ramakrishna
-
సౌర విద్యుత్ కొనుగోలు పిల్‌పై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నుంచి యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు అనుమతినిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీడీపీ నేత, మంత్రి పయ్యావుల కేశవ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు జనవరి 29కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే దాఖలు చేసిన కౌంటర్‌ను ఓసారి పరిశీలించి అవసరమైతే అదనపు వివరాలతో మరో కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.ఇందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు స్పందిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణను జనవరి చివరి వారంలో జరుపుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు రాగా ధర్మాసనం స్పందిస్తూ.. అసలు వివాదం ఏమిటో చెప్పాలని కోరింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేస్తారని.. దీని వల్ల పంపిణీ నష్టాలుంటాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. -
సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ పై స్పందించిన సీపీఐ రామకృష్ణ
-
వైయస్ఆర్సీపీ కురుబ సామాజికవర్గం అధ్యక్షుడిగా గడ్డం రామకృష్ణ
-
చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచబోమని చెప్పి మాట తప్పారు: CPI రామకృష్ణ
-
వైఎస్ జగన్ డిక్లరేషన్ ఎందుకివ్వాలి: రామకృష్ణ
సాక్షి,హైదరాబాద్: వెంకటేశ్వర స్వామిని ముందుపెట్టి రాజకీయాలు చేయడం తగదని, స్వామి వద్దకు అందరూ వెళ్లొచ్చని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ విషయమై రామకృష్ణ శుక్రవారం(సెప్టెంబర్27)ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.‘అందరివాడైన వెంకటేశ్వరస్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు. తిరుమలకు జగన్ వెళ్తే అపవిత్రం అనే వ్యాఖ్యలు తగదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా? మరి ఆయన తిరుమలకు ఎలా వెళ్తున్నాడు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వైఎస్ జగన్ ఐదేళ్లపాటు సీఎంగా ఉండి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పట్టు వస్త్రాలు ఇవ్వడమంటేనే ఒక ప్రాధాన్యతగల అంశం. అప్పుడు ఏమీ మాట్లాడకుండా నేడు సాధారణ భక్తునిలా వైఎస్ జగన్ తిరుమల వెళ్తానంటే డిక్లరేషన్ అడగడమేంటి’అని రామకృష్ణ ప్రశ్నించారు.ఇదీ చదవండి: దొరికిపోయిన చంద్రబాబు..అబద్ధాలు బట్టబయలు -
బ్యారేజ్‌లో బోట్లు వదిలారనడం సరికాదు: సీపీఐ నేతలు
సాక్షి,విజయవాడ:ప్రకాశం బ్యారేజ్‌లో ఉద్దేశపూర్వకంగానే బోట్లు వదిలారంటూ టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సీపీఐ నేతలు తప్పుపట్టారు.ప్రకాశం బ్యారేజ్ వద్ద వరదలకు కొట్టుకొచ్చిన బోట్లను మంగళవారం(సెప్టెంబర్17) సీపీఐ నేతల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడారు.‘గతంలో ఎప్పుడూ రానంత వరద వచ్చింది.చంద్రబాబు వస్తే కరువు వచ్చేదని అనేవారు.ఈసారి అతివృష్టి వచ్చింది.వరదకు మొత్తం కొట్టుకుపోయింది.ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఇలాంటివి జరగుతాయి. వీటిని భరించక తప్పదు.బ్యారేజ్‌ను కూల్చేయడానికే బోట్లు వదిలారనే వాదన సరికాదు.డీపీ నేతలు అతిశయోక్తి మాటలు మానుకోవాలి.వాస్తవాలు మాట్లాడాలి.రాష్ట్రప్రభుత్వం అసలైన దొంగలను గుర్తించాలి.1902లో బుడమేరు యుటి(అండర్ టన్నెల్)కట్టారు.తక్షణమే ఈ ప్రభుత్వం బుడమేరు యుటి షేప్‌ను మార్చాలి.ఇప్పటి వరకు బోట్లేసుకుని తిరిగిన చంద్రబాబు బుడమేరు యుటి గురించి మాత్రం మాట్లాడటం లేదు.ఎంతసేపూ పడవల్లో తిరిగి బాధపడి అయ్యో అమ్మోఅని కన్నీళ్లు పెట్టుకుంటే కుదరదు.చంద్రబాబు ఇప్పటికైనా బుడమేరు యుటిని చూడాలి.యుద్ధప్రాతిపదికన రీ మోడల్ చేయాలి’అని నారాయణ డిమాండ్ చేశారు.గ్రామాల్లో సాయమేది..? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఫైర్కొల్లేరు టు బుడమేరు పర్యటించాంవరదల సమయంలో సీఎం,మంత్రులు అంతా విజయవాడపైనే దృష్టిపెట్టారుగ్రామాల్లోకి వెళితే తమకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు చెబుతున్నారుఅధికారులెవరూ తమ వద్దకు రాలేదంటున్నారువేల ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటికీ ఎన్యుమరేషన్ చేయలేదుప్రభుత్వ తీరుపై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారుగిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ చిన్న సాయం కూడా అందలేదుచంద్రబాబుకు విజయవాడలో పబ్లిసిటీ బాగానే వచ్చింది..సంతోషంగ్రామీణ,గిరిజన ప్రాంతాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందిబుడమేరు మాదిరిగానే కొల్లేరు కూడా ఆక్రమణలకు గురైందిపెద్ద పెద్ద కోటీశ్వరులు కొల్లేరును ఆక్రమించుకున్నారుబుడమేరు మాదిరి కొల్లేరును కూడా ప్రక్షాళన చేయాలికొల్లేరు,0బుడమేరు ఆక్రమణల పై సీఎం చంద్రబాబును కలుస్తాంఅవసరమైతే కేంద్రప్రభుత్వం దృష్టికి కూడా కొల్లేరు సమస్యను తీసుకెళతాంఇదీ చదవండి.. వరద బాధితులకు ప్రభుత్వ సాయమేది: బొత్స -
తరగతి గదిలో బాలికపై లైంగిక దాడి!
తిరుపతి క్రైమ్: సభ్యసమాజం తలదించుకునేలా.. తరగతి గదిలోనే ఓ బాలికపై లైంగిక దాడి జరిగిన దారుణ ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతిలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 14 సంవత్సరాల విద్యార్థిని తొమ్మిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 21వ తేదీన క్లాసులు జరిగిన అనంతరం పీటీ పీరియడ్‌లో విద్యార్థులంతా ఆటలాడుకోడానికి గ్రౌండ్‌కు వెళ్లారు. ఈ సమయంలో సత్యవేడుకు చెందిన.. ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషి అనే యువకుడు స్కూలుకు వచ్చాడు. బాలికకు మాయమాటలు చెప్పి క్లాస్ రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. టీచర్ ఆరా తీయడంతో బయటపడ్డ వైనం బాలిక ప్రవర్తన వింతగా ఉండడంతో క్లాస్ టీచర్‌కు శుక్రవారం అనుమానం వచ్చింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు.. ఆరోగ్యం సరిగా లేదా? అంటూ ప్రశి్నంచింది. బాలిక ఏం లేదంటూనే ఏడవడంతో టీచర్‌కు అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు.దీంతో జరిగిన విషయాన్ని పూర్తిగా తెలిపింది. వెంటనే టీచర్ ప్రభుత్వ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రిషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
భయమేస్తోందంటే మేం ఒప్పుకోం సూపర్ సిక్స్ అమలు చేయాల్సిందే
-
టీడీపీ వేధింపులకు జనసేన నేత బలి
-
ఇదేం పాలన పాక్ చంద్రబాబు.. తప్పు సరిచేసుకో..
-
బెడిసికొట్టిన జడ్జి రామకృష్ణ దాడి నాటకం
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోటకు చెందిన సస్పెన్షన్‌లో ఉన్న జూనియర్ సివిల్ జడ్జి ఎస్. రామకృష్ణ ఇంటిపై దాడి ఘటన ఓ నాటకంగా తేలిపోయింది. దాడిచేసి ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టింది స్వయానా జడ్జి తమ్ముడు రామచంద్ర అని విచారణలో నిర్ధారించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడంతో నాటకానికి తెరపడింది. సోదరుల మధ్య కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో తలెత్తిన విభేదాలను కూడా మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి ఆపాదించే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లెలో గురువారం మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై జడ్జి రామకృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని అర్థమైంది.గతంలోనూ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధం లేని వివాదంలోకి లాగడం కూడా ఇలాంటిదేనని స్పష్టమైంది. రామకృష్ణ చేసిన ఫిర్యాదులో నిందితుడు అతని తమ్ముడేనని తేల్చి ఈ మేరకు అరెస్ట్ చేసి 41 నోటీసు జారీ చేశామని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. గతనెల 30న రాత్రి బి.కొత్తకోట కరెంట్ కాలనీలో ఉంటున్న రామకృష్ణ ఇంటివద్దకు వచ్చిన తమ్ముడు రామచంద్ర ఆస్తి పంపకాల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించాడు, ఇంటిలో నుంచి రామకృష్ణ వెలుపలికి రాకపోవడంతో అక్కడే ఉన్న కట్టెను తీసుకుని గేటుకు కొట్టడంతో రామకృష్ణ బయటకు రాగా ఇద్దరి మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి వివాదం జరిగింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న గొడవతో రామచంద్ర కిటికీ అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తులు తనను హతమార్చేందుకు దాడిచేశారని ఈనెల ఒకటిన రామకృష్ణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, పరిసరాల్లో జరిపిన విచారణలో రామచంద్రే ఇంటి కిటికీ అద్దాలను ధ్వంసం చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడైన రామచంద్రను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. రామచంద్రపై బి.కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఏడు కేసులు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. -
అవినీతి వెలగపండు
భవ్య పరిపాలనా రాజధానిలో సూర్యోదయ దిక్కుకు ప్రాతినిధ్యం వహించే ఆ ఎమ్మెల్యే అవినీతికి అంతేలేదు. ఆయన పేరు చెబితే భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, దందాలే గుర్తొస్తాయి. కొండలు సైతం భయంతో కంపిస్తాయంటే అతిశయోక్తి కాదు. వరుసగా మూడుసార్లు ఎన్నికైనా ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. అవినీతి, అక్రమాలు మాత్రం భారీగానే వెలగబెట్టారు. ఫలితంగా ‘రామ..రామ’.. ఇదేమి దోపిడీ అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఆరిలోవ(విశాఖ): విశాఖ నగర ప్రజలకు తెలియని కత్తికట్టి ఆడే కోడి పందేల విష సంస్కృతిని ఆ ఎమ్మెల్యే ఇక్కడి జూదరులకు పరిచయం చేశారు. ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక జీవీఎంసీకి చెందిన పదెకరాల ఖాళీ స్థలంలో 2016 నుంచి 2020 వరకు సుమారు నాలుగేళ్లపాటు వరుసగా సంక్రాంతి సమయంలో బరులు ఏర్పాటు చేయించి భారీగానే వెనకేసుకున్నారు. ప్రజల జేబులు గుల్లచేశారు. ఆరిలోవ, జోడుగుళ్లపాలెం, అప్పూఘర్, జాలరిపేట ప్రాంతాల్లో మద్యం దుకాణాలను 2015లో ఎమ్మెల్యే ప్రారంభించారు. అప్పట్లో ఆరిలోవలో నిర్వహించిన మద్యం దుకాణం తొలగించాలని ఐద్వా ఆధ్వర్యంలో స్థానికులు, డ్వాక్రా సంఘాల మహిళలు ధర్నాలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ► రుషికొండ ప్రాంతంలో రెవెన్యూకి చెందిన భూమిలో గెడ్డ భాగాన్ని ఆక్రమించి ఆ స్థలం రోడ్డు నిర్మాణంలో పోయినట్టు ఎమ్మెల్యే చూపించారు. ప్రత్యామ్నాయంగా వేరేచోట స్థలం పొందారు. ► 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అనేక దందాలకు పాల్పడ్డారు. జోడుగుళ్లపాలెం వద్ద సుమారు ఎకరం స్థలాన్ని తన బంధువుల పేరుతో ఆక్రమించే యత్నం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన యత్నానికి బ్రేక్ పడింది. ► ఎంవీపీ కాలనీలో సెక్టార్–2లో గెడ్డ స్థలాన్ని ఆక్రమించి ఓ బిల్డర్‌కు అపార్టుమెంట్ నిర్మాణం కోసం కట్టబెట్టారు. ఆ అపార్టుమెంట్లో కొన్ని ప్లాట్లు తనకు ఇవ్వడానికి బిల్డర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో దీనిపై తీవ్రమైన విమర్శలు రావడంతో జీవీఎంసీ అధికారులు ఆ అపార్టుమెంట్ నిర్మాణాన్ని నిలిపేశారు. అప్పటి వైఎస్సార్ సీపీ నాయకుడు (ప్రస్తుతం జనసేన కార్పొరేటర్) పీతల మూర్తియాదవ్ ఈ ఆక్రమణపై కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. ► రామకృష్ణాపురాన్ని ఆనుకొని ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక 2017లో పెగదిలికి చెందిన ఎమ్మెల్యే అనుచరులు కొందరు సర్వే నంబర్లు 26, 27ల్లోని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి 18 పాకలు వేశారు. దీనిపై ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జీవీఎంసీ అధికారులు ఆ పాకలను తొలగించారు. అయినా పట్టువదలకుండా వేసిన పాకలను మూడుసార్లు అధికారులు తొలగించాల్సి వచి్చంది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు పేదలకు చెందిన పాకలను తొలగించారని కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఎమ్మెల్యేపై కేసులు ► 2020 మార్చి 15న ఎమ్మెల్యే నిర్వహించే మద్యం షాపుల్లో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేపట్టారు. ఆ దుకాణాల్లో కల్తీ మద్యం బ్రాండ్లు విక్రయిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ఎమ్మెల్యే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులతో ధర్నా చేపట్టారు. ఎక్సైజ్ పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐపీసీ 353, 501 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ► 2019 సాధారణ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేపై మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ► రుషికొండ వద్ద ప్రభుత్వానికి చెందిన స్థలంలో గెడ్డ భాగాన్ని ఆక్రమించినట్లు 2011లో రూరల్ రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేపై భూ ఆక్రమణ కేసు పెట్టారు. అయితే ఆ తర్వాత అధికారులను బెదిరించి ఆయన కేసును కొట్టివేయించుకున్నారు. -
బాబు, పవన్ డబుల్‌గేమ్‌పై క్యాడర్ తిరుగుబాటు
అవనిగడ్డ/ఎలమంచిలి/రాజంపేట/పాడేరు: పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపులో చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ఆడుతున్న డబుల్‌గేమ్‌పై ఆయా నియోజకవర్గాల్లో ఆసమ్మతి జ్వాలలు రేగుతున్నాయి. అవనిగడ్డలో జనసేన నాయకులు ఎదురుతిరగగా, యలమంచిలిలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. రాజంపేట, పాడేరు నియోజకవర్గాల్లో ఆయా నేతలు ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన నేతలు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సీటు ప్రకటిస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతిచ్చేది లేదని తెగేసి చెప్పారు. సోమవారం అవనిగడ్డలో జనసేన నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బచ్చు వెంకటనాథ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జనసేన ఉమ్మడి కృష్ణా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత పదేళ్లుగా పార్టీ బలోపేతం కోసం కష్టపడిన నాయకులను కాదని ఈరోజు పార్టీలో చేరిన వారికి సీటు ఎలా ఇస్తారని మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు మాట్లాడుతూ బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జనసేన కోసం పోరాడిన తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారని, నడిరోడ్డుపై నిలబెట్టి విమర్శలు చేసిన వ్యక్తికి నేడు సీటెలా ఇస్తారని ప్రశ్నించారు. బుద్ధప్రసాద్‌కు సీటు ప్రకటిస్తే ఎట్టి పరిస్ధితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని, వెంటనే మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సమావేశంలో తీర్మానం చేశారు. ఎన్నికలకు ముందు పార్టీలు మారడం బుద్ధప్రసాద్‌కు అలవాటని, 2019లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, ఇప్పుడు జనసేనలోకి వచ్చారని కార్యకర్తలు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నుంచి జనసేనలో చేరిన వల్లభనేని బాలశౌరి మంత్రాంగం నడిపి బుద్ధప్రసాద్‌ను జనసేనలోకి తీసుకొచ్చారని, ఎంపీ సీటు కోసం ఆయన, ఎంఎల్ఏ సీటుకు బుద్ధప్రసాద్ పార్టీలు మారారని జనసైనికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పార్టీ నాయకులు మత్తి వెంకటేశ్వరరావు, చిలకలపూడి పాపారావు, గుడివాక శేషుబాబుతో పాటు ఆరు మండలాలకు చెందిన జనసేన నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. సమాచారం ఇవ్వకుండా మీటింగా? అనకాపల్లి జిల్లా యలమంచిలిలో టీడీపీ సీనియర్ నేత పప్పల చలపతిరావు ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మియ సమావేశం రసాభాసగా ముగిసింది. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ ప్రగడ నాగేశ్వరరావు తెలియకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కోట్లు ఖర్చు పెట్టించి ఐదేళ్లుగా టీడీపీ కోసం కష్టపడి పనిచేయించుకుని, పొత్తు పేరుతో నాగేశ్వరరావుకు హ్యాండిచ్చారని వారు నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు సీఎం రాజేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్‌ల సమక్షంలోనే పప్పల చలపతిరావును వేదికపైకి రానీయకుండా నెట్టేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట, ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీ సీనియర్లకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సమావేశం ప్రారంభం కాకుండానే వాయిదా వేస్తున్నట్టు బుద్ధ నాగజగదీష్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల ప్రకటన రాకపోతే రెండ్రోజుల్లో 10 వేల మందితో సమావేశం ఏర్పాటు చేసి తమ సత్తా చూపుతామని ప్రగడ నాగేశ్వరరావు వర్గీయులు స్పష్టం చేశారు. సుగవాసి వద్దే వద్దు పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట టికెట్ రాయచోటి వాసి సుగవాసి బాలసుబ్రమణ్యానికి కేటాయించడం టీడీపీలో చిచ్చు రేపింది. సోమవారం టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీడీపీ రాజంపేట ఇన్చార్జి బత్యాల చెంగల్రాయుడు తన వర్గీయులతో బలప్రదర్శన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తిరుపతి రహదారిలోని ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి ర్యాలీ కొనసాగింది. చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుగవాసి వద్దు అంటూ నినాదాలు చేశారు. చెంగల్రాయుడు మాట్లాడుతూ తనే అభ్యర్ధి అని, రాజంపేట నుంచి పోటీ చేసి గెలిచి వస్తే మంచి భవిష్యత్తు కల్పిస్తామని చంద్రబాబే చెప్పారని తెలిపారు. కానీ సుగవాసి బాలసుబ్రమణ్యానికి టికెట్ ఇచి్చనట్లు సమాచారం వచ్చిందన్నారు. ర్యాలీ పాతబస్టాండు, శివాలయం, ఆర్టీసీ బస్టాండు, మన్నూరు మీదుగా యల్లమ్మగుడి వరకు కొనసాగింది. రమేష్‌నాయుడిని ఓడిద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. టికెట్ దక్కలేదని ఆగ్రహంతో ఉన్న ఆమె సోమవారం కుమ్మరిపుట్టులోని తన నివాసంలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన తన అనుచరులు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్ధి రమేష్ నాయుడు వద్దు..గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించి గిడ్డి ఈశ్వరికి టికెట్ కేటాయించాలని, లేని పక్షంలో రమేష్‌నాయుడును ఓడిస్తామని హెచ్చరించారు. -
బ్రేక్ అప్ చెప్పిన చంద్రబాబు..RK హార్ట్ బ్రేక్
-
చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్
-
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, ఇది చరిత్రాత్మకమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. ఒకేసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఏపీలోనే తొలిసారి జరుగుతోందని తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్లపై వారికి పూర్తి హక్కు కల్పిస్తూ, వారికి ఒక ఆస్తిగా దాన్ని సమకూర్చి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇంత పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేయడం తమ శాఖకు చాలెంజింగ్ వంటిదని, అత్యంత క్లిష్టమైన ఈ పనిని అందరి సహకారంతో సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షలాది మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు, వారి ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, హద్దులు, రెవెన్యూ గ్రామాల సమాచారాన్ని అప్లోడ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజి్రస్టార్లుగా గుర్తించడంతో వారికి లాగిన్లు ఇవ్వడం, ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్లు చేసే 15 వేల మంది వీఆర్వోలకు లాగిన్లు ఇవ్వడం పూర్తి చేసినట్టు చెప్పారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ఈ డేటా మొత్తాన్ని మ్యాపింగ్ చేశామన్నారు. ఈ పని చేయడమే అత్యంత క్లిష్టమని, దాన్ని పూర్తి చేయడంతో రిజిస్ట్రేషన్లు ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్లు వెల్లడించారు. వీరందరి ఆధార్ ఈ–సిగ్నేచర్లతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల నకిలీ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని చెప్పారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 6.5 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని తెలిపారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిచ్చిందని రామకృష్ణ తెలిపారు. సాధారణంగా సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.5 వేల ఫీజు కట్టాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్టు తెలిపారు. రోజుకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, త్వరలో ప్రభుత్వం లక్ష్యానికనుగుణంగా అన్ని రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంతో సాకారమైందని తెలిపారు. మొన్నటివరకు భూముల రీ సర్వే పూర్తయిన 4 వేల గ్రామాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసేవారని, ఇప్పుడు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ గ్రామ స్థాయికి పూర్తిస్థాయిలో చేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ఈ–సిగ్నేచర్ యూజర్లు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. 6.5 లక్షల రిజిస్ట్రేషన్ల కోసం 20 లక్షల ఈ–సిగ్నేచర్లు తీసుకున్నట్టు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల వల్ల వారు పొందిన స్థలాలపై పేదలకు హక్కులు ఏర్పడతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇచ్చే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారడం వల్ల వారికి ఇబ్బందులుండవన్నారు. రెవెన్యూ ఎన్వోసీ లేకుండానే పదేళ్ల గడువు ముగిశాక ఆ స్థలాలపై పేదలకు సర్వ హక్కులు లభిస్తాయని, ఇది వారికి ఎంతో ఉపయోగకరమని రామకృష్ణ వివరించారు. -
Fact Check: ఈనాడు కథనానికి ఇంజనీరు బలి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తెచ్చిన సిమెంట్‌ను అవసరమైన చోట్ల వాడామని, బిల్లులు వచ్చిన తర్వాత వెనక్కి తెప్పిస్తున్నామని ‘ఈనాడు’ పత్రికకు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా వక్రభాష్యాలు చెబుతూ కథనాలను ప్రచురించింది. దీంతో ఒత్తిడికి గురైన విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ జేఈ (కాంట్రాక్ట్ ఉద్యోగి) వి.రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను వైఎస్సార్సీపీ నాయకులకు ముడిపెడుతూ ఈనెల 30వతేదీన ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించింది. ఈనెల 29న ఉదయం రేగిడి మండల జేఈ (కాంట్రాక్టు) వి.రామకృష్ణ రాజాం పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల వారీగా వచ్చిన సిమెంట్ బస్తాలు, వినియోగంపై ఇంజినీరింగ్ అసిస్టెంట్లను రాజాం సీఐ ఎస్.శ్రీనివాస్ ఆరా తీశారు. అవసరాన్ని బట్టి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయం పరిధిలో భవనాల నిర్మాణానికి సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈనెల 25న ‘ఆ సిమెంట్ బస్తాల మాటేమిటి?’ శీర్షికతో ఈనాడులో కథనం వచ్చినప్పటి నుంచి తన భర్తపై ఒత్తిళ్లు ప్రారంభమైనట్లు రామకృష్ణ భార్య ఉమాదేవి వాపోతున్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సిమెంట్ బస్తాలు వేరే సచివాలయం పరిధిలోని భవనాలకు సరఫరా చేశామని రామకృష్ణ మొత్తుకున్నా ‘ఈనాడు’ కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో రామకృష్ణ మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. -
పోస్టాఫీసులో కోటిన్నర స్వాహా
నాగార్జునసాగర్: నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీలోని సబ్ పోస్టాఫీస్‌లో ఖాతాదారుల సొమ్ము సుమారు కోటిన్నరకుపైగానే సబ్ పోస్టుమాస్టర్ స్వాహా చేసినట్టు విచారణలో తేలింది. ఖాతాదారులు, పోస్టల్ డిపార్టుమెంట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నాగార్జునసాగర్ సీఐ బీసన్న బుధవారం తపాలా కార్యాలయానికి వెళ్లి విచారణ చేశారు. పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో ఖాతాదారులు, డిపాజిటర్లు వారి పాసుబుక్‌లతో పెద్ద సంఖ్యలో వచ్చారు. సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ పోస్టాఫీసు ఖాతాదారులకు డూప్లికేట్ పాసుపుస్తకాలు ఇచ్చి ఖాతాలో వేసిన నగదును ఆ పాసుపుస్తకంలోనే రాసి ఇస్తూ నగదును తన సొంత ఖాతాలో జమ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అలాగే ఖాతాదారుల ఫోన్ నంబర్లు కూడా మార్చి వేరే నంబర్లు నమోదు చేసినట్లు వెల్లడైంది. ఖాతాదారుల అకౌంట్లలోని నగదును విత్‌డ్రా చేసుకోవడంతో పాటు డిపాజిట్‌దారుల సొమ్మును విత్‌డ్రా చేసినట్లు తేలింది. ఖాతా నంబర్లకు లింకయిన ఫోన్ నంబర్లను ముందస్తుగానే మార్చడంతో నగదు విత్‌డ్రా చేసినప్పుడు వేరేవారికి సమాచారం వెళ్లలేదని విచారణలో తేలింది. పసిగట్టని అధికారులు లక్షల రూపాయలు విత్‌డ్రా అవుతుంటే సంబంధిత ఉన్నతాధికారులు పసిగట్టలేకపోయారు. గతంలో ఒక ఖాతా నుంచి చిన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకున్నా.. ఫోన్ చేసి మీరు మీ నగదును విత్‌డ్రా చేసుకున్నారా అని అడిగే వారని, ఇంత నగదు అతి తక్కవ కాలంలో విత్‌డ్రా అవుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోలేదని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ రెండవ వారంలోనే నగదు లెక్కల్లో తేడా వచ్చినట్లు గమనించి 17వ తేదీన రామకృష్ణను పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వెంటనే విచారణ చేసిన పోస్టల్ అధికారులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రామకృష్ణ డబ్బులతో పరారవుతుంటే పోస్టల్, పోలీస్ శాఖలు ఏం చేసినట్లని ఖాతాదారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అనుముల మండలం హజారుగూడెంకు చెందిన సదరు సబ్ పోస్టుమాస్టర్ రామకృష్ణ శనివారం నిడమనూరు కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. -
తికమకతాండ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: తికమకతాండ నటీనటులు: హరికృష్ణ, రామకృష్ణ, యాని,రేఖ నిరోష, శివన్నారాయణ, రాకెట్ రాఘవ తదితరులు నిర్మాణ సంస్థ:టి ఎస్ ఆర్ మూవీమేకర్స్ నిర్మాత : తిరుపతి శ్రీనివాసరావు దర్శకత్వం : వెంకట్ సంగీతం: సురేశ్ బొబిల్లి సినిమాటోగ్రఫీ: హరికృష్ణన్ విడుదల తేది: డిసెంబర్ 15, 2023 కథేంటంటే.. తికమకతాండ అనే గ్రామంలోని ప్రజలందరికి మతిమరుపు అనే సమస్య ఉంటుంది. రచ్చబండతో సహా ప్రతి ఏరియాను గుర్తుపెట్టుకోవాడానికి పలకపై పేర్లను రాసి అక్కడ తగిలిస్తారు. మతిమరుపు కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీంతో తమకున్న మతిమరుపు సమస్యను తొలగించుకోవడం కోసం అమ్మవారి జాతర చేద్దాం అనుకుంటారు. అంతా జాతరకు సిద్ధమైన సమయంలో అమ్మవారి విగ్రహం మాయమైపోతుంది. అసలు అమ్మవారి విగ్రహం ఎలా మాయమైంది? ఆ ఊరి జనాలకు మతిమరుపు సమస్య ఎలా వచ్చింది? ఆ ఊరి సమస్యను తీర్చడానికి రంగంలోకి దిగిన హీరోలకు ఎదురైన సమస్యలు ఏంటి? విగ్రహాన్ని తిరిగి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టమేంటి? చివరకు ఏం జరిగింది అనేది తెలియాలంటే థియేటర్స్‌లో తిమకతాండ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఊరందరికీ మతిమరుపు అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ఊరికి ఒక అమ్మవారు ఉండడం .. అమ్మవారి విగ్రహం మాయమవడం తిరిగి ఊరు వారు ఆ విగ్రహాన్ని పట్టుకున్నారా లేదా అనేదే ఆ మూవీ కథాంశం. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ..తెరపై అంతే కొత్తగా చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు.ఫస్టాఫ్ అంతా ఊరి వాళ్ళ మతిమరుపుతో కాస్త కామెడీ, హీరోల ప్రేమ కథలతో సాగుతుంది. యాదమ్మ రాజు కామెడీ నవ్వులు పూయిస్తుంది. విగ్రహం మాయమవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. విగ్రహం తీసుకురావడానికి హీరో రంగంలోకి దిగడంతో కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం సీరియస్‌గా సాగుతుంది. కొన్ని సాగదీత సీన్స్ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ..క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. లాజిక్స్‌ని పక్కకి పెట్టి చూస్తే గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆకట్టుకుంటుంది. నటీనటుల విషయానికొస్తే.. ఈ చిత్రంలో హీరోలుగా హరికృష్ణ రామకృష్ణ నటించారు.వారిద్దరికి ఇది తొలి సినిమానే అయినా.. చక్కగా నటించారు. డ్యాన్స్‌తో పాటు యాక్షన్స్ సీన్స్ కూడా అదరగొట్టేశారు.రాజన్న మూవీ లో మల్లమ్మ పాత్ర పోషించినయాన్ని ఈ సినిమాలో మల్లికగా కథానాయక గా పరిచయమైంది. ఊరు అమ్మాయి పాత్రలో గాని చాలా అద్భుతంగా నటించింది ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించింది. ఓహో పుత్తడి బొమ్మ సాంగ్‌లో నిజంగా పుత్తడి బొమ్మలానె అనిపించింది. ఇంకో హీరోయిన్గా రేఖా నిరోషా నటించింది. నిడివి తక్కువైనా తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. ఇక దర్శకుడు వెంకట్ పాత్రకు వస్తే దర్శకుడుగానే కాకుండా నటుడిగా కూడా తన ఏంటో నిరూపించుకున్నారు. శివన్నారాయణ గారు బుల్లెట్ భాస్కర్ యాదవరాజు ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారు. సాంకేతిక విషయాలకొస్తే..హరికృష్ణన్ గారి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్. సిద్ శ్రీరామ్ పాడిన ఓహో పుత్తడి బొమ్మ సాంగ్ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమా చూస్తే అర్థమతుంది. -
మతిమరుపు...
కవలలు హరికృష్ణ, రామకృష్ణ హీరోలుగా యాని, రేఖా నిరోషా హీరోయిన్లుగా వెంకట్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తికమక తాండ’. తిరుపతి సత్యం సమర్పణలో తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి నిర్మాతలు సి. కల్యాణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై, హిట్టవ్వాలన్నారు. ‘‘తికమక తాండ అనే ఊర్లోని ప్రజలకు మతిమరుపు అనే కథాంశంతో రూపొందించాం’’ అన్నారు వెంకట్. ‘‘మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలి’’ అన్నారు తిరుపతి శ్రీనివాసరావు. -
కన్నకూతురిని కత్తులతో నరికి..
వైరా రూరల్: ఆస్తి కోసం కనీస విచక్షణ, మానవత్వం..చివరికి కన్నప్రేమను కూడా మరిచి మృగంలా మారిన ఓ తండ్రి కన్నకూతురును.. పైగా ఐదు నెలల గర్భవతి అని కూడా చూడ కుండా వేటకొడవళ్లు, గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనలో కుమార్తె అక్కడికక్కడే మృతిచెందగా అల్లుడు చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాటిపూడి గ్రామానికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులతోపాటు కుమార్తె ఉషశ్రీ(35) ఉన్నారు. వీరిలో ఇద్దరు కుమారులు నరేశ్, వెంకటేష్ స్థానికంగానే ఉంటుండగా, మరొకరు దూరంగా నివసిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన రాములు మామ (మంగమ్మ తండ్రి) మన్నెం వెంకయ్య చిన్నతనం నుంచే ఉషశ్రీని పెంచి పెద్దచేసి పదేళ్ల కిందట కొణిజర్ల మండలం గోపారానికి చెందిన పర్శబోయిన రామకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ సమయంలో వెంకయ్య తన రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 10కుంటల ఇంటి స్థలాన్ని ఉషశ్రీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో రామకృష్ణ ఇల్లరికంపై తాటిపూడికి రాగా, అక్కడే భార్యాభర్తలు టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పదేళ్ల క్రితం పెళ్లి కాగా, ఇన్నేళ్లకు ఉషశ్రీ గర్భం దాల్చింది. కాగా, తన మామ వెంకయ్య ఆస్తిని ఉషశ్రీకి రాయడాన్ని జీర్ణించుకోలేని ఆమె తండ్రి రాములు, సోదరులు నరేశ్, వెంకటేష్ తరచూ ఘర్షణ పడేవారు. ఈ విషయమై కేసు కూడా కోర్టులో పెండింగ్‌లో ఉంది. కూతురినీ నరికేశాడు.. శుక్రవారం ఉదయం ఉషశ్రీకి చెందిన ఇంటి స్థలంలో ఉన్న సుబాబుల్ చెట్లను నరికేందుకు పిట్టల రాములు, ఆయన కుమారులు నరేష్, వెంకటేశ్ వేటకొడవళ్లు, గొడ్డలి, గడ్డపలుగులతో వచ్చారు. ఇది చూసి రామకృష్ణ, ఉషశ్రీ అడ్డుకున్నారు. దీంతో వారు గడ్డపలుగు, వేటకొడవళ్లతో వెంటపడ్డారు. ఈ క్రమంలో రామకృష్ణపై దాడి చేస్తుండగా, ఉషశ్రీ తప్పించుకునే ప్రయత్నంలో ఇంకొకరి ఇంట్లోకి వెళ్లడంతో వెంబడించి మరీ నరికారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రగాయాలపాలైన రామకృష్ణను స్థానికులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మరక్షణ కోసం ఉషశ్రీ, రామకృష్ణ ప్రతిదాడి చేయడంతో రాములు, వెంకటేశ్, నరేశ్‌కు కూడా గాయాలవడంతో ఆస్పత్రిలో చేరారు. వైరా ఏసీపీ ఎం.ఎ రెహమాన్, సీఐ నునావత్ సాగర్, ఎస్సై మేడా ప్రసాద్ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
కావాలనే నన్ను సినీ పరిశ్రమకు దూరం చేశారు
-
ఎవరో కాదు... నా తండ్రే నా పరువు తీశాడు
-
సినిమా అంటే నాకు చాలా ఇష్టం కానీ.. నన్ను దూరం చేశారు
-
నాకు అంత అదృష్టం లేదు...!