CPI
-
‘పవన్.. రాజకీయాల కోసం పోర్టును దొంగగా చిత్రీకరిస్తారా?’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. ఇదే సమయంలో కాకినాడ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు.కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ చేసిన హంగామాపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోర్టు విషయమై పవన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సీపీఐ నేత మధు.. కాకినాడ యాంకరేజ్ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోంది. రాజకీయాల కోసం పోర్టును నాశనం చేయాలనుకుంటున్నారా?. పోర్టును నమ్ముకుని 30 వేల మంది కార్మికులు ఉన్నారు.రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా.. స్మగ్లింగ్ డెన్‌గా చిత్రీకరించకండి. కాకినాడ ప్రజలు మానసికంగా బాధపడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. పోర్టు ద్వారా అక్రమ వ్యాపారాలు జరిగితే సీబీఐ విచారణ జరపండి. పోర్టు గౌరవాన్ని దెబ్బ తీయకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పోలవరం జోలికొస్తే బాబు సర్కార్‌కు నూకలు చెల్లినట్టే: సీపీఐ రామకృష్ణ
సాక్షి, అనంతపురం: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. అలాగే, పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చల్లినట్లేనని హెచ్చరించారు.సీపీఐ రామకృష్ణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు దుర్మార్గం. చంద్రబాబు ఎన్డీయేలో భాగస్వామి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. 45.72 అడుగుల ప్రాజెక్టును 41 అడుగులకు కుదిస్తే ఎలా?. పునరావస ప్యాకేజీ ఎగ్గొట్టేందుకే కేంద్రం కుట్రలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?.పోలవరం జోలికి వస్తే చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు వల్ల రైతులకు తీరని అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు దారుణం. నవంబర్ ఏడో తేదీన విద్యుత్ ఛార్జీల పెంపుపై విజయవాడలో వామపక్షాల సమావేశం ఉంది. విద్యుత్ ఛార్జీల పెంపు పోరాటం చేస్తాం అని చంద్రబాబు సర్కార్‌ను హెచ్చరించారు. ఇది కూడా చదవండి: పోలవరానికి చంద్రబాబు కూటమి ఉరి.. -
చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం
తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌరహక్కుల కోసం, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయడం కోసం జరిగిన పోరాటం.మొగల్ సామ్రాజ్యంలో భాగమైన దక్షిణ భారతదేశానికి ఔరంగజేబు మరణానంతరం ఢిల్లీ రాజప్రతినిధిగా వచ్చిన సైనికాధిపతే నిజామ్. ఢిల్లీలో మొగల్ సామ్రాజ్య ప్రాభవం తగ్గగానే స్వతంత్రం ప్రకటించుకున్నారు. మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌కు, మహా రాష్ట్రులకు వ్యతిరేకంగా బ్రిటిషర్లకు నిజాం మద్దతు ఇచ్చినందుకు, నిజాం నవాబును కాపాడేందుకు బ్రిటిష్ సైన్యాన్ని ఇక్కడ ఉంచారు. వారి ఖర్చుల నిమిత్తం, సర్కారు జిల్లాలను, ఆ తర్వాత రాయ లసీమను వారికి అప్పగించారు.ఐనా మిగిలిన హైదరాబాదు సంస్థానం దేశంలోని 550 సంస్థా నాలలో పెద్దది. దీని వైశాల్యం 82,696 చదరపు మైళ్ళు. ఇది గ్రేట్ బ్రిటన్ వైశాల్యానికి సమానం. ఇందులో ఎనిమిది తెలుగు జిల్లాలు, ఐదు మరాఠీ జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలు ఉండేవి. కోటీ ఎనభై లక్షల జనాభాలో సగంమంది మాతృభాష తెలుగు, 25 శాతం మంది మరాఠీ, 12 శాతం మంది ఉర్దూ, 11 శాతం మంది కన్నడ, ఇతర భాషలు మాట్లాడేవారు. కాని ఉర్దూలో తప్ప పాఠశాలలు లేవు. ప్రైవే టుగా మాతృభాషలో పాఠశాలలు పెట్టుకోవడానికి వీల్లేదు. తెలంగాణ ప్రాంతంలో భూ కేంద్రీకరణ విపరీతంగా వుండేది. మొత్తం సాగులో వున్న భూమి దాదాపు 70% భూస్వాముల చేతుల్లో వుండేది. ఐదు వేల ఎకరాలపైన వున్న భూస్వాములు 550 మంది. చిన్న పెద్ద భూస్వాములలో 1982 మంది ముస్లింలు, 618 మంది హిందూ భూస్వాములు. నిజాం సొంత ఖర్చుల కోసం 636 గ్రామాల్లో ఐదు లక్షల ముప్ఫై వేల ఎకరాల భూమి వుండేది. 7వ నిజాం ఆస్తి ఆనాడు 400 కోట్ల రూపాయలు. అప్పుడు ప్రపంచంలో కెల్లా ధనవంతుడని పేరుండేది. రాష్ట్రంలో ప్రజలు దుర్భర జీవితం గడిపేవారు. అన్ని కులాలవారు, జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు, ప్రభుత్వ అధికారుల దగ్గర వెట్టిచాకిరీ చేయాల్సి వచ్చేది. తెలుగు ప్రజల సంఘంగా ఆంధ్ర జనసభ ప్రారంభమైంది. అది ఆంధ్ర మహాసభగా రూపొందింది. జోగిపేట ప్రథమ ఆంధ్ర మహా సభ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది. 1946 నాటికి ఆంధ్ర మహాసభ ప్రధాన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఈ దశలో ఆంధ్ర మహాసభలో మితవాదులు, అతివాదులు, జాతీయ వాదుల మధ్య ఘర్షణలో వామపక్షవాదులు మెజారిటీ అయ్యారు. రావి నారాయణ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత పేద ప్రజల సమస్యలు, తెలుగులో బోధన, వెట్టిచాకిరీ రద్దు తదితర అంశాలపైన కార్యాచరణ తీసుకున్నారు.దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్య్ర పోరాటం హైదరాబాద్ సంస్థాన ప్రజల మీద ప్రభావం చూపింది. మజ్లిస్ పార్టీకి ఖాశిం రజ్వీ అధ్యక్షుడై, హైదరాబాదును స్వతంత్ర ముస్లిం రాజ్యం చేస్తానని ప్రక టించి రజాకార్ల (వలంటీర్) నిర్మాణానికి పూనుకుని వేలాదిమంది ముస్లిములను చేర్పించి దాడులు ప్రారంభించాడు. నిజాం మద్దతి చ్చాడు. తెలంగాణను ముస్లిం మెజారిటీ సంస్థానంగా చేసేందుకు ఇతర రాష్ట్ర్రాల నుండి 8 లక్షల మంది ముస్లింలను అంతకు ముందు తీసుకువచ్చారని ఒక ఆరోపణవుంది.ఈ దశలో కేంద్ర ప్రభుత్వానికి నిజాంకు మధ్య అనేక చర్చల తర్వాత యథాతథ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నిజాం రాజుగా కొనసాగుతాడు. విదేశాంగ, రక్షణ కేంద్రం బాధ్యతల్లో వుంటుంది. ఇది రాష్ట్ర ప్రజలకు కేంద్రం చేసిన ద్రోహం. ఈలోగా విసునూరి రామచంద్రారెడ్డి ప్రజల మీద దాడులు ఉధృతం చేశాడు. ఆయన తల్లి జానకమ్మ నరరూప రాక్షసి. కడివెండిలో ప్రజలు బలవంతపు ధాన్యం లెవీకి వ్యతిరేకంగా ఊరేగింపు తీస్తే, గడీలోంచి కాల్పులు జరిపి, దొడ్డి కొమరయ్యను బలి తీసుకున్నారు. ఇక, అనేక ఇతర గ్రామాలలో రజాకార్లు గ్రామాలను తగలబెట్టి, స్త్రీలను మానభంగాలు చేశారు. బైరాన్‌పల్లి, పరకాల తదితర గ్రామాలలో డజన్ల సంఖ్యలో ప్రజలు హతులయ్యారు.ఈ నేపథ్యంలో 1947 సెప్టెంబరు 11వ తేదీన నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని కూలద్రోసి సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకుగాను, సాయుధ పోరాటం చేయవలసిందిగా రావి నారా యణరెడ్డి, మఖ్దుం మొహియుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి పేరుతో ప్రకటన విడుదల చేశారు. సాయుధ పోరాటం దావానలంలాగా వ్యాపించింది. ఈ పోరాటం ముఖ్యంగా నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా, ఇతర జిల్లాల్లో కొంత పరిమితంగా జరిగింది. 3,000 గ్రామాలను కమ్యూనిస్టు పార్టీ ప్రభావితం చేసింది. దాదాపు పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంచింది. హింసను అరికట్టే పేరుతో యూనియన్ సైన్యాలు హైదరాబాదు సంస్థానాన్ని ముట్టడించాయి. 3 రోజుల్లో నిజాం సైన్యం లొంగి పోయింది. మిలిటరీ గవర్నరుగా నియమించబడ్డ జనరల్ చౌదరి కొందరు రజాకార్లను, ఖాశిం రజ్వీని అరెస్టు చేసి, కమ్యూనిస్టుల మీద యుద్ధం ప్రకటించాడు. సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ జయసూర్య, మరికొందరు మిలిటరీ గవర్నరును కలిసి నెల రోజుల గడువిస్తే, కమ్యూనిస్టులతో చర్చించి, సాయుధ పోరాటాన్ని ఉపసంహరింపజేస్తామని చెప్పారు. దానికి జనరల్ చౌదరి నిరాకరించి నెల రోజు లెందుకు, వారం రోజుల్లో తెలంగాణలో కమ్యూనిస్టులను ఏరివేస్తా నని జవాబిచ్చాడు. అనివార్యంగా సాయుధ పోరాటం కొనసాగింది. హైదరాబాదు సంస్థానం, భారత యూనియన్‌లో విలీనమైనందున, నిజాం దుష్ట ప్రభుత్వం కూలిపోయినందున మధ్యతరగతి ప్రజలు, కొందరు మేధావులు సాయుధ పోరాటం ఆవశ్యకత లేదని భావించారు. 1951 చివరిలో పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై సాయుధ పోరాటాన్ని ఉపసంహరించాలని నిర్ణయించింది.1952 నాటికి సీపీఐ మీద నిషేధం తొలగనందున పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ పేరుతో కమ్యూనిస్టులు + ప్రజాతంత్ర వాదులు కలిసి పోటీ చేశారు. మెజారిటీ స్థానాల్లో పి.డి.ఎఫ్. గెలిచింది. రావి నారాయణరెడ్డి నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచారు. నిజాం సంస్థానంలోని కర్ణాటక, మహారాష్ట్ర జిల్లాల్లో కమ్యూనిస్టు పార్టీ బలహీనంగా ఉండటంతో కాంగ్రెసుకు వచ్చిన మెజారిటీతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది. మరొకవైపు రజాకార్లు స్వల్పశిక్షలతో బయటపడితే, కమ్యూనిస్టులపై సుదీర్ఘ శిక్షలు పడ్డాయి. 12 మందికి మరణశిక్షలు విధింప బడ్డాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు, ఆందోళన జరిగింది. వాటిని ముందు యావజ్జీవ కారాగార శిక్షలుగా మార్చి, కొన్నేళ్ళకు రద్దు చేశారు. రాజబహదూర్ గౌర్ రాజ్యసభకు ఎన్నికైనా విడుదల చేయలేదు. చివరకు ఉపరాష్ట్రపతి సర్వేపల్లి జోక్యంతో విడుదలయ్యారు.భూస్వాములు, వారి తాబేదార్లు, ముందు కాంగ్రెసులో, తర్వాత తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ రాష్ట్ర సమితులలో చేరారు. ఇప్పుడు బీజేపీలో భాగమౌతున్నారు. బీజేపీ వారు చరిత్రను వక్రీకరించి ‘ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందువుల పోరాటం’గా చిత్రీక రిస్తున్నారు. ముస్లిం కార్మికులు సాయుధ పోరాటానికి మద్దతిచ్చారు. భారత యూనియన్‌లో హైదరాబాదు సంస్థానం విలీనంలో మిత వాదుల పాత్ర నామమాత్రం. స్వామి రామానంద తీర్థ నాయకత్వాన కాంగ్రెసు జాతీయవాదులు గట్టిగా పోరాటం చేశారు. కాని సాయుధ పోరాటానిదే ప్రధాన పాత్ర. భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ వల్ల మిలిటరీ హైదరాబాదును విలీనం చేసిందనేది దుష్ప్రచారం మాత్రమే. సాయుధ పోరాటం తెలంగాణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుందనే భయంతోనే మిలిటరీని పంపారు. వేలాదిమందిని హత్యలు చేయించిన నిజాంను అరెస్టు చెయ్యకపోగా, రాజప్రముఖ్‌ను చేసి కోటి రూపాయల రాజభరణం ఇచ్చారు. ఇది ‘విముక్తా’, ‘రాజీ’నా ప్రజలు అర్థం చేసుకున్నారు.తెలంగాణ సాయుధ పోరాటం మత పోరాటం కాదు. వర్గ పోరాట స్వభావం కలిగిన పోరాటం. ప్రజాస్వామ్యం కోసం, పౌర హక్కుల కోసం, సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం కోసం జరిగిన పోరాటం. ప్రస్తుత నక్సలైట్ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపు అనే వాదన తప్పు. పోరాటం చైతన్యవంతులైన ప్రజలు నడుపుతారు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభించిన నాటికి ఆంధ్ర మహాసభకు ఏడు లక్షల సభ్యత్వం వుంది. 90 లక్షల తెలుగు భాష మాట్లాడే ప్రజల్లో 7 లక్షల సభ్యత్వం అంటే దాదాపు ప్రతి 12 మంది జనాభాలో ఒకరు ఆంధ్రమహాసభ సభ్యులు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఏమైనా తెలంగాణ సాయుధ పోరాటం, చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం. మన దేశం కోసం, మన కోసం, మన స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన ఆ యోధులను స్మరించుకుందాం. సురవరం సుధాకర్ రెడ్డి వ్యాసకర్త సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి -
చంద్రబాబు, నితీష్‌పై బీజేపీకి అపనమ్మకమే: సీపీఐ నారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతుండవని హెచ్చరించారు రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం అని కామెంట్స్ చేశారు.కాగా, సీపీఐ నారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీజేపీ స్టీల్‌ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా?. ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే.రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం. ఏపీలో కూటమికి ఇలాంటి విజయం వస్తుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడింది. మోదీ మెజారిటీ కూడా తగ్గింది. ప్రధానిగా మోదీ ఉండి.. మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఇది సంతోషకరం. అపనమ్మకంతోనే నితీష్, చంద్రబాబులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంది. వీళ్లపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం వేరు.. రాష్ట్రంలో వేరు కాదు. మా దృష్టిలో రెండు ప్రభుత్వాలు ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తాను అంటే మేము వద్దంటామా?. కోడలు మగ బిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. -
కామ్రేడ్స్ షేక్..హ్యాండ్
లోక్‌సభ ఎన్నికల్లో పరస్పర పొత్తు విషయమై తెలంగాణలో ‘ఇండియా’ కూటమి పార్టీల మధ్య ఇంకా చర్చలే ప్రారంభం కాలేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య ఐక్యతారాగం వినిపించడంలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీల మధ్య పొత్తులు, చర్చలు జరుగుతుండగా, తెలంగాణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని కామ్రేడ్లు వాపోతున్నారు. కాంగ్రెస్‌తో విసిగి వేసారిన సీపీఎం భువనగిరి లోక్‌సభ స్థానంలో తన అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఈ నెల 19న తమ పార్టీ అభ్యర్థి జహంగీర్ నామినేషన్ కూడా వేస్తారని ఆ పార్టీ తెలిపింది. కాగా, ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని కూడా ప్రకటించింది. పొత్తులు కుదరకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా సీపీఎం ప్రచారం చేయనుంది. అక్కడ సీపీఎంకు గణనీయమైన ఓట్లు ఉన్నందున అది కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు సీపీఐ కూడా తనకు ఒక సీటు కావాలని కోరుతోంది. బేషరతు పొత్తుకు కాంగ్రెస్ ప్రతిపాదన? పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాల్లో సీపీఐ, సీపీఎంలకు చెరో సీటు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదన్న భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల కోసం భారీగానే పోటీ ఉన్నందున కేటాయించడం కుదరదని అంటున్నారు. ఈ నేప థ్యంలో ఒకవేళ వామపక్షాలతో పొత్తులపై చర్చ జరిగితే, భేష రతు మద్దతు కోరాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే ఒక్క సీటు కూడా కేటాయించకుండా అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు వామపక్షాలు మద్దతు ఇవ్వాలన్నమా ట. అలా మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవులు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు ఇచ్చేలా ప్రతిపా దనను కాంగ్రెస్ తెరపైకి తీసుకురానుంది. అయితే జాతీయ పార్టీ హోదాను కాపాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఓట్ల శా తం, సీట్లు వంటివి తెచ్చుకోవడం వామపక్షాలకు అవసరం. ఆ పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణలో ఒక్క సీట్లోనైనా గట్టిగా పోటీ చేయాల్సిందేనని సూచించినట్లు నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కామ్రేడ్లను కాంగ్రెస్ దూరం పెడుతోందా..? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సీపీఐ ఒక సీటులో పోటీ చేసి, మిగిలిన సీట్లలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. అయితే అప్పుడు సీపీఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదరని సంగతి తెలిసిందే. దీంతో సీపీఎం ఒంటరిగా 19 స్థానాల్లో బరిలో నిలిచి.. బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నచోట్ల కాంగ్రెస్‌కు, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది. అయితే 19 స్థానాల్లోనూ సీపీఎం తన పరువు పోగొట్టుకుంది. ఒక్క సీట్లో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. పార్టీ నిర్ణయాన్ని అప్పట్లో కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఆమోదించలేదన్న వాదన బలంగా వినిపించింది. తదనంతర పరిణామాల్లో బీజేపీని ఓడించే సత్తా హస్తం పార్టీకే ఉండటం... ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా ఉండటంతో కలిసి పని చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ మాత్రం వామపక్షాలను పెద్దగా పట్టించుకోవడంలేదన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలకు పెద్దగా ఓట్లు పడలేదన్న భావన ఉండటమే కారణమని అంటున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్ వంటి చోట్ల వామపక్షాలకు వేలల్లోనే ఓట్లు ఉంటాయనీ, వాటిని పోగొట్టుకోవడం ఎందుకన్న భావన కాంగ్రెస్‌లోని కొందరు నేతల్లో ఉంది. దీంతో నామినేషన్ల నాటికి పొత్తులపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. -బొల్లోజు రవి -
ఎన్నికల బరిలో జెఎన్యూ విద్యార్థి సంఘం మాజీ నేత!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బరిలో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను వివిధ పార్టీలు విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్‌లో భాగమైన సీపీఐ (ఎంఎల్) బీహార్‌లోని ఆరా, నలంద, కరకత్ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. వీటిలో నలంద టిక్కెట్‌ను 2013లో జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన సందీప్ సౌరవ్ (36)కు కేటాయించింది. సందీప్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించేందుకు 2017లో తాను చేస్తున్న హిందీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలివేశారు. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పాలిగంజ్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాట్నా సమీపంలోని మానేర్‌లో నివాసం ఉంటున్న సౌరవ్ 2009లో జేఎన్‌యూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, 2014లో పీహెచ్డీ పూర్తి చేశారు. సౌరవ్ 2013 వరకు రెండుసార్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. నలంద నుంచి ఎన్నికల బరిలోకి దిగిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బీహార్ సీఎం నితీశ్ కుమార్ అవినీతి రాజకీయాలపై పోరాటం చేస్తానన్నారు. ఎన్డీఏ హయాంలో ప్రజాస్వామ్య విలువలపై దాడులు జరుగుతున్నాయని సందీప్ ఆందోళన వ్యక్తం చేశారు. -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
ఈ కూడలిలో ఎవరి ప్రభావం ఎంత?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టున్న సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచిచూస్తున్నాయి. బీఆర్ఎస్తో వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. ఉభయ పార్టీల ప్రతిపాదనపై ఇప్పటివరకు కాంగ్రెస్ స్పందించకపోవడంతో కామ్రేడ్స్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం ఇప్పటికే నిరీక్షణను పక్కనపెట్టి భువనగిరి అభ్యర్థిని ప్రకటించడమే కాక మిగతా స్థానాల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. సీపీఐ మాత్రం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నందున రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానమైనా తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలవకపోవడంతో ఈనెలాఖరు నాటికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేశాయి. సీపీఎం నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో.. సీపీఐ మహబూబాబాద్, భువనగిరిలో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఉమ్మడి జిల్లాలో ఒంటరిగా, సీపీఐ కాంగ్రెస్‌తో జత కట్టాయి. ఆ ఎన్నికల్లో నమోదైన ఓట్ల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థిని ప్రకటించగా.. నేడో, రేపో ఖమ్మం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశముంది. దీంతో సీపీఎం భువనగిరి ఒక్క స్థానానికే పరిమితవుతుందా, ఖమ్మంలోనూ పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. పోటీలో ఆ పార్టీ అభ్యర్థిని పెట్టకపోతే కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు కలిసొస్తాయన్న చర్చ జరుగుతోంది. ఇక సీపీఐ నేతలు జాతీయ నాయకత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా పోటీ చేయకపోతే కేడర్ బలహీనమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..? -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు..
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులుగా ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించి కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు, ఒక సీపీఐ ఎమ్మెల్యేకు హైకోర్టు శుక్రవారం వేర్వేరుగా నోటీసులు జారీ చేసింది. వారంతా వచ్చే నెలలోగా స్పందించి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను వచ్చేనెల (ఏప్రిల్ 16, 18, 19 తేదీలకు) వాయిదా వేసింది. అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ (బీఆర్ఎస్), జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్ (బీఆర్ఎస్), ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మి (బీఆర్ఎస్), మహబూబ్‌నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్), దేవరకద్ర నుంచి జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు(సీపీఐ) విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఓడిన ప్రత్యర్థులు కొందరు వీరి ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వారు ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చారని, సరైన సమాచారం ఇవ్వలేదని వాటిలో పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేల ఎన్నికను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ సూరేపల్లి నందా తదితరులతో కూడిన వేర్వేరు ధర్మాసనాలు శుక్రవారం విచారణ చేపట్టారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేశాయి. ఎవరెవరిపై పిటిషన్లు..? మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిటిషన్ వేశారు; జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్, నవీన్‌యాదవ్..; కొత్తగూడెం నుంచి సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు ఎన్నికను సవాల్ చేస్తూ కొత్తగూడెం పట్టణానికి చెందిన నందూలాల్ అగర్వాల్..; ఆసిఫాబాద్ నుంచి బీఆర్ఎస్ నేత కోవ లక్ష్మి ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్..; ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎన్నికను సవాల్ చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి..; దేవరకద్ర నుంచి కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన జి.మధుసూదన్‌రెడ్డి ఎన్నిక రద్దు కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. -
సీపీఐ నారాయణకు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రమాదానికి గురయ్యారు. ఈ నెల 16వ తేదీన ఓ వివాహ వేడుకకు హాజరైన ఆయన వేదిక ఎక్కబోతుండగా.. జారిపడ్డారు. ఆ తర్వాత అదేం పట్టించుకోకుండా మాములుగానే తన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత నొప్పి ఎక్కువ కావడంతో ఆయన వైద్యుల్ని సంప్రదించడంతో ఆయన గాయపడినట్లు తేలింది. నారాయణకు రిబ్ ఎముక విరిగిందని.. రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. -
మళ్లీ కారు..కొడవలి!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పనిచేసే దిశగా వామ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమ్యూని స్టు పార్టీలు.. అందుకు కలిసి వచ్చే అవకాశం ఉన్న, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ భే టీ అయిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ రెండు పార్టీలూ నిర్ణయించాయి. త్వరలోనే పొత్తుకు సంబంధించిన విధివిధానాలు, సీట్ల పంపకాలపై చర్చలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్, సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ పట్టును నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి సవాల్ విసరాలనే ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నేతల నుంచి కమ్యూనిస్టు పార్టీలకు కూడా పిలుపు వచ్ఛి నట్లు తెలిసింది. తాము వచ్చి చర్చలు జరుపుతామని, అందుకు సుముఖమేనా అని బీఆర్ఎస్ వర్గాలు అడిగినట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. ఇప్పటికే అనధికారికంగా లెఫ్ట్, బీఆర్ఎస్ మధ్య మంతనాలు జరుగుతున్నట్లు కమ్యూనిస్టు వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనుకున్నా.. వాస్తవానికి బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’కూటమిలో భాగమైన కాంగ్రెస్‌తో, రాష్ట్రంలోనూ కలిసి వెళ్లాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. చెరో సీటు ఇస్తే చాలన్నట్టుగా సంకేతాలు పంపాయి. కానీ దేశవ్యాప్తంగా పొత్తులు కుదుర్చుకుంటూ, రాష్ట్రంలో సైతం ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ప్రారంభించిన హస్తం పార్టీ నుంచి ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చొరవా, కదలిక లేకపోవడం వామపక్షాలను ఆగ్రహానికి గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్తో పొత్తు ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని సీపీఐ, సీపీఎం భావించాయి. అయితే ‘ఇండియా’కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నందున వామపక్షాలతో జట్టు కట్టకూడదని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. అయితే సీట్ల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా సీపీఎం ఒంటరిగానే 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జతకట్టింది. ఒకే ఒక్క స్థానం కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకోగా, ఇండియా కూటమి దృష్ట్యా సీపీఎం కూడా సుముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని, చెరో స్థానం ఇస్తే చాలని కూడా రెండు పార్టీలు ఎప్పుడో ప్రకటించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఈ విషయం పట్టించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరివరకు పొత్తుపై తేల్చకుండా నాన్చారని, దానివల్ల తాము నష్టపోయామని సీపీఎం వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే రావడంతో సీపీఎంతో పాటు సీపీఐ కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చాక తమ అవసరం లేదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కమ్యూనిస్టు వర్గాలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. విజయన్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయన్ హైదరాబాద్ వచ్ఛి న సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడాన్ని, కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కేసీఆర్ ఆహ్వానం మేరకు పాల్గొనడాన్ని రేవంత్ తప్పుపట్టారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపరుడని, ఆయనను కలిసిన విజయన్ కూడా అవినీతిపరుడని, అందుకే కేసీఆర్‌ను కలిశారంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ వ్యాఖ్యలు బాధ్యతారహితమని పేర్కొంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏకంగా ఒక ప్రకటనే విడుదల చేశారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయమన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా? కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడే క్రమంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు సభలో పాల్గొని విజయన్ ఏమి మాట్లాడారో సీఎం మరచిపోవడం ఆశ్చర్యకరం. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సీపీఎం పాత్ర ఏమిటో కూడా మరచిపోయి, బాధ్యత మరచి, తప్పుడు ఆరోపణలు చేశారు..’అంటూ ఘాటుగా ధ్వజమెత్తారు. కాగా అప్పట్నుంచే వామపక్షాలు కాంగ్రెస్‌పై వామపక్షాలు ఒకింత అసహనంతో ఉన్నాయి. ప్రధాని మోదీని ప్రశంసించిన సీఎం ఇది చాలదన్నట్టు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్ఛినప్పుడు సీఎం రేవంత్ ఆయనతో కలిసి సభలో పాల్గొనడం, అంతేకాకుండా ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడటం, పెద్దన్న మోదీ అంటూ సంబోధించడాన్ని కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాజకీయ విభేదాలు మరిచి పొగడడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. తమతో పాటు బీజేపీతో ప్రధానంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని మరిచి రేవంత్‌రెడ్డి వ్యవహరించారని కమ్యూనిస్టులు అంటున్నారు. రేవంత్‌రెడ్డి సైతం బీజేపీపై గట్టిగా పోరాడాల్సింది పోయి మెతక వైఖరితో ఉన్నారని భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్తో కలిసి వెళ్లే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఈ మూడు పార్టీల శ్రేణులు కలిసి పనిచేసిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. -
వయ్‌నాడ్‌లో మహిళా అభ్యర్థిని పోటీకి దింపిన సీపీఐ
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయాన్ని పలు రాష్ట్రాల్లో కొలిక్కి తీసుకుస్తోంది. ఇక.. బీజేపీ సైతం వారం రోజుల్లో మొదటి జాబితాలోనే సుమారు వంది మంది అభ్యర్థులను ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ).. కేరళలో తమ పార్టీ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఐ ప్రకంటిచిన జాబితాలో వయ్‌నాడ్ సెగ్మెంట్లో పోటీ చేయనున్న అభ్యర్థి కూడా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత నేత, ఎంపీ రాహుల్‌గాంధీ వయ్‌నాడ్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వయ్‌నాడ్ స్థానంలో సీపీఐ.. ఓ మహిళా అభ్యర్థిని బరిలో దించింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా సతీమణి, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సీనియర్ నాయకురాలు అన్నే రాజా.. రాహుల్‌గాంధీపై పోటీపడబోతున్నారు. తిరువనంతపురం, మావెలిక్కర, త్రిస్సూర్ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది సీపీఐ. తిరువనంతపురం నుంచి పన్నియన్ రవీంద్రన్, మావెలిక్కర నుంచి అరుణ్ కుమార్, త్రిస్సూర్ నుంచి వీఎస్ సునీల్ కుమార్ సీపీఐ అభ్యర్థులుగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. దీంతో రాహుల్ గాంధీ వయ్‌నాడ్ లోససభ నియోజకర్గం నుంచి పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షాల ‘ఇండియా కూటమి’లో సీపీఐ పార్టీ భాగస్వామ్యం పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. -
‘చేయి’స్తారా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని సీపీఐ, సీపీఎం అనుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. 17 లోక్‌సభ సెగ్మెంట్లలో చెరో సీటులో పోటీ చేస్తామని స్పష్టం చేశాయి. అయితే పొత్తులపై సీపీఐ, సీపీఎం ప్రకటన చేసినా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో కామ్రేడ్లు కాస్తంత గుర్రుగా ఉన్నారు. బీజేపీని నిలువరించాలంటే తమ మద్దతు అవసరమని, కాబట్టి కాంగ్రెస్ త్వరగా తేల్చాలని లెఫ్ట్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులపై దృష్టి సారించిందని, రాష్ట్రంలో కూడా త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ముందస్తుగా ప్రచారంలోకి దూసుకెళ్లొచ్చని అంటున్నాయి. సీపీఎం వైఖరిలో మార్పు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ముందస్తుగా బీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించాయి. ఆ పార్టీతో పొత్తు చిత్తవడంతో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని అనుకున్నాయి. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు సీపీఐ ఒక్క సీటుకు ఒప్పుకొని కొత్తగూడెంలో విజయం సాధించింది. సీపీఎం మాత్రం కాంగ్రెస్‌తో రాజీప డక ఒంటరిపోరుకు సిద్ధమై 19 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లోనూ కొన్ని జిల్లాలకు చెందిన నాయకులు ఈ విషయాన్ని బాహాటంగానే విమర్శించినట్టు సమాచారం. కాంగ్రెస్‌తో వెళ్లి ఉంటే కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేదని చర్చ జరిగినట్టు తెలిసింది. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల, బీఆర్ఎస్కు మరికొన్నిచోట్ల మద్దతు ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదన్న వాదనలు కూడా ఆ పార్టీలో తలెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కే తమ మద్దతు అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేస్తే, రాష్ట్ర పార్టీ నాయకత్వం మాత్రం బయటకు ఏదీ నేరుగా చెప్పకుండా అంతర్గతంగా బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చా యి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీపీఎం వైఖరిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్‌తోనే ముందుకు నడవాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఓట్లతో బయటపడ్డ వాస్తవాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు అసెంబ్లీ స్థానంలో పరువు దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి పాలేరులో 5,308 ఓట్లు, మిర్యాలగూడలో 3,23 4 ఓట్లు, వైరాలో 4,439 ఓట్లు వచ్చాయి. అంతేకాదు మొదట్లో అడిగిన ఐదింటిలోని భద్రాచ లంలో 5,860 ఓట్లు, మధిరలో 6,575 ఓట్లు, ఇబ్రహీంపట్నంలో 3,948 ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం 19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం అన్నిచోట్లా కలిపి కేవలం 52,349 ఓట్లే సాధించింది. కనీసం ఎక్కడా డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించినట్టుగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంతోపాటు, రెండు ఎమ్మెల్సీలు తీసుకొని ఉంటే ఎలాగోలా గౌరవం దక్కేదన్న చర్చ కూడా సీపీఎంలో జరుగుతోంది. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో సరాసరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి తమ ఓట్లు గణనీయంగా ఉంటాయని లెఫ్ట్ నేతలు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని, కాబట్టి ఆ పార్టీకి ఎలాగైనా ఎంపీ సీట్లలో గండిపెట్టాలని వామపక్షాలు భావిస్తున్నాయి. చెరో ఎంపీ సీటు ఇస్తే సరేసరి... లేకుంటే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనూ ఆ పార్టీలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. మద్దతు ఇచ్చినందుకు చెరో ఎమ్మెల్సీ స్థానం కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
బ్రేక్ అప్ చెప్పిన చంద్రబాబు..RK హార్ట్ బ్రేక్
-
సీపీఐ (ఎంఎల్)ఎమ్మెల్యేపై అనర్హత వేటు
పట్నా: సీపీఐ(ఎంఎల్)లిబరేషన్ పారీ్టకి చెందిన ఎమ్మెల్యే మనోజ్ మంజిల్‌ను బిహార్ అసెంబ్లీ అనర్హుడిగా ప్రకటించింది. ఓ హత్య కేసులో న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించినందున, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విధాన సభ సెక్రటేరియట్ తెలిపింది. కోర్టు శిక్ష ప్రకటించిన ఫిబ్రవరి 13వ తేదీ నుంచి అనర్హత అమల్లోకి వస్తుందని శుక్రవారం జారీ చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. భోజ్‌పూర్ జిల్లా తరారీ స్థానం నుంచి మంజిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి హత్య కేసు విచారించిన ఎంపీ/ఎమ్మెల్యే కేసుల ప్రత్యేక కోర్టు మంజిల్‌ను దోషిగా నిర్థారించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో బిహార్ అసెంబ్లీలో వామపక్షాల బలం 11కు తగ్గినట్లయింది. -
రాహుల్ వయనాడ్ సీటును వదులుతారా? సీపీఐకి ఏం కావాలి?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ యాత్ర చేపడుతున్నారు. ఇదిలావుంటే మమతా బెనర్జీ, నితీష్ కుమార్ల తర్వాత వామపక్షాలు కూడా కాంగ్రెస్‌కు పట్టం కట్టాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌కు సవాళ్లు పెరుగుతున్నాయి. కేరళలోని రాహుల్ గాంధీ స్థానమైన వయనాడ్‌పై సీపీఐ తన వాదనలు వినిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఈ సీటును వదులుకునే పరిస్థితి లేదని చెబుతున్నప్పటికీ, సంకీర్ణ రాజకీయాల కారణంగా రాహుల్ ఈ సీటును వదిలిపెట్టే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. సీపీఐ చూపు ఇప్పుడు రాహుల్‌కు చెందిన వయనాడ్ సీటుపై పడింది. వయనాడ్ ఎప్పటి నుంచో లెఫ్ట్ సీటు అని, కాబట్టి రాహుల్ నిజంగా బీజేపీని సవాలు చేయాలనుకుంటే ఉత్తర భారతదేశంలోని ఏదైనా స్థానం నుండి పోటీ చేయాలని సీపీఐ చెబుతోంది. కాగా సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం మాట్లాడుతూ రాహుల్ స్థాయి వ్యక్తులు వాయనాడ్‌ను ఎన్నుకునేందుకు బదులుగా ఉత్తరాదితో పోరాడాలి. ఉత్తరాదిలో బీజేపీతో ప్రధాన పోరు ఉంది. అక్కడ ఎక్కువ సీట్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కాంగ్రెస్‌లో కాన్ఫిడెన్స్ లేదని అనిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే రాహుల్‌కి వయనాడ్ సీటు సేఫ్ అనే వాదన వినిపిస్తుంటుంది. 2019లో రాహుల్ వయనాడ్‌లో సీపీఎం అభ్యర్థిని నాలుగు లక్షలకు పైగా ఓట్లతో ఓడించారు. అయితే అమేథీలో ఓడిపోయారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా రాహుల్‌కు మద్దతు నివ్వాలని కాంగ్రెస్ వామపక్షాలను అభ్యర్థిస్తోంది. సీపీఐ, సీపీఎం తదితర వామపక్షాలు రాహుల్‌కు మద్దతివ్వాలని తాము కోరుతున్నామని కాంగ్రెస్ ఎంపీ కె.సురేష్ అన్నారు. కేరళ ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయాలని కేరళ ప్రజలు, కార్యకర్తలు కోరుకుంటున్నారని కూడా సురేష్ పేర్కొన్నారు. అయితే వయనాడ్ సీటు విషయంలో రెండు పార్టీలు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇండియా కూటమికి చెందిన ఈ రెండు పక్షాలు వయనాడ్ సీటు విషయంలో తమ వాదనలపై గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. -
మన లక్ష్యం బీజేపీ విముక్త్ భారత్
సాక్షి, హైదరాబాద్: ‘పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని వ్యవస్థలు విచ్చిన్నమయ్యాయి..మరోసారి కేంద్రంలో మోదీకి అధికారం ఇస్తే దేశం విధ్వంసమవుతుంది. బీజేపీ విముక్త్ భారత్ మన లక్ష్యం. ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలి’అని సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించడానికే ఇండియా కూటమిలో చేరి ఉద్యమిస్తున్నట్టు ఆయన వివరించారు. మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో భాగంగా శుక్రవారం తొలిరోజు సమావేశంలో డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యదేశంలో అధ్యక్షతరహా పాలన సాగించేందుకు మోదీ ఒకే దేశం.ఒకే ఎన్నిక అనే నినాదం తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేలా ప్రజలను చైతన్యపరచాలని చెప్పారు. మరోసారి మోదీకి అధికారం కట్టబెడితే దేశ భవిష్యత్ ఆందోళనకరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. దేశాన్ని రక్షించేందుకు ‘దేశ్ బచావో.. బీజేపీ హఠావో’అని ఇండియా కూటమి నినాదం ఇచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లో రాజ్యాంగానికి అనుగుణంగా లౌకిక, ప్రజాస్వామ్య విలువలతో పనిచేసే పారీ్టలు గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ప్రజస్వామిక దేశంగా ఉంటుందా..లౌకిక గ్రణతంత్రంగా కొనసాగుతుందా? లేదా ఫాసిస్టు, నియంతృత్వ దేశంగా ఉండబోతుందా? అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నామన్నారు. బీజేపీని ఎలా గద్దె దించాలో లౌకిక, ప్రజాతంత్ర పారీ్టలు, శక్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి, ఏకస్వామ్య ఫాసిస్టు, నియంతృత్వ వ్యవస్థ తీసుకొస్తోందన్నారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోదీ సర్కారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపె ట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పేదల కోసం ఎలాంటి ప్రకటనలు చేయలేదని, కార్పొరేట్ సంస్థలకు విధించే పన్నులను 32 శాతం నుంచి 27 శాతానికి తగ్గించారని డి.రాజా అన్నారు. తద్వారా మోదీ ప్రభుత్వం ఎవరి పక్షపాతి అనేది స్పష్టమైందని.. సబ్‌కాసాత్ సబ్కా వికాస్ అన్నా, వాస్తవ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మోదీ పాలనలో యువత భవిష్యత్ అంధకారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడ్డారని మోదీ చెబుతున్నారని, అంతర్జాతీయ ఆక లి సూచీలో 125 దేశాల మధ్య భారతదేశం 111వ స్థానంలో ఉండడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ, గాందీల రాముడు వేర్వేరు బీజేపీ రాముడి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తోందని, మోదీ చెప్పే రాముడు, గాంధీ చెప్పే రాముడికి తేడా ఉందన్నారు. మోదీ హయాంలో మతతత్వ రాజ్యంగా మారుస్తున్నారని, రాజ్యాంగాన్ని, అందులోని మౌలిక సిద్ధాంతాలు, ప్రజాస్వామ్యం, లౌకికవ్యవస్థను కాలరాస్తోందని విమర్శించారు. గత పార్లమెంట్ సమావేశాలలో ఎంతమంది ఎంపీలను సస్పెండ్ చేశారో అందరికీ తెలుసున్నారు. ప్రజాస్వామ్యం ఉన్నతమైనదని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పార్లమెంటు కళ్లలాంటివని, అలాంటి ప్రతిపక్ష సభ్యులను గత పార్లమెంట్ సమావేశంలో సస్పెండ్ చేశారని విమర్శించారు. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంటుందని, పార్లమెంట్ పని చేయకపోతే ప్రజాస్వామ్యం మరణిస్తుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పాడన్నారు. సమావేశాలకు రామకృష్ణ పాండా, కూనంనేని సాంబశివరావు, నిషా సిద్ధూలు అధ్యక్ష వర్గంగా వ్యవహరిస్తున్నారు. -
తెలంగాణలో కక్కలేక మింగలేక కాంగ్రెస్ తో కమ్యూనిస్టుల పొత్తు
-
ఒక ఎంపీ సీటివ్వండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు ఒక స్థానం కేటాయించాలని సీపీఐ బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎంతో సీపీఐ ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. సచివాలయంలో సుమారు గంట పాటు జరిగిన భేటీలో వర్తమాన అంశాలపై చర్చ జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, పశ్యపద్మ తదితరులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ అవగాహన సత్ఫలితాలను ఇచ్చిందని ఈ సందర్భంగా సీపీఐ నేతలు పేర్కొన్నారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, సీపీఐలు తెలంగాణలో అవగాహనతో పోటీ చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలన్నారు. కాగా, ఖమ్మం లేదా నల్లగొండ స్థానాల్లో ఏదో ఒకటి ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు సమాచారం. అయితే అధిష్టానం నిర్ణయం మేరకు తమ నిర్ణయం ఉంటుందని సీఎం అన్నట్లు తెలిసింది. కాగా, గత ఎన్నికల సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం రెండు ఎమ్మెల్సీ స్థానాలు తమకు కేటాయించాలని కూడా సీపీఐ నేతలు సీఎంకు గుర్తుచేశారని సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నట్లు తెలిసింది. న్యాయవిచారణ పరిధిలో సింగరేణిని చేర్చాలి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడంతో పాటు, పటిష్టపరచాలని సీఎంకు సీపీఐ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. సింగరేణి కాలరీస్‌లో జరిగిన అవినీతి, అక్రమాలను న్యాయవిచారణ పరిధిలోకి తీసుకురావాలని కూనంనేని సాంబశివరావు కోరారు. అలాగే సమ్మె నోటీసు ఇచ్చిన జెన్ కో కార్మికులు, ఇతర ఉద్యోగులపై గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని, సుమారు 400 మంది ఫోర్ మెన్ ఆర్టిజన్లను వివిధ కారణాలతో పనిచేసిన చోటు నుంచి బైటకు పంపడమో, తొలగించడమో జరిగిందని, ఎస్ఈలను డీఈలు, డీఈ, ఏడీఈలుగా డిమోట్ చేయడం వంటి చర్యలకు పాల్పడిందని, వీటిని సరిచేయాలని సీఎంను కోరారు. సాయంత్రం 4 నుంచి 5 వరకు అందుబాటులో ఉంటా: సీఎం కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందు బాటులో ఉన్నట్లుగా ప్రజలలో భావన నెలకొందని, సీఎం, మంత్రులు కూడా అందుబా టులో ఉంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్న దని సీపీఐ నేతలు తెలిపారు. వివిధ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, పార్టీల నేతల ను కలిసేందుకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని సీఎం చెప్పినట్లు సీపీఐ నేతలు వెల్లడించారు. ఈ సచివాలయం మీ కోసమే కేసీఆర్ కట్టించారు: నారాయణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాల యాన్ని రేవంత్‌రెడ్డి కోసమే కట్టించారని నారా యణ సరదాగా వ్యాఖ్యానించారు. గత ప్రభు త్వం వివిధ సంస్థలు, శాఖల్లో రిటైర్డ్ అధికా రులను నియమించి ఏళ్ళ తరబడి కొనసాగించిందని, కొత్త ప్రభుత్వంలో ఆ సంప్రదాయా నికి స్వస్తి పలకాలని నారాయ ణ సూచించారు. రిటైర్డ్ ఐఏఎస్‌లను ప్రభుత్వంలోకి తీసుకో వద్దని కోరారు. -
కాంగ్రెస్‌తోనే కామ్రేడ్లు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ మాత్రమే పొత్తుతో ముందుకు వెళ్లగా, లోక్‌సభ ఎన్నికల వేళ సీపీఎం కూడా జతచేరనుందా? మొత్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తాయా? పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని నిలువరించడమే ధ్యేయంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు అధికారికంగా పొత్తు కుదుర్చుకోనున్నా యా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో భాగస్వాములైన ఈ మూడు పార్టీలు.. తెలంగాణలోనూ కలసి పనిచేస్తామని అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుందని తెలుస్తోంది. ఇందుకు శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌తో రాష్ట్ర సీపీఎం నేతల భేటీ వేదికయిందనే చర్చ జరుగుతోంది. కలసి పనిచేద్దాం.. సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు కల సిన సందర్భంగా యాధృచ్ఛికంగా ఈ చర్చ వచ్చిన ట్టు తెలుస్తోంది. తమతో కలసి పనిచేయనప్పటికీ.. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ సీపీఎం నేతలతో అన్నారని విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పనిచేయనంత మాత్రాన వేర్వేరు కాబోమని, లోక్‌సభ ఎన్నికల సమయంలో పొంచి ఉన్న బీజేపీ ప్రమాదాన్ని ఎదు ర్కొనేందుకు ఐక్యంగా పనిచేద్దామని ముఖ్యమంత్రి వ్యూహాత్మక ప్రతిపాదన చేశారు. ఇందుకు స్పందించిన సీపీఎం నేతలు బీజేపీని ఎదుర్కొనే విషయంలో తమకు వేరే ఆలోచన ఉండబోదని, అయితే కాంగ్రెస్‌తో కలసి పనిచేసే అంశాన్ని పార్టీలో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినట్టు సమా చారం. అలాగే చేద్దామని, త్వరలోనే మళ్లీ కలసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని సీఎం రేవంత్ చెప్పడంతో మరోమారు సమావేశమవు దామని వారు ఈ చర్చను ముగించినట్టు తెలిసింది. సీపీఎం నాయకులు తనను కలసిన సందర్భంగా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారని తెలుస్తోంది. సీపీఎంతో తెలంగాణలో జట్టుకట్టే విషయంలో కాంగ్రెస్ సిద్ధంగా ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చారని, ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఉభయ వామపక్షాల సహకారంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ జయభేరి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ(All India Trade Union Congress) సత్తా చాటింది. మొత్తంగా 1436 ఓట్ల తేడాతో గుర్తింపు సంఘంగా ఎన్నిక కాబడింది. సింగరేణి విస్తరించిన ఉన్న 11 ప్రాంతాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులకుగానూ.. 37,447 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. అత్యధిక ఓట్లతో ఏఐటీయూసీతో గుర్తుకు కార్మికులు పట్టం కట్టారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో 5 స్థానాలలో ఐఎన్టీయూసీ, 6 స్థానాలలో ఏఐటీయూసీ విజయం సాధించాయి. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం–1, రామగుండం–2, రామగుండం–3 ప్రాంతాల్లో ఏఐటీయూసీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అత్యధిక ఓట్లతో ఆయా ప్రాంతాల్లో ప్రాతినిధ్యం దక్కించుకుంటూనే కార్మికుల ఓట్లను రాబట్టింది. ఒక్క శ్రీరాంపూర్‌లోనే 2,166 ఓట్ల ఆధిక్యం చేజిక్కించుకోవడం పోలింగ్‌లోనే టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఇల్లెందు, మణుగూరు, కార్పొరేట్లో ఏఐటీయూసీపై స్వల్ప ఆధిక్యంతో ప్రాతినిధ్యం నిలుపుకోగలిగింది. 2012, 2017లో సత్తా చాటిన బీఆర్ఎస్ అనుబంధ టీజీబీకేఎస్.. ఈసారి ఎన్నికల్లో ఖాతానే తెరవలేదు. AITUC సాధించినవి బెల్లంపల్లి - 122 మందమర్రి - 467 శ్రీరాంపూర్ - 2166 రామగుండం-1 -451 రామగుండం-2 - 358 మొత్తం ఓట్లు = 3564 మెజారిటీ INTUC కార్పొరేషన్ - 342 కొత్తగూడెం - 233 మణుగూరు - 2 ఇల్లందు - 46 భూపాలపల్లి - 801 రామగుండం-3 - 704 మొత్తం = 2128 మెజారిటీ. మొత్తంగా ఏఐటీయూసీ మెజారిటీ =3564 ఐఎన్టీయూసీ మెజారిటీ =2129 రాష్ట్ర స్థాయి లో 1436 ఓట్ల తో AITUC గుర్తింపు సంఘం గా ఎన్నిక కాబడింది. పోలింగ్ సరళి ఇలా...! సింగరేణి వ్యాప్తంగా 11ఏరియాల్లో ఏర్పాటు చేసిన 84 పోలింగ్ కేంద్రాల్లో 39,773మందికి 37,447 (94.15శాతం) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం నుంచే కార్మికులు బారులుదీరారు. దీంతో గంటగంటకూ పోలింగ్ శాతం పెరిగింది. అన్ని ఏరియాల్లో కలిపి ఉదయం 8గంటల వరకు 14.62 శాతం పోలింగ్ నమోదుకాగా, 9గంటలకు 27.05 శాతం , 10గంటలకు 38.67శాతం , 11గంటలకు 49.89శాతం , 12గంటలకు 59.33శాతం , మధ్యాహ్నం 1గంటకు 67.67శాతం 2గంటలకు 75.41శాతం , 3గంటల వరకు 85.92శాతం , 4గంటలకు 93.09 శాతం , పోలింగ్ ముగిసే సాయంత్రం 5గంటల వరకు మొత్తంగా 94.15 పోలింగ్ శాతంగా నమోదైంది. కౌంటింగ్ రాత్రి 7 గంటల నుంచి మొదలైంది. అయితే స్పష్టమైన ఫలితాల కోసం అర్ధరాత్రి దాటే దాకా ఎదురు చూడాల్సి వచ్చింది. ఎవరు ‘ప్రాతినిధ్యం’... ఎవరు గుర్తింపు సంఘం సింగరేణివ్యాప్తంగా ఉన్న 11ఏరియాలు ఉండగా, ఆయా ఏరియాల్లో అత్యధికంగా ఓట్లు సాధించిన యూనియన్ను ప్రాతినిధ్య సంఘంగా గుర్తిస్తారు. పదకొండు ఏరియాల్లోనూ అత్యధికంగా ఓట్లు లభించిన యూనియన్ను గుర్తింపు సంఘంగా ప్రకటిస్తారు. సింగరేణిలో ఏడోసారి నిర్వహించిన ఎన్నికల్లో 11 ఏరియాల్లో 4 చోట్ల ఐఎన్టీయూసీ 5 చోట్ల గెలిచి ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా విజయం సాధించాయి. మొత్తంగా సింగరేణివ్యాప్తంగా అత్యధిక ఓట్లు సాధించి ఏఐటీయూసీ సంఘం గుర్తింపు సంఘంగా విజయకేతనం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇలా.. 1998–ఏఐటీయూసీ 2001–ఏఐటీయూసీ 2003–ఐఎన్టీయూసీ 2007–ఏఐటీయూసీ 2012–టీజీబీకేఎస్ 2017–టీజీబీకేఎస్ 2023–ఏఐటీయూసీ -
అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ
అసెంబ్లీలోకి సీపీఐ ఎమ్మెల్యే అడుగిడగా, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంకు మాత్రం పరాభావమే మిగిలింది. సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఎంతో ప్రతిష్ట కలిగిన సీపీఎంకు గత అసెంబ్లీలోనూ, ప్రస్తుత అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం దక్కలేదు. పొత్తుల్లో సీపీఐ సక్సెస్ బీఆర్ఎస్తో పొత్తు విఫలం కావడంతో సీపీఐ కాంగ్రెస్‌కు దగ్గరమైంది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు కాగా, సీపీఎంతో పొత్తు కుదరలేదు. చివరకు సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగగా, సీపీఐ కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. ఆ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి వామపక్షాలు కలిసి పనిచేయాలని ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నాయి. కానీ పొత్తుల విషయంలో పొసగక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఎన్నికల దృష్టితో చూస్తే సీపీఐ వ్యూహం ఫలించదని అంటున్నారు. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓట్లను నిలబెట్టుకోలేకపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. సీపీఎంకు ఘోర పరాభవం... తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. భద్రాచలం మినహా ఇతరచోట్ల గెలుపోటటములను నిర్దేశించలేకపోయింది. సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లో 15 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా, మిగిలిన నాలుగు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అంతేకాదు అన్ని స్థానాల్లోనూ సీపీఎం డిపాజిట్లు పొందకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు నియోజకవర్గంలోనూ సత్తా చాటలేకపోయారు. ఆయనకు కేవలం 5,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి 5,860 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ 5,719 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలుపునకు సీపీఎం అడ్డుపడినట్టుగా హస్తం వర్గాలు అంటున్నాయి. 19 చోట్ల పోటీ చేస్తే సీపీఎంకు వచి్చన మొత్తం ఓట్లు కేవలం 52,349 మాత్రమే కావడం గమనార్హం. -
సీపీఐతో పొత్తు వల్లే కాంగ్రెస్ గెలిచింది: నారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తమ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇదే సమయంలో మిగతా రాష్ట్రాల్లో కూడా తమతో పొత్తు పెట్టుకుంటే గెలిచేవారని నారాయణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ పార్టీతో పొత్తు లేకపోవడంతో మిగతా మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోడిందని అన్నారు. కాగా, సీపీఐ నారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో తమ పార్టీకి 90-100 నియోజకవర్గాల్లో దాదాపు 1000 నుంచి 10,000 ఓట్ల వరకు ఉంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తమ ఓట్లు ఎంతో కలిసి వచ్చాయని తెలిపారు. మిగితా రాష్ట్రాలో పొత్తు పెట్టుకోకపోవడం వల్లనే ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్, ఛత్తీస్‌ఢ్‌లో అధికారంలో ఉందని మరి అక్కడ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. అలాగే మధ్యప్రదేశ్‌లో కూడా గతంలో వచ్చిన సీటలును ఆ పార్టీ కోల్పోయిందని అన్నారు. ఈ విషయం ఆ పార్టీ అధిష్టానం గుణపాఠంగా తీసుకోవాలని అన్నారు. ఏఐసీసీ ముఖ్యంగా దీనిని గమనించాలని తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కూడా సీపీఐతో పొత్తు పెట్టుకొని ఉంటే తమ పార్టీ ఓట్లు కూడా పడేవని, ఇవి ఎంతగానో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చేవని కామెంట్స్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. కాంగ్రెస్ గెలిచినా.. ఓడినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. బీజేపీ ఓటమే తమకు ముఖ్యమన్నారు. ఇండియా భాగస్వామ్య కూటమిలోని పార్టీలను కలుపుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమని నారాయణ చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ పోటీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేరళలో నాలుగు, తమిళనాడులో రెండు, పశ్చిమ బెంగాల్లో మూడు, ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఒక్కో లోక్‌సభ స్థానంలో సీపీఐ పోటీ చేయనున్నట్టు నారాయణ వెల్లడించారు. ఎన్నికల అవగాహనలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ఒక్క స్థానంలో సీపీఐకి అఖిలేష్ యాదవ్ మద్దతునిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో మద్దతు కుదిరితే వారితో కలిసి పోటీ చేస్తామన్నారు. -
మంత్రివర్గంలో చేరేందుకు సీపీఐ ఆసక్తి?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సీపీఐ నేతలు మంగళవారం ఎల్లా హాటల్లో భేటీ అయ్యారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు రేవంత్‌ను కలిసి అభినందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, తమను మంత్రివర్గంలోకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. దీనిపై చాడ వెంకటరెడ్డిని ప్రశ్నించగా, తమకు అలాంటి ఆలోచన లేదనీ, అయితే కాంగ్రెస్ ఆహ్వానిస్తే ఆలోచిస్తామని మాత్రమే చెప్పామన్నారు. అంటే సీపీఐకి ఈ ప్రభుత్వంలో నేరుగా భాగస్వామ్యం కావాలన్న ఆలోచన ఉన్నట్లుగా సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఒక్క సీటు గెలిస్తే మంత్రి పదవి వస్తుందా? అయితే, ఒక్క సీటు గెలిచిన సీపీఐకి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి ఉండదనీ, కాంగ్రెస్‌లో ఉన్న వారికే సర్దుబాటు చేయడం కష్టమని అంటున్నారు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు వంటి వారు ఉన్నప్పుడు సీపీఐకి ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రతిపాదిస్తే ఆలోచిస్తాం: నారాయణ మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టూరిజం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై జ్యూడీషియల్ విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం బయటపడుతుందని భావించి విలువైన ద్రస్తాలను తగులబెట్టారని విమర్శించారు. తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకుచిత వైఖరిని ప్రదర్శించిందని విమర్శించారు. దేశంలో బీజేపీ ప్రమాదకరమని, వ్యవస్థలను నాశనం చేస్తోందని విమర్శించిన ఆయన ఇండియా కూటమి బలపడాలని ఆకాంక్షించారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతుకగా, అన్ని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధిగా ఉంటానన్నారు. -
ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది..
‘పాలమూరు’లో కాంగ్రెస్ హవా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 12 గెలుపొంది సత్తా చాటింది. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డికి చుక్కెదురైంది. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జీఎమ్మార్ మధ్య రౌండ్ రౌండ్‌కూ హోరాహోరీ పోరు కొనసాగింది. రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో చివరి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డికి 907 ఓట్ల మెజార్టీ రాగా.. పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకుని మొత్తం 1,392 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలిసారిగా 9 మంది.. ఉమ్మడి పాలమూరులో తొమ్మిది మంది తొలిసారి గా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి అభ్యర్థులు జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజే శ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డితో పాటు బీఆర్ఎస్ అలంపూర్ అభ్యర్థి విజయుడు తొలిసారిగా విజయం సాధించారు. ఇందులో అందరూ యువతే కావడం విశేషం. వనపర్తిలో గలాటా.. వనపర్తిలో చిట్యాల శివారులోని మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి కారు అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో దుమారం చెలరేగింది. పోలీసులు వారిని చెదరగొట్టి మంత్రిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రోడ్డుపైనే సుమారు గంటన్నర సేపు ఆందోళనకు దిగగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మంత్రులకు తప్పని ఓటమి.. మహబూబ్‌నగర్‌లో మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి 25,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒక్కటి మినహా. అన్నింటా హస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీ‹Ùరెడ్డి గెలుపొందారు. మిగతా నియోజకవర్గాలైన నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండలో నేనావత్ బాలునాయక్, నాగార్జునసాగర్ లో కుందూరు జయవీర్‌రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి లో మందుల సామేల్, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి, ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో అనిల్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10స్థానాల్లో బీఆర్ఎస్ గెలు పొందగా, రెండు స్థానాల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి అంతకుమించి 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది. ప్రస్తుత విజయంతో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా తమ పట్టును సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైనే ఈ విజయాన్ని సాధించారు. ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని ఇచ్చి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యాన్ని కనబరచడం విశేషం. గిరిజన ఖిల్లాలో‘కమలం’ బోణీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పు ఇచ్చారు. తొలిసారిగా ఈ ప్రాంతం నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రాంతం నుంచి కమలనాథులు శాసనసభకు ఎన్నికకావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు బీజేపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఇక్కడి ఓటర్లు అనూహ్య తీర్పునిచ్చారు. బీఆర్ఎస్పై అదే దెబ్బ.. గిరిజనుల రిజర్వేషన్లు 6 నుంచి పది శాతం పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆదివాసీ, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూమి హక్కు పత్రాలు) 48వేల మందికి లక్ష ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించారు. కానీ ఇవేమీ బీఆర్ఎస్కు ఫలితం ఇవ్వలేకపోయాయి. ఆదివాసీ లంబాడా మధ్య వైరం, గిరిజనేతరులకు ఏజెన్సీ సమస్యలు బీఆర్ఎస్ను దెబ్బతీశాయి. మూడు ఎస్టీ స్థానాల్లో ఆసిఫాబాద్, బోథ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి అనిల్ జాదవ్ గెలుపొందగా, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలిచారు. నిర్మల్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్‌రావు, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ ఘోర ఓటమి పాలయ్యారు. కేటీఆర్ స్నేహితుడైన భూక్యా జాన్సన్‌నాయక్ ఖానాపూర్‌లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలుపొందారు. మొదటి నుంచి ఈ స్థానంలో త్రికోణ పోటీగా ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు రమేశ్‌రాథోడ్, ఇటు జాన్సన్ నాయక్, వెడ్మ బొజ్జు బరిలో ఉండగా, చివరకు ఆదివాసీ నాయకుడికే పట్టం కట్టారు. ఇక్కడ 1984లో మాజీ మంత్రి కోటా్నక భీంరావు కాంగ్రెస్ నుంచి గెలవగా, మళ్లీ 40ఏళ్ళ తర్వాత ఓ ఆదివాసీకి విజయం వరించింది. ఓరుగల్లులో కాంగ్రెస్ హోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 చోట్ల గెలిచి అనూహ్య ఫలితాలను రికార్డు చేయగా, బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నాయకులు, వరుస విజయాలను నమోదు చేసిన నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. వరంగల్ పశ్చిమనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి, తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. అదేవిధంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై కాంగ్రెస్ నుంచి ములుగు సీతక్క గెలుపొందారు. నర్సంపేటనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, పాలకుర్తిలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి, మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రునాయక్ విజయం సాధించారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు. విలక్షణం.. ఇందూరు తీర్పు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఇందూరు జిల్లా మరోసారి విలక్షణ తీర్పు తో తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖా ముఖి పోరు జరగగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని ఉన్న 9 స్థానాలకు గాను కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీపడిన కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్ రేంజ్లో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్‌రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం భూపతిరెడ్డి 21,963 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్రావు ప్రస్తుతం 24,001 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మదన్మోహన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మినహా నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్మోహన్రావు, జుక్కల్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు సైతం శాసనసభలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కేవలం 3,062 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. 1999, 2004, 2009లో బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్‌రెడ్డి వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో పనిచేశారు. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం షకీల్‌పై విజయం సాధించారు. పోచారం వరుసగా 5వ సారి, ప్రశాంత్‌రెడ్డి వరుసగా 3వ సారి విజయంబాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలుపొందగా, 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018, 2023లలో వరుసగా 5 సార్లు విజయం సాధించడం గమనార్హం. స్పీకర్‌గా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందుతారన్న సెంటిమెంట్‌ను పోచారం బ్రేక్ చేశారు. పోచారం 23,464 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బాల్కొండ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2014, 2018, 2023లో వరుసగా మూడుసార్లు గెలు పొందారు. ప్రశాంత్‌రెడ్డి కేవలం 4,533ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ ప్రస్తు తం 21,963 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. -
మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఆయన తండ్రి, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వర్రావు మద్దతు పలుకుతూ వివిధ రకాలుగా ప్రచారం చేయడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పువ్వాడ నాగేశ్వర్రావుకు శనివారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘మీకు ఇలాంటి ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్నా మీ గత చరిత్ర, మీరు పార్టీకి చేసిన సేవరీత్యా మనసంగీకరించక రాయలేదు. ఇంకా భరించడం నా వల్ల కాదు’అని నారాయణ ఆ లేఖలో పేర్కొన్నారు. ‘మీ కుమారుడు అజయ్‌కుమార్ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించింది మొదలు మీలో మౌలిక మార్పులు వచ్చాయి. మీరు సీపీఐలో ప్రముఖ పాత్ర వహించారు. రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించారు. ఖమ్మం జిల్లాలో సీపీఐని ఉన్నత స్థాయికి తెచ్చారు. మీరు ఏ సభలకు వచ్చినా పార్టీ మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది. చివరకు ఖమ్మం జిల్లా సీపీఐ కార్యాలయం ముందు కూడా మీ ఫ్లెక్సీ నేటికీ ఉంది. ఇంత గౌరవం పొందిన మీరు సీపీఐకి ఇస్తున్న మర్యాద ఏది? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి సందర్భంలోనూ మీ కుమారుడిని సమర్థించారు తప్ప, సీపీఐ తీసుకున్న విధానాలను బహిరంగంగా సమర్థించలేదు. తాజాగా కొత్తగూడెం స్థానాన్ని కాంగ్రెస్ సీపీఐకి కేటాయిస్తే అక్కడ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును పోటీకి పెట్టింది. కనీస మర్యాదకైనా కొత్తగూడెం స్థానం బలపడే విధంగా ఈ ఎన్నికల్లో సీపీఐ విధానాన్ని సమర్థిస్తూ ఒక ప్రకటన చేయకపోగా, ఏ పద్ధతుల్లోనూ మీరు సమర్ధించలేదు. మీ కుమారుడు, బీఆర్ఎస్ అభ్యర్థి అజయ్‌కుమార్‌ను బలపరుస్తూ వివిధ పద్ధతుల్లో ప్రచారం చేశారు’అని నారాయణ విమర్శించారు. ‘మీరు నాటిన చెట్టుని నరుక్కుంటున్నారు. మీకు మీరు నరుక్కుంటే నాకు అభ్యంతరం లేదు. పార్టీ కార్యకర్తలను, పార్టీ ప్రభావాన్ని కించపరచకండి. జిల్లా పార్టీ కార్యాలయం ముందున్న మీ ఫ్లెక్సీని మీరే తీయించేసుకోండి’అని నారాయణ హితవు పలికారు. -
కేటీఆర్‌పై సీపీఐ నారాయణ విమర్శలు
-
కూనంనేనికే ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు.. : సీపీఐ సభ్యుడు రామరాజు
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: కొత్తగూడెంలో మిత్రపక్షాలు బలపరుస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామరాజు తెలిపారు. సోమవారం శేషగిరిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీలు పోటీ చేసే చోట పోటీ చేయకూడదని నిర్ణయించిందని, ఇందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించారని, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు బీఫాం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. నేతాజీ ఆశయాలతో పనిచేస్తున్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీ ఫామ్ వామపక్ష వ్యతిరేకికి ఇవ్వడం సరికాదన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు కూనంనేని విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం.. -
చంద్రబాబు బెయిల్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
-
సీపీఎం పోటీ చేయని చోట కాంగ్రెస్‌కు మద్దతు: సీతారాం ఏచూరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ ప్రభుత్వానికి అకౌంటబిలిటీ లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం విమర్శించారు. తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్, బీజేపీతో కలుస్తుందని చెప్పారు. యాంటీ బీజేపీగా అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఒంటరిగా పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. సీపీఎం పోటీలో లేని చోట ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్‌కే తమ మద్దతు ఉంటుందన్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తే కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఓటమి కోసమే తమ పోరాటమని ఏచూరి తెలిపారు. అయిదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ కష్టకాలంలో ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో కొంత బలం ఉన్నా.. ఫలితాల్లో మాత్రం కనిపించకపోవచ్చని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బంది అయ్యాయని విమర్శించారు. బాధ్యత లేకుండా బీజేపీ పాలన నడుస్తోందని మండిపడ్డారు. బీజేపీకి అతిపెద్ద మిత్రపక్షాలు ఈడీ, సీబీఐ అని.. ఆ మిత్రులతో కలిసి బీజేపీ దేశంలో ఏదైనా చేయగలదని ధ్వజమెత్తారు. ‘ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనపై అకౌంటబిలిటీ కనిపించడం లేదు. టన్నెల్‌కు ఎవరు అనుమతి ఇచ్చారు?. ఆ ఘటనకు భాధ్యత ఎవరు వహించాలి?. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనకు మోదీ పాల్పడుతున్నారు అయినా ఈసీఐ నోటీసులు ఇవ్వదు. తెలంగాణలో సీపీఎం ఒంటరిగా బరిలో ఉన్నా కాంగ్రెస్ నష్టం లేదు అనే భావనలో కాంగ్రెస్ ఉంది. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు రాకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. ఒకటి, రెండు సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీది. పొలిటికల్ బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలు లీగల్‌గా అవినీతికి పాల్పడుతున్నాయి, పొలిటికల్ పార్టీల ఖర్చుపై పరిమితం పెట్టాలి. ఇండియా కూటమి ఏర్పడిన ఉద్దేశంతోనే ముందుకు వెళ్తోంది. మణిపూర్ ఘటన వెనుక రాజకీయ కుట్రకోణం ఉంది. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని కోరుతున్నాం’ అని ఏచూరి పేర్కొన్నారు. చదవండి: మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి -
ఏపీలో మేం టిడిపితో కలవాలనుకుంటున్నాం
-
పువ్వాడకి సీపీఐ మద్దతా? నారాయణ ఏమన్నారంటే..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐ పొత్తుగా ముందుకు వెళ్తున్నాయి. కానీ ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కోసం కాకుండా.. పువ్వాడ అజయ్ కోసం సీపీఐ ప్రచారం చేస్తోందన్న ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నారాయణ ఖండించారు. అజయ్‌ను తులసి వనంలో గంజాయి మొక్కగా అభివర్ణించిన నారాయణ.. ఉమ్మడి ఖమ్మంలో ఓడిపోయే బీఆర్ఎస్ సీటు అజయదేనని జోస్యం చెప్పారు. ‘‘ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనే ప్రచారం నడుస్తోంది. కానీ, అది అపోహ మాత్రమే. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు కొడుకు పువ్వాడ అజయ్‌కు మద్దతు ఇస్తుందనే కొందరు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇవాళ్టి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా సీపీఐ నుంచి అజయ్‌కు మద్దతు ఇస్తే.. అది ఎంత పెద్ద నేత అయినా సరే చర్యలు తీసుకుంటాం’’ అని నారాయణ చెప్పారు. ఖమ్మంలో సీపీఐ కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పువ్వాడ నాగేశ్వర్ రావు. కానీ, తండ్రి నాగేశ్వరరావుకి మూడు నామాలు పెట్టిన వ్యక్తి అజయ్ కుమార్. అటువంటి వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లోనూ సీపీఐ మద్దతు ఇవ్వదు. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో బీఆర్ఎస్ ఓడిపోయే సీటు అజయదే అని నారాయణ అన్నారు. ఆ మూడు పార్టీలవి ఒప్పందమే! కాంగ్రెస్, సీపీఐకు ఓటేస్తే.. బీజేపీ, బీఆర్ఎస్ ,ఏంఐఎం.. మూడు పార్టీలు ఎలిమినేట్ అవుతాయి. ఆ మూడు ఒక ఒప్పందం ప్రకారమే ముందుకు వెళ్తున్నాయి. గోషామహల్లో బీజేపీ తరఫున రాజాసింగ్ పోటీ చేస్తున్నారు. అక్కడ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న చోట మాత్రం ఏంఐఎం అభ్యర్థిని నిలబెట్టింది. ఇది ఒక్కటి చాలు వీళ్లంతా ఎంతలా కలిసి ఉన్నారో చెప్పటానికి. పైకి ఒకరిపై ఒకరు విమర్శించుకున్నట్లు కనిపిస్తూ డ్రామాలు ఆడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్లే తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్, సీపీఐ గెలిస్తే దేశ రాజకీయాల్లో అనేక మార్పులు జరుగుతాయి అని నారాయణ అన్నారు. -
టీడీపీతో కలవాలనుకుంటున్నాం, కానీ.. : సీపీఐ నారాయణ
సాక్షి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. తాము టీడీపీతో కలవాలని అనుకుంటున్నప్పటికీ.. ఆ పార్టీ పక్క చూపులు చూస్తోందంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ రాజకీయాల గురించి కూడా ప్రస్తావించారు. ఏపీలో మేం టీడీపీతో కలవాలనుకుంటున్నాం. కానీ, ఆ పార్టీ పక్క చూపులు చూస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తూ బీజేపీతో టీడీపీని కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే మాత్రం మళ్లీ వైఎస్ జగన్ అధికారంలోకి రావడం ఖాయం. ఒకవేళ.. టీడీపీ గనుక బీజేపీతో కలవకుంటే మాత్రం మేం సపోర్ట్ చేస్తాం అని తేల్చి చెప్పారాయన. ఇక చంద్రబాబు అరెస్ట్.. బెయిల్‌పై విడుదల పరిణామాపై నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలే చేశారు. ‘‘చంద్రబాబుది అన్ అఫీషియల్ కండిషనల్ బెయిల్. బీజేపీ అగ్రనేత అమిత్ షాను నారా లోకేష్ కలిసిన తర్వాతనే పరిణామాలు మారాయి. షా వల్లనే చంద్రబాబుకి బెయిల్ వచ్చింది. చంద్రబాబు మళ్లీ ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు అని నారాయణ వ్యాఖ్యానించారు. -
అభివృద్ధికి అందలమా..మార్పునకు పట్టమా?
ఉద్యమాల గడ్డ.. రాజకీయ చైతన్య అడ్డా..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజకీయ సమీకరణలు మారాయి. 2018 నాటికి జిల్లాలోని మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్ఎస్ పట్టు సాధించింది. 2014 తర్వాత సీపీఐ నుంచి ఒకరు గెలిచినా, కాంగ్రెస్ నుంచి ఇంకొకరు గెలిచినా.. ఇద్దరూ బీఆర్ఎస్లోకి చేరిపోవడంతో మొత్తం గులాబీదళమైంది. ఉప ఎన్నికల్లో హుజూర్నగర్.. నాగార్జున సాగర్... మునుగోడుల్లోనూ గులాబీ వికసించింది. ఇప్పుడు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఢీ.. అంటే ఢీ అనే వాతావరణం కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాల్లో నెలకొన్న క్షేత్రస్థాయి రాజకీయ ముఖచిత్రంపై ప్రత్యేక కథనం... నల్లగొండ జనం ఎవరి వెంటో? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య రసవత్తర పోరు సాగుతోంది. బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్, సీపీఎం అభ్యర్థి సుధాకర్‌రెడ్డి తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మెడికల్ కాలేజీ, ఐటీ హబ్ రావడం. రహదారుల విస్తరణ, పట్టణ సుందరీకరణ, పార్కుల అభివృద్ధి బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల ప్రచారాస్త్రాలుగా మారాయి. కానీ సొంతపార్టీలో పెరిగిన అసంతృప్తి, ప్రత్యర్థుల ఆరోపణలు ఆయనకు తలనొప్పిగా మారాయి. ఇక ఎలాగైనా ఈ స్థానం దక్కించుకోవాలన్నది కోమటిరెడ్డి ఎత్తుగడ. అధికార పార్టీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. ఎంపీగా గెలిచాక నల్లగొండకు దూరమయ్యారనేది కోమటిరెడ్డికి మైనస్ పాయింట్. 1999 నుంచి నాలుగుసార్లు గెలిచిన కోమటిరెడ్డి, 2018లో కంచర్ల చేతిలో 23 వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. గతంలో విజయ వ్యూహాలు, కాంగ్రెస్ మార్పు నినాదంపై ఆయన నమ్మకం పెట్టుకున్నారు. నల్లగొండ, తిప్పర్తి, మాడ్గులపల్లి, కనగల్ ఓటర్ల తీర్పే ఈ ఇద్దరికీ కీలకం. నకిరేకల్ ఆ ఇద్దరే..! చిరుమర్తి లింగయ్య ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థి. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత పార్టీ మారారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక వీరిద్దరి మధ్యే ఇక్కడ పోటీ. 2018లో చిరుమర్తికి 8,259 ఓట్ల మెజారిటీ వచ్చింది. బీఆర్ఎస్లో ఆయనకు వర్గపోరు ఉంది. వేముల వీరేశంకు బీఆర్ఎస్లోని కొంతమంది సహకరిస్తున్నారనే భయం లింగయ్యను వెంటాడుతోంది. సంప్రదాయ ఓటు బ్యాంకు, బీఆర్ఎస్లో మిత్రులు, సిట్టింగ్‌పై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని వీరేశం భావిస్తున్నారు. దేవరకొండ ‘నాయక్’ ఎవరు? కాంగ్రెస్, కమ్యూనిస్టుల అడ్డా దేవరకొండలో తెలంగాణ ఏర్పడ్డాక సమీకరణలు మారాయి. 2014లో సీపీఐ టికెట్‌పై గెలిచిన రమావత్ రవీంద్రకుమార్ నాటి టీఆర్ఎస్లోకి వెళ్లారు. 2018లోనూ ఆయన విజయం సాధించారు. ఇప్పుడూ ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలూనాయక్‌తో తలపడుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధిపత్యమున్న ఈ స్థానంలో ఈసారి గెలుపోటములపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ హయాంలో సాగిన అభివృద్ధి ఎమ్మెల్యేపై వ్యతిరేకతను డామినేట్ చేస్తోందని ఆ పార్టీ వారే చెప్పుకుంటున్నారు. దళితబంధులో కమీషన్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులో ప్రజాగ్రహం కాంగ్రెస్ ప్రచారా్రస్తాలుగా మారాయి. ఏడాదిగా బాలూ నాయక్ ప్రజలతో మమేకమై రాజకీయ యుద్ధానికి సిద్ధమవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్. ఈ నేపథ్యంలో ఎవరి బలం ఎంతో తేలాల్సి ఉంది. తుంగతుర్తి తేడా ఒక్క శాతమే.. ఒక్క శాతం ఓట్లే ఇక్కడ జయాపజయాలను నిర్ణయిస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్, కాంగ్రెస్ నుంచి మందుల సామేల్ మధ్యే ప్రధాన పోటీ. నిజానికి ఈ స్థానాన్ని అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ తొలుత కేటాయించింది. ఆఖరి నిమిషంలో సామేల్ తెరమీదకొచ్చారు. దయాకర్ హైకమాండ్ బుజ్జగింపుతో తప్పుకున్నారు. ఆయన గత రెండు పర్యాయాలు ఒక్క శాతం ఓటుతోనే ఓడిపోయారు. సామేల్‌కు మద్దతిస్తున్న ఆయనకు ప్రజల్లోనూ సానుభూతి ఉంది. ఇదే ఆ పార్టీకి సానుకూలాంశం. అధికార పార్టీ అభ్యర్థి రెండుసార్లు గెలిచిన అనుభవం, అభివృద్ధి ఎజెండాతో ముందుకెళ్తున్నారు. అయితే, దళిత బంధు, డబుల్ బెడ్రూం కేటాయింపుల్లో అవినీతిపై ఎదురయ్యే దాడి ప్రతికూలంగా ఉంది. ఇది ఏమేర ప్రభావం చూపుతుందనేదే ఇక్కడ గెలుపోటములను నిర్ణయిస్తుంది. మునుగోడు మజా.. ఉపఎన్నికతో దేశవ్యాప్తంగా ఆకర్షించిన మునుగోడు రాజకీయం ఇప్పడూ రసవత్తరంగానే ఉంది. 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022లో బీజేపీలోకి వెళ్లి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన గెలుపు కోసం యావత్ బీఆర్ఎస్ నాయకత్వం సర్వశక్తులొడ్డింది. ఇప్పుడు రాజకీయం మారింది. కోమటిరెడ్డి మళ్లీ పార్టీ మారి, కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. ఇక కూసుకుంట్ల కోసం ఉప ఎన్నికల మాదిరి పార్టీ మొత్తం పనిచేసే పరిస్థితి లేదు. అభివృద్ధి నినాదంతో ఆయన బరిలో ఉంటే..ఉపపోరులో కలసి ఉన్న సీపీఎం ఈసారి పోటీలో ఉంది. స్వల్ప మెజారిటీ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కామ్రేడ్ల పోటీ వల్ల కూసుకుంట్లలో కలవరం లేకపోలేదు. పాల్వాయి స్రవంతి వల్ల ఏమేర నష్టం ఉంటుందనే ఆందోళన కోమటిరెడ్డిలోనూ లేకపోలేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చల్లమల కృష్ణారెడ్డి ప్రభావమూ కీలకమే. ఎన్ని ఓట్లు ఈ పార్టీ సాధిస్తుందనేది ఆసక్తి కల్గించే అంశం. సూర్యాపేట సిరి ఎవరిదో? అధికార పార్టీ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బీజేపీ నుంచి సంకేనేని వెంకటేశ్వరరావు బరిలో ఉన్నారు. 2018లో జగదీశ్‌రెడ్డి కేవలం 5,900 ఓట్ల మెజారిటీతో తెలిచారు. అప్పట్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేశ్‌రెడ్డి ఏఐ ఎఫ్బీ తరపున పోటీ చేయడం కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి పడింది. ఈసారి ఈయన్ను అధిష్టానం ఒప్పించి, బరిలో లేకుండా చేసింది. ఇది తమకు కలిసి వస్తుందనేది కాంగ్రెస్ వాదన. దీంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. జగదీశ్‌రెడ్డి అభివృద్ధి పనులపై ప్రజల్లో మంచి పేరుంది. ఇవే గెలిపిస్తాయనేది ఆయన నమ్మకం. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంకు కూడా 39 వేల వరకూ ఉంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న కాంగ్రెస్ ప్రచారంతో బీజేపీ ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందా? అనే సందేహాలున్నాయి. ఇవి ఓటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు. వారసుల సాగరం విజేతెవరో? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుందూరు జానారెడ్డి కుమా రుడు జయవీర్‌రెడ్డి, దివంగత నోముల నర్సింహయ్య కొడుకు భగత్ పోటీ పడుతున్నారు. 2018లో ఓటమి చవి చూసిన జానారెడ్డి వారసుడి గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. తన రాజకీయ అనుభవాన్ని రంగరించి పనిచేస్తున్నారు. ఉప ఎన్నికలో నోముల భగత్ విజయానికి పార్టీ యావత్ కృషి చేసింది. ఇప్పుడు ఒంటరిగానే ప్రచార బరిలో నిలిచారు. తండ్రి మరణంతో వచ్చిన సానుభూతి ఉప ఎన్నికల్లో గెలిపిస్తే..ఆ తర్వాత జరిగిన అభివృద్ధి ఈసారి గెలుపునకు మార్గమన్నది ఆయన వాదన. అనుభవ రాహిత్యంతో కేడర్ దూరమైందనేది అక్కడ పరిశీలన. జానారెడ్డి వ్యూహాలను ఎలా తిప్పికొడతాడనే దానిపై ఆయన విజయా వకాశాలుండే వీలుంది. కాంగ్రెస్‌కు కలిసి వచ్చే మార్పు నినాదం, పాతుకుపోయిన కేడర్ కుందూరు బలాలుగా చెప్పుకుంటున్నారు. భువనగిరి ఎవరి బలమెంత? ఇక్కడ పార్టీల ఆధిపత్యం తరచూ మారుతుంటుంది. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్ మధ్యనే పోటీ ఉంది. బీజేపీ, సీపీఎంది నామమాత్రపు పోటీనే. ఫ్లోరైడ్ ప్రాంతాల్లో మంచినీరు అందించడం శేఖర్‌రెడ్డి సాధించిన విజయంగా ప్రచారబరిలో ఉన్నారు. ప్రజల్లోనే ఉంటారనే పేరూ ఉంది. అయితే రైతుల ఆందోళన సందర్భంగా జరిగిన అరెస్టులపై జనం కాస్త వ్యతిరేకంగా ఉన్నారు. సొంతపార్టీలో వర్గపోరూ ఇబ్బందిగా ఉంది. కుంభం అనిల్ కుమార్‌కు కాంగ్రెస్ మార్పు నినాదం, ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిసి వచ్చే అంశాలు. కానీ పార్టీలు మారతారనే అంశం ప్రతికూలంగా ఉంది. ఎస్సీలు 20, గౌడ్ 13, రెడ్డి 10, యాదవ 10, పద్మశాలీ 8, ముదిరాజులు 8 శాతం ఇక్కడున్నారు. ఎస్సీ, గౌడ ఓటర్లతో పాటు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికార పార్టీలో ఉన్న వర్గపోరు వల్ల తనకు వస్తాయనేది అనిల్ నమ్మకం. జీ ‘హుజూర్’ ఎవరికో ? ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి (బీఆర్ఎస్), సీనియర్‌నేత ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంది. 1999 నుంచి ఉత్తమ్ ఇక్కడ విజయం సాధిస్తున్నారు. ఎంపీగా వెళ్లడంతో 2019లో ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ సైదిరెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తమ్ సతీమణి పద్మావతి ఉప పోరులో తలపడ్డా, కాంగ్రెస్ అపజయం చవిచూసింది. ఈసారి ఉత్తమ్ బరిలో ఉండటం, బీఆర్ఎస్ నుంచి వలసలు ఎక్కువ ఉండటంతో తమ గెలుపుపై ఉత్తమ్ ధీమాగా ఉన్నారు. సొంత పార్టీలో వర్గపోరు సర్దుకుంటే సైదిరెడ్డి కొన్ని ప్రాంతాల్లో ఓట్లు రాబట్టే వీలుంది. ఈ దిశగా అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ, సీపీఎం ఇక్కడ పోటీలో ఉన్నా వీరు ఎవరి ఓట్లు చీలుస్తారు? బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు ఆఖరి నిమిషంలో వదిలే ప్రచారాస్త్రాలు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. కోదాడ కొత్త రాజకీయం కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ (బీఆర్ఎస్), ఎన్ పద్మావతిరెడ్డి (కాంగ్రెస్) హోరాహోరీగా తలపడుతున్నారు. పద్మావతి ఉత్తమ్ సతీమణి. 2014లో ఆమె గెలిచినా, 2018లో మల్లయ్యయాదవ్ చేతిలో కేవలం 756 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పట్లో టీడీపీ మద్దతివ్వడం..బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ రాజేయడంతో పద్మావతికి ప్రతికూలత ఏర్పడింది. ఈసారి ఇక్కడ అనేక రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి. ఆంధ్రకు సరిహద్దు స్థానం కావడం, టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం పద్మావతికి కలిసి వచ్చే అంశాలు. యాదవ్‌ను గత ఎన్నికల్లో బలంగా వెనకేసుకొచ్చిన చందర్రావు ఈసారి వ్యతిరేకంగా ఉన్నాడనేది మల్లయ్యయాదవ్లో కనిపిస్తున్న కలవరం. అవినీతి ఆరోపణలు ఆయనకు మైనస్ పాయింట్‌గా ఉంది. బలమైన బీఆర్ఎస్ నేతలూ కాంగ్రెస్ బాట పట్టడం మరో ప్రతికూలత. అభివృద్ధి మంత్రమే గెలిపిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఆలేరు.. ఆ సెంటిమెంట్‌పైనే చర్చ ఇక్కడ ఒక పార్టీ నుంచి వరుసగా మూడోసారి గెలిచిన దాఖలాల్లేవు. ఇదే ఇప్పుడు రాజకీయ చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీత ఇప్పటికే రెండుసార్లు గెలిచారు. మరోసారి పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీర్ల ఐలయ్య గట్టి పోటీనే ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పడాల శ్రీనివాస్ పార్టీ సంప్రదాయ ఓటర్ను కాపాడుకునే పనిలో ఉన్నారు. 8 మండలాలున్న ఈ స్థానంలో గౌడ ఓటర్లు 40 వేలు, యాదవ ఓటర్లు 38 వేలుంటారు. వీళ్లే ఇక్కడ ప్రభావం చూపనున్నారు. యాదాద్రి టెంపుల్‌ను బీఆర్ఎస్ ఫోకస్ చేస్తోంది. మహిళా ఓటర్లను తనవైపు తిప్పుకోగలననే నమ్మకాన్ని సునీత వ్యక్తం చేస్తున్నారు. అయితే, సొంత పార్టీ నేతలే కలిసిరాని ప్రతికూలతను ఆమె ఎదుర్కొంటున్నారు. ఐలయ్యకు జిల్లా నేతల ఆశీస్సులుండటం, కాంగ్రెస్ గాలి వీస్తోందన్న ప్రచారం సానుకూలాంశాలుగా చెబుతున్నారు. పార్టీలో చేరికలు ఈయనకు కలిసి వచ్చే అంశం. మిర్యాలగూడ ఘాటెవరికో? బీఆర్ఎస్ తరపున నల్లమోతు భాస్కర్‌రావు సిట్టింగ్ ఎమ్మెల్యే. కాంగ్రెస్ ఆయనపై పోటీకి బత్తుల లక్ష్మారెడ్డిని బరిలోకి తెచ్చింది. సీపీఎం తరపున జూలకంటి రంగారెడ్డి తలపడుతున్నారు. సాధినేని శ్రీనివాసరావును బీజేపీ రంగంలోకి దించింది. బీఎల్ఆర్‌గా ప్రజాక్షేత్రంలో సామాజిక కార్యక్రమాలతో కొన్నేళ్లుగా లక్ష్మారెడ్డి దూసుకెళ్తున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యతిరేకించినా, కాంగ్రెస్ జిల్లా నేతలు బుజ్జగించి దారికి తెచ్చారు. 2018లో ఇక్కడ భాస్కర్‌రావుకు 30 వేల మెజారిటీ వచ్చింది. స్కైలాబ్ నాయక్ 2018లో కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసి, 14 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి ఆయన కాంగ్రెస్ వైపు ఉన్నారు. దీంతో కాంగ్రెస్ గెలుపు తథ్యమనేది వారి వాదన. ఇక్కడ సంప్రదాయ సీపీఎం ఓట్లు 10 వేలు ఉంటాయి. దీంతో స్వల్ప మెజారిటీతోనే ఎవరైనా గెలిచే వీలుందని తెలుస్తోంది. విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వాలి విద్యారంగంలో మంచి మార్పులొస్తే ఎన్నో రంగాల్లో సమూల మార్పులొస్తాయి. అందుకే ఏ రాజకీయ పార్టీ గెలిచినా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. నిధులు పెంచాలి.. అప్పుడే నాణ్యమైన విద్య అందించడం సాధ్యమవుతుంది. అన్నివర్గాలకూ అది ఉపయుక్తంగా ఉంటుంది. –మంత్రి ప్రగడ కనకయ్య వాళ్లేం చేస్తారో చూద్దాం తెలంగాణ తెచ్చిన బీఆర్ఎస్ పాలన చూశాం. ఇచ్చిన కాంగ్రెస్ పాలనా చూద్దాం. ఒకసారి అవకాశమిద్దాం. అయితే, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. – కొండా కనకమ్మ, రైతుకూలీ, చిలుకూరు మధ్యతరగతి నలిగిపోతోంది ఏ పార్టీలైనా మధ్యతరగతి గోడు పట్టించుకోవడం లేదు. ఓట్ల రాజకీయాలు తప్ప, అన్నింటా నలిగిపోతున్నది మధ్య తరగతి ప్రజలే. వాళ్లగురించి పాలకులు సానుకూలంగా ఆలోచించాలి. – వంగాల మాధవి, గృహిణి, మిర్యాలగూడ ఉద్యోగాలు ఇవ్వాలి లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లేదు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఓ పద్ధతిగా జరగాలి. ప్రైవేటు ఉద్యోగాలు వచ్చే నైపుణ్యం పెంచాలి. –కొరడాల సాయికుమార్, చివ్వెంల, సూర్యాపేట -ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వనం దుర్గాప్రసాద్ -
ఒంటరిగా బరిలోకి.. సీపీఎం పోటీతో లాభపడేది! నష్టపోయేది ఎవరు?
ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 వరకు జిల్లాలో ఎర్ర పార్టీలకు ఏదో ఒకచోట ఎమ్మెల్యే ఉండేవారు. కాని తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు అసెంబ్లీలోనే ఉనికి లేకుండా పోయింది. ఒకనాటి ఉద్యమ కేంద్రంలో ఒక్క సీటైనా గెలుచుకోవాలనే ఆరాటం కొనసాగుతోంది. కాని ఈసారి ఒంటరిగా బరిలో దిగిన సీపీఎం ఒక్క సీటైనా గెలుస్తుందన్న నమ్మకం లేదనే టాక్ నడుస్తోంది. అయితే సీపీఎం పోటీతో లాభపడేది ఎవరు? నష్టపోయేది ఎవరు అంటూ చర్చలు సాగుతున్నాయి? జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో ఒకనాడు కమ్యూనిస్టు ఉద్దండులు అసెంబ్లీలో ఉండేవారు. వారిలో ఎక్కువ భాగం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే వచ్చేవారు. రాను రాను కమ్యూనిస్టు పార్టీలు అటు రాష్ట్రంలోను.. ఇటు జిల్లాలోనూ ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం గట్టి పట్టు ఉండి.. అనేకసార్లు గెలిచిన నకిరేకల్, మిర్యాలగూడ స్థానాలు కూడా గెలవలేని స్థితికి వచ్చారు. 2009లో సింగిల్‌గా మిర్యాలగూడ స్థానాన్ని గెలుచుకున్న సీపీఎం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓడిపోతూనే వచ్చింది. మూడు సార్లు గెలిచిన జూలకంటి రంగారెడ్డి తాజా ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్రంలో రెండో మూడు సీట్లైనా గెలచుకోవడానికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సీపీఎం చాలా ప్రయత్నించింది. కాని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఆఖరు నిమిషంలో హ్యాండివ్వడంతో సీపీఎం ఒంటరిపోరుకే సిద్ధపడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా.. ఏడు నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు బరిలో దిగారు. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీలో ఉంటే.. ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది. పార్టీ బలహీనం అయినా ప్రతీ నియోజకవర్గంలో ఆ పార్టీకి కనీసం మూడు వేల ఓట్లయినా ఉంటాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ఈ ఓట్ల చీలికతో ఏ పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయనే చర్చల్లో.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. మిర్యాలగూడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి పదకొండు వేల ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఆయన ఎన్ని ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. జూలకంటి రంగారెడ్డి ప్రధానంగా కార్మికులతో పాటు వ్యవసాయ కూలీల ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్నారు. రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: బండి సంజయ్ వర్సెస్ గంగుల కమలాకర్ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు. ఆతర్వాత నోముల నర్సింహయ్య రెండుసార్లు గెలిచి..తర్వాత గులాబీ పార్టీలో చేరి.. ఒకసారి విజయం సాధించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా మూడు నుంచి ఐదు వేల ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో గెలుపోటములకు సీపీఐఎం అభ్యర్థి చినవెంకులు చీల్చే ఓట్లే కీలకం కానున్నాయి. ఇక నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా నంద్యాల నర్సింహ్మారెడ్డి ఒకసారి గెలిచారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో నిలుస్తున్నారు. పాత తిప్పర్తి మండలంలో జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ఆయనకు మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా మంచి పరిచయాలే ఉన్నాయి. తిప్పర్తి మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో ఆయన ఏమేరకు ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. గతంలో సీపీఎంలో పనిచేసిన నేతలంతా ప్రస్తుతం అధికార పార్టీ చేరిపోయారు. మునుగోడులో సీపీఐకి మంచి పట్టుంది. కానీ మొదటి నుంచి ఇక్కడ సీపీఐ అభ్యర్థికే సీపీఎం మద్దతు ఇస్తూ వస్తోంది. సీపీఐ పలుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ సీపీఐ పోటీ చేయడంలేదు...కాంగ్రెస్‌తో ఉన్న పొత్తు కారణంగా...హస్తం పార్టీ అభ్యర్ధికే సీపీఐ మద్దతు ఇస్తుంది. అందువల్ల సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తోంది. సీపీఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి బరిలో ఉన్నా ఆయన ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో నర్సిరెడ్డి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఇక భువనగిరి, హుజూర్ నగర్, కోదాడల్లో ఆ పార్టీ పోటీ చేస్తున్నా అక్కడ సీపీఎంకు చెప్పుకోదగిన బలం లేదు. అయినా మూడు నుంచి ఐదు వేల ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కావడంతో అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. వర్తమాన రాజకీయాల దృష్ట్యా సీపీఎం లేదా సీపీఐ పార్టీలు ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించే పరిస్థితులు అయితే లేవు. ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటేనే గెలిచే అవకాశాలుంటాయి. అందువల్ల ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఎం అభ్యర్థులకు పడే ఓట్ల వల్ల ఏదో ఒక పార్టీకి లాభం, మరో పార్టీకి నష్టం కలగక తప్పదనే టాక్ నడుస్తోంది. మొత్తంగా సీపీఐఎం బరిలో ఉండటంతో అధికార పార్టీ లాభపడే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. -
మరింత సమన్వయంతో ముందుకు...
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అధికారికంగా పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు మరింత సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల కేడర్, నేతలను సమ న్వయం చేసుకునేందుకు కమిటీలను ఏర్పాటు చేసుకోనున్నా యి. ఈ మేరకు మంగళవారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మూడు పార్టీల నేతలు సమావేశమయ్యారు. మాణిక్‌రావ్‌ఠాక్రే, మహేశ్‌కుమార్‌గౌడ్ (కాంగ్రెస్), చాడ వెంకట్‌రెడ్డి, బాల మల్లేశ్ (సీపీఐ), ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్రావు (టీజేఎస్) తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తమ కూటమి గెలుపు అంచనాలు, ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ రెండు వారాల సమయం చాలా కీలకమని, మూడు పార్టీల నాయకత్వం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్, బీజేపీలను చిత్తుగా ఓడించేలా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏ స్థాయిలోనూ మూడు పార్టీ ల కేడర్, నేతల మధ్య ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీ లు కలిసి పాల్గొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు: మూడు పార్టీ ల నాయకులు మూకుమ్మడిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ కన్వినర్‌గా బి. మహేశ్‌కుమార్‌గౌడ్ (టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్)ను నియమించారు. ఈయనతో పాటు మరో ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చాడ వెంకట్‌రెడ్డి, బాల మల్లేశ్, ఈటి నర్సింహ (సీపీఐ), కోదండరాం, పి.ఎల్. విశ్వేశ్వర్రావు, రమేశ్ (టీజేఎస్)లను కూడా కమిటీ సభ్యులుగా నియమించారు. రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ నేతల సమావేశంలో నిర్ణయించారు. -
బీఆర్ఎస్, బీజేపీ ఓటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రావాలన్నదే తమ ఆకాంక్ష అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో చాడ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనేందుకు ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడులే నిదర్శనమని ఆరోపించారు. ప్రపంచ రికార్డ్ అని చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిన రికార్డు సాధించిందని ఎద్దేవా చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికార పార్టీకి ప్రజాతిరుగుబాటు తప్పదని జోస్యం చెప్పారు. కొత్తగూడెం స్థానంలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును ప్రజలు గెలిపిస్తారని చాడ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల నాణ్యమైన కరెంటు అమలు కావడం లేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంలో పేదల ఆదాయం ఎందుకు పెరగడం లేదని, వారు ఇంకా ప్రభుత్వంపైన ఆధారపడాల్సిన పరిస్థితులు ఎందుకొచ్చాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ మాట తప్పారు.. గతంలో బీజేపీకి మద్దతిచ్చిన మాట వాస్తవమేనని, ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటామంటూ సీఎం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నిక ముందు తమతో చె ప్పారని చాడ గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత ఆయన మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని, భూమి సమస్యలు పరిష్కారానికి నోచుకోవాలని చాడ ఆకాంక్షించారు. వై.ఎస్. హయాం నాటి ఎల్లంపల్లి చెక్కుచెదరలేదు సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కట్టిన మూడేళ్లకే దెబ్బతిన్నదని చాడ విమర్శించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం వై.ఎస్. రాజశేఖరరెడ్డి మేడిగడ్డకు సమీపంలో శ్రీకారం చుట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నేటికీ చెక్కుచెదరలేదని చాడ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తప్పని పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌తో ముందుకు... సీట్ల విషయంలో కాంగ్రెస్, సీపీఎం మధ్య అవగాహన కుదరలేదని, కాబట్టి వామపక్షాలుగా కలసి పోటీ చేయలేకపోతున్నామని చాడ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తామేమీ వామపక్ష ఐక్యతకు గండికొట్టలేదని.. 2018లోనూ సీపీఐ, సీపీఎం వేర్వేరుగానే ఎన్నికలకు వెళ్లాయని గుర్తుచేశారు. తమతో అవగాహనలో భాగంగా కాంగ్రెస్ ఒక్క సీటే కేటాయించడంపట్ల సంతృప్తి లేకున్నా అప్రజాస్వామిక, నియంతృత్వ బీఆర్ఎస్ను ఓడించేందుకు తప్పని పరిస్థితుల్లోనే ఆ పార్టీతో ఎన్నికల అవగాహనతో ముందుకెళ్తున్నామని చాడ వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తులు అనివార్యమయ్యాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే ఎన్డీఏ పేరుతో 36 పార్టీలతో పొత్తు పెట్టుకుందని చాడ గుర్తుచేశారు. -
ఇదేందయ్యా... ఒక్క సీటు మురిపెం
భారత దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. కానీ, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉనికిలో లేదు. ఆంధ్రా ప్రాంతమంతా మదరాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉంటే, తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలోని హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండింది. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టుల పేరు బరిలోకి దిగి 41 చోట్ల గెలిచింది. కమ్యూనిస్టులకు 20.09 శాతం ఓట్లు వచ్చాయి. అపుడు అక్కడ కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారా అన్నంత చర్చ జరిగింది. ఇతర చిన్న పార్టీలతో కలిసి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలో ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) పేరు పోటీ చేసి 37 చోట్ల విజయం సాధించింది. 1955లో జరిగిన ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులకు ఆంధ్ర పాంతంలో 30.82 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు అధికారానికి దగ్గరగానే ఉన్నా.. 1962 తర్వాత పార్టీలో వచ్చిన చీలిక వారిని బలహీన పరిచినా కూడా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు ఉమ్మడి ఏపీ శాసన సభలో వారి గొంతు బలంగానే వినిపించింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మరీ దారుణంగా ఆ పార్టీల పరిస్థితి పడిపోయింది. 2023 శాసన సభ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడం ఔరా అనిపిస్తోంది. గత గణాంకాలకే ఇక పరిమితమా..? కమ్యూనిస్టులు ఉమ్మడిగానే ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఫలితాలు తేలిగ్గా కొట్టిపారేయలేం. అందుబాటులో ఉన్న ఎన్నికల గణాంకాల ప్రకారం చూసినా.. రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగినంత దగ్గరగా వచ్చిన పార్టీ. ఆంధ్ర ప్రాంతంలో 1952 ఎన్నికల్లో 41 సీట్లు, 1955 ఎన్నికల్లో 15 స్థానాలు, తెలంగాణ ప్రాంతంలో 1952లో 37 సీట్లు, 1957లో 22 సీట్లు ఏపీ ఏర్పడిన తర్వాత 1962లో 51 సీట్లను కమ్యూనిస్టులు గెలుచుకున్నారు. 1964లో కమ్యూనిస్టుల్లో చీలిక ఏర్పడి సీపీఐ నుంచి విడివడిన వర్గం సీపీఐ (ఎం)గా ఏర్పడింది. 1964 మధ్యంతర ఎన్నికల్లో సైతం సీపీఐ 31, సీపీఎం 22 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నాయి. ఒక సీపీఐ గురించి మాత్రమే చర్చిస్తే.. 1967లో 11, 1972లో 7, స్థానాలకు మాత్రమే పరిమితమై తన గ్రాఫ్‌ను తగ్గించుకుంటూ వచ్చింది. తెలంగాణ పరిధిలోని 119 స్థానాల అంశాన్ని పరిగణలోకి తీసుకుని మాట్లాడుకున్నా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌తో పొత్తుతో 2014లో కేవలం రెండు సీట్లకే పరిమితం అయ్యింది. 2018లో ఒక చోటా గెలవలేదు. ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న సీపీఐ ఈ ఎన్నికల్లో కేవలం ఒక్క చోట నుంచే పోటీ చేయడం విశేషం. 30 నియోజకవర్గాల ప్రాతినిధ్యం నుంచి ఒక్క స్థానానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఒక్కో ఎన్నికకు పోటీ చేసే స్థానాల సంఖ్యను కుదించుకుంటూ వస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీపీఐకి 30 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం ఉండింది. ఆ స్థానాల నుంచి ఒకసారి మొదలు ఆరేడు పర్యాయాలు గెలిచిన చరిత్ర కూడా ఉంది. ఆసీఫాబాద్‌లో సీపీఐ మూడు సార్లు గెలిచింది. ఆదిలాబాద్‌లో ఒక సారి ప్రాతినిధ్యం వహించింది. హుస్నాబాద్ (ఇందుర్తి రద్దయినది) నియోజకవర్గంలో ఆ పార్టీ ఏకంగా 6 సార్లు గెలిచింది. సాయుధ తెలంగాణ సేనాని బద్దం ఎల్లారెడ్డి ఇక్కడి గెలిచారు. దేశిని చినమల్లయ్య నాలుగు సార్లు విజయం సాధించారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఒక సారి గెలిచారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వర్‌రావు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచారు. మెదక్, పెద్దవూర (ఇపుడు నాగార్జున సాగర్), నల్గొండ, భువనగిరి, నకిరేకల్, ఆలేరు, జనగామ, స్టేషన్ ఘనపూర్, నర్సంపేట, పరకాల, చేర్యాల (రద్దు అయ్యింది), పాలేరు నియోజకవర్గాల్లో ఒక్కో సారి విజయం సాధించి అక్కడి నుంచి ఎమ్మెల్యేలు శాసన సభకు ప్రాతినిధ్యం వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో సీపీఐ 5 సార్లు గెలిస్తే.. అన్న సార్లూ చిలుముల విఠల్ రెడ్డి గెలిచారు. నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి సీపీఐ ఏకంగా 7 విజయాలను నమోదు చేసింది. బద్దూ చౌహాన్ హ్యాట్రిక్ సాధించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో కూడా ఇక్కడ సీపీఐ నుంచి రవీంద్ర కుమార్ గెలిచి, ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. మునుగోడు నియోజకవర్గంలో కూడా సీపీఐకి 6 విజయాలు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో రద్దయిన మరో నియోజజకవర్గం రామన్నపేట నుంచి 4 సార్లు గెలిస్తే ఇందులో వరసగా మూడు సార్లు గెలిచిన గుర్రం యాదిగిరి రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. మహబూబాబాద్ లో 2 సార్లు, రద్దయిన బూర్గంపాడు (ఇపుడు పినపాక)లో 5 సార్లు, సుజాతనగర్ (ఇపుడు వైరా)లో 5 సార్లు, భద్రాచలంలో 2 సార్లు గెలిచింది. ఇక, ఇపుడు కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం కొత్తగూడెంలో గతంలో రెండు సార్లు గెలిచింది. ఈ సారి అభ్యర్థిగా బరిలో ఉన్న సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గతంలో కూడా ఒక సారి విజయం సాధించారు. ఇంతగా విజయాల చరిత్ర ఉన్నా.. కేవలం ఒకే ఒక్క సీటు కోసం కాంగ్రెస్‌తో రాజీపడిపోవడాన్ని చివరకు పార్టీ వర్గాలు కూడా జీర్ణించుకోలేక పోతున్నాయి. :::మిత్రా. ఎన్ -
‘సుత్తి’ దెబ్బ ఎవరికి..
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడతో పాటు ఖమ్మం జిల్లాలోని వైరా స్థానం కూడా తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబట్టడం, మిర్యాలగూడ మాత్రమే ఇస్తానని కాంగ్రెస్ చెప్పడంతో సీపీఎం ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పటివరకు రెండు విడతల్లో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పొత్తుపై సీపీఎంతో చర్చలు జరుపుతూనే ఉంది. దీంతో చివరి క్షణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై రెండు పార్టీల కార్యకర్తల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు కుదిరిన నేపథ్యంలో.. సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు సీపీఎం ఓటింగ్ ఎంత? సీపీఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాగా సీపీఎం కారణంగా ఈ జిల్లాల్లో లేదా ఈ స్థానాల్లో తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే, సీపీఎం కొన్నిచోట్ల కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భద్రాచలం, వైరా, మిర్యాలగూడ లాంటి స్థానాల్లో ఓ మాదిరి సంఖ్యలో ఓట్లు పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేయగా, సీపీఎం ఒంటరిగా రాష్ట్ర వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి మొత్తం 91,099 ఓట్లు మాత్రమే పొంది ఒక్క సీటూ గెలవలేదు. సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేసి 83,215 ఓట్లు సాధించినా ఎక్కడా గెలవలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పొందిన ఓట్ల కన్నా సీపీఐ, సీపీఎం పార్టీలు సాధించిన ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు ఏకంగా 6.73 లక్షల ఓట్లు (3.3 శాతం) వచ్చాయి. అంతేకాదు నోటాకు వచ్చిన స్థాయి లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు రాలేదంటే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అప్పట్లో నోటాకు 2.2 లక్షలు అంటే 1.1 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఎం రాష్ట్రంలో ఆ ఎన్నికల్లో కేవలం 0.44 శాతం ఓట్లు మాత్రమే పొందింది. అధికంగా భద్రాచలంలో 14,228, వైరాలో 11,373, మిర్యాలగూడలో 11,221, ఇబ్రహీంపట్నంలో 9,106, పాలేరులో 6,769 ఓట్లు వచ్చాయి. అత్యంత తక్కువగా హైదరాబాద్‌లోని నాంపల్లిలో 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా అప్పటికీ ఇప్పటికీ సీపీఎం పెద్దగా పుంజుకున్నదేంలేదని, వాస్తవానికి అప్పటికంటే ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంక్ ఇంకా తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీపీఎం పోటీతో ఏ పార్టీకి ప్రయోజనం? 2018లో ఓటింగ్‌ను పరిశీలిస్తే చూస్తే, ఇప్పుడు సీపీఎం బరిలో నిలిచే స్థానాల్లో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆ పార్టీ చెబుతోంది. కాగా ఐదారు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం సీపీఎంకు ఉందని విశ్లేషకులంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటే, ఆయా స్థానాల్లో సీపీఎం పోటీ వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. అదే పోటాపోటీగా ఉన్న స్థానాల్లో మాత్రం సీపీఎంకు పడిన ఓట్ల వల్ల ఏదో ఒక పార్టీ నష్టపోయినట్టుగానే పరిగణించాల్సి వస్తుంది. మరోవైపు కొన్నిచోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే ఆ మేరకు కాంగ్రెస్‌కు నష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే, సీపీఎంతో పొత్తుతో కొంత ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయంతోనే.. కాంగ్రెస్ ఇంకా ఆశలు వదులుకోలేదు. మిర్యాలగూడ స్థానంలో అభ్యరి్థని ప్రకటించకుండా అందుకే పెండింగ్‌లో పెట్టిందని చెబుతున్నారు. మరో 3 స్థానాలకు సీపీఎం అభ్యర్థుల ప్రకటన ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం, మంగళవారం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడలో మట్టిపెల్లి సైదులు, మునుగోడులో దోనూరు నర్సిరెడ్డి, ఇల్లెందులో దుగ్గి కృష్ణలను ఖరారు చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -బొల్లోజు రవి -
కొత్తగూడెం సీటు.. రెండు ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునివ్వడంతోపాటు, రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీల జాతీయ నాయకత్వాలను సంప్రదించిన తర్వాత ఈ మేరకు ఒప్పందానికి వచ్చామని చెప్పారు. రేవంత్ సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌కు వెళ్లారు. ఏఐసీసీ పరిశీలకులు దీపాదాస్ మున్షీ, కార్యదర్శి విష్ణుదాస్ ఆయన వెంట ఉన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి తదితరులతో పొత్తుపై చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌లతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం తమపై ఉన్న రాజకీయ ఒత్తిడి, తాజా పరిణామా లు, పరిస్థితులను సీపీఐ నేతలకు వివరించామని రేవంత్ తెలిపారు. పేదల తరఫున నిలబడేందుకు, పెద్ద మనసుతో ముందుకు రావాల్సిందిగా తాము చేసిన విజ్ఞప్తికి సీపీఐ అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ఎన్డీఏ కూటమిని ఇండియా కూటమి ఓడించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, సీపీఐల మధ్య స్పష్టమైన పొత్తు ఖరారైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐని గెలిపించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించాలని, కలిసి పని చేయాలని కోరారు. సెక్యులర్ శక్తులకు విశ్వాసాన్ని కల్పించేందుకు, పేద, సామాన్యుల సమస్యలు చట్ట సభలలో ప్రస్తావనకు వచ్చేలా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే శాసనమండలిలో సీపీఐకి చెందిన ఇద్దరు సభ్యులకు అవకాశం ఇస్తామని చెప్పారు. మునుగోడు సీటుపైనా చర్చ జరిగిందని, అక్కడ స్నేహ పూర్వక పోటీ వద్దని సీపీఐని కోరామన్నారు. సమస్యలపై కలిసి పోరాటం, ఎన్నికల ప్రచారం, ఓటు బదిలీపై సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని చెప్పారు. సీపీఎంతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. దగా పడిన ప్రజల విముక్తే లక్ష్యం: నారాయణ బీఆర్ఎస్ చేతిలో దగాపడిన ప్రజానీకానికి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. ఇందుకోసమే సీపీఐ, కాంగ్రెస్ ఐక్యంగా నిలబడ్డాయని తెలిపారు. రాజకీయ, భౌతిక, అనివార్య పరిస్థితుల్లో ఒక్క కొత్తగూడెం స్థానం నుంచే పోటీకి అంగీకరించామని కూనంనేని చెప్పారు. తమ స్నేహ బంధంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలావుండగా తాను ఈ నెల 8న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు కూనంనేని ఖమ్మంలో చెప్పారు. ప్రజలు అన్ని విషయాలను గమనించి ప్రజాతంత్ర, లౌకిక శక్తులను గెలిపించాలని, ప్రజలను మరిచి పాలన చేస్తున్న పాలకులను ఓడించాలని పిలుపునిచ్చారు. కూనంనేని కార్యదర్శిగా కొనసాగేనా? కొత్తగూడెం నుంచి కూనంనేని పోటీ చేయనుండటంతో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కొనసాగుతారా లేదా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల్లో ఆయన పూర్తి బిజీగా ఉంటే పార్టీ బాధ్యతలు ఎవరు చూస్తారని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు ఎమ్మెల్సీలు ఎవరెవరికి దక్కవచ్చనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు సీపీఐ ఎన్నికల కన్వీనర్‌గా చాడ వెంకట్‌రెడ్డిని నియమించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. -
సీపీఐతో పొత్తు కుదిరింది: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని చెప్పారు. కొత్తగూడెంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు. అక్కడ సీపీఐ నేతలతో రేవంత్ చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామన్నారు. ఈ ఎన్నికల్లో పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్-సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సీపీఎం ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారితో కూడా పొత్తు విషయమై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు..కూనంనేని కాంగ్రెస్‌కు తెలంగాణలో సానుకూల పవనాలు వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడులో కేవలం బీజేపీని ఓడించడానికే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. కేంద్రంలో నిరంకుశ పాలన ఉందని, అదే స్థాయిలో తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు. సీపీఎంతో కూడా కాంగ్రెస్‌కు ఒక అవగాహన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్‌తో ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని కూనంనేని ఆకాంక్షించారు. -
కడుపేద వర్గాలకు చేరువైన 'సీపీఐ..' ఇకపై ప్రశ్నార్థకమేనా!?
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ప్రజా ఉద్యమాలు పరమావధిగా, సమసమాజ నిర్మాణమే ప్రధానలక్ష్యంగా నిర్మితమైన పార్టీ ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు గట్టి పట్టు సాధించింది. నిజాం నిరంకుశ, రాచరిక పాలన, రజాకార్లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధగెరిల్లా పోరాటం చేసి పీడిత, తాడిత, అట్టడుగు వర్గాలకు చేరువైంది. అంతటి ఘనకీర్తిని సాధించిన సీపీఐని ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతగానో ఆదరించారు. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల నుంచి 2009వరకు జరిగిన ఎన్నికల్లో ఏడు పర్యాయాలు పార్టీ విజయం సాధించింది.ఆదిలాబాద్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మూడేసి సార్లు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వి భజనలో భాగంగా కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లిని యోజకవర్గం నుంచి ఓసారి విజయ కేతనం ఎగురవేసింది. శాసనసభలో ప్రజల పక్షాన వాణి వినిపించి ఎర్రజెండా ఖ్యాతిని కమ్యూనిస్టులు ఎలుగెత్తి చాటారు. 2014 నుంచి సీపీఐ ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తుండగా.. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మ డి జిల్లాలో పోటీ చేస్తుందా..? లేదా..? అనే అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతుండడం గమనార్హం. ఆసిఫాబాద్‌లో ఎర్రజెండా రెపరెపలు.. పాత ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం సీపీఐకి బలమైన పట్టు కలిగిన స్థానంగా విరాజిల్లింది. 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రథమంగా గుండా మల్లేశ్ సీపీఐ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభంజనం లోనూ ఎ మ్మెల్యేగా గెలిచి సత్తాచాటారు. 1985లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లోనూ గుండా మల్లేశ్ సీపీఐ తరఫున పోటీలో నిలబడి విజయబా వుటా ఎగురవేశారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లోనూ మల్లేశ్ గెలిచారు. వరుసగా మూడు దఫాలు ఆసిఫా బాద్ నియోజకవర్గం నుంచి మల్లేశ్ విజయం సా ధించి తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగి పాత ఆసిఫాబాద్ అసెంబ్లీ నుంచి వేరుపడి బెల్లంపల్లి కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. బెల్లంపల్లికి 2009లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో గుండా మల్లేశ్ ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డుకెక్కారు. నాలుగు పర్యాయాలు అసెంబ్లీకిప్రాతినిధ్యం వహించారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో.. తెలంగాణ రైతాంగ సాయుధ గెరిల్లా పోరాటం చేసిన కమ్యూనిస్టులను జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారు. సాయుధ పోరాట విరమణ అ నంతరం 1952లో దేశవ్యాప్తంగా సాధారణ ఎ న్నికలు జరిగాయి. తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడంతో ఆ దిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క మ్యూనిస్టు నేత దాజీ శంకర్రావు ప్రొగ్రెసివ్ డె మొక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో మరో కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ రంగనాథరావు బోలన్వార్ కూడా పీడీఎఫ్ అభ్యర్థిగా విజయం సాధించారు. 1967 లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా కస్తాల రామకిష్టు శాసనసభకు ఎన్నికయ్యారు. గతమెంతో ఘనకీర్తి..! ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన సీపీఐ క్రమక్రమంగా ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. ఎర్రజెండా మెరుపు కానరాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణం సన్నగిల్లడంతోపాటు తాజా రాజకీయాలకు అనుగుణంగా ఎన్నికల్లో తలపడే అర్థబలం, అంగబలం లేకుండా పోయి చతికిలపడినట్లుగా సీపీఐ శ్రేణులు అంగీకరిస్తున్నారు. ఒకానొక దశలో ఉమ్మ డి జిల్లాలో ఎర్రజెండాను రెపరెపలాడించిన కమ్యూనిస్టులు ప్రస్తుత వర్తమానకాల పరిస్థితులకు సరి తూగలేక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయలేక పొత్తులకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.ఈ పరి ణామాల క్రమంలో గతమెంతో ఘనకీర్తిగా చెప్పుకో వాల్సిన పరిస్థితులు కమ్యూనిస్టులకు ఏర్పడ్డాయి. ఈసారి ఎన్నికల్లో.. ఉమ్మడి జిల్లాలో 2014 ఎన్నికల నుంచి సీపీఐ ప్రా తినిధ్యం కరువైంది. 2018 ఎన్నికల్లో బెల్లంపల్లి ని యోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా గుండా మల్లేశ్ పోటీ చేసి ఓటమి చవి చూశారు. ఈసారి ఎన్నికల్లో సీపీఐ పోటీ చేస్తుందా..? లేదా..? అనే అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దఫా కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నా పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రానట్లుగా తెలుస్తోంది. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చే యాలని ఆరాటపడగా కాంగ్రెస్ చెన్నూర్ స్థానాన్ని కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు లేనట్లుగా తెలుస్తుండగా కమ్యూనిస్టు శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. ఇవి చదవండి: 'బోథ్' కాంగ్రెస్‌లో.. అభ్యర్థిని మార్చుతున్నారనే ప్రచారంతో లొల్లి!? -
‘మూడు’ ఎలా ఉంటుందో..? చివరి నిమిషం వరకు చిక్కుల్లో సీపీఐ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేడు జాబితాను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలైనా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. భద్రాద్రి జిల్లాలో ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొత్తగూడెం సీపీఐకి..? ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించి నెల రోజులు గడిచినా ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొత్తగూడెంతోపాటు మరో సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్‌తో కలిసి నడవబోమంటూ మరోవైపు సీపీఐ ప్రకటించింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే సీపీఐ జాతీయ నాయకత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరినట్టు గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకే వదిలేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. అయితే సీపీఐ విధించిన ఇతర షరతులపై ఇంకా స్పష్టత రాలేదు. ఇల్లెందు, అశ్వారావుపేటలలో వీడని పీటముడి.. ఇల్లెందు, అశ్వారావుపేట సీట్లపై పీటముడి ఇంకా వీడటం లేదు. ఇల్లెందు నుంచి టికెట్ ఆశిస్తున్న జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. శనివారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే ఈ సీటును బంజరా సామాజిక వర్గానికి కేటాయించాలనే డిమాండ్ బలంగా తెర మీదకు వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌తోపాటు శంకర్‌నాయక్, డాక్టర్ రవి, ప్రవీణ్‌నాయక్, చీమల వెంకటేశ్వర్లు తదితర నేతలు ఈ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రకటించబోయే మూడో జాబితాలో టికెట్ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అశ్వారావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో పాటు జారే ఆదినారాయణ, సున్నం నాగమణిలు టికెట్ ఆశిస్తున్నారు. తమకే టికెట్ దక్కుతుందనే అంచనాల్లో వీరంతా నమ్మకాలు పెట్టుకున్నారు. అజ్ఞాతంలోకి సీపీఐ కౌన్సిలర్లు! చర్చోపచర్చల అనంతరం కాంగ్రెస్, సీపీఐల మధ్య ఎన్నికల పొత్తు విషయంలో సయోధ్య కుదిరిందనేలోగా మరో సమస్య ఆ పార్టీకి ఎదురైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్లు ఇంకా పట్టు వీడలేదు. ఆ పార్టీకి మొత్తం ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఐదుగురు కౌన్సిలర్లు శనివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్లకు కూడా స్పందించడం లేదు. వీరంతా ఆదివారం కొత్తగూడెంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అధికారికంగా ధ్రువీకరించలేదు. మరోవైపు తప్పుడు ప్రచారమంటూ ఆ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లారనే వార్తలు ప్రచారంలోకి రాగానే మరోసారి కాంగ్రెస్ నేతలు పొత్తులపై ఆసక్తికర కామెంట్లను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో ఉంటుందంటూ వారు ఆ పోస్టుల్లో పేర్కొంటున్నారు. ఇవి చదవండి: ఇల్లెందులో.. స్వతంత్ర అభ్యర్థిగా గుమ్మడి అనురాధ! -
ఆ రెండు సీట్లు దక్కేలా చూడండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీతో ఎలాగైనా పొత్తు కుదుర్చుకోవాలని సీపీఐ భావిస్తోంది. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన కొత్తగూడెంతోపాటు చెన్నూరు లేదా మునుగోడు స్థానాలను ఇవ్వాలని కోరుతోంది. అందుకోసం ప్రయత్నాలు తీవ్రం చేయాలని పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజాను స్థానిక నాయకులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర కమిటీకి బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర సమితి ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి సీపీఐ రాష్ట్ర విస్త్రృతస్థాయి సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని తేల్చే బాధ్యతను కేంద్ర కమిటీకి అప్పగిస్తూ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులతో చర్చించి రెండు అసెంబ్లీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాల్సిందిగా కోరామని ఆయన చెప్పారు. కేంద్ర కమిటీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో గందరగోళం.. కాగా, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా బరిలో నిలవాలని సీపీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ మాత్రం అలా తెగతెంపులు చేసుకోవడానికి ఏమాత్రం సిద్ధపడడంలేదని తెలుస్తోంది. వామపక్షాలన్నీ కలసి పోటీ చేసినా ఎక్కడా గెలిచే పరిస్థితి లేదనీ, కాబట్టి ఎలాగైనా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటేనే అసెంబ్లీలో అడుగు పెట్టగలమని ఆ పార్టీ భావిస్తోందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోవడం, శాసనసభలో ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతిందనీ, కేడర్ చెల్లాచెదురైపోతున్నారనేది సీపీఐ భావనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టి తీరాలని సీపీఐ యోచిస్తోంది. అయితే సీపీఐ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో మాత్రం నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తినట్లు తెలిసింది. కొందరు సీపీఎం సహా ఇతర వామపక్ష, లౌకిక శక్తులతో కలసి పోటీ చేయాలని కోరగా, కొందరు ఎలాగైనా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటేనే బాగుంటుందని అన్నట్లు తెలిసింది. అంతేకాదు మునుగోడు, కొత్తగూడెం సీట్ల విషయంపై ఆయాచోట్ల తలెత్తిన అసంతృప్తి కూడా ఈ సమావేశంలో బయటపడినట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు ఖరారై కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చినా మునుగోడులో పోటీ చేసి తీరాల్సిందేనని కొందరు పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో గందరగోళ వాతావరణం నెలకొనడంతో సమావేశానికి వచ్చిన సభ్యులను శాంతింప చేయడం కష్టమైందని సమాచారం. ఈ నేపథ్యంలో పొత్తు బాధ్యతను కేంద్ర కమిటీకి అప్పగించినట్లు తెలిసింది. ఒకవేళ కాంగ్రెస్‌తో సయోధ్య కుదరకుంటే, తదుపరి ఏం చేయాలన్న దానిపైనా కూడా కేంద్ర కమిటీనే తేల్చాలని కోరినట్లు వెల్లడైంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకుంటే దాదాపు 20 సీట్లలో పోటీ చేసే విషయం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. -
కారుకు...నో ఎంట్రీ
రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఐదో పర్యాయం భారత్ రాష్ట్ర సమితి పేరిట శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లోనూ ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఇలా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా నేటికీ కొన్ని సెగ్మెంట్లలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. కొరకరాని కొయ్యలుగా మిగిలిన ఆ సెగ్మెంట్లపై ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించిన బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ఈసారైనా పాగా వేయాలని భావిస్తోంది. నేటికీ గెలుపు తీరాలకు చేరని నియోజకవర్గాలివే.. ఉమ్మడిఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. వీటితో పాటు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పాగా వేయలేకపోయింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీలకు చెందిన అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. వీరిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మినహా మిగతా ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికలో బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగుతున్నారు. ♦ 2004లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల కూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. ♦ 2009లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది ♦ 2014, 2018లో రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆయా చోట్ల ఇలా... 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 17 చోట్ల ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది. మరో 39 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఒక్కసారే గెలుపొందగా, 37 నియోజకవర్గాల్లో రెండేసి పర్యాయాలు విజయం సాధించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు 26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుతీరాలకు చేరారు. 2001 నుంచి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు సిద్దిపేటలో అత్యధికంగా ఎనిమిది పర్యాయాలు, హుజూరాబాద్‌లో ఆరు పర్యాయాలు, వరంగల్ పశ్చిమలో ఐదుసార్లు గెలుపొందారు. పాతబస్తీలో ఎంఐఎంతో దోస్తీ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పాతబస్తీలో పరిమిత సీట్లలో పోటీ చేసినా 2014, 2018 ఎన్నికల్లో మాత్రం అన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే మజ్లిస్ పార్టీతో మిత్రబంధం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో బీఆర్ఎస్ స్నేహపూర్వక పోటీ పేరిట నామమాత్ర పోటీకి పరిమితమవుతోంది. అక్కడ ఈసారీ నామమాత్రపు పోటీనే? ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలతో పాటు ఆ పార్టీ బలంగా ఉన్న మరో రెండు సీట్లు నాంపల్లి, గోషామహల్లో ఈసారి కూడా బీఆర్ఎస్ నామమాత్ర పోటీకీ పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్ పాత బస్తీలోని ఏడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా, వారికి ఇప్పటికీ బీ ఫారాలు ఇవ్వలేదు. మరోవైపు నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ నేటికీ ఖరారు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చిక్కని పట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా బీఆర్ఎస్కు పట్టు చిక్కడం లేదు. 2014లో కొత్తగూడెంలో మాత్రమే పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. పాలేరుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలవడంతో పార్టీ బలం రెండుకు చేరింది. ఆ తర్వాత చేరికల ద్వారా బలపడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నా 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే విజయం సాధ్యమైంది. చేరికల వ్యూహంతో మరోమారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని లోటును పూడ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అయితే చేరికల వ్యూహం వికటించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో చేరికల ద్వారా బలపడేందుకు అనుసరించిన వ్యూహం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. -కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
ఒంటరిగానే పోటీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గురువారం ఎంబీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించామని, రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ రెండు స్థానాలేమిటో కాంగ్రెస్ చెప్పలేదన్నారు. కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ పార్టీ వైఖరి వల్లే పొత్తు నుంచి తప్పుకొని ఒంటరిగా పోటీకి నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని తెలిపారు. తొలుత 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఈ సంఖ్య పెరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఐక్య పోటీపై సీపీఐ వైఖరి చెప్పలేదు.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని తమ్మినేని పేర్కొన్నారు. అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని, ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేసినా ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతరులెవరున్నా సీపీఎం మద్దతుగా నిలుస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. 17 స్థానాలు ఇవే... ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ (ఎస్సీ), భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ జాబితాలో ముషీరాబాద్ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్ పేరు ఖరారైనట్లు తెలిసింది. -
సీపీఎం దారిలో సీపీఐ?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించగా అదే దారిలో నడవాలని సీపీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీపీఐకి కొత్తగూ డెం, సీపీఎంకు మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలే ఇస్తామని, అధికారంలోకి వచ్చాక చెరో ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేయడంతో వామపక్షాలు భగ్గుమంటున్నాయి. ఐదు సీట్ల నుంచి మూడు... తర్వాత రెండు స్థానాలకు దిగిరాగా ఇప్పుడు చెరొక సీటే ఇస్తామని ప్రకటించడంపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించగా సీపీఐ శుక్రవారం జరిగే పార్టీ రాష్ట్ర సమావేశంలో చర్చించి ఒక అభిప్రాయానికి రానుంది. సీపీఎం నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగాలని సీపీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సీపీఎం 17 స్థానాలతో మొదటి జాబితా ప్రకటించగా సీపీఐ సైతం అదే స్థాయిలో జాబితా ప్రకటించే అవకాశముంది. నామినేషన్ల గడువు వరకు తుది నిర్ణయం ప్రకటించకుండా తమకు ఆశాభంగం కలిగించిన కాంగ్రెస్‌పై లెఫ్ట్ పార్టీలు గరంగరంగా ఉన్నాయి. ఇది తమను మోసం చేయడమేనని అంటున్నాయి. తమ సత్తా చాటుకోవాలని, పోటీ చేసే అన్నిచోట్లా గణనీయంగా ఓట్లు సంపాదించాలని, ఆ మేరకు కృషి చేయాలని నిర్ణయించుకుంటున్నాయి. సీపీఐ వైఖరి శుక్రవారం వెల్లడైతే వెంటనే ఇరు పార్టీల సంయుక్త సమావేశం జరగనుంది. 45 సీట్లలో ఇరు పార్టీల పోటీ? బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వామపక్షాలు ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సీపీఐ కూడా కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకొని ముందుకు వస్తే, ఈ ఎన్నికల బరిలో వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక కూటమి పోటీలో ని లవనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా సీపీఐ, సీపీఎం కలసి పోటీ చేస్తాయని అంటున్నాయి. ఆ తర్వాత కలిసొచ్చే ఇతర ప్రజాతంత్ర, లౌకిక శక్తులతో కలసి పోటీలో ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. సీపీఐ, సీపీఎం 45కు పైగా స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది. మిగిలిన స్థానాల్లో బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ప్రకటించనున్నాయి. -
సీపీఎం డెడ్ లైన్ తో ఆలోచనలో పడ్డ టీ కాంగ్రెస్
-
ఘనమైన చరిత్ర నుంచి గట్టెక్కలేని స్థితికి..
స్వతంత్ర భారతావనికి జరిగిన తొలి ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన ఎంపీతోనే కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలన్న నిర్ణయం జరిగింది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు కూడా దక్కని ఆ ఖ్యాతి కమ్యూనిస్టులకు దక్కింది. 1952 మార్చిలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ లోక్ సభ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్టుల అభ్యర్థి రావినారాయణ రెడ్డి, నెహ్రూకన్నా అత్యధిక మెజారిటీలో విజయం సాధించారు. రావి నారాయణ రెడ్డికి ఆ ఎన్నికల్లో 3,09,162 ఓట్లు పోలయ్యాయి. అదే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ కమ్ జౌన్పూర్ (పశ్చిమ) ద్విసభ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జవహర్లాల్ నెహ్రూకు మాత్రం 2,33,571 ఓట్లు పడ్డాయి. దీంతో పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే అరుదైన అవకాశం కమ్యూనిస్టులకు దక్కినట్లయ్యింది. ఇపుడు ఈ చరిత్రనంతా నెమరు వేయడం ఎందుకంటే.. కమ్యూనిస్టుల ప్రాభవం ఏ విధంగా ఉండేదో గుర్తు చేసుకోవడం కోసం.. ఇప్పటి వారి పరిస్థితిపై ఓ అంచనాకు రావడం కోసం. ఉనికి కోసం వారు పడుతున్న ఆరాటాల గురించి చర్చించుకోవడం కోసం. తెలంగాణ శాసన సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ బీఆర్ఎస్ నిరాదరణకు గురై, కాంగ్రెస్ కు స్నేహ హస్తం చాచినా ఆ పార్టీ పట్టించుకోక పోవడంతో ఇపుడు ఎలాంటి ఎన్నికల పొత్తులు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాల్సి వచ్చింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకునే స్థితి నుంచి కమ్యూనిస్టులు ఎపుడో కిందకు జారిపోయారు. కమ్యూనిస్టులది ఘనమైన చరిత్రే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు అంటే 1983 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వైరి వర్గాలు కాంగ్రెస్, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలే. కమ్యూనిస్టులు సీపీఐ, సీపీఎంలుగా విడివడ్డాక క్రమేణా కాంగ్రెస్ ను ధీటుగా ఎదుక్కోవడంలో ఉభయ కమ్యూనిస్టులు విఫలమవుతూ వచ్చారు. ఈ తరుణంలోనే ఎన్టీ రామారావు నాయకత్వంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి దగ్గరై, పోత్తులు పెట్టుకోవడం మొదలు పెట్టారు. నాటి ఆర్ధిక మంత్రి నాదేండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు, తెలుగుదేశంలో ఏర్పడిన అంతర్గత సంక్షోభం సమయంలో ఎన్టీఆర్ ను తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టడానికి జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో వామపక్షాలది తీసివేయలేని పాత్ర. వాస్తవానికి 1983లో ఎన్టీఆర్ ప్రభంజనలో సైతం వామపక్షాలు తమ ఉనికిని చాటాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ 4 నియోజకవర్గాల్లో, సీపీఎం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాయి. అంటే అప్పటికి ఆ పార్టీలకు ఉన్న శక్తిని తక్కువగా అంచనా వేయలేం. కానీ, తర్వాత వరసగా జరిగిన 1985, 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీతో జతకట్టి బరిలోకి దిగాయి. ఇక్కడి వరకు సవ్యంగా సాగిన టీడీపీ, లెఫ్ట్ పార్టీల స్నేహం ( ఒక విధంగా ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ ఉన్నన్ని రోజులు..) ఆతర్వాత బ్రేక్ అయ్యింది. చంద్రబాబు అవకాశవాదంతో టీడీపీకి దూరమైన వామపక్షాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిన 1999 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో చంద్రబాబు అవకాశవాదానికి షాకైన వామపక్షాలు, టీడీపీకి దూరమయ్యాయి. ఆ ఎన్నికల్లో సీపీఎం రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించగా, సీపీఐకి ఒక్క చోటా గెలవలేదు. ఆ తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జరిగిన పొత్తులో లాభపడిన సీపీఐ 6, సీపీ ఎం 9 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నాయి. కాంగ్రెస్‌తో వచ్చిన పొరపొచ్చాల వల్ల 2009 ఎన్నికల్లో మహాకూటమి లో భాగంగా టీడీపీ, బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) తో ఎన్నికలు వెళ్లాయి. అప్పుడు కూడా సీపీఐ 4 చోట్ల , సీపీఐఎం ఒక చోట గెలిచాయి. గడిచిన నాలుగు దశాబ్ధాల కాలంలో అంటే 1983 నుంచి ఇప్పటి దాకా ఏదో ఒక పార్టీ అండలేకుండా అసెంబ్లీ సీట్లను గెలుచుకోలేని స్థితికి వామపక్షాలు చేరుకున్నాయి. చివకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణలో సీపీఐ(ఎం) వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టకుని ఒక చోట, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న సీపీఐ ఒక చోట గెలిచాయి. 2018 ఎన్నికలు తెలంగాణలో ఆ పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేశాయి. మునుగోడు ఉప ఎన్నికతో.. బీఆర్ఎస్ తో దోస్తీ 2023 ఎన్నికల్లో మొదట బీఆర్ఎస్ తో కలిసి వెళతాయని భావించినా, అది బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలు వేదికగా ఆ నియోజకవర్గంలో బీజేపీని ఎదుర్కునే శక్తి బీఆర్ఎస్ కే ఉందని పేర్కొంటూ ఆ పార్టీతో జతకట్టాయి. ఆ ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతోనే బీఆర్ఎస్ గెలిచిందని అంతా భావించినా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం వామపక్షాలను కరివేపాకులా తీసి పక్కన పడేశారు. 2023 ఎన్నికల అభ్యర్థుల ప్రకటన సమయంలో తమ మిత్రపక్షాలుగా భావిస్తున్న వామపక్షాలతో మాటమాత్రంగా కూడా చర్చలేవి జరపకుండా ఏక కాలంలో 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో సీపీఎం, సీపీఐ పోటీ చేయాలని భావించిన స్థానాలు కూడా ఉండడం విశేషం. దీంతో బీఆర్ఎస్, వామపక్షాల మధ్య చెడిందని, పొత్తు లేనట్టేనన్న అర్థమై పోయింది. జాతీయ రాజకీయాల్లో భాగంగా ‘ ఇండియా ’ కూటమిలో కాంగ్రెస్ తో వామపక్షాలు కలిసి నడుస్తున్నాయి. దీంతో తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని భావించినా.. ఆ పార్టీల మధ్య ఇంకా పొత్తు పొడవలేదు. దాదాపు తెలంగాణలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఉండక పోవచ్చని, ఒంటరిగానే వామపక్షాలు పోటీ చేయనున్నాయని తెలుస్తోంది. దీంతో వామపక్ష పార్టీలకు ఉన్న ఓటు బ్యాంకు ఎవరి జయాపజయాల్లో కీలకం కానుందన్న సమీకరణలు మొదలయ్యాయి. వామపక్షాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయనున్నాయి..? చివకు కనీసం ఉభయ కమ్యూనిస్టుల పార్టీల మధ్యనైనా సరైన అవాగాహన కుదురుతుందా అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది. :::మిత్రా. ఎన్ -
కాంగ్రెస్ పొత్తు యూటర్న్‌పై నారాయణ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: పొత్తులో సీట్ల కేటాయింపు జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ యూటర్న్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్-కమ్యూనిస్టుల పొత్తును ఉద్దేశించి ట్విటర్ వేదికగా నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిశ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కుడా జరిగితే ఎలా? పొత్తు ధర్మం పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు ‘‘ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నిచ్చితార్డం అయ్యాక యింకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయిగాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో మరి వ్యవస్థను కాపాడే తాజారాజకీయాలలో కుడా జరిగితే ఎలా?#media #SocialMediaPromo #aicc — Narayana Kankanala (@NarayanaKankana) November 2, 2023 కాంగ్రెస్ పార్టీతో మంగళవారం కటీఫ్ ప్రకటించిన సీపీఎం బుధవారం ఒక అడుగు వెనక్కు వేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఫోన్ చేసి విన్నవించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఆ సమయంలోగా పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వకుంటే, వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తేల్చిచెప్పింది. కాగా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది. ఇదిలా వుండగా, రెండు పార్టీల రాష్ట్ర సమావేశాల్లో నాయకుల తీరుపై కొందరు పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పొత్తులపై ఇదేం పాకులాట అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు పాకులాడడంపై ప్రజల్లో పలుచన అయిపోతున్నామని, ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. 2 స్థానాల్లో పోటీ అనడంతో వాటిపైనే దృష్టిపెట్టామని, ఇప్పుడు పొత్తు లేదని, 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్న ద్ధం కాగలమని సీపీఎం శ్రేణులు ప్రశ్నించినట్లు సమాచారం. చదవండి: అయితే వెయిటింగ్! -
ఇద్దరూ ఒకేసారి శాసనసభ పక్ష నేతలుగా...
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చెన్నమనేని రాజేశ్వర్‌రావు, చెన్నమనేని విద్యాసాగర్‌రావులు అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వారిద్దరూ ఉమ్మడి శాసనసభలో కరీంనగర్ జిల్లాలో వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎన్నికవ్వడం, భిన్న ధ్రువాలు, విభిన్న సిద్ధాంతాలతో సీపీఐ, బీజేపీల నుంచి ప్రాతినిథ్యం వహించడం, శాసనసభలో సభాపక్ష నేతలుగా ఉండటం ఎప్పటికీ ఓ రికార్డే. ♦ చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల నియోజక వర్గం నుంచి 1967, 1978, 1985, 1994 ఎన్నికల్లో సీపీఐ నుంచి, 2004లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ♦ ఆయన సోదరుడైన చెన్నమనేని విద్యాసాగర్‌రావు 1985,1989,1994 ఎన్నికల్లో బీజేపీ నుంచి మెట్పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కరీంనగర్ ఎంపీగా 1998, 1999 ఎన్నికల్లో రెండుమార్లు ఎంపికై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆనంతరం మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ♦ 1994 నుంచి 1999 మధ్యకాలంలో ఉమ్మడి శాసనసభలో బీజేపీ శాసనసభ పక్షనేతగా సీహెచ్ విద్యాసాగర్‌రావు, సీపీఐ శాసనసభ పక్షనేతగా సీహెచ్ రాజేశ్వర్‌రావు ఉన్నారు. అసెంబ్లీలో కాషాయదళపతిగా విద్యాసాగర్‌రావు, ఎరుపుదళానికి నాయకుడిగా రాజేశ్వర్‌రావు తమ పార్టీల వాణిని ఆయా సందర్భాల్లో బలంగా వినిపించారు. ఒకరి విధానాలను మరొకరు ఖండించి ఎండగట్టారు. ఎదుట నిలుచుంది సోదర బంధం, రక్త సంబంధమైనా విధానాలపరంగా ఒకరినొకరు విరుద్ధ వేదికలపై నిలిచారు. విధానాలపరంగా పరస్పరం ఎదుటి పార్టీలో ఉన్న సోదరుడిని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకు ఏనాడూ వెనకడుగు వేయని అరుదైన సందర్భాలు వీరిద్దరి హయాంలో అనేకమున్నాయ. -
కాంగ్రెస్, వామపక్షాల మధ్య తెగని పొత్తు పంచాయితీ
-
అగ్రవర్ణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15న ప్రకటించిన 55 స్థానాలకు తోడు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరో 45 స్థానాలను క్లియర్ చేయడంతో ఇప్పటివరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో విడత జాబితాలో అగ్రవర్ణాలకు చెందిన నేతలకు పెద్ద పీట వేయగా, బీసీలకు 8 స్థానాలను, ఎస్సీ, ఎస్టీలకు 8, మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించింది. ఇక ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గానికి 21, వెలమలకు 2, బ్రాహ్మణులకు 1, కమ్మ సామాజిక వర్గానికి మూడు టికెట్లను కేటాయించింది. ప్యారాచూట్లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చినట్లు సీట్ల కేటాయింపు స్పష్టం చేస్తోంది. గతంలో చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, వివిధ కారణాలతో వేరే పార్టీల్లోకి వెళ్లి ఇటీవలే తిరిగి సొంతగూటికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి)లకు టికెట్లు కేటాయించారు. అలాగే ఇటీవలే పార్టీలోకి వచ్చిన బి.మనోహర్‌రెడ్డి (తాండూరు), శ్యాంనాయక్ (ఖానాపూర్), కంది శ్రీనివాస్‌రెడ్డి (ఆదిలాబాద్), యశస్వినిరెడ్డి (పాలకుర్తి), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), బండి రమేష్ (కూకట్పల్లి), జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), నారాయణరావు పాటిల్(బోథ్), వొడితల ప్రణవ్ (హుజూరాబాద్), కస్తూరి నరేందర్ (రాజేంద్రనగర్), విజయారెడ్డి (ఖైరతాబాద్), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మురళీ నాయక్ (మహబూబాబాద్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కె.ఆర్.నాగరాజు (వర్ధన్నపేట)లకు అవకాశ మిచ్చారు. బల్మూరి, విష్ణుకు మొండిచేయి అనుబంధ సంఘాల అధ్యక్షులు శివసేనారెడ్డి (వనపర్తి), బల్మూరి వెంకట్ (హుజూరాబాద్)లకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మాజీ మంత్రి పీజేఆర్ కుటుంబానికి ఒక టికెట్‌తోనే సరిపెట్టింది. జూబ్లీహిల్స్ టికెట్‌ను పీజేఆర్ తనయుడు విష్ణు ఆశించినా అక్కడ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి అవకాశమిచ్చింది. వరంగల్ జిల్లాలో కొండా దంపతులిద్దరికీ టికెట్ వస్తుందని భావించినా వరంగల్ తూర్పులో సురేఖకే అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో పార్టీలో చేరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ ఖరారు చేసింది. ఇక ఖానాపూర్‌లో కొమురం భీం మనుమడు ఎడ్మ బొజ్జుకు, నారాయణపేటలో చిట్టెం కుటుంబానికి చెందిన డాక్టర్ పర్ణికారెడ్డి, పాలకుర్తిలో ప్రవాసాంధ్రురాలు హనుమాండ్ల ఝాన్సీ కోడలు యశశ్వినిరెడ్డి (ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో పిన్నవయసు్కరాలు (26))లకు అవకాశం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న స్థానాలివే.. మిర్యాలగూడ, వైరా (సీపీఎంకు కేటాయించే అవకాశం), చెన్నూరు, కొత్తగూడెం (సీపీఐకి కేటాయించినట్లు సమాచారం), పటాన్చెరు, అశ్వారావుపేట, తుంగతుర్తి, సూర్యాపేట, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, చార్మినార్, బాన్సువాడ, జుక్కల్, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సామాజిక వర్గాల వారీగా ఇలా.. ఎస్సీలు–15 (మాదిగ–9, మాల–6) ఎస్టీలు–8 (ఆదివాసీలు–5, లంబాడీ–3) బీసీలు–20, మైనార్టీలు–4, ఓసీలు–53 (రెడ్డి–38, వెలమ–9, బ్రాహ్మణ–3, కమ్మ–3) బీసీలకు 20 సీట్లే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో కలిపి మొత్తం 20 స్థానాలే వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలకు దక్కాయి. మొదటి జాబితాలో 12 మందికి ఇవ్వగా, ఈసారి 8 మందికి అవకాశం కల్పించారు. తాజాగా ప్రకటించిన లిస్టులో 3 గౌడ, 2 ముదిరాజ్, పద్మశాలి, ఆరె మరాఠి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మధుయాాష్కీ, పొన్నం ప్రభాకర్, జగదీశ్వర్ (గౌడ) కస్తూరి నరేందర్, వాకిటి శ్రీహరి (ముదిరాజ్), కొండా సురేఖ (పద్మశాలి, భర్త మున్నూరు కాపు), నారాయణరావు పాటిల్ ( ఆరె మరాఠి), పూజల హరికృష్ణ (మున్నూరు కాపు)లకు టికెట్లు ఖరారయ్యాయి. కాగా ప్రకటించిన 100 సీట్లలో 20 శాతమే బీసీలకు కేటాయించి 53 శాతం ఓసీ వర్గాలకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు కేటా యించిన 20 సీట్లలో యాదవ–4, గౌడ –3, మున్నూరుకాపు–3, ముదిరాజ్–3, పద్మశాలి, ఆరె మరాఠి, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కులాలకు ఒక్కొక్కటి దక్కాయి. -
తండ్రీ కొడుకు.. భిన్న నేపథ్యం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌కు తండ్రీకొడుకు రెండేసిసార్లు ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు గెలిచిన పువ్వాడ 1989లో పువ్వాడ నాగేశ్వరరావు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.దుర్గానర్సింహారావుపై విజయం సాధించారు. ఆ తర్వాత 1994లో సీపీఐ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి జహీర్‌అలీ మహ్మద్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచే పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మూడోసారి బరిలో అజయ్ పువ్వాడ అజయ్‌కుమార్ 2014లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి..టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 5,609 ఓట్ల మెజారిట్టీతో గెలిచారు. 2018లోఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి, టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 10,991 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడో సారి బీఆర్ఎస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ చరిత్రలో మంత్రి పదవి సైతం పువ్వాడ అజయ్కుమార్నే వరించింది. -
పచ్చనోట్ల మధ్య..పదునెక్కని ఓటు
ఆకాశాన్ని తాకే ఆశయం, గుండె గొంతుకలోంచి పుట్టుకొచ్చే భావోద్వేగం, కష్టమైన, నిష్టూరమైనా సైద్ధాంతిక ఆలోచనా విధానమే అప్పట్లో రాజకీయ నేపథ్యంగా ఉండేది అంటున్నారు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. వామపక్ష ఉద్యమమే గీటురాయిగా పనిచేసిన సీపీఐ (ఎంఎల్) పార్టీ అంటే గుర్తుకొచ్చేది గుమ్మడి నర్సయ్యే. విలువలు, నిరాడంబర జీవితం ఆయన సొంతం. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నాటి నుంచి ఇప్పటివరకు అత్యంత సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు. అప్పటికి ఇప్పటికి ఎన్నికల సరళి పూర్తిగా మారిపోయిందని.. పదునైన ఓటు ఆయుధం పచ్చనోట్ల మధ్య మొద్దుబారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యం అపహాస్యం చేస్తోందని వాపోయారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. మారిన ఎన్నికల తీరుపై గుమ్మడి నర్సయ్య ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. దోచుకున్నా గుర్తించరేం? దోపిడీ విధానాలపై ఉక్కు పిడికిలితో ఉద్యమించిన ప్రజల్లో మార్పు వచ్చింది. దీన్ని ఆకర్షణ పేరుతో పాలకులు అణచివేస్తున్నారు. తాయిలాలు, సంక్షేమానికి ఆకర్షితులవుతున్న జనం.. వాటి కోసం తమ జేబుకే చిల్లు పెడుతున్నారని గుర్తించడం లేదు. మద్యం పేరుతో సర్వం హరిస్తున్నా తెలుసుకోకపోవడం దారుణం. అభివృద్ధి, సంక్షేమానికి చాలా తేడా ఉంటుంది. అభివృద్ధి వల్ల శాశ్వత ఉపాధి అవకాశం లభిస్తుంది. అప్పుడు ఏ సంక్షేమ పథకాలకూ ప్రజలు ఆకర్షితులుకారు. మారిన లెఫ్ట్ పంథా.. వామపక్ష ఉద్యమ పంథాలో మార్పు వచ్చిందనేది నిజమే. సామాజిక మార్పులను గుర్తించకపోవడం నష్టమే. ఉద్యమ నేపథ్యం ఉన్న పక్షాలు ఐక్యంగా ముందుకెళ్లలేని స్థితి ఏర్పడింది. దీంతో ప్రజలు పోరాడే విధానానికి దూర మయ్యారు. ఒకప్పుడు పోడు భూముల కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన చరిత్ర ఉంది. ఇప్పుడు నేతలు పోటీపడి ఇస్తా మంటే ఆకర్షితులవుతున్నారు. తేలి కగా వచ్చే దానికి ఆకర్షితులవుతున్నారు. పోరాటానికి వెనకాడుతు న్నారు. ఈ ముసుగులోనే సోకాల్డ్ నేతలు ప్రజలను వంచిస్తున్నారు. రాజకీయమా.. వ్యాపారమా..? ‘‘1983 నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అప్పట్లో ప్రజల్లో మమేకమైతేనే పార్టీలు సీట్లు ఇచ్చేవి అప్పట్లో. పోటీచేసే వ్యక్తిని జనం అదే రీతిలో సొంతం చేసుకునే వాళ్లు. పోస్టర్లు, గోడమీద రాతలు అవే ఆ కాలంలో అతిపెద్ద ఎన్నికల ఖర్చు. ప్రచారం కోసం వచ్చే వాళ్లకు ప్రజలే అన్నంపెట్టే వారు. ఆశ్రయం కల్పించేవారు. అంతా కలిపి రూ.లక్షన్నర వరకూ ఎన్నికల ఖర్చు ఉండేది. ప్రజలు పైసలు ఆశించేవాళ్లు కాదు. 1994 నుంచి రాజకీయాలు మారిపోయాయి. కోట్లు గుమ్మరిస్తేనే గెలుస్తామని పార్టీలు కూడా భావిస్తున్నాయి. ప్రజలకు, నాయకులకు మధ్య ధన సంబంధం ఏర్పడింది. రాజకీయాలు కలుíÙతమయ్యాయి. రూ.కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత తమకు ఏది లాభమో దాన్నే అనుసరిస్తున్నారు. అవసరమైతే పార్టీలు మారుతున్నారు. మౌనం ఉరుముతున్న వేళ.. ఎన్నికల మహాభారతంలో ప్రజలే నిర్ణేతలు. ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్లకే ఓట్లేసే ఆలోచన విధానం కొన్నేళ్లుగా పెరిగింది. కానీ ఒక తరం ఇలా చేయడం వల్ల దాని ప్రభావం భవిష్యత్ తరాలపై పడింది. అందుకే యువతలో ఇప్పుడు నిర్వేదం, నైరాశ్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి. ఉపాధి లేని జీవితం.. సర్కారీ ఉద్యోగం ఎండమావేనని భావించే యువతలో ఆగ్రహం క్రమంగా కట్టలు తెంచుకుంటోంది. ఇది రానురాను రాజకీయ సమీకరణాలను మారుస్తుంది. ఒక తరం కోల్పోయిన పోరాట పంథాకు ఊపిరిపోస్తోంది. వామపక్ష ఉద్యమ నేపథ్యాన్ని తిరిగి తెలుసుకుంటోంది. పోరాటమే అంతిమ లక్ష్యమన్న ధోరణిలోంచే ఎన్నికల విధానంలోనూ మార్పు వస్తుందనేది వాస్తవం..’’అని గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. 4 సార్లు ఎమ్మెల్యే.. 3 నియోజకవర్గాలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ సిట్టింగ్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన మూడు వేర్వేరు నియోజకవర్గాల్లో ఈ ఘనత సాధించడం గమనార్హం. 1981లో నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చీమన్‌పల్లికి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. 1986లో సిరికొండ ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా ఆర్మూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిప్రయత్నంలోనే ఆయన ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఇండిపెండెంట్ ప్యానల్ ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో భీంగల్ ఎంపీపీ, సిరికొండ జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో తన అనుచరులను గెలిపించుకున్నారు. 1999లో ఆర్మూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున ఏలేటి అన్నపూర్ణమ్మ(టీడీపీ)పై గెలుపొందారు. 2004లో బాన్సువాడ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి(టీడీపీ)పై గెలుపొందారు. 2009లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డిపై ఓడిపోయారు. తర్వాత 2014లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున గోవర్ధన్ పోటీ చేసి ధర్మపురి శ్రీనివాస్(కాంగ్రెస్)పై, 2018లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా భూపతిరెడ్డి(కాంగ్రెస్)పై విజయం సాధించారు. - వనం దుర్గాప్రసాద్ -
దసరా తర్వాతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. సీపీఐకి ఎదురుదెబ్బ!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బస్సు యాత్రలో హస్తం నేతలు బిజీగా ఉన్నారు. మరోవైపు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. కాగా, దసరా తర్వాతే రెండో జాబితా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటికే 55 మందితో తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, దసరా తర్వాతనే తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈనెల 25 లేదా 26 తేదీలలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఇక, ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మెజారిటీ కసరత్తు పూర్తి చేసింది. అవసరాన్ని బట్టి అభ్యర్ధులతో కాంగ్రెస్ నాయకత్వం మాట్లాడనున్నట్టు సమాచారం. మరోవైపు, సీట్ల కేటాయింపులో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో రెండు స్థానాలు ఇచ్చేందకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. చెన్నూరు నుంచి సీపీఐ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చెన్నూరులో అభ్యర్థిని ప్రకటించక ముందే సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సీపీఐ అనుబందం సంఘం ఎఐటీయూసీ.. చెన్నూరులో సీపీఐ పోటీ చేయడంపై వ్యతిరేకత చూపించింది. సీపీఐ అక్కడ పోటీ చేయవద్దంటూ ఏకంగా తీర్మానం చేసింది. బలం లేని చోట పోటీ వద్దంటూ తీర్మానంలో పేర్కొంది. వెంటనే చెన్నూర్ టిక్కెట్ తీసుకునే ప్రతిపాదనను విరమించుకోవాలని మందమర్రి కార్మిక సంఘం విభాగం కోరింది. దీంతో, ఆదిలోనే సీపీఐకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. -
సీట్ సిక్ట్సీ ..చేరుకోని కాంగ్రెస్
మ్యాజిక్ ఫిగర్... అధికారం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలకు అవసరమైన కీలక సంఖ్య ఇది. మొత్తం స్థానాల్లో సగం కంటే ఒకటి ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్ సంఖ్య విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఫికర్ అవుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరమవుతాయి. ఈ 60 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు ఎన్నికల్లోనూ సాధించలేదు. ఇంకోమాట చెప్పాలంటే 1985 నుంచీ ఈ 60 స్థానాలు ఆ పార్టీకి దక్కలేదు. అయితే 1985 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోని అసెంబ్లీ సీట్లు 107 మాత్రమే. ఈ లెక్కన ఆ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో ఒకట్రెండు సార్లు మ్యాజిక్ ఫిగర్ వచ్చింది ఇక, తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో అయితే ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు ఆమడదూరంలో నిలబడింది. 2014లో 21, 2018లో 19 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. ఇప్పుడు ఆ సంఖ్య నుంచి ఏకంగా 60 స్థానాలకు ఎగబాకడం ఏ మేరకు సాధ్యమనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతమంతా కటువుగా.. గతాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఒడిదుడుకుల మధ్యనే సాగుతున్నట్టు అర్థమవుతుంది. కొన్ని ఎన్నికల్లో బాగానే సీట్లు సాధించినా, మరికొన్ని ఎన్నికల్లో చతికిలబడి పోవడం, ఆ తర్వాతి ఎన్నికల్లో కొంత పుంజుకోవడం రివాజుగా కనిపిస్తుంది. 1983లో ఎన్టీరామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక నాదెండ్ల భాస్కరరావు రూపంలో జరిగిన తిరుగుబాటు కారణంగా అసెంబ్లీ రద్దయి 1985లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 107 స్థానాల్లో గెలిచింది కేవలం 14 మాత్రమే. అంతకుముందు 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 43 చోట్ల గెలుపొందింది. రెండేళ్లలోనే 29 స్థానాలు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో సీపీఐ8, సీపీఎం7, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం విశేషం. ఇక, 1989లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో బాగా మెరుగుపడింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో 107 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 58 సీట్లు వచ్చాయి. అప్పుడున్న మొత్తం స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలోనూ వచ్చింది. 1985లో 14 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 89లో ఏకంగా 44 సీట్లను అదనంగా సాధించింది. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ ఎన్నికల్లో 107 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 6 మాత్రమే. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి సొంతంగా 69 చోట్లా, సీపీఐకి 13, సీపీఎంకు 8 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో తెలంగాణలో 42 సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతం కంటే మెరుగైన ఫలితాలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇక, 2004లో మహానేత డాక్టర్ వైఎస్సార్ పాదయాత్ర ప్రభావం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 185 సీట్లు సాధిస్తే, అందులో తెలంగాణలో 48 ఉన్నాయి. అప్పుడు ఉన్న 107 స్థానాల్లో కూడా ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంది. గత ఎన్నికల కంటే రెండు ఎక్కువగా అంటే 50 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. కానీ, అప్పుడున్న మొత్తం 119 అసెంబ్లీ స్థానాలతో పోలిస్తే మ్యాజిక్ ఫిగర్ మాత్రం రాలేదు. ఈ ఫలితాలను బట్టి ఉత్థాన పతనాల పరిణామాల అనంతరం ఈసారైనా కాంగ్రెస్ నిలదొక్కుకుంటుందా? గత రికార్డులను బద్దలు కొట్టి 119 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ అయిన 60 చోట్ల గెలుపొందుతుందా అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ, పైకి మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏం జరుగుతుందో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. 1985కు ముందు జరిగిన ఎన్నికల ఫలితాలిలా.. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సమయంలో తెలంగాణలో 107 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం హవా కనిపించింది. కానీ, తెలంగాణలో మాత్రం తెలుగుదేశంతో సమానంగా కాంగ్రెస్ పార్టీ 43 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. అక్కడ మొత్తం 187 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది 17 మాత్రమే. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో విజయం సాధించింది. అందులో తెలంగాణలోని 107 సీట్లలో 65 స్థానాల్లో గెలుపొందింది. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 78 స్థానాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 219 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం మీద ఇండిపెండెంట్లు 57 మంది గెలుపొందారు. 1967 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కానీ, అప్పుడు ఇండిపెండెంట్లు తమ హవా చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 165 సీట్లు వస్తే అందులో తెలంగాణలో 64 ఉన్నాయి. 101 స్థానాలను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్ల హవా కొనసాగింది. మొత్తం 287 స్థానాలకు గాను 68 చోట్ల స్వతంత్రులే గెలుపొందారు. తెలంగాణలో వీరి సంఖ్య 26 కావడం గమనార్హం. 1962లోనూ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. తెలంగాణలోనూ 64 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో సీపీఐకి 18 స్థానాలు వచ్చాయి. ఇండిపెండెంట్లు 19 మంది గెలిచారు.ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ 51 స్థానాల్లో గెలుపొందింది. కానీ, తర్వాతి రెండు ఎన్నికల్లోనూ సీపీఐకి గణనీయంగా సీట్లు తగ్గడంతో చాలా మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు సందర్భం కావడంతో 1955లో ఆంధ్రప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారినే 1962 వరకు కొనసాగించారు. కానీ, తెలంగాణలో మాత్రం 1957లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 చోట్ల గెలుపొందగా, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున పోటీ చేసిన కమ్యూనిస్టులు 22 చోట్ల గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ 10 మంది ఇండిపెండెంట్లు గెలుపొందడం విశేషం. - మేకల కల్యాణ్ చక్రవర్తి -
బీఆర్ఎస్.. పట్టు బిగించేందుకు.. కాంగ్రెస్.. పాగా వేసేందుకు...
మెతుకుసీమ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి పట్టు నిలుపుకునేందుకు అధికార బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా ముందుకెళుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఉనికిని చాటుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ దూకుడు... ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా పేరుంది. ఈఎన్నికల్లో కూడా జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలనే తపనతో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. 2018 ఎన్నికల్లో ఒక్క సంగారెడ్డి మినహా, మిగిలిన తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి పదికి పది స్థానాలను గెలుచుకోవాలని పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది. ఒక్క నర్సాపూర్ మినహా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థిత్వాలను ప్రకటించింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అభ్యర్థులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లారు. ఒకటికి రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఇతర పార్టీల నుంచి భారీ చేరికలతో బీఆర్ఎస్ హవా కొనసాగుతోందనే సంకేతాలను క్షేత్రస్థాయికి పంపారు. ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తూ పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. చేరికలతో పకడ్బందీగా కాంగ్రెస్.. ఉమ్మడి మెదక్‌లో పాగా వేసేందుకు హస్తం పార్టీ పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా లో సంగారెడ్డిని మాత్రమే కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగలిగింది. ఇక్కడ జగ్గారెడ్డి విజయం సాధించారు. ఈసారి జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్, ఆయన కుమారుడు రోహిత్‌కు మెదక్ అభ్యర్థిత్వం ఖరారు చేసింది. అలాగే బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్‌కు గాలం వేసిన కాంగ్రెస్.. ఆయనకు జహీరాబాద్ టికెట్ ప్రకటించింది. కాంగ్రెస్ ముఖ్యనేతలు దామోదర రాజనర్సింహ ఆందోల్ నుంచి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి నుంచి బరిలోకి దిగారు. మిగిలిన నియోజకవర్గాల అభ్యర్థిత్వాలపై తకరారు కొనసాగుతోంది. బరిలో అగ్రనేతలు.. గజ్వేల్ నుంచి సీఎం కె.చంద్రశేఖర్‌రావు, సిద్దిపేట నుంచి రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అందోల్ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితర అగ్రనేతలు ఈసారి కూడా బరిలోకి దిగుతున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి మూడోసారి పోటీ చేస్తుండగా, ఈసారి ఆయన ఈ స్థానంతో పాటు, కామారెడ్డి నుంచి కూడా బరిలో నిలుస్తున్నారు. ♦ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సాధిస్తున్న మంత్రి హరీశ్‌రావు ఈసారి కూడా ఇదే హవాను కొనసాగించేలా ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో భారీగా 1.18 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన మంత్రి హరీశ్‌రావు ఈసారి అంతకు మించి మెజారిటీ సాధిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఇక వరుసగా రెండు పర్యాయాలు ఓటమిని చవిచూస్తున్న దామోదర్ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ♦ ప్రచార శంఖారావం ఇక్కడి నుంచే.. సెంటిమెంట్ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ బహిరంగసభతోనే ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. బలమైన నేతల కోసం బీజేపీ ఎదురుచూపులు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కమలం పార్టీ ఈ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. దీంతో పలుచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఆశించి., భంగపడిన నాయకులకు బీజేపీ గాలం వేస్తోంది. వారిని పార్టీలో చేర్చుకుని అభ్యర్థులుగా బరిలోకి దింపేందుకు వ్యూహాలను రచిస్తోంది. సీపీఐ హుస్నాబాద్ అడిగినా.. కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తుపై జాతీయ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. పొత్తులో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీపీఐ అడిగింది. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ అసెంబ్లీ సెగ్మెంట్ సీపీఐకి కేటాయిస్తారా, కాంగ్రెస్ పోటీలో ఉంటుందా చూడాలి. బీఆర్ఎస్ది అభివృద్ధి నినాదం.. ♦ సిద్దిపేట సర్వతోముఖాభివృద్ధి ♦ మెదక్‌కు రైలుమార్గం, మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు. ♦ సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం విపక్షాల ప్రచార అస్త్రాలు ♦ దళితబ0ధు అమలులో అవినీతి అక్రమాలు. ♦ బీసీబంధు, మైనార్టీబంధు అందరికీ అందకపోవడం. ♦ అందోల్ ప్రాంతంలో అధ్వానంగా రహదారులు. ♦ బీఆర్ఎస్ నేతలపై భూకబ్జాల ఆరోపణలు, అవినీతి అక్రమాలు. ♦ విచ్చలవిడిగా సాగిన అక్రమ మైనింగ్ సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. జహీరాబాద్‌లో మైనార్టీల ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణఖేడ్‌లో ఎస్టీలు, మిగతా చోట్ల ఎస్సీలు, బీసీల ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ముదిరాజ్‌లు, లింగాయత్, పద్మశాలి, గౌడ్ వంటి సామాజికవర్గాలు జిల్లాలో అధికంగా ఉన్నారు. ఏడాదికో ఉపఎన్నిక మంచిర్యాల డెస్క్: 2018లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన పరిణామాలతో ఏడాదికో ఉపఎన్నిక అనివార్యమైంది. 2019లో..: హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. దీంతో ఉప ఎన్నిక జరగ్గా, ఆయన భార్య పద్మావతిరెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉండగా, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. 2020లో..: దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మరణించడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన భార్య సుజాత పోటీ చేయగా, ఆమెపై బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. 2021లో..: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించగా, జరిగిన ఉపఎన్నికలో ఆయన కుమారుడు భగత్ టీఆర్ఎస్ నుంచే పోటీ చేసి, జానారెడ్డిపై గెలిచారు. 2021లో..: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై బీజేపీ నుంచి పోటీ చేసి ఈటల గెలిచారు. 2022లో..: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నికరాగా, ఆయనపై బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలిచారు. ♦ ఇక 2023 నవంబర్ 30న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. - పాత బాలప్రసాద్ -
సర్దుకుపోదాం..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో వామపక్షాలు సర్దుకుపోయే ధోరణిలో ఉన్నట్టు కన్పి స్తున్నాయి. రెండేసి చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకున్న సీపీఐ, సీపీఎంల్లో తాము పోటీ చేసే స్థానాల విషయంలో మాత్రం కొంత గందరగోళం నెలకొని ఉంది. కొత్తగూడెం, మునుగోడు స్థానా లను సీపీఐ కోరగా, కాంగ్రెస్ కొత్తగూడెం, చెన్నూ రు స్థానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ తమకు మునుగోడే కావాలని ఇప్పటివరకు పట్టు బడుతున్న సీపీఐ తాజాగా కాస్త మెత్తబడుతున్నట్టు తెలిసింది. అవకాశం ఉంటే మునుగోడు ఇవ్వాలని, లేనిపక్షంలో చెన్నూరు బరిలో దిగుతామంటూ సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. ఇక సీపీఎం మిర్యా లగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానా లు ఇవ్వాలని కోరింది. అయితే భద్రాచలంలో ఇప్ప టికే తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. మిర్యాల గూడ స్థానానికి మాత్రం సరే అంది. కానీ పాలేరు విషయంలోనే ఎటూ తేలడం లేదని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. పాలేరు సీటు ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంకో సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదో ఒక సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుబడుతుండటంతో అనూహ్యంగా ఇప్పుడు ఆ జిల్లాలోని వైరా రిజర్వుడు స్థానం తెరపైకి వచ్చింది. వైరా నియో జకవర్గంలో సీపీఎంకు మంచి పట్టుంది. కాబట్టి పాలేరు సాధ్యం కాకుంటే వైరాను అడగాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ వైరాలో కాంగ్రెస్ అభ్యర్థినే బరిలో దింపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పట్టదలతో ఉన్నట్టు తెలిసింది. దీంతో వైరా కూడా ఎంతవరకు ముడిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వామపక్షాల అసహనం! కాంగ్రెస్‌తో పొత్తు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవ డంతో సీపీఐ, సీపీఎం నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినా ఇంకా పని చేసుకోండంటూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లపై కూడా అను మానాలున్నాయా అనే సందేహాలు ఆ పార్టీ కార్య కర్తల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీపీఎంకు మిర్యాలగూడ ఖరారు చేసినా.. ఆ సీటు విషయంలోనూ పూర్తిగా భరోసా ఇవ్వలేదని ఆ పార్టీ చెబుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఎక్కడ పోటీలో ఉంటామో స్పష్టత లేకపోవడంతో వామపక్షాల నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రచారానికి తగిన సమయం ఉండదని అంటున్నాయి. అంతేకాదు పొత్తులపై తమ కేడర్‌కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నా మని చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపోతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. బీఎల్ఎఫ్ రెండో జాబితా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ఆ పార్టీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులను బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకా‹శ్ ప్రకటించారు. ఇల్లెందు బరిలో గుమ్మడి అనురాధ గతంలో ఇల్లెందు నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అనురాధ ఉస్మానియా లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తనకు న్యూడెమొక్రసీ, ప్రజాపంథా సహా పలు సీపీఐ (ఎంఎల్) పార్టీల మద్దతు ఉన్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే బలమైన తండ్రి వారస త్వం ఆమెకు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
1,000 నుంచి 5,000 ఓట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్షాలు ఎన్నికల రణరంగంలో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. అయితే పొత్తు, సీట్ల వ్యవహారంపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఒప్పందం జరగలేదని సీపీఐ చెపుతోంది. కాగా, రాష్ట్రంలో తాము అనేక అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలమని, ఇది కాంగ్రెస్‌కు కలసి వస్తుందని సీపీఐ, సీపీఎం నేతలు చెబుతున్నారు. తమ ఓట్లతో బీఆర్ఎస్, బీజేపీలను మట్టికరిపించవచ్చనీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని లెఫ్ట్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము గెలిచే స్థితిలో లేకపోయినా, మిత్రులను గెలిపించడంలోనూ, శత్రువులను ఓడించడంలోనూ కీలకంగా ఉంటామని చెబుతున్నారు. దీంతో వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్‌కు కీలకంగా మారనుంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అధికంగా ఓట్లు : రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 30 స్థానాల్లో అంటే నాలుగోవంతు సెగ్మెంట్లలో తాము పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలమని సీపీఐ, సీపీఎంలు చెబుతున్నాయి. 30 స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పారీ్టలకు వెయ్యి నుంచి 5 వేల మధ్య ఓట్లు ఉంటాయని సీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అధిక స్థానాల్లో ఓట్లు ఉన్నాయంటున్నారు. ఇక 100 నుంచి వెయ్యి వరకు ఓట్లున్న స్థానాలు 60 వరకు ఉంటాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంలో అప్పుడు సీపీఎం తరఫున పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి 11 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. భద్రాచలంలో కూడా సీపీఎం నుంచి పోటీ చేసిన మిడియం బాబూరావుకు 14 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. సీపీఐకి కూడా కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు ఉన్నాయి. ఈ స్థాయి ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని, గెలుపు అవకాశాలను నిర్ణయిస్తాయని లెఫ్ట్ నేతలు అంటున్నారు. పొత్తు కుదిరిన పక్షంలో రాష్ట్రంలో తాము పోటీ చేసే స్థానాలతోపాటు, గణనీయంగా ఓట్లున్న 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కృషి చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే లెక్కలతో వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతోందని చర్చా సాగుతోంది. -
తేలని పొత్తులు.. కామ్రేడ్లతో కాంగ్రెస్ సర్దుబాటుపై సందిగ్ధం..
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎన్నికల కదన రంగంలో కలిసి నడుస్తామని ఆయా పార్టీల అగ్రనాయకులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీట్లపైనే పేచీ ఈ ఏడాది ఆరంభంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో అంటీముంటనట్టుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీకి ధీటుగా బదులిస్తున్న భారత రాష్ట్ర సమితితోనే ఎన్నికల్లో కలిసి నడుస్తామని నేరుగా ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇటు సీపీఐ, అటు సీపీఎం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కీలక సీట్ల కోసం పట్టుబట్టాయి. ముఖ్యంగా కొత్తగూడెం, వైరా సీట్లను సీసీఐ.. పాలేరు, భద్రాచలం సీట్లను సీపీఎం కోరాయి. ఈ అంశంపై నాలుగైదు దఫాలుగా ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్షంగా దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తు ప్రస్థావన అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్‌తో కలిసి.. ఎన్నికల పొత్తుపై మాట వరుసకై నా చెప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం కమ్యూనిస్టు పార్టీలకు మింగుడు పడలేదు. దీంతో అనివార్యంగా కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందించాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కమ్యూనిస్టు నేతలు ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపారు. పై స్థాయిలో చర్చలు జరుగుతుండటంతో పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్థానిక హస్తం నేతలు ప్రకటించారు. అయితే పొత్తులపై ఎంతకీ స్పష్టత రావడం లేదు. మరోవైపు రోజులు గడుస్తున్న కొద్దీ ఆశావహులు సైతం తమ వంతు ప్రయత్నంగా టికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఏకై క జనరల్ స్థానంగా ఉన్న కొత్తగూడెం నుంచి హస్తం పార్టీ తరఫున పోటీ ఎక్కువగా ఉంది. కొత్తగూడెంపై పట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో జాతీయ స్థాయిలో పార్టీ పరంగా మంతనాలు సాగిస్తున్నారు. కొత్తగూడెంలో సీపీఐకి గతంలో ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటూ పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన ఉంటే కొత్తగూడెం నుంచి సీపీఐ బరిలో ఉండాల్సిందేనని ఖరాఖండీగా చెబుతున్నారు. దీంతో కూనంనేని పట్టుదల కాంగ్రెస్ నేతల్లో కలవరపాటు కలిగిస్తోంది. టికెట్‌పై ఆశతో.. కొత్తగూడెం సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తాను పోటీ చేయబోయే స్థానాన్ని పార్టీ పెద్దలు నిర్ణయిస్తారంటూ పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు బీసీ వర్గాల నుంచి ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణ ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు నాగ సీతారామలు సైతం గడపగడపకూ తిరుగుతూనే ఢిల్లీ–కొత్తగూడెం మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఇలా నేతలంతా పోటీ కోసం రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. హస్తం ఉండాల్సిందే కొత్తగూడెం సీటును కమ్యూనిస్టులకు కేటాయించారంటూ జోరుగా ప్రచారం జరగడం కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో ఎవరికి వారు తమ గాడ్ఫాదర్లకు ఫోన్లు చేసి పొత్తుల చిక్కులపై వాకబు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు పొత్తు కారణంగా అన్యాయం జరగకుండా చూడాలంటూ విన్నవించుకున్నారు. పొత్తు విషయంలో ముందుగానే ఓ స్పష్టత ఇస్తే బాగుండేదని, ఎంతకీ తేల్చక పోవడం వల్ల తాము ఈ సీటుపై నమ్మకం పెట్టకుని పని చేస్తున్నామని టికెట్ ఆశిస్తున్న నేతలు అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ హై కమాండ్‌కు ఎదురు సమాధానం చెబితే అసలుకే ఎసరు వస్తుందనే భయం కూడా లేకపోలేదు. దీంతో నేరుగా నేతలు బటయకు రాకుండా తమ అనుచరులు, మద్దతుదారులతో ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో ఉంటుందంటూ ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఉండాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
లెఫ్ట్‌తో పొత్తు ఇంకా ఖరారు కాలేదు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వామపక్షాలకు మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందన్న వార్తల్లో వాస్తవం లేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సోమవారం విస్తృత ప్రచారం జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఈ పొత్తు కుదిరిందని, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం, సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం నియోజకవర్గాలను కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాన్ని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సున్నితంగా తోసిపుచ్చారు. వామపక్షాలతో పొత్తు చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించినట్లు జరిగిన ప్రచారం కేవలం ఊహాగానమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం త్వర లోనే అధికారికంగా ప్రకటిస్తుందని, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై పార్టీ శ్రేణులు ఆందోళనకు గురికావద్దని సోమవారం ఆయన వెల్లడించారు. కాగా, వామపక్షాలు అడుగుతున్న నియోజకవర్గా లకు సంబంధించిన సమాచారాన్ని టీపీ సీసీ, అధిష్టానికి పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల ఒకటో తేదీన సమావేశమై ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేస్తా మని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పినా.. అలాంటి సమావేశం ఏదీ జరగకపోగా, చెరో రెండు స్థానాలు ఖరారైనా ఏయే నియోజకవర్గాలన్న అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్తో ఇప్పుడు కాంగ్రెస్‌తో.. ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కీలకంగా ఉన్నాయి. తెలంగాణలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి బ్రేక్ వేసేందుకు ఆనాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో వామపక్షాలు చేతులు కలిపాయి. ఆ ఎన్నికలో బీజేపీ గెలవకుండా అడ్డుకోవడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో కలసి సాగాలని లెఫ్ట్ పార్టిలు భావించాయి. కానీ వివిధ రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీని, బీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే పలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలోనే జాతీయ నేతల భేటీ.. తెలంగాణలో పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు గతంలోనే భేటీ అయినట్లు తెలంగాణ లెఫ్ట్ నేతలు వెల్లడించారు. మూడు జాతీయ పార్టిల అధినేతలు తెలంగాణలో పొత్తుకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారని చెపుతున్నారు. పొత్తుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా పార్టిల రాష్ట్ర నేతలకు అగ్ర నాయకత్వాలు సూచించాయని సమాచారం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలసి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, కమ్యూనిస్టులు కోరుతున్న స్థానాల్లోని కాంగ్రెస్ ఆశావహుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న ఆందోళన హస్తం నేతల్లో నెలకొని ఉంది. -
సీపీఐ, సీపీఎంతో సీట్ల పంపకంపై టీ.కాంగ్రెస్ కీలక నిర్ణయం
-
ఉమ్మడిగా వామపక్షాల పోటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశాన్ని తేల్చేందుకు వచ్చే నెల ఒకటో తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, హేమంత్ కుమార్ తదితరులు ఈ భేటీలో పాల్గన్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. బీజేపీకి సహకరించేలా సీఎం కేసీఆర్ ఆలోచనలు: తమ్మినేని వీరభద్రం కేంద్రంలో బీజేపీకి సహకరించే విధంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా కొత్త ఫ్రంట్ తెరిచారని విమర్శించారు. కమ్యూనిస్టు పారీ్టలు బీజేపీ ఓటమి కోసమే పనిచేస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని, ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా పోటీచేస్తూ.. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తోందని ఆరోపించారు. మహిళలను ఉద్ధరించే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని, ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లు తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రాలేదు: కూనంనేని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చించలేదని, అయితే ఆ పార్టీతో పొత్తు వద్దనే ఆలోచన తమకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని.. సీట్ల పంపకంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మజ్లిస్‌తో కేసీఆర్‌కు మొదటి నుంచీ సఖ్యత ఉందని.. సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో మజ్లిస్, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీ ఆరితేరిందన్నారు. రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించ డం ఏమిటని నిలదీశారు. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చే కుట్ర ఇది అని మండిపడ్డారు. -
సీపీఐ, జనసేనపై మల్లాది విష్ణు సీరియస్ కామెంట్స్
సాక్షి, విజయవాడ: సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు, పవన్‌పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తొత్తులా సీపీఐ రామకృష్ణ వ్యవహరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని ఎద్దేవా చేశారు. అలాగే, బాలకృష్ణ, పవన్ నోరు అదుపులో పెట్టకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి చేసిన చంద్రబాబును సీపీఐ సమర్థిస్తోంది. చంద్రబాబుకు తొత్తులా రామకృష్ణ వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు చేసిన స్కాంలు పవన్‌కు కనబడట్లేదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం 12 నుంచి 6 శాతానికి తగ్గింది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. జనసేన సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు అత్యుత్సహం ఎక్కువైంది. దత్త తండ్రి అరెస్ట్‌ను పవన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అవినీతి చేసిన వ్యక్తిని సపోర్టు చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్, బాలకృష్ణకు కూడా వాటా ఉందా?. చంద్రబాబు ఒక ఆర్థిక నేరస్థుడు. పవన్‌కు భయం పట్టుకుంది. అందుకే ఈరోజు జైలుకి వెళ్లాడు. పవన్ బీజేపీతో వివాహం.. టీడీపీతో కాపురం చేస్తున్నాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: మాకొద్దు ‘బాబు’ వర్రీ.. మాకెందుకు ఈ కొరివి! -
లెఫ్ట్ పార్టీలకు ఏమైంది?
-
హోం గార్డులను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి: సీపీఐ నేతలు
-
పొత్తు సరే.. సీట్ల మాటేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తుకు మార్గం దాదాపుగా సుగమమైంది. మునుగోడులో వామపక్షాలతో జతగట్టినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకే బీఆర్ఎస్ మొగ్గుచూపింది. బీఆర్ఎస్తో బ్రేకప్ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేశాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతో జరిపిన సంప్రదింపులు దాదాపు సక్సెస్ అయినట్లేననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏఐసీసీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో వామపక్షాలు సైతం భాగస్వాములుగా ఉండడంతో రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై సానుకూలతకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అయితే తమకు కేటాయించే సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈ విషయంలో మరింత ముందుకెళ్లాలనే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొత్తు, సీట్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. చెరో ఐదు సీట్లు ఇవ్వండి పొత్తుకు కాంగ్రెస్ ప్రాథమికంగా సమ్మతించినప్పటికీ సీట్ల విషయాన్ని తేల్చలేదు. అయితే సీపీఐ, సీపీఎంలు చెరో ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ వద్ద ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. సీపీఐ నేత నారాయణ తాము ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నట్లు సమాచారం. అయితే తాము అత్యంత బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను కేటాయించడాన్ని కాంగ్రెస్ కొంత ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. సీపీఎం సైతం ఐదు సీట్లలో పోటీ చేస్తామంటోంది. భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు, ఈ మేరకు ఠాక్రేతో ఫోన్లో సీపీఎం నేతలు మాట్లాడినట్లు తెలిసింది. కాగా సీట్ల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే చర్చలు కొనసాగించాలని వామపక్ష పార్టీలు నిర్ణయానికి వచ్చాయని సమాచారం. కాంగ్రెస్ తర్జనభర్జన! వామపక్ష పార్టీల ప్రతిపాదనల నేపథ్యంలో.. వారికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయిలో నాయకత్వం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాల వారీగా కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
చెరొక్కటి మాత్రమే..!
-
హైదరాబాద్ లో సీపీఐ నేతల సమావేశం
-
నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వరం ఎలా మార్చివేయగలరో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. ఆయన ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ప్రత్యేక హోదా అంశంపైనే విబేధించామని చెప్పారు. పొత్తులు ఎలా ఉంటాయో చెప్పలేనంటూనే బీజేపీకి ఆయన పంపుతున్న సంకేతాన్ని జనం అర్థం చేసుకోలేరా?. బీజేపీని, ప్రధాని మోదీని 2019 ఎన్నికలకు ముందు ఎన్ని తిట్లు తిట్టింది ప్రజలు మర్చిపోయారని ఆయన భావించవచ్చు. గతంలో.. అంటే సోషల్ మీడియా లేని రోజుల్లో ఆయన ఏమి చెప్పినా, అనతికాలంలోనే మర్చిపోతారులే అని అనుకునేవారు. అది ఆయనకు కొంత కలిసి వచ్చేది. ఎన్నిసార్లు మాట మార్చినా ఆయనకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కాని ఇప్పుడు కాలం మారింది. చంద్రబాబు నాయుడు ఏదైనా కొత్త స్టేట్ మెంట్ ఇచ్చిన నిమిషాలు.. గంటల్లోనే ఆయన గతంలో అదే సబ్జెక్ట్‌కు సంబంధించి ఏమి అన్నారో తెలిపే వీడియోలు ప్రత్యక్షం అవుతున్నాయి. అలాగే ఇప్పుడు చంద్రబాబు బీజేపీని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కావిస్తున్న విన్యాసాలు.. సన్నాయి నొక్కులు బయటకు రాగానే, గతంలో ఇదే బీజేపీని.. ఇదే ప్రధాని మోదీని ఎంత తీవ్రంగా దూషించింది వివరించే వీడియోలు వచ్చేశాయి. దాంతో చంద్రబాబు అసలు స్వరూపం ఇదా! అనే చర్చ జరుగుతోంది. ✍️ 2017లో చంద్రబాబు ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పి, మోదీ ప్రభుత్వం నుంచి తన మంత్రులను కూడా విత్ డ్రా చేసుకున్నారు. అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా అంశంపై తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి ప్రజలలోకి రావడంతో చంద్రబాబు తన వైఖరి మార్చుకుని.. తాను కూడా ప్రత్యేక హోదా అనుకూలమని ప్రకటించి ఎన్టీయే నుంచి వైదొలిగారు. అంతకు ముందు అసలు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీనే కావాలని చంద్రబాబు వాదించేవారు. ప్రత్యేక హోదా జనంలో సెంటిమెంట్ గా మారిందని భయపడడం, అదే తరుణంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని, మోదీ ప్రభుత్వం తిరిగి రాకపోవచ్చనే అభిప్రాయం ఆయనలో ఏర్పడింది. దాంతో తనవల్లే మోదీ ప్రభుత్వం పడిపోయిందని పేరు తెచ్చుకోవాలని ఆయన NDA వ్యతిరేక పక్షాల నేతలను కలిసి రాజకీయ చర్చలు జరిపి ఒక కూటమి కట్టడానికి కాస్త చొరవ తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వంటివారితో చర్చలు జరిపారు. తెలంగాణ ఎన్నికల సమయానికి ఏకంగా కాంగ్రెస్‌తో జట్టు కట్టి శాసనసభ ఎన్నికలలో పోటీచేశారు. కానీ.. ఫలితం దక్కలేదు. అది వేరే సంగతి. అప్పట్లో.. కేంద్రానికి సహకరించే పార్టీలను బహిష్కరించాలన్నంతవరకు స్టేట్ మెంట్లు ఇచ్చేవారు చంద్రబాబు. అటు కేసీఆర్, ఇటు వైఎస్ జగన్‌లు మోదీకి దత్తపుత్రులని వ్యాఖ్యానించేవారు. అంతవరకు తాను మోదీతో జతలో ఉన్నప్పటికీ, దానిని కప్పిపుచ్చి ఈ పార్టీలపై ఆరోపణలు చేస్తుండేవారు. మోదీ, ఏపీకి తీరని నష్టం చేశారని.. దేశాన్ని నాశనం చేశారని.. ఇంత అవినీతిపరుడు లేడని చంద్రబాబు అనేక ఆరోపణలు చేశారు. అంతేకాక తనకు కుటుంబం ఉందని, మోదీకి కుటుంబం లేదని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇప్పుడేమో.. మోదీ దేశం కోసం పనిచేస్తున్నారని, విదేశీవిధానం గొప్పగా ఉందని, బీజేపీతో విబేధాలు లేవని చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన గూటిలోకి దాదాపు చేర్చుకున్న చంద్రబాబు.. ఎలాగైనా బీజేపీని కూడా తన ట్రాప్‌లోకి లాగాలని చూస్తున్నారు. పవన్ ద్వారా రాయబారం చేసినా ఫలితం లేకపోవడంతో ఆయనే స్వయంగా అమిత్ షాను కలిసి వచ్చారు. అయినా ఆశించిన విధంగా జరగలేదు. దాంతో ఆయన తన ప్రయత్నాలు వదలిపెట్టకుండా.. దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా జేపీ నడ్డాతో రాయబారం జరిపారు. ఈ పరిణామం ప్రభావం ఎలా ఉంటుందన్నది అప్పుడే చెప్పలేం. కానీ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు చంద్రబాబు చేసిన పరాభవాన్ని బీజేపీ మర్చిపోతే తప్ప.. టీడీపీతో పొత్తుకు అవకాశం లేదనే చెప్పాలి. నిజంగానే చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో విడిపోయి ఉంటే, ఇప్పటికీ ఆ అంశాన్ని బీజేపీ పరిష్కరించలేదు. పైగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి నో చెప్పింది. అయినా ఇప్పుడు టీడీపీ ఎందుకు స్నేహం కోసం ఆ పార్టీ వెంటబడుతోంది. ✍️ పనిలో పని దేశాన్ని నడపడానికి విధానాలు రూపొందించామని, ఇప్పుడు 2047 పేరుతో విజన్ తయారు చేశామని ఆయన అంటున్నారు. తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం కూడా తెలివైన పనే అని అంటారు. ఆ విషయంలో చంద్రబాబు దిట్ట అని చెప్పాలి. ఇప్పుడు అదే ప్రకారం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయా?లేదా?అన్నది చెప్పలేం. మరో విశేషం ఏమిటంటే చంద్రబాబు బీజేపీ ప్రాపకం కోసం పాటులాడుతుంటే.. చంద్రబాబు చొక్కా పట్టుకుని తిరగాలని సీపీఐ ఆలోచిస్తోంది. చంద్రబాబు బృందం ఆయన భజంత్రి మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి తెలంగాణలో తెలుగుదేశం పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, ఏపీలో పొత్తుకు ఓకే అనాలని టీడీపీ భావిస్తోందని ప్రచారం చేశాయి. కానీ.. తెలంగాణ బీజేపీ నిర్దద్వందంగా టీడీపీతో తమ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తెలంగాణలో ఒంటరిగానే పోటీచేస్తామని చెబుతున్నారు. అది ఉత్తుత్తిపోటీగానే మిగిలిపోనుందన్నది తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ పొత్తు కుదురుతుందా?లేదా?అన్నది సందిగ్దంగా మారింది. ✍️ కాగా టీడీపీ, జనసేన, సీపీఐ పక్షాలు కలిసి కూటమి కట్టాలని సీపీఐ నాయకులు కోరుకుంటున్నారు. సీపీఐ నేత నారాయణ కాని మరికొందరు నేతలు కాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమతో స్నేహం చేసినప్పుడు ఆయనను పోరాట యోధుడుగాను.. బీజేపీని ఎదుర్కునే ధీరుడుగాను ప్రశంసిస్తూ ప్రచారం చేశారు. కాని ఇప్పుడు జనరల్ ఎన్నికలలో కేసీఆర్ వారికి సీట్లు కేటాయించకపోవడంతో.. మోదీకి లొంగిపోయారని విమర్శిస్తున్నారు. కేసీఆర్, జగన్‌లు మోదీకి మద్దతుదారులని సీపీఐ నేత నారాయణ అంటున్నారు. విశేషం ఏమిటంటే తనపై వచ్చిన ఆదాయపన్ను కేసులో ఇబ్బంది రాకుండా ఉండడానికి బీజేపీతో పొత్తుకు అర్రులు చాస్తూ చంద్రబాబు.. ఢిల్లీలో తంటాలు పడుతుంటే.. ఆయన్ని మాత్రం నారాయణ ఏమి అనకపోవడం విశేషం. అంటే చంద్రబాబుతో బీజేపీ పొత్తు పెట్టుకోదని.. అప్పుడు తాము కలవొచ్చని.. ఏదైనా ఒకటి,రెండు సీట్లు సంపాదించడానికి ఇదో అవకాశమని సీపీఐ నేతలు కొందరు భావిస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ‘అచ్చం తెలుగుదేశం’ భాషలోనే విమర్శలు చేస్తూ పర్యటన సాగిస్తున్నారు. చివరికి సీపీఐ ఇంత దయనీయంగా మారిపోవడం చారిత్రక విషాదం అనుకోవాలా! :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘కాంగ్రెస్‌తో పొత్తు నిశ్చితార్థం దశలో ఉంది’
సాక్షి, ఢిల్లీ: పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, క్రామేడ్ల కూటమి నిశ్చితార్థం స్టేజ్‌లో ఉందంటూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఎంఐఎంతో కలిసి కేసీఆర్ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తారట. కేసీఆర్ నుంచి మేం ఇంకొంచెం ముందు బయటపడాలి. తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ కూటమిగా కలిస్తే కేసీఆర్‌కు డిపాజిట్లు రావు’’ అని పేర్కొన్నారు. బీజేపీ ఊగిసలాట నుంచి చంద్రబాబు బయటపడాలి. ఏపీలో ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బెటర్’’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు. కాగా, బీఆర్ఎస్తో బ్రేకప్ తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాయబారం మొదలుపెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో జత కట్టాలని భావిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఓ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు ఉండటం, ఇతర జిల్లాల్లోనూ అనేక చోట్ల ప్రభావితం చేయగలిగే పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తుకు సిద్ధం కావాలని యోచిస్తోంది. చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం -
Telangana: కామ్రేడ్స్‌తో కాంగ్రెస్ దోస్తీ!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్తో బ్రేకప్ తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పార్టీ రాయబారం మొదలుపెట్టింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో జత కట్టాలని భావిస్తోంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఓ స్థాయిలో కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు ఉండటం, ఇతర జిల్లాల్లోనూ అనేక చోట్ల ప్రభావితం చేయగలిగే పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐ, సీపీఎంలతో పొత్తుకు సిద్ధం కావాలని యోచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావుఠాక్రే కమ్యూనిస్టులతో మధ్యవర్తిత్వం మొదలుపెట్టారు.హైదరాబాద్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డితో సమావేశమయ్యారు. ‘బీజేపీని ఓడించాలన్న కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తాము సిద్ధం. అందుకోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా ఉన్నారు. అయితే మాకు గౌరవప్రదంగా సీట్లు కేటాయిస్తే జత కడతామని’సీపీఐ నేతలు అన్నట్లు తెలిసింది. కాగా త్వరలోనే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. సాగదీత ధోరణి వద్దని చెప్పాం: కూనంనేని ఈ విషయంపై కూనంనేని మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌తో పొత్తుపై మాణిక్‌రావు ఠాక్రేతో చర్చలు జరిగాయి. సానుకూల వాతావరణంలో మేం మాట్లాడుకున్నాం. పొత్తుల విషయంలో సాగదీత ధోరణి వద్దని స్పష్టం చేశాం. ఒకట్రెండు సార్లు చర్చలతోనే అన్నీ జరిగిపోవాలి. అంతేగానీ బీఆర్ఎస్ వలె ఒకటిస్తాం... రెండిస్తాం అన్న ధోరణితో ఉంటే అసలు చర్చలే అవసరంలేదని మధ్యవర్తితో చెప్పాం. అన్నీ సక్రమంగా జరిగితే పొత్తుకు ముందుకు వస్తాం. గౌరవ ప్రదంగా సీట్లు కేటాయించకుండా సాగదీత ధోరణితో వ్యవహరిస్తే మా దారి మేం చూసుకుంటామ’ని చెప్పామన్నారు. మరోవైపు సీపీఎం నేతలతోనూ ఠాక్రే రాయబారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నందున ఎప్పుడు చర్చలు జరుగుతాయో చూడాలి. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కీలకంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో కమ్యూనిస్టులతో పొత్తుతో ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసినట్టు సమాచారం. బీఆర్ఎస్ పునరాలోచన...? బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా తన అభ్యర్థులను ప్రకటించడంతో కమ్యూనిస్టులు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులను ఉపయోగించుకొని వదిలేశారని, మోసం చేశారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం, మరోవైపు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు వెళ్తే నష్టం జరుగుతుందన్న అంచనాకు రావడం తదితర కారణాలతో బీఆర్ఎస్ పునరాలోచనలో పడినట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన ఒక నేత కమ్యూనిస్టులతో మళ్లీ రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ‘జరిగిందేదో జరిగింది. మనం మళ్లీ పొత్తు పెట్టుకుందాం. తొందపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే ఇప్పటికిప్పుడు చెరో ఎమ్మెల్సీ స్థానం ఇస్తాం. అందుకోసం ప్రస్తుతమున్న ఎమ్మెల్సీలను రాజీనామా చేయిస్తాం. అసెంబ్లీ సీట్లపైనా ఒక అవగాహనకు వద్దాం’అన్నట్లు తెలిసింది. కానీ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. మరి చివరి వరకు కమ్యూనిస్టులు అదే పట్టు కొనసాగిస్తారా.. ఎన్నికల నాటికి వారి పొత్తు ఎటువైపు దారితీస్తుందో చూడాలి.! -
అవసరం తీరగానే వదిలేస్తారా?.. కేసీఆర్‌పై కూనంనేని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్తో లెఫ్ట్ పార్టీల పొత్తు బ్రేకప్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వైఖరి దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ద్రోహం చేశారని మండిపడ్డారు. పొత్తు వీగినందుకు కేసీఆర్‌పై లెఫ్ట్ పార్టీల రాష్ట్ర నాయకులు పోటీ చేయాలని డిమాండ్ వచ్చిందన్న కూనంనేని.. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లిలో బలపైన పోటీ కచ్చితంగా ఉంటుందన్నారు. అది తెలిసీ ఎందుకు ప్రపోజల్ పెట్టారు? కంటివెలుగు, మునుగోడు సభకు పిలిచి మిత్రధర్మం పాటించారట.. లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉండి మిత్రధర్మం తప్పామట అంటూ బీఆర్ఎస్పై కూనంనేని మండిపడ్డారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని కేసీఆర్‌కు ముందే తెలుసన్నారు. కూటమిలో ఉన్న విషయం తెలిసి కూడా ఒక సీటు ఇస్తామని, రెండు ఎమ్మెల్సీ ఇస్తామని ఎందుకు ప్రపోజల్ పెట్టారని ప్రశ్నించారు. ఏ రాజకీయం అయినా కొంతకాలమే నడుస్తుందన్నారు. కేసీఆర్ మిత్రధర్మం తప్పింది వాస్తవా కాదా? 2004లో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఎందుకు కూటమి కట్టారని నిలదీశారు. ఆ సమయంలో కూటమిలో ఉంటూనే చాడ పోటీ చేసే స్థానంలో మరో వ్యక్తిని కేసీఆర్ పోటీలో పెట్టారని గుర్తు చేసిన కూనంనేని.. అప్పుడు మిత్రధర్మం తప్పినట్లు కాదా? అని ప్రశ్నించారు. 2009లో టీడీపీతో పొత్తులో ఉంటూ మిత్రధర్మం మళ్ళీ తప్పి సీపీఐ పోటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ పెట్టారని ప్రస్తావించారు. 2004, 2009లో కేసీఆర్ ఉమ్మడి పోత్తులో ఉండి మిత్రధర్మం తప్పింది వాస్తవం కాదా ప్రశ్నించారు. చదవండి: కేసీఆర్ నేర్పించిన విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నా.. రాజకీయాలు కావాలి.. రాజకీయ విలువలు కాదు ‘అవసరం వస్తే మా దగ్గరికి వస్తారు.. అవసరం తీరిపోగానే వదిలేస్తారా?. కేసీఆర్‌కు రాజకీయాలు మాత్రమే కావాలి.. రాజకీయ విలువలు కాదు. రాజకీయ శవాలపై రాజసౌధం నిర్మించుకున్న నాయకుడు కేసీఆర్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లాంటి జిల్లాలో లెఫ్ట్ ప్రభావం ఉంటుందని, రాష్ట్రంలో 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ బలంగా ఉంది. భవిష్యత్తులో కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నాం. మరింత బలంగా మేము తయారు అవుతాం. సమరశిల పోరాటానికి శంఖారావం పూరిస్తాం. గ్రామగ్రామన ప్రభుత్వ వైఫల్యాలను ఖండిస్తాం సాయుధ పోరాటానికి పిలుపు సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆగస్ట్ 15, 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదు. తెలంగాణకు స్వాతంత్రం కోసం సెప్టెంబర్ 11న పోరాటానికి పిలుపునిస్తే 17న హైదరాబాద్‌ను ఇండియాలో కలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సువర్ణ అక్షరాలతో లికించాల్సినది పోయి...తప్పుగా చిత్రీకరించారు. తెలంగాణ పోరాటం అనేది సాయుధ పోరాటంతో నాంది పలికి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలిపారు. సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ కాంగ్రెస్ ద్రోహులు అని కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17పై కేసీఆర్ తన వైఖరి ఏంటో చెప్పాలి. సాయుధ పోరాటం వల్ల లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కింది. పోరాటంలో మరణించిన వాళ్ళు ముస్లింలు, హిందువులు ఉన్నారు. అసలు తెలంగాణ పోరాటం ఆనాడే పురుడుపోసుకొంది.సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపకపోతే అమరుల ఆశయాలను నిర్లక్ష్యం చేసినట్లే. సెప్టెంబర్ 11 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు జరుపుతున్నాం. సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ’ నిర్వహించనున్నట్లు కూనంనేని పేర్కొన్నారు. చదవండి: అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం.. -
కాంగ్రెస్ వైపు కామ్రేడ్ల చూపు
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించే సత్తా ఉన్న ఆ పార్టీతో జత కట్టాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు వికటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. పైగా దేశంలో ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ స్వయంగా ఆహా్వనిస్తేనే ముందుకు సాగాలని, అప్పటివరకు వేచి చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పొత్తుల విషయంలో ప్రజల్లో పలుచన కాకుండా హుందాగా ముందుకు సాగాలన్నది కమ్యూనిస్టుల అభిప్రాయం. బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని నిర్ణయం దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ఓటమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. మతోన్మాదం పెరుగుతున్నందున, బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీలు ఏవైనా సరే వాటితో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఆ ప్రకారమే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయి. గతేడాది మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేసే శక్తి బీఆర్ఎస్కే ఉందని భావించి ఆ పార్టీతో సీపీఐ, సీపీఎంలు జతకట్టాయి. అప్పుడు వాటి ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన సభలోనూ సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని తమ ఐక్యత చాటారు. కానీ కేసీఆర్ తమను మోసం చేశారని కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తుకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మావైపు రండి. మీరు అడిగినన్ని సీట్లు ఇస్తామని’గతంలో కాంగ్రెస్ నేతలు లెఫ్ట్ నేతలతో అన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని లెఫ్ట్ పార్టీలు పెడచెవిన పెట్టాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోకుంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, దీనివల్ల అధికార పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఏదిఏమైనా ఈసారి బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టాలని లెఫ్ట్ పార్టీలు యోచిస్తున్నాయి. ఇప్పుడు రెండే ప్రత్యామ్నాయాలు ఇప్పుడు కమ్యూనిస్టుల ముందున్నవి రెండే ప్రత్యామ్నాయాలు. ఒకటి కాంగ్రెస్‌తో కలిసి నడవడం, రెండోది వామపక్ష, ఇతర పార్టీలతో జతకట్టి ముందుకు సాగడం. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే చెరి ఐదు అసెంబ్లీ స్థానాలు తప్పక సాధించాలన్నది ఆ పార్టీల యోచన. గౌరవప్రదమైన స్థానాలను కేటాయించడంలో కాంగ్రెస్ విఫలమైతే, రెండు కమ్యూనిస్టు పార్టీలు చెరి 25 స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయి. బీజేపీని ఓడించడం తమకే కాదు ఆయా ప్రతిపక్షపార్టీలకు కూడా అవసరమేనంటున్నారు. తాము గెలవకపోయినా, ఓడించే సత్తా మాత్రం ఉందంటున్నారు. తమకంటే వారికే తీవ్రమైన నష్టమంటున్నారు. అధికారం కావాలంటే తమ అవసరం ఆయా పార్టీలకు ఉందంటున్నారు. ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కమ్యూనిస్టులు కృతనిశ్చయంతో ఉన్నారు. -
మా తడాఖా చూపిస్తాం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాజకీయం అంటేనే మోసమనే నిర్వచనం ఇచ్చారని, మిత్ర ధర్మాన్ని పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వామపక్షాలు మండిపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించాయి. ‘‘సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టంలేదు. నష్టపోయేది కేసీఆరే. బీజేపీతో బీఆర్ఎస్కు సఖ్యత ఏర్పడింది. బీజేపీ అండ ఉంటే చాలనుకుంటోంది. మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రమాదమని చెప్పారు. మరిప్పుడు బీజేపీ ప్రమాదం కాదా? మిత్రధర్మం పాటించరా? కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ ఏమయ్యేది? ఆ ఎన్నికల్లో కేసీఆరే మా అండ కోరారు. తర్వాత కూడా వామపక్షాలు మిత్రపక్షాలని చెప్పారు. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇది ఊహించని పరిణామం. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం’’ అని వామపక్షాల నేతలు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం, పొత్తు మాట ఇంకెక్కడిదని స్పష్టం చేయడంతో కంగుతిన్న సీపీఐ, సీపీఎం నేతలు.. మంగళవారం వేర్వేరుగా, తర్వాత ఉమ్మడిగా సమావేశమయ్యారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రెండు పార్టీలకు చెందిన నేతలు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, చెరుపల్లి సీతారాములు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయమేదీ తీసుకోలేదు..: కూనంనేని 15 రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలు వినోద్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావులతో పొత్తులపై చర్చ జరిగిందని.. తమకు చెరో అసెంబ్లీ సీటు (సీపీఐకి మునుగోడు, సీపీఎంకు భద్రాచలం), రెండేసి ఎమ్మెల్సీలు ఇస్తామన్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ విధమైన పొత్తుకు అంగీకరిస్తే, అప్పటికప్పుడే చెరో ఎమ్మెల్సీని గవర్నర్ కోటాలో ఇస్తామన్నారని.. ఎమ్మెల్సీ సంగతేమో కానీ, చెరో మూడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని అడిగామని వివరించారు. ‘‘ఇదే సమయంలో బీఆర్ఎస్ బృందం తమ రాజకీయ వైఖరిని కూడా బయటపెట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలసి ఉన్నాయని.. అలా ఉండటం తమకు ఇష్టంలేదని పేర్కొంది. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములకు బీఆర్ఎస్ వ్యతిరేకమని కేసీఆర్ మాకు స్పష్టం చేయాలన్నారని బృందం వివరించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను, బీజేపీని ఓడించడం కోసం కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్తాం..’’ అని కూనంనేని తెలిపారు కాంగ్రెస్‌తో పొత్తుపై తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వామపక్షాల సాయం లేకపోతే బీఆర్ఎస్ మునుగోడులో గెలిచేదా? అని ప్రశ్నించారు. బీజేపీ మునుగోడులో గెలిచి ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేవారు కాదా అని వ్యాఖ్యానించారు. రాజకీయ వైఖరిలో తేడా వల్లే..: తమ్మినేని మునుగోడులో బీజేపీని ఓడించటం కోసమే బీఆర్ఎస్తో కలిశామని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఏకంగా ఉండాలనేది తమ నిర్ణయమని తమ్మినేని వీరభద్రం వివరించారు. తాము అడిగినన్ని సీట్లు కేసీఆర్ ఇవ్వలేదనే ప్రచారం తప్పు అని, రాజకీయ వైఖరిలోనే తేడా వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ వైఖరిని తమకు వెల్లడించారన్నారు. ‘‘బీజేపీకి వ్యతిరేక నిర్ణయానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలో కలవద్దని బీఆర్ఎస్ నేతలు షరతు విధించారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ తమకు ప్రధాన రాజకీయ శత్రువు కాబట్టి అందులో ఉండబోమని చెప్పారు. ‘ఇండియా’ కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉన్నందువల్ల మాతో పొత్తు పెట్టుకోలేదని భావిస్తున్నాం. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి..’’ అని తమ్మినేని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పొత్తుపై తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, నేరుగా అభ్యర్థులను ప్రకటించడం సమంజసం కాదన్నారు. తమకు ఎమ్మెల్సీలు వద్దని, ఎమ్మెల్యే సీట్లు కావాలని అడిగామని, అదీ ఎక్కువ సీట్లేమీ అడగలేదని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఎక్కువ పోరాటాలు చేసింది తామేనని, కేసులు కూడా ఎక్కువగా తమపైనే ఉన్నాయని పేర్కొన్నారు. -
‘కమ్యూనిస్ట్‌లు అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాం’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ పదే పదే చెప్పారని, కానీ, ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారని వామపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అనంతరం వామ పక్ష నేతలు సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తమ్మినేని మాట్లాడుతూ.. ‘‘మునుగోడులో మద్ధతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. బీజేపీ దూకుడును నిలువరించాలన్నది అప్పుడు మా విధానం. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు బీఆర్ఎస్కు మద్ధతు ఇవ్వాల్సి వచ్చింది. లెఫ్ట్‌పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కేసీఆరే ప్రకటించారు. ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. మేం కోరిన సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదు. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని తమ్మినేని అన్నారు. మాతో చర్చలకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. ఇండియా కూటమిలో ఉండడం నచ్చలేదని చెప్పారు. ఎన్డీయేకు దూరంగా ఉంటామన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని పదే పదే కేసీఆరే స్వయంగా చెప్పారు. ఇప్పుడేమో ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. కేసీఆర్ రాజకీయ విధానంతో సమస్య వచ్చింది అని తమ్మినేని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేస్తుంది. ఎవరితో కలవాలనేది భవిష్యత్తులో నిర్ణయిస్తాం. మాతో కలిసి వచ్చేవారితో పని చేస్తాం. కమ్యూనిస్ట్‌లు అంటే ఏంటో అందరికీ తెలియజేస్తాం. నిర్ణయాత్మక పాత్ర రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో పోషిస్తాం. బీజేపీతో బీఆర్ఎస్కు ఎక్కడో మిత్రత్వం జరిగింది. బీజేపీకి దగ్గరైతే.. కేసీఆర్ మిత్ర ధర్మం పాటించరా. లెఫ్ట్లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచేదా?. మునుగోడులో బీజేపీ గెలిస్తే ఇవాళ ఇంతటి ప్రశాంత వాతావరణ ఉండేదా?. ఎంతటి బేరసారాలు జరిగాయో కేసీఆర్ మర్చిపోయారా? కేసీఆర్‌కు బీజేపీ అండదండలు ఉంటే చాలు అనుకుంటున్నారా? అని కూనంనేని మండిపడ్డారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగాల్సి ఉందని.. ఈ నెల 27 తర్వాత వామపక్ష పార్టీలు మరోసారి ఉమ్మడిగా భేటీ అవుతామని, ఆ తర్వాతే కార్యచరణ ప్రకటిస్తామని వామపక్ష నేతలు వెల్లడించారు. -
సీఎం కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు: కూనంనేని
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలను కలుపుకొని పోయిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారు. 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వామపక్షాలతో పొత్తు లేదనే విషయాన్ని సీఎం చెప్పకనే చెప్పేశారు. కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు లేదంటూ సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో నేడు(మంగళవారం) వామపక్షాలు కీలక సమావేశం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నాయి. సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసినా అన్ని చోట్లా పోటీచేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో పోటీ చేయని చోట కమ్యూనిస్టులు ఎవరికి మద్దతిస్తారని ఆసక్తిగా మారింది.మళ్లీ కాంగ్రెస్‌కు చేరువవుతారా దూరంగానే ఉంటారా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Telangana: చతుర్ముఖ వ్యూహంతో బీజేపీ.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమను అవసరానికి వాడుకున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఆయనకు కేసీఆర్‌కు అవసరం ఉంది కాబట్టి పిలిచారని.. అక్కడ బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని తెలిపారు. రాజకీయాల్లో మోసం చేసే వాళ్లు ఉంటారని, తాము బీఆర్ఎస్ను నమ్ముకొని లేమని పేర్కొన్నారు. ఎవరైనా కలిసొస్తే పోటీ చేస్తామని.. లేకుంటే ఒంటరిగా పోటీచేస్తామన్నారు. ‘సీపీఐ-సీపీఎం ఉమ్మడిగా కలిసేపోటీ చేస్తాయి. పొత్తుపై మేం ఎప్పుడు వెంపర్లాడలేదు. కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగింది వాస్తవమే. ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ఎన్నికలకు సిద్ధమవుతాం. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. చెరి 3 అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టిన వామపక్షాలు.. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని అడిగాయి. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని బీఆర్ఎస్ పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు. కాగా 9 నెలల కింద జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అక్కడ కొంత బలంగా ఉన్న సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ పార్టీల మధ్య మైత్రి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందని అప్పట్లోనే రెండు పార్టీల నేతలు ప్రకటించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తమ పార్టీలకు చెందిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో వామపక్షాలు కంగుతిన్నాయి. పొత్తులో భాగంగా తమ రెండు పార్టీలకు టికెట్లు కేటాయిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న కమ్యూనిస్టులకు కేసీఆర్ మొండి చేయి చూపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి దాకా పొత్తులపై చర్చలు జరిపి, తీరా దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే అభ్యర్థులను ప్రకటించడంపై మండిపడుతున్నాయి. మునుగోడు తర్వాత కేసీఆర్ మాట తప్పారని, సీఎం అవకాశ వాది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పట్టించుకోకపోవడాన్ని సీపీఐ, సీపీఎం ఏ విధంగా చూస్తాయనేది తెలియాల్సి ఉంది. -
కంగుతిన్న కామ్రేడ్లు...!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్తో చిగురించిన వామపక్షాల పొత్తు అంతలోనే వాడిపోయింది. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని విశ్వసించిన కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనతో కంగుతిన్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందని చెప్పారు. తీరా ఇప్పుడు వామపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై వామపక్షాల నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీఆర్ఎస్తో పొత్తులేదని స్పష్టం కావడంతో ఎలక్షన్లకు ఎలా సన్నద్ధం కావాలో తేల్చుకునేందుకు వామపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. కార్యాచరణపై సమావేశాలు బీఆర్ఎస్ వైఖరితో కంగుతిన్న సీపీఎం, సీపీఐ పార్టీ లు భవిష్యత్ కార్యాచరణ కోసం మంగళవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులోభాగంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా రెండు పార్టీలు విడివిడిగా సమావేశమైన తర్వాత ఉమ్మడి గా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఇందులోభాగంగా మేథోమథనానికి సిద్ధమయ్యా యి. ఏదేమైనా ఈసారి కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వామపక్ష పార్టీలు అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టార్గెట్ బీజేపీ: వామపక్షాల ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌తో జతకట్టింది. కానీ రాష్ట్రంలో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్తో కలిసి నడిచింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడంలో వామపక్షాల పాత్ర కీలకంగా ఉందని, అందుకే పొత్తు పొడిచిందని కామ్రేడ్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు ముగియడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దేశంలో జత కట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తులు కొనసాగించే అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీతో పొత్తులు సాగించిన కామ్రేడ్లతో రాష్ట్ర కాంగ్రెస్ కలిసిపోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేసే కోణంలోనూ వామపక్ష నేతలు యోచిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందన్న సమయంలో తమకు మూడోవంతు సీట్లు కేటాయించాలని కా మ్రేడ్లు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు సమయంలో సీట్ల సంఖ్యను ఏమేరకు పరిమితం చేయాలనే అంశంపైనా చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు పొత్తులు లేకుండా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైనా చర్చించనున్నారు. ఇప్పటివరకు చెరో పాతిక స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి. -
బీఆర్ఎస్తో కొలిక్కిరాని సీపీఎం, సీపీఐ పొత్తు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పయనంపై ఆ పార్టీల కేడర్‌లో అయోమయం నెలకొంది. బీఆర్ఎస్తో పొత్తుపై ఆ పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్తో పొత్తుపై గట్టిగా మాట్లాడిన కమ్యూనిస్టు నేతలు ఇప్పుడు స్వరం తగ్గించారు. రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలా.. బీఆర్ఎస్తో పొత్తుతో వెళ్లాలా అనే ఆలోచనలు ఎటూ తెగడంలేదు. పొత్తులు ఉన్నా, లేకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధిక సీట్లలో పోటీ చేయడంపై ఆయా పార్టీల నేతలు దృష్టి సారించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు కావడమే కాక రాష్ట్రంలోనే ఆ పార్టీలకు ఇక్కడ కొంత బలం ఎక్కువగానే ఉంది. ఇక పొత్తులపై బీఆర్ఎస్ నాన్చివేత ధోరణి అవలంబిస్తోందనే భావనకు వచ్చిన రెండు పార్టీల నేతలు ఈనెలాఖరు వరకు ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కొలిక్కి రాకుండానే.. ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలతో బీఆర్ఎస్కు చెందిన నేత ఒకరు రాజధానిలో పొత్తుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు, సీపీఐ కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్ స్థానాలను కోరినట్లు తెలిసింది. కాగా సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తామని సూత్రప్రాయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకపోగా చర్చలు ఆగిపోయాయి. ఉభయ కమ్యూనిస్టులు మాత్రం తమకు బలం ఉన్న స్థానాలను కేటాయిస్తేనే పొత్తుకు సై అనే ఆలోచనలో ఉండగా.. విషయం తేలక కేడర్‌లో స్తబ్దత నెలకొంది. కాలయాపనతో.. బీఆర్ఎస్తో పొత్తు వ్యవహారంలో కాలయాపన జరిగితే తాము నష్టపోతామనే అభిప్రాయం సీపీఎం, సీపీఐ కేడర్‌లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ముందుకు రాకపోవడంతో పొత్తు అంశం తేలడం లేదనే చర్చ సాగుతోంది. పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్ ఎన్నికల సమయం వరకు వేచి ఉంటుందని భావిస్తుండగా, కమ్యూనిస్టులు బహిరంగంగా ప్రస్తావించడం లేదు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని బీఆర్ఎస్తో బ్రేకప్ కాలేదని, అన్నీ కుదిరితే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. పరస్పర ఓట్ల బదిలీ, సీట్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పొత్తు ఉంటుందని.. లేదంటే ఒంటరిగానే బరిలో దిగుతామని తెలిపారు. దీంతో కమ్యూనిస్టులు ఏదో ఒకటి త్వరగా తేల్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 20కి తగ్గేదే లే... అధికార బీఆర్ఎస్తో పొత్తు ఉన్నా.. లేకున్నా రాష్ట్రంలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉభయ కమ్యూనిస్టులు ఉన్నారు. ఈసారి అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలనే ఏకై క అజెండాతో ఆ పార్టీల అడుగులు వేస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్తో చర్చలు ఫలించకపోతే సీపీఎం, సీపీఐ కలిసి బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి కనీసం ఏడు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాలపై ప్రధాన దృష్టి సారించాయి. అలాగే, రాష్ట్రంలోని మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, హుస్నాబాద్, ఇబ్రహీంపట్నం స్థానాలతోపాటు మరో ఏడు స్థానాల్లో తాము బలంగా ఉన్నట్లు ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుండగా.. కమ్యూనిస్టులు ఎటూ తేల్చుకోలేక.. ఎటు సాగాలో తెలియక ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీడని పీఠముడి ఇప్పటికే పొత్తులపై ఉభయ కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ మధ్య పలుమార్లు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా ఫలితం మాత్రం తేలలేదు. గతంలో పొత్తుపై అటు కమ్యూనిస్టులు, ఇటు బీఆర్ఎస్ నేతలు గట్టిగానే మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనూ సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అలాగే వర్షాలతో నష్టపోయిన పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట బోనకల్ మండలంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఉన్నారు. ఆ తర్వాత నుంచి పొత్తులపై బీఆర్ఎస్ వేచిచూసే ధోరణి అవలంబిస్తోందనే అభిప్రాయం కమ్యూనిస్టు పార్టీల కేడర్‌లో వ్యక్తమవుతోంది. -
ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. గేట్లు క్లోజ్ చేసిన పోలీసులు..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడిని పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో, ఖమ్మం కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి అఖిలపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా అఖిలపక్ష పార్టీల నేతలు నాగపూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపే అలైన్మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేటు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఇక, కలెక్టరేట్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్శదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రైతును చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వాలు ఉద్యోగుల కాళ్ల వద్దకు వస్తున్నాయి. రైతుకు ఆ పరిస్థితి లేదు. పోలీసులతో ఇబ్బంది పెడితే ఖమ్మంను స్తంభింప చేస్తాం. పోరాడితేనే మన భూములు మనకు మిగులుతాయి. వద్దన్న రోడ్లు వేస్తున్నారు.. కావాలన్న రోడ్లు వేయడం లేదు. బీఆర్ఎస్కు మేము చెబితే వినే పరిస్థితి లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులది చట్టబద్దమైన పోరాటం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రైతుల భూ పోరాటం తీవ్ర స్థాయికి చేరింది. రైతులు చూపిన త్యాగం, ధైర్యంతోనే పోరాటం విజయం సాధిస్తుంది. రైతుల పోరాటానికి సీపీఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. రైతులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రైతు పోరాటం వీధి పోరాటం కాదు, చట్టబద్ధమైన పోరాటం. 90శాతం మంది రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవాలని చట్టంలో ఉంది. తక్కువ నష్టం అయ్యే భూమినే ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది. మార్కెట్ విలువకు 3 రెట్లు ఎక్కువ కట్టించి రైతులకు ఇవ్వాలి. 2016లో భూసేకరణ చట్ట ప్రకారం రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: జెండావిష్కరణలో బీజేపీ నేతల బాహాబాహీ.. రెచ్చిపోయిన ఇరువర్గాలు -
కర్నాటక ఫలితాల ఎఫెక్ట్: ఈసారి పక్కా ప్లాన్‌తో ఎర్రన్నలు, అందుకే ఈ మౌనం
తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు ఉంటాయనే చర్చ మొదలైంది. రాజకీయ పోరులో కమలం ప్లేస్‌లోకి హస్తం పార్టీ రావడంతో లెఫ్ట్ నేతలు సైలెంట్‌గా పరిస్థితిని గమనిస్తున్నారు. గతంలో మాట ఎలా ఉన్నా.. పొత్తుల గురించి ఇప్పుడే ఓపెన్ కావద్దని నిర్ణయించుకున్నారట ఎర్రన్నలు. ముందుగా బలగం ఉన్న నియోజకవర్గాల్లో బలం పెంచుకునే పని ప్రారంభించారట. ఇంతకీ వారి సైలెన్స్ వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం.. కారులోనే అనుకున్నారు, కానీ.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత బలం ఉందని చెప్పుకోగల జిల్లా ఏదైనా ఉందంటే.. అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే. రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఈ జిల్లాకు చెందినవారే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేయడానకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ తమ మనసులోని మాట బయటపెట్టారు కూడా. వారు తమ నియోజకవర్గాల్లో చాలా కాలం క్రితమే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు మద్దతిచ్చిన వామపక్షాలు.. సాధారణ ఎన్నికల్లో కూడా కారులోనే ప్రయాణం చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ లెఫ్ట్ పార్టీల మీద కూడా ప్రసరించింది. అందుకే పరిస్థితులు ఎలా మారతాయో అన్న ముందు జాగ్రత్తతో ప్రస్తుతానికి పొత్తుల విషయంలో సైలెన్స్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు. (చదవండి: ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు) తొందర పడితే ఇబ్బందులు.. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాకముందు రాష్ట్రంలో కారు, కమలం మధ్యే పోటీ అన్నట్లుగా వార్ జరిగేది. కాని కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అన్నట్లుగా మారింది. ఇప్పుడు బీజేపీ మూడో ప్లేస్‌లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తన శక్తినంతా కూడదీసుకుంటోంది. ఇలాంటి కీలక సమయంలో తొందరపడి పొత్తుల విషయం ప్రకటిస్తే.. అసలుకే ప్రమాదం వస్తుందని లెఫ్ట్ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ.. చర్చించే ముఖ్యాంశాలు ఇవేనా!) ఎన్నికలు వచ్చేలోగా తమకు పట్టు ఉన్న 30 సెగ్మెంట్లలో బలం పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలని డిసైడయ్యారు. ఇద్దరం కలిసికట్టుగా ఉంటే.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చని, లేదంటే అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా మండలి సీటు ఇస్తామని మభ్య పెట్టే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నాయి. తమకు తాముగా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నట్లు కనిపించకూడదని, బలాన్ని పెంచుకుంటే అటు కాంగ్రెస్ గాని.. ఇటు బీఆర్ఎస్ గాని ఎవరో ఒకరు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. అందుకే మరికొంతకాలం మౌనం పాటించనున్నట్లు తెలుస్తోంది. మనమే తొందరపడి సర్దుబాటు కోసం ప్రయత్నిస్తే డిమాండ్ పడిపోద్దని లెఫ్ట్ పార్టీల నాయకత్వం భయపడుతోంది. అలాగాకుండా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల వైపు నుంచి పొత్తుల ప్రతిపాదన వస్తే మనం డిమాండ్ చేయవచ్చని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కమ్యూనిస్టు నేతలు. కారు, హస్తం ఏదైనా ఒక్కటే.. ఇచ్చే సీట్లను బట్టే పొత్తులు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్. -
పొత్తుల కోసం వెంపర్లాడం
హుస్నాబాద్: బీఆర్ఎస్ పార్టీతో పొత్తులపై ముఖాముఖి చర్చలు జరగలేదని, పొత్తులకోసం వెంపర్లాడబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు ఉన్నా.. లేకున్నా వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయ న తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మునుగోడులో సీపీఐ వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. సీఎం కేసీఆర్ ఆనాడు తమను పిలి చి పొత్తుపెట్టుకున్నారని, వ చ్చే ఎన్నికల్లోనూ ఆయన పిలిస్తేనే పొత్తులపై చర్చిస్తామని చెప్పారు. బీఆర్ఎస్తో తమ స్నేహబంధం ముగియలేదన్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కలిసే పయనిస్తాయని తేల్చిచెప్పారు. తెలంగాణలో 15 సీట్లలో సీపీఐ బలంగా ఉందని, 5 సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కొత్తగూడెం, వైరా, పెద్దపల్లి, మునుగోడు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో తప్పకుండా పోటీ చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ డిపోల ఎదుట రౌండ్ టేబుల్ సమావేశాలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను నేరవేర్చాలని ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డిపోల ఎదుట తమ పార్టీ ఆ«ధ్వర్యంలో సేవ్ ఆర్టీసీ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచుతామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు ఇచ్చి న హామీని నేరవేర్చలేదని చాడ విమర్శించారు. వచ్చే నెల 7న ప్రజాసమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బీసీ, దళితబంధు లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం సరికాదన్నా రు. గ్రామసభల ద్వారా లబ్దిదారులను ఎంపి క చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మణిపూర్ సంఘటనపై ఈనెల 25న దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు. -
‘ఇండియా’లో బీఆర్ఎస్ లేకున్నా పొత్తు
సాక్షి, హైదరాబాద్: ‘ఇండియా’ కూటమిలో బీఆర్ఎస్ లేకపోయినా ఆ పార్టీతో పొత్తుకు సంబంధించి సీపీఐ, సీపీఎంకు ఎలాంటి సమస్య లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్రంలో కలిసి పోటీ చేసే అంశం తలెత్తదన్నారు. ‘ఇండియా’ కూటమికి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితు లకు సంబంధం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ కూటములే ప్రధా న ప్రత్యర్థులని, అలాగే పశ్చిమ బెంగాల్లో సైతం తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థు లని, కానీ జాతీయ స్థాయిలో దేశం కోసం ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా లేరా? అని కూనంనేని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య పోరాటం ఉన్నప్పటికీ దేశ ప్రజల ప్రయోజ నాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఒకటిగా ఉన్నామని వివరించారు. ప్రీ పోల్, పోస్ట్ పోల్ పొత్తులు కొన్ని ఎన్నికల ముందు (ప్రీ పోల్), కొన్ని ఎన్నికల అనంతర (పోస్ట్ పోల్) పొత్తులు ఉంటాయని కూనంనేని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మని, ఆ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించామని, ఈ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. 26 నుంచి ’సేవ్ ఆర్టీసీ’ పేరిట నిరసన ప్రమాదంలో పడిన ఆర్టీసీని రక్షించుకునేందుకు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ‘సేవ్ ఆర్టీసీ’ పేరు తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్య క్రమాలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తా మని కూనంనేని తెలిపారు. ఆగస్టు 7న ఇళ్లు, గుడిసెలకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో పాటు ఇతరత్రా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు ముట్టడిస్తామన్నారు. -
పవన్ కల్యాణ్ రాజకీయాలు చేస్తున్నారా? లేక ఇంకా ఏమైనా చేస్తున్నారా?
-
ఎకానమీకి గణాంకాల ఊరట, దేశంలో గరిష్టానికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన గణాంకాలు ఎకానమీకి కొంత ఊరటనిచ్చాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిలో 4.81 శాతంగా నమోదవగా, మే నెల పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 5.2 శాతం పురోగతి నెలకొంది. తయారీ, మైనింగ్ రంగాలు మంచి పనితీరును ప్రదర్శించాయి. రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెల్లో మూడు నెలల గరిష్ట స్థాయిని చూసినా, అది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిలోనే ఉండడం ఊరట నిస్తున్న అంశం. అన్ని విభాగాలూ పురోగతిలోనే... మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 5.7 శాతం వృద్ధిని (గత ఆర్థిక సంవత్సరం ఇదే నెల విలువతో పోల్చి) నమోదుచేసుకుంది. ♦ విద్యుత్ ఉత్పత్తి 0.9% వృద్ధి నమోదయ్యింది. ♦ మైనింగ్‌లో 6.4 శాతం పురోగతి ఉంది. ♦ క్యాపిటల్ గూడ్స్ విభాగంలో 8.2 శాతం వృద్ధి. ♦కన్జూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తిలో 1.1% వృద్ధి. ♦ మౌలిక, నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 14%. ఏప్రిల్– మే నెలల్లో... ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 4.8 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలల్లో ఈ రేటు 12.9 శాతంగా నమోదయ్యింది. అమెరికన్లకు ఊరట మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం కట్టడి అక్కడి ప్రజలకు భారీ ఊరట కల్పించింది. లేబర్ డిపార్ట్మెంట్ జూన్‌లో వార్షిక ప్రాతిపదికన వినియోగదారుల ధరల సూచిక 3 శాతం పెరిగింది. మేలో 4శాతం వార్షిక లాభం నుండి తగ్గింది. నెలవారీ ప్రాతిపదికన సీపీఐ ద్రవ్యోల్బణం 0.2 శాతం లాభపడింది. తాజాగా, సీపీఐ డేటా ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపుదల చివరకు ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పట్టింది.. సంవత్సరానికి పైగా సీపీఐ ద్రవ్యోల్బణం జూన్ 2022లో 9.1% శాతం 40 సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇది ఇప్పుడు వరుసగా 12 నెలలు పడిపోయింది. -
‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’
సాక్షి, హైదరాబాద్: సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్‌తో జత కడుతారనే తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకి శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో మైత్రి కొనసాగుతుందని తమ్మినేని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ కలిసి వెళ్ళినప్పుడే లబ్ధి పొందామని, విడివిడిగా పోయినప్పుడు నష్టపోయామని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించామని కూనంనేని చెప్పారు. పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు ‘బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చూసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరింది. మునుగోడే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యునిస్టులతో పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ సీట్ల అంశంపై మాతో చర్చించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని అనుకుంటున్నారు. మాకు బలంగా ఉన్న చోట ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం’ అని తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే అయ్యేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తహతహ.. కమ్యూనిస్టులు ఉంటేనే కుంభకోణాలు బయటకు.. మునుగోడులో వచ్చిన విపత్తును సీపీఎం, సీపీఐ అడ్డుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంట్లను ప్రజలు ఊహించుకోవడం లేదని.. కమ్యూనిస్టులు ఉంటేనే అనేక కుంభకోణాలు బయటకు తీసుకు వస్తారని చెప్పారు. ఓట్లు సీట్ల కోసం దిగజారం ‘కమ్యూనిస్టుల పద్దతుల్లో మా పోరాటం చేస్తున్నాం. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవు. వ్యక్తిగత దూషణలకే పరిమితం. ఓట్లు సీట్ల కోసం మేము దిగజారం. రోజుకో పార్టీ మారే వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. పొత్తులపైన వెంపర్లాడడం లేదు. కేసీఆర్ ఎప్పుడూ పిలిస్తే అప్పుడే వెళ్తాం. కేసీఆర్ బీజేపీని తక్కువ అంచనా వేయవద్దని విజ్ఞప్తి. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో పొందిక ఉంటుంది. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం’ అని కూనంనేని తెలిపారు. -
బీఆర్ఎస్ తీరుపై కామ్రేడ్ల కస్సుబుస్సు
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో బీఆర్ఎస్ తీరుపై వామపక్షాలు గరంగరంగా ఉన్నాయి. పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై సీపీఐ, సీపీఎం కేడర్‌లో గందరగోళం నెలకొంది. పొత్తులు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను అపాయింట్మెంట్ కోరినా ఇప్పటివరకు లభించకపోవడంపై కామ్రేడ్లు కస్సుబుస్సులాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ తమను ఉపయోగించుకొని పొత్తులపై చర్చించాలనే సరికి మాత్రం పక్కనపెడుతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభకు తమ జాతీయ నేతలైన కేరళ సీఎం పినరయి విజయన్, డి.రాజా వంటి వారిని వెంటపడి మరీ పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం ఎంబీ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులతోనే ముందుకు... మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని భావించి ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చాయి. అనుకున్నట్లుగానే బీజేపీ గెలవకుండా అక్కడ వామపక్షాల ఓట్లు సహకరించాయి. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించే సత్తాగల పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది వామపక్షాల వైఖరి. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ను చెరో 10 అసెంబ్లీ స్థానాలు కోరాలనుకుంటున్నాయి. చర్చల్లో చివరకు చెరో ఐదు స్థానాలు తప్పనిసరిగా అడగాలన్నది వారి ఉద్దేశం. కానీ ఈ స్థానాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్‌లున్న ఆయా స్థానాలను కామ్రేడ్లకు ఇవ్వడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు అలిగి సహకరించకపోతే ఓటు బదిలీ జరగక వారు ఓడిపోయే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్ఎస్ ఉందని వామపక్షాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పది సీట్లు ఇచ్చినా వామపక్షాలు డబ్బు ఖర్చు పెట్టవని, దానివల్ల కూడా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకొనే దిశగా కూడా వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తుపై ఆసక్తి చూపించడంలేదని సమాచారం. -
TS: పొత్తుల విషయంలో వామపక్షాలు మౌనం.. కారణం అదేనా!
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో పొత్తుల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ రాలేదా? కాంగ్రెస్ బలపడుతున్నదని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎర్రన్నల ఆలోచనలు ఎలా ఉన్నాయి? కొంతకాలంగా పొత్తుల విషయంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని రెండు వైపుల నుంచి ప్రచారం ఊపందుకుంది. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీని టార్గెట్ చేసింది. ఖమ్మం అంటే కమ్యూనిస్టుల అడ్డా అని..ఇక్కడ కాషాయ పార్టీ పప్పులు ఉడకవని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయనే విషయమై ఎలాంటి చర్చలూ జరగలేదని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై ఎన్నికల సమయంలోనే స్పష్టత వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలు చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. అందులో భాగంగానే కొత్తగూడెంలో భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేసింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు. ఇటివలే ఖమ్మం నగరంలో సీపీఏం కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో సీపీఏంకి పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో బలం ఉంది. పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ సైతం మొదలుపెట్టారు. సీట్ల విషయంలో బీఆర్ఏస్ నుంచి క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ముందు తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో బలం చూపించుకుంటే సీట్లు అవే వస్తాయన్న భావనలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల విషయంలో మౌనంగా ఉంటున్నాయి. అయితే సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరి వారి పొత్తు కాంగ్రెస్‌తో ఉంటుందా? బీఆర్ఎస్తో ఉంటుందా? బహుశా వారికి కావాల్సిన సీట్లు ఎవరిస్తే వారితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
బీఆర్ఎస్తో పొత్తుపై సందిగ్ధంలో లెఫ్ట్!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందా? లేదా? అన్నదానిపై వామపక్షాల్లో సందిగ్ధం నెలకొంది. ‘మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పొత్తుతో ముందుకు వెళ్లినా.. ప్రస్తుతం ఆ పారీ్టతో పొత్తు వ్యవహారం యథాతథ స్థితిలో ఉంది’అని ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్య చర్చనీయాంశమైంది. పొత్తుల విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉండటంపై వామపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్తో కలసి పనిచేసిన తర్వాత.. ఇప్పుడా పార్టీని కాదని మరో పార్టీతో ముందుకెళితే ప్రజల్లో చులకన భావన ఏర్పడుతుందని అంటున్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందా, లేదా అన్నదానిపై తమ కార్యకర్తలకు ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, ఆ ప్రభావం ఇక్కడా ఉంటుందన్న చర్చల నేపథ్యంలో హస్తం పార్టీ వైపు వెళ్లాలని కొందరు వామపక్ష నేతలు చర్చ లేవనెత్తుతున్నారు. పొత్తులపై త్వరలో తేలుస్తామంటున్న నేతలు సీపీఐ, సీపీఎం నేతలు ప్రజాసమస్యలతోపాటు పొత్తులపైనా సీఎం కేసీఆర్‌తో చర్చించాలని అనుకున్నారు. దీనిపై సీఎం అపాయింట్మెంట్ కూడా అడిగారు. కానీ వారాలు గడిచినా అపాయింట్మెంట్పై ఎలాంటి స్పందనా రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గతంలో బీఆర్ఎస్కు చెందిన కొందరు నేతలు ‘పొత్తులుంటాయి కానీ.. లెఫ్ట్ పార్టీలకు సీట్లు ఇవ్వబోం. కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తాం’అని పేర్కొనడం.. దానిపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తమవి ప్రజా పార్టీలనీ, ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేయడం గమనార్హం. పొత్తులో భాగంగా చెరో 10 సీట్లు అడగాలని సీపీఐ, సీపీఎం భావించాయి. చివరికి చెరో ఐదు సీట్లతో అయినా పొత్తుకు సిద్ధం కావా లని అనుకున్నాయి. కానీ బీఆర్ఎస్ నుంచి స్పందన లేదు. దీనితో వామపక్షాలను బీఆర్ఎస్ను పట్టించుకోవడం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. తాము ఖమ్మం, నల్లగొండ వంటి రెండు, మూడు ఉమ్మడి జిల్లాల్లో ప్రభావితం చూపుతామని.. పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్కే లాభమని వామపక్షాలు అంటున్నాయి. త్వరలో ఏదో ఒకటి తేల్చుతాం! పొత్తులపై త్వరలోనే ఏదో ఒకటి తేల్చుతామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల తర్వాత కేసీఆర్‌ను కలసి ఒక ఒప్పందానికి వస్తామని వామపక్షాలు అంటున్నాయి. తమకు గౌరవ ప్రదమైన సంఖ్యలో సీట్లు ఇవ్వకపోతే పొత్తుపై పునరాలోచిస్తామని.. అయితే ఈ విషయంలో తొందర పడబోమని పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ నేతలు కూడా వామపక్షాలంటే లెక్కలేకుండా ఉన్నారని, కనీసం తమను సంప్రదించలేదని, వారితో ఎలా ముందుకు సాగగలమని లెఫ్ట్నేతలు అంటున్నారు. ఏదిఏమైనా బీజేపీని ఓడించే శక్తులతో ముందుకు వెళ్లాలన్నదే తమ అభిమతమని స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. వామపక్షాల పొత్తు అంశం అంతుబట్టడం లేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘గూడెం’లో నేడే ప్రజాగర్జన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారత కమ్యూనిస్టు పా ర్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న ప్రజాగర్జన బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సాయంత్రం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో జరిగే సభకు పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా ముఖ్య అతి థిగా హాజరు కానున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కో రుతూ ఈ ఏడాది ఏప్రిల్ 14న సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపో రు యాత్రలు చేపట్టి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు నిర్వహించారు. పోడు సాగుదారులకు పట్టాల పంపిణీ, సింగరేణి ప్రైవేటీకరణ, రాజ్యాంగ, లౌకిక వ్యవస్థల పరిరక్షణ తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఎర్ర జెండా రెపరెపలతో..: ప్రజాగర్జన బహిరంగ సభ నేపథ్యంలో కొత్తగూడెం పట్టణం ఎరుపెక్కింది. ప్రకాశం స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు లక్ష మంది జన సమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టే గత నెలరోజులుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు..: కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రధా నంగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. ఇందుకో సం వెయ్యి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా 300 చొప్పున బస్సుల్లో కార్యకర్తలు తరలివస్తారని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తెలిపారు. ఒక్క కొత్తగూడెం నియోజకవర్గం నుంచే 25 వేల మందికి పైగా ప్రజలను తరలించేందుకు వాహనాలను సిద్ధం చేశామని, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని చెప్పా రు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వేలాదిగా కార్మికులు వచ్చేందుకు బెల్లంపల్లి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిన ట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తారని వివరించారు. హాజరుకానున్న రాజా..: ఈ సభకు జాతీయ కార్యదర్శి డి.రాజాతో పాటు సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ, అజీజ్ పాషా, చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి, వాసిరెడ్డి సీతారామయ్య, ప్రముఖ కళాకారులు గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరుకానున్నారు. -
బాబు, పవన్‌లపై లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి?
ఏపీలో వామపక్షాలకు జ్ఞానోదయం కలిగిందా? చంద్రబాబు అండ్ పవన్‌కల్యాణ్‌ల ఊసరవెల్లి రాజకీయాలు వారికి నిజంగానే అర్థమయ్యాయా? బాబు, పవన్‌ల మీద ఏపీ లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి? వచ్చే ఎన్నికల్లో తమకు చంద్రబాబుతో కలిసే ఛాన్స్ పోతుందని ఆందోళన చెందుతున్నాయా? నిజంగా ఏపీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాయా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ అక్కడి రాజకీయాలు ఎప్పటి నుంచో మాంచి కాకమీదున్నాయి. రేపే సీఎం సీటు మీద కూర్చోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉవ్విళ్ళూరిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వబోనని ప్రతిజ్ఞలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీతో బీజేపీని కలపాలని తెగ ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు, బీజేపీ నుంచి బీఎస్పీ వరకు చంద్రబాబు పొత్తు పెట్టుకోని రాజకీయ పార్టీ భారత దేశంలో లేదు. జనసేన పార్టీ స్థాపించి తొమ్మిదేళ్ళు గడచినా ఇంకా నిర్మాణమే చేయని పవన్ కల్యాణ్ కూడా బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, బీఎస్పీ..ఇలా అన్ని రకాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు దత్త పుత్రుడుగా ముద్ర వేయించుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే ఇతర పార్టీలు గౌరవించేవి. ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు రాజకీయాలు మొదలుపెట్టాయో అప్పటినుంచే ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల గౌరవం తగ్గిపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న సీపీఎం, సీపీఐలు ఈసారి టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని...ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాయి. కాని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తమకు ఎక్కడ దూరం అవుతాడో అని లెఫ్ట్ పార్టీలకు బెంగ పట్టుకుంది. అసెంబ్లీలో కాలు మోపే ఛాన్స్ ఈసారి కూడా మిస్ అవుతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది. తాజాగా సీపీఎం, సీపీఐ తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు బీవీ రాఘవులు, కంకణాల నారాయణ సంయుక్తంగా చంద్రబాబు, పవన్‌లపై విరుచుకుపడ్డారు. మోడీ మెడ పట్టి గెంటుతున్నా..చూరు పట్టుకుని వేళ్ళాడటానికి ఇద్దరికీ సిగ్గు లేదా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశంతో..మరోసారి కాంగ్రెస్‌తో... ఇలా ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నపుడే వామపక్షాలు అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాయి. సొంతంగా పోటీ చేసినపుడు భంగపడ్డాయి. గత ఎన్నికల్లో పవన్‌తో కలిసి బోల్తా పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో జతకట్టాలని ఉబలాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ప్రాపకం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. పవన్ చేస్తున్న బ్రోకరిజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదో రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని పోజులు కొడుతున్నా.. వాస్తవానికి అసెంబ్లీలో ఒకటో.. రెండో సీట్లు గెలవాలంటే చంద్రబాబు పంచన చేరక తప్పదని సీపీఎం, సీపీఐ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ప్రతి విషయంలోనూ టీడీపీ తోక పార్టీలుగా వ్యవహరిస్తూ.. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతలు ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రతిదానికీ విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ ఎప్పుడూ సింగిల్‌గానే ఎన్నికలకు వెళుతున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని పదే పదే చెబుతున్నారు. అందుకే సింహాన్ని ఎదిరించేందుకు గుంపుతో కలిసి రావాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ప్రజలకు దూరమైన కమ్యూనిస్టు పార్టీలు ఇలాగే చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న వాటి కోరిక ఎప్పటికీ నెరవేరదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
మళ్లీ మావోల కలకలం! ఛత్తీస్‌గఢ్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో మళ్లీ మావోల కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ తూర్పు భాగం గుండా మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు యతి్నస్తున్నారు. అదే సమయంలో తూర్పు దిక్కున మావోలకు కంచుకోటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవీ కాన్వాయ్‌పై తూటాల వర్షం కురిపించి దాడికి తెగబడ్డారు. అయితే, ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ క్రమంలో మావోలు తెలంగాణలోకి వస్తున్నారన్న సమాచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో వీరి కదలికలపై పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉంది. దీంతో వీరు రాష్ట్రంలోకి రాకుండా నిలువరించేందుకు పోలీసులు సరిహద్దుల వద్ద భద్రత పెంచారు. అయితే, ఈసారి ఏప్రిల్ 20న జరగనున్న ఇంద్రవెల్లి అమరుల సంస్మరణను పురస్కరించుకుని ఉద్యమాలను నిర్మించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జల్, జంగిల్, జమీన్ నినాదంతో ఉద్యమించిన ఆదివాసీల్లో 13 మంది పోలీసు కాల్పుల్లో మరణించిన ఘటనను ఉద్యమకారులు మరో జలియన్ వాలా భాగ్‌తో పోలుస్తారు. గిరిజనులు, ఆదివాసీల హక్కుల పరిరక్షణే..! ఇంద్రవెల్లి వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తరచుగా కేంద్రంపై విమర్శలు, తమపై సాగే పోలీసు దాడులను నిలిపివేయాలనే సాధారణ డిమాండ్లను మావోయిస్టు పార్టీ ఈసారి వినిపించకపోవడం గమనార్హం. కేవలం ఆదివాసీలు, గిరిజనుల హక్కులు, వారి సంక్షేమానికి ప్రభుత్వం తెచ్చిన చట్టాలు, జీవోలను అమలు చేయాలని డిమాండ్ చేయడం విశేషం. ఆదివాసీ ప్రాంతాల్లో స్వయం పాలన, 1995 పెసా చట్టం, 2005 అటవీ హక్కుల చట్టం, కవ్వాల్ టైగర్ జోన్, అభయారణ్యాల ఎత్తివేత, ఆదివాసీల పోడు భూములకు పట్టాలు, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు, ఆదివాసీల కోసం ప్రత్యేక డీఎస్సీ, ఆదివాసీబంధు అమలు తదితర డిమాండ్లను మావోయిస్టులు ప్రభుత్వం ముందుంచుతున్నారు. చివరిగా.. ఎస్టీల్లో ఇతర కులాలను చేర్చవద్దని స్పష్టంచేశారు. ఎందుకు వస్తున్నట్లు..? మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించేందుకు రాజకీయ, భౌగోళిక, వాతావరణ కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం వేసవి కారణంగా అడవులు పలుచబడటం, ఆకులు రాలిపోవడంతో వీరు మరింత దట్టమైన అడవుల్లోకి లేదా తెలంగాణలోకి రావాల్సిన అనివార్య పరిస్థితులున్నాయి. అదేసమయంలో గోదావరిలో నీటిప్రవాహం తగ్గడం వల్ల ఎంపిక చేసిన ప్రాంతాల్లో నదిని దాటడం సులభంగా ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదివాసీలు, గిరిజనుల హక్కుల కోసం గతంలో చేసిన చట్టాలు, విడుదల చేసిన జీవోల అమలుకు ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మావోల వ్యూహంగా కనిపిస్తోంది. -
ఆపత్కాలంలో ఐక్యతా రాగం!
దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్‌లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం. ‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’. – సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్‌లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం: ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం. తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి: ‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు. ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది. అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది. బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు. అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది. ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్‌ను అడిగితే చెబుతాడు: ‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే నేను నా మాతృభూమికి దేశద్రోహినే దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కలి‘విడి’గానే! చర్చనీయాంశంగా కారు – కామ్రేడ్ల స్నేహబంధం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ – వామపక్షాల పొత్తు అంశం మాత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీల నేతలు పోటీలు పడుతూ దీన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఈ అవగాహనలో భాగంగా తాము అడిగే మొదటి స్థానం పాలేరేనని, ఇక్కడ తాము పోటీ చేస్తే మంచోళ్లంతా తమకే ఓట్లు వేయాలని ఆయన కోరారు. పొత్తు చర్చలు ప్రారంభం కాకుండానే ఆయన సీపీఎం పోటీ చేసే స్థానాలపై మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ సభలో కూడా ఇక్కడి నుంచి సీపీఎం కచ్చితంగా పోటీ చేస్తుందంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు. తమ్మినేని మాత్రమే కాదు.. తాము కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఆయా సందర్భాల్లో బీఆర్ఎస్తో పొత్తు, తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రస్తావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని, కొత్తగూడెం నుంచి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పార్టీ కేడర్‌కు చెపుతున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఆలోచన ఏ విధంగా ఉందన్నది బయటపడక పోవడంతో.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధం ఎంత దూరం కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గౌరవప్రదమైన స్థాయిలో అంగీకారం! వామపక్ష పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు అడగాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాలేరు, వైరా, మధిర, భద్రాచలం, ఖమ్మం, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ, ఇబ్రహీంపట్నం స్థానాలు కావాలని సీపీఎం అడిగే అవకాశం ఉండగా కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, ఇల్లందు, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరే అవకాశముంది. అయితే కోరినన్ని స్థానాలు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో పొత్తును అంగీకరించే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్టు సమాచారం. కనీసం మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కోసం బీఆర్ఎస్ను కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందో? కామ్రేడ్ల ఆలోచనలు ఎలా ఉన్నా.. వారితో తమ అనుబంధంపై బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందన్నది అంతు పట్టడం లేదు. పలు సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం తెరపైకి వస్తున్నప్పటికీ ఆ పార్టీ కీలక నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. అయితే వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని, ఆయా స్థానాల్లో తామే పోటీ చేస్తామని స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశం కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తారనే సంకేతాల నేపథ్యంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పలువురు కమ్యూనిస్టు నాయకులకు ఏకంగా సీఎం కేసీఆర్ స్థాయిలో హామీ లభించిందన్న ప్రచారం కూడా వారికి మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తదితరులు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఒకవేళ ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యా లగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. -
ఆ తప్పులే కొంప ముంచాయా?.. ఎందుకిలా జరిగింది?
కమ్యూనిస్టుల ఐక్యత దేశానికి దిక్సూచి అని ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలు అభిప్రాయపడడం ఆసక్తికర పరిణామమే. కాకపోతే తాను ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు అన్నట్లుగా కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు చారిత్రక తప్పిదాలు చేస్తూ పోతున్నారు. తత్ఫలితంగా వారు దేశంలో నానాటికి కునారిల్లిపోతున్నారు. నిజమే! ఒకప్పుడు కమ్యూనిస్టులు అంటే పేద ప్రజల పక్షాన ఉంటారని అంతా అనుకునేవారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన విపక్షం ఉండాలని, అందులోను కమ్యూనిస్టులు వంటివారు ఉంటే దేశానికి ప్రయోజనకరమని గతంలో భావించేవారు. కానీ ప్రజల నమ్మకాన్ని వారే వమ్ము చేసుకున్నారు. రైట్ టైమ్ -రాంగ్ డెసిషన్, రాంగ్ టైమ్- రైట్ డెసిషన్ అన్న నానుడి వీరికి బాగా వర్తిస్తుందని ఎక్కువ మంది నమ్ముతారు. స్వాతంత్ర పోరాట సమయంలో కొన్నిసార్లు కమ్యూనిస్టులు అనుసరించిన వైఖరులు విమర్శకు గురి అయ్యాయి. అయినా వారి దేశ భక్తిని ఎవరూ శంకించేవారు కారు.. ఆ తర్వాత నిజాం సంస్థానంపై జరిగిన పోరు, సాయుధ రైతాంగ పోరాటాలలో కమ్యూనిస్టులు ఎదుర్కున్న కష్టాలు ఇన్నీ,అన్నీ కావు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయగలిగారు. ఆ తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం సాగించడం ద్వారా తీవ్రంగా నష్టపోయిందని చెబుతారు. చాలా మంది యోధులను కోల్పోవలసి వచ్చింది. ఆ సమయంలో కూడా అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. తదుపరి ఎన్నికల రాజకీయాలలోకి రాక తప్పలేదు. కానీ అనతికాలంలోనే రష్యా లైన్, చైనా లైన్ గా పార్టీ నేతలు విడిపోయి, అనంతరం రెండు ప్రధాన పార్టీలుగా కమ్యూనిస్టులు ఏర్పడ్డారు. సీపీఐ నుంచి వేరుపడ్డ సీపీఎం క్రమేపీ పుంజుకుని పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ వంటి రాష్ట్రాలలో అధికారం సాధించింది. అయినా కమ్యూనిస్టుల చీలికలు ఆగలేదు నక్సలైట్ ఉద్యమం దేశంలోనే పెద్ద సంచలనం. భయానకం, ప్రభుత్వ అణచివేతను తట్టుకోవడం అంత తేలిక కాదని రుజువైనా ఇప్పటికీ పీపుల్ వార్ గ్రూప్ పేరుతోనో, మరో పేరుతోనో అడవులలో పోరాటాలు చేస్తున్నవారు ఉన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాలలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎంల మధ్య ఏదో రూపంలో గొడవలు సాగుతుండేవి. కొన్ని చోట్ల ఇరువైపులా హత్యలు చేసుకునేంతగా కక్షలు పెరిగాయి. ఉదాహరణకు గతంలో ఖమ్మం జిల్లాలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన కలహాలకు పలువురు బలి అయ్యారు. దేశవ్యాప్తంగా ఈ రెండు పార్టీలు క్యాడర్ ను కలిగి ఉన్నా సీపీఎందే పై చేయి అవుతూ వచ్చింది. కానీ ఆ పార్టీ కూడా ఇటీవలికాలంలో దారుణంగా దెబ్బతింది. ముప్పైమూడేళ్లపాటు నిరాటంకంగా పశ్చిమబెంగాల్లో పాలన చేసిన సీపీఎంకు ప్రస్తుతం ఆ రాష్ట్ర శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం చారిత్రక విషాదం అని చెప్పాలి. సీపీఎం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులే ఆ పార్టీని ఇలా పతనం చేశాయని అంటారు. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు దేశ ప్రధాని అయ్యే అవకాశం వస్తే, దానిని ఆ పార్టీ వదలుకోవడం కూడా పెద్ద తప్పిదంగా చాలా మంది పరిగణిస్తారు. 1991 కి ముందు కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకతతో ఉన్న సీపీఎం 2004 నాటికి ఆ పార్టీతో కలవక తప్పలేదు. 1971లో ఇందిరాగాంధీతో రాజకీయ సంబంధాలు నెరపిన సీపీఐ ఆ తర్వాత కాలంలో దూరం అయింది. 1989 లో బీజేపీతో కలిసి వీపీ సింగ్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించాయి. మూడో ఫ్రంట్ అనో, మరొకటనో రకరకాల ప్రయోగాలు చేసిన వామపక్షాలు 2004 నాటికి కాంగ్రెస్ తో జతకట్టక తప్పలేదు. దానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయకుండా నూక్లియర్ ఒప్పందం పేరుతో 2009 నాటికి కాంగ్రెస్‌కు దూరం అయ్యారు. దాంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ తర్వాత క్రమేపి క్షీణించడమే తప్ప ఎదుగుదల లేకుండా పోయింది. తాజాగా సీపీఐ జాతీయ హోదాను కూడా కోల్పోయింది. సీపీఎం కేరళలో మాత్రం అధికారం సాధించగలిగింది. అందులో సీపీఐ కూడా ఒక భాగస్వామిగా ఉంది. 1996లో మాత్రం యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఇద్దరు సీపీఐ నేతలు కేంద్రంలో మంత్రులుగా ఉండేవారు ప్రముఖ నేత ఇంద్రజిత్ గుప్తా వారిలో ఒకరు. కానీ ఆ పరిణామాలను పార్టీకి పెద్దగా ఉపయోగించుకోలేకపోయారని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా రెండు పార్టీలు రెండు లైన్ లు తీసుకున్నాయి. సీపీఐ రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉద్యమం చేస్తే, సీపీఎం సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంది. ఈ రెండు విధానాలలోను ఈ పార్టీలకు కలిసి వచ్చిందేమీ లేదనే చెప్పాలి. చివరికి ఆంధ్ర, తెలంగాణలలో శాసనసభలలో పార్టీలకు ప్రాతినిద్యం లేకుండా పోయింది. కొంతకాలం టీఆర్ఎస్ (ప్రస్తుతం బిఆర్ఎస్) కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్లను బుజ్జగించడం వల్లో, , లేక బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నారనే కారణంతోనో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదన్న బాధలో ఉన్నట్లుగా సీపీఐ,సీపీఎం నేతల ప్రసంగాలను బట్టి అర్ధం అవుతుంది. బీఆర్ఎస్ తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందా అన్న ఆశతో ఎదురు చూడవలసిన పరిస్థితిలో పార్టీలు పడ్డాయి. ఇక ఏపీలో అయితే మరీ చిత్రమైన పరిస్థితి. బీజేపీ మద్దతు కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తంటాలు పడుతుంటే, సీపీఐ మాత్రం తెలుగుదేశంతో కలవడానికి వెంపర్లాడుతోంది. బీజేపీతో కలవం అంటూనే ఆ పార్టీ నేతలతో కలిసి రాజధాని ఉద్యమంలో చేతులెత్తుతుంటారు. పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేసే వామపక్షాలు ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే, దానిని స్వాగతించకపోగా ఆయన ప్రభుత్వంపై ఉద్యమిస్తున్నామని చెబుతుంటారు. ఈ విషయంలో సీపీఎం కొంత బెటర్ . సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అయితే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పు చేతలలో ఉంటారన్న విమర్శలు ఎదుర్కుంటుంటారు. రాజధానిలో పేదలకు స్థలాలు ఇవ్వద్దన్న వారితో కలిసి ఈ పార్టీ పనిచేస్తుంటుంది. పేదలకోసం పలు స్కీములు అమలు చేస్తున్న జగన్ ను వ్యతిరేకించడం చారిత్రక తప్పిదమే అవుతుందేమో! జగన్ పేదల కోసం అమలు చేస్తున్న స్కీములను సీపీఎం అగ్రనేత , దివంగత పుచ్చలపల్లి సుందరయ్య జీవించి ఉంటే స్వాగతించి ఉండేవారని సీనియర్ నేత పాటూరి రామయ్య వ్యాఖ్యానిస్తే, సీపీఎం నాయకత్వం ఆయనను తప్పు పట్టడం చిత్రమే. వామపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవడంలో అంత సఫలం కాలేకపోతున్నాయని, హైదరాబాద్ లో జరిగిన సభలో ఉభయ పార్టీల అగ్రనేతల ఉపన్యాసాలను విశ్లేషించుకుంటే అర్ధం అవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్‌పై గుడ్డి వ్యతిరేకత, ఇప్పుడు బీజేపీపై గుడ్డి వ్యతిరేకత పెంచుకుంటున్నారు. గతంలో టాటా, బిర్లా తదితర పారిశ్రామిక సంస్థలను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ప్రస్తుతం రిలయన్స్ అంబానీ, అదాని వంటివారిని వ్యతిరేకిస్తున్నారు. కానీ చైనా వంటి కమ్యూనిస్టు దేశంలో కూడా కార్పొరేట్ సంస్థలను ఎలా ప్రోత్సహిస్తున్నది తెలుసుకుంటే మన కమ్యూనిస్టులు ఎటు వైపు పయనిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఏ పారిశ్రామకి సంస్థలో అయినా తప్పులు జరుగుతుంటే ఎత్తి చూపడం తప్పు కాదు. కానీ ఆ సాకుతో అసలు పెద్ద పరిశ్రమలను వ్యతిరేకిస్తున్న తీరు వారికి ప్రయోజనం కలిగించదు. ఒకప్పుడు కంప్యూటర్ లను వీరు వ్యతిరేకించేవారు .కానీ సాంకేతిక పరిజ్ఞానం అపారంగా పెరిగిన తరుణంలో వాటిని అనుసరించక తప్పలేదు. ఇక మీడియా బారన్ రామోజీరావుకు చెందిన మార్గదర్శి గ్రూపులో జరిగిన అవకతవకలపై సీపీఐ కూడా అచ్చం తెలుగుదేశం మాదిరే మాట్లాడింది తప్ప, హేతుబద్దంగా స్పందించలేదు. ఒకప్పుడు సీపీఐ ,సీపీఎం లు కలిసి పనిచేసి ఉంటే మంచి ప్రత్యామ్నాయంగా ఎదిగి ఉండేవారు. 1952లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. ఆనాడు జరిగిన ఎన్నికలలో ఈ ప్రాంతం వరకు చూసుకుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు దాదాపు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. తదుపరి 1955 లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రకాశం పంతులు, ఎన్.జి.రంగా వంటివారిని కలుపుకుని కమ్యూనిస్టులను పూర్తిగా దెబ్బతీసింది. అప్పట్లో అధిక విశ్వాసంతో కమ్యూనిస్టు పార్టీ దెబ్బ తింది. తదుపరి ఎప్పటికీ కోలుకోలేకపోయింది. కమ్యూనిస్టు పార్టీ స్పేస్‌ను పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఆక్రమించేశాయి. దాంతో ఆ పార్టీలపై ఆధారపడవలసిన దయనీయ స్థితి వామపక్షాలకు సంక్రమించింది. 1952 నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు కేంద్రంలోను, ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ తో పోటాపోటీగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వామపక్షం ఇప్పుడు ఉనికిని నిలబెట్టుకోవడమే పెద్ద సమస్యగా ఉంది. ఈ సంక్షోభం నుంచి వామపక్షాలు బయటపడగలతాయా అంటే సంశయంగానే ఉంది. వామపక్షాలు ఐక్యత కోసం ప్రయత్నించడం మంచి పరిణామమే. కాకపోతే ఇప్పటికే బాగా ఆలస్యం అయిందనే సంగతి ఆ పార్టీల నేతలకే బాగా తెలుసు అని చెప్పవచ్చు. - కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ చదవండి: ఏది నిజం?: బాబే.. ప్రైవేటు మాస్టర్.. అంతా చేసింది ఆయనే.. ఒక్క ముక్క రాయని ఈనాడు -
జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి?
న్యూఢిల్లీ: సీపీఐ, ఎన్సీపీ, టీఎంసీలకు జాతీయ పార్టీల గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసీ జాతీయ హోదా ఇచ్చింది. అయితే ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలవాలి? ఎన్ని రాష్ట్రాల్లో ఉనికి ఉండాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ గుర్తింపు పొంది ఉండాలి. అసెంబ్లీ లేదా సార్వత్రిక ఎన్నికల్లో(లోక్‌సభ) నాలుగు రాష్ట్రాల్లో కనీసం 6శాతం ఓట్లు పొంది ఉండాలి. లేదా నాలుగు ఎంపీ సీట్లైనా గెలవాలి. లేదా లోక్‌సభలో రెండు శాతం సీట్లు కలిగిఉండాలి. కనీసం మూడు రాష్ట్రాల నుంచి ఆ పార్టీ ఎంపీలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఉండాలి. వీటిలో ఏ అర్హత ఉన్నా ఎన్నికల సంఘం ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. ప్రస్తుతం దేశంలో 6 జాతీయ పార్టీలు ప్రస్తుతం దేశంలో ఆరు పార్టీలకు జాతీయ హోదా ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ,ఆమ్ ఆద్మీ పార్టీ ఈ జాబితాలో ఉన్నాయి. కొత్తగా జాతీయ హోదా పొందిన ఆప్‌ను అరవింద్ కేజ్రీవాల్ 2012లో స్థాపించారు. 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజ యం సాధించింది. 1925లో ఏర్పాటైన సీపీఐ 1989లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినడం, దేశవ్యాప్తంగా కూడా తగిన సంఖ్యలో లోక్‌సభ సీట్లను సాధించలేకపోవడంతో జాతీయ హోదాను కోల్పోయింది. జాతీయ హోదా కోల్పోయిన టీఎంసీని 1998లో మమతా బెనర్జీ స్థాపించారు. టీఎంసీ 2004లో రాష్ట్ర పార్టీ హోదా పొందింది. తర్వాత అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురకూ విస్తరించగా.. 2016లో జాతీయ పార్టీ హోదా వచ్చింది. కానీ తర్వాత పెద్దగా ప్రభావం చూపకపోవడంతో హోదా కోల్పోవాల్సి వచ్చింది. శరద్‌పవార్ 1999 లో కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి ఎన్సీపీని స్థాపించారు. వివిధ ఎన్నికల్లో విజయం సాధించడంతో 2000 సంవత్స రంలో జాతీయ హోదా లభించింది. చదవండి: రెండో గండం దాటేస్తారా!? 38 ఏళ్ల సంప్రదాయం.. బీజేపీ ఏం చేస్తుందో? -
EC: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆప్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదాను కల్పించింది. ఇదే సమయంలో మరో మూడు జాతీయ హోదా కలిగిన పార్టీలకు షాకిచ్చింది. తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ), నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూడు పార్టీలు జాతీయ హోదాను కోల్పోయాయి. ఇక, ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును ఈసీ తొలగించింది. అయితే, 2012లో స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. అనంతరం.. పలు రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది. Election Commission of India recognises Aam Aadmi Party (AAP) as a national party. Election Commission of India derecognises CPI and TMC as national parties. pic.twitter.com/9ACJvofqj6 — ANI (@ANI) April 10, 2023 -
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకెన్నాళ్లు?
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? గులాబీ పార్టీ మీద ఎర్రన్నల ప్రేమ వన్ సైడేనా? మునుగోడు విజయంతో ఎర్ర పార్టీలను పొగిడిన గులాబీ దళపతి... ఇప్పుడు పట్టించుకోవడంలేదా? మిత్రపక్షాలుగా మారిన ఎర్ర గులాబీలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నాయి ఎందుకు? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది? తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ గులాబీ పార్టీ విషయంలో చెరో దారిలో ప్రయాణించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కు బేషరతు మద్దతు ప్రకటించాయి. ప్రచారంలో కలిసి ముందుకు సాగాయి. మునుగోడులో గులాబీ పార్టీ విజయంలో లెఫ్ట్ పార్టీల సహకారం గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దీంతో సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతుందనే ప్రచారం జరిగింది. ఉనికి కోసం ఆరాటపడుతున్న ఉభయ కమ్యూనిస్టులకు మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కలిసొచ్చింది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని.. అసెంబ్లీలో ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. ముఖ్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గాల్లో ఖర్చీఫ్‌లు కూడా వేసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్తో కుదిరిన స్నేహం కారణంగా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శల్లో తీవ్రత తగ్గించారు కమ్యూనిస్టు పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పై లెఫ్ట్ పార్టీలు ఎంత ప్రేమ చూపిస్తున్నా... పైకి ప్రేమగా మాట్లాడుతున్నా లోపల కత్తులు దూస్తున్నారట జిల్లాల్లోని గులాబీ పార్టీ నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ జిల్లాల్లో స్థానిక నేతలు కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదనే చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీ చేస్తానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించగా.. సిటింగ్ ఎమ్మెల్యేను తానుండగా ఇంకెవరు పోటీ చేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపెందర్ రెడ్డి రచ్చకు దిగారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం కొంత వెనక్కి తగ్గి సీపీఎం పోటీ చేస్తే బీఆర్ఎస్ సహాకరిస్తుంది.. బీఆర్ఎస్ పోటీ చేస్తే సీపీఎం సహకరిస్తుందని ప్రకటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావుకు మధ్య అసలు పొసగడం లేదట. అన్ని రకాలుగా ప్రభుత్వానికి సహాకరిస్తున్న తమను పట్టించుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారని జూలకంటి రంగారెడ్డి వాపోతున్నారట. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కూడా తన సొంత నియోజకవర్గం కొత్తగూడెంలో పలు సార్లు పరాభవం ఎదురైందట. కేసీఆర్ తనకు సన్నిహితంగా ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కూనంనేని. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న తనకే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో తమ పార్టీ నేతల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారట కూనంనేని. రాష్ట్ర స్థాయిలో పార్టీ అగ్రనాయకుల మధ్య అవగాహన ఉన్నా.. స్థానిక నాయకత్వం మధ్య స్నేహం లేకపోవడంతో సీపీఐ, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్కు అవగాహన కుదరడం లేదట. తాము వన్ సైడ్ లవ్‌తో ప్రభుత్వానికి సహకరిస్తున్నా స్పందించకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారట కమ్యూనిస్టు పార్టీల నేతలు. చూడాలి మరి ఎర్ర పార్టీలకు, గులాబీ పార్టీతో పొత్తు కుదురుతుందా లేక గతంలో మాదిరిగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే తమ సీటు పోతుందనుకుంటున్న గులాబీ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు మాత్రం లెఫ్ట్ నాయకులంటే కస్సుమంటున్నారనే టాక్ నడుస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ చదవండి: రేవంత్ ఒక్కడే ఎందుకిలా?.. ఆ జిల్లాకు వెళ్లాలంటే భయమా? -
కలసి నడుద్దాం
సాక్షి, హైదరాబాద్: కామ్రేడ్లు ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కీలకమైన అయిదారు వేలమంది క్రియాశీలక కార్యకర్తలతో వచ్చే నెల 9వ తేదీన హైదరాబాద్‌లో ఉమ్మడి సమావేశం నిర్వహించాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఉభయ పార్టీల నేతలు ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఎంబీ భవన్లో సమావేశమయ్యారు. సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, సీపీఎం తరపున తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని నిర్ణయించారు. వచ్చే నెల జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో క్యాడర్‌కు మార్గనిర్దేశం చేసేందుకు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలకు చెందిన జాతీయ నేతలను ఆహ్వానిస్తారు. ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి బీజేపీయేతర పార్టీలతో పొత్తులుంటాయి. పొత్తులతో సంబంధం లేకుండా 10 వేలకు పైగా ఓట్లున్న.. దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా ఆ స్థానాలను కోరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెండు పార్టీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరు పోటీ చేసుకోకూడదనేది ప్రాథమికంగా నిర్ణయించారు. పొత్తులపై ఇప్పటికీ గందరగోళమే.. రాష్ట్రంలో బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదని, కేవలం ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని బీఆర్ఎస్ అంటున్న ట్టు జరుగుతున్న ప్రచారంపై కామ్రేడ్లు ఇంకా గరంగరంగానే ఉన్నారు. అవసరమైతే కాంగ్రెస్‌తోనైనా పొత్తుకు వెనుకాడబోమని వామపక్షాలు భావిస్తు న్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. -
కాంగ్రెస్ వైపు కామ్రేడ్లు.. ప్రణాళికలు సిద్ధం..!
అసెంబ్లీ ఎన్నిక లకు ఏడాది సమయం కూడా లేదు. ముందస్తు ఎన్నికలపైనా ఊహాగా నాలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఎన్నికలు లక్ష్యంగానే వ్యూహాలు రూపొందించి అమ లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పొత్తులు తెరపైకి వస్తుండగా.. వామ పక్షాలు తాజాగా కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. ప్రచారం సైతం నిర్వ హించాయి. భవిష్యత్తులోనూ సీపీఎం, సీపీఐ తో కలిసే వెళ్తామని ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు చెప్పారు. సీఎం కేసీఆర్ కూడా కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిన్న, మొన్నటివరకు ఇదే విధమైన వాతావరణం కన్పించింది. కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని, కేవలం అవగాహన మాత్రమే ఉంటుందని ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేయడం, బీఆర్ఎస్ అధిష్టానం దీనిపై మౌనం వహించడం ఉభయ కమ్యూనిస్టు పార్టీలను అయోమయంలో పడేసింది. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ కలిసిరాని పక్షంలో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ఓటమే లక్ష్యం.. దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. బీజేపీతో విభేదించే పార్టీలు ఏవైనా సరే వాటితో కలిసి ముందుకు సాగుతున్నాయి. ఎన్నికల్లో పొత్తులు కూడా పెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీపీఐ, సీపీఎం పార్టీలు బీఆర్ఎస్తో జత కట్టాయి. ఆ పార్టీ విజయంలో తమ వంతుపాత్ర పోషించాయి. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో ఇటీవల ఖమ్మంలో ఆ పార్టీ నిర్వహించిన సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని ఐక్యత చాటారు. కానీ ఇటీవల కాలంలో వామపక్షాలతో పొత్తుపై బీఆర్ఎస్ నాయకులు స్వరం మార్చారు. అసెంబ్లీ స్థానాలు ఇచ్చేది లేదని, అవసరమైతే పెద్దల సభకు నామినేట్ చేస్తామంటూ తలోమాట మాట్లాడుతుండటంతో లెఫ్ట్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీపీఐ, సీపీఎంలు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నాయని, ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగిందని, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కొందరు లెఫ్ట్ పార్టీల నేతలతో మంతనాలు జరిపారని తెలిసింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెస్ పెద్దలు.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మా వైపు రండి..’ అంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు ఎన్నికలకు సంబంధించి మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. కమ్యూనిస్టుల ముందు 3 ప్లాన్లు... లెఫ్ట్ పార్టీలు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ.. ఇలా మూడు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్లాన్ ఏ.. బీఆర్ఎస్తో పొత్తు ఉండేలా కృషి చేయడం. చెరో పది సీట్లు అడగాలి. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, పాలేరు, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, ఇబ్రహీంపట్నం, హుస్నాబాద్ స్థానాల కోసం పట్టుబట్టాలి. ఒకవేళ కొన్ని కాదని ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామంటే ఆలోచించాలి. ప్లాన్ బీ.. బీఆర్ఎస్ తర్వాత బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, వైఎస్సార్టీపీ, తెలంగాణ జన సమితి వంటి పార్టీలతో జత కట్టడం. కాంగ్రెస్ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి సాను కూలంగా ఉండటం కీలకాంశం. ప్లాన్ సీ కాంగ్రెస్ గౌరవప్రదమైన సీట్లకు అంగీకరించని పక్షంలో, ఏదైనా కారణంతో ఆ పార్టీతోనూ పొత్తు కుదరని పక్షంలో ఒంటరి పోరాటం చేయడం. చెరో 25 స్థానాల్లో పోటీ చేసి ఎన్నికల పోరాటంలో బీజేపీ సహా ఇతర పార్టీల వైఖరులను, విధానాలను ఎండగట్టడం. -
కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై టీడీపీ, సీపీఐ నేతల దాడి
-
ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై టీడీపీ, సీపీఐ నేతల దాడి
సాక్షి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో అలజడి సృష్టించేందుకు టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నేతలు కుట్రలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏకంగా అధికారులపై దాడులకు తెగబడుతున్నారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు.. పాఠశాలల్లో నాడు - నేడు పనులు పర్యవేక్షణలో భాగంగా ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై అనంతపురంలో విపక్షాలకు చెందిన కార్యకర్తలు దాడికి యత్నించటం తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి భర్త, విద్యాశాఖ కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ రెడ్డి పై దాడికి యత్నించారు. అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు పాఠశాలల ప్రతినిధులతో మాట్లాడుతుండగా.. టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల నేతలు ఒక్కసారిగా దౌర్జన్యం చేశారు. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన ఉపాధ్యాయ సంఘాల నేతలు దుండగులను అడ్డుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డిపై దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. తనను హత్య చేసేందుకు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు ప్రయత్నించారని.. పలువురు ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారం తో బయటపడ్డానని కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. తనపై అభ్యంతరాలు ఉంటే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోవచ్చని.. ఇలా దౌర్జన్యానికి దిగటం అప్రజాస్వామికం అన్నారాయన. ప్రతాప్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చదవండి: టీడీపీ స్కెచ్.. ‘నీ పంట దున్నెయ్.. లీడర్ని చేస్తాం..’ -
ప్రత్యామ్నాయమా.. ఒంటరిపోరా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎంల పొత్తు వ్యవహారం గందరగోళంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు మూడు పార్టీల మధ్య కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే.. బీఆర్ఎస్ కలిసిరాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, కుదరని పక్షంలో ఒంటరిగా పోటీ దిశగా వామపక్షాలు సమాలోచన చేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ మధ్య పొత్తు ఉంటుందని మునుగోడు ఎన్నికల సందర్భంగా కొందరు నాయకులు ప్రకటించినా, ఇప్పుడు దానిపై స్పష్టత కరువైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లు కేటాయించేది లేదనీ, ఎమ్మెల్సీ స్థానాలు ఇచ్చి సరిపెడతామని కొందరు బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కామ్రేడ్లు మండిపడుతున్నారు. ‘మాది రాజకీయ పార్టీ. ప్రజా క్షేత్రంలో పోరాడిన చరిత్ర మాది. దేశంలో గతంలో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఇప్పుడు కేరళలో అధికారంలో ఉన్నాం. జాతీయ స్థాయిలో కీలకమైన పార్టీలుగా ఉన్నాం. అలాంటి పార్టీలు ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి నామినేటెడ్ పోస్టుల వరకే పరి మితం కాబోవు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. పొత్తు ఉన్నా లేకున్నా బరిలో ఉంటాం..’అని లెఫ్ట్‌కు చెందిన ఒక కీలకనేత వ్యాఖ్యానించడంతో పొత్తులు రసకందాయంలో పడ్డాయి. పొత్తులపై హాట్‌హాట్ చర్చ రాష్ట్రంలో బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు ఇస్తే బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి. పొత్తులు, ప్రజాసమస్యలపై పోరాటాలు వంటి అంశాలపై సీపీఐ, సీపీఎం నేతలు మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్లో సమావేశమయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తో పాటు ఆ పార్టీకి చెందిన పశ్య పద్మ, చాడ వెంకటరెడ్డి తదితరులు.. సీపీఎం నుంచి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, జాన్‌వెస్లీ, చెరుపల్లి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తులపై హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ‘మేం చెరో 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాం. ఆ మేరకు బీఆర్ఎస్కు ప్రతిపాదించే ఆలోచనలో ఉన్నాం. ఆ పార్టీతో జరిగే చర్చల్లో అటుఇటుగా పొత్తుకు సిద్ధం అవుతాం. ఒకవేళ బీఆర్ఎస్ మాకు గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వకపోతే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తాం. బీజేపీకి అడ్డుకట్ట వేసే మరో పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని పరిశీలిస్తాం. కుదరకపోతే ఒంటరిగానైనా పోటీ చేస్తాం. అప్పుడు అవసరమైతే చెరో 20 స్థానాల్లోనూ పోటీ చేసి తీరతాం’అని ఆ చర్చల్లో పాల్గొన్న ఒక నేత స్పష్టం చేశారు. మరోవైపు రాబోయే ఎన్నికల్లో పరస్పర ఐక్యత ప్రదర్శించాలని రెండు పార్టీలు స్పష్టమైన అవగాహనకు వచ్చాయి. ఎక్కడా ఒకరిపై మరో పార్టీ పోటీకి పెట్టకుండా ఉండాలని నిర్ణయించాయి. కాగా బీఆర్ఎస్, కామ్రేడ్ల మధ్య సాగుతున్న ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ ఆసక్తిగా పరిశీలిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కలిసి పనిచేయా లని కూడా సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. ఈ మేరకు మార్చి నెలలో ప్రజా పోరాటాలు నిర్వహించనున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తేనున్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ సహా పలు అంశాలపై ఐక్య పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించాయి. -
కాంగ్రెస్ కు ఈసారి టీడీపీ దరిద్రం లేనట్టే
-
బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎం.. పొత్తు ఉండాలంటే.. సీట్లు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండాలంటే ఆ పార్టీ తమకు గౌరవ ప్రదమైన సీట్లు కేటాయించాలని సీపీఐ, సీపీఎం స్పష్టం చేస్తున్నాయి. సీట్లు కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవాల్సి వస్తుందని చెబుతున్నాయి. ‘మాతో పొత్తు, సీట్ల కేటాయింపునకు సంబంధించి ఇటీవల కొందరు బీఆర్ఎస్ నేతలు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సీపీఐ, సీపీఎంలకు అసెంబ్లీలో సీట్లు కేటాయించబోమని, కేవలం చెరో ఎమ్మెల్సీ సీటు కేటాయిస్తామంటున్నారు. ఇది బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశం మేరకు చేస్తున్న వ్యాఖ్యలుగా మేము అనుకోవట్లేదు. అయితే ఒకవేళ అలాంటి ఆలోచన బీఆర్ఎస్ అధిష్టానానికి ఉంటే మాత్రం ఒకసారి పునరాలోచించుకోవాలి. లేకుంటే మేము ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సి ఉంటుంది’అని లెఫ్ట్ పార్టీలకు చెందిన ఒక నేత వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు, ఇతరత్రా అంశాలపై సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీలకు చెందిన ఇతర రాష్ట్ర సీనియర్ నేతలు మంగళవారం భేటీ కానున్నారు. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. గెలిచే సత్తా లేకున్నా ఓడించే దమ్ముంది... బీజేపీ ప్రధాన శత్రువుగా ముందుకు సాగాలన్నది సీపీఐ, సీపీఎంల ప్రధాన వైఖరి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీకి బ్రేక్ వేసేందుకు అవసరమైన వ్యూహం రచించేలా ఆ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. బీజేపీని ఓడించే సత్తా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. అందులో భాగంగానే గతేడాది మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు సీపీఐ, సీపీఎంలు మద్దతిచ్చాయి. ఉమ్మడిగా ప్రచారం నిర్వహించాయి. అయితే రానున్న ఎన్నికల్లో తమకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేకపోయినా విడిగా పోటీ చేసి బీఆర్ఎస్ను కొన్నిచోట్ల ఓడించే దమ్ము మాత్రం ఉందని ఆయా పారీ్టల నేతలు అంటున్నారు. తమను తక్కువగా అంచనా వేస్తే బీఆర్ఎస్కే నష్టమని ఓ సీనియర్ నేత కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. బీజేపీకి చెక్ పెట్టాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందేనని చెబుతున్నారు. మరోవైపు ఇరు పారీ్టలు పరస్పరం అభ్యర్థులను పోటీకి నిలపొద్దని సీపీఐ, సీపీఎం ఒక నిర్ణయానికి రానున్నాయి. పరస్పర ఐక్యత, బీఆర్ఎస్తో పొత్తుపై మంగళవారం సమావేశంలో నేతలు ప్రాథమికంగా ఒక అంచనాకు రానున్నారు. ఎన్ని సీట్లు అడుగుదాం? పొత్తుల విషయంలో ఒకవేళ బీఆర్ఎస్తో చర్చించాల్సి వస్తే ఎన్ని సీట్లు అడగాలనే అంశంపైనా సీపీఐ, సీపీఎంలు ఈ సమావేశంలో ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశముంది. చెరో 10 సీట్లు అడగాలని, కనీసం చెరో 5 ఇచ్చేలా అయినా ఒప్పందం చేసుకోవాలన్న ఆలోచనగా ఉంది. ఒకవేళ అదీ సాధ్యం కాకుంటే చివరకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు కోరడంతోపాటు ఇరు పారీ్టలు ఒకట్రెండు ఎమ్మెల్సీ సీట్ల చొప్పున అయినా సాధించాలని నేతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సీపీఐ కొత్తగూడెం స్థానాన్ని, సీపీఎం భద్రాచలం సీటును తప్పనిసరిగా అడిగే అవకాశమున్నట్లు సమాచారం. బీఆర్ఎస్కు ఇబ్బంది లేకుండా, తమ పారీ్టలు బలంగా ఉన్న నియోజకవర్గాలను సీపీఐ, సీపీఎంలు గుర్తిస్తున్నాయి. -
ఆర్బీఐ ముందు సీపీఐ ఆందోళన..
పారిశ్రామికవేత్త అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జాతీయ సమితి దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం సైఫాబాద్‌లోని ఆర్బీఐ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఆ పార్టీ రాష్ట్ర శాఖ. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, పార్టీ నాయకులు తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు, బాలమల్లేశ్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కార్యదర్శులు, గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.అంజయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. – ఖైరతాబాద్ (హైదరాబాద్) -
హైదరాబాద్ ఆర్బీఐ వద్ద సీపీఐ ఆందోళన
-
బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని భ్రష్టు ప్రట్టిస్తున్నాయి: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
-
అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు: సీపీఐ రాజా
సాక్షి, ఖమ్మం: బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ కలిసి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా మండిపడ్డారు. బుధవారం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. ‘తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులర్పిస్తున్నా.. తెలంగాణలో సుపరిపాలన అందుతోంది. సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్, తాగునీరు అందుతున్నాయి. రైతుబంధు, దళితబంధు పథకాలు దేశానికే ఆదర్శం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయి. మోదీ వెనుక అంబానీ, అదానీ ఉండి నడిపిస్తున్నారు. రిపబ్లిక్ దేశంగా ఉన్న దేశాన్ని మార్చి ఒకే మతం, ఒకే పన్ను, ఒకే ఎన్నిక పేరుతో విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. భారత్‌ను హిందూ దేశంగా మార్చి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారు. మోదీ పేదలు, రైతుల పక్షాన లేకుండా.. అదానీ, అంబానీ, టాటా బిర్లాల జపం చేస్తున్నారు. బీజేపీ గవర్నర్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని కేరళ, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్‌ను ఇబ్బంది పెడుతోంది. 2024లో అందరు కలిసి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా ఐక్య పోరాటాలు చేయాలి. ఐక్య పోరాటాలకు ఖమ్మం సభ నాంది కావాలి. బీజేపీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యం’ అని డి.రాజా చెప్పారు. -
బీఆర్ఎస్తో సీపీఐ, సీపీఎం పొత్తు? చెరో పది అసెంబ్లీ సీట్లలో పోటీ!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో చెరో పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని సీపీఐ, సీపీఎం యోచిస్తున్నాయి. ఆ మేరకు బీఆర్ఎస్తో పొత్తు కుదుర్చుకోవాలని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. వీలును బట్టి ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు స్పష్టం చేయాలని భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ వల్లే బీఆర్ఎస్ గెలిచిందని, కాబట్టి ఆ పార్టీ మళ్లీ అధికారం రావాలంటే తమతో పొత్తు తప్ప మరో గత్యంతరం లేదని సీపీఐ, సీపీఎం చెబుతున్నాయి. అయితే 20 సీట్లు బీఆర్ఎస్ ఇస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు చివరకు చెరో ఐదు సీట్లయినా ఇవ్వాలని పట్టుబడతామని ఆ పార్టీల నేతలు అంటున్నారు. చెరో ఐదు స్థానాలైనా ఇవ్వకపోతే పొత్తుపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే చెరో ఐదు స్థానాలైనా బీఆర్ఎస్ ఇస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. -
క్రమం తప్పకుండా అందరూ పూజించాలి!
క్రమం తప్పకుండా అందరూ పూజించాలి! -
Che Guevara: 22న చేగువేరా కుమార్తె హైదరాబాద్ రాక
సాక్షి, హైదరాబాద్: క్యూబా విముక్తి విప్లవ నాయకుడు చేగువేరా కుమార్తె ఆలైదా గువేరా ఈనెల 22న హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: (టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702) -
జీవో నెం.1పై తాత్కాలిక స్టే విధించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 23 వరకు జీవో నెం.1పై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. -
జీవో నంబర్-1పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపించిన ఏజీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జీవో నంబర్-1పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సీపీఐ రామకృష్ణ కోర్టును కోరారు. ఈ క్రమంలో ఈ పిటిషన్‌ను అత్యవసరంగా తీసుకోనక్కర్లేదని ఏజీ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చెంచ్‌కు పిల్‌ను విచారించే అధికారం లేదని ఏజీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పిల్‌ను తామే అత్యవసరంగా విచారిస్తామని వెకేషన్ కోర్టు తెలిపింది. కాగా, హైకోర్టులో విచారణలో భాగంగా ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. పిల్‌పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదన్నారు. నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదు. వెకేషన్ బెంచ్ విధాన నిర్ణయాల కేసులను విచారించకూడదు. జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంది అని స్పష్టం చేశారు. -
టీడీపీ ముసుగులో పనిచేస్తున్న వ్యక్తి కొణతల రామకృష్ణ: మంత్రి గుడివాడ అమర్నాథ్
-
బీజేపీ మళ్లీ గెలిస్తే వినాశనమే
సాక్షి, హైదరాబాద్: బీజేపీని ఓడించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి డి.రాజా అన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు సమిష్టిగా సరైన వ్యూహ రచన చేయాలని, ఇందుకు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పార్టీలు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫాసిస్టు శక్తుల భారతీయ పరివ ర్తనా రూపమే (ఇండియన్ వేరియెంట్) ఆర్ఎస్ ఎస్, బీజేపీ అని విమర్శించారు. బీజేపీ మళ్ళీ గెలిస్తే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. సోమవా రం పార్టీ జాతీయ కార్యదర్శి సయ్యద్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది తెలంగాణ, తమిళనాడు, త్రిపుర తదితర రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని రాజా ప్రజలకు పిలు పునిచ్చారు. లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఒక చోటకు చేరాలన్నారు. మోదీ పాలనలో ఆర్థిక సంక్షో భం తారాస్థాయికి చేరుకుందని, నిరుద్యోగిత రేటు 18 నెలల్లో అత్యధికంగా 8.5 శాతానికి పైగా నమో దైందని చెప్పారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా పేదలు మరింత నిరుపేదలవగా, అదానీ, అంబానీ వంటి వారి సంపద మరింత పెరిగి, వారు ప్రపంచ శత కోటీశ్వరులతో పోటీ పడుతున్నారని అన్నారు. జమిలి ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదు పార్లమెంటు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సీపీఐ అభిప్రాయం కోరుతూ జాతీయ లా కమిషన్ ఇటీవల లేఖ రాసిందని డి.రాజా తెలిపారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేది బీజేపీ విధానమని, అయితే బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థ కలిగిన భారతదేశంలో ఇది అసాధ్య మని ఆయన పేర్కొన్నారు. నిరంతరం ఎన్నికలు జరుగుతుంటే స్థిరమైన ప్రభుత్వాలు ఎలా ఉంటా యనే ప్రశ్నకు అంబేడ్కర్ సమాధానం చెబుతూ.. మనకు స్థిరమైన ప్రభుత్వం కావాలా? జవాబు దారీ ప్రభుత్వం కావాలా? అంటే తాను జవాబు దారీ ప్రభుత్వాన్నే కోరుకుంటానని చెప్పార న్నారు. ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జవాబు దారీతనం లేని ప్రభుత్వమని విమర్శించారు.నోట్ల రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చింది ఏకగ్రీవ తీర్పు కాదని, ధర్మాసనంలో మెజారిటీ జడ్జీలు నోట్ల రద్దును సమర్థించినప్పటికీ, ఒక జడ్జి అందుకు భిన్నంగా వేరే తీర్పును ఇచ్చారని తెలిపారు. డబ్బు, మతమే బీజేపీ ఎజెండా: కూనంనేని ప్రజా సమస్యలపై పోరాటాలను వదిలేసి, డబ్బు, మతం ఎజెండాతో రాష్ట్రంలో అధికారంలోకి రావా లని బీజేపీ భావిస్తోందని కూనంనేని విమర్శించా రు. టీఆర్ఎస్తో మునుగోడులో అవగాహన ఉన్నా ప్రజాసమస్యలపై సీపీఐ నిరతరం పోరాటాలను కొనసాగిస్తోందని, భూసమస్యలు,గవర్నర్ వ్యవస్థ, పోలీసు రిక్రూట్మెంట్లో తప్పులపై ఉద్యమాలు చేస్తోందన్నారు. బీజేపీ ఒక్క ప్రజా సమస్యపైనైనా పోరాటం చేసిందా అని ప్రశ్నించారు. -
ఇదేమైనా బాహుబలి సినిమానా?
హైదరాబాద్: ఈ బారు నుంచి ఆ బారుకు దూకడానికి ఇది బాహుబలి సినిమా కాదని, ఈ అభ్యర్థులేమీ సినిమా షూటింగ్లో పాల్గొనడం లేదంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. తప్పులతడకగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులను కలిపి కోర్టు తీర్పును గౌరవించాలంటూ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్(టీఎస్ఎల్పీఆర్బీ)కు కూనంనేని సూచించారు. శనివారం ఏఐవైఎఫ్ పిలుపుమేరకు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల డీజీపీ కార్యాలయం ముట్టడి భగ్నమయ్యింది. అభ్యర్థులు ప్లకార్డులు చేతబూని బోర్డు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీగా ముట్టడికి ప్రయత్నిస్తున్న సమయంలో వీరందరినీ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పీఎస్‌లకు తరలించారు. మద్దతు తెలిపేందుకు వచ్చిన కూనంనేని మాట్లాడుతూ..గత 15 రోజులుగా న్యాయంకోసం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు, ఇతర ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం అభ్యర్థులకు న్యాయం చేయకపోతే మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. -
శాసన వ్యవస్థపై ‘గవర్నర్ల’ దాడి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘దేశవ్యాప్తంగా సమాఖ్య వ్యవస్థ మీద దాడి జరుగుతోంది. కేరళపై ఇది ఇంకా తీవ్రంగా ఉంది. గవర్నర్ల రూపంలో శాసన వ్యవస్థలో జోక్యం చేసుకోవడం నానాటికీ పెరుగుతోంది. బీజేపీ, ఆర్ఎస్ ఎస్ ఎజెండాను గవర్నర్ల ద్వారా అమ లు చేసే ప్రయత్నం చేస్తున్నారు. గవర్నర్లను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుని, చట్టసభల కన్నా ఉన్నతంగా చూపేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది. యూనివర్సిటీ చాన్స్లర్ల పేరుతో ఉన్నత విద్యపై ఆధిపత్యాన్ని సంపాదించుకోవాలని చూస్తోంది. ఇది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం’అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. గురువారం ఖమ్మంలో తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం మూడవ రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విజయన్ మాట్లాడారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో చారిత్రక ఉద్యమాలకు సీపీఎం నాంది పలికిందని, తెలంగాణ, కునప్రవేల, తెబాగలో జరిగిన పోరాటాలు ఇందుకు మచ్చుతునకలని అన్నారు. ఖమ్మంలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు గురుతర బాధ్యత ఖమ్మం ప్రజలదే.. ఈ దేశంలో తామే ప్రతిపక్షమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఎప్పుడూ నిజమైన ప్రతిపక్షంగా లేదని, బీజేపీకి రిక్రూట్మెంట్ ఏజెన్సీగా పనిచేస్తోందని విజయన్ ఆరోపించారు. బీజేపీలోకి కాంగ్రెస్ తన కేడర్‌ను పంపిస్తోందన్నారు. వామపక్షాల్లో సీపీఎం మాత్రమే నిజమైన ప్రతిపక్షంగా దేశంలో కనిపిస్తోందని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తోందని చెప్పారు. వచ్చే పార్లమెంట్, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంను దేశవ్యాప్తంగా, తెలంగాణలోనూ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఖమ్మం ప్రజలపై ఈ గురుతర బాధ్యత ఉందని చెప్పారు. కార్మికులు, శ్రామికులు, రైతులు హక్కుల కోసం పోరాడాలని, అలాంటి పోరాటాలకు ఖమ్మం సభ నాంది కావాలని పిలుపునిచ్చారు. కాగా, సుస్థిర అభివృద్ధిలో దేశంలో కేరళ ది బెస్ట్ అని ఐక్యరాజ్య సమితి ప్రశంసించిందని, అలాగే ఎన్డీఏ ఆధీనంలోని నీతి ఆయోగ్ కూడా కేరళ నంబర్‌వన్ రాష్ట్రంగా అభివర్ణించిందని చెప్పారు. కేరళలోని ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం విక్రయించాలని చూస్తే తమ ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసిందన్నారు. సభకు వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య అధ్యక్షత వహించారు. కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చే వారిదే గెలుపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి చవిచూపిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతుతోనే గెలిచామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెప్పారన్నారు. పొత్తులు ఎన్నికల సమయంలోనే ఉంటాయని, వీటిపై ఇప్పటివరకు ఎక్కడా చర్చించలేదని చెప్పారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కమ్యూనిస్టులు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే గెలుపు అని జోస్యం చెప్పారు. మహాసభకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మికసంఘం, సీపీఎం శ్రేణులు భారీగా తరలివచ్చాయి పెవిలియన్ గ్రౌండ్ నుంచి సభా ప్రాంగణం వరకు రెడ్‌షర్ట్ వలంటీర్లు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్, పార్టీ నేతలు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
బిగ్ క్వశ్చన్: పేరుకు కమ్యూనిజం లోపలంతా ఎల్లో ఇజం
-
రామకృష్ణ, నారాయణ చంద్రబాబుకు అమ్ముడుపోయారు : పేర్ని నాని
-
డబ్బు రాజకీయాల వల్లే వామపక్షాలకు దెబ్బ: సురవరం
సాక్షి, హైదరాబాద్: డబ్బు రాజకీయాల వల్లనే ఎన్నికల్లో వామపక్షాలు దెబ్బతింటున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో వర్గ దోపిడీ, వ్యక్తిగత ఆస్తులకు వ్యతిరేకంగా పోరా టం చేసే ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని, అందుకే కమ్యూనిస్టు పార్టీ పట్ల రాజ కీయ ప్రత్యర్థులు, శతృవులు అనేక దుష్ప్రచారాలను, తప్పుడు మాటలను మాట్లాడుతారని అన్నారు. వారికి ఎర్రజెండా అంటేనే భయమన్నారు. ‘సీపీఐ 98వ వ్యవస్థాపక దినోత్సవ’ సందర్భంగా సోమవారం హైదరాబాద్ మగ్దూంభవన్ ప్రాంగణంలో బహిరంగ సభ నిర్వహించారు. తొలుత సీపీఐ జెండాను సుధాకర్‌రెడ్డి ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్య క్షతన జరిగిన బహిరంగ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్, జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఇ.టి.నర్సింహా, మాజీ ఎంఎల్ఎ పీ.జె చంద్రశేఖర్ హాజర య్యా రు. ఈ సందర్భంగా ‘కమ్యూనిస్టు పార్టీ ప్రాధా న్యత అవసరం’ అంశంపై సురవరం, ‘రాజ్యాంగ రక్షణ ఫెడరల్ వ్యవస్థ పరిరక్షణ’ అనే అంశంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రసంగించారు. సురవరం మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కొత్త పోరా టాలకు రూపకల్పన చేయాలని, అందుకోసం ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. దేశంలో ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి, ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో విశాలమైన ఐక్యతకు సీపీఐ, సీపీఐ(ఎం) కలయిక దోహద పడుతుందని అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల పునరేకీకరణ జరగాలని పేదల నుండి పెద్దల వరకు కోరుతున్నారని చెప్పారు. చదవండి: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం.. -
రామకృష్ణ రూటే సెపరేటు.. నిజాలు తెలిసి నాలుక మడత
కమ్యూనిస్టు పార్టీలంటే ప్రజా సమస్యల మీద పోరాడతారనే పేరుండేది. కాని ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు పక్కన పెట్టి టీడీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షనిస్టులకు మద్దతుగా ఆయన చేస్తున్న ప్రకటనలు అనుమానాలకు తావిస్తోంది. సిద్ధాంతాలకు తిలోదకాలు భారత కమ్యూనిస్టు పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణ.. పాతికేళ్ళ క్రితం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే కొంతకాలంగా రామకృష్ణ అనుసరిస్తున్న తీరుతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని సీపీఐ వర్గాలే చెబుతున్నాయి. అవినీతి, అక్రమాలు ఎవరు చేసినా పోరాడే పార్టీగా తమ పార్టీ సీపీఐకి బ్రాండ్ ఉందని, ఆ పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా ఉంటూ... అక్రమాలకు కొమ్ము కాస్తున్నారని రామకృష్ణపై సీపీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ మూల సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు రామకృష్ణ. అనంతపురం కేంద్రంగా గత కొన్ని రోజులనుంచి జరుగుతున్న పరిణామాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. జాకీపై పచ్చ పడగ అనంతపురం జిల్లా రాప్తాడులో ఓ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు జాకీ కంపెనీ ముందుకొచ్చింది. 129 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పటంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనంతపురంరాప్తాడు మధ్య 27 ఎకరాల భూమిని సేకరించి కంపెనీకి ఇచ్చింది. 2018లోపు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఏమైందో తెలియదు కానీ జాకీ కంపెనీ రాప్తాడులో ఏర్పాటు కాలేదు. రాప్తాడుకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ఈ కంపెనీని ఇరవై కోట్ల రూపాయల కమిషన్లు అడిగినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇంత జరిగినా ఆ రోజున సీపీఐ నేత రామకృష్ణ టీడీపీ నేతల అవినీతి గురించి ప్రశ్నించలేదు. అర్థాంతరంగా పనులు నిలిపివేసి వెళ్లిపోయిన జాకీ పరిశ్రమపై ఆయన ఏ మాత్రం స్పందించలేదు. నిజాలు తెలిసి నాలుక మడత నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జాకీ అంశం చర్చనీయాంశంగా మారింది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డబ్బు డిమాండ్ చేయటం వల్లే జాకీ పరిశ్రమ ఏర్పాటు కాలేదని మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరాం ఆరోపించారు. దీన్నే ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచురించింది. తెలుగుదేశం నాయకుల ఆరోపణలకు మద్దతుగా రంగంలోకి దిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి వల్లే జాకీ పరిశ్రమ రాలేదంటూ టీడీపీ ఆరోపణలను రామకృష్ణ కూడా వల్లె వేస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అక్రమాల వల్లే జాకీ కంపెనీ వెళ్లిపోతే..అప్పుడు సీపీఐ నేత రామకృష్ణ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. సీపీఐ నేత రామకృష్ణ మాజీ మంత్రి పరిటాల సునీతకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆమె కనుసన్నల్లోనే ప్రభుత్వంపైనా, ఎమ్మెల్యే తోపుదుర్తిపైనా ఆరోపణలు చేస్తున్నారని అనంతపురంలో టాక్ నడుస్తోంది. ఏమైంది చిత్తశుద్ధి? ఆనాడు మౌనంగా ఉండి నేడు హడావిడి చేయడానికి కారణం టీడీపీకి మద్దతుగా నిలవడమేనని కమ్యూనిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రామకృష్ణకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీడీపీ నేతల అవినీతి, జాకీ పరిశ్రమ తరలిపోవటంపై నిలదీసి ఉండోచ్చని అంటున్నారు. హింసా రాజకీయాలు అవినీతి, అక్రమాలు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న పరిటాల కుటుంబాన్ని వెనకేసుకు రావటం ద్వారా సీపీఐ నేత రామకృష్ణ కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బతీశారంటూ జిల్లాలోని వామపక్ష వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
టార్గెట్ దేవరకొండ నియోజకవర్గం: కమ్యూనిస్టులకు ఎందుకు కోపం?
కమ్యూనిస్టు పార్టీ ఆ ఎమ్మెల్యేపై పగ పట్టిందా? నల్గొండ జిల్లాలోని ఓ ఎమ్మెల్యేపై తెలంగాణ సీపీఐ పగ సాధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎలాగైనా ఆ సీటు తన ఖాతాలో వేసుకోవాలని నిర్ణయించుకుంది. సీపీఐ ప్రతిపాదనతో అక్కడి గులాబీ ఎమ్మెల్యేకు నిద్ర కరువైంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? సీపీఐ పగ పట్టడానికి కారణం ఏంటి? గెలవలేరు కానీ ఓడించగలరు.! ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎన్నో కొన్ని ఓట్లున్నాయి. ఆ ఓట్లే ఒక పార్టీని ఓడించడానికైనా.. మరో పార్టీని గెలిపించడానికైనా పనికొస్తాయి కాని... లెఫ్ట్ పార్టీలను ఒంటరిగా గెలిపించడానికి సరిపోవు. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాల ఓట్లే గులాబీ పార్టీని గట్టెక్కించాయి. మునుగోడు ఫలితం తర్వాత వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలతో గులాబీ పార్టీ పొత్తు కొనసాగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో ఈ పొత్తు గులాబీ పార్టీకి ఎంతో అవసరమని కూడా కేసీఆర్ గుర్తించినట్లు ప్రచారం సాగుతోంది. ఒక పక్క కాంగ్రెస్..మరో పక్క కమలం పార్టీని ఢీకొట్టాలంటే కమ్యూనిస్టుల సహకారం తప్పనిసరిగా గులాబీ పార్టీ బాస్ గుర్తించారు. ఇప్పుడు ఈ పరిణామమే జిల్లాలోని దేవరకొండ ఎమ్మెల్యేకు చమటలు పట్టిస్తున్నాయి. ఇంకో ఇకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా టెన్షన్ పడుతున్నారని టాక్. ప్రస్తుతం జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు కారు పార్టీలోనే ఉన్నారు. పొత్తులతో లెక్కల తక్కెడ కమ్యూనిస్టులతో పొత్తు కుదిరితే సీటు పోతుందని టెన్షన్ పడుతున్నవారిలో.. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ముందు వరుసలో ఉన్నారు. జిల్లాలో చెరో సీటు కేటాయించాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కచ్చితంగా కేసీఆర్‌ను కోరుతాయి. సీపీఐ కోరే సీటులో మునుగోడు లేదా దేవరకొండ మాత్రమే ఉంటాయి. మునుగోడు ఇటీవలే కష్టపడి గెలుచుకున్నందున వెంటనే దాన్ని వదులుకోవడానికి గులాబీ నేతలు ఒప్పుకోకపోవచ్చు. ఇక దేవరకొండ కూడా ఒకప్పుడు సీపీఐదే గనుక ఆ పార్టీ కచ్చితంగా దేవరకొండ తీసుకుంటుందని అక్కడి ఎమ్మెల్యే టెన్షన్ పడుతున్నారు. సిటింగులందరికీ సీట్లు ఖాయమని కేసీఆర్ ప్రకటించిన తర్వాత కూడా సీపీఐ కారణంగా అక్కడి ఎమ్మెల్యేకు టెన్షన్ తప్పడంలేదు. టార్గెట్ దేవరకొండ మునుగోడు కంటే దేవరకొండ మీదే సీపీఐ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. దీనికి కూడా గట్టి కారణమే ఉంది. ఎందుకంటే..ప్రస్తుత గులాబీ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్...2014 ఎన్నికల్లో సీపీఐ గుర్తు మీదే గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. సుదీర్ఘ కాలం ఎర్ర పార్టీతో ఉండి...పార్టీ గెలిపించిన ఎమ్మెల్యే సీటును గులాబీ పార్టీకి అప్పగిస్తావా అనే ఆగ్రహం సీపీఐ నేతల్లో ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో దేవరకొండ తీసుకుని రవీంద్రకుమార్‌కు బుద్ధి చెప్పాలని సీపీఐ నేతలు గట్టిగా నిర్ణయించుకున్నారని టాక్. రవీంద్రకుమార్ నిర్వాకంతో ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అసెంబ్లీలో సీపీఐకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అందుకే కారు పార్టీతో పొత్తు కుదిరితే ముందుగా దేవరకొండపైనే గురి పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా ముందుకెళ్తారా? ఇప్పటికీ దేవరకొండలో సీపీఐకి బలమైన కేడర్ ఉందంటారు. మరోవైపు పార్టీ నుంచి గెలిచి కండువా మార్చిన రవీంద్ర కుమార్‌కు బుద్ధి చెప్పాలంటే అక్కడ పోటీ చేయాలని లోకల్ కేడర్ కూడా నాయకత్వంపై ఒత్తిడి తెస్తోందట. ఈ నేపథ్యంలో దేవరకొండ స్థానాన్ని సీపీఐకి కేటాయిస్తే తన పరిస్థితి ఏంటా అని రవీంద్ర కుమార్ తీవ్రంగా మదన పడుతున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. సీటును త్యాగం చేసి పోటీకి దూరంగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశముందని ఆయన ఆందోళన పడుతున్నారట. అయితే రవీంద్ర కుమార్ రెండు సార్లు విజయం సాధించడంతో ఎలాగూ ఓటర్ల నుంచి కొంత వ్యతిరేకత ఉందని గులాబీ పార్టీ భావిస్తోందట. ఈ నేపథ్యంలో సీపీఐకి దేవరకొండను కేటాయిస్తే పోలా.... ఎర్ర పార్టీకి అడిగిన సీటూ ఇచ్చినట్లూ ఉంటుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి కారెక్కారో...ఇప్పుడు ఆ పార్టీ వల్లే తన రాజకీయ భవిష్యత్‌కు గండి పడుతోందని రవీంద్రకుమార్ బాధపడుతున్నారట. పెంచి పెద్ద చేసిన పార్టీకి ఏమిచ్చామో..అదే తిరిగి వస్తుందని తనకు తానే చెప్పుకుంటున్నారట పాపం. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రేవంత్‌పై నిర్మల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: భాషపై నిండు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అవమానించడం ఏంటని, వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విచారం వ్యక్తం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఒక సభ్యుని పట్ల అనుచితంగా మాట్లాడటం సమంజసం కాదని మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. సభ కస్టోడియన్‌గా సభ్యుల హక్కులు, మర్యాదను కాపాడాల్సిన లోక్‌సభ స్పీకర్ కూడా రేవంత్‌రెడ్డి రక్షణకు రాకపోగా.. నిర్మలా సీతారామన్‌ను సమర్థించేలా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులకున్న చులకన భావాన్ని ఈ ఘటన తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి హిందీలో మాట్లాడటాన్ని హేళన చేయడం సమర్థనీయం కాదన్నారు. అయినా రేవంత్‌రెడ్డి తన భావాన్ని హిందీలో అర్థమయ్యే రీతిలోనే స్పష్టంగా వ్యక్తీకరించారని, ఆయన లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా నిర్మలా సీతారామన్ కించపరిచేలా మాట్లాడటం ఏంటని కూనంనేని ప్రశ్నించారు. -
సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: సామాన్యుడికి ధరల మంట కాస్తంత తగ్గింది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారోత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో నవంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతానికి దిగొచ్చింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే ఏడాది తర్వాత మళ్లీ తక్కువ ధరలు చూస్తున్నాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (వినియోగ ధరల ఆధారిత సూచీ/రిటైల్ ద్రవ్యోల్బణం) గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా రెండో మాసం. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) అంతకుముందు అక్టోబర్‌లో 6.77 శాతంగా ఉంది. 2021 నవంబర్ నెలలో ఇది 4.91 శాతంగా ఉండడం గమనార్హం. ఏడాది క్రితంతో పోలిస్తే ఇప్పటికీ 1శాతం మేర అధికంగా ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడే ధ్యేయంగా ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ, వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తుండడం తెలిసిందే. ఈ నెల మొ దటి వారంలో ముగిసిన తాజా ఎంపీసీ సమీక్షలోనూ కీలక రెపో రేటు 0.35శాతం మేర పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే రెపో రేటు మొత్తం మీద 2.25 శాతం ఎగిసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6శాతం లోపునకు దిగొస్తుందని, రానున్న రోజుల్లో ధరల మంట కాస్తంత చల్లారుతుందని ఇటీవలి సమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. (ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి) ధరల తీరు...: ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 7.01 శాతంగా ఉంటే అది నవంబర్ నెలకు 4.67 శాతానికి క్షీణించింది. సీపీఐలో ఆహారోత్పత్తుల వాటా 40 శాతం. కూరగాయల ధరలు 8 శాతం మేర తగ్గాయి. ఇక వంట నూనెల ధరలు 0.63 శాతం, చక్కెర ధరలు 0.25 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ధాన్యాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం ఇంకా గరిష్ట స్థాయిలో 12.96శాతం వద్ద ఉంటే, వంట దినుసులకు సంబంధించి 19.52 శాతం, పాల ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతం, పప్పులకు సంబంధించి 3.15శాతంగా నమోదైంది. చమురు, పొగాకు, మత్తు కారకాల రేట్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎక్కువలోనే ఉన్నాయి. వస్త్రాలు, పాదరక్షల ధరలు 9.83శాతం, ఇళ్ల ధరలు 4.57శాతం పెరిగాయి. ‘డిసెంబర్‌లోనూ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడితే వచ్చే ఫిబ్రవరి సమీక్షలో పాలసీ రేట్ల సమీక్షలో కీలక అంశంగా మారుతుందని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. ఊహించని విధంగా ద్రవ్యోల్బణం 6 శాతం లోపునకు దిగివచ్చినట్టు చెప్పారు. నవంబర్ నెలకు 5.88 శాతం చర్యల ఫలితమే ఇది..: ఆహార ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా, ద్రవ్యోల్బణం ఆర్బీఐ నిర్దేశిత గరిష్ట పరిధి అయిన 6 శాతం లోపునకు దిగొచ్చింది. ధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. ఈ చర్యల ఫలితాలు రానున్న నెలల్లో ద్రవ్యోల్బణంపై ఇంకా ప్రతిఫలిస్తాయి. – కేంద్ర ఆర్థిక శాఖ ట్వీట్ -
ఉద్రిక్తతల నడుమ ‘చలో రాజ్‌భవన్’
పంజగుట్ట: గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఐ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్’తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వందలాదిగా సీపీఐ కార్యకర్తలు ఖైరతాబాద్ కూడలి వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ భారీ గా మోహరించిన పోలీసులు బ్యారికేడ్లు వేసి వారిని అక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది కార్యకర్తలు మక్తా రైల్వేగేటు మీదుగా రాజ్‌భవన్ ముట్టడికి యత్నించగా వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఖైరతాబాద్ కూడలివద్ద ఆందోళనకారులు సేవ్ డెమోక్రసీ, సేవ్ ఫెడరల్ సిస్టం, గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాలి అని నినాదాలు చేస్తూ బైఠాయించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు అజీజ్ పాషా, చాడా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేశ్‌తో పాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నగరంలోని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ...గవర్నర్ పదవిని అడ్డంపెట్టుకుని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే దానికి వ్యతిరేక పార్టీలను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహంవ్యక్తం చేశారు. ఎన్‌టీఆర్‌లేని సమయంలో అప్పటి గవర్నర్ రాంలాల్ ప్రభుత్వాన్ని రద్దు చేశారని గుర్తుచేశారు. ఇటీవల మహారాష్ట్రలో, గోవాలో అలానే జరిగిందన్నారు. ఈ నెల 29న అన్ని రాష్ట్రా ల్లో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాజ్ భవన్ వద్ద సీపీఐ నినాదాలు
-
మళ్లీ అలజడి ..అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: అడవుల్లో మళ్లీ అలజడి నెలకొంది. సీపీఐ(మావోయిస్టు) పీఎల్జీఏ(పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల నేపథ్యంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య యుద్ధవాతావరణం ఏర్పడింది. కొయ్యూరు ఎన్కౌంటర్ స్మృత్యార్థం వారోత్సవాలను ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీంతో వారం ముందు నుంచే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో ఓవైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల చర్యలు అడవిలో కలకలం రేపుతున్నాయి. వారోత్సవాలను విజయవంతం చేయాలని లేఖలు, కరపత్రాలు, పోస్టర్ల ద్వారా మావోయిస్టులు విస్తృతంగా ప్రచారం చేయగా, ‘అమాయక ఆదివాసీలను అంతం చేసే మావోయిస్టులు’అంటూ వారికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కాగా, మరో రెండు/రోజుల్లో ముగిసే పీఎల్జీఏ వారోత్సవాలను తెలంగాణలో నిర్వహించాలన్న మావోయిస్టుల ప్లాన్‌ను పసిగట్టిన ఇంటెలిజెన్స్ పోలీసులను అప్రమత్తం చేసింది. దీంతో సోమవారం సాయంత్రం నుంచి మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. పూర్వ వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్ పహారా కాస్తోంది. అడవులు జల్లెడ.. అరెస్టులు, ఎన్కౌంటర్లు.. జేఎస్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కుమురంభీమ్, ఆసిఫాబాద్ జిల్లాలను ఆనుకుని ఉన్న గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా వేశారు. ఈ సందర్భంగా నెలరోజుల వ్యవధిలో వివిధ ప్రాంతాల్లో 22 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, 31 మంది లొంగిపోయినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ప్రకటించారు. ఇదే సమయంలో ఇటీవల బాలాఘాట్ జిల్లా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో జీఆర్బీ, కేబీ డివిజన్ కోఆర్డినేషన్ టీం ఇన్చార్జి గణేశ్ మరావి(35), భోరమ్‌దేవ్ కమిటీ పీఎల్–2 కమాండర్ రాజేశ్ మృతి చెందగా, ఓ మహిళామావోయిస్టు తప్పించుకున్నారు. బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు–మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ కడ్తి(40), మట్వారా ఎల్వోఎస్ సభ్యుడు రమేశ్(32), మహిళా మావోయిస్టునేత సుమిత్ర (28), మరో మహిళా మావోయిస్టు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రశ్నించగా మావోయిస్టు కొరియర్‌గా తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. అన్నల అమ్ములపొదిలో విదేశీ ఆయుధాలు నిత్యనిర్బంధంలోనూ మావోయిస్టులు విదేశీ ఆయుధాలను వాడుతుండటం మూడు రాష్ట్రాల పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలో 1978లో మొదట తపంచాతో మొదలైన సాయుధీకరణ ఏకే–47, ఎల్‌ఎంజీల వరకు వెళ్లగా, ప్రస్తుతం అమెరికా, రష్యా మేడ్ ఆయుధాలను వాడుతుండటం గమనార్హం. మొదట పూర్వ కరీంనగర్ జిల్లా జగిత్యాల డివిజన్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందిన అగ్రనేత పులి రాములు వద్ద ఏకే–47 తుపాకీ పోలీసులకు లభించింది. కాగా, ఇటీవల ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు– మావోయిస్టు దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. అక్కడ నాలుగు ఆయుధాలు, పేలుడు సామగ్రి, కిట్ బ్యాగులు, విప్లవ సాహిత్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి అమెరికాలో తయారైన ఎం1 కార్బైన్ తుపాకీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పీఎల్జీఏ వారోత్సవాలు మరో రెండు రోజులే ఉన్న సందర్భంగా మావోయిస్టులు అధునాతన ఆయుధసంపత్తిని కూడా ఉపయోగించే అవకాశముందన్న సమాచారం మేరకు గ్రేహౌండ్స్, పారా మిలటరీ బలగాలు మూడు రాష్ట్రాల సరిహద్దు, గోదావరి పరీవాహక ప్రాంతంలో మోహరించడం కలకలం రేపుతోంది. -
మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆరాటం.. ఎక్కడి నుంచి పోటీ?
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కేంద్ర బిందువైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ విజయంలో భాగస్వాములు కావడంతో ఎర్ర పార్టీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే జిల్లా నుంచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చన్నది వారి ఆరాటం. టీఆర్ఎస్తో పొత్తు కుదిరితే సీపీఐ, సీపీఎంలు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాయి? ఇదే అదను, దిగాలి బరిలోకి ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల ఖిల్లా అనేవారు. కాల క్రమంలో అదంతా గత వైభవంగా మిగిలిపోయింది. గతంలో మిర్యాలగూడ, నకిరేకల్, నల్లగొండ, దేవరకొండ, మునుగోడు నుంచి ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో దేవరకొండలో సీపీఐ తరపున రవీంద్ర కుమార్ గెలిచారు. కానీ ఆయన సొంత పార్టీకి హ్యాండిచ్చి టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. గత ఎన్నికల్లో కూడా గెలిచి దేవరకొండ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్య నాయకులే కాదు.. రెండు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కేడర్ కూడా చాలావరకు అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో జిల్లాలో వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇక జిల్లా నుంచి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు అసెంబ్లీలో అడుగుపెట్టడం కలగానే మిగిలిపోతుంది అనుకున్నారు అంతా. ఇటువంటి క్లిష్ట సమయంలో వామపక్షాలకు మునుగోడు రూపంలో ఓ వరం లభించి పునర్జన్మ పొందినట్లు అయిందని చెప్పవచ్చు. మిర్యాలగూడ ఎవరికి? దేవరకొండ ఎవరికి? మునుగోడులో అధికార టీఆర్ఎస్కు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతుగా నిలిచాయి. బీజేపీని ఓడించే లక్ష్యంతో రెండు పార్టీలు గులాబీకి దన్నుగా ఉన్నాయి. ఇప్పుడిదే వారికి కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల నాటికి లెఫ్ట్, టీఆర్ఎస్ మధ్య పొత్తగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. లెఫ్ట్ పార్టీలు గులాబీ పార్టీతో పొత్తుపై పూర్తి నమ్మకంతో ఉన్నాయి. అదే జరిగితే జిల్లాలో రెండు పార్టీలు ఒక్కో స్థానాన్ని తమకు కేటాయించాలని అడగనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం మిర్యాలగూడ స్థానాన్ని, సీపీఐ మునుగోడు లేదా దేవరకొండ స్థానంలో ఒకదాన్ని తమకు కేటాయించాలని కోరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీపీఐ మునుగోడు కంటే దేవరకొండ సీటుపైనే మక్కువగా ఉన్నట్లు సమాచారం. తమ పార్టీ నుంచి గెలిచి మోసం చేసి పార్టీ మారిన రవీంద్ర కుమార్‌ను దెబ్బ తీయాలని సీపీఐ నాయకత్వం భావిస్తోంది. అయితే జిల్లాలో సీపీఐకి అంతో ఇంతో కేడర్ ఉన్న నియోజకవర్గం అదే కావడం మరో కారణం. ఒకవేళ దేవరకొండలో అవకాశం రాకపోతే మునుగోడు సీటునే కోరనుంది. ఇక్కడి నుంచి ఇప్పటికే ఆ పార్టీ ఐదు సార్లు గెలవడం పార్టీ కేడర్ ఇంకా మిగిలే ఉండటంతో మునుగోడును ఇవ్వాలని బలంగా కోరే అవకాశం కనిపిస్తోంది. చదవండి: ఫాంహౌజ్ ఎపిసోడ్ ప్రకంపనలు.. కారు పార్టీలో తెర వెనక్కి ఇద్దరు.? జూలకంటి రెఢీ ఇక సీపీఎం కూడా నల్గొండ జిల్లాలో ఒక సీటు కోరుదామనే ఆలోచనలో ఉందని సమాచారం. మిర్యాలగూడ సీటు తీసుకుని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని బరిలో దించాలనే ఆలోచనలో సీపీఎం ఉందని టాక్. ఇప్పటికీ అక్కడ ఆ పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయి. ఎలాగూ అక్కడి సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనాలతో పాటు నియోజకవర్గానికి చెందిన పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం, కేడర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి అక్కడ సిట్టింగ్‌కు సీటు ఇస్తే అధికార పార్టీకి చేతులు కాలే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో గులాబీ పార్టీ నాయకత్వం కూడా మిర్యాలగూడ సీటును సీపీఐఎం పార్టీకి కేటాయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇప్పటికే ఓ సభలో తనకు టికెట్ రాకున్నా పార్టీ కోసం పనిచేస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. అంటే ఆయనకు కూడా ఈ విషయంలో ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు రూపంలో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. ఈ బంధం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగితే ఉబయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. -
బాబా రాందేవ్ పై సీపీఐ నారాయణ ఫైర్
-
రుషికొండ పై సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
-
CPI Narayana: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి
విశాఖ: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుందని నారాయణ తెలిపారు. ఈరోజు(శుక్రవారం) రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. ‘రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణమనేది అవాస్తవం.కొండపైకి ఎవరినీ అనుమతించకపోవడం వల్లే అపోహలు’ అని పేర్కొన్నారు. -
ఆరోజు ఏమయ్యావు రామకృష్ణా?!.. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు
సాక్షి, రాప్తాడురూరల్: ‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్ ఇండస్ట్రీస్) యాజమాన్యం గుడ్‌విల్ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? 1994లో నిన్ను (రామకృష్ణ) అనంతపురం ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆ తర్వాత నిన్ను నువ్వు అమ్మేసుకున్నావ్. పరిటాల కుటుంబానికి రాసిచ్చేశావు. నీ కమ్యూనిజాన్ని పక్కన పెట్టేసి మరో ఇజానికి వెళ్లిపోయావు. ఈ జిల్లాకు నీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకుండా నన్ను ఏవిధంగా విమర్శిస్తావ్. పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పది మందిని వెంటేసుకుని వచ్చి డ్రామా నడిపి పోతావా? సోము వీర్రాజు కూడా నా గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు పత్రిక రాసిందల్లా నిజాలని భావించడం తగదు. అది లూటీ ఇండస్ట్రీస్ పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. జార్ఖండ్, చత్తీస్ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లో భూముల కోసం ప్రయత్నించింది. పెట్టుబడులు పెడతామని అనేక రాష్ట్రాలకు వెళ్లిన సంస్థ ఎక్కడా పెట్టింది లేదు. పై మూడు రాష్ట్రాల్లో వాటి జీఎస్టీ నంబర్లు కూడా రద్దయ్యాయి. అంటే అక్కడ వ్యాపారాల్లేవు. కానీ రాప్తాడు అడ్రెస్‌తో ఉన్న ఆ సంస్థ జీఎస్టీ మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఆరోజుల్లో వంద కోట్ల విలులైన భూములు కేవలం మూడు కోట్ల రూపాయలకు కంపెనీకి కేటాయించడంతో తప్పుమంత్రి ముడుపులు ఆశించారు. ఈ క్రమంలోనే కాంపౌండ్ నిర్మాణ పనులు అర్ధంతరంగా ఆపేశారు. భూములు ఇచ్చింది మీరు..లంచం అడిగింది మీరు..ఎగ్గొట్టి పోయింది పేజ్ ఇండ స్ట్రీస్. మరి ఇందులోకి మేము ఎక్కడి నుంచి వచ్చాం? పేజ్ ఇండస్ట్రీస్‌ను రమ్మని పిలవండి. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధంగా లక్షా 50 వేల చదరపు అడుగుల ఫ్యాక్టరీని నేను నిర్మించి ఇస్తా. అప్పటికీ వారు రాకపోతే ఏమనుకోవాలి? వారు రాకపోయినా వేరే సంస్థలైతే కచ్చితంగా తీసుకొస్తాం. ఇప్పటికే దాదాపు 20 సంస్థల ప్రతినిధులతో మాట్లాడాం. డిపాజిట్లు రావని తెలిసీ పరారీ మంత్రం రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిసే పరిటాల కుటుంబం పరారీ మంత్రం పఠిస్తోంది. ధర్మవరం, పెనుకొండ సీట్లు అడుగుతోంది. కానీ చంద్రబాబు ఆ సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్నారు. మీరు రాప్తాడులోనే పోరాడాలి. ఇక్కడ మీరు గెలవాలంటే నన్నైనా చంపాలి లేదంటే క్యారెక్టర్‌నైనా చంపాలి. అందులో భాగంగానే ఇప్పుడు నా క్యారెక్టర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పరిటాల కుటుంబం రాజ్యమేలినప్పుడు ఈ ప్రాంత ప్రజలు కరువుతో వేలాదిమంది వలసలు వెళ్లారు. ఈ రోజు చెరువుల నిండా నీళ్లున్నాయి. పేరూరు డ్యాం పొంగి పొర్లుతోంది. ఆయకట్టు కళకళలాడుతోంది. 27 వేల ఇళ్లను మంజూరు చేయించా. పది వేలమంది పాడి మహిళా రైతుల కోసం తోపుదుర్తి సహకార డెయిరీ నిర్మిస్తున్నా. రైతులకు ఉచితంగా ఆరు వేల బోర్లు వేయిస్తున్నాం. ఇది చూసే పరిటాల సునీత కళ్లల్లో కన్నీరు. రైతుల పేరుతో పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉంద’ని అన్నారు. సమావేశంలో రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ బెడదూరి గోపాల్‌రెడ్డి, అనంతపురం రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, ఏడీసీసీ బ్యాంకు డైరెక్టర్ జనార్దన్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణ, నాయకులు ఆది, చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
25 అసెంబ్లీ సీట్లపై సీపీఐ దృష్టి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాలపై సీపీఐ దృష్టి కేంద్రీకరించింది. వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో 25 నియోజకవర్గాల్లో బలోపేతంపై కసరత్తు చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, అన్ని నియోజకవర్గాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేయాలని, 25 సీట్లల్లో మాత్రం పార్టీని పటిష్టంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలన్నదానిపై పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇతర పార్టీలతో పొత్తు కుదరకపోతే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసేలా సన్నద్ధం కావాలన్నది ఆ పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం. అంతేకాక పొత్తుల్లో ఎక్కువ సీట్లు అడగాలన్నా, 25 నియోజకవర్గాల్లో బలం ఉందని చూపించుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా ఉందని చెబుతున్నారు. తాము మద్దతు ఇచ్చే పార్టీ గెలుపు ఓటములను నిర్ణయించే శక్తి తమకుందని నిరూపించుకోవడం కూడా కీలకమన్న భావన ఉంది. బీజేపీకి ఉన్న బలమెంత? రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ తమకు పార్టీ కమిటీలున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన పార్టీ అని సీపీఐ నేతలు అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో బలమైన పార్టీగా ఉన్నామని చెపుతున్నారు. వాస్తవంగా ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ డబ్బుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందే కానీ, తమతో పోలిస్తే ఆ పార్టీ బలమెంత అని సీపీఐ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రచారం అధికంగా చేసుకుంటోందని, కానీ తాము అంత ప్రచారం చేసుకోవడంలేదని చెపుతున్నారు. ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని, తాము ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల్లో బలమైన చోట్ల సీట్లను అడిగి తీరుతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఇటీవల పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో జరిగిన విషయం విదితమే. రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జాతీయ నాయకత్వం నొక్కిచెప్పింది. పార్టీ బలం పెంచుకోకుండా ఎన్నికల్లో ముందుకు సాగలేమని నాయకత్వం భావిస్తోంది. పొత్తుల్లోనూ బలం నిరూపించుకోవాల్సిందేనని అంటున్నారు. ‘బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రానున్న ఎన్నికలకు వెళతాము. అందుకోసం రాష్ట్రంలో వామపక్షాలు, టీఆర్ఎస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి. అదే సందర్భంలో మేం గెలవగలిగే స్థానాలపై సరైన అవగాహనకు రావాల్సి ఉంది. పొత్తుల పేరుతో పార్టీకి బలం ఉన్న స్థానాలను వదులుకునే ప్రసక్తే లేదు’అని ఒక నేత అభిప్రాయపడ్డారు. కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శిగా పగ్గాలు చేపట్టాక పార్టీ పటిష్టత పైన, ప్రచారంపైన ప్రత్యేకంగా దృష్టిసారించారని నాయకులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
ఎన్నికలనాటి పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో పొత్తులు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో తమ పొత్తులు, అవగాహనలు ఉంటాయని సీపీఐ జాతీయ ప్రధా నకార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికశక్తులు, ప్రాంతీయ పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టు కుంటుందని వెల్లడించారు. తెలంగాణలోనూ ఇదే వైఖరి అవలంభిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ముందస్తుగానే ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డి.రాజా గురువారం విలే కరులతో మాట్లాడారు. 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ వాగ్దానం ఏమైందని రాజా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను గవర్నర్లు ముందుకు తీసుకెళ్తున్నారని, ఇటీవల తమిళనాడు గవర్నర్ సనా తన ధర్మాన్ని ప్రస్తావించిన విషయాన్ని రాజా గుర్తుచేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే అంశంలో తన ఆలోచనను మార్చుకోవాలని సూచించారు. అనేక ప్రాంతీయ పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, బిహార్‌లో నితీశ్‌కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఒక కూటమిగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో ముందుకు సాగుతామన్నారు. గుజరాత్లో బీజేపీ ఓటమిపాలైతే, అక్కడి నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభం కానుందన్నారు. మిలియన్ సభ్యత్వాలు... మరో రెండేళ్లలో సీపీఐ శతాబ్ది వార్షికోత్సవానికి చేరుకోబోతున్న సందర్భంగా మిలియన్ సభ్యత్వాలను చేర్పించాలని రాజా పిలుపునిచ్చారు. కార్పొరేట్ ఫండ్స్‌లో బీజేపీకి ఎక్కువ వస్తున్నాయని, దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీ అని, అధికారంలోనికి వచ్చేందుకు ఆ పార్టీ విపరీతమైన డబ్బులను వెదజల్లుతోందని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేం: కూనంనేని ఎన్నికల పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న నల్లగొండ, ఇతర జిల్లాల్లోని స్థానాలను అడుగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. బీజేపీని ఓడించే బల మైన ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతోనే ఎన్నికల అవగాహన ఉంటుందన్నారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టంచేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడు తూ.. ప్రైవేటు విమానాల ద్వారా హవాలా డబ్బు, బంగారు ఆభ రణాలు తరలుతున్న నేపథ్యంలో ప్రైవేటు విమానాలలో తనిఖీ చేపట్టాలని, వీటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో కొత్త పొత్తులకు దారి తీస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్కు పొత్తు కుదిరితే కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ సీపీఐ కోటా కిందకు వెళుతుందనే ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే హుస్నాబాద్ గులాబీ ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేస్తారు? అసలు బరిలో ఉంటారా? లేదా? నాడు కమ్యూనిస్టుల కంచుకోట హుస్నాబాద్ నియోజకవర్గం.. కరీంనగర్ జిల్లాలో వామపక్షాలకు ఒకనాటి కంచుకోట. ఇక్కడ సీపీఐ నాయకులు దేశిని చిన మల్లయ్య ఐదుసార్లు, చాడ వెంకట్ రెడ్డి ఒకసారి విజయం సాధించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి సతీష్‌కుమార్ విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా వామపక్షాలతో, టీఆర్ఎస్ పొత్తు గురించి ప్రచారం జరుగుతుండటంతో.. హుస్నాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దారెటు అనే చర్చ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినప్పటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న కేసీఆర్ మిత్రుడు కెప్టెన్ లక్ష్మీకాంత్ రావ్ తనయుడే సతీష్ కుమార్. టీఆర్ఎస్లోని ఈక్వేషన్స్ వల్ల వారి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ నుంచి హుస్నాబాద్ కు వెళ్ళి సతీష్‌కుమార్ పోటీ చేసి గెలిచారు. పొత్తు పొడుస్తుందా? కొత్తగా పొత్తు పొడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కరీంనగర్ జిల్లాలో సీపీఐ ముందుగా అడిగే స్థానం హుస్నాబాద్ అవుతుంది. గులాబీ దళపతి కేసీఆర్ కొత్తగా దోస్తీ కలిసిన మిత్రపక్షం కోసం హుస్నాబాద్ ఇవ్వడానికి ఒకే అంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ప్రస్తుత టీఆరెఎస్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిస్తితి ఏంటనే చర్చ నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో జరుగుతోందట. హుస్నాబాద్ నుంచి మళ్లీ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌కు వలస వెళ్లాల్సిన పరిస్తితి ఏర్పడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సతీష్‌కుమార్ కుటుంబం అంతా అక్కడే రాజకీయంగా ఎదిగింది. కుటుంబ వ్యాపారాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈటల రాజేందర్ కోసం గతంలో సతీష్‌కుమార్‌ను హుస్నాబాద్‌కు పంపించారు కేసీఆర్. ప్రస్తుతం ఈటల బీజేపీలో చేరినందున అక్కడ గులాబీ పార్టీలో కొంతవరకు ఖాళీ ఏర్పడిందంటున్నారు. చదవండి: (తెలంగాణలో ఎన్నికల వేడి.. కారు ఫైరింగ్.. అనూహ్యంగా ఎదిగిన కమలం) హుజురాబాద్‌తో లింకు ఈటల రాజీనామా కారణంగా జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్వీ కార్యకలాపాల్లో మళ్లీ నిమగ్నం అయ్యారు. ఆ సీటు ఆశించి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిన కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ సీటుకు బదులుగా ఎమ్మెల్సీ సీటు దక్కింది. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ... తానే హుజూరాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ చెప్పుకుంటున్నారు పాడి కౌశిక్‌రెడ్డి. అయితే ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నందున హుజూరాబాద్ సీటు సతీష్ కుమార్‌కు ఇచ్చే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాల్లో టాక్. కాని ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ పదవిని తీసుకోవాలని కోరుకుంటున్నారట. ఇదే నిజమైతే అటు హుస్నాబాద్ ఇటు హుజూరాబాద్ రెండింటిలోనూ కొత్త అభ్యర్థులు బరిలో దిగుతారని అనుకోవచ్చు. చదవండి: (MLAs Purchase Case: బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు) -
పొలిటికల్ కారిడార్: పాలేరు నాదే అంటున్న ఎర్రన్న..
-
ఈ పోలీసులు కేంద్ర బలగాలా? కేసీఆర్ పోలీసులా?
సాక్షి, హైదరాబాద్: తమ కార్యాలయం లోపలికి ఎప్పుడూ రాని పోలీసులు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తే మాత్రం లోపలికి వచ్చారని, ఇంతకు ఈ పోలీసులు మోదీకి చెందిన కేంద్ర బలగాలా? లేదా సీఎం కేసీఆర్ పోలీసులా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఆ పార్టీ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, ఇ.టి.నర్సింహతో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణతో సింగరేణి సంస్థను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రధాని పర్యటన రాజకీయ దురుద్దేశంతో కూడిందే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడలేదన్నారు. మునుగోడులో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరాశ చెందకుండా ఉండేందుకే మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారని ఎద్దేవాచేశారు. సింగరేణి సంస్థలో 49 శాతం వాటా ఉన్న కేంద్రం దీన్ని ప్రైవేటు పరం చేయలేదని, అందుకే ఈ సంస్థను చంపే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ధ్వజమెత్తారు. 2015లో గోదావరి పరివాహక ప్రాంతంలోని బొగ్గుబావిని సింగరేణికి ఇవ్వాలనే మైన్స్ మినరల్స్ డెవలప్ రెగ్యులేషన్ చట్టాన్ని 2015లో సవరించి, కమర్షియల్ మైనింగ్ అనుమతినిచ్చారన్నారు. తద్వారా ఇప్పటికే 240 మైన్స్ ప్రైవేటుకు ఇవ్వాలని గుర్తించారని, ఇందులో 98 మైన్స్ ప్రైవేటు వ్యక్తులకు కేటాయించారని వివరించారు. ఇందులో బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారని నారాయణ తెలిపారు. -
మోదీకి వ్యతిరేకంగా నిరసనలు.. 7 వేల మంది సీపీఐ కార్యకర్తల అరెస్టు
సాక్షి, హైదరాబాద్/జైపూర్ (చెన్నూర్): రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన నిర సన కార్యక్రమాల్లో 7 వేల మంది సీపీఐ కార్య కర్తలు, ఏఐటీయూసీ, వివిధ ప్రజా సంఘాల శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. శని వారం తెల్లవారుజాము నుంచే అనేకమందిని గృహనిర్బంధం చేశారు. అలాగే పలువురిని నిరసనల సందర్భంగా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును రామగుండం వెళ్తుండగా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేన శంకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి తదితరులను మంచిర్యాల జిల్లా జైపూర్ స్టేషన్‌కు తరలించారు. అలాగే సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన నిరసనలో పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సహా పలువురిని అరెస్టు చేసి అబిడ్స్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మను ఇంటి వద్ద అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లో నిరసన చేపట్టిన సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాలమల్లేశ్, ఈసీ ఐఎల్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వి.ఎస్.బోస్ అరెస్టయ్యారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం సీపీఐ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మఖ్దూంభవన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీ సులు రాష్ట్ర కార్యాలయం లోపలికి వచ్చి కార్యకర్తలు వేసుకుంటున్న నల్ల చొక్కాలను లాక్కోవడం, అరెస్ట్ చేయడం దుర్మార్గమని కె.నారాయణ మండిపడ్డారు. హక్కులను కాలరాశారు: కూనంనేని రాష్ట్రంలో మోదీ పర్యటన రాచరిక పాలనలో రాజు పర్యటనలా సాగిందని, ఆయనను వ్యతిరేకించే వారిని పోలీసులు ముందే నిర్బంధంలోకి తీసుకున్నారని కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటి వరకు ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కాగా, తమ నాయకుల అరెస్టుకు నిరసనగా సీపీఐ జిల్లా కమిటీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జైపూర్ బస్టాండ్ నుంచి పోలీసుస్టేషన్‌కు వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండాపోయిందని, ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. చదవండి: నిమ్స్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: తమ్మినేని -
ఒక్క సీటుకు టీఆర్ఎస్ నుంచి ముగ్గురి పోటీ? పార్టీ అలా చేస్తే మాత్రం ట్విస్టే!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. అక్కడున్న జనరల్ సీట్లు కేవలం మూడే కావడంతో పోటీపడేవారు ఎక్కువయ్యారు. పార్టీలోని పోటీ తట్టకోవడమే కష్టంగా ఉంటే... ఇప్పుడు సీపీఐ నుంచి మరో ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన పడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. ఇంటా, బయటా జరిగే పోటీలో తమకు సీటు దక్కుతుందా లేదా అనే లెక్కలు వేసుకుంటున్నారు. ఆ సీటులో నేనే పోటీ చేస్తా.! ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెరో ఐదు సీట్లు వచ్చాయి. వీటిలో కేవలం మూడే జనరల్ సీట్లు ఉండగా... కొత్తగూడెం జిల్లాలో అయితే ఒక్క కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు గిరిజనులకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కొత్తగూడెం సీటు కోసం టీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యే... ఇతర నాయకుల మధ్య పోటీ మొదలైంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జలగం వెంకట్రావు పరాజయం చెందారు. గెలిచిన కొంతకాలానికే వనమా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారులో ప్రయాణం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకే కొత్తగూడెం సీటు ఇస్తారని వనమా వెంకటేశ్వరరావు చెప్పుకుంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఫోన్లు ట్యాప్ అవుతున్నది నిజమే: మధుయాష్కీ గౌడ్) సర్వేల్లో నా పేరే చెబుతున్నారు గత ఎన్నికల్లో వనమా మీద ఓడిన, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం టిఆర్ఎస్ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా సర్వేలన్నీ తనకే అనుకూలంగా ఉండటంతో గులాబీ బాస్ టికెట్ తనకే ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. వీరిద్దరితోపాటు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గా ఉన్న గడల శ్రీనివాసరావు టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే ఇటీవల ఆయన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో జీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. వారానికి రెండు రోజులు కొత్తగూడానికి కేటాయిస్తున్నారు. మరో రెండు నెలల తర్వాత కొత్తగూడెంలో ఇంకొన్ని కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. గడల శ్రీనివాసరావుకు సీఎం కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందని ఆయన వర్గీయులు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారట. దీంతో కొత్తగూడెం టిఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతోందన్న గందరగోళంలో పార్టీ శ్రేణులు ఉన్నాయి. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీరుస్తుందా? ఇదిలా ఉంటే అసలు కొత్తగూడెం టికెట్ పొత్తుల్లో భాగంగా సిపిఐ కి వెళ్తుందన్న ప్రచారం స్థానికంగా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం టికెట్ కోసం ఇప్పటినుంచే అన్ని ప్రయత్నాలు ప్రారంభించేశారట. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ తో సిపిఐ పొత్తు దాదాపు ఖరారు అయిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఖచ్చితంగా కొత్తగూడెం టికెట్ సిపిఐకి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు పరిస్థితి ఏంటన్న చర్చ సైతం ఆసక్తికరంగా సాగుతోంది. టికెట్ ఇవ్వకపోతే జంప్ జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న కొత్తగూడెం గులాబీ నేతలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ముగ్గురు నాయకులు కాంగ్రెస్, బిజేపి పార్టీలతో టచ్‌లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ సమయంలోనైనా లెక్కలు తేడా కొట్టినట్లు తెలిస్తే గోడ దూకడానికి సిద్దంగా ఉన్నారట. ఒకవైపు గులాబీ పార్టీలో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తూనే... రాకపోతే అన్న అనుమానంతో పక్క పార్టీలవైపు చూస్తున్నారు. (చదవండి: ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన) -
టీఆర్ఎస్కు కలిసొచ్చిన కమ్యూనిస్టుల మద్దతు.. కమలం ఆశలకు గండి..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీకి కమ్యూనిస్టుల పొత్తు కలిసొచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేందుకు ఈ పొత్తు దోహదపడింది. నియోజవర్గంలో సీపీఐ, సీపీఎంలకు ఉన్న బలం టీఆర్ఎస్కు తోడవడంతో ఆ పార్టీకి గెలుపు దక్కింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరడంతో వారి ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కొంత మేర టీఆర్ఎస్ వైపు మళ్లడం కూడా టీఆర్ఎస్కు లాభం చేసింది. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి గెలుపొందడం ద్వారా దక్షిణ తెలంగాణలో పాగా వేయాలని బీజేపీ భావించింది. అయితే, బీజేపీని అడ్డుకునేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ వ్యూహం అమలు చేశారు. సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడి ఆ రెండు పార్టీల మద్దతు పొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి తరఫున సీపీఎం, సీపీఐ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో 15 వేల వరకు ఉన్న తమ ఓటు బ్యాంకును టీఆర్ఎస్కు మరల్చడంలో సక్సెస్ అయ్యారు. కమ్యూనిస్టులు కలిసి రావడంతో టీఆర్ఎస్కు మేలు చేకూరింది. తద్వారా టీఆర్ఎస్ అభ్యర్థి 10,309 ఓట్ల మెజారిటీతో గెలుపాందారు. చదవండి: మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. -
కామ్రేడ్.. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్దాం? కమ్యూనిస్టు నేతల్లో కొత్త ఉత్సాహం
మునుగోడు ఉప ఎన్నిక ఖమ్మం జిల్లా గులాబీ నేతల చావుకొచ్చింది. మునుగోడులో టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగబోతోందని మూడు పార్టీల నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాకే చెందినవారు కావడంతో ఆ ఇద్దరూ కూడా అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తుతో ఈ జిల్లా నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారని ప్రచారం సాగుతోంది. మునుగోడుతో ముహూర్తం టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి. అయితే మునుగోడులో గులాబీకి ఎర్రపార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాలో తమకు బలమున్న సీట్లపై ఖర్చీఫ్ వేసేశారట. ఘన చరిత్ర.. పేలవ వర్తమానం పాతికేళ్ళ నాడు ఒకసారి ఎంపీగా గెలిచిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 2004లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 2009లో ఒకసారి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల రీత్యా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా ఉన్న అభిప్రాయం. అందుకు మూడు పార్టీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికే అందుకు ఉదాహరణ అంటున్నారు. ఈ సారి తగ్గేదేలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనరల్ సీట్లు ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మాత్రమే. మిగిలినవన్నీ రిజర్వుడు సీట్లే. అగ్రకులాలకు చెందిన నేతలు ఎంతమంది ఉన్నా అక్కడ ఉన్నది మూడు సీట్లు మాత్రమే. ఇప్పటికే ఆ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి నలుగురు సీనియర్ నేతలు పని చేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పాలేరు, కొత్తగూడెం సీట్లపై ఖర్ఛీఫ్ వేసుకున్నారట. వామపక్షాల అగ్రనేతలు తమ స్థానాల్లో సెటిలైతే తమ పరిస్థితేం కావాలంటూ గులాబీ పార్టీ ఆశావహుల్లో గుబులు మొదలైందట. మునుగోడు ఉప ఎన్నిక తమ సీట్లకు ఎసరు తెచ్చిందని గాబరా పడుతున్నారట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ గులాబీ నేతలు. గెలిచిందే ఒక్కరు, ఆ తర్వాత కారు ఎక్కేశారు ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలంటే అభిమానించేవారు ఉన్నప్పటికీ...రెండు పార్టీల నేతల తీరుతో కాలక్రమంలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే సాధించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అక్కడ బలంగానే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కారెక్కడంతో జనరల్ సీట్లు మూడు ఇప్పుడు గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. మరోవైపు జిల్లా రాజకీయాల్లో పట్టున్న ఇద్దరు కామ్రేడ్లు కొత్తగూడెం, పాలేరు సీట్లపై ఖర్చీఫ్ వేసుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. కర్చీఫ్ మిషన్ 2023 టీఆర్ఎస్కు వామపక్షాలతో పొత్తు కుదిరితే గనుక మిగిలిన సీట్ల సంగతెలా ఉన్నా తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు తమకు కావాల్సిన సీట్లపై గట్టిగా ఒత్తిడి తెస్తారని జిల్లాలో టాక్. అదే నిజమైతే గులాబీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి. ఇటీవల ఖమ్మం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాలు అటు టీఆర్ఎస్కు, ఇటు సీపీఎంకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోగలిగితే పొత్తుల వల్ల ఫలితం ఉంటుందని, కమ్యూనిస్టు పార్టీల నాయకులిద్దరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. చదవండి: పదవి అంటే పరారే.! కాంగ్రెస్‌కు ఎందుకీ పరిస్థితి? -
పొలిటికల్ కారిడార్ : ఖమ్మం టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్
-
బీజేపీ విధానాలపై పోరాటాలు తీవ్రతరం
సాక్షి, అమరావతి: దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని సీపీఐ 24వ జాతీయ మహాసభలు తీర్మానం చేశాయి. విజయవాడలో జరుగుతున్న మహాసభల వివరాలను ఆ పార్టీ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అమర్జిత్కౌర్, అతుల్‌కుమార్ అంజాన్, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు మీడియా సమావేశంలో వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక సంస్కరణల అజెండా అమల్లో వేగం పెరిగిందని, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం ప్రజల్లో తీవ్రమైన అసమనతలకు దారితీసిందని చెప్పారు. ఫలితంగా కొద్ది మంది చేతుల్లోకే సంపద కేంద్రీకరణకు దారితీసిందన్నారు. కార్పొరేట్లకు రాయితీలు పెంచుతున్నారని, అదే సమయంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేదరికం పెచ్చుమీరి ఆకలి చావులు పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మహాసభ తీర్మానించినట్టు వివరించారు. అలాగే మూడేళ్ల బిడ్డకు తల్లీ, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని, తెలుగు ప్రజలు ఎక్కడకి వెళ్లినా మీ రాజధాని ఏది అంటే చెప్పలేక పోతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసినట్టు చెప్పారు. యువతరానికే నాయకత్వ పగ్గాలివ్వాలి: పార్టీ నిర్మాణంపై ప్రతినిధులు పార్టీని సంస్థాగతంగా చక్కదిద్దుకోకుండా ఉద్యమ పథంలో రాణించలేమని సీపీఐ జాతీయ మహాసభల్లో పలువురు ప్రతినిధులు తెగేసి చెప్పారు. విజయవాడలోని గురుదాస్ దాస్‌గుప్త నగర్లో జరుగుతున్న మహాసభల్లో ‘పార్టీ నిర్మాణం’పై ఆదివారం వాడివేడీ చర్చ జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. పార్టీలో వృద్ధ నేతల అనుభవాన్ని ఉపయోగించుకుంటూ యువతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కోరారు. కమ్యూనిజం అజేయం: 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధుల ఉద్ఘాటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించిన కమ్యూనిజానికి తిరుగులేదని, పీడిత, తాడిత జనం కోసం పోరాడే కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందని 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధులు తమ సందేశాన్ని విన్పించారు. మతతత్వ శక్తులను తిప్పికొడదామని, ఆంక్షలు పెడుతున్న అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని, పెట్టుబడిదారీ విధానాలపై రాజీలేని పోరును కొనసాగించాలని వివిధ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. -
వామపక్ష ఐక్యతే తక్షణ కర్తవ్యం
సాక్షి, అమరావతి: దేశానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ వంటి విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం తీవ్రమవుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతే తక్షణ కర్తవ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఉద్ఘాటించారు. విజయవాడలో నిర్వహిస్తున్న సీపీఐ 24వ జాతీయ మహాసభల్లో భాగంగా శనివారం గురుదాస్ దాస్‌గుప్తా నగర్(ఎస్ఎస్ కన్వెన్షన్ హాలు)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డి.రాజా ప్రారంభోపన్యాసం చేశారు. ‘విజయవాడలో జరుగుతున్న జాతీయ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు, శ్రామిక పార్టీల ప్రతినిధులు, భారతదేశంలోని వామపక్ష పార్టీల నాయకులు, దేశం నలుమూలల నుంచి పార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలిరావడం మన ఐక్యతను చాటుతోంది. దేశంలోనే మూడోసారి సీపీఐ జాతీయ మహాసభలకు ఆతిథ్యం ఇస్తున్న ఏకైక నగరం విజయవాడ కావడం గర్వకారణం. అటువంటి మహత్తర గడ్డపై జరుగుతున్న మహాసభలు. వామపక్ష, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతను సాధించేందుకు వేదికగా నిలుస్తాయని భావిస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా నయా ఉదారవాదం, మత ఛాందసవాదం, విద్వేషం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా వామపక్షాలు పోరాడుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మార్క్సిస్ట్–లెనినిస్ట్ భావజాలంతో అంతర్జాతీయంగా లోతైన బంధాలను పెంపొందించుకోవడం ద్వారా మానవాళికి మంచి భవిష్యత్ కోసం ముందుకు సాగుదాం’ అని పిలుపునిచ్చారు. మెరుగైన భారతదేశం కోసం ముందుకు సాగుదాం.. సీపీఐ జాతీయ మహాసభలకు సౌహార్థ్ర ప్రతినిధులుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు దేవరాజన్ హాజరై సందేశాలు ఇచ్చారు. ఏచూరి మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంతోపాటు ప్రజలకు మేలు చేసే మెరుగైన భారతదేశం కోసం ఐక్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల ఫాసిస్ట్ చర్యలను తిప్పికొట్టేందుకు కార్మికులు, రైతులు, కూలీలను సమన్వయం చేసుకుని ఐక్య ఉద్యమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ సామాజిక, రాజకీయ, ఆర్థిక విపత్తుల నుంచి దేశాన్ని రక్షించేందుకు శక్తివంతమైన, లోతైన ప్రజాస్వామ్య పునాదుల ఆధారంగా భారతదేశాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. దేవరాజన్ మాట్లాడుతూ దేశంలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల పునరేకీకరణ బాధ్యతను సీపీఐ, సీపీఎం తీసుకోవాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆహ్వాన సంఘం తరఫున ప్రతినిధులకు స్వాగతం పలికి సందేశం ఇచ్చారు. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం నేతలు పి.మధు, వి.శ్రీనివాసరావు, వివిధ రాష్ట్రాల సీపీఐ ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు ఏటుకూరి కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీ పతాకాన్ని సురవరం సుధాకర్‌రెడ్డి, అమరవీరుల స్మారక స్తూపాన్ని సీపీఐ కంట్రోల్ కమిషన్ మాజీ చైర్మన్ ఈడ్పుగంటి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. -
భవిష్యత్ ఆశాకిరణం ఎర్రజెండాయే
సాక్షి, అమరావతి: దేశ భవిష్యత్‌కు ఆశాకి రణం ఎర్రజెండాయే అని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. రానున్న కాలంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తులంతా ఏకమై బీజేపీని నిలువరిస్తాయని చెప్పారు. సీపీఐ 24వ జాతీయ మహా సభలు శుక్రవారం విజయవాడలో ప్రారంభమ య్యాయి. తొలుత కేదారేశ్వర పేటలోని మీసాల రాజేశ్వరరావు బ్రిడ్జి నుంచి అజిత్ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు కదం తొక్కారు. అనంతరం బహిరంగ సభలో రాజా మాట్లా డుతూ.. మోదీ పాలన కంటే వాజ్‌పేయి పాలన ఎంతో బాగుందన్నారు. ఆనాటి బీజేపీ వేరని, ఇప్పటి మోదీ ఉన్న బీజేపీ వేరని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో అదానీ వంటి పెద్ద స్మగ్లర్లు అత్యంత ధనవంతుల జాబితాలోకి చేరుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కె.నారాయణ, ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. వర్షం కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో సభ అర్ధతరంగా నిలిచిపోయింది. విద్యుత్ వైర్లు కాలిపోయి మైకులు పనిచేయలేదు. వర్షం పెరగడంతో వేదికపై ఉన్న నాయకులు, దిగువన ఉన్న కార్యకర్తలు వెళ్లిపోయారు. దీంతో రాజా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభను రద్దు చేశారు. -
బీజేపీని ఓడించే దిశగా కేసీఆర్ అడుగులు వేయాలి : సీపీఐ నారాయణ
-
పొలిటికల్ కారిడార్ : కొత్తగూడెం గులాబీకి గుచ్చుకుంటున్న కొడవలి
-
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ " స్ట్రెయిట్ టాక్ "