Simbaa Movie
-
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ చిత్రం.. పది రోజులుగా టాప్‌లోనే!
అనసూయ, జగపతి బాబు, వశిష్ట, శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం సింబా. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది. సందేశాత్మక చిత్రం కావడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రకృతిని కాపాడుకోవాలన్న కథాంశంతో ఈ సినిమాను మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.ప్రస్తుతం సింబా మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో ఏకంగా టాప్-6 ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ఆహాలోనూ గత పది రోజులుగా టాప్‌లో ట్రెండింగ్ అవుతూనే ఉంది. చెట్లను పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంత ఉంది? ఎందుకు ఉంది? అనేది సింబాలో చక్కగా చూపించారు. మేసేజ్ ఓరియంటెడ్ మూవీ కావడంతో ఓటీటీ ప్రియుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. -
ఓటీటీకి టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం సింబా. ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది కథ అందించగా.. మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. పర్యావరణంపై తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈనెల 6 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ ఆహా ట్వీట్ చేసింది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే నేపథ్యంలో రూపొందించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ మూవీని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. When the planet cries out for help, heroes rise! 🌎💔"Simbaa" a sci-fi crime thriller 🤯 Starring @anusuyakhasba & @IamJagguBhai, premiering on Sep 6 on #aha@KasthuriShankar @DiviVadthya @ImSimhaa @Kabirduhansingh @anishkuruvilla @gautamitads #SimbaaOnAha pic.twitter.com/uRBp75ppKJ— ahavideoin (@ahavideoIN) September 4, 2024 -
మొహం నిండా గాయాలతో అనసూయ.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అనసూయ యాంకర్‌గా కెరీర్ మొదలెట్టి ఏకంగా స్టార్ నటిగా ఎదిగింది. పుష్ప, రంగస్థలం లాంటి సినిమాలతో ఎక్కడా లేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పుష్ప-2లోనూ నటిస్తోన్న అనసూయ.. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింబా. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన సింబాలో అనసూయ ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించిన ఫోటోలను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసింది. మొహమంతా రక్తంతో తడిసి ఉన్న ఫోటోలు చూసి ఆడియన్స్ షాక్‌కు గురి అవుతున్నారు. అయితే ఈ పిక్స్ కేవలం సింబా చిత్రంలో స్టిల్స్ మాత్రమేనని.. సింబా ది ఫారెస్ట్ మ్యాన్ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా.. పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూశాక కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా సంతోషమే అని గతంలో అనసూయ అన్నారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. -
'సింబా' సినిమా రివ్యూ.. థ్రిల్లింగ్ చేస్తుందా..?
టైటిల్: సింబా నటీనటులు: జగపతిబాబు, అనసూయ, శ్రీనాథ్ మాగంటి, కబీర్‌సింగ్ తదితరులు నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్ దర్శకత్వం: మురళీ మనోహర్ రెడ్డి విడుదల తేది: ఆగస్ట్ 9, 2024కథేంటంటే.. ?హైదరాబాద్ నగరంలో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త పార్థ(కబీర్ సింగ్) సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. విచారణ కోసం పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) నగరానికి వస్తాడు. ఈ క్రమంలో మరో హత్య కూడా అలానే జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్ టీచర్ అనుముల అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్(శీనాథ్ మాగంటి) ఉన్నారని తెలిసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకి తరలించే క్రమంలో హత్య చేయాలని పార్థ ప్లాన్ వేస్తాడు. అయితే వీరిద్దరు కలిసి తమను చంపాడానికి వచ్చిన వ్యక్తిని పోలీసుల ముందే చంపేస్తారు.ఈ హత్యలో డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) భాగస్వామి అవుతాడు. అసలు ఎలాంటి సంబంధంలే లేని ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? బొద్దింకను కూడా చంపడానికి ఇష్టపడని అక్షిక..దారుణ హత్యలు ఎలా చేసింది? పురుషోత్తమ్ రెడ్డి అలియాస్ సింబా(జగపతి బాబు) ఎవరు? ఆయనకు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పార్థకి, పురుషోత్తమ్ రెడ్డి మధ్య ఉన్న వైరం ఏంటి? పోలీసాఫీసర్ అనురాగ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? అనేది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక రివేంజ్ డ్రామా.. బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కు డైరెక్టర్ పరిచయం చేశారు. ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే, ఇందులో వాటన్నింటికి భిన్నంగా ఆసక్తి రేకెత్తించేలా సినిమా ఉంటుంది. భవిష్యత్ సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. ఈ అంశాన్ని ఇందులో చూపించిన తీరుని డైరెక్టర్ మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పస్టాప్‌లోనే కథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. దాదాపు చాలా సీన్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతున్న తీరును ఆసక్తిగా చూపించిన దర్శకుడు.. ఈ హత్యల వెనక ఎవరుంటారో అనేది చెప్పడంలో కాస్త విఫలం అయ్యాడు అనిపిస్తుంది.అలా వరుస హత్యలతో పస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతున్న క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సిల్లీగా అనిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని ఆసక్తిగా చెప్పడం లో కాస్త విఫలం అయ్యాడు. ఫోన్ కాల్ లిస్ట్‌తోనే హంతకులను పట్టుకున్న తీరు ఏమాత్రం మెప్పించదు. సెకడాఫ్‌లో క బయాలాజికల్ మెమరీ అంశం అనేది తెరపైకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. పురుషోత్తమ్ రెడ్డి (జగపతిబాబు ) కథ ఇక్కడే మొదలౌతుంది. సినిమాలో ఆయన పాత్రని చివరి వరకూ పెద్దగా ప్రభావం లేకుండా కథ నడపం కాస్త మైనస్ అనిపిస్తుంది. కథ సాధారణమై అయినా.. దర్శకుడు చూపించిన తీరు థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ముందుగా సింబా దర్శకుడు మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాలి. ఉన్నంతలో బాగానే తీశాడు. జగపతిబాబు, అనసూయ లాంటి స్టార్స్‌ను పాత్రల మేరకు బాగానే ఉపయోగించుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వశిష్ఠ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. కథ చివర్లో ఆయన నటించిన తీరు మెప్పిస్తుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించిన కబీర్ పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ మేరకు సినిమా మించే ఉందని చెప్పవచ్చు. ఫైనల్‌గా అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చే సింబా మెప్పిస్తాడు. -
స్టేజీపై కంటతడి పెట్టుకున్న దర్శకుడు
అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సింబ. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఆగస్టు 4న) జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్రదర్శకుడు మురళీ మనోహర్ స్టేజీపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. 'ఆర్టిస్టులతో షూట్ చేయడం ఈజీనే కానీ ఇలా స్టేజీపైకి వచ్చి మాట్లాడటం చాలా కష్టం. డైరెక్టర్ సంపత్ నందిగారు అందించిన కథ చాలా నచ్చింది. నేనే డైరెక్ట్ చేస్తానన్నాను. జర్నీ తలుచుకుని కంటతడితన విజన్‌కు న్యాయం చేశాననే అనుకుంటున్నాను. నా జర్నీ అంత సులువుగా ఏమీ సాగలేదు. నా కుటుంబసభ్యుల సపోర్ట్ వల్లే ఇక్కడిదాకా వచ్చాను. ముఖ్యంగా నా భార్య నా జీవితానికి పిల్లర్‌లా నిలబడింది అని ఫ్యామిలీ గురించి చెప్తూ స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నాడు. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్లో నటుడు శ్రీనాథ్ మొక్కలు నాటి తనకు మెసెజ్ చేస్తే టికెట్లు ఫ్రీగా పంపిస్తానన్నాడు. దీంతో సంతోష్ కుమార్ ముందుకు వచ్చాడు. మొక్కలు నాటితే తాను కూడా టికెట్లు ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.ఆయన శిష్యుడేమురళీ మనోహర్ విషయానికి వస్తే.. ఈయన లండన్ ఫిలిం స్కూల్లో సినిమా కోర్సులు నేర్చుకున్నాడు. ఇండియాకు వచ్చి ఎన్నో షార్ట్ ఫిలింస్ తీశాడు. సంపత్ నంది వద్ద ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నందా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. గాలి పటం చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా, పేపర్ బాయ్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ పని చేశాడు. ఇప్పుడు సింబాతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు.చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట! -
సింబలో మంచి సందేశం ఉంది
‘‘సింబ’ మూవీ ప్రారంభం కావడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆమె నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత కేసీఆర్, సంతోష్గార్లు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలోనే నేను ‘సింబ’ కథ విన్నాను. నవ్విస్తూనే అందరికీ కనువిప్పు కలిగేలా మంచి సందేశం ఉన్న సినిమా ఇది’’ అని డైరెక్టర్ సంపత్ నంది అన్నారు. అనసూయ, జగపతిబాబు లీడ్ రోల్స్‌లో మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింబ’. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల ప్రశంసలు, అభిమానం వల్లే నేను ‘సింబ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయగలుగుతున్నాను’’ అన్నారు. ‘‘సంపత్‌గారి కథకు నేను దర్శకత్వం వహించాను. ‘సింబ’ ఓ కొత్త ΄ాయింట్‌తో రాబోతోంది’’ అన్నారు మురళీ మనోహర్. ‘‘కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నటీనటులు దివి, భానుచందర్ తదితరులు మాట్లాడారు. -
SIMBAA మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
దమ్ముంటే వారిని అనండి.. అనసూయ ట్వీట్ వైరల్
యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంందో అందరికి తెలిసిందే. ప్రతి రోజు తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను, సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంది. ఆమె చేసే ట్వీట్లు చాలా సార్లు కాంట్రవర్సీకి దారి తీశాయి. అయినా కూడా అనసూయ ఎక్కడ తగ్గట్లేదు. తనను నచ్చిన విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఒకటి మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిందో తెలియదు కానీ..అది కాస్త వైరల్ అయి మళ్లీ అనసూయ వార్తల్లో నిలిచింది.అనసూయ చేసిన ట్వీట్ ఏంటంటే..‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలాగండి? నిజంగా మీకు దమ్ముంటే నా మీద కాదు.. తరచూ నేను ఏం చేసినా ఆ టాపిక్ లాగేవారిని అనండి. కానీ మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. (చదవండి: రెండోసారి గుడ్ న్యూస్ చెప్పిన హీరోయిన్)కాగా, గతంలో ఓ యంగ్ హీరోని ఉద్దేశించి అనసూయ చేసిన ట్వీట్‌పై ఇప్పటికీ ట్రోల్స్ నడుస్తూనే ఉంటున్నాయి. అనసూయ పెట్టే ప్రతి ప్రెస్ మీట్లోనూ ఆ వివాదం గురించి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. అయితే అనసూయ కూడా తప్పించుకోకుండా ఓపిగ్గా సమాధానం చెబుతూనే ఉంటుంది. ఇప్పుడు చేసిన ట్వీట్ కూడా ఆ వివాదం గురించేనని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన సింబా సినిమా ఆగస్ట్ 9న విడుదల కానుంది. 😄 Maree inta chaatakaanivaalla laaga unte elagandi.. nijanga meeku kaaltundante naa meeda kaadu.. astamaanam nenu em pani chesina aa topic laage vaallani anandi dammunte.. kaani meeru ala cheyaru kada.. endukante meeku adi chaatakaadu.. mee hero laaga aadavaallani uddesinchi…— Anasuya Bharadwaj (@anusuyakhasba) July 24, 2024 -
ఒక్కరిలో మార్పు వచ్చినా చాలు : అనసూయ
‘‘పర్యావరణాన్ని మనం ఎలా కలుషితం చేస్తున్నామో... దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో చూస్తున్నాం. ఈ నేపథ్యంతో మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘సింబా’. ఈ సినిమా చూశాక కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా సంతోషమే’’ అని అనసూయ అన్నారు. జగపతిబాబు, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. డైరెక్టర్ సంపత్ నంది అందించిన ‘సింబా’ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 9న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మురళీ మనోహర్ మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సింబా’. ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ మూవీ రాలేదు’’ అన్నారు. ‘‘ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముందు తరాల గురించి ఆలోచించండి’’ అన్నారు దాసరి రాజేందర్ రెడ్డి. -
Anasuya Bharadwaj: Simbaa మూవీ ట్రైలర్ లాంచ్ (ఫోటోలు)
-
ఫారెస్ట్ మ్యాన్ గా జగపతిబాబు..ఫస్ట్‌లుక్ పోస్టర్ వైరల్
జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సింబా’. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్ కు డైరెక్టర్ సంపత్ నంది కథను అందించగా.. మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంపత్‌నంది, రాజేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం(జూన్ 5) ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రకృతి తనయుడిగా అద్భుతమైన పాత్రను పోషిస్తున్నారు. అడవుల్లో నివసించే మాచోమ్యాన్‌గా జగపతిబాబును ఈ చిత్రంలో చూపిస్తున్నారు సంపత్‌నంది. ఫస్ట్ లుక్ పోస్టర్లో జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. 'ప్రకృతి తనయుడు ఇతడు... జగపతిబాబుగారిని సింబాగా పరిచయం చేయడానికి ఆనందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ మ్యాన్ సింబాను పరిచయం చేస్తున్నాం’ అని మేకర్స్ రాసిన వ్యాఖ్యలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్న వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. Here’s our Mother Nature's very own child💪🏾💚 Elated to introduce our beloved @iamjaggubhai garu as #SIMBAA - The Forest Man 🔥 on this #WorldEnvironmentDay More details 🔜@mmrdirects@SampathNandi_TW @anusuyakhasba #RajenderReddy @vamsikaka @dhani_aelay pic.twitter.com/j3FzSb5G78 — Sampath Nandi (@IamSampathNandi) June 5, 2022