కాబూల్: అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతోంది. అక్కడ తాలిబన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళలపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అప్ఘన్‌లో మహిళల ఉన్నత విద్యపై ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా అఫ్ఘన్ మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది. కాబూల్, ఇతర ప్రావిన్సులలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీని నిలిపివేసినట్లు అక్కడి మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయినట్టు మీడియా తెలిపింది. ముఖ్యంగా తాలిబన్లు.. మహిళలపై ఉద్యోగాలు, పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు.
అంతకుముందు కూడా బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించలేదు. పాఠశాలలు ఓపెన్ చేసిన వెంటనే అమ్మాయిలను ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉన్నత విద్యకు అక్కడి యువతులు దూరమయ్యారు.
ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌లో రష్యాకు షాకులు.. పుతిన్ ఏం చేస్తారోనన్న టెన్షన్..?
Comments
Please login to add a commentAdd a comment