murali manohar
-
స్టేజీపై కంటతడి పెట్టుకున్న దర్శకుడు
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబ. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఆగస్టు 4న) జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రదర్శకుడు మురళీ మనోహర్ స్టేజీపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 'ఆర్టిస్టులతో షూట్ చేయడం ఈజీనే కానీ ఇలా స్టేజీపైకి వచ్చి మాట్లాడటం చాలా కష్టం. డైరెక్టర్ సంపత్ నందిగారు అందించిన కథ చాలా నచ్చింది. నేనే డైరెక్ట్ చేస్తానన్నాను. జర్నీ తలుచుకుని కంటతడితన విజన్‌కు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నా జర్నీ అంత సులువుగా ఏమీ సాగలేదు. నా కుటుంబసభ్యుల సపోర్ట్ వల్లే ఇక్కడిదాకా వచ్చాను. ముఖ్యంగా నా భార్య నా జీవితానికి పిల్లర్‌లా నిలబడింది అని ఫ్యామిలీ గురించి చెప్తూ స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నాడు. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్లో నటుడు శ్రీనాథ్ మొక్కలు నాటి తనకు మెసెజ్ చేస్తే టికెట్లు ఫ్రీగా పంపిస్తానన్నాడు. దీంతో సంతోష్ కుమార్ ముందుకు వచ్చాడు. మొక్కలు నాటితే తాను కూడా టికెట్లు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.ఆయన శిష్యుడేమురళీ మనోహర్ విషయానికి వస్తే.. ఈయన లండన్ ఫిలిం స్కూల్లో సినిమా కోర్సులు నేర్చుకున్నాడు. ఇండియాకు వచ్చి ఎన్నో షార్ట్ ఫిలింస్ తీశాడు. సంపత్ నంది వద్ద ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నందా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. గాలి పటం చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా, పేపర్ బాయ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ పని చేశాడు. ఇప్పుడు సింబాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు.చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట! -
సమాజంలో మార్పు రావాలి
అప్పుడే అత్యాచారాలను అడ్డుకోవచ్చు: కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి కిస్ ఆఫ్ లవ్‌ను కమ్యూనిస్టులే ప్రోత్సహిస్తున్నారు: ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు సాక్షి, విజయవాడ బ్యూరో: దేశంలో అత్యాచారాలు ఆగాలంటే సమాజంలో మార్పు రావాలని, ఈ మార్పు ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాల్సిన బాధ్యత అమ్మలదేనన్నారు. విజయవాడలో 2 రోజులుగా జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర స్థాయి మహిళా సమ్మేళనం ముగింపు సభలో శనివారం ఆమె ప్రసంగించారు. ఆడపిల్లలకు 18 ఏళ్ల వయసులోపు పెళ్లిళ్లు నిరోధించడం, వరకట్న నిరోధం, గృహ హింస, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి అనేక చట్టాలు అమల్లో ఉన్నా వాటిని యథేచ్ఛంగా ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఏటా 9 శాతం చొప్పున పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాలకు పేదరికం కూడా మరో ప్రధాన కారణమని, పేదరిక నిర్మూలనకు జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేయాల్సివుందని అన్నారు. రాజధానికి భూ సమీకరణ వల్ల రైతులకు నష్టం జరగదని, దీనిపై ప్రభుత్వం చర్చలు జరుపుతుందని పురందేశ్వరి చెప్పారు. సమ్మేళనంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వంలో వచ్చిన భూసేకరణ చట్టం వల్ల పరిశ్రమలకు ఇబ్బందులున్నాయని, దాన్ని మార్చడానికి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మీ పిల్లలను కిస్ ఆఫ్ లవ్‌కు పంపుతారా? ఏబీవీపీ జాతీయ అధ్యక్షుడు మురళీమనోహర్ మాట్లాడుతూ.. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అనుసరించే సీపీఐ, సీపీఎం పార్టీలే కిస్ ఆఫ్ లవ్లను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఆయా పార్టీల వారు తమ పిల్లలను ఇలాంటి వాటికి పుంపుతున్నారా? అని ప్రశ్నించారు. పిల్లల పెంపకంలో తల్లుల మైండ్‌సెట్ మారాలని సూచించారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినులకు వివిధ అంశాలపై బృంద చర్చలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. సమ్మేళనంలో పాల్గొన్న వారికి తులసి మొక్కలు అందించారు. -
28 మంది డీఎస్పీలకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 28 మంది డీఎస్పీలకు కొత్తగా పోస్టింగ్‌లిస్తూ డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీరందరికీ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీలుగా పదోన్నతులిచ్చారు. అనంతరం వీరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమని చెప్పారు. కాగా, మంగళవారం డీజీపీ అనురాగ్‌శర్మ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ సమావేశమై వీరికి కొత్తగా పోస్టింగులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో హైదరాబాద్‌లో 24 మందికి పోస్టింగులివ్వగా, మురళి మనోహర్‌కు సీసీఎస్ మహబూబ్‌నగర్ డీఎస్పీగా, గోవర్ధన్‌కు నాగర్‌కర్నూల్ డీఎస్పీగా, షేక్ అలీకి సంగారెడ్డి డబ్ల్యూపీఎస్గా, తిరుపతన్నకు సంగారెడ్డి డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. -
మళ్ళీ సీక్వెల్ కూడానా?
రజనీకాంత్ నటించిన ‘కోచ్చడయాన్’కు సీక్వెల్ వస్తోందా? ఆ చిత్రం సహ నిర్మాత మురళీ మనోహర్ మాటలు వింటే అలాగే అనుకోవాల్సి వస్తోంది. త్రీడీ మోషన్ క్యాప్చర్ విధానంలో రూపొందిన ఈ చిత్ర సీక్వెల్‌కు తమ బృందం మరింత కష్టపడుతుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. ఉత్తర భారతదేశంలో ఆశించిన రీతిలో ‘కోచ్చడయాన్’కు ఆదరణ లభించలేదని అంగీకరించిన ఆయన, ఈ వ్యాఖ్య చేశారు. ‘‘పరిమిత సమయంలో, పరిమిత బడ్జెట్లో మేము చేయగలిగినదంతా చేశాం. అయితే, ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందని ఒప్పుకుంటున్నా. ఏమైనా, దీనికి సీక్వెల్లో మరింత కష్టపడి, బాగా తీస్తాం’’ అని మురళీ మనోహర్ అన్నారు. హిందీ ప్రాంత ప్రేక్షకులు ఈ సాంకేతిక అద్భుతాన్ని ఆస్వాదించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. చిత్రం ఏమిటంటే, తమిళ, తెలుగు భాషల్లో కూడా ఈ సినిమా అంతంత మాత్రంగానే ఉన్నా, ఈ సహ నిర్మాత మాత్రం ఘన విజయం సాధించిందంటూ డబ్బా కొట్టుకున్నారు. అనుకున్న దాని కన్నా ఆలస్యమైనా, హిందీలో కూడా ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కబుర్లు విని, సినీ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అవును మరి... మొదటి సినిమాకే దిక్కు లేదంటూ ఉంటే, దీనికి సీక్వెల్ కూడానా అని పెదవి విరుస్తున్నారు.