
అఖిలేశ్ సమక్షంలో ఎస్పీలో చేరిన అనిల్ వర్మ
లక్నో/ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీల మధ్య వలసలు అధికంగా ఉన్నాయి. రెండు పార్టీలు పోటా పోటీగా ‘గోడ దూకుళ్ల’ను ప్రోత్సహిస్తున్నాయి.
బీజేపీ నేత, జలాలాబాద్ అభ్యర్థి అనిల్ వర్మ తన మద్దతుదారులతో కలసి సోమవారం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ కూడా సమాజ్ వాదీ పార్టీలోకి మారిపోయారు. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
బీజేపీ తనకు టిక్కెట్ నిరాకరించడంపై స్పందిస్తూ... ‘బీజేపీ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేశాను, అయినప్పటికీ నాకు టిక్కెట్ నిరాకరించారు. యువతను ప్రోత్సహిస్తామని చెప్పి 75 ఏళ్ల వృద్ధుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామ’ని జితేంద్ర వర్మ అన్నారు. (చదవండి: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి...)
జలాల్‌పూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, సుభాష్ రాయ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment