Jalalabad
-
సమాజ్‌వాదీ పార్టీలో చేరిన బీజేపీ అభ్యర్థి
లక్నో/ఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీల మధ్య వలసలు అధికంగా ఉన్నాయి. రెండు పార్టీలు పోటా పోటీగా ‘గోడ దూకుళ్ల’ను ప్రోత్సహిస్తున్నాయి. బీజేపీ నేత, జలాలాబాద్ అభ్యర్థి అనిల్ వర్మ తన మద్దతుదారులతో కలసి సోమవారం సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)లో చేరారు. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ కూడా సమాజ్ వాదీ పార్టీలోకి మారిపోయారు. అఖిలేశ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ తనకు టిక్కెట్ నిరాకరించడంపై స్పందిస్తూ... ‘బీజేపీ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేశాను, అయినప్పటికీ నాకు టిక్కెట్ నిరాకరించారు. యువతను ప్రోత్సహిస్తామని చెప్పి 75 ఏళ్ల వృద్ధుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడతామ’ని జితేంద్ర వర్మ అన్నారు. (చదవండి: బరేలీలో కాంగ్రెస్ టిక్కెట్ తీసుకొని ఎస్పీలోకి...) జలాల్‌పూర్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే, సుభాష్ రాయ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరారు. -
జలాలాబాద్‌లో పేలుళ్లు.. ఇద్దరు మృతి: తాలిబన్ అధికారులు
జలాలాబాద్: ఆప్గనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో 18 నుంచి 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. అంతేగాక మరణించిన వారిలో తాలిబన్ అధికారులూ ఉన్నట్లు తెలుస్తోంది. జలాలాబాద్‌లో జరిగిన వేరువేరు బాంబు పేలుళ్లో ఇద్దరు మృతి చెందినట్లు, 20 మంది వరకు గాయపడినట్లు తమకు సమాచారం అందిందని తాలిబన్ అధికారులు పేర్కొన్నారు. అయితే మృతుల పేర్లు మాత్రం వెల్లడించలేదు. గాయపడిన వారిలో మహిళలు, చిన్న పిల్లలున్నట్లు తెలిపారు. కాగా బాంబు దాడి ఘటనపై విచారణ జరగుతున్నట్లు వెల్లడించారు. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లోని తాలిబాన్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాలిబన్ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు. ఇదిలా ఉండగా ఆగస్ట్ 15న ఆప్గనిస్తాన్‌ను తాలిబన్లు మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుతూనే ఉన్నాయి. చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి: యూఎన్ మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు.. -
పురిటినొప్పులతో విలవిల్లాడిన మహిళ.. కానిస్టేబుల్ చేసిన పనికి ఫిదా..
లక్నో: ఒక మహిళా కానిస్టేబుల్ తన మానవత్వాన్ని చాటుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళకు అండగా నిలిచి, తల్లిబిడ్డలను క్షేమంగా ఆసుపత్రికి చేర్చింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాలాబాద్‌కు చెందిన 30 ఏళ్ల రేఖ తన భర్తతో కలిసి ఉంటుంది. కాగా, గర్భవతి అయినా రేఖ కొన్ని రోజులుగా పురిటినొప్పులతో బాధపడుతుంది. దీంతో ఆసుపత్రికి వెళ్లి చూయించుకోవాలనుకుంది. ఈ క్రమంలో తన తల్లితో కలిసి గత సోమవారం (జులై 26)న బస్సులో షాహజాన్‌పూర్‌కి బయలుదేరింది. బస్సులోని కుదుపుల కారణంగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి.. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అయితే, ఆమెకు నొప్పులు మరీ ఎక్కువకావడంతో బాధను తాళలేక విలవిల్లాడింది. ఈ క్రమంలో బింటూ పుష్కర్ అనే మహిళ కానిస్టేబుల్ అదే బస్సులో ప్రయాణిస్తుంది. అంబూలెన్స్ మాత్రం సమయానికి రాకపోవడంతో ఆమె రేఖ, ఆమె తల్లి ఆందోళనకు లోనయ్యారు. దీంతో బింటూ పుష్కర్ వారిద్దరికి ధైర్యం చెప్పింది. అంతటితో ఆగకుండా, రేఖ తల్లితో కలిసి చీరను అడ్డుగా పెట్టి ఆమెకు సపర్యలు చేసింది. కాసేపటి తర్వాత రేఖకు ఒక బాలిక జన్మించింది. తల్లిబిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. ఈ క్రమంలో.. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న అంబూలెన్స్‌లో తల్లిబిడ్డలను దగ్గర్లోని ఒక మెడికల్ కాలేజీకి తరలించారు. ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. దీంతో పుష్కర్, బస్సులోని మిగతా ప్రయాణికులు సంతోషంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం.. ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కష్టకాలంలో మహిళకు అండగా నిలిచినందుకు కానిస్టేబుల్ బింటూ పుష్కర్పై నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
'అడ్డువస్తే నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారు'
జలాలాబాద్ : పంజాబ్ రాష్ట్రంలోని జలాలాబాద్ నియోజకవర్గం శిరోమణి అకాలీదల్ పార్టీకీ కంచుకోటలాంటిది. పంజాబ్‌కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖ్బీర్ సింగ్ బాదల్ ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. దీంతో అకాలీదల్ పార్టీకి ఇక్కడ మంచి పట్టుంది. తాజాగా జలాలాబాద్‌కు జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు చెందిన రమీందర్ ఆవ్లా విజయం సాధించారు. ఈ సందర్భంగా రమీందర్ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అకాలీదల్‌కు మంచి పట్టున్న జలాలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం తనకు చాలా సంతోషం కలిగించిందని పేర్కొన్నారు. బీజేపీ- అకాలీదల్ పాలనలో ఇక్కడ గూండారాజ్యం కొనసాగిందని, అడ్డు వచ్చిన వారిపై నకిలీ కేసులు పెట్టి బెదిరించేవారని తెలిపారు. చెడుపై మంచి ఎప్పుడు గెలుస్తుందనడానికి తన గెలుపు ఒక కారణమని రమీందర్ వెల్లడించారు. 2017లో సుఖబీర్‌సింగ్ విజయం సాధించినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బీజేపీ- అకాలీదల్ పాలనలో వారు పెట్టిన నకిలీ కేసులను ఒక్కొక్కటిగా పరిష్కరించారని గుర్తుచేశారు.దీంతో అకాలీదల్ 10 ఏళ్ల పాలనలో జరిగిన అన్యాయాలు ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన సుఖ్బీర్ సింగ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తన బాధ్యతను విస్మరించారు. అందుకే తాజాగా జరిగిన ఉప ఎన్నికలో అకాలీదల్‌ను కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని వెల్లడించారు. ఈ సందర్భంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించిన జలాలాబాద్ ప్రజలకు రమీందర్ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. రైస్ మిల్లర్ వ్యాపారులకు ఆశించినంత మేర వ్యాపారం జరగకపోవడంతో ఎక్కువ మొత్తంలో మిల్లులు మూసివేయడం గుర్తించాను. అలాగే ఈ ప్రాంతంలోని స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఒక్క పరిశ్రమ కూడా లేకపోవడం దారుణం అని వెల్లడించారు. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాల్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా బలంగా ఉంది. ఈ సమస్యలన్నింటిని ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అలాగే త్వరలోనే ముఖ్యమంత్రి అమరీందర్సింగ్ని కలిసి నియోజకవర్గ అభివృద్ధి గురించి చర్చిస్తానని తెలిపారు. -
అఫ్గానిస్తాన్ మసీదులో భారీ పేలుడు
జలాలాబాద్: శుక్రవారం ప్రార్థనల సందర్భంగా మసీదులో జరిగిన ఒక భారీ పేలుడులో 62 మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పు అఫ్గానిస్తాన్‌లోని నన్ఘఢార్ రాష్ట్రంలో, జలాలాబాద్‌కు 50 కి.మీ.ల దూరంలోని హస్కమినలో ఈ ఘటన చోటు చేసుకుంది. పేలుడు ధాటికి మసీదు పై కప్పు కూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారన్నారు. 36 మంది గాయపడ్డారని, వారిని జలాలాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. ఇది ఆత్మాహుతి దాడేనా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదన్నారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే, తూర్పుఅఫ్గానిస్తాన్‌లో తాలిబన్, అల్‌కాయిదా ఉగ్రసంస్థలు చురుకుగా ఉన్నాయి. అఫ్గానిస్తాన్‌లో హింస తారస్థాయికి చేరిందంటూ ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక విడుదల చేసిన మర్నాడే ఈ దాడి జరిగింది. ఈ జూలైలో గతమెన్నడూ లేనంత హింస చోటు చేసుకుందని, ఐరాస గణాంకాలు సేకరించడం ప్రారంభించిన తరువాత, ఒక నెలలో హింసాత్మక ఘటనల్లో అత్యధిక సంఖ్యలో పౌరులు మరణించడం ఈ జూలైలోనేనని ఐరాస ఆ నివేదికలో పేర్కొంది. -
మరోసారి రక్తమోడిన అఫ్గాన్
కాబుల్ : ఆత్మాహూతి దాడులతో అఫ్గానిస్తాన్ మరోసారి రక్తమోడింది. మంగళవారం కాబుల్ సమీపంలోని జలాలాబాద్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఏడుగురు మృతి చెందగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. జలాలాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఆఫ్గానిస్తాన్‌లో అక్టోబర్ 20న దేశ వ్యాప్తంగా పార్లమెంట్, జిల్లా కౌన్సిల్స్‌కు ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రచారంలో భాగంగా ప్రజలు గుమ్మిగూడి ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆఫ్గాన్‌లోని 33 ప్రావిన్స్‌లకు, 249 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగునున్నాయి. వీటి కోసం పోటీలో 2691 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాగా ఎన్నికల నేపథ్యంలో ఆఫ్గాన్‌లో ఉగ్రవాదులు ప్రజా ప్రతినిధులను, అధికారులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సహా, అధికారులతో కలుపుని 50 మంది మృతి చెందారు. -
‘ఇక్కడ మేం బతకలేం’
కాబుల్ : వరుస ఉగ్రదాడులతో అప్ఘానిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు భయానికి లోనవుతున్నారు. దేశంలో జీవించలేమంటూ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జలాలాబాద్‌లోని సిక్కులు, హిందువులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్ ఉగ్రవాదులు ఆదివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది మృతిచెందగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 17 మంది హిందువులు, సిక్కులు కాగా.. మరో ఇద్దరు అఫ్గాన్ జాతీయులు ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆ దేశ హిందువులు, సిక్కులు భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో మేం జీవించలేం అంటూ మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘ ఇక్కడ ఉంటే ఎక్కువ రోజులు బతకలేమని నాకు అర్థమయింది. ముస్లిం టెర్రరిస్టులు మమ్మల్ని బతకన్విరు’ అంటూ మృతుల బంధువు ఒకరు భయాన్ని వ్యక్తం చేశారు. మా మతాల వారిని ఉగ్రవాదులు వదలేలా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మేం అప్ఘనిస్తానీయులమని ప్రభుత్వం గుర్తించింది. కానీ ఉగ్రవాదులు మమ్మల్ని టార్గెట్ చేశారు. ముస్లీం టెర్రరిస్టులు మాపై దాడికి పాల్పడుతున్నారు’ అని ఆఫ్ఘాన్ హిందూ, సిక్కుల ఫ్యానెల్ జాతీయ కార్యదర్శి పేర్కొన్నారు. ‘హిందూ, సిక్కులకు అప్ఘాన్లో రాజకీయ, ఇతర అంశాలల్లో సమానమైన అవకాశాలు ఉన్నప్పటికీ పక్షపాత ధోరణితో ముస్లీంలు మమ్మల్ని అణచివేస్తున్నారు. ఉగ్రవాదులు వేధింపులకు తాళలేక వేలాది మంది ఇండియాకు వలస వెళ్లారు. ఇప్పుడు మాకు రెండే దారులు ఉన్నాయి, ఇండియాకు వలస వెళ్లడం లేదా ముస్లిం మతం స్వీకరించడం.అలా చేస్తేనే ఈ దేశంలో మేం బతకగల్గుతాం’ అని మృతుల బంధువులు వాపోతున్నారు. కాగా అప్ఘాన్ హిందూ, సిక్కులు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్ని రోజులైనా ఇండియాలో జీవించవచ్చని అప్ఘాన్ భారత రాయబారి విజయ్ కుమార్ వెల్లడించారు. వారికి మేం రక్షణగా ఉంటాం. అన్ని సౌకర్యాలు అందిస్తాం అని తెలిపారు. -
పసిపిల్లలే లక్ష్యంగా ఉగ్రవాదుల బీభత్సం
జలాలాబాద్ : అభంశుభం తెలియని పసిపిల్లలే లక్ష్యంగా ఉగ్రవాదులు భీకరదాడికి పాల్పడ్డారు. అఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్ పట్టణంలోగల ‘సేవ్ ద చిల్డ్రెన్’ కార్యాలయంపై విరుచుకుపడ్డ ముష్కరులు.. కనిపించినవారిని కనిపించినట్లు కాల్చేశారు. బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో పదుల మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. భీతావహదృశ్యాలు : పిల్లల సంరక్షణ కోసం పనిచేస్తోన్న ‘సేవ్ ద చిల్డ్రెన్’ సంస్థ కార్యాలయం ఎదుట కారుబాంబును పేల్చిన ఉగ్రవాదులు.. అనంతరం తుపాకులతో లోపలికి ప్రవేశించారు. ఇప్పటివరకు అందిన సమాచారాన్నిబట్టి 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. కార్యాలయం లోపలున్న ఉగ్రవాదులు ఇంకా ఎంతమందికి హానితలపెట్టారో ఇప్పుడే చెప్పలేమని జలాలాబాద్ ప్రావిన్స్ ప్రభుత్వ ప్రతినిధి అతావుల్లా పేర్కొన్నారు. భయంతో వణికిపోతున్న పిల్లల్ని.. సంస్థ సహాయకులు దూరంగా తీసుకెళుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. దాడి సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వ బలగాలు ఘటనా స్థలికి తరలివెళ్లాయి. కౌంటర్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. గతవారం కాబూల్‌లోని అతిపెద్ద హోటళ్లలో ఒకటైన ఇంటర్ కాంటినెంటల్‌పై దాడిచేసిన ఉగ్రవాదులు 22 మందిని పొట్టనపెట్టుకున్న సంగతి తెలిసిందే. -
ఆర్మీ రిక్రూట్ మెంట్లో పేల్చుకున్న ఉగ్రవాది
జలాలబాద్: అఫ్ఘానిస్తాన్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఓ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీలో భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడి 12మంది భావి సైనికులను పొట్టన బెట్టుకున్నారు. ఈ దాడిలో మరో 30మంది కూడా గాయాలపాలయ్యారు. 'ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 12మంది ఆర్మీ రిక్రూట్‌కు వచ్చినవారు చనిపోయారు. మరో 38 మంది తీవ్ర గాయాలపాలయ్యారు' అని నంగర్ హార్ ప్రావిన్స్‌కు చెందిన ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఈ ఆత్మాహుతి దాడి ఎవరు చేశారనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. -
అఫ్ఘాన్ లో మరో ఉగ్రదాడి: 11 మంది మృతి
అఫ్ఘానిస్థాన్ తూర్పు ప్రాంతంలోని జలాలాబాద్ పట్టణం మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. స్థానిక నాయకుండి ఇంటివద్ద ఆదివారం సంభవించిన భారీ పేలుడులో 11 మంది చనిపోగా, మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. బారీగా పేలుడు పదార్థాలతో నిండిన కారులో దూసుకొచ్చిన ఉగ్రవాది తననుతాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డట్లు స్థానిక పోలీసులు చెప్పారు. ఆంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగురోజుల కిందట ఇదే నగరంలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 9 మంది మరనించగా, 15 మంది గాయపడిన సంగతి తెలిసిందే. -
భారత్, పాక్ కాన్సులేట్ల వద్ద భారీ పేలుళ్లు
- అఫ్ఘానిస్థాన్ లో ఇరుదేశాల కాన్సులేట్ ల వద్ద ఉగ్రవాదుల దుశ్చర్య విదేశీ దౌత్యకార్యాలయాలే లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నంగార్హర్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ లో గల ఇండియన్ పాకిస్థానీ కానసులేట్ లకు అతి సమీపంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీనిని ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిగా అభివర్ణించిన స్థానిక అధికారులు.. పేలడులో నలుగురు పోలీసులు చనిపోయారని, పేలుడు తర్వాత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారని తెలిపారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, అయితే భారత దౌత్యకార్యాలయ సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అధికారిక సమాచారం. పేలుడు అనంతరం పాకిస్థాన్ తన దౌత్యకార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. మజర్ ఇ షరీఫ్ పట్టణంలోని భారత దౌత్యకార్యాలయం దాడి జరిగిన 10 రోజులకే, జలాలాబాద్ లో మరో సంఘటన చోటుచేసుకోవటంతో దౌత్యాధికారుల గుండెల్లో గుబులురేపింది. -
ఆఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి: ముగ్గురు మృతి
ఆఫ్ఘానిస్థాన్‌లోని జలాలాబాద్‌లో పోలీసు ఉన్నతాధికారి కార్యాలయం వద్ద ఆత్మహుతి దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారని నంగర్హర్ ప్రొవెన్షియల్ ప్రతినిధి అహ్మద్ జియ అబ్దుల్జయ్ వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులతోపాటు పౌరుడు కూడా ఉన్నారని తెలిపారు. పోలీసు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కారులో ఉండి తీవ్రవాది తనను తాను పేల్చుకొని ఆ ఘాతుకానికి ఒడిగట్టాడని చెప్పారు. ఆ ఘటనలో ఐదుగురు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు. అఫ్ఘాన్‌లో మోహరించిన విదేశీ దళాలను వెనక్కి పంపించాలని చాలా కాలంగా తీవ్రవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో తీవ్రవాదులు ఆ దాడులకు పాల్పడుతున్నారని పోలీసు ఉన్నతాధికారి వివరించారు.