
సాక్షి, అమరావతి : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నట్టు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుంటానని ప్రకటించి.. మరోవైపు ఎన్డీయేలో కొనసాగుతామని సంకేతాలు ఇవ్వడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
తాజాగా సీపీఐ ఏపీ కార్యదర్శి కే రామకృష్ణ చంద్రబాబు తీరును తప్పుబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని గతంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారని, అప్పుడే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి మంత్రులను తప్పించడమే కాకుండా, ఎన్‌డీఏ నుంచి కూడా బాబు వైదొలగాలని ఆయన సూచించారు. ఇప్పటికైనా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పక్షాలను కలుపుకొని ఉద్యమం చేయాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం పోరాడాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment