సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం చంద్రబాబు పాతపాటే పాడారు. శుక్రవారం విశాఖలో ఆయన పర్యటించారు. మీడియా ప్రశ్నకు సమాధానంగా స్టీల్‌ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నాం అంటూ మాట దాటేశారు. దీంతో స్టీల్‌ఫ్లాంట్‌పై చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాత స్వరమే వినిపించడంతో ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఆరు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు.
మరో వైపు, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేపడుతున్న నిరసనలను అణిచివేయడానికి చంద్రబాబు సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా.. ఉద్యమిస్తున్న కార్మికులపై ఉక్కుమోదం మోపుతోంది.
ఇదీ చదవండి: దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి
Comments
Please login to add a commentAdd a comment