racket busted
-
ఓజీ ఖుష్.. హైదరాబాద్‌లో కొత్తరకం డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్, సాక్షి: నగరంలో అత్యంత ప్రమాదకరమైన.. కొత్తరకం డ్రగ్స్ దందాను పోలీసులు పట్టుకున్నారు. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ అక్రమ రవాణా, వినియోగం జరిగే ఓజీ ఖుష్ డ్రగ్స్‌ను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి బెంగళూరు మీదుగా ఈ మాదకద్రవ్యాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ గ్యాంగ్ విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఓజీ ఖుష్ గంజాయిలో ఓ రకం. ఇది అత్యంత ప్రమాదకరమైంది. అఫ్గనిస్థాన్‌లోని హిందూఖుష్ కొండల్లో ఈ డ్రగ్స్‌ను సాగు చేస్తుంటారు. అందుకే దీని పేరులో ఖుష్ చేరింది. ఒక్క గ్రాము విలువ మన కరెన్సీలో రూ. 4 వేల దాకా ఉంటుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం లాలాగూడలో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షల దాకా ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. -
రూ.100 కోట్లకు రాజ్యసభ సీటు లేదా గవర్నర్ పదవి! రాకెట్ గుట్టు రట్టు
సాక్షి,న్యూఢిల్లీ: రూ.100 కోట్లిస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని దందా నడుపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని పట్టుకుంది. రూ.100 కోట్లిస్తే గవర్నర్ పదవి కూడా ఇప్పిస్తామని నిందితులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు వారాలుగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వెళ్తున్న కాల్స్‌పై నిఘా వహించిన అధికారులు ఎట్టకేలకు నలుగురు నిందితులను గుర్తించి పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన కర్మలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్గార్, కర్ణాటకకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్, అభిషేక్ బూరాగా గుర్తించారు అధికారులు. వీరంతా చాలా కాలంగా ఈ రాకెట్ నడుపుతున్నారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు, గవర్నర్ పదవితో పాటు ప్రభుత్వ సంస్థలకు ఛైర్మన్‌గా నియమిస్తామని నమ్మించి మోసానికి పాల్పడుతున్న తెలుస్తోంది. అంతేకాదు తాము సీబీఐ అధికారులమని చెప్పి పోలీసు శాఖలో అధికారులను కూడా బురిడీ కొట్టించి పనులు చేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు ప్రేమ్‌కుమార్ తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని చెప్పి అభిషేక్ బూరాతో కలిసి కుట్రలు చేసినట్లు సీబీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. చదవండి: కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి! -
హై ప్రొఫైల్ వ్యభిచారం.. పోలీసులు పక్కా ప్లాన్ వేసి.. ఇన్ఫార్మర్ని హోటల్‌కి పంపించి..
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని హోటల్స్‌లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార దందాను ఢిల్లీ పోలీసులు (ఐజీఐ) చేధించారు. ఈ ఘటనలో.. దందా నడిపిస్తున్న సూత్రధారి, ఒక అమ్మాయితో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 21న ఏరోసిటీ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లలో హైప్రోఫైల్ వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంపై దాడులు చేసేందుకు పోలీసు అధికారులు బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల బృందం ఏరోసిటీ ప్రాంతానికి చేరుకుంది. ఈ దందా నడుపుతున్న వ్యక్తి దగ్గరకు పోలీసులు తమ రహస్య ఇన్ఫార్మర్ ద్వారా సంప్రదించారు. ప్లాన్ ప్రకారం హోటల్ హాలిడే ఇన్‌లో ఒక గదిని కూడా బుక్ చేశారు. ఇన్ఫార్మర్ వేచి ఉన్న హోటల్‌కు సూత్రధారి ఓ అమ్మాయిని తీసుకుని వచ్చి హోటల్ వరండాలో దించి అడ్వాన్స్‌గా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత హోటల్లో గదికి యువతి చేరుకోగానే డెకాయ్ కస్టమర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆ పరిసరాల్లోనే ఉన్న బృందం యువతిని, ఆమెను డ్రాప్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి నవీన్‌గా గర్తించారు. అతనిచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు. చదవండి: భార్యను చితకబాదిన భర్త.. కూతురు ఎంత వేడుకున్నా వినకపోవడంతో... -
బేరాల్లేవమ్మా.. ఎస్సెస్సీ టు బీటెక్.. ఏదైనా ఒకే రేటు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిభ కలిగిన విద్యార్థులకు శరాఘాతంగా మారుతున్న నకిలీ విద్యార్హత పత్రాలపై నగర పోలీసులు జంగ్ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఓ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. గతంలో చిక్కిన నాలుగు ముఠాలు ఆయా వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు జారీ చేయిస్తుండగా... వీళ్లు మాత్రం నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు. టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఏదైనా ఒకే రేటుకు విక్రయించేస్తున్నారని అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి వెల్లడించారు. యాకుత్‌పురకు చెందిన సయ్యద్ నవీద్ సంతోష్‌నగర్ ప్రాంతంలో ఎంహెచ్ కన్సల్టెన్సీ పేరుతో ఎడ్యుకేషనల్ సేవలు అందించే సంస్థను నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ ప్రభావంతో వ్యాపారం దెబ్బతిన్న ఇతగాడు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. గతేడాది మేలో బషీర్‌బాగ్‌లో క్యూబేజ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో వీసా ప్రాసెసింగ్ సంస్థను ఏర్పాటు చేశాడు. నిబంధనల ప్రకారం వీసా ప్రాసెసింగ్ చేస్తే ఇతడికి ఎక్కువ లాభాలు రావట్లేదు. మరోపక్క అనేక మంది సరైన విద్యార్హతలు లేని వాళ్లు సైతం వీరి వద్దకు ప్రాసెసింగ్‌కు వస్తున్నారు. దీంతో తానే నకిలీ సర్టిఫికెట్లు రూపొందించి ప్రాసెసింగ్ చేస్తే భారీ లాభాలు ఉంటాయని భావించాడు. చదవండి: ఇకపై జంక్షన్లో చుక్కలే!.. రెడ్ సిగ్నల్ పడగానే డ్రంకన్ డ్రైవ్ డీటీపీలో మంచి పట్టున్న మీర్‌చౌక్ వాసి షేక్ నదీమ్‌ను తన సంస్థలో నియమించుకున్నాడు. జమాల్‌కాలనీకి చెందిన మహ్మద్ అబ్రారుద్దీన్ ఆ తరహా విద్యార్థులను తీసుకువచ్చేవాడు. వారి అవసరాలకు తగ్గట్టు నవీద్ పదో తరగతి నుంచి బీటెక్ వరకు సర్టిఫికెట్లను నదీమ్‌తో తయారు చేయించేవాడు. వీటిని రూ.70 వేల నుంచి రూ.80 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, పి.శ్రీనయ్యలతో కూడిన బృందం దాడి చేసింది. నవీద్, నదీమ్, అబ్రార్‌లతో పాటు సర్టిఫికెట్లు ఖరీదు చేసిన అబ్దుల్ రహీం ఖాన్, అబ్దుల్ కరీం ఖాన్, మహ్మద్ ఇస్మాయిల్ అహ్మద్, మహ్మద్ నాసిర్ అహ్మద్, ఫైసల్ బిన్ షాదుల్లాలను పట్టుకున్నారు. అన్నిరకాల సర్టిఫికెట్లు లభ్యం నిందితుల నుంచి రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డు పేరుతో ఉన్న సర్టిఫికెట్లు 4, మహారాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పేరు తో ఉన్న సర్టిఫికెట్లు 4, ఓయూ పేరుతో ఉన్న డిగ్రీలు 3, ఏయూ పేరుతో ఉన్న బీటెక్ పట్టాలు 7, తెలంగాణ యూనివర్శిటీ పేరుతో ఉన్న డిగ్రీలు 30, పుణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ పేరుతో ఉన్న పట్టా ఒకటి స్వాధీనం చేసుకున్నారు. -
పైన సోపు.. లోపల చూస్తే..
బనశంకరి: ముంబై నుంచి సోప్బాక్సుల్లో డ్రగ్స్‌ను తెప్పించి అమ్ముతున్న ముగ్గురు నైజీరియన్లను బుధవారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.80 లక్షల విలువచేసే ఎండీఎంఏ, కొకైన్, హషిష్ నూనె, 5 మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ తెలిపారు. బిసల్ ఎన్డూయిసి, ఆడూచి సిల్వెస్టర్, చార్లెస్ అనే ముగ్గురు వ్యాపార వీసాపై భారత్‌కు వచ్చి బెంగళూరులో బాగలగుంటె వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటూ డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నారు. న్యూ ఇయర్ రావడంతో నగరంలో జరిగే పార్టీలకు డ్రగ్స్ సరఫరాకు ముంబైలోని డ్రగ్ డీలర్ల నుంచి సోపులు, షాంపూల బాటిళ్లలో డ్రగ్స్‌ను తెప్పించి ఇంట్లో నిల్వ చేసి విక్రయించసాగారు. సమాచారం తెలిసి దాడి చేసి అరెస్టు చేశారు. -
Hyderabad: వ్యభిచార గృహం గుట్టు రట్టు.. సోదరుడి ఇంట్లోనే..
సాక్షి, హైదరాబాద్(నాగోలు): ఎల్బీనగర్ పోలీసులు ఓ వ్యభిచార గృహం గుట్టును రట్టు చేశారు. గృహం నిర్వాహకురాలితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం కాలనీకి చెందిన ఎస్. వెంకటలక్ష్మి(68) బైరామల్‌గూడ రెడ్డి కాలనీలోని తన సోదరుడి ఇంట్లో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. చదవండి: (కలహాలతో విసిగిపోయి.. బిడ్డతో సహా కావేరి నదిలో దూకి..) సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావుతో పాటు వెంకటక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటలక్ష్మి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. తనకు తెలిసిన సెక్స్‌వర్కర్లతో ఒప్పందం చేసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. కాగా, గతంలోనూ వెంకటలక్ష్మిని పోలీసులు వ్యభిచారం కేసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వెంకటలక్ష్మి మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తూ పట్టుబడింది. చదవండి: (స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి..) -
ప్రియుడిని నమ్మి అద్దె గర్భానికి ఒప్పుకుంది.. చివర్లో కథ అడ్డం తిరిగింది
ముంబై: ప్రియుడి మాట విని సరోగసికి ఒప్పుకుంది ఓ యువతి. అయితే అనుకోకుండా కథ అడ్డం తిరగడంతో చిక్కుల్లో పడింది. చివరకు పోలీసుల రంగప్రవేశంతో ఆ యువతి ఉచ్చులోంచి క్షేమంగా బయటపడింది. ఈ ఘటన మహరాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలద్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఉద్యోగ అన్వేషణ నిమిత్తం ముంబైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు నేవీ ముంబైలో ఓ డయోగ్నస్టిక్ సెంటర్లో చేరింది. కొన్ని రోజుల తరువాత అక్కడ పని చేస్తున్న వ్యక్తితో ఆ యువతికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అయితే అనుకోకుండా వారు పని చేస్తున్న డయోగ్నస్టిక్ సెంటర్ మూసివేయడంతో ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ప్రియుడు సరోగసికి ఆమెను ప్రోత్సహించాడు. అలా చేస్తే రూ. 4-5 లక్షల డబ్బు వస్తుందని నమ్మబలికాడు. అందుకు అంగీకరించిన ఆమెను హైదరాబాద్‌కు పంపాడు. ఈ క్రమంలో వారు టోకన్ అడ్వాన్స్ కింద కొంత సోమ్మును కూడా తీసుకున్నారు. ఆగస్టు నెలలో ఆ యువతికి సరోగసి పరీక్షలు చేసిన వైద్యులు అందుకు ఆమె పనికి రాదని తెలిపారు. దీంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. వారి దగ్గర తీసుకున్న టోకన్ డబ్బు కట్టలేకపోయింది. ఆమె ద్వారా డబ్బు పరంగా తనకెటువంటి లాభం లేదని గ్రహించిన ప్రియుడు అక్కడినుంచి జంప్ అయ్యాడు. ఏం చేయాలో తెలియక ఆ యువతి సెప్టెంబర్ 28న తన తల్లికి ఫోన్ చేసింది. తల్లి సదరు యువతిని పోలీసుల దగ్గరకు వెళ్లమని చెప్పింది. అనంతరం యువతి తల్లి తన కూతురు కనిపించటం లేదని ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు హైదరబాద్‌లో ఉన్న యువతి ముంబైకి తీసుకువచ్చారు. విచారణలో ఆమె జరిగిందంతా పోలీసులకు చెప్పింది. ప్రియుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: మందలించిన భర్త.. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసిన భార్య.. -
ఒక్క ఫోన్‌కాల్‌తో రూ.5 కోట్లు!
-
రూ. 80 వేలకే ఇంజనీరింగ్ సర్టిఫికెట్!
పదో తరగతి నుంచి ఇంజనీరింగ్, పీజీ వరకు ఏ సర్టిఫికెట్ కావాలన్నా.. ఏ యూనివర్సిటీ నుంచి కావాలన్నా నిమిషాల్లో తెప్పిస్తాడు.. కాదు, ముద్రిస్తాడు. కేవలం రూ. 80వేలు పెడితే ఇంజనీరింగ్ సర్టిఫికెట్ వచ్చేస్తుంది. ఇలా నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తూ పలువురిని మోసం చేసిన ఘరానా మోసగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టుచేశారు. మహ్మద్ జుమైర్ అలియాస్ జుబైర్ అలియాస్ హుస్సేన్ (43) ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. ఇతడు మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్, మదురై కామరాజ్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఇంజనీరింగ్ స్టడీస్, ఛత్రపతి సాహూజీ మహరాజ్ యూనివర్సిటీ, కాన్పూర్, సత్యభామ యూనివర్సిటీ, డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ యూనివర్సిటీ ఆగ్రా, మానవ్ భారతి యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓఖ్లా, ఢిల్లీ, వినాయక మిషన్స్ యూనివర్సిటీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ మధ్య భారత్ గ్వాలియర్, గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ లాంటి సంస్థల పేరు మీద నకిలీ డిగ్రీలను సప్లై చేసేవాడు. అతడి వద్దనుంచి వివిధ వర్సిటీలకు చెందిన 60 నకిలీ సర్టిఫికెట్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక కలర్ ప్రింటర్ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. 2011 సంవత్సరంలో మహ్మద్ జుమైర్ క్విక్ జాబ్ సొల్యూషన్స్ అనే కన్సల్టెన్సీని మలక్‌పేట సమీపంలోని సిటీటవర్స్లో ప్రారంభించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేసి చివరకు దుకాణం ఎత్తేశాడు. తర్వాత 2015లో హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్డ్ స్టడీస్ పేరుతో సంతోష్‌నగర్‌లోని చంపాపేట రోడ్డులో మరో దుకాణం తెరిచాడు. అక్కడ వ్యాపారం బాగోకపోవడంతో పంజాగుట్ట మోడల్ హౌస్ ప్రాంతానికి మార్చాడు. అక్కడ ఎ. హరిబాబుతో కలిసి వివిధ యూనివర్సిటీల నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసేవాడు. బషీర్‌బాగ్ లోని బాబూఖాన్ ఎస్టేట్‌లో మరో ఆఫీసు తెరిచి, దాని బాధ్యతలు హరిబాబుకు ఇచ్చాడు. వన్ సిట్టింగ్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కరస్పాండెన్స్ కోర్సుల పేరుతో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, అక్కడకు వచ్చినవారి నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకుని వాళ్లతో పరీక్షలు రాయించకుండానే ఈ నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. సుదూర ప్రాంతాల్లో ఉన్న బ్రోకర్లతో కూడా ఇతడికి సంబంధాలుండేవి. వాళ్లకు విద్యార్థుల వివరాలు వాట్సప్ ద్వారా పంపితే వాళ్లు కొరియర్లో సర్టిఫికెట్లు పంపేవారు. ఇంజనీరింగ్‌కు రూ. 80వేలు, ఎంబీఏ కావాలంటే రూ. 40 వేలు, ఎంసీఏకు రూ. 50వేలు, డిగ్రీకి రూ. 40వేలు, ఇంటర్‌కు రూ. 15వేలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చేవాడు. ఇలా ఇప్పటివరకు 80-100 మందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఎట్టకేలకు ఇతగాడు పోలీసులకు చిక్కాడు. -
నకిలీ డీజిల్ తయారీ ముఠా గుట్టురట్టు
నల్గొండ : నల్గొండ జిల్లా సూర్యాపేటలో నకిలీ డిజిల్ తయారీ ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఎనిమిది మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే 8 వేల లీటర్ల నకిలీ డీజిల్, 4 వేల లీటర్ల కిరోసిన్, 3 కరెంట్ మోటర్లు, కెమికల్స్‌తోపాటు డీజిల్ ట్యాంకర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. -
ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్ల యాక్టివేషన్
ముఠా గుట్టురట్టు నెల్లూరు (క్రైమ్) : ఫోర్జరీ డాక్యుమెంట్లతో యాక్టివేషన్ చేసిన (ప్రీయాక్టివేటెడ్) సిమ్‌కార్డులను విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను నాల్గోనగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నగర డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. వెంకటరాముడు నిందితుల వివరాలను వెల్లడించారు. నగరంలోని ఏసీనగర్‌కు చెందిన బాలాజీకుమార్, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన పెంచలయ్య స్నేహితులు. వీరు మూడు నెలలుగా హరనాథపురంలో గిరి మెడికల్ షాపు సమీపంలో వోడాఫోన్ అవుట్లెట్ నిర్వహిస్తూ ఆ కంపెనీ సిమ్‌లను విక్రయిస్తున్నారు. సిమ్కోసం వచ్చే వినియోగదారులనుంచి ఫొటోగుర్తింపు, ధ్రువపత్రాలను తీసుకుని వాటి ద్వారా ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. వోడాఫోన్ సీఎస్ఎం అండ్ అసిస్టెంట్ మేనేజర్ షరాబు భానుప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ జి. రాజశేఖర్ సహాయంతో ఫోర్జరీ ధువపత్రాలతో సిమ్‌కార్డులు యాక్టివేట్ చేసి ఒక్కో సిమ్ రూ.200 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్ల విక్రయాలపై నాల్గోనగర ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య కొంతకాలంగా నిఘా ఉంచారు. బుధవారం సీతారామయ్య ఆధ్వర్యంలో నాల్గోనగర ఎస్ఐలు ఎస్కే అలీసాహెబ్, ఎం రఘునాథ్ తమ సిబ్బందితో కలిసి వొడాఫోను అవుట్‌లెట్‌పై దాడి చేశారు. యాక్టివేషన్ చేసిన వొడాఫోన్ సిమ్‌కార్డులు 10, యాక్టివేషన్ కానివి 99, ఖాళీ దరఖాస్తులు 29, రెండు కార్బన్ సెల్ఫోన్లు, రూ. వెయ్యి నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అవుట్లెట్ నిర్వహిస్తున్న బాలాజీకుమార్, పెంచలయ్యతో పాటు వోడాఫోన్ సీఎస్ఎం అండ్ అసిస్టెంట్ మేనేజర్ షరాబు భానుప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ రాజశేఖర్‌ను అరెస్ట్‌చేశారు. రోడ్లపై సిమ్‌లు కొనుగోలు చేయవద్దు రోడ్లపై ఏర్పాటు చేసిన అవుట్లెట్ల్లో సిమ్‌లు సాధ్యమైనంత మేర కొనుగోలు చేయవద్దని నగర డీఎస్పీ సూచించారు. అవుట్లెట్ నిర్వాహకులు అనేక మంది డబ్బులకు ఆశపడి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సిమ్కొనుగోలు చేసిన సమయంలో వినియోగదారులు ఇచ్చిన ధృవపత్రాలను ఫోర్జరీ చేసి ఇతర సిమ్‌లను వాటి ద్వారా యాక్టివేట్ చేసి విక్రయిస్తోన్నారని చెప్పారు. దీని వల్లన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆధీకృత కంపెనీ డీలర్ల వద్దనే సిమలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు.ఫోర్జరీ డాక్యుమెంట్లతో సిమ్‌లను యాక్టివేట్ చేసి విక్రయించి జేబులు నింపుకుంటున్న ముఠాలపై నిఘా ఉంచామన్నారు. సిబ్బందికి అభినందన సిమ్ మాఫియా గుట్టురట్టు చేసిన నాల్గోనగర ఇన్స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య, ఎస్ఐలు ఎస్కే అలీసాహెబ్, ఎం. రఘునాథ్ సిబ్బంది పోలయ్య, సురేష్, శివకృష్ణ, మహేంద్రనాథ్‌రెడ్డి, వేణు, రాజేంద్ర, శ్రీకాంత్‌ను డీఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వికలాంగుల నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్
కరీంనగర్ : వికలాంగులకు ఇచ్చే రాయితీలు పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును కరీంనగర్ జిల్లా పోలీసులు మంగళవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 163 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి... వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పలు వికలాంగుల సర్టిఫికేట్లను పరిశీలించారు. వాటిలో పలు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఆ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి... కేశవపట్నంలోని ఓ కంప్యూటర్ సెంటర్‌పై దాడి చేసి... ... ఆరోఖ్య రమేష్, సుధీర్, చిలక అజయ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. వీరు ఓ ముఠాగా ఏర్పడి...ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. -
కల్లులో కలిపే రసాయనంతో కృత్రిమ పాలు తయారీ
-
నకిలీ రబ్బరు స్టాంపుల ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: నకిలీ రబ్బరు స్టాంపులు తయారీ చేసి ఎన్వోసీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ముఠా గుట్టును నాచారంలో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ రబ్బరు స్టాంపులతోపాటు నకిలీ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించి... తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. ఎన్ఎఫ్సీలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ముఠా ఎన్వోసీలు జారీ చేస్తుందని పోలీసులు తెలిపారు.