Nude
-
విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు
పెర్త్: ఆస్ట్రేలియాలోని ఓ విమానంలో ఒక ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు. అంతటితో ఆగకుండా సిబ్బందిని కిందకు తోసేసి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన వర్జిన్ ఆస్ట్రేలియా విమానంలో జరిగింది. ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మెల్బోర్న్కు వీఏ 696 విమానం సోమవారం(మే27) రాత్రి బయలుదేరింది. పెర్త్‌లో విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ ప్రయాణికుడు వింతగా ప్రవర్తించాడు. దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటూ, ఇటూ పరిగెత్తాడు. అడ్డుకున్న సిబ్బందిని తోసేశాడు. అతడి చేష్టలతో తోటి ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. విమాన సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఎయిర్‌పోర్టుకు చేరుకుని నగ్నంగా పరుగులు తీసిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. -
జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే. ‘‘శని క్రెడిట్ కార్డును గాజాలో పూర్తిగా వాడేశారు. తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నాం’’అంటూ ఆమె తల్లి బావురుమంది. శనివారం ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన కిబుట్జ్ సమీపంలో ఫెస్టివల్ ఆఫ్ పీస్ జరుగుతుండగా హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడిచేసి పలువురిని బందీలుగా గాజాకు తరలించారు. -
అర్ధరాత్రి వాట్సాప్‌లో అశ్లీలంగా యువతి వీడియో కాల్..
కర్నూలు: పట్టణంలో హనీ ట్రాప్ కలకలం రేపుతోంది. తాజాగా ఓ యువకుడికి శనివారం అర్ధరాత్రి కొత్త నంబర్ నుంచి వాట్సాప్‌లో వీడియో కాల్ వచ్చింది. వీడియోలో ఉన్న యువతి హిందీలో మాట్లాడుతూ అశ్లీలంగా కనిపించటంతో ఆ యువకుడు కాల్‌ను కట్ చేశారు. వెంటనే వాట్సప్‌లో మేసేజ్ వచ్చింది. యువకుడి ఫొటోనుమార్ఫింగ్ చేసి అశ్లీల వీడియో పెట్టడం చూసి భయపడ్డాడు.తన అకౌంట్‌కు రూ.8,100 వెంటనే పంపాలని, లేకపోతే ఆ వీడియోను ఫ్రెండ్స్‌కు పంపుతానని, యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తానని హిందీలో బెదిరించింది. తనకు ఒక రోజు సమయం ఇవ్వాలని యువకుడు కోరినా వినిపించుకోలేదు. ఆ యువకుడు సెల్ స్విచాఫ్ చేసుకోవడంతో అతని స్నేహితుడికి వీడియో పంపారు. వీడియో చూసిన స్నేహితుడు ఆ యువకుడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో భయపడి ఫేస్‌బుక్‌ను డెలీట్ చేసుకున్నారు. అనంతరం బాధిత యువకుడు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై టౌన్ సీఐ మదుసుధన్రావును వివరణ కోరగా కేసు విచారిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలోనే తేరుబజార్‌కు చెందిన ఓ యువకుడు హనీట్రాప్ బారిన పడి కొంత డబ్బు ఫోన్‌పే చేసినట్లు, అయినా బెదిరింపులు ఆగకపోవడంతో ఎదురుతిరిగి ఏం చేస్తారో చేసుకోండి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో అప్పటి నుంచి మెసేజ్‌లు ఆగిపోయినట్లు బాధితుడు తెలిపారు. పట్టణంలో హానీ ట్రాప్ బాధితులు చాలా మంది ఉన్నా భయంతో ఎవరూ ముందుకు రావటం లేదు. -
ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: యువత బలహీనతను ఆసరా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్న సైబర్ ముఠా ఆగడాలు పెరిగిపోయాయి. హాయ్ అన్న చిన్న పదానికి స్పందిస్తే చాలు గంటల వ్యవధిలోనే వాట్సాప్ ద్వారా వచ్చే కాల్స్‌ను వద్దనుకున్నా.. టచ్ చేసి తీరుతారు. అందులో నగ్నంగా కనిపించే యువతి ఫొటోను మీరు గమనిస్తుండగా స్క్రీన్ షాట్ తీసి మళ్లీ మీకే పంపుతారు. చదవండి: భర్తను దారికి తెచ్చుకోవాలనుకుంది.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య ఆ తర్వాత బ్లాక్మెయిల్.. వేధింపులు షరామాములే. అవతలి వారు డిమాండ్ చేసిన మేరకు డబ్బు చెల్లించుకోకపోతే మానసిక వేదన తప్పదు. ఈ తరహా చిక్కులో పడి ఎందరో నలిగి పోతున్నారు. వారిలో కొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు వలపుల వలలో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చాలారోజుల క్రితం రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఓ ముఠాను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేసి రూ. 25 కోట్లు కాజేసినట్లు నిర్ధారించారు. 18 రాష్ట్రాల్లో ఈ ముఠా తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన వలపుల వల విసరడంలో ఈ ముఠాలు ఎంతగా ఆరితేరాయో ఇట్టే అర్థమవుతోంది. ఫేస్ బుక్‌తో చాటింగ్ ప్రారంభించి...వాట్సప్‌తో వసూళ్లకు దిగుతున్న ఈ ముఠాలతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అనంత పోలీసులు. మోసపోయిన కొందరు.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి ఉన్నత చదువుల నిమిత్తం నగరానికి వచ్చిన ఓ యువకుడు వలపుల వలలో చిక్కుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆ యువకుడు.. రాత్రి వేళ పోర్న్ వెబ్‌సైట్‌ను చూస్తుండగా అతని వాట్సాప్‌కు ఓ వీడియో వచ్చింది. తీరా చూస్తే అందులో తాను చూస్తున్న వీడియోలో అమ్మాయితో తాను ఉన్నట్లుగా ఉంది. అవాక్కైన అతను తేరుకునేలోపు అవతలి నుంచి మరో సందేశం వచ్చింది. తాము కోరిన మేరకు డబ్బు చెల్లించాలని లేకపోతే ఆ వీడియోను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరిస్తున్నట్లుగా మెసేజ్ చేశారు. దీంతో తన చదువుల కోసం దాచుకున్న డబ్బు కాస్త బ్లాక్‌మెయిలర్ చెప్పిన ఖాతాకు జమ చేశాడు. ఇంతటితో విషయాన్ని ఆపలేదు. తరచూ డబ్బు కోసం వేధిస్తుండడంతో విషయాన్ని తన మిత్రుల ద్వారా తండ్రికి చేరవేశాడు. తల్లిదండ్రులు ఆ యువకుడిని మందలించి ఫోన్లో బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని గట్టిగా హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, అప్పటికే ఆ యువకుడు రూ.వేలల్లో బ్లాక్‌మెయిలర్‌కు నగదు బదిలీ చేశాడు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ సంఘం నాయకుడి మొబైల్‌కు రాత్రి 10 గంటల సమయంలో హాయ్ ఎలా ఉన్నారంటూ ఓ మెస్సేజ్ వచ్చింది. తెలిసిన వారేమోనని అతను స్పందించాడు. నిమిషాల వ్యవధిలో అతనికి వీడియో ఫోన్ కాల్ వచ్చింది. తీసి చూస్తే న్యూడ్‌గా ఓ యువతి దర్శనమిచ్చింది. మొదట భయపడిన ఆయన కొద్ది క్షణాల పాటు ఆ అమ్మాయి ఎవరోనని చూసి ఫోన్ కట్ చేశాడు. ఇక రాత్రంతా ఒకటే గోల మేము పంపిన నంబరుకు ఫోన్‌పే ద్వారా మీరు డబ్బు పంపక పోతే మీ పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు. నేనేం తప్పు చేశానో? చెప్పమంటూ వారితో అతను వాదించాడు. అదే సమయంలో స్క్రీన్ రికార్డు చేసిన చిన్న వీడియో క్లిప్‌ను బ్లాక్‌మెయిలర్ పంపాడు. అందులో ఆ అమ్మాయి న్యూడ్‌గా ఉన్న వీడియోను తాను చూస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోని మీ ఫేస్బుక్లో ఉన్న మిత్రులు, పొలిటికల్ లీడర్లకు పంపుతామని బెదిరించారు. ఏం చేయాలో పాలుపోక తెలిసిన పోలీసు మిత్రుడికి చెప్పి ఆయనతో ఫోన్లో బ్లాక్ మెయిలర్‌ని హెచ్చరికలు జారి చేయించి బయటపడ్డాడు. కాకపోతే అప్పటికే ఆ నేత రూ.18 వేలు ఫోన్‌ఫే ద్వారా బ్లాక్‌మెయిలర్‌కు బదిలీ చేయడం గమనార్హం. రోజుకో రూపంలో మోసాలు సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు తెగబడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో ఉంచకూడదు. సెల్ఫోన్లో చిన్నపాటి ప్రైవసీ సెట్టింగ్ చేసుకుంటే చాలా మంచిది. ప్రధానంగా ఫేస్బుక్ హ్యాక్, వాట్సాప్, మెస్సేంజర్, వీడియో కాల్స్ ద్వారా ఆకర్శించి దోపిడీ చేస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వీడియోకాల్స్, సందేశాలకు స్పందించకపోతే సురక్షితంగా ఉన్నట్లే. కాదని ఆకర్శితులైతే బ్లాక్మెయిలర్స్ వలలో పడక తప్పదు. కొత్త వ్యక్తులు పంపే సందేశాలు, లింకులను అసలు ఓపెన్ చేయవద్దు. ఒకవేళ ఇలాంటి ఉచ్చులో పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం -
ఆండ్రియా.. భారీ పారితోషికం కూడా
సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం పిశాచి–2. 2014లో ఈయన దర్శకత్వంలో రూపొంది మంచి విజయాన్ని సాధించిన పిశాచి చిత్రానికి ఇది సీక్వెల్. రాక్‌ఫోర్ట్ పతాకంపై మురుగానందం నిర్మించిన ఈ చిత్రంలో నటి ఆండ్రియా ప్రధాన పాత్రలో నటించింది. నటుడు విజయ్ సేతుపతి గౌరవ పాత్రలో నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హారర్, థ్రిల్లర్ కథా చిత్రం ఈ నెల 31వ తేదీ విధులకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా నటి ఆండ్రియా ఈ చిత్రంలో పూర్తి నగ్నంగా నటించిందని, అందుకు ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేసిందనే ప్రచారం వైరల్ అవుతుంది. దీనిపై దర్శకుడు మిష్కిన్ స్పందిస్తూ చిత్రం కోసం నటి ఆండ్రియాను నగ్నంగా చిత్రీకరించిన విషయం నిజమేనన్నారు. అందుకు ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడం కూడా సహజమేనని పేర్కొన్నారు. అయితే ఆమె నగ్నంగా నటించిన సన్నివేశాలను చిత్రీకరించలేదని, ఫొటోలు మాత్రమే తీసినట్లు, అవి కూడా ఆమె సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తోనే తీయించామని తెలిపారు. అక్కడ తాను కూడా లేనని చెప్పారు. అయితే చిత్రాన్ని పిల్లలు కూడా చూడాలన్న ఉద్దేశంతో నగ్న ఫొటోలను చిత్రంలో పొందుపరచలేదని తెలిపారు. చిత్రంలో ఆ ఫొటోలు జత చేస్తే సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇస్తుందని భావించి చేర్చలేదని వివరించారు. -
ఆ వీడియో కాల్ ఎత్తారో..బతుకు బస్టాండే
సాక్షి, హైదరాబాద్: ‘నార్సింగికి చెందిన వ్యక్తికి గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు స్క్రీన్‌పై ఎలాంటి ఆడియో, వీడియో లేదు. తెర బ్లాక్‌గా కనిపించింది. కాల్ కట్ అయిన కొన్ని నిమిషాల తర్వాత.. తనకొచ్చిన మెసేజ్ చూసి బాధితుడు షాకయ్యాడు. తన ముఖాన్ని మార్ఫింగ్ చేసిన న్యూడ్ వీడియో అది! అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోను కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు పంపిస్తామని సైబర్ నేరస్తులు బెదిరించారు. దీంతో ఏం చేయాలో తోచని బాధితుడు మొదట రూ.5 వేలు ఆన్లైన్లో చెల్లించి, దాని స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. మరోసారి ఫోన్ చేసిన నిందితులు రూ.30 వేలు డిమాండ్ చేశారు. భయపడిపోయిన బాధితుడు మళ్లీ సమర్పించుకున్నాడు. ఈసారికి రూ.20 వేలు పంపించాలని బెదిరించడంతో అలాగే పంపాడు. అయినా వారి నుంచి బెదిరింపులు ఆగకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు.’ ఇప్పటివరకు సైబర్ నేరస్తులు అమ్మాయిలుగా బాధితులకు ఫోన్ చేసేవారు. చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తున్నారా.. అయితే ఇక కష్టమే..) కొద్ది సేపు మాట్లాడిన తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసుకుందామని నమ్మించేవారు. బాధితుడికి అవతలి వైపున కనిపించే న్యూడ్ అమ్మాయి నిజమేనని భావిస్తాడు. వాస్తవానికి అక్కడ ప్లే అయ్యేది అశ్లీల వీడియో మాత్రమే. ఈ విషయం తెలియని బాధితుడు అవతలి వ్యక్తి సూచించినట్లుగా న్యూడ్‌గా మారతాడు. ఈ తతంగమంతా సైబర్ నేరస్తులు రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాధితుడికి ఫోన్ చేసి తన న్యూడ్ వీడియోను పంపించి, బ్లాక్ మెయిల్ చేస్తారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాల్ లిస్ట్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు ఈ వీడియో పంపిస్తామని బెదిరించేవారు. కానీ, తాజాగా నార్సింగి పీఎస్‌లో నమోదైన వాట్సాప్ వీడియో కాల్లో.. నేరస్తుల తరుఫున ఆడియో గానీ వీడియో గానీ ప్లే అవ్వలేదు. కేవలం బాధితుడి వీడియోను రికార్డ్ చేసి, ఆపై దాన్ని న్యూడ్‌గా మార్ఫింగ్ చేసి బెదిరించి అందినకాడికి దోచుకున్నారు. బాధితుల నంబర్లు ఎక్కడివి? సాధారణంగా సైబర్ నేరస్తులు బాధితుల ఫోన్ నంబర్లను సోషల్ మీడియా ఖాతాల నుంచి సేకరిస్తుంటారు. మరికొంత మంది నేరస్తులు జాబ్ పోర్టల్స్, షాపింగ్ వెబ్సైట్లలో నమోదయిన ఫోన్ నంబర్లను థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేస్తుంటారని ఓ సైబర్ క్రైమ్ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఈ కేసులో బాధితుడి నంబర్ నేరస్తుల చేతికి ఎలా చిక్కిందనేది ఇంకా తేలలేదని తెలిపారు. -
అలా చేశాడని.. చితకబాది నడిరోడ్డుపై బట్టలు విప్పి ఊరేగించారు
బెంగళూరు: ఒంటరిగా మహిళలు, బాలికలు కనపడితే చాలు ఆకతాయిలు రెచ్చిపోతుంటారు. అలా ప్రవర్తించిన ఓ ఆకతాయికి నడిరోడ్డుపై చితకబాది బుద్ధి చెప్పారు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హసన్ జిల్లాలోని మహారాజా పార్క్ వద్ద బాలికతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణతో రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, బట్టలూడదీసి ఊరేగించారు. దాడికి గురైన వ్యక్తి విజయపుర జిల్లాకు చెందిన మేఘరాజ్‌గా గుర్తించారు. హసన్ నగరంలో భవన నిర్మాణ కార్మికుడు.మేఘరాజ్ పార్క్‌కి అప్పుడప్పుడు వచ్చి సేదతీరుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మేఘారాజ్ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు కొందరు అతనిపై దాడి చేశారు. అయితే పోలీసులకు అప్పగించడానికి బదులు, వారు అతనిని కొట్టి, బట్టలు విప్పి, ఆపై రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ అయిన హేమావతి విగ్రహం సర్కిల్ దగ్గర ఒంటిపై బట్టలు లేకుండా ఊరేగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. వెంటనే మేఘరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆరా తీసిన హసన్ నగర పోలీసులు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై..దాడి చేసి ఊరేగించినందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా బాలిక మాత్రం మేఘరాజ్‌పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదని సమాచారం. -
గ్రేటర్ నోయిడా: ఏడో అంతస్తు నుంచి నగ్నంగా కిందపడిన యువతి
లక్నో: అపార్ట్మెంట్లోని 7వ అంతస్తు నుంచి ఓ యువతి నగ్నంగా కిందపడిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. డిసెంబర్ 12 జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లోని పానిపట్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల యువతి తన స్నేహితుడిని కలవడానికి నోయిడాలోని ఎన్నారై సిటీ సొసైటీకి వచ్చింది. రాత్రి పడుకున్న తరువాత బాలిక వాష్‌రూమ్ వెళ్లడానికి లేచింది. ఆ తరువాత ఏమైందో ఏమో గానీ అపార్ట్మెంట్లోని 7వ అంతస్తు కిటికి నుంచి ఒక్కసారిగా కిందపడిపయింది. దీంతో తీవ్రంగా గాయాలపాలైంది దీనిని చూసిన స్థానికులు యువతిని రక్షించేందుకు పరుగులు పెట్టగా.. ప్రమాదం సమయంలో యువతి నగ్నంగా(వివస్త్రగా) ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువతిని ఆసుపత్రికి తరలించారు. కింద పడిపోవడంతో యువతి మెడ విరిగిపోయిందని, చికిత్స అందిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. పస్తుతం యువతి కోమాలోకి వెళ్లిందని తెలిపారు. కాగా యువతి నిద్రమత్తులో అకస్మాత్తుగా కిటికీలోంచి కింద పడిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు అయినప్పటికీ యువతి ప్రమాదవశాత్తు కిందపడిపోయిందా లేక ఎవరైనా తోసేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరగపుతున్నారు. యువతి కోమాలోకి వెళ్లిపోవడంతో ఆమె నుంచి ఎలాంటి వివరాలు సేకరించలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్పృహలోకి రాగానే నిజానిజాలు తెలుస్తాయని పేర్కొన్నారు. రోవైపు బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. చదవండి: కుమార్తె నిశ్చితార్థం రద్దు.. తండ్రి ఆత్మహత్య! అదే విధంగా యువతి స్నేహితుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అయితే యువతి తనను కలిసేందుకు తరుచూ అపార్ట్‌మెంట్‌కు వస్తుంటుందని ఆమె స్నేహితుడు పోలీసులకు తెలిపారు. ఘటన జరిగిన రోజు ఇద్దరు కలిసి పార్టీ చేసుకున్నట్లు పేర్కొన్నాడు. రాత్రి పడుకున్న తరువాత మద్యం మత్తులో ఉన్న బాలిక బాత్రూమ్ వైపు వెళ్లిందని తెలిపాడు. మద్యం మత్తులో ఆమె కిటికీ నుంచి కిందపడి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటనపై పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి.. -
జూనియర్ విద్యార్థినితో పరిచయం.. వాట్సాప్‌లో అశ్లీల దృశ్యాలు
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): యువతిని ప్రేమ పేరుతో నమ్మించి అశ్లీల దృశ్యాలను వాట్సాప్‌లో పెట్టి వికృతంగా వ్యవహరించిన యువకుడి ఉదంతం హుబ్లీలో వెలుగు చూసింది. మహారాష్ట్రలోని షిరిడీకి చెందిన యువకుడు హుబ్లీలో నర్సింగ్ కోర్సు చదువుతున్నాడు. తన జూనియర్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని ఫోన్లో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. అనంతరం వాట్సాప్‌ద్వారా వీడియోకాల్ చేసి ఆమె నగ్న దృశ్యాలను రికార్డు చేశాడు. వాటిని ఎడిట్ చేసి ఫొటోలను ఈనెల 11న వాట్సాప్‌లో పెట్టాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హస్కి వాయిస్.. న్యూడ్ వీడియో కాల్స్ చేయించుకోని..
సాక్షి, హిమాయత్‌నగర్(హైదరాబాద్): అందమైన అమ్మాయిల ఫొటోలు పంపి, ఆపై న్యూడ్ వీడియోకాల్ చేపించుకుని నగర వాసి నుంచి డబ్బులు వసూలు చేశారు సైబర్ నేరగాడు. క్యాప్చర్ చేసిన వీడియోను అడ్డుపెట్టుకుని పలు దఫాలుగా పెద్ద మొత్తంలో లక్షలు వసూలు చేయడంతో..బాధితుడు న్యాయం కావాలంటూ సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల నగర యువకుడికి ఓ వ్యక్తి అమ్మాయిల వాట్సప్‌లో పరిచయమయ్యాడు. సాంకేతికను అడ్డం పెట్టుకుని పలుమార్లు అమ్మాయి గొంతుతో మాట్లాడారు.. దుస్తులు ధరించినవి, దుస్తులు లేకుండా(న్యూడ్) ఉన్న ఫొటోస్‌ని పంపి యువకుడికి గాలం వేశారు. ఇలా రెండు, మూడు పర్యాయాలు వాట్సప్ వీడియో కాల్ చేపించుకున్నారు. అవతలి వ్యక్తి కనిపించకుండానే..యువకుడిని దుస్తులు విప్పాలన్నారు. ఆపై యువకుడి వీడియోను రికార్డ్ చేశారు. తదనంతరం డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే నీ న్యూడ్ వీడియోను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో పాటు..యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. దీంతో వారు చెప్పిన విధంగా యువకుడు పలు దఫాలుగా ఇప్పటి వరకు రూ.4లక్షలు పంపాడు. ఎంత పంపినా తీసుకుంటున్నారే కానీ..వీడియో డిలీట్ చేయడం లేదని, మరికొన్ని డబ్బులు కావాలని వేధిస్తుండటంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి తాము దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. -
వర్షాల కోసం నగ్నంగా బాలికల ఊరేగింపు
దమోహ్(మధ్యప్రదేశ్): ఆధునిక యుగంలోనూ దురాచారాలకు అడ్డుకట్ట పడడం లేదనడానికి ఇది మరో ఉదాహరణ. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆరుగురు మైనర్ బాలికలతో నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం దమోహ్ జిల్లాలో జబేరా పోలీసు స్టేషన్ పరిధిలోని బనియా గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకొనే దురాగతానికి ఒడిగట్టారు. దీనికి సంబంధించిన రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగ్న ప్రదర్శనకు బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. వర్షాల కోసం కప్పను ఒక దుంగకు కట్టి, గ్రామంలో ఊరేగించడం చాలామందికి తెలిసిందే. బనియా గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి, వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. -
నగ్నంగా బీచ్‌లో.. ఊహించని ఘటనతో పరుగో పరుగు
ఒక పక్క కొత్త వేరియెంట్ల విజృంభణ. మరోవైపు లాక్డౌన్ తరహా ఆంక్షల విధింపు. అనవసరంగా బయట అడుగుపెట్టొద్దనే ఆదేశాలు. అయినా కూడా ఆస్ట్రేలియాలో ఆదేశాల్ని పెడచెవిన పెట్టి నిబంధనల్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ విచిత్రమైన ఘటనలో ఇద్దరికి మొట్టికాయలు వేశారు అధికారులు. సౌత్‌వేల్స్: సౌత్ సిడ్నికీ చెందిన ఇద్దరు వ్యక్తులు.. సన్‌బాత్ కోసమని ఆదివారం మధ్యాహ్నాం దగ్గర్లోని బీచ్‌కు చేరుకున్నారు. నగ్నంగా ఒడ్డున కూర్చుని సూర్య కాంతిని ఆస్వాదిస్తున్నారు. ఆ టైంలో ఎటునుంచి వచ్చిందో తెలియదుగానీ.. ఓ దుప్పి వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. అంతే.. దానిని చూడగానే వాళ్ల గుండెలు జారిపోయాయి. అక్కడి నుంచి పరుగులు అందుకున్నారు. వాళ్లను తరుముతూ అది వెనకాలే వెళ్లింది. ఆ కంగారులో పక్కనే ఉన్న రాయల్ నేషనల్ పార్క్‌లోకి దౌడు తీశారు వాళ్లిద్దరూ. ఇక వాళ్ల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రంతా గాలించి ఆ వ్యక్తుల్ని (ఒకరి వయసు 30, మరొకరి వయసు 49) ఆచూకీ కనిపెట్టగలిగారు. ఇద్దరూ ఓ చెట్టు మీద దాక్కుని రక్షించమని కేకలు వేస్తున్నారు. ‘ఇలాంటి మూర్ఖులను ఎలాంటి చట్టాలతో అడ్డుకోవాలో అర్థం కావట్లేదు’ అని సౌత్ వేల్స్ పోలీస్ కమిషన్ మిక్ ఫుల్లర్ వ్యాఖ్యానించాడు. కరోనా ఉల్లంఘనల నేరం కింద ఇద్దరికీ 760 డాలర్ల ఫైన్ విధించారు. సౌత్ వేల్స్ స్టేట్‌లో కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే సౌత్ వేల్స్లో 40మందికి జరిమానాలు విధించారు అధికారులు. చదవండి: పాత ఎఫైర్.. తన పేషీలోని జాబ్.. మంత్రి రాసలీలలు -
నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చి..
వేలూరు(తిరువణ్ణామలై): తిరువణ్ణామలై అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసేందుకు సౌత్ ఇండియా నదుల అనుసంధానం రైతుల సంఘం ఆధ్వర్యంలో వందవాసికి చెందిన చక్రపాణి, కలశపాక్కం తాలుకా మేల్ సామ్‌కుప్పం గ్రామానికి చెందిన రాజేంద్రన్ ఇద్దరూ తిరువణ్ణామలై వచ్చారు. అనంతరం తిరువణ్ణామలై తాలుకా కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు పెరియార్ విగ్రహం నుంచి కాలి నడకన నగ్నంగా నడిచి వచ్చారు. గమనించిన బందోబస్తులో ఉన్న పోలీసులు వెంటనే దుస్తులు కప్పి నామినేషన్ దాఖలు చేయకుండా నిలిపి వేశారు. దీంతో ఇద్దరు రైతులు నడి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న అయ్యాకన్నుతో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యాకన్ను మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి అమిత్‌షా రైతుల సంఘాలను ఢిల్లీకి పిలిపించి రూ.6 వేలు పింఛన్ రైతులందరికీ అందజేస్తామని, రైతులు పండించే పంటలకు రెండింతలు ఇస్తామని, గోదావరి–కావేరి నదులను అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే ఆయన తమ డిమాండ్లను ఏమీ పరిష్కరించలేదన్నారు. వీటిని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని తిరువణ్ణామలైలో బీజేపీ పోటీ చేసే నియోజక వర్గంలో పోటీచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. దీంతోనే నగ్నంగా నామినేషన్ వేసేందుకు వచ్చినట్లు తెలిపారు. నగ్నంగా వచ్చిన ఇద్దరు రైతు నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చదవండి: ఘోరం: అందరూ చూస్తుండగానే... భర్త చేష్టలతో విసుగుచెంది... -
జూమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో నగ్నంగా..
బ్రెసీలియా: లాక్డౌన్ వల్ల అనేక రంగాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరిగా మారింది. అధికారులు సైతం ఇళ్లలో నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షలు జరుపుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతున్నాయి. తాజాగా దేశాధ్యక్షునికి సైతం ఓ చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. కరోనా కట్టడిలో భాగంగా అనుసరిస్తున్న లాక్డౌన్ ఫలితాలపై చర్చిందుకు సావో పాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు పాలో స్కాఫ్ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఇందులో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారోతో పాటు పది మంది ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ఇంతలోనే ఆ వీడియో కాల్లో ఓ వ్యక్తి నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. (బొల్సొనారో ఆసుపత్రికి వెళ్లింది అందుకేనా !) దీంతో ఖంగు తిన్న అధ్యక్షడు జైల్ బొల్సనారో.. "పాలో, ఈ కాల్లో చివర్లో ఉన్న వ్యక్తి బాగానే ఉన్నాడు కదా?" అని అనుమానాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ఇతర అధికారులు సదరు వ్యక్తిని కాన్ఫరెన్స్ నుంచి తొలగించారు. ఈ వీడియో గురించి పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడ్స్ మాట్లాడుతూ.. "అతను నగ్నంగా స్నానం చేస్తున్నాడు. ఈ మీటింగ్ వేడి వేడిగా జరుగుతోంది. అందుకని అతను చన్నీళ్లతో స్నానం చేస్తున్నాడు" అని చమత్కరించారు. కాగా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఏప్రిల్‌లోనూ ఓ బ్రెజిల్ జడ్జి చొక్కా వేసుకోకుండా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. (కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్) -
నగ్నంగా నిల్చోబెట్టి వైద్య పరీక్షలు
సూరత్: ‘పీరియడ్స్’లో ఉన్న విద్యార్థినులను గుర్తించేందుకు కాలేజ్ హాస్టల్లో వారి లోదుస్తులను విప్పించిన అమానవీయ ఘటన మరవకముందే.. అదే రాష్ట్రంలో మరో ఘటన జరిగింది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్ఎంసీ)లోని ట్రైనీ మహిళా క్లర్క్‌లను అందరినీ ఒకే చోట నగ్నంగా నిల్చోబెట్టి అవమానించారు. దీనిపై శుక్రవారం సూరత్ మున్సిపల్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో క్లర్క్‌లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది మహిళలు, నిబంధనల్లో భాగంగా వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి గైనకాలజీ విభాగంలో వైద్యులు, సిబ్బంది వారిని ఒకే గదిలో వివస్త్రలుగా నిల్చోబెట్టి పరీక్షించారు. అవివాహితులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. వారిని అభ్యంతరకర ప్రశ్నలతో అవమానించారు. ఈ ఘటన ‘సూరత్ మున్సిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్’లో గురువారం జరిగింది. దీనిపై వారు సూరత్ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో, విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషనర్ కమిటీని నియమించారు. ట్రైనీ క్లర్క్‌లపై జరిగిన ఈ అమానవీయ ఘటన∙విమర్శలకు కారణమైంది. శిక్షణ అనంతరం విధులను నిర్వర్తించేందుకు అవసరమైన శారీరక సామర్ధ్యం వారికి ఉందా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఎస్ఎంసీలో క్లర్క్‌లుగా ఎంపికైనవారికి తప్పని సరిగా చేస్తారు. అయితే, వైద్య పరీక్షలకు తాము వ్యతిరేకం కాదని, కానీ పరీక్షలు జరిపిన తీరే అభ్యంతరకరంగా ఉందని ఎస్ఎంసీ ఉద్యోగ సంఘం విమర్శించింది. ప్రతీ మహిళకు ప్రత్యేకంగా, ఒంటరిగా పరీక్షలు జరపడం పద్ధతి. అక్కడి డాక్లర్లు అభ్యంతరకర రీతిలో గర్భధారణపై ప్రశ్నలు అడిగారని సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
న్యూడ్‌గా కనిపించడం నా ఛాయిస్!
‘‘చుట్టూ సినిమా టీమ్ ఉంది. డైరెక్టర్ ఫ్రాన్సిస్ నా దగ్గరకొచ్చి, నేనప్పుడు చేస్తోన్న సీన్లో నేను మిస్ చేసిన చిన్న కరెక్షన్ చెబుతున్నాడు. అప్పుడు నా ఒంటి మీద బట్టలున్నట్టుగానే ఆయన నన్ను చూశాడు. నేనూ నా ఒంటి మీద బట్టలున్నట్టే భావించా. చుట్టూ ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్స్. నాకేం ఇబ్బంది అనిపించలేదు.’’ జెన్నిఫర్ చెప్పిన మాటలివి. ‘రెడ్ స్పారో’ సినిమాలో సందర్భానుసారం ఒక సన్నివేశంలో జెన్నిఫర్ న్యూడ్‌గా కనిపించింది. ‘‘సినిమా కథ ప్రకారం, ఆ పాత్ర అప్పుడు న్యూడ్‌గా కనిపించడం అవసరం అనుకున్నా. నో చెప్పలేదు. సినిమాల్లో న్యూడ్‌గా కనిపించాలనుకోవడం నా ఛాయిస్. ఇక్కడ ఆ అవసరం ఉందని, చుట్టూ ఉన్నవాళ్లూ కథ గురించే ఆలోచిస్తారనే ఆ సీన్ చేశా..’’ అని చెప్పుకొచ్చిందామె. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. -
ఒక కాజ్ కోసం న్యూడ్ ఫొటోషూట్!
పెర్త్: సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఎల్జీబీటీ కమ్యూనిటీకి అండగా నిలబడాలని పెర్త్ హాకీ ఆటగాళ్లు నిర్ణయించారు. ఇందుకోసం వాళ్లు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ఊహించనిరీతిలో ఒంటిపై దుస్తులు విడిచి.. నగ్నంగా క్యాలెండర్ల ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. సమాజంలో స్వలింగ సంపర్కులపై ఎంతో వివక్ష నెలకొందని, వారు ఎన్నో రకాలుగా దూషణలు ఎదుర్కొంటున్నారని, దీనికి వ్యతిరేకంగా తాము నిలబడాలని నిర్ణయించామని ద పెర్త్ పైథాన్ హాకీ జట్టు ఆటగాడు రీడ్ స్మిత్ తెలిపాడు. పెర్త్ పైథాన్ పురుష జట్టుతోపాటు ఆస్ట్రేలియా జాతీయ జట్టు ప్లేయర్స్ సైతం ఈ నగ్న ఫొటోషూట్‌లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. హాకీని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేయడంతోపాటు హోమోఫొబియోకు వ్యతిరేకంగా నిలబడేందుకు తాము ఫొటోషూట్‌లో పాల్గొన్నామని పెర్త్ పైథాన్ జట్టు ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఈ నెల 23న హాకీ ఆటగాళ్ల నగ్న క్యాలెండర్‌ను విడుదల చేయనున్నారు. -
అంత డబ్బు ఇస్తే.. 'నగ్న'సత్యాలు చెబుతా!
మెల్బోర్న్ : వెస్టిండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ ఆటతో ఎంత ఫేమసో.. వివాదాల్లోనూ అంతే. ఇటీవల జరిగన ఓ వివాదం గురించి వివరించాలంటే తనకు గంట సమయం పడుతుందని, ఒకవేళ సీక్రెట్స్ తెలుసుకోవాలనుకున్న మీడియా తనకు దాదాపు రూ. 2 కోట్లు (3 లక్షల అమెరికన్ డాలర్లు) మేర నగదు చెల్లిస్తే చెబుతానని కండీషన్ పెట్టాడు. ఇందుకు సంబంధించి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశాడు. అసలు వివాదమేంటి? 2015 వన్డే ప్రపంచ కప్ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన మహిళా మసాజ్ థెరపిస్ట్ లిన్నే రస్సెల్ డ్రెస్సింగ్ రూములోకి రాగా, గేల్ తాను కట్టుకున్న టవాల్ విప్పేసి నగ్నంగా మారినట్లు ఆమె ఆరోపించింది. లిన్నే రస్సెల్‌కు గేల్ తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గత జనవరిలో సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్బెర్రా టైమ్స్ లలో కథనాలు వచ్చాయి. తనపై తప్పుడు కథనాలు ప్రచురించారని మీడియాపై పరువునష్టం దావా వేశాడు. గత నెల చివరివారంలో విచారణ చేపట్టిన ఎన్ఎస్డబ్ల్యూ సుప్రీంకోర్టు గేల్‌కు మద్ధతు తెలిపింది. దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తిపై సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కథనాలు రాయడం సబబు కాదని మీడియాకు ధర్మాసనం సూచించింది. ఆసక్తికర కథ చెప్పాలా.. 'మీకు చెప్పడానికి నాతో ఎంతో ఆసక్తికర కథ ఉంది. అరవై నిమిషాల ఇంటర్వ్యూలో ఆ వివాదాన్ని మీకు వివరిస్తాను. లేకపోతే నా తర్వాతి బుక్ విడుదల చేసే వరకు ఎదురుచూడాల్సిందే. ఆస్ట్రేలియాలో ఏం జరిగింది, నాపై నిషేధం విధించేందుకు కొందరు పెద్ద వ్యక్తులు రంగంలోకి దిగారు. నన్ను ఏ విధంగా బలిపశువును చేయాలని చూశారో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చెబుతాను. సినిమా కథలా చెబుతాను. కనుక ఆ ఇంటర్వ్యూ ఖరీదు అక్షరాలా 3 లక్షల అమెరికన్ డాలర్లు అవుతుందంటూ' మసాజ్ థెరపిస్ట్ తో ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్తితులపై గేల్ ఈ విధంగా ట్వీట్లలో రాసుకొచ్చాడు. దీనిపై గేల్ అభిమానులు ఆయనకు మద్ధతుగా రీట్వీట్లు చేయడం గమనార్హం. I have a very interested successful story to tell!! It can be an exclusive 60mins interview or y’all just have to wait on my next book! It’s about what transpired in court and behind the scenes in Australia, how they went to bigger heads to get me ban... — Chris Gayle (@henrygayle) 9 November 2017 How they want to use me as a scapegoat over a interview-I’ll tell you what I do every day after court, believe me, when I break this down to y’all it will be like a movie! No holding back! Biding starts at US$ 300K for this interview! So much to say & I will! — Chris Gayle (@henrygayle) 9 November 2017 -
'నగ్న' వివాదం: గేల్‌కు భారీ ఊరట
సిడ్నీ: వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ 'నగ్న' వివాదంలో విజయం సాధించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కోర్టును ఆశ్రయించగా అతడినే విజయం వరించింది. 2015 ప్రపంచకప్ సందర్భంగా డ్రస్సింగ్ రూమ్‌లో గేల్ ఉన్న సమయంలో మసాజ్ థెరపిస్ట్ లిన్నే రస్సెల్ ఆ గదికి వచ్చి టవల్ వెతుకుతోంది. ఆ సమయంలో అక్కడే ఉన్న గేల్ ఏం వెతుకుతున్నావంటూ ఆమెను అడిగగా.. టవల్ కోసమని ఆమె బదులిచ్చారు. తాను కట్టుకున్న టవల్ విప్పి నగ్నంగా మారిన గేల్.. ఆ టవల్ ఇదేనా అంటూ లీన్నె రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గత జనవరిలో సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్బెర్రా టైమ్స్ లలో కథనాలు వచ్చాయి. ఆరోపణలపై గతంలోనే స్పందించిన గేల్.. వివాదాన్ని పరిష్కరించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే కొన్ని ఆస్ట్రేలియా మీడియా సంస్థలు తన ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపిస్తూ గత వారం గేల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోమవావరం విచారణ జరిపిన ఎన్ఎస్డబ్ల్యూ సుప్రీంకోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 'ఆధారాలు లేకుండా మీడియా ఆసక్తికర కథనాలు రాసిందే తప్ప అందులో నిజనిజాలు తెలుసుకునే యత్నం చేయలేదు. దేశం తరఫున ఆడే ఉన్నత వ్యక్తి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవరిస్తారంటూ' కోర్టు పత్రికల యాజమాన్యాలను ప్రశ్నించింది. 'నేను చాలా మంచి వ్యక్తిని. దీనికి సిగ్గు పడాల్సిన పనిలేదు. కోర్టు తీర్పు నాకు అనుకూలంగా రావడంతో సంతోషంగా ఉన్నాను' అని గేల్ కోర్టు తీర్పు అనంతరం గేల్ వ్యాఖ్యానించాడు. విస్టిండీస్ జట్టు ఆటగాడు, గేల్ సహచరుడు డ్వేన్ స్మిత్ సైతం కోర్టుకు హాజరై.. గేల్ పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పాడు. ఆరోజు టవల్ విప్పేసి గేలా అలా అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణల్లో వాస్తవం లేదని కోర్టుకు వివరించాడు. మరోవైపు బాధితురాలు లిన్నే రస్సెల్ ఇటీవల మీడియా ముందుకు వచ్చి.. గేల్ నగ్నంగా మారి తనతో అసభ్యంగా, అమర్యాదగా ప్రవర్తించాడని ఆరోపించడం వివాదానికి దారితీసింది. -
ఆ దీవిలోకి పురుషులకు మాత్రమే ఎంట్రీ
-
అక్కడికి వెళ్లాలంటే నగ్నంగా ప్రయాణించాల్సిందే..!
టోక్యో(జపాన్): పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న జపాన్‌లోని ఓ దీవికి యునెస్కో ప్రపంచ వారస్వత గుర్తింపు లభించింది. కొన్ని వందల ఏళ్లుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాధించటం ఆచారంగా వస్తోంది. ఈ దీవిలోకి మహిళలకు అనుమతి లేదు. ఆ పవిత్ర ప్రాంతంలో ప్రవేశించే పురుషులు అక్కడి ఆచారాలను తుచ తప్పకుండా అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా అక్కడి సముద్రంలో నగ్నంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటలపాటు జరిగే వేడుకకు గాను 200 మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు. యునెస్కో గుర్తింపుతో ఈ దీవికి విపరీతమైన ప్రచారం దక్కనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది. దీంతో ఒకినోషిమా దీవి ప్రత్యేకత, పవిత్రత దెబ్బతింటాయని అక్కడి పూజారులు భావిస్తున్నారట. ఈ కారణం చేతనే భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకులను అనుమతించబోమని, కేవలం పూజారులనే రానిస్తామని చెబుతున్నారు. అయితే, ఆడవారికి ప్రవేశం నిరాకరించటంపై ఓ అధికారి స్పందిస్తూ.. దీనిపై తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు. మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవటం చాలా ప్రమాదకరమని భావిస్తారని, శతాబ్ధాలనాటి ఆనవాయితీని దేవాలయాన్ని మార్చుకోబోదని అన్నారు. ఇలాంటి నిషేధాన్ని మహిళలను రక్షించటానికే పెట్టిఉంటారని అన్నారు. కొరియా ద్వీపకల్పాన్ని, చైనాను కలిపే చోట ఈ దీవి ఉంటుంది. గతంలో ఇక్కడ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు లభించాయి. అవి ఎటువంటి అవరోధాలు లేకుండా సముద్ర ప్రయాణం సాగినందుకు ఇక్కడి దేవతను ఆరాధించిన వ్యాపారులు సమర్పించినవి అయి ఉంటాయని ఆలయ పూజారి మునకత తైషా తెలిపారు. కాగా, ఇటీవల పోలండ్‌లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్ కమిటీ ఆదివారం తాజాగా ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి. దీంతోపాటు భారత్‌లోని అహ్మదాబాద్ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్ దీవుల్లోని టపుటపువాటీ అనే పొలినేషియన్ ట్రయాంగిల్ కూడా ఉంది. అలాగే, యూకేలో లేక్ డిస్ట్రిక్ట్, ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగో వార్ఫ్ అనేవి కూడా ఉన్నాయి. -
ఆడా, మగా తేడాలేకుండా న్యూడ్‌గా..
సిడ్నీ : సిడ్నీ స్కిన్నీ ఓషియన్ స్విమ్ ఐదో వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం నూలు పోగులేకుండా స్విమ్మర్లు సముద్రతీరంలో సందడి చేశారు. ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కోబ్లర్స్ బీచ్‌లో మొత్తం 1335 మంది స్విమ్మర్లు ఆడ, మగా తేడా లేకుండా ఒంటిపై నూలు పోగుకూడా లేకుండా సముద్రంలో ఈత కొట్టారు. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ న్యూరోసర్జన్ చార్లీ టీయో, సర్ఫింగ్‌లో ప్రపంచ చాంపియన్ లేన్ బీచ్లేలు కూడా న్యూడ్‌గా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. న్యూడ్‌గా బీచ్‌లోకి రావడంమే కాకుండా 300 నుంచి 900 మీటర్ల స్మిమ్మింగ్ పోటీల్లో వీరందరూ పాల్గొన్నారు. అయితే ఇవి స్విమ్మింగ్ రేసులు మాత్రం కాదని ఆర్గనైజర్లు తెలిపారు. ఆస్ట్రేలియన్ చారిటీల కోసం, మంచి పనులు చేయడానికి నిధులు సమకూర్చడానికి ఈ న్యూడ్ స్విమ్ ఈవెంట్ ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. 'ప్రతి ఒక్కరూ ఎలాంటి ఇబ్బందిలేకుండా న్యూడ్‌గా నీళ్లలో సరదాగా దిగండి. న్యూడ్‌గా ఉండటం మాత్రమే ఈ ఈవెంట్ ప్రధాన అంశం కాదు. మిమ్మల్ని మీరు ప్రకృతితో మమేకమై సరదగా గడుపుతున్నామని భావించండి' అని ఈ కార్యక్రమానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బీచ్‌లే అన్నారు. -
లండన్‌లో తొలి నగ్న రెస్టారెంట్!
లండన్: బాహ్య ప్రపంచపు కట్టుబాట్లను కాసేపు పక్కనబెట్టి ఎంచక్కా నచ్చినట్లు నగ్నంగా రెస్టారెంట్లో గడపాలనుకునే వారికి స్వర్గధామంలాంటి రెస్టారెంట్ ఒకటి లండన్‌లో ప్రారంభానికి సిద్ధమైంది. ‘ది బునియాది(పునాది)గా పిలిచే ఈ రెస్టారెంట్లో తప్పదనుకుంటే పొదుపుగా దుస్తులను వేసుకున్న వారికీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శాఖాహార, మాంసాహార వంటలను మట్టికుండల్లో, ‘తినగల’ చెంచాలతో వడ్డిస్తారు. ఈ చెంచాలను ఆహారపదార్ధాలతో తయారుచేస్తారు. రసాయనాలులేని వంటలు ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. ఇప్పటికే రెస్టారెంట్‌కు వెయిటింగ్ లిస్ట్ ఏకంగా 44,200కు చేరింది. రెస్టారెంట్లో ఒకేసారి కేవలం 42 మంది మాత్రమే కూర్చునే సదుపాయం ఉంది. విద్యుత్, ఫోన్, దుస్తులు ఇలా ఎలాంటివి లేని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం ఈ రెస్టారెంట్‌ను నెలకొల్పినట్లు రెస్టారెంట్ మాతృసంస్థ అయిన ‘లాలీపాప్’ వ్యవస్థాపకుడు సెబ్ లేయాల్ ప్రకటించారు. శనివారం ప్రారంభంకానున్న ఈ రెస్టారెంట్లో పూర్తి నగ్నంగా ఉండే కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగా ఇంటీరియర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కొవ్వొత్తుల కాంతుల్లో.. వెదురుకర్రలతో చేసిన ఏర్పాట్లు రెస్టారెంట్‌కు కొత్త శోభను తెస్తాయన్నారు. -
మేన కోడలిపై అత్యాచారం.. ఫొటోలతో బెదిరింపులు!
హైదరాబాద్: ఓ యువతిపై ఆమె సొంత మేనమామే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. అజయ్ అనే యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న తన మేనకోడలిని కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగక ఆమె నగ్న ఫొటోలను సెల్ఫోన్లో తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికినైనా చెబితే ఫొటోలు ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేస్తానంటూ బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
ఆవిడ గురించి తెలిస్తే.. అబ్బో అనాల్సిందే!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలినియా ట్రంప్ గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. మెలేనియా స్లోవెనియాకు చెందిన వలసదారు. 2005లో బిలియనీర్ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్‌ను పెళ్లాడిన తర్వాతే ఆమె అమెరికా పౌరసత్వం పొందారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే.. అమెరికా మొదటి పౌరురాలి (ఫస్ట్ లేడీ)గా కీర్తి పొందిన రెండో విదేశీయురాలిగా ఆమె గుర్తింపు పొందనున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ క్వీన్సీ ఆడం సతీమణి లూసియా కూడా ప్రవాసురాలే. మ్యాగజీన్ కోసం నగ్నంగా పోజు.. సూపర్ మోడల్ అయిన మెలినియా 1996లో అమెరికాలో తన కెరీర్ ప్రారంభించి.. సొంతంగా వ్యాపారవేత్తగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. 'మెలినియా టైంపీసెస్ అండ్ ఫ్యాషన్ జ్యువెలరీ' పేరిట ఆమె బంగారు అభరణాలు అమ్మే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా 2000 బ్రిటిష్ మ్యాగజీన్ 'జీక్యూ' కోసం ఆమె ఓసారి నగ్నం పోజు ఇచ్చారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ఓ మ్యాగజీన్లో నగ్నంగా కనిపించిన తొలి అమెరికా ప్రథమ పౌరురాలు ఆమెనే కానుంది. డొనాల్డ్ ట్రంప్‌తో ఫస్ట్ డేట్.. డొనాల్డ్ ట్రంపే మొదట మెలినియాపై మనస్సు పడ్డారు. ఆమె ఫోన్ నెంబర్ అడిగారు. అయితే ఆయన అప్పటికే వేరే మహిళతో డేటింగ్ చేస్తుండటంతో మెలినియా నంబర్ ఇవ్వలేదట. 'ఆయన నా నంబర్ అడిగారు. కానీ ఆయన వేరే డేటింగ్ లో ఉన్నారు. అందుకే నేను ఇవ్వలేదు. కానీ ఆయన నంబర్‌ను నేను అడిగాను. తర్వాత కాల్ చేస్తానని చెప్పాను. అయితే, ఆయన ఏ నంబర్ ఇస్తాడోనని నేను అనుకున్నాను. ఒకవేళ వ్యాపార నంబర్ ఇస్తే.. నేను మీతో బిజినెస్ చేయడం లేదని చెప్దామనుకున్నా..' అని అప్పటి విషయాన్ని మెలినియా గుర్తుచేసుకుంటారు. అయితే ట్రంప్ మూడు ఫోన్ నంబర్లు ఇచ్చి ఒకటి ఎంచుకోమని చెప్పాడట. ఆ తర్వాత వారిద్దరు కలువడం, ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. రాజకీయాలకు దూరం! 'రాజకీయాలు నా భర్త పని. అందుకే బహిరంగంగా రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను. వ్యక్తిగత జీవితానికి వస్తే ఆయన గురించి ప్రతిదీ నాకు తెలుసు. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలూ చూసుకుంటాను. అయినా నేను ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించాను. అది నా సొంతం నిర్ణయం. నేను నాలాగా ఉండటమే ఇష్టం. దానిని మా ఆయన కూడా ఇష్టపడతారని భావిస్తున్నా' అని మెలినియా తెలిపింది. -
గర్భిణిని వివస్త్రను చేసిన వ్యక్తుల అరెస్ట్
పరారీలో మరో ముగ్గురు సీకేఎం ఆస్పత్రికి బాధితురాలి తరలింపు వర్ధన్నపేటటౌన్ : మానవత్వం మరిచి అనాగరికంగా ఓ గర్భిణీని వివస్త్రను చేసి ఒంటిపై కా ల్చి హత్యాయత్నం చేసిన నిందితులను ఆరుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు వర్ధన్నపేట సీఐ సంతోష్ తెలిపారు. మండలంలోని డీసీ తండాలో సోమవారం బానోత్ రవి రెండో భార్య అనితపై అతడి మొదటి భార్య స్వరూ ప బంధువులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీ సులు నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు. సీఐ కథనం ప్రకారం.. డీసీ తండాకు చెందిన బానోతు రవికి అదే తండాకు చెందిన యువతితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సంవత్స రం రవి అదేతండాకు చెందిన అనితను తీసుకెళ్లి తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు రవిపై ఫిర్యాదు చేయగా అతడిపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇటీవల న్యాయస్థానంలో రవికి అనుకూలంగా తీ ర్పు వచ్చింది. దీంతో రవి అనిత డీసీ తండా లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి మొదటి భార్య స్వరూప, రెండో భార్య అనిత తమను దూషిం చారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం స్వరూప, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి అనిత, ఆమె తల్లి నర్సిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. కొర్రాయితో అనితను కాలుస్తూ నిప్పులు మీద పోయడంతో పరుగెత్తింది. ఆమెను వెంబ డించి వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి భాధితులను ఆస్పత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనిత తండ్రి తావు ఫిర్యా దు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, వారిలో బానోతు స్వరూప, మాలోతు హేమ్ల, మాలోతు భద్రి, మాలోతు సాయిలు, బానోతు కమలమ్మ, బానోతు సాలిని అరెస్టు చేశారు. పరారీలో మాలోతు మహేష్, మాలోతు బుజ్జి, మా లోతు విజయ ఉన్నారు. సమావేశంలో ఎస్సై రవిరాజు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రాణాపాయం లేదు : గైనకాలజిస్టు విజయలక్ష్మి దాడికి గురైన అనిత ఆరు నెలల గర్భిణి. ఆమెకు పలుచోట్ల కాలిన గాయాలున్నాయి. గర్భంలో శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఆమె కాలిన గాయాలకు చికిత్స కోసం వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తరలించాం. -
యువతిని వివస్త్రను చేయలేదు
బెంగళూరు ఘటనపై వివరణ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం * ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడి * నివేదిక సమర్పించాలని కోరిన కేంద్రం బెంగళూరు/న్యూఢిల్లీ: టాంజానియా యువతిని నడి రోడ్డుపై వివస్త్రను చేసి భౌతిక దాడికి పాల్పడిన ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన దౌత్యపర వివాదంగా మారింది. ‘ఆ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు అరెస్టయ్యారు. దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాతో మాట్లాడారు. ఘటనపై కేంద్రానికి నివేదిక పంపిస్తాం’ అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. కాగా, యువతిని వివస్త్రను చేసినట్లు వస్తున్న వార్తలను కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర ఖండించారు. ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలు, బాధితురాలిని కాపాడేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటకను కేంద్ర హోం శాఖ సూచించింది. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఢిల్లీలో టాంజానియా హైకమిషనర్ జాన్ కిజాజీ కోరారు. కాగా, జాన్ కిజాజీతో కూడిన బృందం శుక్రవారం బెంగళూరుకు వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సిద్ధరామయ్యను వివరణ కోరిన రాహుల్ యువతిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం సిద్ధరామయ్యను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ కోరినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. రాహుల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ టాంజానియా యువతిపై జరిగిన దాడి ఘటనకు బాధ్యులైన వారిపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ను బీజేపీ దుయ్యబట్టింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బెంగళూరు నగరానికి అపకీర్తి తెచ్చిందని పేర్కొంది. కర్ణాటక డీజీపీని వెంటనే బదిలీ చేయాలని, సంబంధిత పోలీసు అధికారులను సస్సెండ్ చేయాలని కేంద్ర మంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. -
వీళ్లా మగాళ్లు!
మహిళకు ఎక్కడా రక్షణ లేదు. రోడ్డు మీద, బస్సులో, స్కూల్లో, ఆఫీస్‌లో... చివరికి ఇంట్లో కూడా లేదు! ఇన్ని భూతాలతో మహిళ నిత్యం పోరాడుతుంటే... ఇప్పుడు ఇంకో భూతం తయారైంది. దీని భూతం అనాలా? బూతు అనాలా? ఇంటర్నెట్లో అమ్మాయిల ఫొటోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా చూపించడం... నోటికొచ్చినట్లు కామెంట్ చెయ్యడం... మళ్లీ వీటన్నిటినీ సర్కులేట్ చెయ్యడం..! డర్టీ మగాళ్ల పిరికి బిహేవియర్ ఇది. ఈ సిగ్గులేని, నీతిమాలిన పిరికిపందలు మగాళ్లెలా అవుతారు?! సాగరికా ఘోష్ ప్రసిద్ధ టీవీ జర్నలిస్ట్. ట్విట్టర్లో ఆమె చాలా చురుకుగా ఉండేవారు. అయితే సడన్‌గా ఆమె ట్విట్టర్ జోలికే వెళ్లడం మానేశారు. కారణం. తనపై వచ్చిన బ్యాడ్ కామెంట్స్. మొదటైతే ఆ కామెంట్స్‌ని సాగరిక పట్టించుకోలేదు. టీనేజ్‌లో ఉన్న తన కూతురినీ ఆ కామెంట్స్ టార్గెట్ చేయడంతో ఆమె చాలా డిస్టర్బ్ అయ్యారు. ఏం చేయాలో అర్థంకాలేదు. కొన్నాళ్లు మాటకు మాట ఇచ్చారు కానీ, కామెంట్లు శృతిమించడంతో ట్విట్టర్‌ని వదిలేశారు. ప్రఖ్యాత మహిళా కార్యకర్త కవితా కృష్ణన్దీ ఇలాంటి అనుభవమే. ఒకసారి ఆమె మహిళల మీద హింసకు వ్యతిరేకంగా ఆన్లైన్లో చాట్ చేస్తుంటే.. ఉన్నట్టుండి ఓ వ్యక్తి హఠాత్తుగా ‘నిన్ను రేప్ చేయడానికి కండోమ్‌తో వస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు’ అంటూ అసభ్యంగా చాట్ చేయసాగాడు. అంతే వెంటనే ఆ చాట్లోంచి సైన్ ఆఫ్ అయిపోయారు కవిత. ‘‘నేను చాట్‌చేసిన సైట్ రెడిఫ్ డాట్ కామ్. అలాంటి పదజాలంతో ఉన్న ఆ చాట్‌ను రెడిఫ్ డాట్ కామ్ బ్లాక్ చేయకపోవడం పట్ల చాలా బాధేసింది’’ అన్నారు కవితా కృష్ణన్ నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ. వీళ్లిద్దరి కంటే కొంచెం గుండె దిటవైన మనిషి సోనాక్షీ సిన్హా. ఆమె ‘లావు’ గురించి ట్విటర్లో చాలాకాలం పాటు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. వాటిని సోనాక్షీ తిప్పి కొట్టగలిగారు. ఆ ఇష్యూ అక్కడితో ముగిసిపోయింది. సోషల్ మీడియాను కొందరు మగాళ్లు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో కళ్లకుకటే ్ట‘సైబర్ బుల్లీయింగ్’ సంఘటనలివి. ఇంటర్నెట్ను, సోషల్ నెట్వర్క్ వెబ్సైట్లనూ ఉపయోగించి, సంఘంలో పేరు ప్రతిష్ఠలు, సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తులపై ఆకతాయిలు అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం ఇటీవల ఎక్కువైపోయింది. బుల్ అంటే దున్నపోతు. అంటే జడివాన కురిసినా, చలనం లేనట్టుండే బండ జంతువు. సైబర్ బుల్లీయింగ్ కూడా అంతే. అవతలి వారు ఏమైపోతే నాకేం అన్నట్టు... ప్రవర్తించే మానవ మృగాలు చేసే పని కాబట్టి ఆ ప్రవృత్తిని అలా అనడం సమంజసమే! ఫొటోలు మార్ఫింగ్ చేయడం, ఫేక్‌బుక్ అకౌంట్లు ఓపెన్ చేయటం, వారి పేరుతో ఇతరులకు అభ్యంతరకరమైన కామెంట్లు చేయటం, రకరకాల వెకిలి చేష్టలు చేయటం, అశ్లీలమైన ఫొటోలు పోస్ట్ చేయటం... ఇలాంటివన్నీ సైబర్ బుల్లీయింగ్ కిందికే వస్తాయి. సైబర్ బుల్లీయింగ్ బారిన పడి ఎన్నో ఎన్నో కాపురాలు కూలిపోయాయి. మరెందరి జీవితాలో బలయ్యాయి. పరువే ప్రాణంగా బతికే సున్నిత మనస్కులు మనస్తాపంతో ఆత్మహత్యలకు ప్రయత్నించే ప్రమాదం ఉంది. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించి, వెలుగును పంచవచ్చు, ఇంటి చూరుకు నిప్పు పెట్టి, బతుకును బుగ్గిపాలూ చేయవచ్చు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దీపం వెలిగించి, వెలుగును పంచడానికే వినియోగించుకోవాలి తప్ప కుసంస్కారంతో సాటి మనుషులను బాధపెట్టకూడదు. సంస్కారవంతులు పెరగాలి ఫోటోషాప్‌లో మొహాలు మార్చేసే ‘మార్ఫింగ్’ ప్రక్రియ నెట్లో చాలా జోరుగా సాగుతోంది. అసభ్యంగా ఉండే ఫొటోలకు, అభ్యంతరకర వీడియోలకు సెలబ్రిటీల మొహాలు అతికించేసి, కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారు. అంతేకాదు, తమకు ఏ అమ్మాయి మీద అయినా పగ ఉంటే, ఆ అమ్మాయి పరువు తీయడానికి కూడా ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది చాలా దారుణమైన విషయం. - అదా శర్మ, కథానాయిక బహిర్గతం చెయ్యకూడదు ముఖ్యంగా అమ్మాయిల పట్ల ఈ సైబర్ ప్రపంచం పెనుభూతంగా మారిందనే చెప్పాలి. ఈ నేరాలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే ఏకంగా జీవితాలనే నాశనం చేసేస్తున్నాయి. ఆన్లైన్లో అపరిచితులకు వ్యక్తిగత విషయాలు చెప్పడం శ్రేయస్కరం కాదు. ముఖ పరిచయం లేనివారితో మాట్లాడకపోవడమే క్షేమం. - నందిత, నటి చట్టాలేవీ లేవు సైబర్ బుల్లీయింగ్‌కి సంబంధించి పటిష్ఠమైన చట్టాలేవీ మన దేశంలో లేవు. ఇప్పుడున్న సైబర్ లా (ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000) కూడా సైబర్ బుల్లీయింగ్‌కి సంబంధించిన అంశాల మీద చురుగ్గా ఏమీ స్పందించట్లేదు. అందుకే దీన్ని సైబర్ లాతో అనుసంధానించకుండా సైబర్ బుల్లీయింగ్‌కి ప్రత్యేకమైన చట్టం తేవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ నేరం చేసిన వాళ్లకు కనీసం ఏడేళ్ల జైలు శిక్షతోపాటు 50 లక్షల రూపాయల జరిమానా విధించాలి. అలాగే బాధితులకు జరిగిన న ష్టాన్ని, మనస్తాపాన్ని బట్టి వాళ్లకు 50 కోట్ల రూపాయల నష్టపరిహారాన్నీ ఇప్పించాలి. - పవన్ దుగ్గల్, సైబర్ లా ఎక్స్పర్ట్, సుప్రీంకోర్టు న్యాయవాది కంప్లయింట్ ముఖ్యం ఫేస్బుక్ లాంటి వాటిల్లో అబ్యూజ్ లాంగ్వేజ్, న్యూడ్ఫోటో పోస్టింగ్స్లాంటివి పెట్టి... బాధితులు కంప్లయింట్ చేసినా ఏమీ చేయలేని పరిస్థితీ ఉంటుంది. ఎందుకంటే ఫేస్బుక్ అమెరికన్ సంస్థ. అక్కడి చట్టాల ప్రకారం అది రూపొందింది. ఇండియాలో ఫేస్బుక్ ద్వారా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యల మీద చర్య తీసుకోవడానికి వివరాలు కావాలని ఆ సంస్థకు పంపిస్తే స్పందించదు. ఇండియాలో అయితే ఇన్వెస్టిగేషన్ టీమ్ అడిగిన ఏ వివరాన్నయినా ఇటు ప్రైవేట్ అటు పబ్లిక్ ఏజెన్సీ ఏదైనా చెప్పి తీరాల్సిందే. అందుకు బాధితుల ఫిర్యాదు ముఖ్యం. - రాజశేఖర్, సీఐ (సైబర్ క్రైమ్), హైదరాబాద్ వెంటనే స్టాప్ చేయాలి ప్రధానంగా టీనేజ్ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సిందేమిటంటే... మనం ఆన్లైన్లో చేసే కామెంట్ ఏదీ అంతమైపోదు. ఎవరో ఒకరి వాల్ మీద జీవించే ఉంటుంది. దాన్ని గుర్తెరిగి, మనం సంభాషించాలి. ఇక మనమీద వేధింపులు మొదలు కాగానే వాటిని మొగ్గలోనే తుంచేయడం మేలు. ఇక అజ్ఞాతంగా చేసే కామెంట్స్‌నూ లేదా వేధింపులు జరుగుతుంటే అది ఎక్కడి నుంచి జరుగుతోందన్న విషయాలను తవ్వి తీయగల సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అందుబాటులో ఉంది. దాంతోపాటు దీనికి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాల మద్దతు ఉండాలి. - డాక్టర్ పద్మా పాల్వాయి, సైకియాట్రిస్ట్, హైదరాబాద్ -
అమ్మో ఐదు కోట్లా...!
‘‘నా సినిమాలో నటించేవాళ్లు నగ్నంగా నటించాలి. చిత్రీకరణ సమయంలో కుదరదంటే ఒప్పుకోను. అందుకే ముందే ఒప్పంద పత్రంలో సంతకం పెట్టాలి’’ అంటోంది ఏక్తా. ‘శృంగార తార’ ఇమేజ్ సొంతం చేసుకున్న సన్నీ లియోన్ని తన ఎక్స్ఎక్స్ఎక్స్’ చిత్రంలో నటింప జేయాలనుకున్నారామె. సన్నీకి నగ్నంగా నటించడం సమస్య కాదు. కానీ, ‘ఐదు కోట్లు’ పారితోషికం కావాలన్నదట. ఈ పారితోషికం విన్న ఏక్తా కపూర్... ప్రత్యామ్నాయ మార్గాలకోసం అన్వేషిస్తోంది. -
నగ్నంగా తిరుగుతూ విద్యార్థినులకు వేధింపులు
హైదరాబాద్ : నగ్నంగా తిరుగుతూ పాఠశాల విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కథనం ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు రోడ్ నెం.10 అవర్ ప్లేస్ హోటల్ వైపు నుంచి పార్కు మీదగా నడిచి వస్తుంటారు. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న నేపాల్‌కు చెందిన దీపక్ తన ఇద్దరు అనుచరులతో కలిసి నిత్యం ఈ విద్యార్థినుల వెంటపడుతున్నాడు. తన దుస్తులు విప్పేసుకుని వారితో అసభ్యంగా ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా...దీపక్‌ను అరెస్ట్ చేశారు. అతని అనుచరుల కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
అమీర్ దారిలో హీరో నవీన్ కృష్ణ
బెంగళూరు :శాండల్‌వుడ్ నటుడు నవీన్‌కృష్ణ, బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ దారిలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ విషయంలో అనుకుంటున్నారా...తెరపై నగ్నంగా కనిపించడంలో! అవును పి.కె సినిమా మొదటి పోస్టర్లో రైలు పట్టాల మధ్య అమీర్‌ఖాన్ నగ్నంగా కనిపించి పలు వివాదాలకు తెరతీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు శాండల్‌వుడ్ నటుడు నవీన్ కృష్ణ కూడా శాండల్‌వుడ్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా వెండితెరపై నగ్నంగా కనిపించేందుకు ఓకే చెప్పేశారు. నవీన్ కృష్ణ ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా మాటల రచయితగా కూడా పనిచేస్తున్న 'హగ్గద కొనె' సినిమాలో ఈ సన్నివేశాలు కనిపించనున్నాయి. ఈ సినిమాకు దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహిస్తుండగా, ఉమేష్ బనాకార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ రచయిత పర్వతవాణి రాసిన ఓ నాటకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ గడిపే జైలు జీవితం సన్నివేశాలను ఎంతో సహజంగా ప్రేక్షకులకు చూపించడంలో భాగంగానే నవీన్ కృష్ణతో ఈ సన్నివేశాలను చిత్రించామని దర్శకుడు దయాల్ చెబుతున్నారు. ఉరిశిక్షకు చేరువవుతున్న ఓ ఖైదీ నిస్సహాయ పరిస్థితులను, జైలు గోడల మధ్య అతని జీవితాన్ని కృత్రిమంగా చూపించడం తనకు ఇష్టం లేక నవీన్ కృష్ణతో ఈ విషయంపై చర్చించాన న్నారు. ఇందుకు నవీన్‌కృష్ణ అంగీకరించడంతో జైలు ఊచల వెనక నవీన్‌కృష్ణ నగ్నంగా నిలబడి ఉన్న దృశ్యాలను గత గురువారం నగరంలో వేసిన ప్రత్యేక జైలు సెట్లో చిత్రించామని అన్నారు. ఒక నటుడు ఇలా వెండితెరపై నగ్నంగా కనిపించడానికి సన్నద్ధమవడం శాండల్‌వుడ్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. -
'పీకే కోసం సల్మాన్ న్యూడ్ గా మారాలి'
ముంబై: సల్మాన్ ఖాన్ ను బట్టల్లేకుండా చూడాలనుకుంటున్నట్టు ఆమిర్ ఖాన్ వెల్లడించాడు. పీకే' సినిమా పోస్టర్ లో ఆమిర్ ఖాన్ నగ్నంగా కనిపించాడు. ఇదే ఫీట్ సల్మాన్ ఖాన్ చేస్తే చూడాలనివుందని అతడు పేర్కొన్నాడు. ఆమిర్ ఖాన్ ప్రతినాయక పాత్ర పోషించిన 'ధూమ్ 3'ని సల్మాన్ ప్రమోట్ చేశాడు. ఆమిర్ పెట్టుకున్న టోపీ పెట్టుకుని 'బిగ్ బాస్' రియాల్టి షో పాల్గొన్నాడు సల్మాన్. 'బిగ్ బాస్ లో ధూమ్ 3కి సల్మాన్ ప్రచారం చేశాడు. ఇప్పుడు పీకే సినిమాకు అతడు ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు సల్మాన్ చొక్కా మాత్రమే విప్పాడు. ఇప్పుడు ఫ్యాంట్ విప్పాలి. సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ షిప్‌కు ఇది పరీక్ష' అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నాడు. స్నేహితుడి కోసం సల్మాన్ న్యూడ్ గా మారతాడో, లేదో చూడాలి. -
నగ్నంగా కనిపించడం టాలెంటా?
అమీర్ ఖాన్, షారుక్ ఖాన్.. పరిచయమక్కర్లేని పేర్లివి. ఇద్దరూ సినీ పరిశ్రమలో గొప్ప నటులుగా పేరొందినవారే, స్టార్లుగా వెలుగొందుతున్నవారే, బయటెక్కడైనా కలిస్తే చక్కగా పలకరించుకునే వారే. ఇదంతా కనిపించే కోణంలో ఓ భాగం మాత్రమే. కనిపించని మరో కోణంలో ఇద్దరూ స్టార్ స్టేటస్ కోసం ఒకర్నొకరు విమర్శించుకుంటూ.. నువ్వా? నేనా? అన్నట్లు ఫీలయ్యే ఒక సాధారణ ఈగో జీవులు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేంత శత్రుత్వం ఉందనేది ఎప్పుడూ బయటకు కనిపించకపోయినా.. అదే నిజమని చెప్పే సంఘటన ఇది. ఈ మధ్యే విడుదలైన అమీర్ తాజా చిత్రం 'పీకే'కి సంబంధించిన న్యూడ్ పోస్టర్ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ విషయంపైనే షారూక్ స్పందిస్తూ, 'నగ్నంగా నటించడం ఏమైనా గొప్ప విషయమా? దాన్ని టాలెంట్ అని ఎలా అంటాం?' అంటూ చురకలంటించారు. షారూఖ్, తన తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ మాటలన్నారు. వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఇప్పటిదేం కాదు. ఓసారి ఆమీర్ తన బ్లాగులో, 'మా కుక్క పేరు షారుక్ ఖాన్' అంటూ పోస్ట్ చేయడంతో రేగిన దుమారం అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఇక వీరిద్దరి మధ్యన జరిగే మాటల యుద్ధానికి సల్మాన్ ఖాన్ అప్పుడప్పుడూ కాస్త మసాలా జోడిస్తుండడం కొసమెరుపు! కాగా షారుక్ వ్యాఖ్యలను అమీర్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన మనసులో అనేక ఆలోచనలు ఉంటాయని, అయితే వాటన్నింటిని ఎప్పటికప్పుడూ వదిలించుకుంటానని తెలిపాడు. కొంతమంది ఎదుటవారిలో లోపాలు వెదికేందుకు ప్రయత్నిస్తారని, అలాంటివాటికి తాను దూరమని అమీర్ చెప్పుకొచ్చాడు. -
అమీర్ 'పీకే పోస్టర్' వివాదం
-
నేను నగ్నంగా నటించిన మాట నిజమే!
తేజస్వి... ఈ పేరు ప్రస్తుతం ఓ సెన్సేషన్. చిన్న చిన్న పాత్రలు చేస్తూ... ఓవర్‌నైట్ హీరోయిన్ అయిపోయిన లక్కీ గాళ్ తేజస్వి. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రెండు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోందీ ముద్దుగుమ్మ.దక్షిణాదిన ఏ హీరోయిన్నూ చేయలేని ఫీట్ చేసేసి అటు పరిశ్రమలో, ఇటు ప్రేక్షకుల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన ఈ ‘ఐస్‌క్రీమ్’ పాపతో ‘సాక్షి’ జరిపిన స్పెషల్ ఇంటర్వ్యూ. ఏంటి? సంచలనాలు సృష్టించేస్తున్నారు? నేను కాదు... రామ్‌గోపాల్‌వర్మగారు. ఈ ప్రశ్న మీరు ఆయన్నే అడగాలి. న్యూడ్‌గా నటించింది మీరే కదా? వర్మ గారు చేయమంటే చేశాను. ఆయన అలా ఎందుకు చేయమన్నారో తెరపై చూస్తే కానీఅర్థం కాదు. ఎందుకు చేయమన్నా, ఎలా చేయమన్నా, న్యూడ్‌గా చేయడం సాధారణమైన విషయం కాదు కదా. చుట్టూ యూనిట్ సభ్యులు...ఆగండాగండి... అంటే... అందరి ముందూ అలా చేసేశాననా మీ అనుమానం. కాదా? నేనూ అందరిలాంటి అమ్మాయినే. అంతమంది ముందు అలా ఎలా చేస్తాననుకున్నారు? కథ రీత్యా ఈ సన్నివేశం సినిమాకు చాలా ముఖ్యం. ఆ విషయాన్నే వర్మగారు చెప్పారు. అలా చేస్తే తప్ప ఆ సన్నివేశం పండదని నాకూ అనిపించింది. అయితే... ‘అందరి ముందూ ఎలా?’ అని అడిగాను. దానిక్కూడా వర్మగారే పరిష్కారం చెప్పారు. ‘మేమంతా బయటకు వెళ్లిపోతాం. రూమ్‌లో కెమెరా, నువ్వు అంతే... అల్రెడీ కెమెరా ఆన్‌లో ఉంటుంది. నువ్వు దాని ముందు సీన్ చేసేయ్. తర్వాత నువ్వే కెమెరా ఆఫ్ చేసేయ్... దట్సాల్...’’ అన్నారు. ఆయన చెప్పినట్టే చేశాను. సరే... తర్వాత అయినా... కెమెరాలో అందరూ చూస్తారుగా? అసలు నేను ఏం చేశానో, ఎలా చేశానో మీకు చెప్పలేదు కదా. అది రివీల్ చేస్తే కిక్ ఉండదు. అంటే... సినిమాకు హైప్ తీసుకురావడానికి చేసిన చిన్న టెక్నిక్ అన్నమాట. ఇందులో అబద్ధం ఏమీ లేదు. నేను న్యూడ్‌గా చేసిన మాట నిజమే. చిన్న చిన్ని పాత్రలు చేస్తూ ఉన్న ఫళంగా హీరోయిన్ అయిపోయారు. అంతే స్పీడ్‌గా స్టార్ అయిపోదామనా ఈ తాపత్రయం? మీకు తెలీదనుకుంటా. నాకసలు యాక్టింగ్ అంటే ఆసక్తే లేదు. అసలు ఇప్పటివరకూ ఒక్కరిని కూడా నేను అవకాశం అడగలేదు. అవన్నీ వాటంతట అవే నా దగ్గరకొచ్చాయి. అసలు మీ నేపథ్యం ఏంటి? మా అమ్మది గుంటూరు. నాన్నది విజయవాడ. జర్నలిజం చదివాను. చిన్నప్పట్నుంచీ డాన్సంటే ఇష్టం. కూచిపూడి నేర్చుకున్నా. తర్వాత వెస్ట్రన్ డాన్స్, హిపాప్ కూడా నేర్చుకున్నా. ఇంటర్ చదువున్నప్పుడే డాన్స్ క్లాసులు చెప్పేదాన్ని. చాలామందిని నా చేతులతో డాన్సర్లను చేశాను. ఆ డాన్సింగ్ టాలెంట్ వల్లే పాత్రలు వాటంతట అవే నా దగ్గరకొచ్చాయి. మొదట్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘హార్ట్ ఎటాక్’... తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేశాను. ఇప్పుడు హీరోయిన్గా అవకాశాలొస్తున్నాయి. నటనపై మొదట్లో పెద్దగా ఆసక్తి లేకపోయినా... పరిస్థితుల్ని బట్టి నా జీవితం ఇదే అనిపించింది. అందుకే ప్రొసీడ్ అవుతున్నా. సరే... వర్మ కంట్లో ఎలా పడ్డారు? ఏదో సందర్భంలో నా ఫొటో చూశారాయన. వెంటనే... మోహన్‌బాబుగారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ‘విష్ణు పక్కన హీరోయిన్గా చేస్తారా?’ అని. నేను షాక్. వెళ్లి వర్మగారిని కలిశాను. వెంటనే నన్ను ‘ఓకే’ చేసేశారు. ఆ సినిమానే ‘12’. త్వరలో విడుదల కానుంది. ఆ సినిమాలో నేను విష్ణు భార్యగా నటించాను. అందులోని నా నటన నచ్చి వెంటనే ‘ఐస్‌క్రీమ్’ చిత్రానికి హీరోయిన్గా తీసుకున్నారు వర్మ. ‘12’లో నవదీప్ కూడా చేశారు. ఆయన్ను కూడా ఆ సినిమా ద్వారానే హీరోగా ఎంపిక చేసుకున్నారు. అసలు ‘ఐస్‌క్రీమ్’ క్రీమేంటి? ఇదొక హారర్ థ్రిల్లర్. ఓ ఇంట్లో ఓ అమ్మాయికి, ఓ అబ్బాయికీ ఎదురైన అనుభవాలే ఈ సినిమా. సాధారణంగా అమ్మాయిలకు ‘ఐస్‌క్రీమ్’ అంటే ఇష్టం. అలాగే ఈ సినిమాలో నాకు ‘ఐస్‌క్రీమ్’ ఇష్టం. అది ఎలాంటి పరిణామాలకు దారితీసింది? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. వర్మ హారర్ మిస్టరీల్లో ఇది ఓ సంచలనం అవుతుంది. ఇంతకీ... భయపెట్టేది దెయ్యమా? లేక మనుషులేనా? అనేది తెరపైనే చూడాలి. అవకాశాలు ఎలా ఉన్నాయి? ఓంకార్ తమ్ముడు హీరోగా రూపొందుతోన్న ‘ఊర్వశివో రాక్షసివో’ అనే సినిమాలో చేస్తున్నా. అలాగే... ‘హోలీ’ అనే తమిళ సినిమాకు ఇటీవలే సైన్ చేశా. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న చిత్రంలో నాది కీలక పాత్ర.