taliban
-
తాలిబన్లను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు
ఆఫ్ఘనిస్తాన్ మహిళల క్రికెట్లో (Afghanistan Women's Cricket Team) నవశకం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ ధీర వనితలు తమ దేశంలో రాజ్యమేలుతున్న ఆటవిక తాలిబన్ల (Taliban) పాలనను వ్యతిరేకించి క్రికెట్ బరిలోకి దిగారు. ప్రతిష్టాత్మక మెల్బోర్న్ మైదానంలో (Melbourne Cricket Ground) క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవెన్‌తో ఇవాళ (జనవరి 30) ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ ఆడారు. మహిళల యాషెస్ (ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్) టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఈ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ వితౌట్ బోర్డర్స్, ఆస్ట్రేలియా ప్రభుత్వం కలిసి ఈ మ్యాచ్‌ను నిర్వహించాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు, అప్పటి నుంచి అక్కడి మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా నిషేధం విధించారు. దీంతో ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్లు ఒక్కొక్కరుగా దేశాన్ని వీడి ఆస్ట్రేలియాలో శరణార్థులుగా తలదాచుకున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా ప్రభుత్వం చొరవతో ఒక్కొక్కరుగా విడిపోయిన ఆఫ్ఘన్ క్రికెటర్లు మూడేళ్ల తర్వాత జట్టుగా కూడి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.చాలాకాలం తర్వాత జట్టుగా బరిలోకి దిగడంతో ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మాకందరికీ ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వీడాం. ఇప్పుడు అందరం కలిసి ఒక్కటయ్యాం అని ఓ ఆఫ్ఘన్ మహిళా క్రికెటర్ భావోద్వేగ ప్రకటన చేసింది. కాగా, ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ ప్రభుత్వం మహిళలపై అనేక అంక్షలు అమల్లో పెట్టిన విషయం తెలిసిందే. అక్కడి మహిళలు ఉన్నత చదువులు చదువకోవడానికి వీల్లేదు. స్వేచ్ఛగా బయట తిరగకూడదు. ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదు. -
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ పాలన.. భారత్‌లో కీలక పరిణామం
ఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ పాలనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తొలిసారిగా భారత్‌లోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఆప్ఘనిస్థాన్ దౌత్యవేత్త కార్యాలయం (కాన్సులేట్) తాత్కాలిక రాయబారిగా విద్యార్థి ఇక్రముద్దీన్ కమిల్ నియమితులయ్యారు. 2021లో ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే తాలిబన్ పాలనను కేంద్రం వ్యతిరేకించింది. భారత్‌లో ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారుల్ని వెనక్కి పంపింది. మూడేళ్ల తర్వాత తాజాగా భారత్‌లోని ఆప్ఘనిస్థాన్ కాన్సులేట్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్‌ను తాలిబన్ ప్రభుత్వం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నియామకంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంది. -
ఉగ్రజాబితా నుంచి తాలిబాన్లను తొలగించిన రష్యా
-
ప్రమాదంలో అఫ్గాన్ ఉనికి
2021 ఆగస్టు 15. భారత్, దక్షిణ కొరియా వంటి పలు దేశాలు స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న వేళ. అఫ్గానిస్తాన్‌లో మాత్రం ప్రజాస్వామ్యం కుప్పకూలింది. దేశం మరోసారి తాలిబన్ల హస్తగతమైంది. వారి మూడేళ్ల అరాచక పాలనలో అత్యంత భారీ మూల్యం చెల్లించుకున్నది, ఇంకా చెల్లించుకుంటున్నదీ మహిళలే. అడుగడుగునా ఆంక్షల నడుమ సర్వ హక్కులూ కోల్పోయారు. ఇదిలాగే కొనసాగితే దేశ ఉనికికే ప్రమాదమంటున్నారు అఫ్గాన్ హక్కుల కార్యకర్త మహబూబా సిరాజ్. పరిస్థితిని మెరుగు పరిచేందుకు అంతర్జాతీయ సమాజం తాలిబన్లతో చర్చించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే...మళ్లీ అవే అణచివేతలు... 1996 నుంచి 2001 దాకా తాలిబన్లు తొలిసారి అధికారం చేపట్టినప్పుడు అఫ్గాన్‌లో అత్యంత అరాచకం తాండవించింది. మహిళలపై అత్యంత కఠినమైన ఆంక్షలు! విద్య, ఉపాధి అవకాశాల్లేవు. ఒంటరిగా గడప దాటొద్దు. ముఖం పూర్తిగా కప్పుకోకున్నా కొరడా దెబ్బలు, బహిరంగ ఉరి శిక్షలు! తాలిబన్ల పునరాగమనంతో ఆఫ్గాన్ మహిళల పరిస్థితి మళ్లీ దయనీయంగా మారింది. ఆంక్షలు ఇంకా పెరిగాయి. ఇస్లాంలో, అల్లా దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. దాన్ని తోసిరాజని మహిళలను ఇలా అణచివేయడం ఏం ధర్మమో అర్థం కాదు!చర్చలే పరిష్కారం.. ఈ అరాచకం ఇలాగే కొనసాగితే అఫ్గాన్ ఉనికే ప్రమాదంలో పడుతుంది. తాలిబన్లతో చర్చించాలన్నందుకు నన్ను వారి లాబీయిస్టునంటూ విమర్శిస్తున్నారు. ఎవరితో సమస్యో వాళ్లతో కనీసం మాట్లాడకపోతే పరిష్కారం ఎలా సాధ్యం? మా ముందున్నవి రెండే మార్గాలు. పరస్పరం చంపుకోవడం ఒకటైతే, కూర్చుని చర్చించుకోవడం రెండోది. పోరే శరణ్యమంటే అకారణంగా చచ్చిపోతాం. అందుకే చర్చలంటున్నాను. తాలిబన్లు తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేను దేశంలో లేను. ఈసారి ఎందుకుంటున్నానని ప్రశి్నస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి మహిళలకు నా అవసరముంది. మాకిప్పుడు ప్రపంచంలోని ప్రతి మహిళ మద్దతూ అవసరం. అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి మాకు సాయపడాలి. భవిష్యత్తుపై ఆశ.. శరణార్థులు, వలసదారులు యూరప్‌ను రంగులమయం చేస్తున్నారు. అయినా ముస్లింలంటే పాశ్చాత్య దేశాలకు భయమెందుకో అర్థం కాదు. ఒకనాటి అఫ్గానిస్తాన్ విభిన్న జాతులు, సంప్రదాయాలతో కూడిన అందమైన కళాఖండం. ఆ పాత అఫ్గాన్ తిరిగి రావాలంటే దేశం వీడిన వాళ్లంతా తిరిగి రావాలి. రాచరిక నేపథ్యం... 75 ఏళ్ల మెహబూబా సిరాజ్ రాజ కుటుంబీకురాలు. 1880 నుంచి 1901 దాకా అఫ్గాన్‌ను పాలించిన అబ్దుర్ రెహా్మన్ ఖాన్ వంశీకురాలు. హజారా తెగ ఊచకోత రెహ్మాన్ హయాంలో జరిగిందే. నియంతృత్వ పాలనతో కర్కోటకునిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తనపై తాలిబన్ల కీలుబోమ్మ అన్న ఆరోపణలకు ఆ వారసత్వమే కారణమని వాపోతారామె. ఆమె 26 ఏళ్ల పాటు అమెరికాలో గడిపి 2003లో అఫ్గాన్ తిరిగి వెళ్లారు. దేశంలో మహిళలు, బాలికల హక్కుల కోసం కృషి చేస్తున్నారు. అఫ్గాన్ విమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వంటివి నిర్వహిస్తున్నారు. గృహ హింసకు గురవుతున్న మహిళలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. గతేడాది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. ఇటీవలే ఫిన్లండ్ ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డు అందుకున్నారు. -
గళానికీ సంకెళ్లు!
మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది. మూడేళ్ల క్రితం పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ అక్కడ రాతియుగపు పాలన నడుస్తోంది. మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువునా కాలడం వారికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా మహిళల గళానికి కూడా సంకెళ్లు పడ్డాయి... – సాక్షి, నేషనల్ డెస్క్అడుగు కదిపితే ఆంక్షలు. ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. అఫ్గాన్‌లో మహిళపై తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు. ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి. ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఈ అణచివేతను పరాకాష్టకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడటానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా విని్పంచకూడదని ఆదేశించారు! అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరంటూ మరో నిబంధన విధించారు!! మహిళల అస్తిత్వానికే గొడ్డలిపెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి’ పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 114 పేజీల డాక్యుమెంట్‌ను ఆ శాఖ విడుదల చేసింది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైనది. ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఇటీవలే ఆమోదముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.‘మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడుతాయి’ అంటూ సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు! కొత్త ఆంక్షలు ఇలా...– ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు. – బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవొద్దు. పాటలు పాడొద్దు. రాగాలు తీయొద్దు. – మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ విని్పంచకూడదు. – రక్త సంబం«దీకులను, భర్తను తప్ప మరే పురుషుని వైపూ కన్నెత్తి కూడా చూడొద్దు. – బహిరంగ ప్రదేశాలలో మహిళలు మగవాళ్లతో మాట్లాడటం నిషిద్ధం.– మహిళలను బయటికొచి్చనప్పుడు ముఖం పూర్తిగా కవరయ్యేలా కప్పుకోవాలి. లేదంటే వాళ్లను చూసి మగవాళ్లు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారముంది. – కనుక మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా మేలిముసుగు ధరించాల్సిందే. కేవలం జుత్తు, మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు. – మహిళలు ఇకనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు. – వాహనదారులెవరూ మగవాళ్లు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు. – పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసముండాలి. – అఫ్గాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. – మీడియాలో ఎవరి ఫొటోలూ చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు.శిక్షలు ఇలా... – నూతన నిబంధనలను ఉల్లంఘించే మహిళలకు... – తొలుత హెచ్చరికల జారీ. – అనంతరం ఆస్తుల జప్తు. – మూడు రోజులదాకా నిర్బంధం. – అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు. – నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది అఫ్గాన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈ ఆంక్షలు... – బాలికలు ఆరో తరగతితోనే చదువు ఆపేయాలి. – మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు.– హిజాబ్ లేకుండా వాళ్లు ఇల్లు దాటకూడదు. -
దేశం వద్దు పొమ్మంది.. అయినా పట్టువీడలే! సాహసం చేసి మరీ..
ఫరీబా హషిమి, యుల్డుజ్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు. వారిద్దరికి చిన్నతనం నుంచి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఒలింపిక్స్‌లో తమ దేశం తరుపన సత్తాచాటాలని ఎన్నో కలలు కన్నారు. విశ్వవేదికపై తమ జాతీయ జెండాను రెపరెపలాడించాలని తహతహలడారు. కానీ విధి మాత్రం మరోలా తలపిచింది.సొంత దేశమే వారికి అండగా నిలవలేదు. వారి కలను ఆదిలోనే తుంచేయాలని అక్కడి పాలకులు నిర్ణయించారు. మహిళలలు క్రీడల్లో పాల్గోకూడదని ఆంక్షలు విధించారు. కానీ ఆ అక్కచెల్లెల్లు మాత్రం ఎక్కడా నిరాశచెందలేదు. విశ్వక్రీడలే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఏకంగా దేశాన్ని విడిచి మరి ఒలిపింక్స్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యారు. తమ కలలను మరో వారం రోజుల్లో సాకారం చేసుకునేందుకు ఉర్రూతలూగుతున్నారు. ఇదింతా ఏ దేశమే కోసమో ఇప్పటికే మీకు ఓ అంచనా వచ్చి ఉంటుంది. అవును మీరు అనుకున్నది నిజమే. ఆ దేశమే తాలిబాన్లు పరిపాలిస్తున్న అఫ్గానిస్తాన్. ప్యారిస్ ఒలిపింక్స్ నేపథ్యంలో ఈ అఫ్గాన్ సైక్లిస్ట్ సిస్టర్ల స్టోరీపై ఒ లుక్కేద్దాం.అఫ్గాన్ ధీర వనితలు..2021లో అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు ఆధీనంలో తీసుకున్నాక మహిళలు క్రీడల్లో పాల్గొనడంపై నిషేధం విధించారు. ఈ క్రమంలో ఫరీబా హషిమి, యుల్డుజ్ తమ కలలను సాకారం చేసుకునుందుకు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న తమ దేశ సైక్లిస్ట్ల తరలింపు కోసం ఇటలీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది.దీంతో ఫరీబా, యుల్డుజ్ సైతం ఇటలీ వెళ్లే విమానం ఎక్కారు. అక్కడ వెళ్లాక సరైన కోచింగ్‌ను పొందేందుకు ఇటలీలోని సైక్లింగ్ టీమ్‌లో ఈ అఫ్గాన్ సోదరిలు చేరారు. ఈ క్రమంలో ఈ ఏడాది జూన్‌లో ఏవోసీ(అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ) ప్యారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ ఆరుగురు సభ్యులతో కూడిన అఫ్గాన్ జట్టును ప్రకటించింది. అందులో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ జాబితాలో ఫరీబా హషిమి, యుల్డుజ్లు చోటుదక్కించుకున్నారు. దీంతో ఒలిపింక్స్‌లో పాల్గోవాలన్న తమ కలను నేరువేర్చుకునేందుకు ఈ అక్కచెల్లెల్లు అడుగు దూరంలో నిలిచారు.మాకంటూ ప్రత్యేకమైన బలమేమి లేదు. మాకు మేమే బలం. నేను ఆమెకు ధైర్యంగా ఉంటాను. ఆమె నాకు సపోర్ట్‌గా ఉంటుంది: యుల్డుజ్ఒలింపిక్స్లో పాల్గోనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. మేము సాధించిన ఈ ఘనతను అఫ్గానిస్తాన్ మహిళలకు అంకితమివ్వాలనకుంటున్నాము. ఎందుకంటే వారి వాళ్లే మేము ఒలింపిక్స్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాము. మా హక్కులను కాలరాసినప్పటకి, మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలమని నిరూపించాం. ఈ విశ్వక్రీడల్లో మేము 20 మిలియన్ల ఆఫ్ఘన్ మహిళల తరపున ప్రాతినిథ్యం వహిస్తాము: ఫరీబా -
అఫ్గానిస్తాన్‌లో వర్ష బీభత్సం.. 35 మంది మృతి
అఫ్గానిస్తాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలకు వివిధ దుర్ఘటనలు చోటుచేసుకోవడంతో 35 మంది మృతి చెందారని తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు.వర్షాల కారణంగా నంగర్హార్ ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారని సమాచార, సాంస్కృతిక శాఖ ప్రావిన్షియల్ డైరెక్టర్ సెడిఖుల్లా ఖురేషి మీడియాకు తెలిపారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నారని, సుర్ఖ్ రోడ్ జిల్లాలో ఇంటి పైకప్పు కూలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయారని ఖురేషీ తెలిపారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారన్నారు.భారీవర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. భారీ ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. నంగర్హార్లోని ప్రాంతీయ ఆసుపత్రి అధిపతి అమీనుల్లా షరీఫ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 207 మంది బాధితులు వివిధ ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చారన్నారు. కాగా గత మే 10, 11 తేదీల్లో దేశంలో కురిసిన భారీ వర్షాలకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
తాలిబన్ల ఆయుధాలపై పాక్ వణుకు!
పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన తాలిబన్లు ఇప్పుడు తమ ఆయుధాలతో తమకు నీడ కల్పించిన దేశాన్నే వణికిస్తున్నారు. తాలిబన్ల దగ్గరున్న ప్రాణాంతక, ప్రమాదరక ఆయుధాలను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితి(యూఎన్ఓ)ని వేడుకుంటోంది.పాకిస్తాన్ తమకు రెండో ఇల్లు అని చెప్పుకునే తాలిబన్లు పాక్‌లో వ్యాపార, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ పరస్పరం సరిహద్దులు పంచుకుంటున్న దేశాలని, మతపరంగా కూడా తాము ఒకే గూటి పక్షులమని తాలిబన్ నేతలు గతంలో ప్రకటించారు. అయితే అదే తాలిబన్ ఇప్పుడు పాకిస్తాన్‌పై వేలాడుతున్న కత్తిలా ప్రమాదకరంగా తయారయ్యింది.తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) వంటి తీవ్రవాద గ్రూపులను నిరాయుధులను చేసేందుకు ‘కాంక్రీట్ క్యాంపెయిన్’ ప్రారంభించాలని పాక్ తాజగా యూఎన్ఓను కోరింది. ఐక్యరాజ్య సమితి సమీక్షా సమావేశంలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపులు ఆధునిక ఆయుధాలను సేకరించడం, వినియోగించడంపై పాకిస్తాన్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నదని తెలిపారు. ఆ గ్రూపుల దగ్గరున్న అన్ని ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సంఘటిత ప్రచారం అవసరమని పేర్కొన్నారు. అలాగే ఈ ఉగ్రవాద గ్రూపులు అధునాతన ఆయుధాలను ఎలా సేకరించాయనే దానిపై విచారణ చేపట్టాలని కూడా కోరారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ టీటీపీ పాకిస్తాన్ అంతటా షరియా పాలనను నెలకొల్పాలని భావిస్తోంది. ‘డాన్’ వార్తా కథనం ప్రకారం ఉగ్రవాద గ్రూపులు సాగిస్తున్న ఆయుధాల స్మగ్లింగ్, వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితితో పాటు గ్లోబల్ ఆర్గనైజేషన్‌లోని సభ్య దేశాలపై ఉందని పాక్ రాయబారి వ్యాఖ్యానించారు. ఈ ఆయుధాలను ఉగ్రవాదులు, నేరస్తులు స్వయంగా తయారు చేయరని, వాటిని చట్టవిరుద్ధమైన ఆయుధ మార్కెట్ల నుండి లేదా ఏదైనా దేశాన్ని అస్థిరపరచాలనుకునే సంస్థల నుండి సేకరిస్తారని పాక్ రాయబారి ఐక్యరాజ్య సమితికి వివరించారు. -
వివాహేతర సంబంధం పెట్టుకుంటే రాళ్లతో కొట్టి చంపుతాం
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో మధ్యయుగాల నాటి ఛాందసవాద పాలనకు తెరలేపిన తాలిబాన్లు ప్రజల పట్ల మరింత దారుణంగా వ్యవహరించనున్నారు. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను మరోసారి ఝులిపించారు. వివాహేతర సంబంధం, వ్యభిచారానికి ఒడిగట్టే మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపుతామని తాలిబాన్లు హెచ్చరించారు. ఈ మేరకు తాలిబాన్ల సుప్రీం లీడర్ ముల్లా హిబాతుల్లా అకుంద్‌జాదా అఫ్గాన్లనుద్దేశిస్తూ ప్రభుత్వ టీవీ చానెల్లో శనివారం ఒక ఆడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు మహిళలకు హక్కులు ఉండాలంటారా? అవి మన ఇస్లామిక్ షరియా చట్టాలు, మన మతాధికారుల నియమాలకు వ్యతిరేకం. మేం చాయ్ తాగుతూ చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారేమో! ఈ నేలపై షరియా చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసి తీరతాం. వివాహేతర సంబంధాలు, వ్యభిచారం ఘటనల్లో మహిళలను అందరూ చూస్తుండగా కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతాం’’ అని అకుంద్‌జాదా హెచ్చరించారు. -
శరణార్థులపై పాక్ పంజా
నిన్నటి వరకూ ఎత్తుకుని ముద్దాడినవారు హఠాత్తుగా విసిరికొడితే...? ఇప్పుడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అఫ్గానిస్తాన్ శరణార్థులు ఇలాంటి దుఃస్థితిలోనే పడ్డారు. ఇజ్రాయెల్ గడ్డపై హమాస్ దాడుల పర్యవసానంగా దాదాపు నెలరోజుల నుంచి గాజా స్ట్రిప్‌లో మారణహోమం సాగుతోంది. నిరాయుధ పౌరులు వేలాదిమంది పిట్టల్లా నేలరాలుతున్నారు. ఈ పరిణామాలపై అరబ్బు ప్రపంచం భగ్గుమంటోంది. కానీ ఈమూల ప్రాణాలు అరచేతపట్టుకుని వచ్చిన శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపించటానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. వారిని నరకకూపంలోకి నెట్టడం అన్యాయమని అనేకులు నచ్చజెబుతున్నా, తీవ్ర పర్యవసానాలుంటాయని తాలిబన్లు బెదిరిస్తున్నా పాక్ పాలకులు లక్ష్యపెట్టడం లేదు. చట్టవిరుద్ధంగా వుంటున్న 17 లక్షలమంది శరణార్థుల్లో సోమవారం నాటికి లక్షా 70 వేలమందిని పంపించామని పాక్ ప్రకటించింది. శరణా ర్థుల సమస్య పూర్తిగా పాకిస్తాన్ స్వయంకృతం. నిన్నటివరకూ తన మిత్రులైన తాలిబన్లతో వైరం తెచ్చుకుని, పెరుగుతున్న నేరాలకూ, అధోగతిలో వున్న దేశ ఆర్థికవ్యవస్థకూ అఫ్గాన్ శరణార్థులను కారణంగా చూపి వదుల్చుకోవాలని చూడటం పాకిస్తాన్ సైన్యం కపటనీతికి అద్దం పడుతుంది. 80వ దశకంలో అఫ్గాన్‌పై సోవియెట్ యూనియన్ సైన్యం దురాక్రమణకు దిగినప్పుడు అమెరికా అండతో అఫ్గాన్‌కు అండగా నిలిచినట్టు నటించింది పాకిస్తానే. ఆ వంకన వచ్చిపడిన నిధులు అన్నివిధాలా అక్కరకొచ్చాయి. సోవియెట్ దళాలు నిష్క్రమించాక తాలిబన్ల ఏలుబడి మొదలైనప్పుడు వారితో చెట్టపట్టాలేసుకుని వారి అరాచకాలకు అండదండలందించింది, వారిని ఉసిగొల్పి మన దేశాన్ని చికాకుపరిచింది కూడా పాకిస్తానే. 2001లో తమ దేశంపై ఉగ్రదాడి జరిగాక అమెరికా ఆగ్రహించి అఫ్గాన్‌పై దండయాత్రకు దిగింది. తాలిబన్లను తొలగించి తమ అనుకూలురను ప్రతిష్టించింది. అనంతరకాలంలో పరిమిత ప్రాంతాల్లోనైనా అంతో ఇంతో సాధారణ పరిస్థితులుండేవి. మహిళలు చదువుకోవటానికి, వృత్తి ఉద్యోగాలు చేసుకోవటానికి వీలుండేది. మన దేశం, మరికొన్ని దేశాలు అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. ఇదంతా పాకిస్తాన్‌కు కంటగింపైంది. అఫ్గాన్‌లో తమ హవా సాగటం లేదన్న దుగ్ధతో పాకిస్తాన్ అక్కడ ఏదోవిధంగా పాలకులను చికాకుపరిచేది. చివరకు అమెరికాలో ట్రంప్ హయాం వచ్చాక చడీచప్పుడూ లేకుండా తాలిబన్ల తరఫున ఆయనతో రాయబారాలు జరిపి, వారు పూర్తిగా మారిపోయారని నమ్మబలికింది. ఆ తర్వాతే అమెరికా మంచి తాలిబన్లు, చెడ్డ తాలిబన్లు అంటూ వర్గీకరించి అఫ్గాన్ నుంచి నిష్క్రమించేందుకు దారులు వెదుక్కొంది. ఈ క్రమం అంతటా పాకిస్తాన్ ఆడిన ప్రమాదకర క్రీడ అడుగడుగునా కనబడుతూనే వుంది. తీరా రెండేళ్లక్రితం తాలిబన్ల పాలన మొదలయ్యాక ఇద్దరికీ చెడింది. పాక్ సైన్యం చేతుల్లో కీలుబొమ్మలు కావటానికి తాలిబన్లు ససేమిరా అనటం, తమ సహజ వనరులను పాక్ పెట్టుబడిదారులకు దోచిపెట్టడానికి అంగీకరించకపోవటం సైన్యానికి ఆగ్రహం కలిగించింది. శరణార్థులను వెనక్కు పంపటంలోని ఆంతర్యం అదే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లోని అఫ్గాన్ శరణార్థుల సంఖ్య 13 లక్షలు. మరో 8 లక్షల 80 వేలమంది చట్టబద్ధంగా అక్కడుంటున్నారు. వీరిలో 2021లో మళ్లీ తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నాక ప్రాణభయంతో వచ్చినవారు దాదాపు 6 లక్షలమంది. వీరుగాక 1980 ప్రాంతంలో సోవియెట్ దురాక్రమణ సమయంలో వచ్చిన 3 లక్షలమంది శరణార్థులున్నారు. కానీ పాక్ సైన్యం లెక్కలు వేరేలా వున్నాయి. 17 లక్షలమంది శరణార్థులు అక్రమంగా వుంటున్నారని అది చెబుతోంది. ఎవరి లెక్కలు ఏమైనా శరణార్థుల్లో అనేకులు దశాబ్దాలుగా ఉపాధి వెదుక్కొని ఇస్లామాబాద్ మొదలుకొని కరాచీ వరకూ అనేక నగరాల్లో స్థిరపడి అక్కడే తమకంటూ గూడు ఏర్పర్చుకున్నారు. ఆ సమాజంలో భాగమయ్యారు. వారి పిల్లలు చదువుకుంటున్నారు. ఉపాధి వెదుక్కున్నారు. కొందరు ఆస్తులు కూడబెట్టుకున్నారు. కానీ హఠాత్తుగా పాకిస్తాన్ సైన్యం పోలీసులు, సైన్యం విరుచుకుపడి వారి అధికారిక పత్రాలు స్వాధీనం చేసుకుని పొమ్మంటే ఏమై పోవాలి? తనకు అనుకూలంగా వున్నప్పుడు సమస్యను చక్కగా వినియోగించుకుని, తాలిబన్లతో తకరారు తలెత్తాక ఇన్ని లక్షలమందిని కట్టుబట్టలతో గెంటేయాలని చూడటం ఏం న్యాయం? ఇప్పుడు దేశవ్యాప్తంగావున్న అఫ్గాన్ శరణార్థులను సరిహద్దుల్లోని తోర్ఖాం ప్రాంతానికి తరలించి నరకాన్ని తలపించే గుడారాల్లో కుక్కుతోంది. కొందరిని బలూచిస్తాన్ వైపున్న చమన్వైపు తరలిస్తోంది. ఒకపక్క అమానవీయంగా ఇన్ని లక్షలమందిని నరక కూపంలోకి నెడుతూ స్వచ్ఛందంగా పోతున్నారని సైన్యం తప్పుడు ప్రచారం చేస్తోంది. 1950 ప్రాంతం తర్వాత దేశంనుంచి ఇంత పెద్దయెత్తున జనం తరలిపోవటం ఇదే ప్రథమమని పాకిస్తాన్ మీడియా చెబుతోంది. ఉగ్రవాదం విషయంలో పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరే దేశంలో ఆత్మాహుతి దాడులు, ఇతర నేరాలు పెరగటానికి కారణం. తాము మద్దతుగా నిలిచిన తాలిబాన్లే అడ్డం తిరగటంతో సైన్యానికి దిక్కుతోచటం లేదు. దానికితోడు దేశంలో పౌర ప్రభుత్వంతో పొసగటం లేదు. ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి దించినా అంతా అనుకున్నట్టు జరగలేదు. త్వరలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దేశం దివాలా తీసింది. ఈ పరిస్థితుల్లో సకల క్లేశాలకూ శరణార్థులను బాధ్యులుగా చూపి, బలిపశువుల్ని చేయటం దుర్మార్గం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించి శరణార్థుల విషయంలో కనీస మానవీయత ప్రదర్శించటం అవసరమని పాక్ సైన్యమూ, పాలకులూ గుర్తించాలి. -
అఫ్గాన్‌లో భూకంపం.. బాధితులను పట్టించుకోని తాలిబన్ సర్కార్
అఫ్గాన్‌లో భూకంపం.. బాధితులను పట్టించుకోని తాలిబన్ సర్కార్ -
భారత్‌లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత
న్యూఢిల్లీ: భారత్‌లో రాయబార కార్యాలయాన్ని అఫ్గానిస్థాన్ మూసివేసింది. ఆదివారం నుంచి కార్యకలాపాలన్నీ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అఫ్గానిస్తాన్‌లో అష్రాఫ్ ఘనీ ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబన్లు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత భారత్‌లో దౌత్యపరమైన కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీలోని అఫ్గాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వనరుల కొరత, సిబ్బంది కొరతతో దౌత్య కార్యాలయాన్ని నిర్వహించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. పనిలో పనిగా భారత్‌పై కూడా ఆరోపణలు గుప్పించింది. భారత ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడం కూడా రాయ బార కార్యాలయాన్ని మూసివేయడానికి కారణమని ఆ ప్రకటనలో పేర్కొంది. భారత్ సహా ఎన్నో దేశాలు అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని ఇంకా గుర్తించడం లేదని వాపోయింది. -
ప్రపంచంలోనే బెస్ట్ పెర్ఫామింగ్ కరెన్సీ ఏదో తెలుసా? నమ్మలేరు!
తాలిబన్ల నేతృత్వంలో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ‘ఆఫ్ఘని’ ఆశ్చర్యకరంగా టాప్‌లోకి దూసుకొచ్చింది. ఈ త్రైమాసికంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ పనితీరుతో టాప్-3లో చోటు సంపాదించుకుంది. రెండేళ్ళ క్రితం తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడి ఆర్థికపరిస్థితి అతలాకుతమైంది. ఆఫ్ఘన్ జాతీయ కరెన్సీ విలువ దారుణంగా పతనమైంది. కానీ తాలిబన్ల కీలక చర్యలతో ఈ త్రైమాసికంలో ఆఫ్గని అనూహ్యంగా పుంజుకోవడం విశేషంగా నిలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం కొలంబియన్ పెసో, శ్రీలంక రూపాయి తర్వాత 2023లో ప్రపంచంలో మూడో అత్యంత బలమైన పనితీరు కనబర్చిన కరెన్సీగా అవతరించింది. ముఖ్యంగా మానవతా దృక్పథంతో ఆ దేశానికి అందిన మిలియనర్ల డాలర్ల సాయం, పొరుగు దేశాలతో పెరిగిన వాణిజ్యం దీనికి కారణమని భావిస్తున్నారు. మానవ హక్కుల విషయంలో ప్రపంచంలోనే దారుణంగా పడిపోయి, పేదరిక పీడిత దేశంగా పేరొందిన ఆఫ్గాన్ కరెన్సీ బలోపేతం చేయడానికి తాలిబాన్ చర్యలు కూడా ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తన కరెన్సీ బలోపేతం చేయడానికి అనేక చర్యలను అమలు చేసింది. ఆఫ్ఘని సంవత్సరానికి దాదాపు 14శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మూడవ బలమైన కరెన్సీగా నిలిచింది, కొలంబియన్ పెసో మరియు శ్రీలంక రూపాయి కంటే మాత్రమే వెనుకబడి ఉంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, కరెన్సీ నియంత్రణలు, నగదు ప్రవాహం,చెల్లింపులతో ఆఫ్ఘని ఈ త్రైమాసికంలో సుమారుగా 9 శాతం పుంజుకుంది. కొలంబియన్ పెసో 3 శాతం లాభాలను అధిగమించింది. (ఈ బ్యాంకు లైసెన్స్ రద్దుచేసిన ఆర్బీఐ: అకౌంట్ ఉందా చెక్ చేసుకోండి!) కరెన్సీలో ఈ పెరుగుదల ఆఫ్ఘనిస్తాన్ అంతర్గతం సంక్షోభం ఇంకా అలాగే ఉందనీ, ముఖ్యంగా ఆర్థిక ఆంక్షల కారణంగాకా దేశం ప్రపంచ ఆర్థికవ్యవస్థ నుంచి దూరంగా ఉందంటున్నారు ఆర్థికవేత్తలు. ప్రధానంగా నిరుద్యోగం తీవ్రంగా ఉంది. మూడింట రెండొంతుల కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కష్టపడుతున్నాయి. ద్రవ్యోల్బణానికి బదులుగా ప్రతి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 2021 చివరి నుంచి ప్రతి కొన్ని వారాలకు ఐక్య రాజ్యసమితి క్రమం తప్పకుండా 40 మిలియన్ల డాలర్లకు పైగా సాయం అందిస్తోంది. మరోవైపు కరెన్సీ నియంత్రణలు ప్రస్తుతానికి పని చేస్తున్నప్పటికీ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ, అస్థిరత ఏర్పడొచ్చని వాషింగ్టన్‌లోని న్యూ లైన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజీ & పాలసీలో మిడిల్ ఈస్టర్న్, సెంట్రల్ అండ్ దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడు కమ్రాన్ బోఖారీ హెచ్చరిస్తున్నారు. -
తాలిబాన్‌తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? భారత్‌పై ప్రభావమెంత?
ఇటీవల భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు యావత్ ప్రపంచం దృష్టిని తనవైపు తప్పుకుంది. అయితే అదేసమయంలో చైనా పెద్ద రాజకీయ ఎత్తుగడ వేసింది. 55 దేశాలతో కూడిన ఆఫ్రికన్ యూనియన్ జి-20లో ప్రవేశించడం చైనా తనకు ఎదురుదెబ్బగా భావించింది. తాజాగా చైనా.. తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్థాన్‌లో తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా చైనా అవతరించింది. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా అధికారికంగా దౌత్య సంబంధాలను నెలకొల్పబోతోందని అర్థం. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి తాలిబాన్ ప్రభుత్వం అంతర్జాతీయ గుర్తింపునకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో చైనాతో ఆఫ్ఘనిస్థాన్ దోస్తీ ఆ దేశానికి కలిసివచ్చేలా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌తో చైనా మైత్రి భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగామారింది. అయితే చైనా.. ఆఫ్ఘనిస్థాన్‌తో చెలిమి చేయడంపై ప్రపంచవ్యాపంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనాగరిక పాలన సాగిస్తున్న తాలిబాన్ ప్రభుత్వంతో చైనా స్నేహం చేయడాన్ని ఏ దేశమూ ఇష్టపడటం లేదు. ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా ఆధిపత్యం? వాస్తవానికి చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలవాలని కోరుకుంటోంది. దీనిలో భాగంగానే ఆఫ్ఘనిస్థాన్‌లో అడుగు పెట్టింది. ఇది చైనా వ్యూహంలో ఒక భాగమని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఆఫ్ఘనిస్థాన్‌లో చైనా కూడా అదే పనిచేసేందుకు సిద్ధం అవుతోంది. అలాగే చైనా తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ను వాడుకోవాలనుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో వైట్ గోల్డ్‌గా పిలిచే లిథియం నిల్వలపై చైనా దృష్టి సారించింది. చైనా.. ఆఫ్ఘనిస్తాన్‌లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది. కోటి ఆశలతో చైనాతో చెలిమి తాలిబాన్ అభిప్రాయం ప్రకారం చైనాతో ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఆఫ్ఘనిస్థాన్‌లో లక్షలాది ఉద్యోగాలు ఏర్పడతాయి. మరోవైపు చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సీపీఈసీని ఆఫ్ఘనిస్థాన్ ద్వారా మధ్య ఆసియా దేశాలకు తీసుకెళ్లాలని భావిస్తోంది. చైనాతో స్నేహం దరిమిలా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని తాలిబాన్ భావిస్తోంది. కాగా చైనా- తాలిబాన్ స్నేహం భారతదేశానికి పలు సమస్యలను తెచ్చిపెట్టనున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత అంతర్జాతీయ ప్రాజెక్టులకు ఆటంకం ఆఫ్ఘనిస్థాన్ పొరుగు దేశమైన ఇరాన్‌లోని చబహార్ పోర్టు ద్వారా మధ్య ఆసియా దేశాలతో కనెక్టివిటీని నెలకొల్పేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి కారణంగా అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ కారిడార్ వంటి భారతదేశ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రభావితం కావచ్చు. తాలిబాన్ అధికారంలోకి రాకముందే ఆఫ్ఘనిస్థాన్‌లో మిలియన్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారతదేశం ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటోంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో చైనా ఉనికి భారతదేశ అసంపూర్ణ ప్రాజెక్టులను ప్రభావితం చేయనున్నదనే అంచనాలున్నాయి. ఇది కూడా చదవండి: వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది? -
ఎవరి మాటా వినని తాలిబన్లు
అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. 2020లో అమెరికాతో దోహాలో చేసుకున్న ఒప్పందానికి తాలిబన్లు కట్టుబడలేదు. ఉగ్రవాదుల అడ్డాగా మార్చకపోవడం, లింగ వివక్ష అంశాలతో పాటు, అఫ్గాన్ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపైనా తాలిబన్లు చర్చలు జరిపారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందన్న అంచనా తీరా తారుమారైంది. పాశ్చాత్య దేశాలు తమను కూలదోయలేవని తాలిబన్లకు తెలుసు. మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, లేదంటే ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఆక్రమించి మొన్న ఆగస్టు 15 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. అదే రోజు అప్పటి అధ్య క్షుడు అశరఫ్ గనీ దేశం వదిలి పారిపోయారు. తాలిబన్లు తమ ఆయుధ బలం మొత్తాన్ని ఉపయోగించి, అఫ్గానిస్తాన్ ఆద్యంతం అఫ్గాన్ ఎమిరేట్‌ను పునఃస్థాపించారు. అమెరికాపై ఉగ్రదాడికి ప్రతిగా ఆ దేశ మిలిటరీ దళాలు అఫ్గానిస్తాన్ మీద 2001 నవంబరులో యుద్ధం ప్రకటించడంతోనే ఈ అఫ్గాన్ ఎమిరేట్ పతనమైన సంగతి తెలిసిందే. తాలిబన్లు మళ్లీ దేశాన్ని వశం చేసుకోవడానికి ముందు, అమెరికాతో దోహాలో 2020లో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడలేదు. మిలిటరీ బలగాలను వెనక్కు తీసుకున్నందుకు ప్రతిగా తాలిబన్లు అఫ్గాన్ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డాగా మార్చరాదని దోహా ఒప్పందం షరతు విధించింది. దీనితో పాటు, అఫ్గాన్ రిపబ్లిక్‌తో అధికారం పంచుకోవడంపై చర్చలు జరిపేందుకూ తాలిబన్లు అంగీకరించారు. ఈ క్రమంలో అక్కడ కొత్త రాజ్యాంగం పురుడు పోసుకుంటుందని వేసుకున్న అంచనా తారుమారైంది. తాలిబన్లు అఫ్గాన్ నేషనల్ ఆర్మీపై వేగంగా పైచేయి సాధించడంతో అధికారం పంచుకోవడం అన్న మాట పక్కకెళ్లిపోయింది. ఒకవైపు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ తో తాలి బన్లు పోరాడుతూనే ఉన్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థ ఆల్– ఖైదాతో వారి అనుబంధం పెరుగుతూనే ఉంది. అల్–ఖైదా నేత అయ మాన్ అల్–జవాహిరిని 2022 జూలైలో అమెరికా ఒక డ్రోన్ దాడిలో హతం చేసినప్పుడు, ఈ సంబంధం కొనసాగుతున్నట్టు అర్థమైంది. అఫ్గానిస్తాన్‌లో అమెరికా, నాటోకు గట్టి దెబ్బ తగిలింది. తమ మిలిటరీ దళాలను వెనక్కు తీసుకునే ప్రక్రియను కూడా అవి సాఫీగా నిర్వహించలేకపోయాయి. గడచిన రెండేళ్లుగా, అమెరికా, దాని భాగ స్వాములు, అంతర్జాతీయ సమాజ సభ్యదేశాలు తాలిబన్ ప్రభుత్వం మానవ హక్కులు, మరీ ముఖ్యంగా లింగ వివక్షకు సంబంధించిన అంశాల్లో అందరినీ కలుపుకొని పోవాలని డిమాండ్ చేస్తున్నాయి. తాలిబన్ ప్రభుత్వం తాను అన్ని తెగలకు ప్రాతినిధ్యం కల్పించామని చెబుతోంది. అయితే లింగ వివక్షకు సంబంధించిన విషయాల్లో మాత్రం వాళ్లు ఇప్పటికీ షరియా చట్టాల అమలుకే మొగ్గు చూపు తున్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే 1990ల నాటి క్రూరత్వం కొంత తగ్గిందని చెప్పాలి. అంతర్జాతీయ సమాజపు డిమాండ్ల విషయంలో తాలిబన్లు వెనక్కి తగ్గలేదన్నది సుస్పష్టం. ప్రస్తుత అమీర్ (పాలకుడు) అయిన హిబతుల్లాహ్ అఖుంద్జాదా చేతుల్లో అధికారం ఉన్నంత వరకూ ఇది అసాధ్యమని కూడా చెప్పు కోవాలి. తాలిబన్లు ప్రధానంగా పష్తూన్లు. అదే సమయంలో ఇస్లామ్‌ను అనుసరిస్తారు. యాభై ఏళ్ల సంక్షోభం, యుద్ధాల ఫలితంగా అక్కడ సామాజిక మార్పులు చోటు చేసుకుని పష్తూన్ల సంప్రదాయ బలం తగ్గింది. ఈ నేపథ్యంలో తాలిబన్ అగ్రనేతకు అమిర్ అల్–ముమినీన్ హోదా కల్పించడంతో ఆయన మాట మీరడం ఎవరికైనా దుర్లభం. దేశ ఆగ్నేయ ప్రాంతంలో మంచి పట్టున్న అంతర్గత వ్యవహారాల తాత్కాలిక మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ, తాలిబన్ల వ్యవస్థాపకుడైన ముల్లా ఒమర్ కుమారుడిగా అదనపు అనుకూలత ఉన్న రక్షణ శాఖ మధ్యంతర మంత్రి ముల్లా యాకూబ్ లాంటి యువ నేతలు మార్పు నకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే, లింగ అంశాల మీద ప్రపంచాన్ని ధిక్కరిస్తున్న హిబతుల్లాహ్, ఆయన వర్గమైన సంప్ర దాయ ముల్లాలకు వ్యతిరేకంగా వారు నిలబడ లేకపోతున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొద లైన తరువాత అంతర్జాతీయ సమాజం, అగ్రరాజ్యాల ధ్యాస మొత్తం అటువైపు మళ్లింది. యూరోపియన్ దేశాలపై, అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న పోటీ విషయంలోనూ యుద్ధం ప్రభావం చాలా ఎక్కువే. పైగా ఈ యుద్ధం వల్ల భూ దక్షిణార్ధ గోళంలో చేపట్టిన సంక్షేమ కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. వీటన్నింటి కారణంగా అఫ్గానిస్తాన్ అంశం ఏడాదిన్నర కాలంగా కను మరుగైంది. అప్పుడప్పుడూ మొక్కుబడిగా కొన్ని డిమాండ్లు చేయడం, ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తే అంతే చాలన్నట్టుగా అంతర్జాతీయ సమాజం ఉంది. ఇదిలా ఉండగానే, అఫ్గానిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరీ దిగజారి, శరణార్థులు ఇతర దేశాలకు వెల్లువెత్త కుండా మానవతా సాయం కొంతవరకూ కాపాడుతోంది. అయితే విదేశాలకు వెళ్లగలిగిన స్థోమత ఉన్నవారు ఇప్పటికీ వెళుతూనే ఉండటం గమనార్హం. అఫ్గానిస్తాన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు ఇప్పుడు అంత ర్జాతీయ సమాజం అనాసక్తంగా ఉంది. ఆఖరికి అక్కడినుంచి పెరిగి పోతున్న మాదకద్రవ్యాల సరఫరా విషయాన్నీ పట్టించుకోవడం లేదు. మరోవైపు, ఏ అగ్రరాజ్యమైనా అక్కడ ఏం చేయగలదు? క్షేత్రస్థాయిలో అక్కడ ఎవరూ లేరు. ఉగ్రవాదుల గుంపు కార్యకలాపాలపై టెక్నాలజీ లేదా మానవ నిఘా ద్వారా ఎంత వరకూ పరిశీలించవచ్చు? అయితే అప్పుడప్పుడూ ఇవి కూడా ప్రభావవంతంగా ఉంటాయనడానికి అల్–జవాహిరిని మట్టుబెట్టడం నిదర్శనం. పాశ్చాత్య దేశాలు తలుచుకుంటే వాయుమార్గం ద్వారా తమను ఎప్పుడైనా దెబ్బతీయగలవనీ, అయినప్పటికీ తమ ప్రభుత్వాన్ని మాత్రం అవి కూల్చలేవనీ తాలిబన్లకు తెలుసు. ఇలా జరగాలంటే దేశంలో అసంతృప్తి పెరగాలి. కానీ అలాంటి పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రజాగ్రహం లేదా విదేశాల్లో స్థిరపడ్డ ప్రతిపక్ష పార్టీల చర్యలు మచ్చుకైనా లేవు. అంతేకాకుండా అమెరికా, యూరప్, రష్యా, చైనా ప్రయోజనాలేవీ దెబ్బతినకుండా తాలిబన్లు జాగ్రత్త పడుతున్నారు. అమెరికన్లు, యూరోపియన్ల విషయంలో తాలిబన్లు కొంత సానుకూలంగా వ్యవహరిస్తున్నా పాకిస్తాన్‌తో మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నారు. తెహరీక్–ఎ–తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ), అఫ్గాన్ తాలిబన్ల సంబంధాలు మతపరమైనవి, వ్యక్తిగత మైనవి, తెగలకు కూడా సంబంధించినవి. టీటీపీ కూడా ‘అమీర్’కు విధేయులుగా ఉంటామని ఇప్పటికే ప్రకటించింది. అది ఇరు పక్షా లకూ పవిత్ర సంబంధం లాంటిది. టీటీపీ నియంత్రణలో తాలిబన్ల సహకారం ఏమాత్రం అందక పోవడంతో పాకిస్తాన్ సైన్యం, నిఘా వర్గాలు చాలా నిస్పృహలో ఉన్నాయి. ఇది కాస్తా ఘర్షణకు దారితీస్తోంది. ఇరువైపులా బాహాటంగా వ్యతిరేకత వెల్లడవుతోంది. ఆగస్టు 14వ తేదీన కాకుల్లో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా, పాకి స్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ మాట్లాడుతూ, ‘‘అఫ్గాన్ సోదరులను గౌరవిస్తూనే ఈ మాట. వారిని బాగా ఆదరిస్తున్న దేశం పాక్. వారు కూడా ఈ గౌరవ మన్ననలకు తగ్గట్టుగా వ్యవహరించా ల్సిన అవసరముంది. కనీసం మాకు వ్యతిరేకంగా పనిచేసే వారికి ఆశ్రయమైనా కల్పించకుండా ఉండాల్సింది’’ అని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలను తాలిబన్ అధికార ప్రతినిధి తిరస్కరించడం గమనార్హం. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లు టీటీపీని వదులు కోరు. అంతర్జాతీయ సంబంధాల్లో ఉదారత అనేది ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం కాదని గ్రహించిన తొలి దేశం పాకిస్తాన్ ఏమీ కాదు. తాలిబన్లతో సంబంధాల విషయంలో భారత్ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏడాది కాలంగా అఫ్గానిస్తాన్‌లో మన ‘టెక్నికల్ టీమ్’ ఒకటి పనిచేస్తోంది. భారత్ నుంచి మానవతా సాయం కూడా ఈ పొరుగు దేశానికి అందుతోంది. అయితే అఫ్గాన్ల పరిస్థితిని వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకుని ఆచరణ సాధ్యమైన ఆలోచనలను అమల్లో పెట్టడం మేలు. భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే వీసాల జారీని కొంత సులువు చేయడం అవసరం. ఈ చర్య ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న సంబంధాలను మరి కొంచెం దృఢతరం చేయగలదు. వివేక్ కాట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తాలిబాన్ దురాగతాలు: బ్యూటీ పార్లర్లు ఫినిష్.. ఇప్పుడు వాయిద్య పరికరాల వంతు!
అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ ఆంక్షలు, దురాగతాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా తాలిబన్ ప్రభుత్వ అధికారులు సంగీతం అనైతికమైనదని తీర్మానిస్తూ ప్రజల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సంగీత పరికరాలను హెరాత్ ప్రాంతంలో దహనం చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారి అల్-ముజ్రిమ్ మాట్లాడుతూ సంగీతాన్ని ప్రోత్సహించడం అనేది నైతిక విలువలను దెబ్బతీస్తుందని, సంగీతాన్ని వాయించేవారు తప్పుదారి పడతారని వ్యాఖ్యానించారు. 2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ను కబ్జా చేసుకున్న తాలిబాన్ నేతలు ఇష్టమొచ్చిన రీతిన కఠిన శాసనాలను, చట్టాలను చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా బహిరంగంగా సంగీతం ఆలపించడంపై నిషేధం విధించారు. దీనికి ముందు బ్యూటీ పార్లర్లపై నిషేధం విధించారు. తాజాగా వేల డాలర్ల విలువైన వాయిద్య పరికరాలను స్థానిక ప్రజల నుంచి స్వాధీనం చేసుకుని వాటిని దహనం చేశారు. వీటిలో గిటార్, తబలా, డ్రమ్ తదితర వాయిద్య పరికరాలతో పాటు ఆంప్లిఫయర్, స్పీకర్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రణభూమిలో యోగ సాధన: సిరియా ముఖచిత్రాన్ని మారుస్తున్న రిషికేశ్ "Music causes moral corruption and playing it will cause the youth to go astray." Afghanistan's vice ministry burns musical instruments and equipment, deeming music immoralhttps://t.co/as5hDUQ7BX pic.twitter.com/eh9xSgWhkU — AFP News Agency (@AFP) July 31, 2023 -
పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే
ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ పాలన మొదలయ్యాక పాకిస్తాన్లో తెహ్రిక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) మరింత పుంజుకున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)కి చెందిన మానిటరింగ్ కమిటీ ఒక నివేదికలో తెలిపింది. పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై పట్టు కోసం ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్‌లోని గిరిజన ప్రాంతాలపై నియంత్రణ సాధించేందుకు టీటీపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందని ఈ నివేదిక వెల్లడించింది. కాబూల్ పతనం అనంతరం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సమాచారం. టీటీపీ సరిహద్దు ఆవల నుండి తాలిబాన్ మద్దతు పొందుతోంది. పాకిస్తాన్‌పై పట్టు బిగించడంలో టీటీపీ ఊపందుకుంటున్నట్లు సభ్య దేశాల అంచనా. ఆఫ్ఘానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం ద్వారా ధైర్యాన్ని పొందిన టీటీపీ ఇప్పుడు పాకిస్తాన్లో భూభాగంపై నియంత్రణను తిరిగి స్థాపించాలనే ఆశయంతో పనిచేస్తున్నదని నివేదిక తెలియజేస్తున్నది. బలోపేతమవుతున్న టీటీపీ పాకిస్తాన్లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడులు టీటీపీ బలోపేతాన్ని రుజువు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోని ముఖ్య లక్ష్యాలు, పట్టణ ప్రాంతాల్లో సాఫ్ట్ లక్ష్యాలపై టీటీపీ దృష్టి సారిస్తోందని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్తాన్‌లో టీటీపీ యధేచ్ఛగా తన కార్యకలాపాలను కొనసాగిస్తే అది ప్రాంతీయ ముప్పుగా మారుతుందని సభ్య దేశాలు ఆందోళన చెందుతున్నాయని నివేదిక పేర్కొంది. యూఎన్‌ఎస్‌సీలోని కొన్ని సభ్య దేశాలు కూడా టీటీపీ తిరిగి పుంజుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్‌లో టీటీపీ వివిధ విదేశీ సంస్థలతో అనుబంధం ఏర్పరుచుకోవచ్చని, సమీప భవిష్యత్తులో అల్-ఖైదాతో విలీనమయ్యే అవకాశం కూడా ఉండవచ్చని నివేదిక తెలిపింది. టీటీపీకి అల్-ఖైదా మార్గనిర్దేశం అల్-ఖైదా ఇప్పటికే టీటీపీకి మార్గనిర్దేశం చేస్తోందని, పాకిస్తాన్ లోపల లక్షిత ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి సహాయం చేస్తున్నదని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘానిస్థాన్‌లోని కునార్ ప్రావిన్స్‌లో నిషేధిత సంస్థ ఈస్ట్ టర్కెస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ (ఈటీఐఎం)శిక్షణా శిబిరాలను టీటీపీ నాయకులు ఉపయోగిస్తున్నారని, ఇది తాలిబాన్ పాలన కింద వివిధ సమూహాల మధ్య సమన్వయం, మద్దతును సూచిస్తున్నదని నివేదిక తెలిపింది. 20కిపైగా ఉగ్రసంస్థలకు ఆఫ్ఘానిస్తాన్ అండ? తీవ్రవాదం విషయంలో ఆఫ్ఘానిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. దాని పొరుగున ఉన్న పాకిస్తాన్లో అశాంతిని వ్యాప్తి చేయడానికి పనిచేస్తున్న 20కి మించిన ఉగ్రవాద సమూహాలకు ఆఫ్ఘానిస్తాన్ సురక్షితమైన ప్రాంతంగా ఉంది. తాలిబాన్, టీటీపీ, అల్ ఖైదాలు సైద్ధాంతికంగా కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయనేది వాస్తవం. ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్, అల్ ఖైదాలు రహస్యంగా పనిచేస్తున్నాయి. అల్ ఖైదా తన కార్యాచరణ సామర్థ్యాన్ని రహస్యంగా పునర్నిర్మించుకుంటూ, నూతనంగా యువతను రిక్రూట్ చేయడానికి ఆఫ్ఘానిస్తాన్‌ను రవాణా కేంద్రంగా ఉపయోగిస్తోంది. ప్రాంతీయ తీవ్రవాద గ్రూపుల సహకారంతో.. అల్ ఖైదా నాయకులు ఆఫ్ఘానిస్తాన్‌లో ఉన్న నాన్-ఆఫ్ఘన్ మూలాలు కలిగిన ప్రాంతీయ తీవ్రవాద గ్రూపులతో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్, జమాత్ అన్సరుల్లా సహకారంతో మధ్య ఆసియాతో పాటు ఇతర దేశాలలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆ నివేదికలో పేర్కొంది. ఇది కూడా చదవండి: పాపం.. జపాన్ భవిష్యత్తు అలా ఏడ్చింది -
తాలిబాన్ సంచలన నిర్ణయం.. వాటిపై నిషేధం, అలా జరిగితే ఇదే మొదటి సారి
2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆ దేశ ప్రజలపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళలపై అనేక ఆంక్షలు విధించారు. అందులో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి, యూనివర్సిటీ విద్యను అభ్యసించడాన్ని నిషేధించడంతోపాటు పాఠశాల విద్యపైనా అనేక ఆంక్షలు విధించారు. చివరికి మహిళలు బ్యూటీ పార్లర్లను నిషేధించారు. తాజాగా పురుషుల దుస్తులపై కూడా నిషేధాన్ని విధించేందుకు సిద్దమయ్యారు తాలిబన్లు. వివరాల్లోకి వెళితే.. పురుషులు ధరించే నెక్టైలపై నిషేధం విధించేందుకు తాలిబన్లు సిద్ధమయ్యారు. నెక్‌టైలు క్రైస్తవ శిలువను పోలి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పారు. ఈ విషయాన్ని ‘ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్’ డైరెక్టర్ మొహమ్మద్ హషిమ్ షాహీద్ వ్రార్ వెల్లడించారు. అఫ్గాన్‌లో మతపరమైన విధానాలను నిర్ణయించే స్వతంత్ర సంస్థ ది ఇన్విటేషన్ అండ్ గైడెన్స్ డైరెక్టరేట్. ఆయన దీనిపై మాట్లాడుతూ.. "కొన్నిసార్లు, నేను ఆసుపత్రులకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు, ఆఫ్ఘన్ ముస్లిం ఇంజనీర్ లేదా డాక్టర్ నెక్‌టైని ఉపయోగించడం చూశాను. నెక్టైకి మూలం ఏంటి.. క్రిస్టియన్ శిలువను పోలి ఉందని, వీటిని నిషేధించాల్సి ఉందని" అని పేర్కొన్నాడు. నెక్టీలపై నిషేధం విధించినట్లయితే, తాలిబాన్ అధికారులు పురుషుల దుస్తులపై ఆంక్షలు విధించడం ఇదే మొడటి సారి అవుతుంది. Video: Mohammad Hashim Shaheed Wror, General Director of the Invitation and Guidance Directorate (an independent body that determines religious policies within the interim govt), said that the necktie originated from the Christian cross and that it is “ordered in Shariah that you… pic.twitter.com/UMHesWX6TM — TOLOnews (@TOLOnews) July 26, 2023 చదవండి US Woman Got 100 Amazon Orders: ఆర్డర్ పెట్టకుండానే ఆమె ఇంటికి 100కు పైగా పార్సిళ్లు.. ఆరా తీస్తే.. -
బ్యూటీ పార్లర్ల నిషేధానికి నిరసనగా రోడ్డెక్కిన ఆఫ్ఘాన్ మహిళలు..
కాబూల్: ఆగస్టు 2021లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే తాలిబాన్ ప్రభుత్వం బాలికలు హైస్కూళ్ళు, విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవలే అక్కడ మహిళలు బ్యూటీ పార్లర్లు నడపడంపై నిషేధాన్ని విధించింది. దీంతో బ్యూటీ పార్లర్ నడుపుకునే మహిళలు అఫ్గాన్ ప్రభుత్వంతో తమ గోడును చెప్పుకునేందుకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేతులు మారి తాలిబాన్ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన తర్వాత కొన్ని కఠిన నియమాలను అమల్లోకి తీసుకురావడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కాలేజీల్లోనూ, హై స్కూళ్లలోనూ, విశ్వ విద్యాలయాలలోనూ విద్యార్థినులకు ప్రవేశాన్ని నిషేధించింది. పార్కులకు, ఆటవిడుపు ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు జిమ్ వంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు నిండుగా దుస్తులు ధరించి వెళ్లాలని హుకుం జారీ చేసింది. వీటికి కొనసాగింపుగా దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్లను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం. నిరవధికంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వ పెద్దలు తమ గోడు వినకపోవడం దారుణమని.. ఇంతవరకు ఎవ్వరూ తమతో చర్చలు నిర్వహించే ప్రయత్నమైనా చేయలేదని నిరసనకారులు వాపోతున్నారు. ఉన్నట్టుండి మా పొట్ట కొట్టడం సరికాదని చెబుతూ ప్లకార్డులు ప్రదర్శన చేస్తూ తమ జీవనభృతిని కాపాడాలని నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా బ్యూటీ పార్లర్ల సంప్రదాయం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందని, చాలామంది అందాన్ని పెంచుకుని ఆకాశానికి నిచ్చెన వేసే క్రమంలో నిరుపేదలుగా మారుతున్నారని, సెలూన్ లో కొన్ని ట్రీట్మెంట్లు అయితే మన సంప్రదాయాలను మంటగలిపే విధంగా ఉందన్నది ప్రభుత్వం అభిప్రాయం. ఇది కూడా చదవండి: అతడు సముద్రాన్ని జయించాడు.. 60 రోజుల పాటు ఒక్కడే.. -
అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు కీలక మార్గాన్ని తెరిచిన తాలిబన్లు
పెషావర్: అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దుల్లోని కీలకమైన తోర్ఖామ్ మార్గాన్ని తాలిబన్ పాలకులు గురువారం తెరిచారు. వైద్యం, ఇతర అత్యవసరాల నిమిత్తం సరిహద్దులు దాటి వచ్చే వారికి పాకిస్తాన్ యంత్రాంగం అవసరమైన తోడ్పాటు ఇవ్వడం లేదంటూ తాలిబన్లు ఆదివారం తోర్ఖామ్ మార్గాన్ని మూసివేశారు. పాకిస్తాన్– మధ్య ఆసియా దేశాలకు ముఖ్యమైన సరఫరా మార్గం ఇదే. ఇది మూసుకుపోవడంతో పాకిస్తాన్ హుటాహుటిన ఉన్నత స్థాయి బృందాన్ని కాబూల్‌కు పంపించింది. డిమాండ్లను నెరవేర్చేందుకు అంగీకరించడంతో తాలిబన్లు శాంతించారు. అధికారుల సూచనలతో సరిహద్దులు తెరుచుకున్నాయి. దీంతో, అఫ్గాన్ ప్రజల కోసం ఆహార పదార్థాలు, తదితర అత్యవసరాలతో సరిహద్దుల్లో నిలిచిపోయిన వందలాది ట్రక్కులు ఖైబర్ పాస్ గుండా ముందుకుసాగాయి. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కవర్లా?
కాబూల్: 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అరాచక పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాస్తోంది. వాళ్లపై అనేక ఆంక్షలు విధిస్తూ అణగదొక్కుతోంది. అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోకుండా నిషేధం విధించింది. జిమ్‌లు, పార్కులకు వెళ్లకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా తాలిబన్లు తీసుకున్న మరో నిర్ణయం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పటివరకు అమ్మాయిలపై ఆంక్షలు విధించిన తాలిబన్ సర్కార్.. తాజాగా ఆడ బొమ్మలపై కూడా వివక్ష చూపుతోంది. వస్త్ర దుకాణాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసే అమ్మాయిల బొమ్మల మొహాలు కన్పించొద్దని ఆదేశించింది. ఈ మేరకు దుకాణ యజమానులకు హుకుం జారీ చేసింది. దీంతో షాపింగ్ మాల్స్‌లోని అమ్మాయిల బొమ్మల మొహాలకు వస్త్రం లేదా పాలిథీన్ కవర్లను కట్టారు యజమానులు. ఆడ బొమ్మల మొహాలు కన్పించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాలిబన్ల నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొదట అసలు షాపింగ్ మాల్స్‌లో అమ్మాయిల బొమ్మలను పూర్తిగా తొలగించాలని, లేదా వాళ్ల మొహాలను తీసేయాలని తాలిబన్లు ఆదేశించారని దుకాణ యజమానులు వాపోయారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని మొహాలు కన్పించకుండా కవర్లు చుట్టాలని చెప్పారని వివరించారు. దీంతో తాము కొన్ని బొమ్మలకు వాటి దస్తులకు మ్యాచ్ అయ్యే వస్త్రాన్ని కట్టామని, మరి కొన్నింటింకి స్కార్ఫ్, లేదా పాలిథీన్ కవర్లు చుట్టామని చెబుతున్నారు. షాపింగ్ మాల్స్‌లో ఆడ బొమ్మల మొహాలకు కవర్లు చుట్టిన ఫొటోలను అఫ్గాన్ మానవతావాది సారా వాహేది ట్విట్టర్లో షేర్ చేయగా.. అవి కాసేపట్లోనే వైరల్‌గా మారాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళల జీవితం ఎంత దయనీయంగా ఉందో చెప్పేందుకు ఈ ఫొటోలే నిదర్శనమని ఆమె అన్నారు. ఇది అత్యంత బాధాకరం అని ఓ నెటిజన్ స్పందించాడు. తాలిబన్లు నీచులంటూ మరొకరు మండిపడ్డారు. The Taliban’s hatred of women extends beyond the living. It is now mandatory for store owners to cover the faces of mannequins. These dystopian images are a sign of how much worse life is going to become for Afghan women if the world doesn’t stand with them. pic.twitter.com/p2p0b0QGRR — Sara Wahedi (@SaraWahedi) January 18, 2023 చదవండి: సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా -
మహిళల హక్కులను పట్టించుకోం.. మాకు అదే ముఖ్యం: తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలను హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీల్లో చదవకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా మహిళలు ఎన్జీఓల్లో కూడా పనిచేయకుండా కొత్త రూల్ తీసుకొచ్చారు. దీంతో తాలిబన్ ప్రభుత్వం తీరును ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. మహిళల హక్కులను కాలరాయొద్దని సూచిస్తున్నాయి. ఈ విషయంపై తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ స్పందించాడు. అసలు మహిళల హక్కులు తామ ప్రాధాన్యమే కాదని చెప్పాడు. తమకు ఇస్లామిక్ చట్టమే ముఖ్యమని దాని ప్రకారమే మహిళలు నడుచుకోవాలని పేర్కొన్నాడు. వాళ్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే ఉద్దేశమే తమకు లేదని తేల్చిచెప్పాడు. ఇస్లాం చట్ట ప్రకారమే తమ పాలన ఉంటుందన్నాడు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులను కాలరాస్తోంది. ఉన్నత విద్య, కాలేజీలు, యూనివర్సీటీల్లో అమ్మాయిలపై నిషేధం విధించింది. వాళ్లు అబ్బాయిలతో కలిసి చదువుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరకు మహిళలు ఎన్జీఓల్లో కూడా ఉద్యోగం చేయకుండా ఆంక్షలు విధించింది. హిజాబ్ ధరిచంకుండా, మగ తోడు లేకుండా బయటకు వెళ్లొద్దని నిబంధనలు తీసుకొచ్చింది. ప్రపంచదేశాలు నుంచి తీవ్ర విమర్శలు ఎదరువుతున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. చదవండి: కీవ్‌పై మరోసారి పేట్రేగిన రష్యా -
స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై నిషేధంపై తాలిబన్ల కీలక ప్రకటన
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవుకోకుండా తాలిబన్ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ చర్యను ప్రపంచదేశాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తాజాగా ఇందుకు సంబంధించి తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. విద్యాసంస్థల్లో అమ్మాయిలపై విధించిన నిషేధం శాశ్వతం కాదని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఇది కొంతకాలం వాయిదా మాత్రమే పడినట్లు పేర్కొన్నారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో అమ్మాయిలకు అనువైన వాతావరణం కల్పించిన తర్వాత వాళ్లు మళ్లీ చదువుకుంటారని పేర్కొన్నారు. మహిళా విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఇది ఎప్పటివరకు పూర్తవుతుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచక పాలన కొనసాగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులను వారు కాలరాస్తున్నారు. మగ తోడు లేకుండా, హిజాబ్ ధరించకుండా మహిళలు బయటకు వెళ్లొద్దని నిబంధన తీసుకొచ్చారు. అలాగే ఆరో తరగతి తర్వాత అమ్మాయిల, అబ్బాయిలు కలిసి చదువుకోవడాన్ని తాలిబన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థల్లో అమ్మాయిలపై డిసెంబర్లో నిషేధం విధించారు. చదవండి: కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు.. -
ఉగ్రపడగ నీడలో పాక్
-
ఆఫ్ఘానిస్తాన్ లో అమ్మాయిలకు నరకం చూపిస్తున్న తాలిబన్లు
-
అమ్మాయిలకు మద్దతుగా అబ్బాయిలు.. క్లాస్‌లు బాయ్‌కాట్ చేసి నిరసన
అఫ్గానిస్తాన్‌లో అమ్మాయిలు యునివర్సిటీల్లో చదువుకోకుండా తాలిబన్ ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో వారు ఉన్నత విద్యకు దూరమై ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే యూనివర్సిటీల్లో చదువుకునే అబ్బాయిలు.. అమ్మాయిలకు మద్దతుగా నిరసన బాట పట్టారు. తమకు కూడా చదువు వద్దని క్లాస్‌లు బహిష్కరించారు. అమ్మాయిలను కూడా క్లాస్‌లోకి అనుమతిస్తేనే తాము చదువుకుంటామని, లేదంటే చదువు మానేస్తామని హెచ్చరించారు. అమ్మాయిలకు తిరిగి యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని అబ్బాయిలు డిమాండ్ చేస్తున్నారు. తమ అక్కా చెల్లెళ్లను ఉన్నత విద్యకు నోచునివ్వకపోతే తమకు కూడా చదువు అవసరం లేదని చెప్పారు. యూనివర్సిటీకి వెళ్లబోమని తేల్చిచెప్పారు. కాబుల్ యూనివర్సిటీలోని లెక్చరర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళలు చదువుకోకుండా నిషేధం విధించడం సరైన నిర్ణయం కాదన్నారు. తాలిబన్ల నిర్ణయం కారణంగా తన ఇద్దరు చెల్లెల్లు చదువు మానేయాల్సి వచ్చింది ఓ లెక్చరర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో ప్రంపచ దేశాలు జోక్యం చేసుకోవాలని మానవహక్కుల ఆందోళకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు తమ నిర్ణయం ఉపసంహరించుకునేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. అఫ్గాన్ మహిళల ఆవేదన
కాబుల్: అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ, అఫ్గాన్ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు తాలిబన్లు. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని హుకుం జారీ చేశారు. ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకు దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. యూనివర్సిటీల దగ్గర భారీగా బలగాలను మోహరించి వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తమ హక్కులను కాలరాయడంపై అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు మార్వా అనే యువతికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ, ఇప్పుడు ఆమె సోదరుడు ఒక్కడే వెళ్తాడని తెలిసి మనోవేదనకు గురైంది మార్వా. మహిళలపై నిషేధం విధించటం వారి తల నరకడం కన్నా చాలా బాధకారమని పేర్కొంది. ‘ఒకవేళ వారు మహిళలను శిరచ్ఛేదం చేయమని ఆదేశిస్తే.. అది కూడా ఈ నిషేధం కంటే మెరుగ్గా ఉండేది. మనం ఇంత దురదృష్టవంతులమైతే, మనం పుట్టి ఉండకపోతేనే బాగుండేది. నేను ఈ భూమిపై ఉన్నందుకు బాధపడుతున్నా. మనల్ని పశువులకన్నా హీనంగా చూస్తున్నారు. పశువులు ఎక్కడికైనా వెళ్లగలవు. కానీ, బాలికలకు ఇంట్లోంచి బయట అడుగుపెట్టేందుకు కూడా హక్కు లేదు. ’ అని ఆవేదన వ్యక్తం చేసింది 19 ఏళ్ల మార్వా. కాబుల్‌లోని మెడికల్ యూనివర్సిటీలో మార్చి నుంచి మెడికల్ డిగ్రీలో చేరేందుకు ఇటీవలే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది మార్వా. అతన సోదరుడు హమిద్‌తో పాటు యూనివర్సిటీకి వెళ్లాలని కలలను కంది. అయితే, తాజా నిర్ణయం ఆమె ఆశలను నాశనం చేసింది. తనతో పాటు చదువుకుని తన సోదరి లక్ష్యాన్ని సాధించాలని కోరుకున్నట్లు తెలిపాడు హమిద్. ఎన్నో కష్టాలను దాటుకుని తన సోదరి 12వ తరగతి వరకు చదువుకున్నట్లు తెలిపాడు. 45% బాలికలు డ్రాపవుట్ 2021 సెప్టెంబర్ నుంచి అఫ్గాన్‌లో సెకండరీ స్కూల్స్‌లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్ అయ్యారు. ఇదీ చదవండి: Afghanistan: రెక్కలు విరిచేస్తున్నారు.. అఫ్గాన్ యూనివర్సిటీల్లో అమ్మాయిలకు ఇక నో ఎంట్రీ -
చదువుకు పరదాలా?
కరోనా భయంతో ప్రపంచం క్వారంటైన్ అవుతున్న రోజుల్లో, అఫ్గానిస్తాన్ మహిళలు అంతకన్నా భయానకమైన వేరొక కారణంతో ఏకాంతవాస శిక్ష అనుభవిస్తున్నారు. వారు అన్ని హక్కులూ కోల్పోయి జీవితాన్నీ, భవిష్యత్తునూ తాలిబన్ ముష్కర పాలకుల దయాదాక్షిణ్యాలకే వదిలేసు కోవాల్సి వచ్చింది. గత నెలలో పార్కులు, జిమ్‌లు, ఈతకొలనుల తర్వాత ఇప్పుడు అఫ్గాన్ విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశాన్ని తాలిబన్ ఏలికలు నిరవధికంగా నిషేధించారు. అలా విద్యార్థినుల్ని చదువుకు దూరం చేస్తూ మంగళవారం హుకుం జారీ చేశారు. అదేమంటే ‘జాతీయ ప్రయోజనం, మహిళల గౌరవం’ కోసం ఈ పని చేశామంటున్నారు. జనాభాలో సగాన్ని పిడికిట బంధించి, విద్యావంతులు కాకుండా చేస్తే ఏ జాతీయ ప్రయోజనం సిద్ధిస్తుందో దేవుడికి తెలియాలి. తాలిబన్ల ధోరణి తెలుసు గనక ఈ దుర్నిర్ణయం ఆశ్చర్యమేమీ కాకున్నా, అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆడిన మాట తప్పిన అనాగరిక పాలనను కళ్ళకు కట్టింది. అఫ్గాన్‌లో మానవ హక్కులను పరిరక్షించాలంటూ ఐరాస ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చిన మర్నాడే తాలిబన్ల తాజా నిర్ణయం వెలువడింది. తాలిబన్ల నిర్ణయంపై స్థానిక ఉద్యమకారుల మొదలు అమెరికా నేతల దాకా అంతా నిరసన గళం విప్పారు. 2021 ఆగస్ట్‌లో అమెరికా సారథ్యం లోని పాశ్చాత్య సేనల అర్ధంతర ఉపసంహరణతో అధికారం హస్తగతం చేసుకున్న తాలిబన్ మూకల అకృత్యాలకు ఇదే మొదలు కాదు. తాలిబన్లు గద్దెనెక్కిన నాటి నుంచి అత్యధికంగా అణచివేతకు గురైంది మహిళలే. స్త్రీలను ప్రభుత్వ, ప్రజావిధాన పాత్రల నుంచి పక్కకు తప్పించి ఇంట్లో పరదాల చాటుకు పరిమితం చేశారు. ఈ మార్చిలోనే ఆడపిల్లల చదువుపై నిషేధాల కథ మొదలైంది. ఆరో తరగతి దాటాక ఆడపిల్లలకు బడి చదువు తోసిపుచ్చారు. ఉన్నత విద్యకు ఇప్పుడు తెర దించేశారు. ఒక్కముక్కలో ఈడొచ్చిన పిల్లలెవరూ వీధుల్లోకి ఒంటరిగా రావడానికి వీల్లేదు. చదువు, ఉద్యోగాలే కాదు, చివరికి పక్కనున్న పార్కుకు వెళ్ళే స్వతంత్రం కూడా స్త్రీలకు లేకుండా చేయడం అమానుషం. ఈ ఛాందసత్వమే అస్థిరతకూ, దారిద్య్రానికీ, అదుపు లేని జనాభా పెరుగుదలకూ దారి తీస్తుంది. 1990లలోని నిరుటి తాలిబన్ పాలన తర్వాత 2001 నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ కాలంలో అఫ్గాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. స్త్రీ విద్య సహా పలు అంశాల్లో సామాజికంగా ఎంతోకొంత పురోగతీ సాధించింది. వాటన్నిటినీ ఇప్పుడు తుంగలో తొక్కుతోంది తాజా తాలిబన్ మధ్యంతర సర్కార్. అందరినీ కలుపుకొనిపోతామంటూ దోహా చర్చల్లో గొప్పగా చెప్పిన ఈ తాలిబన్ 2.0 సర్కార్ ఆచరణలో ఆది నుంచి అందుకు విరుద్ధంగానే వ్యవహరిస్తోంది. ఏడాది దాటినా, ఇప్పటికీ వారికి చట్టబద్ధమైన పాలకులుగా అంతర్జాతీయంగా అధికారిక గుర్తింపు రాలేదు. స్త్రీల పట్ల తిరోగమన విధానాలే అందుకు ప్రధాన కారణం. తాలిబన్లు అనుసరిస్తున్నామని చెబుతున్న ఇస్లామిక్ షరియా చట్టం సైతం ఈ విధానాలను సమర్థించదు. ఆ మాటకొస్తే, గతంలోనూ ఇలాంటి విధానాలు, వ్యవహారాల వల్లే అఫ్గాన్‌లో అంతర్జాతీయ జోక్యం మొదలైంది. తాలిబన్లకు సన్నిహితమైన పాక్ సైతం స్త్రీ విద్యానిరోధాన్ని నిరసించడం విశేషం. ఆ మాటకొస్తే, 1990లలో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించిన సౌదీ అరేబియా, యూఏఈ, పాక్ సైతం ఏడాది క్రితం వచ్చిన కొత్త తాలిబన్ సర్కార్‌ను ఇంకా గుర్తించనే లేదు. మరోపక్క మత ఛాందసవాద ఇస్లామిస్ట్ సర్కార్ పుణ్యమా అని కాబూల్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఏడాదిగా అంతర్జాతీయ వాణిజ్యం, సహాయం దాదాపు ఆగిపోయాయి. ఏటా 400 కోట్ల అమెరికన్ డాలర్ల మేర విదేశీ సాయం అందుకొనే దేశానికి ఇది పెద్దదెబ్బ. అయినా సరే ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తలమునకలైన పాశ్చాత్య ప్రపంచం సహా వర్తమాన అంతర్జాతీయ అనిశ్చితిని వాటంగా చేసుకొని, తాలిబన్లు యథేచ్ఛగా వర్తిస్తున్నారు. కొద్దివారాల క్రితమే బహిరంగ కొరడా దెబ్బలు, ఉరి విధానాల్ని పునరుద్ధ రించారు. ఆంక్షల నుంచి బయటపడేందుకూ, అంతర్జాతీయ చట్టబద్ధతకూ ఇవేవీ కాబూల్‌కు తోడ్పడవు. అయినా మొండిగా ముందుకుపోతుండడం విడ్డూరం. స్త్రీ విద్యను ప్రోత్సహిస్తే స్థానికం గానూ, అంతర్జాతీయంగానూ సంబంధాలు మెరుగవుతాయని గ్రహించకపోవడం విచిత్రం. తాలిబన్ల తొలి ఏలుబడిలోనూ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆనాటి అఫ్గాన్ మహిళలు ధైర్యం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి, రహస్యంగా చదువులు చెప్పడం వల్లే నేటి తరం మహిళ తయారైంది. ఇప్పుడిక ఈ తరం తమ గౌరవం కోసం, న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. అయితే, వారి ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, గౌరవించి, అండగా నిలవాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిది! వివిధ వేదికలపై ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా స్పందించాలి. అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలి. అఫ్గాన్‌తో సంబంధాలపై ఆంక్షల అస్త్రం సహా సామదాన దండోపాయాలను ప్రయోగించాలి. ఐరాస భద్రతామండలి లాంటివి చేయగలిగిందేంటో చూడాలి. దోహా చర్చల సాక్షిగా చేసిన బాసలు తప్పి, లింగ దుర్విచక్షణతో అమానవీయంగా వ్యవ హరిస్తున్న తాలిబన్ సర్కారుకు ముకుతాడు వేయాలి. ఆచరణాత్మక ప్రయోజనాల రీత్యా కాబూల్‌కు స్నేహహస్తం చాస్తున్న భారత్ సైతం ఆటవిక పాలకుల్ని తగు దూరంలో పెడితే మంచిది. చరిత్రను పునర్లిఖిస్తున్న మహిళల్ని ప్రజాజీవితానికి దూరంగా వంటింటి కుందేళ్ళుగా మారుస్తామంటే ఆధునిక సమాజానికి అంగీకారయోగ్యం కాదని తాలిబన్లకు తెలివిడి కలిగించడం ముఖ్యం. -
తాలిబన్ల మరో సంచలన నిర్ణయం.. యూనివర్సిటీ విద్యపై నిషేధం
కాబూల్: అఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల ప్రభుత్వంలో మహిళా లోకంపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. అధికారాన్ని చేజిక్కుంచుకునే ముందు మహిళ హక్కుల కోసం పోరాడుతామని, ప్రజలకు స్వేచ్ఛాయుతమైన ప్రజాస్వామయ్య పాలన అందిస్తామని హామీ ఇచ్చిన తాలిబన్లు.. తరువాత తమ అనాలోచిత నిర్ణయాలు, అరాచక పాలనతో దేశంలోని పౌరుల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బాలికల స్వేచ్చను హరిస్తూ.. వారిని ఇప్పటికే ఉన్నత విద్యకు దూరం చేశారు. అనేక ఉద్యోగాల్లో మహిళలపై ఆంక్షలు విధించారు. దేశ మహిళలు బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధిరంచాల్సిందేనని ఆదేశించారు. ఈ క్రమంలో తాజాగా తాలిబన్లు మరో సంచలన నిబంధన తీసుకొచ్చారు. దేశ వ్యాప్తంగా మహిళలకు యూనివర్సిటీ(విశ్వవిద్యాలయ) విద్యను నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాలిబాన్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. మహిళా విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి నేడా మహ్మద్ నదీమ్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలుపుతూ మేరకు ట్వీట్ చేశారు. న్యూయర్క్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశమై.. తాలిబన్లు నిర్భంధించిన ఇద్దరు అమెరికన్లు విడుదల చేస్తున్నట్లు యూఎస్ విదేశాంగశాఖ వెల్లడించిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే తాలిబన్ల నిర్ణయంపై అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తునఆనయి. మహిళలను ఆంక్షలకు గురిచేస్తున్న తాలిబన్లను.. ఆప్గనిస్థాన్‌లోని అందరి హక్కులను గౌరవించే వరకు అంతర్జాతీయ సమాజంలో చట్టబద్ధమైన సభ్యులుగా ఉండేందుకు ఆశించలేమని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఇద్దరు మృతి.. చీకట్లో వేల మంది.. -
అఫీషియల్: జిమ్‌లు, పార్కుల్లో మహిళలకు నో ఎంట్రీ
కాబూల్: మహిళా హక్కులను, స్వేచ్ఛను హరిస్తూ అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని జిమ్‌లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించింది. ఈ వారం నుంచే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించకపోవడం, పార్కులు, జిమ్‌లలో మహిళలు, పురుషులు విభజనను పాటించకపోవడం వల్లే తాజాగా ఈ ఆంక్షలను తీసుకువచ్చినట్లు ప్రభుత్వ ప్రతినిధి గురువారం చెప్పారు. 2021 ఆగస్ట్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. మాధ్యమిక, ఉన్నత విద్యా పాఠశాలల్లో బాలికల ప్రవేశాన్ని నిషేధించారు. అనేక రంగాల్లో మహిళా ఉద్యోగులను తొలగించారు. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధారణ తప్పనిసరి చేశారు. -
Taliban: ఎట్టకేలకు ఆ సమాధి వెలుగులోకి!
ముల్లా ఒమర్.. ప్రపంచం మొత్తం చర్చించుకున్న.. చర్చిస్తున్న ఇస్లామిక్ రెబల్ గ్రూప్ ‘తాలిబన్’ అలియాస్ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ వ్యవస్థాపకుడు. అయితే.. అఫ్గన్ గడ్డపై అమెరికా దళాల మోహరింపు తర్వాత ఆయన ఏమయ్యాడనే మిస్టరీ చాలా ఏళ్లు ఒక ప్రశ్నగా ఉండిపోయింది. చివరికి ఆయన సమాధి తొమ్మిదేళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. తాలిబన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ ముల్లా ఒమర్.. 2001 దాకా ఆ సంస్థకు ఎమిర్(అధినేత)గా వ్యవహరించారు. అయితే అదే ఏడాది అఫ్గన్‌లో అమెరికా-నాటో దళాల మోహరింపు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 2013 ఏప్రిల్‌లో ఆయన అనారోగ్యం పాలై మరణించినట్లు.. రెండేళ్ల తర్వాత తాలిబన్ సంస్థ ప్రకటించింది. అయితే ఆయన్ని ఎక్కడ ఖననం చేశారు? ఆ సమాధి ఎక్కడుందనే విషయాలపై తాలిబన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండా పోయింది. ఈ తరుణంలో.. జబుల్ ప్రావిన్స్‌లోని సూరి జిల్లా దగ్గర ఒమర్జోలో ఆయన్ని ఖననం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మధ్యే ఆయన సమాధి వద్ద ఓ కార్యక్రమం నిర్వహించగా.. ఆదివారం తాలిబన్ ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని అధికారికంగా వెల్డించారు. సమాధిని ధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో.. ఇంతకాలం ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది తాలిబన్ గ్రూప్. ఇప్పుడు ఎలాంటి సమస్య లేకపోవడంతో విషయాన్ని బయటికి వెల్లడించారు. కాందహార్‌లో పుట్టి పెరిగిన ఒమర్.. ఉన్నత చదువులతో అపర మేధావిగా గుర్తింపు పొందాడు. అయితే.. 1993లో అఫ్గనిస్థాన్ అంతర్యుద్ధం కారణంగా తాలిబన్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. తనను తాను స్వాతంత్ర సమరయోధుడిగా ప్రకటించుకున్న ఒమర్.. పాశ్చాత్య దేశాల తీరుపై విరుచుకుపడుతూ ఉండేవాడు. ఆయన హయాంలోనే తీవ్రవాద సంస్థగా ఎదిగిన తాలిబన్.. మహిళలపై కఠిన ఆంక్షలతో నరకరం చూపించింది. -
వైరల్ వీడియో : బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్ అధికారుల దాడి
-
Viral Video: బుర్ఖా ధరించని విద్యార్థులపై తాలిబన్ అధికారుల దాడి
కాబూల్: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచక పాలన రోజురోజుకీ మితిమీరిపోతుంది. గతేడాది దేశాన్ని తాలిబన్లు తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడి మహిళల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చదువులు, ఉద్యోగాలకు అనుమతి నిరాకరిస్తూ మహిళలను ఆంక్షల చట్రంలో బంధిస్తున్నారు. మహిళల స్వేచ్చ, భావవ్యక్తీకరణ, వస్త్రధారణ ఇలా ప్రతి దానిపై నిషేధం విధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి బాలికలు పాఠశాలకు రాకుండా నిషేధించారు. మహిళలు కేవలం వంటింటికే పరిమితం అయ్యేలా వారిని అణిచివేతకు గురిచేస్తున్నారు. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టిన మహిళలకు హిజాబ్(బుర్భా) ధరించడం తప్పనిసరి చేసింది తాలిబన్ ప్రభుత్వం. ఆఖరికి విద్యాసంస్థలకు కూడా ఇలాగే రావాలని ఆదేశించింది. అయితే అక్కడి మహిళలు తాలిబన్ల నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు బుర్భా పూర్తిగా ధరించకుండా వచ్చినందుకు అధికారులు యూనివర్సిటీ లోపలికి అనుమతివ్వలేదు. దీంతో చదవుకోవడం మా హక్కు అంటూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అయితే నిరసన చేస్తున్న మహిళా విద్యార్థులపై తాలిబన్ అధికారులు దాడి చేశారు. దీంతో విద్యార్థులు భయంతో అక్కడినుంచి పరుగులు తీశారు. Taliban beat female students Even though the girls are wearing hijabs, why are they not allowed to enter the university? The #Taliban want to close the universities for #Female students. Today the the Taliban didn’t allow female students to enter university. #Badakhshan pic.twitter.com/xXmZ8eDolH — Panjshir_Province (@PanjshirProvin1) October 30, 2022 యూనివర్సిటీ ముందు నిరసన తెలుపుతున్న మహిళా విద్యార్థులను కొడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విద్యార్థులపై దాడి చేసిన వ్యక్తి తాలిబాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందినవారుగా తెలిసింది. ఈ సంఘటన ఆదివారం ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లోని బదక్షన్ విశ్వవిద్యాలయం గేట్ బయట జరిగింది. అయితే వీరంతా ముఖం కనిపించకుండా బుర్భా కప్పుకోకపోవడంతో అధికారులు యూనివర్సిటీలోకి అనుమతించలేదని తెలుస్తోంది. -
ప్చ్! వెంటనే ఓడిపోయి మీరు సర్వ....
ప్చ్! వెంటనే ఓడిపోయి మీరు సర్వ.... -
శిక్షణ విన్యాసాల్లో అపశ్రుతి.... హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
కాబూల్: అప్గనిస్తాన్‌లో కాబూల్ శిక్షణా విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికా తయారు చేసిన బ్లాక్‌హాక్ ఛాపర్ కూలి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఒక అనుభవం లేని తాలిబన్ పైలెట్ ఆ అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన సంభవించింది. తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ సాంకేతిక లోపం కారణంగా ఈ ఘటన జరిగనట్లు ధృవీకరించింది. ఈ ఛాపర్‌ని శిక్షణా విమానంగా పేర్కొంది. అయితే మంత్రిత్వశాఖ అదనంగా ఐదుగురు చనిపోయారని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి యునైటెడ్ స్టేట్స్ 2002 నుంచి 2017 మధ్య సుమారు రూ. 2 లక్షల కోట్లు విలువైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నైట్ విజన్ పరికరాలు, విమానాలు, నిఘా వ్యవస్థలతో సహా అఫ్గాన్ ప్రభుత్వానికి రక్షణాయుధాలను పంపింది. (చదవండి: ప్రపంచంలో అత్యంత వృద్ధ రైల్వే యూనియన్ నాయకుడిగా రికార్డు) -
ఆగస్టు 31ని పండగలా జరుపుకుంటున్న తాలిబన్లు... అంబరాన్నంటిన సంబరాలు
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాలబన్లు తమ ఇష్టా రాజ్యంగా రకరకాల నిబంధనలు, ఆదేశాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజగా తాలిబన్లు ఆగస్టు 31 బాణా సంచా కాలుస్తు పెద్దగా సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 31 అనేది యూఎస్ నేతృత్వంలోని దళాలను ఉపసంహరించుకున రోజు. ఈ సందర్భంగా తాలిబన్లు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ పై గత 20 ఏళ్లుగా దారుణమైన యుద్ధం సాగించింది. దీంతో అఫ్గాన్ నిరంతరం యుద్ధం భయంతో మునిగిపోయింది. అంతేకాదు ఈ యుద్ధంలో వేలాది మంది అఫ్గాన్ వాసులు చనిపోవడం, లక్షలాది మంది గాయాలపాలవ్వడం వంటి విధ్వంసాన్ని చవిచూసింది అఫ్గాన్. ఈ విధ్యంసకర దాడికి ముగింపు పలకి ఆగస్టు 31న యూఎస్ తన బలగాలను అప్గనిస్తాన్ నుంచి వెనుక్కు రప్పించింది. అందువల్ల తాలిబన్లు ఈ రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొంటూ ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. ఈ వార్షికోత్సవంను తాము వివిధ రంగుల బానసంచా కాల్పులతోనూ, వైమానిక కాల్పులతో అట్టహాసంగా జరుపుకుంటామని చెప్పారు. అంతేకాదు తాలిబన్లు అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన రోజైన ఆగస్టు 15 జాతీయ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా
These wouldn't affect of Russia's special military operation in Ukraine: అఫ్గనిస్తాన్‌లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన తదనంతరం తాలబన్లు అఫ్గాన్‌ని తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ చేతుల్లోకి వెళ్లిన అఫ్గాన్ దేశంలో ఉండలేమంటూ చాలామంది అప్గనిస్తాన్ సైనిక, వైమానిక దళ సిబ్బంది ఉజ్బెకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా వంటి దేశాలకు పారిపోయారు. దీంతో అత్యాధునిక ఆయుధాలు తాలిబన్ల హస్తగతమైంది. ఇలా అమెరికాకు పారిపోయిన అఫ్గాన్ పైలెట్లకు పెంటగాన్(యూఎస్ డిపార్ట్మెంట్ ఆప్ డిఫెన్స్) సైనిక శిక్షణ ఇస్తుందని రష్యా చెబుతోంది. ఆ సైనిక శిక్షణలో అఫ్గాన్‌కి చెందిన మాజీ పైలెట్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన అధికారులు కూడా ఉన్నారని తెలిపింది. వీరంతా శిక్షణ పొందిన తదనంతరం పోలాండ్ గుండా ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తారని, యుద్ధంలో పాల్గొనేలా వారితో ఒప్పందం కూడా కుదుర్చుకుంటుందని రష్యా సైనిక దౌత్యవేత్తలు పేర్కొన్నట్లు రష్యా స్థానిక మీడియా వెల్లడించింది. ఐతే రష్యా మాత్రం తాము ఉక్రెయిన్‌లో జరుపుతున్న ప్రత్యేక సైనిక చర్యను ఇలాంటి ప్రయత్నాలు ఏ మాత్రం ప్రభావితం చేయలేదని తేల్చి చెప్పింది. రష్యాను నియంత్రించడం అసాధ్యం అని ధీమాగా చెబుతోంది. ఐతే యూఎస్ నుంచి ఈ విషయమై ఎలాంటి ప్రతిస్పందన లేదు. అలాగే పలు నివేదికల ప్రకారం... అఫ్గాన్‌లో స్పెషల్ వింగ్‌కు చెందిన పలువురు పైలెట్లు తమ విమానాలను ఇతర దేశాల సరిహద్దుల గుండా నడిపినట్లు పేర్కొంది. పైగా ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా పారిపోయిన అనేకమంది పైలెట్లును తజికిస్తాన్ అధికారులు మూడు నెలలకు పైగా నిర్బంధించారని కూడా తెలిపింది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం కూడా తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుమారు 100 మంది అఫ్గాన్ సైనిక సిబ్బంది మరణించారని, చాల సైనిక కుటుంబాలు దేశం విడిచి పారిపోయినట్లు యూఎన్ తన నివేదికలో వెల్లడించింది. మరోవైపు హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో డజన్ల కొద్ది అఫ్గాన్ భద్రతాదళాల సభ్యులను ఉరితీసినట్లు పేర్కొంది. అంతేకాదు అఫ్గాన్ మాజీ భద్రతా దళ సభ్యుల కుటుంబాలను సైతం తాలిబన్లు వదలలేదని తెలిపింది. (చదవండి: పారిపోండి.. చస్తారు! రష్యా బలగాలకు జెలెన్స్కీ సాలిడ్ వార్నింగ్.. ఖేర్సన్లో మిస్సైళ్ల వాన) -
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ పాలనకు ఏడాది పూర్తి
-
Afghanistan: ఏడాదిగా అరాచకమే
సరిగ్గా ఏడాది క్రితం.. అమెరికా రక్షణ ఛత్రం కింద ఉన్న అఫ్గానిస్తాన్ మళ్లీ తాలిబన్ల చెరలో చిక్కుకుంది. 20 ఏళ్ల యుద్ధాన్ని విరమించి, అమెరికాతోపాటు పశ్చిమ దేశాల సైన్యం వెనక్కి తరలిపోవడం ప్రారంభమైన కొద్ది రోజుల వ్యవధిలోనే దేశంలో తాలిబన్లు పాగా వేశారు. వారి అరాచక పాలనకు ఏడాది నిండింది. తాలిబన్లు అఫ్గాన్ ప్రజలకు నరకం చూపుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, కనీస వసతులు అందని ద్రాక్షగా మారాయి. మానవ హక్కుల జాడే లేదు. పేదరికం, కరువు ప్రధాన శత్రువులుగా మారిపోయి పీడిస్తున్నాయని అఫ్గాన్ పౌరులు ఆవేదన చెందుతున్నారు. ఎవరిని కదిలించినా కన్నీళ్లే ఉబికి వస్తున్నాయి. పిడివాద పాలనను పరిశీలిస్తే నిర్వేదమే మిగులుతుంది. ఆహార సంక్షోభం ప్రపంచంలో తాలిబన్ పాలకులు ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయారు. అఫ్గాన్ ప్రభుత్వాన్ని చాలా దేశాలు అధికారికంగా గుర్తించడం లేదు. విదేశీ సాయం నిలిచిపోయింది. 2020–21లో అఫ్రాఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో 5.5 బలియన్ డాలర్ల వార్షిక బడ్జెట్ ప్రకటించారు. ఇందులో 75 శాతం నిధులు విదేశాల నుంచి సాయం రూపంలో అందినవే కావడం గమనార్హం. తాలిబన్ల రాకతో ఈ సాయమంతా హఠాత్తుగా ఆగిపోయింది. అఫ్గాన్‌కు చెందిన 7 బిలియన్ డాలర్ల నిధులను అమెరికా స్తంభింపజేసింది. ఆర్థిక ఇబ్బందులు కుంగదీస్తున్నాయి. ఉద్యోగాలు లేవు, ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. అఫ్గాన్ పేదలు ఉపాధి కోసం పొరుగుదేశం ఇరాన్‌కు వలసవెళ్తున్నారు. అక్కడా పనులు దొరక్క ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారు. లక్షలాది మంది జనం పేదరికంలోకి జారిపోతున్నారు. ఈ రోజు తినడానికి తిండి దొరికితే అదే గొప్ప అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. అఫ్గాన్ జనాభా 4.07 కోట్లు కాగా, సగానికి పైగా ప్రజలు ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. సమీప భవిష్యత్తులోనూ బతుకులు మారుతాయన్న సూచనలు కనిపించడం లేదు. ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన శిక్షలు: అఫ్గాన్‌లో మహిళలపై వివక్ష యథావిధిగా కొనసాగుతోంది. తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే మహిళలను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించారు. మీరు ఇక ఇళ్లకే పరిమితం కావాలి, మీ కుటుంబాల్లోని పురుషులకు ఉద్యోగాలు ఇస్తాం అంటూ తేల్చిచెప్పేశారు. వారికి ఉన్నత విద్యను సైతం దూరం చేస్తున్నారు. బాలికలు పాఠశాలల్లో ఆరో గ్రేడ్‌కు మించి చదువుకోవడానికి వీల్లేదు. టీనేజీ బాలికలకు పాఠశాలల్లో ప్రవేశం లేదు. అంతోఇంతో స్తోమత కలిగిన కొందరు ఇళ్లల్లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వస్తే శరీరమంతా కప్పేసేలా దుస్తులు ధరించాలి. ఆంక్షలను అతిక్రమిస్తే శిక్షలుంటాయి. వ్యవసాయ కూలీలుగా విద్యావంతులు దేశంలో ఈ ఏడాది కరువు తీవ్రత పెరిగింది. పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రధాన పంట గోధుమల ఉత్పత్తి తగ్గింది. ఉన్నత చదువులు చదువుకున్న యువత కూడా ఉపాధి కోసం చేలల్లో పనిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారికి రోజువారీ కూలీ 2 డాలర్ల లోపే లభిస్తోంది. జనం ఆవేదన ఇలా ఉండగా, తాలిబన్ల వాదన మరోలా ఉంది. దేశంలో అవినీతిని అంతం చేశామని, దురాక్రమణదారులను తరిమికొట్టి ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని చెబుతున్నారు. షరియా చట్టం పరిధిలోనే మహిళలకు హక్కులు కల్పిస్తున్నామనిఅంటున్నారు. బొగ్గు, పండ్లను పాకిస్తాన్‌కు ఎగుమతి చేయడంతోపాటు కస్టమ్స్ రెవెన్యూ వసూళ్ల ద్వారా తాలిబన్లు ఆదాయం సంపాదిస్తున్నారు. 2021 డిసెంబర్ నుంచి 2022 జూన్ మధ్య 840 మిలియన్ డాలర్లు ఆర్జించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో అఫ్గానిస్తాన్ బడ్జెట్ 2.6 బిలియన్ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
అల్‌ఖైదా అగ్రనేత జవహరీ మృతిపై తాలిబన్ల సంచలన ప్రకటన
కాబూల్: అల్‌ఖైదా అగ్రనాయకుడు అమాన్ అల్-జవహరీ మృతిపై తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. జవహరీ మృతి చెందలేదని తాలిబన్లు ప్రకటించారు. జవహారీ చనిపోయినట్లు ఆధారాలు లేవని, ఆయన మృతిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా అల్‌ఖైదా అధినేత అల్-జవహరీని అమెరికా మట్టుబెట్టినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. అప్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్ దాడిలో అల్-జవహరీని హతమార్చినట్లు స్వయంగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఈజిప్టు సర్జన్ అయిన అల్-జవహరీ ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారారు. 2001 సెప్టెంబర్ 11న (9/11 హైజాక్) అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో 3వేల మంది మరణించారు. ఈ దాడికి పాల్పడిన సూత్రధారుల్లో అల్ జవహరీ ఒకరు. అమెరికా దళాలు 2011లో ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చిన తర్వాత అల్-ఖైదా పగ్గాలను జవహరీ స్వీకరించాడు. జవహరీపై 25 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ఇప్పటికే ప్రకటించింది. కాబూల్‌లో జవహరీ మృతికి సంబంధించి డీఎన్ఏ ఆధారాలు లేవని అమెరికా ధృవీకరించింది. అయితే అనేక ఇతర మూలాల ద్వారా అతను చనిపోయినట్లు గుర్తించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా, తాలిబన్ల పరస్పర విభిన్న ప్రకటనలతో అల్‌ఖైదా అధినేత జవహరీ మృతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇది కూడా చదవండి: జవహరీ హతం.. అమెరికన్లూ జాగ్రత్త! బైడెన్ సర్కారు అధికారిక ప్రకటన -
కాబూల్‌లో అల్‌ఖైదా చీఫ్ హతం.. స్పందించిన తాలిబన్లు
కాబూల్: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా డ్రోన్ దాడులు నిర్వహించి హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగిన ఈ దాడిపై తాలిబన్లు స్పందించారు. అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. 2020లో జరిగిన అమెరికా బలగాల ఉపసంహరణ ఒప్పందాన్ని అతిక్రమించారని పేర్కొన్నారు. ఈమేరకు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహీద్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాబూల్‌లోని ఓ నివాసంలో తలదాచుకున్న అల్ జవహరిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం వెల్లడించారు. 9/11 దాడి బాధితులకు న్యాయం చేసినట్లయిందని పేర్కొన్నారు. ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన అమెరికా నిఘా వర్గాలను కొనియాడారు. అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నాడనే పక్కా సమాచారంతో అమెరికా సీఐఏ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. అతను ఇంటి బాల్కనీపైకి వచ్చినప్పుడు అదను చూసి క్షిపణులతో విరచుకుపడింది. డ్రోన్ల సాయంతో ఈ దాడి చేసింది. ఈ ఘటనలో సాధారణ పౌరులెవరూ చనిపోలేదని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భాగంగా దాదాపు 20 ఏళ్లకు పైగా అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా బలగాలు గతేడాది తాలిబన్లు అధికారం చేపట్టాక వెళ్లిపోయాయి. దాదాపు 11 నెలల తర్వాత అల్‌ఖైదా చీఫ్‌ను హతమార్చేందుకు మళ్లీ అక్కడకు వెళ్లాయి. అయితే దాడి విషయంపై తాలిబన్లకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. చదవండి: రెండు దశాబ్దాల వేట.. అల్ ఖైదా చీఫ్‌ను అమెరికా ఎలా మట్టుబెట్టిందంటే? -
మహిళా ఉద్యోగులకు తాలిబన్ల షాక్! ఆఫీస్‌కు మగాళ్లను పంపాలని ఆదేశం
కాబూల్: అధికారం చేపట్టినప్పటి నుంచి క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తోంది అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు. 'తాలిబన్ అధికారుల నుంచి నాకు కాల్ వచ్చింది. ఆఫీస్‌లో పని భారం పెరుగుతోంది. మీరు చేయలేరు. మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపాలి అని చెప్పారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా పదవిని తగ్గించారు. 60 వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారు. ఇదేంటని మా పై అధికారిని అడిగితే దరుసుగా ప్రవర్తించారు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోమన్నారు. ఈ విషయంపై చర్చించవద్దన్నారు. జీతం తగ్గాక నా పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి వచ్చింది. 15 ఏళ్లుగా నేను ఆర్థిక శాఖలో పని చేస్తున్నా. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ కూడా చేశా' అని మహిళా ఉద్యోగి తెలిపారు. గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు తాలిబన్లు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ మే నెలలోనే అంచనా వేశారు. అఫ్గాన్ పేదరికంలోకి వెళ్లిందని, ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: డెలివరీ బాయ్ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు -
నవ వధువుని మిలటరీ హెలికాప్టర్లో తీసుకెళ్లిన కమాండర్! ఆగ్రహించిన ప్రజలు
Commander landing near the bride's house: తాలిబన్ కమాండర్ నవ వధువుని ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్ని ఉపయోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మీడియా కథనం ప్రకారం... ఒక తాలిబన్ వ్యక్తి నవ వధువుని తీసుకుని మిలటరీ చాపర్‌లో పయనించాడని అఫ్గాన్ స్థానిక మీడియా పేర్కొంది. అతను తన భార్యను తీసుకుని ఆ చాపర్‌లో అప్గనిస్తాన్‌లోని లోగర్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ వెళ్లినట్లు తెలిపింది. పైగా ఆ వ్యక్తిని హక్కాని శాఖ కమాండర్‌గా పేర్కొంది. అంతేకాదు ఆ కమాండర్ నవవధువు ఇంటి దగ్గర హెలికాప్టర్ నుంచి దిగుతున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తి ఆమెని వివాహం చేసుకునేందుకు తన మామగారికి దాదాపు రూ. 10 లక్షలు పైనే చెల్లించాడని వెల్లడించింది. అంతేగాక ఆ వ్యక్తి ఖోస్ట్‌లో నివశిస్తున్నాడని, అతని భార్య పుట్టిల్లు లోగర్‌లోని బార్కి బరాక్ జిల్లాలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ విషయమై తాలిబన్ డిప్యూటి అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్ అహ్మదీ స్పందిస్తూ... ఆ వ్యాఖ్యలను ఖండించారు. సేనాధిపతి చేసిన వ్యాఖ్యలను శత్రువులు చేస్తున్న తప్పుడూ ప్రచారంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ తోసిపుచ్చింది కూడా. ఐతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఈ చర్యను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగపరచడం కిందకే వస్తుందంటూ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. -
నాడు యాంకర్‌గా...నేడు రోడ్లపై తినుబండారాలు అమ్ముకుంటూ...
Photo Of Journalist Surviving In Afghanistan Viral: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి అఫ్గనిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ మేరకు తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్ జర్నలిస్ట్ ప్రాణాలతో బయటపడిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫోటోని అఫ్గాన్‌లోని మునుపటి హమీద్ కర్జాయ్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన కబీర్ హక్మల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అతని పేరు మూసా మొహమ్మదీ అని, అతను ఒకప్పుడూ చాలా ఏళ్లు వివిధ టీవీ ఛానెళ్లలో యాంకర్ అండ్ రిపోర్టర్‌గా పనిచేశాడని పేర్కొన్నాడు. ఐతే ప్రస్తుతం తన కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలని అమ్ముకుంటున్నాడని చెప్పాడు. అతనికి ఆదాయం లేకపోవటంతో కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం ఈ పనిచేస్తున్నాడని వివరించాడు. ప్రస్తుతం అతని కథ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఇది కాస్తా నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టిని ఆకర్షించింది. దీంతో అతను ఆ మాజీ జర్నలిస్ట్‌కు తన ఛానెల్లో ఉద్యోగం ఇస్తానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. అంతేకాదు అతనికి తమ నేషనల్ రేడియో అండ్ టెలివిజన్‌లో నియమించుకుంటామని హామీ ఇచ్చాడు. ఐతే మొహమ్మదీలానే చాలామంది జర్నలిస్టులు, మరీ ముఖ్యంగా మహిళా జర్నలిస్ట్‌లు అఫ్గనిస్తాన్‌లో ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదీగాక 2021లో చివరి నాలుగు నెలల్లో తలసరి ఆదాయం మూడింట ఒక వంతు పడిపోయినందున అఫ్గనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. Journalists life in #Afghanistan under the #Taliban. Musa Mohammadi worked for years as anchor & reporter in different TV channels, now has no income to fed his family. & sells street food to earn some money. #Afghans suffer unprecedented poverty after the fall of republic. pic.twitter.com/nCTTIbfZN3 — Kabir Haqmal (@Haqmal) June 15, 2022 (చదవండి: మాట మార్చిన రష్యా! సంబంధాలు యథావిధిగా మెరుగవుతాయి) -
అఫ్గన్ గడ్డపై భారత బృందం.. తాలిబన్ల విన్నపాలు
కాబూల్: అమెరికా బలగాల నిష్క్రమణ.. తాలిబన్ పాలన చేపట్టాక అఫ్గనిస్థాన్‌లో భారత బృందం తొలిసారి పర్యటించింది. మానవతా సాయం పంపిణీ పర్యవేక్షణకు విదేశాంగ శాఖ జాయింట్ సెక్రెటరీ జేపీ సింగ్ నేతృత్వంలోని ఓ బృందం అఫ్గానిస్తాన్‌లో పర్యటిస్తోంది. తాలిబన్ల చేతిలోకి వెళ్లాక భారత బృందం అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. అఫ్గన్ విదేశాంగ మంత్రి అమీర్‌ఖాన్, జేపీ సింగ్ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం భారత బృందం అక్కడి మంత్రితో భేటీ అయ్యింది. మానవతా సాయం పంపిణీ వివరాలను అడిగి తెలుసుకుంది. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గన్‌కు ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం అవసరం. ఈ నేపథ్యంలోనే భారత బృందం పర్యటిస్తోంది. ఇదే అదనుగా భారత్‌కు తమ విన్నపాలు చేసుకుంది తాలిబన్ ప్రభుత్వం. భారత్ సహకారంతో అఫ్గన్‌లో చేపట్టిన ప్రాజెక్టులను పునరుద్ధరించడంతో పాటు.. దౌత్యపరమైన సంబంధాలను సైతం కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. దీనికి భారత్ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది. అలాగే వర్తక వాణిజ్యాలను సైతం కొనసాగించాలంటూ తాలిబన్ సర్కార్.. భారత్‌కు విజ్ఞప్తి చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాలిబన్ పాలనకు మాత్రం ఇంకా భారత్ అధికారిక గుర్తింపు ఇవ్వని విషయం తెలిసిందే. -
ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట!
Women Under Taliban Rule: సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు, మహిళా రిపోర్టర్లు.. సందర్భాలను బట్టి ముస్తాబై కెమెరాల ముందుకు వస్తారు. మతాచారాల పేరుతో కఠినంగా వ్యవహరించే.. అరబ్ దేశాల్లో మాత్రం తలభాగాన్ని కప్పేసుకుని.. ముఖం కనిపించేలా వార్తలు చదువుతారు. అయితే అఫ్గన్‌లో మాత్రం తాలిబన్ ప్రభుత్వం.. టీవీ ప్రజెంటర్లకు విచిత్రమైన నిబంధన పెట్టాయి. ముఖం కూడా కప్పేసుకుని(పూర్తిగా శరీరాన్ని కప్పేసుకుని) వార్తలు చదవాలని తాజాగా నిబంధం తీసుకొచ్చింది. అధికారం చేపట్టడం సంగతి ఏమోగానీ.. తాలిబన్ల తలతిక్క నిర్ణయాలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. హిజాబ్‌లో కాకున్నా.. కనీసం ఇంట్లోని దుప్పట్లు కప్పేసుకుని ఆఫీసులకు రావాలని ఆదేశించడం, డిస్ప్లే బొమ్మలకు తల భాగం లేకుండా షాపుల్లో ప్రదర్శనలకు ఉంచడం లాంటివి.. ఉదాహరణాలు. ఈ క్రమంలో ఇప్పుడు మరోకటి బయటపడింది. గతంలో తాలిబన్ల పాలనలో అరాచకాలను ఎదుర్కొన్న అక్కడి మహిళా లోకం.. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది. ఈ మధ్యే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేటప్పుడు ముఖాన్ని కప్పేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు తాలిబన్ అధికారులు. ఇప్పుడు యాంకర్లు, టీవీ ప్రజెంటర్లు, కవరేజ్‌కు వెళ్లే రిపోర్టర్లు.. ముఖం కూడా కనిపించకుండా తమ పని చేసుకోవాలంటూ ఆదేశించింది. మీడియా ఛానెల్స్‌తో ఇదివరకే సమావేశం అయ్యామని, మే 21వ తేదీ వరకు తమ ఆదేశాలను పాటించేందుకు చివరి గడువని తాలిబన్ మంత్రి అఖిఫ్ మహజార్ చెబుతున్నాడు. ఒకవేళ పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్‌మాస్క్‌లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఒకటి ఇస్తున్నాడు. చదవండి: షూట్ ఎట్ సైట్ ఆదేశాలపై శ్రీలంక ప్రధాని స్పందన -
Afghanistan: తాలిబన్ల షాకింగ్ నిర్ణయం
కాబూల్: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అప్ఘన్లో మహిళల ఉన్నత విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు మీడియా తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతకుముందు కూడా బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించలేదు. పాఠశాలలు ఓపెన్ చేసిన వెంటనే అమ్మాయిలను ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్యకు అక్కడి యువతులు దూరమయ్యారు. ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌లో రష్యాకు షాకులు.. పుతిన్ ఏం చేస్తారోనన్న టెన్షన్..? -
‘మరోసారి పాక్ దాడులు చేస్తే సహించేది లేదు’
Taliban administration blamed Pakistan for airstrikes: అఫ్గనిస్తాన్ రాజధాని కాబోల్ని కునార్, ఖోస్ట్ ప్రావిన్స్‌లలో వరుస వైమానిక దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అఫ్గాన్ ఈ దాడులను పాకిస్తాన్ నిర్వహించిందని సంచలన ఆరోపణలు చేసింది కూడా. పైగా తాము ఈ దాడులను సహించమని తాలిబన్లు హెచ్చరించారు. అయితే పాక్ మాత్రం అఫ్గనిస్తాన్ సరిహద్దులో జరిగిన వైమానిక దాడుల్లో తమ ప్రమేయం లేదని ధృవీకరించకపోవడం గమనార్హం. ఈ మేరకు అఫ్గనిస్తాన్ తాత్కాలిక రక్షణ మంత్రి ముల్లా మహ్మద్ యాకూబ్ మాట్లాడుతూ...మేము ప్రపంచం, పోరుగు దేశాల నుంచి చాలా రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నాం. ఇందుకు మా సరిహద్దు భూభాగాల్లో జరిగిన వైమానిక దాడులే ఒక ఉదాహరణ. కానీ పాకిస్తాన్, అఫ్గనిస్తాన్ రెండు సోదర దేశాలు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మేమే ఈ దాడులన సహించాం. మరోసారి ఈ దాడులు జరిగితే సహించేది లేదు అని నొక్కి చెప్పారు. అంతేకాదు ఈ రెండు దేశాలు తీవ్రవాదాన్ని వ్యతిరేకించేవే కానీ గత కొంతకాలంగా తీవ్రవాదానికి సంబంధించిన దేశాలు అనే కళంకంతో బాధపడుతున్నాయని అన్నారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, ఆయా గడ్డలలో ఉగ్రవాద గ్రూపులపై చర్యలు తీసుకోవడంలోనూ ఇరు దేశాలకు సంబంధించిన అధికారులు సహకరించాలని చెప్పారు. ఈ దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు తాలిబాన్ పరిపాలన విదేశాంగ శాఖ గత వారం పాకిస్తాన్‌న్ రాయబారిని పిలిచింది కూడా. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 36 మంది మరణించారని అఫ్గాన్ స్థానిక అధికారులు తెలిపారు. అంతేకాదు ఏప్రిల్ 16న ఖోస్ట్, కునార్ ప్రావీన్సులలో జరిగిన వైమానిక దాడుల్లో 20 మంది పిల్లలు మరణించారని ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్యసమితి పిల్లల ఏజెన్సీ హెడ్ పేర్కొన్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఆయుధాగారాలపై రష్యా ముమ్మర దాడులు) -
ఆప్ఘనిస్తాన్‌లో బాంబు పేలుళ్లు.. తాలిబన్లు అలర్ట్
కాబూల్: వరుస బాంబు పేలుళ్లతో ఆప్ఘనిస్తాన్ అతలాకుతలం అవుతోంది. దేశ రాజధాని కాబూల్ సహా మరో ఐదు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. కాగా, ఓ ప్రార్థనా మందిరంలో భారీ పేలుడు సంభవించడంతో 18 మంది మృతి చెందినట్టు సమాచారం. 20 మందికి పైగా సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను స్థానికంగా ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో తాలిబన్లు అలర్ట్ అయ్యారు. ఇది చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా విక్టరీ.. పుతిన్ రెస్పాన్స్ ఇదే.. -
Talibans warning: పాకిస్తాన్‌కు తాలిబన్ల సీరియస్ వార్నింగ్.. షాక్‌లో పాక్
కాబూల్: దాయాది దేశం పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న ఆప్ఘనిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఆప్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 60 మందికిపైగా ఆప్ఘన్ సాధారణ పౌరులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో తాలిబన్లు ఆదివారం పాకిస్తాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. పాక్ దాడులపై తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన సమాచార, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి జబివుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షించకండి. ఆ తర్వాత జరిగే తీవ్రమైన పరిణామాలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా, మరోసారి వైమానిక దాడులు జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇలాంటి ఘటన వల్ల రెండు దేశాల మధ్య వివాదాలు పెరుగుతాయన్న ముజాహిద్.. దౌత్య మార్గాల్లో సమస్యల పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. పాక్ వైమానిక దాడుల అనంతరం ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని పాకిస్తాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌తో తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమావేశమైంది. ఈ సందర్బంగా ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. ఇది చదవండి: సీన్ రివర్స్.. మాట మార్చిన ఇమ్రాన్‌ఖాన్ -
అక్కడ మగవాళ్లు గడ్డం లేకుండా ఆఫీసుకి రాకూడదట!
Taliban have enforced a new dress code: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎప్పడూ ఏదో ఒక కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్‌ని అమలు చేసింది. దీని ప్రకారం పురుష ప్రభుత్వ ఉద్యోగులు గడ్డం లేకుండా కార్యాలయానికి రాకూడదని తెలిపింది. పాశ్చాత్య సూట్లు ధరించకూడదని, తమ తలలను కప్పుకోవడానికి టోపీ లేదా తలపాగాతో పాటు సంప్రదాయ పొడవాటి టాప్స్ , ప్యాంటులు ధరించాలి అని పేర్కొంది. ఈ కోడ్‌ను ఉల్లంఘిస్తే, ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి ప్రవేశించడానికి అనుమతించకపోవడమే కాకుండా చివరికి విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉందని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పైగా గతవారం నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉండగా బాలికలు పాఠశాలలకు హాజరుకాకుండా నిషేధించింది. దీంతో యూఎన్ ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఈ విషయమై తాలిబన్లకు విద్యాహక్కును గౌరవించమని నొక్కి చెప్పింది. ఆఖరికి పురుషులు, కుటుంబ సభ్యులు లేకుండా మహిళలు ఒంటరిగా ప్రయాణించడాన్ని నిషేధించింది కూడా. (చదవండి: రెండు శిక్షణా విమానాలు ఢీ... ముగ్గురు మృతి) -
బాలికలను స్కూళ్లకు అనుమతించండి...తాలిబన్లను ఆదేశించిన యూఎన్
Taliban on allowing girls in high schools: గతేడాది అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకుని తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలికలను పాఠశాలలకు వెళ్లకుండా నిషేధిస్తూ తాలిబాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ విషయమై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఎన్ఎస్సీ సభ్యుల ఈ విషయమై అఫ్గనిస్తాన్‌కి సంబంధించిన సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి డెబోరా లియోనన్స్తో చర్చించారు. ఆ సమావేశలో బాలికలతో సహా అఫ్గాన్లందరి విద్యా హక్కు గురించి పునరుద్ఘాటించారు. విద్యా హక్కును గౌరవించడమే కాకుండా విద్యార్థులందరూ పాఠశాలకు వెళ్లేలా స్కూళ్లు తెరవాలని తాలిబన్లకు పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్ ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (యూఎన్ఏఎంఏ) , ఈ సమస్యపై సంబంధిత అఫ్గాన్ వాటాదారులందరితో పరస్పర చర్చ కొనసాగించాలని సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిని ఆదేశించింది. అంతేగాదు ఈ అంశం పురోగతిపై భద్రతా మండలికి తెలియజేయాలని కూడా కోరింది. విద్యతో సహా అన్ని అంశాల్లో అఫ్గనిస్తాన్‌కు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను భద్రతా మండలి సభ్యులు నొక్కి చెప్పారు. అయితే గతేడాది అఫ్గనిస్తాన్‌లోని వేలాది మంది సెకండరీ పాఠశాల బాలికలు ఆగస్టు 2021 తర్వాత మొదటిసారి తరగతులకు హాజరు కావడానికి ఆసక్తి కనబర్చారు. కానీ కొన్ని గంటల్లోనే పాఠశాలలను మూసివేయాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాదు తాలిబాన్ ప్రభుత్వం తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటించే వరకు బాలికలు ఇంట్లోనే ఉండాలని సూచించారు కూడా. ఒక వారంలోగా బాలికల మాధ్యమిక పాఠశాలలను తిరిగి తెరవడంలో తాలిబాన్ విఫలమైతే దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని అప్గాన్‌లోని మహిళా హక్కుల కార్యకర్తలు హెచ్చరించారు. ఇదిలా ఉండగా రాజధాని నగరం కాబూల్‌లో విద్యార్థినిలు విద్య మన సంపూర్ణ హక్కు అని నినాదాలు చేశారు. అయితే ఈ విషయమై తాలిబానీ విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి వివరణ ఇవ్వలేదు. కానీ ఇస్లామిక్ ఎమిరేట్ సీనియర్ నాయకుడు మాత్రం పాఠశాలలను తిరిగి తెరవడానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను ఇంకా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు. (చదవండి: రష్యా బలగాల ఉపసంహరణ దిశగా వ్యూహం.. భయాందోళనలో ఉక్రెయిన్) -
తాలిబన్ల రాజ్యం ఆప్గన్‌లో స్కూల్స్ ఓపెన్.. స్పెషల్ కండీషన్స్ అప్లై..
కాబూల్: ఆప్గనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. ఆప్గన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో ఆఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. అనంతరం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు మళ్లీ దేశంపై ఆధిపత్యం సాధించారు. ఇదిలా ఉండగా.. తాలిబన్ల సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆప్గనిస్తాన్ పిల్లల చదువు విషయంలో సర్కార్ దృష్టిసారించింది. వచ్చే వారం నుంచి విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నామని తాలిబాన్ ప్రభుత్వ విద్యా మంత్రి అజీజ్ అహ్మద్ రయాన్ ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే వారం నుంచి స్కూల్స్, కాలేజీలు తెరుస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో కొన్ని కండీషన్ అప్లై అంటూ వార్నింగ్ సైతం ఇచ్చారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా విద్యా సంస్థలు నడుస్తాయని చెప్పారు. అయితే, బాలికలకు సంబంధించిన విద్యా సంస్థల్లో కేవలం మహిళా స్టాఫ్ మాత్రమే బోధిస్తారని తెలిపారు. అలాగే, రిమోట్ ప్రాంతాల్లో మహిళా స్టాఫ్ లేని క్రమంలో వయస్సు మళ్లిన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందించనున్నట్టు వెల్లడించారు. కాగా, బాలుర విద్యాసంస్థల్లో పురుషులతో తరగతుల నిర్వహణ జరుగుతుందన్నారు. మరోవైపు, ఈ విద్యా సంవత్సరంలో స్కూల్స్, కాలేజీల మూసివేత ఉండదని స్పష్టం చేశారు. -
‘తాలిబన్’ లేకుండానే అఫ్గన్ అనుకూల తీర్మానం
అఫ్గనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చాక తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తాలిబన్ ప్రభుత్వానికి శుభవార్త అందించింది ఐక్యరాజ్య సమితి. అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కేలా ఒక అడుగు ముందుకు వేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గురువారం ఒక తీర్మానం చేయగా.. ఆమోదం లభించింది. అఫ్గనిస్థాన్ ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం అది. ఇక వోటింగ్‌కు రష్యా దూరం కాగా.. 14 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఈ తీర్మానం తర్వాతి దశకు వెళ్తుంది. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు గనుక ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే(తప్పనిసరేం కాదు!).. ఆపై తాలిబన్లు నడిపిస్తున్న అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కినట్లు అవుతుంది. తాలిబన్ లేకుండానే.. అయితే ఐరాసలో భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానంలో చిన్నమెలిక ఉంది. ఎక్కడా తాలిబన్ అనే పదాన్ని పేర్కొనలేదు. కాకపోతే.. యూఎన్ పొలిటికల్ మిషన్ ఏడాది పాటు ఉంటుందని, అఫ్గనిస్థాన్‌లో శాంతి స్థాపనకు కృషి చేస్తుందని మాటిచ్చింది. అయితే తాలిబన్ అనే పదం లేకపోవడం సాంకేతికంగా అఫ్గన్ సాయానికి, గుర్తింపునకు ఎలాంటి ఆటంకంగా మారబోదు. కాకపోతే.. తాలిబన్ అనే పదం బదులు.. మరో పదం తీసుకురావాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక ఈ తీర్మానంలో.. పరస్సర సహకారం, మానవతా కోణంలో సాయం, రాజకీయ అంశాలపై హామీలు ఉన్నాయి. ఉనామా(UNAMA ..the UN mission to Afghanistan)కు ప్రపంచ దేశాలు అన్ని విధాల సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టిన నార్వే ఐరాస రాయబారి మోనా జుల్ చెప్తున్నారు. -
పాక్ చెత్త.. భారత్ బంగారం!: తాలిబన్లు
అఫ్గనిస్థాన్ పునర్మిర్మాణంలో పలు దేశాలు పాలు పంచుకుటున్న విషయం తెలిసిందే. తాలిబన్లు అఫ్గన్‌ను ఆక్రమించుకున్నాక.. ఆర్థిక ఆంక్షల వల్ల సంక్షోభంలో కూరుకుపోయింది. తాలిబన్ ప్రభుత్వానికి ఇంకా గ్లోబల్ గుర్తింపు దక్కనప్పటికీ.. నానాటికీ పరిస్థితి దిగజారిపోతుండడంతో మానవతా కోణంలో భారీ సాయమే అందుతోంది. ఈ క్రమంలో.. అఫ్గన్ పొరుగున ఉన్న పాక్ గోధుమలను అందించగా.. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది అక్కడి ప్రభుత్వం. ‘‘పాక్ నుంచి పంపించిన గోధుమ నాసికరంగా ఉన్నాయి. తినడానికి అస్సలు పనికిరావు. చెత్తలోపారబోయడానికి తప్ప. ఎందుకు పంపారో ఆ దేశ ప్రభుత్వానికే తెలియాలి. బహుశా ఖరాబును జమ చేసుకోవడం ఇష్టం లేక పంపారేమో’’ అంటూ మండిపడ్డారు అక్కడి అధికారులు. అదే సమయంలో భారత్ అందించిన గోధుమలపైనా స్పందించారు. భారత్ మేలిమి రకపు గోధుమలను అందించిందని, అందుకు మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని తెలిపారు. తాలిబన్ ప్రతినిధులు పాక్-భారత్ గోధుమ సాయంపై స్పందించిన వీడియో ఒక దానిని అఫ్గన్ జర్నలిస్ట్ అబ్దుల్లా ఒమెరీ ట్వీట్ చేశారు. దీనికి అఫ్గన్ నెటిజనుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. జై హింద్ అంటూ పలువురు అఫ్గన్ పౌరులు ట్వీట్లు చేస్తుండడం విశేషం. #Afghanistan : #Taliban officials allege that wheat sent by @ImranKhanPTI #Pakistan Govt is rotten not fit for consumption while @narendramodi’s Indian Govt’s 50,000 MT of wheat is very good.pic.twitter.com/5NSnQBVEKo — Arun (@arunpudur) March 4, 2022 ఇదిలా ఉండగా.. సంక్షోభ సమయం నుంచే భారత్, అఫ్గనిస్థాన్‌కు సాయం అందిస్తోంది.ఈ క్రమంలో రోడ్డు మార్గం గుండా సరుకులు పంపే సమయంలో పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేసి అడ్డుపడగా.. తమ దేశం గుండా అనుమతించి పెద్ద మనసు చాటుకుంది ఇరాన్. ఇదిలా ఉండగా.. అమృత్సర్ నుంచి మొన్న గురువారం 2వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఫుడ్ ప్రోగామ్లో భాగంగా యాభై వేల మెట్రిక్ టన్నుల గోధుమలను పంపాలనే కమిట్మెంట్కు కట్టుబడి.. సాయం అందిస్తూ పోతోంది భారత్. ఈ సందర్భంగా కోలుకుంటున్న అఫ్గన్‌తో భారత్ మంచి సంబంధాలు కోరుకుంటోందని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. -
ఉక్రెయిన్-రష్యా వివాదం: సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన తాలిబన్లు!
Russia Ukraine conflict through “peaceful means: అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలించడమే కాక పౌరుల ప్రాణ నష్టం పై ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తీవ్రతరం చేసే విధానాలను ఇరు పక్షాలు మానుకోవాలని సూచించింది. అంతేకాదు అఫ్గాన్ తటస్థ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది నెలరోజుల క్రితం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఇదే విధమైన సైనిక దాడిని ఉపసంహరించుకుని అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ఏళ్ల తర్వాత అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో అష్రఫ్ ఘనీ ఎన్నికైన ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 15న అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 (చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!) -
తాలిబన్లకు కొత్త తలనొప్పులు
ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న తాలిబన్ ప్రభుత్వానికి రోజుకో కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే వైద్య సిబ్బంది జీతాల్లేక ఇళ్లకే పరిమితం కాగా, జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు కరెన్సీ నిల్వలు లేక బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలై.. బ్యాంకులూ మూతపడ్డాయి. చాలా రంగాలు ఇదే బాట పడుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా మీడియా రంగం ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆరు నెలలపాటు అఫ్గనిస్థాన్‌లో మీడియా ఛానెల్స్ ఏవీ పని చేయబోవని హెచ్చరికలు జారీ చేసింది అఫ్గనిస్థాన్ జర్నలిస్ట్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ ఫెడరేషన్. తక్షణమే మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించింది AJMOF. ఇందుకోసం వారం వ్యవధిని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టులో తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. చాలా రంగాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మీడియా ఆర్థికంతో పాటు సమాచార సేకరణలోనూ ఇబ్బందులు పడుతోంది. ‘‘చాలావరకు చానెళ్లు, పేపర్లు, వెబ్సైట్లు మూతపడ్డాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరుకున్నాం. కొందరు వేరే ఉద్యోగాలకు తరలిపోతున్నారు. కవరేజ్ సంగతి ఏమోగానీ.. జర్నలిస్టులు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి దాపురించింది’’ అని ఫెడరేషన్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తాలిబన్ ప్రభుత్వానికి సరైనరీతిలో స్పందించి ఉంటే.. ఇప్పుడు ఈ మీడియా రంగం సంక్షోభం ఎదుర్కొనేది కాదని ఫెడరేషన్ అభిప్రాయపడుతోంది. నిధుల అవకతవకలతో పాటు కమ్యూనికేషన్ రంగం కుదేలు కావడానికి తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు జర్నలిస్టులు. పనిలో పనిగా ఈయూ మానవతా దృక్ఫథంతో అందించబోయే సాయం నుంచి తమకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. -
ఐరాస సిబ్బందిని నిర్బంధించి వదిలేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులతో పాటు పలువురు ఐరాస శరణార్థుల సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) సిబ్బందిని రాజధాని కాబూల్‌లో తాలిబన్లు కొద్ది గంటల పాటు నిర్బంధించారు. తర్వాత వారిని సురక్షితంగా వదిలేశారు. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా వారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చిందని సాంస్కృతిక, సమాచార శాఖ ఉప మంత్రి జబియుల్లా ముజాహిద్ చెప్పారు. నిర్బంధించిన వారిలో అఫ్గాన్‌లో చిరకాలంగా పని చేస్తున్న బీబీసీ మాజీ జర్నలిస్టు ఆండ్రూ నార్త్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యూఎన్‌హెచ్‌సీఆర్ కోసం పని చేస్తున్నారు. -
నిధులపై తాలిబన్ల ఆశలు ఆవిరి
వాషింగ్టన్: అమెరికాలో స్తంభించిన అఫ్గాన్ కేంద్ర బ్యాంకు నిధులను తమకు అప్పగించాలన్న తాలిబన్ల ఆశలపై అమెరికా నీళ్లుజల్లింది. దాదాపు 700 కోట్ల డాలర్ల ఈ నిధులను అఫ్గాన్‌లో మానవీయ సాయానికి, 2001 బాధితులకు పరిహారానికి వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో త్వరలో అధ్యక్షుడు బ్యాంకులకు ఆదేశాలిస్తారని, దీంతో యూఎస్ ఫైనాన్స్ సంస్థలు ఈ నిధులను విడుదల చేస్తాయని సంబంధిత అధికారులు చెప్పారు. వీటిలో 350 కోట్ల డాలర్లను అఫ్గాన్‌లో సహాయానికి కేటాయిస్తారని, 350 కోట్ల డాలర్లను అమెరికా వద్దే ఉంచుకొని ఉగ్రవాద దాడుల బాధితులకు అందిస్తారని చెప్పారు. గతంలో అమెరికా సహా పలు దేశాలు అఫ్గాన్‌కు సాయం కోసం కోట్లాది డాలర్ల నిధులను అందించాయి. వీటిని అఫ్గాన్ కేంద్రబ్యాంకు అమెరికా బ్యాంకుల్లో దాచింది. తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్నప్పటినుంచి ఈ నిధులు తమకు అప్పగించాలని కోరుతున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ నిధులను అమెరికా స్తంభింపజేసింది. అమెరికాలో ఉన్న 700 కోట్ల డాలర్లు కాకుండా మరో 200 కోట్ల డాలర్ల అఫ్గాన్ నిధులు జర్మనీ, యూఏఈ, స్విట్జర్లాండ్, ఖతార్‌లో ఉన్నాయి. అమెరికా తాజా నిర్ణయాన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తారని అంచనా. వీరి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ప్లీజ్.. సాయం చేయండి: చైనా పంచన చేరిన తాలిబన్లు
గ్లోబల్ పొలిటికల్ సినారియోలో మరో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అఫ్గనిస్థాన్‌లో పాలన కొనసాగిస్తున్న తాలిబన్ ప్రభుత్వం.. ఇప్పుడు చైనా సాయం కోరుతోంది. ఇదే అదనుగా అమెరికాపై విమర్శలు ఎక్కుపెట్టింది డ్రాగన్ కంట్రీ. తమ ఇస్టామిక్ ఎమిరేట్ ప్రభుత్వానికి(తాలిబన్ ప్రభుత్వం).. అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కేలా చూడాలంటూ చైనాను వేడుకుంటున్నారు తాలిబన్లు. తద్వారా ఓవర్సీస్లో నిలిచిపోయిన 9 బిలియన్ డాలర్ల నిధులకు మోక్షం దక్కుతుందేమోనని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ సమాజం నుంచి గుర్తింపు కోసం కావాల్సిన పరిస్థితులన్నీ ఇప్పుడు మాకు ఉన్నాయి. చైనా ఇస్లామిక్ ఎమిరేట్‌కు పెద్ద దిక్కుగా సాయం చేయాలని కోరుకుంటున్నాం అని తాలిబన్ ప్రతినిధి బిలాల్ కరిమి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నో రికగ్నిషన్ అమెరికా, అమెరికా మిత్రపక్ష దేశాలు, రష్యా, చైనా.. ఇలా ఏ దేశం కూడా ఇప్పటిదాకా అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించింది లేదు. ఉగ్రవాదంతో ముడిపడి ఉండడం, మానవ హక్కుల్ని కాలరాయడం, అమ్మాయిలను విద్యకు దూరం చేయడంతో పాటు ప్రస్తుతం తాలిబన్ కేబినెట్లో ఉన్న సభ్యులు కొందరిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి. అందుకే అగష్టులో అధికారం చేపట్టినప్పటికీ.. ఇప్పటిదాకా తాలిబన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజం గుర్తింపు దక్కలేదు. నివేదికలతో తారుమారు అయితే అధికారం చేపట్టాక సంస్కరణలకు పెద్ద పీట వేస్తామని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రొత్సహించబోమని, అఫ్గనిస్థాన్‌లో ఉగ్రచర్యల కట్టడికి ప్రయత్నిస్తామని, ఉమెన్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కొనసాగుతామని ప్రకటించుకుంది. ఈ తరుణంలో పరిస్థితులు అనుకూలిస్తాయని భావిస్తుండగా.. సొంత దేశంలో కొన్ని ఘటనలు(వ్యతిరేక ఉద్యమాలు), 2022లో దేశం తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొనబోతోందని ఐరాస ఇచ్చిన హెచ్చరికల నివేదికతో గుర్తింపు ఆలస్యం అవుతోంది. ఈ తరుణంలో రంగంలోకి దిగిన తాలిబన్లు.. చైనా సంప్రదింపుల ద్వారా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈమధ్యే చైనా రాయబారి వాంగ్ యూతో సమావేశమైన తాలిబన్ మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ.. చైనా మద్దతు కోరినట్లు తెలుస్తోంది. దీనికి సానుకూల స్పందన లభించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ భేటీలో అమెరికన్,యూరోపియన్ బ్యాంకుల నిధులు నిలిచిపోవడానికి అమెరికానే కారణమని ఇరువర్గాలు ఆరోపించినట్లు సమాచారం. ‘ఆర్థిక ఆంక్షల ద్వారా అఫ్గన్ల మీద ప్రతీకారం తీర్చుకోవడం అమెరికాకు మంచిది కాదు’ అంటూ వాంగ్ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో తాలిబన్ మంత్రి హక్కానీ ఉన్నాడు. చదవండి: తాలిబన్ల పిలుపునకు స్పందన.. అమెరికా సాయం, యూఎన్ భారీ ప్రణాళిక -
అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం.. 26 మంది మృతి
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ ఆఫ్గన్‌లో చోటుచేసుకున్న వరుస భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. పశ్చిమ అఫ్గన్‌లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం వచ్చింది. బాద్గీస్ పశ్చిమ ప్రావిన్సులోని ఖాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చదవండి: డిగ్రీ చదవడానికే దిక్కులేదు.. నలభై ఏళ్లకే 1.20 లక్షల కోట్లకి అధిపతి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనటట్లు యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. అయితే ప్రావిన్స్‌లోని ముఖ్ర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించిందని కానీ అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సర్వారీ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే అఫ్గనిస్తాన్ తీవ్ర విపత్తులో చిక్కుకుంది. గత ఏడాది ఆగష్టులో దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజా భూకంపాలతో అఫ్గన్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు. ఇక తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత అఫ్గన్ ఎదుర్కొన్న తొలి ప్రకృతి విపత్తు ఇదే కావడం గమనార్హం. చదవండి: లైన్లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా! -
అఫ్ఘనిస్తాన్‌లో పేలుడు... తొమ్మిది మంది మృతి
తూర్పు అఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందగా, నలుగురు గాయపడినట్లు తాలిబన్లు తెలిపారు. అయితే ఈ తూర్పు నాగర్‌హర్ ప్రావిన్స్‌లోని లాలోపర్ జిల్లాలో ఆహార పదార్థాలను విక్రయిస్తున్న బండి పాత పేలని మోర్టార్ షెల్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని తాలిబన్ల గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. (చదవండి: 60 మిలియన్లకు కోవిడ్ కేసులు..మృతుల సంఖ్య 8 లక్షలకుపైనే!) తాలిబాన్ ప్రత్యర్థుల అయిన ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అఫ్గనిస్తాన్‌ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఈ కొత్త పాలకులను లక్ష్యంగా చేసుకుని పలు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాక దశాబ్దాల కాలంగా యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొన్న అఫ్గనిస్తాన్‌లో పేలని ల్యాండ్ మైన్స్, ఇతర ఆయుధాలు కోకొల్లలు. అయితే అవి ఎప్పుడైన పేలితే మాత్రం పిల్లలే ఆ ప్రమాదానికి బాధితులవడం బాధాకరం. (చదవండి: వరల్డ్ స్ట్రాంగెస్ట్ గర్ల్: దెబ్బ పడితే ఖతమే!) -
'తాలిబన్ల తల తిక్క నిర్ణయం'
తాలిబన్ల తల తిక్క నిర్ణయాలు అక్కడి ప్రజలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే తాలిబన్ల అరచకాలకు బయపడి ప్రజలు దినదిన గండం నూరేళ్లే ఆయుష్షు అన్న చందంగా మారింది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ వారు తీసుకునే నిర్ణయాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం స్థానికంగా బట్టల షాపుల్లో ఉన్న ప్లాస్టిక్ మహిళల బొమ్మల తలల్ని తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆగస్ట్‌లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తాలిబాన్లు ప్రజల స్వేచ్ఛని హరించి వేస్తున్నారు. మహిళలు, బాలికల స్వేచ్ఛకు భంగం కలిగేలా పరిపాలిస్తున్నారు. తాజాగా మహిళల ప్లాస్టిక్ బొమ్మలు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని, పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న బట్టల షాపు యజమానులకు షాపుల్లో ఉండే మహిళ బొమ్మల తలలను నరికేయాలని ఆదేశించారు. ఇది (ఇస్లామిక్) షరియా చట్టానికి విరుద్ధం. కాబట్టి మహిళల ప్లాస్టిక్ బొమ్మల తలల్ని కత్తిరించాలని షాపుయజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రమోషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ అధిపతి అజీజ్ రెహ్మాన్ మీడియా సంస్థ ఏఎఫ్పీకి చెప్పారు. The level of backwardness & barberism of #TalibanTerrorists is astonishing. If massacring of our people for past 25 years was not enough, Taliban 2.0 are now also beheading mannequins because they "offend #Islam." #DoNotRecogniseTalibanpic.twitter.com/4y2nCy5T6D@natiqmalikzada — 🇦🇫Afghanistan Fact Checks🔎 (@AfgFactChecks) January 3, 2022 తాలిబన్లు తెచ్చిన కొత్త చట్టం అమల్లోకి రావడంతో కొంతమంది బట్టల షాపుల యజమానులు ప్లాస్టిక్ బొమ్మల తలల్ని కత్తిరించకుండా..స్కార్ఫ్‌లతో దాచే ప్రయత్నం చేశారు. దీనిపై అజీజ్ రెహ్మాన్ స్పందించారు."వారు (షాపుయ జమానులు) కేవలం బొమ్మల తలల్ని కవర్ చేయడమో, లేదంటే ఆ బొమ్మల్ని దాచిపెట్టడమో చేస్తే అల్లా వారి షాపుల్లోకి లేదా ఇళ్లలోకి వెళ్లి వారిని ఆశీర్వదించడు." అని వ్యాఖ్యానించారు. 1990లలో తాలిబన్లు తొలిసారి అధికారంలో ఉండగా రెండు పురాతన బుద్ధ విగ్రహాలను పేల్చిసి ప్రపంచ దేశాల ప్రతినిధుల ఎదుట ఆగ్రహానికి గురయ్యారు. మళ్లీ ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుండి అనేక ప్రావిన్సులలోని మాధ్యమిక పాఠశాలల నుండి బాలికలను నిషేధించారు. మహిళలు ఎక్కువగా ప్రభుత్వ రంగంలో పని చేయకుండా నిరోధించారు. ప్రభుత్వ పదవుల నుండి మినహాయించారు. గత వారం కాబూల్‌లోని అధికారులు ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే మహిళలకు కాకుండా వారి కుటుంబ సభ్యులైన పురుషులకు మాత్రమే ట్రాన్స్ పోర్ట్ అందించాలని ఆదేశించారు. కాగా, ఇలా ప్రతి అంశంలో తాలిబాన్లు తమ మార్క్ పరిపాలన చేస్తుండగా..ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యింది. అమెరికా నుంచి రావాల్సిన బిలియన్ల డాలర్ల సంపద ఆగిపోయింది. మరి భవిష్యత్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలనలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు -
అఫ్గాన్ వాసులకు ప్రాణాలను కాపాడే గొప్ప బహుమతిని ఇచ్చిన భారత్!!
గత ఏడాది ఆగస్టులో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత భారతదేశం రెండవ విడత మానవతా సహాయాన్ని అఫ్ఘనిస్తాన్కు పంపింది. ఈ విడతలో భారత్ బయోటెక్ కోవిడ్-19 సంబంధించిన 5 లక్షల కోవాక్సిన్ డోస్‌లు పంపించింది. అంతేకాదు ఇరాన్‌కి చెందిన మహాన్ ఎయిర్ విమానం ద్వారా మానవతా సాయం కాబూల్‌కి చేరుకుంది. (చదవండి: స్త్రీని బాధపెట్టడం అంటే దేవుడిని అవమానించడమే) ఈ మేరకు కోవిడ్ -19 వ్యాక్సిన్లను కాబూల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అందజేసినట్లు అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో తెలిపారు. అంతేకాదు భారత్‌లోని అఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ ట్విట్టర్లో "రాబోయే వారాల్లో మరో విడత 500,000 డోస్‌లు సరఫరా చేయబడతాయి. 2022 మొదటి రోజున అఫ్గాన్ ప్రజలకు ప్రాణాలను కాపాడే బహుమతిని అందించినందుకు భారతదేశానికి ధన్యవాదాలు! అని పేర్కొన్నారు. (చదవండి: ఐదేళ్ల జైలు శిక్ష తర్వాత మాజీ అధ్యక్షురాలికి క్షమాభిక్ష) -
ఎట్టకేలకు దిగొచ్చిన తాలిబన్లు!
Afghan Taliban Govt Needs US Help: దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతూ.. జనజీవనం ఆకలి కేకల దుస్థితికి చేరుకున్న తరుణంలో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చింది. అమెరికా విధించిన ఆంక్షల కొర్రిల నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు అమెరికాతో పాటు అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు ప్రకటించి సాయం కోసం చేతులు చాచింది. అఫ్గన్ నేలపై ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. వరుసగా అమెరికా, పొరుగు దేశాల ప్రతినిధులతో చర్చలు నిర్వహిస్తున్నారు తాలిబన్లు. అయితే ప్రతీ చర్చలో తమ ఆధిపత్యమే ప్రదర్శిస్తూ.. ఫలితంపై ఎటూ తేల్చకుండా వస్తున్నారు. దీంతో దేశంలో పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాయం కావాలి ఆడపిల్లలకు విద్యను అందించడం, ఉద్యోగ-ఉపాధి కల్పన ద్వారా మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం కట్టబడి ఉందని విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టాఖి స్పష్టం చేశారు. అయితే ఇందుకు ప్రపంచ దేశాల సాయం తమకు అవసరం ఉందని ఆదివారం ది అసోషియేట్ ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఫారిన్ ఎయిడ్ (విదేశీ సాయం) అఫ్గన్ జీడీపీని తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. ఆరోగ్యం, విద్యా సేవలకు అందులో నుంచే 75 శాతం ఖర్చు చేస్తుంటారు. కానీ, మేం అధికారం చేపట్టేనాటికే అఫ్గన్ ఆర్థికం ఘోరంగా ఉంది. గత ప్రభుత్వ ప్రతినిధులు నిధులతో పారిపోయారు. పైగా అఫ్గన్‌కు చెందిన బిలియన్ల డాలర్ల విదేశీ నిల్వలను నిలిపివేశారు. అమెరికాతో మాకెలాంటి సమస్యలు లేవు. ఒక్క అమెరికాతోనే కాదు అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నాం. ..అఫ్గన్‌కు సంబంధించి 10 బిలియన్ డాలర్ల ఫండ్ నిలిచిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. అది విడుదలయ్యేందుకు అన్నీ దేశాలు మాకు సహకరిస్తాయని భావిస్తున్నాం. అఫ్గన్‌పై ఆంక్షలు ఎవరికీ ఎలాంటి ప్రయోజనాలు కలిగించవు. అఫ్గన్ అస్థిరత, ఒక దేశ ప్రభుత్వాన్ని బలహీనపర్చడం ఏదో ఒక దేశం ఆసక్తి మీద ఆధారపడి ఉండదని గమనించాలి. అఫ్గన్ కోలుకోవడానికి సాయం అందించాలి’’ అని అంతర్జాతీయ సమాజానికి ముట్టాఖి విజ్ఞప్తి చేశాడు. ఇక తాలిబన్ల పాలనలో ఆడపిల్లలు, మహిళల అణచివేత కొనసాగుతోందన్న కథనాలను కొట్టిపారేసిన ముట్టాఖీ.. మత చట్టంలో కొన్ని సవరణలకు, వాటిని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. గతంలోనూ తాము సవరణలు చేపట్టిన అంశాన్ని ప్రస్తావించారాయన. ‘‘ముందు ప్రపంచం మాతో కలవాలి. మేం వాళ్లతో కలవాలి. అప్పుడే కదా మాకు బయటి ప్రపంచం గురించి తెలిసేది. ఎలాంటి సడలింపులు ఇవ్వాలో తెలిసేది’’ అని వ్యాఖ్యానించారాయన. చదవండి: ఏం మిగల్లేదు! అఫ్గన్ ఆర్తనాదాలు తప్పులు ఒప్పుకుంటున్నాం అధికారంలోకి వచ్చాక కొన్ని నెలలపాటు తమ(తాలిబన్) ప్రభుత్వం తప్పులు చేసిందని ముట్టాఖీ అంగీకరించారు. అయితే వాటి గురించి చర్చించకుండా.. సంస్కరణల గురించి, సంక్షోభం నుంచి గట్టెక్కడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలిపారాయన. అమెరికా దళాల ఉపసంహరణ ప్రకటన నేపథ్యంలో.. మేం మాట నిలబెట్టుకున్నాం. నాటో, అమెరికా దళాలపై ఎటువంటి దాడులు చేయలేదు. దురదృష్టవశాత్తూ ఐసిస్ చేసిన దాడుల్ని మేం చేసినట్లుగా అనుమానించారు. ఆపై మా నిజాయితీ నిరూపించుకున్నాం. ప్రతీకార దాడుల కథనాలు కూడా ఊహాగానాలే!. ఏదిఏమైనా శాంతి భద్రతల స్థాపనకు, మానవ హక్కుల పరిరక్షణ ప్రకటనకు కట్టుబడి ఉంటాం. ముందు ముందు కూడా అదే ఆచరిస్తాం. అందుకు అఫ్గన్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత అమెరికా లాంటి అగ్రరాజ్యం పై ఉందని ఆయన పేర్కొన్నారాయన. ‘‘అమెరికా సంయుక్త బలగాల ఉపసంహరణ తర్వాత అప్గన్.. దారుణంగా దెబ్బతింది. అది కోలుకోవాలంటే తిరిగి అమెరికా చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే అమెరికా గొప్ప దేశం కాబట్టి. పొరపచ్చాలను పక్కనపెట్టి అమెరికాతో మా ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తేనే అప్గన్నిస్థాన్ బాగుపడేది అని ఆశాబావం వ్యక్తం చేశారాయన. అయితే ఐసిస్ వ్యతిరేక పోరాటంలో అమెరికాకు మద్ధతుగా నిలుస్తారా? అనే ప్రశ్నకు మాత్రం అమిర్ ఖాన్ దాటవేత ధోరణి ప్రదర్శించడం కొసమెరుపు. చదవండి: పెళ్లిళ్లపై తాలిబన్ల సంచలన నిర్ణయం.. -
అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!
Malala Yousafzai Calls US And UN To Support Of Afghan Women Education: నోబ్‌ల్ శాంతి బహుమతి గ్రహిత, మానవ హక్కుల న్యాయవాది మలాలా యూసఫ్‌జాయ్ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అఫ్గాన్ బాలికలకు, మహిళలకు బలమైన యూఎస్ మద్దతు కావాలని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం బాలికలకు సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం అఫ్ఘనిస్తాన్ అని, పైగా వారు విద్యనభ్యసించకుండా నిషేధించారంటూ యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో మలాలా తన ఆవేదనను వ్యక్తం చేశారు. (చదవండి: పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..) ఈ మేరకు ఈ సమావేశంలో మలాల సోటోడా అనే అఫ్గాన్ అమ్మాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘ఇది అఫ్గాన్ బాలికల సందేశం. బాలికలందరికీ సురక్షితమైన మరియు నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం’ అని రాసిన లేఖను బ్లింకెన్కి అందజేశారు. అంతేకాదు తమను ఎంతకాలం పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు దూరం చేస్తారో అంతలా తమ భవిష్యత్తుపై ఆశ చిగురిస్తూనే ఉంటుందని సోటోడా లేఖలో ప్రస్తావించిన విషయాన్ని మలాలా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో శాంతి భద్రతలను తీసుకురాగలిగే అతి ముఖ్యమైన సాధనం బాలికల విద్య అని, అమ్మాయిలు చదువుకోకపోతే అఫ్ఘాన్ నష్టపోతుందంటూ ఆవేదనగా పేర్కొంది. అయితే అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బాలికలు విద్యనభ్యసించకూడదంటూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలాలా యునైటెడ్ స్టేట్స్, యుఎన్‌తో కలిసి అఫ్ఘాన్‌లోని బాలికలు వీలైనంత త్వరగా తమ పాఠశాలలకు తిరిగి వెళ్లేలా చూసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) -
Afghanistan: పెళ్లిళ్లపై తాలిబన్ల సంచలన నిర్ణయం.. వారికి విముక్తి లభించినట్టేనా?
కాబూల్: మహిళల బలవంతపు పెళ్లిళ్లపై నిషేధం విధిస్తున్నట్లు అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలకులు ప్రకటించారు. వివాహానికి మహిళ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. పురుషులు, మహిళలు సమానమని, అతివను ఆస్తిగా పరిగణించకూడదంటూ కూడా పేర్కొన్నారు. తాలిబన్ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. అఫ్గాన్ గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు.. భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలన్న నియమం ఉంది. ఇలాంటి ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబన్ల తాజా ఉత్తర్వులున్నాయి. అయితే ఇందుకు భిన్నంగా భర్తను కోల్పోయిన మహిళ, 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తున్నట్టు తాజా ఆదేశాల్లో తాలిబన్లు పేర్కొన్నారు. చదవండి: ఎంత మంచి మనసో: రూ. 2 కోట్ల ఇంటిని కేవలం రూ. 100కే అమ్మకం -
సుస్థిర అఫ్గాన్‌కు దారి
అఫ్గానిస్తాన్‌పై బుధవారం వెలువడిన న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆ దేశంలోని వర్తమాన స్థితిగతులకు అద్దం పట్టింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. తమ దేశంలో పరిస్థితులు భేషుగ్గా ఉన్నాయని అధికారం చెలాయిస్తున్న తాలిబన్లు చెప్పుకుంటున్నారు. శాంతిభద్రతలను కాపాడ టంలో విజయం సాధించామంటున్నారు. ఆఖరికి న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై స్పందించిన సందర్భంలో సైతం తాలిబన్ల ప్రతినిధి దాన్నే పునరుద్ఘాటించారు. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశం నుంచి అమెరికా నిష్క్రమించి మూడు నెలలు కావస్తోంది. అప్పటినుంచీ మహిళలపై కొన సాగుతున్న దుండగాలకు లెక్క లేదు. వారిని ఇళ్లకే పరిమితం చేశారు. ఉద్యోగాల నుంచి తొలగిం చారు. ధిక్కరించినవారిని కాల్చిచంపుతున్నారు. పాలనలో మహిళలు, మైనారిటీలతోసహా అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పిస్తామని తాలిబన్లు చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. దశా బ్దాలుగా పాలనతోసహా భిన్న రంగాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్న హజారా, ఉజ్బెక్ తెగలను పూర్తిగా పక్కనపెట్టారు. ఉగ్రవాదానికి తమ గడ్డపై చోటుండదని ప్రకటించినా దేశ రాజధాని కాబూల్, కుందుజ్, కాందహార్లతోసహా అనేకచోట్ల ఐఎస్ ఉగ్రవాదులు తరచుగా నరమేథం సాగి స్తూనే ఉన్నారు. తాలిబన్లు కూడా ఏమంత మెరుగ్గా లేరు. అనాగరికమైన మరణదండనలు అమలు చేస్తున్నారు. అన్నిటికీ మించి ఆ దేశం ఆర్థికంగా పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఐక్య రాజ్యసమితి లెక్క ప్రకారం 2.30 కోట్లమంది పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు. వీటిని అఫ్గాన్ ఆంతరంగిక వ్యవహారంగా పరిగణించి ప్రపంచం ప్రేక్షక పాత్ర వహించలేదు. ఇది దీర్ఘకాలం కొన సాగితే... అంతర్యుద్ధంగా మారితే ఇరుగుపొరుగు దేశాలకూ, తరువాత మొత్తంగా మధ్య ఆసియా ప్రాంతానికీ, అంతిమంగా ప్రపంచ దేశాలకూ పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుంది. రెండు దశాబ్దాల పాటు ఆ దేశాన్ని గుప్పిట బంధించి వర్తమాన దుస్థితికి కారణమైన అమెరికా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అఫ్గాన్కొచ్చే ముప్పేమీ లేదని, అది సవ్యంగానే మనుగడ సాగిస్తుందని అమెరికా చేసిన ప్రకటనలు వంచన తప్ప మరేమీ కాదని అది నిష్క్రమించిన క్షణాల్లోనే రుజువైంది. అఫ్గాన్ దుస్థితిపై మన దేశం మాత్రమే కాదు...దానికి పొరుగునున్న రష్యా, ఇరాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్ వంటివి సైతం కలవరపడుతున్నాయి. గతంలో తాలిబన్లు ఏలికలుగా ఉన్నప్పుడు కలిగిన చేదు అనుభవాల పర్యవసానంగా వారితో చర్చించడానికి మన దేశం మొదట్లో సిద్ధపడని మాట వాస్తవం. కానీ ఆ తర్వాత మనసు మార్చు కుంది. సెప్టెంబర్ 1న ఖతార్‌లోని దోహాలో తాలిబన్లతో మన ప్రతినిధులు మాట్లాడగలిగారు. గత కొన్నేళ్లుగా అఫ్గాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న మన దేశంపై వారి వైఖరి మారినట్టే కనబడింది. మాటల వరకూ అయితే ఇప్పటికీ వారు అలాగే చెబుతున్నారు. కానీ వారిని వెనకుండి నడిపిస్తున్న పాకిస్తాన్ తీరుతెన్నులపై భారత్‌కు సందేహాలున్నాయి. నిజానికి తాజా సదస్సు హఠాత్తుగా ఊడిపడింది కాదు. ఆ దేశంనుంచి తాము నిష్క్రమించదల్చుకున్నట్టు తొలిసారి 2018లో అమెరికా ప్రకటించినప్పుడు ఇరాన్ చొరవతో, రష్యా తోడ్పాటుతో తొలి సదస్సు జరిగింది. ఆ మరుసటి ఏడాది సైతం ఇరానే సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుత సదస్సు ఆ క్రమంలో మూడోది. భారత్ హాజరైతే తాము రాబోమని పాకిస్తాన్ తొలి సదస్సు సమయంలోనే చెప్పింది. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నిజంగా తాలిబన్లు కోరుకుంటున్నట్టయితే అది కేవలం వారి వల్ల మాత్రమే అయ్యే పనికాదు. విధ్వంసకర ఘటనలతో, బెదిరింపులతో ఉగ్ర వాద ముఠాలు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. మాదకద్రవ్యాలను దూరతీరాలకు తరలిస్తూ వేల కోట్లు నిధులు ఆర్జిస్తున్నాయి. మారణాయుధాలు పోగేస్తున్నాయి. ఈ ముఠాలను అదుపు చేయా లన్నా, చుట్టుముట్టిన సంక్షోభాలనుంచి గట్టెక్కాలన్నా ప్రపంచ దేశాల సహకారం అత్యవసరం. పారదర్శకంగా వ్యవహరించడం నేర్చుకుని అన్ని వర్గాలకూ పాలనలో భాగస్వామ్యం కల్పిస్తే... మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కులకు పూచీపడితే ఉగ్రవాద ముఠాల ఆగడాలు అంతమవు తాయి. తమకు ప్రభుత్వం నుంచి రక్షణ దొరుకుతుందన్న భరోసా ఉంటే సాధారణ ప్రజానీకం ఉగ్రవాదులను తరిమికొట్టడానికి సిద్ధపడతారు. తాలిబన్లు వచ్చాక సాయం ఆపేసిన ప్రపంచ దేశాలు సైతం పునరాలోచన చేస్తాయి. అఫ్గాన్ విషయంలో ఐక్యరాజ్యసమితి కీలక పాత్ర పోషించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్ ఇచ్చిన పిలుపు అర్ధవంతమైనది. మొదట్లోనే అటువంటి అంతర్జాతీయ వేదికల ప్రమేయం ఉన్నట్టయితే అఫ్గాన్‌కు ప్రస్తుత దుస్థితి తప్పేది. ఆకలితో అలమటిస్తున్న పౌరులకు చేయూతనందించడం, పిల్ల లకు పౌష్టికాహారం సమకూర్చడం, కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకురావడం తక్షణ కర్తవ్యం. ఈ అంశాల్లో సమష్టిగా పనిచేయాలని సదస్సు నిర్ణయించడం మెచ్చదగ్గది. వేరే కారణా లతో సదస్సుకు గైర్హాజరైన చైనా ఈ కృషిలో తాను కూడా పాలుపంచుకుంటానంటున్నది. ఆచ రణలో అది రుజువుకావాల్సివుంది. తాలిబన్లు చిత్తశుద్ధితో వ్యవహరించి మెరుగైన కార్యాచరణకు దోహదపడితే సుస్థిరమైన, శాంతియుతమైన అఫ్గాన్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆ దేశం అచిరకాలంలోనే అభివృద్ధి పథంలో పయనిస్తుంది. -
పాక్ తాలిబన్లతోనూ ఇమ్రాన్ రాజీ!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భద్రతాబలగాలు, పౌరులే లక్ష్యంగా గడిచిన 14 ఏళ్లుగా దాడులకు పాల్పడుతున్న పాకిస్తానీ తాలిబన్ ఉగ్ర సంస్థతో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం డిసెంబర్ 9 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇమ్రాన్ ప్రభుత్వం, తెహ్రిక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో అఫ్గాన్ తాలిబన్ ప్రభుత్వం సహకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఫవాద్ చౌదరి వెల్లడించారు. టీటీపీ ప్రతినిధి మొహమ్మద్ ఖురాసానీ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నెల రోజుల్లో రెండు వర్గాల ప్రతినిధులతో ఏర్పడిన కమిటీ చర్చలు కొనసాగిస్తుందని ఆయన వివరించారు. గత నెలలో పాక్ ప్రభుత్వం, టీటీపీ మధ్య మొదలైన చర్చల నేపథ్యంలో తాజాగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ చర్చల్లో పురోగతి కనిపిస్తే కాల్పుల విరమణ కూడా కొనసాగనుందని ఫవాద్ చెప్పారు. చర్చల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, అఫ్గాన్ తాలిబన్ అనుబంధ సంస్థే టీటీపీ. పాకిస్తానీ ఉగ్రవాదులతో 2007లో ఏర్పాటైన ఈ సంస్థ జరిపిన వందలాది దాడుల్లో వేలాదిగా ప్రజలు చనిపోయారు. కాగా, ఉగ్ర సంస్థగా పాక్ అధికారికంగా గుర్తించిన తెహ్రిక్–ఇ–లబ్బాయిక్ పాకిస్తాన్(టీఎల్పీ)పై ఉన్న నిషేధాన్ని ఇమ్రాన్ ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. -
ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!
నంగర్హర్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక అక్కడ రోజుకో ఆంక్ష అన్నట్లే ఉంది. ఇప్పటికే ప్రజలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం.. తాజాగా ట్యాక్సీ డ్రైవర్లకు పలు ఆంక్షలు విధించింది. ట్యాక్సీల్లో ముష్కరులను ఎవరినైనా తీసుకొస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తూర్పు నంగర్హార్ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్లను తాలిబాన్ అనుబంధ సంస్థలకు సంబంధించిన వారిని మినహాయించి ఇతర ముష్కరులను ఎవ్వరిని మీరు ట్యాక్సిల్లో ఎక్కించుకోని తీసుకురావద్దని ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!) ఆ ప్రావిన్స్‌కు చెందిన ట్యాక్సీ డ్రైవర్ల అందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. అదే సమయంలో టాక్సీలలో ఎవరైనా అనుమానాస్పద గన్మెన్లను చూసినప్పుడు అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తాలిబన్లు ఆదేశించినట్లు తెలిపింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రావిన్సులలో మోహరిస్తున్న ఐఎస్ఐఎస్-కే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇలాంటి ఆదేశాలు జారిచేసిందని స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. (చదవండి: ‘ప్రవేశం లేదు’ బోర్డు.. ఎలుగుబంటి ఏం చేసిందో చూడండి!) -
ఆఫ్ఘనిస్తాన్‌కి షాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా..
Australia Postpone First Ever Test Match Against Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం ప్రకటించింది. ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్ 27 నుంచి టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. దేశంలో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మహిళల క్రీడలపై నిషేధం విధించారు. దీంతో ఆస్ట్రేలియా ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మహిళా క్రికెట్‌పై నిషేధం కొనసాగితే టెస్టును రద్దు చేయాలని ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్లుఘా దేశ క్రికెట్ బోర్డును సూచించినట్లు సమాచారం. "ప్రస్తుత అనిశ్చితి దృష్ట్యా ఆఫ్ఘాన్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ నిర్వహించడం సరికాదని మేం భావిస్తున్నాం. అందకే ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేయాలాని నిర్ణయించకున్నాము. ఆఫ్ఘనిస్తాన్‌లో పురుషులు, మహిళల క్రికెట్ అభివృద్దికి ఆస్ట్రేలియా ఎప్పడూ కట్టుబడి ఉంటుంది" అని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఆస్ట్రేలియా నిర్ణయంపై ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ నబీ స్పందించాడు. ఈ ఏడాది టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది అని తెలిపాడు. "ఈ సంవత్సరం టెస్ట్ మ్యాచ్ జరగకపోవడం నిరాశపరిచింది, అయితే మ్యాచ్ వాయిదా మాత్రమే వేయబడింది. పూర్తిగా రద్దు కానుందున నేను సంతోషంగా ఉన్నాను" అని నబీ పేర్కొన్నాడు. చదవండి: T20 WC 2021 NZ Vs NAM: కివీస్ బౌలర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. -
తెరపైకి తాలిబన్ల సరికొత్త రూల్.. ఈ సారి ఏకంగా..
కాబూల్: ఆప్గనిస్తాన్‌లో తాలిబన్లు పరిపాలన ఏమోగానీ తమ నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విదేశీ కరెన్సీపై తాలిబన్లు నిషేధం విధించారు. దీంతో ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉండగా , ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత జఠిలంగా తయారుకానుంది. తాలిబన్ల చేతుల్లోకి ఆఫ్గనిస్తాన్ వెళ్లినప్పటినుంచి అంతర్జాతీయ సమాజం తాలిబాన్ల పరిపాలనను ప్రభుత్వంగా గుర్తించడానికి నిరాకరించింది. మరో వైపు ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో బ్యాంకులు నగదు కొరత ఏర్పడింది. దీంతో ఆ దేశానికి కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయి. దీనికి తోడు పరిపాలనంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు, దేశాన్ని అభివృద్ధి వైపు నడపడం లాంటివి గాక కేవలం తమకు తెలిసిన రాక్షస పాలన, ఏకాధిపత్య నిర్ణయాలను మాత్రమే అనుసరిస్తూ వస్తున్నారు తాలిబన్లు. ఈ పరిస్థితిలో స్వదేశీ వ్యాపారం కోసం విదేశీ కరెన్సీ వాడే వారిని శిక్షిస్తామని తాలిబన్ల ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ తెలుపుతూ ప్రజలకు మరో షాక్ ఇచ్చారు. దేశంలో ఆర్థిక పరిస్థితి, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆఫ్గన్లందరూ ఇకపకై ప్రతి లావాదేవీలను ఆఫ్గనిస్తాన్ కరెన్సీలోనే చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపాడు. చదవండి: China: చైనాలో ఏం జరుగుతోంది.. ఆ ప్రకటనకు కారణం కోవిడా? ఆహార కొరతా? -
ఆ డబ్బులు అఫ్గనిస్తాన్‌వి.. మాకు తిరిగివ్వండి: తాలిబన్లు
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. క్రూరమైన శిక్షలు, పాశవిక పాలన మధ్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోవడంతో పాటు ప్రజలకు తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఖజానా పరంగా కూడా నగదు లేకపోవడంతో పొరుగు దేశాలతో ఎగుమతి ,దిగుమతులకు కూడా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో నిల్వ ఉంచిన తమ డబ్బును తిరిగివ్వాలని తాలిబన్ ప్రభుత్వం బ్యాంకులను కోరుతోంది. అఫ్గనిస్థాన్ గత ప్రభుత్వాలు బిలియన్ల కొద్ది డాలర్లను యూఎస్ ఫెడరల్ రిజర్వ్, ఐరోపాలోని ఇతర సెంట్రల్ బ్యాంకులలో నిల్వచేసింది. అయితే ఆగస్టులో ఇస్లామిస్ట్ తాలిబాన్ పాశ్చాత్య-మద్దతుగల ప్రభుత్వాన్ని తొలగించినప్పటి నుంచి ఆయా దేశ ప్రభుత్వాలు ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోకుండా నిలిపివేశాయి. దీంతో ప్రస్తుతం తమ దేశంలో పరిస్థితుల దృష్ట్యా ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని తాలిబన్ ప్రభుత్వం బ్యాంకులను అభ్యర్థిస్తోంది. అఫ్గన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఆ డబ్బు అఫ్గనిస్తాన్ దేశానిది. కాబట్టి మా డబ్బు మాకివ్వండి. నగదు నిల్వలను నిలుపుదల చేయడం సమజసం కాదని, అంతర్జాతీయ చట్టాలు, విలువలకు విరుద్ధం. ’’ అని తెలిపారు. తమ ప్రభుత్వం మహిళలకు విద్య సహా మానవ హక్కులను గౌరవిస్తుందని, మానవత్వంతో చేసే పనులకు నిధులు విడుదల చేయాలని కోరారు. చదవండి: ‘నన్ను ప్రత్యక్షంగా చూస్తే థ్రిల్లింగ్‌గా ఉందా.. తేడా కొడితే మాత్రం ఇంతే’ -
ఆకలితో అల్లాడుతున్న అఫ్గన్ చిన్నారులు.. తిండి దొరక్క
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి ఆ దేశ ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మొన్నటి వరకు తాలిబన్ల ఆగడాలను, అకృత్యాలను, హింసలను అఫ్గన్లు భరిస్తూ వస్తున్నారు. తాజాగా అక్కడ ఆకలి చావులు కూడా మొదలుకావడంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. పశ్చిమ కాబూల్‌లో హజారా కమ్యూనిటీకి చెందిన 8 మంది చిన్నారులు ఆకలికితో చనిపోయారు. ఈ విషయాన్ని అఫ్గనిస్తాన్ మాజీ చట్టసభ సభ్యుడు మొహమ్మద్ మొహాఖేక్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్గన్ ప్రజలకు తగిన జీవన ప్రమాణాలను సరిపడే విధంగా వారు అందించలేకపోయారని ఆయన విమర్శించారు. ఆప్గనిస్థాన్‌లోని మైనారిటీ వర్గాలైన హజారా, షియా కమ్యూనిటీలకు అంతర్జాతీయ సమాజం అండగా నిలువాలని కోరారు. షియా ఇస్లాంను ఆచరించే హజారా ప్రజలు అఫ్గనిస్తాన్ జనాభాలో 9 శాతం ఉన్నారు. హక్కుల సంఘాల నివేదికల ప్రకారం, వారు గతంలో తాలిబాన్లచే తీవ్రంగా హింసించబడ్డారు. ఆగష్టు మధ్యలో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశంలో జీవన పరిస్థితులు క్షీణించడంపై అనేక అంతర్జాతీయ సమూహాలు అప్రమత్తం చేస్తునే ఉన్నాయి. చదవండి: మరో డ్రామాకు తెరతీసిన చైనా.. కొత్తగా సరిహద్దు చట్టం -
ఆగని తాలిబన్ల అకృత్యాలు.. మహిళా క్రీడాకారిణి తల నరికి..
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పరిపాలన పేరుతో రాక్షస పాలనను కొనసాగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు నిరసనలు చేస్తున్నా, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా తమ దారి తమదే అన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా అఫ్గన్ జూనియర్ మహిళల జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి తల నరికినట్లు ఆ జట్టు కోచ్ ఓ ప్రముఖ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అయితే ఈ దారుణానికి గల కారణాన్ని ఆమె వెల్లడించలేదు. ఆ ఇంటర్యూలో.. కోచ్ అఫ్జలీ అక్టోబర్‌లో మహబజిన్ హకీమి అనే మహిళా క్రీడాకారిణిని తాలిబాన్లు చంపడంతో పాటు కిరాతకంగా ఆమె తలను నరికేశారని తెలిపింది. అయితే ఈ విషయం గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని తాలిబన్లు ఆమె కుటుంబాన్ని బెదిరించారని అందుకే తాను ఇప్పటి వరకు చెప్పలేకపోయినట్లు పేర్కొంది. మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని చెప్పింది. ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ చెప్పింది. ( చదవండి: VIDEO: బాబోయ్ అంత పెద్ద కొండచిలువనా? ఈ వైరల్ వీడియో వెనుక కథేంటంటే.. ) ప్రస్తుతం వాలీబాల్ జట్టులోని ఆటగాళ్లు, మిగిలిన మహిళా అథ్లెట్లు గత కొంత కాలంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు ఏ క్షణాన ఏం జరుగుతోందో అనే భయంతో బతుకుతున్నారని అఫ్జలీ వెల్లడించారు. ఈ క్రమంలో చాలా మంది క్రిడాకారులు ఎవరికీ కనిపించకుండా అండర్‌గ్రౌండ్‌లో కూడా జీవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. గత వారం, ఫిఫా, ఖతర్ ప్రభుత్వం అఫ్గనిస్తాన్ నుంచి జాతీయ ఫుట్‌బాల్ జట్టు సభ్యులను, వారి కుటుంబ సభ్యులతో సహా 100 మంది మహిళా ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆ దేశం నుంచి తరలించారు. మరో వైపు ఆఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుంచి క్రీడలు, రాజకీయ, సామాజిక రంగాలలో మహిళల కార్యకలాపాలన్నీ దాదాపుగా నిలిచిపోయాయి. బాలికల్లోనూ అత్యధికులు సెకండరీ స్కూలుకు వెళ్లడం కూడా మానేశారు. భవిష్యత్తులో అక్కడ ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తోందోనని అఫ్గన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. Mahjabin Hakimi, a member of the Afghan women's national volleyball team who played in the youth age group, was slaughtered by the Taliban in Kabul. She was beheaded. @EUinAfghanistan @unwomenafghan https://t.co/wit0XFoUaQ — Sahraa Karimi/ صحرا كريمي (@sahraakarimi) October 19, 2021 చదవండి: Woman Eats Her Dead Husband Ashes: భర్తపై ఎనలేని ప్రేమ.. అతని చితాభస్మం కుళ్లిన వాసన వస్తున్నప్పటికీ.. -
Narendra Modi: అఫ్గాన్‌లో ఉమ్మడి వ్యూహం
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏకీకృత ప్రతిస్పందన అవసరమని ప్రధాని మోదీ అంతర్జాతీయ సమాజానికి పిలుపు నిచ్చారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఉగ్రవాద, తీవ్రవాద శక్తులకు అఫ్గాన్ గడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ స్థావరంగా మారరాదని అన్నారు. మంగళవారం ప్రధాని మోదీ జి–20 అసాధారణ భేటీనుద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ఆకలి, పోషకాహార సమస్యతో అల్లాడుతున్న అఫ్గాన్ పౌరులకు తక్షణమే బేషరతుగా మానవతా సాయం అందించాలని కోరారు. 20 ఏళ్లుగా అఫ్గాన్ సమాజం సాధించిన అభివృద్ధిని కొనసాగించేందుకు తాలిబన్ల పాలనలో మహిళలు, మైనారిటీలకు తగు చోటు కల్పించాలని ఆయన అన్నారు. భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగస్ట్ 30వ తేదీన ఆమోదించిన తీర్మానం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రతిస్పందన అవసరమని ప్రధాని అన్నారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం, డ్రగ్స్, ఆయుధ అక్రమ రవాణావంటి వాటిని గట్టిగా అడ్డుకునేందుకు ఉమ్మడి పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారని విదేశాంగ శాఖ ట్విట్టర్లో తెలిపింది. జి–20 అధ్యక్ష హోదాలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. -
వెంటనే అక్కడి నుంచి వెళ్లండి.. యూఎస్, బ్రిటన్ పౌరులకు హెచ్చరిక
కాబుల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబుల్ నగరంలోని హోటళ్లలో ఉన్న తమ దేశీయుల్ని అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ఇటీవల ఐసీసీ గ్రూప్ మసీదులో దాడికి పాల్పడిన నేపథ్యంలో ఉగ్రముప్పు పొంచి ఉందని, ఆ ప్రాంతంలోని హోటళ్లకు దూరంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. భవిష్యత్తులోనూ ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందని.. సెరెనా హోటల్‌తోపాటు ఆ పరిసరాల్లో ఉంటున్న అమెరికన్లు తక్షణమే ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లాలంటూ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. బ్రిటన్ ప్రభుత్వం కూడా.. ‘ ఆ ప్రాంతంలో పెరిగిన ప్రమాదాల నేపథ్యంలో, అక్కడ హోటళ్లలో, ముఖ్యంగా కాబూల్‌లో సెరెనా హోటల్ వంటివాటిలో అసలు ఉండకూడదని సూచనలు చేసింది. ( చదవండి: Afghanistan: అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ ) సెరెనా హాటలోనే ఎందుకంటే కాబుల్‌లోని సెరెనా హోటల్లో విదేశీయులు ఎక్కువ బస చేస్తుంటారు. గతంలో తాలిబన్లు దీనిపై రెండుసార్లు దాడులకు కూడా పాల్పడ్డారు. 2008లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మరణించారు. అలాగే 2014 అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా మరోసారి దాడి జరగగా.. నలుగురు యువకులు హోటల్లోకి చొచ్చుకెళ్లి, కాల్పులు జరిపారు. ఈ దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ పాత్రికేయుడు, అతని కుటుంబ సభ్యులు ఉన్నారు. అఫ్గన్‌ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి, చాలా మంది విదేశీయులు ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే కొంతమంది పాత్రికేయులు, సహాయక కార్మికులు మాత్రమే ఇప్పటికీ కాబుల్‌లో ఉంటున్నారు. తాలిబన్లు అఫ్గన్‌ను చేజిక్కించుకుని, ఇస్లామిక్ ఎమిరేట్‌గా ప్రకటించినప్పటి నుంచి ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే ప్రయత్నాలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. చదవండి: అమేజింగ్ హోటల్! హర్ష్‌గోయెంకా పోస్ట్ చేసిన హోటల్, ఎలా ఉందో చూడండి -
అలా చేయకండి.. అమెరికాకు తాలిబన్లు వార్నింగ్
కాబుల్: తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాను తాలిబన్లు హెచ్చరించారు. కాగా అఫ్గన్ నుంచి అమెరికా నాటో దళాలు వైదొలగిన తర్వాత తొలిసారి తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వంతో ముఖాముఖి చర్చలు జరిగిన సందర్భంగా తాలిబన్లు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ చర్చల అనంతరం అఫ్గన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ దీనిపై మాట్లాడుతూ.. ‘అఫ్గన్‌లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసే ప్రయత్నాలు ఏ ఒక్కరికీ మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేశారు. "అఫ్గనిస్తాన్‌తో సత్సంబంధాలు అందరికీ మంచిది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఆటంకం కలిగించేలా ఎవరూ ప్రయత్నించిన ఉపేక్షించమని, పైగా ఇటువంటి చర్యలు ప్రజా సమస్యలకు దారీ తీస్తాయని హెచ్చరించారు. అనంతరం కరోనాను ఎదుర్కోవడానికి అమెరికా సహకరిస్తుందని చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఖతార్ రాజధాని దోహా వేదికగా అమెరికా, తాలిబన్ తాత్కాలిక ప్రతినిధుల మధ్య రెండు రోజుల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ శాఖకు చెందిన ప్రత్యేక ప్రతినిధి టామ్ వెస్ట్, అమెరికా మానవతా సాయం విభాగం అధికారి సారా చార్లెస్ పాల్గొన్నారు. అఫ్గన్‌లో సుమారు రెండు దశాబ్దాల తర్వాత అమెరికా దళాలు ఆగస్టు 31తో సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు మళ్లీ అఫ్గన్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపు మాత్రం దక్కలేదు. చదవండి: Toddler Admitted To Hospital : బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు -
తాలిబన్లతో డీల్.. మెలిక పెట్టిన అమెరికా
US Talibans Face To Face Meeting: అమెరికా సైనిక దళాల ఉపసంహరణ వల్లే తాలిబన్ల దురాక్రమణకు మార్గం సుగమం అయ్యిందనే విమర్శ ఉంది. అంతేకాదు అఫ్గనిస్తాన్ నుంచి చాలా దేశాలకు వర్తకవాణిజ్యాలు నిలిచిపోవడంతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం పడింది. ఈ తరుణంలో తాలిబన్లతో చర్చలకు అమెరికా సిద్ధపడడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 31తో ఆఫ్గన్ నుంచి బలగాల్ని ఉపసంహరించుకున్న అగ్రరాజ్యం.. ఆ తర్వాత అక్కడి పరిణామాల్లో తలదూర్చలేదు. కానీ, అక్కడి పౌర హక్కుల ఉల్లంఘనపై మాత్రం తాలిబన్లను నిలదీస్తూ వస్తోంది. మరోవైపు తాలిబన్ల చేష్టల్ని ఓ కంటకనిపెడుతున్న అమెరికా.. ఇప్పుడు ప్రత్యక్ష చర్చలకు సిద్ధపడుతుండడం విశేషం. ప్రపంచంతో వర్తకవాణిజ్యాల పునరుద్దరణ ప్రధాన ఎజెండాగా ముఖాముఖి చర్చలకు రెడీ అయ్యింది. ఈ చర్చల్లోనే తాలిబన్లకు పలు షరతులు విధించాలని భావిస్తోంది. ఆ ఒక్కటి తప్ప.. అయితే ఆశ్చర్యకరరీతిలో చర్చలకు సిద్ధపడిన బైడెన్ ప్రభుత్వం.. తాలిబన్లకు మాత్రం గట్టి ఝలకే ఇచ్చింది. ఇలా చర్చలు జరిపినంత మాత్రానా తాలిబన్లను అఫ్గనిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధులుగా గుర్తించబోమని (తాలిబన్ ప్రభుత్వంగా గుర్తించమని పరోక్షంగా) ప్రకటన విడుదల చేసింది. ‘‘తాలిబన్లు ఇప్పటికీ ఉగ్రవాద అనుబంధ సంస్థగానే ఉన్నారు. అమెరికాతో పాటు మిగిలిన అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్లు(తాలిబన్లు) మారారనే నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వ గుర్తింపు అంశం పరిశీలిస్తాం’ అని అమెరికా తరపు ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. అమెరికా తరపున ప్రతినిధులు శనివారం నేరుగా తాలిబన్లతో సమావేశమై చర్చలు జరపబోతున్నారు. వాణిజ్య అంశాలతో పాటు ఎగుమతులు-దిగుమతుల కొనసాగింపు, సుంకాల విధింపు-సడలింపులు తదితర విషయాలపై చర్చించనున్నారు. వీటితో పాటే మానవ హక్కులు.. ముఖ్యంగా మహిళలు, పిల్లల హక్కుల్ని పరిరక్షించాలనే డిమాండ్‌ను సైతం తాలిబన్ల ముందు ఉంచాలని అమెరికా భావిస్తోందట. అంతేకాదు ఈ సంక్షోభ-విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దేశాలను, సహాయక బృందాలను అఫ్గనిస్తాన్‌లోకి అనుమతించాలని సైతం కోరనుంది. చదవండి: ప్రపంచ దేశాల ఆందోళన.. అఫ్గాన్‌పై మాస్కోలో సదస్సు -
తాలిబన్ పాలన... భారత్‌కు సరికొత్త సవాళ్లు
అఫ్గానిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆవిర్భావం నేటి వాస్తవం. ప్రపంచ దేశాలు ఈ వాస్తవాన్ని ఇప్పుడే కాకపోయినా, తరువాత అయినా గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పటికే, ఈ ప్రాంతంలోని ముఖ్య శక్తులైన రష్యా, చైనాలు తాలిబన్ పాలనకు తమ మద్దతును ప్రకటిం చాయి. పాకిస్తాన్ తన మద్దతును ఇవ్వడమే కాకుండా, నూతన ప్రభుత్వంలో తన అనుకూల హక్కాని నెట్వర్క్ నాయకులను కీలకమైన పదవులలో చొప్పించడంలో కూడా సఫలమైంది. ప్రపంచ దేశాలు తాలిబన్లను బహిష్కరిస్తే అది ప్రతిచర్యలకు మాత్రమే దారితీయగలదని, సంభాషణలు సానుకూల ఫలితాలను ఇవ్వగలవని, అందువల్ల అఫ్గాన్ నూతన ప్రభుత్వంతో చర్చలు కొనసాగించాలని ఐక్యరాజ్యసమితి వేదికగా ఖతార్ ప్రకటించింది. దాని వ్యూహాత్మక, భద్రతా అవస రాలను దృష్టిలో ఉంచుకొని, ఇరాన్ కూడా తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. అఫ్గానిస్తాన్ అంతర్గత రాజకీయ పరిణామాలలో భారతదేశం ఎప్పుడూ ముఖ్యమైన పాత్ర వహించలేదు, కానీ భారత్‌కి అఫ్గానిస్తాన్‌తో ముడిపడిన వ్యూహాత్మక, భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయి. చరిత్రాత్మకంగా, 1996 నుంచి 2001 వరకు తాలిబన్ పాలన కాలంలో ఉండిన వైరుధ్యపరమైన సంబంధాలు మినహాయించి, భారతదేశం అఫ్గానిస్తాన్‌తో సుహృద్భావ సంబంధాలను కొనసాగించింది. దేశ భద్రతా, వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా, భారత్ త్వరలోనే తాలిబన్ ప్రభుత్వంతో ఒక ఒప్పందానికి రావాల్సి ఉంటుంది. ఈ కోణంలో మన ముందున్న సవాళ్లు ఏమిటి? మొదటిరకం సవాళ్లు ప్రాంతీయ, అంతర్జాతీయ ఉగ్రవాదం ముప్పులు. అవి ముఖ్యంగా కశ్మీర్ సమస్యను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ మతఛాందస, జిహాదీ ఉగ్రవాద సమ స్యలు భారత్‌కు మాత్రమే ప్రత్యేకమైనవి కాదు. రష్యా, చైనాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. రష్యా తాలి బాన్ల నుండి ఇస్లామిక్ ఛాందసవాద భావజాలం వ్యాప్తి గురించి ఆందోళన చెందుతోంది, చైనా ఆందోళనలు అన్నీ అఫ్గానిస్తాన్ సరిహద్దులోని ముస్లింలు అధికంగా ఉన్న జింజియాంగ్ రాష్ట్రం చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. వారి వారి ఆసక్తుల దృష్ట్యా రష్యా, చైనాలు, అఫ్గాన్ నుంచి అమె రికా సైన్యాల ఉపసంహర ణకు ముందే, తాలిబాన్లతో చర్చలు జరిపి వారికి మద్దతు ప్రకటించాయి. ఇదే రకం ప్రక్రియలను భారతదేశం చేపట్టలేదు. భారత్‌కి రెండవరకం సవాళ్లు అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రమేయంతో ఎదురవుతున్నాయి. ప్రస్తుత తాలిబన్ నాయకత్వం ఎంతవరకు పాకిస్తాన్‌తో అను కూలంగా ఉండగలదు? అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ సరిహద్దు ‘డ్యూరాండ్ లైన్’ను గతంలో ఏ అఫ్గాన్ ప్రభుత్వం కానీ, చివరికి తాలిబన్లు సహితం గుర్తించలేదనేది వాస్తవం. అయితే, తాలిబన్లను ఐఎస్ఐ తప్పక ప్రభావితం చేయ గలదనేది కూడా వాస్తవం. అందువల్ల, అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ఐ ప్రభావాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇక చివరి రకం సవాళ్లు భారత దీర్ఘకాలిక ప్రయోజనాలకు సంబంధించినవి. ఇవి మునుముందు అఫ్గానిస్తాన్‌లో రాజకీయ స్థిరత్వం ఏ విధంగా ఉండగలదు అనే సమస్యతో ముడిపడి ఉన్నాయి. గత ఇరవై ఏళ్లుగా అఫ్గానిస్తాన్‌పై భారత విదేశాంగ విధానం, ప్రాథమికంగా సైనిక విధానాన్ని అనుసరించిన అమెరికా వలె కాకుండా, భిన్నంగా ఉంటూ వచ్చింది. అప్గానిస్తాన్‌లో చేపట్టిన తన సహాయ కార్యక్రమాలలో స్థానిక ప్రజలను భాగస్వామ్యంచేసే నిర్మాణాత్మక ప్రక్రియను భారత్ అనుసరించింది. ఫలితంగా, 2006 నుంచి 300కి పైగా అనేక చిన్నతరహా అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించింది. వీటిలో హైవే రోడ్డు నెట్‌వర్క్‌లను నిర్మించడం ఒకటి. ఉదాహరణకు, జరాంజ్–డేలరాం హైవే, కాబుల్‌లోని కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం, చిన్న నీటిపారుదల కాలువలు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు నెలకొల్పడం, ఆ దేశ విద్యార్థులు భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రతి ఏటా వేలాది స్కాలర్షిప్లను అందించడం, కోవిడ్–19 మహమ్మారి సమయంలో గోధుమలు, అవసరమైన మందు లను పంపడం వంటివి ఉన్నాయి. ఐపీఎల్లో అఫ్గాన్ క్రికెట్ క్రీడాకారులు కూడా ఉన్నారు. ఈ విధంగా అక్కడి ప్రజల దృష్టిలో, ముఖ్యంగా యువతలో భారత్‌పై చక్కటి సుహృ ద్భావం ఉంది. దేశ జనాభాలో 30 శాతంగా ఉన్న ఈ పట్టణ ప్రాంత యువతతో తాలిబాన్లు అనుసంధానం కావాల్సి ఉంటుంది. హెన్రీ కిసింజర్ ఇలా అంటాడు, ‘దేశాధినేతలు విధానాలను రూపొందించే సమయంలో, ముందే నిరూ పించలేని అంచనాలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’. ఇదే దిశలో భారత్ తాలిబన్ల అఫ్గానిస్తాన్‌పట్ల తన విధానా లను అన్వేషించాల్సి ఉంది. భారత్ ముందుగల అవకాశాలు: ఒకటి, తాలిబన్లతో చర్చలు జరపడానికి ఒక ప్రత్యేక రాయబారిని నియమించడం; రెండు, రష్యాతో కలిసి కదలడం. భారత్ ఇప్పటికే అఫ్గాన్ భవితవ్యంపై రష్యా నేతృత్వంలోని చర్చలలో 2017 నుండి భాగంగా ఉన్నది. దీనిని ముందుకు సాగించడం; మూడు, షాంఘై సహకార సంస్థ ఆఫ్గాన్ కాంటాక్ట్ గ్రూప్ ద్వారా దారులు వెతకడం. ఈ సంస్థలో భారత్ ఇప్పటికే ఒక సభ్యదేశంగా ఉంది. ఈ వేదిక చైనాతో భారత్ సహకరించడానికి అవకాశాన్ని ఇస్తుంది; నాలుగు, అఫ్గాన్‌లో ఇంటెలిజెన్స్ సేకరణ కోసం ఇరాన్ గతంలో భారత్‌కు సహాయపడింది. తాలిబన్లతో ఇరాన్‌కు చేదు అనుభవం ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో వారికి ఇరాన్ మద్దతునిచ్చింది. అందువల్ల, తాలిబన్లతో వ్యవహరించడానికి భారత్ ఇరాన్ సాయాన్ని కోరవచ్చు; ఈ ఐదింటిలో భారత్ ఏ దిశను ఎంచుకున్నా, ప్రతి కార్యా చరణ వ్యూహంలో సమస్యలు ఉండగలవని గుర్తుంచుకో వాలి. అట్లాగే, భారతదేశం తన భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా పాక్ ఇష్టానికే వదిలివేయడం అత్యంత ప్రమాదకరం అని గుర్తించాలి. చెన్న బసవయ్య మడపతి వ్యాసకర్త విశ్రాంత రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా విశ్వ విద్యాలయం -
తాలిబన్ల దుశ్చర్య .. సోమనాథ్ ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేసి ట్వీట్ చేశారు
కాబుల్: ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అకృత్యాలు ప్రజల నుంచి దేవుళ్ల వరకు వెళ్లాయి. తాజాగా అక్కడి చారిత్రాత్మక సోమనాథ్ దేవాలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అందుకు బదులుగా ఆ స్థానంలో మహ్మమద్ గజ్నవి దర్గాను పునర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తాలిబన్‌కు చెందిన అనాస్ హక్కానీ ట్విటర్ ద్వారా తెలిపారు. ఆ ట్వీట్లో.. ఇవాళ మేము పదో శతాబ్దపు ముస్లిం వారియర్ మహ్మమద్ గజ్నవి దర్గాకు వెళ్లాం. ఈ ప్రాంతంలో ఆయన పటిష్టమైన ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ వైభవాన్ని మేము తిరిగి తీసుకొస్తామని తెలిపారు. కాగా, అందుకోసం తాలిబన్లు సోమ్‌నాథ్ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపారు. 998 నుంచి 1030 వరకు పాలించిన గజనావిడ్స్ తుర్కిక్ రాజవంశం మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు మహమూద్ గజ్నవి. అతను భారతదేశంలోని సంపన్న నగరాలు, కాంగ్రా, మధుర, జ్వాలాముఖ్ వంటి దేవాలయాలతో పాటుగా 17 సార్లు గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాన్ని దోచుకున్న సంగతి తెలిసింది. సోమనాథ్పై దాడి చేసినప్పుడు, గజ్నవీ దేవాలయాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వేలాది మంది భక్తులను చంపినట్లు చెబుతారు. కాగా సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం భారతదేశపు మొదటి హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ప్రారంభించగా ఆయన మరణం తర్వాత మే 1951 లో పూర్తయింది. ప్రస్తుతం ఆ దేవాలయం అన్ని వైభవాలతో కళకళలాడుతోంది. ఇక ఈ ట్వీట్‌పై . బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాతో పాటు అనేక మంది భారతీయ నెటిజన్లు ధీటుగా స్పందించారు. అనస్ హక్కానీ ట్వీట్‌కు.. సోమనాథ్ ఆలయం ఇంకా ఉన్నతస్థానంలో ఉందని, గజ్నవీ నగరాలు నశించిపోతున్నాయని నెటిజన్లు గుర్తు చేశారు. Today, we visited the shrine of Sultan Mahmud Ghaznavi, a renowned Muslim warrior & Mujahid of the 10th century. Ghaznavi (May the mercy of Allah be upon him) established a strong Muslim rule in the region from Ghazni & smashed the idol of Somnath. pic.twitter.com/Ja92gYjX5j — Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021 చదవండి: పైసల కోసమే ఫేస్బుక్ కక్కుర్తి! ఛస్.. లాజిక్ లేదన్న మార్క్ -
కాబూల్‌లో బాంబ్ పేలుడు.. 14 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో మరోసారి బాంబు పేలుడు చోటు చేసుకుంది. కాబూల్‌లోని ఈద్ గాహ్ మసీదు ప్రవేశద్వారం జరిగిన బాంబ్ పేలుడులో 14మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ ఘటనపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ స్పందిస్తూ.. మసీదు వెలుపల బాంబ్ పేలుడు జరిగినట్లు వెల్లడించారు. -
‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళలు వినూత్నంగా..
కాబుల్: పరిపాలన పేరుతో తాలిబన్లు అఫ్గన్ ప్రజలపై పాల్పడుతున్న ఆకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల బాలకల విద్య పై కఠిన ఆంక్షలు విధిస్తూ వారిని పాఠశాలలోకి అనుమతించని సంగతి తెలిసిందే. తాజాగా కాబుల్‌లో కొందరు మహిళలు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆపేందుకు తాలిబన్లు తమదైన శైలిలో హింసాత్మక ధోరణిని ప్రదర్శించారు. స్థానికి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. 6-12 తరగతుల బాలికలను తిరిగి పాఠశాలలకు అనుమతించాలని ‘స్పాంటేనియస్ మూవ్మెంట్ ఆఫ్ అఫ్గాన్ వుమెన్ యాక్టివిస్ట్స్’ బృందానికి చెందిన కొందరు మహిళలు ఓ సెకండరీ స్కూల్ ముందు నిరసనకు దిగారు. అందులో.. ‘మా పెన్నులు విరగ్గొట్టొద్దు. మా పుస్తకాలను కాల్చొద్దు. మా పాఠశాలలను మూసివేయొద్దని.. రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇంతలో అక్కడికి వచ్చని తాలిబన్లు వారిని వెనక్కి నెట్టి, ఆ బ్యానర్లు లాగేసుకున్నారు. నిరసన ఆపకపోయేసరికి వారిని అదుపుచేసేందుకు గాల్లో కాల్పులు సైతం జరిపారు. ఇదంతా రికార్డు చేస్తున్న విదేశీ జర్నలిస్ట్‌ను నిలువరించడమేగాక రైఫిల్‌తో అతన్ని కొట్టారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన బృందానికి నాయకుడైన మౌలావి నస్రతుల్లా మాట్లాడుతూ.. నిరసనకారులు తమ ప్రదర్శనకు సంబంధించి అనుమతులు తీసుకోలేదని వెల్లడిస్తూ, ఇతర దేశాల మాదిరిగానే తమ దేశంలో కూడా నిరసన తెలిపే హక్కు ఉందని అయితే అందుకు ముందస్తు అనుమతి తప్పనిసరిని తెలియజేశారు. అఫ్గాన్‌లో 6-12 తరగతులకు కేవలం బాలురను మాత్రమే అనుమతిస్తూ తాలిబన్లు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళల హక్కుల విషయంలోనూ వారు మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తున్నారు. చదవండి: Pakistan: ట్రోలింగ్: అధికారుల ఫోన్లలో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని మోగాల్సిందే.. -
భారత్‌కు తొలిసారి తాలిబన్ల లేఖ: విమానాలు నడపాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: తాలిబన్లు తొలిసారి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. అఫ్గానిస్తాన్‌ను సొంతం చేసుకుని ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి తాలిబన్లు భారత్‌తో సత్సంబంధాలు ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ దేశానికి విమాన రాకపోకలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. కాబూల్‌కి వాణిజ్య విమానయాన సేవలను తిరిగి ప్రారంభించాలని తాలిబన్ ప్రభుత్వం భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ని కోరింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వం ఒక లేఖ పంపించారని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇటీవల అఫ్గనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్న నేపథ్యంలో కాబూల్‌కి అన్ని వాణిజ్య విమానాలను భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. (చదవండి: లంచం ఇస్తే తీసుకోండి.. బలవంతంగా వసూలు చేయొద్దు) ఈ మేరకు తాలిబన్లు విమానయానానికి సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించామని, తమ వంతు సహకారం పూర్తిగా అందిస్తామని లేఖలో పేర్కొనట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఆర్థిక సంకోభంలో కొట్టుమిట్టాడుతున్న అఫ్గనిస్తాన్‌ని గట్టెక్కించే చర్యల్లో భాగంగా తాలిబన్ ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. అయితే తాలిబన్ ప్రభుత్వం గతవారం కూడా పలు దేశాలతో విమానయన సేవలను పునరద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే భారత్‌కు కూడా లేఖ రాసింది. ఈ విషయమై తాలిబన్ల ప్రతినిధి అబ్దుల్ కహార్ బాల్కి స్పందిస్తూ.. ‘అంతర్జాతీయ విమానయాన సేవలను నిలపివేయడంతో విదేశాల్లో చిక్కుకున్న అఫ్గన్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రయాణాలు లేకపోతే ప్రజలకు ఉపాధి, చదువు సజావుగా కొనసాగదు’ అని స్పష్టం చేశారు. తాలిబన్లు అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ స్థాయిలో సెప్టెంబర్ 13వ తేదీన కాబూల్ వెళ్లిన మొదటి కమర్షియల్ విమానం పాకిస్తాన్‌కు చెందినదే కావడం గమనార్హం. (చదవండి: ఒక్క టవరే కూల్చండి.. ప్లీజ్) -
పాకిస్తాన్‌ని సాగనంపాల్సిందేనా?
పాకిస్తాన్ ప్రదర్శిస్తున్న అత్యంత ప్రతికూల వైఖరి కారణంగా సార్క్ ఉద్యమం బలహీనపడుతోంది. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అఫ్గానిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని పాక్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. తాలిబన్ల హృదయాల్లో మానవహక్కులకు అసలు తావులేదు. అందుకే పాకిస్తాన్ చేసిన అసంబద్ధమైన డిమాండ్‌ను సార్క్ దేశాలు తోసిపుచ్చాయి. సార్క్ సభ్యదేశంగా పాక్∙కొనసాగినంతవరకు ఈ కూటమికి భవిష్యత్తు లేదన్నది వాస్తవం. కూటమిని మరింత బలోపేతం చేసుకోవడానికి గొప్ప అవకాశం ఇప్పుడు ‘సార్క్’కు అందుబాటులో ఉంది. దక్షిణాసియా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని, స్నేహ భావాన్ని విస్తరింపజేసే బలమైన వేదిక అయిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య(సార్క్)ని ధ్వంసం చేసేందుకు పాకిస్తాన్ ఈరోజుకీ ప్రయత్నిస్తూనే ఉంది. పాక్ వైఖరి అత్యంత ప్రతికూలంగా ఉంటోంది. దీనివల్లే సార్క్ వేదిక స్తంభించిపోయింది. అఫ్గానిస్తాన్‌లో ఇటీవలే అధికారంలోకి వచ్చిన తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధులను సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సుకు ఆహ్వానించాలని పాక్ ఇటీవలే డిమాండ్ చేసింది. ఈ సదస్సు ఇటీవల ఐక్యరాజ్యసమితి 76వ వార్షిక సమావేశాల్లో భాగంగా జరగాల్సింది. అయితే ఇతర సార్క్ దేశాలు ఈ అంశంపై చర్చకు సిద్ధంగా లేనందున అవి ఈ సదస్సును తమకు తాముగా రద్దు చేసుకున్నాయి. పాకిస్తాన్ డిమాండ్‌ను ఆమోదించడం అంటే, అత్యంత ప్రతీఘాతుకత్వంతో, ఉగ్రవాద అనుకూల స్వభావంతో, మహిళా వ్యతిరేకతతో నడుస్తున్న అఫ్గాన్ ప్రభుత్వాన్ని నేరుగా లేదా పరోక్షంగా అయినా సరే సమర్థించడమేనని సార్క్ దేశాలు భావించాయి.. తాలిబన్ హృదయాల్లో మానవహక్కులకు అసలు తావులేదు. అందుకే పాకిస్తాన్ చేసిన అసంబద్ధమైన డిమాండ్‌ను సార్క్ దేశాలు తోసిపుచ్చాయి. మన ప్రధాని నరేంద్రమోదీ 2014లో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించారు. బలహీనపడుతున్న సార్క్ కూటమిని తిరిగి పునరుద్ధరించాలని ప్రధాని గట్టి చొరవ చేశారు. కాని ఈ లక్ష్యసాధనను నెరవేర్చే క్రమంలో పాక్ నిరంతరం ప్రతిబంధకాలను సృష్టిస్తూపోయింది. ఈ కూటమిలో వీలైనంత ఎక్కువగా తన అరాచకాన్ని విస్తరించేందుకు పాక్ ప్రయత్నించింది. దక్షిణాసియా దేశాల ఆర్థిక, రాజకీయ సంస్థ సార్క్. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్ కలిసి సార్క్ కూటమిని నెలకొల్పాయి. 2007 ఏప్రిల్‌లో జరిగిన 14వ సార్క్ కూటమి సదస్సులో అఫ్గానిస్తాన్‌ను ఎనిమిదవ సభ్యదేశంగా చేర్చుకున్నారు. సార్క్ చరిత్రలోకి వెళ్లి చూస్తే, 1970లలో బంగ్లాదేశ్ ప్రజారిపబ్లిక్ అధ్యక్షుడు, దక్షిణాసియా దేశాల మధ్య వాణిజ్య మండలి ఏర్పాటును ప్రతిపాదించారు. ఆ తర్వాత 1980 మే నెలలో సార్క్ సభ్యదేశాల మధ్య ప్రాంతీయ సహకారం అనే భావన ముందుకొచ్చింది. 1981 ఏప్రిల్‌లో పై ఏడుదేశాల విదేశాంగ కార్యదర్శులు మొదటిసారిగా శ్రీలంక రాజధాని కొలంబోలో సమావేశమయ్యారు. ఆ తర్వాతే సార్క్ ఉనికిలోకి వచ్చింది. దేశాల మధ్య పరస్పర సహకారం ప్రాధాన్యతను మొత్తం ప్రపంచం అర్థం చేసుకుంటున్న తరుణంలో సార్క్ కూటమి ఎదగడానికి పాకిస్తాన్ ఏమాత్రం సహకరించడం లేదు. అందుకే సార్క్ దేశాలు ఉగ్రవాదం, పరస్పర వాణిజ్యం వంటి ముఖ్యమైన అంశాలపై కూడా ఒక అభిప్రాయాన్ని ఉంచుకోలేకపోయాయి. భారత్‌లో ఉగ్రవాదాన్ని విస్తరింపజేసే లక్ష్యమే కర్తవ్యంగా భావిస్తున్న ఉగ్రమూకలను పెంచి పోషించే ఎరువుగా పాక్ ఉపయోగపడుతూ వస్తోంది. ముంబైలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి పాక్‌దే ప్రధాన బాధ్యత. మొత్తం ప్రపంచానికి ఈ విషయం తెలుసు. ఇక ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో తలదాచుకుని దొరికిపోయాడు. అందుకే పాకిస్తాన్ ఒక ఉగ్రవాద కార్ఖానాగా మారిపోయిందని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా ఏ దేశమూ పాకిస్తాన్లో ఆడటానికి, పర్యటించడానికి సాహసించలేదు. ఒకవేళ వెళ్లినా ఉగ్రవాదుల హెచ్చరికలతో వెనుదిరిగి వచ్చేస్తున్నారు. ఇటీవలే న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ పాక్‌లో ఆడటానికి చివరిక్షణంలో తిరస్కరించింది. ఇక ఇంగ్లండ్ జట్టు అయితే ఆ దేశానికి వెళ్లడానికి కూడా వ్యతిరేకించింది. ఇంత జరిగాక కూడా పాకిస్తాన్, సార్క్ కూటమిలో కొనసాగుతోంది. భారత్ మాత్రం ప్రారంభం నుంచి సార్క్ కూటమిని బలోపేతం చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తూ వచ్చింది. సభ్యదేశాలు భారత్‌కు ఈ లక్ష్య సాధనలో సహకరించాలి. కరోనా మహమ్మారితో పోరాటంలో సార్క్ దేశాల మధ్య సాధ్యమైనంత సహకారానికి కృషి చేస్తానని భారత్ హామీ ఇచ్చింది. సంక్షోభంలో చిక్కుకున్న దేశాలు పరస్పరం ఐక్యంగా నిలబడాలని చెబుతుంటారు. అలాంటి సంక్షోభ పరిస్థితుల్లో పాత విభేదాలను కూడా మర్చిపోవాల్సి ఉంటుంది. భారత్ తనవంతుగా కరోనా వైరస్‌తో తలపడటంలో సార్క్ కూటమికి అండగా నిలబడింది. బలమైన సోదరభావాన్ని ఏర్పర్చింది. కరోనా వైరస్‌తో భారత్ తలపడిన తీరును సార్క్ కూటమితో పాటు యావత్ ప్రపంచం గుర్తించి ప్రశంసించింది. పాకిస్తాన్ ప్రజలు కూడా దాన్ని గమనించారు కానీ పాక్ నాయకులు మాత్రం మోదీని కానీ, భారత్‌ని ప్రశంసించడానికి ముందుకు రాలేదు. పాకిస్తాన్ దుష్ట తలంపువల్లే సార్క్ కూటమి అడుగు ముందుకు వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో సార్క్ దేశాలు తమ వేదికనుంచి పాకిస్తాన్‌ని తొలగించే విషయమై తీవ్రంగా ఆలోచించాల్సి ఉంది. కూటమిలోని ఒక్క దేశం ఇతర సభ్యదేశాలన్నింటినీ భాధపెడుతూ వస్తోందని అవి గుర్తించాలి. పాకిస్తాన్, భారత్‌కి మాత్రమే శత్రుదేశం కాదు. పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌తోనూ అది సఖ్యంగా లేదు. బంగ్లాదేశ్ ఒకప్పుడు పాక్‌లో భాగమేనని గుర్తించాలి. బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ దేశంగా ఉంటున్నప్పటికీ ఆ దేశానికి వీలైన అన్ని మార్గాల్లో హాని కలిగించాలని పాక్ నిరంతరం ప్రయత్నించింది. పాకిస్తాన్‌ని సార్క్ దేశాలు సాగనంపితే, అది సార్క్ కూటమిని మరింత బలోపేతం చేస్తుంది. అప్పుడు నిజంగా అవసరమైన రంగాల్లో ఈ కూటమిని నేరుగా సహకరించుకోవచ్చు. అలాగే ఉగ్రవాదంపై వారు తలపడవచ్చు కూడా. తమ కూటమిలో పాక్ ఉన్నంతవరకు తామేమీ చేయలేమని సార్క్ దేశాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ లేకుంటే సార్క్ దేశాలు ఆర్థిక సహకారాన్ని వేగవంతం చేసుకోవచ్చు. 2007లో బంగ్లాదేశ్‌లో మూడు బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడిని పెట్టడానికి భారత్‌కి చెందిన టాటా గ్రూప్ సిద్ధపడింది. కానీ టాటా గ్రూప్‌ని అనుమతిస్తే అది మరో ఈస్ట్ ఇండియా కంపెనీ అవుతుందని వాదించారు, వ్యతిరేకించారు. ఈరకమైన ఆలోచన తప్పు. కరోనా మహమ్మారి కాలంలో దేశాలు, ప్రత్యేకించి ఇరుగుపొరుగు దేశాలు కలిసి పనిచేయాల్సి ఉంది. సార్క్ కూటమిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంటోందని సభ్య దేశాలు గుర్తించాలి. రవీంద్రకిషోర్ సిన్హా వ్యాసకర్త మాజీ ఎంపీ, కాలమిస్ట్ -
మరో బాంబు పేల్చిన తాలిబన్లు.. ఇక స్టైలిష్ కటింగ్స్ బంద్!
కాబుల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు తమ నియంతృత్వ పాలనను కొనసాగిస్తూ ప్రజలను భయభ్రాంతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే అవకాశం లేకుండా విదేశాలు తమ అంతర్గత పాలన విషయంలో జోక్యం చేసుకోకూడదని తాలిబన్ నేతలు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తాజాగా మరో అవసరపై కూడా నిషేదం విధిస్తున్నట్లు వారు ప్రకటించారు. దక్షిణ అఫ్గనిస్తాన్‌లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో స్టైలిష్ హెయిర్‌స్టైల్స్, క్లీన్ షేవ్‌ను చేసుకోవడాన్ని తాలిబన్లు నిషేదించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇస్లామిక్ ఓరియంటేషన్ మంత్రిత్వ శాఖ అధికారులు, ప్రావిన్షియల్ రాజధాని లష్కర్ గాహ్‌లో పురుషుల సెలూన్ల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో స్టైలిష్‌గా హెయిర్ కట్టింగ్, గడ్డం షేవింగ్ చేయకూడదని స్పష్టం చేశారు. దాంతోపాటు షాపులలో ఆధ్యాత్మిక పరమైనవి కాకుండా ఇతర సంగీతం వినిపించకుడదని హకుం జారీ చేశారు. తాలిబన్ల పాలానా విధానం చూస్తే వారు పాత ధోరణినే కొనసాగిస్తున్నట్లు ఆ మీడియా పేర్కొంది. ఓ పక్క మారిపోయామంటూనే తమ పాత ధోరణిని పాటిస్తున్న తాలిబన్లు అఫ్గన్‌లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల పశ్చిమ నగరం హెరాత్‌లో కిడ్నాప్‌కు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులను చంపి ఆ మృతదేహాలను తాలిబన్లు బహిరంగంగా వేలాడదీసిన సంగతి తెలిసిందే. చదవండి: Afghanistan: తాలిబన్ల వికృత చర్య.. చంపేసిన వాళ్లని.. -
తాలిబన్ల వికృత చర్య.. ఈ సారి ఒళ్లు గగుర్పొడిచేలా..
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు మునుపటిలానే వారి కిరాతక చర్యలను కొనసాగిస్తున్నారు. హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో క్రేన్‌కు ఒక మృతదేహాన్ని వేలాడదీసి బహిరంగంగా ప్రదర్శించారు. అయితే అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మొదట.. తమ పాలన గతంలో మాదిరి ఉండదని, మారిపోయానట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల గతంలోని పాలన మాదిరిగా షరియా చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేస్తామని, చేతులు నరకడంతోపాటు బహిరంగంగా ఉరి తీస్తామని తాలిబన్ నేత ముల్లా నూరుద్దీన్ తురాబి తెలిపాడు. హెరాత్ ప్రాంతంలో ఫార్మసీ నడుపుతున్న ఓ వ్యక్తి మీడియాకి తెలిపిన వివరాల ప్రకారం.. తాలబన్లు నాలుగు మృతదేహాలను ప్రధాన కూడలికి తీసుకువచ్చి ఒక మృతదేహాన్ని వేలాడిదీసారని, మిగిలిన మూడు మృతదేహాలను మరో కూడళ్లలో వద్ద ఈరకంగానే వేలాడ దీసేందుకు తీసుకెళ్లారని తెలిపాడు. అయితే ఆ నలుగురు కిడ్నాప్ యత్నించడంతో పోలీసుల చేతిలో హతమయ్యారని తాలిబాన్లు ఆ కూడలి వద్ద ప్రకటించారని చెప్పాడు. ఆగష్టు 15 న తాలిబాన్లు ఆప్గన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజలు చీకటి పాలన మళ్లీ మొదలుకానుందని భయభ్రాంతులకు గురవుతున్నారు. చదవండి: కిల్లర్ చైర్.. దీని కథ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. -
మీడియాపై తాలిబన్ల ఉక్కుపాదం.. కొత్తగా 11 నియమాలు
కాబూల్: అప్గనిస్తాన్‌లో పత్రికా స్వేచ్ఛను కాలరాయడమే లక్ష్యంగా తాలిబన్ పాలకులు కఠిన చర్యలు ప్రారంభించారు. వార్తా సంస్థలపై ఆంక్షలు విధిస్తూ కొత్తగా 11 నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇస్లాం మతాన్ని, దేశంలోని ప్రముఖ నాయకులను కించపర్చేలా ఎలాంటి సమాచారం ప్రచురించిన కఠినా దండన తప్పదని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ మీడియా కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ పత్రికల్లో వార్తలు, వ్యాసాలు ప్రచురించాలని జర్నలిస్టులకు తాలిబన్లు హుకుం జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అఫ్గాన్‌లో పని చేస్తున్న పాత్రికేయులు తీవ్ర భయాందోళనకు గురవుతు న్నారని అమెరికాకు చెందిన ప్రెస్ ఫ్రీడమ్ ఆర్గనైజేషన్ సభ్యుడు స్టీవెన్ బట్లర్ చెప్పారు. తమకు సాయం చేయాలంటూ అఫ్గాన్ జర్నలిస్టుల నుంచి తనకు వందలాది ఈ–మెయిళ్లు వస్తున్నా యని తెలిపారు. అఫ్గానిస్తాన్‌ను ఆగస్టులో తాలిబన్లు మళ్లీ ఆక్రమించిన తర్వాత 150కిపైగా మీడియా సంస్థలు మూతపడినట్లు సమాచారం. దేశంలోని ప్రముఖ పత్రికలు ప్రింటింగ్ కార్యకలాపాలను నిలిపివేశాయి. ఆన్లైన్ ఎడిషన్‌కు పరిమితం అవుతున్నాయి. తాలిబన్ల నుంచి ముప్పు తప్పదన్న భయంతోపాటు ఆర్థిక పరిస్థితి దిగజారడం కూడా ఇందుకు కారణం. తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలన్న డిమాండ్‌తో జనం వీధుల్లోకి వచ్చారు. ఈ నిరనస కార్యక్రమాలను, ప్రజల ఆగ్రహాన్ని ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టులపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. చాలామందిని నిర్బంధించినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ టీవీ చానళ్ల తీరు మారిపోయింది. టీవీల్లో న్యూస్ బులెటిన్లు, రాజకీయ చర్చలు, వినోదం, సంగీతం, విదేశీ నాటికలు తెరమరుగయ్యాయి. వాటి స్థానంలో తాలిబన్ ప్రభుత్వానికి అనుకూలమైన కార్యక్రమాలే ప్రసారమవుతున్నాయి. విలేకరులను నిర్బంధిం చడం తక్షణమే నిలిపివేయాలని కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(సీపీజే) తాలిబన్ సర్కారును డిమాండ్ చేసింది. మీడియా కార్యకలాపాలు స్వేచ్ఛగా కొనసాగే వాతావరణం కల్పించాలని పేర్కొంది. శవాలను వేలాడదీసిన తాలిబన్లు అఫ్గాన్‌లో తాలిబన్ల అరాచక శిక్షలు ప్రారంభమైనట్లే కనిపిస్తోంది. శనివారం ఓ వ్యక్తి శవాన్ని హెరాత్ నగరంలోని ప్రధాన కూడలిలో వేలాడదీశారని ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. మొత్తం నాలుగు శవాలను తాలిబన్లు తీసుకొచ్చారని, అందులో మూడు శవాలను వేరే చోటకు తీసుకెళ్లారని అన్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయా మృతదేహాలను వేలాడదీసేందుకే తీసుకెళ్లారని చెప్పారు. హెరాత్ నగరంలోని ప్రధాన కూడలి వద్ద ఓ శవాన్ని క్రేన్ సాయంతో వేలాడదీశారని, ఆ ప్రదేశానికి దగ్గర్లోనే తనకు ఓ ఫార్మసీ షాపు ఉందని వాజిర్ అహ్మద్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. దీనిపై ఉన్నతాధికారి మౌలావి షీర్ అహ్మద్ స్పందించారు. నిందితులు ఓ వ్యాపార వేత్త కుమారుడిని కిడ్నాప్ చేశారని, వారిని భద్రతా బలగాలు ఆపడంతో కాల్పులు జరిపారని అన్నారు. దీంతో భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో నలుగురు కిడ్నాపర్లు మరణించారన్నారు. అనంతరం నలుగురి శవాలను వివిధ ప్రాంతాల్లో వేలాడదీశారు. ‘కిడ్నాప్‌కు పాల్పడే వారికి ఇలాంటి శిక్షే పడుతుంది’ అని రాసి ఉన్న బోర్డులను మృత దేహాలకు తగిలించారు. ఎవరూ కిడ్నాప్ కావడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. చదవండి: Afghanistan: కాళ్లు, చేతులు నరకడం శిక్షలు ఆపేదిలేదు: తాలిబన్లు -
US ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
-
పాకిస్తాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన స్నేహ దూబే.. అసలు ఎవరామే!
న్యూయార్క్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్య రాజ్య సమితి 76వ జనరల్ అంసెంబ్లీ (యూఎన్జీఏ) సమావేశంలో భారత్‌పై మళ్లీ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని సమావేశంలో కశ్మీర్ సమస్యను లేవనెత్తి భారత్‌పై ద్వేషపూరిత ఆరోపణలు చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. అంతేకాదు ఈ సమావేశంలో ప్రపంచ దృష్టిని మరల్చేలా భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారు. దీంతో భారత ప్రతినిధి స్నేహ దూబే పాక్ ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు భారత్ ప్రతినిధి స్నేహ దూబే మాట్లాడుతూ...." జమ్మూ కాశ్మీర్, లడఖ్ వంటి కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లోని అంతర్భాగమని, వాటిని ఎన్నటికీ భారత్ నుంచి విడదీయలేరు. పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా ఆక్రమించి స్థావరాలు ఏర్పాటు చేసుకున్న భారతదేశానికి చెందిన ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయండి." అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక పాక్ ప్రధాని కుదిరినప్పుడుల్లా పొరుగు దేశమైన భారత్‌పై కయ్యానికి కాలుదువ్వడమే పనిగా పెట్టుకుంటారంటూ ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, స్వేచ్ఛగా తిరిగేలా పాస్‌పోర్ట్‌లు కూడా మంజూరు చేసిన గొప్ప దేశం అంటూ విమర్శించారు. ఉగ్రవాదులకు శిక్షణనిచ్చి ఆర్థిక సహయం అందిస్తున్న చారిత్రాత్మక దేశంగా ప్రపంచ దేశాలకు తెలుపంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. (చదవండి: అపహరణకు గురైన ఇరాక్ పురాతన శాసనాన్ని తిరిగి ఇచ్చేశాం!) ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి జోక్యం చేసుకుంటూ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించనివ్వకుండా భారత్దేశ సమస్యలు గురించి ఎందుకంటూ ఘాటుగా విమర్శించారు. ఉగ్రవాదులకు సహాయసహకారాలు అందించే విషయాలు, తాలిబన్ ఆక్రమిత అఫ్గనిస్తాన్ వంటి వాటిల్లో పాక్ కీలక పాత్ర గురించి క్వాడ్ లేదా మరే ఏ ఇతర సదస్సుల్లో అయిన ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలని చెప్పారు. స్నేహ దూబే వివరాలు దీంతో పాకిస్తాన్‌కు ధీటుగా బదులిచ్చిన స్నేహ దూబే గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చ మొదలైంది. అసలు ఇంతకీ ఎవరామే అంటే ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు. స్నేహ దూబే ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి వ్యాపార వేత్త, తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. చిన్న వయసు నుంచే స్నేహ దూబే దేశానికి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నారు. గోవాలో పాఠశాల చదువును పూర్తి చేశారు, పూణెలో కళాశాల విద్య, ఆతర్వాత దిల్లీ జేఎన్‌యూ నుంచి ఎంఫిల్ పట్టా పొందారు. 2012 బ్యాచ్‌కు చెందిన దూబే మొదటి పోస్టు విదేశాంగ శాఖలో తరువాత 2014లో స్పెయిన్‌లోని భారత దౌత్య కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఐరాసలో భారతదేశ మొదటి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు!) -
కాళ్లు, చేతులు నరకడం శిక్షలు ఆపేదిలేదు: తాలిబన్లు
ఆఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఎట్టకేలకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తమ గత పరిపాలనలా ప్రస్తుతం ఉండబోదని అఫ్గన్ ప్రజలకు తాలిబన్లు చెప్పిన మొదటి మాట ఇది. అయితే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు, తాలిబన్లు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఆ మాట మీద వాళ్లు నిలబడడం లేదనే తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా తాలిబన్ నేత నుంచి వచ్చిన మరో ప్రకటనను చూస్తే అది అర్థమవుతుంది. అఫ్గన్‌లో తాలిబన్లు మళ్లీ వారి పాత విధానాలనే ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యారు. 1990లో మాదిరిగానే ప్రస్తుత పరిపాలనలో కూడా కాళ్లు, చేతులు నరకడం వంటి కఠిన శిక్షలు అమల్లో ఉంటాయని తాలిబన్లు తేల్చి చెబుతున్నారు. ఈ అంశంపై తాలిబన్ వ్యవస్థాపక సభ్యుడు ముల్లా నూరుద్దీన్ తురాబీ మీడియాతో మాట్లాడుతూ.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తమ చట్టాలు, పరిపాలను ఎలా ఉండాలనేది ఇతర దేశాలు చెప్పకూడదన్నారు. చదవండి: Freshworks Company: ఒక్క రోజులోనే కోటీశ్వరులైన 500 మంది ఉద్యోగులు...! -
అలా జరిగితే అఫ్గాన్ జట్టును బహిష్కరిస్తాం.. ఐసీసీ వార్నింగ్
ICC Warns Afghanistan Cricket Team: క్రికెట్ బోర్డుల వ్యవహారాల్లో ఆయా దేశాల ప్రభుత్వాల జోక్యాన్ని సహించేది లేదని ఐసీసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. వచ్చే నెలలో ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ పాల్గొనడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెలలో ఆఫ్గనిస్థాన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు.. ఆ దేశ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధ్యక్షడిని సైతం మార్చేసి వారికి అనుకూలంగా ఉండే వ్యక్తిని నియమించుకోవడంతో పాటు ఆ దేశ అమ్మాయిలను క్రికెట్ ఆడకుండా నిషేధించారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్ జాతీయ పతాకానికి బదులు తమ జెండా పెట్టాలని తాలిబన్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే.. అఫ్గాన్ జట్టును బహిష్కరించేందుకు కూడా వెనుకాడమని ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. పొట్టి ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే ఐసీసీ నియమాలు తప్పకుండా పాటించాలని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు మొత్తం 8 జట్లు అర్హత సాధించగా, అందులో అప్గాన్ జట్టు ఒకటి. ఇటీవలి కాలంలో పొట్టి ఫార్మాట్లో బలమైన జట్టుగా ఎదిగిన అఫ్గానిస్థాన్ జట్టు ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 8వ స్థానంలో ఉంది. చదవండి: ఆ క్రికెట్ సిరీస్ కోసం ఇద్దరు ప్రధానుల మధ్య చర్చ.. -
అఫ్గాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణమట..!
Taliban Bans IPL Broadcast: అఫ్గాన్‌లో తాలిబన్ల వికృత చేష్టలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దీంతో సాధారణ జనజీవనం దుర్భరంగా మారింది. రెండోసారి అధికారం చేజిక్కించుకున్నాక తాము మారిపోయామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన తాలిబన్ ముష్కరులు గతానికి మించి క్రూరంగా తయారయ్యారు. మహిళలకు సంబంధించి రోజుకో ఫత్వా జారీ చేస్తూ.. ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. క్రీడలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు ఉండవంటూనే మహిళల పేర్లు చెప్పి తమదైన మార్కు రాక్షస పాలన అమలు చేస్తున్నారు. తాజాగా మహిళల అశ్లీలతను సాకుగా చూపి ప్రపంచ క్రికెట్ పండుగ అయిన ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)పై నిషేధం విధించారు. స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉంటున్నారని, అక్కడ మహిళలు డ్యాన్స్ చేస్తున్నారని, ఇది తమ ఆచారాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అందుచేతనే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ తాలిబన్(ఆఫ్గానిస్తాన్)లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు అఫ్గాన్‌లో ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్స్‌ను గట్టిగా హెచ్చరించారు. కాగా, అఫ్గానిస్తాన్ స్టార్ ఆటగాళ్లు రషీద్‌ఖాన్, నబీ సహా పలువురు అఫ్గాన్ క్రికెటర్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. తాలిబన్ల తాజా నిర్ణయం పట్ల వీరు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్ల పాలనలో అనేక వినోద కార్యక్రమాలపై ఆంక్షలు అమల్లో ఉండగా, తాజాగా ఈ జాబితాలో ఐపీఎల్ కూడా చేరింది. చదవండి: IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే -
ఒక్క మహిళా కూడా లేదు.. మొత్తం పురుషులతో నిండిన మంత్రివర్గం
కాబూల్: అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు అఫ్తానిస్తాన్‌లో మహిళలపై వివక్ష తీవ్రంగా చూపిస్తున్నారు. మహిళలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ల ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్న మహిళా శాఖను ఎత్తేసిన ఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించగా వారిలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. 1990 కాలాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఇటీవల అఫ్గాన్‌లో ప్రధానమంత్రితో పాటు మంత్రివర్గాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ సందర్భంగా ఉప మంత్రులను ఎన్నుకున్నారు. అయితే ఆ ఉప మంత్రుల్లోనూ.. కేబినెట్ మంత్రుల్లోనూ ఒక్క మహిళకు చోటు కల్పించలేదు. అయితే దీనిపై జబిహుల్లా స్పందిస్తూ ‘ఇది తాత్కాలిక ప్రభుత్వమే. భవిష్యత్‌లో మార్పులు జరుగుతాయి’ అని స్పష్టం చేశాడు. చదవండి: గురజాడ అప్పారావుకు సీఎం జగన్ ఘన నివాళి మొత్తం మహిళలను ఇంటికే పరిమితం చేయాలని అఫ్గాన్ పాలకులు నిర్ణయించారు. ఇటీవల ఓ ప్రతినిధి ‘మహిళలు పిల్లలు కనడానికి మాత్రమే పనికి వస్తారు. మంత్రులుగా కాదు’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు ధర్మ ప్రచార మంత్రిత్వ శాఖగా మార్చేశారు. ఆదివారం రాజధాని కాబూల్ మునిసిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. ఇక యువతులు, మహిళలు చదువుకునే హక్కును కాలరాస్తున్నారు. కేవలం పాఠశాల విద్యకే మహిళలను పరిమితం చేస్తున్నారు. అఫ్గాన్ పరిణామాలను అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. అయితే అంతర్జాతీయంగా ఎంతటి విమర్శలు వచ్చినా కూడా తాలిబన్లు మహిళలపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. షరియా చట్టాలకు అనుగుణంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు ఎప్పుడో ప్రకటించారు. తదనుగుణంగా వారి పాలన సాగుతోంది. -
జలాలాబాద్‌లో పేలుళ్లు.. ఇద్దరు మృతి: తాలిబన్ అధికారులు
జలాలాబాద్: ఆప్గనిస్తాన్‌లోని జలాలాబాద్‌లో శనివారం మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, మరో 18 నుంచి 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. అంతేగాక మరణించిన వారిలో తాలిబన్ అధికారులూ ఉన్నట్లు తెలుస్తోంది. జలాలాబాద్‌లో జరిగిన వేరువేరు బాంబు పేలుళ్లో ఇద్దరు మృతి చెందినట్లు, 20 మంది వరకు గాయపడినట్లు తమకు సమాచారం అందిందని తాలిబన్ అధికారులు పేర్కొన్నారు. అయితే మృతుల పేర్లు మాత్రం వెల్లడించలేదు. గాయపడిన వారిలో మహిళలు, చిన్న పిల్లలున్నట్లు తెలిపారు. కాగా బాంబు దాడి ఘటనపై విచారణ జరగుతున్నట్లు వెల్లడించారు. నంగర్హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లోని తాలిబాన్ వాహనాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. తాలిబన్ దళాల వాహనాలు వెళ్తుండగా రోడ్డు పక్కన అమర్చిన మందుపాతరను పేల్చారని చెప్పారు. ఇదిలా ఉండగా ఆగస్ట్ 15న ఆప్గనిస్తాన్‌ను తాలిబన్లు మరోసారి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి ఆ దేశంలో వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరుతూనే ఉన్నాయి. చదవండి: అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి: యూఎన్ మూగజీవాల రక్షకుడు.. 8వేల కుక్కలను కాపాడిన భిక్షువు.. -
అఫ్గనిస్తాన్‌కి తక్షణ సాయం కావాలి: యూఎన్
ఇస్లామాబాద్: దశాబ్దాల నుంచి నిర్విరామ యుద్ధంతో విసిగిపోయిన అఫ్గనిస్తాన్ ప్రజలకు తక్షణ సాయం అవసరమని, వారికి మానవతా దృక్పథంతో కూడిన సాయం కావాలంటూ.. ఐక్య రాజ్య సమితి (యూఎన్ఓ) శరణార్థుల హై కమిషనర్ ఫిలిప్పో గ్రాండి పిలుపునిచ్చారు. అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: "ఇది మా తప్పిదమే": యూఎస్ ప్రస్తుతం అఫ్గాన్ వాసులకు తక్కణ మానవతా సహాయంతోపాటు, ఆహారం, నివాసం, వైద్యం అత్యవసరమని ఇస్లామాబాద్ పత్రికా సమావేశంలో నొక్కి చెప్పారు. తాలిబిన్ల పరిపాలన విధానం, వారు విధించిన ఆంక్షాల కారణంగా మానవతా సాయం రాజకీయాలకు లోబడి ఉండకూడదంటూ సూచించారు. ప్రస్తుతం అక్కడ డబ్బు కొరత కారణంగా ప్రజా సేవలకు ఆస్కారమే ఉండదన్నారు. దీంతో అక్కడ మానవతా సంక్షోభం ఏర్పడి భయానకంగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రస్తుతం 18 మిలియన్ల మంది అఫ్గాన్ ప్రజలకు తక్షణ సాయం అవసరమని పేర్కొన్నారు. చదవండి: స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో? -
"ఇది మా తప్పిదమే": యూఎస్
వాషిగ్టంన్: కాబూల్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని జరిపిన డ్రోన్ దాడులు గురించి ప్రస్తావిస్తూ, ఇది మా ఇంటెలిజెన్సీ వర్గాల తప్పిదమే అని యూఎస్ జనరల్ అత్యున్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. గత నెలలో యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ నుంచి వైదొలగే సమయంలో జరిపిన డ్రోన్ దాడిలో చిన్న పిల్లలతో సహా 10 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ దాడిని అర్థం లేని దారుణమైన చర్యగా కమాండర్ జనరల్ కెనత్ మెకెంజీ అభివర్ణించారు. ఇది ఒక విషాదకరమైన దాడిగా పేర్కొన్నారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు యూఎస్ రకణ శాఖ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని అన్నారు. తెల్లని టయోట కారు... ఈ సందర్భంగా మెకెంజీ మాట్లాడుతూ..." ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆగస్టు 29న కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నట్లు యూఎస్ ఇంటెలిజెన్సీ గుర్తించింది. ఈ క్రమంలో ఆ ఐఎస్ఐ ఉగ్రవాద బృందం తెల్లని టయోట కారుని వాడుతున్నట్లు తెలిసి లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాం. కానీ విషాదమేమిటంటే ఆ దాడిలో చనిపోయిన వాళ్లెవ్వరికీ ఐఎస్ఐఎస్తో సంబంధం లేదు" అని అన్నారు. ఆగస్టు 26న తాలిబన్లు చేసిన ఆత్మహుతి బాంబు దాడిలో యూఎస్ సర్వీస్ సభ్యులతో సహా సుమారు 13 మంది చనిపోయిన సంగతిని గుర్తు చేశారు. ఈ మేరకు తమని తాము రక్షించుకునే ప్రయత్నంలోనే ఈ దాడులను నిర్వహించామంటూ. .కెనెత్ మెకెంజీ తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
తాలిబన్ల తలపట్లు
ఇల్లు అలకగానే పండుగ కాదు, ముందుంది మొసళ్ల పండుగ... ఇలాంటి సామెతలన్నీ తాలిబన్లకు వర్తించేలా పరిస్థితులు మారుతున్నాయి. అఫ్గాన్‌ను స్వా«దీనం చేసుకున్న ఆనందం ఆవిరవడానికి తాలిబన్లకు ఎక్కువ సమయం పట్టడం లేదు. తాత్కాలిక ప్రభుత్వంలో వివిధవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నేతల మధ్య సయోధ్య కరువవడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అఫ్గాన్‌ను అమెరికా సైన్యాలు వదిలిపోవడంతో అలవోకగా స్వాదీనం చేసుకున్న తాలిబన్లు.. అది తమ ఘనవిజయంగా భావించారు. కానీ దేశానికి ఆధిపత్యం వహించే విషయంలో అగ్రనేతల మధ్య ఆరంభమైన కుమ్ములాటలు అఫ్గాన్ స్వాధీన విజయాన్ని ఆవిరి చేస్తున్నాయి. నిజానికి బయటనుంచి చూసేవారికి తాలిబన్లంతా ఒకటేనని, వారి సిద్ధాంతాల్లో తేడాలుండవని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. అన్ని పారీ్టల్లాగానే తాలిబన్లలో కూడా వర్గాలు, గ్రూపులు, అభిప్రాయభేదాలు, కుమ్ములాటలు బోలెడున్నాయని తాలిబన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు అజ్ఞాతంలో బతుకుతూ అమెరికాతో యుద్దం చేయాల్సిరావడం వల్ల ఈ వర్గాలు, భేదాభిప్రాయాలు బయటపడలేదు. కానీ ఎప్పుడైతే దేశం స్వాదీనమై పాలనా పగ్గాలు చేతికి వచ్చాయో వీరిలో విభేదాలు ముదురుతున్నాయి. ఉమ్మడి శత్రువు మొఖం చాటేయగానే తాలిబన్లలో గ్రూపు రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ మంటలు ముదిరి సోమవారం రెండువర్గాల మధ్య అధ్యక్ష భవనంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో తాలిబన్ అగ్రనేత, సహవ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ మరణించాడని పుకార్లు షికారు చేశాయి. కానీ తాను బతికే ఉన్నానని బరాదర్ ఒక ఆడియో రిలీజ్ చేశాడు. అయినా సరే తన పరిస్థితిపై అయోమయం నెలకొంది. (చదవండి: ప్రభుత్వ ఏర్పాటుతో వేర్పాటు బీజాలు అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందనగానే బరాదర్ నాయకుడిగా ఉంటారని ఎక్కువమంది భావించారు. అమెరికాతో చర్చలు జరిపి, వారి సేనలు వెనక్కుమరలిపోయేలా చేయడంలో బరాదర్ కీలకపాత్ర పోషించాడు. దీనికితోడు అతను ముల్లాఒమర్కు సన్నిహితుడు. ఖతార్‌తో తనకు సత్సంబంధాలున్నాయి. అందుకే సహజంగా బరాదరే ప్రధాని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దీంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయని అఫ్గాన్ పరిణామాల విశ్లేషకుడు నైమతుల్లా ఇబ్రహిమి అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వంలో కాందహార్‌కు చెందిన పాతతరం తాలిబన్లతో పాటు అల్‌కాయిదా, పాక్ ఐఎస్ఐతో సత్సంబంధాలున్న హక్కానీలకు పెద్దపీట దక్కింది. ఇరాన్ అండ ఉన్న పశ్చిమ తాలిబన్ గ్రూపునకు అసలు ప్రాధాన్యమే దక్కలేదు. గతంలో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కాందహార్ గ్రూపుదే ప్రభుత్వంలో ఆధిపత్యం ఉండేది. కానీ తాజా ప్రభుత్వంలో హక్కానీలకు ప్రాధాన్యత పెరిగింది. ఐఎస్ఐ అండదండలే హక్కానీల బలం పెరిగేందుకు కారణమయ్యాయని నైమతుల్లా చెప్పారు. హక్కానీల నేత సిరాజుద్దీన్ తలపై అమెరికా కోటి డాలర్ల బహుమతి ప్రకటించింది. కానీ ప్రస్తుతం సిరాజుద్దీన్ అఫ్గాన్ ప్రభుత్వంలో కీలకమంత్రి అయ్యారు. ఇది పాశ్చాత్య దేశాలకు మింగుడుపడని అంశం. (చదవండి: తాలిబన్ ముప్పు.. పాక్ చేరిన అఫ్ఘాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు) ఉమ్మడి ప్రభుత్వమే శరణ్యం? హక్కానీల ప్రాధాన్యత పెరగడం వల్లనే అఫ్గాన్ ప్రభుత్వాన్ని యూఎస్, మిత్రపక్షాలు గుర్తించడంలో జాప్యం చేయడం, అమెరికాలోని అఫ్గాన్ బ్యాంకు నిధులు విడుదల చేయకుండా తొక్కిపట్టడం చేస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే దీన్ని బరాదర్ వైఫల్యంగా హక్కానీలు ఎత్తిచూపుతున్నారు. అయితే ప్రాధాన్యం లేని పోస్టు ఇచ్చినందుకు ఈ విషయంలో తామెందుకు జోక్యం చేసుకోవాలని బరాదర్ వర్గం భావిస్తోంది. పాశ్చాత్య ప్రపంచం గుర్తించకపోతే అఫ్గాన్‌కు ఆర్థిక సాయం అందదు. దీంతో దేశం తీవ్ర సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉంది. దీన్ని పట్టించుకోకుండా తాలిబన్– హక్కానీలు సిగపట్లు పడుతున్నారు. ఇది కేవలం అఫ్గాన్‌కే కాకుండా పొరుగుదేశాలకు కూడా ప్రమాదం తెస్తుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అఫ్గాన్‌లోని పలు వర్గాలను ప్రభుత్వంలో చేర్చుకోకపోవడంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందని, దీనివల్ల తిరిగి దేశంలో అంతర్యుద్ధం ఆరంభం కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్యుద్ధమే ఆరంభమైతే మరలా రష్యా, ఇరాన్, ఇతర దేశాలు తమ అనుకూల గ్రూపులకు సాయం చేయడం మొదలుపెడతాయి. దీంతో మరోమారు అఫ్గాన్‌లో హింసాత్మక పోరు పెచ్చరిల్లుతుందని నైమతుల్లా అభిప్రాయపడ్డారు. మరి ఇప్పటికైనా తాలిబన్లు, హక్కానీలు భేదాభిప్రాయాలు మరిచి ఇతర గ్రూపులకు కూడా ప్రభుత్వంలో స్థానం కల్పిస్తాయా? లేక గ్రూపు రాజకీయాలను పెంచుతాయా? అని అన్ని దేశాలు ఆందోళనతో ఎదురు చూస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి -
నేను చనిపోలేదు.. బతికే ఉన్నా: తాలిబన్ సహ వ్యవస్థాపకుడు
కాబూల్: తాలిబన్ల మధ్య అంతర్గతంగా జరిగిన ఘర్షణలో తాను చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతున్న ప్రచారాన్ని తాలిబన్ ముఠా సహ వ్యవస్థాపకుడు, అఫ్గానిస్తాన్ ఉప ప్రధానమంత్రి అబ్దుల్ ఘనీ బరాదర్ ఖండించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. తాలిబన్ల అధికారిక వెబ్సైట్లలో ఈ ఆడియోను పోస్టు చేశారు. తనకు ఏమీ కాలేదని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు వార్తలు ప్రసారం చేయడం దారుణమని విమర్శించారు. పుకార్లు సృష్టించడం మానుకోవా లని హితవు పలికారు. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత అధికారాన్ని పంచుకొనే విషయంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో తాలిబన్ల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిందని, కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటన లో బరాదర్ హతమయ్యాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: మరణించాడని భావిస్తే.. మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.. -
అఫ్గన్‌కు 60 కోట్ల డాలర్ల సాయం చేయండి: ఐరాస
జెనీవా: తాలిబన్ల వశమైన అఫ్గనిస్తాన్‌ను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించా ల్సిందిగా సోమవారం ప్రపంచ దేశాలను ఐక్యరాజ్య సమితి(ఐరాస) కోరింది. ఈ ఏడాది డిసెంబర్ వరకు అఫ్గన్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 60.6 కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,463 కోట్లు) సాయం చేసి ప్రపంచ దేశాలు తమ మానవతా దృక్పథాన్ని మరోసారి చాటాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హితవు పలికారు. సోమవారం జెనీవాలో జరిగిన విరాళాల సేక రణ సదస్సులో ఆయన మాట్లాడారు. అఫ్గన్ పేదలకు సాయపడాలన్నారు. ఐక్యరాజ్య సమితి అత్యవసర విభాగం తరఫున 2 కోట్ల డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు సదస్సులో గుటెర్రస్ ప్రకటించారు. -
Afghanistan: అఫ్గాన్‌లో మహిళలు చదువుకోవచ్చు..కానీ
సాక్షి, కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో మహిళలు పోస్టు గ్రాడ్యుయేట్ వరకు చదువు కొనసాగించవచ్చునని తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. అయితే, తరగతి గదుల్లో పురుషులకు, మహిళలకు వేరుగా ఏర్పాట్లుండాలనీ, విద్యార్థినులకు ఇస్లామ్ సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరని స్పష్టం చేసింది. తాలిబన్ ప్రభుత్వంలో ఉన్నత విద్యా శాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ఆదివారం మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం అనుసరించిన విధానాలనే మళ్లీ తాము అమలు చేయాలనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. బాలబాలికలు కలిసి చదువు కొనసాగించేందు(కో ఎడ్యుకేషన్)కు అనుమతించబోమన్నారు. బాలికలు హిజాబ్ ధరించడం తప్పనిసరని తెలిపారు. వ్సటీల్లో బోధించే సబ్జెక్టులపై సమీక్ష చేపడతామన్నారు. చదవండి: అఫ్గాన్: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు -
అఫ్గన్ నిజమైన సంస్కృతి ఇదే.. ‘నా దుస్తుల జోలికి రావొద్దు’
రబ్బరు బంతిని ఎంత బలంగా నేలకు కొడితే అంతే వేగంగా పైకి లేస్తుంది... జీవం లేని వస్తువే అంతటి ప్రతిఘటన చూపిస్తే.. మరి ప్రాణమున్న మనుషుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అణచివేత ధోరణికి పోరాటాలతో చరమగీతం పాడి హక్కులు సాధించుకున్న అనేకానేక స్ఫూర్తిదాయక కథలను చరిత్ర తన కడుపులో దాచుకున్నది. ఆధిపత్య భావజాలానికి ఎదురొడ్డి హక్కుల సాధనకు కృషి చేసిన మహనీయుల గాథలను ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉంటుంది. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి మహిళలు ఇప్పుడు మరోసారి తమ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వస్త్రధారణ, విద్య, ఉద్యోగం వంటి అంశాల్లో తాలిబన్లు అనుసరిస్తున్న వైఖరికి గట్టిగానే సమాధానం చెబుతున్నారు. నిజానికి ఆగష్టు 15న రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత తాలిబన్ల గత అరాచక పాలనను గుర్తుచేసుకుని దేశ ప్రజలు.. ముఖ్యంగా మహిళలు ఎంతగా బెంబేలెత్తిపోయారో ప్రపంచం మొత్తం చూసింది. తాము మరోసారి నరకంలోకి వెళ్లడం ఖాయమని వారు చేసిన వ్యాఖ్యలు వారి దుస్థితికి అద్దం పట్టాయి. అలాంటి సమయంలో తమ తొట్టతొలి మీడియా సమావేశంలో మహిళలపై ఎలాంటి వివక్ష చూపబోమంటూ తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే, అది కేవలం మాటల వరకే పరిమితమని తేలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కో ఎడ్యుకేషన్ రద్దు చేస్తూ ఫత్వా జారీ చేయడం, తమ ప్రభుత్వంలో మహిళలకు ఉన్నత పదవులు(మంత్రి) ఉండవని చెప్పడం స్త్రీల పట్ల వారు అనుసరించబోయే విధానాలను చెప్పకనేచెప్పాయి. ముఖ్యంగా పురుషుల తోడు లేకుండా ఆడవాళ్లు బయటకు రావద్దని చెప్పడం, వస్త్రధారణ పట్ల ఆంక్షలు విధించడం షరా మామూలే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల కట్టుబాట్లకు తలొంచేది లేదని, తమ స్వేచ్చకు భంగం కలిగితే ఊరుకునేది లేదని గట్టిగానే గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే పలు నిరసనలు చేపట్టిన స్త్రీలు.. సోషల్ మీడియా వేదికగా మరో ఉద్యమానికి తెరతీశారు. అఫ్గన్ సంస్కృతి ఇదే! సుదీర్ఘ కాలంగా అంతర్గత విభేదాలు, విదేశీ జోక్యంతో అతలాకుతలమైన అఫ్గనిస్తాన్ 20వ శతాబ్దం మధ్యలో ఆధునీకరణ వైపు అడుగులు వేసింది. ముఖ్యంగా 1950, 1960లలో పెద్దఎత్తున మార్పులతో మరింత ఉదార, పాశ్చాత్య జీవనశైలి విధానాలు అవలంబించే దిశగా పాలకులు చర్యలు చేపట్టారు. ఆ సమయంలో మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించే వీలు కలిగింది. కానీ, 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల పాలనలో ఇవన్నీ తలకిందులయ్యాయి. షరియా చట్ట ప్రకారం పాలించిన తాలిబన్లు.. బుర్ఖా విషయంలో కఠిన నిబంధనలు అమలు చేశారు. ఇప్పుడు కూడా అదే వైఖరిని అవలంబిస్తే సహించేది లేదంటున్నారు అక్కడి మహిళలు. ‘#Afghanistanculture పేరిట ట్విటర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. #DoNotTouchMyClothes అంటూ తమ వస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు అఫ్గన్ సంప్రదాయ దుస్తులు ధరించిన తమ ఫొటోలను షేర్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీరికి మద్దతుగా నిలుస్తున్నారు. హక్కుల పోరాటానికై మీరు చేసే ఉద్యమంలో మావంతు సాయం చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. -వెబ్‌డెస్క్ This is another traditional Afghan dress from a different part of Afghanistan. I was a teenager in this pic. We will not let our culture to be appropriated by those who want to erase us. #DoNotTouchMyClothes #AfghanistanCulture pic.twitter.com/dMwnBS7vuT — Dr. Bahar Jalali (@RoxanaBahar1) September 12, 2021 Afghan women, cultural campaign, traditional dress.#AfghanistanCulture 🇦🇫 pic.twitter.com/Qey9mdzVDT — Mustafa Kamal Kakar (@MustafaKamalMKK) September 12, 2021 Black attire, Burqa, and Niqab are not and never been part of the Afghan Culture. Here's a few different types of traditional Afghan attire for women. It's colourful, modest, practical, and more importantly beautiful.#AfghanistanCulture #AfghanWomen #TalibanTerror https://t.co/OYs89B24LC pic.twitter.com/s8hq0CWaij — Zahra Sultani | زارا سلطانی (@zahrasultani_) September 12, 2021 చదవండి: ప్రఖ్యాత గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో హైదరాబాదీ! -
ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ !
న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించిన నేపథ్యంలో సరిహద్దు భద్రతా అంశంలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో మరింత కట్టుదిట్టమైన భద్రత చర్యలతో పాటు సాయుధ బలగాలకు సరికొత్త వ్యూహాత్మక శిక్షణ ఇవ్వాలని కేంద్ర భద్రత సంస్థ సూచించింది. అఫ్గన్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడకుండా మోహరించి ఉన్న దళాలను సరికొత్త వ్యూహంతో ఎదుర్కొనేలా సంసిద్ధం చేయాలని నొక్కి చెప్పింది. అఫ్గానిస్తాన్‌లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని చూస్తే అడుగడుగునా పాకిస్తాన్ ముద్ర స్పష్టంగా కనిపించడమే కాక భారత్‌పై దాడులు చేసిన హక్కానీలకు కీలక పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సరిహద్దు ప్రాంతాలైన పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్, లోతట్టు ప్రాంతాలలో భద్రతా దళాలను మరింతగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోమని కోరింది. భద్రత దళాలైన బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, సీఆర్పీఎఫ్ దళాలు అత్యంత ధైర్య సాహసాలతో ఉగ్రవాదులను తిప్పికొట్టగల సామర్థ్యం కలవారని ఆర్మీ ఉన్నతాధికారి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
తాలిబన్ విజయంతో ఉగ్రమూకలకు ధైర్యం!
న్యూయార్క్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూనే, మరోపక్క తాలిబన్లతో ఐరాస చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్ కీలక పాత్ర పోషించాలని ఐరాస ఆశిస్తోందన్నారు. ‘‘ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్లు విజయం సాధించడం ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు మనోధైర్యాన్నిస్తున్నది నిజం. అయితే ఇతర ఉగ్రగ్రూపులు తాలిబన్లతో పోలిస్తే భిన్నమైనవి, వీరి మధ్య పోలిక కనిపించదు.’’ అని ఆంటోనియో అభిప్రాయపడ్డారు. పలు టెర్రరిస్టు గ్రూపులు తాలిబన్లకు అభినందనలు పంపడమే కాకుండా, తమ సామర్ధ్యంపై బలమైన నమ్మకాన్ని పెంచుకుంటున్నాయన్నారు. ఆఫ్రికాలోని సహేల్ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ప్రస్తావించారు. చాలా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితులు లేవన్నారు. దీనివల్ల టెర్రరిస్టులు క్రమంగా పట్టు సాధిస్తున్నారు, వీరికి తాజా పరిణామాలు ధైర్యాన్నిస్తున్నాయని చెప్పారు. ఐకమత్యమే అవసరం ఒక టెర్రరిస్టు గ్రూపు.. అది ఎంత చిన్నదైనా సరే, ఆత్మాహుతికి సిద్ధపడి ఒక దేశంపై దాడికి దిగితే, సదరు దేశ సైన్యాలు సైతం ఆ గ్రూపును ఎదుర్కోలేకపోతాయని ఆంటోనియో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణగా అఫ్గాన్ ఆర్మీ 7రోజుల్లో మాయమవడాన్ని ప్రస్తావించారు. టెర్రరిజంపై యావత్ ప్రపంచం ఏకతాటిపై నిలబడితే సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు. అఫ్గాన్‌ను ఉగ్రవాదులకు నిలయంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. అఫ్గాన్ తాలిబన్లతో ఐరాస నిరంతరం చర్చిస్తోందని, ఈ స్థితిలో చర్చలే ఉత్తమమార్గమని ఆయన చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వం సమ్మిళితంగా ఉంటుందని ఆశించామని చెప్పారు. తాలిబన్లు అన్ని వర్గాలను పాలనలో మిళితం చేయాలని, మానవ హక్కులను కాపాడాలని, మహిళలు, బాలికల హక్కులపై నెలకొన్న ఆందోళనలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గానిస్థాన్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. -
ఆసీస్ బెదిరింపులకు తలొగ్గిన తాలిబన్లు.. మహిళల క్రికెట్‌కు గ్రీన్ సిగ్నల్..?
కాబుల్: అఫ్గాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు తాలిబన్లు విముఖత చూపితే పురుషుల జట్టుతో నవంబర్‌లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో అఫ్గాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అఫ్గాన్ మహిళలు క్రికెట్ ఆడేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ అజీజుల్లా ఫజ్లీ వెల్లడించారు. ఈ ప్రక్రియ ఎలా జరగుతుందనేది త్వరలోనే తెలియజేస్తామని, అఫ్గానీ మహిళలు కచ్చితంగా శుభవార్తను వింటారని ఆయన తెలిపారు. అఫ్గాన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనరని, అఫ్గానీ మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ ప్రకటించిన కొద్దిరోజులకే ఫజ్లీ ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్ ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గత గురువారం తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఈ విషయమై ఆసీస్ టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ కూడా ఘాటుగానే స్పందించాడు. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేస్తే.. త్వరలో జరుగబోయే పురుషుల టీ20 ప్రపంచకప్ నుంచి ఆ దేశాన్ని తప్పించాలని ఐసీసీని డిమాండ్ చేశాడు. అయితే తాలిబన్ల ప్రకటన ఆధారంగా పురుషుల జట్టును శిక్షించవద్దని అఫ్గాన్ క్రికెట్ బోర్డు ఐసీసీని వేడ్కొంది. కాగా, అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. ఈ క్రమంలోనే మహిళా క్రికెట్‌ను నిషేధించారు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో మేము పాల్గొనం।
న్యూఢిల్లీ: అఫ్గనిస్తాన్ తాలిబన్లు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని రష్యా అధికార ప్రతినిధి క్రెమ్లిన్ స్పష్టం చేశారు. అంతకుముందు తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు రష్యా సహకరిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో క్రెమ్లిన్ ఖండించారు. తాము తాలిబన్ల ప్రభుత్వ ప్రారంభోత్సవంలో పాల్గొనడం లేదని తేల్చి చెప్పారు. (చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్‌కు ఇంజెక్షన్) అఫ్గనిస్తాన్‌ని ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాలిబన్లు కొత్త ప్రభుత్వం ప్రారంభోత్సవానికి చైనా, పాకిస్తాన్, రష్యాతో సహా అనేక దేశాలను ఆహానించినట్లు సమాచారం. 'తాలిబన్లు కొత్త ప్రభుత్వం ఏర్పాటును గుర్తిచాలన్న ఉత్సుకతతో ఉంది. కానీ దశాబ్దాలుగా యుద్ధంతో అట్టుడుకుపోతున్న అఫ్గన్ ప్రజలు తమ దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందని వారు భావిస్తున్నారా ? ' అని భారతదేశంలోని రష్యన్ రాయబారి నికోలాయ్ కుడాషెవ్ సోమవారం సంశయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 11వ తేదీన తాలిబన్ల ప్రభుత్వం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగనుంది.(చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్!) -
అధికార పీఠంపై తాలిబన్లు
అమెరికాపై ఉగ్రదాడి జరిగి మరో 4 రోజుల్లో రెండు దశాబ్దాలు పూర్తవుతుందనగా మంగళవారం తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే రోజు కాబూల్‌లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నవారిలో ఒక మహిళపై తుపాకి గురిపెట్టిన తాలిబన్ దళ సభ్యుడి చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రముఖంగా వైరల్ అయింది. తాలిబన్ల ఏలుబడి తీరుతెన్నులు ఎలా ఉంటాయో చెప్పే ప్రతీకాత్మక చిత్రం ఇది. ఆ మరుసటి రోజే మహిళల ధర్నాను చిత్రీకరించిన టెలి విజన్ పాత్రికేయులిద్దరిని ఒళ్లంతా నుజ్జు చేసిన చిత్రాలు బయటికొచ్చాయి. తాలిబన్లతో రహ స్యంగా రెండేళ్లక్రితం చర్చలు ప్రారంభం కావడానికి చాలా ముందు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారో ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. తాలిబన్లలో మంచివారు, చెడ్డవారు ఉన్నారని, మంచివారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని ఆయన అప్పట్లో ప్రకటించారు. తాజాగా కాబూల్‌లో కొలువుదీరిన ప్రభుత్వం అన్ని మంచి చెడ్డల్నీ గాలి కొదిలినట్టు కేబినెట్ కూర్పు చూస్తే అర్థమవుతుంది. 90వ దశకంలో అఫ్గాన్ అధికారాన్ని చేజిక్కిం చుకున్న తర్వాత ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మాదిరే ఇప్పుడు కీలకమైన పదవులన్నీ ప్రధాన తెగ అయిన పష్తూన్లకు దక్కాయి. 33 మంది కేబినెట్లో ఒక ఉప ప్రధాని పదవి ఉజ్బెక్ తెగకు చెందిన వ్యక్తికి, సైనిక దళాల ప్రధానాధికారి పదవి తజిక్ తెగ నేతకు అప్పగించారు. తక్కినవారంతా పష్తూన్లే. అమెరికా కనుసన్నల్లో మొన్నటివరకూ నడిచిన సర్కారులో కీలక పదవులు అనుభవించిన హజారా తెగకు ఈసారి మొండిచేయి చూపారు. జనాభాలో అయిదోవంతు కంటే అధికంగా ఉన్న హజారాలు షియాలు. వారికి కూడా పదవులు కట్టబెట్టాలని ఇరాన్ ఎంతగా కోరినా సున్నీలైన తాలి బన్లు బేఖాతరు చేశారు. దేశంలో హజారాలు అందరికన్నా బాగా చదువుకున్నవారు. రాజకీ యంగా చురుగ్గా పనిచేస్తున్నవారు. తాలిబన్ల పాలనకు ఇకపై వీరినుంచి సహజంగానే సవాళ్లు ఎదురవుతాయి. మహిళలకు ప్రభుత్వంలో చోటేలేదు. ఈ సంగతలా ఉంచి అమెరికా, నాటో దళా లపై జరిగిన పలు ఉగ్ర దాడులకు కారకుడని అమెరికా బలంగా విశ్వసిస్తున్న సిరాజుద్దీన్ హక్కానీ దేశ ఆంతరంగిక భద్రతామంత్రి అయ్యాడు. ఇరవైయ్యేళ్లుగా అతన్ని అరెస్టు చేయడానికి అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడే సిరాజుద్దీన్ ఆచూకీ చెప్పినవారికి భారీ నజరానా ప్రకటించింది. ఆయన్ను ఆంతరంగిక మంత్రిని చేయడం ద్వారా... ఎన్నో అవమానాల మధ్య అఫ్గాన్ నుంచి నిష్క్రమించి, పరాభవంతో కుంగిపోయివున్న అమెరికాను మరింతగా దెబ్బతీసినట్టయింది. తాలిబన్లతో చర్చిస్తున్న క్రమంనుంచి వారు అల్ కాయిదాతో సంబంధాలు వదులుకుంటామని హామీ ఇచ్చారని అమెరికా చెబుతూ వచ్చింది. కానీ కుదరబోయే శాంతి ఒప్పందంపై తాలిబన్లు ఎప్పటికప్పుడు అల్ కాయిదాతో సంప్రదింపులు జరు పుతూనే వచ్చారు. పర్యవసానంగానే ఇప్పుడు ఆ సంస్థకు సన్నిహితుడైన సిరాజుద్దీన్‌కు కీలక పదవి దక్కింది. అమెరికా ప్రతినిధుల సభలో రిపబ్లికన్ పార్టీ కాకస్‌కు నేతృత్వం వహిస్తున్న కమిటీ అఫ్గాన్ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాదుల చేత, ఉగ్రవాదుల కోసం ఏర్పడిన ఉగ్రవాదుల ప్రభుత్వం’గా అభివర్ణిం చింది. అయితే ఈ దుస్థితికి ప్రధానంగా తామే కారకు లమని ఆ కమిటీ గ్రహించినట్టు లేదు. ఏ సాకు చెప్పుకున్నా అఫ్గాన్ దురాక్రమణ నిర్ణయం అత్యంత దారుణమైన, అనాగరికమైన చర్య అని అమెరికా గుర్తించాల్సివుంది. ఎలాంటి పాలన అవసరమో, ఎవరు అధికార పీఠంపై ఉండాలో నిర్ణయించుకోవాల్సింది అఫ్గాన్ పౌరులే తప్ప తాము కాదన్న ఇంగితం దానికి లేకపోయింది. తాలి బన్ మత ఛాందసవాదం ఆ దేశానికే కాక, మొత్తంగా మధ్య ఆసియాకు ముప్పు కలిగించేదే. కానీ దాని పుట్టుకకూ, విస్తరణకూ, అది బలంగా వేళ్లూనుకోవడానికీ తామే కారకులమని ఇప్పటికీ అమె రికా అంగీకరించడంలేదు. దురాక్రమించినప్పటి బాధ్యతారాహిత్యాన్నే నిష్క్రమణలోనూ ప్రదర్శిం చింది. మిత్ర కూటమి నాటోకు, అఫ్గాన్ సర్కారుకు సైతం తెలియకుండా తాలిబన్లతో అంగీకారా నికొచ్చింది. ఐక్యరాజ్యసమితి మొదలుకొని ఎన్నో ప్రపంచ వేదికలుండగా, అన్ని దేశాలనూ భాగ స్తులను చేయాల్సివుండగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. మతం ఏదైనా వ్యక్తిగత విశ్వాసాల పరిధిని దాటి పబ్లిక్‌లోకి వస్తే... అధికారంతో అంటకాగితే పర్యవసానాలెలా ఉంటాయో అన్ని దేశాల్లోనూ దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. మన పొరు గున పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, ఇంకా పశ్చిమాసియా, ఆఫ్రికా ఖండ దేశాలు మత ఛాందస వాదం ఉగ్రరూపం చూశాయి. చూస్తున్నాయి. పశు మాంసం తింటున్నారన్న సాకుతో తోటి మనుషు లను కొట్టి చంపిన ఉదంతాలు మన దేశంలో అనేకం జరిగాయి. రిపబ్లికన్ ఏలుబడి ఉన్న అమెరికా లోని టెక్సాస్ రాష్ట్రంలో తాజాగా అబార్షన్లను నిషేధించి, మహిళల హక్కులను కాలరాస్తున్న వైనం వెనుక క్రైస్తవ మత ఛాందసం దాగుంది. వాటి సంగతలావుంచి అఫ్గాన్‌లో తాలిబన్ల ఏలుబడితో అరాచకానికి తెరపడినట్టయిందని చైనా పరవశిస్తోంది. పాకిస్తాన్ సరేసరి. అది తాలిబన్ ప్రభు త్వంలో ఎవరుండాలో, ఉండకూడదో నిర్దేశిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రెండు దేశాల ప్రభా వాన్నీ తగ్గించి తాలిబన్లనుంచి ముప్పు లేకుండా చూసుకోవటం మన దేశం ముందున్న ప్రధాన సవాలు. త్వరలో తజకిస్తాన్‌లో జరగబోయే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ)లో ఈ విషయాన్ని లేవనెత్తడంతోపాటు ఇతర అంతర్జాతీయ వేదికలపైనా గట్టిగా ఒత్తిడి తీసుకురావాలి. -
అఫ్గాన్: మహిళలు జన్మనివ్వడానికే.. మంత్రులుగా పనికి రారు
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానమంత్రిగా ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ పరిపాలన మొదలైంది. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటుచేశారు. అయితే ఆ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తాలిబన్లకు వ్యతిరేకంగా బుధవారం మహిళలు నిరసన చేపట్టారు. మంత్రివర్గంలో మహిళ అంశంతో పాటు నిన్న జరిగిన మహిళల ప్రదర్శనపై తాలిబన్ల ప్రతినిధి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మహిళలపై అతడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: తాలిబన్ల అరాచకం.. జర్నలిస్టులకు చిత్రహింసలు ‘మంత్రులుగా మహిళలు పనికి రారు.. వాళ్లు కేవలం జన్మనివ్వడానికే పరిమితం’ అని పేర్కొన్నాడు. తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హషిమి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘మహిళలు మంత్రులు కాలేరు. ఆమె మెడపై ఏమైనా వస్తువు పెడితే వారు మోయలేరు. మంత్రివర్గంలో మంత్రులు తప్పనిసరి కాదు’ అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నిన్న మహిళల నిరసన ప్రదర్శనపై అతడు స్పందిస్తూ ‘ఆ నలుగురు మహిళల నిరసన అఫ్గానిస్తాన్ మొత్తం మహిళలు ప్రాతినిథ్యం వహించినట్టుగా భావించొద్దు’. చదవండి: పెళ్లి చేసుకోవాల్సిన ఈ వధూవరులు ఏం చేస్తున్నారో తెలుసా? ‘మహిళలకు స్వేచ్ఛనిస్తే ఏం జరుగుతుందో మీకో ఉదాహరణ చెబుతా. రెండు దశాబ్దాలుగా కీలుబొమ్మ పరిపాలన కొనసాగలేదా’ అని ఎదురు ప్రశ్నించాడు. వ్యభిచారం బాగా పెరిగిపోయింది. కార్యాలయాల్లోనే ఏకంగా ఆ వ్యవహారం కొనసాగుతోంది. మహిళలు జనాభాలో సగభాగమని యాంకర్ తెలపగా వారు సగభాగమని మేం భావించాం’ అని జెక్రుల్లా స్పష్టం చేశాడు. మహిళలు అఫ్గానిస్తాన్ ప్రజలను జన్మనివ్వడానికే పరిమితం కావాలి’ అని పేర్కొన్నాడు. A Taliban spokesman on @TOLOnews: "A woman can't be a minister, it is like you put something on her neck that she can't carry. It is not necessary for a woman to be in the cabinet, they should give birth & women protesters can't represent all women in AFG." Video with subtitles👇 pic.twitter.com/CFe4MokOk0 — Natiq Malikzada (@natiqmalikzada) September 9, 2021 -
అదే జరిగితే చారిత్రక సిరీస్ రద్దు.. తాలిబన్లకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్
కాబుల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. కఠినమైన షరియా చట్టాల పేరుతో తాలిబన్లు మహిళల హక్కులను కాలరాస్తున్నారు. తాజాగా అఫ్గాన్ మహిళలు.. క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనకూడదని తాలిబన్ ప్రభుత్వం ఫత్వా జారీ చేసింది. క్రీడల్లో పాల్గొన్నప్పుడు మహిళల శరీర భాగాలు బహిర్గతం అవుతాయన్న కారణంగా క్రీడలపై నిషేధం విధిస్తున్నట్లు వారు బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మహిళల క్రికెట్‌ను రద్దు చేయరాదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) గురువారం తాలిబన్ ప్రభుత్వాన్ని కోరింది. తాలిబన్లు మహిళల క్రికెట్‌ను నిర్వీర్యం చేయాలనుకుంటే.. తమ జట్టుతో నవంబర్ 27న జరగాల్సి ఉన్న చారిత్రక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసుకుంటామని బెదిరింపులకు దిగింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ అభివృద్ది చెందాలన్నదే తమ ఉద్దేశమని, మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉంటే, మహిళల క్రికెట్‌పై అంక్షలు విధించిన తాలిబన్ ప్రభుత్వం పురుషుల క్రికెట్‌కు సంపూర్ణ మద్దతు తేలియజేయడం విశేషం. పురుషుల క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీనిచ్చిన తాలిబన్లు.. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని అఫ్గాన్ క్రికెట్ బోర్డుకు భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని స్పష్టం చేసిన తాలిబన్లు మహిళల క్రికెట్ విషయంలో మాత్రం తమ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చదవండి: ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు.. -
ఉగ్రవాదులే పాలకులు..!
కాబూల్/పెషావర్/ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో ఏకంగా 14 మంది ఉగ్రవాదులు ఉన్నారు. ఐక్యరాజ్యసవిుతికి చెందిన భద్రతా మండలి వారిని గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. ఈ జాబితాలో నూతన ప్రధానమంత్రి ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్‌తోపాటు ఇద్దరు ఉపప్రధానుల పేర్లు సైతం ఉండడం గమనార్హం. అఫ్గానిస్తాన్‌లోని కొత్త మంత్రివర్గంలో కరడుగట్టిన ఉగ్రవాదులు స్థానం దక్కించుకోవడం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సిరాజుదీ్దన్ హక్కానీ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రపడ్డారు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది. సిరాజుదీ్దన్ హక్కానీ మామ ఖలీల్ హక్కానీ కాందిశీకుల సంక్షేమ మంత్రిగా నియమితులయ్యారు. రక్షణ శాఖ మంత్రి ముల్లా యాకూబ్, విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాఖీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ తదితరులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెందిన శాంక్షన్స్ కమిటీ(తాలిబన్ శాంక్షన్స్ కమిటీ) గతంలోనే టెర్రరిజం బ్లాక్‌లిస్టులో చేర్చింది. పాకిస్తాన్ ఆర్మీలో కీలక మార్పులు పాక్ ప్రభుత్వం ఆ దేశ ఆర్మీలో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం నియంత్రణ రేఖ వెంట భద్రతా పరమైన విభాగాలను పర్యవేక్షిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ అజర్ అబ్బాస్‌ను చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా నియమించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తర్వాత రెండో ప్రాధాన్యం ఉన్న పోస్టు చీఫ్ జనరల్ స్టాఫ్ కావడం గమనార్హం. జనరల్ అబ్బాస్ బలూచ్ రెజిమెంట్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటి వరకూ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ షషీర్ శంషాద్ మీర్జాను రావల్పిండిలోని 10 కార్ప్స్ కమాండర్‌గా పంపించారు. ఇంకోవైపు ముల్తాన్ కార్ప్స్ కమాండర్‌గా లెఫ్టినెంట్ జనరల్ ముహమ్మద్ ఛిరాగ్ హైదర్‌ను నియమించారు. తాలిబన్లకు చైనా ఆర్థిక సాయం అఫ్గానిస్తాన్‌కు 3.1 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని చైనా ప్రకటించింది. అఫ్గాన్‌లో తాలిబన్లు ఏర్పరిచిన తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది. అశాంతిని పోగొట్టి, శాంతిని నెలకొల్పే చర్యగా ప్రభుత్వ ఏర్పాటును అభివర్ణించింది. అఫ్గాన్‌కు ఆహార ధాన్యాలు, టీకాలు, మందులు ఇస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ చెప్పినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఇరాన్, తజకిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి రష్యా హాజరు కాలేదు. అఫ్గానిస్తాన్ ప్రజలకు తొలి విడతలో 30 లక్షల టీకా డోసులు పంపుతామని వాంగ్ భరోసా ఇచ్చారు. చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెంబిన్ మాట్లాడుతూ అఫ్గాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొన్నారు. చైనా ఎప్పుడూ అఫ్గానిస్తాన్ సార్వ¿ౌమత్వాన్ని, స్వాతంత్య్రాన్ని గౌరవిస్తుందని చెప్పారు. పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు విలువ లేదు తాము పూర్తిగా మారిపోయామని, అఫ్గాన్ ప్రజలకు సుపరిపాలన అందిస్తామని నమ్మబలుకుతున్న తాలిబన్లు మరోవైపు తమ అసలు రూపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పవిత్రమైన షరియా చట్టాల ప్రకా రమే అఫ్గానిస్తాన్ పరిపాలన, ప్రజా జీవనాన్ని నిర్దేశిస్తామని తాలిబన్ అగ్రనేత హైబ తుల్లా అఖుంద్జాదా స్పష్టం చేశారు. అఫ్గాన్ నూతన ఉన్నత విద్యాశాఖ మంత్రి షేక్ మోల్వీ నూరుల్లా మునీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మా రాయి. ‘‘పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలకు పెద్దగా విలు వలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న తాలిబన్లు, ముల్లాలను చూడండి. వారిలో ఎవరికీ పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలు కాదు కదా కనీసం ఎంఏ, హైసూ్కల్ డిగ్రీలు కూడా లేవు. అయినప్పటికీ వారు ఉన్నత స్థాయికి చేరుకున్నారు’’ అని మునీర్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో నికొలాయ్ పాట్రుశేవ్ భేటీ న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం భారత్‌కు చేరుకున్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి నికొలాయ్ పాట్రుశేవ్ బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తామిద్దరం కీలకమైన అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు మోదీ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. -
కొత్త కోణం: అఫ్గాన్ సింహాలు తలవంచేనా!
పంజ్‌షీర్... యావత్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు. తాలిబన్లకు సైతం చుక్కలు చూపిస్తున్న ఐదు సింహాల గడ్డ. ఆఫ్గాన్ నేలపై ఆధిపత్యాన్ని ససేమిరా సహించని పౌరుషానికి రూపం. ఆ లోయను కైవసం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించినా, చిట్టచివరి యోధుడి చిట్టచివరి రక్తపుబొట్టు నేలలో ఇంకేవరకూ తమను గెలవడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు పంజ్‌షీర్ పోరాటవీరులు. ప్రపంచం మొత్తం కరుడుగట్టిన తీవ్రవాదుల్లా భావిస్తోన్న తాలిబన్లను ఎదిరించే సత్తా వీరికెలా వచ్చింది? అంతటి ధీరత్వం, తెగింపు, పట్టుదలకు మూలాలు ఏమిటనేదే ఇప్పుడు చర్చించాల్సిన అంశం. పరిపాలన రీత్యా అఫ్గానిస్తాన్‌లోని ఒక రాష్ట్రం... పంజ్‌షీర్. అమెరికా సేనలు అఫ్గాన్‌ను వీడనున్నట్టు ప్రకటించిన తర్వాత యావత్ అఫ్గాన్నూ అవలీలగా ఆక్రమించుకుంది తాలిబన్ సాయుధ సేన. కానీ ఒకే ఒక చిన్న ప్రాంతం మాత్రం ఈ వ్యాసం రాసేనాటికి పూర్తిగా తాలిబన్ల వశం కాలేదు. అమెరికా తయారు చేసిన ఉగ్రవాదం చివరికి అమెరికానే తరిమికొట్టింది. అమెరికా చేసిన తప్పిదం వల్ల అమెరికా వీడి వెళ్ళిన అత్యాధునిక ఆయుధ సంపత్తి, యుద్ధ విమానాలు ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో ఉన్నాయి. చైనా, రష్యా, పాకిస్తాన్ అండదండలున్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ పంజ్‌షీర్‌లో అడుగు పెట్టలేక పోయారు. కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌లో చివరగా తాలిబన్లు చేసిన ప్రయత్నం–డ్రోన్ల సాయంతో బాంబుల వర్షం కురిపించడం. నిజానికి తాలిబన్ల బలం ముందు పంజ్‌షీర్ నిలబడుతుందా? అనేది ప్రశ్నార్థకమే. కానీ గత చరిత్రను తడిమితే, వారెప్పుడూ విదేశీ సైన్యానికి గానీ, స్వదేశీ సేనలకుగానీ లొంగిపోయింది లేదు. ఎంతటి ఘాతుకానికైనా తెగబడి పంజ్‌షీర్‌ని వశపర్చుకోజూసినా అది తాలిబన్ల తరంకాలేదు. దీంతో పాకిస్తాన్ సాయంతో యువ కిరణం మసూద్‌ని మట్టుబెట్టే ప్రయత్నం చేశారు. అఫ్గాన్ మాజీ ఉపా ధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఇంటిపై బాంబుల వర్షం కురిపించారు. ఇతర నేతల నివాసాలను కూడా బాంబులతో పేల్చి వేశారు. పంజ్‌షీర్ గవర్నర్ కార్యాలయంపై జెండా ఎగురవేసి, తాము గెలిచామంటూ సంబరాలు చేసుకున్నారు తాలిబన్లు. మొన్నటివరకూ అఫ్గాన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్– ‘ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా చట్టబద్ధ పాలనను గౌరవించాలి. కానీ హింసను కాదు. పాకిస్తాన్, తాలిబన్లు కలిసి అఫ్గానిస్తాన్‌ను కబళించడానికి చేస్తున్న ప్రయత్నం ఫలించదు. హింస ముందు అఫ్గాన్ ప్రజలు మోకరిల్లరు’ అంటూ సాహసోపేతమైన ప్రకటన చేశారు. అమ్రుల్లా సలేహ్ పంజ్‌షీర్ నేలపై పుట్టిన వాడు. ఆ ప్రాంతం నుంచి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. 80వ దశకంలో సోవియట్ సేనలతో, 90వ దశకంలో తాలిబన్ల పాలన కాలంలో పంజ్‌షీర్ తరఫున పోరాడిన అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్ ప్రజానాయకుడు అయిన అమ్రుల్లాకు అండగా నిల బడ్డాడు. అమ్రుల్లా వ్యూహంతో, మసూద్ నాయకత్వంలో పంజ్‌షీర్ పోరాడుతోంది. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనేది ప్రశ్నే కాదు. పంజ్‌షీర్ల వారసుడు ఒక్కడున్నా ఈ యుద్ధం ముగియదన్నది సత్యం. అఫ్గానిస్తాన్ బహు జాతుల సమ్మేళనం. అనేక గిరిజన తెగల సమాహారం. చాలాకాలం ఈ తెగలు వేటికవే స్వతంత్రంగా బతి కాయి. మెజారిటీగా అందరూ ముస్లింలే అయినప్పటికీ–జీవన విధానం, ఆచార సంప్రదాయాలు, ఇతర విలువల రీత్యా ఎవరికి వారుగానే ఉన్నారు. వీరిలో పష్తూన్, తజిక్స్, హజారాస్, ఉజ్బెక్, బలూచ్, అయిముఖ్, క్విజల్, బాశ్, టర్క్‌మన్, క్యూజక్, పార్శివాన్, సయ్యద్, కిర్గిజ్, అరబ్ లాంటి ఎన్నో తెగలున్నాయి. ఇందులో పష్తూన్, తజిక్స్, హజారాస్ ప్రధానమైనవి. ప్రస్తుత అఫ్గాన్ జనాభా దాదాపు 3 కోట్ల 80 లక్షలు. ఇందులో 42 శాతం పష్తూన్లే. వీరినే పఠాన్లు అని కూడా అంటారు. తజక్ జనాభా 27 శాతం. హజారాలు 9 శాతం, ఉజ్బెక్లు 4 శాతం, అయిమక్లు 4 శాతం, టర్క్మన్లు 3 శాతం, బలూచ్‌లు 2 శాతం ఉన్నారు. పష్తూన్లు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వీరు సంచార జీవనం గడుపుతుంటారు. ఆధు నిక పద్ధతులు అలవాటు కాలేదు. తాలిబన్ల సాయుధ బలగంలో వీరిదే అగ్రభాగం. నాయకత్వ స్థానంలోనూ అధిక సంఖ్యలో ఉన్నారు. జనాభా రీత్యా రెండవ స్థానంలో ఉన్న తజిక్ తెగ ఆధునిక సమాజంగా వృద్ధి చెందింది. మూడవ స్థానంలో ఉన్న హజారా తెగ వ్యవసాయం, పశుపోషణ, గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తోంది. వెయ్యేండ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన చంఘిజ్‌ఖాన్ వారసులమని వీరు చెప్పుకుంటారు. ఈ మూడు తెగల ప్రభావం ఆఫ్గాన్‌పై ఉంటుందనేది వాస్తవం. ఈ ఆధిపత్య తెగ పశ్తూన్లకూ, మిగిలిన తెగలకూ మధ్య నిరంతర ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ వైరానికి దశాబ్దాల చరిత్ర ఉంది. మొదటిసారిగా 1975లో ఆనాటి ప్రధానమంత్రి దావూద్ ఖాన్‌కు వ్యతిరేకంగా పంజ్‌షీర్ లోయలో తిరుగుబాటు జరిగింది. దావూద్ పష్తూన్ తెగకు చెందిన నాయకుడు. తజక్ తెగకు చెందిన తాహిర్ బదాక్షి నాయకత్వంలో జరిగిన ఈ తిరుగుబాటును వామపక్ష తిరుగుబాటుగా చెపుతారు. అదేవిధంగా ముస్లిముల్లో షియా వర్గానికి చెందిన హజారా నాయకత్వంలో షల్లెహ–ఏ–జిహాద్ పేరుతో 1960ల్లోనే ఒక విప్లవ సంస్థ నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ రోజు పంజ్‌షీర్‌లో ప్రధా నంగా తజక్, హజారా తెగలు... ప్రధానంగా పష్తూన్ల నాయకత్వంలో ఉన్న తాలిబన్లతో ఘర్షణలో ఉన్నారు. అమెరికా సైన్యం అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తరువాత, అఫ్గాన్ జాతీయ ప్రభుత్వాన్ని నడిపిం చడంలో పంజ్‌షీర్ నాయకత్వం ప్రధాన పాత్ర పోషించింది. పంజ్‌షీర్ తెగలు తాలిబన్లను ఎదిరించి నిలవడానికి, చారిత్రకంగా వస్తున్న జాతుల మధ్య వైరుధ్యాలే ప్రధాన కారణం. పంజ్‌షీర్ శత్రు దుర్భేధ్యమైనది. ఇది కాబూల్‌కు 150 కిలోమీటర్ల దూరంలో హిందూకుష్ పర్వతాలను ఆనుకొని ఉన్న ఒక లోయ. ఈ లోయలోకి ప్రవేశించాలంటే ఉన్నది ఒకే ఒక చిన్న మార్గం. ఆ ఏకైక సన్నని తోవగుండానే ఎవరైనా లోనికి పోవాల్సి ఉంటుంది. అది కూడా పంజ్‌షీర్ నదిని దాటుకొని వెళ్లాలి. పంజ్‌షీర్ ప్రజలది ప్రత్యేకమైన జీవన విధానం. యుద్ధ విద్య వారి జీవితంలో భాగం. సహజసిద్ధంగా వారసత్వంగా లభించిన ధీరత్వం వీరికి పెట్టని కిరీటం. వేల ఏళ్ళుగా స్వతంత్రంగా జీవనం సాగించిన పంజ్‌షీర్ ప్రాంతం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించింది. దానికి కారణం ఈ లోయను పచ్చల మణిహారమని చెపుతారు. అత్యంత విలువైన ఖనిజాలు, పచ్చలు(190 క్యారెట్లు కలిగిన ఎమరాల్డ్) ఇక్కడ లభ్యమవడంతో ఈ ప్రాంతం ఆర్థికంగా ఎదిగింది. మధ్యయుగాల కాలంలోనే వెండి గనులు విస్తారంగా ఉండేవి. క్రీస్తు శకం పదహారవ శతాబ్దంలోనే ఈ ప్రాంతానికి చెందిన ఐదుగురు నాయకులు, స్వయంగా అన్నదమ్ములు అక్కడి నదిపైన ఆనకట్టను నిర్మించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. తరతరాలుగా ప్రజలను వరదల నుంచి రక్షించడమే కాకుండా, వ్యవసాయాభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారు. ఆ ఐదుగురు సోదరులనే ఇక్కడి ప్రజలు ఐదు సింహాలుగా, తమ కుల దైవాలుగా కొలుచుకుంటారు. అందుకే ఈ ప్రాంతానికి పంజ్‌షేర్ అనే పేరొచ్చింది. పంజ్‌షేర్ కాస్తా వాడుకలో పంజ్షీర్గా ప్రాచుర్యం పొందింది. ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించడం వల్ల పంజ్‌షీర్ ప్రజ లకు స్థిరమైన జీవన విధానం అలవాటయ్యింది. దీంతో పట్టణాల నిర్మాణం వైపు మొగ్గుచూపారు. దీనికి భిన్నమైన జీవన విధానం పష్తూన్లది. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ వీరు సంచార జీవనమే సాగిస్తున్నారు. ఇస్లాంలో ఉండే విషయాలను మరింత కఠినంగా, మూఢంగా నమ్ముతారు; ఆచరిస్తారు; ప్రచారం చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇతర సమాజంతో, సంప్రదాయాలతో పరస్పర సంబంధాలు లేకపోవడం వలన వెయ్యేళ్ళ కిందటి సంప్ర దాయాలను మక్కీకి మక్కీ అమలు చేస్తున్న పరిస్థితి. తాము మాత్రమే నిజమైన ముస్లింలుగా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే వైరుధ్యం ఇతర తెగలతో ఘర్షణలకు దారితీస్తోంది. ఆధునిక పద్ధ తుల్లో ముందుకు వెళుతోన్న తజిక్, హజారా తెగలకు పష్తూన్ నాయకత్వంలోని తాలిబన్లు సహజ శత్రువులుగా కనిపిస్తున్నారు. ఒకరకంగా సాంప్రదాయక ఛాందసత్వానికీ, ఆధునిక జీవన విధానానికీ మధ్య జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. బలవంతమైన మెజారిటీ వర్గం అణచివేతకు వ్యతిరేకంగా పంజ్షీర్లు తరతరా లుగా సాగిస్తోన్న ఈ పోరాటం... గెరిల్లా యుద్ధ తరహాలో ఉన్న ప్రజా స్వామ్యయుతమైన పోరాటం! - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌తో ప్రధాని మోదీ భేటీ!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రష్యన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నికోలాయ్ పాత్రుషేవ్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత సమయంలో అఫ్గాన్‌తో సహా ప్రాంతీయ సుస్థిరత దిశగా మరింత సమన్వయాన్ని బలోపోతం చేయాలంటూ పునరుద్ఘాటించారు. భారత్ -రష్యాల మధ్య భాగస్వామ్య అభివృద్ధి, రాజకీయాలు, బహుళ ఫార్మేట్స్, ఎస్సీఓ, బ్రిక్స్ తదితర విషయాలపై సంభాషించారు. నికోలాయ్ తన రెండు రోజుల ఇండియా పర్యటనలో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. అఫ్ఘనిస్తాన్ అంతర్జాతీయ తీవ్రవాద గ్రూపులకు ఉనికిగా మారే అవకాశం ఉందని సెక్యూరిటీ అడ్వైజర్లు అభిప్రాయపడ్డారు. తీవ్రవాద గ్రూపులకు ఆయుధాల ప్రవాహం, అఫ్ఘన్ సరిహద్దుల్లో అక్రమ రవాణా, అఫ్ఘనిస్తాన్ నల్లమందు ఉత్పత్తి అక్రమ రవాణాకు కేంద్రంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. తాలిబన్లతోపాటుగా, ఇతర అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో పాకిస్తాన్ సంబంధాలను కలిగి ఉందనే విషయాన్ని భారత్ గుర్తుచేసింది. అఫ్ఘనిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా మారకుండా చూసుకునే బాధ్యత పాకిస్తాన్‌పై ఉందని భారత్ పేర్కొంది. Was happy to meet Mr. Nikolai Patrushev, Secretary of the Security Council of Russia. His visit allowed useful discussions between both sides on important regional developments. pic.twitter.com/v0cwJH1yAF — Narendra Modi (@narendramodi) September 8, 2021 చదవండి: అగర్తలలో ఉద్రిక్తత: ఆగంతకుల దాడిలో సీపీఎం కార్యాలయానికి నిప్పు -
ఇకపై అక్కడ మహిళల 'ఆటలు' సాగవు..
కాబుల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచి అక్కడ అరచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. దీంతో అఫ్గాన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే తాలిబన్లు కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారు. బాలికలకు విద్య అవసరం లేదంటూ, మహిళలు నాలుగు గోడల మధ్యే ఉండాలంటూ పలు హుకుంలు జారీ చేశారు. దీంతో అఫ్గాన్ మహిళలు ప్రాణాలకు తెగించి మరీ ఇతర దేశాలకు పారిపోయేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా తాలిబన్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అఫ్గాన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనలేరు. క్రీడల్లో పాల్గొన్నప్పుడు మహిళల శరీర భాగాలు బహిర్గతం అవుతాయన్న కారణంగా క్రీడలపై నిషేధం విధిస్తున్నట్లు తాలిబన్లు బుధవారం ప్రకటించారు. మహిళలకు క్రీడా కార్యకలాపాలు అవసరం లేదని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వాసిక్ మీడియాకు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే అఫ్గాన్ మహిళా క్రికెట్ జట్టు సహా అనేక మంది మహిళా క్రీడాకారిణుల దేశం విడిచి వెళ్లిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కోసం తాలిబన్లు గాలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మహిళా విద్యార్థులకు కేవలం మహిళా టీచర్లు మాత్రమే బోధించాలని తాలిబన్లు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే విశ్వవిద్యాలయాలకు హాజరయ్యే మహిళలు తప్పనిసరిగా బుర్ఖాను ధరించాలని, పరదా పద్దతిలోనే వారికి క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలో కొత్త అప్గానిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తాలిబన్లు మంగళవారం ప్రకటించిన విషయం విధితమే. చదవండి: కోచ్ కాదు కామాంధుడు.. మసాజ్ పేరుతో మహిళా అథ్లెట్లపై లైంగిక వేధింపులు -
తాలిబన్ల అరాచకం.. గర్భవతని కనికరం కూడా లేకుండా..
కాబుల్: ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి అరాచకాలు మొదలెట్టారు. పైకి మాత్రం తాలిబన్ల నాయకులు మారిపోయినట్లు ప్రకటనలు చేస్తున్నారు. అయితే వారు గతంలో మాదిరిగానే తమ సహజ ప్రవర్తనను బయటపెడుతున్నారు. తాజాగా 6 నెలల గర్భవతిగా ఉన్న ఓ మహిళా పోలీస్ అధికారిణిని దారుణంగా హత్యచేశారు. ఆమెను కుటుంబసభ్యుల ఎదుటే ఆమెను కిరాతకంగా తుపాకితో కాల్చిచంపారు. ఘోర్ ప్రావిన్సుల రాజధాని ఫిరోజ్కొ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హత్యగావించబడ్డ మహిళ జైలు అధికారిణి బాను నెగర్గా స్థానిక మీడియా పేర్కొంది. ఇప్పటికే అఫ్గన్ మహిళలు తమ భద్రతపై ఆందోళన చెందుతుండగా తాజాగా ఈ హత్య కలకలం రేపింది. బుర్ఖాలు లేకుండా కనిపిస్తే తాలిబాన్లు వేటాడతారని, కొడతారనే భయంతో మహిళలు ఇప్పటికే వాటిని కొనుగోలు చేయడం ప్రారంభించారు. దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ప్రభుత్వ ఏర్పాటులో హక్కులు, మహిళా ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేస్తూ కొందరు మహిళలు హెరాత్‌లో నిరసన ప్రదర్శనలు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పనిచేసి అధికారులు తాలిబన్లు ఎక్కడ చంపుతారోనని బిక్కుబిక్కమంటూ కాలం గడుపుతున్నారు. చదవండి: Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్ గురించి తెలుసా? -
తాలీబన్ - హక్కానీ నెట్వర్క్ మధ్య కోల్డ్‌వార్
-
పంజ్‌షీర్‌లో ఎగిరిన తాలిబన్ల జెండా
-
పంజ్‌షీర్ ప్రావిన్స్ పోరులో అఫ్గన్ కీలక ప్రతినిధి మృతి
కాబూల్: ఆదివారం పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో జరిగిన పోరాటంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న బృందంలో కీలక వ్యక్తి మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతి చెందిన వ్యక్తి.. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ఫాహిమ్ దాష్టీ, జమియత్-ఇ-ఇస్లామీ పార్టీ సీనియర్ సభ్యుడు, ఆఫ్ఘన్ జర్నలిస్టుల సమాఖ్య సభ్యుడిగా గుర్తించారు. పంజ్‌షీర్ లోయ హిందూ కుష్ పర్వతాలలో, కాబూల్‌కు ఉత్తరాన దాదాపు 90 మైళ్ల దూరంలో ఉంది. నెలరోజుల వ్యవధిలో ప్రభుత్వ అనుకూల దళాలలో ఈ ప్రాంతంలో ఉక్కుపాదం మోపిన తరువాత తాలిబాన్లతో వారు పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం లోయ త్వరలో కూలిపోవచ్చని నివేదికలు చెప్తున్నాయి. అయితే,ఆఫ్గన్ దళాలు మాత్రం అటువంటి వాదనలను ఖండించాయి. దళాల నాయకుడు అహ్మద్ మసౌద్ ఆదివారం మాట్లాడుతూ.. తాలిబాన్లు ప్రావిన్స్ని విడిచిపెడితే తాము పోరాటం ఆపడానికి, చర్చలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ తాలిబన్లతో విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉందని మిస్టర్ మసౌద్ అన్నారు. చదవండి: Afghanistan: పోరాటాల గడ్డ, పచ్చల లోయ.. పంజ్‌షీర్‌పై పట్టు చిక్కేనా? -
Afghanistan: తాలిబన్లకు పెరుగుతున్న మద్దతు!
అఫ్గానిస్తాన్‌లోని నాయకులు బతుకు జీవుడా అంటూ విదేశాలకు పారిపోతున్నారు. అక్కడి సామాన్య ప్రజలు పొట్ట చేత పట్టుకుని దేశ సరిహద్దులు దాటుతున్నారు. ఎక్కడ చూసినా కల్లోలమే.. ఏ దేవుడైనా కాపాడకపోతాడా అని ఎదురు చూపులే. ఇది తాలిబన్ల రాకతో అఫ్గాన్‌లోని పరిస్థితులు. ఈ క్రమంలో తాలిబన్లకు అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్ కాబుల్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టారు. అఫ్గాన్‌లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లకు తొలిసారిగా చైనా మద్దతు ప్రకటించింది. ‘‘తాలిబన్ల పాలనను స్వాగతిస్తున్నాం. అఫ్గాన్ ప్రజలు తమ గమ్యాన్ని స్వతంత్రంగా నిర్ణయించునే హక్కును చైనా గౌరవిస్తుంది. అఫ్గానిస్తాన్‌తో స్నేహపూర్వక, సహకారం సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. తాలిబన్లు కూడా చైనాతో సంబంధాలను పెంచుకోవాలనుకుంటున్నారు. అఫ్గాన్ పునర్నిర్మాణం, అభివృద్ధిలో చైనా భాగస్వామ్యం కోసం తాలిబన్లు ఎదురు చూస్తున్నారు’’ అని ఇటీవల చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ తెలిపారు. రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు నాగరికతతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ప్రపంచ సమాజం కాబుల్‌తో మంచి దౌత్య సంబంధాలను కొనసాగించే విధంగా తాలిబన్లు ప్రవర్తించడాన్ని చూడాలనుకుంటున్నానని పుతిన్ పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్ విచ్ఛిన్నంపై రష్యాకు ఆసక్తి లేదని, ఒకవేళ అదే జరిగితే.. మాట్లాడటానికి ఎవరూ ఉండరని పుతిన్ అన్నారు. అంతే కాకుండా అమెరికన్లు చాలా ఆచరణాత్మక వ్యక్తులు అనే ప్రచారానికి కొన్ని సంవత్సరాలుగా 1.5 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేశారని, కానీ ఫలితం ఏంటి? సున్నా అని తెలిపారు. ఇక 1989 సోవియట్ దళాల ఉపసంహరణతో అఫ్గాన్‌లో 10 సంవత్సరాల సుదీర్ఘ యుఎస్ఎస్ఆర్ యుద్ధం నుంచి పుతిన్ ఓ పాఠాన్ని నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. అఫ్గానిస్తాన్‌కు సంబంధించి రష్యా తన దౌత్య ప్రయత్నాలన్నింటినీ చేసింది. ఇప్పటికీ తాలిబన్ గ్రూప్‌ను మాస్కోలో 'తీవ్రవాద సంస్థ'గా ముద్ర ఉంది. పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ పతనం తర్వాత పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ కాబుల్‌ను సందర్శించారు. ఆయన వెంట పాక్ అధికారుల బృందం కూడా వచ్చింది. తాలిబన్ల ఆహ్వానం మేరకే హమీద్ అఫ్గాన్ వచ్చారని, రెండు దేశాల భవితవ్యంపై చర్చలు జరిపి, కలసికట్టుగా వ్యూహరచన చేయనున్నట్టుగా పాకిస్తాన్ అబ్జర్వర్ పత్రిక వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు ఐఎస్ఐ చీఫ్‌ను ఆహ్వానించడంతో వారిమధ్య సుదృఢ బంధాలు తేటతెల్లమవుతున్నాయి. అమెరికా తాలిబన్లు ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగకుండా అన్ని వర్గాలను కలుపుకొని పోతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తాము ఆశిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఉగ్ర వాదాన్ని నిరోధించడం, మహిళలు, మైనార్టీల హక్కుల్ని గౌరవించడంలో తమ చిత్తశుద్ధి చూపించాలన్నారు. ముఖ్యమైన విషయాలు, సమస్యలపై తాలిబన్ల సారథ్యంలోని కొత్త అఫ్గాన్ ప్రభుత్వంతో చర్చిస్తామని బ్లింకెన్ హామీ ఇచ్చారు. మరోవైపు అఫ్గాన్‌లో మానవ సంక్షోభం, ఆర్థిక సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 13న జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం కానుంది. 'మానవతా సంక్షోభం' అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు తాలిబన్ల పట్ల తమ వైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ ఐక్యరాజ్యసమితి అఫ్గానిస్తాన్‌లో తీవ్రవాదులచే హింసకు గురవుతోన్న స్థానికులను కాపాడటం గురించి ఆందోళన చెందుతోంది. ‘‘అభివృద్ధి చెందిన దేశాలు తాలిబన్లతో సంబంధాలకు తెల్ల జెండాలను రెపరెపలాడిస్తున్నాయి. కానీ అఫ్గాన్‌లో జరిగే సంఘటనల గురించి ప్రపంచం బాధాతప్త హృదయంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందనే దానిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ‘‘ఒక్కటిగా’’ నిలువాలి" అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గుటెరస్ అన్నారు. చదవండి: పోలీస్ శిబిరంపై బాంబు దాడి: 13 మంది పోలీసులు దుర్మరణం -
పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు జవాన్లు మృతి
క్వెట్టా: పాకిస్తాన్లో నైరుతి ప్రావిన్స్ బలూచిస్తాన్ లోని క్వెట్టా నగరంలో పారా మిలటరీ సైనికులపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పాక్ జవాన్లు ఐదుగురు మరణించగా.. 20 మంది వరకూ గాయపడ్డారు. కాగా తెహ్రీకె తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. క్వెట్టా-మాస్తంగ్ రోడ్డులోని చెక్‌పాయింట్ దగ్గర ఈ దాడి జరిగింది. చెక్‌పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులపైకి ఓ వ్యక్తి బైక్‌పై దూసుకొచ్చి తనను తాను పేల్చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ దాడిలో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ ద్వారా ఈ ఘటనను ఖండించారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కూడా ఈ దాడిని ఖండించారు. చదవండి: Panjshir: పంజ్‌షీర్ ప్రతిఘటన దళాల దెబ్బ?.. గందరగోళంగా అఫ్గన్ ఆధిపత్యపోరు -
తాలిబన్ల పాలనలో అఫ్గన్ తొలి క్రికెట్ సిరీస్ ఇదే!
ఢాకా: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ముస్లిం షరియత్ చట్టాల ప్రకారం పాలన కూడా సాగిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గన్ క్రికెట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, అఫ్గన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోమంటూ తాలిబన్లు ఇటీవల స్పష్టమైన హామీనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్గన్ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక తొలిసారిగా ఆ దేశ అండర్ -19 జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్ అండర్ -19 జట్టుతో ఐదు వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ ఆడనునుంది. మొదటి విడతగా ఎనిమిది మంది ఆటగాళ్ల బృందం ఢాకా కు చేరుకుంది. మిగిలిన ఆటగాళ్లు మరో రెండు విడతలుగా అక్కడకు చేరుకుంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రబీద్ ఇమామ్ తాజాగా వెల్లడించారు. అఫ్ఘన్ ఆటగాళ్లు ఢాకా వచ్చిన వెంటనే సిల్హెట్‌కు వెళ్లిపోయారని ఇమామ్ చెప్పారు. 2020, ఫిబ్రవరిలో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బంగ్లా అండర్ 19 టీమ్‌కు ఇదే తొలి సిరీస్ కావడం విశేషం. చదవండి: South africa vs Sri lanka: రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు -
అఫ్గన్‌లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటి నుంచి సానుకూలంగా ఉన్న చైనా.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చైనా తన నమ్మినబంటు పాకిస్తాన్ సాయంతో అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పాటు చేసేందుకు సాయం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్ శనివారం కాబూల్ చేరుకున్నాడు. అఫ్గన్‌లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సాయం చేయడమేకాక ముల్లా యాకూబ్ నేతృత్వంలోని కాందహరీలు, సిరాజుద్దీన్ హక్కానీ అధ్వర్యంలోని కాబూలీల మధ్య తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కరించడానికి హమీద్ ప్రయత్నించనున్నట్లు తెలిసింది. అలానే పాక్.. అఫ్గన్ ఆర్మీలో హక్కానీలను ప్రవేశపెట్టడానికి పాక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమచారం. ఐఎస్ఐ, హక్కానీ నెట్వర్క్ పోషకుడిగా పరిగణించబడుతుంది. అంతేకాక ఇది అమెరికా, ఐక్యరాజ్య సమితి హక్కానీని తీవ్రవాద గ్రూపుగా ప్రకటించింది. అంతేకాక ఇది అల్ ఖైదాకు సంబంధించిన సంస్థగా ప్రకటించింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రయత్నాల పట్ల అఫ్గన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్ల ప్రధాన సంస్థ పాకిస్తాన్లో ఉన్నట్లు గతంలో అఫ్గన్ ప్రభుత్వం, అమెరికా ఆరోపించినప్పటికి.. పాక్ వాటిని కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. (చదవండి: క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..?) తాలిబన్లు తాము అఫ్గన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో హమీద్ కాబూల్ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది. అయితే హమీద్ పర్యటన గురించి ఎలాంటి అధికారక ప్రకటన లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంలో తాలిబన్ నాయకత్వానికి సాయం చేయడానికే హమీద్ కాబూల్ వచ్చాడని మీడియా వర్గాలు వెల్లడించాయి. (చదవండి: తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ ) అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనా ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. డ్రాగన్ దేశం పాకిస్తాన్‌ను ట్రంప్‌కార్డ్‌గా వాడుకుని.. తాలిబన్లకు రహస్యంగా సాయం చేస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అఫ్గన్‌లో తాలిబన్ల అరాచకాలు మొదలైన వెంటనే అన్ని దేశాలు అక్కడ తమ రాయబార కార్యాలయాలను మూసి వేసినప్పటికి చైనా మాత్రం ఆ పని చేయలేదు. అంతేకాక ప్రస్తుతం చైనానే తమను ఆర్థికంగా ఆదుకుంటుందని తాలిబన్లు భావిస్తున్నారు. అలానే అఫ్గన్‌లోని విస్తారమైన విస్తారమైన రాగి, లిథియం గనులను దృష్టిలో పెట్టుకుని.. డ్రాగన్ అఫ్గనిస్తాన్ కోసం ఉద్దేశించిన బెల్ట్ రోడ్ పనులను కొనసాగించనున్నట్లు తెలిపింది. చదవండి: అఫ్గన్ వాసుల తాకిడితో చమన్ సరిహద్దులను మూసివేసిన పాక్ -
తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!
కాబుల్: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ప్రాంతం సవాలుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాజాగా శుక్రవారం తాలిబన్లు తాము పంజ్‌షీర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాక తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే తాలిబన్ల అత్యుత్సాహం సామాన్యుల పాలిట శాపంగా మారింది. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 17 మంది అఫ్గన్ పౌరులు మరణించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. (చదవండి: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?) రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ (ఎన్ఆర్ఎఫ్ఏ) ఓడించి, పంజ్‌షీర్‌ను అధీనం చేసుకున్నట్టు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం గాల్లో కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనలో సుమారుగా 17 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఇలాంటి పనులతో పౌరులకు హాని తలపెట్టవద్దని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లా ట్విట్టర్లో సైనికులకు సూచనలు చేశారు. తిరుగుబాటుదారులు శాంతియుతంగా లొంగిపోవాలని ప్రకటించారు. అయితే పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల నాయకుడు అహ్మద్ మసూద్ మాత్రం దీన్ని కొట్టిపారేశాడు. ఈ విషయంపై పాకిస్తాన్ మీడియాల్లో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రతిఘటన దాడులు కొనసాగుతునే ఉన్నాయని అహ్మద్ మసూద్ స్థానిక మీడియాకు వెల్లడించారు. کابل ښار او ټول هیواد کې د مجاهدینو د پام وړ: له هوایي ډزو څخه جدا ډډه وکړئ او پر ځای یې د الله تعالی شکر اداء کړئ. ستاسي په لاس کې وسله او مرمۍ بیت المال دي، هیڅوک یې د ضائع کیدو حق نلري. سړې مرمۍ عامو خلکو ته د زیان اړولولو قوي احتمال لري؛ نو بناء بې ځایه ډزې مه کوئ. — Zabihullah (..ذبـــــیح الله م ) (@Zabehulah_M33) September 3, 2021 Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే.. -
క్రికెట్ మ్యాచ్‌లో అత్యద్భుత దృశ్యం.. అఫ్గాన్, తాలిబన్ జెండాలతో..?
కాబూల్: అగస్ట్ 15న అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత తొలిసారిగా జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఓ అత్యద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పీస్ డిఫెండర్స్, పీస్ హీరోస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన చాలామంది క్రికెటర్లు పాల్గొన్నారు. దీంతో మ్యాచ్ చూసేందుకు స్టేడియంలోకి జనం పోటెత్తారు. మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకులు తాలిబన్, అఫ్గాన్ జెండాలను పక్క పక్కనే ఉంచి ఊపడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. తామంతా ఐక్యంగా ఉన్నామని చాటేందుకే ప్రజలు ఇలా జెండాల ప్రదర్శన చేశారని తాలిబన్ అధికారులు పేర్కొనడం గమనార్హం. తాలిబన్ల ఆధిపత్య ప్రాంతమైన చమన్ ఉజురి సమీపంలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు దాదాపు 4 వేల మంది ప్రేక్షకులు హాజరు కాగా, వారిలో మహిళలు లేకపోవడం గమనార్హం. సాధారణ ప్రేక్షకుల కంటే తాలిబన్లే ఈ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించడం విశేషం. ఈ మ్యాచ్‌లో పీస్ డిఫెండర్స్ జట్టు 62 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు సీఈవో హమీద్ షిన్వరి తెలిపారు. కాగా, తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్న తర్వాత క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతారన్న వార్తలు వినిపించాయి. అయితే, ఇప్పుడీ మ్యాచ్ జరగడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లు క్రికెట్‌కు ఆమోదం తెలపడం శుభసూచకమని, తాలిబన్లలో మార్పుకు ఇది నాంది అని తాలిబన్ సానుభూతిపరులు చెప్పుకుంటున్నారు. చదవండి: కోహ్లీ సరికొత్త రికార్డు.. క్రికెట్లో అనుకుంటే పొరపాటే..! -
పంజ్‌షీర్‌ను జయించామన్న తాలిబన్లు.. అదేమీ లేదన్న తిరుగుబాటు దళం
కాబూల్: అప్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు పంజ్‌షీర్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా అక్కడి తిరుగుబాటుదారులు పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తాజాగా మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంజ్‌షీర్ తమ స్వాధీనంలోకి వచ్చిందని తాలిబన్లు తాజాగా సంచలన ప్రకటన చేశారు. అఫ్గాన్‌లోని చివరి ప్రావిన్స్ కాబూల్‌కు ఉత్తరాన ఉన్న పంజ్‌షీర్ లోయను కూడా వశం చేసకున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఈ ఆక్రమణతో అఫ్గానిస్తాన్ పై పూర్తి అధికారం సాధించామన్నారు. ‘అల్లా దయతో అఫ్గానిస్తాన్ మొత్తం మా అధీనంలోకి వచ్చింది. తిరుగుబాటు దారులు ఓడిపోయారు. ప్రస్తుతం పంజ్‌షీర్ మా అధీనంలోనే ఉంది’ అని తాలిబన్ల కమాండర్ ఒకరు తెలిపారు. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు విచిత్రమేమంటే రెండు వర్గాలు మేమే పై చేయి సాధించామని చెప్పుకుంటున్నాయి. పంజ్‌షీర్‌పై పట్టు సాధించామన్న తాలిబన్ల వాదనను అక్కడి తిరుగుబాటుదారులు కొట్టి పారేశారు. తాలిబన్లను తిప్పికొట్టామని ప్రకటించారు. అలాగే పంజ్‌షీర్ నుంచి పారిపోయాననే వాదనను అమ్రుల్లా సాలెహ్ తోసిపుచ్చారు. తాము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. రెండు వైపులా ప్రాణ నష్టం వాటిల్లింది. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ తాలిబన్లకు లొంగేది లేదు. ఎప్పటికీ అఫ్గాన్ పక్షాన నిలబడి పోరాడతామని సాలెహ్ ప్రకటించారు. మరోవైపు కొన్ని వందల తాలిబన్లు తమ వద్ద చిక్కుకున్నారనీ, వారికి ఆయుధాల కొరత కారణంగా లొంగిపోయేందుకు చర్చలు కొనసాగిస్తున్నారని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రతినిధి అలీ నజారీ వెల్లడించారు. చదవండి: Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! అటు పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకున్నాంటూ తాలిబన్లు రెట్టింపు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ క్రమంలో పంజ్‌షీర్‌పై విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ కాబూల్‌లో తాలిబన్లు గాల్లోకి కాల్పులుల్లో 17 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. చిన్నారులు సహా పలువురు మృతి చెందినట్లు స్థానిక ఆఫ్గన్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. -
తాలిబన్లతో సంప్రదింపులు చాలా అవసరం: యూకే
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన బ్రిటిష్ పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడం వంటి కారణాల దృష్ట్యా తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం చాలా అవసరమని యూకే విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ పేర్కొన్నారు. అయితే, అఫ్గాన్‌లో తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే అంశంలో ఇప్పుడే మాట్లాడటం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించారు. చదవండి: Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే! శుక్రవారం ఆయన ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మూద్ ఖురేషితో కలిసి మీడియాతో మాట్లాడారు. తాలిబన్ల నుంచి ఏవిధమైన సహకారం లేకుండా కాబూల్ నుంచి 15 వేల మందిని వెనక్కి తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. ‘తాలిబన్లలోని కొందరు నేతలు కొన్ని అంశాలపై సానుకూలంగా మాట్లాడారు. వాటిని కార్యరూపంలోకి తేవాలంటే వారితో చర్చలు కొనసాగాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. చదవండి : Taliban-Kashmir: కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు Elephant Water Pumping Video: ఈ ఏనుగు చాలా స్మార్ట్! -
అఫ్గాన్ బోర్డర్ దాటించడానికి ‘పెళ్లిళ్లు’ చేస్తున్నారు..!
కాబుల్: అఫ్గానిస్తాన్ మహిళల పరిస్థితి రోజుకో మలుపు తిరుగుతోంది. తాలిబన్ల నుంచి తప్పించుకొనేందుకు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో ఉన్న యువతులకు వివాహం చేసి మరీ బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరలింపు కేంద్రంలో వెలుగుచూసిన ఈ మానవ అక్రమ రవాణా ఉదంతంపై అమెరికా దౌత్య అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో.. అఫ్గాన్ నుంచి పారిపోవడానికి, కొన్ని కుటుంబాలు డబ్బులు చెల్లించీ మరీ పెళ్లి కొడుకుల్ని వెదుకుతున్నారు. వారికి భర్తలను చూసి దేశం దాటించేందుకు యత్నాలు ముమ్మరం చేశారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు ఈ ఘటనలు తాలిబన్ల కిరాతక పాలన నుంచి తప్పించుకోవాలనే అక్కడి మహిళల పరిస్థితికి అద్దం పడుతోంది. అమెరికా దౌత్యాధికారులు ఇటువంటి మానవ అక్రమ రవాణా సంఘటనలను గుర్తించి వారికి సహాయం అందించేందుకు చర్యలు చేపట్టారు. కాగా అమెరికా దళాలు ఆగస్ట్ 30న అఫ్గన్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీనితో 20 యేళ్ళ సుదీర్ఘ యుద్ధానికి తెరపడింది. అయితే తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక మహిళల కనీస హక్కులులేని గత తాలిబన్ పాలనను గుర్తుచేసేలా ఉంది. అంతేకాకుండా మగ కుటుంబ సభ్యుడు లేని మహిళల ప్రయాణాలను తాలిబన్లు నిషేధించారు. ఈ పరిస్థితుల్లో కొన్ని పైవేటు గ్రూపులు తాలిబన్లు తమను వెంటాడుతున్నారని తెలిస్తే తప్ప దేశం సరిహద్దులు దాటవద్దని సూచించారు.దాంతో కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఇలా బలవంతంగా వివాహం చేసి మరీ పంపిస్తున్నారు. చదవండి: Hibatullah Akhundzada: అఫ్గాన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్జాదా -
కశ్మీర్‌పై తాలిబన్ల సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు కశ్మీర్, భారత్ లేదా మరో ఇతర దేశంలో ముస్లింల హక్కులపై మాట్లాడి తీరుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింల సమస్యలపై స్పందించే హక్కు తమ కుందన్నారు. తాలిబన్ల పాలనలో అఫ్గన్ భూభాగం దేశంలో వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతుందనే ఆందోళనల మధ్య తాజా వ్యాఖ్యలు మరింత కలవరం రేపుతున్నాయి. కశ్మీర్‌తోపాటు మరే ఇతర ప్రాంతంలో ఉన్న ముస్లింల స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా తమకుందని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పష్టం చేశారు. ముస్లింలు మీ సొంత ప్రజలు, మీ స్వంత పౌరులని చెబుతాం, మీ చట్టాల ప్రకారం వారికీ సమాన హక్కులుంటాయని చెబుతామని వ్యాఖ్యానించారు. కాబూల్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్న కొన్ని రోజుల తర్వాత, కాశ్మీర్ ఒక ద్వైపాక్షిక, అంతర్గత విషయమని చెప్పిన దానికి భిన్నంగా తాలిబన్ అధికార ప్రతినిధి తాజా ప్రకటన ఉంది. అయితే ఏ దేశానికీ వ్యతిరేకంగా ఆయుధాలను ప్రోత్సహించే విధానం తమకు లేదన్నారు. చదవండి: Taliban China Friendship: చైనా కీలక హామీ, మరింత మద్దతు మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పెరుగుతున్న ఆందోళనల మధ్య, ఈ ప్రాంతంలో భారత ప్రభుత్వం ఇప్పటికే నిఘాను పెంచింది. కాగా అమెరికా ఆధీనంలోని అఫ్గాన్‌కు తాలిబన్ల వల్ల విముక్తి లభించిందని, తదుపరి లక్ష్యం కశ్మీరే అంటూ అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. -
తాలిబన్లకు చైనా మరింత మద్దతు, కీలక హామీ
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను వశం చేసుకున్న తాలిబన్ల పట్ల మొదటినుంచీ సానుకూలంగా ఉన్న చైనా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచుతామని చైనా హామీ ఇచ్చిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అలాగే సంక్షోభంతో నష్టపోయిన అఫ్గాన్‌కు అందించే మానవతా సహాయాన్ని పెంచుతామని చైనా హామీ ఇచ్చినట్లు తాలిబాన్ ప్రతినిధి శుక్రవారం తెలిపారు. అయితే దీనిపై చైనా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మేరకు దోహాలో తాలిబన్ల ప్రతినిది అబ్దుల్ సలాం హనాఫీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా డిప్యూటీ విదేశాంగ మంత్రి వు జియాంగావోతో ఫోన్ ద్వారా సంభాషించినట్టు సుహైల్ షాహీన్ ట్వీట్ చేశారు. కాబూల్‌లో తమ రాయబార కార్యాలయాన్ని నిర్వహించడం తోపాటు, గతంతో పోలిస్తే సంబంధాలు మరింత బలపడతాయని వు జియాంగావో తెలిపారన్నారు. అలాగే కోవిడ్-19 చికిత్సకు సంబంధించి తన సాయాన్ని పెంచనుందని అబ్దుల్ సలాం వెల్లడించారు. కాగా అఫ్గాన్‌లో 20 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో తొలిసారిగా మద్దతు ప్రకటించింది చైనా మాత్రమే. ఆ తరువాత పాకిస్తాన్, రష్యా కూడా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. భద్రత క్షీణించడంతో తమ పౌరులను తరలిస్తున్నప్పటికీ కాబూల్‌లోని చైనా రాయబార కార్యాలయం పనిచేస్తోంది. ప్రస్తుత భద్రతా ఆందోళన దృష్ట్యా తక్షణమే కాకపోయినా, విస్తారమైన రాగి, లిథియం గనులపై చైనా కంపెనీలు కూడా దృష్టి పెట్టనున్నాని నిపుణులు చెబుతున్నారు. అలాగే తాలిబన్లు చైనాను పెట్టుబడి, ఆర్థిక మద్దతుకు కీలకమైన వనరుగా పరిగణించవచ్చని భావిస్తున్నారు. అఫ్గాన్‌లో శాంతి స్థాపన సయోధ్యతోపాటు, ఆ దేశ పునఃనిర్మాణంలో ఇప్పటికే చైనా ప్రకటించిన సహకారాన్ని స్వాగతించిన తాలిబన్లు అఫ్గాన్ అభివృద్దిలో చైనాదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 1/3 Abdul Salam Hanafi, Deputy Director, PO held a phone conversation with Wu Jianghao, Deputy Foreign Minister of the People’s Republic of China. Both sides discussed the ongoing situation of the country and future relations. The Chinese Deputy Foreign Minister said that — Suhail Shaheen. محمد سهیل شاهین (@suhailshaheen1) September 2, 2021 -
అఫ్గాన్‌లో ఆహార కొరత తీవ్రం!
ఐక్యరాజ్యసమితి: తాలిబన్ల చేతికి చిక్కిన అఫ్గానిస్తాన్‌లో ఆహారం కొరత వేధిస్తోంది. ధరలు ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆహార నిల్వలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు నాటికి నిల్వలు పూర్తిగా నిండుకోవడం ఖాయమని అఫ్గాన్‌లో ఐరాస ప్రతినిధి రమీజ్ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభాలో మూడొంతుల్లో కనీసం ఒక వంతు ప్రజలకు రోజుకు ఒకసారైనా తిండి దొరుకుతుందని కచ్చితంగా చెప్పలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. సెప్టెంబర్ నెలాఖరు దాకా ఎలాగోలా నెట్టికొచ్చినా ఆ తర్వాత ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఇక అత్యవసరమైన ఔషధాలు లేకుండా దొరకడం లేదని అన్నారు. మరోవైపు అఫ్గాన్‌లో తీవ్రమైన కరువు కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
Afghanistan Crisis: అఫ్గాన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్జాదా
పెషావర్/కాబూల్: అఫ్గానిస్తాన్‌ను అక్రమించిన రెండు వారాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దేశ అత్యున్నత నాయకుడిగా(సుప్రీం లీడర్) తాలిబన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా(60)ను ఎంపిక చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. ఈ విషయాన్ని తాలిబన్ సమాచార, సాంస్కృతిక కమిషన్ సీనియర్ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ స్వయంగా వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వ అధినేత అఖుంద్జాదా అవుతారని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావే లేదని తేల్చిచెప్పారు. నూతన సర్కారు ఏర్పాటుపై సంప్రదింపులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రివర్గం(కేబినెట్) కూర్పుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రావిన్స్‌లకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఇన్చార్జులుగా ఉంటారని తెలిపారు. అక్కడ పరిపాలన వారి నేతృత్వంలో కొనసాగుతుందని అన్నారు. ప్రావిన్స్‌లు, జిల్లాలకు గవర్నర్లను, పోలీసు చీఫ్‌లను, పోలీసు కమాండర్లను తాలిబన్లు ఇప్పటికే నియమించినట్లు సమాచారం. నూతన ప్రభుత్వ వ్యవస్థ పేరును, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఇనాముల్లా వివరించారు. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం అఫ్గాన్ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మహిళలకు, అన్ని గిరిజన తెగల సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు ఖతార్ రాజధాని దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ ఉప నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ గురువారం ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కుతుందని అన్నారు. తాలిబన్లకు గట్టి పట్టున్న కాందహార్ నగరం నుంచే ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా ప్రభుత్వ అధినేతగా దేశ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో తాము సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నామని వివరించారు. సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేసుకొనే దిశగా ఆయా దేశాలతో తాలిబన్ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి దాదాపు 30 మిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాక నిర్దేశిత ప్రయాణ ధ్రువపత్రాలు ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లొచ్చని సూచించారు. సుప్రీం లీడర్‌దే పెత్తనం అఫ్గానిస్తాన్‌లో ఇరాన్ తరహా ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇరాన్లో సుప్రీం లీడర్‌దే పెత్తనం. దేశంలో ఇదే అత్యున్నత రాజకీయ, మతపరమైన, సైనికపరమైన పదవి. అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైనిక, ప్రభుత్వ, న్యాయ విభాగం అధినేతల నియామకంలో సుప్రీం లీడర్ మాటే చెల్లుబాటు అవుతుంది. అఫ్గానిస్తాన్‌లో సుప్రీం లీడర్ కింద అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రిని నియమించనున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌కు లోబడి అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. -
అఫ్గన్ వాసుల తాకిడితో చమన్ సరిహద్దులను మూసివేసిన పాక్
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి అక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో తాలిబన్ల రాక్షస పాలన మళ్లీ తిరిగిరానుందని భావించి అనేక మంది అఫ్గన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశం దాటాలన్న సంకల్పంతో చివరికి ఆస్తులను కూడా వదిలేసి పొరుగు దేశాలకు పయనమవుతున్నారు అఫ్గన్ ప్రజలు. అయితే దేశాన్ని వీడేందుకు బయలుదేరుతున్న వాళ్లకు తాలిబన్ల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. వీటన్నింటిని దాటుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుకి వేలాది ప్రజలు చేరుకుంటున్నారు. ఆఫ్గన్ వాసుల తాకిడి పెరగడంతో చమన్ సరిహద్దులను పాకిస్తాన్ మూసివేసింది. దీంతో చమన్ సరిహద్దుల్లో వేలది మంది ప్రజలు నిరీక్షిస్తున్నారు. మరోవైపు అన్ని దేశాల సరిహద్దులు సహా వాటికి దారితీసే చెక్ పోస్టుల వద్ద తాలిబన్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. చదవండి: Solar Storm: ‘కరోనా’తో పోలిక.. మహా తుపానుతో భారీ డ్యామేజ్!. మనకేం ఫరక్ పడదు -
‘అఫ్గాన్ నుంచి భారతీయుల తరలింపే మొదటి ప్రాధాన్యత’
సాక్షి, న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వానికి సంబంధించిన స్వభావం, విధివిధానాల విషయంలో భారత్‌దేశానికి ఎటువంటి అవగాహన లేదని కేంద్రం గురువారం స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ.. కాబూల్ విమానాశ్రయం మూసివేయడం కారణంగా నిలిచిపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్‌పోర్టు ముసివేసినట్లు తెలిపారు. కాబూల్‌లో ఎయిర్‌పోర్టు సేవలు మొదలైన అనంతరం భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతీయులను స్వదేశానికి తరలించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. మొదటిసారిగా తాలిబన్ నేత షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్‌లో భారత్ రాయబారి దీపక్ సమావేశమైన విషయం తెలిసిందే. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొన్న సంగతి విదితమే. చదవండి: Afghanistan: అమెరికా సాధించింది శూన్యం, పుతిన్ సెటైర్లు -
అఫ్గాన్‌లో అమెరికా సాధించింది శూన్యం: పుతిన్
మాస్కో: అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు యుద్ధం చేసిన అమెరికా చివరకు సాధించింది శూన్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అఫ్గాన్‌లో అమెరికా చర్యలు, కార్యకలాపాలను ఆయన తప్పుపట్టారు. అఫ్గాన్ ప్రజలకు నాగరికత నేర్పేందుకు, సంస్కరించేందుకు అమెరికా సైన్యం 20 సంవత్సరాలపాటు ప్రయత్నించిందని. సొంత నియమాలు, జీవన ప్రమాణాలను ప్రవేశపెట్టాలని చూసిందని చెప్పారు. చివరకు విషాదం, నష్టం మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. అనుకున్న ఫలితం రాలేదన్నారు. చదవండి : Siddharth Shukla: దిగ్ర్భాంతిలో బాలీవుడ్, టీవీ ఇండస్ట్రీ 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధం వల్ల అమెరికా కంటే అఫ్గాన్ ప్రజలకే ఎక్కువ నష్టం వాటిల్లిందని పుతిన్ వ్యాఖ్యానించారు. ఒకరిపై బయటి నుంచి ఏదో రుద్దడం అసాధ్యమని తేల్చిచెప్పారు. ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే ముందుగా వారి చరిత్రను సమగ్రంగా తెలుసుకోవాలని, వారి సంస్కృతిని అలవర్చుకోవాలని, సంప్రదాయాలను గౌరవించాలని వెల్లడించారు. చదవండి : Afghanistan Crisis: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు? -
కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?
కాబూల్: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికాతోపాటు నాటో దళాలు పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయి. విదేశాలకు వెళ్లడానికి ఇప్పటిదాకా ఒకే ఒక్క ఆధారంగా నిలిచిన కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాల రాకపోకలు లేక నిశ్శబ్దం తాండవిస్తోంది. దీంతో అఫ్గాన్ ప్రజలు దేశ సరిహద్దులకు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా మరో దేశానికి వలస వెళ్లి తలదాచుకోవాలని ఆరాట పడుతున్నారు. ఇందుకోసం సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అఫ్గాన్ సరిహద్దులు జనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్, ఇరాన్, ఇతర మధ్య ఆసియా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అఫ్గాన్–పాకిస్తాన్ మధ్య కీలక సరిహద్దు తోర్ఖామ్. ప్రస్తుతం ఇక్కడ అఫ్గాన్ భూభాగంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడారని, గేటు తెరిచే సమయం కోసం వారంతా వేచి చూస్తున్నారని పాకిస్తాన్ అధికారి ఒకరు చెప్పారు. ఇక అఫ్గాన్–ఇరాన్ నడుమ సరిహద్దు అయిన ఇస్లామ్ ఖాలా బోర్డర్ పోస్టులో వేలాది మంది పడిగాపులు కాస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అఫ్గాన్ ప్రజల పట్ల ఇరాన్ భద్రతా సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరిస్తున్నారని, సరిహద్దును దాటే విషయంలో గతంలో పోలిస్తే ప్రస్తుతం కొంత వెలుసుబాటు కల్పిస్తున్నారని ఇరాన్లో అడుగుపెట్టిన అఫ్గాన్ వాసి ఒకరు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఎప్పుడు? అఫ్గాన్ తాలిబన్ల వశం కావడంతో ఇప్పుడు ప్రపంచం దృష్టి అక్కడి పరిపాలనపై పడింది. తాలిబన్లు ఎలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఎప్పుడు ఏర్పాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తాలిబన్లు 1996లో అఫ్గాన్ రాజధాని కాబూల్‌ను ఆక్రమించినప్పుడు గంటల వ్యవధిలోనే లీడర్షిప్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం తొందరపడకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అఫ్గాన్‌లో ఏకాభిప్రాయంతోనే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని తాను అంచనా వేస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చెప్పారు. అఫ్గాన్‌లో ప్రస్తుతం అధికారికంగా ప్రభుత్వమేదీ లేదు. నూతన సర్కారు ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారయ్యిందని, అతి త్వరలో ప్రకటిస్తామని తాలిబన్లు తెలిపారు. తాలిబన్ సీనియర్ నేత ముల్లా హెబతుల్లా అఖూంజాదా కొత్త ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని, ఆయన కింద ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు దేశాన్ని ముందుకు నడిపిస్తారని తాలిబన్ కల్చరల్ కమిషన్ సభ్యుడు అనాముల్లా సమాంఘనీ తెలియజేశారు. పంజ్‌షీర్ తిరుగుబాటుదారులతో చర్చలు విఫలం కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్‌పై తాలిబన్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నయానో భయానో ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. పంజ్‌షీర్ లోయలో అహ్మద్ మసూద్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్న సంగతి తెలి సిందే. ఇస్లామిక్ ఎమిరేట్‌లో చేరాలంటూ తాలిబన్ నాయకుడు ముల్లా అమీర్‌ఖాన్ ముతాఖీ బుధవారం పంజ్ షీర్ ప్రజలకు ఒక ఆడియో సందేశంలో పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత తాలిబన్లు, పంజ్‌షీర్ తిరుగుబాటుదారుల మధ్య భీకర ఘర్షణ జరిగినట్లు తెలి సింది. ఈ ఘర్షణలో 15 మంది తాలిబన్లు హతమయ్యారని, 200 మంది గాయపడ్డారని, 55 మంది తమకు లొంగిపోయారని తిరుగుబాటుదారుల ప్రతినిధి ఫహీం దష్తీ బుధవారం ప్రకటించారు. ఖతార్ నుంచి సాంకేతిక బృందం రాక కాబూల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ తాలిబన్లకు పెద్ద సంకటంగా మారింది. ఎయిర్‌పోర్టును నిర్వహించే సామర్థ్యం వారికి లేకపోవడమే ఇందుకు కారణం. అందుకే తమ మిత్ర దేశం ఖతార్ సాయాన్ని కోరుతున్నారు. తాలిబన్ల విజ్ఞప్తి మేరకు ఖతార్ ప్రభుత్వం బుధవారం ఒక సాంకేతిక బృందాన్ని ప్రత్యేక విమానంలో కాబూల్‌కు పంపించింది. ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు, విమానాల రాకపోకలపై ఈ బృందం తగిన సాయం అందించనుంది. కశ్మీర్‌కు విముక్తి లభించాలి: అల్–ఖాయిదా అఫ్గాన్‌ను మళ్లీ చేజిక్కించుకున్న తాలిబన్లకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్–ఖాయిదా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇస్లాం శత్రువుల కబంధ హస్తాల నుంచి కశ్మీర్, సోమాలియా, యెమెన్‌తోపాటు మిగతా ఇస్లామిక్ భూభాగాలకు విముక్తి లభించాలి. ఓ.. అల్లా! ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ఖైదీలకు స్వేచ్ఛను ప్రసాదించు’’ అని తన ప్రకటనలో ప్రార్థించింది. -
‘తాలిబన్ ఉగ్రవాద సంస్థా? కాదా? సమాధానం చెప్పాలి’
జమ్మూ కశ్మీర్: అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లతో భారత్ జరిపిన చర్చలను జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా తప్పుపట్టారు. ఆయన బుధవారం మీడియాతో మట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా కేంద్రం పరిగణిస్తుందా? లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాలిబన్ ఉగ్రవాద సంస్థ అయితే మంగళవారం వాళ్లతో ఎందుకు చర్చలు జరిపారని మండిపడ్డారు. తాలిబన్లు ఉగ్రవాదులు కాకపోతే.. ఐక్యరాజ్య సమితికి వెళ్లి ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించాలని చెప్పగలరా? అని నిలదీశారు. చదవండి: Afghanistan Cinema: అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు ఈ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని ఓమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. కేంద్రం తాలిబన్లను ఉగ్రవాదులుగా పరిణిస్తున్న క్రమంలో ఎందుకు చర్చలు జరిపారో సమాధానం చెప్పాలన్నారు. మంగళవారం తాలిబన్ నేత షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానెక్జాయ్‌తో ఖతార్‌లో భారత్ రాయబారి దీపక్ సమావేశమైన విషయం తెలిసిందే. అఫ్గాన్ గడ్డపై భారత వ్యతిరేకశక్తులను అడ్డుకోవడం, భారతీయుల స్వదేశానికి రాక తదితర అంశాలు చర్చకొచ్చాయి. తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. చదవండి: Taliban Attack On Panjshir: 8 మంది తాలిబన్లు మృతి! -
అఫ్గన్ థియేటర్ల మూత, బాలీవుడ్‌కు ఆర్థిక ముప్పు
అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారిపోతున్నాయి. తాలిబన్ల ఆరాచకాలకు ఆఫ్గాన్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తాలిబాన్ అఫ్గనిస్తాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్న ఆనంతరం అక్కడి బ్యూటీ పార్లర్లు, జిమ్‌లు ఇతరత్ర షాపులు మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి థియేటర్లను కూడా తాలిబన్లు మూసివేశారు. గత కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాల ప్రదర్శనతో కళకళలాడిన ఆఫ్ఘన్ థియేటర్లు తాలిబాన్ రాకతో కళ కోల్పోయాయి. దీంతో బాలీవుడ్‌కు ఆర్థీకంగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: ‘ఎన్నిసార్లు ఇలా దర్శనమిస్తావు కియారా’.. అది టాప్‌లెస్ ఫొటో కాదు! అయితే 90వ దశకంలో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనకు ఆఫ్ఘన్ పెద్ద వినియోగదారుగా ఉండేది. హిందీ సినిమాలు చూడటం అక్కడ కుటుంబ సంప్రదాయంగా ఉండేదంటే.. మన సినిమాలను వారు ఎంతగా ప్రేమించేవారో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. అంతేగాక అఫ్గనిస్తాన్ ప్రజలు బాలీవుడ్ చిత్రాలకు, హీరోహీరోయిన్లకు అభిమానులు. అలాగే చాలావరకు హిందీ చిత్రాలు ఆఫ్గనిస్తాన్‌లో చిత్రీకరణ జరిగేవి. అక్కడ ఎన్నో హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. హిందీ సినిమాల పాటలకు అక్కడి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ప్రస్తుతం మారిన పరిస్థితుల బాలీవుడ్‌కు పెద్ద ఎదురుదెబ్బన తగిలింది. చదవండి: నాకు మత్తు ఇచ్చి పోర్న్ వీడియో తీశారు: మాజీ మిస్ ఇండియా యూనివర్స్ తాలిబన్లు సంగీతం, సినిమాలను వ్యతిరేకిస్తుండటంతో బాలీవుడ్ మార్కెట్ పెద్ద మొత్తంలో నష్టపోనుంది. భారతీయ సినిమాలతో ఆఫ్ఘనిస్తాన్‌కు గత 46 ఏండ్లుగా అనుబంధం ఉంది. 1975లో ఫిరోజ్‌ఖాన్, రేఖ, హేమమాలిని నటించిన ‘సెయింట్’ అనే సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఆఫ్ఘన్లో జరిగింది. ఇక 1992లో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి నటించిన ‘ఖుదా గవా’ సినిమా షూటింగ్ కాబూల్‌లో జరిగింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆఫ్ఘన్లో వాతావరణం కొంత ఉద్రిక్తంగా ఉండటంతో.. అమితాబ్ బచ్చన్ రక్షణలో ఆఫ్ఘన్ దేశంలోని సగం వైమానిక దళాన్ని అప్పటి అధ్యక్షుడు మొహమ్మద్ నజీబుల్లా ఉంచారు. అదే సమయంలో అమితాబ్ రాయల్ హానర్ కూడా పొందారు. దీంతో ఆ సినిమాను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆఫ్గన్ ప్రజలు థియేటర్లకు క్యూకట్టారు. -
తీర్మానం జరిగింది.. ఒకవేళ ఆంక్షలు విధిస్తే..
వాషింగ్టన్: అఫ్గనిస్తాన్‌తో తమ దౌత్య సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభమైందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ‘ఆగస్టు 30న అఫ్గన్ నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడంతో అమెరికా సుదీర్ఘ యుద్ధాల్లో ఒకటి ముగిసింది. కొన్ని వారాల వ్యవధిలోనే దాదాపుగా లక్ష 23 వేల మందికి పైగా అఫ్గన్ పౌరులను, 6 వేల యూఎస్ పౌరులను అమెరికా సంకీర్ణ దళాలు రక్షిత ప్రదేశాలకు తరలించాయి’’ అని పేర్కొన్నారు. ఇకమీదట కూడా తమ పనిని కొనసాగిస్తామని, అఫ్గన్ ప్రజలను సురక్షితంగా తరలించడానికి, కాబుల్ విమానాశ్రయం పునఃప్రారంభానికి యూఎస్ తమ వంతు సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఖతార్ రాజధాని దోహాలోని తమ కార్యాలయం నుంచి అఫ్గన్‌తో దౌత్య సంబంధాలు కొనసాగిస్తామని తెలిపారు. దాదాపుగా వంద మంది అమెరికన్లు ఇంకా అఫ్గన్‌లోనే ఉన్నారని, వాళ్లను సురక్షితంగా దేశానికి తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నెడ్ ప్రైస్ వెల్లడించారు. అదే విధంగా.. దేశం వీడాలనుకున్న వారికి ఇబ్బంది కలగకుండా.. తాలిబన్లు ఎటువంటి ఆంక్షలు విధించరాదని, ఇందుకు సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం చేసినట్లు తెలిపారు. ఒకవేళ తాలిబన్లు ఇందుకు సానుకూలంగా స్పందించనట్లయితే, తమ పౌరులను ఎలా తీసుకురావాలో తెలుసునంటూ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. చదవండి: US Afghanistan Exit: ఇకపై విదేశీ గడ్డ మీద అడుగుపెట్టకుండానే: బైడెన్ -
ఆసీస్‌తో చారిత్రక సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో తాలిబన్ ప్రతినిధి అహ్మదుల్లా వసీఖ్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. తాలిబన్లు అఫ్గాన్ క్రికెట్ విషయాల్లో తల దూర్చబోరని స్పష్టమైన హామీ ఇచ్చారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం యధావిధిగా మ్యాచ్‌లు ఆడవచ్చని, తమవైపు నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండబోదని భరోసా ఇచ్చారు. తమకు ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ముఖ్యమని, తమ దేశ క్రికెట్ జట్టు విదేశీ పర్యటనలకు వెళ్లినా, విదేశీ జట్లు తమ దేశానికి వచ్చినా ఎటువంటి అభ్యంతకాలు కానీ అంతరాయాలు కానీ ఉండబోవని స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబరులో జరగాల్సిన ఆసీస్ పర్యటన యధావిధిగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో అఫ్గాన్ జట్టు నవంబర్ 27న ఆసీస్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో తలపడబోతుంది. హోబర్ట్ వేదికగా జరిగే ఈ చారిత్రక మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సైతం ప్రకటించడం విశేషం. ఇదిలా ఉంటే, అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వరుస ట్వీట్ల ద్వారా తన ఆవేదనను వ్యక్తపరుస్తున్న సంగతి తెలిసిందే. తమ దేశాన్ని కాపాడాలని, అఫ్గాన్ ప్రజలను చంపడం ఆపాలని ఆయన చేసిన ట్వీట్లపై తాలిబన్లు ఏరకంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్ ఆడతారని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఇటీవలే స్పష్టం చేసింది. చదవండి: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
మాట ఇచ్చాను.. నిలబెట్టుకున్నాను.. ఇకపై విదేశీ గడ్డ మీద...
వాషింగ్టన్: అఫ్గనిస్తాన్ నుంచి తమ బలగాలు ఉపసంహరించుకోవడాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమర్థించుకున్నారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ‘‘ఇది సరైన, తెలివైన నిర్ణయం. అమెరికాకు మేలు చేసే అత్యుత్తమ నిర్ణయం’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. ‘‘అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ప్రజలు, మిలిటరీ సలహాదారులు, సర్వీస్ చీఫ్‌లు.. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో(అఫ్గన్) పనిచేస్తున్న సైనికులు కోరుకున్నారు’’ అని పేర్కొన్నారు. సైన్యాన్ని వెనక్కి రప్పించడాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేదని, గతం మరిచి మెరుగైన భవిష్యత్తుకై ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అన్నారు. అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన నేపథ్యంలో జో బైడెన్ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్స్తాన్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు మన సైనికులు వారి ప్రాణాలను పణంగా పెట్టారు. ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ‘‘ఇది యుద్ధం కోసం చేపట్టిన చర్య కాదు.. దయా హృదయంతో కూడిన మిషన్’’. ఒక్క అమెరికా తప్ప.. ప్రపంచ చరిత్రలో ఏ దేశం ఇంత గొప్పగా వ్యవహరించలేదు. బలగాల ఉపసంహరణ నిర్ణయానికి పూర్తి బాధ్యత నాదే’’ అని పేర్కొన్నారు. విదేశీ గడ్డ మీద అడుగుపెట్టకుండానే.. ‘‘అఫ్గనిస్తాన్‌లో యుద్ధం ముగిసింది. ఈ యుద్ధాన్ని ముగించే క్రమంలో సవాళ్లు ఎదుర్కొన్న నాలుగో అధ్యక్షుడిని నేను. నా ముందు ప్రెసిడెంట్‌గా పనిచేసిన వారు మే 1న తాలిబన్లతో శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. అమెరికా బలగాలను వెనక్కి పిలిపిస్తామని అంగీకరించారు. నేను సైతం.. యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా ప్రజలకు మాట ఇచ్చాను. దానిని నిలబెట్టుకున్నాను. ఇక అఫ్గన్ లేదా ఇతర ప్రపంచ దేశాల్లో అమెరికా సైనికులు అడుగుపెట్టకుండానే ఉగ్రవాదాన్ని నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటాం. అతి తక్కువ మంది సేవలను ఉపయోగించుకుంటాం. అమెరికాకు గానీ, మా మిత్ర దేశాలకు గానీ ఎటువంటి హాని తలపెట్టాలని చూసినా మేం సహించం. అటువంటి వారిని క్షమించం. వాళ్లు మూల్యం చెల్లించక తప్పదు. వెంటాడి, వేటాడి మట్టుబెడతాం’’ అని ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. There is nothing low-grade, low-risk, or low-cost about any war. It was time to end the war in Afghanistan. pic.twitter.com/jAGbWnBzol — Joe Biden (@JoeBiden) September 1, 2021 చదవండి: Taliban: ‘రష్యా, అమెరికాలను ఓడించారు’ సరే.. మరి అసలు సమస్య?! -
పంజ్‌షీర్‌పై దాడి: 8 మంది తాలిబన్లు మృతి!
కాబూల్: తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్‌షీర్ ప్రాంతంపై పట్టుకోసం తాలిబన్లు ప్రయత్నాలు ఆరంభించారు. ఇందులో భాగంగా పంజ్‌షీర్ ప్రాంతంపై తాలిబన్లు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 8 తాలిబన్లు మరణించారని పంజ్‌షీర్ వర్గాలు తెలిపాయి. పంజ్‌షీర్‌లో తాలిబన్ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న అహ్మద్ మసూద్ ప్రతినిధి ఫహీమ్ దాస్తీ ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం రాత్రి తాలిబన్లు తమ లోయపై దాడికి వచ్చారని, అయితే తమ బలగాలు దాడిని తిప్పికొట్టాయని చెప్పారు. ఇరువైపులా పలువురికి గాయాలయ్యాయని, కానీ తాలిబన్ల వైపు ప్రాణనష్టం కూడా జరిగిందని చెప్పారు. ఓవైపు 20 ఏళ్ల యుద్దానికి ముగింపు పలుకుతూ అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తవుతుండగా.. మరోవైపు తాలిబన్లు ఈ దాడికి దిగడం గమనార్హం. చదవండి: Taliban: ‘రష్యా, అమెరికాలను ఓడించారు’ సరే.. మరి అసలు సమస్య?! -
‘రష్యా, అమెరికాలను ఓడించారు’ సరే.. మరి అసలు సమస్య?!
కాబూల్: అమెరికా దళాల ఉపసంహరణ పూర్తి కావడంతో విజయం సాధించామంటూ తాలిబన్లు ప్రకటించుకున్నారు. యూఎస్ దళాలు వైదొలగగానే కాబూల్ విమానాశ్రయంలో తాలిబన్ బలగాలు కలదిరిగాయి. అప్పుడు రష్యాను, ఇప్పుడు అమెరికాను ఓడించామంటూ సంబరాలు చేసుకున్నాయి. అనంతరం తాలిబన్ నాయకులు కొందరు రన్‌వేపైకి చేరుకున్నారు. తాలిబన్ నాయకులకు అంగరక్షకులుగా నిలిచిన బద్రి దళాలు ఫొటో ఫోజులిచ్చాయి. ‘అఫ్గానిస్తాన్ అంతిమంగా స్వేచ్ఛను సాధించింది’ అని తాలిబన్ నేత హెక్మతుల్లా వాసిక్ ప్రకటించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కేబినెట్‌ను ప్రకటిస్తామని చెప్పారు. అందరికీ క్మాభిక్ష పెట్టినందున ప్రజలంతా తమ పనులకు తిరిగి వెళ్లాలని, పరిస్థితులు క్రమంగా సాధారణ స్థాయికి వస్తాయని, అంతవరకు ప్రజలు ఓపిక వహించాలని విజ్ఞప్తి చేశారు. విమానాశ్రయాన్ని పునఃప్రారంభించడం తాలిబన్లకు ఎదురయ్యే తొలి అతిపెద్ద సవాలు కానుంది. మరోవైపు పూర్తి స్వాతంత్య్రం పొందినందుకుగాను అఫ్గాన్లకు తాలిబన్ రాజకీయ ప్రతినిధి షాబుద్దీన్ డెలావర్ శుభాకాంక్షలు చెప్పారు. బలగాల ఉపసంహరణ అనంతరం అఫ్గాన్‌లో ఇంకా 200మంది అమెరికన్లున్నారు. ఎయిర్‌పోర్టులోని విమానం కాక్‌పిట్‌లో కూర్చున్న తాలిబన్ సభ్యుడు అంతా హడావుడి మంగళవారం ఉదయం విమానాశ్రయం పరిసరాల్లో ఎప్పటిలాగానే హడావుడి, ఆందోళన కనిపించాయి. టరి్మనల్స్‌లో లగేజులు, దుస్తులు, పలు డాక్యుమెంట్లు చెల్లాచెదరుగా పడిఉన్నాయి. ఆశావహులు విమానాశ్రయం వైపునకు రాకుండా తాలిబన్లు రోడ్లపై కంచెలతో నిలువరించారు. యూఎస్ దళాలు వైదొలిగే క్షణాలు ఆసన్నమయ్యే సమయంలో మరోమారు దాడులు జరగకుండా జాగ్రత్త వహించారు. ఒక్కసారి యూఎస్ దళాలు వెళ్లడం పూర్తవగానే తాలిబన్ బలగాలు భారీగా విమానాశ్రయంలోకి వచ్చాయి. ఈ సందర్భంగా బద్రి యూనిట్‌ను ఉద్దేశించి తాలిబన్ నేత జబిహుల్లా ప్రసంగించారు. ఇకనుంచి దేశ రక్షణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎయిర్పోర్ట్ పునఃప్రారంభానికి తమ సాంకేతిక బృందం పనిచేస్తోందని జబిహుల్లా విలేకరులకు చెప్పారు. ఇక తమ దేశం స్వేచ్ఛగా ఉంటుందని, షరియా చట్టం అమలు చేస్తామని తాలిబన్లు చెప్పారు. ఆర్థికమే అసలు సమస్య అఫ్గాన్లు స్వేచ్ఛ పొందారని తాలిబన్లు ప్రకటించుకుంటున్నా అసలు సమస్య ఇప్పుడే ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వస్తున్న అంతర్జాతీయ సాయం ఆగిపోవడం, కీలక నిధులను అమెరికా తొక్కిపెట్టడంతో తాలిబన్లకు పాలన సంక్లిష్టం కానుందంటున్నారు. బ్యాంకుల్లో నిధులన్నీ కస్టమర్లు విత్‌డ్రా చేసుకుంటున్నారు. దేశంలోని ప్రభుత్వోద్యోగులకు జీతాలు అందడం లేదు. దేశంలో కరువు తాండవిస్తుండడంతో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయి. పాలన గాడిన పెట్టేందుకు తాలిబన్లు ఏమి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. చదవండి: Afghanistan Crisis: మరో యుద్ధం మొదలైంది! -
అఫ్గాన్‌లో మరో యుద్ధం మొదలైంది!
గెలవని యుద్ధం ఎన్నాళ్ళు చేస్తామనే ఆలోచనొచ్చాక, ఎవరికైనా పోరాటం కొనసాగించడం కష్టమే. లేస్తే మనిషిని కాననే అగ్రరాజ్యానికైనా నిస్పృహ తప్పదు. ఇరవయ్యేళ్ళ క్రితం స్వాతిశయంతో అఫ్గాన్‌లో మొదలుపెట్టిన తీవ్రవాదంపై యుద్ధానికి అమెరికా ఎట్టకేలకు అగౌరవ ప్రదమైన రీతిలో స్వస్తి చెప్పింది. అమెరికన్ చరిత్రలోనే ఎన్నడూ లేనంత కాలంగా సాగుతున్న అఫ్గాన్‌లోని యుద్ధమనే నెత్తిమీది బరువును ఎప్పుడు దించేసుకుందామా అని కొన్నేళ్ళుగా చూస్తున్న అమెరికా ఎట్టకేలకు ఆ భారం వదిలించుకుంది. సైనిక ఉపసంహరణకు తనకు తాను చెప్పిన తుది గడువు ఆగస్టు 31 కన్నా 24 గంటల ముందే 30వ తేదీ అర్ధరాత్రికే అంతా ముగిం చింది. రెండేళ్ళ క్రితం 2020 ఫిబ్రవరిలో శాంతి ఒప్పందం పేరిట తాలిబన్లకు చట్టబద్ధతనూ, లేని పోని బలాన్ని అందించి అమెరికా తప్పు చేసింది. చివరకు అఫ్గాన్‌లో శాంతియుత, సుస్థిర వ్యవస్థకు చోటివ్వకుండా హడావిడి డెడ్‌లైన్ ప్రకటన, ప్రణాళిక లేని సైనిక ఉపసంహరణలతో ఆఖరి తప్పూ పూర్తి చేసింది. (చదవండి: షారుక్ పాటకు.. స్టెప్పులు వేసిన అమెరికన్ జంట) ఆఖరి విమానంలో అమెరికా తాత్కాలిక రాయబారి, సైనికాధికారి సహా మిగిలిన కొందరు సైనికులూ తిరుగుముఖం పట్టారు. ఆగస్టు 15న కాబూల్ కైవసంతో మొదలైన తాలిబన్ల జైత్రయాత్రకు పదిహేను రోజుల్లోనే దక్కిన పతాకస్థాయి విజయమిది. చివరి దాకా పహారా కాసిన కాబూల్ విమానాశ్రయాన్ని సైతం అమెరికన్ సైనికులు ఖాళీ చేయడంతో, ఇప్పుడు అఫ్గాన్ మొత్తం తాలిబన్ల చేతికి వచ్చేసినట్టయింది. పంజ్‌షీర్ లోయ లాంటి చోట్ల అంతర్గత ప్రతిఘటన ఉన్నా, ఆధిపత్యం తమదేనని నిరూపించుకొనేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్ అవతరించిందంటూ గాలిలో కాల్పులతో సాయుధ తాలిబన్ల సంబరాలు... గాలిలో హెలికాప్టర్ మీద నుంచి మనిషిని ఉరి తీయడాలు... చూశాక కొత్త హయాం ఎలా ఉంటుందో అనూహ్యమేమీ కాదు. ‘మా దేశం మీదకొస్తే, ఎవరికైనా ఏ గతి పడుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ’ అన్న తాలిబన్ ప్రతినిధుల మాట ఇప్పుడు ప్రపంచంలో ప్రతిధ్వనిస్తున్న హెచ్చరిక. విపక్ష రిపబ్లికన్లతో పాటు స్వపక్ష డెమోక్రాట్లు, చివరకు సొంత పౌరుల నుంచి కూడా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు విమర్శలు తప్పలేదు. వాటన్నిటి మధ్యే ఆయన తాజా అధికారిక ప్రకటన చేశారు. లక్షమంది అఫ్గాన్ పౌరులు, 6 వేల మంది అమెరికన్ సైనికులు సహా అంతా కలిపి 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన సుదీర్ఘ యుద్ధం... 2.3 లక్షల కోట్ల డాలర్లకు పైగా అమెరికా ఖర్చు చేసిన కళ్ళెదుటి యుద్ధం ముగిసింది. కానీ, కనిపించని కొత్త యుద్ధం మొదలైంది. ఆరంభం నుంచి అంతిమ ఘట్టం దాకా అనేకానేక వ్యూహాత్మక తప్పిదాల ఫలితమే – ఈ మలి యుద్ధం. అమాయక అఫ్గాన్లు చేయాల్సి వచ్చిన హక్కుల యుద్ధం. తీవ్రవాదానికి అఫ్గాన్ అడ్డా కాకూడదని పొరుగునున్న భారత్ సహా పలు ప్రపంచ దేశాలు సాగించే రక్షణ, దౌత్య యుద్ధం. సొంత గడ్డ మీద ఉన్న సవాలక్ష తెగలతోనూ, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతోనూ తాలిబన్లు చేయాల్సి ఉన్న అధికార సహవాస యుద్ధం. ఛాందసవాద మూర్ఖత్వానికి మానవత్వం బలి కూకూడదని యావత్ మానవాళి చేయాల్సిన మహా యుద్ధం. పాత తప్పుల ఫలితంగా, భవిష్యత్ పరిణామాలను ప్రభావితం చేసే శక్తిని పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు చాలావరకు కోల్పోవడమే ఈ కొత్త యుద్ధంలోని కీలక కోణం. (చదవండి: తాలిబన్లతో భారత రాయబారి చర్చలు) అమెరికా ఛత్రచ్ఛాయలోని కాలంలో భారత్ సైనిక జోక్యం చేసుకోకుండా పార్లమెంట్ మొదలు అనేక నిర్మాణాలు, అభివృద్ధి సాయాలు, దౌత్య సంబంధాలతో అఫ్గాన్ పౌరసమాజం మనసు గెలిచింది. ప్రజాస్వామ్య అఫ్గాన్ సర్కారుకు ఆఖరు దాకా మద్దతు నిచ్చింది. ఇప్పుడిక మారిన పరిస్థితుల్లో వ్యూహం మార్చుకోక తప్పదు. అనిశ్చిత అఫ్గాన్‌లో కొత్త తాలిబన్ పాలనను మొత్తంగా తోసిపుచ్చడం కన్నా సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారిని దోవలోకి తెచ్చుకోవడమే ఇప్పటికి తెలివైన దౌత్యనీతి. అఫ్గాన్‌ను అమెరికా ఖాళీ చేసిన కొద్దిగంటలకే మంగళవారం భారత్ తొలిసారిగా తాలిబన్లతో చర్చలకు శ్రీకారం చుట్టింది. ఖతార్‌లోని భారత రాయబారి తాలిబన్ల అభ్యర్థన మేరకు దోహాలో వారి ప్రతినిధులను కలసి, చర్చలు జరిపినట్టు కథనం. అఫ్గాన్ భూభాగాన్ని తీవ్రవాదానికి వినియోగించుకొనేందుకు అనుమతించరాదని చర్చల్లో భారత్ తెలిపింది. అదే సమయంలో మన పౌరులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అనుమతించాలనీ కోరింది. అలాగే, అఫ్గాన్ పరిణామాలపై దృష్టి పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. అంతర్జాతీయంగా చట్టబద్ధత, ఆగిన విదేశీసాయం కోసం ఆరాటంతో తాలిబన్లు కూడా మెత్తటి కబుర్లు చెబుతున్నారు. కానీ, వివిధ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలతో సంబంధమున్న తాలిబన్లను ఎంతవరకు నమ్మాలనేది ఇప్పుడు ప్రపంచమంతటితో పాటు భారత్‌కూ ఉన్న సమస్యే. మరోపక్క తాలిబన్ల భయంతో వేలాది అఫ్గాన్ జనం పాకిస్తాన్‌కి తరలిపోతుండడం ఇంకో విషాదం. లక్షా 23 వేల మందికి పైగా పౌరులను అమెరికా దళాలు అఫ్గాన్ నుంచి తరలించినా, వివిధ దేశాల పౌరులు ఇంకా అఫ్గాన్‌లో చిక్కుబడి ఉన్నారు. వెరసి, అమెరికా మునుపెన్నడూ లేనంత సుదీర్ఘకాలం సాగించిన యుద్ధం అన్ని రకాలుగా విఫలమైంది. తీరని అవమాన భారమే మిగిలింది. తీవ్రవాదంపై మొదలుపెట్టిన యుద్ధాన్ని చివరకు తీవ్రవాదులకే సానుకూలమయ్యేలా ముగించి, సేనలు ఇంటిముఖం పట్టడం విరోధాభాస. శాంతి అంటే యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య విరామం అంటారు. కొత్త యుద్ధానికి సిద్ధమవడం ఒక్కటే ఇప్పుడు ప్రపంచానికి మిగిలింది. (చదవండి: 20 ఏళ్ల యుద్ధం ముగిసింది.. చిట్టచివరి సోల్జర్ ఈయనే!) -
రెచ్చిపోయిన తాలిబన్లు.. చేతికి చిక్కిన బిలియన్ డాలర్ల పరికరాలు
కాబూల్: అమెరికా భద్రతా బలగాలు అఫ్గానిస్తాన్ నుంచి అడుగు బయట పెట్టగానే.. తాలిబన్లు రెచ్చిపోయారు. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ మీదుగా వెళ్తున్న యూఎస్ బ్లాక్ హాక్ హెలికాప్టర్‌కు ఓ మృతదేహాన్ని తాడుతో వేలాదీసి కట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇరవై ఏళ్లుగా అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌లో అందిస్తున్న సేవలు నేటితో ముగిశాయి. ముందుగా నిర్దేశించిన ప్రకారం ఆగష్టు 31 తెల్లవారుజామున అమెరికా జవాన్లు, పౌరులను తరలిస్తున్న చివరి విమానం అఫ్గాన్ నుంచి బయల్దేరిన తర్వాత గాల్లోకి కాల్పులు జరిపి తాలిబన్లు సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: Afghanistan Crisis: ప్లేట్ భోజనం ఖరీదు రూ.7 వేల పైనే! అయితే తాజాగా ‘‘కాందహార్ ప్రావిన్స్‌లో పెట్రోలింగ్ చేయడానికి తాలిబన్లు తీసుకున్న యూఎస్ మిలిటరీ హెలికాప్టర్‌కు తాలిబన్లు ఓ వ్యక్తిని చంపి అతడిని వేలాడతీశారు’’ అంటూ పలువురు జర్నలిస్టులు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై సెనేటర్ టెడ్ క్రజ్ స్పందిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మండి పడ్డారు. ఈ విపత్తును తీవ్రమైన విషాదంగా.. ఊహించలేనిదిగా వర్ణించారు. అయితే ఆ మృతదేహం అమెరికాకు చెందిన ఓ వ్యాఖ్యాతది అంటూ ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. కాగా అఫ్గానిస్తాన్‌లో బిలియన్ డాలర్ల విలువైన సైనిక పరికరాలను యూఎస్ దళాలు అక్కడే వదిలేశాయి. ఇప్పుడు వాటిని తాలిబన్లు ఉపయోగించనున్నారు. కాబూల్ విమానాశ్రయంలో 73 విమానాలు, 27 హై-మొబిలిటీ మల్టీపర్పస్ వీల్డ్ వెహికల్స్ (హమ్వీ) కూడా అక్కడే వదిలేశారు. వాటితో పాటు కౌంటర్ రాకెట్, ఆర్టీలరీ, మోర్టార్ (సి-ర్యామ్) క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నైట్ విజన్ గాగుల్స్ కూడా భారీ సంఖ్యలో మిగిలిపోయాయి. దీనిపై చాలా మంది నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. చదవండి: విమానాశ్రయాన్ని దిగ్బంధిస్తున్న తాలిబన్లు Another landmark picture taking the world in a new era of terror. Taliban hang a person, presumed to be an American interpreter, from a U.S. Blackhawk helicopter. The left over US helicopters will now be used in #Afganistan like this. pic.twitter.com/8q6C5bo4IB — Sudhir Chaudhary (@sudhirchaudhary) August 31, 2021 #UPDATES The Taliban joyously fire guns into the air and offer words of reconciliation, as they celebrate defeating the US and returning to power in a victory that is a "lesson for other invaders" https://t.co/zenNKV5CFK pic.twitter.com/IHU2rFkFfg — AFP News Agency (@AFP) August 31, 2021 -
జమ్ము కశ్మీర్లో అఫ్గాన్ యువకుడు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
జమ్మూ కశ్మీర్: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న నేపథ్యంలో ఆ దేశప్రజలు భయంతో ఇతర సరిహద్దు దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే తాజాగా అఫ్గాన్‌కు చెందిన ఓ యువకుడు జమ్ము కశ్మీర్లోకి ప్రవేశించి.. కథువా జిల్లాలోని లఖన్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఓ కోవిడ్ నిర్ధారణ కేంద్రంలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వివరాల ప్రకారం.. అబ్దుల్ రెహ్మాన్(17) అఫ్గాన్ దేశానికి చెందిన అబ్దుల్ రషీద్ అహ్మద్ కుమారుడు. అతను మంగళవారం ఉదయం 6.30 సమయంలో భారత్‌లోనికి ప్రవేశించి కథువా జిల్లాలోని లఖన్‌పూర్ ప్రాంతంలో ఉన్న కోవిడ్ నిర్ధారణ కేంద్రంలో కరోనా టెస్ట్ చేసుకోవడానికి వచ్చాడని పోలీసులు తెలిపారు. చదవండి: Talibans: తాలిబన్లతో భారత రాయబారి చర్చలు అతని సోదరుడు ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని బాలుడు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే ఆ యువకుడు కథువా జిల్లాలోని లఖన్‌పూర్ ప్రాంతానికి ఎలా ప్రవేశించాడనే విషయంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అబ్దుల్ రెహ్మాన్ వద్ద ఇరు దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. తన పాస్‌పోర్టు, వీసా భారత్‌లోని అఫ్గానిస్తాన్ రాయబార కార్యాలయంలో ఉన్నాయని ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. అఫ్గానిస్తాన్ రాయబార కార్యాలయ అధికారుల నుంచి యువకుడి పాస్‌పోర్టు, వీసాకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తామని పోలీసులు తెలిపారు. అబ్దుల్ రెహ్మాన్ భారతదేశంలోకి ఎలా ప్రవేశించాడనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: తాలిబన్లను పొగిడిన పాక్ క్రికెటర్‌పై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు -
తాలిబన్లతో భారత రాయబారి భేటి
సాక్షి, న్యూఢిల్లీ: తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తరువాత భారత్‌తో సంబంధాల విషయంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఖతార్‌లోని భారత రాయబారి దీపక్ మిట్టల్ తాలిబన్ ప్రతినిధి షేర్ మహ్మద్ అబ్బాస్ మధ్య చర్చలు విశేషంగా నిలిచాయి. మంగళవారం దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తాలిబన్ల అభ్యర్థన మేరకు ఈ సమావేశం జరిగిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరుపక్షాల మధ్య మొట్టమొదటి అధికారిక దౌత్య సంబంధాలపై జరిగిన ఈ మీట్లో భారత్ లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని తాలిబన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అఫ్గన్ మట్టిని భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాద చర్యలకు ఏంతమాత్రం ఉపయోగించరాదని మిట్టల్ తాలిబన్లను కోరారు. ఈ చర్చల్లో అఫ్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత, వారిని వేగంగా తరలింపు లాంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే అఫ్గాన్ జాతీయులు, ముఖ్యంగా మైనారిటీలు, భారతదేశాన్ని సందర్శించాలనుకునే వారి ప్రయాణ ఏర్పాట్లు కూడా చర్చకు వచ్చినట్టు తెలిపింది. భారత్‌తోవాణిజ్య, ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తామని, తమ వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: taliban: మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు -
కాబూల్ మిషన్: చిట్టచివరి సైనికుడు ఈయనే.. ఫొటో వైరల్!
The last American soldier to leave Afghanistan: దాదాపు ఇరవై ఏళ్లుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా బలగాలు మంగళవారంతో పూర్తిగా వెనక్కి మళ్లాయి. కాబూల్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికాకు చెందిన సీ-17 విమానం బయల్దేరడంతో సేనల ఉపసంహరణ పూర్తైంది. కాగా న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సంబంధించిన సెప్టెంబరు 11, 2001 నాటి ఉగ్రదాడి(ఆల్‌ఖైదా) తర్వాత అమెరికా సేనలు.. అఫ్గనిస్తాన్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. తాలిబన్ ప్రభుత్వాన్ని పడగొట్టి అగ్రరాజ్యం పూర్తి ఆధిపత్యం సాధించింది. అశ్రఫ్ ఘనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి తాలిబన్ల అరాచకాలకు చెక్ పెట్టే విధంగా ఎన్నో ఆపరేషన్లు చేపట్టింది. ఈ క్రమంలో కొన్ని లక్షల కోట్ల డాలర్లకు పైగానే ఖర్చు పెట్టింది. అయితే, 2020లో తాలిబన్లతో కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం నేపథ్యంలో తమ సేనలను ఉపసంహరించుకునేందుకు నాటి ట్రంప్ ప్రభుత్వం అంగీకరించింది. దశల వారీగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో వేగంగా పుంజుకున్న తాలిబన్లు.. అఫ్గన్ సైన్యాన్ని ఓడించి ప్రధాన పట్టణాలు సహా రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకుని అఫ్గన్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నాయి. దీంతో అధ్యక్షుడిగా ఉన్న అశ్రఫ్ ఘనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పారిపోయి తలదాచుకుంటున్నారు. మరోవైపు తాలిబన్ల గత పాలనలోని అరాచకాలు తెలిసిన అఫ్గన్ ప్రజలు, విదేశీయులు సైతం దేశం విడిచి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. అమెరికా, మిత్ర దేశాలు చేపట్టిన తరలింపు ప్రక్రియ ద్వారా ఇప్పటికే వేలాది మంది అఫ్గన్‌ను వీడారు. ఈ క్రమంలో అమెరికా అమెరికా సేనలు ఆగష్టు 31 నాటికి ఖాళీ చేయాలని తాలిబన్లు బైడెన్ సర్కారుకు డెడ్‌లైన్ విధించగా నేటితో అది పూర్తైంది. ఈ నేపథ్యంలో.. 20 ఏళ్ల యుద్ధంలో ఎంతో మంది సైనికులను పోగొట్టుకొట్టున్న అమెరికా ఎట్టకేలకు నేటితో అమెరికా తమ బలగాలను ఉపసంహరించుకుంది. చదవండి: అఫ్గన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ.. బైడెన్ కీలక వ్యాఖ్యలు చిట్ట చివరి సైనికుడు ఈయనే! ఈ విషయాన్ని ధ్రువీకరించిన అమెరికా రక్షణ శాఖ అఫ్గన్‌ను వీడిన చివరి సైనికుడి పేరిట ఓ ఫొటోను ట్విటర్లో షేర్ చేసింది. ‘‘82వ ఎయిర్‌బోర్న్ డివిజన్, 18 ఎయిర్‌బోర్న్ కార్‌్ప్స కమాండర్, మేజర్ జనరల్ క్రిస్ డోనా.. ఆగష్టు 30, 2021న అమెరికా వైమానిక దళ విమానం సీ-17లో ప్రవేశించడంతో కాబూల్‌లో యూఎస్ మిషన్ ముగిసింది’’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది అమెరికా పెత్తనం ఇక ముగిసిందని పేర్కొంటుండగా.. మరికొందరు.. తాలిబన్ల అరాచకాలు మళ్లీ చూడటానికి సిద్ధంగా ఉండండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక బలగాల ఉపసంహరణ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌లో మిగిలిపోయిన యుద్ధ విమానాలను అమెరికా సైన్యం విచ్ఛిన్నం చేసింది. ఇకపై అవి ఎగురలేవని, వాటిని ఎవరూ ఆపరేట్ చేయలేరని యూఎస్ జనరల్ కెన్నెత్ మెకాంజీ పేర్కొన్నారు. -వెబ్‌డెస్క్ చదవండి: ఇది మనందరి విజయం.. వారికి గుణపాఠం.. కంగ్రాట్స్: తాలిబన్లు -
మా నుంచి భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదు: తాలిబన్లు
కాబూల్: భారతదేశానికి తాలిబన్ల నుంచి ఎలాంటి ముప్పు ఉండబోదని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం స్పష్టం చేశారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జబీహుల్లా పలు అంశాలను ప్రస్తావించారు. ‘ఆసియా ప్రాంతంలో భారత్ కీలకమైన దేశం. గత అఫ్గాన్ ప్రభుత్వం, భారత్ మధ్య మంచి సంబంధాలు కొనసాగాయి. తాలిబన్ల నేతృత్వంలో ఏర్పడే నూతన అఫ్గాన్ ప్రభుత్వం సైతం అదే స్థాయిలో సహృద్భావ సంబంధాలను కోరుకుంటోంది’ అని జబీహుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తో కలసి భారత వ్యతిరేక కార్యకాలాపాలకు తాలిబన్లు పాల్పడబోతున్నారనే వార్తలపై జబీహుల్లా స్పందించారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. తాలిబన్లు భారత్‌కు ఎటువంటి హానీ తలపెట్టబోరన్నారు. తాలిబన్లు పాక్‌నూ తమ సొంత దేశంగా భావిస్తారని జబీహుల్లా ఇటీవల పేర్కొన్నారు. ఆ అంశంపై వివరణ ఇచ్చారు. ‘పాక్‌తో అఫ్గాన్‌కు సరిహద్దు బంధముంది. అఫ్గానీయులు తరచూ సరిహద్దు దాటి బంధువులు, వాణిజ్యం కోసం పాక్ ప్రజలతో మమేకమవుతారు. అలాంటి బంధాన్నే మేం కోరుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం’ అని అన్నారు. ‘అన్ని దేశాలతో మంచి దౌత్య సంబంధాలనే మేం ఆశిస్తున్నాం. ముఖ్య దేశాలన్నీ ఎంబసీలను కొనసాగించాలి’ అని అన్నారు. పంజాబ్ ప్రావిన్స్‌పైనా మాట్లాడారు. ‘ఒక ఉమ్మడి నిర్ణయం కోసం రెండు వైపుల నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధమే ఏకైక మార్గమని మేం భావించట్లేదు’ అని చెప్పారు. -
తలకు తుపాకీ ఎక్కుపెట్టి మరీ.. తాలిబన్ల అరాచకం
కాబూల్: అఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాము శాంతిని కోరుకుంటున్నట్లు ప్రకటించిన తాలిబన్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే మహిళలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక జర్నలిస్టులు, సాధారణ ప్రజలపై కూడా వారి అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయుధాలు చేతబట్టి ఓ న్యూస్ చానెల్లో ప్రత్యక్షమైన తాలిబన్లు.. యాంకర్‌కు తుపాకులు ఎక్కుపెట్టారు. తాము పూర్తిగా మారిపోయారని, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలంటూ అతడిని బెదిరించారు. అందుకు సరేనన్న ఆ యాంకర్.. వారు చెప్పిన మాటలను అప్పజెప్పి.. బతుకు జీవుడా అన్నట్లు ఊపిరి పీల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నేటితో(ఆగష్టు 31)తో అఫ్గనిస్తాన్‌లో అమెరికా సేనల ఉపసంహరణ పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వీడియో మరోసారి షేర్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘‘ఎంచక్కా తుపాకులు ఎక్కుపెట్టి.. మారిపోయామని చెప్పమన్నారు. తద్వారా తాము మారలేదని చెప్పకనే చెప్పారు. ఇక ఇప్పుడు వారిని అడ్డుకునేందుకు అమెరికా సేనలు కూడా లేవు. ఇష్టారాజ్యం’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఇది మన విజయం; అమెరికాతో పాటు ఇతర దేశాలతో కూడా.. -
ఇది మనందరి విజయం.. వారికి గుణపాఠం.. కంగ్రాట్స్: తాలిబన్లు
కాబూల్: అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తైన సందర్భంగా తాలిబన్ అధికార ప్రతినిధి జుబీహుల్లా ముజాహిద్ అఫ్గన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలో ఇదొక గొప్ప విజయం అంటూ హర్షం వ్యక్తం చేశారు. తమకు పూర్తిగా స్వేచ్ఛ, స్వాత్రంత్యాలు లభించాయని, ఆక్రమణదారులకు ఇదొక గుణపాఠమని వ్యాఖ్యానించారు. అయితే, తాము అమెరికాతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ మేరకు హమీద్ కర్జాయి ఎయిర్‌పోర్టు నుంచి అమెరికాకు చెందిన సీ-17 విమానం వెళ్లిపోయిన అనంతరం రన్‌వే నుంచే ప్రజలకు సందేశం అందించారు. ‘‘అఫ్గనిస్తాన్‌కు శుభాభినందనలు. ఈ విజయం మనందరిదీ. అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాలతో కూడా మేం సత్సంబంధాలు కోరుకుంటున్నాం. అంతర్జాతీయ సమాజంతో దౌత్యపరమైన సంబంధాలను మేం స్వాగతిస్తున్నాం’’ అని జుబీహుల్లా పేర్కొన్నారు. కాగా దాదాపు 20 ఏళ్లుగా అఫ్గనిస్తాన్‌లో మోహరించిన సేనలను ఉపసంహరించుకున్నట్లు, ఈ ప్రక్రియ పూర్తైందని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: Antony Blinken: అఫ్గన్‌తో దౌత్య సంబంధాలు.. అమెరికా కీలక ప్రకటన -
అఫ్గనిస్తాన్‌తో దౌత్య సంబంధాలు.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: అఫ్గనిస్తాన్ నుంచి తమ సేనల ఉపసంహరణతో దౌత్యపరంగా తాము అక్కడి నుంచి నిష్క్రమించినట్లైందని, ఇక నుంచి దౌత్య సంబంధాలను ఖతార్ నుంచి నిర్వహిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ‘‘మిలిటరీ ఆపరేషన్ ముగిసింది. ఇక డిప్లొమాటిక్ మిషన్ మొదలుకానుంది. అమెరికా- అఫ్గనిస్తాన్ సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక మానవతా దృక్పథంతో అఫ్గన్ ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటామని బ్లింకెన్ స్పష్టం చేశారు. అయితే, తాలిబన్ ప్రభుత్వం ద్వారా కాకుండా, ఐక్యరాజ్యసమితి, ఎన్జీవోల వంటి స్వతంత్ర స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ సహాయం అందుతుందని పేర్కొన్నారు. అదే విధంగా... అఫ్గన్‌ను వీడాలనుకున్న ప్రతి అమెరికన్, అఫ్గన్, ఇతర పౌరులను సురక్షితంగా తరలించామని తెలిపారు. కాగా కొద్ది మంది అమెరికా పౌరులు అక్కడే చిక్కుకుపోయారన్న బ్లింకెన్.. త్వరలోనే వారిని మాతృదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రయాణాలపై తాలిబన్లు ఆంక్షలు విధించవద్దని, మహిళలు, మైనార్టీ హక్కులను కాలరాసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. అలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యలకు తావివ్వకూడదని విజ్ఞప్తి చేశారు. చదవండి: Joe Biden: అఫ్గనిస్తాన్ నుంచి ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చిందో చెప్తా!