
అన్నపూర్ణగా, అన్నదాతగా చరిత్రలో నిలిచిపోయిన డొక్కా సీతమ్మ జీవితం వెండితెరకు రానుంది. ‘డొక్కా సీతమ్మ’ పేరుతో ఈ సినిమాని రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రభాకర్ గౌడ్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాని మరొకరు నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ వివాదం గురించి రామకృష్ణ, ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2016లోనే ‘డొక్కా సీతమ్మ’ సినిమా స్క్రిప్ట్‌ని హైదరాబాద్‌లోని తెలుగు సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేశాం.
మా రచనను కాపీ కొడుతూ వేరొక సంస్థ వారు డొక్కా సీతమ్మపై సినిమా తీయడానికి పూనుకోవడంతో ఈ వివాదం కోర్టుకు చేరింది. కాపీ రైట్ యాక్ట్ మాకు ఉన్నప్పటికీ కోర్టులో వివాదం ఉండటంతో మేం ముందుకెళ్లలేదు. వేరొక సంస్థ ఈ సినిమాను తీసేందుకు సన్నాహాలు చేస్తే కోర్టు ధిక్కారం అవుతుంది’’ అన్నారు. ‘డొక్కా సీతమ్మ’ చరిత్ర తొలి రచయిత వంశీయులు మిర్తిపాటి రామచయనులు, దర్శకుడు సాయికృష్ణ, కెమేరామేన్ వాసువర్మ ఈ సమావేశంలో పాల్గొన్నారు