Green India Challenge
-
సింబలో మంచి సందేశం ఉంది
‘‘సింబ’ మూవీ ప్రారంభం కావడానికి కారణం ఉదయభాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆమె నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తర్వాత కేసీఆర్, సంతోష్గార్లు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలోనే నేను ‘సింబ’ కథ విన్నాను. నవ్విస్తూనే అందరికీ కనువిప్పు కలిగేలా మంచి సందేశం ఉన్న సినిమా ఇది’’ అని డైరెక్టర్ సంపత్ నంది అన్నారు. అనసూయ, జగపతిబాబు లీడ్ రోల్స్‌లో మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘సింబ’. సంపత్‌నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల ప్రశంసలు, అభిమానం వల్లే నేను ‘సింబ’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయగలుగుతున్నాను’’ అన్నారు. ‘‘సంపత్‌గారి కథకు నేను దర్శకత్వం వహించాను. ‘సింబ’ ఓ కొత్త ΄ాయింట్‌తో రాబోతోంది’’ అన్నారు మురళీ మనోహర్. ‘‘కోటికిపైగా మొక్కలు నాటిన వనజీవి రామయ్య వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు రాజేందర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, నటీనటులు దివి, భానుచందర్ తదితరులు మాట్లాడారు. -
ఉమెన్స్ డేకి మహిళలంతా మొక్కలు నాటండి: నమ్రత
పర్యావరణం పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను సూపర్ స్టార్ మహేశ్‌బాబు సతీమణి నమ్రత స్వీకరించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని ఆమె కోరారు. అంతకుముందు గ్రీన్ ఇండియా చాలెంజ్ కి తనను నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి నమ్రత ధన్యవాదాలు తెలిపారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో కంగనా రనౌత్
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. హైదరాబాద్‌కు వచ్చిన ఆమె శంషాబాద్ పంచవటి పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం కంగనా మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కోట్లాది మొక్కలు నాటడం గొప్ప విషయమని ఆమె అన్నారు. ఈ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అనంతరం రంగోలి చందర్, రీతూ రనౌత్, అంజలి చౌహన్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని విసిరారు. -
కొండగట్టు ఆలయ అభివృద్ధిలో ‘గ్రీన్ ఇండియా’
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని దేశంలోనే ప్రముఖ దేవాలయంగా పునర్ నిర్మించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయానికి మద్దతుగా ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న వెయ్యి ఎకరాల అభయారణ్యాన్ని దత్తత తీసుకోవాలని ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ నిర్ణయించారు. ఫిబ్రవరి 17న కేïసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున గురువారం తన నిర్ణయాన్ని ఎంపీ ప్రకటించారు. స్వరాష్ట్రం సిద్ధించాక గత ఎనిమిదేళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఆయన తపనను దగ్గరి నుంచి చూసిన వ్యక్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కొడిమ్యాల అభివృద్ధి ఇలా... కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వచ్చే కంపార్ట్మెంట్ 684లో 752 ఎకరాలు, 685లో 342 ఎకరాలు మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటారు. మొదటి విడతగా రూ.కోటి వ్యయంతో ఈ వెయ్యి ఎకరాల అటవీ భూమికి మరింత పచ్చందాలు అద్దుతామని సంతోష్ ప్రకటించారు. దశలవారీగా మిగతా నిధులు కూడా అందించి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కొండగట్టు ఆలయంలో ఈ అడవిలో లభించే సుగంధ మొక్కలు, చందనం చెట్ల నుంచే పూజలు జరిగేవని ప్రతీతి. మళ్లీ ఆ వైభవం కోసం ఈ అటవీ ప్రాంతంలో పెద్దఎత్తున ఔషధ, సుగంధ మొక్కలు నాటు తామన్నారు. అటవీశాఖ అధ్వర్యంలో అటవీ భూమి సరిహద్దుకు రక్షణ, అడవి లోపల పునరుజ్జీవన చర్యలు చేపడతామన్నారు. ఆలయ పరిసరాల్లో సంచరించే కోతులను అటవీ ప్రాంతానికి పరిమితం చేసేలా పెద్దఎత్తున పండ్ల మొక్కలు నాటి మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
మొక్కలు నాటిన పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల (ఫోటోలు)
-
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న నటుడు
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను నటుడు సముద్రఖని స్వీకరించారు. ఈమేరకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు. ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్, నిర్వాహకుల నిరంతర కృషి ప్రశంసనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను. ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ, ప్రముఖ దర్శకులు హెచ్.వినోద్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నా' అన్నారు సముద్రఖని. చదవండి: డూప్లెక్స్ అమ్మిన సోనమ్ కపూర్, ఎన్ని కోట్లంటే? రష్మికపై ట్రోలింగ్, రాళ్లు విసురుతారన్న కన్నడ స్టార్ -
ఎంపీ సంతోష్‌పై ‘ఇండియా ఫోర్బ్స్’ కథనం
సాక్షి, హైదరాబాద్: తాను మొక్కలు నాటడంతోపాటు ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ద్వారా లక్షలాది మందిని హరిత ఉద్యమంలో భాగస్వాములను చేసిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై ‘ఇండియా ఫోర్బ్స్’తాజా సంచికలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రంలో అమలవుతున్న హరితహారం కార్యక్రమం స్ఫూర్తితో ‘పచ్చదనంతోనే పరిపూర్ణత’నినాదంతో 2018 జూలై 17న సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. రాజకీయ నాయకులు, సినీ నటులు, క్రీడా ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతోపాటు సామాన్యులను కూడా మొక్కలు నాటడంలో భాగస్వాములను చేశారు. మొక్కల ఔషధ గుణాలను తెలుపుతూ వృక్షవేదం అనే పుస్తకాన్ని ప్రచురించడంతోపాటు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 2021 ఫిబ్రవరి 17న ‘కోటి వృక్షార్చన’పేరిట ఒకే రోజు కోటి మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో సంతోష్ కృషిపై ఇండియా ఫోర్బ్స్ ప్రత్యేక కథనం ప్రచురించింది. -
నాన్న ఎప్పుడూ ఆ మాటలు చెప్తుంటాడు: నిహారిక
సాక్షి, బంజారాహిల్స్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్కులో సోమవారం నటి నిహారికా కొణిదెల మొక్కలు నాటారు. తన తండ్రి నాగబాబు ఎప్పుడూ ప్రకృతిని ప్రేమించాలని, మొక్కలను పెంచాలని చెబుతుంటారని ఈ ప్రపంచంలో అందరినీ కాపాడే మొదటి దేవుడు ప్రకృతి అని ఆ ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తూ మొక్కలు నాటించడం అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. చదవండి: (NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!) -
మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలి: ఇంద్రకరణ్‌రెడ్డి
గచ్చిబౌలి(హైదరాబాద్): మొక్కలు నాటడం జీవన విధానంలో భాగం కావాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బొటానికల్ గార్డెన్లో ఆయన జమ్మిచెట్టు నాటి రెండో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జమ్మి వృక్షం పవిత్రమైందని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వృక్షంగా ప్రకటించిందని తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ప్రతిగ్రామంలోనూ 1.20 లక్షల జమ్మిచెట్లను నాటేందుకు అటవీ, దేవాదాయ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయని చెప్పారు. బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా సంతోశ్ కుమార్‌ను ఎన్నుకున్నారు. ఊరూరా జమ్మిచెట్టు–గుడిగుడిలో జమ్మిచెట్టు, వాకర్స్ అసొసియేషన్ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, చాంద్‌పాషా తదితరులు పాల్గొన్నారు. -
Pillalamarri: ఆసియాలోనే రెండో పెద్ద వృక్షం
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్‌లో ఉన్న పిల్లలమర్రి ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద వృక్షం అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని పిల్లలమర్రిని ఆయన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ కార్యక్రమం ప్రారంభం తర్వాత రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో హరితహారం విజయవంతమైనందుకే సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఈ మంచి కార్యంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రోత్సహిస్తున్నారన్నారు. వివిధ కారణాల వల్ల మర్రి వృక్షం చనిపోయే దశకు రాగా కలెక్టర్లు, అటవీశాఖ తదితర శాఖల సహకారంతో పునర్జీవం ఇచ్చారన్నారు. జిల్లాలో గతేడాది 2 కోట్ల విత్తన బంతులను తయారు చేసి డ్రోన్ ద్వారా గుట్టలు, కొండలలో, బంజరు భూములలో చల్లించామన్నారు. అంతే కాక విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించామని, ఈ సంవత్సరం కూడా చల్లుతున్నామని తెలిపారు. అపురూపంగా చూసుకోవడం సంతోషం గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పిల్లలమర్రి అభివృద్ధికి తనవంతుగా ఎంపీ నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్లో సైతం పేర్కొన్నారు. 800 ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని అపురూపంగా చూసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంత్రితో కలిసి పిల్లలమర్రి చెట్లు ఎక్కిన ఫొటోను ట్విటర్‌కు ట్యాగ్ చేశారు. వివిధ కారణాలతో పూర్తిగా పాడైపోయే దశకు చేరుకున్న పిల్లలమర్రి వృక్షానికి సెలైన్లు ఎక్కించి బతికించడమే కాక ప్రతి వేరును అభివృద్ధి చేస్తున్న మంత్రిని, అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ వెంకటేశ్వర్లు, రాష్ట్ర క్రీడా అధికార సంస్థ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ సంతోష్‌కు ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డ్’
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు’ అందుకున్నారు. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించు కొని బెంగళూరు డా‘‘బి.ఆర్.అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వృక్ష మాత ఆమె చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు. సాలుమారద తిమ్మక్క ఇంటర్నేషనల్ ఫౌండేషన్, శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషనల్ సొసైటీ (కర్ణాటక) సంయుక్తంగా ఇచ్చే ఈ అవార్డుకు ప్రకృతి పరిరక్షణ విభాగంలో 2020 సంవత్సరానికి సంతోష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డు తూ.. ఈ నేల భవిష్యత్ తరాలకు అందకుండా పోతుందేమోనని ఆవేద నతో స్పందించే ప్రతీ హృదయానికి, ఈ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రతీ ఒక్క రికి ఈ అవార్డును అంకితం చేస్తున్న. ఇది నా బాధ్యతను మరింత పెంచింది’ అని చెప్పారు. తనతోపాటు అవార్డు అందుకున్న ఇస్రో మాజీ చైర్మన్, పద్మశ్రీ ఎ.ఎస్.కిరణ్ కుమార్, ప్రముఖ నిర్మాత రంగనాథ్ భరద్వాజ్, ప్రముఖ విద్యా వేత్త గురురాజా కరజ్జయిని, సత్యామోర్గానీలకు శుభాకాం క్షలు తెలిపారు. -
గ్రీన్ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న సింగర్ సునీత
ప్రముఖ సింగర్ సునీత గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా జూబ్లీహీల్స్ జీహెచ్ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది కన్నతల్లి ని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదే విదంగా మన ప్రకృతి ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఆమె తెలిపారు. పర్యావరణ పరిరక్షిద్దాం రాబోయే బావి తరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్,రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. -
మంచు ఖండాన.. గ్రీన్ చాలెంజ్ జెండా
సాక్షి, హైదరాబాద్: పర్యా వరణ హితాన్ని కోరుతూ, పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సరికొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండా ఎగిరింది. ప్రపంచ పర్యా వరణ పరిరక్షణ, కర్బన ఉద్ఘారాలు తగ్గించాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో గ్రీన్ ఇండియా వలంటీర్‌కు స్థానం దక్కింది. పర్యావరణ మార్పులపై 35 దేశాలకు చెందిన 150 మంది సభ్యుల బృందం చేపట్టిన అధ్యయనంలో భాగంగా గ్రీన్ఇండియా అంటార్కిటికాకు ప్రయాణించింది. ఫౌండేషన్–2041 నెలకొల్పి పర్యావరణం కాపాడాలనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్‌ను అక్కడ గ్రీన్ ఇండియా వాలంటీర్ కలిశారు. తమ ఉద్యమం తీరును వివరించారు. దీన్ని ప్రశంసించిన రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు. అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలంటీర్ అభిషేక్ శోభన్నను ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ అభినందించారు. -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవడంతో పాటు వాటి సంరక్షణపై దృష్టి పెట్టాలని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్ 5.0’లో భాగంగా ఆయనతో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో సల్మాన్ ఖాన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలు, వరదలు, విపత్తుల మూలంగా దేశంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల జరిగే అనర్థాలను అడ్డుకునేందుకు మొక్కలు నాటడమే మార్గమని అభిప్రాయపడ్డారు. సల్మాన్‌ఖాన్ మొక్కలు నాటడం వల్ల కోట్లాది మంది అభిమానులు స్ఫూర్తి పొందుతారని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. -
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సల్మాన్ ఖాన్
Salman Khan Participate In Green India Challenge 5.0: ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0”లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. తర్వాత సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలి. అని కోరారు. ఇంకా సల్మాన్ మాట్లాడుతూ అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఈ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని సల్మాన్ తెలిపారు. నా అభిమానులంతా విధిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. (చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..) అనంతరం రాజ్యసభ సభ్యుడు, జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 'పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..) #GreenIndiaChallenge is delighted to have the Bollywood Sultan in Hyderabad. Euphoric to have the company of @BeingSalmanKhan to plant saplings. He not only accept our invitation but felt proud to be part of #GIC. This would definitely inspire millions of his fanbase to replicate pic.twitter.com/yylnOdqO2P — Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022 -
గ్రీన్ చాలెంజ్ తరుణమిదే..ఎలాంటి మొక్కలు పెంచాలి?
సాక్షి, హైదరాబాద్: వానా కాలం సీజన్ మొదలైంది. గ్రేటర్ నగరం గ్రీన్ చాలెంజ్‌ను స్వీకరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కోటిన్నర జనాభాకు చేరువైన సిటీలో హరితం శాతం గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల 42 డిగ్రీల మేర నమోదైన పగటి ఉష్ణోగ్రతలు సొమ్మసిల్లేలా చేయడం ప్రతిఒక్కరికీ అనుభవమైంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రభుత్వ విభాగాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సిటీజన్లు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని పర్యావరణ వేత్తలు స్పష్టంచేస్తున్నారు. కాగా మహానగరాన్ని గ్రీన్‌సిటీగా మార్చేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా నిర్వహించిన హరితహారం కార్యక్రమం ఉద్దేశం బాగానే ఉన్నా..నగరంలో గ్రీన్‌బెల్ట్‌ను గణనీయంగా పెంచేందుకు అంతగా దోహదం చేయలేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హరితహారంలో ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూలమొక్కలను సుమారు 95 శాతం పంపిణీ చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీస్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే ఉన్నట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్లో చేపట్టే హరితహారంలో భాగంగా ప్రస్తుతం గ్రేటర్లో ఉన్న గ్రీన్‌బెల్ట్ 20 నుంచి 30 శాతానికి పెంచాలని స్పష్టంచేస్తున్నారు. లక్ష్యం చేరని హరితహారం.. 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిలో 2016 నుంచి ఏటా హరితహారం చేపట్టారు. ఐదేళ్లుగా సుమారు మూడు కోట్ల మొక్కలు నాటగా..ఇందులో సుమారు 50 శాతం మొక్కలే బతికాయి. ఇందులో ఇళ్లకు పంపిణీచేసే తులసి,కలబంద,క్రోటన్,పూల మొక్కల వంటి చిన్నమొక్కలే అధికంగా ఉన్నాయి. ఖాళీప్రదేశాలు,చెరువులు,పార్కుల వద్ద నాటే విషయంలో బల్దియా యంత్రాంగం విఫలమైంది. బహిరంగ ప్రదేశాల్లో పెద్ద మొత్తంలో మొక్కలు నాటేందుకు ఖాళీస్థలాలు అందుబాటులో లేవని అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇళ్లలో నాటే మొక్కలతో గ్రీన్‌బెల్ట్ పెరగదు: జీవానందరెడ్డి,పర్యావరణ వేత్త హరితహారంలో నాటుతున్న మొక్కల్లో 95 శాతం ఇళ్లలో పెంచేవే. వీటితో నగరంలో గ్రీన్‌బెల్ట్ పెరిగే అవకాశం లేదు. దీర్ఘకాలం మన్నికగలవి,ఆక్సీజన్ అందించేవి,కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే వేప,రావి,మర్రి,మద్ది,చింత వంటి సంప్రదాయ చెట్లను పెద్దమొత్తంలో నాటితేనే గ్రీన్‌బెల్ట్ పెరిగి నగరంలో ఆక్సీజన్శాతం పెరిగి సిటీజన్లకు కాలుష్యం నుంచి విముక్తి లభిస్తుంది. గ్రీన్‌చాలెంజ్ ఇలా... ► నగరంలోని ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ పెద్దమొత్తంలో మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ ఏర్పాటు చేయాలి. ► తద్వారా భూగర్భజలమట్టాలు పెరిగి,పర్యావరణ కాలుష్యం బాగా తగ్గుతుంది. ► సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తరవాతనే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ►నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. ► నూతన లే అవుట్లకు అనుమతులిచ్చే సమయంలో ఈ విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. -
పుడమిని కాపాడటమే లక్ష్యం: జగ్గీ వాసుదేవ్
శంషాబాద్ రూరల్: ‘ప్రకృతిని పరిరక్షిస్తేనే భవిష్యత్ ఉంటుంది. పుడమిని కాపాడడమే సేవ్ సాయిల్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సంయుక్త లక్ష్యం’ అని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గొల్లూరు అటవీ ప్రాంతంలో గురువారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ఐదో విడతను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు హరితహారంతో పచ్చదనం పెంపు, గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాలు దేశానికే ఆదర్శమన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ మాట్లాడుతూ... తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ప్రారంభించానని, సద్గురు ఆశీస్సులు అందుకోవటం తన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్‌రాజు, నవీన్‌రావు, విఠల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఆర్ఎం డోబ్రియల్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ముచ్చింతల్ సమీపంలో ఉన్న సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సద్గురు, శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కలిసి ‘సేవ్ సాయిల్’ పోస్టర్లను ఆవిష్కరించారు. -
ఎంపీ సంతోష్‌కు ‘వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్’ అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ: గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశ విదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ‘వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్’అవార్డు లభించింది. శనివారం రాజస్థాన్‌లో జరిగిన వృక్షమిత్ర సమ్మాన్ సమారోహ్ అవార్డుల ప్రదానోత్సవంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్, ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబాల నుంచి సంతోష్‌కుమార్ తరపున గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకుడు సంజీవళ్ల రాఘవ, మర్ది కరుణాకర్‌రెడ్డిలు అవార్డును స్వీకరించారు. ‘ఈ అవార్డు నాది మాత్రమే కాదు. నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిదీ’అని సంతోష్ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా, రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి ఎరిక్ సోలిమ్ శ్రీకారం చుట్టారు. -
మనసుకు దగ్గరైన కార్యక్రమం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో 'ఆర్ఆర్ఆర్' త్రయం
RRR Movie In Green India Challenge With MP Santhosh Kumar: పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అని ఆర్ఆర్ఆర్ త్రయం ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్కొన్నారు. యావత్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తోంది ఆర్ఆర్ఆర్ టీం. ఇటీవల గుజరాత్, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో పర్యటించింది. మూవీ విడుదలకు ఇంకా రెండు రోజులే ఉండటంతో బుధవారం హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైంది జక్కన్న బృందం. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి గచ్చిబౌలిలో మొక్కలు నాటారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, హీరోలు జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్. ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని రాజమౌళి తెలిపారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే ఎంపీ సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలన్నారు. బాహుబలి టీమ్‌తో కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న విషయాన్ని రాజమౌళి గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెండ్ మరింత విజయవంతంగా కొనసాగాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలన్నారు. ఈ భూమిపై మనం అందరం అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన పిల్లలను ఎలా పోషిస్తామో మొక్కలను కూడా అలాగే నాటి రక్షించాలని కోరారు. గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్నాని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందన్నారు రామ్ చరణ్. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం అత్యంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్‌ను ట్రిపుల్ ఆర్ టీమ్ అభినందించింది. సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందని ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు. సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని పేర్కొన్నారు. మూవీ రిలీజ్ షెడ్యూల్లో బిజీగా ఉండికూడా, చొరవ తీసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్న బృందానికి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్లు కరుణాకర్ రెడ్డి, రాఘవ, తదితరులు పాల్గొన్నారు. -
షణ్నూకి ఛాలెంజ్ విసిరిన బిగ్‌బాస్ విన్నర్ సన్నీ
బిగ్‌బాస్ సీజన్-5 విజేత వీజే సన్నీ షణ్నూ, సిరిలతో పాటు సింగర్ శ్రీరామచంద్రను నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ అయిపోయింది ఇంక నామినేషన్స్ ఏంటి అనే కదా మీ డౌటు.. ఈ ఛాలెంజ్ బిగ్‌బాస్‌కి సంబంధించింది కాదు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. . పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సన్నీ.. బిగ్‌బాస్ కంటెస్టెంట్లు షణ్ముక్, సిరి, శ్రీరామచంద్రలకు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. -
వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకోనున్న నాగ్!
Bigg Boss Telugu 5, Nagarjuna Akkineni: కోట్లాది మొక్కలు నాటించడమే లక్ష్యంగా ఆకుపచ్చని తెలంగాణే ధ్యేయంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఎంతో పాటుపడుతున్నారు. పచ్చదనమే రేపటి ప్రగతి పథమని బిగ్‌బాస్ షో వేదికగా చాటిచెప్పారు. ఆదివారం(డిసెంబర్ 12న) ఆయన బిగ్‌బాస్ షోకు ప్రత్యేక విచ్చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి మాట్లాడారు. ఈ చాలెంజ్ ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తైందన్న ఆయన బిగ్‌బాస్ హౌస్‌లో నాటమని హోస్ట్ నాగార్జునకు ఒక మొక్కను బహుకరించడం విశేషం. గడిచిన మూడేళ్లలో 16 కోట్ల మొక్కలు నాటానన్న ఎంపీ సంతోష్‌కుమార్ ఈ చాలెంజ్‌లో సెలబ్రిటీలు సైతం ముందుకు వచ్చి అడవులను దత్త తీసుకున్నారని తెలిపారు. హీరో ప్రభాస్ 1650 ఎకరాలు దత్తత తీసుకుని దాన్ని హరితవనంగా మార్చేందుకు సిద్ధపడ్డారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున కూడా ఒక అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటానని ముందుకు రావడం విశేషం. ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ చూపిస్తే అక్కడ వెయ్యి ఎకరాలు దత్తత తీసుకుని మొక్కలు పెంచడానికి నాగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజలు కూడా మూడు వారాలు మూడు మొక్కలు నాటి ఈ ఏడాదికి మంచి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చాడు. *King Nagarjuna comes forward to adopt 1000 acres forest:*#greenindiachallenge Reaches Big Boss 5 @MPsantoshtrs @iamnagarjuna @amalaakkineni1 @AkhilAkkineni8 @chay_akkineni @ErikSolheim @StarMaa @DrRanjithReddy @UrsVamsiShekar pic.twitter.com/HU3VqXFeA8 — Raghav s (@raghavtrs) December 12, 2021 -
తన అభిమానులను మూడు మొక్కలు నాటుమంటున్న హీరో
Siddharth Malhotra Accept Green India Challenge: తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సామాన్యులతో పాటు టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో మొక్కలు నాటుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర కూడా పర్యావరణాన్ని కాపాడే ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించాడు సిద్ధార్థ్. మూడు మొక్కలు నాటి, తన అభిమానులందరికి 'గ్రీన్ ఇండియా సవాల్' విసిరాడు. తన అభిమానులందరూ అతడిలా మూడు మొక్కలు నాటుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరాడు. అలాగే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన జోగినపల్లి సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయాన్ని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన ట్విటర్లో తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సిద్ధార్థ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన 10 మిలియన్ ఫాలోవర్స్ అందరూ ఈ ఛాలెంజ్‌ను కొనసాగించాలని కోరారు. సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం 'యోధ' మంచి సక్సెస్ సాధించాలని 'ఆల్ ది బెస్ట్' చెప్పారు. Thank you @SidMalhotra ji for accepting #GreenIndiaChallenge and planting sapling. Hoping that your 10M followers across the world on @Twitter would replicate what you have done today, in the interest of the better future. Wish you all the best for #Yodha Movie.#Appreciate🌱. pic.twitter.com/HYsKQQZXxG — Santosh Kumar J (@MPsantoshtrs) November 27, 2021 'రాధేశ్యామ్' హీరోయిన్ పూజా హెగ్డే ఈ ఛాలెంజ్‌ను శుక్రవారం స్వీకరించి మొక్కలు నాటింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను యువ హీరో సుశాంత్ నుంచి స్వీకరించి, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు సవాల్ విసిరింది. ఇంతకుముందు అమీర్ ఖాన్, నాగ చైతన్య కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే స్వతహాగా సవాల్ స్వీకరించిన నటి నందితా శ్వేత మొక్కలు నాటారు. అనంతరం ఆమె ఐశ్వర్య రాజేశ్, హీరో నిఖిల్, డైరెక్టర్ ప్రశాంత్‌కు ఛాలెంజ్ విసిరారు. ఇదీ చదవండి: 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' స్వీకరించిన రాధేశ్యామ్ బ్యూటీ -
మొక్కలు నాటిన పూజా హెగ్డే.. ఆ స్మైల్ చూడండి
Radheshyam Actress Pooja Hegde Accepted Green India Challenge: తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా సాగుతోంది. సామాన్యులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు ఎందరో మొక్కలు నాటుతున్నారు. పర్యావరణాన్ని రక్షించే మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో ఇప్పటికే సినిమా తారలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు పాల్గొంటున్నారు. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే ఈ గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రేరణ (రాధేశ్యామ్ చిత్రంలో పూజా హెగ్డే పాత్ర పేరు) మొక్కలు నాటి పలువురికి ప్రేరణ కలిగించింది. ఈ విషయాన్ని జోగినపల్లి సంతోష్ ఆయన ట్విటర్ వేదికగా తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి, కార్యక్రమంలో భాగమైనందుకు పూజా హెగ్డేకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'మంచి భవిష్యత్తు కోసం మీరు చేసిన ఈ గొప్ప కార్యక్రమాన్ని, దేశవ్యాప్తంగా ఉన్న మీ అభిమానులు కూడా నిర్వహిస్తారని భావిస్తున్నాను' అని జోగినపల్లి సంతోష్ ట్వీటారు. పూజా హెగ్డేకు హీరో సుశాంత్ ఈ గ్రీన్ ఇండియా సవాల్ విసిరారు. అలాగే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు పూజా హెగ్డే 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఇచ్చింది. ప్రస్తుతం పూజా హెగ్డే రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది. అందులో 'ప్రేరణ' అనే పాత్రలో అభిమానులను అలరించనుంది. Thank you #PoojaHegde ji for accepting #GIC nomination from @iamSushanthA garu and planting saplings as part of #GreenIndiaChallenge. Hoping that your huge fan base across India would replicate what you have done today, in the interest of the better future.#Appreciate 🌱 pic.twitter.com/qK1IfSptOL — Santosh Kumar J (@MPsantoshtrs) November 26, 2021 ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇటీవల స్వతహాగా సవాల్ స్వీకరించిన నటి నందితా శ్వేత మొక్కలు నాటారు. అనంతరం ఆమె ఐశ్వర్య రాజేశ్, హీరో నిఖిల్, డైరెక్టర్ ప్రశాంత్‌కు ఛాలెంజ్ విసిరారు. అంతేకాకుండా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కూడా పాల్గొని మొక్కలు నాటారు. వారివెంట అక్కినేని నాగ చైతన్య కూడా ఉన్నారు. -
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో మొక్కలు నాటిన సీజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ ‘గ్రీన్ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన విషయాన్ని సీజే గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు సంతోష్‌ను ప్రశంసించారు. మంగళవారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్య క్రమంలో సీజే, బీఎస్ ప్రసాద్, ఏజీ జె.రామచంద్రరావులతో కలిసి సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు. సీజే సతీశ్‌చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తుల కు ఎంపీ సంతోష్ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ శ్రీసుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్‌గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్‌రావు, జీపీలు జోగినిపల్లి సాయికృష్ణ, సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
మొక్కకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టిన విశాల్
మాదాపూర్: తాను నాటిన మొక్కకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు నటుడు విశాల్. ఎనిమీ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తన స్నేహితుడు పునీత్ రాజ్‌కుమార్ గుర్తుగా మొక్కని నాటినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో ఆయన ప్రారంభించిన ఈ చాలెంజ్ గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్రబృందానికి అందజేశారు. -
గ్రీన్ ఇండియా చాలెంజ్ : మొక్కలు నాటిన ‘మహా సముద్రం’ టీమ్
-
దేశాలు దాటుతున్న మన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
-
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న టీమిండియా క్రికెటర్
Hanuma Vihari Takes Part In Green India Challenge: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ హనుమ విహారి పాల్గొన్నాడు. ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విహారి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చాడు. కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, టీమిండియా దిగ్గజ క్రికెటర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్, కృష్ణ ప్రియలకు ఆయన ఛాలెంజ్ విసిరాడు. చదవండి: గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్ ప్రకటన -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నీతిఆయోగ్ సీఈవో
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతీబాగ్‌లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమితాబ్‌కాంత్ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవోకు వృక్ష వేదం పుస్తకాన్ని సంతోష్ బహూకరించారు. పుస్తక వివరాలతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కి నామినేట్ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ‘ఊరిఊరికో జమ్మిచెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు’ నినాదంతో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆదివారమిక్కడ జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. -
‘గ్రీన్’ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్
సాక్షి, హైదరాబాద్: ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సహనటుడు, టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి విమానాశ్రయంలో ఆయన మొక్కలు నాటారు. జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్ అభినందించారు. ‘మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి. అప్పుడే భవిష్యత్ తరాలు జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లమవుతాం. మొక్కలు నాటడాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి’అని పిలుపునిచ్చారు. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అమీర్ ఖాన్, నాగచైతన్య
-
మొక్కలు నాటిన అమీర్ ఖాన్, నాగచైతన్య.. ఫోటోలు వైరల్
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ విలక్షణ చిత్రాల హీరో అమీర్ ఖాన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఆదివారం హైదరాబాద్ చేరుకున్న మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్, తన లాల్ సింగ్ చద్ధా సహానటుడు, టాలీవుడ్ యంగ్ టర్క్ అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఎన్నో ఛాలెంజ్ లను మనం చూసాం కానీ, మొక్కలు నాటాలనే అద్భుతమైన ఛాలెంజ్ ను మనకు అందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి, వాటిని బాధ్యతగా పెంచాలి. అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. దీన్ని ఒక కార్యక్రమంగా కాకుండా.. నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ప్రతీ ఒక్కరిని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, రాఘవ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో గౌతమ్ గంభీర్..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్.. తెలంగాణ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా గంభీర్ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ.. గంభీర్‌కు వృక్ష వేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అని ఈ సందర్భంగా గంభీర్ కొనియాడారు. ఈ మహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. గంభీర్ మొక్కలు నాటిన వీడియోను ఎంపీ సంతోష్ కుమార్ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఈ ఛాలెంజ్‌లో భాగమైనందుకు గంభీర్‌కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, టీ20 ప్రపంచకప్ మెంటర్‌గా ధోని ఎంపికపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్ సంచలన వ్యాఖ్యలు -
పాలమూరు.. పచ్చదనానికి విశ్వవేదిక
సాక్షి, హైదరాబాద్: సమైక్యపాలనలో వలసలకు, ఆకలిచావులకు నిలయమైన పాలమూరు జిల్లా స్వయంపాలనలో పచ్చదనానికి విశ్వవేదికగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సీడ్‌బాల్స్‌ను రికార్డుస్థాయిలో తయారు చేసి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వెదజల్లడం, సీడ్‌బాల్స్‌తో అత్యంత పొడవైన వాక్యాన్ని నిర్మించడం ద్వారా సాధించిన గిన్నీస్‌బుక్ వరల్డ్ రికార్డు జ్ఞాపికను శుక్రవారం ప్రగతిభన్‌లో సీఎం చేతుల మీదుగా ఎంపీ జోగినపెల్లి సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అందుకున్నారు. ఈ సందర్భంగా వారి కృషిని సీఎం అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా అందిస్తున్న జలాలతో జిల్లావ్యాప్తంగా పచ్చనిపంటలు కనువిందు చేస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. బీడుభూములు, రాళ్లు, గుట్టలకే ఇన్నాళ్లూ పరిమితమైన పాలమూరు పచ్చదనంతో రూపురేఖలను మార్చుకుని, వినూత్నరీతిలో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకుపోతుండటం గర్వకారణమన్నారు. తక్కువఖర్చుతో ఎక్కువ పచ్చదనాన్ని సాధించేదిశగా రికార్డుస్థాయిలో 2 కోట్ల పది లక్షల సీడ్‌బాల్స్‌ను నెలరోజుల వ్యవధిలో తయారు చేసి 10 రోజుల్లో కొండలు, గుట్టల ప్రాంతాల్లో వెదజల్లిన జిల్లా మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని అభినందించారు. -
నా బర్త్‌డే రోజు ఆ పని చేయండి
Mahesh Babu: హీరో బర్త్‌డే అంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే హడావుడి చేస్తుంటారు అభిమానులు. కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేట్ చేయాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. భారీ కటౌట్లు ఏర్పాటు చేసి, వాటికి అభిషేకాలు చేస్తూ, కిలోల కొద్దీ కేక్స్ రెడీ చేయించి వాటిని కట్ చేస్తూ, స్వీట్లు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఫ్యాన్స్ చేసే హంగామాతో హీరో పేరు మార్మోగిపోతుంటుంది. కాగా మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 9న సూపర్ స్టార్ మహేశ్‌బాబు బర్త్‌డే. అయితే ఈ సారి తనకో చిన్న పని చేసి పెట్టమని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడీ హీరో. తన పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కోరుతున్నాడు. "నాపై ప్రేమాభిమానాలతో మీరు చేసే పనులు నన్నెంతగానో ప్రేరేపిస్తున్నాయి. అయితే ఈసారి మీ అందరికీ నాదో ప్రత్యేక విన్నపం. నా బర్త్‌డే రోజు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు మద్దతుగా నిలబడండి. మొక్కలు నాటుతూ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. వాటిని నేను కూడా చూస్తాను" అని పేర్కొన్నాడు. మహేశ్ తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎంత గొప్ప మనసంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అమితాబ్, నాగార్జున ఫొటోలు
-
మరో మైలురాయి సాధించిన ‘గ్రీన్ ఇండియా’
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కి విశేష స్పందన లభిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో బిగ్‌బీతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్, హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను అమితాబ్ అభినందించారు. ప్రజలందరూ ఇందులో భాగస్వామ్యులు కావాలని అమితాబ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. -
అమితాబ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్
-
ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: శనివారం మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు గ్రీన్ ఇండియా చాలెంజ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ జిల్లాల్లో నమోదవుతున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క గంటలో నాటాలన్న నియమాన్ని సడలించినట్టు తెలిపారు. వర్షాల తెరిపి, వీలును బట్టి రోజంతా తమతమ ప్రాంతాల్లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. కేటీఆర్‌కు ఈ మొక్కలు నాటడాన్నే పుట్టినరోజు కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అన్ని స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తమ పరిధిలో వీలైనన్ని మొక్కలు నాట డం ద్వారా హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిని దేశవ్యాప్తం చేయాలన్న తమ సంకల్పానికి ప్రజలు ఇచ్చే ఈ మద్దతు చాలా కీలకమని సంతోష్ పేర్కొన్నారు. ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలునాటేలా కార్యాచరణ... రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 3.30 కోట్ల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రాష్ట్రంలోని సర్పంచులు 2.5 కోట్ల మొక్కలు, జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేటర్లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు. 142 మున్సిపాలిటీలలో చైర్మన్లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో ప్రజాప్రతినిధులతో 20 లక్షలు మొక్కలు నాటేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటేవారు తాము నాటిన మొక్కతో ఫొటో దిగి 9000365000 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మొక్కల కోసం గ్రామాల్లోని పంచాయతీ నర్సరీలు, అటవీ, మున్సిపల్ నర్సరీలను ఇప్పటికే అనుసంధానించినట్టు తెలియజేశారు. -
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మనవడు బర్త్ డే
సాక్షి, హైదరాబాద్: ’గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీ రామారావు కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితహారంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హిమాన్షు కోరారు. -
Green India Challenge: గిన్నీస్ బుక్‌లో పాలమూరు ఆడబిడ్డలు
పాలమూరు ఆడబిడ్డలు గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు. విత్తన బంతుల (సీడ్ బాల్స్)తో ఇంగ్లిష్ అక్షరాలతో అతిపెద్ద వాక్యాన్ని పేర్చినందుకు ఈ ఘనత సాధించారు. అంతేకాదు 2.08 కోట్ల విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేసి వెదజల్లారు. జిల్లాలోని 479 గ్రామైక్య, 11,506 స్వయం సహాయక సంఘాల్లోని (ఎస్‌హెచ్‌జీ 1,29,506 మంది మహిళలు, మెప్మా ఆధ్వర్యంలోని 27,040 మంది 10 రోజుల పాటు శ్రమించి వీటిని తయారుచేశారు. 81 మంది మహిళలు.. 81 ఇంగ్లిష్ అక్షరాలతో ‘టూ క్రోర్ సీడ్ బాల్స్ మేడ్ అండ్ ప్లాంటెడ్ బై ఎస్‌హెచ్‌జీ ఉమెన్ ట్రాన్స్ఫామ్ మహబూబ్‌నగర్ ఇన్ టు హెటిరో గ్రీన్ బెల్ట్’అని ఇంగ్లిష్‌లో 73,918 సీడ్ బాల్స్‌ను పేర్చారు. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా వీక్షించిన గిన్నిస్ బుక్ ప్రతినిధి రిషినాథ్ సాయంత్రం రికార్డు సాధించినట్లు ప్రకటించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని మయూరి రిజర్వ్ ఫారెస్ట్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోష్‌కుమార్, కలెక్టర్ వెంకట్రావ్ విత్తన బంతులను వెదజల్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. - సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ -
ఎంపీ సంతోష్‌కుమార్‌పై మోదీ ప్రశంసలు
-
ఆకుపచ్చని బర్త్‌డే: కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన
రాష్ట్రంలో బృహత్ కార్యానికి తెరలేవనుంది.. ఏటేటా పచ్చదనాన్ని సింగారించుకుంటున్న తెలంగాణకు ‘కోటి వృక్షార్చన’ జరగనుంది.. కొత్త ఆశలు ప్రతిఫలించేలా కోటి మొక్కలు వేళ్లూనుకోనున్నాయి.. సాక్షి, హైదరాబాద్: గంట వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా కోటి మొక్కలు నాటనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ మహత్తర కార్యక్రమం చేపట్టనున్నారు. హరితహారంలో భాగమైన ఈ మహత్కార్యం ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘కోటి వృక్షార్చన’పేరిట హరిత విప్లవంలో మరో అంకం తీసుకురానున్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సరిగ్గా గంట సమయంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కోటి మొక్కలు నాటి రాష్ట్రాన్ని ఆకుపచ్చని వనం చేయనున్నారు. ఉద్యమ స్ఫూర్తితో సాగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ శ్రేణులు ఇందులో భాగస్వాములు కానున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ పిలుపుతో.. ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా బుధవారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాలని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆకు పచ్చని తివాచీ పరిచేందుకు ఆయన నడుం బిగించారు. ఇందులో మరింత మందిని భాగస్వామ్యం చేసేందుకు కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్కు సంస్థాగతంగా ఉన్న దాదాపు 60 లక్షల మంది కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. పెరిగిన గ్రీన్ కవర్ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో గ్రీన్‌కవర్ 24 శాతం ఉండేది. దీంతో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రాధాన్యమిచ్చిన సీఎం కేసీఆర్.. ‘హరితహారం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏటా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తూ ఆరేళ్లలో 211 కోట్ల మొక్కలు నాటింది. దీంతో గతంతో పోలిస్తే రాష్ట్రంలో 3.67 శాతం గ్రీన్ కవర్ పెరిగినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మేమూ నాటుతాం..! ప్రముఖ నటులు చిరంజీవి, సంజయ్‌దత్, నాగార్జున, మహేశ్‌బాబుతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ‘కోటి వక్షార్చన’కు మద్దతు పలకడంతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ నలుమూలలా ఉన్న కేసీఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ‘వృక్షార్చన’ కోటి వృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, పారిశ్రామికవాడలు, విద్యా సంస్థలు తదితర ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు టీఆర్ఎస్ నేతలు, వివిధ వర్గాలకు చెందిన వారు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీఆర్ఎస్ ఎన్నారై సెల్‌కు చెందిన 50 దేశాల ప్రతినిధులతో మంగళవారం ఎంపీ సంతోష్‌కుమార్ సమావేశమయ్యారు. మొక్కలు నాటే వారు వాట్సాప్ ద్వారా 9000365000 నంబర్‌కు ఫొటోలు పంపితే.. వారికి ‘వనమాలి’బిరుదు ప్రదానం చేస్తామని తెలిపారు. కాగా, కోటి వృక్షార్చనలో భాగంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, విప్‌లు తదితరులు బుధవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో మొక్కలు నాటనున్నారు. మెగా రక్తదాన శిబిరానికి కేటీఆర్ తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం తెలంగాణభవన్‌లో జరిగే మెగా రక్తదాన కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మెగా రక్తదాన శిబిరంలో పార్టీ శ్రేణులు పాల్గొనాల్సిందిగా టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అన్ని దేశాల్లో మొక్కలు నాటాల్సిందిగా టీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాల, ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి కోరారు. బల్కంపేట ఎల్లమ్మకు 2 కేజీల బంగారు చీర సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి 2 కిలోల బంగారంతో తయారు చేసిన పట్టుచీరను సమర్పించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నేతృత్వంలో జలవిహార్‌లో జరిగే జన్మదిన వేడుకల్లో కేసీఆర్ జీవన ప్రస్థానంపై రూపొందించిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ఐదు ప్రత్యేక గీతాలను కేటీఆర్ విడుదల చేస్తారు., తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ విజేతలకు ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి బహమతులు అందజేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, సర్వమత ప్రార్థనలు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. -
తెలంగాణకి హరిత తిలకం కోటి వృక్షార్చన
భరతమాత నుదిటిపై సస్య తిలకం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్. ఆకు పచ్చని తెలంగాణ సంకల్పం.. హరిత హారం. ఈ హరితహార సాధన పథ క్రమంలో తలపెట్టిన మహా యజ్ఞం.. కోటి వృక్షార్చన. ఒకేరోజు ఒకే గంటలో.. కోటి మొక్కలు నాటి సీఎం కె. చంద్రశేఖర రావుకి ఘన వన కానుకనందించేందుకు యావత్ తెలంగాణ పచ్చని మొక్కలు చేబూనింది. పల్లెపట్నాన మొక్కల పండుగతో వన హారతి పట్టేందుకు సన్నద్ధమైంది. వన విస్తరణలో సరికొత్త రికార్డులు బద్ధలుకొట్టేందుకు కోటి వృక్షార్చన వేదిక కాబోతోంది. మొక్కలే మన శ్వాస. వృక్షాలే మన ఊపిరి. జలజీవాలకి మూలం అడవులే. మొక్కలు లేనిదే మనుగడ లేదు. పచ్చదనం లేనిదే పురోగమనం లేదు. కానీ నేడు ఆ పచ్చదనమే కరువై ప్రపంచం అల్లాడుతోంది. శ్రుతి మించిన శిలాజ ఇంధనాల వాడకం, విచక్షణ రహిత వనరుల వినియోగం కారణంగా ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతిని... భూతాపం భూమండలాన్ని కబళించే దుస్థితి దాపురించింది. పర్యావరణ మార్పులకి అడ్డుకట్ట పడకపోతే... జీవ ఉనికి, మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన నేటి సాంకేతిక యుగంలో తలసరి మొక్కలు, అంతి మంగా హరిత సాంద్రత పెంచడమే లక్ష్యంగా భారతరత్న, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలకి ప్రతిరూపంగా ప్రాణం పోసుకున్న సామాజిక వన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్. మొక్కలు నాటడంలో సరికొత్త సంచలనం, వనాల విస్తరణలో వినూత్న మంత్రం ఈ హరిత సవాలు. ఇది ప్రప్రథమంగా మొదలైన తెలంగాణతోపాటు దేశమంతటా నేడు ఉద్యమంలా విస్తరించింది. ఎంపీ సంతోష్ చొరవ, సెలబ్రిటీల హంగులు వెరసి మూడు మొక్కలు ఆరు చెట్లతో ఘనంగా సాగుతోంది. సామాజిక ట్రెండ్‌గా మారిన గ్రీన్ ఛాలెంజ్.. మరో దశని అందుకోబోతోంది. ముఖ్యంగా తెలం గాణ గడ్డ మరోసారి హరిత రికార్డులకి సిద్ధమైంది. ఫిబ్రవరి 17 సీఎం పుట్టినరోజు సందర్భంగా... తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. 3 మొక్కలు నాటిన పౌరులు... ఆన్లైన్ యాప్, వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఇప్పటికే వాట్సప్ నంబర్ 9000365000, ఇగ్నైటింగ్ మైండ్స్ మొబైల్ యాప్‌ని అందుబాటులోకి తెచ్చారు. ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటిన వ్యక్తులు, సంస్థలకి అవార్డులు ఇవ్వనున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి వివిధ రంగాలకి చెందిన సెలబ్రిటీలు నూతన శోభని తీసుకువచ్చారు. ఈ ఛాలెంజ్ నిరంతరం సజీవంగా ఉండేలా, వార్తల్లో నిలిచేలా వెలుగు తెచ్చారు. సచిన్, అమితాబచ్చన్, చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ ఇలా ఎందరెందరో మొక్కలు నాటి అభిమానుల్లో స్ఫూర్తి నింపారు. ఫలితంగా నేడు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరణ వార్తలు, మొక్కలు నాటుతున్న ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి. ఎందరో బుల్లితెర, వెండితెర నటీనటులు, క్రీడా, వ్యాపార ప్రముఖులు ఇప్పటికే మొక్కలు నాటిన వారంతా తాజాగా కోటి వృక్షార్చనలో పాల్గొనాలంటూ పిలుపునిస్తున్నారు. ప్రకృతి విపత్తుల నుంచి భారతావనిని కాపాడుకుందామంటూ యూట్యూబ్, ట్విట్టర్లలో వీడియో సందేశాలు పెడుతున్నారు. సీఎం పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలంటూ ఆహ్వానిస్తున్నారు. కోటి రత్నాల తెలంగాణ గడ్డకు.. వన తిలకం.. హరిత హారం. ఈ హరిత యజ్ఞానికి.. పచ్చని పావడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్. సీఎం స్వప్నమైన ఆకుపచ్చని తెలంగాణ సాధనలో.. హరిత సవాలు చిరునిచ్చెన. హరిత భారత స్వప్నంతో ప్రతిఒక్కరికీ చేరువైన గ్రీన్ ఛాలెంజ్.. కోటి వృక్షార్చన ద్వారా వనాల విస్తరణ, కాలుష్య నివారణకి దోహదపడనుంది. కోటి మొక్కలతో సీఎంకి మరపురాని బహుమతి ఇవ్వాలని తెలంగాణ సమాజం ఎదురుచూస్తోంది. ఇప్పటికే హరితహారం పుణ్యమాని రాష్ట్రంలో పచ్చదనం 4 శాతం వృద్ధి చెందింది. ఇక ఈ సామాజిక వన విప్లవం ఇదే స్థాయిలో దేశమంతటా కొనసాగితే... 28 చెట్లతో తలసరి మొక్కల లెక్కల్లో అట్టడుగున ఉన్న భారత్‌లో పచ్చదనం పరిఢవిల్లుతుంది. చెట్టు–పుట్ట, పశువులు–పక్షులు, నదులని పూజించే దేశంలో జన చైతన్యం వెల్లివిరిస్తే.. భారత్‌లో హరిత సాంద్రత పెంచడం అసాధ్యం కాదు. ఉత్తరాఖండ్ మంచు సరస్సు విధ్వంసం వంటి ఘటనలకి ఆస్కారం ఉండదు. నిర్జీవమవుతున్న అడవులు కొత్త చిగుళ్లు వేస్తాయి. వనాల వైశాల్యం పెరిగితే... తద్వారా వర్షాలు, భూగర్భ జలాలు మెరుగుపడి కరవుల ప్రభావం తగ్గుతుంది. అంతిమంగా దేశానికి ఆహార, జల భద్రత లభిస్తుంది. ఇందుకు కోటి వృక్షార్చన ద్వారా తెలంగాణ రాష్ట్రమే పునాది కావాలని ఆశిద్దాం. రాష్ట్రంలో హరిత వనాలు గగన సీమలని అందుకోవాలని కోరుకుందాం. (నేడు సీఎం కేసీఆర్ జన్మదినం) వ్యాసకర్త ఇగ్నైటింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు ఎం. కరుణాకర్‌రెడ్డి మొబైల్ : 98494 33311 -
సీఎం కేసీఆర్‌కు ఇచ్చే గిఫ్ట్ ఇదే : చిరంజీవి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు (ఫిబ్రవరి 17) సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన ‘కోటి వృక్షార్చన’పిలుపుకు సెలబ్రిటీలందరూ స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటామని వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడా రంగ ప్రముఖులంతా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పులువురు టాలీవుడ్ తారలు ‘కోటి వృక్షార్చన’ చాలెంజ్‌ను స్వీకరించగా.. తాజగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ‘కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి పుట్టినరోజు కానుకగా అందిద్దాం’ అని తెలుపుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి వృక్షార్చన’కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుదాం. వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకుందాం. మన ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం’ అని చిరంజీవి పిలుసుపునిచ్చారు. Thank you very much @KChiruTweets garu for your kind words about #GreenIndiaChallenge. Also for spreading awareness by encouraging not only your fans but all the public to take part #KotiVruksharchana marking CM #KCR sir Birthday, it’s certain that it goes deep into the society. pic.twitter.com/vNYHcQz2dR — Santosh Kumar J (@MPsantoshtrs) February 15, 2021 పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.MP సంతోష్ కుమార్ గారు చేపట్టిన #GreenIndiaChallenge కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం Shri.KCR గారికి ఇచ్చే కానుక.అందరం మొక్కలు నాటుదాం... వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం. — Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2021 -
ఒక గంటలో కోటి మొక్కలు
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశమంతటా హరిత భావజాల స్ఫూర్తిని వ్యాపింపజేస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణను పర్యావరణపరంగా, అత్యంత నివాసయోగ్యంగా మార్చుకునేందుకు ఈ చాలెంజ్‌లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు (ఫిబ్రవరి 17)న కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఒక్కరోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్ ఇండియా చాలెంజ్ సంకల్పమన్నారు. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవుతున్నాయని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, గ్రామ స్థాయి వరకు పార్టీ పదవుల్లో ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సంతోష్ పిలుపునిచ్చారు. ఇక కేసీఆర్‌ను అభిమానించే వారితో పాటు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడా రంగ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేం దుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ నెల 16, 17 రోజుల్లో రెండ్రోజుల పాటు శంషాబాద్ విమానాశ్రమంలో హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులందరికీ ఔషధ మొక్కలను గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రతీ గ్రామం.. తద్వారా రాష్ట్రం ఆకుపచ్చగా తయారు కావాలని, అందుకోసం అందరి కృషి అవసరమని సంతోష్ ఆకాంక్షించారు. ఎండలు సమీపిస్తున్నందున మొక్కలు నాటడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు, నీటి సౌకర్యం, తగిన రక్షణ కల్పించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. -
ఛాలెంజ్ స్వీకరించిన మోనాల్.. మరో నలుగురికి!
పర్యావరణం పచ్చగా ఉండాలనే దృఢ సంకల్పంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో పలువురు సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పాల్గొని బాధ్యతాయుతంగా మొక్కలు నాటారు. తాజాగా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మోనాల్ సోమవారం మొక్కలు నాటారు. మరో కంటెస్టెంట్ దేత్తడి హారిక విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటారు. చదవండి: స్పెషల్ సాంగ్..మోనాల్‌కు అంత రెమ్యునరేషనా? అనంతరం మోనాల్ మాట్లాడుతూ.. జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని సవాలును స్వీకరించి మొక్కలు నాటనని తెలిపారు. అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ కుమార్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పేర్కొన్నారు. అలాగే మరో నలుగురు ( మాకప ఆనంద్ , మిత్ర గాద్వి , క్రిష్ణ కుల్ శేకరన్ , మల్హాత్ థాకర్) లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని సూచించింది. చదవండి: అదే అసలైన ‘రిపబ్లిక్’ అంటున్న మెగా మేనల్లుడు Thank you #MonalGujjar garu for accepting the nomination & planting the saplings under #GreenIndiaChallenge. Also for nominating your fabulous co-stars.https://t.co/t5Xx9oUtw3#GIC🌱🌱🌱. pic.twitter.com/UZwYqRDdTp — Santosh Kumar J (@MPsantoshtrs) January 25, 2021 -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌పై రాహుల్ పాట
సాక్షి, హైదరాబాద్: పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె అనే నినాదంతో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" మూడో దశ విస్తృతంగా వ్యాపిస్తోంది. స్టార్ నటుల నుంచి సామాన్యుల వరకు ఈ మహోత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. ఈ క్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రాముఖ్యతను చాటిచెప్తూ రాహుల్ సిప్లిగంజ్ ఓ పాటను చిత్రీకరించారు. హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వనజీవి రామయ్య ఈ స్పెషల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ పాటలో ప్రాణవాయువును పెంచే చెట్లతో చెలిమి చేయండని సందేశాన్ని పొందు పరిచారు. మనిషికో మూడు మొక్కలు నాటండని చెప్తూనే, చంటిపాపను కాపాడినట్టుగా చెట్లను సంరక్షించండని పిలుపునిచ్చారు. (చదవండి: అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్) -
అభిజిత్ ఛాలెంజ్ స్వీకరించిన సోహైల్
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్‌ను రెండో రన్నరప్ సోహైల్ స్వీకరించాడు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో సోహైల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని ఇస్తుందన్నారు. అలసిపోయి వచ్చిన పచ్చని చెట్టు కింద కూర్చుని పచ్చడి మెతుకులు వేసుకొని తింటే ఆ ఆనందమే వేరు ఉంటుందని పేర్కొన్నారు. మనం ఇప్పుడు మంచి నీటిని డబ్బులు ఇచ్చి కోనుకుంటున్నామని, రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కొనే పరిస్థితి రాకుడదంటే బాధ్యతగా మనం అందరం మొక్కలు నాటాలని సోహైల్ కోరారు. చదవండి: హీరోగా ఎంట్రీ.. సోహైల్ కొత్త సినిమా ఫిక్స్! దయచేసి నన్ను అభిమానించే అందరూ మొక్కలు నాటి ఎంపీ సంతోష్ కుమార్, నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్యాగ్ చేయగలరు అని పిలుపునిచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తను మరో ముగ్గురికి( అరియానా, మెహబూబ్, అఖిల్) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు ఈ సందర్భంగా సోహైల్‌కు వృక్షవేదం పుస్తకాన్ని అందజేశారు. చదవండి: సమంతతో ఆఫర్ కొట్టేసిన అభిజిత్ బిగ్‌బాస్ 4 కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..