Visakha Steel Plant
-
ఢిల్లీకి విశాఖ ఉక్కు పోరాటం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అందని జీతాలు
-
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట దాటేసిన చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం చంద్రబాబు పాతపాటే పాడారు. శుక్రవారం విశాఖలో ఆయన పర్యటించారు. మీడియా ప్రశ్నకు సమాధానంగా స్టీల్‌ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నాం అంటూ మాట దాటేశారు. దీంతో స్టీల్‌ఫ్లాంట్‌పై చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాత స్వరమే వినిపించడంతో ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఆరు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు.మరో వైపు, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేపడుతున్న నిరసనలను అణిచివేయడానికి చంద్రబాబు సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా.. ఉద్యమిస్తున్న కార్మికులపై ఉక్కుమోదం మోపుతోంది. ఇదీ చదవండి: దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి -
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్
-
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ఉక్కు సత్యాగ్రహం మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నామని కేంద్రమంత్రి చెప్పి మూడు నెలలైంది.. ఇప్పటివరకు దాని ఊసే లేదన్నారు.కాగా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళ, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు మణిహారంగా ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని ఆ సంఘాల నేతల విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కర్మాగారంపై, కార్మికులపై రుద్దుతున్న ఆర్థిక ఆంక్షలను తక్షణం విరమించుకునేలా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నారు. -
ఆందోళనలతో దద్దరిల్లుతున్న ఏపీ..
-
విశాఖలో హైటెన్షన్.. ప్రధాని పర్యటన.. ఉక్కు కార్మికుల ఆందోళన ఉధృతం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ఈ నెల 29న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కార్మికులు ఆందోళన ఉధృతం చేశారు. ఆదివారం.. పాత గాజువాక కూడలి నుంచి కొత్త గాజువాక వరకు కార్మికులు నిరసన చేపట్టారు. ప్రధాని స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయాలని ఉక్కు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవడంతోపాటు ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి డిమాండ్ చేసింది. విశాఖ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటన చేయాలని కోరుతూ తీర్మానించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిన్న(శనివారం) అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 1,380 రోజులుగా కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటం చేయడం గొప్ప విషయమన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడరాదని, 5 కోట్ల ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉందన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. టీడీపీ, జనసేనకు చెందిన 18 మంది ఎంపీల మద్దతు ఉపసంహరిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు.కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చంద్రబాబు ప్రకటిస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు. కర్ణాటకలో స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం రూ.15వేల కోట్లు సాయం అందించిందని, మరో రూ.15 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు, హెచ్ఆర్ఏ తగ్గింపు, వీఆర్ఎస్ సర్వే, ఉద్యోగులు తమంతట తాము మానేసే విధంగా ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. 2,200 ఎకరాల స్టీల్‌ప్లాంట్ భూమి రూ.2 లక్షల కోట్ల విలువ ఉంటుందని, దానిని పల్లీలకు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అప్పుల్లో ఉంది కానీ, నష్టాల్లో లేదని గుర్తించాలన్నారు. గతంలో ఒకే ఏడాది 950 కోట్లు లాభం ఆర్జించిందన్నారు. సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ తన చిన్నప్పటినుంచే ఉందని, కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే ఉద్యమానికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. పరిరక్షణ కమిటీ చైర్మన్లు ఆదినారాయణ, అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. జనవరి 27 నాటికి ఉక్కు ప్రైవేటీకరణ పోరాట ఉద్యమం ప్రారంభించి నాలుగేళ్లు పూర్తవుతుందన్నారు. విశాఖ వస్తున్న ప్రధాని మోదీ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమిస్తున్నట్టు ప్రకటించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, సెయిల్‌లో విలీనం చేస్తామని ప్రకటించాలని తీర్మానిస్తున్నట్టు తెలిపారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. మోదీ రాక సందర్భంగా బైక్ ర్యాలీలు, నిరాహార దీక్షలు వంటి కార్యక్రమాలతో ఈ నెల 28న ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు తెలిపారు. -
స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చేతులెత్తేశారు: విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సమస్యలపై పోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నామన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు చేతులెత్తేశారన్నారు. రెండు లక్షల కోట్ల విలువచేసే స్టీల్ ప్లాంట్‌ను కారు చౌకగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం’’ అని మరోసారి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.విశాఖలో ఏర్పాటు చేసే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాన్ని చంద్రబాబు విజయవాడకు తీసుకెళ్లారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నదే మా ఉద్దేశ్యం. త్వరలో ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలు 44 స్థానాలకు పెరగనున్నాయి. ఉత్తరాంధ్రలో అన్ని స్థానాలను గెలుచుకుంటాము. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాము. వారికి ఎటువంటి కష్టం రానివ్వం’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.ఇదీ చదవండి: అప్రజాస్వామిక పాలనలో.. ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం: వైఎస్సార్సీపీ -
బాబూ.. బేల మాటలేల?
‘విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి నేను ఒకటే చెబుతున్నాను.. ఇది ఆంధ్రుల మనోభావాలకు చెందిన ప్రాజెక్టు. ఉద్యోగులు, యాజమాన్యం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలి. సమర్థవంతంగా ప్లాంట్‌ని నడిపించాలి. సెయిల్ మాదిరిగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించాలి? ఇవీ.. పరవాడ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయింపులో చొరవ తీసుకోవల్సిన ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడంపై స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ఇటీవల పరవాడ పర్యటనలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సెయిల్‌కు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న తేడా తెలియదా అంటూ కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి. సెయిల్‌కు సొంత గనులు ఉండటం వల్లే లాభాల బాటలో పయనిస్తోంది. సెయిల్‌కు, స్టీల్‌ప్లాంట్‌కు ఉత్పత్తి వ్యయంలో చాలా తేడా ఉంది. సెయిల్‌తో పోలిస్తే స్టీల్‌ప్లాంట్‌కు మూడు రెట్లు ఉత్పత్తి వ్యయం అవుతోంది. సొంత గనులు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్లాంట్‌కు గనులు కేటాయించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ కార్మిక సంఘాలు చంద్రబాబు, పవన్ దృష్టికి సొంతగనుల కేటాయింపు విషయాన్ని పలుమార్లు విన్నవించినా.. కేంద్రంతో ఒక్కసారి కూడా సంప్రదింపులు జరపలేదు. ఇప్పుడు మాత్రం.. లాభాల బాట నడిపించాల్సిన బాధ్యత ఉద్యోగులు, కార్మికులదే అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడటంపై ఉక్కు పోరాట కమిటీ నాయకులు మండిపడుతున్నారు. మేనేజ్మెంట్ బాధ్యత ఎవరిది బాబూ.? స్టీల్‌ప్లాంట్‌కు మంచి మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకోవాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైనా కార్మికులు మండిపడుతున్నారు. ప్లాంట్‌కు ఉన్నతాధికారుల నియామకం, సీఎండీ నియామకం మొదలైన బాధ్యతలన్నీ కేంద్రం పరిధిలో ఉంటాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో జతకట్టిన టీడీపీ, జనసేన ఈ విషయంపై ఎప్పుడూ చర్చించిన పాపానపోలేదు. అలాంటిది.. మంచి మేనేజ్మెంట్ను ఉద్యోగులు ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు అనడమేంటని ప్రశి్నస్తున్నారు. ఐదు నెలల్లో ఉక్కు కోసం ఏం చేశారు.? ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఐదు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగులు, కార్మికులకు ఉన్న సదుపాయాల్ని యాజమాన్యం కోత విధించినా స్పందించలేదు. ఉద్యోగుల వీఆర్ఎస్, మరో ప్లాంట్‌కు బదిలీలకు పూనుకున్నా.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ తొలగించినా నోరెత్తిలేదు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టీల్‌ప్లాంట్ క్వార్టర్స్‌లో యూనిట్‌కి రూ.8 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసినా మాట్లాడలేదు. లీవ్ ఎన్‌క్యా‹మెంట్, ఎల్‌టీఏ(లాంగ్ ట్రావెల్ అలవెన్స్), లాంగ్‌లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్ఎల్టీసీ), ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) కూడా నిలిపేశారు. దీనికి తోడు చంద్రబాబు ప్రభుత్వం గోరుచుట్టుపై రోకలిపోటులా రూ.80 కోట్ల విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామంటూ నోటీసులు జారీ చేసింది. అలాగే స్టీల్‌ప్లాంట్‌కు ప్యాకేజీ ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మొదట ఇచ్చిన రూ.500 కోట్లలో రూ.237 కోట్లు జీఎస్టీకి చెల్లించగా మిగిలిన ధనంతో ముడి పదార్థాలు కొనుగోలు చేశారు. రెండోసారి ప్యాకేజీ పేరుతో రూ.1140 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. బ్యాంకులకు రుణాల పేరిట తిరిగి తీసేసుకుంది. ఇలా ప్రతి విషయంలోనూ ప్లాంట్‌ని నిర్వీర్యం చేసేందుకు యతి్నస్తుంటే కూటమి నేతలు నోరుమెదపకపోవడం ఏంటని కార్మిక సంఘాలు ప్రశి్నస్తున్నాయి.నక్కపల్లిలో ప్రైవేట్ ప్లాంట్‌కు సొంత గనులా? అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మిట్టల్ ప్రైవేట్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా దానికి సొంత గనుల కేటాయింపులోనూ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉన్న స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్‌కు కొమ్ము కాస్తుండడం చూస్తే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు విశాఖ ఉక్కుపై ఉన్నది కపట ప్రేమ అని తేటతెల్లమవుతోందంటూ ఉద్యోగ సంఘ ప్రతినిధులు విమర్శిస్తున్నారు.గనుల కేటాయింపులో వివక్ష కారణంగా..? గతంలో వరుసగా సాధించిన లాభాలతో 6.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికి, ఆ తర్వాత 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యానికిప్లాంట్ విస్తరణ జరిగింది. ఒక రకంగా విస్తరణ స్టీల్‌ప్లాంట్‌కు నష్టం తెచ్చిందని చెప్పవచ్చు. విస్తరణ పూర్తయ్యే నాటికి ఉన్న వనరులన్నీ కరిగిపోగా రుణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా దేశంలోని ప్రైవేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేటాయించడంలో వివక్ష చూపుతూ వస్తుంది. దీని వల్ల ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయం అవుతుండగా సొంత గనులు లేని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను స్టీల్‌ప్లాంట్ అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో గత నాలుగున్నరేళ్ల కాలంలో మూడేళ్ల పాటు నష్టాలను చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లకు మించిపోయాయి. అయితే స్టీల్‌ప్లాంట్ ఈ 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ. 40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. వీటిని వద్దని చెప్పినా ప్లాంట్ సజీవంగా బతికేది.ఉద్యోగులపై నిందలు వేయడం సరికాదు స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు ఉంటే సెయిల్ కంటే ఎక్కువ లాభాలు సాధించేది. ఉక్కు యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది కానీ ఉద్యోగులు కాదు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలో చేస్తున్న సహాయ నిరాకరణ వల్ల స్టీల్‌ప్లాంట్ ఈ పరిస్థితికి చేరింది.. తప్ప ఉద్యోగుల వల్ల కాదు. సీఎం చంద్రబాబుకి అందిన తప్పుడు సమాచారం వల్లే ఆయన అలా మాట్లాడుతున్నారేమో. – మంత్రి రాజశేఖర్, స్టీల్ ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి -
స్టీల్ ప్లాంట్ లో పరిణామాలపై చంద్రబాబు వైఖరేంటి : బొత్స
-
‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’
''ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై క్లియర్ పిక్చర్ లేదు’’... నలభై ఏళ్ల రాజకీయ అనుభవం నాదని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య ఇది. చూస్తే చాలా అమాయకుడని అనిపించవచ్చు. కానీ.. మాటల మార్చడంలో, ప్రగల్భాలు పలకడంలో, యూటర్న్ తీసుకోవడంలో ఈయన్ను మించిన వారు ఇంకొకరు ఉండరంటే అతిశయోక్తి కానే కాదు. బహుశా దేశం మొత్తమ్మీద ఇంకొకరు లేరనడానికి ఇది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బాబు వ్యాఖ్య ఒక నిదర్శనమనే చెప్పవచ్చు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ గురించి మీడియాతో మాట్లాడుతూ వారు ఏ ప్రశ్న అడిగినా అది సాధ్యం కాదన్న సమాధానం వచ్చేలా చెప్పారు. కేంద్రం ప్యాకేజీ ఇవ్వొచ్చుకదా అంటే ''అవును ఇవ్వొచ్చుగానీ అంతటితో అయిపోదు కదా, గనుల్లేవు అని ముక్తాయిస్తారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం చేయొచ్చుకదా అంటే ''అలా చేయవచ్చుగానీ, అందుకు వారు అంగీకరించాలి. ఆర్థిక సమస్యలు ఉంటాయి'' అంటూ జవాబా ఇస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవటీకరణ కాకుండా నిలబెడతామన్నారు కదా అని ప్రశ్నిస్తే ''ప్రతిపక్షంలో ఉనప్పుడు మాకు క్లియర్ పిక్చర్ లేదు'' కదా అని నిస్సిగ్గుగా బదులిస్తారు.వీటన్నిటి సారాంశం ఒకటే..స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అపలేమని చెప్పడమే. ఇక్కడే ఆయన తన తెలివితేటలన్నీ ఉపయోగిస్తుంటారు. ఇంకో అనుమానం కూడా వస్తోంది. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నదని, పది వేల మందికి ఉపాధి వస్తుందని తెలుగుదేశం మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి బ్యానర్ కథనాలు వండివార్చాయి. ఇందులో లోకేష్‌ను పైకెత్తడం ఒక పాయింట్ అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జనంలో ఉన్న ఆందోళనను డైవర్ట్ చేయడం కూడా మరో అంశం అనిపిస్తోంది. నిజానికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇన్ఫోసిస్, టీసీఎస్ మొదలైన సంస్థల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇన్ఫోసిస్ క్యాంపస్‌ను జగన్ స్వయంగా ఆరంభించారు. బీచ్ ఐటీ పేరుతో విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా మార్చాలని జగన్ ప్రయత్నిస్తే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటివి ఎల్లో మీడియా రకరకాలుగా విమర్శిస్తూ అడ్డుకునేంత పనిచేశాయి. కానీ ఇప్పుడు ఆ సెంటర్ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఆ సెంటర్ వస్తే మంచిదే. కానీ అంతా అయిపోయినట్టు, పదివేల మందికి ఉపాధి వచ్చేసినట్టు ప్రచారం చేయడమంటే జనాన్ని మభ్యపెట్టడమే.ఇదంతా విశాఖలో స్టీలప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి మీద జనంలో ఉన్న నిరసనను తగ్గించడానికే అని అనుకోవచ్చు.ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఏమని చెప్పారో గుర్తు చేసుకుందాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, దానికోసం ఎందాకైనా వెళ్లి పోరాడతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు శపథాల మీద శపథాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి కొన్ని ప్రత్యామ్నాయాలు సూచిస్తే ఇంకేముంది భూములు కాజేయడానికే అని దుష్ప్రచారం చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం చేసినా జగన్ ప్రైవేటీకరణను ఆపడం లేదని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తేనే దాన్ని నిలబెడతామని గొప్పలకు పోయారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా తామే ఫ్యాక్టరీని నిలబెట్టామని చెప్పుకున్నారు. విశాఖ ఉక్కు రక్షణకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని పార్టీల వారిని ఢిల్లీ తీసుకువెళతామని చంద్రబాబు, పవన్ లు తమ ప్రసంగాల్లో ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిద్దరూ చేతులెత్తేయడం, నాలుక మడతేయడం చేస్తున్నారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకాదు.. కాదన్నట్లు పరిస్థితి ఏర్పడుతున్నా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నిమ్మకు నీరెత్తితనట్లు వ్యవహరిస్తున్నది. ఎన్నికల ముందే తాము ప్రైవేటీకరణకు అనుకూలం అని చెప్పి ఉంటే, ఇప్పుడు తప్పు పట్టజాలం. అలా కాకుండా, జనాన్ని మభ్య పెట్టడానికి అప్పుడు కబుర్లు చెప్పి, ఇప్పుడు నాలుక మడతేయడం అంటే ఆంధ్రులను అవమానించడమే. ప్రధాని నరేంద్ర మోదీ తన జేబులో ఉన్నట్టు మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. కొద్ది రోజులక్రితం తెలుగుదేశం మీడియా ఈనాడులో విశాఖ స్టీల్‌ను విలీనం చేసుకోవడానికి సెయిల్ అంగీకరించింది అంటూ ఒక పెద్ద కథనాన్ని ఇచ్చారు. అంటే అప్పుడు కార్మికులను మభ్యపెట్టడం కోసం రాశారన్నమాట. అసలు వాస్తవం ఏంటంటే సెయిల్ లో విలీనం అంత తేలిక కాదు అని చంద్రబాబే చెబుతున్నారు. జనసేన నేతలైతే కార్మిక సంఘాల వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయ్యే పరిస్థితి వచ్చిందని ఎదురు దాడి కూడా చేస్తున్నారు. చంద్రబాబు స్టీల్ ప్లాంట్ అంశంపై నంగినంగిగా మాట్లాడినప్పుడు ఎవరికైనా అనుమానం వచ్చింది. స్టీల్ ప్లాంట్ ను కేంద్రం విక్రయించడానికి సిద్ధమైందని, దానికి ఆయన ఓకే చేశారనిపిస్తోంది. అందుకే ఇప్పుడు అఖిలపక్షం వేస్తే ప్రయోజనం ఏముంటుంది? రాజకీయ విమర్శలు తప్ప అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు క్లియర్ పికచ్చర్ లేదని బుకాయిస్తున్నారు. తానే విశాఖ స్టీల్ ను కాపాడానని ప్రచారం చేసుకుంటూ ఇంకో వైపు క్లియర్ పిక్చర్ లేదని చంద్రబాబు చెబుతుండడం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కును, ఆయనే ప్రైవేట్ వారికి అమ్మేస్తున్నట్టుగా అనుకోవాలన్న మాట.పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబకు స్టీల్ ప్లాంట్ గురించి తెలియదంటే ఆయన విజన్ ఏమైనట్టు? ఆయన చేసిన వాగ్ధానాలు ఏమైనట్టు? ఎన్నికలకు ముందు కార్మికుల ఆందోళనలో భాగస్వామ్యమై వారిని నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఇప్పుడు నట్టేట ముంచుతున్నారని అనుకోవాలి. కేంద్రంలోను, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వీరు పూర్తిగా యూటర్న్ తీసుకోవడమంటే విశాఖ ప్రజలనే కాకుండా ఆంధ్ర ప్రజలందరినీ పచ్చిగా మోసం చేసినట్టు అవుతుంది కదా.విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం వేలాది మంది రైతులు తమ భూములను ఇచ్చారు. స్లీల్ ప్లాంట్ వచ్చాక విశాఖలో పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. అది ప్రభుత్వపరంగా ఉండడంతో ఉద్యోగులకు ప్రయోజనాలు చేకూరాయి. ఆ ప్లాంట్‌కు ఇప్పటికైనా ఐరన్ ఓర్ గనిని కేటాయించి, ఒక ప్యాకేజీ ఇస్తే అది నిలబడుతుందని, కానీ కావాలనే ఈ ప్లాంట్‌ను నష్టాల పాలు చేస్తున్నారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వివిధ హామీల విషయంలో జనాన్ని మాయ చేసినట్లుగానే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మరోసారి మాట తప్పుతున్నారు. తద్వారా రాష్ట్రానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమే తీరని ద్రోహం చేస్తోందన్న అభిప్రాయానికి అవకాశం ఇస్తున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖ ఉక్కుపై బాబు అండ్ కో యూటర్న్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు. నిర్భీతిగా మాట మార్చేస్తున్నారు. ‘ప్రైవేటీకరణను నిలవరించలేని జగన్.. రాజీనామా చెయ్యి’ అంటూ నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటానని ఎన్నికలకు ముందు ప్రజాగళం సభలో శపథం చేశారు. వాజపేయి హయాంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోతే తానే అడ్డుకున్నానని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం రాబట్టి ఫ్యాక్టరీని ఆదుకున్నామని.. ఇప్పుడూ కాపాడుకుంటామని గద్దె నెక్కిన కొత్తలో సెలవిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం యూనియన్ నాయకులకూ మొన్న ఆగస్టులో అదే హామీ ఇచ్చారు. ‘విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం కానివ్వం. అసెంబ్లీలో తీర్మానం చేయాలి. వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి. నాతో కలిసి రండి, ఢిల్లీకి తీసుకువెళ్తా. ఇక్కడ కూటమి అభ్యర్థిని గెలిపిస్తే ఢిల్లీలో మన వాణి బలంగా వినిపిద్దాం..’ అని ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బల్లగుద్ది చెప్పారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తీర్చాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరుతానని హామీ ఇచ్చారు. ఇన్ని మాటలు మాట్లాడిన ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చేశారు. పవన్ మౌన వ్రతం పాటిస్తుండగా.. చంద్రబాబు తన ఒక్కడి చేతుల్లో లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ‘వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంపై ఢిల్లీ వెళదామని నేను పిలిస్తే స్పందించారా? ప్రైవేటు ఉక్కు కర్మాగారాలన్నీ లాభాల బాటలో నడుస్తుంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా భ్రష్టు పట్టడానికి కారణమేంటో యాజమాన్యం, సిబ్బంది ఆలోచించుకోవాలి’ అంటూ చంద్రబాబు గత నెల 17న మీడియాతో రివర్స్‌లో మాట్లాడారు. అప్పుడు మొత్తం పిక్చర్ తెలీదట!‘‘విశాఖ స్టీలు ప్లాంటును ఏ విధంగా రివైవ్ చేసుకోవాలి? ఏ విధంగా ట్రాక్‌లో పెట్టాలి.. ఏ విధంగా చేస్తే ముందుకు వెళుతుంది.. అనే అంశాల గురించి సీరియస్‌గా ఆలోచిస్తున్నాం. సెయిల్‌లో విలీనం చేయాలనేది ఒక ప్రత్యామ్నాయం. అందుకు సెయిల్, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి. అదొక సమస్య. ఎన్ఎండీసీకి భూమి ఇస్తే.. వారు డబ్బులిచ్చినా అది తాత్కాలికం. ఆ డబ్బులు చాలవు. రూ.వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లతో రివైవ్ కాదు. దీనికి ఒక పూర్తి ప్యాకేజీ ఇవ్వాలి. ముడి సరుకు కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు మేం ఆలోచిస్తున్నాం. మొత్తం మీద ఫెయిర్‌గా డిస్కస్ చేయకపోతే ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. ఎవరో ఒకరు.. కేంద్రమో, రాష్ట్ర ప్రభుత్వమో, బ్యాంకులో ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి. మేనిఫెస్టోలో విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను ఆపేస్తాం అని చెప్పాం. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మొత్తం పిక్చర్ ఉండదు. వెరీ క్లియర్. అందరూ గుర్తు పెట్టుకోవాలి’’ అని తాజాగా అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో హామీ లిచ్చామని, ఇప్పుడు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దాటవేసే ప్రయత్నం చేశారు. పైగా సెయిల్‌లో విలీనానికి సెయిల్, కేంద్రం ఒప్పుకోవాలని.. ఇది తమ చేతుల్లో లేదనే రీతిలో వ్యాఖ్యానించారు. తద్వారా విశాఖ స్టీలు ప్లాంటుపై ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా కొద్ది రోజులు మాట్లాడిన మాటలు అంతా హంబక్ అని చంద్రబాబు తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.అసెంబ్లీ తీర్మానంతో వైఎస్సార్సీపీ అడ్డుకునే యత్నం » స్టీల్ ప్లాంట్‌ను దివాలా పరిశ్రమగా చూపించే కుట్ర జరుగుతోంది. 2021లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. వెంటనే అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్లాంట్ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి లేఖలు రాశారు. » అంతటితో ఆగకుండా అసెంబ్లీలో సైతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. విశాఖలో భారీ బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చిన సందర్భంలో కూడా వేదికపై లక్షల మంది ప్రజల సమక్షంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. » రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆశీల్‌మెట్ట జంక్ష¯న్ నుంచి కూర్మన్నపాలెం జంక్ష¯Œన్ వరకు అప్పటి ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో భారీ పాదయాత్ర చేపట్టారు. స్టీలు ప్లాంట్ ఉద్యమానికి వైఎస్సార్సీపీ నుంచి లభించిన మద్దతు కార్మికుల్లో ధైర్యాన్ని పెంచింది. ఫలితంగా కేంద్రం దూకుడుగా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఎన్నికలకు వెళ్లింది.» ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు స్టీలు ప్లాంటులో ఇంత జరుగుతున్నా... ఏ ఒక్క రోజూ నోరు విప్పి మాట్లాడేందుకు సాహసించ లేదు. పైగా జనసేన నేతలు నెపమంతా కార్మికులపై నెట్టేందుకు యత్నించారు. సీఎం చంద్రబాబు మరో అడుగు ముందుకు వేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఉన్న సమాచారంతో మాట్లాడతామని, ఇప్పుడు అంత సులువుకాదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. రుణం పేరుతో నిబంధనలు, బెనిఫిట్స్‌లో కోత » స్టీల్ ప్లాంట్ కోసం రూ.12 వేల కోట్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ కావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, కేంద్రం రూ.2 వేల కోట్ల రుణాన్ని (ఎస్బీఐ ద్వారా) అందిస్తున్నట్టు పైకి నటిస్తూ.. ఈ నిధులను జీఎస్టీ, పీఎఫ్ బకాయిలు, ప్రభుత్వ లెవీ, వెండర్స్‌కు చెల్లింపులు చేయాలని నిబంధనలు విధించింది. ఇతరత్రా అంశాలకు ఖర్చు చేస్తే.. ఆ నిధుల్ని ఫ్రీజ్ చెయ్యాలంటూ ఆదేశించింది. » వాస్తవానికి స్టీలు ప్లాంటు పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యం 7.9 మిలియన్ టన్నులు. పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు 30 వేల మంది కార్మికులు ఉండాలి. ఒకవైపు సెయిల్‌లో 19 మిలియ¯Œన్ టన్నుల సామర్థ్యానికి లక్ష మంది కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉన్న 14 వేల మందిలోనే 4 వేల మందిని తొలగించేందుకు ప్రయత్నించడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా ప్రతిఘటించాయి.» దీంతో రానున్న రోజుల్లో విడతలు విడతలుగా కార్మికులను తొలగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులకు ఇచ్చే బెనిఫిట్స్‌లోనూ భారీగా కోతలకు యాజమాన్యం దిగింది. గత ఆరు నెలలుగా ఉద్యోగులు జీతం ఒకేసారి అందుకున్న దాఖలాలు లేవు. సగం జీతం కూడా నెలాఖరున చెల్లిస్తుండడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించ లేక డీఫాల్టర్లుగా మారుతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించడం లేదు. టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు, పీఆర్పీ, ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్ తాత్కాలికంగా నిలుపుదల వంటి అనేక చర్యలకు దిగింది. వీటన్నింటిపై ఏ ఒక్క రోజు కూడా కూటమి నేతలు కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడిన దాఖలాలు లేవు.జగన్ చెప్పిందే నిజమవుతోంది.. వాస్తవానికి ఎన్నికల ముందు గాజువాకలో జరిగిన సభలో అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ... గాజువాక అసెంబ్లీ, విశాఖ పార్లమెంటు సీట్లల్లో టీడీపీకి ఓటు వేయడం అంటే స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు ఓటు వేయడమేనని స్పష్టంగా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి అత్యధిక మెజార్టీ వచ్చి గెలుపొందారు. ఆ తర్వాత స్టీలు ప్లాంట్ ఉన్న నియోజకవర్గంలో తమకు వచ్చిన భారీ మెజార్టీ ధైర్యంతోనే ప్రైవేటీకరణ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయని అర్థమవుతోంది. ప్రతి రోజూ ఏదో ఒక సమస్యతో కార్మికులు, ఉద్యోగులు పోరుబాట పడుతున్నప్పటికీ కూటమి నేతలెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు.పరిస్థితి తారుమారు» కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి తారుమారైందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్డీయే సర్కారు వరుస నిర్ణయాలతో స్టీల్ ప్లాంట్‌ను దివాలా దిశగా తీసుకెళ్తోంది. ఇందుకు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోంది. ముందుగా మూల ధనం సమీకరణ పేరుతో ఆస్తుల వేలానికి సిద్ధమైంది. » ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్ యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.476.18 కోట్లుగా లెక్కగట్టింది. ఆ వెంటనే ఉత్పిత్తిని తగ్గించే కుట్రలో భాగంగా రెండు నెలల క్రితం బ్లాస్ట్ ఫర్నేస్–1ను మూసివేసింది. » స్టీల్ ప్లాంట్‌కు ఏటా 73 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. కానీ సంస్థ నిర్వీర్యం చేయడానికి బ్లాస్ట్ ఫర్నేస్–1ను మూసేసిన కూటమి ప్రభుత్వం.. గత నెలలో బొగ్గు కొరతను కారణంగా చూపిస్తూ... బ్లాస్ట్ ఫర్నేస్–3ని బ్లోడౌ¯న్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం బ్లాస్ట్ ఫర్నేస్–2 ద్వారా మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. సాధారణంగా ఒక్కో బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి రోజుకు 7 వేల టన్నుల ఉత్పత్తికి అవకాశమున్నప్పటికీ.. బీఎస్–2 ద్వారా కేవలం 4 నుంచి 5 వేల టన్నులు స్టీల్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.» మరో వైపు సుమారు 4 వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపించడానికి రూ.1,261 కోట్లు కేటాయించింది. రాత్రికి రాత్రి రేపటి నుంచి ఉద్యోగాల్లోకి రావద్దంటూ కార్మికులకు కబురు పంపింది. అయితే, కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా స్టీలు ప్లాంటు యాజమాన్యం వెనక్కు తగ్గింది. మరోవైపు 500 మంది ప్లాంట్ అధికారులను ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్ ప్లాంటుకు డిప్యుటేషన్‌పై పంపాలని తీర్మానించారు. వీరితో పాటు 25 శాతం మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని తగ్గించాలని నిర్ణయించారు. » మరోవైపు జనసేన నేత బొలిశెట్టి సత్య నోటి దురుసుతో అసలు ప్రైవేటీకరణకు కారణం కార్మికులే అని నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ వ్యాఖ్యలను ఆ పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ఖండించలేదు. పైగా పవన్ కళ్యాణ్ మౌనం కాస్తా ఇదే తమ పార్టీ స్టాండ్ అనే రీతిలో ప్రజలకు అర్థమవుతోంది. -
విశాఖ ఉక్కుపై శ్వేతపత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ‘విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం నా ఒక్కడి చేతిలో లేదు. ఏం చేద్దామన్న విషయంపై మాకు సరైన స్పష్టత లేదు. ఈ అంశం విషయంలో ఆల్ పార్టీ నేతలతో మీటింగ్ పెడితే వాళ్లేం చెబుతారు? వాళ్లు రాజకీయ విమర్శలే కదా చేసేది? శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నా. అందుకే దీనిపై వైట్ పేపర్ (శ్వేతపత్రం) రిలీజ్ చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.ఉదయం రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి.. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌లతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చలు జరిపారు. అనంతరం ఎంపిక చేసుకున్న మీడియా బృందంతో సమావేశం నిర్వహించి, ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చాలా జఠిల సమస్య అని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు చెప్పారు. ప్రధాన మంత్రి మోదీని కలిసి ‘స్వర్ణాంధ్ర–2047’ డాక్యుమెంట్‌ను వివరించానని, పోలవరం నిధుల విషయంలో, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపనవిశాఖ రైల్వే జోన్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా రూ.73,743 కోట్లతో రైల్వే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్–అమరావతి–చెన్నై–బెంగుళూరు–హైదరాబాద్ ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ బుల్లెట్ ట్రైన్ తీసుకు రావాలని కోరానని తెలిపారు. 2026లో పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. అమరావతి–విజయవాడ రైల్వే లైన్, మచిలీపట్నం–రేపల్లె కనెక్టివిటీ, ఇక్కడ నుంచి కాకినాడకు కనెక్టివిటీ ఉండేలా పనులు ప్రారంభించాలని కోరామన్నారు.రైల్వే స్టేషన్ల అభివృద్ధి, అండర్ పాస్‌లు, రైల్వే బ్రిడ్జిలను త్వరితగతిన పూర్తి చేయాలని.. నడికూడి, శ్రీకాళహస్తి, కోటపల్లి, నర్సాపూర్ వంటి లైన్లను కూడా మార్చాలని కోరానని తెలిపారు. హైదరాబాద్–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ వేపై నితిన్ గడ్కరీతో చర్చించానని చెప్పారు. 189 కి.మీల అమరావతి ఓఆర్ఆర్పై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో భేటీ అయ్యారు. -
ఉద్యమంపై ‘ఉక్కు’పాదం..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అధికారంలోకి రాకముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు పరోక్షంగా కుట్రలకు పదును పెడుతున్నారు. కార్మికులు మీడియాతో మాట్లాడకూడదంటూ యాజమాన్యం షరతులు విధిస్తూ.. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతూ.. యాజమాన్యం బెదిరింపులకు భయపడేదేలేదని తేల్చిచెబుతున్నాయి. కార్మిక నియామక నిబంధనల్ని సర్క్యులర్‌లో పేర్కొంటూ.. మీడియాతో మాట్లాడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు జారీచేసింది. దీంతో కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది. మరోవైపు.. 4,200 మంది కార్మికుల్ని యాజమాన్యం ఒకేసారి తొలగించి మళ్లీ తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో కార్మికులు మండిపడుతున్నారు. కార్మికుల మెడపై కత్తి.. ఇక పొమ్మనలేక పొగపెట్టినట్లు.. కార్మికులు, ఉద్యోగుల్ని యాజమన్యం నిరంకుశ నిర్ణయాలతో వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో నిర్ణయాన్ని అమలుచేస్తూ.. కార్మికుల మెడపై ఒక్కో కత్తి వేలాడదీస్తుండటంతో వారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల పొదుపు చర్యల పేరుతో 500 మంది అధికారుల్ని, ఉద్యోగుల్ని ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్ స్టీల్‌ప్లాంట్‌కు డిప్యుటేషన్‌పై పంపించేందుకు రంగం సిద్ధంచేయడం వారిని తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. అలాగే, రోజురోజుకూ క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితివల్ల గత ఎనిమిది నెలలుగా ఉద్యోగులు ఒకే విడతలో జీతం అందుకున్న దాఖలాల్లేవు. నెలనెలా రూ.10వేల నుంచి రూ.30వేల నష్టం.. అలాగే, 2017 జనవరి 1న జరగాల్సి వేతన ఒప్పందం జరగకపోవడంవల్ల ఉద్యోగులు ప్రతీనెలా కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టపోతున్నారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలకు అండగా ఉండే పీఎఫ్, త్రిఫ్ట్ సొసైటీలకు యాజమాన్యం సకాలంలో నగదు చెల్లించకపోవడంతో వారి నుంచి ఉద్యోగులకు రుణాలు సైతం నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయి. దీనికి తోడు అధికారులకు ప్రోత్సాహకాలు తగ్గించడం, టౌన్షిప్లో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ చార్జీల పెంపు అమలు, బోనస్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) తాత్కాలికంగా నిలుపుదల, ఈఎల్ ఎన్‌క్యాష్ మెంట్ తాత్కాలికంగా నిలుపుదల తదితర అనేక చర్యలకు ఉపక్రమించింది.ఇలా ప్రతి అంశంలోనూ కార్మకుల్ని యాజమాన్యం రోడ్డున పడేస్తూ.. మానసికంగా వేధింపులకు గురిచేస్తోంది. ఒక్కో కఠిన నిర్ణయాన్ని అమలుచేస్తూ.. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు, ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలకు అస్సలు పొంతనలేదంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడొద్దంటూ జారీచేసిన సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఉక్కు పోరాటం ఉధృతం
-
ప్రైవేటీకరణ ఆపకుంటే.. కూటమి నుంచి వైదొలగాలి..
సీతమ్మధార: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే ఆపాలని.. లేకుంటే టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రానికి తమ మద్దతును ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వినర్ వీవీ రమణమూర్తి డిమాండ్ చేశారు. పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును.. ఇప్పుడు ఉద్యమించి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో రాజకీయ పార్టీలకతీతంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బుధవారం మహా పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా వేదికపై ఆయన ప్రసంగించారు. ఆనాడు తమనంపల్లి అమృతరావు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 4,290 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలనుకోవడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఊపిరి స్టీల్ ప్లాంట్ అని, ఉద్యమం ద్వారా ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో పోరాడి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకుని సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, రూ.10 వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ కేటాయించాలని, స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని, బదిలీలను నిలిపివేసి నిర్వాసితులందరికీ ఉద్యోగాలిచి్చ.. కాంట్రాక్ట్ కార్మికుల్ని క్రమబదీ్ధకరించాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని తదితర తీర్మానాలను రమణమూర్తి సభలో చదివి వినిపించారు. తరలి వచ్చిన జనవాహిని అంతకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ జన సంద్రమైంది. మార్గంమధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరాజనాలు పలికారు. ర్యాలీకి సంఘీభావంగా దారి పొడవునా పలువురు వ్యాపారులు మద్దతు పలికారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహా పాదయాత్ర చేరగానే అక్కడ ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఉద్యమకారులు చేసిన నినాదాలతో ప్రజా ఉద్యమ వేదిక సభా ప్రాంగణం దద్ధరిల్లింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, విశాఖ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు తిలక్, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్‌దాస్, భారత నాస్తిక సమాజం జిల్లా, రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామమూర్తి వై.నూకరాజు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కేఎస్ చలం, మురికివాడల సంక్షేమ సంఘం తరఫున కె.రవికుమార్, ఇసరపు లక్ష్మి, హెచ్ఆర్ఎఫ్ నుంచి శరత్, ప్రగతిశీల కార్మిక సంఘం తరఫున కె.అన్నపూర్ణ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట కార్యదర్శి అత్తిలి విమల, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, దళిత సేన అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్, వివిధ ప్రజా సంఘాలు, అఖిలపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి లడ్డూపై ఉన్న శ్రద్ధ స్టీల్ ప్లాంట్‌పై లేదుసీతమ్మధార: రాష్ట్ర ప్రభుత్వానికి తిరుపతి లడ్డూతో రాజకీయాలు చేయడంపై ఉన్న శ్రద్ధ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణపై లేదని అఖిలపక్ష సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా సెయిల్‌లో విలీనం చేయాలని, ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యాన్నారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు లోకనాథం డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి0ది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున నిరహార దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని చెప్పిన నాయకులు నేడు బీజేపీ చర్యల్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అఖిలపక్ష కార్మిక, ప్రజ సంఘాల పోరాట కమిటీ జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, వైస్ చెర్మన్ నాగభూషణం, మన్మథరావులు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు స్టీల్ ప్లాంట్‌ను బీజేపీకి తాకట్టుపెట్టే విధానాలు అవలంభిస్తే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు, సీఐఎఫ్టీయూ జాతీయ కార్యదర్శి ఎ.కనకారావు, ఏఐసీటీయూ జిల్లా కార్యదర్శి కె.శంకరావు, ఏపీఎఫ్‌టీయూ కె.దేవా, మల్లన్న, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ వద్ద హైటెన్షన్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి వరకు ధర్నా కొనసాగింది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.చివరకు ఒత్తిడిల నేపథ్యంలో యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో తొలగించిన కార్మికులకు నెలవారీ పాసులు, వేరే రంగు పాసులు ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదించింది. దీనికి ఆగ్రహించిన అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈడీ బిల్డింగ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. పోలీసు బలగాల మోహరింపు ధర్నాకు ముందెన్నడూ లేనివిధంగా విధుల్లో ఉన్న కార్మికులు కూడా హాజరయ్యారు. దీంతో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కార్మికులను నిలువరించేందుకు ఈడీ భవనం ముందు, వెనుక గేట్లకు తాళాలు వేశారు. దీంతో కార్మికులు భవనం ఎదుట కారిడార్‌లో బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కొందరు కార్మికులు అక్కడి అద్దాలు పగులగొట్టారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులు రెండు గేట్ల వద్ద బైఠాయించడంతో భవనం నుంచి ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి. ఒకానొక దశలో పోలీసులు ఆందోళనాకారులను లాఠీల సాయంతో పక్కకు నెట్టారు. అప్పటికే అక్కడికి మీటింగ్‌కు వచ్చి ఉన్న వివిధ విభాగాధిపతులు మధ్యాహ్నం భోజనానికి తమ విభాగాలకు వెళ్లలేక పోయారు. సాయంత్రం 5.30కు ప్లాంట్ నుంచి బయటకు వెళ్లాల్సిన ఉద్యోగులను కూడా బిల్డింగ్ బయటకు అనుమతించక పోవడంతో వారు తమ కార్యాలయాల్లో నిలిచిపోవాల్సి వచి్చంది.డిమాండ్లపై యాజమాన్యం ససేమిరా డిమాండ్ల సాధన కోసం యాజమాన్యం ప్రతినిధులతో కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు చర్చలు జరిపారు. గతంలో మాదిరిగా పాసులు ఇవ్వాలని, వారికి పాత రంగులో పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం రాతపూర్వకంగా హామీ కోరగా.. యాజమాన్యం ససేమిరా అనేసింది. దీంతో రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు తెగేసి చెప్పారు. వర్క్స్ ఉన్నతాధికారులు, హెచ్ఆర్ అధికారులు ఉన్నత యాజమాన్యం అనుమతి కోసం ప్రయత్నం చేసినా సానుకూల స్పందన రాలేదు. ఫలితంగా కార్మికులు మంగళవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ఉద్యమాన్ని ఉధృతం చేసిన విశాఖ ఉక్కు కార్మికులు
-
తొలగిస్తే సహించం.. ఉక్కు కార్మికుల హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మికులు అంటున్నారు.నిన్న(ఆదివారం) సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.మరోవైపు, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: ‘స్టీల్’ కాంట్రాక్ట్ కార్మికుల నెత్తిన పిడుగుదీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
ఒకేసారి 4 వేల మంది తొలగింపు!.. రోడ్డెక్కిన ఉక్కు కార్మికులు
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్టు కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.యాజమాన్యం నిర్ణయం వల్ల నాలుగు వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును పూర్తిస్థాయిలో నడపాలి. నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను చంద్రబాబు పవన్ నిలబెట్టుకోవాలి. స్టీల్ ప్లాంట్‌ను వెంటనే సెయిల్‌లో విలీనం చేయాలి. ప్లాంట్‌కు కావాల్సిన ముడి సరుకు ఇవ్వాలి. మూడు బ్లాస్ట్ ఫర్నిస్ను పూర్తిస్థాయిలో నడపాలి’’ అని కార్మికులు కోరుతున్నారు.కాగా, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది.నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.దీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి.ఇదీ చదవండి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం -
స్టీల్ ప్లాంట్ ని చంద్రబాబు, పవన్ ఏ విధంగా అమ్మేస్తున్నారు.. కేఏ పాల్ సంచలన విషయాలు
-
విశాఖ ఉక్కు భవితవ్యం ఏమిటి?
ఒకపక్క నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెబుతుంటే... మరో పక్క ఆ నష్టాలు అధికమయ్యే అనేక సమస్యలను ఎదుర్కొంటోంది విశాఖ ఉక్కు కర్మాగారం. ప్రస్తుతం ఉక్కు తయారీలో కీలక పాత్ర పోషించే ద్రవరూప ఖనిజం (స్టీల్ మెటల్ లిక్విడ్) ఉత్పత్తికి విఘాతం వాటిల్లింది. దీనికి ప్రధాన కారణం బొగ్గు కొరత. అలాగే నిధుల లేమి, ముడి ఖనిజం కొరత అగ్నికి ఆజ్యం తోడైనట్లు పరిణమించాయి. ఆంధ్రుల హక్కైన ‘విశాఖ ఉక్కు’కు ఈ సమస్యలన్నీ ఉరితాళ్లలా పరిణమించాయి.విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయడంలో గోదావరి (బ్లాస్ట్ ఫర్నేస్–1), కృష్ణా (బ్లాస్ట్ ఫర్నేస్–2), అన్నపూర్ణ (బ్లాస్ట్ ఫర్నేస్–3) బ్లాస్ట్ ఫర్నేస్లది కీలక పాత్ర. అయితే వీటిలో రెండు మూలన పడ్డాయి. ఈ నెల 12న అన్నపూర్ణ (బీఎఫ్– 3) మూత పడింది. గోదావరి ఈ ఏడాది మార్చిలో ద్రవ ఖనిజ ఉత్పత్తిని ఆపేసింది. ఇక మిగిలింది కృష్ణా మాత్రమే. ఇందులోనూ ఒకటి రెండు రోజుల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రస్తుతం కృష్ణాకు అతి కొద్ది బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అన్న పూర్ణ సామర్థ్యానికి తగినంత బొగ్గు అందుబాటులో లేనందునే మూత పడిందని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. రోజుకు మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల నుంచి 20 వేల టన్నుల ద్రవ ఉక్కు ఖనిజాన్ని ఉత్పత్తి చేయాలంటే 14 వేల టన్నుల బొగ్గు అవసరం. ఈ లెక్కన 45 రోజులకు కావాల్సిన బొగ్గును ముందస్తుగానే సమకూర్చు కోవాలి. అంటే 6.3 లక్షల టన్నుల బొగ్గు నిల్వలను అందు బాటులో ఉంచాలి. కానీ ప్రస్తుతం 20 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉంది. దీని వినియోగం పూర్తయిన వెంటనే కృష్ణా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి ఉత్పత్తి ప్రక్రియను ఆపేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. అన్నపూర్ణను మూసే స్తున్నట్లు కొద్ది రోజుల కిందటే అంతర్గతంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక మార్గదర్శకాలు, ముడి సరుకుల కొరతతో పాటు కీలకమైన బొగ్గు లభ్యత లేనందున నిర్ణయం తీసుకున్నాం అంటూ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ద్రవరూప ఉక్కు ఖనిజం ఉత్పత్తి కావాలంటే బ్లాస్ట్ ఫర్నేస్ నాజిల్ వరకు బొగ్గు నింపి మండించే ప్రక్రియను చేపట్టాలి. కానీ ఆ స్థాయిలో బొగ్గు లేనందున మూసేస్తున్నామంటున్నారు. అన్నపూర్ణ నుంచి ఉత్పత్తి 2012లో ప్రారంభమైంది. అనతి కాలంలో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యానికి దీన్ని విస్తరించారు. 23 నెలల కిందట అంటే జనవరి 2022 నుంచి డిసెంబరు 2023 మధ్య కాలంలో ఈ బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ఆగిపోయింది. కారణం ముడి సరుకు అందుబాటులో లేకపోవడం. మరోవైపు కరోనా ప్రభావం దీనికి తోడైంది. ఈ ఏడాది జనవరిలో సవాళ్లను అధిగమించి పని ప్రారంభించింది.ఇకపై సమస్యలేవీ లేవనుకుంటున్న తరు ణంలో బొగ్గు కొరత రూపేణా పూడ్చలేని అవరోధం రావడంతో ఉక్కు ఉత్పత్తితో పాటు పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం సమస్యను గుర్తించి తగినంత ముడి బొగ్గును సర ఫరా చేయక పోతే ఉక్కు ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఆగి పోతుంది. ఇదే జరిగితే 1982లో ఉక్కు కర్మాగారం ఆవిర్భావం అనంతరం... మొట్ట మొదటి సారిగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి నిలిచే ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేటీకరణలో వెనక్కితగ్గేదే లేదంటూ దేశరాజధానిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఓవైపు... అలా జరిగేదేమీ లేదంటూ స్థానిక కూటమి పాలకులు మరోవైపు భిన్న స్వరాలు వినిపిస్తున్న తతంగాన్ని ఆంధ్రులంతా గమనిస్తున్నారు. ఇప్పటికైనా ప్లాంట్ నిర్వహణ విషయమై ఇక్కడి పాలకులు కేంద్రానికి నివేదిస్తారా, లేదా ఏవో హామీలతో కాల యాపన చేస్తారా అన్నది వేచి చూడాల్సిన విషయం.– తిరుమలరావు కరుకోల ‘ జర్నలిస్ట్, 98494 93833 -
బాబు, పవన్ ఎక్కడ..? స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన..
-
ఉక్కు పోరాటం ఉధృతం
-
ప్రైవేటీకరణ దిశగా స్టీల్‌ప్లాంట్.. ఉక్కు కార్మికుల నిరసన
సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు నిరసనకు దిగారు. అగనంపూడి, పెదగంట్యాడ, ముస్తఫా జంక్షన్లలో భారీ నిరసనలు చేపట్టారు. ఉక్కు కార్మికులకు హెచ్ఆర్ఏ నిలిపివేస్తూ ప్లాంట్ సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.మరోవైపు, అనుబంధ పరిశ్రమల విక్రయానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రైవేటుకు అప్పగించిన ఫెర్రో స్క్రాప్ నిగం లిమిటెడ్‌ను విక్రయించారు. మరో రెండేళ్ల పాటు వెయ్యి కోట్ల ఆర్డర్ ఉన్నా అమ్మేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: లాభాల్లో ఉన్నా అమ్మేశారుకేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న జపాన్ సంస్థతో ఒప్పందం కుదిరింది. లాభాల్లో ఉన్న సంస్థను ఎలా అమ్మేస్తారంటూ ఫెర్రోస్క్రాప్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రశ్నిస్తోంది. ఫెర్రోస్క్రాప్ ఏటా లాభాలు ఆర్జిస్తోంది. పలు ఆర్డర్లు ఉన్నాయి. నగదు నిల్వలున్నాయి. కేవలం రూ.320 కోట్లు కోసం ఇలాచేయడం వెనుక కుట్ర ఉంది. దీనిపై ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.