సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతుండవని హెచ్చరించారు రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం అని కామెంట్స్ చేశారు.
కాగా, సీపీఐ నారాయణ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది. స్టీల్‌ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. బీజేపీ స్టీల్‌ప్లాంట్ అమ్మితే టీడీపీ సహకరిస్తుందా?. ప్లాంట్ అమ్మకం ప్రతిపాదన వ్యతిరేకిస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. లేదంటే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్టే.
రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడుతాం. ఏపీలో కూటమికి ఇలాంటి విజయం వస్తుందని చంద్రబాబు కూడా ఊహించి ఉండడు. కేంద్రంలో బీజేపీ చావు తప్పి బయటపడింది. మోదీ మెజారిటీ కూడా తగ్గింది. ప్రధానిగా మోదీ ఉండి.. మైనార్టీలను రెచ్చగొడుతున్నాడు. దేశంలో ప్రతిపక్షం చాలా బలంగా ఉంది. ఇది సంతోషకరం. అపనమ్మకంతోనే నితీష్, చంద్రబాబులను బీజేపీ దగ్గరకు చేర్చుకుంది. వీళ్లపై ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం వేరు.. రాష్ట్రంలో వేరు కాదు. మా దృష్టిలో రెండు ప్రభుత్వాలు ఒక్కటే. రాష్ట్ర ప్రభుత్వం మంచి చేస్తాను అంటే మేము వద్దంటామా?. కోడలు మగ బిడ్డను కంటాను అంటే అత్త వద్దంటుందా? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment