అఫ్ఘానిస్థాన్ తూర్పు ప్రాంతంలోని జలాలాబాద్ పట్టణం మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. స్థానిక నాయకుండి ఇంటివద్ద ఆదివారం సంభవించిన భారీ పేలుడులో 11 మంది చనిపోగా, మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
బారీగా పేలుడు పదార్థాలతో నిండిన కారులో దూసుకొచ్చిన ఉగ్రవాది తననుతాను పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డట్లు స్థానిక పోలీసులు చెప్పారు. ఆంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
నాలుగురోజుల కిందట ఇదే నగరంలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం వద్ద ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 9 మంది మరనించగా, 15 మంది గాయపడిన సంగతి తెలిసిందే.