ఆర్థిక ప్యాకేజీ ఎవరికి లాభం..? | CPI Ramakrishna Diwali Wishes To AP People | Sakshi
Sakshi News home page

ఆర్థిక ప్యాకేజీ ఎవరికి లాభం : సీపీఐ

Published Sat, Nov 14 2020 2:36 PM | Last Updated on Sat, Nov 14 2020 3:57 PM

CPI Ramakrishna Diwali Wishes To AP People - Sakshi

సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రకటించిన మూడో విడత ఆర్థిక ప్యాకేజి వల్ల సామాన్య మానవులకు ఎలాంటి ఉపయోగం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల ప్రయోజనం కోసమే ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని ఆరోపించారు. బీజేపీ ప్రకటనలు, ప్యాకేజీలు బీజేపీ పాలిత రాష్ట్ర లలో సామాన్య ప్రజలకు సైతం ఉపయోగపడవని అన్నారు. కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి కోల్పోయిన వారికి ఏమి ప్రయోజనం లేదన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు వ్యారాలను మోదీ సర్కార్‌ గాలికి వదిలేసిందని మండిపడ్డారు. గ్రామీణ పేదలు, వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని ప్యాకేజి ఇవ్వాలని కోరారు. శనివారం విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన రామకృష్ణ.. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement