కరీంనగర్ : వికలాంగులకు ఇచ్చే రాయితీలు పొందేందుకు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును కరీంనగర్ జిల్లా పోలీసులు మంగళవారం రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 163 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి... వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇటీవల డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ పలు వికలాంగుల సర్టిఫికేట్లను పరిశీలించారు. వాటిలో పలు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు ఆమె గుర్తించారు. ఆ క్రమంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి... కేశవపట్నంలోని ఓ కంప్యూటర్ సెంటర్పై దాడి చేసి... ... ఆరోఖ్య రమేష్, సుధీర్, చిలక అజయ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. వీరు ఓ ముఠాగా ఏర్పడి...ఈ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు.