నాకు ఫ్యామిలీ ఉంది.. అనవసర విషయాల్లోకి లాగొద్దు: అనసూయ | Anchor Anasuya Bharadwaj Request to the Fans Who Targeted Her | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: ప్లీజ్.. నాకు కుటుంబం ఉంది.. దయచేసి నన్ను వదిలేయండి: అనసూయ

Published Mon, Jun 19 2023 4:00 PM | Last Updated on Mon, Jun 19 2023 4:28 PM

Anchor Anasuya Bharadwaj Request to the Fans Who Targeted Her - Sakshi

బుల్లితెర యాంకర్‌గా, నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇటీవలే విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. రంగస్థలం, పుష్ప సినిమాలతో మరింత ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ తనను టార్గెట్‌ చేోశారని.. కావాలనే తనపై కొందరికి డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

(ఇది చదవండి: ఇకపై ఆ వివాదానికి దూరంగా ఉంటా : అనసూయ)

అనసూయ భరద్వాజ్ మరోసారి టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే తాను గొడవలకు దూరంగా ఉంటానన్న ప్రకటించిన నటి మరోసారి వారికి విజ్ఞప్తి చేసింది. దయచేసి నాకు సంబంధం లేని విషయాల్లోకి లాగవద్దని అభ్యర్థించింది. తనకు ఫ్యామిలీ ఉందని.. ఇక నుంచి నన్ను వదిలేయండని ట్వీట్‌లో ప్రస్తావించింది.

అనసూయ ట్వీట్‌లో రాస్తూ..'అందరికి నమస్కారం. కొన్ని రోజులుగా నాకు చాలా ట్వీట్లు వస్తున్నాయి. రాజకీయ, వినోద పరిశ్రమలో ఇతరులను అగౌరవపరిచేందుకు నా పేరును ఉపయోగిస్తున్నారు. ఇది చాలా అమర్యాదగా ఉంది. నన్ను, నా పేరును కించపరిచేలా ఉంది. వీటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా జీవితం. నాకు నచ్చిన విధంగా ఉంటా. కాబట్టి నేను ఎవరి దారిలోకి రావాలనుకోవడంలేదు.  నేను మీ అందరిని ఒకటే అభ్యర్థిస్తున్నా. నేను కూడా ఓ మహిళనే. ఈ విషయంలో నన్ను నమ్మండి. నాకు పీఆర్‌ టీం లేదు. మీకు ఏది చెప్పాలన్నా నేనే.  మీరు నన్ను ప్రోత్సహించడం ఇష్టం లేకపోతే కనీసం నా నుంచి దూరంగా ఉండండి. దయచేసి ఒక మనిషిగా సంబంధం లేని విషయాల్లోకి నా పేరును లాగకండి. నాకు ఒక కుటుంబం ఉంది. ప్లీజ్.' అంటూ పోస్ట్ చేసింది. 

(ఇది చదవండి: 'ధమాకా' జోడీ రిపీట్.. ఈసారి మాత్రం!)

కాగా.. అనసూయ విజయ్‌ల మధ్య కోల్డ్‌ వార్‌ జరిగిన విషయం తెలిసిందే. అనసూయ తరచూ విజయ్‌పై పరోక్షంగా ట్వీట్స్‌ చేస్తుంటారు. ఇటీవల విజయ్‌ నటించిన ఖుషీ పోస్టర్‌పై ‘ది విజయ్‌ దేవరకొండ’అని ఉండటాన్ని తప్పుబడుతూ ఆమె వరుస ట్వీట్స్‌ చేసింది. దీంతో విజయ్‌ ఫ్యాన్స్‌ అనసూయను ట్రోల్‌ చేశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement