honey trap
-
హనీ ట్రాప్ కేసులో సీన్ రీ కన్స్ట్రక్షన్
-
ఓసారి మా ఇంటికొచ్చి.. టీ తాగి వెళ్లండి!
కృష్ణరాజపురం: అల్లరి నరేష్ బ్లేడ్‌బాబ్జీ సినిమాలోని సీన్‌ను తలపించే ఘటన ఒకటి బ్యాడరహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వేషంలో హనీట్రాప్‌కు పాల్పడి..బ్బు గుంజే ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ప్రధాన నిందితురాలు నయన (20) అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఈ గ్యాంగ్‌లోని సంతోష్, అజయ్, జయరాజ్‌లను అరెస్టు చేసిన బ్యాడరహళ్లి పోలీసులు తాజాగా నయనను అరెస్టు చేశారు. నిర్మాణ కాంట్రాక్టర్ (57)ని పరిచయం చేసుకున్న నయన మాయమాటలతో అతని నుంచి తరచుగా రూ.5 వేలు, రూ.10 వేలను ఇప్పించుకొనేది. ఓసారి టీ తాగి వెళ్లండి అని ఇంటికి పిలిచింది. వలలో పడిన బాధితుడు ఆమె స్కూటీని ఫాలో చేసుకుని ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంటిలో ఉండగా పోలీసులమని చెప్పి వచ్చిన దుండగులు వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ బ్లాక్మెయిల్ చేశారు. కాంట్రాక్టర్‌ను కొట్టి దుస్తులు విప్పించి ఫొటోలు తీసుకున్నారు. కింద మేడం ఉన్నారు, ఇక్కడే సెటిల్ చేసుకోమని బెదిరించి రూ.29 వేల నగదు, ఫోన్‌పేలో రూ.26 వేల నగదు, వంటిపై ఉన్న రూ.5 లక్షల విలువ చేసే బంగారు గొలుసు, ఉంగరం, బ్రాస్లెట్ను లాక్కొని పరారయ్యారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. విషాద మలుపుల ప్రేమ -
విశాఖ జాయ్ జమీమా కేసులో మాజీ ఎంపీ కుమారుడి పేరు
-
జాయ్ జెమీమా కేసు: ‘ హర్షకుమార్కు ఎందుకంత ఇంట్రెస్టో అర్థం కావడం లేదు’
విశాఖ: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన జాయ్ జెమీమా హనీ ట్రాప్ కేసులో విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి. ఈ మేరకు మంగళవారం హనీ ట్రాప్ కేసుకు సంబంధించి కీలక విషయాలను మీడియాకు వెల్లడించారు సీపీ. ‘జాయ్ జెమీమా గ్యాంగ్ చాలామంది జీవితాలతో ఆడుకుంది. మోసాలతో పాటు హత్యాయత్నాలు కూడా చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ వేణురెడ్డి రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. జాయ్ జెమీమా పెళ్లి జరిగినట్లు ఒప్పుకున్నారు. 10 మందిని జాయ్ జెమీమా మోసం చేసినట్లు గుర్తించాం. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతాం.మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలపై దర్యాప్తు చేస్తాం. ఈ కేసులో ఆయనకు ఎందకతం ఇంట్రెస్టో అర్థం కావడం లేదు. రాజకీయ నాయకులతో సంబంధాలపై విచారణ చేస్తున్నాం. జాయ్ జెమీమాతో ఎంపీ హర్షకుమార్ కుమారుడు పరిచయాలపై విచారణ జరుగుతోంది.మాజీ ఎంపి హర్ష కుమార్ కుమారునికి జాయ్ జమీమాకు పరిచయాలు పై విచారణ జరుగుతోంది. చట్టం ముందు అందరూ సమానమే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ ముఠాలో ప్రధాన నిందితులు జాయ్ జెమిమాతో పాటు వేణు రెడ్డి, కిషోర్‌లను అరెస్ట్ చేశాం. ఈ ముఠాకు సంబంధించిన మరో ముగ్గురిని గుర్తించాం త్వరలో అరెస్టు చేస్తాం’ అని సీపీ పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెళ్లైన వారే కిలాడీ లేడీ టార్గెట్..!విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత -
జాయ్ జమీమా వెనుక వేణుభాస్కరరెడ్డి
విశాఖ సిటీ: హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ధనికులు, వ్యాపారవేత్తలు, వివాహమైన వారికి వల వేసి ప్రేమాయణం నడిపి బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన జాయ్ జమీమా వెనుక ఉన్న ప్రధాన ముఠా సభ్యుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేణుభాస్కర్‌రెడ్డిని విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జాయ్ జమీమాతో సహజీవనం చేసే వేణుభాస్కర్‌రెడ్డి వెనకుండి బాధితులపై దాడులు, హత్యాయత్నం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు విచారణలో నిర్ధారణైంది. వివరాల్లోకి వెళితే.. జాయ్ జమీమా అనే మహిళ విశాఖ నగరంలో పలువురు బడాబాబులకు వలపు వల విసిరి, వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో బ్లాక్మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసింది. డబ్బు కోసం కొంత మందిపై దాడులు, హత్యాయత్నాలు కూడా చేసింది. ఆమె ట్రాప్‌లో చిక్కిన ఒక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సినిమా తరహాలో మత్తు మందు ఇచ్చి బాధితులను లొంగదీసుకొని వీడియోలు తీసి బెదిరింపులకు దిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆమె అరెస్టు తరువాత వరుసగా బాధితులు బయటకు వచ్చి నగరంలో పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.కీలక సూత్రధారి కోసం ప్రత్యేక బృందాలు..పోలీసుల విచారణకు జాయ్ జమీమా కనీసం సహకరించకపోగా తిరిగి వారిపైనే బెదిరింపులకు దిగింది. ఒక మహిళ ఇంత మందిని మోసం చేయడం, దాడులు చేయడం వెనుక ఉన్న వారి కోసం పోలీసులు నిఘా పెట్టారు. కొంతమంది బాధితులపై దాడులు చేసిన క్రమంలో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు కూడా ఉన్నట్లు పలువురు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఆమె కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలు, ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టారు. ఇందులో లభించిన సమాచారంతో పోలీసులు ఆమె స్నేహితుడి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఈ కేసు రాజకీయ, సామాజికవర్గ రంగు పులుముకుంది. మాజీ మంత్రి హర్షకుమార్ నేరుగా విశాఖకు వచ్చి జాయ్ జమీమా కేసులో పోలీసులపై ఆరోపణలు సైతం చేశారు. దీంతో పోలీసులు ఈ కేసులో మరింత స్పీడ్ పెంచారు.పోలీసులకు చిక్కిన కీలక సభ్యుడుప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జాయ్ జమీమా వెనుక ఉన్నది శ్రీకాకుళం జిల్లాకు చెందిన వేణుభాస్కర్‌రెడ్డి అని గుర్తించారు. జమీమా, వేణుభాస్కర్ల మధ్య జరిగిన నగదు లావాదేవీల సాక్ష్యాలను సైతం సేకరించారు. మద్దిలపాలెం ప్రాంతంలో ఉండే ఒక వ్యక్తిని కూడా మత్తులోకి దించి, బెదిరించి హత్యాయత్నం చేసి భారీగా మొత్తంలో నగదు కాజేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. వేణుభాస్కర్‌రెడ్డి కూడా పలు కేసుల్లో ముద్దాయిగా ఉంటూ తప్పించుకొని తిరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందాలతో గాలించిన పోలీసులకు వేణుభాస్కర్‌రెడ్డి ఎన్ఏడీ కొత్తరోడ్ వద్దే పట్టుబడ్డాడు. దీంతో శనివారం అతడిని అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
సీఐడీ చీఫ్ అయ్యన్నార్ వీరంగం!
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మరింతగా బరితెగించింది. వలపు వలతో బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ కుట్రపూరితంగా ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెదిరింపులకు దిగుతోంది. ఇందులో భాగంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ రంగంలోకి దిగడం.. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అయ్యన్నార్పై హైకోర్టుకు ఫిర్యాదు చేసేందుకు కుక్కల విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు సిద్ధపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..వేరే గదిలోకి తీసుకువెళ్లి బెదిరింపులు..హనీట్రాప్ ట్రాక్ రికార్డ్ ఉన్న కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఇటీవల సీఐడీకి బదిలీచేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు విద్యాసాగర్‌ను విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో మూడ్రోజుల కస్టడీకి తీసుకున్నారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ కొంతసేపు విచారించారు. ఆ తర్వాత ఆయన్ను మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లుచేయకపోవడం గమనార్హం. మరి ఆయన్ని ఆ గదిలోకి ఎందుకు తీసుకువెళ్లారన్నది అర్థంకాలేదు. కానీ, కొన్ని క్షణాలకే సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం స్పష్టమైంది. ఆడియో, వీడియో రికార్డింగ్లేని ఆ గదిలో విద్యాసాగర్‌ను రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు సమాచారం. తాము చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన పోలీసు శైలిలో హెచ్చరించారు. తాము చెప్పిన కొందరి పేర్లను వాంగ్మూలంలో పేర్కొనాలని.. వారు చెప్పినట్లే తాను చేశానని.. అంతా వారి ప్రమేయంతోనే జరిగిందనే అసత్య వాంగ్మూలాన్ని ఇవ్వాలని బెదిరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గతంలో తాము ఎవరెవర్ని ఎలా కేసుల్లో ఇరికించింది.. ఎంతగా వేధించిందీ చెబుతూ బెదిరించారు. ఓ సమయంలో ఆయన నిగ్రహం కోల్పోయి మరీ తీవ్రస్థాయిలో విరచుకుపడినట్లు తెలిసింది. దీంతో అసలక్కడ ఏం జరుగుతోందోనని సీఐడీ వర్గాలే కాసేపు ఆందోళన చెందాయి.అయ్యన్నార్ బెదిరింపులపై హైకోర్టుకు నివేదన..న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిర్వహిస్తున్న విచారణ సందర్భంలోనే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నిబంధనలను ఉల్లంఘించడంపట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన వ్యవహారశైలి న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. అయ్యన్నార్ బెదిరింపులను విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు. కస్టడీలో వేధింపులు, కోర్టు ఆదేశాల ధిక్కరణ తదితర అభియోగాలతో అయ్యన్నార్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విద్యాసాగర్ కూడా తనను రవిశంకర్ అయ్యన్నార్ ఏ రీతిలో బెదిరించిందీ.. అంతుచూస్తానని హెచ్చరించిందీ న్యాయస్థానానికి విన్నవించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. -
వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్..
-
హనీట్రాప్ కేసులో కూటమి ఎమ్మెల్యే?
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసు వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యే ఉన్నారా? బీజేపీ యువనేతలకు కూడా ఈ కేసుతో ప్రమేయముందా? వీరూ హనీట్రాప్ బాధితులా? లేదా యువతి ద్వారా వ్యాపారులను దోచుకుంటున్న సూత్రధారులా? ఇప్పుడివే సందేహాలు సర్వత్రా చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారులు, బిగ్షాట్స్ లక్ష్యంగా జాయ్ జమీనా అనే యువతి వలపు వల విసిరి.. వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు వ్యాపారులు మాత్రమే ఆమె వలలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ.. ఆ జాబితాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారన్న వార్తలు గుçప్పుమంటున్నాయి. ఈ కేసు వివరాలు బయటకు వెల్లడించకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తుండడం కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూరిస్తోంది. వలపు వల విసిరి.. రేప్ కేసు పెట్టి.. జాయ్ జమీనా కోసం ఎన్ఆర్ఐ యువకుడు అమెరికా నుంచి వచ్చి.. ఆమె వలలో చిక్కుకొని రూ.లక్షలు పోగొట్టుకున్నాడని.. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైంది. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. విచారణలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు విస్తుపోయారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆమె నోరువిప్పనట్లు తెలిసింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. గతంలో ఈ తరహా కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా? అని దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఒక వ్యక్తిపై పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ కేసు వివరాలను ఆరా తీయడంతో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఆమెను భీమిలి పోలీస్‌స్టేషన్‌లో విచారించినప్పటికీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనట్లు సమాచారం. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టుకు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇంతలో కంచరపాలెం, ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఆమె ఇద్దరి వ్యాపారులను ఇదే తరహాలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందాయి. స్ప్రే కొట్టి.. ముగ్గులోకి దించి.. జాయ్ జమీనా ట్రాప్‌లో చిక్కుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆమె వ్యాపారులను దోచుకున్న తీరుపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా రెస్టారెంట్, కాఫీషాప్, రాజకీయ నేతలు ఇలా ఆర్థికంగా బలమైన వారినే ఎంచుకుంది. వారిని ఏదో ఒక విధంగా పరిచయం చేసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని, కవ్వింపు మాటలతో ముగ్గులోకి దింపేది. ఒక రోజు వారితో కారులో బయటకు వెళ్లడం.. ఆ సమయంలో వారి ముఖంపై ఒక రసాయనాన్ని స్ప్రే చేయడం.. ఇంటికి తీసుకువెళ్లడం.. వారు వద్దన్నా డ్రింక్ లేదా కాఫీ బలవంతంగా తాగించడం.. ఆ తరువాత బాధితులు మత్తులోకి జారిపోవడం.. లేచి చూసేసరికి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం.. రూ.లక్షలు డిమాండ్ చేయడం.. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించడం.. డబ్బు ఇవ్వని వారిపై రేప్ కేసు పెట్టడం.. ఇదే తరహాలో అనేక మందిని ఆమె దోచుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో వ్యాపారులు, ఎన్ఆర్ఐలతో పాటు రాజకీయ నేతలు సైతం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నా..జమీనా నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి స్టేషన్లో నమోదైన కేసులో ఆమె అరెస్టయింది. కోర్టు ద్వారా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించారు. ఆమె వెనుక ఉన్న ముఠా సమాచారం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా.. నోరు విప్పడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ల్యాప్‌టాప్, మొబైల్లో ఉన్న సమాచారం సేకరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు సమాచారం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, నచ్చింది చేసుకోమని ఆమె సమాధానమివ్వడంతో పాటు తిరిగి వారినే బెదిరిస్తూ మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీ సమయం ముగియడంతో ఆమెను మళ్లీ జైలుకు పంపించారు. అయితే కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కాఫీషాప్ యజమాని ఫిర్యాదుపై నమోదైన కేసులో కూడా గత రెండు రోజుల క్రితం ఆమెను రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆమె నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయతి్నంచారు. -
వైజాగ్ హనీ ట్రాప్ కేసులో బయటపడ్డ జాయ్ జెమిమా వీడియో
-
Karnataka: వీడియోలతో బెదిరించి మంత్రి అయ్యాడు
బనశంకరి: కాంట్రాక్టర్లపై బెదిరింపులు, అలాగే అత్యాచారం, హనీట్రాప్ కేసులు ఎదుర్కొంటూ అరెస్టయిన రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తనను వాడుకుని ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను హనీట్రాప్ చేయించారని మహిళ ఆరోపించారు. బెంగళూరులో ఇది జరిగిందని, నా భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించి హనీట్రాప్ చేయించారని తెలిపారు. చాలా మంది మహిళలతో ఈ మహిళపై అత్యాచారం కేసులోనే మునిరత్న అరెస్టయ్యారు. ఆమె బుధవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. తనకు భద్రత కల్పిస్తే, మాజీ సీఎం హనీట్రాప్ విషయాలను సిట్‌కు అందజేస్తానని తెలిపారు. మునిరత్న తనలాగే చాలామంది మహిళలను హనీ ట్రాప్ కు వాడుకున్నారని, తనకు మొబైల్ ఫోన్ ఇచ్చి సదరు వ్యక్తుల వద్దకు పంపించేవారని చెప్పారు. మునిరత్న బంధువు సుధాకర్ కూడా హనీట్రాప్ దందాలో పాల్గొనేవాడని చెప్పారు. హెచ్ఐవీ కలిగిన యువతితో.. మునిరత్న బెదిరించి తనతో హనీ ట్రాప్ చేసిన సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని, తాను సొంతంగా ఎవరినీ ట్రాప్ చేయలేదని ఆమె చెప్పారు. ఆయన మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను హనీట్రాప్ చేసి వీడియో తీశారని, ఏసీపీ, సీఐ కూడా హనీట్రాప్ చేయించారని తెలిపారు. హెచ్ఐవీ జబ్బు కలిగిన యువతిని రాజకీయ నేతల వద్దకు పంపేవారని, 10 నిమిషాలు సమయం ఇస్తే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై.విజయేంద్రను కలిసి మునిరత్న అక్రమాలను వివరిస్తానని, ఆయనను ఇంకా పారీ్టలో ఎందుకు కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మునిరత్న మంత్రిగా ఉండగా ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారో కొన్ని ఫోటోలను ఆమె విడుదల చేశారు. హనీ ట్రాప్ వీడియోల ద్వారా అప్పటి సీఎంలను బెదిరించి మంత్రి పదవి పొందారని అన్నారు. నాకు ఏమైనా జరిగితే మునిరత్న కారణమన్నారు. అత్యాచారం ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టానన్నారు. తనకు రక్షణ కలి్పంచాలని పదే పదే కోరారు. -
విశాఖలో సంచలనం రేపుతున్న హనీట్రాప్
-
పోలీసులే షాకయ్యేలా.. విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలనాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ హనీ ట్రాప్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిలేడీ జాయ్ జెమీమా ఆగడాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. ధనవంతులను తన అందంతో ట్రాప్ చేస్తున్న మాయా లేడీ.. సోషల్ మీడియాలో పరిచయం చేసుకొని విదేశాల్లో ఉన్న వారిని సైతం భారత్‌కి రప్పిస్తోంది. విచారణలో పోలీసులే షాకయ్యే అనేక వాస్తవాలు బయటపడుతున్నాయి.మంచి అమ్మాయిగా నటించి...విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని..పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.ఇంటికి రప్పించి.. నగ్నంగా ఫోటోలు తీసి..ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్‌లు ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది.ఇదీ చదవండి: ప్రియుడి మోజులో.. ఆమె భర్తను ఏం చేసిందంటే?బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని..ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది.ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపోయేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచారులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా శవమైపోతావు అంటూ బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4న బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్‌లో జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమపేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. -
ఆ శిక్ష.. ఐపీఎస్‌లపై కక్ష!
సాక్షి, అమరావతి: వలపు వల (హనీ ట్రాప్)తో బడా బాబులను బ్లాక్ మెయిల్ చేయడం ఆమె వ్యవహార శైలి.. ఫోర్జరీ పత్రాలతో మోసాలకు పాల్పడటం ఆమె నైజం..ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు ఆమె నేర చరిత్రకు సాక్ష్యం..ఫోర్జరీ నేరంపై విజయవాడ కోర్టు ఆదేశాలతో రిమాండ్.. ఇదీ ఇటీవల నేపథ్యం.. తీవ్రమైన నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ నిరాధార ఆరోపణలతో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేస్తే, ప్రభుత్వం ఎలా స్పందించాలి? ఆమెను అరెస్ట్ చేసి, న్యాయస్థానం ద్వారా రిమాండ్ విధించిన అధికారులపై ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. మరోవైపు ఆమె ఆరోపణలు ఎంత వరకు వాస్తవమో దర్యాప్తునకు ఆదేశించాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు తనను అరెస్టు చేసి జైలులో పెట్టడాన్ని మనసులో ఉంచుకున్న చంద్రబాబు.. ఏదో ఒక సాకు చూపి.. సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలని ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగానే జుగుప్సాకరమైన, తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీకి ప్రభుత్వం విశిష్ట అతిథి స్థాయిలో ప్రోటోకాల్ మర్యాదలు చేసింది. ఆపై ఆమె ఫిర్యాదును సాకుగా చేసుకుని డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఐజీ టి.కాంతి రాణా, డీఐజీ విశాల్ గున్నీలను ఏకపక్షంగా సస్పెండ్ చేసింది. వారిపై మరిన్ని చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈ పరిణామం యావత్ దేశ వ్యాప్తంగా అఖిల భారత సర్వీసు అధికారుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికలకు ముందు తనను అరెస్ట్ చేయడాన్ని మనసులో పెట్టుకున్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారులపై.. అదీ ఏకంగా డీజీ స్థాయి, ఐజీ, డీఐజీ స్థాయి అధికారులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. వ్యక్తిగత కక్షతోనే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు కుట్ర పూరితంగా కక్ష సాధింపునకు పాల్పడుతోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులతో వేధిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. కీలక ఉన్నతాధికారులే లక్ష్యంగా కుట్రలకు పదును పెడుతోంది. కాదంబరితో క్విడ్ ప్రో కో కుట్రవలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడటమే వ్యాపకంగా మార్చుకున్న కాదంబరి జత్వానీతో కూడా చంద్రబాబు ప్రభుత్వం క్విడ్ ప్రో కో కుట్రకు తెరతీసింది. ఫోర్జరీ పత్రాలతో భూములు కొల్లగొట్టేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయిన ఆమెతో టీడీపీ ప్రభుత్వం అవగాహనకు రావడం విడ్డూరంగా ఉంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో నిందితురాలికి వత్తాసు పలుకుతూ ఐపీఎస్ అధికారులను వేధిస్తుండటం పట్ల అఖిల భారత సర్వీసు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నేర చరిత్ర ఉన్న కాదంబరి జత్వానీతో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి.. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్ గున్నీలను ఇప్పటికే ఏకపక్షంగా సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. వారిపై మరిన్ని వేధింపులకు పాల్పడేందుకు సన్నద్ధమవుతుండటం పట్ల ఆగ్రహం వ్యక్యం చేస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ విజయవాడలో ప్రత్యక్షం కావడం వెనుక పక్కా కుట్ర దాగి ఉందని అధికార వర్గాలే వెల్లడిస్తున్నాయి. గతంలో ఆమెపై నమోదు చేసిన ఫోర్జరీ కేసును నీరుగారుస్తామని చెబుతూ.. అందుకు ప్రతిగా ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయమని ఆమెకు షరతు విధించినట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ కథ, స్క్రీన్ ప్లే ప్రకారం కాదంబరి జత్వానీ నెల రోజులుగా విజయవాడలో హైడ్రామా సృష్టిస్తున్నారు. జత్వానీపై ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. వలపు వలతో బడా బాబులను బ్లాక్ మెయిలింగ్ చేయడం ఆమె వ్యాపకంగా చేసుకున్నారని పలు ఫిర్యాదులు, విమర్శలు ఉన్నాయి.నిందితురాలితో ప్రభుత్వం కుమ్మక్కుపారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు చెందిన ఐదు ఎకరాలను ఫోర్జరీ పత్రాలతో మరొకరికి విక్రయించేందుకు కూడా కాదంబరి జత్వానీ బరి తెగించారు. వెంటనే అప్రమత్తమైన విద్యాసాగర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయస్థానం అనుమతితో నిబంధనలను పాటిస్తూ ముంబయిలో ఆమెను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు. ఫోర్జరీ అభియోగాలకు సంబంధించి పోలీసులు సమర్పించిన ఆధారాలతో న్యాయస్థానం సంతృప్తి చెంది ఆమెకు రిమాండ్ విధించింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంత మాత్రాన జత్వానీ గతంలో పాల్పడిన తీవ్రమైన, జుగుప్సాకరమైన నేరాలు ఒక్క దెబ్బతో మాయమైపోయినట్టు కాదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తన ఫోర్జరీ బాగోతాన్ని ఆధారాలతోసహా వెలికి తీసినందుకే ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఆమె కక్ష గట్టారు. కాగా ఆ పోలీసు అధికారులను అక్రమ కేసులతో వేధించాలని అప్పటికే నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం కాదంబరి జత్వానీని తమ కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ప్రభుత్వ పెద్దలు ఆమెతో ఇటీవల ఇప్పించిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఇంకొందరు పోలీసు అధికారుల పేర్లను కూడా చేర్చేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, అధికారులను అవమానిస్తూ వేధిస్తున్న తీరు అఖిల భారత సర్వీసు అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. ఇదే ప్రభుత్వ విధానంగా మారితే.. రాష్ట్రంలో ఏ అఖిల భారత స్థాయి అధికారి కూడా నిబద్ధతతో పని చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఏదైనా నేరానికి పాల్పడిన వారిపై విచారణ నిర్వహించి పక్కా ఆధారాలతో చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పెద్దలు అభినందించాలి. కానీ నిందితులతో కుమ్మక్కై అధికారులనే వేధిస్తుంటే రాష్ట్రంలో పని చేసేందుకు ఏ అఖిత భారత సర్వీసు అధికారి కూడా ఇష్టపడరని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం మనో ధైర్యం దెబ్బతింటే అంతిమంగా ప్రజలే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరో టార్గెట్ రామకృష్ణే .. చంద్రబాబు, ఈనాడు రామోజీరావు కుటుంబం క్విడ్ ప్రో కోకుట్ర మరోసారి అధికారికంగా బట్టబయలవుతోంది. అందులో భాగంగానే స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ పూర్వపు ఐజీ రామకృష్ణకు టీడీపీ కూటమి ప్రభుత్వం గురి పెట్టింది. ఎందుకంటే.. రామోజీరావు కుటుంబం దశాబ్దాలుగా మార్గదర్శి చిట్ ఫండ్స్ ద్వారా యథేచ్చగా పాల్పడిన ఆర్థిక అక్రమాలను ఆధారాలతో సహా ఆయన నిగ్గు తేల్చారు. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ.. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నించారు. ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ రామోజీరావు కుటుంబం మార్గదర్శి చిట్స్ చందాదారుల సొమ్మును అక్రమ మార్గాల ద్వారా మళ్లించి తమ కుటుంబ వ్యాపార సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో అక్రమ పెట్టుబడులుగా పెట్టినట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ గుర్తించింది. ఘోస్ట్ చందాదారుల పేరుతో అక్రమాలు, రశీదుల ముసుగులో అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర ఆర్థిక నేరాలను వెలుగులోకి తెచ్చింది. దాంతో రెండేళ్లపాటు మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో కొత్త చిట్టీ గ్రూపులు నిలిచి పోవడంతో రామోజీ కుటుంబ ఆర్థిక అక్రమాల పునాదులు కదిలాయి. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అక్రమాలకు పక్కా ఆధారాలు లభించడంతో గత ఏడాది రామోజీరావు (ప్రస్తుతం చనిపోయారు), ఆయన కోడలు శైలజ కిరణ్‌ను హైదరాబాద్‌లో విచారించారు. ఇది ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న చంద్రబాబుకు ఏమాత్రం రుచించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రామకృష్ణను వ్యక్తిగత లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనకు పోస్టింగు ఇవ్వనే లేదు. మరోవైపు ఐఆర్ఎస్ అధికారిగా ఆయన డెప్యుటేషన్ పూర్తి కావడంతో కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా సరే.. డీమ్డ్ టు బీ రిలీవ్డ్‌గా పరిగణించి ఆయనకు కేంద్ర ప్రభుత్వం పోస్టింగు ఇచ్చేందుకు సిద్ధమైంది. నిబంధనల మేరకు సాగుతున్న పరిణామాలపై రామోజీరావు కుటుంబం భగ్గుమంది. రామకృష్ణను లక్ష్యంగా చేసుకుని ఈనాడు పత్రికలో రెండు రోజులుగా ప్రత్యేక కథనాలు ప్రచురించారు. రాజగురువు కుటుంబానికి ఆగ్రహం కలిగిందని బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం.. నిబంధనలను అతిక్రమించేందుకు కూడా వెనుకాడటం లేదు. రామోజీ కుటుంబాన్ని సంతృప్తి పరిచేందుకు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలాయాన్ని ఆదేశించినట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి అయిన ఆయనపై ఏకపక్షంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయ వర్గాలు తర్జన భర్జన పడుతున్నాయి. కానీ రామోజీ కుటుంబం కళ్లల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యం.. అన్నట్లు రామకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందేనని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసినట్టు సమాచారం. దాంతో రామకృష్ణపై ప్రభుత్వం ఒకట్రెండ్రోజుల్లో కక్ష సాధింపు చర్యలు చేపట్టే అవకాశాలున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. -
కాదంబరి కోరాలే గానీ..
సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం : వలపువల విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఏకంగా విశిష్ట అతిథిగా మారిపోయారు. ఫోర్జరీ పత్రాలతో భూములు విక్రయించే మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలైన ఆమెను రాష్ట్ర ప్రభుత్వ మర్యాదలు లభిస్తుండటం విస్మయపరుస్తోంది. తాను చెప్పింది చేయాలంటూ ఏకంగా పోలీసు శాఖనే బ్లాక్మెయిల్ చేసే స్థాయిలో ఆమె చెలరేగిపోతుండటం.. విజయవాడ పోలీసులు ఆమె డిమాండ్లకు జీహుజూర్ అంటుండటం వెనుక ప్రభుత్వ పెద్దల వత్తాసు ఉందన్నది స్పష్టమవుతోంది. విజయవాడ పోలీసులు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాన్ని అనధికారికంగా కేటాయించడం, ఆమెకు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయడం విస్మయపరుస్తోంది. కొన్ని రోజులుగా విజయవాడలోనే ఉంటున్న ఆమెకు విజయవాడ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అతిథి స్థాయిలో ప్రొటోకాల్ మర్యాదలు అందిస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి విజయవాడలోని స్టార్ హోటల్ వరకు ఆమెకు పోలీసులు ఎస్కార్ట్‌గా ఉంటున్నారు. పోలీసులనే బ్లాక్ మెయిల్ కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఆమెను ఓ సాధనంగా మలచుకున్నారు. తాము చెప్పినట్టుగా కొందరికి వ్యతిరేకంగా ఫిర్యాదులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఆమెకు చెప్పినట్టు సమాచారం. ఏకంగా పోలీసు అధికారులనే బ్లాక్ మెయిల్ చేసే స్థాయిలో ఆమె వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనను వేధించారంటూ విజయవాడలో గతంలో పనిచేసిన ముగ్గురు పోలీసు అధికారులతో పాటు పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌పై కేసు నమోదు చేయాలని ఆమె పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేయడంపై పోలీసు అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి.. వెంటనే కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. కేసు నమోదు చేసేవరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే కేసు నమోదు చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు వ్యవహరిస్తున్నారని సమాచారం. అసలు జత్వానీకి ఏ హోదాతో అంతటి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది పోలీసువర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
జత్వానీ కేసులో సర్కారు జిత్తులు!
సాక్షి, అమరావతి : అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నేతలను వేధించాలన్న రాజకీయ కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బరితెగిస్తోంది. ఏకంగా న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశాల్లో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. వలపు వల (హనీట్రాప్)తో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలను బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేలా విజయవాడ పోలీసులు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు ఇటువంటి దుందుడుకు చర్యలకు దిగుతున్నారు.కీలక సాక్ష్యాలు సేకరించిన ఆనాటి పోలీసులుహనీట్రాప్తో కాదంబరి జత్వానీ మోసాలపై 2019 ఫిబ్రవరిలో ఫిర్యాదు వచ్చింది. ఆమె తనను వేధిస్తోందని, జగ్గయ్యపేట వద్ద ఉన్న తన 5 ఎకరాలను ఫోర్జరీ పత్రాలు సృష్టించి మరీ విక్రయించేందుకు యత్నిస్తోందని కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త ఆధారాలతోసహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై బాధ్యతాయుతంగా స్పందించిన విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయస్థానం అనుమతితో ముంబై వెళ్లి అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అరెస్ట్ చేశారు.ఆమెను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను ముంబైలోని న్యాయస్థానంలో హాజరుపరచి ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడకు తీసుకువచ్చి ఇక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో విజయవాడలోని సబ్ జైలుకు తరలించారు.ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షల నిమిత్తం న్యాయస్థానం అనుమతితో ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉంది. కీలక ఆధారాలైన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఫోరెన్సిక్ లేబొరేటరీలోనే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వం రాగానే..రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసును నీరుగార్చే కుట్రకు తెరలేచింది. అంతేకాదు.. ఆనాటి ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపునకు ఈ కేసును వక్రీకరిస్తూ టీడీపీ ప్రభుత్వం కుతంత్రానికి తెరతీసింది. టీడీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారుల కనుసన్నల్లో ఈ కుట్రను అమలు చేశారు. కాదంబరి జత్వానీతో ఆనాటి ఐపీఎస్ అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. అనంతరం ఆమె విజయవాడ వచ్చి గతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న తన ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అప్పగించాలని కోరారు. ఆమె కోరిందే తడవుగా ప్రస్తుత విజయవాడ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారు. ఫోరెన్సిక్ లేబొరేటరీలో ఉన్న ఆమె ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విజయవాడ తెచ్చేశారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసులో కీలక ఆధారాలు తీసుకువచ్చేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలన్న ఆలోచన కూడా పోలీసులు చేయలేదు.దీనిపై కిందిస్థాయి పోలీసు అధికారి ఒకరు అభ్యంతరం తెలపడంతో వాటిని ప్రస్తుతానికి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఉంచారు. కొద్ది రోజుల్లోనే వాటిని జత్వానీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో కీలక ఆధారాలు ధ్వంసం కాకుండా పోలీసులను కట్టడి చేయాలని ఫిర్యాదుదారు కుక్కల విద్యాసాగర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కీలక ఆధారాలు ధ్వంసం చేసే కుట్రే!కాదంబరి జత్వానీ కుట్ర, మోసానికి సంబంధించిన కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకే విజయవాడ పోలీసులు ఆమె ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం కేసులో కీలక ఆధారాలను నిందితులకు, మరెవ్వరికీ కూడా అప్పగించకూడదు. కేసు ముగిసేవరకు వాటిని ఫోరెన్సిక్ లేబొరేటరీ లేదా పోలీసులు లేదా న్యాయస్థానం ఆధీనంలోనే ఉంచాలి. కానీ జత్వానీ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆమెకు అప్పగించేందుకు నిర్ణయించడం గమనార్హం. -
మాయలేడి కాదంబరిపై హనీట్రాప్ ఆరోపణలు
-
‘ఆ ఫొటోలు మార్ఫ్ చేసినవే..కావాలంటే ఫోరెన్సిక్ పరీక్ష చేయండి’
సాక్షి,హైదరాబాద్ : ఆమెకు ప్రముఖులు, పారిశ్రామక వేత్తలు, బ్యూరోక్రాట్లే టార్గెట్. ఆయనికి అచ్చంగా వాళ్లే టార్గెట్. ఇద్దరికి పెద్ద తేడాం ఏం లేదు. ఆమె పేరు కాదంబరి జత్వానీ. ఆయన పేరు నారా చంద్రబాబు నాయుడు. పచ్చమీడియా గత నాలుగైదు రోజులుగా వండుతున్న పరమాన్నం మీరు చూసే ఉంటారు. అది ఈ రోజు దాకా చల్లారలేదు. ఇప్పట్లో చల్లారే అవకాశమే లేదు. అసలు ఎవరికోసం ఈ పరమాన్నం వండుతున్నారా? అని ఆరా తీస్తే. విస్తు గొలిపే విషయాలు బయటపడ్డాయి.కాదంబరి జత్వానీ అలియాస్ కిలాడీ కాదంబరి జత్వానీ. చోటా నటి. బడా బ్లాక్‌మెయిలర్. అందమే ఆమె పెట్టుబడి. సినిమాల్లో నటన పార్ట్‌టైం. హనీట్రాప్ బిజినెస్ ఆమె ఫుల్ టైం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేమ పేరుతో వలపుల వల విసిరి ఆ తర్వాత వసూళ్లకు పాల్పడే ఖతర్నాక్ కిలాడీ లేడి. ఇంకా చెప్పాలంటే దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు. వ్యభిచార ముఠాలతో మిలాఖత్లు.. ఆమె డెయిలీ డ్యూటీలో భాగాలు. సంతకాలు ఫోర్జరీ చేయడం. భోగస్ పత్రాలు సృష్టించడం, భారీగా ఆస్తులు పోగేయడం ఆమె అసలు ప్రొఫెషన్. ఈ మాయలేడిని దందాను ఆసరగా చేసుకుని చంద్రబాబు సరికొత్త దందా తెరతీశారు. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికిన కాడుకి దండుకోవాలనుకునే వ్యూహం పన్నారు.నిజం చెప్పాలంటే ఢిల్లీ, బెంగళూరుతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పారిశ్రామిక వేత్తలు, రాజకీయవేత్తలు, బ్యూరోక్రాట్లను బ్లాక్ మెయిల్ చేసి, కోట్లను కొల్లగొట్టింది ఈ కాదంబరి జత్వానీ.ఏషియన్ పెయింట్ ప్రమోటర్ మాలవ్ దాని కూడా ఆమె బాధితుల జాబితాలో ఒకరు. అయన ఫిర్యాదుతో ముంబై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అచ్చం అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కుక్కల విద్యాసాగర్‌కు వలపుల వల విసిరింది. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. ఎందరో ప్రముఖుల జీవితాలతో ఆడుకున్న మహానటిని చంద్రబాబు ఏపీకి తెచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పుచుకునేందుకు బాబు మనల్ని హనీట్రాప్‌లోకి లాగుతున్నారు. తానిచ్చిన హామీల మేరకు ఒక్క మహిళకు న్యాయం చేయని చంద్రబాబు అర్జెంటుగా కాదందరికి న్యాయం చేసేస్తారంట. ఆమెను అడ్డుపెట్టుకుని పారిశశ్రామిక వేత్తలను బ్యూరోక్రాట్లను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా నాడు ఓ సినీనటి నేడు ఈ మహానటి. చంద్రబాబు రాజకీయ జీవితం వీళ్లతోనే ముడిపడి ఉంది. ప్రజలపై చంద్రబాబు హనీట్రాప్ విసిరిన వేళ కాదంబరి జత్వానీ అలియాస్ కిలాడీ కాదంబరి జత్వానీకి తాను కూడా ఓ బాధితుడినేంటూ కుక్కల విద్యాసాగర్ ముందుకు వచ్చారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, కేవలం తనకు న్యాయం కావాలని కోరుతూ మీడియా ముందుకు వచ్చినట్లు చెబుతున్న విద్యాసాగర్‌తో సాక్షి ప్రతినిధి ఇంటర్వ్యూ. సాక్షి ఇంటర్వ్యూలో కాదంబరి జత్వానీ.. కుక్కల విద్యాసాగర్‌ని ఎలా మోసం చేసిందో తెలుసుకుందాం.సాక్షి: కాదంబరి జత్వానీ మీకు ఎక్కడ? ఎప్పుడు? ఎలా? పరిచయం అయ్యిందికుక్కల విద్యాసాగర్ : 2009లో నేను వ్యాపార వేత్తను.నేను చేస్తున్న వ్యాపారం బాగా జరిగేది. ఆ సమయంలో నాకు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన కాదంబరి ట్రాప్‌లో చిక్కుకున్నాను. ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యింది. అప్పటి నుంచి నాతో పరిచయం పెంచుకోవడం. అవసరానికి డబ్బులు అడిగేది.సాక్షి : మీరు ట్రాప్‌లో పడ్డాను అని అంటున్నారు? ఆమె ట్రాప్‌లో పడ్డాను అన్న విషయం మీకు ఎప్పుడు? ఎలా తెలిసింది? విద్యాసాగర్ : కొన్నేళ్ల తర్వాత తెలిసింది. నా వ్యాపారం నిమిత్తం ముంబైలో సెటిల్ అయ్యాను. 2014 నుంచి కాదంబరి,ఆమె తల్లి నాకు సమయం, సందర్భం లేకుండా డబ్బులు కావాలని బెదిరించే వారు. అన్ని లక్షలు కావాలి. ఇన్ని లక్షలు కావాలి అని ఓ పది, పదేహేను నెంబర్ల నుంచి ఫోన్ చేసేవారు. స్పందించపోతే.. నేను నీ గురించి అందరికి చెబుతాను అని బ్లాక్ మెయిల్ చేసేది. చెప్పుకోలేని విధంగా చిత్రహింసలకు గురి చేసేది.సాక్షి: బ్లాక్ మెయిల్ అంటే? ఏ విధమైన బ్లాక్మెయిల్. మీకు సంబంధించిన విషయాలు ఆమె దగ్గర ఏమున్నాయి? ఆమెకు భయపడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది?విద్యాసాగర్: వ్యక్తిగత విషయాలు ఏమీలేవు. మీకు చెప్పాను కదా హైదరాబాద్‌లో బిజినెస్ చేసే సమయంలో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన కాదాంబరిని అప్పుడప్పుడు కలిసే వాడిని. అలా కలిసినప్పుడు నాతో సెల్ఫీలు దిగింది. ఆ సెల్ఫీలను మార్ఫ్ చేసింది. ఆ ఫొటోల్ని నా తల్లిదండ్రులకు చూపిస్తా అని బెదిరించేది. లక్షలు కావాలి. కోట్లు కావాలి అని అడిగేది. సడెన్‌గా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేది. సమయం, సందర్భం లేకుండా నా ఇంటి దగ్గర కారు అపేది. అక్కడికి వచ్చి నాకు డబ్బులు కావాలనే ఫోన్ చేసి విసిగించేది.సాక్షి: అంటే ఆమెతో ఫొటోలు దిగడం మీకు చుట్టుకుంది’అని కోవాలా?విద్యాసాగర్ : అవునుసాక్షి : ఫొటోలు మార్ఫింగ్ అంటున్నారు. రెండు మూడు రోజుల నుంచి ఎల్లో మీడియాలో కొన్ని అర్ధనగ్న ఫోటోలు ప్రసారం అవుతున్నాయి. ఆమె కూడా చూపించింది. ఆ ఫొటోలు మీవేనా?అలాంటి ఫొటోలు మీవి ఆమె దగ్గర ఉన్నాయా?విద్యాసాగర్ : లేవు.అవన్ని మార్ఫ్ చేసినవే. అలా ఫొటోల్ని మార్ఫ్ చేయడం ఆమెకు అలవాటు. అలవాటు ప్రకారం నా ఫొటొల్ని మార్ఫ్ చేసింది. వాటిని చూపించి బెదిరించేది.సాక్షి : ఆ ఫొటోలు మీవి కావని అంటున్నారు. ఆ ఫొటోలు మీవి కావు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా?విద్యాసాగర్ : ఎస్. ఆ ఫొటోలు నావి కావు. మార్ఫ్ చేసినవే. కావాలంటే ఫోరెన్సిక్ పరీక్ష చేయండి. పైగా నేనెప్పుడూ ఆరోగ్యంగా బొద్దుగా ఉండేవాడి. ఆ ఫొటోల్లో చూపించినట్లుగా నాకు కండలు లేవు. నాకు జిమ్ చేసే అలవాటు లేదు.సాక్షి: మిమ్మల్ని బెదిరింది ఏం కావాలని డిమాండ్ చేసేవారు.విద్యాసాగర్ : డబ్బులు,ఫ్లైట్ టికెట్లు,హోటెల్ బుకింగ్స్,షాపింగ్ కోసం ఎక్కువ శాతం డబ్బులు అడిగేవారు.సాక్షి : మీలాగే బాధితులు చాలా మంది ఉన్నారని మీకు ఇప్పుడే తెలిసిందా? లేదంటే గతంలోనే తెలిసిందా?విద్యాసాగర్ : నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందిసాక్షి : ఈ మధ్యనే తెలిసిందని అంటున్నారు. మీలాగే చాలామందిని ఇబ్బంది పెట్టింది అంటున్నారు. హనీట్రాప్,బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేందుకు మీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా?విద్యాసాగర్ : 10ఏళ్లుగా నేను డాక్టర్ని అని చెబుతున్న జత్వానీ.. ఏ ఒక్క పేషెంట్‌కైనా ట్రీట్మెంట్ ఇచ్చిందో చెప్పమనండి. ఏ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేసేందో అడగండి. దీంతో పాటు అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీ ఇంటర్నల్ మెడిసిన్‌లో నేను డాక్టర్ని అని చెప్పుకుని తిరుగుతుంది.పాస్‌పోర్ట్‌లు, డేటాబర్త్ సర్టిఫెట్లు చెక్ చేయండి. సమాజానికి నేను బాగా చదివాను.డాక్టర్ని అని ఒక హైప్ క్రియేట్ చేసింది. ప్రముఖులతో కూడా ఇలాగే చెప్పుకునేవారు. వాళ్లు కూడా నమ్మేవారు. నేను రెండు సార్లో, మూడు సార్లో ఆమెతో మాట్లాడాను. నాలుగో సారి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది.సాక్షి : మిమ్మల్ని పెళ్లి చేసుకోమని అడిగారా?విద్యాసాగర్ : జత్వానీ, ఆమె తల్లి ఇద్దరు ఫోన్ చేసి అడిగారు. మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని. -
మాయలేడిని అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ బెదిరింపులు!
సాక్షి, అమరావతి : బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే కాదంబరి జత్వానీ అత్యంత వివాదాస్పదురాలు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లు తదితరులను లక్ష్యంగా చేసుకుని ‘వలపు వల (హనీ ట్రాప్)’ వేసి...అనంతరం బ్లాక్ మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు. అందుకోసం సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతూ మరీ భారీగా ఆస్తులను కొల్లగొట్టడం ఆమె చరిత్ర. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయి. అయితే ఈ మాయలేడి బ్లాక్ మెయిలింగ్ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసింది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికినకాడికి దండుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు.. ఇన్నాళ్లూ ప్రత్యర్థి పార్టీ వరకే పరిమితం చేసిన వేధింపులను తాజాగా పారిశ్రామికవేత్తలకూ వర్తింపజేశారు. ఈ పరంపరలో బడా పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌ను తాజాగా ఈ కేసులోకి లాగుతున్నారు. ఇందుకు ఎల్లో మీడియా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఊతమిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్ బెవరేజస్ పరిశ్రమను.. వైఎస్సార్ జిల్లాలో జువారి, దాలి్మయా సిమెంటు పరిశ్రమల యాజమాన్యాన్ని సర్కారు పెద్దలు ముడుపుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను ముడుపుల కోసం వేధిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా సరే టీడీపీ పెద్దలు బరితెగించి మరీ బాడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వ పన్నాగంగా ఉంది. దండుకునే దందా.. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వలపు వల (హానీ ట్రాప్) పేరుతో బ్లాక్ మెయిలింగ్ దందా అది పెద్ద సమస్యగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి.. అనంతరం వారీ నుంచి భారీగా డబ్బులు, ఆస్తులు కొల్లగొట్టడం ఓ మాఫియాస్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి ఓ హనీట్రాప్ కేసును వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు అత్యంత సమర్థంగా సత్వరం పరిష్కరించి శభాష్ అనిపించారు. పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసి.. న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని ముంబయి నుంచి తీసుకువచి్చ... విజయవాడ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. అంతా చట్ట ప్రకారం వ్యవహరించారని అందరూ ప్రశంసించారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వ్యవహారంలో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డ ఘరానా మోసగత్తెకు వత్తాసు పలుకుతోంది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్గా చెప్పుకునే ‘హనీట్రాప్ స్పెషలిస్ట్’ కాదంబరీ జత్వానీని అడ్డంపెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం ఐపీఎస్ అధికారులకు గురిపెట్టింది. రెడ్‌బుక్ రాజ్యాంగం సృష్టిస్తు న్న టెర్రర్లో మరో అంకానికి తెరతీసింది. వలపు వల.. ఆపై బ్లాక్ మెయిలింగ్ వలపు వల, బ్లాక్ మెయిలింగ్, ఫోర్జరీ దందా కోసం కాదంబరీ జత్వానీ పకడ్బందీగా వ్యవహరించేవారు. పోలీసుల విచారణలో ఆమె అక్రమాలలన్నీ పూర్తి ఆధారలతో సహా బట్టబయలయ్యాయి. అవేమిటంటే.. కాదంబరీ జత్వానీకి రెండు పాస్ పోర్టులు, రెండు ఆధార్ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరి వద్ద ఒక్కో పేరుతో పరిచయం చేసుకునేది. ఈ పకడ్బందీ దందాలో కదాంబరీ తమ్ముడు అంబరీశ్ జత్వానీ కూడా ప్రధాన పాత్రధారే. దుబాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తన తమ్ముడికి అండర్ వరల్డ్ మాఫీయాతో సంబంధాలు ఉన్నాయని... ఆ మాఫియా ద్వారా అంతం చేస్తామని కూడా కాదంబరీ తీవ్ర స్థాయిలో బెదిరించే వారు. మాఫియాతో సంబంధాలు ఉండటమే కాదు హవాలా రాకెట్‌ను కూడా అతను నిర్వహించే వాడు. ఈ విధంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరులతోపాటు దేశంలోని పలు నగరాల్లోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి భారీగా ఆస్తులు కొల్లగొట్టారు. ఏసియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవ్ దానీ కూడా ఆమె బాధితుల జాబితాలో ఉన్నారు. ఆయన ఫిర్యా దుతో ముంబయిలోని గమ్‌దేవీ పోలీస్ స్టేషన్లో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే రీతిలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌పై తప్పుడు ఆరోపణలతో బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. అంతా చట్టబద్ధంగానే.. తనకు అలవాటైన రీతిలోనే కాదంబరీ జత్వానీ ఓ రాజకీయ నేత కుక్కల విద్యాసాగర్‌పై వలపు వల విసిరి అనంతరం బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడింది. ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దుబాయిలోని మాఫియాతో అంతం చేయిస్తానని బెదిరించింది. విద్యాసాగర్‌కు చెందిన జగ్గయ్యపేటలో సర్వే నంబరు 396/2ఏ2హెచ్/1తో 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో సొంతం చేసుకుంది. ఆ భూమిని మరొకరికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసాగర్‌కు విషయం తెలిసింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చట్టానికి లోబడి విచారణ నిర్వహించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. మెజిస్ట్రీట్ నుంచి సెర్చ్ వారెంట్ తీసుకుని ముంబయి వెళ్లారు. ముంబయి పోలీçసు ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే కాదంబరీ జత్వానీని అరెస్ట్ చేసి అక్కడి మేజి్రస్టేట్ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమరి్పంచిన ఆధారాలతో సంతృప్తి చెందిన మెజి్రస్టేట్.. ఆమెను ఏపీకి తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేశారు. దాంతో కాదంబరీ జత్వానినీ పోలీసులు విజయవాడ తీసుకువచ్చి అదే రోజు స్థానిక మెజిస్ట్రీట్ ఎదుట హాజరు పరిచారు. మెజిస్ట్రీట్ రిమాండ్ విధించంతో ఆమెను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఆమె కొన్నాళ్లు ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండి, తర్వాత ముంబయికి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సినీ నటి అరెస్టులో అంతా చట్టబద్ధంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆమెకు న్యాయవాదుల సహాయం అందించేందుకు పోలీసులు సంసిద్ధత చూపారు. కానీ ఆమె అందుకు తిర స్కరించి ముంబయి నుంచి తన సొంత న్యాయవాదులను రప్పించుకున్నారు. ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించారు. న్యాయస్థానాల అనుమతితో, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ పూర్తి చేశారు. దేశంలోనే ఎందరో బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడూ మోసం చేస్తున్న కాదంబరీ నేరాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను అభినందించాల్సింది పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం.. పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలతో వేధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సర్కారే లీకులిచ్చి.. భారత రాజ్యాంగాన్ని గౌరవించం అని, తాము అమలు చేసేది లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగమేనని టీడీపీ కూటమి ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలను వేధించడమే ధ్యేయంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే కాదంబరీ జత్వానీ కేసును నేపథ్యంగా తీసుకుని పోలీసు అధికారులకు గురి పెట్టింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించి అవాస్తవాలు, అభూతకల్పనలను టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచి్చంది. తద్వారా ఆ పోలీసు అధికారులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తోంది. టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలతో కథనాలు... పచ్చ టీవీ చానళ్లలో రోజంతా చర్చలతో రాద్ధాంతం చేస్తోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి.. కాదంబరీ జత్వానీ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలపై విచారించాలని విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ను గురువారం విచారణాధికారిగా నియమించింది. -
వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
కోల్‌కతా: బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయనపై వలపు వల(హనీ ట్రాప్) విసిరి కోల్‌కతాకు రప్పించి, దారుణంగా హత్య చేసి, చర్మం వలిచి ముక్కలు ముక్కలుగా నరికినట్లు తేలింది. వలపు వల విసిరిన యువతిని బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను శిలాంతి రెహమాన్‌గా గుర్తించారు. బంగ్లాదేశ్ జాతీయురాలైన శిలాంతి ప్రధాన నిందితుడు, అమెరికా పౌరుడైన అఖ్తరుజమాన్ షహీన్‌కు ప్రియురాలు అని బంగ్లాదేశ్ పోలీసులు తెలిపారు. కోల్‌కతాలోని న్యూటౌన్ ప్రాంతంలో అక్తరుజమాన్ అద్దె ఇంట్లో ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో శిలాంతి రెహమాన్ కోల్తాలోనే ఉన్నట్లు వెల్లడయ్యింది. మరో నిందితుడు అమానుల్లా అమన్‌తో కలిసి ఈ నెల 15న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లిపోయింది. తన మిత్రుడు అన్వరుల్ అజీమ్ అనర్‌ను బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు రప్పించడానికి ప్రధాన నిందితుడు అఖ్తరుజమాన్ తన ప్రియురాలు శిలాంతిని ప్రయోగించినట్లు పోలీసులు తేల్చారు. అన్వరుల్ అజీమ్ అనర్, అఖ్తరుజమాన్ మధ్య ఆర్థికరమైన వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. అక్రమంగా దేశంలోకి చొరబడి హత్యాకాండ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్‌ను చంపడానికి నిందితులు పక్కా పథకం వేశారు. జంతువులను వధించడంలో అనుభవం ఉన్న మాంసం వ్యాపారి జిహాద్ హవల్దార్‌ను బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రప్పించారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. కొంతకాలం ముంబైలో తలదాచుకున్నాడు. పథకం ప్రకారం హత్యకు రెండు నెలల ముందు కోల్‌కతాకు చేరుకున్నాడు. అఖ్తరుజమాన్ అద్దె ఇంట్లో అన్వరుల్ అజీమ్‌ను ఇతర నిందితులతో కలిసి హత్య చేశాడు. -
Hyderabad: తవ్వినకొద్దీ తల్లీకూతుళ్ల లీలలు
బంజారాహిల్స్: రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్టా రాము హత్య కేసులో నిందితులైన తల్లీకూతుళ్లు హిమాంబీ, నసీమా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తల్లీ కూతుళ్ల అరాచకాలకు చాలామంది బలికాగా, ప్రస్తుతం వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిందితురాలు హిమాంబీ ఆ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి యజమానిపై తప్పుడు కేసులు బనాయించింది. ఇటువైపు తొంగిచూస్తే తమపై అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బెదిరిస్తుండడంతో ఇంటి యజమాని అటువైపు తొంగి చూడడం లేదు. ఇదే అదనుగా హిమాంబీ, ఆమె కూతురు నసీమా ఇద్దరూ ఈ ఇంటిని వ్యభిచార కూపంగా మార్చారు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో ఇటీవల రియల్టర్ పుట్టా రామును 11 మంది కత్తులతో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నసీమా హనీట్రాప్ చేసి రామును ఇంటికి పిలిపించి ఈ విషయాన్ని ప్రధాన నిందితుడు మణికంఠకు మెసేజ్ చేసి హత్య కుట్ర కారణమై జైలు పాలైంది. హిమాంబీపై ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మేడిపల్లి తదితర పోలీస్స్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. బెయిల్‌పై వస్తూ.. 2017 జూన్‌లో హిమాంబీ.. ఓ యువతితో వ్యభిచారం చేయిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు పట్టుబడింది. 2018లో మరో అమ్మాయితోనూ వ్యభిచారం చేయిస్తూ అరెస్టయ్యింది. 2020లో జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరిలో వ్యభిచార గృహంపై దాడి చేయగా పోలీసులకు మరోసారి పట్టుబడింది. 2017లో విష్ణుకాంత్ అనే వ్యక్తి నుంచి బ్లాక్మెయిల్ చేసి రూ.3 లక్షలు వసూలు చేసింది. 2019లో తన కూతురు నసీమాను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు కేసు పెట్టింది. పోలీసులకు పట్టుబడిన ప్రతిసారీ బెయిల్‌పై వస్తూ.. కూతురు నసీమాను ఎరగా వేసి ఏడేళ్లుగా హిమాంబీ స్థానికంగా అరాచకాలకు, బ్లాక్మెయిల్ వ్యవహారాలకు, కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. కానిస్టేబుల్‌పైనే కేసులు పెట్టించి.. ఓ కానిస్టేబుల్‌కు చెందిన ఈ ఇంటిని అద్దెకు తీసుకుని అతడిపైనా తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసింది. ఇంటిని ఖాళీ చేయించాలంటూ కోర్టు ఆర్డర్ ఉన్నా హిమాంబీ పట్టించుకోకుండా పోలీసుల పైనే తిరగబడింది. మహిళ కావడంతో పోలీసులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ తమకెందుకులే అని పెద్దగా పట్టించుకోకపోవడంతో హిమాంబీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి కబ్జా చేసిన ఇంట్లోనే దర్జాగా వ్యభిచార గృహాన్ని నిర్వహించింది. పుట్టా రాము హత్యతో తల్లీకూతుళ్ల గుట్టు రట్టయ్యింది. -
ఇదేం దోపిడీ.. బాబోయ్..
మైసూరు: వలపు వల విసిరి ట్రాప్‌లోకి లాగే కేటుగాళ్లు ఇప్పుడు ఏకంగా బలవంతంగా ఎత్తుకొచ్చి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు, కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ ఫిర్యాదు మేరకు ఒక మహిళతో పాటు ముగ్గురిని మైసూరు నగర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...కేరళలోని తిరునెల్లికి చెందిన వ్యాపారవేత్త సున్నీ మార్చిలో చైన్నె నుంచి కారులో వస్తున్న సమయంలో మైసూరు మానంద వాడి రోడ్డులో దుండగులు అడ్డుకుని బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం ఒక ఇంటిలోకి తీసుకెళ్లి ఆయనను బెదిరించి ఓ మహిళ పక్కన నగ్నంగా పడుకోబెట్టి, ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారు చైన్, ఉంగరం తీసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఫొటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బెదిరించి ఉడాయించారు. దీంతో ఆయన రూ. 5 లక్షలు వారికి ఇచ్చాడు. మళ్లీ బెదిరింపులు రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిఘా ఉంచి నిందితులు ఫజలుల్లా రెహామన్, రిజ్వాన్, మోనాలను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. -
హనీట్రాప్‌లో మాజీ జవాన్
కర్ణాటక: గుర్తుతెలియని మహిళ హనీ ట్రాప్‌లో పడిన విశ్రాంత సైనికుడు డెత్‌నోట్ రాసి అదృశ్యమైన ఘటన కొడగు జిల్లా మడికెరిలో చోటుచేసుకుంది. అదృశ్యమైన సైనికుడు సందేశ్ (40)గా గుర్తించారు. మంగళవారం ఇంటి దగ్గర ఉన్న చెరువు గట్టున అతని మొబైల్‌ఫోన్, చెప్పులు లభించాయి. దీంతో అతను చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి. చెరువులో ఫైర్ సిబ్బంది, మడికెరి పోలీసులు గాలిస్తున్నారు. సందేశ్‌కు కొంతకాలం కిందట ఫేస్బుక్లో వివాహిత మహిళ పరిచయం చేసుకుంది. ఇద్దరూ ప్రైవేటు ఫోటోలను పంపుకున్నారు. షికార్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆపై ఆమె పదే పదే డబ్బు ఇవ్వాలని, లేకపోతే గుట్టు రట్టు చేస్తానని సందేశ్‌పై వేధింపులకు పాల్పడింది. ఆమె పోరు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సందేశ్ డెత్‌నోట్ రాశాడు. న్యాయం చేయాలని సందేశ్ భార్య భోరున విలపించింది. -
హనీట్రాప్ కలకలం.. కపిల్‌పై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో హనీట్రాప్ కేసులో చిక్కుకున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ త్రివిక్రమ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మంగళవారం సీపీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు చెందిన హనీట్రాప్ కేసులో కపిల్‌పై కేసు నమోదు చేశాం. కపిల్ వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని సైబర్ ఫోరెన్సిక్‌కు పంపించాము. కానిస్టేబుల్ కపిల్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ప్రశ్నిస్తున్నాయి. గుజరాత్‌కు చెందిన కపిల్ కుమార్ విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీలో కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. తొలుత హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహంచి 2022 ఆగస్టు నెలలో విశాఖకు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం అతడు సీఐఎస్ఎఫ్ ఫైర్ విభాగంలో పనిచేస్తునే పేస్బుక్ ద్వారా పరిచయమైన తమీషాతో మాట్లాడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తమీషా ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన ముఖ్య నాయకుడి వద్ద వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేస్తున్నట్లు గుర్తించడంతో కపిల్‌పై నిఘా పెట్టారు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై అంతరంగిక భద్రత చట్టం కింద కేసులు పెట్టామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడిలో చూపు కోల్పోయిన పోలీస్.. సీఎం జగన్ సాయం -
హానీట్రాప్‌లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కీలక సమాచారం పాక్ చేతిలోకి?
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ ఎప్పటిలానే తన కపట బుద్దిని ప్రదర్శిస్తోంది. భారత అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు ఉద్యోగులపై హానీ ట్రాప్ వల విసురుతోంది. తాజాగా పాక్ హానీ ట్రాప్‌లో ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చిక్కుకున్నాడు. అనుమానం రావడంతో అతనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ పని చేస్తున్నాడు. అంతకు ముందు రక్షణ రంగంలో కీలకమైన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో విధులు నిర్వహించేవాడు. దీంతో అతని నుంచి కీలక సమాచారం తెలుసుకునే క్రమంలో పాకిస్తాన్ అతనిపై హనీట్రాప్ ప్లాన్‌ని ప్రయోగించింది. ఓ ఉగ్రవాద సంస్థకి చెందిన పెద్ద నాయకుడి పీ.ఏకి తమిషా అనే పాకిస్తాన్ యువతితో పరిచయం ఉంది. ఆ యువతితో సోషల్ మీడియా ద్వారా కపిల్‌తో పరిచయం పెంచుకుంది. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది. న్యూడ్ వీడియో కాల్స్‌తో మొదలై.. రహస్యంగా ఓ గదిలో కలిసేంత వరకు వీరి కథ నడిచింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా కపిల్ కుమార్ ఏడాది క్రితం హైదరాబాద్ నుంచి బదిలీ అయ్యి విశాఖలో పని చేస్తున్నాడు. కీలక సమాచారం పాకిస్థాన్ గూఢచార సంస్థకు చేరినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కపిల్ కుమార్ మొబైల్స్ స్వాధీనం చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపింది. తదుపరి విచారణ కోరుతూ స్టీల్ ప్లాంట్ పోలీసు స్టేషన్లో సీఐఎస్ఎఫ్ యూనిట్ ఇన్ఛార్జ్ ఫిర్యాదు చేశారు. అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ అంశం అంతరంగిక భద్రతకు సంబంధించిన వ్యవహారం కావడంతో వివిధ ఏజెన్సీలు దర్యాప్తులోకి దిగాయి. చదవండి వచ్చినవాడు గద్దర్.. ఆ హెడింగ్ చూసి ఆశ్చర్యపోయాం! -
బెంగళూరు హనీట్రాప్.. అమ్మాయి పిలిచిందని ఆ ఇంటికి వెళ్తే..
బనశంకరి: సోషల్ మీడియా టెలిగ్రాం ద్వారా యువకులను పరిచయం చేసుకుని వారితో స్నేహంగా ఉంటూ యువతులతో హానీట్రాప్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను మంగళవారం పుట్టేనహళ్లి పోలీసులు అరెస్ట్‌చేశారు. శరణ ప్రకాష్బళిగేర, అబ్దుల్ ఖాదర్, యాసిన్ పట్టుబడిన నిందితులు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు యువతితో పాటు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ బృందంలోని యువతి, యువకులను పరిచయం చేసుకుని జేపీ.నగర ఐదోస్టేజ్ వినాయకనగర ఇంట్లోకి పిలిపించుకునేది. యువకులు ఇంట్లోకి రాగానే ప్లాన్ ప్రకారం హనీట్రాప్ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి యువకుల మొబైల్ లాక్కుని యువతితో ఏం పని అని మాట్లాడుతూనే మొబైల్లో ఫొటో, వీడియో తీసి డబ్బు ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులకు ఫొటో పంపించి పరువుతీస్తామని బెదిరించి రూ.50 వేలు లాక్కున్నారు. ఈ ఘటనపై బాధితుడు పుట్టేనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. -
వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల: పక్కా ప్లాన్‌తో ఇంటికి పిలిచి..
కేరళలోని పాతనమిట్ట ప్రాంతానికి చెందిన నిత్యా శశి (32) మలయాళ టీవీ సీరియల్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈజీ మనీ కోసం తన స్నేహితుడు బినుతో కలిసి అడ్డదారులు తొక్కింది. తిరువనంతపురంలో ఉండే ఆర్మీ రిటైర్ ఉద్యోగి అయిన 75 ఏళ్ల పెద్దాయనకు తన స్నేహితుడితో కలిసి నిత్య వలేసింది. ఇల్లు అద్దెకు కావాలనే వంకతో ఆ సీనియర్ సిటిజన్‌తో నిత్య పరిచయం పెంచుకుని ట్రాప్ చేసి డబ్బులు గుంజే ప్లాన్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. (ఇదీ చదవండి: నయనతార ఇంతే.. ఆమెను ఏం చేయలేం: విశాల్) కేరళకు చెందిన సీరియల్ నటి, న్యాయవాది అయిన నిత్య అద్దెకు ఉండేందుకు ఇంటిని వెతుకుతుండగా వృద్ధుడిని సంప్రదించింది. అక్కడ ఏర్పడిన పరిచయంతో నిరంతర ఫోన్ కాల్స్ ద్వారా వృద్ధుడితో నిత్య స్నేహం పెంచుకుంది. అలా వారిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగింది. దీంతో ఒకరోజు కలకోటేలోని తన అద్దె ఇంటికి రావాలని ఆ వృద్ధుడిని నటి నిత్య పిలిచింది. నిత్య ఆహ్వానాన్ని మన్నించి వృద్ధుడు కూడా ఆమె ఇంటికి వెళ్లాడు. నిత్య ఇంట్లో ఏం జరిగిందో పోలీసులకు ఆ వృద్ధుడు ఇలా చెప్పాడు. 'నేను.. నిత్య ఇంటికి వెళ్లగానే నన్ను మాటల్లో ఉంచి ఆమె నా దుస్తులు తొలగించింది. ఆపై ఆమె కూడా దుస్తులు తొలగించుకుంది. ఇంతలో నిత్య స్నేహితుడు బిను వచ్చి నా ఫోటోలతో పాటు.. కొన్ని ఇద్దరం ఉన్న ఫోటోలను కూడా తీశాడు. ఆపై అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని వారిద్దరు బెదిరింపులకు దిగారు. దీంతో ఇప్పటికే వారికి రూ.11 లక్షలు ఇచ్చాను. కానీ వారు రూ. 25 లక్షలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని, ఇక ఇవ్వలేనని వారికి తెలిపాను. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారు' అని పోలీసులకు తెలిపాడు. (ఇదీ చదవండి: BRO Movie Twitter Review: పవన్ కల్యాణ్ ‘బ్రో’మూవీకి ఊహించని టాక్!) దీంతో పోలీసుల సూచన మేరకు ఆ వృద్ధుడు రూ.25 లక్షలు డబ్బు ఇస్తానని వారిద్దరికి ఆఫర్ చేశాడు. కానీ డబ్బు కోసం తన ఇంటికి ఆహ్వానించాడు. పక్కా ప్లాన్‌తో పోలీసులు అక్కడే ఉండి నిత్య,బినూను అరెస్ట్ చేశారు. ఆపై వారిద్దిరని కోర్టులో హాజరుపరిచారు. నిత్య ఇప్పటికే పలు ప్రముఖ సీరియల్స్‌తో పాటు అక్కడి ప్రసిద్ధ షోలలో కూడా కనిపించింది. -
ఆ ఎమ్మెల్యే హనీట్రాప్ చేసి.. అందుకోసం స్టూడియోలు కూడా
యశవంతపుర(బెంగళూరు): ఆర్ఆర్ నగర ఎమ్మెల్యే, మాజీ మంత్రి మునిరత్న హనీట్రాప్‌నకు పాల్పడేవారని బీబీఎంపీ మాజీ కార్పొరేటర్ వేలు నాయ్కర్ ఆరోపించారు. ఆదివారం తన మద్దతుదారులతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం విలేకర్లతో మాట్లాడుతూ... మునిరత్న హనీట్రాప్ చేసి బెదిరించడం పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. జేపీ పార్క్, డాలర్స్‌కాలనీలో దీని కోసం స్టూడియో ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. 2023 ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే విషయమై మునిరత్నను అడిగాం. అప్పుడు నీది ఈస్ట్‌మన్ కలర్ పిక్చర్ ఉంది చూపించాలా, లేక నోరు మూసుకొని పని చేస్తారా అని బెదిరించినట్లు వేలు నాయ్కర్ ఆరోపించారు. నిర్మాతగా మునిరత్న చేసిన మొదటి సినిమా అంటీ ప్రీత్సే. ఆయన మంత్రి అయిన తరువాత అందరూ అంటీలే ఆయన వెంట ఉండేవారని హేళన చేశారు. నాపై కుట్రలు: మునిరత్న ఆర్ఆర్ నగరను దక్కించుకోవడానికి కొందరు చేస్తున్న కుట్రలని మాజీ మంత్రి మునిరత్న అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పరోక్షంగా డీకే శివకుమార్ బ్రదర్స్‌పై నిప్పులు పోశారు. వేలు నాయక్కర్ చేసిన వ్యాఖ్యలు అతడివి కాదు. చెప్పిస్తున్న మాటలని డీకేశి బ్రదర్స్‌పై మండిపడ్డారు. చదవండి మణిపూర్ మంట చల్లార్చేందుకు కేంద్రం మల్లగుల్లాలు -
ఐటీ ఉద్యోగిని.. ఎన్జీవో.. ఓ డేటింగ్ యాప్.. వీళ్ల ప్లానే వేరు..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఎరక్కపోయి కొందరు కిలేడీల చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ సదరు వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. అనంతరం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు డ్రామా క్రియేట్ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్‌కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన బినితా కుమారి(27) గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్‌లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్(బంబుల్ డేటింగ్ యాప్)లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా, డేటింగ్ యాప్‌లో బినితా కుమారి.. ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో గురుగ్రామ్ సెక్టార్-23లోని ఓ హోటల్‌కు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్ అని బాధితుడు హోటల్‌కు వెళ్లాడు. అయితే, హోటల్‌కు వెళ్లిన తర్వాత మనోడికి ఊహించని విధంగా షాక్ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. She is Binita Kumari Known as B on Bumble Befriended men on dating apps Chose hotel as meeting place Said she wants to have "beer & fun" Few minutes into meeting cried Rape Went to police & filed complaint NGO guy then called to "strike deal" The gang Extorted LACS ARRESTED!! pic.twitter.com/rXDmX95HvM — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 అనంతరం, ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్ ఫోగట్ నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు. దీంతో, కంగారుపడిన బాధితుడు చేసేదేమీలేక డీల్‌కు ఒప్పుకుంటూ రూ.2 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్-3 పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయింది. I was previously contacted by a victim in October too. Same modus operandi. Girl was different in that case. So we don't yet know how big is the gang or how many total victims Their latest victims got in touch We approached higher authorities and @gurgaonpolice swung in action pic.twitter.com/qlVB0b7auk — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 కాగా, ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్‌కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్-3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక, వీరిద్దరూ ఇప్పటి వరకు 12 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: వీడియో: అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు.. షాకింగ్ విషయాలు వెల్లడి -
ప్రియురాలినే ఎరగా వేసి.. ప్రతీకార హత్య!
క్రైమ్: ఆ ఇద్దరికీ పాత గొడవలు ఉన్నాయి. అది మనసు పెట్టుకుని ఎలాగైనా చంపాలని ప్లాన్ చేశాడు శిబిల్. అందుకు తన ప్రియురాలినే ఎరగా ఉపయోగించాడు. హనీట్రాప్ ద్వారా ప్రత్యర్థిని రప్పించి.. అత్యంత కిరాతకంగా హతమార్చాడు. కేరళలో సంచలనం సృష్టించిన రంజిపాలెం మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. శుక్రవారం అట్టప్పడి వద్ద అనుమానాస్పద రీతిలో పడి ఉన్న రెండు ట్రాలీ బ్యాగ్‌లు పోలీసుల దృష్టికి వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా.. మనిషి శరీరం ముక్కలు కనిపించాయి. దీంతో ఆ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదే సమయంలో.. త్రిస్సూర్ చెరుతుర్తి వద్ద ఓ హోండా సిటీ కారును వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కారుకు.. అటవీ ప్రాంతంలో దొరికిన ట్రాలీ బ్యాగులకు ఏదైనా కనెక్షన్ ఉందేమోనన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. చివరకు.. ఆ కేసు ప్రతీకార హత్యగా తేలుస్తూ చిక్కుముడిని విప్పారు. మల్లప్పురం తిరూర్‌కు చెందిన సిద్ధిఖ్(58) ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చాడు. రంజిపాలెంలో ఓ హోటల్ నడుపుతూ స్థిరపడ్డాడు. అందులో శిబిల్(22) మేనేజర్‌గా పని చేసేవాడు. అయితే తన హోటల్ పేరుతో శిబిల్ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడనే విషయం సిద్ధిఖ్ దృష్టికి వచ్చింది. దీంతో.. అతన్ని ఉద్యోగంలోంచి తీసేశాడు సిద్ధిఖ్. ఈ పరిణామంతో శిబిల్ కోపంతో రగిలిపోయాడు. మరో స్నేహితుడితో కలిసి సిద్ధిఖ్ అంతుచూడాలని అనుకున్నాడు. అందుకు తన ప్రియురాలు ఫర్హానా(18)ను సాయం చేయమని కోరాడు. ఫర్హానా సిద్ధిఖ్‌తో ఫోన్ ద్వారా పరిచయం పెంచుకుంది. చివరకు.. శారీరక సుఖం అందిస్తానని, ఎర్హనిపాలెంలోని ఓ హోటల్‌కు రావాలంటూ కబురు పంపింది. మే 18వ తేదీన హోటల్ వద్దకు సిద్ధిఖ్ చేరుకున్నాడు. గదిలోకి వెళ్లిన అతన్ని.. శిబిల్, ఫర్హానా కలిసి హతమార్చారు. చంపేశాక ఆ బాడీని ముక్కలు ముక్కలు చేసి.. రెండు ట్రాలీ బ్యాగుల్లో కుక్కేసింది ఆ ప్రేమ జంట. ఆపై మరో స్నేహితుడి సాయంతో ఆ ట్రాలీ బ్యాగులను సిద్ధిఖ్ కారులోనే తీసుకెళ్లి అట్టప్పడి వద్ద పడేసి వెళ్లిపోయారు. తండ్రి కనిపించకుండా పోవడంతో.. విదేశాల నుంచి తిరిగొచ్చాడు కొడుకు. నాలుగు రోజుల తర్వాత అంటే మే 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు ఫైల్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. రెండు రోజులకే సిద్ధిఖీ అకౌంట్ నుంచి ఏటీఎం కార్డు ద్వారా భారీగా నగదు విత్‌డ్రా అయినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈలోపు ట్రాలీ బ్యాగులో మృతదేహం బయటపడడం.. అది సిద్ధిఖీదేనని పోలీసులు నిర్ధారించుకోవడం జరిగిపోయాయి. డబ్బు విత్‌డ్రా అయిన ప్రాంతం గురించి పోలీసులు ఎంక్వైయిరీ చేయగా.. చెన్నై నుంచి ఆ డబ్బు విత్ డ్రా అయినట్లు తేలింది. దీంతో చెన్నై పోలీసుల సాయం కోరగా.. వాళ్లు శిబిల్, ఫర్హానాను అదుపులోకి తీసుకుని కేరళ పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు అషిఖ్‌ను సైతం కస్టడీలోకి తీసుకున్నారు. -
దేశ రహస్యాలు పాక్‌కు లీక్ చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్త.. నిఘా వైఫల్యమేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు.. అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం కంటికి రెప్పలా ఉంటుందని భావిస్తాం. నిజమే.. మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు వెనక్కు రారు. అలాంటి వారిలో అత్యున్నత అధికారులు ఉండడమే ఆశ్చర్యకరం. పైగా పాకిస్తాన్, చైనాలాంటి దేశాలు విసిరే హానీ ట్రాప్‌లో చిక్కడం మరింత విస్మయకరం. మహిళ అందాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే జాబితా పెరిగిపోతోంది. గత నెల రోజులుగా భారత రక్షణ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న వ్యక్తి ప్రదీప్ కురుల్కర్. భారత రక్షణ వ్యవస్థలోని కీలక వింగ్ DRDOలో అత్యున్నత అధికారిగా ఉన్న ప్రదీప్.. ఇప్పుడు దేశ రహస్యాలను లీక్ చేసిన మాయగాడిగా మిగిలిపోయాడు. వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్‌కు లీక్ చేశాడు డీఆర్డీవో టాప్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటి శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడు. ప్రదీప్‌కు వలపు వల విసిరి రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జర్దాస్ గుప్తా. లండన్ లో నివసిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన్ను ట్రాప్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్‌ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసెజ్‌లు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్, రాత్రుళ్లు కవ్వించే మాటలు.. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేక పోయిన ప్రదీప్ ఆమె మాయలో పడ్డాడు. వేరే దేశానికి రమ్మని పిలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను కూడా తిలకించారు. ఇద్దరూ కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఈ మహిళ అందానికి దాసోహమైన ప్రదీప్.. ఆమె ఏం అడిగినా కాదనకుండా అన్ని వివరాలు వెల్లడించాడు. దేశభద్రత గురించి పట్టించుకోకుండా తెలిసిన రహస్యాలన్నీ లీక్ చేశాడు. ఈ మత్తులో జరుగుతున్న ద్రోహం గురించి ప్రదీప్ కనిపెట్టలేకపోయాడా అన్నది ఓ మిలియన్ డాలర్ క్వొశ్చన్. ఇలాంటి ఆపరేషన్స్‌పై సైన్యంలో ఎందరికో అవగాహన కల్పించిన ప్రదీప్.. తానే ఆ గోతిలో పడ్డాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయాడు. 1988 నుంచి డీఆర్డీఓలో 1988 నుంచి పనిచేస్తున్నారు ప్రదీప్. గ్రేడ్-హెచ్ ఔట్ స్టాండింగ్ కేటగిరీ సైంటిస్ట్‌గా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైన హోదా. కేంద్రంలో అదనపు కార్యదర్శి హోదాతో సమానం. ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి దేశ సమాచారాన్ని లీక్ చేయడం ఒకింత విస్మయం కలిగించే విషయం. దీన్ని ఆరంభంలోనే నిఘావర్గాలు కనిపెట్టలేకపోడవంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశభద్రతలో డీఆర్డీఓ అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 50 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5వేల మందికిపైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పడు ప్రదీప్ వలపు వ్యవహారం బహిర్గతం కావడంతో వీరిపైనా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. ప్రదీప్ విషయం తెలిసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)పుణెలో రెండు వారాల క్రితం అతడ్ని అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ ఏ ఏ రహస్యాలు చేరవేశాడన్నది లెక్క తేలాల్సిన అంశం. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలో అంతర్గత లోపాలను బయటకు రానివ్వరు. సైన్యంలో టాప్ అధికారులకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రదీప్ ఎంతవరకు ఉప్పందించాడు, ఎక్కడెక్కడ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని మార్చుకోవాలి? ఇవీ ఇప్పుడు సైన్యంలోని టాప్ అధికారుల ముందున్న పెద్ద ఛాలెంజ్. చదవండి: చైనా చాట్‌జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా? -
Delhi Lodge Murder Case: హనీ ట్రాప్‌లో భాగమే..ఐతే ఆ 'సారీ నోట్'..
ఢిల్లీలో తీవ్ర కలకలం రేపిన వ్యాపారవేత్త హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ప్రధాన నిందితురాలు 29 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్‌తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బల్జీత్ లాడ్జిలో తన గదిలో నురగలు కక్కుతూ శవమై కనిపించిన వ్యాపరవేత్త దీపక్ సేథీని హనీట్రాప్ ప్లాన్‌తోనే హత్య చేసినట్లు తెలిపారు. సదరు మహిళ పేరు ఉషా అని ఆమె నిక్కీ, అంజలి, నిఖిత వంటి మారుపేర్లతో వ్యక్తులతో స్నేహం చేసి వారిని హోటళ్లుకు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి దోచుకునేదని చెప్పారు. ఈ ప్లాన్‌తోనే ఆ రోజు కూడా ఉషా దీపక్ సేథీని ట్రాప్ చేసి హోటల్‌ల్‌కి తీసుకువెళ్లిందన్నారు. ఐతే ఆరోజు అనుకోకుండా ఓవర్ డోస్ అవ్వడంతో అతను మృతి చెందాడని తెలిపారు. దీపక్ సేథీ(53) మార్చి 30న రాత్రి 9.30 గంటలకు ఉషతో కలిసి గెస్ట్‌హౌస్‌కి వెళ్లిందని, అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో డబ్బు, నగలతో బయటకు వచ్చినట్లు తెలిపారు. ఐతే అనుకోకుండా దీపక్ చనిపోవడంతో ఆమె విచారం వ్యక్తం చేస్తూ.. 'సారీ అంటూ నోట్' రాసిందన్నారు. అదే ఆమెను పోలీసులకు పట్టించేలా చేసిందని చెప్పారు. ఈ ఘటనలో బాధితుడిని సంప్రదించిన ఫోన్ నెంబర్లలో ప్రధాన నిందితురాలితో సహా ఉన్న కొనఇన అనుమానిత నంబర్లను కూడా గుర్తించారు పోలీసులు. నిందితురాలు ఉష నెంబర్ సంత్‌గఢ్ ప్రాంతంలో రీఛార్జ్ అవ్వడంతో ఆ లోకేషన్‌ని ట్రేస్ చేసి అక్కడికి చేరుకుని నైజరియన్ వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. అతడి లివ్ఇన్ భాగస్వామీ మధుమిత స్నేహితురాలి నిక్కీ అలీయాస్ ఉషా అని తేలడంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఆమె 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో జైలులో ఉంది. అక్కడే మధుమితతో పరిచయం ఏర్పడిందని, ఆమె దీపక్ సేథీని ఉషకు పరిచయం చేసినట్లు తెలిపారు. విచారణలో నిందితురాలు ఉషా తనకు దీపక్ సేథీని చంపే ఉద్దేశ్యం లేదని, అందువల్లే ఆ గది నుంచి బయటకు వెళ్లే ముందు సారీ నోట్‌ని వదిలి వెళ్లినట్లు తెలిపింది. అలాగే ఆమె సేథీ నుంచి తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: బార్లో సిబ్బంది, కస్టమర్ల మధ్య వాగ్వాదం..పదిమంది అరెస్టు) -
తేనె పూసిన కత్తులు! హనీ ట్రాప్‌లు ఎన్నో రకాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్‌లు భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్బుక్ అకౌంట్‌తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్‌లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్‌రెడ్డిని 2022 జూన్‌లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హనీ ట్రాప్‌లు.. ఎన్నో రకాలు సోషల్ మీడియా ఆధారిత ట్రాప్‌లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్‌కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం సేకరిస్తారు. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫాంల ద్వారా: ఆన్లైన్లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్‌ల ద్వారా మెసేజ్‌లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్ల ఆధారిత హనీ ట్రాప్‌లు: అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్‌లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు. ఈ మెయిల్లో లింక్‌ల ద్వారా..: ఈ మెయిల్స్‌లో లింక్‌లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్‌లతో: డేటింగ్ యాప్‌లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. ♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు. ♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం. ♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు. అలా అడిగితే అనుమానించాల్సిందే హనీ ట్రాప్‌ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్‌ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
‘హనీట్రాప్’తో లీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక హనీట్రాప్ ఉన్నట్టు బయటపడింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ తనకు సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో ప్రశ్నపత్రాన్ని బయటికి తెచ్చినట్టు తేలింది. ఆ టీచర్ కోరిక మేరకే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని తీసుకురాగా.. సదరు టీచర్ మాత్రం ఓ దళారీ సాయంతో ముగ్గురు అభ్యర్థులకు పేపర్‌ను విక్రయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజ్ విషయం బహిర్గతమైంది. దీనిపై టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పోస్టులకు ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. దీనిని టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోదరుడి కోసమంటూ అడిగి హైదరాబాద్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణ్‌ను సంప్రదించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ వెంటనే అంగీకరించాడు. టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌తో కలిసి పేపర్ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్‌కు చెందిన సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్ ఆ కంప్యూటర్‌పై నిఘా పెట్టారు. 28న తస్కరణ.. 2న కాల్చివేత.. ప్రవీణ్, రాజశేఖర్ పలుమార్లు శంకరమ్మకు చెందిన కంప్యూటర్ను పరిశీలించారు. సరైన లాక్, ఫైర్‌వాల్స్ లేవని నిర్థారించుకుని.. గత నెల 28న రంగంలోకి దిగారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపర్‌ను ఓ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఔట్ తీసుకున్నారు. ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు. కేవలం రేణుక సోదరుడు చదువుకోవడానికే వినియోగించాలని, మరునాడే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దీనికి అంగీకరించిన రేణుక, ఆమె భర్త ఆ పేపర్ తీసుకువెళ్లారు. అయితే రేణుక పేపర్‌ను సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్ కుమారుడితో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్‌ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్‌కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపర్‌ను ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది. ఓ అభ్యర్థి రూమ్మేట్కు తెలియడంతో.. రేణుక పరీక్ష ప్రశ్నపత్రాన్ని విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్.. తనకు తిరిగిచ్చిన పేపర్‌ను సైదాబాద్‌లోని తన ఇంటికి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే ప్రశ్నపత్రం కొన్న అభ్యర్థుల్లో ఒకరు హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. అతడి రూమ్మేట్ సైతం కొన్నాళ్లుగా టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం రాత్రి మాటల సందర్భంలో సదరు అభ్యర్థి పేపర్ లీకేజీని రూమ్మేట్కు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకవడంపై కంగుతిన్న రూమ్మేట్ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్–100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పేపర్ సైతం లీక్? టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీపై బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చేతులు మారిన రూ.14 లక్షలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులను బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. వీరిని విచారిస్తున్న నేపథ్యంలోనే.. గత వారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను సోమవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. పేపర్ లీకేజీ అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు కూడా అంతర్గత విచారణ ప్రారంభించారు. -
TSPSC: పేపర్ లీక్‌లో కొత్త కోణం.. ఆమె కోసమే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. అయితే, పేపర్ లీక్ ఎపిసోడ్లో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో హ్యాకింగ్ జరగలేదని నిర్ధారణ అయ్యింది. అయితే, కమిషన్‌కు చెందిన ఓ ఉద్యోగి.. ఓ యువతి కోసం పేపర్ లీక్ చేసినట్టు సమాచారం. వివరాల ప్రకారం.. పేపర్ లీకేజీ ఘటన కేసు దర్యాప్తులో హానీట్రాప్ జరిగినట్టు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ఆఫీసుకు ఇటీవల తరచుగా ఓ యువతి రావడాన్ని గమనించారు. ప్రవీణ్ కోసం సదరు యువతి తరచూ వస్తూ ఆఫీసులో కలుస్తోంది. సదరు యువతి.. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈ క్రమంలో తనకు పేపర్ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె కోసం పేపర్ లీక్ చేసినట్టు గుర్తించారు. యువతి కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో, నిందితుడు ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలు వాయిదా.. టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలను టీఎస్పీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. -
Honey Trapping: తియ్యని మాటలు.. కవ్వించే గొంతుతో రూ.కోటి కొట్టేసింది..
సాక్షి, హైదరాబాద్: ఓ అమ్మాయి తియ్యని గొంతుతో వేర్వేరుగా ఇద్దరితో మాట కలిపింది. టెలిగ్రామ్ వేదికగా కవ్వింపు మాటలు మాట్లాడి కోటీశ్వరులు అయ్యే ఉపాయం చెప్తానన్నది. ఇంకేముంది?..దీనికి అంగీకరించిన ఇద్దరి నుంచి సైబర్ నేరగాళ్లు అందినకాడికి దోచుకున్నారు. ఒకరి నుంచి రూ.56 లక్షలు, మరొకరి నుంచి రూ.51 లక్షలు కాజేశారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. బంజారాహిల్స్‌కు చెందిన 58 ఏళ్ల వ్యక్తి ఇటీవల టెలిగ్రామ్ వేదికగా ఓ అమ్మాయి పరిచయమయ్యింది. రెండురోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేస్తూ పరిచయాన్ని కాస్త స్నేహంగా మలుచుకున్నారు. తాను ఇన్వెస్టర్ని అంటూ నమ్మబలికింది. నాలా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటూ కోరింది. ఆమె మాటలకు బుట్టలో పడ్డ వ్యక్తి ఆమె చెప్పినట్లుగా ఇన్వెస్ట్ చేశాడు. తొలుత రెండు, మూడు పర్యాయాలు లాభాలు ఇచ్చింది. ఆ తర్వాత సుమారు రూ.20 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయించి ఒక్క రూపాయి లాభం ఇవ్వలేదు. ఈ రూ.20 లక్షలు రావాలంటే మరికొంత కట్టాలన్నది. ఇలా ఆమె చెప్పినట్లు పలు దఫాలుగా రూ.52 లక్షలు వెచ్చించాడు. మెహదీపట్నంకు చెందిన 30 ఏళ్ల యువకుడికి ఇదే మాదిరిగా ఓ అమ్మాయి పరిచయమైంది. ఇన్వెస్ట్మెంట్ నుంచి క్రిప్టో కరెన్సీ వైపు అడుగులు వేయించింది. పలు దఫాలుగా యువకుడి నుంచి రూ.56 లక్షలు స్వాహా చేసింది. ఈ ఇద్దరిదీ ఒకేరకమైన వలపు వల కావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. ముక్కూ మొహం తెలియని అమ్మాయి తియ్యగా మాట్లాడితే అన్ని లక్షలు ఎలా ఇస్తారంటూ ఏసీపీ కేవీఎం ప్రసాద్ మందలించారు. వీరిద్దరి వేర్వేరు ఫిర్యాదులతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
HYD: హనీట్రాప్.. అందమైన రూపంతో ఎర.. ఒంటిపై నూలుపోగు లేకుండా వీడియో కాల్!
సాక్షి, హైదరాబాద్: ఓ అందమైన యువతి అనుకోకుండా వీడియో కాల్ చేయడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆమె మాయలో పడ్డాడు. మాయలేడి మాయ మాటలు చెప్పి ఆయనను పీకల్లోతు ప్రేమలోకి తీసికెళ్లింది. కట్ చేస్తే ఆ వీడియోను అడ్డం పెట్టుకుని రూ.లక్షలు కాజేసింది. ఆ వీడియో బయటకు వస్తే తన పరువుపోతుందని భావించిన అతను తనకు న్యాయం చేయాలని కోరుతూ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చంపాపేటకు చెందిన వ్యక్తి ఓ ప్రభుత్వోద్యోగిగా పని చేస్తున్నాడు. విధుల్లో ఉన్న ఆయనకు ఓ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. దానిని లిఫ్ట్ చేయగా అవతలి వైపు అందమైన అమ్మాయి కనిపించింది. మీతో స్నేహాన్ని పంచుకోవాలనుకుంటున్నానంటూ తియ్యని మాటలతో అతడిని రెచ్చగొట్టింది. ఇంటికెళ్లిన తర్వాత కాల్ చేస్తానంటూ చెప్పి అతను కాల్ కట్ చేశాడు. రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటరిగా సదరు యువతికి కాల్ చేశాడు. వీడియో కాల్లో ఒంటిపై నూలు పోగు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే ఓ వ్యక్తి కాల్ చేసి పోలీసునని పరిచయం చేసుకున్నాడు. మీరు ఓ యువతిని భయపెట్టి ఆమెతో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడారని, మేం చెప్పినట్లు వినకపోతే వీడియోకాల్‌ను సోషల్ మీడియాలో పెట్టడమే కాక కేసు ఫైల్ చేస్తామన్నారు. ఈ విషయం బయటికి వస్తే తన పరువు పోతుందనే భయంతో అతను వారికి రూ.5లక్షలు ముట్టజెప్పాడు. ఇంకా కావాలని ఫోన్ చేసి వేధిస్తుండటంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: హైదరాబాద్ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు -
సహచరుడి గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్.. స్పందించిన బాబర్ ఆజమ్
Babar Azam Honey Trap Episode: సహచరుడి గర్ల్ ఫ్రెండ్‌తో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్.. తాజాగా ఈ ఉదంతంపై స్పందించాడు. తనపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఉద్దేశిస్తూ.. సుఖంగా ఉండేందుకు మరీ అంత రిస్క్ చేయనన్న అర్ధం వచ్చేలా ట్వీట్ చేస్తూ, తనపై వస్తున్న ఆరోపణలకు పరోక్షంగా చెక్ పెట్టాడు. Doesn't take too much to be happy ☺️ pic.twitter.com/udKmZTHl6V — Babar Azam (@babarazam258) January 16, 2023 నదీ తీరాన, ఆహ్లాదకరమైన వాతావరణంలో తీసుకున్న తన ఫోటోను షేర్ చేస్తూ బాబర్ ఈ ట్వీట్ చేశాడు. ఈ పోస్ట్‌లో బాబర్ నవ్వుతూ ఇచ్చిన పోజ్‌ను బట్టి చూస్తే.. తనపై వస్తున్న ఆరోపణలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో పాటు అభిమానులు కూడా బాబర్‌కు అండగా నిలిచారు. సోషల్‌మీడియాలో వైరలవుతున్న వీడియోలో ఉన్నది బాబర్ కాదని, గిట్టని వారు మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పట్టీపట్టనట్లుగా ఉండటంతో బాబర్‌కు మద్దతుగా నిలుస్తోందని స్పష్టమవుతోంది. The war against Babar Azam has started 😢#BabarAzam𓃵 #BabarAzam pic.twitter.com/JOSmHd9A32 — Muhammad Noman (@nomanedits) January 15, 2023 కాగా, వైరలవుతున్న వీడియోలో బాబర్.. తన సహచరుడి (పాక్ జట్టులో సభ్యుడు) గర్ల్ ఫ్రెండ్‌తో అసభ్య పదజాలం ఉపయోగించి చాటింగ్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నియో యాదవ్ అనే ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో బాబర్, తన సహచర పాకిస్తాన్ ఆటగాడి గర్ల్ ఫ్రెండ్‌తో సెక్స్ చాటింగ్ చేస్తున్నాడు. తనతో చాటింగ్ కొనసాగిస్తే.. సదరు అమ్మాయి ప్రియుడికి జట్టులో స్థానానికి ఢోకా ఉండదని ప్రామిస్ చేశాడు. ఈ వీడియోతో పాటు పలు అసభ్య చాట్ మెసేజ్‌లు, ఆడియో రికార్డింగ్‌లు, బాబర్‌కు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కూడా సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్‌ల్లో జట్టును గెలిపించలేక, కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో ఉన్న బాబర్‌కు తాజా ఉదంతం మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. -
Hyderabad: వలపు వల హనీ ట్రాప్‌తో నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రాంతానికి చెందిన చోటామోటా వ్యాపారుల్లో అమాయకులను ఎంచుకోవడం... యువతులతో వారికి ఎర వేసి ఫొటోల వరకు తీసుకువెళ్లడం... వాటితో యువతుల బంధువులుగా రంగంలోకి దిగడం... దాడులు, బెదిరింపులతో భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దండుకోవడం... ఈ పంథాలో రెచ్చిపోతున్న “హనీట్రాప్స్ బందిపోటు’ ముఠాను ముషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అరెస్టైన 12 మందిలో ఓ మాజీ హోంగార్డు, బౌన్సర్ ఉన్నట్లు మధ్య మండల డీసీపీ ఎం.రాజేష్ చంద్ర తెలిపారు. చిక్కడపల్లి ఏసీపీ ఎస్.యాదగిరితో కలిసి సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. హోంగార్డుగా పని చేస్తూ నేరాలు... ముషీరాబాద్ పరిధిలోని దయారా మార్కెట్ ప్రాంతానికి చెందిన మహ్మద్ విఖార్ మెహ్దీ గతంలో నగర భద్రతా విభాగంలో హోంగార్డుగా పని చేశారు. 2013లో పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీ, బెదిరింపులకు పాల్పడి జైలుకు వెళ్లాడు. 2016లో నోట్ల రద్దు తర్వాత పాత నోట్లకు కొత్త నోట్లు మార్పిడి పేరుతో దందా చేసి పలువురిని మోసం చేశాడు. దీనిపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో మరోసారి జైలుకు వెళ్లాడు. ఇతడి నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. విఖార్ జైల్లో ఉండగా తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖాన్‌తో పరిచయమైంది. వీళ్లిద్దరూ కలిసి పంజగుట్టలో విఖార్‌తో కలిసి అరెస్టు అయిన సంతోష్‌నగర్ వాసి మహ్మద్ కలీం ఖాన్, ముషీరాబాద్‌కు చెందిన పాత నేరగాడు, విఖార్ సోదరుడైన సిరాజ్ జట్టు కట్టారు. పహాడీషరీఫ్, మెహదీపట్నం ప్రాంతాలకు చెందిన షేక్ సమీర, సైదా ఫాతిమా, మహ్మద్ ఇస్మాయిల్, అలీ, మజీద్ అహ్మద్, అహ్మద్ రిజ్వాన్, సయ్యద్ రఫీఖ్, షేక్ బషీర్, స్టేజ్ డ్యాన్సర్ హీనాలతో ముఠా ఏర్పాటు చేశారు. చిరు వ్యాపారులను ఎంపిక చేసుకుని... ఈ గ్యాంగ్‌లోని పురుషులు తమ ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల్లో అమాయకులను టార్గెట్‌గా చేసుకుంటారు. వీరి ద్వారా విషయం తెలుసుకునే ముఠాలోని యువతులు, మహిళలు అతడి వద్దకు వెళ్తారు. ఆయా వ్యాపారాలకు సంబంధించి ఆర్డర్లు ఇవ్వడానికంటూ వ్యాపారుల ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఆపై వారికి వాట్సాప్‌లో సందేశాలు పంపి చాటింగ్స్ చేస్తారు. ఓ ప్రాంతంలో కలుసుకోవడానికి రమ్మని పిలిచి వారితో ఫొటోలు దిగుతారు. ఈ ఫొటోలను తీసుకుని ముఠా సభ్యులు అసలు కథ మొదలెడతారు. ఆ వ్యాపారి వద్దకు వెళ్లి సదరు మహిళ తమ భార్య లేదా కాబోయే భార్య అని చెప్పి, ఆమెను లోబరుచుకుంటున్నావని బెదిరించి దాడి చేస్తారు. పోలీసులుగా ఎంట్రీ ఇచ్చే విఖార్, ఇమ్రాన్లు కేసుల పేరుతో, విలేకరి రూపంలో వచ్చే రిజ్వాన్ ఫొటోలు మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరిస్తాడు. దీంతో వారు సదరు వ్యక్తి నుంచి భారీ మొత్తం డిమాండ్ చేసి అందినకాడికి దండుకుంటారు. మూడు ఠాణాల్లో నాలుగు కేసులు... ఈ ఏడాది జూన్ నుంచి నేరాలు చేస్తున్న ఈ గ్యాంగ్‌పై ఇప్పటి వరకు ఆసిఫ్‌నగర్, సంతోష్‌నగర్, ముషీరాబాద్‌ల్లో కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్‌కు చెందిన ఖమ్రుద్దీన్‌ను రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. వీరి వేధింపులు తట్టుకోలేక అతడు తన ఇంటిని తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చాడు. ఇదే ప్రాంత వాసి ఖలీల్ పాషా రూ.2.5 లక్షలు మరో ఇద్దరి నుంచి ఇంకొంత రాబట్టారు. ఇలా మొత్తం రూ.8.5 లక్షలు కాజేసిన, బెదిరింపులకు డమ్మీ పిస్టల్స్, కత్తులు వాడే వీరిపై ముషీరాబాద్‌లో బందిపోటు దొంగతనం సహా వివిధ ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. చిక్కడపల్లి ఏసీపీ ఎస్.యాదగిరి నేతృత్వంలో రంగంలోకి దిగిన నాలుగు బృందాలు హీనా సహా మిగిలిన 12 మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, రెండు డమ్మీ తుపాకులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో అర్హులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, వీరి బారినపడిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని డీసీపీ రాజేష్ చంద్ర కోరారు. -
HYD: కి‘లేడీ’ ప్లాన్.. హోం డెలివరీ పేరిట మహిళ హనీ ట్రాప్
సాక్షి, హైదరాబాద్: నగరంలో హనీ ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. తెలంగాణ పోలీసులు హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా ఓ మహిళతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. హోమ్ డెలివరీ పేరిట ఓ మహిళ నగరంలో కొందరు వ్యక్తులను హనీ ట్రాప్ చేస్తోంది. ఈ క్రమంలో యువకులతో పరిచయం పెంచుకున్న సదరు మహిళ.. వారితో సన్నిహితంగా ఫొటోలు దిగుతోంది. ఇలా వారిలో ఫొటోలు దిగిన మరుసటి రోజే.. సదరు మహిళతో పాటు వారి గ్యాంగ్ యువకుల ఇంటి వద్ద ప్రత్యక్షమవుతున్నారు. యువకులు.. ఆమెతో ఫొటోలు దిగి మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఇంటిపై దాడి చేసి హంగామా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో మహిళ గ్యాంగ్.. బాధిత యువకుల వద్ద రూ. లక్షలు వసూలు చేస్తోంది. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జోన్ పరిధిలోని పోలీసులు వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. అనంతరం, హనీ ట్రాప్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. -
వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ భారీ స్మగ్లింగ్‌ను నిలువరించారు. ఓ వ్యక్తి నుంచి రూ.28 కోట్లు విలువ చేసే కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతను బ్యాగులో దీన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. బ్యాగును చింపి కొకైన్‌ను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. #WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP — ANI (@ANI) January 10, 2023 ఈ వ్యక్తి బ్యాగులో మొత్తం 2.81కిలోల కొకైన్ దొరికింది. దీని విలురు రూ.28.10 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యక్తి ఓ మహిళ వలపు వలలో చిక్కుకునే స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన మహిళ, ఇతడ్ని కొకైన్ ఢిల్లీకి తీసుకెళ్లి మరో వ్యక్తికి ఇవ్వమని చెప్పిందని పేర్కొన్నారు. ఆమె మాయలో పడిన ఇతడు స్మగ్లింగ్ చేసేందుకు సిద్ధమైనట్లు వివరించారు. గతవారం కూడా ముంబై విమానాశ్రయంలో రూ.47 కోట్లు విలువ చేసే కొకైన్, హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి 4.47 కేజీల హెరాయిన్, 1.6 కిలోల కొకైన్‌ను పట్టుకున్నారు. చదవండి: ఆటోను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ట్రక్కు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి -
యువతుల వలపు వల! అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్..
సాక్షి, వరంగల్: న్యూడ్ కాల్స్ న్యూసెన్స్ చేస్తున్నాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో.. అదే స్థాయిలో సైబర్ క్రిమినల్స్ కూడా మరింతగా అప్డేట్ అవుతున్నారు. వాట్సాప్ ద్వారా నేరుగా వీడియో కాల్స్ చేస్తున్న యువతులు ఆ ఫోన్ వినియోగదారుడిని టెంప్ట్(ప్రేరేపిస్తూ) చేసి.. వారిని కూడా వివస్త్రలు కావాలని చెప్పి మరీ ఆ సీన్‌ను వీడియో రికార్డు చేస్తున్నారు. ఆ తర్వాత వారు మొదలు పెట్టే అసలు ఆటలో ఈ విషయాలు బయటకు చెప్పుకోలేక రూ.లక్షలు సమర్పించుకుంటున్నారు. ఇంకొందరు ఈ వేధింపులు తారస్థాయికి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ గడపతొక్కుతున్నారు. మరికొందరేమో తమ పరిధిలోని ఠాణాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పదికి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. అందంతో టెంప్ట్ చేసి.. ఆపై టార్చర్.. అదిరే డ్రెస్సు.. ఆకర్షించే అందచందాలతో చూడచక్కగా ఉండే యువతులు వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ చేస్తున్నారు. ఇలా వీడియో కాల్ రాగానే.. ఇటు నుంచి యువకులు కూడా వారు చెప్పే మా టలకు ఫిదా అవుతున్నారు. ఓ అమ్మాయి నేరుగా వీడియో కాల్ చేయడంతో ఉబ్బితబి్బబ్బవుతున్నా రు. ఆ తర్వాత మాటల్లోకి దింపి సదరు యువతి డ్రెస్ తీసేసి ఇటువైపు నుంచి ఉన్న యువకులను టెంప్ట్ చేస్తుంది. మీరు కూడా బాత్రూమ్కు వెళ్లి బ ట్టలు తీసేయండి అంటూ చెప్పడంతో ఆ మోజులో చాలా మంది అలానే చేస్తున్నారు. ఈ సమయంలో సదరు యువతి మాటలతో రెచ్చగొట్టి యువకులు చేసే సీన్లను వీడియో రికార్డు చేస్తున్నారు. పోలీసుల పేరుతో కాల్స్.. ఇక్కడ్నుంచి నేరస్తుల అసలు కథ మొదలవుతుంది. వీడియో కాల్ పూర్తయ్యాక.. కాసేపటికి బాధితుడికి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఢిల్లీ సైబర్ క్రైమ్ ఏసీపీ, సీఐని మాట్లాడుతున్నానని.. మీతో న్యూడ్ వీడియో కాల్ చేసిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని సదరు బాధితుడిని బెదిరిస్తారు. ఢిల్లీలో కేసు నమోదైందని.. అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తారు. అమ్మా యి సెల్ఫోన్న్వీడియోల రికార్డ్ అంతా రికవరీ చేశామంటారు. ఆ వీడియో సదరు యువకులకే పంపడంతో నిజమేనని నమ్మేస్తారు. కేసులు, తలనొప్పులు లేకుండా ఈజీగా బయటపడాలంటే కొంత డబ్బు పంపించాలని కొరతారు. కొందరు అధికారులను మేనేజ్ చేయాల్సి ఉందని నమ్మబలుకుతారు. ఇలా విడతలవారీగా రూ.లక్షల్లో డబ్బులను ఆన్లైన్లో కొందరు బాధితులు సమర్పించుకున్నారు. ఈ విధంగా వరంగల్‌లోని 36వ డివిజన్ చింతల్‌కు చెందిన ఓ వ్యక్తికి అనుభవం ఎదురుకావడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ వీడియో కాల్స్‌కు స్పందించొద్దు.. సైబర్ నేరగాళ్ల ముసుగులో కొందరు యువతులు వీడియో కాల్స్ చేసి తియ్యటి మాటలతో నగ్నంగా ఉండి టెంప్ట్ చేసి ఆ తర్వాత బెదిరించి డబ్బు వసూలు చేసే కేసులు పెరుగుతున్నాయి. సమాజంలో గౌరవం ఉన్నవారు బయటకు చెప్పుకోలేక పీకల్లోతు వేధింపులు వచ్చాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరహా న్యూడ్ వీడియో కాల్స్‌కు స్పందించకపోవడమే మంచిది. ఒకవేళ అలాంటివి ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలి. నిందితులను టెక్నికల్ డాటా ఆధారంగా పట్టుకునే అవకాశం ఉంటుంది. – ఏవీ రంగనాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
అందంగా ట్రాప్.. కిలాడీ టిక్ టాకర్ అరెస్ట్ ..!
-
హైదరాబాద్ లో వెలుగులోకి మరో వలపు వల
-
పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా
సాక్షి, హైదరాబాద్: మత్తెక్కించే మాటలతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందమైన ఫొటోలు, వీడియోలతో ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించి జేబు ఖాళీ చేసేస్తుంది ఈ మాయలేడి! సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి యువకులకు గాలం వేస్తున్న యువతితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరొకరిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బీ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని భావించిన ఇరువురూ పథకం వేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువకులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నాలుగు అకౌంట్లు తెరిచి అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. కామెంట్లు పెట్టేవారిలో బ్యాచిలర్స్, అమాయకులను ఎంపిక చేసుకుని వారికి రిప్లై ఇచ్చేది. ఫోన్ నంబర్లు తీసుకుని తియ్యని మాటలతో ప్రేమగా మాట్లాడుతూ నమ్మించేది. ఈ క్రమంలో ఓ రోజు ఫిర్యాదుదారుడికి తనుశ్రీ ఇన్‌స్ట్రాగామ్ నుంచి మెసేజ్ వచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకొని గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. తల్లికి ఆరోగ్యం బాలేదని, గృహ రుణం వాయిదా చెల్లించాలని, కరోనా వచ్చిందని ఇలా రకరకాల సాకులతో ఖర్చులకు డబ్బులు కావాలని అడగడంతో 8 నెలల కాలంలో రూ.31.66 లక్షలు బదిలీ చేశాడు. ఒక రోజు యువతి బాధితుడితో పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిజమేనని నమ్మిన బాధితుడు ఎదురుచూశాడు. ఆపై ఆమె నుంచి రిప్లై రాకపోవటంతో మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారాల ఆధారంగా తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు ఇద్దరూ పలువురు యువకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వీరిపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు నమోదయింది. ఇదీ చదవండి: Anti Hijab Protests: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్ -
అరగంట చాలు.. రాష్ట్రంలో సీన్ మారిపోతుంది!: అర్చనా నాగ్
క్రైమ్: హైప్రొఫైల్ హనీ ట్రాప్‌గా ఒడిశాలో సంచలనం సృష్టించి.. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది అర్చనా నాగ్ అరెస్ట్ ఉదంతం. అయితే వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన తరుణంలో మంగళవారం ఆమె మీడియా ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను పెదవిప్పితే రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది. ప్రభుత్వమే కూలిపోతుంది. అందుకు మాట్లాడేందుకు 30 నిమిషాలు అవకాశం ఇవ్వండి. కీలక ఆధారాలను మీకిస్తా’ అని అక్కడే ఉన్న మీడియాను ఉద్దేశించి అర్చన నాగ్ వ్యాఖ్యానించారు. ఆమె అక్రమ ఆస్తులపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు అర్చన నాగ్‌ను మంగళవారం ఏడు రోజుల రిమాండుకు తీసుకున్నారు. కారాగారం నుంచి ఆమెను క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆసుపత్రి వద్ద అర్చన నాగ్ మీడియాతో మాట్లాడారు. పోలీసులు తనను ఓ ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. ఎలాంటి దర్యాప్తునకైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నా. ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. అని ఆమె తెలిపారు. . శ్రద్ధాంజలి బెహరా, సినీ నిర్మాత అక్షయ పరిజ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంటే తననెందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. అధికార బీజేడీ నుంచి 20 మంది, ప్రతిపక్ష బీజేపీ నుంచి కొందరు, రాజకీయ నేతలేగాక.. వీఐపీలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ దిగ్గజాలు, నిర్మాతలు.. అర్చనా వలపు వలలో చిక్కుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశాతో పాటు బెంగాల్‌కు చెందిన ప్రముఖులు ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. హనీ ట్రాప్ కేసులో అర్చనతో పాటు ఆమె భర్త జగబంధు చంద్, ఈ జంటకు వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న ఖగేశ్వర్ పాత్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదివరకు పలువురిని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం నుంచి ఏడు రోజులపాటు అర్చన నాగ్‌ను విచారించనున్నారు. కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. సంబంధిత కథనం: పేద కుటుంబంలో పుట్టి.. అర్చనా నాగ్ వెర్షన్ డర్టీ పిక్చర్ ఇది! -
వస్త్ర వ్యాపారితో శారీరక సంబంధం.. సోదరులతో కలిసి హనీట్రాప్‌కు..
సాక్షి, బెంగళూరు (బనశంకరి): మనిషి బలహీనతే వారికి పెట్టుబడి. వల విసిరి లోబర్చుకుని ఆపై డబ్బూ దస్కం దోచుకోవడం పరిపాటిగా మారింది. సిలికాన్ సిటీలో హానీట్రాప్ దందాలు పెచ్చుమీరుతున్నాయి. సులభంగా బెదిరించి డబ్బులు దండుకోవడానికి దీనిని ఎంచుకుంటున్నారు. అలాగే టెక్నాలజీ సాయంతో అమాయక ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. పనిలో చేరి వలలో వేసుకుని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న యువతి వస్త్ర వ్యాపారితో స్నేహంగా ఉంటూ తన సోదరులతో కలిసి హనీట్రాప్ కు పాల్పడి రూ.43 లక్షలు దోచేసింది. ఈఘటన బాధితుడు నగర్తపేటే నివాసి విక్రంజైన్ (43) అనే వస్త్రవ్యాపారి ఉప్పారపేటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి మైత్రి, ఆమె సోదరుడు కిరణ్, స్నేహితుడు సిద్దు అనే ముగ్గురిపై దర్యాప్తు చేపడుతున్నామని ఉప్పారపేటే పోలీసులు తెలిపారు. జైన్ 2020లో మైత్రి అనే యువతిని షాపులో పనికి చేర్చుకున్నాడు. ఈ సమయంలో యువతి తన సోదరుడు కిరణ్ రోడ్డుప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరాడని, డబ్బు కావాలని జైన్ నుంచి రూ.2 లక్షలు అప్పుగా తీసుకుంది. తరువాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొద్దిరోజుల తరువాత జైన్‌కు మైత్రి ఫోన్ చేసి కేజీ.రోడ్డు బెంగళూరు గేట్ హోటల్‌కు రావాలనడంతో జైన్ వెళ్లాడు. హోటల్లో మైత్రి, కిరణ్, సిద్దు ఉన్నారు. రూ.8 లక్షలు ఇవ్వాలని, లేకపోతే మన ఇద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం గురించి ప్రచారం చేసి పరువు తీస్తానని బెదిరించింది. భయపడిన జైన్ వారికి రూ.8 లక్షలు అందజేశాడు. ఆ తరువాత కూడా దశలవారీగా వారు అతని నుంచి రూ.43 లక్షలు దోచేశారు. మరింత డబ్బు కోసం వేధిస్తుండడంతో తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పాన్‌కార్డు పేరుతో రూ.3.22 లక్షలు వంచన పాన్‌కార్డు అప్డేట్ చేయకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని బ్యాంక్ సిబ్బంది ముసుగులో మహిళకు రూ.3.22 లక్షలు సైబర్ వంచకులు టోపీ వేశారు. జేపీ.నగరలో చంద్రిక (64)కు ఈ నెల 8 తేదీన గుర్తుతెలియని నెంబరు నుంచి చంద్రికాకు ఫోన్ వచ్చింది. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం, మీ పాన్‌కార్డును అప్డేట్ చేయాలి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది అని చెప్పారు. సరేనని చంద్రిక బ్యాంక్ అకౌంట్ వివరాలను పంపగానే ఆమె ఖాతా నుంచి ను రూ.3.22 లక్షలు నగదు కట్ అయింది. ఆమె లబోదిబోమంటూ బ్యాంకుకు వెళ్లి విచారించగా ఇది సైబర్ వంచకుల పని అని తెలిసి సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. చదవండి: (Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం) లింక్ నొక్కి చూసినందుకు రూ.6.24 లక్షలు స్వాహా మొబైల్‌కు వచ్చిన ఆన్లైన్ లింక్‌పై క్లిక్ చేసి నగ్నవీడియో చూసి బ్లాక్‌మెయిల్‌కు గురైన వృద్దుడు రూ.6.24 లక్షలు పోగొట్టుకున్నాడు. బీటీఎం.లేఔట్లో ఉండే 75 ఏళ్ల వృద్ధుడు బాధితుడు. ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు వంచకులైన సౌరవ్, బల్జిత్ రై, రేష్మా అనే ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వృద్దుని మొబైల్ కు అక్టోబరులో గుర్తుతెలియని వ్యక్తి నుంచి లింక్ వచ్చింది. కుతూహలంతో లింక్‌పై క్లిక్‌చేసి యువతి వీడియోను కొద్దిసేపు వీక్షించాడు. ఈ తతంగాన్ని దుండగులు స్క్రీన్షాట్లు తీసుకున్నారు. తరువాత బాధితునికి ఫోన్ చేసి నువ్వు ఓ యువతితో అశ్లీలంగా ఉన్న మీ వీడియో మా వద్ద ఉందని బెదిరించారు. అతని నుంచి దశలవారీగా రూ.6.24 లక్షలను తమ అకౌంట్లకు బదిలీ చేయించుకున్నారు. డబ్బు కోసం మళ్లీ ఒత్తిడి చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల కోసం గాలింపు సాగుతోంది. -
వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట
న్యూఢిల్లీ: వ్యాపారవేత్తకు వలపు విసిరి బ్లాక్మెయిల్ చేసింది ఓ జంట. ప్రైవేటు ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తామని బెదిరించి రూ.80లక్షలు వసూలు చేసింది. ఇంకా డబ్బు కావాలని డిమాండ్ చేస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అధికారులు ఆ జంటపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. వివారాల్లోకి వెలితే.. గురుగ్రాం బాద్‌షాపుర్‌కు చెందిన వ్యాపారవేత్త ఓ అడ్వర్టైస్మెంట్ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఢిల్లీ షాలిమర్ బాగ్‌కు చెందిన నామ్రా ఖాదిర్ అనే మహిళను బిజినెస్ విషయాలు మాట్లాడేందుకు కొద్ది నెలల క్రితం ఓ హోటల్లో కలిశాడు. ఆమెతో పాటు విరాట్ అలియాస్ మనీశ్ బనీవాల్ కూడా ఉన్నాడు. పెళ్లి చేసుకుంటానని.. తన వ్యాపార పనుల కోసం నామ్రా ఖాదిర్‌కు రూ.2.50లక్షలు ఇచ్చాడు బాధితుడు. అయితే డబ్బు తీసుకున్నప్పటికీ ఆమె దానికి తగినట్లు పనిచేయలేదు. దీంతో ఆమెను అతడు ప్రశ్నించాడు. ఆ సమయంలోనే ఆమె అతడ్ని ఇష్టపడ్డానని, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ క్లోజ్ అయ్యారు. పెళ్లి ప్రపోజల్ తర్వాత నమ్రా ఖాదిర్‌తో వ్యాపారవేత్త చాలా రోజలు కలిసితిరిగాడు. ఇద్దరూ పలుమార్లు హోటల్లో గడిపారు. ఈ క్రమంలోనే వీరిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు విరాట్ ఫొటోలు, వీడియోలు తీశాడు. ఆ తర్వాత వాటిని లీక్ చేస్తామని, రేప్ కేసు పెడతామని బెదిరించి వ్యాపారవేత్త నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఇలా మొత్తం రూ.80లక్షలు కాజేశారు. అయినా ఇంకా బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక చివరకు పోలీస్ స్టేషన్ వెళ్లాడు ఆ బిజినెస్‌మేన్. ఖాదిర్, విరాట్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్టోబర్ 10న ఈ జంటకు నోటీసులు పంపారు. అయితే వాళ్లు బెయిల్ కోసం గురుగ్రామ్ కోర్టును ఆశ్రయించారు. కానీ న్యాయస్థానం నవంబర్ 18న వారి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో వాళ్లిద్దరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ జంటను అదుపులోకి తీసుకుంటామన్నారు. చదవండి: ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి.. -
Honey Trap: వలపు వలలో చిక్కిన సీఎం బొమ్మై పీఏ!
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో హనీట్రాప్ కలకలం రేగింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సిబ్బంది ఒకరు వలపు వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సీఎం బొమ్మై సంతకాలతో కూడిన కీలకమైన పత్రాలను అతను ఓ ముఠాకు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు అందిన ఫిర్యాదు వివరాలను పోలీస్ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి. సీఎం బసవరాజ బొమ్మై పీఏ(పర్సనల్ అసిస్టెంట్) హరీష్.. హనీట్రాప్‌కు గురయ్యాడు!. ఈ మేరకు విధానసౌధ పోలీస్ స్టేషన్లో జన్మభూమి ఫౌండేషన్ అధ్యక్షుడు నటరాజ్ శర్మ ఫిర్యాదు చేశారు. శాసన సభ నుంచే ఈ వలపు వల వ్యవహారం జరిగినట్లు ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు. విధానసౌధ డీ-గ్రూపు మహిళా ఉద్యోగి ద్వారా ఓ ముఠా ఈ హనీట్రాప్‌కు పాల్పడినట్లు సమాచారం. హరీష్‌ను ట్రాప్ చేసిన ఆమె.. అతనితో ఏకాంతంగా గడిపింది. ఆ వీడియోల ద్వారా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి.. హరీష్ నుంచి ప్రభుత్వానికి సంబంధించిన కీలక పత్రాలు ఆ ముఠా సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ పత్రాలు ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్లినట్లు ఫిర్యాదులో నటరాజ్ ప్రస్తావించారు. బెంగళూరు కనకపుర దగ్గర కోట్లు విలువ చేసే భూముల్ని సదరు మహిళా ఉద్యోగిణి పేరిట హరీష్ కొనుగోలు చేసినట్లు తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సీఎం పీఎం మాత్రమే కాదు.. చాలా మంది నేతలు, బ్యూరోక్రట్లపై కూడా హనీ ట్రాప్ జరిగిందని ఫిర్యాదులో నటరాజ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హరీష్‌ను పోలీసులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. హరీష్గానీ, సీఎం కార్యాలయంగానీ, రాజకీయ పార్టీలుగానీ ఈ హనీ ట్రాప్ వ్యవహారంపై ఇంకా స్పందించలేదు. -
‘డర్టీ పిక్చర్’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో మహిళలు, యువతులను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంతో ఏ సంబంధం లేని ఓ మహిళ ఫొటోను వైరల్ చేసిన విషయం బయటికి వచ్చింది. సదరు మహిళ దీనిపై బుధవారం ఎస్పీ రంజన్ రతన్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. తాను, తన కుటుంబం అంటే పడనివారు కావాలనే ఇలా సామాజిక మాధ్యమాల్లో ఫొటోను పోస్టు చేశారని వాపోయారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినవారిని శిక్షించాలని కోరారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కీలక వ్యక్తులను తప్పిస్తున్నారనే ఆరోపణలు మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఉదంతంలో ఇప్పటివరకు గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేశ్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డితోపాటు నిఖిల్, వినోద్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఓ పోలీస్ అధికారిపై బదిలీ వేటు వేశారు. అయితే ఈ వ్యవహారంలో ఓ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకులు, కౌన్సిలర్లు, ఓ ముఖ్య నేత అనుచరుడు ఉన్నారని.. వారిని తప్పిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కీలక వ్యక్తులను అరెస్టు చేయాలంటూ.. బుధవారం ప్రజా, విద్యార్థి సంఘాలు, బీజేపీ, సీపీఐ, సీపీఎం, వైఎస్సార్టీపీ, సీనియర్ సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో గద్వాలలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేయాలని, అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆందోళనకారులు కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ రంజన్ రతన్కుమార్లకు వినతిపత్రాలు అందజేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది. స్థానిక పోలీసులపై ఒత్తిళ్లు ఉన్నాయని, సిట్‌తో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో పట్టణంలో సిట్ అధికారులు రహస్య విచారణ చేపట్టారంటూ రోజంతా హైడ్రామా నడవడం గమనార్హం. ముఖ్య నేతకు ఫోన్.. సీరియస్ వార్నింగ్? మహిళలపై ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ ఘటన పరిణామాలపై ప్రధాన పార్టీకి చెందిన ముఖ్య నేతతో పార్టీ అధిష్టానం మాట్లాడినట్టు తెలిసింది. ముందుగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి నుంచి అసలు ఏం జరిగింది? ఇందులో ఎవరు ఉన్నారు? ఏం చేస్తున్నారనే వివరాలు తెలుసుకున్నట్టు సమాచారం. ఆ తర్వాతే గద్వాలకు చెందిన ముఖ్యనేతతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించొద్దని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించినట్టు సమాచారం. పోలీసుల విచారణకు ఎలాంటి అడ్డంకులు సృష్టించొద్దని సూచించినట్టు తెలిసింది. చదవండి: హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు -
జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి..
యశవంతపుర: హనీట్రాప్ దందాలు ఆగడం లేదు. తాజాగా కర్నాటకలో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇచ్చిన అప్పు చెల్లించమని అడిగినందుకు వృద్ధుడిని ట్రాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో దావణగెరె పట్టణం సరస్వతీ నగరకు చెందిన యశోధ (32)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. నగరంలోని శివకుమారస్వామి లేఔట్‌కు చెందిన చిదానందప్పకు సరస్వతి నగరకు చెందిన యశోధతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. చిదానందప్పను తరచూ కాఫీకి ఇంటికి పిలిచేది. ఈ క్రమంలో అతని వద్ద నుంచి ఆమె రూ. 86 వేలు అప్పుగా తీసుకుంది. రోజులు గడచినా అప్పు చెల్లించకపోవడంతో చిదానంద డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి... ఒక రోజు వాకింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న చిదానందప్పను యశోధ ఇంటిలోకి పిలిచి జ్యూస్ ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే అతను స్పృ హ తప్పాడు. ఆ తరువాత కొన్ని గంటల తరువాత లేచి చూస్తే అతని ఒంటి మీద దుస్తులు లేవు. ఆందోళన చెందిన చిదానందప్ప బట్టలు వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. రెండు రోజుల తరువాత యశోధ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. అతను లేదని చెప్పడంతో తన వద్ద అశ్లీల వీడియో ఉందని, రూ. 15 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించింది. ఆందోళన చెందిన చిదానందప్ప తన స్నేహితుల వద్ద గోడును వెళ్లబోసుకున్నాడు. అంతలోనే చిదానంద నగ్నంగా ఉన్న ఫొటోను వాట్సాప్‌లో పంపింది. ఈ విషయం ఆయన కొడుకు దృష్టికి రావడటంతో ఆయన దావణగెరె కేటీజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో యశోధను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
హనీట్రాప్ కేసులో సంచలనం.. ఒక్కొక్కటిగా వెలుగులోకి లీలలు
సాక్షి, గద్వాల: హనీట్రాప్ వ్యవహారం జోగుళాంబ గద్వాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏకంగా ఓ ఖాకీ పాత్రపై కూడా ఆరోపణలు వెల్లువెత్తడం జిల్లావ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రధాన సూత్రధారుల్లో ఓ యువ నేతతో పోలీసు అధికారికి స్నేహం ఉండటంతో.. సదరు నేతకు ఖరీదైన నజరానాలు ఇవ్వడం వంటి విషయాలు వెలుగు చూస్తుండటం కేసును మరో స్థాయికి తీసుకెళ్తుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన నియోజకవర్గ స్థాయి పోలీసు అధికారి, పశుసంవర్ధక శాఖలో పనిచేసిన జిల్లా స్థాయి అధికారి నెరపిన ‘లీలలు’ సైతం ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఇందులో బాధితులు ఎవరూ కూడా ముందుకు రాకపోవడం, మరోవైపు కేసులో పలుకుబడి గల నాయకుల నుంచి ఒత్తిళ్లు, పలు రకాల ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా అటు తిరిగి.. ఇటు తిరిగి తమ కొంపనే ముంచుతుందనే ఉద్దేశంతో పోలీసులు అత్యవసరంగా కేసు మూసేందుకు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన సూత్రధారులతో దోస్తానా.. హనీట్రాప్ వ్యవహారంలో ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన సూత్రధారులతో జిల్లాలో పనిచేస్తున్న ఓ ఖాకీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాల కారణంగా ఇద్దరి మధ్య పలు రకాల లావాదేవీలు కొనసాగినట్లు తెలిసింది. అలాగే ఇటీవల ప్రధాన సూత్రధారికి సంబంధించి వ్యక్తిగత వేడుకలో సదరు ఖాకీ అధికారి ఖరీదైన నజరానాను ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది. అయితే ప్రధాన సూత్రధారి అనుకోని విధంగా పంజరంలో చిక్కడం.. యువతులు, మహిళలతో సాగించిన వ్యవహారాలు వెలుగులోకి రావడంతో సదరు ఖాకీ ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే భయంతో సదరు అధికారి లోలోపల మదనపడుతున్నట్లు తెలిసింది. చదవండి: గద్వాలలో హనీట్రాప్ కలకలం!.. ఫోన్లో 150 మంది మహిళల ఫొటోలు వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్, వెనక నిందితుడు తిరుమలేష్ రాజకీయ నేతల ఒత్తిళ్లు ఈ హనీట్రాప్ వ్యవహారంలో బాధితులు ఎవరూ కూడా కేసు పెట్టేందుకు ముందుకు రాకపోవడం.. పలుకుబడి గల నేతల నుంచి ఒత్తిళ్లు రావడం.. మరోవైపు కొందరు ఖాకీల పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ తలనొప్పిని వదిలించుకునేందుకు పోలీసులు అనామకులపై కేసు నమోదు చేసి చేతులు దులిపేసుకునేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇద్దరిపై కేసు నమోదు కాగా ఒకరిని రిమాండుకు తరలించడం, మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు విలేకరులకు తెలిపారు. అలాగే ఇందులో ఏ రాజకీయ పారీ్టకి సంబంధించిన నేతలు లేరని చెప్పారు. కాగా.. అసలు సూత్రధారులను వదిలి అమాయకుడైన తమ కుమారుడిని (తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి)ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపండంపై తల్లిదండ్రులు పద్మ, నారాయణలు పట్టణ పోలీసుస్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పాత అధికారులు వెలుగులోకి ఇదిలా ఉంటే గతంలో జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పనిచేసిన ఓ ఖాకీ అధికారి, అదేవిధంగా పశుసంవర్ధక శాఖలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి అధికారి నెరపిన రాసలీలల వ్యవహారం కూడా గుప్పుమంది. సాధారణ ప్రజలు చేస్తే దండన విధించే పోలీసులు.. వారి శాఖలోనే పనిచేసే కొందరు ఖాకీలపై ఆరోపణలు వస్తే మాత్రం పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారనే వి మర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును పోలీసులు లోతుగా విచారణ జరిపి ఇందులో ప్రధాన సూత్రధారులను గుర్తించి కఠిన శిక్ష వేస్తేనే ఇలాంటి లతో సహా ఫిర్యాదు చేశారు. కఠిన చర్యలు.. మీరు చెబుతున్నట్లు ఈ వ్యవహారంలో పోలీసు పాత్ర ఉందనడం అవాస్తవం. మహిళల పట్ల జరిగే ఇలాంటి వ్యవహారాలు సహించేది లేదు. ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలుంటే పోలీసులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు. అదేవిధంగా ఆధారాలు లేని ప్రచారాలను కూడా మీరు నమ్మకుండా ఇలాంటి సున్నితమైన అంశంలో సమన్వయం పాటిస్తే బాగుంటుంది. ఈ కేసు విచారణ కొనసాగుతుంది. మీరు చెప్పినట్లు ఏదైనా ఆధారాలు లభిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – రంజన్ రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల -
నా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నావా?.. వీడియో బయటపెడతా
సాక్షి, బెంగళూరు(బనశంకరి): రాష్ట్రంలో హనీట్రాప్ దందాలు ఆగడం లేదు. హైకోర్టు ఉద్యోగికి వల వేసిన నగదు వసూలుకు యత్నించిన ముఠాను శనివారం కామాక్షీపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా సభ్యులు అనురాధ, కావ్య, సిద్దరాజులతో పాటు పది మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు.... హైకోర్టు ఉద్యోగి జైరామ్‌కు రెండేళ్ల క్రితం అనురాధ పరిచయమైంది. ఆరు నెలల క్రితం ఇంటిలో షార్ట్‌సర్క్యూట్‌తో వస్తువులు కాలిపోయాయని, డబ్బు అవసరం ఉందని జైరామ్ వద్ద అనురాధ రూ. 10 వేలు తీసుకుంది. అక్టోబర్ 10న జైరామ్‌కు డబ్బు తిరిగి చెల్లించింది. అనంతరం మళ్లి 25న రూ. 5 వేలు అప్పు అడిగింది. దీంతో జైరామ్ అదే రోజు నగదు ఇవ్వడానికి అనురాధ ఇంటికి వెళ్లాడు. అక్కడే జైరామ్ హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. వల వేసి.. డబ్బుల కోసం డిమాండ్ జైరామ్‌కు అనురాధ పరిచయమైన అనంతరం ఓ రోజు ఇంటికి రావాలని పిలిపించుకుంది. రూ. 5 వేల నగదుతో వచ్చిన జైరామ్ నగదు ఆమె చేతికి ఇచ్చాడు. అదే సమయంలో ఈ గ్యాంగ్ వీడియో చిత్రీకరించారు. అప్పటి వరకు చాటుగా ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి బెదిరింపులకు దిగారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నావా అంటూ ముఠాలోని ఓ వ్యక్తి బెదిరించాడు. ఇదే విషయాన్ని ఆ వ్యక్తి జైరామ్ భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. లేదంటే వీడియో బయట పెడతామని హెచ్చరించారు. దీంతో బాధితుడు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 10 మంది గ్యాంగ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు సిద్దరాజు దావణగెరెకు చెందిన వాడు కాగా నగరంలో రౌడీ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై రెండు దోపిడీలతో పాటు పలు కేసులు ఉన్నాయి. -
జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం..
-
గద్వాలలో హనీట్రాప్ కలకలం!.. ఫోన్లో 150 మంది మహిళల ఫొటోలు
సాక్షి, గద్వాల రూరల్: ప్రధాన నగరాలకే పరిమితమైన హనీట్రాప్ విష సంస్కృతి ఇప్పుడు గద్వాలకు పాకింది. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన యువనాయకులు ఉన్నారన్న విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు యువ నాయకుల మధ్య నెలకొన్న విభేదాలతో కొందరు మహిళలకు సంబంధించిన అశ్లీల ఫొటోలు, వీడియోలు వెలుగు చూసినట్లు సమాచారం. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడం తీవ్ర కలకలం రేపుతుంది. పోలీసుల అదుపులో ఇద్దరు.. ఈ ఘటనపై జిల్లా పోలీసు బాస్ తీవ్రంగా స్పందించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న యువ నాయకుల కదలికలపై రహస్యంగా నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే శుక్రవారం వెంకంపేట మార్గంలోని ఓ ఫంక్షన్‌హాల్ వద్ద ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట వీరిని రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి రహస్యంగా ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లో వంద నుంచి 150 మంది మహిళల ఫొటోలు, వివరాలు ఉన్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న ఇద్దరి నుంచి పూర్తి వివరాలను పోలీసులు తమదైన శైలిలో కూపీ లాగుతున్నారు. జిల్లా కేంద్రంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు గద్వాల పట్టణంలో ఏనోట విన్నా ఇదే విషయంపై చర్చ సాగుతుంది. విచారణ చేస్తున్నాం ఈ వ్యవహారం చాలా సున్నితమైన అంశం. లోతుగా విచారణ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి చట్టవిరుద్ధమైన వ్యవహారాలను సహించేది లేదు. ఇందులో ఎలాంటి పైరవీలకు తావు లేదు. బాధితులు ఎవరైనా ముందకు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసు నమోదు చేస్తాం. – రంజన్‌రతన్‌కుమార్, ఎస్పీ, జోగుళాంబ గద్వాల విభేదాలతోనే.. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన ముగ్గురు యువ నాయకులు కొంతకాలంగా కొందరు అమాయక మహిళలను లోబర్చుకుని వారితో వాట్సప్‌లో అశ్లీలంగా మాట్లాడడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. వీరంతా ఒకే గ్యాంగ్‌గా ఉంటూ లోబర్చుకున్న మహిళల అశ్లీల ఉన్న ఫొటోలు, వీడియోలను తమ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ ముగ్గురు కూడా సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ముగ్గురు నాయకుల్లో ఒకరికి సంబంధించిన బంధువు మహిళ అశ్లీల ఫొటో కనిపించింది. దీంతో ముగ్గురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకుంది. రెచ్చినపోయిన సదరు ముగ్గురు యువనాయకులు తమ వద్దనున్న మహిళల అశ్లీల ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త వెలుగు చూడడంతో పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో సదరు యువ నాయకులు నష్టనివారణ చర్యలకు దిగారు. తమకున్న పలుకుబడి నాయకుల శరణు కోరారు. విషయం పోలీసు కేసుల వరకు వెళ్లకుండా చూడాలంటూ పైరవీలు చేశారు. అయితే ఈ వ్యవహారం మహిళలకు సంబంధించి కావడంతో ఆ ప్రధాన నేత యువ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. -
బీజేపీ ఎమ్మెల్యేకు షాక్.. వాట్సాప్‌లో యువతి న్యూడ్ వీడియో కాల్చేసి..
ఇటీవలి కాలంలో హనీట్రాప్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రాజకీయనేతలు, ప్రముఖులే టార్గెట్‌గా అందమైన యువతులు హనీట్రాప్‌నకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యేకు భారీ షాక్ తగిలింది. ఓ యువతి వాట్సాప్ కాల్ చేసి న్యూడ్‌గా మాట్లాడటంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే వెంటనే కాల్ కట్ చేశాడు. వివరాల ప్రకారం.. కర్నాటకలోని చిత్రదుర్గ ఎమ్మెల్యే జి.హెచ్. తిప్పారెడ్డికి చేదుఅనుభవం ఎదురైంది. ఓ అపరిచిత యువతి తిప్పారెడ్డికి వాట్సాప్ కాల్ చేసి హనీట్రాప్ చేసేందుకు ప్రయత్నించింది. సదరు యువతి తనకు అక్టోబర్ 31వ తేదీన తనకు వీడియో కాల్ చేసిందన్నారు. అయితే, నియోజకవర్గానికి చెందిన వ్యక్తులెవరైనా తనకు కాల్ చేస్తున్నారని భావించిన ఆయన.. కాల్ లిఫ్ట్ చేయడంతో యువతి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. ఈ క్రమంలో తన దుస్తులు విప్పేసి న్యూడ్‌గా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు తెలిపారు. తాను వెంటనే కాల్ కట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా, మరికొద్ది క్షణాలు తర్వాత.. ఆమె మళ్లీ కాల్ చేసిందన్నారు. దీంతో, తన భార్యను కాల్ లిఫ్ట్ చేయమని చెప్పాను. అనంతరం, తన భార్య.. ఆ నంబర్‌ను బ్లాస్ చేసినట్టు చెప్పుకొచ్చారు. అనంతరం, ఈ విషయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. Karnataka #BJP Mla #GHThippareddy files complaint alleging there was an attempt to #HoneyTrap him. In his complaint, he alleges, he received a video call on WhatsApp, and some lady, on the other end stripped herself in the video. MLA has filed complaint with #Chitradurga police. pic.twitter.com/bcdcdyqq0k — Hate Detector 🔍 (@HateDetectors) November 2, 2022 -
పోలీసు కస్టడీకి హనీట్రాప్ ముఠా.. మరింత మంది స్వాములకు యువతి వల?
సాక్షి, బెంగళూరు: రామనగర జిల్లా మాగడిలోని బండేమఠం బసవలింగ స్వామీజీ ఆత్మహత్య కేసు మొదటి నిందితునిగా ఉన్న కణ్ణూరు మఠాధిపతి మృత్యుంజయస్వామీజీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయి. హనీట్రాప్ ద్వారా బసవలింగ స్వామీజీ యువతితో ఉన్న వీడియోలను సేకరించి భారీగా డబ్బు డిమాండ్ చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ వద్ద గల వీడియో విడుదలచేస్తామని బెదిరింపులకు దిగాడు. ఈ ఉదంతంతో బసవలింగస్వామీజీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృత్యుంజయ స్వామి సొంత మఠంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసు కస్టడీకి తరలింపు బసవలింగస్వామీజీ ఆత్మహత్యకేసులో అరెస్టైన మృత్యుంజయస్వామీజీ, నీలాంబిక, మహదేవయ్య ను రామనగర పోలీసులు సోమవారం మాగడి ఏఎంఎప్సీ కోర్టులో హాజరుపరిచి మరింత దర్యాప్తు కోసం తమ కస్టడీకి ఇవ్వాలని మనవిచేశారు. న్యాయమూర్తి ధనలక్ష్మీ నవంబరు 4వ తేదీ వరకు వారిని పోలీసు కస్టడీకి ఆదేశించారు. కేసు గురించి డీజీపీ ప్రవీణ్‌సూద్ మాట్లాడుతూ బసవలింగస్వామీజీ ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇందులో రహస్యం ఏమీ లేదని అన్నారు. మరింత మంది స్వాములకు యువతి వల? మృత్యుంజయ స్వామి, యువతి నీలాంబిక ఇతరులు కలిసి మరింతమంది స్వామీజీలను ఇదే విధంగా హనీట్రాప్ చేసినట్లు తెలిసింది. నీలాంబిక దొడ్డబళ్లాపురలో పేరుపొందిన కాలేజీలో ఇంజనీరింగ్ రెండో ఏడాది విద్యార్థిని. చిన్న వయసు నుంచి ఓ మఠానికి వెళ్తూ పలువురు స్వామీజీలను పరిచయం చేసుకుంది. నీలాంబిక మామ సిద్దగంగ మఠంలో పనిచేస్తున్నాడు. తనతో స్నేహంగా మెలిగిన మరింత మంది స్వామీజీల వీడియోలను ఆమె కణ్ణూరు మృత్యుంజయస్వామికి ఇచ్చి ఉండవచ్చునని అనుమానాలున్నాయి. తద్వారా ఈ బృందం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉండవచ్చుననే కోణంలోనూ విచారణ సాగుతోంది. -
హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు
వారం రోజుల కిందట బండెమఠం బసవలింగ స్వామి ఆత్మహత్య కేసులో తొలిరోజే వ్యక్తమైన అనుమానాలు నిజమయ్యాయి. మరో మఠం స్వామి కుట్ర పన్ని ఆయనను హనీ ట్రాప్‌లో ఇరికించడం, ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించడం బండెమఠం స్వామి ఆత్మహత్యకు కారణమని తేలింది. ఓ యువతిని మఠానికి పంపి స్వామీజీని లోబర్చుకుని వీడియోలు తీశారు. పరువు పోవడం కంటే ప్రాణం పోతే మేలనుకునేలా ఆయనను ఒత్తిడికి గురిచేశారు. సూత్రధారి ఆయనకు బంధువు కావడం గమనార్హం. మఠాల మధ్య సాగుతున్న చీకటి పోరాటాల్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది. సాక్షి, బెంగళూరు: రామనగర జిల్లా మాగడి తాలూకా కంచుగల్ బండేమఠ బసవలింగస్వామి (45) ఆత్మహత్య కేసులో అదే జిల్లా కణ్ణూరు మఠం మృత్యుంజయ శ్రీ, స్థానిక నేత మహదేవయ్య, ఇంజనీరింగ్ విద్యార్థిని నీలాంబికను ఆదివారం రామనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. బసవలింగ స్వామి రాసిన డెత్‌నోట్‌లో మూడు పేజీలలో పూర్తి సమాచారం తెలియపరిచారు. 21 ఏళ్ల నీలాంబికను బండేమఠానికి పంపి కణ్ణూరు మృత్యుంజయ స్వామి హనీట్రాప్‌కు పాల్పడ్డారని డెత్‌నోట్‌లో ప్రస్తావించారు. కణ్ణూరు స్వామి, ఇతర ఏడెనిమిదిమందితో వేధింపులను ఎదుర్కొన్నానని, మఠం గురించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన చావుకు ఆ యువతి కారణమని రాసిపెట్టారు. రాష్ట్రంలో సంచలనం బండేమఠ బసవలింగస్వామీజీ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో నిందితుల కోసం వేట మొదలైంది. మృతుడు వివరంగా డెత్‌నోట్ రాయడంతో పోలీసుల పని సులువైంది. హనీ ట్రాప్ జరిగినట్లు తొలిరోజే వెలుగుచూసింది. నిందితుల అరెస్టులతో ఇది ఖరారైంది. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని రామనగర ఎస్పీ సంతోష్‌బాబు తెలిపారు. నగ్న వీడియో వైరల్ బండేమఠం స్వామి ప్రైవేటు వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో మొదటి రెండు వీడియోల్లో అర్దనగ్నంగా ఉన్న ఆయన ఆ తరువాత పూర్తి నగ్నంగా ఉన్నారు. కానీ వీడియో కాల్ చేసిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ఆమె వీడియో కాల్‌ను రికార్డ్ చేసుకుని ఆడియోను మ్యూట్ చేసింది. 8 మంది తీవ్ర విచారణ ఈ కేసులో 8 మందిని పోలీసులు విచారణ చేపట్టారు. స్వామీజీ యువతి గురించి పదేపదే లేఖలో పేర్కొన్నారు. మూడో వీడియో కూడా శనివారం లీక్ అయింది. మరో మొబైల్లో దృశ్యాలను చూపుతూ ముద్దు పెట్టుకుందామా అని మహిళను కోరే దృశ్యాలు ఉన్నాయి. దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశముంది. పావుగా బెంగళూరు విద్యార్థిని ఈ కేసులో రామనగర పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా బెంగళూరుకు చెందిన నీలాంబికను అదుపులోకి తీసుకున్నారు. కణ్ణూరు మృత్యుంజయస్వామీమి, బండెమఠం బసవలింగస్వామీజీ బంధువులని తెలిసింది. బండెమఠం పీఠం కోసం కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మృత్యుంజయ స్వామిని రామనగర పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. ఇతనితో 8 మంది చేతులు కలిపినట్లు తెలిసింది. అపారమైన సంపద ఉన్న బండె మఠాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి యువతి ద్వారా పథకం నడిపించారు. బండెమఠ పాఠశాలలలో పనిచేసే పంకజ అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వలపు వలలో చిక్కి.. వేధింపులు భరించలేకే!
రామనగర(కర్ణాటక): జిల్లాలోని లింగాయత్ మఠాధిపతి ఆత్మహత్య ఉదంతంలో విస్మయానికి గురి చేసే కోణం ఒకటి వెలుగు చూసింది. హనీట్రాప్‌లో చిక్కుకుని ఆ బ్లాక్‌మెయిలింగ్‌ను భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. రామనగర జిల్లా కంచుగల్ బండ్ మఠానికి చెందిన బసవలింగ స్వామిజీ(45).. తన పూజా మందిరంలో కిటికీ గ్రిల్‌కు ఉరేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తనను పీఠాధిపతిగా తొలగించే యత్నాలు జరుగుతున్నాయని, ఆ వేధింపులను తట్టుకోలేకే తాను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో ఆయన పేర్కొన్నారు. ఈ నోట్ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసుపై ఓ అంచనాకి వచ్చారు. అయితే.. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు.. ఇది హనీట్రాప్ కోణంతో ముడిపడి ఉందని గుర్తించారు. ఓ మహిళ సాయంతో ఆయన్ని అసభ్య కోణంలో చిత్రీకరించి.. ఆ వీడియోల ద్వారా ఆయనపై వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. వీడియోలో ఉన్న మహిళ ఎవరో తెలియదు.. కానీ, ఆమె వల్లే ఇదంతా అంటూ ఆయన లేఖలో రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ మహిళతో ఆయన అభ్యంతరకర రీతిలో వీడియో కాల్ మాట్లాడినట్లు.. అందుకు సంబంధించిన మొత్తం నాలుగు వీడియోలను పోలీసులు గుర్తించారు. మహిళ తన ఫోన్లోని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆ వీడియోలను రికార్డ్ చేసినట్లు ఉంది. ఆ మహిళ ఎవరు? ఆ వీడియోల ద్వారా ఆయన్ని స్థానం నుంచి తప్పించాలనుకున్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక కన్నడనాట మఠాలపై, మఠాధిపతులపై రాజకీయ ప్రభావం ఉండడంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు ముమ్మరం చేస్తామని వెల్లడించారు. నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కంచుగల్ బండ్ మఠానికి బసవలింగ స్వామిజీ.. తన 20వ ఏట(1997లో) మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ మధ్యే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి కూడా. -
అర్చనా నాగ్ వెర్షన్ డర్టీ పిక్చర్ ఇది
భువనేశ్వర్: అర్చనా నాగ్.. ఒడిషాలో కలకలం రేపిన పేరు. వీవీఐపీలకు వలపు వల విసిరి ముగ్గులోకి దించి.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌తో కోట్లు దన్నుకున్న వగలాడి. ఓ నిర్మాత ఫిర్యాదుతో కదిలిన ఈ తేనెతుట్టు(హనీట్రాప్) ఒడిషాలో రాజకీయ ప్రముఖులకు మాత్రమే కాదు.. బెంగాల్‌కు చెందిన సెలబ్రిటీలకు సైతం వణుకు పుట్టిస్తోంది. కలహంది జిల్లా ఒకప్పుడు ఆకలి కేకలతో అల్లలాడిపోయిన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా నాగ్.. కట్ చేస్తే కోట్లు విలువ చేసే బ్యాంక్ బ్యాలెన్స్‌తో, ఇంటి నిండా విదేశాల నుంచి వచ్చిన ఫర్నీచర్‌తో, లగ్జరీ కార్లతో, హైబ్రీడ్ కుక్కలు, ఓ తెల్ల గుర్రం పెంచుకుంటూ విలాసవంతమైన జీవితం గడపాలనుకుంది. అందుకు తగ్గట్లే 26 ఏళ్ల అర్చన పెద్ద పెద్ద స్కెచ్‌లే వేసింది. ప్రముఖులను హనీట్రాప్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకుంది. ► లంజిగర్‌లో ఓ పేద కుటుంబంలో పుట్టిన అర్చనా.. తల్లి వృత్తిరిత్యా కేసింగలో పెరిగింది. ఆపై 2015లో భువనేశ్వర్‌లో అడుగుపెట్టింది. తొలుత ఓ ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలో పని చేసి.. ఆపై ఓ బ్యూటీపార్లర్‌లో పనికి కుదిరింది. అక్కడే బాలాసోర్ జిల్లాకు చెందిన జగబంధు చంద్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరూ 2018లో వివాహం చేసుకున్నారు. అక్కడి నుంచి ఈ భార్యాభర్తల మోసాలు మొదలయ్యాయి. బ్యూటీపార్లర్‌లో పని చేసే టైంలోనే సెక్స్‌రాకెట్ నడిపినట్లు ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి. ► జగబంధు ఓ కార్ల షోరూం తెరిచి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతరులతో పరిచయం పెంచుకున్నాడు. వాళ్లతో ఆ భార్యాభర్తలు ఫొటోలు కూడా దిగారు. ఒక అర్చన వీవీఐపీలతో పరిచయం పెంచుకుని.. వాళ్లకు అమ్మాయిలను సప్లై చేయడం ప్రారంభించింది. ఆ సమయంలోనే వాళ్ల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు తీసి.. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని పోలీసులు వెల్లడించారు. ► అర్చనా బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. 2018 నుంచి 2022 మధ్య.. కేవలం నాలుగేళ్లలో అర్చనా-జగబంధుల ఆసక్తి రూ.30 కోట్లకు చేరుకుందని చెప్తున్నారు. ఆమె ఏయే విలాసాలు కోరుకుందో.. అవన్నీ నెరవేర్చుకుందామె. అంటే.. ఆ భార్యభర్తల బ్లాక్‌మెయిలింగ్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. చివరకు ఓ నిర్మాతను మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో.. ఆయన నాయపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 6న అర్చనా అరెస్ట్ కాగా.. అప్పటి నుంచి రోజుకో రోజుకో సంచలనం బయటపడుతూనే వస్తోంది. జగబంధు డ్రగ్స్ కార్యకలాపాలు సైతం వెలగపెట్టేవాడని తేలింది. ఇక ఈ వ్యవహారంలో ఆర్థిక దర్యాప్తు విభాగాలను సైతం దర్యాప్తు చేపట్టాలని ఒడిషా పోలీసులు కోరుతున్నారు. ► ఇక ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే అర్చనపై ఫిర్యాదుకు ముందుకు వచ్చారని, మరికొందరు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ కోరుతున్నారు. మరోవైపు ఒడియా ఫిల్మ్ మేకర్ శ్రీధర్ మార్థా.. అర్చనా చేసిన డర్టీ పనుల ఆధారంగా ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు కూడా. సెక్స్, డబ్బు, మోసంతో పాటు అర్చనా నాగ్ వ్యవహారంలో ఇప్పుడు రాజకీయమూ కీలకంగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ వ్యవహారంలో అధికార బీజేడీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఉన్నారని ఆరోపిస్తోంది. ఒకవేళ అదే గనుక బయటపడితే 22 ఏళ్ల నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పతనం కాకతప్పదని అంటోంది. మరోవైపు బీజేపీ కూడా బీజేడీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు అర్చనా వలలో ఉన్నట్లు ఆరోపిస్తోంది. బీజేడీ మాత్రం ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్‌లకు సూచిస్తోంది. సుమారు 25 మంది రాజకీయ ప్రముఖులు ఆమె ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ప్రేమను కాదందనే రైలు కిందకు తోసేశాడు -
హాయ్ అంటూ కవ్విస్తుంది.. ఇంటికి పిలిచి క్లోజ్‌గా ఉంటుంది.. ఆ తర్వాత..
ఆమె తన అందంతో రంగంలోకి దిగి.. ప్రముఖులను ముగ్గులోకి దింపుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయం పెంచుకుని వారింతో సన్నిహితంగా మెదులుతుంది. ఈ క్రమంలో వారితో తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేస్తూ హానీట్రాప్ చేస్తుంది. ఇలా డబ్బులు వసూలు చేస్తున్న అర్చనా నాగ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కాగా, విచారణలో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతురాలు అర్చనకు భువనేశ్వర్‌లో విశాలమైన భవనం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, అర్చన.. ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా ప్రముఖులు, సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుంటుంది. అనంతరం.. మాటలు కలిపి వారిని ముగ్గులోకి దింపుతుంది. పరిచయం అనంతరం.. వారిని తన నివాసానికి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీసేది. అనంతరం, వారికి ఈ ఫొటోలు, వీడియోలను పంపించి డబ్బులు వసూలు చేసేది. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు గురిచేసేది. ఇక, కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆమెకు ఎంతో ఖరీదు చేసే బీఎండబ్ల్యూ, ఫోర్డు తదితర కంపెనీల కార్లు, ఫార్మ్ హౌస్ కూడా ఉన్నట్టు గుర్తించారు. కాగా, అర్చనను అరెస్ట్ చేసిన అనంతరం.. పోలీసులు ఆమె కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు. మరోవైపు.. ఆమె బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను సైతం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ని కోరినట్టు డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు. #ବ୍ୟକ୍ତିଗତ_ଫଟୋ_ରଖି_ଲୋକଙ୍କୁ_ବ୍ଲାକମେଲ_କରୁଥିଲା_ଅର୍ଚ୍ଚନା ଅର୍ଚ୍ଚନା ନାଗ୍ ମାମଲାରେ କ’ଣ ପ୍ରତିକ୍ରିୟା ରଖୁଛନ୍ତି ଡିସିପି ଶୁଣନ୍ତୁ...#Odisha #Bhubaneswar #ArchanaNag #DCP pic.twitter.com/KkZxOodmN0 — NandighoshaTV (@NandighoshaTV) October 9, 2022 -
న్యూడ్ కాల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేస్తున్న యువతి
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతి న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేసే ఓ ఉద్యోగి గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ సమీపంలోని హాస్టల్లో నివాసముంటున్నాడు. రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం అయింది. ఈ క్రమంలో వీడియో కాల్ మాట్లాడిన యువతి కాల్‌ను రికార్డు చేసి రూ.10వేలు పంపాలని లేకపోతే దాన్ని న్యూడ్ వీడియోగా మార్చి సోషల్ మీడియాలో పెట్టడమే కాకుండా ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తానని డిమాండ్ చేసిందని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. డబ్బులు పంపితే వీడియోకాల్‌ను డిలీట్ చేస్తానని స్పష్టం చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆ యువతి న్యూడ్ కాల్స్ పేరుతో యువకులను ట్రాప్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: ‘నా డెత్ సర్టిఫికెట్ పొగొట్టుకున్నాను’.. వైరలవుతోన్న పేపర్ యాడ్ -
అర్ధరాత్రి వాట్సాప్‌లో అశ్లీలంగా యువతి వీడియో కాల్..
కర్నూలు: పట్టణంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. తాజాగా ఓ యువకుడికి శనివారం అర్ధరాత్రి కొత్త నంబర్ నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్ వచ్చింది. వీడియోలో ఉన్న యువతి హిందీలో మాట్లాడుతూ అశ్లీలంగా కనిపించటంతో ఆ యువకుడు కాల్‌ను కట్ చేశారు. వెంటనే వాట్సప్‌లో మేసేజ్ వచ్చింది. యువకుడి ఫొటోనుమార్ఫింగ్ చేసి అశ్లీల వీడియో పెట్టడం చూసి భయపడ్డాడు.తన అకౌంట్‌కు రూ.8,100 వెంటనే పంపాలని, లేకపోతే ఆ వీడియోను ఫ్రెండ్స్‌కు పంపుతానని, యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తానని హిందీలో బెదిరించింది. తనకు ఒక రోజు సమయం ఇవ్వాలని యువకుడు కోరినా వినిపించుకోలేదు. ఆ యువకుడు సెల్ స్విచాఫ్ చేసుకోవడంతో అతని స్నేహితుడికి వీడియో పంపారు. వీడియో చూసిన స్నేహితుడు ఆ యువకుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో భయపడి ఫేస్‌బుక్‌ను డెలీట్ చేసుకున్నారు. అనంతరం బాధిత యువకుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై టౌన్ సీఐ మదుసుధన్రావును వివరణ కోరగా కేసు విచారిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలోనే తేరుబజార్‌కు చెందిన ఓ యువకుడు హనీట్రాప్ బారిన పడి కొంత డబ్బు ఫోన్‌పే చేసినట్లు, అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఎదురుతిరిగి ఏం చేస్తారో చేసుకోండి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అప్పటి నుంచి మెసేజ్‌లు ఆగిపోయినట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలో హానీ ట్రాప్ బాధితులు చాలా మంది ఉన్నా భయంతో ఎవరూ ముందుకు రావటం లేదు. -
నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్
మండ్య: మండ్యకు చెందిన బంగారం వ్యాపారి హనీట్రాప్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గతనెల ఓ లాడ్జీలో యువతితో ఉన్న జగన్నాథశెట్టిని ఇద్దరు యువకులు, ఓ మహిళ లాడ్జికి వచ్చి బెదిరించారు. ఆ సమయంలో జగన్నాథ శెట్టి తాను ఓ కళాశాల ప్రిన్సిపల్ అని చెప్పుకుని ట్యూషన్ కోసం యవతిని పిలుచుకుని వచ్చానని వారికి చెప్పాడు. ఆయన మాటలను వారు విశ్వసించకపోవడంతో పాటు తీవ్రంగా కొట్టారు. కొట్టొద్దని వేడుకున్నా వదలలేదు. తాజాగా ఈ వీడియో మొత్తం ఇప్పుడు వైరల్‌గా మారింది. వైరల్‌గా జగన్నాథశెట్టి ఆడియో.. మైసూరులో ఓ లాడ్జిలో రెండు రోజులు ఉందామని జగన్నాథశెట్టి ఓ యువతికి ఫోన్ చేశాడు. సదరు యువతి పుస్తకాలు ఏమైనా తీసుకురావాలా అన్ని ప్రశ్నిస్తే నీకు ఏ పుస్తకం కావాలో నేనే తీసుకువస్తానని ఆ ఆడియో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే జగన్నాథ శెట్టి మండ్య బస్టాండ్‌లో మంగళూరు వెళ్లడానికి వేచి ఉండగా ముగ్గురు వ్యక్తులు మైసూరుకు డ్రాప్ ఇస్తామని చెప్పి ఓ వాహనంలో ఎక్కించుకుని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిని గదిలోకి పంపించి హనీట్రాప్‌నకు పాల్పడ్డారని, ఆ ముఠా డబ్బులు డిమాండ్ చేశారని జగన్నాథశెట్టి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..) అయితే తాజాగా జగన్నాథశెట్టి సదరు యువతితో మాట్లాడిన ఆడియో, ఆయనపై ముఠా దాడిచేసే వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. నిజంగా హనీట్రాప్ జరిగిందా లేదా, ఇది సల్మా ఆమె గ్యాంగ్ డబ్బులు వసూలు చేసుకుని ఈ వీడియో వైరల్ చేశారా అనేది ఇప్పుడు చర్చనీయంశమైంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు. -
స్వీట్‌గా మాట్లాడి క్లోజ్ అవుతారు.. కలవాలని ఉందని చెప్పి..
కృష్ణరాజపురం: ప్రభుత్వ టెండర్ పేరిట మహిళా గ్యాంగ్ ఒకటి నగరంలోని పారిశ్రామికవేత్త కుమారుడిని కిడ్నాప్ చేసి డబ్బులను దోచుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు.. కర్నాటకకు చెందిన రవి అనే పారిశ్రామికవేత్త కుమారుడు సూరజ్. వీరు బ్యాటరాయనపుర ప్రాంతంలో రవి ఇండ్రస్టియల్ సప్లయ్ కంపెనీ నిర్వహిస్తున్నారు. టెండర్ ఇప్పిస్తానని.. సూరజ్‌కు ప్రభుత్వ పనుల టెండర్ ఇప్పిస్తానని పుష్పలత అనే మహిళ నాలుగు సార్లు కలిసింది. శ్రీ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్టు అధ్యక్షురాలిగా పరిచయం చేసుకున్న పుష్పలత పలుమార్లు సూరజ్‌ను హనీట్రాప్ చేయాలని చూసింది. సంతోష్ అనే వ్యక్తిని సూరజ్‌కు పరిచయం చేసి ఇతడు ఐఏఎస్ అధికారి పీఏ అని, టెండర్ ఇప్పిస్తాడని నమ్మబలికింది. ఆ తర్వాత మరో ఇద్దరిని పరిచయం చేసింది. అపహరించి రూ.4 కోట్లు డిమాండ్ సూరజ్ నుంచి ఎలాగైనా డబ్బు వసూలు చేయాలని మూడురోజుల క్రితం అతడిని కిడ్నాప్ చేశారు. రూ. 4 కోట్లు ఇవ్వాలని లేదంటే నీపై అత్యాచారం కేసు పెడతామని పుష్ప, సంతోష్, అయ్యప్ప అలియాస్ అర్జున్, రాకేశ్‌లు పిస్టల్ చూపి బ్లాక్మెయిల్ చేశారు. అంత డబ్బులు లేవని, తనను వదిలిపెట్టాలని సూరజ్ బతిమాలుకున్నాడు. అయినా నిందితులు వినకపోవడంతో ఆ తర్వాత తన స్నేహితుడు గురుమూర్తికి కాల్ చేసి రూ.25 లక్షల నగదును అందజేయగా పుష్పలత వదిలిపెట్టింది. సూరజ్ బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేయగా బుధవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: మేఘనా సర్జా రెండో పెళ్లి? ఆమె ఏమందంటే? -
నగల వ్యాపారికి హనీ ట్రాప్.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..
సాక్షి, మండ్య (బెంగళూరు): కొన్నాళ్లుగా నిలిచిపోయిన హనీట్రాప్ దందా మళ్లీ మొదలైనట్లు కనిపిస్తోంది. మండ్యలో ఒక నగల వ్యాపారిపై వలపు వల విసిరి భారీగా కొల్లగొట్టిన వైనం వెలుగుచూసింది. మండ్య మహావీర్ సర్కిల్లో ఉన్న శ్రీనిధి నగల షాపు యజమాని ఎస్.జగన్నాథ్ శెట్టి హనీ ట్రాప్‌కు గురై రూ. 48 లక్షలు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బస్టాండులో ఉండగా కారులో పికప్ వివరాలు... ఈ ఏడాది ఫిబ్రవరి నెల 22వ తేదీ రాత్రి సుమారు 8 గంటలకు పని మీద మంగళూరుకు వెళ్లాలని మండ్య బస్టాండుకు వచ్చాడు. ఇంతలో ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది, అందులోనివారు మీరు ఎక్కడ వెళుతున్నారు అని అడిగారు. మేము మైసూరు వరకు డ్రాప్ చేస్తామని ఆయనను ఎక్కించుకున్నారు. మా వద్ద కొన్ని బంగారు బిస్కెట్లు ఉన్నాయి, వాటి విలువ చెప్పాలని ఆయన వద్దు వద్దంటున్నా మైసూరులోని ఒక హోటల్‌కు తీసుకెళ్లారు. అందులో నిందితులు సల్మా బాను, జయంత్ ఉన్నారు, మరో యువతి కూడా గదిలోకి వచ్చింది. కెమెరాతో అంతా వీడియో తీసి, మా చెల్లెళ్లతో నీకేం పని అని జయంత్ ఆ వ్యాపారిని బెదిరించాడు. అతన్ని కొట్టి రూ. 4 కోట్లు ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. దీంతో దిక్కుతోచని బాధితుడు ఒక ఎల్ఐసి ఉద్యోగి నుంచి, మరో జువెలరీ షాప్ యజమాని నుంచి మొత్తం రూ.48 లక్షలు వారికి ఇప్పించాడు. అయితే మరింత డబ్బు తేవాలని దుండగులు పీడిస్తుండడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (అప్పు తీర్చమన్నందుకు హత్య, ఇద్దరికి జీవితఖైదు) -
హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..
సాక్షిప్రతినిధి కర్నూలు: జ్యోతిర్మయి(పేరుమార్చాం) పెళ్లికాని యువతి. ఇంటర్మీడియట్ చదివింది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎఫ్‌ఎన్‌ఓగా చేరింది. కొద్దిరోజులు పనిచేసి తర్వాత మానేసింది. అక్కడే రేడియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఓర చూపులు..కొంటె నవ్వులు...కొన్ని రోజులు నడిచింది. మాటల్లో ప్రేమ చూపింది. ఇద్దరూ వీడియోకాల్ వరకూ వచ్చారు. జ్యోతిని నమ్మిన ఆ వ్యక్తి వాట్సాప్ చాటింగ్‌లతో పాటు వీడియోకాల్స్ తరుచూ మాట్లాడేవాడు. చాటింగ్, వీడియోకాల్స్‌ను జ్యోతి రికార్డ్ చేసింది. చదవండి: ప్రేమించి పెళ్లాడి.. వదిలేశాడు ఈ క్రమంలో అతని నుంచి జ్యోతి రూ.10వేలు అప్పు తీసుకుంది. కొద్దిరోజుల తర్వాత అప్పు తిరిగి అతను అడిగాడు. వెంటనే జ్యోతి అసలు నిజస్వరూపం బయటకు వచ్చింది. వీడియోకాల్‌ను అతని వాట్సాప్‌కు పంపింది. డబ్బులు డిమాండ్ చేస్తే వీడియోలు మీ స్నేహితులకు, ఆస్పత్రి సిబ్బందికి పంపిస్తానని బెదిరించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేసేది లేక నిమ్మకుండిపోయాడు. అంతటితో ఆగలేదు. మరో రూ.20వేలు అడిగింది. దీంతో అతను ఇవ్వలేను అనేసరికి వాట్సాప్ చాటింగ్‌లు, మరిన్ని వీడియోకాల్స్ రికార్డింగ్స్ స్క్రీన్‌షాట్స్ పంపి బ్లాక్మెయిల్ చేసింది. భయంతో రూ.20వేలు ఇచ్చాడు. తిరిగి మరోసారి మరికొంత డబ్బులు అడిగింది. ఈ దఫా ఇవ్వలేనని అతను వాదనకు దిగారు. దీంతో జ్యోతి నేరుగా ఆస్పత్రికి వెళ్లి బ్లాక్‌మెయిల్‌తో పాటు గొడవకు దిగింది. ఈ గొడవలో అతని సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లిపోయింది. దీంతో చేసేది లేక అతను నేరుగా త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారి జ్యోతి గురించి ఆరా తీశారు. 2021లో త్రీటౌన్ పోలీసుస్టేషన్లోనే జ్యోతి ఒక కేసు పెట్టింది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆపై లోక్ అదాలత్‌లో కేసు కొట్టేశారు. ఈ కేసు సారాంశం పైన ఆస్పత్రిలో జరిగిన తంతే!! అలాగే ముచ్చుమర్రి పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి లైంగికంగా వేధించారని, పెళ్లి చేసుకోలేదని కేసు నమోదు చేశారు. ఇంట్లో గొడవ జరిగిందని, తనపై, తన తల్లిపై దాడి చేశారని, దుస్తులు చించి అత్యాచారం చేసేందుకు యత్నించారని మరో కేసు నమోదైంది. దీంతో పాటు పోలీసులకు మరో విషయం తెలిసింది. ఆ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ బంధువుపైనే యువతి ‘హనీట్రాప్’ చేసింది. కొంత డబ్బులు తీసుకుంది. ఇదే స్టేషన్లో గతంలో పంచాయితీ చేసి పంపారు. ఈ ఘటనలే కాదు...చాలామంది మగాళ్లతో పరిచయం పెంచుకోవడం, చాటింగ్, వీడియో కాల్స్ చేయడం, వాటి రికార్డింగ్స్‌తో బ్లాక్ మెయిల్ చేయడం జ్యోతికి అలవాటుగా మారింది. దీన్ని ఓ ఆదాయ మార్గంగా ఎంచుకుంది. పెళ్లికాని యువతి కావడంతో చాలామంది యువకులు ఆకర్షితులై పరిచయం పెంచుకుని బుట్టలో పడుతున్నారు. ఆపై విలవిల్లాడి చేసిన పొరపాటుకు ‘పెనాల్టీ’ చెల్లిస్తున్నారు. ఎట్టకేలకు ఆసుపత్రి ఘటనతో జ్యోతి గుట్టు రట్టయింది. పోలీసులు జ్యోతిపై కేసు నమోదు చేశారు. జ్యోతి ఘటన నేపథ్యంలో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
పాక్ మహిళల మాయలో ఆర్మీ జవాన్.. కీలక సమాచారం లీక్!
జైపూర్: పాకిస్థాన్ మహిళలు విసిరిన వలపు వల(హనీట్రాప్)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేశాడన్న ఆరోపణలతో ఓ ఆర్మీ ఉద్యోగి అరెస్టయ్యారు. సైన్యానికి సంబంధించిన సమాచారం లీక్ ఆరోపణలతో భారత ఆర్మీ జవాన్ శాంతిమే రాణా(24)ను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బగుండా జిల్లా కంచన్పుర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘సామాజిక మాధ్యమాల వేదికగా పాకిస్థాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషాలు రాణాకు పరిచయమయ్యారు. రాణా ఫోన్ నంబర్ తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఇద్దరు జవాన్‌తో మాట్లాడేవారు. వారిని పూర్తిగా నమ్మినట్లు గుర్తించిన తర్వాత నిఘా సమాచారం సేకరించటం మొదలు పెట్టారు. అందుకు బదులుగా రాణా ఖాతాలో కొంత డబ్బు సైతం జమ చేశారు.’ అని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం డీజీ ఉమేష్ మిశ్రా తెలిపారు. ఇలా ట్రాప్ చేశారు.. 2018, మార్చిలో ఆర్మీ చేరారు జవాన్ శాంతిమే రాణా. ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్లో విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యారు ఇద్దరు పాకిస్థానీ మహిళా ఏజెంట్లు. చాలా కాలంగా ఆ ఏజెంట్లతో వాట్సాప్ చాట్, వీడియా, ఆడియో సందేశాలతో మాట్లాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు చెందిన మహిళగా పరిచయం చేసుకుంది గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత. మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో పని చేస్తున్నట్లు తెలిపింది. మరో మహిళ నిషాగా పరిచయమైంది. ఆమె మిలిటరీ నర్సింగ్‌లో ఉన్నట్లు పేర్కొంది. కొద్ది రోజుల తర్వాత సైనిక సమాచారం, రహస్య పత్రాల కోసం రాణాను అడిగారు. వారిని నమ్మిన రాణా వాటిని అందించారు. జవాన్ కదలికలపై అనుమానంతో నిఘా వేసిన ఉన్నతాధికారులు.. పాకిస్థాన్ మహిళలతో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: రూ.3వేల కోట్లు విద్యుత్తు బిల్లు.. షాక్‌తో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి! -
కంచన్‌బాగ్ డీఆర్డీవో హనీ ట్రాప్ కేసులో కీలక ట్విస్ట్
-
హనీట్రాప్: భారత క్షిపణుల డేటా పాకిస్థాన్, చైనాలకు అందిందా?
సాక్షి, హైదరాబాద్: నటాషారావు అనే యువతి హనీట్రాప్‌లో చిక్కుకున్న హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధీనంలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ కాంప్లెక్స్ (ఆర్సీఐ) ఇంజనీర్ డి.మల్లికార్జున్‌రెడ్డి అత్యంత కీలకమైన క్షిపణుల డేటాను దేశం దాటించినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవే అభియోగాలపై మల్లికార్జున్‌రెడ్డిని రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గత నెల్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతని విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ నష్టనివారణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించినట్టు సమాచారం. జర్నలిస్టుగా పరిచయం చేసుకుని.. మల్లికార్జున్‌రెడ్డి ఆర్సీఐలోని అడ్వాన్స్డ్ నావెల్ సిస్టం ప్రోగ్రామ్‌లో 2018 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నాడు. ఇతడికి 2019లో ఫేస్బుక్ ద్వారా నటాషారావు అనే యువతితో పరిచయమైంది. హనీట్రాప్ కోసం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ షేర్నీలో ఈమె పని చేస్తున్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లండన్ కేంద్రంగా పని చేస్తున్న డిఫెన్స్ జర్నలిస్ట్‌గా మల్లికార్జున్‌తో పరిచయం పెంచుకున్న నటాషా తన పని ప్రారంభించింది. తాను రాస్తున్న ఆర్టికల్స్‌లో వినియోగించడానికంటూ ఇతడి నుంచి న్యూక్లియర్ డిటరెన్స్ ప్రోగ్రామ్ (అణ్వస్త్ర కార్యక్రమం)కు సంబంధించిన వివరాలను ముందు సేకరించింది. ఆపై ఇతడి బ్యాంకు ఖాతా నంబర్ తీసుకున్న నటాషా ఇందుకోసం కొంత మొత్తం చెల్లిస్తానంటూ నమ్మబలికినట్లు నిఘా వర్గాల విచారణలో తేలినట్లు తెలిసింది. వలపు వలతో ముగ్గులోకి దింపి.. ఓ దశలో మల్లికార్జున్‌రెడ్డి దగ్గర ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తెచ్చి, వాట్సాప్ ద్వారా గంటల తరబడి చాటింగ్ చేసి పూర్తిగా ముగ్గులోకి దింపింది. అత్యంత కీలక సమాచారం సంగ్రహించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అగ్ని క్షిపణులతో పాటు దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం తయారవుతున్న కె–సిరీస్ క్షిపణులకు సంబంధించిన సాంకేతిక అంశాలు కూడా ఇతడి నుంచి రాబట్టింది. నావికాదళం వినియోగించే అణు ఇంధన ఆధారిత జలాంతర్గామి అయిన అరిహంత్ కోసం డీఆర్డీఓ కె–సిరీస్ మిస్సైల్స్‌ను అభివృద్ధి చేస్తోంది. కాగా తాను పని చేస్తున్న మాసపత్రికలో ఆర్టికల్స్ రాయాల్సి ఉందని, దానికి నిర్ణీత గడువు ఉందని చెప్తూ మల్లికార్జున్ నుంచి కీలక సమాచారం సేకరించింది. 2020–21 మధ్య డీఆర్డీఓ, ఆర్సీఐల్లో అభివృద్ధి చేసిన మిస్సైల్స్‌కు సంబంధించిన వివరాలు రాబట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. న్యూక్లియర్ క్యాపబుల్ సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌గా (ఎస్ఎల్బీఎం) పిలిచే 3,500 కి.మీల రేంజ్‌తో కూడిన కె–4, 6 వేల కి.మీల రేంజ్ కె–5, 1,500 కి.మీల రేంజ్ కె–15 సిరీస్‌లతో పాటు సాగరిక సిరీస్‌కు చెందిన బీ–05 సిరీస్ మిస్సైల్ డేటా సైతం నటాషాకు చేరింది. సిమ్రన్, ఓమీషా పేర్లతో.. ఈమె ఫేస్బుక్లో సిమ్రన్ చోప్రా, ఓమీషా హడ్డీ పేర్లతోనూ ప్రొఫైల్స్ నిర్వహించింది. మల్లికార్జున్‌రెడ్డితో ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా చాటింగ్, కాల్స్, వాయిస్ మెసేజ్‌లు చేసిన నటాషా ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయలేదు. ఇతడు కోరినప్పటికీ ఆమె దాటవేస్తూ వచ్చింది. అనేక అంశాలను పరిశీలించిన నిఘా వర్గాలు ఈ సమాచారం పాక్ నుంచి చైనాకు చేరి ఉంటుందని అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్డీవో, ఆర్సీఐలో భద్రతా లోపాలపై నిఘా వర్గాలు ఇప్పటికే అధ్యయనం చేసినట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. -
హైదరాబాద్: డీఆర్డీఎల్ హానీ ట్రాప్.. సంచలన విషయాలు వెలుగులోకి!
సాక్షి, హైదరాబాద్: కంచన్‌బాగ్ డీఆర్డీఎల్ ఇంజినీర్ హానీ ట్రాప్ కేసులో కీలకాంశాలు వెలుగు చూస్తున్నాయి. డీఆర్డీఎల్లో క్వాలిటీ ఇంజినీర్(కాంట్రాక్ట్) మల్లికార్జునరెడ్డి అలియాస్ అర్జున్ బిట్టును ట్రాప్ చేశారు. ఇప్పటికే మల్లికార్జున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.. ఈ వ్యవహారంలో సంచలన విషయాలను సేకరించారు. ముఖ్యంగా.. కే-సిరీస్ మిస్సైల్‌కు చెందిన కీలక సమాచారాన్ని నటాషా పేరుతో ఉన్న ఫేస్బుక్ ప్రొఫైల్‌కు చేరవేశాడు మల్లికార్జున్‌రెడ్డి. ఇక యూకే అనుబంధ డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో నటాషా రావుగా ట్రాప్ చేసినట్లు తేలింది. రెండు సంవత్సరాలుగా నటాషాతో మల్లికార్జున్ సంభాషణ కొనసాగింది. 2019-2021 వరకు నటాషాకు మిస్సైల్ కాంపోనెంట్స్ కీలక డేటా చేరవేశాడు. ఈ క్రమంలో సబ్‌మెరైన్ నుంచి మిస్సైల్ లాంచ్ చేసే కీలక కే-సిరీస్ కోడ్‌ను పాకిస్తానీ స్పైకు చేరవేసినట్లు తేలింది. నటాషా రావు అలియాస్ సిమ్రాన్ చోప్రా అలియాస్ ఒమిషా అడ్డి పేరుతో ఫేస్బుక్ ప్రొఫైల్స్ మెయింటెన్ చేశాడు పాకిస్తానీ. ఇదిలా ఉంటే.. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మల్లికార్జున్‌కు మెసేలు. మల్లికార్జున్ ఫొటోలు, వీడియోలు అడిగినా నటాషా పంపలేదు. కేవలం చాటింగ్‌తోనే మల్లికార్జున్‌ను ట్రాప్ చేసింది నటాషా. మల్లికార్జున్ ల్యాప్‌టాప్, మొబైల్లో మిస్సైల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొబైల్లో ఇంగ్లీష్, హిందీలో ఉన్న నటాషా వాయిస్ రికార్డింగ్‌లు సైతం స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జునరెడ్డిని కస్టడీకి తీసుకోవాలనే యోచనలో ఉన్నారు పోలీసులు. -
హనీట్రాప్స్ కోసం ప్రాజెక్ట్ షేర్నీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సైంటిస్టులను హనీట్రాప్ చేయడానికి పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ‘ప్రాజెక్టు షేర్నీ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఇందులో పని చేయడానికి 300 మంది ఆకర్షణీయమైన యువతులను ఎంపిక చేసుకుని వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. డీఆర్డీఓలో పని చేస్తున్న ఓ సీనియర్ సైంటిస్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఇంజినీర్ దుక్కా మల్లికార్జున్ రెడ్డి శుక్రవారం అరెస్టు అయ్యారు. వీరిద్దరూ ప్రాజెక్ట్ షేర్నీలో పని చేస్తున్న యువతుల వల్లో చిక్కి రహస్య సమాచారం చేరవేశారు. షేర్నీ అంటే ‘ఆడసింహం’ అని అర్థం. ఆరు నెలల పాటు వివిధ అంశాల్లో శిక్షణ.. వీరంతా తమ తమ ప్రాంతాల్లోనే ఉండి ఐఎస్ఐ కోసం పని చేస్తున్నారు. వీరికి ఐఎస్ఐ ఏ స్థాయిలో బ్రెయిన్ వాష్ చేసిందంటే... టార్గెట్ చేసిన వ్యక్తిని హనీ ట్రాప్ చేయడానికి వీడియో కాల్లో నగ్నంగా కనిపించడానికీ వెనుకాడరు. ఎంపికైన 300 మందికీ వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. భారత్‌లోని జీవనస్థితిగతులు, భాష, మతపరమైన నమ్మకాలతో పాటు డార్క్ వెబ్ వినియోగం, హనీ ట్రాప్ చేయడం తదితర అంశాల్లో ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చింది. విదేశాలకు చెందిన ఒక్కో యువతికి దాదాపు 50 వరకు భారతీయుల పేర్లతో ప్రొఫైల్స్ ఏర్పాటు చేసిన ఐఎస్ఐ వీటి ద్వారానే హనీట్రాప్స్ చేయిస్తోంది. వీరి కట్టు, బొట్టు, నడక, నడత ప్రతీ అంశమూ భారతీయ యువతుల మాదిరిగా ఉండేలా వీరిని తయారు చేసింది. హనీట్రాప్‌లో విజయం సాధించి, రహస్య సమాచారం సేకరించిన వారికి ప్రత్యేక నజరానాలూ ఐఎస్ఐ అందిస్తోంది. అబోటాబాద్‌లో సోషల్‌మీడియా యూనిట్... దేశంలోని త్రివిధ దళాలు, రక్షణ సంస్థల్లో పని చేస్తున్న అధికారులు, సైంటిస్టులు, ఇతర ఉద్యోగులకు సంబంధించిన సమాచారం ఐఎస్ఐకి వారి సోషల్‌మీడియా ఖాతాల ద్వారానే తెలుస్తోంది. వీటిని విశ్లేషించడం కోసం ఐఎస్ఐ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో ప్రత్యేక సోషల్‌మీడియా యూనిట్ ఏర్పాటు చేసింది. ఇందులో సుశిక్షితులైన ఐఎస్ఐ ఉద్యోగులతో పాటు పాక్ ఆర్మీ సిబ్బంది, కొందరు హ్యాకర్లు పని చేస్తున్నారు. వీరి ప్రతినిత్యం భారతీయులకు సంబంధించిన సోషల్‌మీడియా ప్రొఫైల్స్‌ను విశ్లేషిస్తుంటారు. వీటిలో తమకు అవసరమైన వారివి ఎంపిక చేసుకుని అధ్యయనం చేస్తారు. అలా తుదిజాబితా రూపొందించిన తర్వాత దాన్ని ప్రాజెక్ట్ షేర్నీలోని యువతకులకు అందిస్తుంది. వీటి ఆధారంగానే ఈ యువతులు టార్గెట్లకు వల వేసి ఆకర్షిస్తారు. అందచందాలతో పాటు డబ్బు ఎర వేసి రహస్య సమాచారం సేకరిస్తారు. తమ పని పూర్తయ్యే వరకు ఐఎస్ఐ కోసం పని చేస్తున్నట్లు ఎదుటి వారికి అనుమానం కూడా రానీయరు. హనీట్రాప్స్‌ను కనిపెట్టడానికి నిఘా వర్గాలతో పాటు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) పని చేస్తున్నాయి. పాకిస్థానీయులు లేకుండా బెటాలియన్.. ప్రాజెక్టు షేర్నీ కోసం కొన్నేళ్లుగా వ్యహాత్మకంగా పని చేసింది. ఇందులో పని చేయడానికి యువతుల ఎంపిక, వారికి శిక్షణ తదితర అంశాల్లో పలు జాగ్రత్తలు తీసుకుంది. 300 మందితో ఏర్పడిన ఈ బెటాలియన్‌లో కనీసం ఒక్క పాకిస్థానీ యువతి కూడా లేదు. ఇందులో పని చేస్తున్న వారంతో భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారు. ఆయా దేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపుల్లో వీరి ఎంపికను రహస్యంగా పూర్తి చేశారు. అక్కడ ఉన్న తమ ఏజెంట్ల ద్వారా ప్రధానం మధ్య, దిగువ మ«ధ్య తరగతి వర్గాల్లో ఆకర్షణీయమైన యువతులను ఉద్యోగాల పేరుతో వల వేసింది. ఆపై డబ్బు ఆశచూపి వారిని ప్రాజెక్టు షేర్నీలో పని చేసేలా ఐఎస్ఐ ఒప్పించింది. (చదవండి: మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని ట్వీట్) -
హనీట్రాప్‌లో డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి
సాక్షి, హైదరాబాద్/ పహాడీషరీఫ్: హనీట్రాప్‌లో పడి దేశ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ఐఎస్ఐ మహిళా ఏజెంట్‌కు చేరవేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), బాలాపూర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన దుక్కా మల్లికార్జున్‌రెడ్డి అలియాస్ అర్జున్ బిట్టు (29) ఇంజనీరింగ్ పూర్తయ్యాక స్థానికంగా ఓ కంపెనీలో పనిచేసి 2018లో పటాన్‌చెరులోని క్వెస్ట్ కంపెనీలో చేరాడు. ఈ సమయంలో క్వెస్ట్ కి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్డీఎల్) నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మీద మల్లికార్జున్‌రెడ్డి 2020 జనవరి వరకు పని చేశాడు. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ఫిబ్రవరిలో మల్లికార్జున్‌రెడ్డి నేరుగా డీఆర్డీఎల్ అధికారులను సంప్రదించి.. అడ్వాన్స్డ్ నావెల్ సర్వీస్ ప్రొవైడర్ (ఏఎన్ఎస్పీ) ప్రాజెక్ట్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు. ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి..: ఈక్రమంలో మల్లికార్జున్‌రెడ్డి తాను డీఆర్డీఎల్లో పనిచేస్తున్నట్లు ఫేస్బుక్ ప్రొఫైల్‌లో స్టేటస్ పెట్టుకున్నాడు. 2020 మార్చిలో మల్లికార్జున్‌కు పాకిస్తా న్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం ప నిచేస్తున్న నటాషారావు అలియా స్ సిమ్రన్ చోప్రా అనే మహిళ నుంచి ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ రావటంతో యాక్సెప్ట్ చేశాడు. అలా స్నేహం పెంచుకున్న నటాషారావు, మల్లికార్జున్ చేస్తున్న వృత్తి, పని ప్రదేశం, కంపెనీ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంది. మల్లికార్జున్ రహస్య సమాచారాన్ని కూడా నటాషారావుకు చేరవేశాడు. అంతేకాకుండా మల్లికార్జున్ తన బ్యాంక్ ఖాతా నంబర్, ఇతరత్రా వివరాలను నటాషాకు పంపించాడు. ఈ నేపథ్యంలో డీఆర్డీఎల్ రహస్యాలు లీకవుతున్నాయని సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ, బాలాపూర్ పోలీసులు మల్లికార్జున్‌ను మీర్పేట్ త్రివేణినగర్‌లో అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు సెల్ఫోన్లు, సిమ్‌కార్డ్, లాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
వివాహేతర సంబంధం.. ప్రైవేటు ఫోటోలు, వీడియోలను అడ్డం పెట్టుకుని..
యశవంతపుర(బెంగళూరు): బెంగళూరు హేరోహళ్లి వార్డు బీజేపీ నాయకుడు అనంతరాజు (46) ఈ నెల 12న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే డెత్‌నోట్ సోమవారం దొరకడంతో హనీ ట్రాప్ అని బయటపడింది. ఓ మహిళ అక్రమ సంబంధం కారణంగా ఆమె తమ ప్రైవేటు ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడిందని, దీనివల్ల ఆత్మహత్య చేసుకొంటున్నట్లు అనంతరాజు అందులో రాశాడు. ఆమె వలలో చిక్కుకొని మోసం చేశానంటూ భార్యకు క్షమాపణలు చెప్పాడు. కేఆర్ పురకు చెందిన రేఖా అనే మహిళతో ఫేస్బుక్ ద్వారా అనంతరాజుకు పరిచయమైంది. తరువాత ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలను చూపి ఆమె అనంతరాజును బ్లాక్మెయిల్ చేయసాగింది. అప్పుడప్పుడు అడిగినంత డబ్బును ఆమెకు ఇచ్చాడు. రోజురోజుకూ ఆమె నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ఇంట్లో చెప్పుకోలేక తీవ్రంగా మథనపడ్డాడు. ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బ్యాడరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. చదవండి: 22 లక్షలతో పారిపోయి.. కోర్టులో లొంగిపోయి -
పాక్ మహిళ హనీట్రాప్.. భారత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఏం చేశాడంటే..
దేశంలో ఇప్పటికి ఎన్నో హనీట్రాప్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో హనీట్రాప్ ఉదంతం కలకలం సృష్టించింది. దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. భారత వైమానిక దళానికి చెందిన అధికారిని హనీట్రాప్ చేసింది. దీంతో సదరు అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. పాక్‌కు చెందిన మహిళ హనీ ట్రాప్‌లో చిక్కుకుని దేశ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లీక్ చేసినట్లు భారత వైమానిక దళానికి చెందిన అధికారి దేవేంద్ర శర్మపై ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు.. సోషల్ మీడియాలో శర్మను పాక్ మహిళ ట్రాప్ చేసినట్టు గుర్తించారు. దేవేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శర్మ ద్వారా దేశ భద్రతకు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నట్టు తెలుసుకున్నారు. మే 6న కస్టడీలోకి తీసుకోగా.. మే 12న (గురువారం) విచారణ ప్రారంభించినట్టు తెలిపారు. ఈ విచారణలో భాగంగా శర్మ నుంచి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసినట్టు స్పష్టం చేశారు. ఇక, దేవేంద్ర శర్మ.. ఢిల్లీ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఈ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో శర్మను సర్వీస్ నుంచి తొలగించినట్టు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: వైద్యుల నిర్వాకం.. బాలికకు తెలియకుండా మత్తుమందు ఇచ్చి.. -
‘ఒంటరిగా ఉన్నాను ఇంటికిరా’.. అంటూ పిలిచి నిలువుదోపిడి చేసిన మహిళ
ముంబై: ముంబై నగరానికి చెందిన ఓ 57 ఏళ్లు వ్యక్తికి కొన్ని రోజుల క్రితం ఒక గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు జ్యోతి అని పరిచయం చేసుకున్న ఓ మహిళ ఆ వ్యక్తితో మాటలు కలిపింది. తనకు ఎవరూ లేరు, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాని ఆమె చెప్పింది. మెల్లిమెల్లిగా సన్నిహితంగా మాట్లాడటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ వ్యక్తిని తన మాటలతో రెచ్చగొట్టింది. ఆమె మాటలకు లొంగిపోయిన సదరు వ్యక్తి మార్చి 23న ఆ మహిళకు ఫోన్ చేసి కలుస్తానని చెప్పాడు. దీంతో ఆ మహిళ తన ఫ్లాట్‌కు రావాల్సిందిగా చెప్పి తూర్పు భయాందర్‌లోని షిరిడీనగర్‌లో ఉన్న ఒక అపార్టుమెంట్ అడ్రస్ ఇచ్చింది. ఇక, ఈ వ్యక్తి ఎంతో ఉత్సాహంతో ఆమె చెప్పిన చోటుకి వెళ్లి ఇంటి తలుపు తట్టాడు. ఇతణ్ని లోపలికి ఆహ్వానించిన సదరు మహిళ నేరుగా బెడ్ రూంలోకి తీసుకెళ్లింది. ఇంతలోనే అతనికి షాకిస్తూ ఓ ముగ్గురు వ్యక్తులు పోలీసు యూనిఫాంలో సరాసరి వాళ్లు ఉన్న బెడ్ రూంలోకి చొచ్చుకు వచ్చి ఏం చేస్తున్నారంటూ బెదిరించారు. అరెస్ట్ చేస్తామని చెప్పి ఆ వ్యక్తిని భయపెట్టారు. దీంతో తనకేం తెలియదని వదిలేయమని ఆ పెద్దమనిషి ప్రాధేయపడగా రూ. 2 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పారు. ఈ రకంగా అతడి ఖాతాలో ఉన్న రూ. 70 వేలను దుండగులు లాగేసుకున్నారు. మిగతా డబ్బును రెండు రోజుల్లోగా ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించి అక్కడ్నించి పంపించారు. అయితే వారి వ్యవహార శైలిపై అనుమానపడిన బాధితుడు, నేరుగా వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. మిగతా డబ్బును ఇస్తామని బాధితుడి ద్వారా ఫోన్ చేయించి ఒక చోటుకి పిలిపించారు. వారు రాగానే అరెస్ట్ చేశారు. ఇక వారు అసలు పోలీసులే కాదని తేలింది.వీరు ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహాలో హాని ట్రాప్ చేసి అమాయకుల నుంచి డబ్బులు గుంజడం చేస్తున్నారని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. నిందితులను సుదర్శన్ 32, విజయ్ 56, ఆయుబ్ ఖాన్ 45లుగా పోలీసులు గుర్తించారు. అయితే మహిళ పేరును మాత్రం పోలీసులు చెప్పలేదు. వీరిని అరెస్ట్ చేశారు. చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం -
ఆమె అందంతో మిస్టర్ పర్ఫెక్ట్కే వలేసింది.. ఐదేళ్లు సహజీవనం చేసి.. ఆ తర్వాత..
జైపూర్: ఆమె అందంతో ఎంతో మందిని తన వలలో వేసుకుంది. చివరకు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ విన్నర్ కూడా ఆమె చేతికి చిక్కి ఇబ్బందులకు గురయ్యాడు. అతడిని హనీ ట్రాప్ చేసిన సదరు యువతి.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హనీ ట్రాప్ ఉందతం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన రాధ.. కొన్నేళ్ల క్రితం తన కుటుంబాన్ని వదిలి రాజస్థాన్‌లోని జైపూర్‌లో నివాసం ఉంటోంది. తనకు పెళ్లి అయిన్పప్పటికీ భర్తకు దూరంగా ఉంటోంది. కాగా, జైపూర్‌లో రాధ.. కొద్ది రోజులు బ్యూటీ పార్లర్ నిర్వహించింది. అనంతరం జైపూర్ మెట్రో పనిచేస్తుండగా.. ఆరేళ్ల క్రితం ఆమె స్నేహితురాలి ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. దీంతో వీరిద్దరూ డీప్ లవ్‌లో మునిగిపోయి దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం కొనసాగించారు. అనంతరం వీరి మధ్య మనస్పర్థలు రావడంతో రాధ ఆ యువకుడికి దూరమైంది. ఈ క్రమంలో సదరు యువకుడు మిస్టర్ రాజస్థాన్ టైటిల్ గెలుచుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో యువకుడికి వివాహం కూడా జరిగింది. మరోవైపు రాధ.. ఓ డ్యాన్స్ గ్రూప్‌లో చేరి అస్సాం వెళ్లింది. సదరు యువకుడిని విడిచిపెట్టి ఆమె మరికొంత మంది యువకులతో కలిసి జీవించడం ప్రారంభించింది. కాగా, గతేడాది మే నెలలో రాధ మళ్లీ జైపూర్‌కు చేరుకుంది. తన ప్రియుడికి(మిస్టర్ రాజస్థాన్) వివాహం జరిగిందన్న విషయం తెలిసి అతడిని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. తమ సంబంధం గురించి అతడి భార్యకు, కుటుంబ సభ్యులకు చెబుతానని బెదిరించి కొద్ది నెలలుగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రాధ అతడిని రూ. 20 లక్షలు డిమాండ్ చేయగా.. తన వద్ద లేవని చెప్పడంతో.. రాధ ఆ వ్యక్తిని అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ వేధింపులు భరించలేక అతను పోలీసులను ఆశ్రయించాడు. పధకం ప్రకారం.. సదరు వ్యక్తి ఓ హోటల్లో బ్లాక్ మెయిలర్ రాధకు రూ.50 వేల నగదు, మూడు చెక్కులను ఇస్తుండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం రాధను సంజయ్ సర్కిల్ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. -
Crime News: ట్యూషన్ టీచర్ వలపు గాలం, ఆపై..
హనీట్రాప్ ఉదంతాలు ఎన్ని వెలుగు చూస్తున్నా.. వాటిలో కొన్ని మాత్రం విషాదాంతాలుగా మిగులుతుంటాయి. తాజాగా రాజస్థాన్‌లో డబ్బు కోసం వెంపర్లాడిన ఓ ట్యూషన్ టీచర్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. తన అందంతో ఓ వ్యాపారవేత్తకు వల వేసిన ఆమె.. ఆపై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో కుటుంబంతో కలిసి హత్య చేశాడు ఆ వ్యక్తి. ఆపై కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని తాతర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. మార్చి 16న వంతెన కింద గోనె సంచిలో యువతి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు సదరు యువతి పేరు ప్రియాంక(29) అని, ఢిల్లీ నుంచి వలస వచ్చిందని తెలిసింది. ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తుండడంతోపాటు స్థానిక వ్యాపారవేత్త కపిల్ గుప్తా ఇంటికి వెళ్లి పిల్లలకు ప్రైవేట్ పాఠాలు చెప్తుండేది. ఈ క్రమంలో ప్రియాంక అందానికి ఫిదా అయిన కపిల్.. ఆమెతో స్నేహం, ఆపై అనైతిక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ‘కట్నం’ కోసం బ్లాక్‌మెయిలింగ్ తనతో సంబంధాన్ని సాకుగా చేసుకుని.. ప్రియాంక, కపిల్‌పై బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. తనకు పెళ్లి కుదిరిందని, వరుడి కుటుంబానికి రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలని, అందుకు డబ్బు ఇవ్వాలంటూ కపిల్‌పై ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో భరించలేకపోయిన కపిల్.. అసలు విషయం భార్యకి, తన బావమర్దులకు చెప్పి ప్రియాంకను ట్రాప్ చేశాడు. డబ్బు కోసం గుడ్డిగా నమ్మివచ్చిన ప్రియాంకను హత్య చేసి.. గోనె సంచిలో కుక్కేసి తాతర్‌పూర్ బ్రిడ్జి కింద పడేశాడు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. సోమవారం కపిల్‌తో పాటు ఆయన భార్య, ఆమె ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రియాంక ఇదే తరహా హానీ ట్రాపింగ్‌తోనే ఎనిమిది మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రైవేట్ ట్యూషన్ పేరుతో ఇళ్లలోకి చేరి.. ఆపై పిల్లల తండ్రులకు వలపు గాలం వేసేదని, అటుపై వాళ్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజేసి ఆ డబ్బుతో ఆమె జల్సాలు చేసేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. -
వైద్యుని ఆత్మహత్య వెనుక హనీట్రాప్.. నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్
యశవంతపుర (బెంగళూరు): గత ఆగస్ట్‌లో కెంగేరి వద్ద యువ వైద్యుడు సార్థిక్ రైలు కింద పడి ఆత్మహత్య కేసులో హనీట్రాప్ కుట్ర బయటపడింది. దీనిపై రైల్వే పోలీసులు ముఖ్య నిందితున్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఎంబీబీఎస్ చదివిన సార్థిక్తో ఒక యువతి వాట్సప్ ద్వారా పరిచయం పెంచుకుంది. ఒక రోజు ఆమె నగ్నచిత్రాలను పంపి వీడియోకాల్ ద్వారా మాట్లాడింది. ఆ కాల్స్‌ను రికార్డు చేసి సార్థిక్ను బెదిరించి రూ.67 వేల వరకూ వసూలు చేసింది. మరింత డబ్బు ఇవ్వాలని, లేదంటే ఇంటర్నెట్లో ఈ చిత్రాలను పెడతానని ఆమె బెదిరిస్తుండడంతో దిక్కుతోచక ఆత్మహత్య చేసుకున్నాడు. చదవండి: (Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం) -
అత్యాచారం కేసు పెట్టిన యువతి అరెస్ట్.. విచారణలో అసలు విషయం!
గురుగ్రామ్: తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేసిన 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్(హర్యానా)లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై 8మంది అత్యాచారం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సదరు యువతి తన తల్లితో గురుగ్రామ్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు హనీ ట్రాప్ పేరుతో మగవారిని వలలో వేసి డబ్బులు గుంజటం అలవాటుగా మారింది. ఆమె వలలో చిక్కనివారిపై నకిలీ అత్యాచారం కేసులు పెట్టి వేధించడం ప్రారంభించింది. తాజాగా ఆమె 8 మందిపై అత్యాచారం కేసు పెట్టగా విచారణ జరిపిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ఆమె ఫేక్ అత్యాచారం కేసు పెట్టి.. పలువురు పురుషుల వద్ద హనీ ట్రాప్ ముగుసులో డబ్బు లాగుతోందని పోలీసులు బయటపెట్టారు. ఈ కేసులో ఆ యువతి తల్లితో పాటు నరేందర్ యాదవ్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారని ఏసీపీ(క్రైమ్) ప్రీత్ పాల్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు. పోలీసులు ఆమెను బుధవారం కోర్టుకు హాజరపరిచి, అనంతరం జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మైనేమ్ ఈజ్ సుజి, ఐ యామ్ సింగిల్.. అంటూ వీడియో కాల్ చేసి.. దుస్తులు తీసేసి..
సాక్షి, నిర్మల్: ‘హాయ్..మైనేమ్ ఈజ్ సుజి(పేరు మార్చాం). వాట్ ఈజ్ యువర్ నేమ్. వేర్ ఆర్ యు ఫ్రమ్. ఐ యామ్ సింగిల్...’ అంటూ ప్రవీణ్(పేరు మార్చాం) అనే యువకుడి మెసెంజర్లో ఒక మెసెజ్ వచ్చింది. పేరు కొత్తగా ఉండటంతో పాటు అందమైన అమ్మా యి ఫొటో డీపీగా ఉండటంతో మెసెంజర్ ఓపెన్‌చేసి, తాను కూడా చాట్ చేయడం మొదలు పెట్టాడు. కాసే పటికే ఎదుటి యువతి ఫోన్ నంబర్ చెప్పు, వీడియో కాల్ చేస్తాను అనటంతోనే.. ఏమాత్రం ఆలోచించకుండా ప్రవీణ్ వెంటనే తన నంబర్‌ను పంపించాడు. సెకన్ల వ్యవధిలోనే గుర్తుతెలియని ఓ కొత్త నంబర్ నుంచి ఆయనకు వాట్సప్ ద్వారా వీడియోకాల్ వచ్చింది. లిఫ్ట్ చేసేసరికి.. నిజంగానే ఓ అందమైన యువతి లైన్లోకి వచ్చింది. ‘హాయ్..’ అంటూ స్వీట్‌గా ఇంగ్లిష్‌లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతడూ వచ్చీరాని ఇంగ్లిష్తో మాట్లాడాడు. కాసేపటికే ఆమె అసభ్యకరంగా మాట్లాడటం, దుస్తులు తొలగించడం చేసింది. తనను కూడా అలాగే చేయాలని చెప్పడంతో.. వెనుకాముందు ఆలోచించకుండా తీసేశాడు. కాసేపటికే.. వీడియోకాల్ కట్ అయ్యింది. అంతే.. ప్రవీణ్ దుస్తులు సర్దుకునేంత లోపే వాట్సప్‌లో ఒక వీడియోతోపాటు ఒకదాని వెంట ఒకటి మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. వాటిని చూడటంతోనే ప్రవీ ణ్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. అప్పటి దాకా వారు మాట్లాడుకున్న వీడియోకాల్ మొత్తం రికార్డు చేసి, తనకు పంపించారు. ‘దుస్తులు లేకుండా మనం ఇద్దరం మాట్లాడుకున్న వీడియో మొత్తం రికార్డు అయ్యింది. నువ్వు వెంటనే మా గూగుల్‌పే నంబర్‌కు రూ.50 వేలు పంపించు. చదవండి: ఇప్పుడే వస్తానమ్మా... అంటివి కదా కొడుకా! లేదంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులందరికీ పంపిస్తాను. సోషల్ మీడియాలలో పోస్టు చేస్తాను. వెంటనే డబ్బు పంపించు.. లేదంటే.. అంతే సంగతి..’అంటూ వరుసగా మెసెజ్‌లు వచ్చాయి. దీంతో ప్రవీణ్ ఒక్కసారిగా బెదిరిపోయాడు. ఏం చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో.. తెలియక కంగారుతో జ్వరం తెచ్చుకున్నాడు. చివరికి దగ్గరి మిత్రుడి సలహాతో వారి ఫోన్లు లిఫ్డ్ చేయడం, మెసేజ్‌లు చూడటం చేయడం లేదు. రెండు రోజులైనా ఇంకా ఆ ఘటన నుంచి తేరుకోవడం లేదు. ఒక్క ప్రవీణ్‌కే కాదు.. జిల్లాలో చాలామంది ‘హనీట్రాప్’కు గురవుతున్నారు. ఇలాంటి పలు రకాల సైబర్ ఉచ్చులతో పలు ముఠాలు వివిధ వయసుల వారిని టార్గెట్ చేస్తున్నాయి. మాటలతో మాయచేస్తూ మోసాలకు పాల్పడుతున్నాయి. చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇంకొంత కాలం ఇంటి నుంచే! మాట కలిపి..మాయ చేస్తూ ‘హనీట్రాప్’.. ఇటీవల ఈ ఉచ్చు బిగించేవారి సంఖ్య పెరుగుతోంది. అందమైన యువతులను ముందు ఉంచి కొన్ని సైబర్ దోపిడీ ముఠాలు ఉచ్చులు పన్నుతున్నాయి. సదరు యువతులు ముందు స్వీట్‌గా పలకరిస్తూ.. మాటల్లోకి దించుతున్నారు. తమ దుస్తులను తొలగిస్తూ.. మెల్లగా ఉచ్చులోకి దించి, ఎదుటి వ్యక్తిని కూడా అసభ్యకరంగా తయారయ్యే దాకా వేచి చూస్తున్నారు. ఇదంతా స్పైవేర్‌తో రికార్డు చేసి, ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు. సదరు అమ్మాయిని ముందుండి కథ నడించిన ముఠా రంగంలోకి దిగి, డబ్బులు డిమాండ్ చేస్తోంది. లేదంటే నీ వీడియో మొత్తం యూట్యూబ్, సోషల్ మీడియాల ద్వారా అందరికీ పంపిస్తామంటూ బెదిరిస్తోంది. చదవండి: అంబులెన్స్ లేదు.. పీహెచ్‌సీకి తాళం.. ఆటోలోనే ప్రసవించిన మహిళ యువతే లక్ష్యంగా... ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ముఠాలు సైబర్‌నేరాలకు పాల్పడుతున్నాయి. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలను పరిశీలిస్తే.. బాధితులంతా 25 నుంచి 28ఏళ్లలోపు వారే ఉన్నారు. ఇందులో పెళ్లికాని వాళ్లు, పెళ్లికి దగ్గరి వయసులో ఉన్నవారినే సదరు ముఠాలు టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి వారైతేనే.. పెళ్లి కావాల్సిన వయసులో ఇలాంటి వీడియోలు బయటకు వస్తే తన పరువు పోవడంతోపాటు పెళ్లికి ఇబ్బంది అవుతుందన్న భయంతో ఎంత అడిగితే అంత డబ్బు ఇస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది పెళ్లయిన వారు కూడా ఎక్కడ తమ బండారం భార్య కు తెలుస్తుందోనన్న భయంతో సదరు ముఠాలకు ఎంత అడిగితే అంత ముట్టజెప్పిన ఘటనలూ ఉన్నాయి. సోషల్‌మీడియా ద్వారా.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న చాలా ముఠాలు సోషల్ మీడియా నుంచే తమ టార్గెట్లను ఎంచుకుంటున్నాయి. ప్రధానంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాంలలో పూర్తి ప్రొఫైల్‌ను పెట్టడం, ఫ్రెండ్స్ గురించి ఉండటంతో సదరు వ్యక్తి ఎలాంటివాడు, ఆయన వెనుకాముందు ఏముందనేది మొత్తం తెలిసిపోతోంది. వారిలో తమ పనికి సులువుగా దొరికి పోయేవాడు, డబ్బులు పంపించేవాడిని ఎంచుకుంటున్నారు. ముందు మెసెజ్‌లతో బెదిరిస్తున్నారు. లేనిపక్షంలో నేరుగా కాల్ చేసి భయపెట్టిస్తున్నారు. పోలీసులకు ఫోన్‌చేసినా, స్టేషన్‌కు వెళ్లినా వెంటనే మీవాళ్లకు ఈ వీడియోలు షేర్ చేస్తామని హెచ్చరిస్తుండటంతో చాలామంది గుట్టుగా ఎంతోకొంత డబ్బులు ముట్ట జెప్పుతున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఇలాంటి ముఠాలు ఒకసారి డబ్బు తీసుకోవడంతోనే వదిలిపెట్టవని, తరచూ అడుగుతూనే ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఏది జరిగినా వెంటనే స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.