
కర్నూలు: పట్టణంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. తాజాగా ఓ యువకుడికి శనివారం అర్ధరాత్రి కొత్త నంబర్ నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్ వచ్చింది. వీడియోలో ఉన్న యువతి హిందీలో మాట్లాడుతూ అశ్లీలంగా కనిపించటంతో ఆ యువకుడు కాల్‌ను కట్ చేశారు. వెంటనే వాట్సప్‌లో మేసేజ్ వచ్చింది. యువకుడి ఫొటోనుమార్ఫింగ్ చేసి అశ్లీల వీడియో పెట్టడం చూసి భయపడ్డాడు.తన అకౌంట్‌కు రూ.8,100 వెంటనే పంపాలని, లేకపోతే ఆ వీడియోను ఫ్రెండ్స్‌కు పంపుతానని, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తానని హిందీలో బెదిరించింది.
తనకు ఒక రోజు సమయం ఇవ్వాలని యువకుడు కోరినా వినిపించుకోలేదు. ఆ యువకుడు సెల్ స్విచాఫ్ చేసుకోవడంతో అతని స్నేహితుడికి వీడియో పంపారు. వీడియో చూసిన స్నేహితుడు ఆ యువకుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో భయపడి ఫేస్‌బుక్‌ను డెలీట్ చేసుకున్నారు. అనంతరం బాధిత యువకుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై టౌన్ సీఐ మదుసుధన్‌రావును వివరణ కోరగా కేసు విచారిస్తున్నామని తెలిపారు.
ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలోనే తేరుబజార్‌కు చెందిన ఓ యువకుడు హనీట్రాప్ బారిన పడి కొంత డబ్బు ఫోన్‌పే చేసినట్లు, అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఎదురుతిరిగి ఏం చేస్తారో చేసుకోండి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అప్పటి నుంచి మెసేజ్‌లు ఆగిపోయినట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలో హానీ ట్రాప్ బాధితులు చాలా మంది ఉన్నా భయంతో ఎవరూ ముందుకు రావటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment