సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందంటూ కూటమి సర్కార్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి వంద రోజుల పాలన మాటలకే పరిమితమయిందని.. పెన్షన్ తప్ప ఏ హామి అమలు కాలేదని విమర్శలు గుప్పించారు.
‘‘స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్నులు కడితే రూ.500 కోట్లు ఇస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్‌ను ఏర్పాటు చేయాలి. స్టీల్ ప్లాంట్‌కు తక్షణమే రూ.15 వేల కోట్లు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి’’ అంటూ శ్రీనివాసరావు నిలదీశారు.
ఇదీ చదవండి: ‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’
చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఉద్యమం: సీఐటీయూ
సీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ నేతలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు.. బీజేపీకి భజన చేస్తున్నారని సీఐటీయూ మండిపడింది.
‘‘స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అన్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటిమెంట్ అనే పదం వాడొద్దంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. సెయిల్‌లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’’ అని సీఐటీయూ నేతలు సీహెచ్ నరసింగరావు, కుమార్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment