మొహం నిండా గాయాలతో అనసూయ.. ‍అసలేం జరిగిందంటే? | Anasuya Bharadwaj Shares Latest Pics From Movie With Horrific Stills | Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: మొహం నిండా గాయాలతో అనసూయ.. ‍అసలు నిజం ఇదే?

Published Fri, Aug 9 2024 2:40 PM | Last Updated on Sat, Aug 10 2024 10:59 AM

 Anasuya Bharadwaj Shares Latest Pics From Movie With Horrific Stills

టాలీవుడ్ అనసూయ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టి ఏకంగా స్టార్‌ నటిగా ఎదిగింది. పుష్ప, రంగస్థలం లాంటి సినిమాలతో ఎక్కడా లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పుష్ప-2లోనూ నటిస్తోన్న అనసూయ.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింబా. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన సింబాలో అనసూయ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. మొహమంతా రక్తంతో తడిసి ఉన్న ఫోటోలు చూసి ఆడియన్స్ షాక్‌కు గురి అవుతున్నారు. అయితే ఈ పిక్స్‌ కేవలం సింబా చిత్రంలో స్టిల్స్‌ మాత్రమేనని.. సింబా ది ఫారెస్ట్ మ్యాన్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా..  పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూశాక కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా సంతోషమే అని గతంలో అనసూయ అన్నారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement