ఓజీ ఖుష్‌.. హైదరాబాద్‌లో కొత్తరకం డ్రగ్స్‌ పట్టివేత | Crime: OG Kush New Drug Caught In Hyderabad | Sakshi
Sakshi News home page

ఓజీ ఖుష్‌.. హైదరాబాద్‌లో కొత్తరకం డ్రగ్స్‌ పట్టివేత

Published Sat, Jun 1 2024 10:34 AM | Last Updated on Sat, Jun 1 2024 10:54 AM

Crime: OG Kush New Drug Caught In Hyderabad

హైదరాబాద్‌, సాక్షి: నగరంలో అత్యంత ప్రమాదకరమైన.. కొత్తరకం డ్రగ్స్‌ దందాను పోలీసులు పట్టుకున్నారు. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ అక్రమ రవాణా, వినియోగం జరిగే ఓజీ ఖుష్‌ డ్రగ్స్‌ను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా ఈ మాదకద్రవ్యాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ గ్యాంగ్‌ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. 

ఓజీ ఖుష్‌ గంజాయిలో ఓ రకం. ఇది అత్యంత ప్రమాదకరమైంది. అఫ్గనిస్థాన్‌లోని హిందూఖుష్‌ కొండల్లో ఈ డ్రగ్స్‌ను సాగు చేస్తుంటారు. అందుకే దీని పేరులో ఖుష్‌ చేరింది. ఒక్క గ్రాము విలువ మన కరెన్సీలో రూ. 4 వేల దాకా ఉంటుందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం లాలాగూడలో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షల దాకా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement