
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఐదురోజుల క్రితం వెలుగులోకొచ్చిన మహిళ అనుమానాస్పద మృతి కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు. బెల్లంపల్లికి చెందిన మమతను జనవరి 27న హత్య చేసి కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో పడేసిన విషయం తెలిసిందే. అయితే, వివాహేతర సంబంధమే మమత హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాసిపేటకు చెందిన మమత.. గత నెల 27న తన కుమారుడితో కలిసి బెల్లంపల్లి నుంచి కారులో బయలుదేరింది. ఆ తర్వాత కనిపించకుండా పోయినా ఆమె.. కరీంనగర్ జిల్లా కొండనపల్లి శివారులో శవమై కనిపించింది. తల్లితో పాటు ఉన్న నాలుగేళ్ల కుమారుడు కూడా కనిపించకుండా పోయాడు. నిందితులు పరారైన కారు నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. చెన్నైలోని ఒక లాడ్జిలో బాలుడు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడిని కాపాడి.. నానమ్మకు అప్పగించారు.
మృతురాలు మమత.. భర్తతో విడిపోయి సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో కలిసి ఉంటుంది. దీంతో భాస్కర్ కుటుంబ సభ్యులు రూ.5 లక్షలు సుపారీ ఇచ్చి మమతను హత్య చేయించినట్లు పోలీసులు నిర్థారించారు. భాస్కర్ సోదరి, ఆమె స్నేహితుడు రఘు, సుపారీ కిల్లర్ కల్యాణ్, భాస్కర్ తండ్రి, సోదరి సమీప బంధువును అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment