
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా దర్శకుడు ఎం.శశికుమార్ ఇచ్చిన ఛాలెంజ్‌ను నటుడు సముద్రఖని స్వీకరించారు. ఈమేరకు హైటెక్ సిటీలోని శిల్పారామంలో రావి మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొనే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు.
ప్రకృతి పచ్చగా ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను గొప్ప సామాజిక ఉద్యమంగానే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగానూ తీర్చిదిద్దిన అధినేత జోగినపల్లి సంతోష్ కుమార్, నిర్వాహకుల నిరంతర కృషి ప్రశంసనీయం. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని నేను నా ఇంటి నుంచే మొదలు పెడుతున్నాను. ఈ బృహత్తర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి నా కుమారుడు హరివిఘ్నేశ్వరన్, కూతురు శివానీ, ప్రముఖ దర్శకులు హెచ్.వినోద్‌లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసురుతున్నా' అన్నారు సముద్రఖని.
చదవండి: డూప్లెక్స్ అమ్మిన సోనమ్ కపూర్, ఎన్ని కోట్లంటే?
రష్మికపై ట్రోలింగ్, రాళ్లు విసురుతారన్న కన్నడ స్టార్
Comments
Please login to add a commentAdd a comment