సాక్షి, అనంతపురం: చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువు పరిస్థితి ఉందని.. రైతులకు కనీసం పెట్టుబడి సహాయం కూడా అందలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు వంద రోజుల పాలన మోసం, దగా.. మాయమాటలతో చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
‘‘అబద్ధాలు చెప్పటంలో చంద్రబాబు గోబెల్స్‌ను మించిపోయారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే నవరత్నాలు అమలు చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో కేవలం రూ.100 కోట్లే ఉంది. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసే నాటికి 7 వేల కోట్ల రూపాయలు ఉంది. అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చంద్రబాబు మీనమేషాలు లెక్కిస్తున్నారు’’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు.
ఇదీ చదవండి: ఆవు నెయ్యి.. టీడీపీకి గొయ్యి!
‘‘జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి వచ్చేది.. రైతు భరోసా పథకం అందేది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఏ మోహం పెట్టుకుని టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్తారు’ అంటూ అనంత వెంకటరామిరెడ్డి దుయ్యబట్టారు.
తిరుపతి లడ్డూ: చంద్రబాబు ఒక మాట.. ఈవో మరో మాట
‘‘కోట్ల మంది భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీస్తున్నారు. తిరుపతి లడ్డూల విషయం చంద్రబాబు ఒక మాట... ఈవో శ్యామలరావు మరో మాట మాట్లాడుతున్నారు. టీడీపీ కార్యాలయం లో తిరుపతి లడ్డూల ప్రస్తావన ఎందుకు చంద్రబాబు?. లడ్డూలపై వచ్చిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడమే చంద్రబాబు దిన చర్య’’ అంటూ అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment