మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు నీ భార్యకు చూపించి..! | Bengaluru Teacher Sridevi Rudagi Incident, Arrested For Blackmailing Student's Father | Sakshi
Sakshi News home page

మన వీడియోలు నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తా..!

Apr 2 2025 7:44 AM | Updated on Apr 2 2025 9:53 AM

Bengaluru Teacher Sridevi Rudagi Incident

బెంగళూరులో ప్రీ స్కూల్‌ యజమానురాలి నిర్వాకం  

సన్నిహితంగా ఉంటూ డబ్బులు గుంజుడు 

 కిడ్నాప్‌ చేసి రూ. కోటికి డిమాండ్‌  

బాధితుని ఫిర్యాదుతో ముగ్గురి అరెస్టు  

కృష్ణరాజపురం/ బనశంకరి: బెంగళూరులో ఓ పారిశ్రామికవేత్తను హనీట్రాప్‌ చేసి ముప్పుతిప్పలు పెట్టి దోచుకున్న ముఠా ఉదంతమిది. కిలాడీ మహిళ ఒక ముద్దుకు రూ.50 వేల చొప్పున వసూలు చేయడం గమనార్హం. ముఠా బెదిరింపులను తట్టుకోలేక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కిలాడీ శ్రీదేవి రుడగి (25), ఆమె ప్రియుడు సాగర్‌ మోరే (28), రౌడీషీటర్‌ గణేష్‌ కాలే (38) లను నగర సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... మహాలక్ష్మి లేఔట్‌లో ప్రీ స్కూల్‌ నిర్వహిస్తున్న శ్రీదేవి అసలు నిందితురాలు. ఆమె ప్రీస్కూల్‌కు రాకేష్‌ వైష్ణవ్‌ (34) అనే వ్యాపారవేత్త తన పిల్లలను పంపించేవాడు. అలా అతనితో పరిచయం పెంచుకుని స్కూలు నిర్వహణ కోసమని రూ.4 లక్షలను అప్పుగా తీసుకుంది. డబ్బు వాపసు ఇవ్వాలని అడగగా ప్రీ స్కూల్‌ పార్టనర్‌ కావాలని కోరింది. చనువు పెంచుకుని కలిసి తిరిగేవారు.  

కొత్త ఫోను, సిమ్‌  
శ్రీదేవితో మాట్లాడేందుకు కొత్త సిమ్, ఫోన్‌ను రాకేష్‌ కొనిచ్చాడు. శ్రీదేవి అతనికి ముద్దు పెట్టి రూ.50 వేలు చొప్పున తీసుకుంది. నీతోనే రిలేషన్‌షిప్‌లో ఉంటానని చెప్పి రూ.15 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. తరచూ డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో రాకేష్‌కు విసుగొచ్చి ఆమె సిమ్‌ను విరగ్గొట్టి పారేశాడు.  

టీసీ ఇస్తామని పిలిచి కిడ్నాప్‌  
రాకేష్‌ ఆమె సూచన మేరకు మార్చి 12న పిల్లలకు టీసీని తీసుకునేందుకు ప్రీ స్కూల్‌కు వచ్చాడు. అప్పుడు శ్రీదేవితో పాటు నిందితులు సాగర్‌ మోరే, గణేష్‌ కాలే ఉన్నారు. వారు రాకేష్‌ పై దాడి చేసి, సాగర్‌తో శ్రీదేవికి నిశ్చితార్థం అయ్యింది. నువ్వు ఆమెతో మజా చేస్తున్నావా? ఈ సంగతిని శ్రీదేవి తండ్రికి, నీ భార్యకు చెబుతానంటూ రాకేష్‌ను బ్లాక్‌మెయిల్‌ చేశారు. పోలీసు స్టేషన్‌కు వెళ్దాం పద అంటూ రాకే‹Ùను ఎక్స్‌యూవీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు. ఇంతటితో వదిలేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని రాకే‹Ùను ఒత్తిడి చేశారు.  చివర రూ.20 లక్షలు ఇస్తే చాలని డిమాండ్‌ చేశారు. ఆఖరికి రూ.1.90 లక్షలు తీసుకుని వదిలేశారు. 

నిందితులు బిజాపురవాసులు  
శ్రీదేవి విద్యార్థుల తండ్రులను తీయని మాటలతో మోసపుచ్చి వలలో వేసుకునేదని, ముద్దు ఇస్తే రూ.50 వేలు ఇవ్వాలనే షరతుతో సల్లాపాలు నడిపేదని వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గురూ  విజయపుర (బిజాపుర) జిల్లా నివాసులు. ఉపాధి కోసం బెంగళూరుకు వలసవచ్చి చాతుర్యాన్ని ప్రదర్శించారు. రౌడీ గణేశ్‌ కాలేపై బెదిరింపులు, దోపిడీ, హత్యాయత్నం వంటి 9 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కిలాడీలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచి పోలీస్‌కస్టడీకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. దర్యాప్తులో మరిన్ని హనీట్రాప్‌ బాగోతాలు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. నగరంలో ఈ హనీట్రాప్‌ దందా సంచలనం కలిగిస్తోంది. ఈమె బారిన మరికొందరు పడి ఉంటారని అనుమానాలున్నాయి.

మళ్లీ బ్లాక్‌మెయిలింగ్‌ 
మార్చి 17న మళ్లీ రాకేష్‌ కు శ్రీదేవి ఫోన్‌ చేసి రూ.15 లక్షలు ఇవ్వాలని, అప్పుడే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు, చాటింగ్‌ను డిలిట్‌ చేస్తాను, లేకుంటే నీ భార్యకు చూపించి నీ సంసారాన్ని పాడు చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేసింది. దీంతో విసిగిపోయిన రాకేష్‌ చివరకు బెంగళూరు సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీదేవి, గణేష్‌, సాగర్‌లను అరెస్టు చేసి మరింత విచారణ కోసం తమ కస్టడీలోకి  తీసుకున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement