తాలిబన్లు దాడిచేసిన కరాచీ విమానాశ్రయం
కరాచీ: పాకిస్తాన్ కరాచీ పట్టణంలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంపై తాలిబాన్లు చేసిన దాడిలో మొత్తం 28 మంది మృతి చెందారు. తరచూ బాంబుదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులు ఏకంగా ఆ దేశ ఆర్థిక రాజధాని అయిన కరాచీలోని విమానాశ్రయంపైనే దాడికి తెగబడ్డారు. ఆదివారం రాత్రి నుంచి ఈ దాడి కొనసాగుతోంది. తొలుత ఉగ్రవాదులు ఎయిర్‌పోర్ట్‌లోని పాత టెర్మినల్ వద్ద హ్యాండ్ గ్రనేడ్ విసిరారు.
విమానాశ్రయంలోని పాత టెర్మినల్ వద్ద గల ఫోకర్ బిల్డింగ్‌లో నక్కిన ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరిగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ దాడిలో చనిపోయిన 28 మందిలో 14 మంది పోలీసులు, విమానాశ్రయ సిబ్బంది ఉన్నారు. తీవ్రవాదుల ఏరివేత కోసం భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. విమానాశ్రయన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.