
టాలీవుడ్ నటి అనసూయ రెండు నెలల క్రితమే నూతన గృహ ప్రవేశం చేసింది. తమ జీవితంలో మరో అధ్యాయం మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా తమ కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టుకుంది. కొత్తింట్లో సంప్రదాయ పద్ధతిలో హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం నిర్వహించింది.
అయితే గృహ ప్రవేశం మరో సంప్రదాయ శుభకార్యం నిర్వహించింది. తన పెద్ద కుమారుడికి ఉపనయనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మన ఆధ్యాత్మిక, వైదిక సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా అనసూయ మరో సంప్రదాయం ఉట్టిపడేలా కుమారులిద్దరికీ స్నానాలు చేయించింది. మన సంస్కృతి ప్రతిబింబించేలా ప్రకృతి ఒడిలో కూర్చోబెట్టి నలుగు పెట్టి మరి స్నానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మన పూర్వీకులు/పెద్దలు మనల్ని అనుసరించమని చెప్పినా సంస్కృతి, సంప్రదాయం, ఆచారాలు పాటించాలని తెలిపింది. మన ఆచారాలను అనుసరించడంలో వచ్చే అపరిమితమైన విలువ, సారాంశం, అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని పోస్ట్ చేసింది. పిల్లలు పుట్టిన తొలినాళ్లలో ఈ ఆచారాలు పాటించానని తెలిపింది. మరోసారి ఇలాంటి అద్భుతమైన అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తోంది అనసూయ.