
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే.
‘‘శని క్రెడిట్ కార్డును గాజాలో పూర్తిగా వాడేశారు. తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నాం’’అంటూ ఆమె తల్లి బావురుమంది. శనివారం ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన కిబుట్జ్ సమీపంలో ఫెస్టివల్ ఆఫ్ పీస్ జరుగుతుండగా హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడిచేసి పలువురిని బందీలుగా గాజాకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment