అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబ. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఆగస్టు 4న) జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రదర్శకుడు మురళీ మనోహర్ స్టేజీపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 'ఆర్టిస్టులతో షూట్ చేయడం ఈజీనే కానీ ఇలా స్టేజీపైకి వచ్చి మాట్లాడటం చాలా కష్టం. డైరెక్టర్ సంపత్ నందిగారు అందించిన కథ చాలా నచ్చింది. నేనే డైరెక్ట్ చేస్తానన్నాను.
జర్నీ తలుచుకుని కంటతడి
తన విజన్‌కు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నా జర్నీ అంత సులువుగా ఏమీ సాగలేదు. నా కుటుంబసభ్యుల సపోర్ట్ వల్లే ఇక్కడిదాకా వచ్చాను. ముఖ్యంగా నా భార్య నా జీవితానికి పిల్లర్‌లా నిలబడింది అని ఫ్యామిలీ గురించి చెప్తూ స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నాడు. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్‌లో నటుడు శ్రీనాథ్ మొక్కలు నాటి తనకు మెసెజ్ చేస్తే టికెట్లు ఫ్రీగా పంపిస్తానన్నాడు. దీంతో సంతోష్ కుమార్ ముందుకు వచ్చాడు. మొక్కలు నాటితే తాను కూడా టికెట్లు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
ఆయన శిష్యుడే
మురళీ మనోహర్ విషయానికి వస్తే.. ఈయన లండన్ ఫిలిం స్కూల్‌లో సినిమా కోర్సులు నేర్చుకున్నాడు. ఇండియాకు వచ్చి ఎన్నో షార్ట్ ఫిలింస్ తీశాడు. సంపత్ నంది వద్ద ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నందా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. గాలి పటం చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా, పేపర్ బాయ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ పని చేశాడు. ఇప్పుడు సింబాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు.
చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట!
Comments
Please login to add a commentAdd a comment