'నా కుమారుడికి పిల్లను ఇవ్వొద్దని తండ్రినే చెబుతున్నా'.. రామం రాఘవం ఎమోషనల్‌ ట్రైలర్ | Dhanraj and Samuthirakani Ramam Raghavam Telugu Movie Trailer | Sakshi
Sakshi News home page

Ramam Raghavam Trailer: ధన్‌రాజ్‌ 'రామం రాఘవం'.. ఎమోషనల్ ట్రైలర్‌ వచ్చేసింది

Published Fri, Feb 14 2025 2:02 PM | Last Updated on Fri, Feb 14 2025 4:22 PM

Dhanraj and Samuthirakani Ramam Raghavam Telugu Movie Trailer

టాలీవుడ్ నటుడు ధనరాజ్ కొరనాని స్వీయ దర్శకత్వం వహిస్తోన్న తొలి చిత్రం 'రామం రాఘవం'. ఈ సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు  నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబం

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ట్రైలర్ ‍విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే తండ్రీ, కొడుకుల మధ్య జరిగే కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ జనరేషన్‌లో తండ్రి, కుమారుల రిలేషన్స్‌ ఎలా ఉంటాయనే కోణంలోనే రామం రాఘవం చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సునీల్,  సత్య, పృద్వి,  శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది.  ఈ చిత్రానికి విమానం దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను అందించగా అరుణ్ చిలువేరు సంగీత సమకూర్చారు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలలో ఒకేసారి త్వరలో విడుదల కానుంది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement