– సంపత్ నంది
‘‘సింబ’ మూవీ ప్రారంభం కావడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆమె నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత కేసీఆర్, సంతోష్‌గార్లు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలోనే నేను ‘సింబ’ కథ విన్నాను. నవ్విస్తూనే అందరికీ కనువిప్పు కలిగేలా మంచి సందేశం ఉన్న సినిమా ఇది’’ అని డైరెక్టర్ సంపత్ నంది అన్నారు.
అనసూయ, జగపతిబాబు లీడ్ రోల్స్‌లో మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింబ’. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనసూయ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల ప్రశంసలు, అభిమానం వల్లే నేను ‘సింబ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయగలుగుతున్నాను’’ అన్నారు.
‘‘సంపత్‌గారి కథకు నేను దర్శకత్వం వహించాను. ‘సింబ’ ఓ కొత్త ΄ాయింట్‌తో రాబోతోంది’’ అన్నారు మురళీ మనోహర్. ‘‘కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నటీనటులు దివి, భానుచందర్ తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment