militants attack
-
మణిపూర్‌లో మిలిటెంట్ల దాడులు..
ఇంఫాల్: మణిపూర్‌లోని కౌట్రుక్, కడంగ్బాండ్ ప్రాంతాల్లో ఆదివారం అనుమానాస్పద మిలిటెంట్ల దాడుల్లో ఇద్దరు చనిపోగా, 9 మంది గాయపడ్డారు. మిలిటెంట్ల దాడులు, ఇళ్లు, ఆస్తుల విధ్వంసం నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో, పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోకి భద్రతా బలగాలను తరలించారు. క్షతగాత్రుల్లో ఐదుగురికి బుల్లెట్ గాయాలు, మిగతా వారికి బాంబు పేలుడు గాయాలను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి తరలించారు. -
మణిపూర్‌లో దుండగుల మెరుపుదాడి
ఇంఫాల్: మణిపూర్‌లోని మోరే పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల మోత మోగింది. భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఎమా కొండోంగ్ లైరెంబి దేవి మందిర్ సమీపంలో భద్రతా బలగాలు నిద్రిస్తున్నాయి. ఈ క్రమంలో దుండగులు దాడులు జరిపారు. చికిమ్ విలేజ్ కొండపై నుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు కేవలం 20 మీటర్ల దూరంలో ఉన్న అసోం రైఫిల్స్ రంగంలోకి దిగి ఎదురుకాల్పులు జరిపారు. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చేపట్టారు. మళ్లీ గంట తర్వాత ఉదయం 5:10 నిమిషాలకు మరోసారి కాల్పులు జరిగాయి. ఎస్బీఐ బ్యాంక్ బిల్డింగ్ దేఖునాయ్ రిసార్ట్ వద్ద మోహరించిన భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు మరొక ఆకస్మిక దాడి చేశారు. రెండోసారి జరిపిన దాడిలో ఓ అధికారి మరణించారు. మరికొంతమంది సైనికులు గాయపడ్డారు. ఇదీ చదవండి: రిపబ్లిక్ డే వేళ ఢిల్లీలో గోడలపై ఖలిస్థానీ రాతల కలకలం -
జర్మనీ మహిళను నగ్నంగా ఊరేగించిన హమాస్
జెరూసలేం: ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి సందర్భంగా బందీలుగా పట్టుకున్న వారిపై హమాస్ మిలిటెంట్ల అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శని లౌక్ అనే జర్మనీ దేశస్తురాలిని శనివారం గాజా వీధుల్లో నగ్నంగా ఊరేగించి పైశాచికానందం పొందడం తెలిసిందే. ‘‘శని క్రెడిట్ కార్డును గాజాలో పూర్తిగా వాడేశారు. తను కనీసం ప్రాణాలతోనైనా ఉందని ఆశపడుతున్నాం’’అంటూ ఆమె తల్లి బావురుమంది. శనివారం ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతమైన కిబుట్జ్ సమీపంలో ఫెస్టివల్ ఆఫ్ పీస్ జరుగుతుండగా హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడిచేసి పలువురిని బందీలుగా గాజాకు తరలించారు. -
Manipur: ఉగ్రవాద కాల్పుల్లో అయిదుగురు పౌరులు మృతి
ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాంగ్పోక్పి జిల్లాలోని బి గామ్నమ్ గ్రామంలోకి మంగళవారం ఉదయం అనేకమంది చొరబడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందారు. మృతుల్లో ఎంపీ ఖుల్లెన్ గ్రామ పెద్దతో పాటు ఎనిమిది సంవత్సరాల చిన్నారి కూడా ఉన్నారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే కుకీ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పౌరులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కాగా ఈ ఘటనను మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది తీవ్రవాద చర్యగా అభివర్ణించారు. చదవండి: Manjula Pradeep: ఎవరీమె... ఏం చేస్తున్నారు.. ఎందుకీ పోరాటం? ఈ ఘటన కుకీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన రెండు రోజుల తర్వాత చోటుచేసుకుంది. ఆదివారం నాడు మఫౌ డ్యామ్ సమీపంలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటేచేసుకున్న విషయం తెలిసిందే. కుకీ ఉగ్రవాదుల సంచారం ఎక్కువగా ఉందన్న సమాచారంతో అక్కడ భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ విషయం తెలిసిన టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో, భద్రతా దళాలు ప్రతిదాడి చేశాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు టెర్రరిస్టులు మృతిచెంచారు. చదవండి: రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. పూజించేందుకు జనం బారులు ఉగ్రవాదుల మృతికి సంతాపంగా బి గామ్నమ్ ప్రాంతంలో ఎంపీ ఖుల్లెన్ గ్రామస్తులు మంగళవారం సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే కొందరు ఉగ్రవాదులు గ్రామంలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్రామ పెద్దతో పాటు నలుగురు పౌరులు మరణించారు. -
భారత్‌లో ఉగ్రదాడులకు అవకాశం
వాషింగ్టన్: భారత్‌లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా వెల్లడించింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370, 35ఏ రద్దు నిర్ణయాలతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత సరిహద్దుల వద్ద దాడులకు తెగబడే అవకాశం ఉందని పేర్కొంది. మిలిటెంట్ గ్రూపులను పాక్ కట్టడి చేయని పక్షంలో భారత్‌పై ఉగ్రమూకలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిపింది. ఈ విషయంలో చైనా పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తాము భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ఇండో పసిఫిక్ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ రాండాల్ శ్రీవర్ వెల్లడించారు. కశ్మీర్ విషయంలో కేవలం దౌత్య, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై మాత్రమే పాక్‌కు చైనా అండగా ఉంటుందని శ్రీవర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ వేదికలపై పాక్‌కు చైనా మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
ఇదే నా చివరి ఫోటో కావొచ్చు..
లక్నో : చనిపోవడానికి కొన్ని గంటల ముందు కేతన్ శర్మ(29) తన ఫోటోను కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశాడు. అంతేకాక బహుశా ఇదే నా లాస్ట్ ఫోటో కావొచ్చు అనే సందేశాన్ని కూడా పంపాడు. అన్నట్లుగానే కొన్ని గంటల వ్యవధిలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు. కేతన్ శర్మ పంపిన చివరి మెసేజ్‌ను తల్చుకుని అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం గురించి కేతన్ శర్మ బావమరిది మాట్లాడుతూ.. ‘కేతన్ నుంచి మాకు మెసేజ్ రాగానే.. చాలా కంగారు పడ్డాం. తనకు కాల్ చేశాం. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆర్మీ అధికారులను కలవగా.. వారు సోమవారం అనంత్‌నాగ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కేతన్ శర్మ తీవ్రంగా గాయపడి మరణించినట్లు తెలిపారు’ అన్నారు. అంత్యక్రియల నిమిత్తం కేతన్ మృతదేహాన్ని మీరట్‌కు తరలించారు. వేలాది మంది ప్రజలు కేతన్కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వచ్చారు. కేతన్ అంకుల్ ఆర్మీలో పని చేస్తుండేవాడు. దాంతో అతను చిన్ననాటి నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలోనే పెరిగాడు. ఆర్మీలో చేరాలని చిన్న వయసు నుంచే కలలు కన్నాడు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆర్మీలో చేరాడు. అతనికి భార్య ఏరా, ఓ కూతురు ఉన్నారు. కేతన్ మరణంతో కుటంబం అంతా శోక సంద్రంలో మునిగి ఉండగా ఇవేం తెలియని అతని చిన్నారి కుమార్తె తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం చూసి ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. #WATCH Army personnel console family members of Army Major Ketan Sharma who lost his life in Anantnag encounter yesterday. His mother says, "Mujhe batado mera sher beta kahan gaya? " #Meerut pic.twitter.com/Rl3wnpQ5gd — ANI UP (@ANINewsUP) June 18, 2019 -
బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని...
పుల్వామా : జమ్మూకశ్మీర్‌లో దారుణం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న ఓ నాయకుడిని ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా రాక్-ఇ-లిటర్ గ్రామానికి చెందిన షబ్బీర్ అహ్మద్ భట్ బీజేపీ అనుకూలంగా జిల్లాలో పనిచేస్తున్నారు. కాగా మంగళవారం అర్థరాత్రి షబ్బీర్‌ను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఈ రోజు(బుధవారం) తెల్లవారు జామున 2.30గంటల పాంత్రంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో షబ్బీర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. శరీరం నిండా బుల్లెట్లతో పడి ఉన్న మృతదేశాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కిడ్నాప్ కలకలం : మృతుల్లో భారతీయుడు
కాబుల్ (అఫ్గానిస్తాన్) : ఉగ్రదాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న అఫ్గానిస్తాన్‌లో మరో కలకలం రేగింది. ఇప్పటికే వలసవాదులపై దాడులకు తెగబడుతున్న తాలిబన్ ఉగ్రవాదులు తాజాగా ముగ్గురు విదేశీయుల్ని చంపారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. వివరాలు.. సోడెక్సో ఇంటర్నేషనల్ ఫుడ్ కంపనీలో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు విధులకు వెళ్తుండగా ఉగ్రవాదులు వారిని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. ముసాహీ జిల్లాలోని పార్కింగ్ చేసి ఉన్న కారులో మృత దేహాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మలేసియా (64), ఇండియా (39), మాసిడోనియా (37) పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారని అంతర్గతభద్రత మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నుష్రత్ రహీమి తెలిపారు. మృతదేహాల పక్కన కొన్ని ఐడీ కార్డులు పడి ఉన్నాయనీ, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. కాగా, ఇన్నాళ్లూ స్వదేశీయుల్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకుంటున్న క్రిమినల్స్ కోవలోకి తీవ్రవాదులు సైతం చేరారు. విదేశీయులే లక్ష్యంగా రెచ్చిపోతూ బాంబు దాడులు, కిడ్నాప్‌లకు తెగబడుతున్నారు. -
ఉగ్రకాల్పుల్లో ఏఎస్ఐ దుర్మరణం
శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో మరో పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. సోమవారం అనంత్‌నాగ్‌లోని మెహందీ కాదల్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్ఐ అబ్దుల్ రషీద్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో రషీద్ వద్ద ఆయుధం లేదు. బుల్లెట్ గాయాలైన రషీద్‌ను వెంటనే దగ్గర్లోని అనంత్‌నాగ్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్ దగ్గర్లోని బదామీబాగ్ కంటోన్మెంట్ సైనిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు శాయశక్తులా కృషిచేసినా ఫలితం లేకుండా పోయింది. -
ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి
- జమ్ముకశ్మీర్‌లోని కృష్ణఘాటి సెక్టార్లో ఘటన శ్రీనగర్: కల్లోల కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత సైన్యాన్ని టార్గెట్ చేసుకుని దాడికి పాల్పడ్డారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిలోని కుల్గామ్ సమీపంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారని, మనవాళ్లు కూడా ముష్కరులపైకి ఎదురుకాల్పులు జరిపారని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని, దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియజేస్తామని అధికారులు చెప్పారు. తాజా సమాచారం ప్రకారం ఉగ్రదాడిలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. పేట్రేగిన పాక్: ఉగ్రదాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు కృష్ణఘటి సెక్టార్‌లోని సరిహద్దు వెంబడి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. అప్రమత్తమైన భారత బలగాలు.. పాక్‌కు గట్టి జవాబిచ్చాయని అధికారులు చెప్పారు. -
మిలిటరీ వాహనాలపై ఉగ్రవాదుల దాడి
గువాహటి: పర్యాటకులకు రక్షణగా వెళుతున్న అసోం రైఫిల్స్‌కు చెందిన వాహనాలపై అనుమానాస్పద ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో ఇద్దరు అధికారులు ప్రాణాలుకోల్పోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరిద్దిరి పరిస్థితి విషమంగా ఉంది. అసోం-అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అసోంలోని టిన్సుకియ జిల్లాలో 53వ జాతీయ రహదారిపై సరిగ్గా జాగున్ 12వ మైల్ బారబస్తీ వద్ద మిలిటీరీ వాహనాలపై ఉగ్రవాదులు గ్రనేడ్‌తో దాడికి దిగారు. అనంతరం కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న జవాన్లు తిరిగి ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. పాంగ్సౌ ఉత్సవానికి వెళ్లొస్తున్న పర్యాటకులకు గస్తీగా మూడు మిలిటీరీ వాహనాలు వెళుతుండగా ఈ దాడి జరిగింది. ప్రస్తుతానికి పర్యాటకులను జాతీయ రహదారికి కొంత దూరంలో నిలిపి చుట్టుపక్కల కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. -
మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు
-
మణిపూర్ సీఎంపై ఉగ్రవాదుల కాల్పులు
ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్ సోమవారం తృటిలో ఉగ్రవాద దాడి నుంచి తప్పించుకున్నారు. ఎన్ఎస్సీఎన్ ఉగ్రవాదులు ఉక్రుల్ హెలిప్యాడ్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కాల్పులు జరిపారు. రాజధాని ఇంఫాల్ కు 84 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛింగాయ్ జిల్లాలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రిపై ఉగ్రవాదులు తెగబడ్డారు. అయితే ఆ కాల్పుల నుంచి ఇబోబీ సింగ్ సురక్షితంగా బయటపడ్డారు. దాంతో సీఎం అక్కడనుంచి హుటాహుటీన తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పోలీసు పోస్ట్ పై ఉగ్రవాదుల దాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బారాముల్లా జిల్లాలోని సొపోర్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మసీదుకు రక్షణ కల్పిస్తున్న పోలీసు పోస్ట్ పై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పోలీసు కానిస్టేబుల్, పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. కానిస్టేబుల్ నుంచి ఐఎన్ఎస్ఏఎస్ తుపాకీని లాక్కుని ఉగ్రవాదులు పారిపోయారని తెలిపారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించినట్టు చెప్పారు. -
మణిపూర్‌లో ఆర్మీ జవాన్ మృతి
- మిలిటెంట్ల దాడిలో చనిపోయినట్టు సమాచారం - శోకసముద్రంలో బెన్నవోలు చోడవరం: దేశ సేవ కోసం వెళ్లిన కొడుకు మిలిటెంట్ల దాడిలో చనిపోయాడని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు. మణిపూర్‌లో విధుల్లో ఉండగా ఆర్మీ జవాన్ మజ్జి శంకరావు(24) మృతి చెందినట్టు మంగళవారం సమాచారం రావడంతో బెన్నవోలులో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బెన్నవోలుకు చెందిన మజ్జి శంకరరావు ఆర్మీలో 2010లో చేరాడు. ఐదేళ్లపాటు ఆర్మీ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇతడు ఢిల్లీలోను విధులు నిర్వహించారు. ఏడాది కిందట మణిపూర్ బదిలీ అయి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉండగా మంగళవారం తెల్లవారు జామున మణిపూర్ మిలిటెంట్లు దాడిలో చనిపోయినట్టు కుటుంబసభ్యులు, బంధువులు భావిస్తున్నారు. మణిపూర్ ఆర్మీ క్యాంపస్ నుంచి ఫోన్‌ద్వారా మృతుడు అన్నయ్య రాజుకు సమాచారం రావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహం గురువారం స్వగ్రామానికి రావచ్చని భావిస్తున్నారు. తమకు దిక్కెవరంటూ రోదన కన్నకొడుకు మృతిచెందాడని తెలియడంతో తల్లిదండ్రులు సత్యవతి, సింహాచలం బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు ఆకస్మికంగా చనిపోయాడని తెలిసి తల్లి సత్యవతి బోరున విలపిస్తోంది. ఆమె రోదన అందరినీ కలిచివేస్తోంది. త్వరలో వివాహం నిశ్చయం: శంకరరావుకు బంధువు కుమార్తెతో వివాహం నిశ్చయించారు. ఈ ఏడాది చివర్లో పెళ్లికి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. ఇంతలో ఘోరం జరిగిపోయిందంటూ బోరున విలిపించారు. గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. అందరిలోనూ విషాదమే కనిపిస్తోంది. స్నేహితుడి అకాల మరణాన్ని అతనితో కలిసి చదువుకున్న మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదుల దాడి: ఒకరు మృతి
జమ్మూ: జమ్మూలో తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కత్వా జిల్లాలోని రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదులు శుక్రవారం తెల్లవారుజామున గ్రానేడ్లతో దాడి చేశారు. అనంతరం పోలీసు స్టేషన్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే స్పందించి తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. ఇరువైపులా కాల్పులు కొనసాగుతున్నాయి. జమ్మూ -పఠాన్‌కోట్ జాతీయరహదారికి సమీపంలోని పోలీసు స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. 2013, సెప్టెంబర్ 26న కత్వా జిల్లాలోని హీరానగర్ పోలీసుస్టేషన్‌పై గెరిల్లాలు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. అనంతరం జమ్ము -పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై ఉన్న ఆర్మీ శిబిరంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. -
చెచెన్యాలో మిలిటెంట్ల కాల్పులు
10 మంది పోలీసుల మృతి ఎదురుకాల్పుల్లో 9 మంది తీవ్రవాదుల హతం గ్రోజ్నీ: రష్యాలోని చెచెన్యా రిపబ్లిక్ రాజధాని గ్రోజ్నీలో మిలిటెంట్లు గురువారం పేట్రేగిపోయారు. పలుకార్లలో వచ్చిన తీవ్రవాదులు ఒక చెక్‌పోస్టు వద్ద ఉన్న 10 మంది ట్రాఫిక్ పోలీసులను కాల్చిచంపారు. తీవ్రవాదులు వస్తున్న కార్లను ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసులను కాల్చి చంపారని చెచెన్ అధ్యక్షుడు రంజాన్ కదిరోవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. తీవ్రవాదులు సెంట్రల్ గ్రోజ్నీలోని ఒక ఆరంతస్థుల భవనాన్ని ఆక్రమించుకున్నారని, ఆరు గంటలకుపైగా జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించారని తెలిపారు. మరికొందరు తీవ్రవాదులు సిటీ స్కూల్లో ఉన్నారని, వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కాకసస్లో ఆందోళనలు సర్వసాధారణమైనప్పటికీ, కదిరోవ్ తీసుకున్న పటిష్ట భద్రతా చర్యలతో కొన్నేళ్లుగా గ్రోజ్నీలో ఎలాంటి హింసాయుత సంఘటనలూ చెలరేగలేదు. -
హిల్లరీకి ఇరాక్ అగ్నిపరీక్ష
బుష్ కాలం నుంచి అమల్లో ఉన్న ‘రాండ్ డాక్ట్రిన్’ను తిరగేసి హిల్లరీ సరికొత్త విధానాన్ని రూపొందించారు. ఇరాన్-ఇరాక్-సిరియాల షియా అనుకూల కూటమికి విరుగుడుగా సున్నీ ఉగ్రవాద మూకలను పెంచి పోషించి, ప్రభుత్వాలను కూల్చే, మార్చే ఆటకు తెరదీశారు. అమెరికాపై చరిత్ర పగబట్టినట్టుంది. వియత్నాం నుండి ఇరాక్, అఫ్ఘానిస్థాన్, సిరియా, ఉక్రెయిన్ల వరకు అది ‘లోక కళ్యాణం’ కోసం ఏంతలపెట్టినా లక్షించినది సిద్ధించలేదు. గరళాన్ని మించిన చేదు ఫలితాలను దింగమింగక తప్పలేదు. ఇరాక్‌లో ‘పేట్రేగుతున్న ఐఎస్ఐఎస్’ భూతాన్ని మట్టుబెట్టబూ నితే అదీ బెడిసికొట్టక తప్పనట్టే ఉంది. లేకపోతే దశాబ్దాల శతృత్వాన్ని మరచి ఇరాన్‌కు స్నేహ హస్తాన్ని చాస్తే చుక్కెదురవు తుందా? ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా ఆలీ ఖమేనీ దాని శీలాన్ని తప్పు పడతాడా? ‘ఇరాక్ అమెరికా శిబిరంలో చేరడమా? లేక స్వతంత్ర ఇరాక్‌ను వాంఛించేవారితో చేరాలా? అనేదే నేటి సంక్షోభం సారం. తన కీలుబొమ్మ ప్రభుత్వాన్ని తేవాలనేదే అమెరికా తాపత్రయం’ అని ఖమేనీ ఆదివారం ప్రకటించారు. ఐఎస్ఐఎస్పై పోరాటానికి తమ ఎలైట్ బలగాలను పంపిన ఆయన ఉగ్రవాదులపై అమెరికా వైమానిక దాడులను అంగీకరించేది లేదని తేల్చేశారు. పైగా ఇది మత పోరు కాదు, ఆధిపత్య పోరని ప్రకటించారు. ఇక ఇరాన్ సైనిక దళాల అధిపతి మేజర్ జనరల్ హసన్ ఫిరోజాబాది ‘ఐఎస్ ఐఎస్ హిల్లరీ క్లింటన్ మానస పుత్రిక. అది షియా, సున్నీల మధ్య యుద్ధాన్ని వాంఛిస్తోంది. అందుకే ఇరాన్-అమెరికా సహకారం అర్థరహితం’ అంటూ బాంబు పేల్చారు. ఇంతకూ అమెరికా విదేశాంగ మంత్రి పదవికి సలాం కొట్టి తన మానాన తాను బతుకుతున్న హిల్లరీని ఫిరోజాబాదీ ఎందుకు రచ్చకెక్కిస్తున్నట్టు? ‘హార్డ్ ఛాయిసెస్’ (సంక్లిష్ట సందిగ్ధాలు) పుస్తకం రాసుకుని అమ్ముకోడానికి కష్టపడుతున్న ఆమెను కష్ట పెట్టడం తగునా? ఈ నెల పదిన విడుదల కావాల్సిన ఆ పుస్తకం ముందుగానే... సరిగ్గా ఇరాక్‌లో ఐఎస్ఐఎస్ సృష్టించిన సంక్షోభంతో పాటే ‘లీకయింది’. ఇరాక్‌పై ఒబామా వైఖరి పూర్తిగా సరైనదంటూ ఆ పుస్తకంలో కితాబులిచ్చిన హిల్లరీ... సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని కూల్చ డం కోసం ఆయన మిలిటెంట్లకు సహాయాన్ని అందించకపోవ డాన్ని తప్పుపట్టారు. ఇరాక్‌పై ఒబామా వైఖరి మాత్రం నేటి వరకు సరైనదేనని సూచించారు. 2010 ఎన్నికల్లో ప్రధాని నౌరి అల్ మలికి ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా ప్రత్యర్థి అలావీయే పై చేయి సంపాదించారనేది బహిరంగ రహస్యం. నేటి ‘షియా ఉన్మాది, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించగల ప్రభుత్వానికి నేతృత్వం వహించే శక్తిలేని’ మలికిని దొడ్డిదారిన గెలిపించినది ఒబామా. అది 2002 నుంచి బుష్ అనుసరించిన ‘రాండ్ డాక్ట్రిన్’ (విధానం) కొనసాగింపు. అది 9/11 ఉగ్రవాద దాడుల తదుపరి అరబ్బు ప్రపంచంలో అమెరికా అనుసరించాల్సిన విధానాన్ని సూచించింది. నేడు మొసుల్, తిక్రిత్ వంటి నగరా ల్లో షియాలపట్ల సున్నీలలో రగులుతున్న తీవ్ర విద్వేషాలకు అదే కారణం. ఆ నగరాలన్నిటా అప్పట్లో సున్నీల ఊచకోత సాగింది. ఆ ఘనకార్యానికే నోబెల్ ‘శాంతి’ దూత ఒబామా మలికికి రెండోసారి పట్టంగట్టారు. హఠాత్తుగా ఇప్పడు ఎందుకు ఆయనపై కన్నెర్ర చేస్తున్నట్టు? ‘రాండ్ డాక్ట్రిన్’ చెత్తబుట్టకు చేరి, ‘హిల్లరీ డాక్ట్రిన్’ అమలులోకి వచ్చింది కాబట్టి. మలికి అమెరికా కీలుబొమ్మగా మిగిలిపోక తోటి షియా దేశమైన ఇరాన్‌తో చెయ్యి కలిపారు. ఇరాన్‌కు ఇటు సిరియాతోనూ అటు రష్యాతోనూ ఉన్న అనుబంధం అందరికీ తె లిసిందే. ఎప్పటిలాగే అమెరికా ఆశించినదానికి విరుద్ధంగా ‘దుష్ట రాజ్యం’ ఇరాన్ ప్రాంతీయశక్తిగా బలపడింది. పైగా అసద్‌తో సైతం మలికి చేయి కలిపాడు! కాబట్టే ‘పెంటగాన్ ప్రియతమ నేత’ హిల్లరీ రాండ్డాక్ట్రిన్ను తిరగేసి అమెరికాకు సరికొత్త విధానాన్ని రూపొందించారు. ఇరాన్ - ఇరాక్ - సిరియాల షియా అనుకూల కూటమికి విరుగుడుగా 9/11 దాడులకు కారణమైన సున్నీ ఉగ్రవాద మూకలను పెంచి పోషించి, ప్రభుత్వాలను కూల్చే, మార్చే ఆటకు తెరదీశారు. హిల్లరీ అయితే సిరియాలో సైనిక జోక్యం చేసుకొనేదంటూ సౌదీ, ఇజ్రాయెల్ నేతలు ఒబామాను పిరికి అధ్యక్షునిగా ఊరికే దుయ్యబట్టలేదు. సిరియా ప్రభుత్వాన్ని కూల్చే కథ అడ్డం తిరగడానికి ఒబామాయే కారణమని ‘సంక్లిష్ట సందిగ్ధాలు’లో హిల్లరీ స్పష్టంగానే ధ్వనించారు. సిరియాలో చేసిన తప్పును ఒబామా ఇరాక్‌లో ‘దిద్దుకుంటున్నారు’. ఆదిలోనే హంసపాదులా ‘హిల్లరీ మానస పుత్రిక’ సైతం చిక్కుల్లోపడింది. ఇరాన్ అమెరికా ఐఎస్ఐఎస్ వ్యతిరేక పోరాటం బుట్టలో పడ లేదు సరికదా... సౌదీ అరేబియా సైతం అమెరికా సైనిక జోక్యానికి అడ్డు చెబుతోంది. ఇరాన్, అమెరికాలు ఒక పక్షాన నిలవడం కాదుగానీ... ఇరాన్, రష్యా, సౌదీలు ఒక్కటై నిలిచే అవకాశాలు తెరుచుకుంటున్నాయి. భావి అధ్యక్షురాలుగా వెలిగిపోతున్న హిల్లరీ భవిష్యత్తు ఇరాక్‌లో తేలే పరిస్థితి ఏర్పడింది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
ఆపదలో 40 మంది విశాఖవాసులు
ఇరాక్‌లో ఓ కంటైనర్లోతిండీ, నీళ్లూ లేకుండా.. వారిని సురక్షితంగా తీసుకురావాలని స్నేహితుల వినతి ఏజెంట్ మోసంతో నెలలుగా ఢిల్లీలో మరికొందరి పడిగాపులు ‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకున్న బాధితులు సాక్షి, న్యూఢిల్లీ: బతుకుతెరువు కోసం ఇరాక్ వెళ్లిన తెలుగువారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. అంతర్యుద్ధంతో అట్టుడుకున్న ఆ దేశంలోని నజాఫ్‌లో దాదాపు 40 మంది విశాఖపట్నం జిల్లా వాసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తమను పనిలోకి తీసుకున్న కంపెనీ తమను ఓ కంటైనర్ ఉంచిందని, తిండీ, నీళ్లూ లేకుండా భయం భయంగా గడుపుతున్నామని, తమను కాపాడాలని వేడుకుంటున్నారు. వీరు ఈ నెల 18నే ఇరాక్ వెళ్లారు. వీరి స్నేహితులు ఆదివారం ఢిల్లీలో ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి ఈ వివరాలు వెల్లడించారు. బాధితులను సురక్షితంగా భారత్‌కు తీసుకురావాలని కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఇరాక్ వెళ్లేందుకు ఢిల్లీ వరకు వచ్చి ఏజెంట్ల మోసం వల్ల ఆగిపోయిన మరికొందరు విశాఖ వాసులు కూడా తమకు సాయం చేయాలని కోరారు. రాజమండ్రి సమీపంలోని రావులపాలెం మండలం ఓబలంక గ్రామానికి చెందిన మేడిపాటి వెంకటకృష్ణ అనే ఏజెంట్ తమను ఇరాక్‌కు పంపుతానని మోసం చేశాడని ఆరోపించారు. తమ వద్ద నుంచి లక్షల్లో డబ్బులు దండుకుని, పాస్‌పోర్టులు తీసుకుని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయారు. విశాఖ జిల్లాకు చెందిన పి. బాపినాయుడు(కసిమికోట), కృష్ణ(హరిపాలెం), ఎం ఉమామహేశ్వరావు, మల్ల అప్పారావు, శివకుమార్, శంకర్, సురేశ్(తిమ్మరాజిపేట) తదితర బాధితులు సాక్షితో గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఇరాక్‌లో మా జిల్లా వాళ్లు 40 మంది దాకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. రెండు రోజుల కిందట మాతో ఫోన్లో మాట్లాడారు. ఓ కంటైనర్‌లో ఉన్నామని, భోజనం, నీళ్లు అందడం లేదని చెప్పారు. తమను ఎలాగైనా కాపాడాలని కోరారు’ అని ఉమామహేశ్వరరావు చెప్పాడు. రెండు నిమిషాలే మాట్లాడారని, వాళ్ల ఫోన్లు కలవడం లేదని తెలిపాడు. ఇరాక్ పరిస్థితులు తెలిసి కూడా ఏమీ జరగదని నమ్మించి వెంకటకృష్ణ వారిని ఈ నెల 18న అక్కడికి పంపారని మల్ల అప్పారావు ఆరోపించారు. ఢిల్లీలో నెలలుగా పడిగాపులు..: ఇరాక్ వెళ్లేందుకు లక్షల్లో సొమ్ము ఇచ్చి మోసపోయిన బాధితులు ఢిల్లీలో నెలలుగా పడిగాపులు కాస్తున్నారు. వీరిలో కొందరు ఇరాక్ వెళ్లి వచ్చిన వారు కూడా ఉన్నారు. హరిపాలెంకు చెందిన కృష్ణ అనే బాధితుడు మాట్లాడుతూ.. ‘ఫిట్టర్లు, వెల్డర్లకు ఇరాక్‌లో మంచి జీతాలు ఉంటాయని వెంకటకృష్ణ చెబితే ఆశపడ్డాం. ఒక్కొక్కరం రూ.1.5 లక్షల వరకు ఇచ్చాం. మా డబ్బులు, పాస్‌పోర్టులు తీసుకుని మమ్మల్ని మార్చిలో ఇరాక్ పంపారు. బాగ్దాద్ ఎయిర్‌పోర్టులో తనిఖీలో మావి నకిలీ వీసాలని తెలిసి పోలీసులు పట్టుకున్నారు. చాలా ఇబ్బందులు పడి తిరిగొచ్చాం. ఢిల్లీకి వచ్చిన ఏజెంట్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. తిండి తిప్పలు లేవు. వెంకటకృష్ణ మా జిల్లా వాళ్ల నుంచి రూ.60 లక్షలు దండుకున్నాడు’ అని తెలిపాడు. వెంకటకృష్ణ నకిలీ వీసాలు చూపుతూ తమను మోసగిస్తున్నాడని మరో బాధితుడు చెప్పాడు. డబ్బులు, పాస్‌పోర్టుల కోసం ఆనంద్నికేతన్లోని ఏజెంట్ ఆఫీసు చుట్టూ తిరిగామని, ఓ చెక్కు ఇచ్చి చేతులు దులుపుకున్నారని బాబినాయుడు అనే బాధితుడు చెప్పాడు. ఇరాక్‌లో చిక్కుకున్న తమ స్నేహితులనురప్పించి, ఏజెంట్ మోసాల బారినుంచి కాపాడేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బాధితులు కోరారు. బాధితుల వివరాలు సేకరించిన ఏపీ ప్రభుత్వం బాధితుల గోడుపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు కార్యాలయ వర్గాలు బాధితులు వివరాలతోపాటు, ఇరాక్‌లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించాయి. ఈ అంశాన్ని సోమవారం విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్తామన్నాయి. మరో రెండు పట్టణాలు మిలిటెంట్ల చేతికి.. బాగ్దాద్: ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్లు మరో రెండు పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సిరియా సరిహద్దులోని వ్యూహాత్మక అల్ కాయిమ్ క్రాసింగ్‌పై పట్టు సాధించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్ జిహాదీలు ఆదివారం రవా, అనా పట్టణాలను చేజిక్కించుకున్నారు. వీరి ధాటికి ఈ పట్టణాలతో పాటు, అల్ క్వాయిమ్ నుంచి ప్రభుత్వ బలగాలు వ్యూహాత్మకంగా తప్పుకున్నాయి. అక్కడి తిరిగి మోహరించేందుకే తప్పుకున్నామని ప్రభుత్వం తెలిపింది. మిలిటెంట్ల స్వాధీనంలోని తిక్రిత్‌లో వాయుసేన దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపోయారు. సున్నీ మిలిటెంట్లు తమ అధీనంలోని మోసుల్‌లో షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. కాగా, ఇరాక్ మిలిటెంట్లు బలం పుంజుకుని, పొరుగు దేశాలనూ అస్థిరపరచే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాక్‌లో బందీలైన భారతీయుల విడుదల కోసం ఇరాక్‌లో భారత రాయబారిగా పనిచేసిన సురేశ్ రెడ్డి అక్కడి అధికారులతో చర్చిస్తున్నారు. -
స్టాక్ మార్కెట్ పై ఇరాక్ దెబ్బ
భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. బుధవారం ట్రేడింగ్ లో నిన్నటి ముగింపుకు 54 పాయింట్ల లాభంతో ఆరంభమైన సెన్సెక్స్.. ఓదశలో 25,609 గరిష్ట స్థాయిని నమోదు చేసుకుంది. అయితే ఇరాక్ రిఫైనరీలపై మిలిటెంట్లు దాడి చేశారనే వార్తల ప్రభావంతో అనూహ్యంగా ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 350 పాయింట్ల నష్టంతో 25171 వద్ద, నిఫ్టీ 101 పాయింట్ల పతనంతో 7,529 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో అత్యధికంగా బీపీసీఎల్ 3.93 శాతం, భెల్ 2.36, ఐడీఎఫ్ సీ 2.28 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.10, టీసీఎస్ 2.07 శాతం నష్టపోయాయి. కొటాక్ మహీంద్ర, సిప్లా, అల్ట్రా టెక్ సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, యాక్సీస్ బ్యాంక్ లు స్వల్ప లాభాల్లో ట్నేడ్ అవుతున్నాయి. -
తాలిబాన్ల దాడిలో 28 మంది మృతి
కరాచీ: పాకిస్తాన్ కరాచీ పట్టణంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబాన్లు చేసిన దాడిలో మొత్తం 28 మంది మృతి చెందారు. తరచూ బాంబుదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఏకంగా ఆ దేశ ఆర్థిక రాజధాని అయిన కరాచీలోని విమానాశ్రయంపైనే దాడికి తెగబడ్డారు. ఆదివారం రాత్రి నుంచి ఈ దాడి కొనసాగుతోంది. తొలుత ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లోని పాత టెర్మినల్ వద్ద హ్యాండ్ గ్రనేడ్ విసిరారు. విమానాశ్రయంలోని పాత టెర్మినల్ వద్ద గల ఫోకర్ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరిగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడిలో చనిపోయిన 28 మందిలో 14 మంది పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది ఉన్నారు. తీవ్రవాదుల ఏరివేత కోసం భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. విమానాశ్రయన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. -
మోడీపై సంధించిన ‘హెరాత్’
బైలైన్ ఎంజే అక్బర్ తాలిబన్లు అఫ్ఘాన్‌లోని మన దౌత్య కార్యాలయంపై సాగించిన విధ్వంసం, విధ్వంసం కోసమే జరిగింది కాదు. అంతకు మించిన మానసిక ప్రభావాన్ని కలుగజేయాలని ఉద్దేశించినది. మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా... బందీలుగా పట్టుకున్న భారతీయులను ఒక్కొక్కరిని హతమార్చుతుండటం ఆయనకు ఎంతటి కఠిన పరీక్ష అయ్యేదో ఊహించవచ్చు. ముసుగు యుద్ధం ముందస్తు హెచ్చరికతో మొదలయ్యేది కాదు. అది సైన్యం చేసే యుద్ధం కాదు, మిలిటెంట్లు చేసేది. దేశం పేరు మీద లేక అందరి ఆమోదాన్ని పొందిన జెనీవా ఒప్పందం నిబంధనలకు కట్టుబడి చేసే యుద్ధం కాదు. ఏదో ఒక అభూత కాల్పనిక లక్ష్యాన్ని అన్వేషిస్తూ వర్తమాన వ్యవస్థను ధ్వంసించడానికి పాశవికత, ఉగ్రవాదాలతో చేసే కార్యాచరణ అది. ఈ యుద్ధంలోని హింసాకాండ చుక్కల్లాగా పదుల సంఖ్యలోని భౌగోళిక స్థలాలపై పరుచుకుని ఉంటుంది. ఉగ్రవాది మనస్సులో ఆ చుక్కలన్నీ ఒక దానితో ఒకటి కలిసి మొత్తం చిత్తరువు రూపుదిద్దుకుంటుంది. అఫ్ఘానిస్థాన్ నుంచి నాటో సేనల ఉపసంహరణ అనంతరపు శకంలోని తొలి దాడి మొదలైంది. అమెరికా మిలిటరీ అకాడమీలో పట్టభద్రులైన 2014 తరగతి క్యాడెట్లనుద్దేశించి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగిస్తుండగా ఆ దాడి జరగడం పూర్తిగా తార్కికమైనదే. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడి (9/11) తర్వాత అఫ్ఘాన్ లేదా ఇరాక్ యుద్ధాల్లో పాల్గొనాల్సిన అవసరం లేని మొదటి బ్యాచ్ క్యాడెట్లు వారేనని ఒబామా ఆ సందర్భంగా అన్నారు. 9/11కు చాలా ముందు నుంచి పోరాడుతూ, అమెరికా సేనలు (అమెరికా కూడా కాదనే ఆశ) రణ రంగాన్ని వీడిన చాలా కాలం తర్వాత సైతం పోరాడుతూనే ఉండే ‘వారికి’ ఆ సందేశం స్పష్టంగా, గట్టిగా వినిపించింది. ఇంతకూ ‘వారు’ ఎవరు? భిన్న తాలిబన్ గ్రూపులూ, లష్కరే తోయిబా వంటి వారి భావజాల సహోదరులూ, అలాంటి లక్ష్యాలనే కలిగివున్నా ఆయా సంస్థల ముద్రలు వేయించుకోకుండా పని చేయడమే తమ ఆశయ సాధనకు మంచిదని భావించే వ్యక్తులు, అధికారులందరితో కూడిన కూటమికి చెందినవారంతా. ఆ కూటమిని ‘తాలిబన్ ప్లస్’గా అభివర్ణించడం ఉత్తమం. వారి ప్రథమ శత్రువు భారతదేశమే. హెరాత్‌లోని మన దౌత్య కార్యాలయం వారి మొదటి లక్ష్యం. ఆ విధ్వంసం, విధ్వంసం కోసమే జరిగింది కాదు. అంతకు మించిన మానసిక ప్రభావాన్ని కలుగజేయాలని ఉద్దేశించినది. భారత్‌లో ప్రభుత్వం మారుతుండటమనే పెద్ద పరిణామం జరుగుతుండగా భారత దౌత్యవేత్తలను, ఇతర సిబ్బందిని బందీలను చేసి, వారి ప్రాణాలను పణంగా పెట్టి బేరసారాలు సాగించడమే వారి అసలు ఉద్దేశం. ఉగ్రవాదంపట్ల కఠోర వైఖరిని ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా... ఒక్కొక్కరుగా భారతీయులను హతమార్చుతుండటం ఆయనకు ఎంతటి కఠిన పరీక్ష అయ్యేదో ఊహించవచ్చు. దక్షిణ ఆసియా ప్రాంత ప్రభుత్వాల మధ్య ఏర్పడే ప్రవర్తనా పరమైన వివిధ సమీకరణలు, సమ్మేళనాలను పరిగణనలోకి తీసుకుని చూడండి. ఎంతమంది సార్క్ నేతలు ప్రమాణ స్వీకారానికి రాగలిగేవారు లేదా వచ్చి ఉండేవారు? ఇంత జరుగుతున్నా మోడీ తమను ఆహ్వానించాలనే అనుకుంటున్నారా? అని వారు తప్పక అనుకునేవారు. ప్రజాగ్రహం ఎంతగా కట్టలు తెంచుకునేది? మన టెలివిజన్ చానళ్లలో క్రమం తప్పకుండా దర్శనమిచ్చే పాక్ వ్యతిరేక దుందుడుకు వైఖరి వత్తాసుదార్లు ఉప్పందించడంతో ఆ ఆగ్రహం మరింకెంతో ఉప్పొంగిపోయేది కాదా? ఉద్వేగభరితమైన ఉద్రిక్తత లు మన వీధుల్లో హింసకు దారి తీసేవి కావా? సమాధానాలు మనకు తెలియదు. కానీ అవి మన భద్ర తా వ్యవస్థ నేతల ఆలోచనల్లో సుళ్లు తిరిగే ఉండాలి. అదృష్టవశాత్తూ ప్రధాని నరేంద్రమోడీ అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. దోవల్ మన ఇంటెలిజెన్స్ సంస్థల హీరో. ఆ శక్తులు విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తరలించి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని పరీక్షకు గురిచేయడాన్ని ఆయన చూశారు. మన పారా మిలిటరీ బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాల ఫలితంగా హెరాత్ కుట్ర విఫలమైంది. ఏంతో కాలం గడవక ముందే మోడీ ప్రభుత్వం ఇలాంటి పరీక్షకు మళ్లీ గురికానున్నదనడం నిస్సందేహం. మన దేశంలోని ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి మూడు విస్పష్ట పార్శ్వాలున్నాయి. అఫ్ఘానిస్థాన్లోని భారతీయుల ఉనికి కచ్చితంగా దౌత్య కార్యకలాపాల పరిధికి, అంతకంటే విస్తృత స్థాయిలోని అభివృద్ధి ప్రాజెక్టుల పరిధికి మాత్రమే పరిమితం. అయినా తాలిబన్ ప్లస్ దాన్ని ‘ఇస్లామిక్ ప్రాంతంలోకి ప్రమాదకరమైన చొరబాటు’గానే చూస్తోంది. అది సోవియట్ లేదా అమెరికా జోక్యం కంటే ఏ మాత్రం తక్కువ తప్పు పట్టాల్సింది కాదని వారు భావిస్తున్నారు. సోవియట్, నాటో సేనలను తరిమేసినవాళ్లకు... భారత్ మనకెంత అనిపించకపోదు. ఈ వైఖరికి పాకిస్థాన్‌లోని అధిక సంఖ్యాకుల మద్దతు లభిస్తోందనడానికి ప్రత్యేకించి ఆధారాలు కావాలనుకునేవారు ఆ టీవీ చానళ్ల చర్చలను గమనించడం సరిపోతుంది. ఇక వారి రెండో లక్ష్యం, చెప్పాల్సిన పనే ముంది... కాశ్మీర్లోయే. అఫ్ఘాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టాక కాశ్మీర్లో హింసాకాండ వెల్లువెత్తింది. తాలిబన్లతో పాటూ పాక్ సైనిక నేతలు ఉంటడం, వారికి నాయక త్వం వహించడమే అందుకు ప్రధాన కారణం. అఫ్ఘాన్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు పాక్ ప్రభుత్వం తాలిబన్ శ్రేణులలోని తమ సైనికులను, ఆఫీసర్లను స్వదేశానికి రప్పించుకోవడానికి గడువును కోరింది. మన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరీకరించడం వారి మూడవ లక్ష్యం. తాలిబన్లు ప్రతిపాదించే మతస్వామ్య నమూనాకు భిన్నంగా లౌకిక ప్రజాస్వామ్యం యువతను ఆకట్టుకునే ప్రత్యామ్నాయం. ఈ వాస్తవం చాలా మంది పాకిస్థానీలలోని ఉన్మాదాన్ని ఎందుకు నయం చేయలేకపోతోందనేది ఆశ్చర్యకరం. హఫీజ్ సయీద్, అతని అనుచరులది కేవలం ఒక్క భారత్‌కు మాత్రమే పరిమితమైన ఎజెండా అని భావిస్తే అది పెద్ద పొరబాటు. పాకిస్థానీల కోసం కూడా వారి వద్ద ఎజెండా ఉంది. భారత్‌ను మతస్వామ్య దేశంగా మార్చలేకపోతే, అప్పుడు వాళ్లు పాక్‌ను మతస్వామ్యంగా మార్చడానికి ప్రయత్నించే అవకాశం పూర్తిగా ఉంది. ఈ నాటో అనంతర యుద్ధం ఒక్క దక్షిణ ఆసియాకే పరిమితమయ్యేది కాదు. అది చైనాను, మధ్య ఆసియాలోని పలు ముస్లిం మెజారిటీ దేశాలను కూడా అందులోకి ఈడుస్తుంది. చైనా ఈ ముప్పు విస్తృతిని గ్రహించడం ప్రారంభించింది. అయితే అది తన విధానాలను మార్చుకోడానికి సమయం తీసుకుంటుంది. యదార్థాలే ఆ మార్పును తీసుకొస్తాయి. భారత, చైనాలు తమ తమ జాతీయ ప్రయోజనాల కోసమే అయినాగానీ సంక్లిష్టమైన ఈ యుద్ధంలో ఒకే పక్షాన నిలిచే సమయం రానుంది. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) -
బస్సుపై తీవ్రవాదుల దాడి: ఐదుగురు మృతి
అసోంలో తీవ్రవాదులు మరోసారి తెగబడ్డారు. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బొడోలాండ్ (ఎన్డీఎఫ్బీ)కు చెందిన తీవ్రవాదులు గత అర్థరాత్రి బస్సుపై దాడి చేశారు. ఆ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి జి.డి.త్రిపాఠి శనివారం ఇక్కడ వెల్లడించారు. తీవ్రవాదులు తుపాకులతో బెదిరించి ప్రయాణికులను బస్సులో నుంచి కిందకి దింపి వారిపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారని తెలిపారు. బెంగాగాన్ నుంచి కోక్రాఝర్ వెళ్తుండగా సెఫంగురి పోలీసు స్టేషన్ పరిధిలోని అతియబరి తినిలి వద్ద ఆ ఘటన చోటు చేసుకుందని వివరించారు. అయితే ఆ ఘటన అనంతరం మరో ఇద్దరు ప్రయాణికులు ఆచూకీ తెలియకుండా పోయిందన్నారు. ఆ దుర్ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి ఘటన స్థలానికి పంపామన్నారు. తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు త్రిపాఠి చెప్పారు.