case
-
ఫార్ములా-ఈ రేసులు.. కేటీఆర్‌పై ‘ఈడీ’ కేసు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకి సంబంధించిన లావాదేవీలను మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. మనీలాండరింగ్‌తో పాటు ఫెమా ఉల్లంఘనలపై ఈడీ దర్యాప్తు కొనసాగనుంది.కేసులో ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేటీఆర్‌పై ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. కేటీఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ మాజీ కార్యదర్శి అరవింద్‌కుమార్,హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డిలపై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, ఫార్ములా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్‌కు శుక్రవారం(డిసెంబర్ 20) సాయంత్రమే హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్‌ను ఫార్ములా ఈ కేసులో డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను 27 వరకు వాయిదా వేసింది. కేసు దర్యాప్తును ఏసీబీ కొనసాగించవచ్చని తెలిపింది. ఇంతలోనే కేటీఆర్‌పై ఇదే వ్యవహారంలో ఈడీ కేసు నమోదు చేయడంపై బీఆర్ఎస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. -
కేటీఆర్ తొలి విజయం సాధించారు: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసు వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి,బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం(డిసెంబర్ 20) హరీశ్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.రేవంత్ అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు చెప్పింది. ఇది డొల్ల కేసు అని హైకోర్టు చెప్పింది. ఈ కార్ రేసుల వల్ల తెలంగాణకు లాభం జరిగింది.రూ.600 కోట్ల నష్టం కాదు..రూ.600 కోట్ల లాభం జరిగింది. అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసుల కేసులో ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1 చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేటీఆర్ కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో హైకోర్టు కేటీఆర్‌కు ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. -
రేవంత్ కుంభకోణాలు బయటపెడుతున్నందుకే..
సాక్షి, హైదరాబాద్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబం చేస్తున్న అవినీతి కుంభోణా లను బయట పెడుతున్నందునే రాష్ట్ర ప్రభుత్వం మాపై రాజకీయ వేధింపులకు దిగుతోంది. అవినీతి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకున్నా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసింది. ఫార్ములా–ఈ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగి నట్లు ఆధారాలు ఉంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చించాలని సవాలు చేస్తున్నా. కానీ అసెంబ్లీలో మాట్లాడలేని సీఎం, దద్దమ్మ మంత్రులు లీకులతో దుష్ప్రచారం చేస్తు న్నారు. సీఎం, మంత్రులకు ఈ అంశంపై అవగా హన ఉంటే అసెంబ్లీ సాక్షిగా అవినీతిని బయట పెట్టాలి. ఈ మొత్తం వ్యవహారంలో అణా పైసా వృథా కాలేదు అనేందుకు నా వద్ద ఆధారాలు ఉన్నా యి..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే రేసులు రద్దయ్యాయి. దీంతో ఈవీ రంగంలో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు, పేరు రాకపోవడంతో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ దెబ్బతింది. రాష్ట్ర ప్రభుత్వ కుట్రలు, మోసా లను ప్రజాస్వామ్య యుతంగా ప్రజల ముందు పెడతాం. నాపై నమోదైన కేసులపై చట్ట ప్రకారం ముందుకు వెళతాం. ఉద్యమ నాయకుడి బిడ్డలం.. ఉద్యమకారులం, అణిచివేతలు, చిల్లర కుట్రలకు భయపడకుండా కొట్లాడతాం..’ అని అన్నారు. ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై కేసు నమోదైన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు.‘ఈవీ’కి తెలంగాణను హబ్‌గా చేయాలనుకున్నాం..‘కేసీఆర్ నాయకత్వంలో ఆటోమొబైల్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం. ఎలక్ట్రిక్ వాహన వాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ‘ఫార్ములా–ఈ రేస్’ను నిర్వహించాలని భావించాం. నాలుగు సీజన్ల పాటు నిర్వహించేలా 2022 అక్టోబర్ 25న ఒప్పందం కుదిరింది.2023 ఫిబ్రవరి 10న తొలి సీజన్ రేసింగ్ నిర్వహించాం. రేస్ నిర్వహణకు హెచ్ఎండీఏ రూ.35 కోట్లు, ప్రమోటర్ సంస్థ గ్రీన్ కో రూ.110 కోట్లు ఖర్చు చేసింది. దీనివల్ల అదనంగా రూ.700 కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరిందని నీల్సేన్ సర్వే సంస్థ తెలిపింది. అయితే నష్టాలను కారణంగా చూపుతూ రెండో సీజన్లో ప్రమోటర్ గ్రీన్ కో తప్పుకోవడంతో హెచ్ఎండీఏ నుంచి రెండు విడతల్లో రూ.55 కోట్లు చెల్లించాలని నాటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను ఆదేశించా. ఎలాన్ మస్క్‌ను రప్పించి ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ద్వారా ఈవీ రంగానికి తెలంగాణను హబ్‌గా ప్రమోట్ చేయాలని అనుకున్నాం..’ అని కేటీఆర్ తెలిపారు.అవినీతే జరగనప్పుడు కేసు ఎలా?‘ఈ నేపథ్యంలో తదుపరి చెల్లింపులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గత ఏడాది డిసెంబర్ 7న ఫార్ములా–ఈ సంస్థ కోరింది. దీని సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లొంగోతో అదే నెల 13న సీఎం రేవంత్, నాటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ సమావేశయ్యారు. తర్వాత రేస్ నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తూ, కాంట్రాక్టు నిబంధనలు ప్రస్తావిస్తూ డిసెంబర్ 21 లోగా నిర్ణయం తెలపాలని సంస్థ లేఖ రాసింది. డిసెంబర్ 26 వరకు వేచి చూసి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రేస్ నిర్వహణ సాధ్యం కాదని చెప్తూ నిర్వాహక సంస్థ రూ.73 లక్షల రేస్ ఫీజును కూడా వెనక్కి పంపింది. ఎఫ్ఈఓ ఎన్నిమార్లు కోరినా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫీజును వెనక్కి తీసుకోవడం లేదు. రూ.55 కోట్లు రెండు వాయిదాలలో తమకు ముట్టిన విషయాన్ని నిర్ధారిస్తూ మూడో వాయిదా చెల్లించడంపై ప్రభుత్వంతో పలుసార్లు లేఖల రూపంలో సంస్థ సంప్రదింపులు కొనసాగించింది. అత్యంత చట్టబద్ధంగా పారదర్శకంగా హెచ్ఎండీఏ ఇండియన్ ఓవర్సీస్ ప్రభుత్వ బ్యాంకు నుంచి ఈ నిధులను ఆ సంస్థకు చెల్లించింది. అవినీతే జరగనప్పుడు కేసు నమోదు చేసే అంశం ఏసీబీ పరిధిలో లేదు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హరీశ్ సాల్వే అనే ప్రముఖ న్యాయవాదితో ఫార్ములా–ఈపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును రాష్ట్ర ప్రభుత్వం దాచి పెట్టింది..’ అని కేటీఆర్ చెప్పారు. చంద్రబాబు హయాంలో ఫార్ములా వన్ యోచన‘చంద్రబాబు హయాంలో 2001లో ‘ఫార్ములా వన్’ నిర్వహించాలనుకున్నారు. ట్రాక్ ఏర్పాటుకు కేటాయించిన భూముల్లో సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన 15 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ విషయాన్ని 2013 ఎన్నికల అఫిడవిట్లోనూ రేవంత్ ప్రస్తావించారు. ట్రాక్ ఏర్పాటు కోసం గోపన్‌పల్లిలో మొత్తం 580 ఎకరాల భూ సేకరణకు గతంలో రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ట్రాక్ ఏర్పాటు ప్రతిపాదనలు వెనక్కి పోగా రైతులు తమ భూమి కోసం నేటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు..’ అని కేటీఆర్ వివరించారు.రేవంత్.. నా వెంట్రుక కూడా పీకలేవు ఫార్ములా–ఈ రేసులో కేసు పెట్టాల్సింది సీఎం రేవంత్ రెడ్డిపైనే అని కేటీఆర్ అన్నారు. అంతటి ప్రఖ్యాత రేసింగ్ దేశానికి రాకపోవడానికి రేవంతే కారణమని చెప్పారు. ‘రేవంత్.. ఏం చేసుకుంటావో చేసుకో.. నా వెంట్రుక కూడా పీకలేవు. నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ..’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అదానీతో అనుబంధంపై మీ సీఎంను ప్రశ్నిస్తారా?రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖఅదానీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్న అనుబంధంపై ప్రశ్నిస్తారా? లేక ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడేందుకు మౌనంగా ఉంటారా? అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీకి వ్యతిరేకంగా నిరసనల పేరిట కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం రాహుల్‌గాంధీకి కేటీఆర్ లేఖ రాశారు.జాతీయ స్థాయిలో అదానీపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, తెలంగాణలో మాత్రం రేవంత్ నాయకత్వంలో అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూనే, తెలంగాణలో అదానీ గ్రూప్‌నకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడం విడ్డూరంగా ఉందన్నారు. గౌతమ్ అదానీ సీఎం రేవంత్‌కు ఇచ్చిన రూ.100 కోట్ల విరాళం పరస్పర ప్రయోజనాలకు ఉదాహరణ అని స్పష్టం చేశారు. ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు‘ఫార్ములా–ఈ రేసు ఆరోపణల్లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమ్మకం ఉంది. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్‌లాగా తయారైంది’ అని అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. -
కేటీఆర్‌పై ఏసీబీ కేసు.. కవిత కీలక ట్వీట్
సాక్షి,హైదరాబాద్:రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ,కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు గురువారం(డిసెంబర్19) కవిత ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదు.సీఎం రేవంత్ రెడ్డి దయచేసి తెలుసుకోండి.మేము కేసీఆర్ సైనికులం. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టింది.మీ చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేవు. అవి మా సంకల్పానికి మరింత బలం చేకూరుస్తాయి.పోరాటం మాకు కొత్త కాదు.అక్రమ కేసులతో మా గొంతులను నొక్కలేరు’అని కవిత పేర్కొన్నారు. -
రాహుల్‌గాంధీపై హత్యాయత్నం కేసు
న్యూఢిల్లీ:లోక్‌సభలో ప్రతిపక్షనేత,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ హత్యాయత్నం కేసు పెట్టింది. గురువారం(డిసెంబర్19) పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ తోయడం వల్లే తమ ఇద్దరు ఎంపీలు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌గాంధీపై కేసు పెట్టింది.‘మా పార్టీ రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దాడి చేయడంతో పాటు దాడికి ప్రేరేపించారని ఫిర్యాదు చేశాం. నిరసన సమయంలో ఏం జరిగిందో ఎంపీలు ఇప్పటికే చెప్పారు’ అని బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.BJP files police complaint against Rahul Gandhi for assault, incitementRead @ANI Story | https://t.co/ls6lEzdYdB#BJP #AnuragThakur #RahulGandhi #policecomplaint pic.twitter.com/sMqjgPbEvL— ANI Digital (@ani_digital) December 19, 2024 ‘రాహుల్ వైఖరి ఆమోదయోగ్యమైందికాదు.అలాగే నేరపూరితమైంది కూడా. అందుకే ఈ రోజు మేమంతా ఆయనపై ఫిర్యాదు చేశాం.పార్లమెంట్‌లోకి శాంతియుతంగా వెళ్లేందుకు భద్రతా సిబ్బంది ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించారు. ఆ దారిలో వెళ్లాలని పదేపదే అభ్యర్థించారు. కానీ రాహుల్ మాత్రం ఆ అభ్యర్థనను తిరస్కరించారు’ అని మరో ఎంపీ బన్సూరీ స్వరాజ్ చెప్పారు.అమిత్ షా వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే: రాహుల్‌గాంధీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ రాహుల్‌గాంధీపై ఈ ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘అంబేడ్కర్‌పై అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అలాగే అదానీ అంశంపై చర్చ వారికి ఇష్టం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఖర్గే,రాహుల్‌గాంధీ గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. -
‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై కేసు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు మంగళవారం(డిసెంబర్17) ఎక్స్(ట్విటర్)లో కేటీఆర్ స్పందించారు. 30సార్లు ఢిల్లీకి పోయినా మూడు పైసలు తేలేదు కాని..మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే గుడ్‌లక్ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసులు పెట్టండి..వాటిని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.కాగా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ కార్ రేసు ఏర్పాట్లలో నిధుల గోల్మాల్ జరిగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈవ్యవహారంలో అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌పై దర్యాప్తు చేయడానికి గవర్నర్ ఆమోదాన్ని కోరగా ఇందుకు ఆయన ఓకే అన్నారు. దీంతో కేటీఆర్‌పై కేసు పెట్టనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం కేబినెట్ భేటీ తర్వాత సంకేతాలిచ్చారు. తాజాగా దీనిపై కేటీఆర్ స్పందించారు. బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ళ బేరాలు, జైపూర్ లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్టుంది 30 సార్లు ఢిల్లీకి పోయిన 3 పైసలు తేలేదు కానీ, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే, మీ ఖర్మ Good luck Chitti Naidu & CoWill face you legally. Bring it on 👍— KTR (@KTRBRS) December 17, 2024 -
హష్మనీ కేసు.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బ
న్యూయార్క్:రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న ట్రంప్‌నకు హష్ మనీ' కేసులో ఎదురుదెబ్బ తగిలింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు అనధికారికంగా సొమ్ములు చెల్లించిన కేసులో తనకు ఉపశమనం కల్పించాలని ట్రంప్ తాజాగా కోర్టును అభ్యర్థించారు.ట్రంప్ చేసిన ఈ విజ్ఞప్తిని న్యూయార్క్ కోర్టు జడ్జి తిరస్కరించారు. అధ్యక్షులకు రక్షణ అధికారిక చర్యలకు మాత్రమే ఉంటుందని న్యాయమూర్తి జువాన్ మర్చన్ స్పష్టం చేశారు. అనధికార ప్రవర్తనకు రక్షణ వర్తించదని వ్యాఖ్యానించారు.పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ఏకాంతంగ గడిపి ఈ విషయం బయటికి చెప్పకుండా ఉండేందుకు ఆమెకు అనధికారికంగా చెల్లింపులు చేశారని ట్రంప్‌పై కేసు రుజువైంది. ఈ కేసులో ట్రంప్ దోషిత్వం రుజువైనప్పటికీ శిక్ష ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
సంథ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ (ఫొటోలు)
-
బెంగళూరు టెక్కీ తండ్రి సంచలన ఆరోపణలు
పాట్నా : భార్య, ఆమె బంధువులు పెట్టే వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ సుభాష్ (34) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్య తనపై పెట్టిన కేసు నుంచి విముక్తి పొందాలంటే రూ.5లక్షలు ఇవ్వాలని ఓ న్యాయవాది అతుల్ సుభాష్‌ను డిమాండ్ చేసినట్లు అతని తండ్రి పవన్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. బెంగళూరు ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న సుభాష్, నిఖితలకు 2019లో వివాహమైంది. అయితే వివాహం జరిగిన కొన్నేళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో నిఖిత.. సుభాష్‌ను విడిచి పెట్టి బెంగళూరు నుంచి తన సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు వెళ్లింది. అక్కడే ఆమె తల్లి, సోదరుని ప్రోద్బలంతో అతుల్‌పై, అతని కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టింది. ఈ కేసు విచారణ నిమిత్తం తన కుమారుడు సుభాష్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్‌కి 40కి కంటే ఎక్కువ సార్లు తిరిగాడని బాధితుడి తండ్రి పవన్ కుమార్ మీడియా ఎదుట వాపోయాడు.కోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి ‘కేసు పరిష్కరించేందుకు’ రూ.5 లక్షలు అడిగారని ఆరోపించారు. దీంతో మధ్యవర్తిత్వం కోసం తాము సిద్దమైనట్లు చెప్పారు. ఆ సమయంలో తాను మధ్యవర్తిత్వం వహించినందుకు ఓ న్యాయవాది తనని ముందు రూ.20 వేల అడిగారని, ఆ తర్వాత రూ.40వేలకు పెంచారని అన్నారు. అప్పుడే న్యాయమూర్తి అతనికి (సుభాష్) సెటిల్మెంట్ కావాలనుకుంటే రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. Atul Subhash’s father shares how the judiciary systematically harassed his son and family. It’s so painful to watch. 😣To everyone involved, remember—karma is real, and you have your family too.😏#JusticeIsDue #JusticeForAtulSubhash pic.twitter.com/H8211785xL— Sann (@san_x_m) December 12, 2024 ప్రస్తుతం, అతుల్ సుభాష్ కేసు దర్యాప్తును బెంగళూరు మారతహళ్లి పోలీసులు వేగవంతం చేశారు. మృతుని సోదరుడు బికాస్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మారతహళ్లి పోలీసులు ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కి వెళ్లారు. అక్కడ అతుల్ భార్య నిఖితా సింఘానియా, తల్లి నిశా, సోదరుడు అనురాగ్, బంధువు సుశీల్‌ను విచారణ చేపట్టారు. బిహార్‌లో ఉండే మృతుని తల్లిదండ్రుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకోనున్నారు. 👉చదవండి : సోషల్ మీడియాను కదిలించిన ఓ భర్త గాథ -
వైఎస్ వివేకానందరెడ్డి కేసు మళ్లీ విచారణ
-
బ్యాంకు మోసాల దర్యాప్తునకు చర్యలు
బ్యాంకు మోసాలకు సంబంధించిన కేసులను మరింత సమర్థంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మధ్య పరస్పరం సహకారాన్ని పెంపొందించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఈ సంస్థల మధ్య సాధారణ చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయడానికి మంత్రిత్వశాఖ అంగీకరించింది.ప్రత్యేక వేదిక ఏర్పాటు..?బ్యాంకు మోసాలపై సీబీఐలో చాలా కేసులు నమోదవుతున్నాయి. వాటి దర్యాప్తులో అవసరమయ్యే కీలక సమాచారాన్ని బ్యాంకర్లు అందించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పూర్తి సమాచారం అందించేందుకు నిబంధనలు అడ్డుగా ఉంటాయి. అయితే ఎలాంటి కేసుల్లో ఎలాంటి సమాచారం అందించాలనే విషయంపై స్పష్టత వచ్చేందుకు సీబీఐ, బ్యాంకర్లు పరస్పరం చర్చించాల్సి ఉంది. అందుకు ఒక వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా..కేసులకు సంబంధించి సీబీఐ చేసిన అభ్యర్థనలను బ్యాంకర్లు పరిశీలించనున్నారు. బ్యాంకర్లు ఇచ్చిన సమాచారంపై భవిష్యత్తులో కస్టమర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సీబీఐ నుంచి బ్యాంకర్లకు రక్షణ ఉంటుందని కొందరు అధికారులు తెలిపారు. సీబీఐ, బ్యాంకర్ల మధ్య పరస్పరం సహకారం వల్ల ఫిర్యాదుల దాఖలుకు సంబంధించిన కార్యాచరణ అంశాలు, దర్యాప్తును క్రమం తప్పకుండా సమీక్షించడం, ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ సులువవడం వల్ల త్వరగా కేసులు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం!అనుమతుల్లేక కేసులు పెండింగ్2018లో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aలో చేసిన సవరణ ప్రకారం.. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆమోదించిన తర్వాతే బ్యాంకు మోసాలపై దర్యాప్తు ఏజెన్సీ ఉద్యోగులను విచారించే అధికారం ఉంటుంది. పీఎస్‌యూ బ్యాంకులకు, ప్రైవేట్ బ్యాంకులకు ఈ నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ దర్యాప్తు సంస్థలు నేరుగా ఇన్వెస్ట్‌గేషన్ చేయాలంటే చట్టం ప్రకారం వారి యాజమాన్యం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. తాజా సమావేశంలో ఈ అంశంపై చర్చించినట్లు కొందరు అధికారులు తెలిపారు. గత ఏడాది కాలంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), విజిలెన్స్ కమిషన్ వంటి ఏజెన్సీలకు బ్యాంకు యాజమాన్యాలు తమ ఉద్యోగులపై విచారణకు అనుమతి ఇవ్వనందున వందలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫిర్యాదు చేశాయి. -
‘హష్ మనీ’ కేసు కొట్టేయండి: ట్రంప్
న్యూయార్క్:ఇటీవలే రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు తనపై ఉన్న క్రిమినల్ కేసుల్లో వరుసగా ఊరట లభిస్తోంది.ఇప్పటికే ట్రంప్‌పై ఉన్న 2020 ఎన్నికల ఫలితం తారుమారు కేసు విచారణను పక్కనపెడుతున్నట్లు కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే శృంగార తార స్టార్మీ డేనియల్స్ తనపై వేసిన హష్మనీ కేసుపై ట్రంప్ తాజాగా దృష్టి సారించారు. తనను ఇప్పటికే దోషిగా ప్రకటించిన ఈ కేసును కొట్టివేయాలని ట్రంప్ తాజాగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు అధ్యక్ష పదవి నిర్వహించేందుకు తనకు అడ్డంకిగా మారుతుందని పిటిషన్లో పేర్కొన్నారు.నిజానికి ఈ కేసులో ట్రంప్‌కు నవంబర్ 26నే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. శిక్ష ఖరారు అంశాన్ని జడ్జి ఇప్పటికే నిరవధికంగా వాయిదా వేశారు. అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికైన వారికి క్రిమినల్ కేసుల నుంచి రక్షణ ఉంటుంది. ఇది ట్రంప్‌కు ప్రస్తుతం అనుకూలంగా మారింది. -
ఆర్జీ కర్ ఆస్పత్రిలో అవినీతి.. సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను ప్రధాన నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఆ ఛార్జ్ షీట్లో పేర్కొంది. 1000 పేజీల చార్జిషీటును సీబీఐ సిద్ధం చేసింది. అయితే ఈ ఛార్జ్‌షీట్‌ను అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ చార్జిషీటులో ఐదుగురిని నిందితుల జాబితాలో చేర్చారు.సీబీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ (సస్పెండ్ అయ్యారు)తో పాటు మరో నలుగురు అరెస్టయిన నిందితుల పేర్లు ఛార్జ్ షీట్లో ఉన్నాయన్నారు. ఇందులో బిప్లబ్ సింగ్, అఫ్సర్ అలీ, సుమన్ హజ్రా, ఆశిష్ పాండే పేర్లు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిపై చార్జిషీట్ దాఖలు చేయడానికి అవసరమైన అధికారిక అనుమతి పొందలేనందున అలీపూర్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈ ఛార్జిషీట్‌ను అంగీకరించలేదు.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇదే సమయంలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో భారీ అవినీతి జరిగిందంటూ విద్యార్థులు, కొంతమంది వైద్యులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేసింది. విచారణలో పలు ఆర్థిక అవకతవకలు బయటపడ్డాయి. వైద్యసామగ్రి కొనుగోలులో నిందితులు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ విచారణలో తేలింది. ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
ట్రంప్‌కు మరో కేసు నుంచి ఊరట
వాషింగ్టన్:అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌నకు కేసుల్లో వరుసగా ఊరట లభిస్తోంది. ట్రంప్‌పై ఉన్న 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాల తారుమారుకు యత్నించిన కేసును కొట్టివేస్తునట్లు తాజాగా కోర్టు తీర్పిచ్చింది. తన క్లైంట్‌పై ఉన్న 2020 ఎన్నికల కేసును కొట్టివేయాలని ట్రంప్ తరఫు న్యాయవాది జాక్ స్మిత్ కోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని జడ్జి అంగీకరించారు.కేసును తొలగించడం సముచితమేనని,ఈ తీర్పు అధ్యక్ష పదవిలో ఉన్నంతవరకు మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. తనపై కేసును కొట్టివేయడంపై ట్రంప్ స్పందించారు. తనపై కేసులన్నీ చట్ట విరుద్ధమైనవని, వీటి కోసం డెమొక్రాట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేశారని సోషల్‌మీడియాలో పోస్టుపెట్టారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో దిగిన ట్రంప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
తెరపైకి ‘హమ్ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్
ఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించడం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్టాక్‌మార్కెట్ సైతం కుదేలైంది. మరోపక్క.. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.‘మోదాని’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు బలం చేకూరుతోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే.. The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024न्यूयॉर्क के पूर्वी ज़िले के अमेरिकी अटॉर्नी कार्यालय द्वारा गौतम अडानी और उनसे जुड़े अन्य लोगों पर गंभीर आरोप लगाना उस मांग को सही ठहराता है जो भारतीय राष्ट्रीय कांग्रेस जनवरी 2023 से विभिन्न मोदानी घोटालों की संयुक्त संसदीय समिति (JPC) जांच के लिए कर रही है। कांग्रेस ने हम…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024 ‘హమ్ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్ విమర్శ గుప్పించారు.గతంలో.. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక మార్కెట్ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లోనూ డిమాండ్ చేశాయి.అదానీపై తాజా అభియోగాలివే..ఇదిలా ఉంటే.. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆపై.. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు వాళ్లు పేర్కొన్నారు. అలాగే..తద్వారా.. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపించారు. న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది. -
Lagcherla Incident: పరిగి డీఎస్పీ కరుణసాగర్‌పై వేటు
సాక్షి, వికారాబాద్ జిల్లా : దుద్యాల మండలం లగచర్లలో ఈ నెల 11న అధికారులపై జరిగిన దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి ఘటనలో ఉన్నతాధికారులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిగి డీఎస్పీగా కరుణసాగర్‌రెడ్డిపై వేటు వేసింది. డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిగి కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌ను నియమించింది.మరోవైపు కలెక్టర్‌పై దాడి కేసులో కొత్తకోణం చేసుకుంది. దాడి ఘటనలో పంచాయితీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సంగయ్య పల్లి పంచాయితీ సెక్రటరీగా పనిచేస్తున్న రాఘవేందర్ రైతుల్ని రెచ్చగొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరుణంలో సంగయ్యపల్లి పంచాయితీ సెక్రటరీపై రాఘవేందర్‌పై వేటు వేస్తూ సంబంధిశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. Attack On #DistrictCollector in #TelanganaTension erupts in #Lagcherla village in #Dudyala mandal of #Vikarabad district, as villagers were attacked with sticks on District Collector Prateek Jain and govt officials and pelted stones on their vehicles.The officials today… pic.twitter.com/LjKtlrTujC— Surya Reddy (@jsuryareddy) November 11, 2024 -
KSR Live Show: బాబుకు ఇంటూరి రవికిరణ్ అంటే ఎందుకంత భయం..
-
ఘోర రోడ్డు ప్రమాదంలో యువతీ యువకులు మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్ : ఘోర రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల లోపు వయసున్న ఆరుగురు యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పిల్లలు ప్రాణాలు పోయినా కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడం హృదయ విదారకరంగా మారింది.మంగళవారం ఉదయం 1.30 గంటల సమయంలో డెహ్రడూన్‌లోని ఓఎన్జీసీ చౌక్ సమీపంలో యువతి యువకులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు భారీ కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 25ఏళ్ల సిద్ధేష్ అగర్వాల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సిద్దేష్ను స్థానిక సినర్జీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి.అయితే రోడ్డు ప్రమాదంపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేసు నమోదు చేయలేదు. పైగా ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తప్పేమి లేదని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కాంట్ పోలీస్ స్టేషన్ ఎస్సై కేసీ భట్ మాట్లాడుతూ.. ప్రమాదంపై కేసు నమోదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. ఎవరూ ఫిర్యాదు చేయకపోతే మేం కేసు ఎలా ఫైల్ చేస్తాం. బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు. వాహనం నడుపుతున్న కారు యజమాని ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుత చట్టం ప్రకారం ఈ కేసులో అతను బాధ్యత వహించలేడు. కాబట్టే ఈ కేసులో చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎస్సై కేసీ భట్ వెల్లడించారు.కాగా, మృతుల్లో ఐదుగురు డెహ్రాడూన్‌కు చెందినవారు కాగా, ఒకరు చంబాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘోర ప్రమాదం జరగడానికి ముందు యువతి యువకులు అర్థరాత్రి డ్రైవ్‌కు వెళ్లినట్లు సమాచారం.👉 చదవండి : చికెన్ బిర్యానీలో నిద్ర మాత్రలు..భర్తకు తినిపించిన భార్య.. ఆపై -
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు
-
సంచలన డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు..!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, నారా బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టు చేశారని తెదేపా మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్జీవీపై పోలీసు కేసు నమోదు చేశారు.కాగా.. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పలువురు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌ను టార్గెట్ చేసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. కాగా.. అక్రమ కేసులపై కార్యకర్తలకు అండగా ఉంటామని వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. -
బతికుంటే కోర్టుకెళతా: సాధ్వి ప్రజ్ఞ
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆమె కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ తనను చిత్రహింసకు గురిచేసిందని, ఏటీఎస్ కస్టడీకి పంపిందని ఇవి తనను జీవితాంతం వెంటాడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.మెదడులో వాపు, చూపు తగ్గడం, వినికిడి లోపం, మాటల్లో అసమతుల్యతతో పాటు స్టెరాయిడ్స్, న్యూరో డ్రగ్స్ కారణంగా తన శరీరమంతా వాపునకు గురవుతున్నదని ఆమె తెలిపారు. తాను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లోని ఫొటోలో ఆమె ముఖంలో వాపు స్పష్టంగా కనిపిస్తోంది.2008 మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞ నిందితురాలు. వైద్య కారణాలతో ఆమె గత కొన్ని నెలలుగా కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ కేసులో ఎన్ఐఏ ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో తుది వాదనలు కొనసాగుతున్నాయని, ఆమె కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. #कांग्रेस_का_टॉर्चर सिर्फ ATS कस्टडी तक ही नहीं मेरेजीवन भर के लिए मृत्यु दाई कष्ट का कारण हो गएl ब्रेन में सूजन,आँखों से कम दिखना,कानो से कम सुनना बोलने में असंतुलन स्टेरॉयड और न्यूरो की दवाओंसे पूरे शरीर में सूजन एक हॉस्पिटल में उपचार चल रहा हैl जिंदा रही तो कोर्ट अवश्य जाउंगीl pic.twitter.com/vGzNWn6SzX— Sadhvi Pragya Singh Thakur (@sadhvipragyag) November 6, 2024 ఇటీవల సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ హిందూయేతర దుకాణదారులు వారి వ్యాపార సంస్థలపై వారి పేర్లను రాయాలని కోరారు. కన్వర్ యాత్ర మార్గాల్లో ఉన్న తినుబండారాల దుకాణదారులు వారిపేర్లను వెల్లడించాలని ఆమె కోరారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇలాంటి ఆదేశాలు జారీ చేసిన దరిమిలా సాధ్వి ప్రజ్ఞా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.ఇది కూడా చదవండి: నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనితదే బాధ్యత -
కుమారస్వామిపై కేసు
బెంగళూరు: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామిపై కర్ణాటకలో కేసు నమోదైంది. 2006–08 కాలంలో కర్ణాటక సీఎంగా ఉన్న కాలంలో కుమారస్వామి ఒక గనుల తవ్వకం సంస్థకు అక్రమంగా మైనింగ్ అనుమతులు ఇచ్చారని గతంలో ఒక కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి సారథ్యం వహిస్తున్న ఇన్స్పెక్టర్ జనరల్ ఎం.చంద్రశేఖర్ తాజాగా ఫిర్యాదుచేయడంతో బెంగళూరులోని సంజయ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కుమారస్వామిపై కేసు నమోదైంది.కుమారస్వామి ప్రభుత్వ అధికారిగా తన విధి నిర్వహణకు అడ్డు తగులుతున్నారని, తనను బెదిరించారని చంద్రశేఖర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించి నాడు బళ్లారి జిల్లాలో శ్రీసాయి వెంకటేశ్వర మినరల్స్ సంస్థకు 550 ఎకరాల్లో గనుల తవ్వకం అనుమతులు ఇచ్చారని కుమారస్వామిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. కుట్రపూరిత కేసు: కుమారస్వామితాజా కేసుపై కుమారస్వామి స్పందించారు. ‘‘ ఇది పూర్తిగా కుట్రపూరితంగా నమోదుచేసిన కేసు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఐజీపై నేను పత్రికాసమావేశంలో ఆరోపణలు చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది నిజమని నిరూపించగలరా? కావాలంటే ప్రెస్‌మీట్ వీడియోను మరోసారి చూడండి. ఈ కేసును నేను చట్టప్రకారమే ఎదుర్కొంటా’’ అని మంత్రి అన్నారు. -
హనీట్రాప్ కేసులో కూటమి ఎమ్మెల్యే?
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసు వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యే ఉన్నారా? బీజేపీ యువనేతలకు కూడా ఈ కేసుతో ప్రమేయముందా? వీరూ హనీట్రాప్ బాధితులా? లేదా యువతి ద్వారా వ్యాపారులను దోచుకుంటున్న సూత్రధారులా? ఇప్పుడివే సందేహాలు సర్వత్రా చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారులు, బిగ్షాట్స్ లక్ష్యంగా జాయ్ జమీనా అనే యువతి వలపు వల విసిరి.. వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు వ్యాపారులు మాత్రమే ఆమె వలలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ.. ఆ జాబితాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారన్న వార్తలు గుçప్పుమంటున్నాయి. ఈ కేసు వివరాలు బయటకు వెల్లడించకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తుండడం కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూరిస్తోంది. వలపు వల విసిరి.. రేప్ కేసు పెట్టి.. జాయ్ జమీనా కోసం ఎన్ఆర్ఐ యువకుడు అమెరికా నుంచి వచ్చి.. ఆమె వలలో చిక్కుకొని రూ.లక్షలు పోగొట్టుకున్నాడని.. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైంది. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. విచారణలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు విస్తుపోయారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆమె నోరువిప్పనట్లు తెలిసింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. గతంలో ఈ తరహా కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా? అని దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఒక వ్యక్తిపై పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ కేసు వివరాలను ఆరా తీయడంతో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఆమెను భీమిలి పోలీస్‌స్టేషన్‌లో విచారించినప్పటికీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనట్లు సమాచారం. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టుకు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇంతలో కంచరపాలెం, ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఆమె ఇద్దరి వ్యాపారులను ఇదే తరహాలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందాయి. స్ప్రే కొట్టి.. ముగ్గులోకి దించి.. జాయ్ జమీనా ట్రాప్‌లో చిక్కుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆమె వ్యాపారులను దోచుకున్న తీరుపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా రెస్టారెంట్, కాఫీషాప్, రాజకీయ నేతలు ఇలా ఆర్థికంగా బలమైన వారినే ఎంచుకుంది. వారిని ఏదో ఒక విధంగా పరిచయం చేసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని, కవ్వింపు మాటలతో ముగ్గులోకి దింపేది. ఒక రోజు వారితో కారులో బయటకు వెళ్లడం.. ఆ సమయంలో వారి ముఖంపై ఒక రసాయనాన్ని స్ప్రే చేయడం.. ఇంటికి తీసుకువెళ్లడం.. వారు వద్దన్నా డ్రింక్ లేదా కాఫీ బలవంతంగా తాగించడం.. ఆ తరువాత బాధితులు మత్తులోకి జారిపోవడం.. లేచి చూసేసరికి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం.. రూ.లక్షలు డిమాండ్ చేయడం.. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించడం.. డబ్బు ఇవ్వని వారిపై రేప్ కేసు పెట్టడం.. ఇదే తరహాలో అనేక మందిని ఆమె దోచుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో వ్యాపారులు, ఎన్ఆర్ఐలతో పాటు రాజకీయ నేతలు సైతం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నా..జమీనా నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి స్టేషన్లో నమోదైన కేసులో ఆమె అరెస్టయింది. కోర్టు ద్వారా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించారు. ఆమె వెనుక ఉన్న ముఠా సమాచారం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా.. నోరు విప్పడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ల్యాప్‌టాప్, మొబైల్లో ఉన్న సమాచారం సేకరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు సమాచారం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, నచ్చింది చేసుకోమని ఆమె సమాధానమివ్వడంతో పాటు తిరిగి వారినే బెదిరిస్తూ మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీ సమయం ముగియడంతో ఆమెను మళ్లీ జైలుకు పంపించారు. అయితే కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కాఫీషాప్ యజమాని ఫిర్యాదుపై నమోదైన కేసులో కూడా గత రెండు రోజుల క్రితం ఆమెను రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆమె నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయతి్నంచారు. -
KSR Live Show: అన్న ఆస్తి కోసం చెల్లి కుట్ర..
-
హతమార్చి.. పోలీసులను ఏమార్చి!
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలకు తెగబడటం, ప్రతిఘటించిన వారిని హత్య చేసి పరారయ్యే హంతకుడిని పట్టుకోవడంలో రాచకొండ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. హత్య చేసి ఏడాదిన్నర కాలం పాటు పోలీసుల కళ్లగప్పి వారి ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. మరో ఇద్దరిని హత్య చేసి, తనంతట తాను దొరికితే తప్ప విచారణాధికారులు నిందితుడిని పట్టుకోలేకపోయారు. శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరించి తొలి కేసులోనే నిందితుడిని పట్టుకుని ఉంటే.. ఇద్దరు ప్రాణాలతో మిగిలేవారు. కేసుల దర్యాప్తులో రాచకొండ పోలీసుల డొల్లతనంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాగితే అఘాయిత్యమే.. దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుమార్ మద్యం మత్తులో సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. తాగిన మైకంలో ఫామ్ హౌస్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై కన్నేసేవాడు. అదను చూసి మద్యం తాగి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే అక్కడే ఉన్న పదునైన ఆయుధంతో వారిని హత్య చేసి పరారయ్యేవాడు. ఈ ఘటనను ఎవరైనా చూస్తే.. సాక్ష్యం మిగలకుండా వారిని కూడా అంతం చేసేందుకు వెనుకాడేవాడు కాదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వాటిలో పోస్ట్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆధారాల సేకరణలో విఫలం.. దాసర్లపల్లిలోని అరుణ ఫామ్ హౌస్‌లో పనిచేసే శైలజ అనే మహిళపై కన్నేసిన అతను గతేడాది మార్చి 3న ఆమెను హత్య చేశాడు. అనంతరం హతురాలి ఇంట్లో ఉన్న రెండు విదేశీ మద్యం బాటిళ్లు నిందితుడికంట పడ్డాయి. దీంతో ఒక బాటిల్‌ను తీసుకుని, మరొకటి తీస్తుండగా చేయి జారి కింద పడిపోయింది. పగిలిన బాటిల్‌పై ఉన్న నిందితుడి వేలిముద్రలను పోలీసులు సేకరించారు. అయితే హతురాలు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారే అయినా పోలీసులు ఊరిలో ఉన్న అనుమానితులను విచారించలేదు. దీంతో నిందితుడు శివ కళ్ల ముందు ఉన్నా గుర్తించలేకపోయారు. అంతే కాకుండా హత్య అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు వచి్చన సమయంలోనూ నిందితుడు కూడా అక్కడే ఉండి ఆధారాల సేకరణలో వారికి సహాయపడినట్లు తెలిసింది. వాసన పసిగట్టి డాగ్ స్క్వాడ్ వెంబడిస్తాయని ముందుగానే తెలుసుకున్న నిందితుడు... అవి రాకముందే అక్కడ్నుంచి పరారయ్యేవాడు. శైలజా రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏడాదిన్నర కాలం పాటు అదే ఊర్లో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారు. మరోసారి మద్యం మత్తులో మ్యాంగో ఆర్చిడ్స్ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్న శాంతమ్మపై అత్యాచారానికి యతి్నంచాడు. ఆమె ప్రతిఘటించడంతో వేట కొడవలితో హత్య చేశాడు. ఇది చూశాడన్న అనుమానంతో ఆమె భర్త మూగ హోసయ్యనూ అంతం చేశాడు. తొలి కేసులోనే పోలీసులు హంతుకుడు శివను పట్టుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలకు దక్కేవని స్థానికులు పేర్కొంటున్నారు.పాత కేసులపై ఆరా.. హత్యలు జరిగిన రెండు ఫామ్ హౌస్‌లలోనూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా పోలీసుల దర్యాప్తునకు సవాల్‌గా మారింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకునే యజమానులు, సిబ్బంది భద్రత, రక్షణ కోసం కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఉండాల్సిందని పోలీసులు సూచిస్తున్నారు. ఫామ్ హౌస్‌లకు వచ్చివెళ్లే దారిలో కూడా ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడం నిందితులు ఎలాంటి బెరుకు లేకుండా నేరాలకు పాల్పడుతుంటారని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా నిందితుడు సాయంత్రం వేళల్లో మద్యం తాగి, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతుంటాడు. అడ్డుపడిన వారిపై పదునైన ఆయుధంతో హత్య చేస్తుంటాడు. దీంతో మహేశ్వరం జోన్ పరిధిలో ఇదే తరహాలో ఏమైనా హత్య కేసులు నమోదయ్యాయా అనే కోణంలో పోలీసులు పునఃసమీక్షిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, ఫామ్ హౌస్‌లు, గృహాలలో సాయంత్రం వేళల్లో జరిగిన మహిళల హత్య కేసులను ఆరా తీస్తున్నారు.