సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది చంద్రబాబేనని..నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేట్ వ్యక్తులు ఎలా నడుపుతారు? అంటూ ప్రశ్నించింది సీపీఎం.. గనులు కేటాయించకపోవడం వల్లే స్టీల్‌ప్లాంట్‌కు నష్టాలంటూ సీపీఎం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులపైన కన్నేసి ప్రైవేటీకరణ వైపు వెళుతున్నారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు. మీడియా పై దాడులతో సమస్యలు పరిష్కారం కావని వెంకట్ హితవు పలికారు.
కాగా, విశాఖలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గురువారం పర్యటించారు. స్టీల్‌ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సహకరిస్తుందని కార్మికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణపై చంద్రబాబు స్పందించకపోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని గతంలో పవన్ కల్యాణ్ ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ నోరు విప్పడం లేదు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ తీసుకుందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కుమారస్వామి పర్యటనలో అద్భుతాలు జరగవన్న మంత్రి శ్రీనివాస వర్మ.. ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకోవలసింది ప్రధానేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికుల డిమాండ్ చేస్తున్నారు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని మోదీతో చెప్పించాలని కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడ్డుకుంది. అప్పటి సీఎం జగన్.. ప్రధానమంత్రికి రెండు సార్లు లేఖ రాశారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment