సీఎం కేసీఆర్‌కు ఇచ్చే గిఫ్ట్‌ ఇదే : చిరంజీవి | Chiranjeevi Calls To His Fans For Koti Vruksh Archana For KCR Birthday | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు ఇచ్చే గిఫ్ట్‌ ఇదే : చిరంజీవి

Published Tue, Feb 16 2021 7:13 PM | Last Updated on Tue, Feb 16 2021 10:29 PM

Chiranjeevi Calls To His Fans For Koti Vruksh Archana For KCR Birthday - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు (ఫిబ్రవరి 17) సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఇచ్చిన ‘కోటి వృక్షార్చన’పిలుపుకు సెలబ్రిటీలందరూ స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటామని వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడా రంగ ప్రముఖులంతా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పులువురు టాలీవుడ్‌ తారలు ‘కోటి వృక్షార్చన’ చాలెంజ్‌ను స్వీకరించగా.. తాజగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. 

‘కోటి వృక్షార్చనలో పాల్గొని మొక్కలు నాటి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి పుట్టినరోజు కానుకగా అందిద్దాం’ అని తెలుపుతూ.. మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో కళకళలాడాలి అని మన ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి ఆకాంక్ష, కోరిక. దాని కోసం మన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి వృక్షార్చన’కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుదాం. వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకుందాం. మన ముఖ్యమంత్రిగారికి పుట్టినరోజు కానుకగా ఇద్దాం’ అని చిరంజీవి పిలుసుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement