CPM
-
రేసులో ఎంఎ బేబి, అశోక్ ధవాలే
మదురై(తమిళనాడు): దేశంలోనే అతిపెద్ద వామపక్ష పార్టీగా కొనసాగుతున్న సీపీఎం పార్టీకి నూతన ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్న నేపథ్యంలో ఆ పదవిలో ఎవరు కూర్చోబోతున్నారన్న చర్చ మొదలైంది. పార్టీ పగ్గాలు ప్రధానంగా ఎంఏ బేబీ, అశోక్ ధవాలేల్లో ఒకరికి దక్కే వీలుందని వార్తలు వినవస్తున్నాయి. ఎంఏ బేబీ గత 13 సంవత్సరాలుగా పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యునిగా సేవలందిస్తున్నారు. ఎంఏ బేబికి ముఖ్యంగా కేరళ రాష్ట్ర నాయకత్వం నుంచి దాదాపు సంపూర్ణ మద్దతు లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని మరింత విస్తరించాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా రైతాంగ సమస్యలు దేశవ్యాప్తంగా పతాక శీర్షికలకెక్కాయి. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధర అంశంపై రైతు ఉద్యమం ఉధృతంగా కొనసాగిన నేపథ్యంలో ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ ధవాలేను తమ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటే పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బలపడుతుందని ముఖ్యనేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బీజేపీ విధానాలపై పోరాటంలో భాగంగా వామపక్ష పార్టీల మధ్య సఖ్యత సాధించే, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను ఏకతాటి మీదకు తెచ్చే బలమైన నేతను పార్టీ ప్రధాన కార్యదర్శి పీఠంపై కూర్చోబెట్టాలని పార్టీ ముఖ్యులు యోచిస్తున్నారు. ధవాలేకు పశ్చిమబెంగాల్ ప్రాంతం నుంచి బలమైన మద్దతు ఉంది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లగల సత్తా ధవాలేకు ఉందని తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా తాజా లోక్‌సభ ఎన్నికల వేళ విపక్షాలు ‘ఇండియా’కూటమిగా ముందుకొచ్చి ఘోర వైఫల్యాన్ని చవిచూసిన నేపథ్యంలో మళ్లీ పార్టీల మధ్య సఖ్యత సాధించడంలో కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కొనసాగించడంలో నిష్ణాతుడైన నేత కోసం పార్టీ వేట మొదలెట్టడం తెల్సిందే. తెరమీదకు బీవీ రాఘవులు పేరు తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యంత సీనియర్ పోలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సైతం ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయకురాలు బృందా కారత్ను జనరల్ సెక్రటరీగా చూడాలని మరికొందరు నేతలు భావిస్తున్నారు. 75 ఏళ్లు దాటిన నేతను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకూడదనే నిబంధనను పార్టీ అమల్లోకి తెచ్చింది. అయితే అరుదైన, అత్యవసర పరిస్థితుల్లో ఈ నిబంధనను పక్కనబెట్టే వీలుందని తెలుస్తోంది. అగ్రనేతను ఎన్నుకునే క్రమంలో గతంలో కేరళ, పశ్చిమబెంగాల్ వర్గాల నుంచి గట్టి పోటీ ఎదురైంది. 1996లో పశ్చిమబెంగాల్ నుంచి జ్యోతిబసు ప్రధానమంత్రి పదవికి అర్హుడని భావించినవేళ కేరళ వామపక్ష వర్గం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించింది. 2007లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునే విషయంలోనూ పార్టీలో ఈ రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యపడలేదు. 2015లో సీతారాం ఏచూరిని ప్రధా న కార్యదర్శిగా ఎన్నుకుంటే ఆనాడు కేరళ ముఖ్యనేతలు ఎస్ఆర్ పిళ్లైకు మద్దతు పలికారు. తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ 24వ మహాసభలు మదురైలో జరుగుతున్న తరుణంలో ఆదివా రం పార్టీ కేంద్ర కమిటీ తదుపరి పార్టీ ఎన్నికల కోసం అభ్యర్థుల పేర్లను ప్రకటించే వీలుంది. -
హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత
-
రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో ఉద్రిక్తత నెలకొంది. రామోజీరావు ఫిలింసిటీని సీపీఎం నేతలు ముట్టడించారు. రామోజీ ఫిలింసిటీ గేట్లు దూకి సీపీఎం నేతలు లోపలికి వెళ్లారు. పేదల భూములను ఫిలిం సిటీ యాజమాన్యం ఆక్రమించగా.. బాధితులతో కలిసి ఆక్రమిత స్థలంలో సీపీఎం నిరసన చేపట్టింది. ఈ క్రమంలో సీపీఎం నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తోపులాటలో మహిళ స్పృహ తప్పిపోయింది.కాగా, సీపీఎం ఇవాల ఛలో రామోజీ ఫిలిం సిటీకి పిలుపునిచ్చింది.. పేదలకు ఇచ్చిన భూములను రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఆక్రమించింది. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని చెప్పి ఆర్ఎఫ్సీ యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా ఆర్ఎఫ్సీ యాజమాన్యం సాగదీస్తోంది.ఇటీవల కలెక్టరేట్ ముందు బాధితులతో కలిసి సీపీఎం ధర్నా కూడా నిర్వహించింది. ముడు దఫాలుగా ఫిలిం సిటీ యాజమాన్యంతో చర్చలు జరిపిన ఫలితం లేకపోవడంతో నేడు ఛలో ఫిలిం సిటీకి పిలుపునిచ్చింది. చర్చలు జరిపి తమకు ఇంటి స్థలాన్ని చూపించకపోతే ఫిలింసిటీని ముట్టడిస్తామని సీపీఎం నేతలు ముందే హెచ్చరించారు. -
‘ఇండియా’ కూటమి లేనట్టేనా?
సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ ఈ నెల 9వ తేదీన గమనా ర్హమైన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మరణం తర్వాత ఇంకా ఎవరూ ఆ స్థానంలోకి రాలేదు. కరత్ పాలిట్ బ్యూరో సమన్వయ కర్తగా నియమితులయ్యారు. అది ప్రస్తుతా నికి ప్రధాన కార్యదర్శి వంటి హోదా. పైగా ఆయన స్వయంగా లోగడ ఆ హోదాలో పని చేశారు. అందువల్ల తన మాటలకు తగినంత ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాదు. కరత్‌కు మార్క్సిస్ట్ సిద్ధాంతాలలో నిష్ణాతుడనే పేరు పార్టీలో, బయటా కూడా ఉన్నది. హరికిషన్ సింగ్ సూర్జిత్ ప్రధాన కార్యదర్శిగా ఉండినపుడు, సీపీఎంతో పాటు మొత్తం వామపక్షాలను మధ్యే మార్గ పార్టీలతో మైత్రి వైపు మళ్లించారు. సీతారాం అందుకు అనుకూలురు కాగా, కరత్ వ్యతిరేకి. కరత్ మాట్లాడిన సందర్భం సీపీఎం కేరళ శాఖ సభలు కొల్లామ్ పట్టణంలో జరగటం. ఆ సభలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి. ఆయన మాటలు నేరుగా తన ప్రసంగంలో అన్నవి గాక, విడిగా ఒక పత్రికా ప్రతినిధితో చెప్పినవి. అందువల్ల వాటికి తగిన ప్రచారం రాలేదు. కానీ అవి మొదట అనుకున్నట్లు గమనార్హమైనవి: ‘ఇండి యన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధా నాలు, సిద్ధాంతాలు, నాయకులు ఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. ఒక సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఇతర పార్టీలు ప్రయత్నించాయి గానీ అది ఆచరణలో పని చేయగలది కాదన్నాము. దానితో, నాయకులు మాత్రం కలుస్తుండేవారు. కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు గానీ అవేవీ పని చేయ లేదు. సీట్ల సర్దుబాటుపై జాతీయ స్థాయి చర్చలు వీలయేవి కాదు గనుక ఆ పని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా జరగాలన్నాము మేము. ఉదాహరణకు మా పార్టీ బెంగాల్లో, కేరళలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయదు. మొత్తానికి ఆ పద్ధతి పనిచేసి బీజేపీ సొంత మెజారిటీ కోల్పోయి 240 స్థానాలకు తగ్గింది. అందువల్ల, ఇండియా కూటమి అన్న ఆలోచనే లోక్‌సభ ఎన్నికలకు పరిమితమైనటువంటిది... లోక్ సభ ఎన్నికల అనంతరం తమకు అసలు ఒక ఉమ్మడి వేదిక అవస రమా? అయితే ఏ విధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. ఒక వేళ వేదిక ఎన్నికల కోసమే అయితే, ఇపుడు చేయవలసింది ఏమీఉండదు’ అన్నారు సీపీఎం సమన్వయకర్త.కూటమి భవిష్యత్తు?కరత్ వెల్లడించిన అభిప్రాయాలలో ఇండియా కూటమి ఏవిధంగా వ్యవహరించిందన్న గత పరిస్థితులకే పరిమితమయ్యారనే భావన కలగవచ్చు. కానీ అందులో అంతర్లీనంగా, ప్రతిపక్షాలు మౌలి కంగా ఎట్లా పనిచేస్తున్నాయి, భవిష్యత్తులో ఏ విధంగా పని చేయా లనే కోణాలు కూడా కనిపిస్తాయి. చెప్పాలంటే ఈ ప్రశ్నలు ప్రతి పక్షాలకు 1977 నాటి జనతా పార్టీ నుంచి మొదలుకొని తర్వాత కాలంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ల కాలంలో, ఇంకా తర్వాత కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడిన యూపీఏ హయాంలోనూ కొనసాగినవే. ఇండియా కూటమి బలహీనతలు, వైఫల్యాల వెనుక కూడా ఇదంతా ఉంది. కూటమికి వ్యవస్థాత్మక నిర్మాణాన్ని సీపీఎం వ్యతిరేకించటానికి కారణం అందులో పలు రకాల విధానాలు, సిద్ధాంతాలు గల పార్టీలు, నాయకులు ఉండటం. దీనికి సమాధానాలు కనుగొనలేకపోయినందువల్లనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి కూటమికి భంగపాట్లు ఎదురు కావటం జరిగింది. అటువంటి భంగపాట్లు జనతా పార్టీ కాలం నుంచి గత 48 సంవత్సరాలుగా ప్రతిపక్షాలకు ఎదురవుతూనే ఉన్నాయి. అందుకు ఒక కారణం వారి వైఫల్యాలు కాగా, మరొకటి భారతదేశపు మహా విస్తారమైన వైవిధ్యత.ఇన్నిన్ని ప్రాంతాలు, సైద్ధాంతిక, విధానపర, రాజకీయ వైవిధ్య తలు ఉన్నపుడు ఏకాభిప్రాయాలు, విభేదాలకు అవకాశం ఉండని సమష్టి నాయకత్వాలు తేలిక కాదు. కాంగ్రెస్, బీజేపీలవలె నిర్దిష్ట దీర్ఘకాలిక చరిత్రలు, నాయకత్వాలు, సిద్ధాంతాలు ఉన్నపుడు అది సాధ్యమవుతుంది. లేదా ఎమర్జెన్సీ వంటి అసాధారణ పరిస్థితి ఏర్పడి దేశాన్ని ఒకటి చేయటం వంటిది జరగాలి. వీటన్నింటి మధ్య స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఒక పాయగా సాగుతుండిన సోషలిస్టు రాజకీయం సరిగా కుదురుకొని ఉంటే ఏమి జరిగేదో గానీ పలు కారణాలవల్ల అది ఛిన్నాభిన్నమైంది. మరొకవైపు, కేవలం ఎమర్జెన్సీ పట్ల వ్యతిరేకతతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఏర్పడిన జనతా పార్టీ, తర్వాత ‘యాంటీ కాంగ్రెసిజం’ ఆలోచనలతో ముందుకు వచ్చింది. తాము ఒకప్పటి కాంగ్రెస్ సంప్రదాయంలో వామపక్షపు మొగ్గు గల మధ్యే మార్గ ప్రత్యామ్నాయం కాగలమన్న ఫ్రంట్ కూటములు అదే దశలో చెదిరిపోయాయి.కనీస ఉమ్మడి కార్యక్రమం ఏమిటి?అయితే, ప్రకాశ్ కరత్ మాటలను పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే, 1977 నాటి జనతా పార్టీ కాదుగానీ, 1989లో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ కొంత భిన్నంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలతో అదే పార్టీకి చెందిన వీపీ సింగ్ వంటి ముఖ్య నేతలు బయటకు రావటం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నదనే ఫిర్యాదుతో పలు ప్రాంతీయ పార్టీలు, ప్రభుత్వాలు, ఎమర్జెన్సీ – జనతా పార్టీ దశలో ఒకటై తిరిగి చెదిరిపోయిన సోషలిస్టు వర్గాలు, ఉభయ కమ్యూ నిస్టులు, దేశవ్యాప్తంగా సమాజంలోని ప్రజాస్వామికవాదులు ఒకే వేదికపైకి వచ్చి చేరారు. అంతేగాక, వీపీ సింగ్, ఎన్టీఆర్‌ల నాయ కత్వాన బీజేపీని ఒక అడుగు దూరంలోనే ఉంచివేశారు. ఈ వైవిధ్య తల మధ్య అపుడు ప్రకాశ్ కరత్ ఉద్దేశిస్తున్నది ఒకటి జరిగింది. అది, ఎన్నికలకన్నా ముందే వివిధ పార్టీల మధ్య సుదీర్ఘ చర్చల ద్వారా ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఒకటి రూపొందించటం. అది దేశ ప్రజానీకానికి ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించిన మాట నిజం. అయితే కొందరు సీనియర్ల అధికార కాంక్షలు, మందిర్–మండల్ వివాదాల మూలంగా ఆ ప్రయోగం భంగపడటం తెలిసిందే. అది జరగనట్ల యితే దేశ రాజకీయాలు మరొక విధంగా ఉండేవేమో.సీపీఎం సమన్వయ కర్త ప్రకాశ్ కరత్ అపుడంతా జాతీయ స్థాయిలో ఈ పరిణామాలను ప్రత్యక్షంగా గమనించిన వ్యక్తి. ప్రస్తుత ‘ఇండియా’ కూటమికి సంబంధించిన పరిణామాల వరకు తనకు తెలియనిది లేదు. అందువల్లనే ఆ కూటమి ఏర్పాటు తీరు, లక్ష్యాలు, పనితీరు, పరిమితులు, సాఫల్య వైఫల్యాల గురించి అంత స్పష్టంగా చెప్పగలిగారు. ఈ విషయాన్ని కొంత ముందుకు తీసుకువెళ్ళి నట్లయితే, ఆయన ఎత్తి చూపిన సైద్ధాంతిక, విధానపరమైన వైవిధ్యతలు, వైరుధ్యాల నుంచి, నాయకుల వ్యక్తిగత ధోరణులనుంచి బీజేపీ యేతర పార్టీలు బయటకు రాగలగటం, నేషనల్‌ఫ్రంట్ వలె కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకోవటం ఎంత వరకు సాధ్యమన్నది ప్రశ్న. అందుకు బీజేపీ వ్యతిరేకత అన్నదొక్కటే చాలదు. తమవైపు నుంచి ప్రజలకు చూపించే ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆర్థిక, సామాజిక, అభివృద్ధి అజెండా తప్పనిసరి. ఎన్నికల తర్వాత ఏమిటన్న చర్చ ‘ఇండియా’ కూటమిలో ఎప్పుడూ జరగలేదని కరత్ ఎత్తిచూపింది ఈ విధమైన కొరతనే!‘ఇండియా’ పేరిట ఏర్పడిన 26 బీజేపీ యేతర పార్టీల కూటమి 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీకి ఏర్పడింది మాత్రమే. ఆ ఎన్నికల తర్వాత ఏమి చేయాలన్నది ఎవరూ ఆలోచించలేదు. ఆ కూటమికి ఒక వ్యవస్థాత్మక నిర్మాణాన్ని మేము వ్యతిరేకించాం. ఎందుకంటే రకరకాల విధానాలు, సిద్ధాంతాలు, నాయకులుఆ కూటమిలో ఉన్న స్థితిలో ఏకీకృత కేంద్ర స్థాయి నిర్మాణం సాధ్యం కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరంతమకుఅసలు ఒక ఉమ్మడి వేదిక అవసరమా? అయితే ఏవిధంగా? అన్నది ఈ పార్టీలు ఆలోచించాలి. – ప్రకాశ్ కరత్, సీపీఎం పాలిట్ బ్యూరో సమన్వయకర్త-వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- టంకశాల అశోక్ -
థరూర్ సీపీఎంలో చేరబోరు: కారత్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సీపీఎం పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ తాత్కాలిక సమన్వయకర్త ప్రకాశ్ కారత్ తోసిపుచ్చారు. ఆయన పార్టీ వీడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదన్నారు. కేవలం కేరళలో స్టార్టప్‌లు సాధిస్తున్న గణనీయమైన ప్రగతి గురించి మాత్రమే మాట్లాడారని చెప్పుకొచ్చారు. శశిథరూర్ సాధారణ వ్యక్తి కాదని ప్రశంసించిన కారత్.. ఆయన నిక్కచ్చి అభిప్రాయాలు కొన్నిసార్లు కాంగ్రెస్‌కు అసౌకర్యాన్ని కలిగిస్తాయన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం సాధిస్తున్న పారిశ్రామికాభివృద్ధిని ప్రశంసిస్తూ థరూర్ గత నెలలో ఓ ఆంగ్ల పత్రికలో వ్యాసం రాశారు. ఇది రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ దానిపై ప్రశ్నల వర్షం కురిపించగా.. సీపీఎం వ్యాసాన్ని స్వాగతించింది. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశంసించలేదని, కేవలం స్టార్టప్ రంగంలో రాష్ట్ర ప్రగతిని ఎత్తి చూపానని థరూర్ స్పష్టం చేశారు. ఆ తరువాత మలయాళంలో ఓ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేరళలో పార్టీ నాయకత్వ బాధ్యతలకు తాను అర్హుడినని ప్రకటించారు. సంసిద్ధతను సైతం వ్యక్తం చేశారు. ఈ ప్రకటన కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని కలవరపరిచింది. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ థరూర్ మీడియాపై మండిపడ్డారు. -
పేదల భూముల వ్యవహారం.. ఆర్ఎఫ్సీకి అల్టిమేటం జారీ
రంగారెడ్డి, సాక్షి: పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించిన రామోజీ ఫిల్మ్ సిటీ(Ramoji Film City) యాజమాన్యానికి అల్టిమేటం జారీ అయ్యింది. వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని ఆర్ఎఫ్సీ యాజమాన్యం తమ గుప్పిటే ఉంచుకుంది. అయితే.. తమ భూములు తమకు ఇవ్వకపోతే ఫిల్మ్ సిటీని ముస్తామని పేద లబ్ధిదారులు హెచ్చరించారు. తాజాగా.. సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు రంగారెడ్డి కలెక్టరేట్(Rangareddy Collectorate) ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంతో.. నేడు చర్చల కోసం ఇరు వర్గాలను ఆర్డీవో ఆహ్వానించారు. అయితే.. చర్చలకు రాకుండా ఆర్ఎఫ్సీ యాజమాన్యం డుమ్మా కొట్టింది. ఈ పరిణామంతో బాధితులు మరోసారి ఆందోళకు దిగారు.ఈ పరిణామాన్ని ఆర్డీవో తీవ్రంగా పరిగణించారు. గురువారం చర్చలకు ఖచ్చితంగా రావాల్సిందేనంటూ ఆర్ఎఫ్సీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారాయన. మరోవైపు.. ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని RFC యాజమాన్యం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని, ఏడాది కాలంగా సమస్య పరిష్కారం చేయకుండా సాగదీస్తోందని బాధితులు వాపోతున్నారు. రేపు చర్చల్లో పాల్గొని తమ స్థలాలను చూపించకపోతే గనుక.. రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామన్న సీపీఎం(CPM) నేతలు, లబ్ది దారులు హెచ్చరికలు జారీ చేశారు. -
రెండు జాతీయ పార్టీలకు నోటా కంటే తక్కువ ఓట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల డేటా విశ్లేషణలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఢిల్లీ ఓటర్లు గుర్తింపు పొందిన జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎం కంటే నోటా (నాన్ ఆఫ్ ది ఎబవ్)ఆప్షన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపారని తేలింది. మొత్తం పోలైన ఓట్లలో నోటా ఆప్షన్‌కు 0.57 శాతం ఓట్లు పడగా బీఎస్పీకి 0.55 శాతం, సీపీఎంకు 0.01శాతం మంది మాత్రమే ఓటేయడం గమనార్హం. ఈ రెండు పార్టీలకు దక్కిన ఓట్ల కంటే నోటా ఓట్ల శాతమే ఎక్కువ. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.01, జేడీయూకు 0.53 శాతం ఓట్లు పడ్డాయి. -
ఏం సాధించారని కూటమి నేతల సంబరాలు: సీపీఎం
సాక్షి, విశాఖపట్నం: కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వాల్తేర్ డివిజన్‌ను రెండు ముక్కలు చేయడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. 10,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని.. ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా ఒరిస్సా పరిధిలో కలిసిపోతుందని సీపీఎం పేర్కొంది.అరకు అభివృద్ధికి ఒరిస్సా మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం సాధించారని కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు. జోన్ ఏర్పాటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీపీఎం తెలిపింది.కాగా, కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.విశాఖ పర్యాటక భూభాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్‌ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వాపోయారు. రాయగడ డివిజన్లో కేకే లైన్‌ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు. -
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు’
సాక్షి, హన్మకొండ: ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు సీపీఐ నాయకుడు చాడా వెంకట్‌రెడ్డి. ప్రజాకవి గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదని చెప్పుకొచ్చారు.చాడా వెంకట్‌రెడ్డి తాజాగా హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులను అణచివేయాలని చూస్తున్నారు. ఎన్కౌంటర్ల ద్వారా మావోయిస్టులను అంతం చేయలేరు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరం కాదు. నక్సలిజాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడాలి.గద్దర్‌కు అవార్డు ఇవ్వడం తప్పు అనేది సరైంది కాదు. గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. దేశాన్ని రాచరికం ఏలుతున్న రోజుల్లో కమ్యూనిజం పుట్టింది. భారత సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చింది సీపీఐ పార్టీనే. ఎన్నో నిర్భంధాలను కమ్యూనిస్ట్ పార్టీ ఎదుర్కొంది. నవాళి కళ్యాణానికి బీజం వేసింది భారత కమ్యూనిస్టు పార్టీ. దీన్ని అంతం చేస్తామని కొందరు చెబుతున్నారు. కమ్యూనిజం అంతం చేయడం ఎవరితరమూ కాదు అంటూ కామెంట్స్ చేశారు.మరోవైపు.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మావోయిస్టులపై వరుస ఎన్కౌంటర్ల విషయమై స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ..‘వంద మంది అమిత్ షాలు వచ్చినా ఉద్యమాలు ఆగవు. ఎన్కౌంటర్ల వల్ల ఉద్యమాలకు చెక్ పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి ఎన్కౌంటర్లు గతంలో చాలా జరిగాయి.. ఉద్యమాలు మళ్ళీ మొదలు అయ్యాయి. ఎన్కౌంటర్ల వల్ల కొంతమంది మరణం మాత్రమే జరుగుతుంది. కొంత మందిని మాత్రమే చంపగలరు. ఉద్యమాన్ని ఆపలేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ
సాక్షి, సంగారెడ్డి: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్‌వెస్లీ నియమితులయ్యారు. 60 మందితో సీపీఎం నూతన కార్యవర్గం ఏర్పాటు కాగా, 70 ఏళ్లు దాటిన నేతలకు రాష్ట్ర కమిటి నుంచి ఉద్వాసన పలికారు. తమ్మినేని వీరభద్రం, సీతారాములు, నర్సింగరావులకు సీపీఎం రాష్ట్ర కమిటీలో అవకాశం దక్కలేదు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వెస్లీ.. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేశారు.అయితే, సీపీఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. సంగారెడ్డిలో జరుగుతున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలు నేటితో ముగిశాయి. చివరి రోజు మంగళవారం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని ఆ కమిటీ ఎన్నుకోనుంది. -
2సీట్లు ఉన్న కుమార స్వామిని చూసి బుద్ధి తెచ్చుకో.. బాబుపై సీపీఎం నేత ఫైర్
-
డిప్యూటీ సీఎం పవన్ పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శలు
-
పవన్.. సీజ్ ది షిప్ ఏమైంది?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖపట్నం: విశాఖను ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒక్క నిమిషం కూడా చంద్రబాబు ప్రధానితో మాట్లాడలేదన్నారు. అలాగే, కూటమి పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ఘాటు విమర్శలు చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘స్టీల్ ప్లాంట్ సహా అన్నింటినీ అదానీకి అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. రైల్వే జోన్‌ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు. రైల్వే జోన్ ప్రారంభం కాకుండా కుట్రలు పన్నుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెప్పారు. మొన్న ప్రధానిని చంద్రబాబు కలిసినప్పుడు ఈ ప్రభుత్వం అసలు స్వరూపం బయటపడింది. విశాఖ ఉక్కు కోసం ఒక్క నిమిషం కూడా ప్రధానితో బాబు మాట్లాడలేదు. మీరు స్టీల్ ప్లాంట్‌ను కాపాడే వ్యక్తులా లేక మిట్టల్‌కు బ్రోకర్లా అని అడుగుతున్నా. మిట్టల్‌కు ఆగమేఘాల మీద అనుమతులు ఎందుకు అడుగుతున్నారు?.ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కడపలో ఉక్కు పరిశ్రమ పెట్టాలి. విశాఖ ఉక్కును బలి చేసి మిట్టల్‌ను తీసుకొస్తామంటే ఊరుకునేది లేదు. ముందు విశాఖ ఉక్కును కాపాడి అప్పుడు ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతిస్తాం. కర్ణాటక స్టీల్ ప్లాంట్‌కు రూ.15వేల కోట్లు కుమారస్వామి తీసుకొని వెళ్ళాడు. ఇక్కడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు?. మన ఎంపీలకు ఏ మాత్రం సిగ్గు ఉన్నా ఢిల్లీలో ధర్నా చేసి స్టీల్ ప్లాంట్‌కు నిధులు తేవాలి. లేనిపక్షంలో ఎంపీలు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి.చంద్రబాబుని ప్రధాని మోదీ ఆడిస్తున్నారు. ఆరు నెలల్లో వెన్నుపోట్లు పొడవద్దు. రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా అవినీతే కనపడుతోంది. ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పి మహిళలకు శఠగోపం పెట్టారు. సూపర్ సిక్స్ ఎక్కడా కనపడటం లేదు.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు.. పథకాలు ఇవ్వడంలో ఆ స్పీడ్ ఎందుకు లేదు?. ఈ ప్రభుత్వంపై పేదలు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు. సీజ్ లేదు.. షిప్ లేదు. ఒక్క బియ్యపు గింజను కూడా సీజ్ చేయలేదు. పవన్‌కు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేవుడిలా కనపడుతున్నారు. పవన్ ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం అంటున్నారు. గిరిజనులకు భూమి హక్కు కల్పించి సనాతన ధర్మ పరిరక్షకుడిగా నిరూపించుకోవాలి. కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
చంద్రబాబు తీరు దుర్మార్గం.. సీపీఎం నిరసన
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ.. జగదాంబ సెంటర్లో సీపీఎం నిరసన చేపట్టింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గం అంటూ సీపీఎం నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏమిటంటూ వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.వైజాగ్ స్టీల్ కోసం గనులు అడగకుండా మిట్టల్‌కు చంద్రబాబు ఎలా గనులు ఇవ్వాలని కోరుతారంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని.. వైజాగ్ స్టీల్‌ను కాపాడకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది. -
పవన్ మాటలు వెనుక బీజేపీ ట్రైనింగ్
-
చంద్రబాబు విన్యాసాలు.. కష్టాల్లో ఏపీ ప్రజలు
-
ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక పార్క్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా విలేజ్ కాదని.. పారిశ్రామిక పార్క్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అక్కడ కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. శనివారం సచివాలయంలో సీఎంను సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతోపాటు సీపీఐ(ఎంఎల్) ప్రతినిధులు కలిశారు. ఇటీవల లగచర్లలో పర్యటించిన వీరు.. అధికారులపై దాడి ఘటన తర్వాత అక్కడి పరిస్థితులపై రూపొందించిన నిజనిర్దారణ నివేదికను సీఎంకు అందజేశారు. పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ సందర్భంగా లగచర్లలో ఏర్పాటుచేయబోయే పరిశ్రమల గురించి వారికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. లగచర్లలో కాలుష్య రహిత పరిశ్రమలనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. భూసేకరణ పరిహారం పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. నా ప్రజలను నేను ఇబ్బంది పెడతానా? తన నియోజకవర్గంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం తన బాధ్యత అని వామపక్ష పార్టీల నేతలతో సీఎం అన్నారు. ‘నా సొంత నియోజకవర్గ ప్రజలను నేనే ఎందుకు ఇబ్బంది పెడుతా?’అని ప్రశ్నించారు. అయితే, లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి చేసిన వారిని, అందుకు కుట్ర చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేది లేదని స్పష్టంచేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టిన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయంపై సమాలోచన కాలుష్య కారక పరిశ్రమల కోసం రెండు పంటలు పండే భూములను తీసుకోవడం సరికాదని సీఎంకు సూచించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లగచర్లలో కాకుండా కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి చెందిన 1,156 ఎకరాలకు పైగా ఉన్న సీలింగ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మంచిదని తెలిపినట్లు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఆ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నందున ఆలస్యం జరుగుతోందని సీఎం అన్నారని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ భూములుంటే సూచించాలని సీఎం అడిగారని, దీనిపై రెండుమూడుసార్లు సమావేశాలు నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకుందామని చెప్పారని తమ్మినేని వెల్లడించారు. కాగా, లగచర్లలో వరి కోతలకు అధికారులు యంత్రాలను అనుమతించడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, పోలీసు క్యాంపులతో నిర్భందం కొనసాగుతున్నదని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే.. ఆయన వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి వరికోత యంత్రాలను అనుమతించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పోలీసు క్యాంపులను వెంటనే తొలగించాలని ఆదేశించినట్లు వివరించారు. గిరిజనులపై కేసులు ఎత్తేయండి: కూనంనేని లగచర్ల ఘటనలో గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎంను కోరినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. పరిశ్రమలను ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేయాలని, రైతుల భూములు సేకరించి జనావాసాల మధ్య ఫార్మా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామంటే వామపక్షాలు అంగీకరించబోవని సీఎంకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే.. అదికూడా రైతులను ఒప్పించి, పూర్తి నష్టపరిహారం అందించిన తరువాతే వారి భూములను సేకరించాలని సూచించినట్లు తెలిపారు. సీఎంను కలిసినవారిలో సీపీఐ రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, సీపీఐ (ఎం.ఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, ఎస్.ఎల్. పద్మ, ఆర్ఎస్పీ నాయకడు జానకిరాములు, ఎంసీపీఐ నాయకుడు గాదగోని రవి తదితరు ఉన్నారు. -
సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ సీపీఎం నేతల కీలక భేటీ
-
రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
-
బాబూ.. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?: సీపీఎం శ్రీనివాసరావు
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. అలాగే, స్టీల్‌ప్లాంట్‌పై కేబినెట్లో ఒక్కసారైనా చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందంటూ కామెంట్స్ చేశారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ కాపాడుతారనే కారణంగానే గాజువాకలో టీడీపీ ఎమ్మెల్యేకి అతిపెద్ద మెజారిటీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై టీడీపీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు ఇవ్వాలా?. కూటమి ప్రభుత్వం ఒక్కసారైనా కేబినెట్లో స్టీల్ ప్లాంట్ కోసం చర్చించిందా?. సనాతన ధర్మంలో అవినీతి అనే అంశం లేనట్టు ఉంది.స్మార్ట్ మీటర్లను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు వ్యతిరేకించారు. ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లు వేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు?. ఇరిగేషన్లో పీపీపీ మోడల్ ఏమిటో అర్ధం కావడం లేదు. టోల్ వసూలు చేసి రోడ్లు వేస్తామని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉంది. టోల్ పెట్టకపోతే రోడ్లు వేయరా?. సీఎం బాబు మొదటి సంతకం చేసిన డీఎస్సీ ఏమైంది?. డీఎస్సీకి దిక్కులేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో పరుగులు పెట్టిస్తారా?. విశాఖలో అత్యాచారాలపై చాలా బాధగా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వారిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30వేల మంది మహిళలు మిస్సింగ్ అని ప్రచారం చేశారు. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు.. ఏం చేశారు?. లేదంటే అది ఎన్నికల డ్రామానా? అని ప్రశ్నించారు. -
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఉపేక్షించం..మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీలేదు. ఏడాది పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం తప్ప వేటినీ అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా ఊరూరా ఎర్రజెండా ను తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా చెప్పాం.ఇక నుండి రోడ్ల పైకి వస్తాం. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవలచేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమకిచ్చిన హామీ నెరవేర్చక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు.. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీపీఎం భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జి వంటి మరికొన్ని అంశాలను కూడా ఆ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంపై ఒకపక్క సీపీఎం విరుచుకు పడుతుంటే, మరోపక్క సీపీఐ కూడా వివిధ సమస్యలపై తన నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రజలకు దూరమవుతామన్న భావన.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవగా, సీపీఎం పార్టీ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని అసెంబ్లీ పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు సీపీఎంకు కూడా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించాలన్న అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది.అయితే ఏడాది కావొస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అసంతృప్తి కామ్రేడ్లలో ఉందని అంటున్నారు. అలాగే పలు సందర్భాల్లో సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇచ్చినా లెక్క చేయడంలేదని వామపక్షాలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే తాము మిన్నకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, వారికి దూరం అయ్యేందుకు అవకాశం ఉందనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ఫలితమే సీపీఎం, సీపీఐల ప్రతిస్పందనలని అంటున్నారు. ఇటీవలి పరిణామాలేంటి..?బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచే జీవోను రద్దుచేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను పడగొట్టి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఒకవైపు ప్రజాపాలన అంటూనే ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తోందని సీపీఎం విమర్శించింది. ‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పోలీసులను, అధికారులను ప్రయోగిస్తోంది. ఇళ్ల కూలి్చవేతకు ఏర్పాట్లు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ సీఎం రేవంత్‌రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు. ‘రైతులకు ప్రకటించిన రు.2 లక్షల రుణమాఫీని అర్హులైనవారందరికీ అమలు చేయాలి. అలాగే పంటకాలం పూర్తవుతున్నప్పటికీ వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. తక్షణమే రైతు భరోసా చెల్లించాలి..’అని సీపీఎం కోరింది. గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించింది. వారికి న్యాయం చేసేవిధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. వానాకాలం, యాసంగికి రైతుభరోసా, రుణమాఫీలను వెంటనే అమలు చేయాలని సీపీఐకి చెందిన రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై జిల్లాల్లో ధర్నాలు చేపట్టింది. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమేనంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
నమ్మించి మోసం చేసిన కూటమి కరెంటు బిల్లులు బాదుడే బాదుడు..
-
Jammu Kashmir election results: కశ్మీర్ లోయలో ఎర్రజెండా
జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. ‘ఓ జో తరిగామ్ వాలా?’అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పారీ్టకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత ‘హక్ కా హామీ తరిగామీ’అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి. గట్టిపోటీని తట్టుకుని..ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యరి్థగా తరిగామికి మద్దతు ఇచి్చంది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచి్చంది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆరి్టకల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది. జైలు జీవితం.. గృహ నిర్భందం.. 1949లో జని్మంచిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యారి్థ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్భందానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్‌లో 35 రోజుల పాటు గృహనిర్భందలో ఉంచారు. నిర్భందంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
పవన్‌ను సీఎం చేయడమే బీజేపీ ప్లాన్: సీపీఎం కార్యదర్శి
సాక్షి,విజయవాడ:కూటమి ప్రభుత్వంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌ను బీజేపీ ఆడిస్తోందన్నారు.చంద్రబాబును దింపేసి పవన్ కళ్యాణ్‌ను సీఎం చేసేందుకు బిజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.ఏపీని నాశనం చేసేందుకు బీజేపీ పవన్ కల్యాణ్‌ను వాడుకుంటోందన్నారు. వందరోజుల్లోనే కూటమి ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని విమర్శించారు.ఇదీ చదవండి: జీతాలు నిల్లు.. పబ్లిసిటీ ఫుల్లు: విజయసాయిరెడ్డి సెటైర్లు -
తిరుమల లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు: బీవీ రాఘవులు
-
లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలిగానీ, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏ కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురావని, పాపమే తెస్తాయన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ)భవన్లో ఆదివారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడని, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అయన్ని చెప్పమనండి అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాఘవులు ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి సీతారాం ఏచూరి పెద్ద పుస్తకమే రాశారని, సనాతన ధర్మంలో కీలకం కుల వ్యవస్థ అని, కులంపై అభిమానం ఉన్నవాళ్లు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారన్నారు. కుల వ్యవస్థ శ్రమకు, సాటి మనిషికి గౌరవం ఇవ్వదన్నారు. అలాగే, కుల వ్యవస్థను తీసేస్తే సనాతన ధర్మం ఉండదని, అది ఆధునిక ధర్మం అవుతుందన్నారు. ఈ దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడాలంటే కుల, మత వ్యవస్థను తొలగించాలని రాఘవులు తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ వంటి మతతత్వ శక్తుల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటివి ప్రమాదంలో పడిపోయాయని, ఈ తరుణంలో సీతారాం ఏచూరి వంటి నాయకులు లేకపోవడం దేశానికి పెద్ద లోటన్నారు.ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనర్థాలు..తాజాగా.. కేంద్ర మంత్రివర్గం ఒకే దేశం, ఒకే ఎన్నికకు ఆమోదం తెలిపిందని, ఈ నినాదం బాగుందని అనుకోవద్దని, దీనివల్ల ఏకత్వం మాటెలా ఉన్నా దేశంలో ప్రాంతాల వారీ తగదాలకు, విభజనకు దారితీస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. అధ్యక్ష తరహా పాలనను గతంలో ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఒకే ఎన్నిక అంటోందన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని, మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇక కామన్ సివిల్‌కోడ్ గురించి మనమంతా మాట్లాడుకుంటుంటే సాక్షాత్తు ప్రధానమంత్రే కమ్యూనల్ సివిల్‌కోడ్ తెస్తామని చెబుతున్నాడని.. ఇది ఏకత్వం కాదని, ఈ దేశం ఐక్యతను దెబ్బతీసే చర్యలని రాఘవులు విమర్శించారు.సిద్ధాంతానికి కట్టుబడ్డ ఏచూరి..మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఆహర్నిశలు పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి మన తెలుగు వాడు కావడం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి ‘రాజీనామా చేయండి’ అని డిమాండ్ చేసిన ధైర్యశాలి సీతారాం అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పుడు, ఆయన్ను మళ్లీ సీఎం పీఠం ఎక్కించడానికి రాష్ట్రంలోను, ఢిల్లీలోను సీతారాం చేసిన కృషి ఎనలేనిదన్నారు.ఉత్తమ పార్లమెంటేరియన్ మన ఏచూరి : అంబటిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల కోసం పోరాడే శక్తి అని, అటువంటి పార్టీలో నిబద్ధతతో రాటుదేలి రాణించడమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతారాం ఏచూరి మన తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. భారత పార్లమెంట్లో ఆయన పెట్టిన సవరణలు ఆమోదించేలా పోరాడిన సీతారాం ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారన్నారు. సీతారాం మరణం భారత రాజకీయాలకు తీరనిలోటని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు వచ్చానని అన్నారు. జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన సీతారాంకు తమ నాయకుడు జగన్ తరఫున, తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నానని రాంబాబు పేర్కొన్నారు. సభలో ఇంకా మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీతారాం చిత్రపటానికి అంజలి ఘటించారు. -
అన్నాడంటే మాటపై ఉన్నాడనే!
ఇచ్చిన మాటకే కాదు, తామన్న మాటలకూ ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్దిమంది రాజకీయ నాయకులలో సీతారాం ఏచూరి ఒకరు. ఇంటర్వ్యూ లలో వెలిబుచ్చిన అభిప్రాయాల పర్యవసానాలను ఆ తర్వాత ఎదుర్కొనే ధైర్యం లేక ప్రసారాలకు ముందే వాటిని తొలగించమని నాయకులు కోరటమన్నది అసాధారణమేమీ కాదు. కానీ ఏచూరి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండేవారు. యునైటెడ్ ఫ్రంట్‌కు సీపీఎం మద్దతిస్తున్నప్పటికీ, అప్పటి ప్రధాని దేవె గౌడ మీద ఆయన చేసిన విమర్శ దీనికి నిదర్శనం. రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే విజ్ఞప్తులను సైతం అంగీకరించటం కోసమే ఏచూరి మార్గాలను వెతికేవారు. ఆయన గుణం సావధానం. ఆయన జ్ఞాపకశక్తి అపారం.సీతారాం ఏచూరిని నేను మొదటిసారి ఎప్పుడు కలిశానో గుర్తుకు రావటం లేదు. బహుశా అది నేను 1990లో ఇండియాకు తిరిగి వచ్చిన కొద్ది రోజులకు కావచ్చు. అయితే నేనెప్పటికీ మర్చిపోలేనిది మాత్రం ఆయనతో సుదీర్ఘమైన నా మొదటి ఇంటర్వ్యూ. అది 1996వ సంవత్సరం.ఇంటర్వ్యూ చేసింది ఆనాటి నూతన ప్రధాని దేవె గౌడ గురించి. అప్పటికి సీతారాంతో నాకు బాగా పరిచయం ఏర్పడి ఉంది. ఇంటర్వ్యూలో ‘సీత’ (తనను ఇలా పిలవొచ్చని ఏచూరి నాతో అన్నప్పట్నుంచీ నేనాయన్ని సీత అనటం మొదలుపెట్టాను) దేవె గౌడ తన అధికారిక పర్యటనకు తనతో పాటుగా అనేక మంది తన కుటుంబ సభ్యులను ఇటలీకి వెంటబెట్టుకుని వెళ్లటాన్ని విమర్శించారు. నాటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి దేవె గౌడ పార్టీ, సీపీఎం రెండూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నందు వల్ల సీత అలా విమర్శించటం అనూహ్యం, దాపరికం లేకపోవడం మాత్రమే కాక వార్తగా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. అది కేవలం ఒక సాధారణ వ్యాఖ్య కాదు. పూర్తి స్థాయి విమర్శ. ఇంటర్వ్యూ ప్రసారానికి ముందు రోజు సాయంత్రం సీత నాకు ఫోన్ చేశారు. ‘‘ఇంటర్వ్యూలో నేను చెప్పిన దానిని తొలగించమని అడగటానికి నేను మీకు కాల్ చేయలేదు’’ అని నవ్వుతూ అన్నారు. అదొక వ్యాప్తి చెందే స్వభావం కలిగిన సహృదయ హాసం. ‘‘నేను దాని గురించి ఇప్పటికే నా సహచరులకు చెప్పి, వారి స్పందనలకు తగిన వివరణ ఇచ్చేశాను కనుక దానిని మీరు తీసేయలేదని నిర్ధారించుకోటానికే మీకు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు దానిని తొలగిస్తే ఇద్దరం కూడా నవ్వులపాలౌతాం’’ అన్నారు. నిజానికి సీత, తామన్న మాటలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉండే అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో ఒకరు. నాయకులు ఇంటర్వ్యూలలో వెలిబుచ్చిన తమ వాస్తవ అభిప్రాయాల పర్యవసానా లను ఎదుర్కొనే ధైర్యం లేక వాటిని తొలగించమని కోరటమన్నది అసాధారణమేమీ కాని ఆ 9వ దశకంలో, 2000–2009 మధ్య కాలంలో సీత అలా నాకు కాల్ చేయటం అత్యంత అసాధారణం. చెప్పాలంటే అభినందనీయం. అదొక్కటే కాదు, సీత సావధానంగా వినే గుణం కలిగిన వారనీ, ఆయన జ్ఞాపకశక్తి అపారమనీ కనిపెట్టటానికి నాకు మరికొంచెం సమయం పట్టింది. నేను ‘ఐ విట్నెస్’ వీడియో మేగజీన్‌కు పని చేస్తూ, తరచు చర్చలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఓసారి నాకు ఢిల్లీ కమానీ ఆడిటోరియం వెలుపలి ప్రాంగణంలో సీత సిగరెట్ తాగుతూ కనిపించారు. ‘‘మీకూ ఒకటి కావాలా?’’ అని నన్ను అడిగారు. బహుశా నా ముఖం సిగరెట్టు తాగే రకంలా ఆయనకు కనిపించి ఉండాలి. తన సిగరెట్ వెలిగించుకున్నాక, నాకూ ఒకటి ఇచ్చారు. నేను సిగరెట్ తాగుతానని మీకెలా తెలుసు అని అడిగాను. ‘‘మీరేగా చెప్పారు, మర్చిపోయారా?’’ అని ఆశ్చర్యపోయారు. ‘‘జనవరిలో మాత్రమే తాగుతానని, అది కూడా ఇతరులు ఇచ్చే సిగ రెట్లు మాత్రమే తాగుతానని మీరు నాతో చెప్పారు కదా’’ అన్నారు. ఆయన అన్నది నిజమే. అయితే ఎవరికి గుర్తుంటుంది కనుక అని నేను తమాషాగా చెప్పే విషయాలలో ఇది కూడా ఒకటి. కానీ సీత దానిని గుర్తుపెట్టుకున్నారు! వాస్తవానికి ఆయన జ్ఞాపకశక్తి పరిధి, కచ్చితత్వాలే ఇంటర్వ్యూ లలో ఆయనకు శక్తిమంతమైన ఆయుధాలు. ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా ప్రశ్నల్లో నేను తేదీలను కలిపేసినప్పుడు లేదా వాస్త వాలలో నా వైపు తప్పులు దొర్లినప్పుడు వెంటనే ఆయన నన్ను సరి దిద్దేవారు. అలాగని ఎప్పుడూ కూడా అభ్యంతరకరంగా మాట్లాడే వారు కాదు. నేను మర్చిపోయిన ఒకటీ రెండు పాయింట్లను కూడా జోడించి మరీ విషయాన్ని ముగించేవారు. అలాగుండేది ఏచూరితో. అయితే ఆయనలో అస్సలు లేనివి ఏమిటంటే ముఖం చిట్లింపు, హాస్య విహీనత. ఆయన చమత్కారం ఉవ్వెత్తున పొంగిన షాంపేన్లా మిరిమిట్లతో నురగలు కక్కుతుంది. 2005లో బృందా కారత్ సీపీఎం పాలిట్ బ్యూరోలో చేరారు. అప్పటికే ఆమె భర్త (ప్రకాశ్ కారత్) అందులో ఉన్నారు. బృందా పాలిట్ బ్యూరో సభ్యురాలైన కొత్తల్లో ‘సీఎన్ బీసీ’ లేట్ నైట్ డిస్కషన్లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.బృందాతో పాటు మరికొందరు అతిథులు ఉన్నారు. ఆ డిస్కషన్‌కు నాదే యాంకరింగ్. చర్చ సాగుతుండగా అతిథుల్లో ఒకరు... సీపీఎం పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించిన తొలి మహిళ కదా బృందా కారత్ అన్నారు. ‘‘అవును’’ అని చిరునవ్వుతో చూస్తూ, ‘‘మాది ఇప్పుడు రెండు క్యారెట్ల పార్టీ!’’ అన్నారు సీత. సీత... సల్లాపాల ఉల్లాస ప్రియుడు కూడా. కథలు కథలుగా తన గురించి చెప్పుకుంటున్నప్పుడు... ఆయన కళ్లు దివ్వెలై వెలగటం, ఆయన ముఖం నవ్వులై విరియటం చూసి... ఆయన స్వీయానంద భరితులై ఉన్నట్లు మీరు చెప్పగలుగుతారు. కొన్నిసార్లు ఆయనకు ఒక ఇంటర్వ్యూ నచ్చి, లేదా అంతక్రితమే ఆయన చదివిన ఒక కాలమ్ గురించి చెప్పాలనిపించి, పొద్దుపోయాక నాతో ఫోన్లో వృత్తాంత భరితంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖంలోని చిరుమంద హాసం లేదా ఆ గొంతులో తొణికిసలాడే నవ్వు నా గ్రహింపులోనికి వచ్చేవి. సీత ఎప్పుడో గాని చెప్పిన సమయానికి చేరుకోలేరు. ఒక ఇంటర్యూకి ఫలానా సమయానికి వచ్చేస్తానని మాట ఇచ్చి కూడా దారి మధ్యలో తనను కలవాలని వచ్చిన అనేక మంది కోసం కారును ఆపించేవారు. ‘‘సమస్య చిన్నదే. వాళ్లందరూ ఆయనతో మాట్లాడాలని ఆశ పడతారు. అందుకు ఆయన ఎప్పుడూ నిరాకరించరు’’ అని ఇంటర్వ్యూకు ఆయను తీసుకువచ్చేందుకు వెళ్లిన నా సహచరులు చెప్పేవారు. ‘కాదు’ అని సీత ఎప్పుడైనా నాతో అన్నట్లు గుర్తు లేదు. సాధా రణంగా జర్నలిస్టులు చేసే విధంగానే, ఇతర రాజకీయ నాయకులు ఏ మాత్రం సంకోచించకుండా తిరస్కరించే అసంభవమైన విజ్ఞప్తులను నేను సీతకు చేసేవాడిని. అందుకు సీత ఎప్పుడూ వాటిని అంగీకరించటం కోసమే మార్గాలను వెతికే ప్రయత్నం చేసేవారు. కొన్నిసార్లు తన భార్య సీమ వైపు నుంచి చేయించే విన్నపాలను మన్నించేవారు. ఇన్ని విధాలుగా ఆయన నాకు ఎల్లప్పుడూ గుర్తుంటారు.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి...
-
స్టీల్‌ప్లాంట్ మూసివేతకు కుట్ర.. ‘కూటమి’పై సీపీఎం నేత ఫైర్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోందంటూ కూటమి సర్కార్‌పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి వంద రోజుల పాలన మాటలకే పరిమితమయిందని.. పెన్షన్ తప్ప ఏ హామి అమలు కాలేదని విమర్శలు గుప్పించారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల పన్నులు కడితే రూ.500 కోట్లు ఇస్తామంటున్నారు. స్టీల్ ప్లాంట్ మూసివేతకు కుట్ర జరుగుతోంది. స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్‌ను ఏర్పాటు చేయాలి. స్టీల్ ప్లాంట్‌కు తక్షణమే రూ.15 వేల కోట్లు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు మాటలు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి’’ అంటూ శ్రీనివాసరావు నిలదీశారు.ఇదీ చదవండి: ‘చంద్రబాబు వంద రోజుల పాలన మోసం.. దగా’చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ ఉద్యమం: సీఐటీయూసీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ నేతలు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు.. బీజేపీకి భజన చేస్తున్నారని సీఐటీయూ మండిపడింది.‘‘స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అధికారంలోకి రాకముందు విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ అన్నారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత సెంటిమెంట్ అనే పదం వాడొద్దంటున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు. సెయిల్‌లో విలీనం చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి’’ అని సీఐటీయూ నేతలు సీహెచ్ నరసింగరావు, కుమార్ డిమాండ్ చేశారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్.. బీజేపీ నేతకు సీపీఎం నేత దిమ్మతిరిగే కౌంటర్
-
ఎయిమ్స్‌కు ఏచూరి భౌతికకాయం అప్పగింత
న్యూఢిల్లీ: వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థీవదేహం ఎయిమ్స్‌కు చేరుకుంది. వివిధ పార్టీల రాజకీయ ప్రముఖులు నివాళి అర్పించిన అనంతరం.. అంతిమ యాత్ర సాగింది. ఆయన కోరిక మేరకే భౌతిక కాయాన్ని మెడికల్ రీసెర్చ్ కోసం ఎయిమ్స్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు దానం చేశారు.ఈ ఉదయం 11 గంటలకు ఏచూరి పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి సీపీఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం.. పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ.. ఏచూరి భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి ఆయన సతీమణిని ఓదార్చారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ సీఎం పినరయి విజయన్.. ఏచూరి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆప్ కీలక నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, వైఎస్సార్సీపీ తరఫున విజయసాయిరెడ్డి కూడా దివంగత కామ్రేడ్‌కు నివాళులర్పించారు.సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన 1992 నుంచి సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి తొలుత జేఎన్‌యూ(JNU)కు తరలించి అక్కడి నుంచి ఆయన నివాసానికి తీసుకెళ్లారు. జేఎన్‌యూఎస్‌యూ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉంచగా.. వందల మంది విద్యార్థులు ‘‘లాల్‌సలాం’’ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమాన కమ్యూనిస్టు యోధుడికి పుష్పాంజలి ఘటించారు. VIDEO | Veteran CPI(M) leader Sitaram Yechury’s mortal remains brought to AIIMS, Delhi. The CPI(M) general secretary died on Thursday, August 12, in Delhi after battling a lung infection. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/7eTYgwssEG— Press Trust of India (@PTI_News) September 14, 2024క్లిక్ చేయండి: వామపక్ష దిగ్గజ నేత జీవితంలో ప్రత్యేక క్షణాలు -
విజయవాడ వరద బాధితులకు అండగా సీపీఎం
-
సంస్కరణవాది.. స్థిత ప్రజ్ఞుడు
సాక్షి, నేషనల్ డెస్క్/సాక్షి, హైదరాబాద్: బహుభాషావేత్తగా, కాలమిస్ట్‌గా, రాజకీయవేత్తగా, వామపక్షవాదిగా సీతారాం ఏచూరిది సుదీర్ఘ ప్రస్థానం. అటు పార్టీ అగ్రనేతగా కొనసాగుతూనే ఇటు ఎర్రజెండా పట్టుకుని పలు ప్రజా ఉద్యమాల్లో తలమునకలయ్యారు. సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన వామపక్ష నేతగా కొనసాగారు. తుదిశ్వాస వరకూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం పాటుపడి నిఖార్సయిన కామ్రేడ్‌గా పేరు నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వాక్పటిమతో సంప్రదింపులు జరపడంలో దిట్టగా ఏచూరికి పేరుంది.తెలుగు కుటుంబంలో జననం.. : సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12న చెన్నైలో స్థిరపడిన తెలుగు వాస్తవ్యులు ఏచూరి సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు జని్మంచారు. స్వస్థలం కాకినాడ కాగా బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తండ్రి సోమయాజి బదిలీపై విజయవాడ ఆరీ్టసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలో చదువుకున్నారు. ఏచూరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్వయానా మేనమామ. చెన్నైలోని మేనమామ ఇంట్లో ఆయన జని్మంచారు. హైదరాబాద్ ఆల్ సెయింట్స్‌లో, ఢిల్లీలో హైసూ్కల్ విద్యను అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ (ఆనర్స్) ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర..తన గురు సమానులు హర్కిషన్ సింగ్ సుర్జీత్లాగా 2004–2014 కాలంలో ఏచూరి సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భూమిక అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా గాంధీ తిరస్కరించాక నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తర్వాత సోనియా కలిసిన తొలి కాంగ్రెసేతర నేత ఏచూరినే. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంతో కలిసి పనిచేశారు. యూపీఏ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్‌కు అత్యంత నమ్మదగ్గ నేస్తంగా ఉన్నారు. నెగ్గిన ఏచూరి బడ్జెట్ సవరణల ప్రతిపాదన..గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన చేసిన సవరణల ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం కేవలం నాలుగోసారి మాత్రమే. ఒబామా రాకను వ్యతిరేకించిన సందర్భం..అమెరికాపై విమర్శలు చేయడంలో ఏచూరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణం అంటూ చురుకైన విమర్శలు చేసేవారు. గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని ఏచూరి వ్యతిరేకించారు. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకొచి్చన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను, జమ్మూ, కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35అ రద్దును కూడా ఆయన వ్యతిరేకించారు. ఇండియా కూటమికి కృషి..పార్లమెంట్ వేదికగా సామాన్యుల సమస్యలను ఎలుగెత్తి, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను దునుమాడారు. విపక్షాలను ‘ఇండియా’ కూటమిగా ఏకతాటి మీదకు తేవడంలో కూడా ఏచూరి పాత్ర కీలకమైంది. లోక్‌సభలో విపక్షనేతగా మోదీ సర్కార్‌ను తూర్పారబడుతున్న రాహుల్‌గాంధీకి రాజకీయ గురువుల్లో ఒకరిగా ఈయనకు పేరుంది. ఇతర భాషల్లోనూ అనర్గళంగా..అచ్చ తెలుగు వ్యక్తి అయిన ఏచూరి హిందీ, తమిళం, బెంగాళీ, మలయాళం సైతం అనర్గళంగా మాట్లాడేవారు. హిందూ పురాణాలను ఔపోసన పట్టిన ఏచూరి సందర్భోచితంగా తన ప్రసంగాల్లో వాటిని ఉదహరిస్తూ బీజేపీకి చురకలంటించేవారు. సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్ట్‌లు పెట్టేవారు. ప్రకాశ్‌కారత్ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్న ఏచూరి సౌమ్యంగా ఉంటూనే పార్టీలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పేరొందారు. మా భుజాలపై తుపాకులు పెట్టి తప్పించు కుంటారా? తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి. కొన్ని పక్షాలు ఒప్పుకోవడం లేదన్న భావనతోకాంగ్రెస్ పార్టీ వ్యవహరించేది. అలాంటి సందర్భంలో తెలంగాణపై జరిగిన చర్చలో సీతారాం ఏచూరి ‘తెలంగాణపై ఏ పార్టీ అభిప్రాయాలు ఆ పారీ్టకి ఉంటాయి. ఆయా పారీ్టల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? తెలంగాణపై మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. అంతేగానీ మా భుజాలపై తుపాకులు పెట్టి పేల్చాలనుకోవడం సరికాదు..’ అని ఏచూరి కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారని పార్టీ నేత జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 2015లో విశాఖలో జరిగిన సీపీఐ(ఎం) సదస్సులో పారీ్టకి ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో, 2021 కోజికోడ్ మహాసభలోనూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే హోదాలో ఆయన మృతి చెందారు. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా ప్రముఖ జర్నలిస్టు సీమా ఛిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. కుమార్తె అఖిల, ఇద్దరు కుమారులు ఆశిష్, డ్యానిష్ కాగా.. 34 ఏళ్ల పెద్ద కుమారుడు ఆశిష్ 2021లో కోవిడ్‌తో కన్నుమూశారు. అఖిల.. యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్‌బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో బోధిస్తారు.ఎస్ఎఫ్ఐలో చేరికతో.. 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరికతో ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో సభ్యుడు అయ్యారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరించిన ఏచూరి అనేక ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టై కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో జేఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న ఆయన..ఆ కారణంగా డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. ఎంతోమంది సన్నిహితుల మధ్య తాను డాక్టరేట్ పూర్తి చేయలేకపోయానని ప్రస్తావిస్తూ బాధపడుతుండేవారు.దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత ఏచూరి జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పశి్చమ బెంగాల్, కేరళయేతర వ్యక్తి ప్రెసిడెంట్ కావడం అదే తొలిసారి కావడం విశేషం. కాగా 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఆయన ఎన్నికయ్యారు. 1992లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, వివిధ కమిటీల్లో..2005లో పశి్చమబెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2006 రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలకు చైర్మన్‌గా, సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యుడిగా, జనాభా, ప్రజా ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఫోరంలో సభ్యుడిగా, విలువల కమిటీలో సభ్యుడిగా, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా నియమితులై సేవలు అందించారు. 2009లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ కమిటీతో పాటు, పార్లమెంట్ హౌస్‌లో దేశ నాయకులు, పార్లమెంటేరియన్ల చిత్రపటాలు, విగ్రహాల ఏర్పాటుకు ఉద్దేశించిన కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2011లో తిరిగి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2012లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.గొప్ప రచయిత ఏచూరి గొప్ప రచయితగా కూడా పేరు సంపాదించారు. పారీ్టకి చెందిన వారపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి రెండు దశాబ్దాలకు పైగా సంపాదకులుగా పనిచేశారు. సైద్ధాంతిక రంగంలో, హిందూత్వంపై ఆ పుస్తకంలో విమర్శలు చేసేవారు. ఇలా రచయితగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరుతో ఆంగ్లపత్రికకు కాలమ్స్ రాసేవారు. ‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్’, ‘న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనిలజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలను రాశారు. ఏచూరికి పాత హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూసేందుకు ఏచూరితో కలిసి రఫీ మార్గ్ నుంచి చాణక్య ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లే వాళ్లమని తోటి సీపీఎం నేతలు నాటి సంగతులు చెప్పారు. 1977అక్టోబర్ నెల.. ఓ నూనూగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా వెళ్లారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లేచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమోరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.అసాధారణ నేత..⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. –ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్‌ఖడ్, ఉప రాష్ట్రపతి⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరి నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను –కేంద్ర హోంమంత్రి, అమిత్ షా⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్లో పనిచేశాం. ఆయన మరణం ప్రజాస్వామ్య వర్గాలకు తీరని లోటు. –డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి⇒ ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ప్రజా, దేశ సమస్యలు ప్రస్తావించే ఒక గొంతు మూగబోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత వామపక్షాల ఐక్యతను విస్తృతం, పటిష్టం చేసేందుకు మంచి కృషి చేశారు. – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ⇒ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, పశ్చిమబెంగాల్, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, పినరయి విజయన్, భారత్‌లో చైనా రాయబారి ఫెహోంగ్ తదితరులు ఏచూరి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.⇒ ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి⇒ సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. మరణం భారత లౌకిక వాదానికి, కార్మిక లోకానికి తీరని లోటు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ⇒ ఏచూరి భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు. – ఏపీ సీఎం చంద్రబాబు⇒ దత్తాత్రేయ, కేంద్ర మంత్రుల సంతాపం..: ఏచూరి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, బీఏఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. ⇒ ప్రముఖుల సంతాపం..: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, అసదుద్దీన్ ఒవైసీ, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, తదితరులు ఏచూరి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. -
కాకినాడ కామ్రేడ్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన వామç³క్ష దిగ్గజం సీతారాం ఏచూరి తెలుగు బిడ్డే. సుదీర్ఘకాలం సీపీఎం అగ్రనేతగా కొనసాగిన ఆయన స్వస్థలం కాకినాడ. బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తాతల కాలం నాటి ఇంటి స్థానంలో అపార్టుమెంట్ నిరి్మంచారు. అక్కడ కనిపించే రెండు ఏనుగు బొమ్మల గురించి స్థానికులు గొప్పగా చెప్పుకునే వారు. తాత సీతారామారావు పేరునే ఏచూరికి పెట్టారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా సీతారాంకు స్వయానా మేనమామ. చెన్నైలో మేనమామ ఇంట సీతారాం జని్మంచారు. ఢిల్లీ జేఎన్‌యూలో ఉన్నత విద్యాభ్యాసం అనంతరం అక్కడి నుంచే వామపక్షవాదిగా రాజకీయాల్లోకి వచ్చారు. సీతారాం తండ్రి సర్వేశ్వర సోమయాజులు రవాణా శాఖలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై ఢిల్లీ వెళ్లారు. ప్రాచీన కళలపై ఎనలేని మక్కువ సీతారాం తల్లి కల్పకం విద్యావంతురాలు. కాకినాడ కేంద్రంగా మూడున్నర దశాబ్దాల పాటు అఖిల భారత మహిళా కాన్ఫరెన్స్ సభ్యురాలిగా చురుకైన పాత్ర పోషించారు. వాతావరణ కాలుష్యం, మొక్కల పెంపకం, నీటి వనరుల పరిరక్షణ, మహిళలపై దాడుల నియంత్రణ తదితర అంశాలపై ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మూడేళ్ల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. తన తండ్రి పేరుతో కాకినాడ గాం«దీభవన్‌లో నిరి్మంచిన కార్యాలయాన్ని చూసి సీతారాం ఎంతో సంతోíÙంచారని నాటి జ్ఞాపకాలను కాకినాడకు చెందిన వాడ్రేవు శ్రీనివాస్ గుర్తు చేసుకున్నారు. మహర్షి సాంబమూర్తి ఇనిస్టిట్యూట్‌ను తాత్కాలికంగా సీతారాం ఇంట్లో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కలి్పంచారని ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు తటవర్తి శ్రీనివాస్ చెప్పారు.ప్రాచీన కళలంటే వల్లమాలిన అభిమానం కలిగిన సీతారాం తోలు బొమ్మలాట కార్మికులు నిర్వహించిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కాకినాడ వచ్చారు. నేటి యువత గాంధీజీ ఆశయాలను ఆకళింపు చేసుకునేలాగాంధీ భవన్ చేస్తున్న కృషిని ప్రశంసించారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. 2008 ఆగస్టు 31న కాకినాడలో సీపీఎం కార్యాలయం సుందరయ్య భవనం ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో సీతారాం ప్రసంగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని సీపీఎం నాయకులు పేర్కొంటున్నారు. -
కామ్రేడ్ ఏచూరి కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రజెండా నీడలో ప్రకాశించిన అరుణతార నేల రాలింది. దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యూనిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసిన వామపక్ష యోధుడు, ప్రజా ఉద్యమకారుడు, సామాజిక వేత్త, కాలమిస్ట్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. న్యుమోనియాతో బాధపడుతూ ఆగస్టు 19వ తేదీన ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఐసీయూలో చేరిన ఏచూరి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రమవడంతో రెండురోజుల క్రితం విదేశాల నుంచి మెడిసిన్ తెప్పించారు.అది కూడా ఫలితాన్నివ్వకపోవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీతారాం ఏచూరి కన్నుమూసినట్లు ఎయిమ్స్ వైద్య బృందం ప్రకటించింది. ఆయన భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు పరిశోధనల నిమిత్తం దానంగా ఇవ్వనున్నారు. ఏచూరి కోరిక మేరకే ఆయన కుటుంబసభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏచూరి రెండు వివాహాలు చేసుకున్నారు. మొదటి భార్య పేరు ఇంద్రాణి మజుందార్. రెండో భార్య సీమ చిస్తీ. ఆయనకు కుమార్తె అఖిల, కుమారుడు డానిష్ ఉన్నారు. పశి్చమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత బుద్ధదేవ్ భట్టాచార్యకు నివాళులర్పిస్తూ ఆగస్టు 22న చివరిసారిగా ఏచూరి ఒక వీడియో సందేశంలో కని్పంచారు. ‘అనారోగ్యం కారణంగా ఎయిమ్స్ నుంచే మాట్లాడాల్సి వస్తోంది. విప్లవ లాల్ సలామ్‌లు బుద్ధదేవ్ గారికి..’ అని ఆ సందేశంలో ఏచూరి అన్నారు.ఏచూరి మరణంతో అటు కమ్యూనిస్టు పార్టీలోనూ, ఇటు కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియతమ కామ్రేడ్‌ను కోల్పోవడం తీవ్ర విషాదకరమని సీపీఎం పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఏచూరి మృతిపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాం«దీతో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఏచూరి భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ వసంత్‌కుంజ్‌లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తల నివాళులు, సందర్శనార్థం ఏచూరి పార్థివదేహాన్ని శనివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంచుతామని సీపీఎం తెలిపింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు. పరిశోధనల కోసం పార్థివ దేహం ఏచూరి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం దానం చేస్తున్నట్లు ఆయన కుటుంబీకులు అధికారికంగా ప్రకటించారు. పార్థివ దేహాలను పరిశోధనల కోసం దానం చేసే పద్ధతిని కమ్యూనిస్టులు కొంతకాలంగా కొనసాగిస్తున్నారు. ఇదే కోవలో పశి్చమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య భౌతికకాయాన్ని కూడా దానం చేశారు. ఇలాగే మరికొందరి భౌతికకాయాలను కూడా ఆసుపత్రులకు అప్పగించారు. నేడు విదేశీ కమ్యూనిస్టు నేతల రాక ఏచూరి మరణవార్తను తెలుసుకున్న విదేశాలకు చెందిన కమ్యూనిస్టుల పార్టీల నేతలు, ఆయనకు నివాళులరి్పంచేందుకు ఢిల్లీ రానున్నారు. శుక్రవారం చైనా, నార్త్ కొరియా, వియత్నాం, క్యూబా వంటి దేశాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూడురోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1977అక్టోబర్ నెల.. ఓ నూనుగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా చేరారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లెగిచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమెరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.ఏచూరికి ప్రముఖుల సంతాపం⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. – ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్కడ్, ఉప రాష్ట్రపతి⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరు నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన మరణ వార్త నన్ను కలచివేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను – అమిత్‌షా, కేంద్ర హోంమంత్రి⇒ ఏచూరి మరణం బాధాకరం. సుదీర్ఘ ప్రజాజీవితంలో పార్లమెంట్ సభ్యునిగా ఉంటూనే పౌర సమస్యలపై పోరాడుతూ విశిష్టమైన నేతగా ఎదిగారు. – రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి⇒ భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఏచూరి ఒకరు. ఆయన కింద స్థాయి నుంచి పైస్థాయి వరకు ఎదిగారు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – సీఎం చంద్రబాబు ⇒ జీవితాంతం వామపక్ష భావాలతో ఏచూరి గడిపారు. దేశ ప్రగతి కోసం నిరి్వరామంగా చొరవ చూపారు. సీతారాం స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారు. ఏచూరి మృతి దేశ రాజకీయాల్లో తీరని లోటు. ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – వైఎస్ జగన్, మాజీ సీఎం ⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. రాజ్యాంగాన్ని ఎంతో గౌరవిస్తారు. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. పార్లమెంటేరియన్‌గా ప్రజాసమస్యలను బలంగా వినిపించారు. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్లో పనిచేశాం. – డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి -
అలా వెళ్లిపోయావేం... ఏచూరీ!
అలా వెళ్లిపోయావేం ఏచూరీ, ఆఖరి ఆశలు కూడా వమ్ముచేసి. తన్నుకొచ్చే దుఃఖాన్ని ఆపలేకపోతోంది మా భౌతికవాద చైతన్యం... సమకాలీన భారత రాజకీయ రంగంలో అరుదైన ఆణిముత్యం సీతారాం ఏచూరి. పదహారణాల సంప్రదాయ తెలుగు కుటుంబంలో అత్యున్నత విద్యావంతుల ముద్దుబిడ్డగా పుట్టారు. తండ్రి ఎఎస్ సోమయాజులు అధికారి, తల్లి కల్పకం ఉద్యోగిని (కాకినాడలో సామాజిక కార్యక్రమాలకు కన్నతల్లి లాంటి ఆమె మూడేళ్ళ క్రితం కన్నుమూశారు.) మేనమామ ఉమ్మడి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన మోహన్ కందా కాగా మిగిలిన వారిలోనూ ఐఏఎస్‌లే ఎక్కువ. చిన్నప్పటి నుంచి చదువు సంధ్యలలో మిన్న అయిన ఏచూరి కూడా అదే మార్గంలో నడుస్తాడనుకున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో చదువుతుండగా తండ్రి ఉద్యోగం కారణంగా కుటుంబం ఢిల్లీకి వెళ్లిపోయింది. అక్కడే చదువుతూ 1970లో సీబీఎస్ఈ 12వ క్లాసులో అఖిల భారత స్థాయిలో ప్రథముడుగా వచ్చారు. అమెరికా పర్యటించే అవకాశం దక్కించుకున్నారు. సెంట్ స్టీఫె¯Œ ్స కాలేజీలో ఎకనామిక్స్‌లో పట్టభద్రుడై ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చేరారు. 1974లో అక్కడే ఆయనకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ప్రకాశ్ కరత్‌తో పరిచయమైంది. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి అర్థశాస్త్రంలో అపారమైన ఆసక్తితో పరిశోధన చేయాలనుకున్నా ఎమర్జెన్సీలో అరెస్టయ్యారు. రెండేళ్లలో మూడుసార్లు జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఇందిరా గాంధీ జేఎన్‌యూ ఛాన్సలర్ హోదాలో ఉండగా, ఆమె నివాసానికి ప్రదర్శనగా వెళ్ళి, ఆమెను నిలబెట్టి అభియోగ పత్రం చదవడమే గాక, ఛాన్సలర్‌గా వుండటం తగదని మొహం మీదనే చెప్పేశారు. మొదట ఆశ్చర్యానికి గురైన ఆమె తర్వాత నిజంగానే ఆ బాధ్యత నుంచి వైదొలగారు. యాభై ఏళ్లపాటు ఏచూరి సాగించబోయే నిబద్ధ, నిశ్చల రాజకీయ ప్రస్థానానికి అది నాందీ ప్రస్తావన.ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఏచూరి 1984 నుంచి 1986లో విజయవాడలో జరిగిన అఖిల భారత మహాసభల దాకా కొనసాగారు. 1985లోనే కలకత్తాలో జరిగిన సీపీఎం మహాసభల్లో కేంద్ర కమిటీ సభ్యుడైనాడు. నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, మాకినేని బసవపున్నయ్య వంటి సీనియర్ నాయకులు ఉద్యమాన్ని సమర్థంగా కొనసాగించడం కోసం వ్యూహాత్మకంగానే ఏచూరి, కరత్ వంటి యువనాయకులకు తర్ఫీదునిచ్చారు. తెలుగువాడిగా మాకినేనితోనూ, జాతీయ రాజకీ యాల్లో సూర్జిత్తోనూ సీతారాం సన్నిహితంగా మెలు గుతూ ఆచరణాత్మక విషయాలూ ఆకళింపు చేసు కున్నారు. 1988లో సీపీఎం కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడైన ఏచూరి, 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు సూర్జిత్తో పాటు ఆ పరిణామాలలో కీలక పాత్ర వహించారు. 1991లో సోషలిస్టు సోవియట్ విచ్ఛిన్నం పెద్ద ఎదురుదెబ్బగా మారిన తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వుండదనుకునేవారికి కను విప్పు కలిగేలా భారత దేశంలో మూడు రాష్ట్రాలలో సీపీఎం, వామపక్షాలు గెలుపొందాయి. 1992లో మద్రాసులో జరిగిన సీపీఎం మహాసభలో ఈ సైద్ధాంతిక పరిణామాలపై తీర్మానం ఏచూరి ప్రవేశపెట్టడం, సమాధానమివ్వడం ఆయన ఎదుగుదలకు అద్దం పట్టాయి. అప్పుడే పొలిట్ బ్యూరోలో ప్రవేశించారు.1992 డిసెంబరులో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత దేశంలో మత రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏచూరి కీలకపాత్ర వహించారు. అనేక ప్రామాణిక రచనలు వెలువరించారు. దేవెగౌడ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ కాలానికి సూర్జిత్, జ్యోతిబసు, చంద్రబాబు, వీపీ సింగ్ వంటివారితో పాటు సీతారాం ఏచూరి కూడా ఒక కీలక పాత్రధారిగా రూపొందారు. ఇదే కాలంలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా సీపీఎం పత్రాల విధానాల రూపకల్పనలో తనదైన ముద్ర వేస్తూ, ఉపన్యాసకుడుగా వాటిని దేశమంతటా ప్రజలకూ పార్టీ శ్రేణులకూ వివరిస్తూ సవ్యసాచిలా పనిచేశారు. ఆ క్రమంలోనే 2004లో యూపీఏ ఏర్పాటు, కార్యక్రమ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరెడ్డి వంటివారు కూడా ఆ రోజులలో ఏవైనా రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఆయనతో ప్రత్యేకంగా చర్చించేవారు.వామపక్ష ఐక్యతలో భాగంగా సోదర పార్టీలతోనూ, లౌకిక పార్టీలతోనూ సంప్రదింపులు జరపడంలో ఏచూరి పట్టువిడుపులకు పేరు పొందారు. ఆ విషయంలో అక్షరాలా సూర్జిత్ వారసుడనే చెప్పాలి. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు వంటి బీజేపీ నేతలు కూడా ఏచూరి ప్రత్యేకతను చెప్పకుండా వుండలేరు. అదే సమయంలో అపారమైన అధ్యయనం, అర్థశాస్త్రంలో పట్టు, ఆధునిక పరిణామాల అవగాహన ఆయనకు రాజకీయ నేతలలో ప్రత్యేక స్థానం తెచ్చిపెట్టాయి. జాతీయంగా ఇంత ఉన్నత స్థాయిలో వ్యవహరించే ఏచూరి సామాన్య కార్యకర్తలతో, ప్రత్యేకంగా యువతతో అలవోకగా కలసిపోయేవారు. ఎక్కడైనా ఏచూరి ప్రవేశించడమే ఏదో ఒక ఛలోక్తితో జరిగేది.సామాజిక న్యాయం, సాంస్కృతిక రంగాల్లో సీతారాం ఏచూరిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంబేడ్కర్ మాటలను, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రస్తావించకుండా మాట్లాడేవారు కాదు. మీడియా మిత్రుడిగా టీవీ డిబేట్లలో కీలకంగా కనిపించిన కొందరు తొలి నేతలలో ఆయనొకరు. సీపీఎం అధికార పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’కి ఇరవయ్యేళ్లు సంపాదకులుగా వున్నారు. పుష్కరకాలం రాజ్యసభ సభ్యుడిగా వున్న ఏచూరి ప్రసంగాలంటే పాలక పక్షానికి పరీక్షలే. తను ఎదిగిన జేఎన్‌యూపై 2019లో రాజ్యసభలో చర్చ జరిగినపుడు నాటి మంత్రి స్మృతీ ఇరానీకి షేక్స్పియర్ భాషలో ఆయన సమాధానమిచ్చిన తీరు మర్చిపోలేనిది. అందుకే ఏచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వచ్చింది. ఆయన రచనలు, ప్రసంగాలు అనేకం పుస్తకాలుగా అందుబాటులో ఉన్నాయి. ‘ప్రపంచీకరణ యుగంలో సోషలిజం’, ‘ప్రపంచీకరణలో అర్థశాస్త్రం’, ‘హిందూరాష్ట్ర’, ‘లౌకికతత్వం అంటే ఏమిటి?’ వంటివి ప్రత్యర్థి పార్టీల వ్యూహాల లోతుపాతులు తెలియాలంటే చదవాల్సిందే. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ ఏచూరి కీలక పాత్రధారిగా మెలిగారు. ఒక దశలో భారత దేశంలో ఐక్యతా ప్రయత్నాల లాగే నేపాల్లోనూ కమ్యూనిస్టు గ్రూపులను ఒక వేదిక మీదకు తేవడానికి దోహదం చేశారు. అనేక కారణాల వల్ల వామపక్షాల బలం తగ్గుతున్న పరిస్థితులలో రాజకీయ పోరాటాలలోనూ, ఎన్నికలలోనూ లౌకిక శక్తులను పునరేకీకరణ చేయడానికి సహేతుక ప్రాతిపదిక ఏర్పరచడానికి ఆయన నిరంతరం పనిచేశారు. 2024 ఎన్నికలకు ముందు ‘ఇండియా’ వేదిక ఏర్పాటు, లోక్‌సభ బలాల పొందిక మార్పు వెనక ఈ కృషి వుంది.బెంగాలీ, తమిళం, హిందీ, ఇంగ్లీషు వంటి బహు భాషల్లో ధారాళంగా మాట్లాడే ఏచూరి తెలుగు బిడ్డగా తెలుగువారికి మరింత ప్రేమపాత్రులైనారు. ఢిల్లీలో వుండిపోవడం వల్ల సరైన తెలుగు మాట్లాడలేనంటూ మొదలుపెట్టినా అదో ప్రత్యేకమైన మంచి భాష మాట్లాడేవారు. మన రక్తం ఎర్రగా వున్నంతవరకూ ఎర్రజెండా ఎగురుతుంటుందని ఆయన అనే మాటతో చప్పట్లు మోగిపోయేవి. తెలుగు పాటలు కూడా ఇష్టపడేవారు. శాస్త్రీయ సంగీతంలోని ముగ్గురు ప్రముఖులు దక్షిణాది వారే కావడంపై ఆయన కేతు విశ్వనాథరెడ్డి పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రస్తావించారు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న పద్యం మూలాలను గురించి చర్చించిన సందర్భం నాకింకా గుర్తుంది. 1980లో ఎస్ఎఫ్ఐ మహాసభల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం తెలుగువారికి గర్వకారణమే. ఆయన తన కోసం ఏమీ కోరుకోలేదు. తీసుకుపోలేదు. ఆశయాల బాట మిగిల్చివెళ్లారు.తెలకపల్లి రవి వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఏచూరి ప్రజల మనసుల్లో నిలిచిపోతారు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: వామపక్ష దిగ్గజ నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం పట్ల దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పాత్రను కొనియాడుతూ.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు.ఈ క్రమంలో ఏచూరి మరణంపై ప్రధానమంత్రి మోదీ మోదీ సంతాపం తెలిపారు. ఏచూరి వామపక్ష ఉద్యమానికి దారిదీపం వంటి వారని పేర్కొన్నారు, ఆయన సామర్ధ్యం, వాగ్ధాటి పార్టీలకు అతీతంగా అందరినీ ఆకట్టుకునేదని అన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన ప్రధాని మోదీ.. గతంలో ఏచూరితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.చదవండి: సీతారాం ఏచూరి కన్నుమూత.. జీవిత ప్రస్థానం ఇదేSaddened by the passing away of Shri Sitaram Yechury Ji. He was a leading light of the Left and was known for his ability to connect across the political spectrum. He also made a mark as an effective Parliamentarian. My thoughts are with his family and admirers in this sad hour.… pic.twitter.com/Cp8NYNlwSB— Narendra Modi (@narendramodi) September 12, 2024 -
ఏచూరి మరణం కార్మికలోకానికి, లౌకికవాదానికి తీరని లోటు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జాతీయ ప్రధాన కార్యదర్శి, సీతారాం ఏచూరిమృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్ర శేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి, విద్యార్థి నాయకుడిగా, కమ్యూనిస్టు పార్టీకి కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా అంచలంచలుగా ఎదిగి ప్రజా పక్షం వహించారని.. వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.సీతారాం ఏచూరి మరణం భారత కార్మిక లోకానికి, లౌకిక వాదానికి తీరని లోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి మరణంతో శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కాగా ప్రముఖ రాజకీయ వేత్త, వామపక్ష మోధుడు కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి నేడు ప్రాణాలు విడిచారు. -
Sitaram Yechury: జీవితమే కాదు.. దేహమూ ప్రజాసేవకే అంకితం
ప్రముఖ రాజకీయ నేత, సీపీఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. 72 ఏళ్ల ఏచూరి ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశనుంచే వామపక్ష భావాలను అలవరచుకున్న ఆయన.. తుదిశ్వాస విడిచే వరకు ప్రజా పోరాటాల్లో బతికారు. తన జీవితాన్నే కాదు.. చివరకు తన దేహాన్ని సైతం ప్రజాసేవకే అంకితమిచ్చారు.ఆయన బతికి ఉన్నప్పుడే తాను మరణిస్తే పార్థీవ దేహాన్ని వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యులు దానం చేయనున్నారు. మృతదేహాన్ని శుక్రవారం ఆస్పత్రికి తరలించనున్నారు. దీంతో ఏచూరి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించటం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమ్యూనిస్టు నేతలు తమ పార్థివదేహాలను పరిశోధనల కోసం ఇవ్వడం ఇదే తొలిసారికాదు.. గత కొన్నేళ్లుగా వామపక్ష నాయకులు ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఆగస్టు 2024లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం నేత బుద్ధదేవ్ భట్టాచార్య (80) భౌతికకాయాన్ని కూడా వైద్య పరిశోధనల కోసం దానం చేశారు. కోల్‌కతాలోని నీల్ రతన్ సిర్కార్ ఆసుపత్రిలోని అనాటమీ విభాగానికి పార్థివ దేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించి మార్చి 2006లోనే బుద్ధదేవ్ ఓ స్వచ్ఛంద సంస్థకు హామీ ఇచ్చారు.ఆయనతోపాటు పశ్చిమ బెంగాల్‌కు 34 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కమ్యూనిస్టు దిగ్గజ నేత జ్యోతిబసు కూడా 2010లో ఆయన మరణాంతరం శరీరాన్ని వైద్య సేవలకే అప్పగించారు.ఆయన పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి దానం చేశారు. ఇందుకు సంబంధించి 2006లోనే ఆయన హామీ ఇచ్చారు. మాజీ లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ 2000 సంవత్సరంలో తన శరీరాన్ని దానం చేస్తానని ప్రమాణం చేశాడు. 2018లో అతని మరణం తర్వాత అతని కుటుంబ సభ్యులు శరీరాన్ని దానం చేశారు. సీపీఎం కార్యదర్శి అనిల్ బిశ్వాస్‌తోపాటు పార్టీ సీనియర్ నేత బెనోయ్ చౌధురీల భౌతికకాయాలూ ఆస్పత్రులకు అప్పగించారు. -
సీతారాం ఏచూరి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఏచూరి పట్ల వైఎస్ జగన్..జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయ స్థాయికి ఎదిగారని, విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని గుర్తు చేశారు. సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారు. ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని అన్నారు. ఇది కూడా చదవండి: వామపక్ష దిగ్గజ నేత ఏచూరి రాజకీయ ప్రస్థానం ఇలా.. -
కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కన్నుమూత.. నేతల దిగ్బ్రాంతి
ప్రముఖ రాజకీయ వేత్త, వామపక్ష మోధుడు కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి నేడు ప్రాణాలు విడిచారు.విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు : వైఎస్ జగన్సీతారాం ఏచూరి మృతిపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం వామపక్ష భావాలతో గడిపిన ఆయన, దేశ ప్రగతి కోసం నిర్విరామంగా చొరవ చూపారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జన్మించిన సీతారాం ఏచూరి, స్వశక్తితో జాతీయస్థాయికి ఎదిగారని ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలు కనబర్చారని అన్నారు.సీపీఎంలోనూ నాయకత్వ లక్షణాలు చూపి, పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక పోలిట్‌బ్యూరో సభ్యుడిగానూ, పార్టీ ప్రధాన కార్యదర్శిగానూ పని చేశారని కొనియాడారు. సీతారాం ఏచూరి మృతి, దేశ రాజకీయాల్లో తీరని లోటని తెలిపిన వైఎస్ జగన్.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.చదవండి: సీతారాం ఏచూరి జీవిత ప్రస్థానంఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం: సీఎం రేవంత్సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని తెలియజేశారు.దేశంపై లోతైన అవగాహన: రాహుల్సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి మరణంపై లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. దేశ ఆలోచనల రక్షకుడని, భారత్ గురించి లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఏచూరి అని పేర్కొన్నారు. తాను ఏచూరితో కలిసి చేసిన సుదీర్ఘ చర్చలను ఇకపై మిస్ అవుతానని తెలిపారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు.జాతీయ రాజకీయాలకు తీరని లోటు: మమతా బెనర్జీసీతారాం ఏచూరి మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటు అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ‘సీతారాం ఏచూరి మరణించారని తెలిసి బాధగా ఉంది. ప్రముఖ పార్లమెంటేరియన్ అయిన ఆయన మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, సహోద్యోగులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను’ అని ఎక్స్‌లో తెలిపారు.చాలా బాధాకరం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణసీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని, చాలా బాధాకరమని నారాయణ అన్నారు. ఏచూరితో కలిసి అనేక జాతీయ, అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొన్నట్టు నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు.ఏచూరిని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు: బండి సంజయ్సీతారాం ఏచూరి మరణం పట్ల కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం ప్రకటించారు. నమ్మిన సిద్ధాంతం కోసం జీవిత కాలం పనిచేశారన్నారు. తెలుగువాడిగా ఏచూరిని తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని బండి సంజయ్ అన్నారు. బలహీన వర్గాల హక్కుల కోసం ఏచూరి పోరాటం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం అదే పార్టీలో ఉండి పోరాడారన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి తీవ్ర లోటు: రాఘవులుఎల్లుండి సీతారాం ఏచూరికి అంతిమయాత్ర నిర్వహిస్తాం.దేశ విదేశాల నాయకులు, ప్రతినిధులు దౌత్యవేత్తలు రాబోతున్నారు.ఎల్లుండి మధ్యాహ్నం 10 గంటల నుంచి ఐదు గంటల వరకు సీపీఎం ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం సీతారాం ఏచూరి పార్తివ దేహాన్ని ఉంచుతాం.ఆయన కోరిక మేరకు పార్థివదేహాన్ని పరిశోధనల కోసం ఆస్పత్రికి అప్పగిస్తాం.సీతారాం ఏచూరి జీవితాంతం వామపక్ష ఉద్యమం కోసం పనిచేశారుఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.ఏ పని అప్పగించిన అందులో తనదైన ముద్ర వేశారు.కష్టకాలంలో సిపిఎం పార్టీని ముందుకు నడిపించారు.ఇండియా కూటమి లో కీలకపాత్ర పోషించారు.ఆయన పోరాట మార్గాన్ని ముందుకు తీసుకెళ్తాముపీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కామెంట్స్.చిన్ననాటి నుంచి వామపక్ష భావజానీకి ఆకర్షితుడై ,విద్యార్ధి ఉద్యమం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన మహా ధీరుడు సీతారాం ఏచూరిజేఎన్యూ నుంచి అభ్యుదయ భావజాలాన్ని దేశ వ్యాప్తంగా విస్తరింప చేశారు .అత్యున్నత యూనివర్సిటీ జె ఎన్ యు అధ్యక్షులుగా మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు.ప్రపంచ దేశాలకు సైద్ధాంతిక చర్చకు వెళ్లేవారు.చైనా , రష్యా లాంటి దేశాలకు సలహాలు ఇచ్చే వారుఆర్థిక సంస్కరణ లపై వీశ్లేషణ చేసే వరకు..మన్మోహన్ సింగ్ లాంటి వారు రాజ్య సభ లో అయిన ప్రసంగం వినటానికి వచ్చే వారు..చిన్న పెద్ద అందరినీ ఆప్యాయంగా పిలవడం అయినా గొప్పతనం..దేశంలో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేశారు.ఖమ్మం జిల్లా లో అనేక సందర్భాల్లో కూడా పిలిసిన వెంటనే వచ్చేవారు.ఎంపీ గా తన బాధ్యత సక్రమంగా నేరేవేరుస్తూ ఆదర్శంగా నిలిచారుమతోన్మాద శక్తులు పెరుగుతున్న సమయంలోకమ్యూనిస్టులకు ఆదరణ లేదు.ఏచూరి లాంటి వారు చాలా అవసరం..కమ్యూనిష్టులు ప్రజలకు అవసరం ఉన్నపుడు బలహీన పడ్డాం.ఎల్లుండి బౌతికాయన్ని మెడికల్ కాలేజీ కి బౌతిక కాయని డొనేట్ చేస్తారు.తెలంగాణ నుండి భారీ ఎత్తున అక్కడికి వెళ్తున్నాం.ఏచూరి వ్యక్తిగతంగా మంచి స్నేహితుడు: కపిల్ సిబల్సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణ వార్త తనను కలిచివేసిందని రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ చీఫ్ కపిల్ సిబల్ విచారం వ్యక్తం చేశారు. ఏచూరి తనకు వ్యక్తిగతంగా మంచి స్నేహితుడని, తాము సుదీర్ఘకాలం ప్రయాణించామని చెప్పారు. 2005 నుంచి 2014 వరకూ ఆయన పార్లమెంట్లో తనతో ఉన్నారని గుర్తుచేసుకున్నారు. తాము ఎన్నో అంశాలపై చర్చించి పరిష్కరించేవారమని అన్నారు. -
సీతారాం ఏచూరి కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వేత్త సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా 72 ఏళ్ల ఏచూరి.. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కొద్ది వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి పలుమార్లు విషమించింది. నేడు ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించి ప్రాణాలు విడిచారు. 1952 ఆగష్టు 12న చెన్నైలో తెలుగు కుటుంబంలో జన్మించిన ఏచూరి.. బాల్యం మొత్తం హైదరాబాద్‌లో గడిపారు. హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి ఏపీఎస్ ఆర్టీసీలో ఇంజినీర్ ఉద్యోగం, తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీకి చేరిన ఏచూరి.. ఢిల్లీలోని ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు.ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. జవహార్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎమ్ఏ ఎకనామిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో(ఎస్ఎఫ్ఐ) చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో చదవుకు ఫుల్‌స్టాఫ్ పెట్టారు.1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరిఎమర్జెన్సీ సమయంలో అండర్ గ్రౌండ్‌కు వెళ్లిన సీతారాంఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మూడుసార్లు జేఎన్య నాయకుడిగా ఎన్నిక1992లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నమోదుఉమ్మడి ఏపీ సీఎస్ మోహన్ కందాకు ఏచూరి మేనల్లుడు1984లో సీపీఎం కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఏచూరి1985లో పార్టీ రాజ్యాంగ సవరణలో కీలక పాత్రంఇంద్రాణి మజుందార్‌తో ఏచూరికి వివాహంకూతురు అఖిలా ఏచూరి, కొడుకు ఆశిష్ ఏచూరిజర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్న ఏచూరి1992లో జరిగిన 14వ కాంగ్రెస్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రమోషన్1996 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కీలకపాత్ర2005 నుంచి 2017 వరకు పశ్చిమ బెంగాల్ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రాతినిథ్యంరచయితగా హిందూస్థాన్ టైమ్స్‌లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాలమ్20 ఏళ్లుగా పార్టీ పత్రిక పీపుల్స్ డెమోక్రసీ ఎడిటోరియల్ బోర్డు మెంబర్2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య పాత్ర2005 నుంచి 2015 వరకు వరుసగా మూడుసార్లు ప్రధాన కార్యదర్శి2015, 2018, 2022లో సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నిక‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్: న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.అనారోగ్యంతో ఆగష్టు 19న ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఏచూరిచికిత్స పొందుతూ సెప్టెంబర్ 12న కన్నుమూతజీవితంతం లెఫ్ట్ బావజాలంతో గడిపిన ఏచూరి -
మళ్లీ విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం మళ్లీ విషమించింది. సీపీఎం పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 72 ఏళ్ల ఏచూరికి వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని వెల్లడించింది. ‘‘సీతారాం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్ జరిగింది. ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందుతున్నా.. పరిస్థితి విషమంగా ఉంది. వైద్యుల బృందం ఏచూరిని నిశితంగా పరిశీలిస్తోంది’’ అని సీపీఎం పార్టీ ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టింది.కాగా ఆగస్టు 19వ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో సీతారాం ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో వైద్యుల నిర్ణయం మేరకు వెంటిలేటర్ అమర్చారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. దీంతో ఆయన కోలుకుంటున్నారని అంతా భావించారు. ఈలోపే మళ్లీ ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు పార్టీ వెల్లడించింది. Comrade Sitaram Yechury’s health condition pic.twitter.com/NDPl8HE8K0— CPI (M) (@cpimspeak) September 10, 2024 ఇదీ చదవండి: కాంగ్రెస్‌తో కటీఫేనా?.. రెండో జాబితా కూడా విడుదల -
నిలకడగా ఏచూరి ఆరోగ్యం: సీపీఎం
న్యూఢిల్లీ: సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఈ మేరకు సీపీఎం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో కామ్రెడ్ సీతారాం ఏచూరి చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల తీవ్ర ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయనకు చికిత్స అందుతోంది. సానుకూల స్పందన కనిపిస్తోంది. కామ్రెడ్ సీతారాం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఛాతీలో న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ సోకడంతో ఆగస్ట్ 19వ తేదీన ఆన ఎయిమ్స్‌లో చేరారు. -
సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా క్షీణించింది. ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావడంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. -
ఆసుప్రతి వద్ద విధ్వంసం.. బీజేపీ, సీపీఎం పనే: సీఎం మమతా
కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్, ఆసుపత్రిలో ఓ గుంపు చొరబడి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఆసుపత్రి సెమినార్ హాల్లో డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని ఖండిస్తూ విద్యార్ధులు, వైద్య సిబ్బంది ఆందోళన చేస్తున్న సమయంలో కొందరు గుర్తుతెలియని నిరసనకారులు ఆసుపత్రిలోకి చొచ్చుకొచ్చి బీభత్సం చేశారు.అయితే అసుపత్రి వద్ద జరిగిన విధ్వంసంలో సీపీఎం, బీజేపీ కార్యకర్తల పాత్ర ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. గురువారం గవర్నర్‌ను కలిసిన తర్వాత మమతా మీడియాతో మాట్లాడుతూ.. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ధ్వంసం చేసిన వారు బయటి వ్యక్తులుగా కనిపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.‘బయటి వ్యక్తులు, 'బామ్ అండ్ రామ్'కి చెందిన కొంతమంది రాజకీయ పార్టీ కార్యకర్తలు ఈ పని చేసినట్లు నాకు సమాచారం అందింది. ఇందులో విద్యార్థుల పాత్ర లేదు. ఈ సంఘటనను ఖండిస్తున్నాను. అలాగే అత్యాచార నిందితులను ఉరి తీయాలంటూ ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేయబోతున్నాను,రాత్రి ఘటనలో వామపక్షాలు, బీజేపీ జెండాలను చూశాను. వారు పోలీసులపై దాడి చేసిన విధానం చేశారు. ఇన్ఛార్జ్ అధికారి ఒకరు గంటపాటు కనిపించలేదు. తరువాత అతను గాయపడినట్లు తేలింది. కానీ పోలీసులు రోగులకు ఇబ్బంది కలగకూడదని ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మేము చాలా ఆందోళనలు చేశాం. కానీ ఆసుపత్రిలో ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు’ అని తెలిపారు. కాగా ే గతంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని బామ్ అంటే లెఫ్ట్, రామ్ అంటే బీజేపీపై మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు.ఇదిలా ఉండగా కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ క్యాంపస్‌లోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆస్తులను ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వాహనాలపై తమ ప్రతాపం చూపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. వారిపై సైతం ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. అనంతరం పోలీసులు లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసు అధికారులు గాయపడ్డారు. -
అంతుచూస్తా.. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యం
సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు మునిసిపాలిటీలో స్థల వివాదంలో సీపీఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. రెచ్చిపోయిన బైరెడ్డి.. అంతుచూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ సీపీఎం నాయకులపై చిందులు తొక్కారు.20 ఏళ్లుగా ఈ స్థలంలోనే ఉన్నాం.. పన్నులు చెలిస్తున్నాం. న్యాయం చేయకపోగా మాపైనే దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి మేము పన్నులు కూడా చెల్లించామని.. తమకు న్యాయం చేయమంటే మున్సిపాలిటీ అధికారులు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన బాటపట్టారు. -
West Bengal: బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత
కోల్‌కతా: సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూశారు. 80 ఏళ్ల బుద్ధదేవ్ గురువారం ఉదయం 8.20 గంటలకు మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. శ్వాసకోస వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్న ఆయన కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ఉన్న తన ఫ్లాట్‌లో తుదిశ్వాస విడిచారు. గతేడాదే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కోలుకున్నారు. మళ్లీ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. ప్రజల సందర్శనార్థం భట్టాచార్య భౌతికకాయాన్ని శుక్రవారం తొలుత బెంగాల్ అసెంబ్లీ, తర్వాత సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి, డీవైఎఫ్ఐ కార్యాలయానికి తరలిస్తారు. అనంతరం అంతిమయాత్ర నిర్వహించి, మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగిస్తారు. కార్యకర్త నుంచి ముఖ్యమంత్రిగా.. సీపీఎం అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు అయిన భట్టాచార్య 1944 మార్చి 1న కోల్‌కతాలో జన్మించారు. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి బెంగాలీలో బీఏ ఆనర్స్ చేశారు. 1966లో పారీ్టలో చేరారు. సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఆయన 2000లో జ్యోతిబసు సీఎం పదవి నుంచి వైదొలగక ముందు ఉపముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. జ్యోతిబసు తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. జ్యోతిబసు పాలనతో పోలిస్తే భట్టాచార్య హయాంలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల పట్ల సానుకూలంగా వ్యవహరించింది. విచిత్రమేమిటంటే పారిశ్రామికీకరణకు సంబంధించిన సీపీఎం విధానాలే 2011 ఎన్నికల్లో వామపక్షాల పరాజయానికి బాటలు వేశాయి. ‘పద్మభూషణ్’ తిరస్కరణ కేంద్రం 2021లో బుద్ధదేవ్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి బుద్ధదేవ్ మరణం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. బెంగాల్ అభివృద్ధికి కృషి చేశారని, ప్రజలకు విశిష్టమైన సేవలు అందించారని బుద్ధదేవ్‌ను మోదీ కొనియాడారు. బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు సంతాపం తెలిపారు. -
13 రోజులకు పరామర్శకు వస్తారా?
పగిడ్యాల: మైనర్ బాలిక కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల చెక్‌ను అందజేయడానికి శుక్రవారం ముచ్చుమర్రికి వ చ్చిన మంత్రులకు భంగపాటు తప్పలేదు. ఘటన జరిగి 13 రోజులైన పరామర్శించడానికి మనస్సు రాలేదా? అంటూ సీపీఎం నేతలు, స్థానికులు మంత్రులను ప్రశ్నించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, పోలీసుల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు.. మంత్రి ఫరూక్‌ను కోరారు. దీంతో మంత్రి ఆగ్రహిస్తూ మాకు తెలుసంటూ చులకన భావంతో మాట్లాడారు. దీంతో సీపీఎం నాయకుల్లో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. ఘటన జరిగి 13 రోజులవుతున్నా ఇప్పటి వరకు మృతదేహాన్ని బాధిత తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారని నిలదీశారు. దీంతో కమ్యూనిస్టులకు, మంత్రులకు మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన పోలీసు ఉన్నతాధికారులు, రోప్ పార్టీ సిబ్బంది కమ్యూనిస్టులను కట్టడి చేసేందుకు యత్నించారు. సమాధానం చెప్పాలని, లేదంటే వాహనాలను కదలనిచ్చేది లేదని కమ్యూనిస్టులు స్వరం పెంచడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది.వెంటనే స్పందించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి సీపీఎం నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా కాకుండా రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది చంద్రబాబే: సీపీఎం
సాక్షి, ఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాల్సింది చంద్రబాబేనని..నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేట్ వ్యక్తులు ఎలా నడుపుతారు? అంటూ ప్రశ్నించింది సీపీఎం.. గనులు కేటాయించకపోవడం వల్లే స్టీల్‌ప్లాంట్‌కు నష్టాలంటూ సీపీఎం అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ దుయ్యబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులపైన కన్నేసి ప్రైవేటీకరణ వైపు వెళుతున్నారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు. మీడియా పై దాడులతో సమస్యలు పరిష్కారం కావని వెంకట్ హితవు పలికారు.కాగా, విశాఖలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి గురువారం పర్యటించారు. స్టీల్‌ప్లాంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు సహకరిస్తుందని కార్మికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటీకరణపై చంద్రబాబు స్పందించకపోవడంపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని గతంలో పవన్ కల్యాణ్ ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ నోరు విప్పడం లేదు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ తీసుకుందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కుమారస్వామి పర్యటనలో అద్భుతాలు జరగవన్న మంత్రి శ్రీనివాస వర్మ.. ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకోవలసింది ప్రధానేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని కార్మికుల డిమాండ్ చేస్తున్నారుస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రధాని మోదీతో చెప్పించాలని కార్మికులు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకుంది. అప్పటి సీఎం జగన్.. ప్రధానమంత్రికి రెండు సార్లు లేఖ రాశారు. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసింది. -
సీపీఎం నాయకునిపై టీడీపీ వర్గీయుల దాడి
-
బాదుడే బాదుడు..
-
చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్లనే వినియోగిస్తున్నారు: నారాయణ
-
Lok Sabha Election 2024: డమ్ డమ్‌లో... విజయఢంకా మోగించేదెవరో!
డమ్ డమ్ లోక్‌సభ స్థానం. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి లెఫ్ట్ విజయం సాధించగలిగే సీట్లలో ఒకటి. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. దాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని సీపీఎం పోరాడుతోంది. ఇది తృణమూల్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ తమ ఓటు బ్యాంకుకు గండి పడకుండా కాపాడుకోవడానికి టీఎంసీ తిప్పలు పడుతోంది. ఒకసారి గెలుపొందిన ఈ స్థానంలో మళ్లీ పాగా వేయాలని బీజేపీ ప్రయతి్నస్తోంది. దాంతో డమ్ డమ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది... కోల్‌కతా సమీపంలో ఉండే డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి పశి్చమ బెంగాల్లో చారిత్రక ప్రాధాన్యముంది. 1783లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ సైనిక కంటోన్మెంట్, మిలిటరీ బ్యారక్‌లు నిర్మించింది. 1846లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్థాపించింది. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసిన మంగళ్ పాండేకు మరణశిక్ష విధించింది కూడా డమ్ డమ్ కంటోన్మెంట్‌లోనే. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని డమ్ డమ్ బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో హిందూ శరణార్థులు ఇక్కడ భారీగా స్థిరపడ్డారు. పట్టణ జనాభా అధికం... డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి 1977లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల పాటు ఈ స్థానం సీపీఎం గుప్పెట్లోనే కొనసాగింది. 1998లో తొలిసారిగా బీజేపీకి చెందిన తపన్ సిక్దర్ విజయం సాధించారు. 1999లో ఈ స్థానాన్ని నిలుపుకున్నారు. అనంతరం మూడుసార్లు టీఎంసీ నుంచి సౌగతా రాయ్ విజయం సాధించారు. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం మొత్తం జనాభా 21,84,460. ఇందులో 98.43 శాతం పట్టణ జనాభాయే. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలూ టీఎంసీ ఖాతాలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.ప్రతి ఐదు ఓట్లలో ఒకటి... డమ్ డమ్‌లో తృణమూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ సౌగతా రాయ్, సీపీఎం నుంచి సుజన్ చక్రవర్తి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పద్రా దత్తా బరిలో ఉన్నారు. శిల్పద్రా 2020లో తృణమూల్‌కు రాజీనామా చేసి కాషాయ పారీ్టలో చేరారు. మమతా వ్యతిరేక ఓటర్లు వామపక్షాల వైపు మొగ్గితే కాంగ్రెస్ మద్దతుతో సుజన్ గెలవడం సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. అయితే సీపీఎం కేవలం బీజేపీకి ఓట్లను ఆకర్షించగలదే తప్ప తమనేమీ చేయలేదని టీఎంసీ ధీమాతో ఉంది. సీపీఎం ఓట్లు గతం కంటే పెరిగే అవకాశముందని, ఇది బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.‘వలస’ ఓట్లపై సీఏఏ ప్రభావం... బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన వారు డమ్ డమ్‌లో అధిక సంఖ్యలో ఉంటున్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం అమలు వివాదం వారిపై ప్రభావం చూపేలా ఉంది. ‘‘దీంతోపాటు అయోధ్య రామమందిర నిర్మాణం కూడా హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుంది. కనుక బీజేపీ గెలుపు ఖాయం’’ అని శిల్పద్రా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రంలో ప్రధానంగా కని్పంచే డమ్ డమ్ ఇప్పుడు ఆ ప్రత్యేకతను కోల్పోయిందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సంక్షోభం అధికార తృణమూల్‌కు నష్టం చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: లోక్‌సభ బరిలో ప్యాడ్ ఉమన్
బెంగాల్–జార్ఖండ్ సరిహద్దుల్లోని గిరిజన గ్రామాలు. అక్షరాస్యత అంతంతే. మహిళల రుతు సమస్యలపై చర్చ కూడా నిషిద్ధమే. దాన్ని బ్రేక్ చేశారామె. సమస్యపై మహిళలకు అవగాహన కల్పించడమే గాక శానిటరీ న్యాప్కిన్ల వాడకం నేర్పించారు. జార్ఖండ్–బెంగాల్ సరిహద్దుల్లో ప్యాడ్ ఉమన్‌గా పేరొందారు. పశ్చిమ బెంగాల్లో శనివారం పోలింగ్ జరగనున్న ఝార్గ్రామ్ లోక్‌సభ స్థానం నుంచి సీపీఎం అభ్యరి్థగా పోటీ చేస్తున్నారు. ఆమే జార్ఖండ్ మట్టి బిడ్డ, బెంగాల్ కోడలు సోనామణి ముర్ము... సోనామణి జార్ఖండ్‌లోని తూర్పు సింగ్భూమ్ జిల్లా కొడియాలో జని్మంచారు. జంషెడ్‌పూర్‌లో సైకాలజీలో పీజీ చేశారు. నిరక్షరాస్యతకు అమాయకత్వం తోడవటంతో స్థానిక మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలు. టీనేజ్ అమ్మాయిలతో మొదలు పెట్టిన మహిళలందరికీ రుతుక్రమ సమస్యలపై అవగాహన కలి్పంచారు. పెళ్లికి ముందు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో గెలిచి ప్రధాన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2016లో బెంగాల్‌లోని బంద్వాన్ నివాసి మనీష్ తుడును పెళ్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం అభ్యరి్థగా విజయం సాధించారు. ఇప్పుడు ఏకంగా లోక్‌సభ బరిలో నిలిచారు. దీదీ, మోదీలతో విసిగిపోయారు.. ఝార్గ్రామ్ ఒకప్పుడు సీపీఎం కంచుకోట. జంగల్మహల్లో మావోయిస్టుల హింస తరువాత తృణమూల్ అధికారంలోకి వచి్చంది. ఎర్రకోట పచ్చగా మారింది. సీపీఎం కార్యకర్తలు ఇళ్లు వీడాల్సి వచి్చంది. గత లోక్‌సభలో అక్కడ బీజేపీ గెలిచింది. ఈసారి మాత్రం లాల్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు గిరిజన బిడ్డ సోనామణి. ‘‘దీదీ, మోదీ చిత్రహింసలతో జనం విసిగిపోయారు. అందుకే ఎర్రజెండాను కోరుతున్నారు. ఝార్గ్రామ్లో పేదరికం ఎక్కువ. రెండు పూటలా కడుపునిండా తిండి దొరకని స్థితి. ఉపాధి లేదు. ఉపాధి హామీ పనులూ లేవు. సాగుపైనే ఆధారపడే అటవీ ప్రాంతాల ప్రజలకు ఎరువులు, విత్తనాల ధరలు అందుబాటులో లేవు. పాఠశాలల పరిస్థితి అధ్వానం. చదువుకున్నవారికి ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితిని మారుస్తా’’ అంటూ ఇంటింటికీ ప్రచారం చేసి ఆకట్టుకున్నారామె. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: యువ పిడికిలి..దీప్సితా ధర్
భుజాన సంచి. అందులో జాగ్రఫీ పుస్తకం, ఒక జత బట్టలు. మెడలో ఎర్ర కండువా. ముఖాన చెరగని చిరునవ్వు. మండే ఎండల్లోనూ అలుపెరుగని ప్రచారం. వయసు 30 ఏళ్లు. పేరు దీప్సితా ధర్. బెంగాల్ వామపక్ష రాజకీయాల్లో కొత్త ముఖం. సీపీఎం సానుభూతిపరురాలిగా మొదలై, ఢిల్లీలో విద్యార్థి నాయకురాలిగా ఎదిగి ఇప్పుడు సొంత బెంగాల్లో శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానం అభ్యరి్థగా బరిలోకి దిగారు. ‘ఖేలా హోబ్’ (గేమ్ ఈజ్ ఆన్) అన్న తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా దీదీ ఇచ్చిన నినాదానికి బదులుగా ‘నేను సైతం సిద్ధం’ అంటూ తలపడుతున్నారు... టామ్ బోయ్... దీప్సిత పశ్చిమబెంగాల్లోని హౌరాలో 1993లో జన్మించారు. తండ్రి పీయూష్ ధర్. తల్లి దీపికా ఠాకూర్ చక్రవర్తి. తాత పద్మనిధి ధర్. అంతా సీపీఎం రాజకీయాల్లో ఉన్నారు. బాల్యం నుంచి టామ్ బోయ్‌లా పెరిగిన దీప్సితకు రాజకీయాలంటే ఆసక్తి ఉండేది కాదు. ఇంట్లో వాళ్ళని చూసి రాజకీయాలు చేస్తే కుటుంబానికి సమయం ఇవ్వలేమని నిర్ణయించుకున్నారు. కానీ తర్వాత అభిప్రాయం మారింది. దక్షిణ కోల్‌కతాలోని అశుతోష్ కాలేజీలో జియాలజీ చదివాక ఢిల్లీ జేఎన్‌యూలో జాగ్రఫీలో పీజీ, ఎంఫిల్ చేశారు. పాపులేషన్ జాగ్రఫీలో పీహెచ్డీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో అరంగేట్రం... కోల్‌కతాలో కాలేజీ రోజుల నుంచీ దీప్సిత విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. తర్వాత ఎస్ఎఫ్ఐ జేఎన్‌యూ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా పనిచేశారు. రోహిత్ వేముల మృతి సందర్భంగా జరిగిన ఉద్యమంలో, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నందుకు కేసులు ఎదుర్కొన్నారు. ఇంగ్లి‹Ù, హిందీ, బెంగాలీల్లో అద్భుతంగా, అనర్గళంగా మాట్లాడే దీప్సిత జాతీయ చానళ్లలో రాజకీయ చర్చల్లో తరచూ పాల్గొంటారు. 2011లో బెంగాల్లో సీపీఎం అధికారం కోల్పోవడం ఆమెను బాధించింది. అదే పదేళ్ల తర్వాత ఎన్నికల రాజకీయాలవైపు నడిపించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో సీపీఎం తరఫున రాజకీయ ఉద్ధండులతో పోరాడుతున్నారు. మిస్టర్ ఇండియా వర్సెస్ మిస్ యూనివర్స్ రెండు నెలల ముందునుంచే దీప్సిత ప్రచారం మొదలుపెట్టారు. తృణమూల్, బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తృణమూల్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమే. తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచాక బీజేపీలో చేరారు. సీపీఎం నుంచి మాత్రం ఎవరూ బీజేపీలోకి వెళ్లలేదు. ‘‘మిస్టర్ ఇండియా సినిమాలో అనిల్ కపూర్ వాచ్ పెట్టుకుంటే మాయమైపోయేవాడు. మన ఎంపీలదీ అదే పరిస్థితి. గెలుస్తారు, మాయమైపోతారు’’ అంటూ బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి కళ్యాణ్ కౌంటరిస్తూ దీప్సితను మిస్ యూనివర్స్‌గా అభివరి్ణంచారు. ‘‘దేశమంతా పర్యటించి వచ్చారు. ఇప్పుడు మిస్టర్ ఇండియాను చూసేందుకు శ్రీరాంపూర్ వచ్చారు’ అంటూ ఆమెను ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర సీపీఎం తీవ్రంగా మండిపడుతోంది. బాధించిన ‘రంగు’ తన బాల్యం కాస్త బాధాకరంగానే గడిచిందంటారు దీప్సిత. తల్లిదండ్రులిద్దరిదీ మంచి రంగు. తాను మాత్రం నల్లగా ఉంటుంది. దాంతో ఇరుగుపొరుగు మొదలు అందరూ ‘అమ్మాయేంటి ఇంత నల్లగా ఉం’దని అడిగేవారట. బయటికి వెళ్లినా అదే పరిస్థితి. దాంతో నలుగురికిలోకి వెళ్లాలంటే ఒక రకమైన భయం! ఒకసారి చూసిన వారు మళ్లీ పరికించి చూస్తే తన రంగు గురించేమోననే బాధ తెలియకుండానే కలిగేది. తర్వాత ఆ ఆత్మన్యూనత నుంచి బయటపడ్డారామె. ఇప్పుడు బెంగాల్లో భయంకరమైన ఎండలు. అయినా ప్రచారంలో దీప్సిత కళ్లజోడు కూడా పెట్టుకోవడం లేదు. ఎందుకంటే, ‘‘అందరూ నా కళ్లలోకి చూడగలగాలి. నా మనసులో ఏముందో అర్థం చేసుకోగలగాలి. కళ్లను అద్దాలతో మూసేస్తే ఎలా?’’ అని ప్రశి్నస్తారామె.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
శ్రీరాంపూర్‌లో పర్సనల్ ఫైట్ సిట్టింగ్ ఎంపీ బెనర్జీపై మాజీ అల్లుడు కబీర్ పోటీ గట్టి పోటీ ఇస్తున్న సీపీఎం యువ అభ్యర్థి దీప్సిత పశి్చమబెంగాల్‌లోని శ్రీరాంపూర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికలు మాజీ మామా అల్లుళ్ల మధ్య పోరుగా మారాయి. టీఎంసీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై ఆయన మాజీ అల్లుడు కబీర్ శంకర్ బోస్‌ను బీజేపీ బరిలోకి దింపింది. మూడుసార్లు నెగ్గిన కళ్యాణ్ పట్టు నిలుపుకునే ప్రయత్నాల్లో ఉంటే ఇక్కడ ఎలాగైనా ఖాతా తెరవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. శ్రీరాంపూర్ ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా, కమ్యూనిస్టుల కంచుకోటగా విలసిల్లింది. అక్కడ కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ ఎర్రజెండా ఎగరేసేందుకు యువ నాయకురాలు దీప్సితా ధర్‌ను సీపీఎం రంగంలోకి దింపింది... హుగ్లీ నది.. శ్రీరాంపూర్ సంక్లిష్టమైన చరిత్రకు సాక్షి. ఇదే ఇక్కడి ఒండ్రుమట్టిని అన్నం గిన్నెగా మార్చింది. జనపనార, పత్తి, కాగితం పరిశ్రమల ఏర్పాటుతో స్థిరమైన పారిశ్రామికీకరణ జరిగింది. కానీ ఇప్పుడు హింద్ మోటార్స్ మూతబడింది. పత్తి మిల్లులు చరిత్ర పుటల్లోనే మిగిలాయి. జూట్, పేపర్ మిల్లులు లాక్డౌన్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు వ్యవసాయ, పారిశ్రామిక శక్తిగా వేలాది మంది వలసదారులకు ఉపాధి కలి్పంచిన ఈ నేల నుంచి ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు జరిగిన 17 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం ఏడుసార్లు, టీఎంసీ, కాంగ్రెస్ నాలుగేసి సార్లు, సీపీఐ రెండుసార్లు చొప్పున శ్రీరాంపూర్‌ను గెలుచుకున్నాయి. దేశంలో బీజేపీ ఎన్నడూ గెలవని లోక్‌సభ స్థానాల్లో ఇదీ ఒకటి.బెనర్జీది దిగజారుడుతనం: బోస్.. కేవలం ఎన్నికల విజయం కోసం వ్యక్తిగత విషయాలను వక్రీకరించి ప్రజల ముందు పెట్టే స్థాయికి బెనర్జీ దిగజారిపోయారంటూ కబీర్ దుయ్యబడుతున్నారు. ఆయన సానుభూతి డ్రామా ఫలించదని, ప్రజలకు అంతా తెలుసని చెప్పుకొచ్చారు. ‘‘కేవలం బెనర్జీ వల్లే ఆయన కూతురితో నా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది. తను మళ్లీ పెళ్లి కూడా చేసుకుంది. అలాంటప్పుడు కూతురి గత జీవితాన్నే ఇలా ప్రచారానికి వాడుకోవడం చౌకబారుతనం’’ అంటూ మండిపడ్డారు. మాజీ మామకు గట్టి పోటీ ఇచ్చి తీరతానని కబీర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘‘బెంగాల్లో పరిస్థితి మారింది. మమత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న పురోగతి, అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. సామాన్యులంతా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బెనర్జీ లక్ష పై చిలుకు ఓట్ల తేడాతో నా చేతిలో ఓడటం ఖాయం. బీజేపీకి బెంగాల్లో 35 లోక్‌సభ స్థానాలకు పైగా వస్తాయి’’ అని బోస్ జోస్యం చెబుతున్నారు.తక్షణావసరం ‘భారత్ బచావో’ సీపీఎం అభ్యర్థి దీప్సితా ధర్ జేఎన్‌యూ విద్యారి్థ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బాలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా, మోటివేషనల్ స్పీకర్‌గా, రెడ్ వాలంటీర్‌గా బాగా పేరు సంపాదించారామె. సీఏఏ, ఎన్ఆర్సీ పేరుతో ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెంగాల్లో ఫలించబోవని అంటున్నారు. ‘‘3 కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ మాటలు బూటకమని తేలిపోయింది. ప్రజలు అన్నివిధాలా మోసపోయారు. పారిశ్రామిక, వ్యవసాయ అభివృద్ధి, మహిళల సాధికారత, భద్రత, యువతకు ఉద్యోగావకాశాలు, అవినీతిరహిత అభివృద్ధి సీపీఎంతోనే సాధ్యం’’ అంటూ దీప్సిత చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ప్రజల విచక్షణపై నమ్మకముంది: బెనర్జీ న్యాయశాస్త్ర పట్టభద్రుడైన కళ్యాణ్ బెనర్జీ సీఎం మమతకు నమ్మకస్తుడు. 2001లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత శ్రీరాంపూర్ నుంచి మూడుసార్లు ఎంపీ అయ్యారు. తన కూతురిని వేధించి చివరికి విడాకులు తీసుకున్న వ్యక్తికి టికెటివ్వడం బీజేపీ కుత్సిత మనస్తత్వానికి నిదర్శనమని బెనర్జీ మండిపడ్డారు. బోస్‌కు తన మాజీ అల్లునిగా తప్ప మరో గుర్తింపే లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘నేను మాట నిలుపుకునే వ్యక్తినని నియోజకవర్గ ప్రజలకు తెలుసు. వాళ్లు ఈసారీ నన్నే గెలిపిస్తారు. శ్రీరాంపూర్ నుంచి అత్యధికసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు నాకు కట్టబెడతారు’’ అని అన్నారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీజేపీపై పోరాడే సమయం లేదా?
సాక్షి, యాదాద్రి: కేరళకు వెళ్లి సీపీఎంను తిట్టేంత సమయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీపై పోరాడటానికి మాత్రం లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికినట్లు.. కేరళకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్‌ని రేవంత్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఓటుకు నోటు సంగతి ఏమైందని ప్రశ్నించారు. భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన బహిరంగసభలో రాఘవులు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ, నోరు పారేసుకోవద్దని రేవంత్‌రెడ్డికి సూచించారు. కేసీఆర్ అహంకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని, సీఎం రేవంత్ ఆ బాటలో నడవద్దని అన్నారు. కేరళలో బీజేపీ, కమ్యూనిస్టులు కలసి పనిచేస్తున్నారని రేవంత్ పేర్కొనడం అతని అవివేకం అని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కవితను బీజేపీ జైల్లో పెట్టిందని, ఇప్పటికైనా బీఆర్ఎస్ ఇండియా కుటమిలోకి రావాలని సూచించారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాఘవులు అన్నారు. మమ్మల్ని కలుస్తామని కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది : తమ్మినేని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడానికి అందరితో కలసి వెళ్తామని, ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్ నాయకత్వం సీపీఎంను కలవనున్నట్లు సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ తెలంగాణలో భువనగిరి నుంచి సీపీఎం పోటీచేయడం ఖాయమన్నారు. -
ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పోస్టులిస్తాం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పారీ్టకి మద్దతిస్తే సీపీఎంకి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ఈ మేరకు భట్టి శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యు లు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య, జూలకంటి రంగారెడ్డితో భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చించిన మీదట ఎట్టకేలకు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆ రెండు పారీ్టలు అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం కార్యాలయానికి వచ్చానని, ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని కోరానని చెప్పారు. ఇరు పారీ్టల పరంగా అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. ఇరు వురి అభిప్రాయాలపై సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి శనివారం ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఇరు పార్టీలు సుహృద్భావ వాతావరణంలో ఓ అంగీకారానికి వచ్చామని అన్నారు. భువనగిరి స్థానంలో మద్దతు ఇమ్మన్న సీపీఎం భువనగిరి స్థానానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు భట్టిని కోరారు. మిగిలిన 16 స్థానాల్లో తాము మద్దతిస్తామని తెలిపారు. అయితే భువనగిరి స్థానంలో కూడా తమకే మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అందుకు తాము ఎమ్మెల్సీ లేదా చైర్మన్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. భట్టి రావడం హ్యాపీ.. కానీ రేవంత్ అలా మాట్లాడకూడదు: తమ్మినేని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పార్టీ కార్యాలయానికి రావడం, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలంటూ కోరడం సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉందన్నారు. సీట్లు, మద్దతు విషయంలో భట్టితో మాట్లాడామని చెప్పారు. భువనగిరి మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి చర్చించినపుడు తుది నిర్ణయానికి వస్తామన్నారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని తమ్మినేని వ్యాఖ్యానించారు. -
‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్
తిరువనంతపురం: సీపీఎం పార్టీపై దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫైర్ అయ్యారు. కేరళలోని కాసర్గాడ్లో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ‘సీపీఎం అధికారంలోకి వస్తే దేశంలోని న్యూక్లియర్ ఆయుధాల(అణు బాంబులు)ను ధ్వంసం చేస్తామని చెబుతోంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా న్యూక్లియర్ బాంబులను కలిగి ఉన్నప్పుడు మనం వాటిని వదులుకుంటే ఎలా. సీపీఎం తీరు దేశ భద్రతతో ఆటలాడినట్లుంది. సీపీఎం హామీపై కాంగ్రెస్ పార్టీ వెంటనే తన వైఖరి వెల్లడించాలి’అని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు. సీపీఎం, కాంగ్రెస్ కలిసి కేంద్రంలో దోచుకోవాలని చూస్తున్నాయని, ఇది తాము జరగనివ్వబోమని రాజ్‌నాథ్ చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 26న రెండో దశలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. తృణమూల్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే -
కామ్రేడ్స్ షేక్..హ్యాండ్
లోక్‌సభ ఎన్నికల్లో పరస్పర పొత్తు విషయమై తెలంగాణలో ‘ఇండియా’ కూటమి పార్టీల మధ్య ఇంకా చర్చలే ప్రారంభం కాలేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య ఐక్యతారాగం వినిపించడంలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీల మధ్య పొత్తులు, చర్చలు జరుగుతుండగా, తెలంగాణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని కామ్రేడ్లు వాపోతున్నారు. కాంగ్రెస్‌తో విసిగి వేసారిన సీపీఎం భువనగిరి లోక్‌సభ స్థానంలో తన అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఈ నెల 19న తమ పార్టీ అభ్యర్థి జహంగీర్ నామినేషన్ కూడా వేస్తారని ఆ పార్టీ తెలిపింది. కాగా, ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని కూడా ప్రకటించింది. పొత్తులు కుదరకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా సీపీఎం ప్రచారం చేయనుంది. అక్కడ సీపీఎంకు గణనీయమైన ఓట్లు ఉన్నందున అది కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు సీపీఐ కూడా తనకు ఒక సీటు కావాలని కోరుతోంది. బేషరతు పొత్తుకు కాంగ్రెస్ ప్రతిపాదన? పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాల్లో సీపీఐ, సీపీఎంలకు చెరో సీటు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదన్న భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల కోసం భారీగానే పోటీ ఉన్నందున కేటాయించడం కుదరదని అంటున్నారు. ఈ నేప థ్యంలో ఒకవేళ వామపక్షాలతో పొత్తులపై చర్చ జరిగితే, భేష రతు మద్దతు కోరాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే ఒక్క సీటు కూడా కేటాయించకుండా అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు వామపక్షాలు మద్దతు ఇవ్వాలన్నమా ట. అలా మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవులు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు ఇచ్చేలా ప్రతిపా దనను కాంగ్రెస్ తెరపైకి తీసుకురానుంది. అయితే జాతీయ పార్టీ హోదాను కాపాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఓట్ల శా తం, సీట్లు వంటివి తెచ్చుకోవడం వామపక్షాలకు అవసరం. ఆ పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణలో ఒక్క సీట్లోనైనా గట్టిగా పోటీ చేయాల్సిందేనని సూచించినట్లు నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కామ్రేడ్లను కాంగ్రెస్ దూరం పెడుతోందా..? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సీపీఐ ఒక సీటులో పోటీ చేసి, మిగిలిన సీట్లలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. అయితే అప్పుడు సీపీఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదరని సంగతి తెలిసిందే. దీంతో సీపీఎం ఒంటరిగా 19 స్థానాల్లో బరిలో నిలిచి.. బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నచోట్ల కాంగ్రెస్‌కు, మరికొన్నిచోట్ల బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది. అయితే 19 స్థానాల్లోనూ సీపీఎం తన పరువు పోగొట్టుకుంది. ఒక్క సీట్లో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. పార్టీ నిర్ణయాన్ని అప్పట్లో కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఆమోదించలేదన్న వాదన బలంగా వినిపించింది. తదనంతర పరిణామాల్లో బీజేపీని ఓడించే సత్తా హస్తం పార్టీకే ఉండటం... ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా ఉండటంతో కలిసి పని చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ మాత్రం వామపక్షాలను పెద్దగా పట్టించుకోవడంలేదన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలకు పెద్దగా ఓట్లు పడలేదన్న భావన ఉండటమే కారణమని అంటున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్ వంటి చోట్ల వామపక్షాలకు వేలల్లోనే ఓట్లు ఉంటాయనీ, వాటిని పోగొట్టుకోవడం ఎందుకన్న భావన కాంగ్రెస్‌లోని కొందరు నేతల్లో ఉంది. దీంతో నామినేషన్ల నాటికి పొత్తులపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. -బొల్లోజు రవి -
కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేరళ సీఎం తీవ్ర విమర్శలు
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. మత, హిందుత్వ రాజకీయాలను ఎదుర్కొవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలైమైందన్నారు. సీఎం పినరయి శనివారం అలప్పుజలో మాట్లాడారు. ‘సీపీఐ(ఎం) మేనిఫెస్టోలో దేశంలో విభజన సృష్టించే సీఏఏను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం దానికి సంబంధించి ప్రస్తావన లేదు. సీఏఏ విషయంలో కాంగ్రెస్ మౌనం వహించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) వంటి కఠినమైన చట్టాలను రద్దు చేస్తామని సీపీఐ(ఎం) హామీ ఇచ్చింది’ అని సీఎం విజయన్ తెలిపారు. సీఏఏ చట్టంపై కాంగ్రెస్ పార్టీ కనీసం బహిరంగ విమర్శలు కూడా చేయలేదన్నారు. సీఏఏపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా సింఘ్ పరివార్ విధానాలకు దగ్గరగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం వల్ల భవిష్యత్తులో దేశ ప్రజలకు ఏ ఉపయోగం ఉండదని అన్నారు. బీజేపీ తీసుకువచ్చిన పలు చట్టాలను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, వాటికే ఓటు వేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. మొత్తం 20 స్థానాలు ఉన్న కేరళలో రెండు దఫాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగి.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
ధనికులపై సూపర్ ట్యాక్స్.. సీపీఎం మేనిఫెస్టో ఇదే..
న్యూఢిల్లీ, సాక్షి: రానున్న లోక్‌సభ ఎన్నికలకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPM) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. UAPA వంటి క్రూరమైన చట్టాలను రద్దు చేస్తామని, ధనికులపై "సూపర్ ట్యాక్స్"ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవకాశం కల్పించాలని వామపక్ష పార్టీ తన మ్యానిఫెస్టోలో ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ దశాబ్ద పాలన ద్వారా రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని సీపీఎం పేర్కొంది. సీపీఎం మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ద్వేషపూరిత ప్రసంగం, నేరాలకు వ్యతిరేకంగా చట్టం కోసం పోరాడతామని సీపీఎం హామీ ఇచ్చింది. CAA లేదా పౌరసత్వ (సవరణ) చట్టం- 2019ని రద్దు చేసేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. "చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA), మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) వంటి అన్ని క్రూరమైన చట్టాలను రద్దు చేస్తామని సీపీఎంపేర్కొంది. స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తిని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను పునఃపరిశీలించి, రివర్స్ చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. సాధారణ సంపద పన్నుతో పాటు అత్యంత సంపన్నులపై పన్ను, వారసత్వపు పన్ను తప్పనిసరిగా చట్టబద్ధం చేస్తామని పేర్కొంది. ప్రస్తుత లేబర్ కోడ్స్ స్థానంలో కార్మిక అనుకూల చట్టాలను రూపొందిస్తామని కూడా పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మాదిరిగానే, సీపీఎం కూడా పంటలకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన నిబంధనను హామీ ఇచ్చింది. 'పని చేసే హక్కు'ని రాజ్యాంగ హక్కుగా చేర్చేలా చూస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పోస్టులలో ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడంతోపాటు ఉపాధి హామీ పథకం కోసం బడ్జెట్ కేటాయింపులను రెట్టింపు చేస్తామని మేనిఫెస్టో పేర్కొంది. పట్టణ ఉపాధికి హామీ ఇచ్చే కొత్త చట్టం, నిరుద్యోగ భృతిపై సీపీఎం హామీ ఇచ్చింది. విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో జీడీపీలో కనీసం ఆరు శాతానికి పెంచనున్నట్లు సీపీఎం పేర్కొంది. ఇది మొత్తం కేంద్ర పన్నుల వసూళ్లలో 50 శాతం రాష్ట్రాలకు అప్పగించడాన్ని సూచిస్తుంది. తాము అధికారంలోకి వస్తే, ఒక ప్యానెల్ ద్వారా రాష్ట్ర గవర్నర్‌ను ఎన్నుకునే పద్ధతిని అమలు చేయాలని పార్టీ భావిస్తోంది. దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదిస్తారు. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల అమలు సీపీఎం హామీ ఇచ్చింది. ఆదివాసీల రాజ్యాంగ, చట్టపరమైన హక్కుల పరిరక్షణపై వాగ్దానం చేసింది. కుల ప్రాతిపదికన జనాభా గణన, రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలపై నిషేధం, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ తదితర అంశాలు సీపీఎం మేనిఫెస్టోలో ఉన్నాయి. -
విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె!
విమాన సిబ్బందిలో మహిళలు పనిచేయాలంటే కచ్చితంగా స్కర్టులు, కోట్లు ధరించాల్సిందే. అందులోనూ లండన్‌లో అయితే కచ్చితంగా ఆ ఆహార్యంలోనే ఉండాల్సిందే. భారతీయ మహిళలైనా ఆ రూల్స్ పాటించక తపని రోజులవి. కానీ ఓ మహిళ ఆ ఎయిర్ ఇండియా రూల్స్‌నే తిరగరాసింది. చీరకట్టుతోనే పనిచేస్తామని తెగేసి చెప్పడమే గాక ఉద్యమం చేసి మరీ తను అనుకున్నది సాధించుకుంది. ఎయిర్ ఇండియాలో పనిచేసే ప్రతి సిబ్బంది చీరకట్టకునేలా చేసింది. అంతేగాదు రాజకీయాల్లోకి రావడానికి మహిళలు భయపడుతున్న రోజుల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చి తన గళం వినిపిస్తూ అంచెలంచెలుగా పైకొస్తూ.. మంచి రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమె నేటితరానికి, భవిష్యత్తుతరాలకు స్ఫూర్తిగా నిలిచే గొప్ప వ్యక్తి. ఎవరీమె అంటే.. ఆమె పేరు బృందా కారత్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సరిగ్గా రెండు నెలలకు పుట్టారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే ఆమె అదే ఏడాది అక్టోబర్ 17న కోల్‌కతాలో జన్మించారు. తండ్రి సూరజ్ లాల్ దాస్ పాకిస్తాన్‌లోని లాహోర్ నుంచి వలస వచ్చారు. తల్లి ఒషుకోనా మిత్ర బెంగాలి. వీళ్లది ప్రేమ పెళ్లి. పెద్దలు వ్యతిరేకించి మరీ ఓషుకోనా సూరజ్‌ని పెళ్లి చేసుకున్నారు. బృందాకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఐదేళ్ల వయసులో బృందా తన తల్లి ఒషుకోనా మిత్రను కోల్పోయినా తండ్రి తన పిల్లల్ని చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచారు. ఎన్.డి.టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ప్రణయ్ రాయ్‌ని పెళ్లాడిన రాధిక ఆమె చెల్లెలే. బృందా ప్రాథమిక విద్య డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో పూర్తి చేశారు. ఆమె 16 ఏళ్ల వయస్సులో మిరిండా హౌస్‌లోని దర్హి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి బీఏ పట్టా తీసుకున్నారు. అప్పుడే ఆమె తండ్రి సూరజ్ లాల్ దాస్ తన కుమార్తె బందాను పిలిచి నేను చదువు చెప్పించా. ఇక నువ్వు నీ కాళ్ళపై నిలబడాలని సూచించారు. దీంతో ఆమె 1967లో లండన్ వెళ్లి ఎయిర్ ఇండియాలో చేరారు. అయితే లండన్‌లోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా స్కర్ట్ లు వేసుకోవాల్సిందే తప్ప చీరె కట్టును అనుమతించరు. అందుకు ససేమిరా అని బృందాకారత్ తెగేసి చెప్పడం జరిగింది. ఆ టైంలో లండన్ హీత్రూ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్. ఆయన కూడా ఏమాత్రం తగ్గేదే లే అంటూ చీర ధరించేందుకు అనమితించమని చెప్పేశారు. అయితే తాము సమ్మే చేస్తామని నిర్భయంగా చెప్పింది బృందాకారత్. చేస్కోండి! అని ఆయన కూడా తీసిపడేసినట్లుగా అన్నారు. దీంతో ఆమె చీరే కట్టుకుంటాం అనే డిమాండ్‌తో నిరవధికంగా మూడు రోజు సమ్మే చేసి మరీ ఎయిర్ ఇండియా మెడలు వంచింది బృందా. దెబ్బకి ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్ దిగి రావడమే గాక మీరే విజయం సాధించారు, పైగా ఎయిర్ ఇండియాలో ప్రతి ఒక్కరూ చీరకట్టుకునేలా చేశారు అన్నారట. కానీ బృందాకారత్ ఆ మాటలకు పొంగిపోలేదు. ఈ విజయం తనదేనని ఒప్పుకోలేదు. "సారీ, గెలిచింది నేను కాదు. శారీ జాతీయవాదం" అని చెప్పి ఎయిర్ ఇండియా అధికారిని షాక్‌కి గురయ్యేలా చేసిందట. ఆమె తన వ్యక్తిగత విజయాన్ని జాతీయ వాదంతో పోల్చి చెప్పడమేగాక ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి బదులు అందరికీ వర్తింపజేసేలా మాట్లాడినందుకు...ఆమెను అభినందించకుండా ఉండలేక పోయారు ఆయన. అంతేగాదు అలా ఎయిర్ ఇండియాకు సెలక్ట్ అయిన బ్రిటిష్ యువతులందరికీ చీరకట్టుకోవడం నేర్పించారు బృందాకారత్. అలా ఆమె అక్కడ కొంతకాలం పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సీపీఎం అనుబంధ సంఘాలలో పని చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రాని రోజుల్లో వామపక్ష రాజకీయాల వైపుకి వెళ్లారు. అరుదైన కమ్యూనిస్టు రాజకీయ వేత్తగా ఎదిగారు. నుదుట పెద్ద బొట్టు, ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని వర్చసు ఉన్న బృందా అనర్ఘళంగా హిందీ, ఇంగ్లీషు, మళయాళం, బెంగాలీ, కొన్ని తెలుగు పదాలు మాట్లాడగలరు. దేశంలో ఫెమినిస్ట్ ఉద్యమానికి ఊపిరులు వారిలో బృందా కారత్ ఒకరు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఎం తరఫున రాజ్యసభకు 2005 నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2005లో సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళ బృందా కారత్. అంతేగాదు ఆమె సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ భార్య. ఇక బృందా కారత్ 1975 నాటి ఎమర్జెన్సీ మొదలు కమ్యూనిస్టు ఉద్యమం ఉజ్వలంగా సాగిన1985 వరకు తన జ్ఞాపకాలను, ఇతర వ్యాసాలను కలిపి ఓ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. “యాన్ ఎడ్యుకేషన్ ఫర్ రీటా” పేరిట ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే నేటితరం యువత తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం లాంటివే. కనువిప్పు కలిగించేవే. పదేళ్ళ చరిత్రను కళ్లకు కట్టారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలోని పదేళ్ల కాలాన్ని గుర్తుపెట్టుకుని క్రమం తప్పకుండా రాయడమంటే మామూలు విషయం కాదు.పైగా ఈ పుస్తకంలో బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలం నుంచి మొదలు పెట్టి ఢిల్లీ గల్లీలలో జరిగిన పోరాటాలను, కష్టకాలంలో జరిగిన చర్చల్ని, నాయకుల తీరు తెన్నులన్నింటిని చక్కగా వివరించారు. అయితే అందులో ఉన్న రీటీ ఎవరో కాదు బృందాయే అని పుస్తకం చదివిన తర్వాత గానీ తెలియదు. అయితే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలపి పోరాడిన ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఇక తానెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని ప్రశ్నిస్తే మాత్రం బృందా..తన వయసు 70 దాటిందని, ఈ వయసులో పరిగెత్తడం సమంజసం కాదని చెబుతుంటారామె. నేటి పరిస్థితులన్ని మార్చాలంటే యువతీ యువకులే నడుం కట్టాలని చెబుతుంటారు. ఈ ఎన్నికల్లోనైనా మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారనే ఆశతో చూస్తున్నారామె. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
సీపీఎం మొదటి లిస్ట్ విడుదల
రానున్న లోక్‌సభ ఎన్నికలకు సీపీఎం తమ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 44 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చాలా రాష్ట్రాల్లో ఒకటీ రెండు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం.. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లకు తమ అభ్యర్థులను వెల్లడించింది. ఈ జాబితాలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 17 స్థానాలు ఉన్నాయి. కేరళకు చెందిన 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇందులో అలప్పుజా నుంచి సిట్టింగ్ ఎంపీ ఆరిఫ్, వడకర నుంచి మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ టీచర్, కాజీకోడ్ నుంచి రాజ్యసభ ఎంపీ ఎలమరం కరీం ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 17 పేర్లలో ముర్షిదాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం పేరు కూడా ఉంది. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మధురై నుంచి సిట్టింగ్ ఎంపీలు ఎస్ వెంకటేశన్, దిండిగల్ ఆర్ సచ్చిదానందంలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలోని భువనగిరి స్థానానికి ఎండీ జహంగీర్ పేరును, ఆంధ్ర ప్రదేశ్‌లోని అరకు స్థానానికి పాచిపెంట అప్పలనరస పేరును మొదటి జాబితాలో వెల్లడించింది. -
Income Tax Department: సీపీఐ, సీపీఎంలకు ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు ఆదాయపు పన్ను నోటీసుల పరంపరం కొనసాగుతోంది. రూ.11 కోట్లు చెల్లించాలంటూ సీపీఐకి ఐటీ డిపార్టుమెంట్ నోటీసు జారీ చేసినట్లు అధికార వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. గత కొన్నేళ్లలో దాఖలు చేసిన ఐటీ రిటర్నుల్లో పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు ఫెనాలీ్టలు, వడ్డీ కింద రూ.11 కోట్లు చెల్లించాలంటూ ఈ నోటీసు ఇచి్చనట్లు తెలిపాయి. ఈ నోటీసులను న్యాయస్థానంలో సవాలు చేయడానికి సీపీఐ నేతలు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది. అలాగే సీసీఎంకు కూడా ఐటీ నోటీసులు అందాయి. 2016–17లో ఇచ్చిన పన్ను మినహాయింపును ఉపసంహరించుకుంటూ ఐటీ విభాగం తాజాగా సీపీఎంకు నోటీసులు ఇచి్చంది. అప్పట్లో ఐటీ రిటర్నుల్లో బ్యాంకు ఖాతాను నిర్ధారించనందుకు రూ.15.59 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. -
ఈ కూడలిలో ఎవరి ప్రభావం ఎంత?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పట్టున్న సీపీఎం, సీపీఐ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు కోసం వేచిచూస్తున్నాయి. బీఆర్ఎస్తో వెళ్లేది లేదని ఖరాఖండిగా చెబుతూనే కాంగ్రెస్ స్నేహ హస్తం కోసం ఎదురుచూస్తున్నాయి. ఉభయ పార్టీల ప్రతిపాదనపై ఇప్పటివరకు కాంగ్రెస్ స్పందించకపోవడంతో కామ్రేడ్స్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఎం ఇప్పటికే నిరీక్షణను పక్కనపెట్టి భువనగిరి అభ్యర్థిని ప్రకటించడమే కాక మిగతా స్థానాల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై సమాలోచనలు చేస్తోంది. సీపీఐ మాత్రం దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో ఉన్నందున రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానమైనా తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ చర్చలకు పిలవకపోవడంతో ఈనెలాఖరు నాటికి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేశాయి. సీపీఎం నల్లగొండ, ఖమ్మం స్థానాల్లో.. సీపీఐ మహబూబాబాద్, భువనగిరిలో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం ఉమ్మడి జిల్లాలో ఒంటరిగా, సీపీఐ కాంగ్రెస్‌తో జత కట్టాయి. ఆ ఎన్నికల్లో నమోదైన ఓట్ల ఆధారంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీల ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ అభ్యర్థిని ప్రకటించగా.. నేడో, రేపో ఖమ్మం అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశముంది. దీంతో సీపీఎం భువనగిరి ఒక్క స్థానానికే పరిమితవుతుందా, ఖమ్మంలోనూ పోటీ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. పోటీలో ఆ పార్టీ అభ్యర్థిని పెట్టకపోతే కాంగ్రెస్‌కు ఎన్ని ఓట్లు కలిసొస్తాయన్న చర్చ జరుగుతోంది. ఇక సీపీఐ నేతలు జాతీయ నాయకత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా పోటీ చేయకపోతే కేడర్ బలహీనమవుతుందన్న ఆలోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీని నిలువరించడమే లక్ష్యంగా తమ అడుగులు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: ఈ రెండుస్థానాల్లో పోటీ ఎవరు..? -
నేడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తూ, ప్రజా స్వామ్య హక్కులను కాల రాస్తోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేశ్, ఎస్.వీరయ్య మండిప డ్డారు. వామపక్ష పార్టీల సమావేశం శుక్రవారం ఎంబీ భవన్లో జరిగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణులను సమావేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా శనివారం ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిరసన కార్యక్రమం ఉంటుందని తెలిపా రు. స్వచ్ఛందంగా పనిచేసే ఈడీ, ఐటీ, సీబీఐలను తమ జేబు సంస్థలుగా కేంద్రం వాడుకుంటోందని మండిపడ్డారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చట్ట ఉల్లంఘనలు జరుగుతున్నా పట్టించుకోకుండా, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల నా యకులను భయభ్రాంతులకు గురిచేస్తోందని విరుచుకుపడ్డారు. అందులో భాగంగానే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తోపా టు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలను అరెస్టు చేసిందన్నారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసి ఎన్నికల్లో దెబ్బతీయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు రమ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్, ఎంసీపీఐ(యు) నాయకులు వనం సుధాకర్, ఎస్ యూసీఐ(యు) నాయకులు తేజ, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు కోటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు. -
ఒంటరిగానే బరిలోకి సీపీఎం!
సాక్షి, హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి గానే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఒంటరిగానే బరి లోకి దిగాలని సీపీఎం భావిస్తోంది. ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని భావించినా, ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చి నట్లు తెలిసింది. బుధారం జరిగిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. కాగా ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా ఎండీ జహంగీర్ పేరును ఆ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన 16 లోక్‌సభ స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణ యం తీసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హైదరాబాద్‌లో విలేకరుల కు చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, రేవంత్‌రెడ్డి వంద రోజుల పాలన, పార్లమెంటు ఎన్నికలు, పార్టీ వైఖరిపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ఖమ్మం, మహబూబాబాద్, భువనగిరి, నల్లగొండల్లో తమకు బలముందని, భువనగిరి కాకుండా మిగతా మూడింటిలో ఎక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ ప్రతిపాదించినా తాము సిద్ధమని ప్రకటించారు. కలిసి పనిచేద్దామని బీఆర్ ఎస్ నుంచి ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.జహంగీర్ భువ నగిరి జిల్లాలో అనేక సమస్యలపై పోరాటాలు చేశా రని చెప్పారు. మూసీ సమస్యను పరిష్కరించాలంటూ పాదయాత్ర నిర్వహించారని గుర్తు చేశారు. తమ్మినేనికి బదులు వీరయ్య నిర్ణయాలు అనారోగ్య కారణాలతో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బదు లుగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పార్టీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా జహంగీర్ పేరును కూడా వీరయ్యే ప్రకటించారు. ఇలావుండగా రాష్ట్రంలో పెద్దపల్లి, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక స్థానంలో సీట్ల సర్దుబాటు ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. ఈ విషయాన్ని తాము ఇదివరకే ప్రతిపాదించామని చెప్పారు. బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. -
లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే సీపీఎం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుకు దూరంగా ఉన్న సీపీఎం.. లోక్‌సభ ఎన్నికలకు ఒంటరిగానే వెళ్లాని నిర్ణయించుకుంది. బుధవారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ను ప్రకటించిన సీపీఎం మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపింది. -
పాచిపోయిన లడ్డులు తినడానికి అలవాటు పడ్డాడు
-
మళ్లీ కారు..కొడవలి!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పనిచేసే దిశగా వామ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమ్యూని స్టు పార్టీలు.. అందుకు కలిసి వచ్చే అవకాశం ఉన్న, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ భే టీ అయిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ రెండు పార్టీలూ నిర్ణయించాయి. త్వరలోనే పొత్తుకు సంబంధించిన విధివిధానాలు, సీట్ల పంపకాలపై చర్చలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైన బీఆర్ఎస్, సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ పట్టును నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి సవాల్ విసరాలనే ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ నేతల నుంచి కమ్యూనిస్టు పార్టీలకు కూడా పిలుపు వచ్ఛి నట్లు తెలిసింది. తాము వచ్చి చర్చలు జరుపుతామని, అందుకు సుముఖమేనా అని బీఆర్ఎస్ వర్గాలు అడిగినట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. ఇప్పటికే అనధికారికంగా లెఫ్ట్, బీఆర్ఎస్ మధ్య మంతనాలు జరుగుతున్నట్లు కమ్యూనిస్టు వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనుకున్నా.. వాస్తవానికి బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’కూటమిలో భాగమైన కాంగ్రెస్‌తో, రాష్ట్రంలోనూ కలిసి వెళ్లాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. చెరో సీటు ఇస్తే చాలన్నట్టుగా సంకేతాలు పంపాయి. కానీ దేశవ్యాప్తంగా పొత్తులు కుదుర్చుకుంటూ, రాష్ట్రంలో సైతం ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ప్రారంభించిన హస్తం పార్టీ నుంచి ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చొరవా, కదలిక లేకపోవడం వామపక్షాలను ఆగ్రహానికి గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్తో పొత్తు ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్తో కలిసి వెళ్లాలని సీపీఐ, సీపీఎం భావించాయి. అయితే ‘ఇండియా’కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్నందున వామపక్షాలతో జట్టు కట్టకూడదని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించాయి. అయితే సీట్ల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా సీపీఎం ఒంటరిగానే 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జతకట్టింది. ఒకే ఒక్క స్థానం కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకోగా, ఇండియా కూటమి దృష్ట్యా సీపీఎం కూడా సుముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని, చెరో స్థానం ఇస్తే చాలని కూడా రెండు పార్టీలు ఎప్పుడో ప్రకటించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఈ విషయం పట్టించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరివరకు పొత్తుపై తేల్చకుండా నాన్చారని, దానివల్ల తాము నష్టపోయామని సీపీఎం వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే రావడంతో సీపీఎంతో పాటు సీపీఐ కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చాక తమ అవసరం లేదన్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కమ్యూనిస్టు వర్గాలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. విజయన్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయన్ హైదరాబాద్ వచ్ఛి న సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడాన్ని, కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కేసీఆర్ ఆహ్వానం మేరకు పాల్గొనడాన్ని రేవంత్ తప్పుపట్టారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపరుడని, ఆయనను కలిసిన విజయన్ కూడా అవినీతిపరుడని, అందుకే కేసీఆర్‌ను కలిశారంటూ నోరు పారేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ వ్యాఖ్యలు బాధ్యతారహితమని పేర్కొంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏకంగా ఒక ప్రకటనే విడుదల చేశారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయమన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా? కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడే క్రమంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు సభలో పాల్గొని విజయన్ ఏమి మాట్లాడారో సీఎం మరచిపోవడం ఆశ్చర్యకరం. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సీపీఎం పాత్ర ఏమిటో కూడా మరచిపోయి, బాధ్యత మరచి, తప్పుడు ఆరోపణలు చేశారు..’అంటూ ఘాటుగా ధ్వజమెత్తారు. కాగా అప్పట్నుంచే వామపక్షాలు కాంగ్రెస్‌పై వామపక్షాలు ఒకింత అసహనంతో ఉన్నాయి. ప్రధాని మోదీని ప్రశంసించిన సీఎం ఇది చాలదన్నట్టు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్ఛినప్పుడు సీఎం రేవంత్ ఆయనతో కలిసి సభలో పాల్గొనడం, అంతేకాకుండా ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడటం, పెద్దన్న మోదీ అంటూ సంబోధించడాన్ని కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాజకీయ విభేదాలు మరిచి పొగడడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు. తమతో పాటు బీజేపీతో ప్రధానంగా పోరాడేది కాంగ్రెస్ పార్టీయేనన్న విషయాన్ని మరిచి రేవంత్‌రెడ్డి వ్యవహరించారని కమ్యూనిస్టులు అంటున్నారు. రేవంత్‌రెడ్డి సైతం బీజేపీపై గట్టిగా పోరాడాల్సింది పోయి మెతక వైఖరితో ఉన్నారని భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని బీఆర్ఎస్తో కలిసి వెళ్లే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఈ మూడు పార్టీల శ్రేణులు కలిసి పనిచేసిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు. -
లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా శైలజా టీచర్.. ప్రకటించిన సీపీఎం
తిరువనంతపురం: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్ష పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే తమకు పట్టు ఉన్న కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీసీఐ) పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే నలుగరు అభ్యర్థుల పేర్లను సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) (సీపీఎం) పార్టీ నేడు (మంగళవారం) 15 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సీపీఎం పార్టీ రాష్ట్ర సెక్రటరీ ఎంవీ గోవిందన్ లోక్‌సభలో పోటీచేసేవారి జాబితాను విడుదల చేశారు. ఎల్డీఎఫ్ మిత్రపక్షమైన సీపీఎం.. మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో నాలుగు స్థానాలను ఇప్పటికే సీపీఐకి కేటాయించింది. గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు మంత్రిగా సేవలందించిన కేకే శైలజా(శైలజా టీచర్)ను సీపీఏం.. లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దించుతోంది. ఆమెకు వడకర లోక్‌సభ నియోజకవర్గాన్ని కేటాయించింది. థామస్ ఐజాక్ పతనంతిట్ట సెగ్మెంట్ నుంచి పోటీ చేయనున్నారు. మరో సీటును కేరళలోని కాంగ్రెస్(ఎం)కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. కేరళలో అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షపార్టీ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నాయకత్వంలోని కొత్త మంత్రివర్గంలో కేకే శైలజకు మాత్రం చోటు దక్కలేదు. ఆమె రెండోసారి ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రతి ఒక్కరు భావించినప్పటికీ.. పార్టీ ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇక.. 2018లో ఆరోగ్య మంత్రిగా చేసిన సమయంలోనూ ప్రాణాంతక నిపా వైరస్‌ను నియంత్రించేందుకు చేపట్టిన చర్యలతో కేకే శైలజా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం తరఫున పోటీచేసే అభ్యర్థులు వీరే... అలప్పుజ - ఏఎం ఆరిఫ్ అలత్తూరు - కె. రాధాకృష్ణన్ అట్టింగల్ - వి. జాయ్ చాలకుడి - ప్రొఫెసర్ సి. రవీంద్రనాథ్ ఎర్నాకులం - కె.జె. షైన్ ఇడుక్కి - జాయిస్ జార్జ్ కన్నూర్ - ఎం.వీ జయరాజన్ కాసరగోడ్ - ఎం.వీ బాలకృష్ణన్ కొల్లాం - ఎం. ముఖేష్ కోజికోడ్ - ఎలమరం కరీం మలప్పురం - వి. వసీఫ్ పాలక్కాడ్ - ఎ. విజయరాఘవన్ పతనంతిట్ట - థామస్ ఐజాక్ పొన్నాని - కే.ఎస్. హంస వడకర - కె.కె.శైలజ ఇది కూడా చదవండి: కేరళ: నలుగురు అభ్యర్థులను ప్రకటించిన సీపీఐ -
‘చేయి’స్తారా?
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని సీపీఐ, సీపీఎం అనుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. 17 లోక్‌సభ సెగ్మెంట్లలో చెరో సీటులో పోటీ చేస్తామని స్పష్టం చేశాయి. అయితే పొత్తులపై సీపీఐ, సీపీఎం ప్రకటన చేసినా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో కామ్రేడ్లు కాస్తంత గుర్రుగా ఉన్నారు. బీజేపీని నిలువరించాలంటే తమ మద్దతు అవసరమని, కాబట్టి కాంగ్రెస్ త్వరగా తేల్చాలని లెఫ్ట్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులపై దృష్టి సారించిందని, రాష్ట్రంలో కూడా త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ముందస్తుగా ప్రచారంలోకి దూసుకెళ్లొచ్చని అంటున్నాయి. సీపీఎం వైఖరిలో మార్పు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ముందస్తుగా బీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించాయి. ఆ పార్టీతో పొత్తు చిత్తవడంతో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని అనుకున్నాయి. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు సీపీఐ ఒక్క సీటుకు ఒప్పుకొని కొత్తగూడెంలో విజయం సాధించింది. సీపీఎం మాత్రం కాంగ్రెస్‌తో రాజీప డక ఒంటరిపోరుకు సిద్ధమై 19 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లోనూ కొన్ని జిల్లాలకు చెందిన నాయకులు ఈ విషయాన్ని బాహాటంగానే విమర్శించినట్టు సమాచారం. కాంగ్రెస్‌తో వెళ్లి ఉంటే కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేదని చర్చ జరిగినట్టు తెలిసింది. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల, బీఆర్ఎస్కు మరికొన్నిచోట్ల మద్దతు ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదన్న వాదనలు కూడా ఆ పార్టీలో తలెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కే తమ మద్దతు అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేస్తే, రాష్ట్ర పార్టీ నాయకత్వం మాత్రం బయటకు ఏదీ నేరుగా చెప్పకుండా అంతర్గతంగా బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చా యి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీపీఎం వైఖరిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్‌తోనే ముందుకు నడవాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఓట్లతో బయటపడ్డ వాస్తవాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు అసెంబ్లీ స్థానంలో పరువు దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి పాలేరులో 5,308 ఓట్లు, మిర్యాలగూడలో 3,23 4 ఓట్లు, వైరాలో 4,439 ఓట్లు వచ్చాయి. అంతేకాదు మొదట్లో అడిగిన ఐదింటిలోని భద్రాచ లంలో 5,860 ఓట్లు, మధిరలో 6,575 ఓట్లు, ఇబ్రహీంపట్నంలో 3,948 ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం 19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం అన్నిచోట్లా కలిపి కేవలం 52,349 ఓట్లే సాధించింది. కనీసం ఎక్కడా డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించినట్టుగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంతోపాటు, రెండు ఎమ్మెల్సీలు తీసుకొని ఉంటే ఎలాగోలా గౌరవం దక్కేదన్న చర్చ కూడా సీపీఎంలో జరుగుతోంది. ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో సరాసరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి తమ ఓట్లు గణనీయంగా ఉంటాయని లెఫ్ట్ నేతలు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని, కాబట్టి ఆ పార్టీకి ఎలాగైనా ఎంపీ సీట్లలో గండిపెట్టాలని వామపక్షాలు భావిస్తున్నాయి. చెరో ఎంపీ సీటు ఇస్తే సరేసరి... లేకుంటే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనూ ఆ పార్టీలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. మద్దతు ఇచ్చినందుకు చెరో ఎమ్మెల్సీ స్థానం కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు అవకాశాలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులతో వెళ్లాలని భావిస్తోందన్నారు. ఒకవేళ పొత్తు ఉన్నా లేకున్నా రెండు ఎంపీ సీట్లలో సీపీఎం పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజులపాటు జరగనున్న సీపీఎం రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ప్రారంభమైంది. ఆ పార్టీ సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తమ్మినేని మాట్లాడుతూ.. పొత్తు ఉంటుందా? లేదా? అన్నది కాంగ్రెస్ పారీ్టనే తేల్చాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని, కానీ ఒకసారి ఆరు నెలలు, మరోసారి సంవత్సరంలో భర్తీ చేస్తామని అంటున్నారని, ఈ రెండు మాటల్లో మర్మమేంటని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో రామమందిరం ప్రారంభోత్సవ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. అక్షింతలు ఓట్లుగా మారతాయా? బీజేపీకి ఓట్లేస్తారా? అనేది చూడాలన్నారు. బీజేపీపై రేవంత్‌రెడ్డి పోరాడాలి: బీవీ రాఘవులు కర్ణాటక ప్రభుత్వ తరహాలో బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి ఇక్కడ పోరాడాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు కోరారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు వచ్చాయని, అవి సమన్లా లేక గాలమా అనేది కొద్దిరోజుల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు. ’’కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓట్లేస్తే మూసీనదిలో వేసినట్టేనని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారు కానీ నిజానికి కిషన్రెడ్డీ నువ్వే మూసీలో పడిపోతావు జాగ్రత్త’’అని రాఘవులు ఎద్దేవాచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రాములు, జూలకంటి రంగారెడ్డి, డీజీ నరసింహారావు, జాన్‌వెస్లీ, పాలడుగు భాస్కర్, టి.సాగర్, మల్లు లక్ష్మి, పి.ప్రభాకర్ పాల్గొన్నారు. -
వీరయ్యకు పార్టీ పర్యవేక్షణ బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సీపీఎం పర్యవేక్ష ణ బాధ్యతలు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్యకు అప్పగించారు. రాష్ట్ర రాజధాని హై దరాబాద్‌లో ఉంటూ పార్టీని నడిపించాల్సిన బాధ్య తను ఆయనకు అప్పగిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9, 10 తేదీల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ సమావే శాలు జరిగాయి. ఆ భేటీల్లో ఈ నిర్ణయం తీసుకు న్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఏఐజీలో ఆయన చికిత్స పొందారు. ఆయనకు మరింత విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ఈ నేపథ్యంలో రెండ్రోజులు జరిగిన పార్టీ సమావే శాలకు కూడా తమ్మినేని కొద్దిసేపు మాత్రమే హాజర య్యారు. కాగా తమ్మినేని సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వంలోనే వీరయ్య పనిచేయాలని స్ప ష్టం చేస్తూ రాష్ట్ర కమిటీ తీర్మానించింది. అవసరాన్ని బట్టి తమ్మినేని హైదరాబాద్‌లో, అలాగే ఖమ్మంలోనూ ఉంటారు. మూడు నెలల పాటు వీరయ్య ఈ బాధ్యతలు నిర్వర్తించాలని సీపీఎం నిర్ణయించింది. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీని నడిపించాల్సిన బాధ్యత వీరయ్యపై పడింది. ఈయన గతంలో ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడిగా, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, నవ తెలంగాణ ఎడిటర్‌గా పనిచేశారు. రెండు ఎంపీ సీట్లలో పోటీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించినట్లు తమ్మినేని ఒక ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా కమిటీలతో చర్చించిన అనంతరం త్వరలో సీట్లను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, భువనగిరి స్థానాల్లో ఏవో రెండింటిలో పోటీ చేయాలని సీపీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నేతల గురి ప్రధానంగా మహబూబాబాద్, భువనగిరి స్థానాలపై ఉన్నట్లు సమాచారం. అయితే ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానమే ఇస్తాననడంతో పొత్తు కుదరలేదు. ఇక రెండ్రోజులు జరిగిన సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, లోక్‌సభ ఎన్నికలు, తదితర అంశాలపై సీపీఎం చర్చించింది. కాంగ్రెస్‌తో అవగాహన చేసుకొని ఉంటే సానుకూల ఫలితాలు వచ్చేవన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఒక స్థానంలో సీపీఐ పోటీ! సీపీఐ కనీసం ఒక లోక్‌సభ స్థానంలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే లోక్‌సభ ఎన్నికలకు మద్దతు కోరి ఎమ్మెల్సీలు లేదా రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించవచ్చని అనుకుంటున్నారు. 16న సమ్మెకు మద్దతు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌కు పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని, ప్రజలంతా పాల్గొనాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు. -
ఒక్క సీటు కూడా ఇవ్వను.. కాంగ్రెస్‌పై మమత ఫైర్
కోల్‌కతా: ఇండియా కూటమిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. టీఎంసీతో పొత్తు కావాలంటే సీపీఎంతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు. సీట్ల పంపకాల్లో రెండు సీట్ల ప్రతిపాదనను కాంగ్రెస్ తీరస్కరించింది.. కానీ ఇప్పుడు ఒక్క సీటు కూడా ఇవ్వనని తెగేసి చెప్పారు. 'గతంలోనూ పలు సందర్భాల్లో సీపీఎం నాపై భౌతిక దాడి చేసింది. నన్ను నిర్దాక్షిణ్యంగా కొట్టారు. నా శ్రేయోభిలాషుల ఆశీస్సుల వల్లే బతికి ఉన్నాను. వామపక్షాలను ఎప్పటికీ క్షమించలేను. సీపీఎంను క్షమించలేను. కాబట్టి ఈరోజు సీపీఎంతో ఉన్నవాళ్లు బీజేపీతో కూడా ఉండొచ్చు. నేను వారిని క్షమించను.' అని మమతా బెనర్జీ మాల్డాలో ఏర్పాటు చేసిన సభలో అన్నారు. 'అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని కాంగ్రెస్‌కు చెప్పాను. రెండు పార్లమెంట్ స్థానాలు ఇస్తాం. మీ అభ్యర్థులను మేమే గెలిపించుకుంటాం అని చెప్పాం. కానీ వారికి ఎక్కువ సీట్లు కావాలి. నేను కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వను. మీరు వామపక్షాలను విడిచిపెట్టే వరకు మా వద్దకు రాకండి" అని మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్‌తో పొత్తు ఉండబోదని సీపీఎం గతంలోనే తేల్చి చెప్పింది. బెంగాల్లో బీజేపీ, టీఎంసీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, సీపీఎం ఉంటాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. అటు.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి కూడా మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీఎంసీతో పొత్తు ఉండబోదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, టీఎంసీ మధ్య పొత్తు కుదిరే పరిస్థితులు లేకుండా పోయాయి. ఇదీ చదవండి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కారు అద్దాలు ధ్వంసం -
తమ్మినేని ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన ఏ ఐజీ హాస్పిటల్
-
విషమంగానే తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి
-
Tammineni: వెంటిలేటర్‌పైనే తమ్మినేని.. విషమంగా ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న తమ్మినేనికి సోమవారం సాయంత్రం ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అయితే గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. గుండె పనిచేయకపోవడం, గుండె కొట్టుకోకపోవడంతో అసాధారణ పరిస్థితి నెలకొందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతోపాటు మూత్రపిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమైంది. బీపీ మెరుగుపరిచేందుకు మందులు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించి, గుండె సాధారణ స్థితికి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ మార్గదర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉన్నారని ఆ బులెటిన్‌లో ఏఐజీ వెల్లడించింది. ఆస్పత్రిలో తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదించి తగిన వైద్యం అందించడానికి పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, డీజీ నరసింహారావు, పి.ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తమ్మినేనిని మాజీ మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 2004లోనూ తమ్మినేనికి గుండెనొప్పి రావడంతో వైద్యులు స్టంట్స్ వేశారు. -
సీపీఎం తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండె పోటుకు గురయ్యారు. దీంతో, మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఇక, గతంలోనే తమ్మినేని స్ట్రోక్ రావడంతో స్టంట్ కూడా పడింది. వివరాల ప్రకారం.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గుండె పోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లో తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. గతంలో తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి కొంచెం విషమంగా మారింది. -
కేరళ గవర్నర్‌పై బృందాకారత్ సంచలన వ్యాఖలు
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కావాలంటే ఖాన్ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ‘గౌరవ గవర్నర్‌కు ఒకవేళ రాజకీయాలంటే ఆసక్తి ఉంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలి. పోటీచేసి రాజకీయాల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలి. బీజేపీ టికెట్ తీసుకుని కేరళలోని ఏ స్థానం నుంచి అయినా ఆయన పోటీ చేయొచ్చు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోతాయి. గవర్నర్ రోజూ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చే బదులు సీఎంతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటే మంచిది’అని బృందా కారత్ సూచించారు. కేరళ ప్రభుత్వం పంపిన యూనివర్సిటీ బిల్లులపై సంతకాలు చేయకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారు. దీంతో గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సంబంధాలు చెడిపోయాయి. యూనివర్సిటీ బిల్లులు మనీ బిల్లులయినందున గవర్నర్ ఆమోదం లేకుండా వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కుదరదు. దీంతో ఆ బిల్లులపై ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. గవర్నర్‌కు ఈ బిల్లులపై డైరెక్షన్స్ ఇదీచదవండి..విజయ్‌కాంత్‌ను తల్చుకుని ప్రధాని భావోద్వేగం -
ప్రాధాన్యం ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో నిర్మించాలని, ధరణి పోర్టల్‌ను సవరించి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, సుప్రీం తీర్పు నేపథ్యంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీపీఎం నేతలు కోరారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, టి.జ్యోతి, పి.సుదర్శన్, నర్సింహారావు, జాన్‌వెస్లీ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పేద రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులకు 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. తొమ్మిదేళ్లలో వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల జీవో సవరించలేదని, రోజు కూలీ రూ.600 ఉండేలా జీవోను సవరించాలని సూచించారు. అర్హులైన పేదలందరికీ 120 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ఉద్యమాల సందర్బంగా ప్రజలు, కార్యకర్తలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించాలన్నారు. రాష్ట్రంలో సీలింగ్, మిగులు తదితర సాగుకు ఉపయోగపడే భూములను భూమిలేని పేదలకు పంచాలన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, ఖాళీ పోస్టులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరారు. చేతి వృత్తుల సంక్షేమ పథకాల్లో లోపాలను సవరించి, అవినీతిని అరికట్టాలని సీపీఎం నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. -
కాంగ్రెస్‌తోనే కామ్రేడ్లు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ మాత్రమే పొత్తుతో ముందుకు వెళ్లగా, లోక్‌సభ ఎన్నికల వేళ సీపీఎం కూడా జతచేరనుందా? మొత్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పనిచేస్తాయా? పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని నిలువరించడమే ధ్యేయంగా కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు అధికారికంగా పొత్తు కుదుర్చుకోనున్నా యా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో భాగస్వాములైన ఈ మూడు పార్టీలు.. తెలంగాణలోనూ కలసి పనిచేస్తామని అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుందని తెలుస్తోంది. ఇందుకు శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌తో రాష్ట్ర సీపీఎం నేతల భేటీ వేదికయిందనే చర్చ జరుగుతోంది. కలసి పనిచేద్దాం.. సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి తదితరులు కల సిన సందర్భంగా యాధృచ్ఛికంగా ఈ చర్చ వచ్చిన ట్టు తెలుస్తోంది. తమతో కలసి పనిచేయనప్పటికీ.. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకునే క్రమంలో మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటామని, ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సీఎం రేవంత్ సీపీఎం నేతలతో అన్నారని విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పనిచేయనంత మాత్రాన వేర్వేరు కాబోమని, లోక్‌సభ ఎన్నికల సమయంలో పొంచి ఉన్న బీజేపీ ప్రమాదాన్ని ఎదు ర్కొనేందుకు ఐక్యంగా పనిచేద్దామని ముఖ్యమంత్రి వ్యూహాత్మక ప్రతిపాదన చేశారు. ఇందుకు స్పందించిన సీపీఎం నేతలు బీజేపీని ఎదుర్కొనే విషయంలో తమకు వేరే ఆలోచన ఉండబోదని, అయితే కాంగ్రెస్‌తో కలసి పనిచేసే అంశాన్ని పార్టీలో చర్చించి అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినట్టు సమా చారం. అలాగే చేద్దామని, త్వరలోనే మళ్లీ కలసి అన్ని విషయాలు మాట్లాడుకుందామని సీఎం రేవంత్ చెప్పడంతో మరోమారు సమావేశమవు దామని వారు ఈ చర్చను ముగించినట్టు తెలిసింది. సీపీఎం నాయకులు తనను కలసిన సందర్భంగా సీఎం రేవంత్ వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని ప్రస్తావనకు తెచ్చారని తెలుస్తోంది. సీపీఎంతో తెలంగాణలో జట్టుకట్టే విషయంలో కాంగ్రెస్ సిద్ధంగా ఉందనే సంకేతాలను ఆయన ఇచ్చారని, ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఉభయ వామపక్షాల సహకారంతో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అసెంబ్లీలో అడుగిడిన సీపీఐ
అసెంబ్లీలోకి సీపీఐ ఎమ్మెల్యే అడుగిడగా, శాసనసభ ఎన్నికల్లో సీపీఎంకు మాత్రం పరాభావమే మిగిలింది. సీపీఎం 19 స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. ఎంతో ప్రతిష్ట కలిగిన సీపీఎంకు గత అసెంబ్లీలోనూ, ప్రస్తుత అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం దక్కలేదు. పొత్తుల్లో సీపీఐ సక్సెస్ బీఆర్ఎస్తో పొత్తు విఫలం కావడంతో సీపీఐ కాంగ్రెస్‌కు దగ్గరమైంది. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు కాగా, సీపీఎంతో పొత్తు కుదరలేదు. చివరకు సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగగా, సీపీఐ కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. ఆ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 మెజారిటీతో గెలుపొందారు. వాస్తవానికి వామపక్షాలు కలిసి పనిచేయాలని ఎన్నికలకు ముందే నిర్ణయించుకున్నాయి. కానీ పొత్తుల విషయంలో పొసగక ఎవరిదారి వారు చూసుకున్నారు. ఎన్నికల దృష్టితో చూస్తే సీపీఐ వ్యూహం ఫలించదని అంటున్నారు. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓట్లను నిలబెట్టుకోలేకపోయిందన్న ఆరోపణలు వచ్చాయి. సీపీఎంకు ఘోర పరాభవం... తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం ఎక్కడా తన ప్రభావం చూపలేకపోయింది. భద్రాచలం మినహా ఇతరచోట్ల గెలుపోటటములను నిర్దేశించలేకపోయింది. సీపీఎం పోటీ చేసిన 19 స్థానాల్లో 15 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా, మిగిలిన నాలుగు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అంతేకాదు అన్ని స్థానాల్లోనూ సీపీఎం డిపాజిట్లు పొందకపోవడంపై ఆ పార్టీ కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు నియోజకవర్గంలోనూ సత్తా చాటలేకపోయారు. ఆయనకు కేవలం 5,308 ఓట్లు మాత్రమే వచ్చాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి 5,860 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ 5,719 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలుపునకు సీపీఎం అడ్డుపడినట్టుగా హస్తం వర్గాలు అంటున్నాయి. 19 చోట్ల పోటీ చేస్తే సీపీఎంకు వచి్చన మొత్తం ఓట్లు కేవలం 52,349 మాత్రమే కావడం గమనార్హం. -
పార్టీ అభిమానులూ ఓటేయలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీపట్ల అభిమానం ఉన్నవారు కూడా ఓటేయలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం, రాష్ట్ర కమిటీ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎ.విజయ రాఘవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం తనను కలిసిన విలేకర్లతో తమ్మినేని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ అనుసరించిన ఎత్తుగడలు, ఫలితాలపై సమీక్షించామని చెప్పారు. సీపీఎం కుటుంబాలు మినహా పార్టీ అభిమానులు కూడా ఈసారి తమకు ఓటేయకపోవడంతో గతంతో పోలిస్తే సీపీఎం దారుణంగా దెబ్బతిన్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేశామని... ప్రతి ఎన్నికల్లోనూ ఇదే అనుభవం ఎదురైందని చెప్పారు. పార్టీలో లోపాలు జరిగాయని, వాటిని సమీక్షించుకొని భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నామని తమ్మినేని చెప్పారు. పొత్తు సాధ్యం కాక... తాము పోటీ చేసిన 19 స్థానాల్లో గెలుస్తామని భావించకపోయినా ఓట్లు తక్కువ రావడం ప్రధాన లోపంగా పార్టీ గుర్తించిందని తమ్మినేని వివరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు విషయంలో కాలయాపన కావడం, చివరి నిమిషంలో పొత్తు సాధ్యం కాదని తేలాక ఒంటరిగా పోటీ చేయాల్సి రావడం దెబ్బతీసిందని చెప్పారు. ఎన్నికలకు సిద్ధం కావడానికి సమయం సరిపోని పరిస్థితి ఏర్పడిందని వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ అహంభావ, అప్రజాస్వామిక ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారని తమ్మినేని విశ్లేషించారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర, రేవంత్‌రెడ్డి నాయకత్వం, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వంటి పరిణామాలన్నీ కాంగ్రెస్ గెలుపునకు తోడ్పడ్డాయని వివరించారు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓట్లు, సీట్లు రెట్టింపయ్యాయనీ, ఇది ఓ ప్రమాదకర సంకేతమని చెప్పారు. -
కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం
కనీసం ఇతరులన్నా పొందారు సంతోషం -
కరెక్ట్ కాదు.. కామ్రేడ్!
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయంపై సీపీఎంలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోకుండా చివరి నిమిషం వరకు గందరగోళ నిర్ణయాలు తీసుకోవడం... అనంతరం ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు కోల్పోవడంపై ఆ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా బీఆర్ఎస్కు ప్రయోజనం చేకూరేదిగా ఉందన్న ఆరోపణలను రాష్ట్ర అగ్రస్థాయి నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ పోటీ చేసిన 19 నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందని పార్టీ అంతర్గత విచారణలో తేలింది. పార్టీకి చెందిన యువ ఓటర్లు కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లు స్పష్టమైందని అంటున్నారు. అందువల్లే ఎన్నడూలేని స్థాయిలో పార్టీ ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందంటున్నారు. మిర్యాలగూడ, పాలేరు, భద్రాచలం వంటి స్థానాల్లోనూ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేvస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్‌ను గెలిపించేలా క్రాస్ ఓటింగ్ జరిగిందని పార్టీ వర్గాలు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. సీపీఐ మాదిరిగా ఎందుకు వ్యవహరించలేదు? ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పొడవకపోవడంతో కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని సీపీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. చివరకు కాంగ్రెస్‌తోనూ సర్దుబాటు కుదరలేదు. మిర్యాలగూడ కేటాయించి, అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని కాంగ్రెస్ విధించిన షరతును సీపీఎం తోసిపుచ్చింది. దీంతో ఒంటరిగా 19 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఐ కొత్తగూడెం సీటు, రెండు ఎమ్మెల్సీలకు ఒప్పుకొని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని ప్రయోజనం పొందగలిగింది. ఇలా ఎందుకు చేయలేదన్న చర్చ సీపీఎంలో కొందరు నేతలు లేవనెత్తుతున్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి తప్పుడు నిర్ణయాలే? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పార్టీ నాయకత్వం తప్పుడు నిర్ణయాలే తీసుకుంటోందని రాష్ట్రస్థాయి నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో 2014లోనూ సీపీఎం భారీ నష్టాన్ని మూటగట్టుకుంది. 2018 ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను ఏర్పాటు చేసి విఫలమైంది. బీఎల్ఎఫ్ ఏర్పాటు విఫల ప్రయోగమని పార్టీ కేంద్ర కమిటీ చీవాట్లు పెట్టిందని అంటున్నారు. ఇక ఇప్పుడు మూడోసారి కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవడంలో విఫలమై మరోసారి పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని ఒక నాయకుడు విశ్లేvంచారు. ‘పార్టీ సిద్ధాంతం గొప్పది. మార్క్సిజం అజేయమే. కానీ ఆ సిద్ధాంతాన్ని సరిగా అమలుచేయకపోవడం వల్ల ప్రజల్లో సీపీఎం పలుచన అవుతోంది. ఇది కొందరు వ్యక్తులు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే’నని ఆ నాయకుడు అన్నారు. ఆ మూడురోజుల్లో చర్చ పార్టీ ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై ఈ నెల 12వ తేదీన రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం, 13, 14 తేదీల్లో రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీపీఎం నిర్ణయించింది. మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పనిచేసిన వ్యక్తులపై చర్యలు తప్పవని అంటున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా సరైన వ్యూహాన్ని అనుసరించి ఎన్నికలకు వెళ్లాలని సీపీఎం కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
సీపీఎంకు భంగపాటు.. తమ్మినేనికి ఎదురుదెబ్బ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అనేవారు. ఇప్పుడు కంచుకోట కనుమరుగైపోయింది. కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ ఒక సీటు గెలుచుకుంది. ఒంటరిగా బరిలోకి దిగిన సీపీఎం కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి కూడా డిపాజిట్ దక్కలేదు. ఇంత పతనాన్ని సీపీఎం నాయకులు ఊహించలేదా? ఊహించినా నిర్లక్ష్యంగా వ్యవహరించారా? తాజా ఎన్నికలతో కమ్యూనిస్టుల ప్రస్తుత వాస్తవ బలం ఎంతో తెలిసిందా?.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రస్తుతం ఉన్న ప్రజా బలం ఎంతో తేలిపోయింది. సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం సీటు ఒక్కటి తీసుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం సీట్ల బేరం కుదరక ఒంటరిగా బరిలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 స్థానాల్లో పోటీ చేయగా.. కనీసం ఒక్క చోట కూడా డిజాజిట్ దక్కలేదు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సొంత ఊరులో కూడా అతి స్వల్పంగా ఓట్లు రావడం ఆ పార్టీ దయనీయ పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఒకనాడు ఎర్ర జెండాల రెపరెపలతో కళకళలాడిన ఖమ్మం జిల్లాలో సీపీఎంకు ఇంతటి దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమ బలాన్ని అతిగా అంచనా వేసుకుని తమకు సీట్లు ఇవ్వని కాంగ్రెస్‌ను దెబ్బ కొడదామనుకున్నారా? లేక వాస్తవాలు తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో 2014లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలకు చెరో సీటు దక్కింది. గత సభలో రెండు పార్టీలు ఒక్కో స్థానం కూడా పొందలేకపోయాయి. తాజా ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పినా.. ఆచరణలో అలా జరగలేదు. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు పెట్టుకోగా.. సీపీఎం ఒంటరిగా పోటీ చేసింది. పాలేరు నుంచి పోటీ చేసిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు కూడా సీపీఎం ఓటర్లు ఝలక్ ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఎంకు 18 వేల నుంచి 20 వేల ఓట్లు ఉన్నట్లు చెబుతున్నా.. తమ్మినేని కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రాష్ట్రంలో సీపీఎం పరిస్థితిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తమ్మినేని వీరభద్రంకు కేవలం 5వేల 308 ఓట్లు మాత్రమే వచ్చాయి. సొంతూరు తెల్దారపల్లిలో సైతం అతి తక్కువ ఓట్లు రావడంతో తమ్మినేని జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎంకు అన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంకు ఉంది. పాలేరు, మధిర, వైరా, భద్రాచలం నియోజకవర్గాల్లో సీపీఎంకు ఓట్ బ్యాంక్ ఉంది. ఈ నాలుగు స్థానాల్లోనూ గత ఎన్నికల్లో కంటే ఈసారి చాలా తక్కువ ఓట్లు సీపీఎంకు దక్కాయి. ఈసారి మధిర నియోజకవర్గంలో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థికి అత్యధికంగా 6,575 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లు గత ఎన్నికల్లో నాలుగో వంతు మాత్రమే. ఇక అత్యల్పంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్ అభ్యర్థికి 835 మాత్రమే పోలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన 19 సీపీఎం అభ్యర్థులకు కలిపినా మొత్తం 50 వేల ఓట్లు కూడా పోలవ్వలేదు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు మిర్యాలగూడెం అసెంబ్లీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్సీలకు అంగీకరించి ఉంటే గౌరవంగా ఉండేదన్న అభిప్రాయాలు ఇప్పుడు సీపీఎం నాయకత్వంలో వ్యక్తమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోగా.. కనీసం ఆశించిన స్థాయిలో కూడా ఓట్లు రాకపోవడంతో మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసి జరిగిన పొరపాట్లను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకుని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసుకుని మళ్లీ జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవాలని సీపీఎం నాయకత్వం భావిస్తోంది. -
సీపీఎంకు ఎక్కడా డిపాజిట్లు దక్కలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంకు ఘోర పరాభవం మిగిలింది. ఒంటరిగా పోటీచేసిన 19 స్థానాల్లోనూ దాదాపు అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయింది. ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా గౌరవప్రదమైన ఓట్లు పొందలేకపోయారు. ఆయనకు 16వ రౌండ్ వచ్చేసరికి కేవలం 4,354 ఓట్లు వచ్చాయి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3,234 ఓట్లు మాత్రమే వచ్చాయి. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థురాలిగా బరిలోకి దిగిన శిరీష (బర్రెలక్క)కు 5,598 ఓట్లు వచ్చాయి. ఆ స్థాయి ఓట్లు కూడా సీపీఎం అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో ప్రతిష్టకు పోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీపీఎం తాను పోటీచేసిన మొత్తం 16 స్థానాల్లోనూ కలిపి 49,604 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్‌కే పడ్డ సీపీఎం ఓట్లు! పార్టీ కార్యకర్తలు అనేకచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేశారన్న చర్చ జరుగుతోంది. తాము పోటీచేయని చోట కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొనగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ప్రజాతంత్ర లౌకిక శక్తులకు ఓటు వేయాలని మాత్రమే చెప్పారు. ఈ విషయంలో కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య వైరుధ్యం నెలకొందన్న విమర్శలు వచ్చాయి. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 26,568 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీకి దక్కనున్నాయి. సీపీఎం మాత్రం పరాజయం పాలవడమే కాకుండా, తన ఓటు బ్యాంకును కూడా నిలబెట్టుకోలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. -
కాంగ్రెస్‌కు మద్దతుపై ఏచూరి వర్సెస్ తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు విషయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగాం. కాబట్టి మేం పోటీ చేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓటేయ్యాలి’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అలాంటి స్పష్టత ఎక్కడా ఇవ్వడంలేదు. ‘మా పార్టీ పోటీ చేసే 19 నియోజకవర్గాలు మినహా బీజేపీ బలంగా ఉన్నచోట్ల దానిని ఓడించగల పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ, శేర్లింగంపల్లిలో ఎంసీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. మిగిలిన స్థానాలలో ఎవరిని బలపరచాలో పార్టీ జిల్లా కమిటీలు తగు నిర్ణయం తీసుకొని ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక, పోరాట శక్తులకు మద్దతు ఇస్తాయ’ని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. చదవండి: రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో? ఇక్కడ ఏచూరి ప్రకటనకు, తమ్మినేని ప్రకటనకు మధ్య వైరుధ్యం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘ఇండియా’కూటమిలో ఉన్నందున తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఏచూరి స్పష్టం చేయగా, తమ్మినేని మాత్రం అలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీని ఓడించగలిగే పార్టీలకు ఓటు వేయాలని కోరుతున్న తమ్మినేని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయమని ఎందుకు పిలుపునివ్వడంలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. ఏచూరికి సమాచారం ఇవ్వలేదా? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నచోట దాన్ని ఓడించే పార్టీలకు ఓటేయ్యాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీజేపీ బలంగా లేనిచోట ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపైనే కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య భిన్నాభిప్రాయం నెలకొంది.. సీతారాం ఏచూరికి రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని తెలియజేయలేదని తెలిసింది. కాగా, తాము పోటీ చేస్తున్న 19 స్థానాలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: డిసెంబర్ 4న జాబ్ కేలండర్ ఇస్తాం: కేటీఆర్ -
ఒంటరిగా బరిలోకి.. సీపీఎం పోటీతో లాభపడేది! నష్టపోయేది ఎవరు?
ఉమ్మడి నల్గొండ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 2009 వరకు జిల్లాలో ఎర్ర పార్టీలకు ఏదో ఒకచోట ఎమ్మెల్యే ఉండేవారు. కాని తెలంగాణ ఏర్పడిన తర్వాత అసలు అసెంబ్లీలోనే ఉనికి లేకుండా పోయింది. ఒకనాటి ఉద్యమ కేంద్రంలో ఒక్క సీటైనా గెలుచుకోవాలనే ఆరాటం కొనసాగుతోంది. కాని ఈసారి ఒంటరిగా బరిలో దిగిన సీపీఎం ఒక్క సీటైనా గెలుస్తుందన్న నమ్మకం లేదనే టాక్ నడుస్తోంది. అయితే సీపీఎం పోటీతో లాభపడేది ఎవరు? నష్టపోయేది ఎవరు అంటూ చర్చలు సాగుతున్నాయి? జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో ఒకనాడు కమ్యూనిస్టు ఉద్దండులు అసెంబ్లీలో ఉండేవారు. వారిలో ఎక్కువ భాగం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే వచ్చేవారు. రాను రాను కమ్యూనిస్టు పార్టీలు అటు రాష్ట్రంలోను.. ఇటు జిల్లాలోనూ ఉనికి కోసమే పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీపీఎం గట్టి పట్టు ఉండి.. అనేకసార్లు గెలిచిన నకిరేకల్, మిర్యాలగూడ స్థానాలు కూడా గెలవలేని స్థితికి వచ్చారు. 2009లో సింగిల్‌గా మిర్యాలగూడ స్థానాన్ని గెలుచుకున్న సీపీఎం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఓడిపోతూనే వచ్చింది. మూడు సార్లు గెలిచిన జూలకంటి రంగారెడ్డి తాజా ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్రంలో రెండో మూడు సీట్లైనా గెలచుకోవడానికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సీపీఎం చాలా ప్రయత్నించింది. కాని బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఆఖరు నిమిషంలో హ్యాండివ్వడంతో సీపీఎం ఒంటరిపోరుకే సిద్ధపడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉండగా.. ఏడు నియోజకవర్గాల్లో సీపీఎం అభ్యర్థులు బరిలో దిగారు. మిర్యాలగూడ నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పోటీలో ఉంటే.. ఎవరికి నష్టం అనే చర్చ జరుగుతోంది. పార్టీ బలహీనం అయినా ప్రతీ నియోజకవర్గంలో ఆ పార్టీకి కనీసం మూడు వేల ఓట్లయినా ఉంటాయి. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల్లో ఈ ఓట్ల చీలికతో ఏ పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయనే చర్చల్లో.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఆందోళన కలిగిస్తోంది. మిర్యాలగూడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి పదకొండు వేల ఓట్లు పోలయ్యాయి. ఈసారి ఆయన ఎన్ని ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. జూలకంటి రంగారెడ్డి ప్రధానంగా కార్మికులతో పాటు వ్యవసాయ కూలీల ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్నారు. రంగారెడ్డి చీల్చే ఓట్లపైనే మిర్యాలగూడ ఫలితం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: బండి సంజయ్ వర్సెస్ గంగుల కమలాకర్ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరుసార్లు విజయం సాధించారు. ఆతర్వాత నోముల నర్సింహయ్య రెండుసార్లు గెలిచి..తర్వాత గులాబీ పార్టీలో చేరి.. ఒకసారి విజయం సాధించారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ నుంచి వేముల వీరేశం పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచినా మూడు నుంచి ఐదు వేల ఓట్ల మధ్యనే మెజార్టీ ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. దీంతో గెలుపోటములకు సీపీఐఎం అభ్యర్థి చినవెంకులు చీల్చే ఓట్లే కీలకం కానున్నాయి. ఇక నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా నంద్యాల నర్సింహ్మారెడ్డి ఒకసారి గెలిచారు. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పోటీలో నిలుస్తున్నారు. పాత తిప్పర్తి మండలంలో జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ఆయనకు మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా మంచి పరిచయాలే ఉన్నాయి. తిప్పర్తి మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. దీంతో ఆయన ఏమేరకు ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారింది. గతంలో సీపీఎంలో పనిచేసిన నేతలంతా ప్రస్తుతం అధికార పార్టీ చేరిపోయారు. మునుగోడులో సీపీఐకి మంచి పట్టుంది. కానీ మొదటి నుంచి ఇక్కడ సీపీఐ అభ్యర్థికే సీపీఎం మద్దతు ఇస్తూ వస్తోంది. సీపీఐ పలుసార్లు ఇక్కడి నుంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఇక్కడ సీపీఐ పోటీ చేయడంలేదు...కాంగ్రెస్‌తో ఉన్న పొత్తు కారణంగా...హస్తం పార్టీ అభ్యర్ధికే సీపీఐ మద్దతు ఇస్తుంది. అందువల్ల సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తోంది. సీపీఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి బరిలో ఉన్నా ఆయన ప్రభావం అంతంత మాత్రమే అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో నర్సిరెడ్డి చీల్చే ఓట్లు కీలకం కానున్నాయి. ఇక భువనగిరి, హుజూర్ నగర్, కోదాడల్లో ఆ పార్టీ పోటీ చేస్తున్నా అక్కడ సీపీఎంకు చెప్పుకోదగిన బలం లేదు. అయినా మూడు నుంచి ఐదు వేల ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కావడంతో అధికార పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. వర్తమాన రాజకీయాల దృష్ట్యా సీపీఎం లేదా సీపీఐ పార్టీలు ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించే పరిస్థితులు అయితే లేవు. ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటేనే గెలిచే అవకాశాలుంటాయి. అందువల్ల ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీపీఎం అభ్యర్థులకు పడే ఓట్ల వల్ల ఏదో ఒక పార్టీకి లాభం, మరో పార్టీకి నష్టం కలగక తప్పదనే టాక్ నడుస్తోంది. మొత్తంగా సీపీఐఎం బరిలో ఉండటంతో అధికార పార్టీ లాభపడే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. -
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏడు సీట్లలో సీపీఎం పోటీ
-
కామ్రేడ్ శంకరయ్య కన్నుమూత.. నేరుగా ఆస్పత్రికి వెళ్లిన సీఎం స్టాలిన్
శతాధిక స్వాంతంత్య్ర సమరయోఢుడు, తమళనాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత ఎన్.శంకరయ్య(102) బుధవారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎన్. శంకరయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకెళ్లే ముందు అభిమానుల సందర్శనార్థం సీపీఎం కార్యాలయానికి తరలించనున్నారు. ఎన్. శంకరయ్య కన్నుమూత గురించి తెలియజేస్తూ తమిళనాడు సీపీఎం సోషల్ మీడియా ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. కామ్రేడ్ శంకరయ్య భౌతికంగా మనకు దూరమైనా చరిత్ర ఉన్నంత వరకూ ఆయన మనతోనే ఉంటారని పేర్కొంది. స్వాంతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర అత్యంత సీనియర్ నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడిగా పేరొందిన ఎన్.శంకరయ్య భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో చరుకైన పాత్ర పోషించారు. ఎన్నో విద్యార్థి ఉద్యమాలను నడిపించారు. 1995 నుంచి 2002 వరకు సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. తన రాజకీయ ప్రస్థానంలో మధురై వెస్ట్, మధురై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి తమిళనాడు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. தோழர் என்.எஸ். மறைவு! #CPIM மாநிலச் செயலாளர் தோழர் கே.பாலகிருஷ்ணன், தமிழ்நாடு முதல்வர் மு.க.ஸ்டாலின் ஆகியோர் நேரில் அஞ்சலி செலுத்தினர். #ComradeNS #NSankaraiah #FreedomFighter #CommunistLeader #CPIMLeader More: https://t.co/46hnp062DE pic.twitter.com/h8lPadt4Pp — CPIM Tamilnadu (@tncpim) November 15, 2023 -
లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
-
‘సుత్తి’ దెబ్బ ఎవరికి..
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడతో పాటు ఖమ్మం జిల్లాలోని వైరా స్థానం కూడా తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబట్టడం, మిర్యాలగూడ మాత్రమే ఇస్తానని కాంగ్రెస్ చెప్పడంతో సీపీఎం ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పటివరకు రెండు విడతల్లో 19 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పొత్తుపై సీపీఎంతో చర్చలు జరుపుతూనే ఉంది. దీంతో చివరి క్షణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై రెండు పార్టీల కార్యకర్తల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు కుదిరిన నేపథ్యంలో.. సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ జోరుగా సాగుతోంది. అసలు సీపీఎం ఓటింగ్ ఎంత? సీపీఎం పోటీ చేస్తున్న 19 స్థానాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాగా సీపీఎం కారణంగా ఈ జిల్లాల్లో లేదా ఈ స్థానాల్లో తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్లను విశ్లేషిస్తే, సీపీఎం కొన్నిచోట్ల కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. భద్రాచలం, వైరా, మిర్యాలగూడ లాంటి స్థానాల్లో ఓ మాదిరి సంఖ్యలో ఓట్లు పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేయగా, సీపీఎం ఒంటరిగా రాష్ట్ర వ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి మొత్తం 91,099 ఓట్లు మాత్రమే పొంది ఒక్క సీటూ గెలవలేదు. సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేసి 83,215 ఓట్లు సాధించినా ఎక్కడా గెలవలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పొందిన ఓట్ల కన్నా సీపీఐ, సీపీఎం పార్టీలు సాధించిన ఓట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్లకు ఏకంగా 6.73 లక్షల ఓట్లు (3.3 శాతం) వచ్చాయి. అంతేకాదు నోటాకు వచ్చిన స్థాయి లోనూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఓట్లు రాలేదంటే అప్పటి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అప్పట్లో నోటాకు 2.2 లక్షలు అంటే 1.1 శాతం ఓట్లు వచ్చాయి. సీపీఎం రాష్ట్రంలో ఆ ఎన్నికల్లో కేవలం 0.44 శాతం ఓట్లు మాత్రమే పొందింది. అధికంగా భద్రాచలంలో 14,228, వైరాలో 11,373, మిర్యాలగూడలో 11,221, ఇబ్రహీంపట్నంలో 9,106, పాలేరులో 6,769 ఓట్లు వచ్చాయి. అత్యంత తక్కువగా హైదరాబాద్‌లోని నాంపల్లిలో 400 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా అప్పటికీ ఇప్పటికీ సీపీఎం పెద్దగా పుంజుకున్నదేంలేదని, వాస్తవానికి అప్పటికంటే ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంక్ ఇంకా తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీపీఎం పోటీతో ఏ పార్టీకి ప్రయోజనం? 2018లో ఓటింగ్‌ను పరిశీలిస్తే చూస్తే, ఇప్పుడు సీపీఎం బరిలో నిలిచే స్థానాల్లో ఎక్కడా గెలిచే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే పార్టీ విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఆ పార్టీ చెబుతోంది. కాగా ఐదారు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం సీపీఎంకు ఉందని విశ్లేషకులంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటే, ఆయా స్థానాల్లో సీపీఎం పోటీ వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అంటున్నారు. అదే పోటాపోటీగా ఉన్న స్థానాల్లో మాత్రం సీపీఎంకు పడిన ఓట్ల వల్ల ఏదో ఒక పార్టీ నష్టపోయినట్టుగానే పరిగణించాల్సి వస్తుంది. మరోవైపు కొన్నిచోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే ఆ మేరకు కాంగ్రెస్‌కు నష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే, సీపీఎంతో పొత్తుతో కొంత ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయంతోనే.. కాంగ్రెస్ ఇంకా ఆశలు వదులుకోలేదు. మిర్యాలగూడ స్థానంలో అభ్యరి్థని ప్రకటించకుండా అందుకే పెండింగ్‌లో పెట్టిందని చెబుతున్నారు. మరో 3 స్థానాలకు సీపీఎం అభ్యర్థుల ప్రకటన ఇప్పటివరకు 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం, మంగళవారం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కోదాడలో మట్టిపెల్లి సైదులు, మునుగోడులో దోనూరు నర్సిరెడ్డి, ఇల్లెందులో దుగ్గి కృష్ణలను ఖరారు చేసినట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. -బొల్లోజు రవి -
TS: సోనియా ఫోన్ చేసినా పొత్తుకు నో!
సాక్షి, ఖమ్మం : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ పొత్తు కోసం వామపక్ష పార్టీలకు కాంగ్రెస్ ప్రాధాన్యమిస్తోంది. తాజాగా సీపీఐతో పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ సీపీఎంపైనా దృష్టి సారించింది. సీట్ల విషయంలో అలిగి సొంతగా అభ్యర్థులను ప్రకటించిన సీపీఎంతో పొత్తుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏ రేంజ్లో అంటే ఏకంగా ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీయే ఈ విషయమై రంగంలోకి దిగారు. తెలంగాణ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు కోసం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సోమవారం సోనియా గాంధీ ఫోన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎంకు రెండు ఎంఎల్ సీ పదవులు ఇస్తామని సోనియా ఆఫర్ చేశారు. పొత్తుకు సహకరించాలని కోరారు. ఇండియా కూటమి తరహాలోనే తెలంగాణలో కలిసి పని చేద్దాం అని రిక్వెస్ట్ చేశారు. సోనియా ఫోన్ వచ్చిన వెంటనే సీతారాం ఏచూరి, సీపీఎం తెలంగాణ స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రంకు ఫోన్ చేశారు. సోనియా ఫోన్ గురించి చెప్పారు. అయితే రాష్ట్రంలో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తుందని తమ్మినేని ఏచూరికి స్పష్టం చేశారు. మిర్యాలగూడెం, వైరా సీట్లు ఇవ్వకుండా కాంగ్రెస్‌తో చర్చలు లేవని తేల్చి చెప్పారు. పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చినట్టుగా ఒక్క సీటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదనను తెలంగాణ సీపీఎం ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ తీరు సరిగా లేదు..తమ్మినేని కాగా, ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని, రేపు కోదాడ అభ్యర్థిని ప్రకటిస్తామని సీపీఎం స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం సోమవారం ఉదయం తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన 17 సీట్ల తో పాటు మునుగోడు ,ఇల్లందు స్థానాలకు పోటీ చేయాలని ఆలోచన ఉందన్నారు. పొత్తులపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శించారు. జానారెడ్డి, భట్టివిక్రమార్క ఫోన్ చేస్తే ఇదే చెప్పానన్నారు. ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు ఇవ్వకుండా పొత్తు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పొత్తుల కోసం తాము వెంపర్లాడడం లేదని స్పష్టం చేశారు. -
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ కోసం కృషి చేస్తామని సీపీఎం హామీనిచ్చింది. కేరళ తరహాలో రైతు రుణ విమోచన చట్టం రూపొందించాలని అభిప్రాయపడింది. ఈ మేరకు సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరుతూ మేనిఫెస్టోలో పలు అంశాలను జోడించింది. రైతుల పంటలపై 80 శాతం రుణాలు ఇచ్చి గోదాముల సౌకర్యం కల్పించాలని కోరతామని పేర్కొంది.ధరల నిర్ణాయక కమిషన్ ఏర్పాటు చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంటలు సేకరించాలని కోరతామని స్పష్టం చేసింది. కౌలు రైతుల గుర్తింపు, వ్యవసాయ రు ణాలు, సబ్సిడీలు, పంట బీమా, కౌలు, పోడు రైతులందరికీ రూ. 5 లక్షల రైతు బీమా సౌకర్యం కల్పించాలని, ప్రకృతి వైపరీత్యాలు, అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సాగు చేసిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తి డి చేస్తామని సీపీఎం పేర్కొంది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములలో సాగులో వున్న అర్హులైన అందరికీ హక్కు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపింది. 10 ఎకరాల లోపు రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు ఉచితంగా ప్రభుత్వం అందించాలని కోరింది. సీపీఎం ఎన్నికల మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. ♦ ఇళ్లు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఆ ఇళ్ల నిర్మాణానికి రు. 10 లక్షల ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం. ♦ ప్రతి జర్నలిస్టుకు 300 గజాల ఇంటిస్థలం ఉచి తంగా కేటాయించాలి. ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలి. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు రూ.10 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలి. వారి పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి. జర్నలిస్టులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ స్కీంను అమలు చేయాలి. ♦ ప్రభుత్వ భూములను ఆర్హులైన పేదలందరికీ పంపిణీ చేయాలని పోరాడుతాం. ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న, సాగుచేస్తున్న పేదలకు పట్టాల కోసం పోరాటం చేస్తాం. ♦ భూమి లేని వ్యవసాయ కూలీలకు మిగులు భూ మి పంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ♦ కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలకు తగ్గకుండా నిర్ణయించేవరకూ పోరాటం. ♦ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం కృషి చేస్తాం. ♦ అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, ఐకేపీ తదితర స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించేందుకు జరిగే పోరాటాలకు అండగా ఉంటాం. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ అమ లు, హెల్త్ స్కీమ్ పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి. ♦ బీసీ కులాలకు జనగణన చేపట్టాలి. ♦ 250 యూనిట్లలోపు కరెంటు వాడకం ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ♦ నిరుద్యోగులకు రూ. 5 వేల భృతి ఇవ్వాలి. ♦ సింగరేణి కోల్ బ్లాకులను ప్రైవేటుపరం చేయకుండా ఒత్తిడి తెస్తాం. ♦ టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వంపై పోరాడతాం. ♦ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలి. ♦ కాటికాపరుల వృత్తిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఇవ్వాలి. -
సీపీఎం తెలంగాణ అభ్యర్థుల జాబితా విడుదల
-
తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫోన్
సాక్షి, హైదరాబాద్: అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసుకోవాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ నేత జానారెడ్డి ఫోన్ చేశారు. ఇప్పటికే 14 స్థానాల్లో పేర్లు ప్రకటించామని, మరో మూడు స్థానాలు చర్చల్లో ఉన్నాయన్న తమ్మినేని.. కుదరదని తేల్చి చెప్పారు. మిగతా స్థానాలను రెండురోజుల్లో ప్రకటిస్తామని చెప్పిన తమ్మినేని.. కాంగ్రెస్‌తో మాట్లాడటం తప్ప ఎలాంటి నిర్ణయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తుల వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వనికారణంగా ఒంటరి పోరుకు సీపీఎం సిద్ధం కాగా, పొత్తు పెట్టుకుని పోరులో నిలవాలని సీపీఐ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీపీఐకి ఒక చోట పోటీతో పాటు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తాజాగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ అంశంపై సీపీఐ సైతం సుముఖత వ్యక్తం చేసి పొత్తుతో ముందుకు సాగనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు అంశం, సీటు కేటాయింపు పట్ల ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు. చదవండి: ఎన్నికల పోరుకు రెడీ.. అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం -
ఎన్నికల పోరుకు రెడీ.. అభ్యర్థులను ప్రకటించిన సీపీఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తుకు చెక్ పెడుతూ సీపీఎం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తాజాగా 14 మంది అభ్యర్థులతో సీపీఎం జాబితాను తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సీపీఎం షాకిచ్చింది. పొత్తుల విషయంలో హస్తం పార్టీతో తెగదెంపులు చేసుకుని తమ పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో 14 మంది అభ్యర్థులతో సీపీఎం జాబితాను విడుదల చేసింది. మరో స్థానాల్లో కూడా అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. వారి పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామని తమ్మినేని తెలిపారు. మరోవైపు.. తమ్మినేని వీరభద్రంకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేయాలని జానారెడ్డి కోరినట్టు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రకటన వాయిదా కుదరదని తమ్మినేని గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో మాట్లాడం తప్ప ఎలాంటి నిర్ణయం ఉండటంలేదని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అభ్యర్థులు వీరే.. భద్రాచలం- కారం పుల్లయ్య అశ్వారావుపేట- పి. అర్జున్ పాలేరు- తమ్మినేని వీరభద్రం వైరా- భూక్య వీరభద్రం మధిర- పాలడుగు భాస్కర్ ఖమ్మం- శ్రీకాంత్ మిర్యాలగూడ- జూలకంటి రంగారెడ్డి సత్తుపల్లి- భారతి నకిరేకల్- చిన్న వెంకులు పటాన్చెరు- మల్లికార్జున్ ముషీరాబాద్- దశరథ్ జనగామ- కనకారెడ్డి భువనగిరి- నర్సింహ ఇబ్రహీంపట్నం- యాదయ్య. ఇది కూడా చదవండి: రూట్ మార్చిన కేటీఆర్.. గంగవ్వతో నాటుకోడి కూర వండి.. -
ఆ ఒక్కటి చాలు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో వామపక్ష పార్టీల పొత్తుల వ్యవహారం ఇప్పటికీ గందరగోళంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్యంగా పోటీ చేయాలనే ఆలోచనతో కమ్యూనిస్టులు కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీతో మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వనికారణంగా ఒంటరి పోరుకు సీపీఎం సిద్ధం కాగా, పొత్తు పెట్టుకుని పోరులో నిలవాలని సీపీఐ సంప్రదింపుల ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీపీఐకి ఒక చోట పోటీతో పాటు ఒక ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తాజాగా అంగీకరించినట్లు తెలిసింది. ఈ అంశంపై సీపీఐ సైతం సుముఖత వ్యక్తం చేసి పొత్తుతో ముందుకు సాగనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు దాదాపు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు అంశం, సీటు కేటాయింపు పట్ల ఇప్పటికీ అధికారికంగా ప్రకటన చేయలేదు ఎంబీ భవన్లో కామ్రేడ్ల మంతనాలు ఒక చోట పోటీ, ఒక ఎమ్మెల్సీ నిబంధనకు ఆమోదయోగ్యంగా ఉన్నట్లు సీపీఐ నాయకులు చెబుతున్నారు. ఇందులో భా గంగా సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు సీనియర్ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి తదితరులు శనివారం ఎంబీ భవన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనితో పాటు సీనియర్ నేతలతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. సీపీఎం తగ్గేదేలే? ఈ సందర్భంగా సీపీఎంతో కూడా పొత్తును సాగించేందుకు కాంగ్రెస్ పార్టీ సమ్మతి తెలిపిందనే అంశాన్ని సీపీఐ నేతలు ప్రస్తావించారు. అయితే ఇంతకు ముందు అనుకున్న విధంగా రెండు సీట్లలో పోటీ, ఎమ్మెల్సీ అవకాశానికే కట్టుబడి ఉన్నామని, ఒక సీటు, ఒక ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఆమోదించే ప్రసక్తే లేదని సీపీఎం నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్రవ్యాప్తంగా 17కిపైగా స్థానాల్లో సీపీఎం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పేర్లను కూడా ప్రకటించగా.. ఆదివారం నాడు అభ్యర్థుల పేర్లను వెల్లడించనుంది. అదేవిధంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సైతం విడుదల చేస్తామని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. -
కారుకు...నో ఎంట్రీ
రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఐదో పర్యాయం భారత్ రాష్ట్ర సమితి పేరిట శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లోనూ ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఇలా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా నేటికీ కొన్ని సెగ్మెంట్లలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. కొరకరాని కొయ్యలుగా మిగిలిన ఆ సెగ్మెంట్లపై ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించిన బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ఈసారైనా పాగా వేయాలని భావిస్తోంది. నేటికీ గెలుపు తీరాలకు చేరని నియోజకవర్గాలివే.. ఉమ్మడిఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. వీటితో పాటు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పాగా వేయలేకపోయింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీలకు చెందిన అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. వీరిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మినహా మిగతా ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికలో బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగుతున్నారు. ♦ 2004లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల కూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. ♦ 2009లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది ♦ 2014, 2018లో రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆయా చోట్ల ఇలా... 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 17 చోట్ల ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది. మరో 39 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఒక్కసారే గెలుపొందగా, 37 నియోజకవర్గాల్లో రెండేసి పర్యాయాలు విజయం సాధించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు 26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుతీరాలకు చేరారు. 2001 నుంచి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు సిద్దిపేటలో అత్యధికంగా ఎనిమిది పర్యాయాలు, హుజూరాబాద్‌లో ఆరు పర్యాయాలు, వరంగల్ పశ్చిమలో ఐదుసార్లు గెలుపొందారు. పాతబస్తీలో ఎంఐఎంతో దోస్తీ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పాతబస్తీలో పరిమిత సీట్లలో పోటీ చేసినా 2014, 2018 ఎన్నికల్లో మాత్రం అన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే మజ్లిస్ పార్టీతో మిత్రబంధం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో బీఆర్ఎస్ స్నేహపూర్వక పోటీ పేరిట నామమాత్ర పోటీకి పరిమితమవుతోంది. అక్కడ ఈసారీ నామమాత్రపు పోటీనే? ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలతో పాటు ఆ పార్టీ బలంగా ఉన్న మరో రెండు సీట్లు నాంపల్లి, గోషామహల్లో ఈసారి కూడా బీఆర్ఎస్ నామమాత్ర పోటీకీ పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్ పాత బస్తీలోని ఏడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా, వారికి ఇప్పటికీ బీ ఫారాలు ఇవ్వలేదు. మరోవైపు నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ నేటికీ ఖరారు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చిక్కని పట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా బీఆర్ఎస్కు పట్టు చిక్కడం లేదు. 2014లో కొత్తగూడెంలో మాత్రమే పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. పాలేరుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలవడంతో పార్టీ బలం రెండుకు చేరింది. ఆ తర్వాత చేరికల ద్వారా బలపడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నా 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే విజయం సాధ్యమైంది. చేరికల వ్యూహంతో మరోమారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని లోటును పూడ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అయితే చేరికల వ్యూహం వికటించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో చేరికల ద్వారా బలపడేందుకు అనుసరించిన వ్యూహం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. -కల్వల మల్లికార్జున్‌రెడ్డి -
ఒంటరిగానే పోటీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గురువారం ఎంబీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించామని, రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ రెండు స్థానాలేమిటో కాంగ్రెస్ చెప్పలేదన్నారు. కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ పార్టీ వైఖరి వల్లే పొత్తు నుంచి తప్పుకొని ఒంటరిగా పోటీకి నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని తెలిపారు. తొలుత 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఈ సంఖ్య పెరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఐక్య పోటీపై సీపీఐ వైఖరి చెప్పలేదు.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని తమ్మినేని పేర్కొన్నారు. అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని, ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేసినా ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతరులెవరున్నా సీపీఎం మద్దతుగా నిలుస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. 17 స్థానాలు ఇవే... ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ (ఎస్సీ), భువనగిరి, హుజూర్నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ జాబితాలో ముషీరాబాద్ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్ పేరు ఖరారైనట్లు తెలిసింది. -
కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌బై.. 17 స్థానాల్లో ఒంటరి పోరుకు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌బై చెప్పింది. అడిగిన సీట్లు ఇవ్వలేదంటూ ఒంటరి పోరుకు సిద్ధమైంది. 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా పొత్తులు, అభ్యర్థులపై కాంగ్రెస్‌కు సీపీఎం ఇచ్చిన డెడ్‌లైన్ దాటిపోవడంతో పోటీ చేసే స్థానాల జాబితాను ప్రకటించింది. 17 మందితో కూడిన సీపీఎం అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం గురువారం ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, హైదరాబాద్ జిల్లాలో సీపీఎం పోటీ ఉంటుందని తమ్మినేని వెల్లడించారు. భద్రాచలం, అశ్వారావుపేట, పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, భువనగిరి, హూజుర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్‌తో కూడిన జాబితాను విడుదల చేశారు. భద్రాచలంలో 8సార్లు వరుసగా గెలిచామని తమ్మినేని తెలిపారు. పాలేరు, భద్రాచలం సీటు కావాలని తాము పట్టుపడితే కాంగ్రెస్ ఇవ్వలేదని మండిపడ్డారు. భద్రాచలం, సత్తుపల్లి, పాలేరు సిట్టింగ్ కాబట్టి ఇవ్వబోమన్నారని తెలిపారు. వైరా, మిర్యాలగూడ, హైదరాబాద్‌లో ఇస్తామని చెప్పారన్నారు. తాము అడిగిన సీట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చే సీట్లకు చెప్పినా కూడా పొత్తు విషయంలో కాంగ్రెస్ మాట మార్చిందని దుయ్యబట్టారు. తమకు ఇస్తామన్న సీట్లు ఇవ్వలేదని మండిపడ్డారు. చర్చల సమయంలో ఎన్నో మెట్లు దిగి మాట్లాడామని, ఇంత అవమానకరంగా పొత్తులకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌తో కలిసి ఉండాలా విడిపోవాలా అన్నది సీపీఐ ఇష్టమని తమ్మినేని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ సీపీఐకి రెండు టికెట్లు ఇస్తే.. అక్కడ పోటీ పెట్టబోమని తెలిపారు. సీపీఐ నిలబడే స్థానాల్లో వారకే సీపీఎం మద్దతిస్తుందన్నారు. మిత్రుత్వంతో చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు ఉండాలన్న ఆయన.. పొత్తు కుదరకపోవడానికి కాంగ్రెస్సే కారణమని విమర్శించారు. చదవండి: చెన్నూరు నుంచి వివేక్..ఎంపీగా కొడుకు పోటీ! కమ్యూనిస్టుల ప్రాధాన్యతను నిలబెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడిగా ప్రకటించడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. నిన్న భట్టి ఫోన్ చేసి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం వరకు ఎదురుచూశామని, అనివార్య పరిస్థితుల్లో విడిగా వెళ్లడానికే నిర్ణయంచుకున్నామని తెలిపారు. బీజేపీని ఓడించడానికి బీఆర్ఎస్ను కూడా సపోర్టు చేస్తామన్నారు. అసెంబ్లీలో పేదల గొంతు వినిపించాలంటే సీపీఎంను గెలిపించాలని, కమ్యూనిష్టులు లేని శాసన సభలు దేవుడి లేని దేవాలయాలుగా ఉంటాయన్నారు. ‘పొత్తు అవసరం లేదని కాంగ్రెస్ అనుకుంటుంది. పొత్తుల బ్రేకప్ మేము కోరుకుంది కాదు. ఏమెల్సీలు, మంత్రి పదవులు తీసుకోవడం సీపీఎం పార్టీ విధానం కాదు. సీపీఎం ఆనాడే ప్రధాని పదవిని సూత్రప్రాయంగా వదిలివేశాము. దాదాపు 24 సీట్లకు ప్రతిపాదనలు వచ్చాయి. కార్యవర్గంలో చర్చించి మరో రెండు మూడు సీట్లు ప్రకటిస్తాం. ఈ ప్రకటించిన సీట్లలో మార్పులు జరిగే అవకశాలున్నాయి. కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదరకపోతే మార్పులు ఉంటాయి. అభ్యర్థులను రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం. బీజేపీ గెలుపుకు అవకాశం ఉన్న ప్రతీ సీటును ఓడించడం మా లక్ష్యం. బీజేపీ ఓడిపోయే సీట్లలో ఎవరు ఓడించే వారైతే వాళ్లకు ఓటు వేస్తాం. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా’ అని తమ్మినేని పేర్కొన్నారు. -
అయితే వెయిటింగ్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీతో మంగళవారం కటీఫ్ ప్రకటించిన సీపీఎం బుధవారం ఒక అడుగు వెనక్కు వేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు భట్టి విక్రమార్క ఫోన్ చేసి విన్నవించడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఆ సమయంలోగా పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వకుంటే, వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తేల్చిచెప్పింది. సోనియా అనారోగ్యంతో చర్చలు జరగలేదట తమ్మినేని వీరభద్రం గత ఆదివారం కాంగ్రెస్‌కు రెండ్రోజుల గడువు విధించారు. గడువు ముగిసినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరి పోరుకే వెళ్లాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది మీడియాలో ప్రచారం కావడంతో భట్టి విక్రమార్క తమ్మినేని వీరభద్రానికి ఫోన్ చేసి వేచి చూడమన్నారు. తమ పార్టీ అధిష్టానం పొత్తు విషయంపై చర్చిస్తుందని చెప్పారు. దీంతో తాము మరోసారి గడువు విధించినట్లు సీపీఎం తెలిపింది. బుధవారం జరిగిన ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ అనారోగ్యం రీత్యా వారితో సమావేశం జరగలేదని భట్టి చెప్పారని గురువారం ఉదయానికి కబురు చెప్తామని అన్నారని వెల్లడించారు. అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నట్టు భట్టి తెలిపారన్నారు. సీపీఐ, సీపీఎంలు కలిసే ఉంటాయి సీపీఐతో తాము గురువారం ఉదయం మాట్లాడతామని తమ్మినేని తెలిపారు. వైరా, మిర్యాలగూడ కేటాయించకపోతే తాము ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంచనాలు, సీపీఐ నిర్ణయాలపై తాము వ్యాఖ్యానించబోమన్నారు. అఖిల భారత స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాల మేరకే పొత్తులుంటాయే కానీ, ఎవరి పంచనో చేరడానికి కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎంలు కలిసే ఉంటాయని, ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరిపోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు. అయితే సీపీఐ అభ్యర్థులున్న స్థానాల్లో మాత్రం తాము పోటీ చేయబోమని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ప్రకటించే వరకు సీపీఐ ఎదురుచూపు... మరోవైపు సీపీఐ కూడా బుధవారం రాష్ట్ర సమితి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, తమతో భట్టి విక్రమార్క ఫోన్లో మాట్లాడారని తెలిపారు. పొత్తుల విషయంపై సానుకూల నిర్ణ యం ఉంటుందని చెప్పారని వివరించారు. కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించే వరకు వేచి చూసిన తర్వాతే తమ పార్టీ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించకపోయినా తాము పాటిస్తామన్నారు. సీపీఎం వైఖరిపై తామేమీ నిర్ణయం తీసుకోలేదన్నారు. కాంగ్రెస్‌తో అవగాహనలో భాగంగా సీపీఐకి రెండు స్థానాలు ఇస్తామని పేర్కొందనీ, అందులో మార్పులు చేర్పులు ఉంటే తరువాత ఆలోచన చేస్తామన్నారు. పొత్తు కుదిరినా ఆ స్థానాలు ఇస్తారా? కాగా, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం కూడా లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది. నేతల తీరుపై రెండు పార్టీల్లో గరంగరం... ఇదిలావుండగా, రెండు పార్టీల రాష్ట్ర సమావేశాల్లో నాయకుల తీరుపై కొందరు పార్టీ సభ్యులు తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. పొత్తులపై ఇదేం పాకులాట అంటూ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకు పాకులాడడంపై ప్రజల్లో పలుచన అయిపోతున్నామని, ఇది పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని కొందరు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నిలదీసినట్లు తెలిసింది. 2 స్థానాల్లో పోటీ అనడంతో వాటిపైనే దృష్టిపెట్టామని, ఇప్పుడు పొత్తు లేదని, 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్న ద్ధం కాగలమని సీపీఎం శ్రేణులు ప్రశ్నించినట్లు సమాచారం. సీపీఎం పోటీ చేయాలనుకుంటున్న స్థానాలివే కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే సీపీఎం సింగిల్‌గానే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏయే స్థానాల్లో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గంలో బలం ఉందనే వివరాలను బుధవారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో సేకరించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 నుంచి 20 స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, పాలేరు, వైరా, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వారావుపేటతోపాటు ఇల్లందులో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, సూర్యాపేటతో పాటు మరో స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నంతోపాటు మరోస్థానం, హైదరాబాద్‌లో ముషీరాబాద్, కార్వాన్ స్థానాలతోపాటు సంగారెడ్డి, పటాన్ చెరు బరిలో ఉండాలని సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ సహా మరో రెండు స్థానాల్లో పోటీకి దిగాలని నిర్ణయించినట్టు సమాచారం. -
కాంగ్రెస్, వామపక్షాల మధ్య తెగని పొత్తు పంచాయితీ
-
కాంగ్రెస్–సీపీఎం పొత్తు చిత్తు!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు బెడిసికొట్టింది. మిర్యాలగూడ, వైరా స్థానాలు తమకు కేటాయించేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విధించిన రెండు రోజుల గడువు ముగిసినా కాంగ్రెస్ నుంచి స్పందన రాకపోవడంతో ఒంటరి పోరుకే వెళ్లాలని ఆ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. మంగళవారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో 10 స్థానాల్లో పోటీకి సిద్ధపడాలన్న కీలక నిర్ణయానికి వచ్చింది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో కలిపి 9 స్థానాల్లో పోటీ చేయాలని, ఇబ్రహీంపట్నంలోనూ బరిలో ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. బుధవారం జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో మరో ఐదు స్థానాలను గుర్తించి మొత్తం 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు బెడిసికొట్టగా తెలంగాణలోనూ తమతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధంగా లేనట్లు ఢిల్లీ నుంచి సంకేతాలు అందిన నేపథ్యంలోనే ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. ఐదు నుంచి రెండు సీట్లకు తగ్గినా... మునుగోడు ఉపఎన్నికలో తమతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్... ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధపడటంతో కాంగ్రెస్‌తో జత కట్టాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించుకున్నాయి. అందుకు కాంగ్రెస్ కూడా సముఖత వ్యక్తం చేసింది. మొదట్లో సీపీఐ, సీపీఎం చెరో ఐదు స్థానాలు కాంగ్రెస్‌ను కోరగా ఆ తర్వాత జరిగిన చర్చల్లో మూడు చొప్పున సీట్లు ఇవ్వాలని అడిగాయి. చివరకు ఆ సంఖ్య రెండేసి స్థానాల వద్దకు చేరుకుంది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు అడగ్గా సీపీఎం మిర్యాలగూడతోపాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను కోరింది. కానీ కాంగ్రెస్ మాత్రం వారు కోరిన స్థానాల్లో మార్పులు చేసింది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా ఇస్తామని ప్రతిపాదించినట్లు లెఫ్ట్ వర్గాలు తెలిపాయి. చివరకు సీపీఎంకు వైరా స్థానం కేటాయించే విషయంలో కాంగ్రెస్ పేచీ పెట్టింది. ఆ స్థానం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది. దీంతో మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తేనే పొత్తు ఉంటుందని సీపీఎం తేల్చిచెప్పింది. సీపీఐ దారెటు? సీపీఐతో పొత్తు విషయంలో కాంగ్రెస్ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఆ పార్టీకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగినా ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయకపోవడంపై సీపీఐ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఒంటరి పోరుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయించగా సీపీఐ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాంగ్రెస్‌తో ఎలాగైనా కలిసి ముందుకు సాగాల్సిందేనని, అసెంబ్లీలో అడుగు పెట్టాల్సిందేనని సీపీఐకి చెందిన ఒక కీలక నేత పట్టుబడుతున్నట్లు సమాచారం. ‘లెఫ్ట్’ఉమ్మడి పోరు యోచన... ఒకవేళ సీపీఐతోనూ కాంగ్రెస్ పొత్తు కుదరకుంటే లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ మేరకు లెఫ్ట్ పార్టీల ఉమ్మడి సమావేశం నేడు లేదా రేపు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సీపీఐ రా్ర‹Ù్టర సమితి సైతం బుధవారం సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. ఒకవేళ లెఫ్ట్ పార్టీలు ఉమ్మడి పోరుకు దిగితే దాదాపు 30 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆయా పార్టీల వర్గాలు చెబుతున్నాయి. -
లోక్‌సభ ఎన్నికల కోసమే ‘ఇండియా’ కూటమి
న్యూఢిల్లీ: 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, కలిసికట్టుగా పోటీ చేయడానికి విపక్షాలతో ‘ఇండియా’ కూటమి ఏర్పాటైందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం చెప్పారు. ప్రస్తుత ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూటమి పక్షాలు పరస్పరం అవగాహనతో పని చేయాలని సూచించారు. రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో తమ పార్టీ అభ్యర్థుల జాబితాకు కేంద్ర కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపామని, తెలంగాణ విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. జాతీయ స్థాయిలోనే కాదు, రాష్ట్రాల స్థాయిలోనూ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. -
మిర్యాలగూడ, వైరా ఇస్తేనే పొత్తు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘మిర్యాలగూడతో పాటు వైరా సీటు ఇస్తే ఓకే.. ఈ రెండు స్థానాలు ఇవ్వకపోతే పొత్తు కుదరదు. రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తేల్చకపోతే మేము విడిగా వెళ్తాం’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం హైదరాబా ద్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశం, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటాయని, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరవుతారని తెలిపా రు. ఈ సమావేశాల్లోపు కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రాకుంటే తాము విడిగా పోటీ చేయడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. బాల్ కాంగ్రెస్ కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించారు. చిత్తశుద్ధి లేకనే ఇలా చేస్తున్నారు.. కాంగ్రెస్‌తో పొత్తు కోసం జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలుమార్లు చర్చలు జరిగాయని, తొలు త భద్రాచలం, పాలేరు, మిర్యాలగూ డెం, ఇబ్రహీంపట్నం, వైరా స్థానాలను అడిగామని తమ్మినేని తెలిపారు. భద్రా చలం సిట్టింగ్ స్థానం ఇవ్వడం కుదరద ని చెప్పారని, ఒక దశలో పాలేరు ఇస్తా మని చెప్పి.. తర్వాత వారి అభ్యర్థిని ప్రకటించారని అన్నారు. ఒక్కో మెట్టు దిగి భద్రాచలం, పాలేరు వదులుకున్నామని, చివ రకువారు ప్రతిపాదించిన వైరా, మిర్యాలగూడ సీట్ల కు అంగీకరించామని వివరించారు. మళ్లీ ఇప్పుడు వైరా స్థానం ఇస్తామని చెప్పలేదంటూ ఆ పార్టీకి చెందిన ఒక నేత మాట్లాడారని విమర్శించారు. ప్రస్తుతం మిర్యాలగూడతో పాటు హైదరాబాద్ నగరంలో ఒక సీటు ఇస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నా రని తమ్మినేని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎంతో పొత్తుపై చిత్తశుద్ధి లేకనే అలా మాట్లాడుతున్నా రని, ఇది సరైంది కాదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, అది మద్దతిచ్చే పార్టీ గెలవొద్దనే విషయంలో తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ముందుకొస్తే సంతోషమని వ్యా ఖ్యానించారు. తాజా పరిణామాలను సీపీఐ నేతల కు కూడా తెలియజేశామని చెప్పారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ తో సీపీఎం పొత్తుపై కొనసాగుతున్న సస్పెన్స్
-
కాంగ్రెస్ తో వామపక్ష పార్టీల పొత్తులపై వీడని చిక్కుముడి
-
అగ్రవర్ణాలకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15న ప్రకటించిన 55 స్థానాలకు తోడు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరో 45 స్థానాలను క్లియర్ చేయడంతో ఇప్పటివరకు మొత్తం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. రెండో విడత జాబితాలో అగ్రవర్ణాలకు చెందిన నేతలకు పెద్ద పీట వేయగా, బీసీలకు 8 స్థానాలను, ఎస్సీ, ఎస్టీలకు 8, మైనార్టీలకు ఒక స్థానాన్ని కేటాయించింది. ఇక ఓసీల్లో రెడ్డి సామాజిక వర్గానికి 21, వెలమలకు 2, బ్రాహ్మణులకు 1, కమ్మ సామాజిక వర్గానికి మూడు టికెట్లను కేటాయించింది. ప్యారాచూట్లకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చినట్లు సీట్ల కేటాయింపు స్పష్టం చేస్తోంది. గతంలో చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, వివిధ కారణాలతో వేరే పార్టీల్లోకి వెళ్లి ఇటీవలే తిరిగి సొంతగూటికి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి (భువనగిరి)లకు టికెట్లు కేటాయించారు. అలాగే ఇటీవలే పార్టీలోకి వచ్చిన బి.మనోహర్‌రెడ్డి (తాండూరు), శ్యాంనాయక్ (ఖానాపూర్), కంది శ్రీనివాస్‌రెడ్డి (ఆదిలాబాద్), యశస్వినిరెడ్డి (పాలకుర్తి), రేవూరి ప్రకాశ్‌రెడ్డి (పరకాల), తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం), పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (పాలేరు), కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), బండి రమేష్ (కూకట్పల్లి), జగదీశ్వర్‌గౌడ్ (శేరిలింగంపల్లి), నారాయణరావు పాటిల్(బోథ్), వొడితల ప్రణవ్ (హుజూరాబాద్), కస్తూరి నరేందర్ (రాజేంద్రనగర్), విజయారెడ్డి (ఖైరతాబాద్), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మురళీ నాయక్ (మహబూబాబాద్), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కె.ఆర్.నాగరాజు (వర్ధన్నపేట)లకు అవకాశ మిచ్చారు. బల్మూరి, విష్ణుకు మొండిచేయి అనుబంధ సంఘాల అధ్యక్షులు శివసేనారెడ్డి (వనపర్తి), బల్మూరి వెంకట్ (హుజూరాబాద్)లకు పార్టీ అధిష్టానం మొండిచేయి చూపింది. మాజీ మంత్రి పీజేఆర్ కుటుంబానికి ఒక టికెట్‌తోనే సరిపెట్టింది. జూబ్లీహిల్స్ టికెట్‌ను పీజేఆర్ తనయుడు విష్ణు ఆశించినా అక్కడ మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను ఎంపిక చేసింది. ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డికి అవకాశమిచ్చింది. వరంగల్ జిల్లాలో కొండా దంపతులిద్దరికీ టికెట్ వస్తుందని భావించినా వరంగల్ తూర్పులో సురేఖకే అవకాశం ఇచ్చింది. బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో పార్టీలో చేరిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ ఖరారు చేసింది. ఇక ఖానాపూర్‌లో కొమురం భీం మనుమడు ఎడ్మ బొజ్జుకు, నారాయణపేటలో చిట్టెం కుటుంబానికి చెందిన డాక్టర్ పర్ణికారెడ్డి, పాలకుర్తిలో ప్రవాసాంధ్రురాలు హనుమాండ్ల ఝాన్సీ కోడలు యశశ్వినిరెడ్డి (ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో పిన్నవయసు్కరాలు (26))లకు అవకాశం కల్పించింది. పెండింగ్‌లో ఉన్న స్థానాలివే.. మిర్యాలగూడ, వైరా (సీపీఎంకు కేటాయించే అవకాశం), చెన్నూరు, కొత్తగూడెం (సీపీఐకి కేటాయించినట్లు సమాచారం), పటాన్చెరు, అశ్వారావుపేట, తుంగతుర్తి, సూర్యాపేట, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, చార్మినార్, బాన్సువాడ, జుక్కల్, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సామాజిక వర్గాల వారీగా ఇలా.. ఎస్సీలు–15 (మాదిగ–9, మాల–6) ఎస్టీలు–8 (ఆదివాసీలు–5, లంబాడీ–3) బీసీలు–20, మైనార్టీలు–4, ఓసీలు–53 (రెడ్డి–38, వెలమ–9, బ్రాహ్మణ–3, కమ్మ–3) బీసీలకు 20 సీట్లే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండు జాబితాల్లో కలిపి మొత్తం 20 స్థానాలే వెనుకబడిన వర్గాలకు చెందిన నేతలకు దక్కాయి. మొదటి జాబితాలో 12 మందికి ఇవ్వగా, ఈసారి 8 మందికి అవకాశం కల్పించారు. తాజాగా ప్రకటించిన లిస్టులో 3 గౌడ, 2 ముదిరాజ్, పద్మశాలి, ఆరె మరాఠి, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. మధుయాాష్కీ, పొన్నం ప్రభాకర్, జగదీశ్వర్ (గౌడ) కస్తూరి నరేందర్, వాకిటి శ్రీహరి (ముదిరాజ్), కొండా సురేఖ (పద్మశాలి, భర్త మున్నూరు కాపు), నారాయణరావు పాటిల్ ( ఆరె మరాఠి), పూజల హరికృష్ణ (మున్నూరు కాపు)లకు టికెట్లు ఖరారయ్యాయి. కాగా ప్రకటించిన 100 సీట్లలో 20 శాతమే బీసీలకు కేటాయించి 53 శాతం ఓసీ వర్గాలకు కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీలకు కేటా యించిన 20 సీట్లలో యాదవ–4, గౌడ –3, మున్నూరుకాపు–3, ముదిరాజ్–3, పద్మశాలి, ఆరె మరాఠి, వాల్మికి, మేరు, వంజర, చాకలి, బొందిలి కులాలకు ఒక్కొక్కటి దక్కాయి. -
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య తెగని సీట్ల పంచాయితీ..!
-
సీట్ సిక్ట్సీ ..చేరుకోని కాంగ్రెస్
మ్యాజిక్ ఫిగర్... అధికారం దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలకు అవసరమైన కీలక సంఖ్య ఇది. మొత్తం స్థానాల్లో సగం కంటే ఒకటి ఎక్కువ స్థానాల్లో గెలుపొందిన పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాజిక్ సంఖ్య విషయంలోనే కాంగ్రెస్ పార్టీ ఫికర్ అవుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరమవుతాయి. ఈ 60 స్థానాల మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు ఎన్నికల్లోనూ సాధించలేదు. ఇంకోమాట చెప్పాలంటే 1985 నుంచీ ఈ 60 స్థానాలు ఆ పార్టీకి దక్కలేదు. అయితే 1985 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలోని అసెంబ్లీ సీట్లు 107 మాత్రమే. ఈ లెక్కన ఆ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల్లో ఒకట్రెండు సార్లు మ్యాజిక్ ఫిగర్ వచ్చింది ఇక, తెలంగాణ ఏర్పాటయిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో అయితే ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు ఆమడదూరంలో నిలబడింది. 2014లో 21, 2018లో 19 స్థానాలకు మాత్రమే పరిమితమయింది. ఇప్పుడు ఆ సంఖ్య నుంచి ఏకంగా 60 స్థానాలకు ఎగబాకడం ఏ మేరకు సాధ్యమనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గతమంతా కటువుగా.. గతాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రయాణం ఒడిదుడుకుల మధ్యనే సాగుతున్నట్టు అర్థమవుతుంది. కొన్ని ఎన్నికల్లో బాగానే సీట్లు సాధించినా, మరికొన్ని ఎన్నికల్లో చతికిలబడి పోవడం, ఆ తర్వాతి ఎన్నికల్లో కొంత పుంజుకోవడం రివాజుగా కనిపిస్తుంది. 1983లో ఎన్టీరామారావు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక నాదెండ్ల భాస్కరరావు రూపంలో జరిగిన తిరుగుబాటు కారణంగా అసెంబ్లీ రద్దయి 1985లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 107 స్థానాల్లో గెలిచింది కేవలం 14 మాత్రమే. అంతకుముందు 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 43 చోట్ల గెలుపొందింది. రెండేళ్లలోనే 29 స్థానాలు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో సీపీఐ8, సీపీఎం7, బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం విశేషం. ఇక, 1989లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో బాగా మెరుగుపడింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో 107 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 58 సీట్లు వచ్చాయి. అప్పుడున్న మొత్తం స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలోనూ వచ్చింది. 1985లో 14 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 89లో ఏకంగా 44 సీట్లను అదనంగా సాధించింది. 1994 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం ముందు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఈ ఎన్నికల్లో 107 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 6 మాత్రమే. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి సొంతంగా 69 చోట్లా, సీపీఐకి 13, సీపీఎంకు 8 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో తెలంగాణలో 42 సీట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతం కంటే మెరుగైన ఫలితాలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సాధించింది. ఇక, 2004లో మహానేత డాక్టర్ వైఎస్సార్ పాదయాత్ర ప్రభావం తెలంగాణలోనూ స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 185 సీట్లు సాధిస్తే, అందులో తెలంగాణలో 48 ఉన్నాయి. అప్పుడు ఉన్న 107 స్థానాల్లో కూడా ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఆ తర్వాత జరిగిన 2009 ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంది. గత ఎన్నికల కంటే రెండు ఎక్కువగా అంటే 50 చోట్ల ఆ పార్టీ విజయం సాధించింది. కానీ, అప్పుడున్న మొత్తం 119 అసెంబ్లీ స్థానాలతో పోలిస్తే మ్యాజిక్ ఫిగర్ మాత్రం రాలేదు. ఈ ఫలితాలను బట్టి ఉత్థాన పతనాల పరిణామాల అనంతరం ఈసారైనా కాంగ్రెస్ నిలదొక్కుకుంటుందా? గత రికార్డులను బద్దలు కొట్టి 119 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ అయిన 60 చోట్ల గెలుపొందుతుందా అనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. కానీ, పైకి మాత్రం ధీమాగానే కనిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఏం జరుగుతుందో డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిందే. 1985కు ముందు జరిగిన ఎన్నికల ఫలితాలిలా.. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన సమయంలో తెలంగాణలో 107 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం హవా కనిపించింది. కానీ, తెలంగాణలో మాత్రం తెలుగుదేశంతో సమానంగా కాంగ్రెస్ పార్టీ 43 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. అక్కడ మొత్తం 187 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది 17 మాత్రమే. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాల్లో విజయం సాధించింది. అందులో తెలంగాణలోని 107 సీట్లలో 65 స్థానాల్లో గెలుపొందింది. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 78 స్థానాలు వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 219 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం మీద ఇండిపెండెంట్లు 57 మంది గెలుపొందారు. 1967 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కానీ, అప్పుడు ఇండిపెండెంట్లు తమ హవా చూపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 165 సీట్లు వస్తే అందులో తెలంగాణలో 64 ఉన్నాయి. 101 స్థానాలను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఇండిపెండెంట్ల హవా కొనసాగింది. మొత్తం 287 స్థానాలకు గాను 68 చోట్ల స్వతంత్రులే గెలుపొందారు. తెలంగాణలో వీరి సంఖ్య 26 కావడం గమనార్హం. 1962లోనూ కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. తెలంగాణలోనూ 64 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో సీపీఐకి 18 స్థానాలు వచ్చాయి. ఇండిపెండెంట్లు 19 మంది గెలిచారు.ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ 51 స్థానాల్లో గెలుపొందింది. కానీ, తర్వాతి రెండు ఎన్నికల్లోనూ సీపీఐకి గణనీయంగా సీట్లు తగ్గడంతో చాలా మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు సందర్భం కావడంతో 1955లో ఆంధ్రప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారినే 1962 వరకు కొనసాగించారు. కానీ, తెలంగాణలో మాత్రం 1957లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 68 చోట్ల గెలుపొందగా, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) తరఫున పోటీ చేసిన కమ్యూనిస్టులు 22 చోట్ల గెలిచారు. ఈ ఎన్నికల్లోనూ 10 మంది ఇండిపెండెంట్లు గెలుపొందడం విశేషం. - మేకల కల్యాణ్ చక్రవర్తి -
జేడీఎస్ అధినేత దేవెగౌడ వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి ఆగ్రహం
తిరువనంతపురం: బీజేపీతో పొత్తు విషయంలో ఇటీవల మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. కర్ణాటకలో బీజేపీతో పొత్తుకు కేరళ సీఎం ఒప్పుకున్నట్లు ఇటీవల హెచ్డీ దేవెగౌడ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై విజయన్ మాట్లాడుతూ.. దేవెగౌడ ప్రకటన పూర్తి అవాస్తవమని, అసంబద్దమని పేర్కొన్నారు. రాజకీయ స్వలాభం కోసం అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కాగా కేరళలో పినరయి విజయన్ పార్టీ సీపీఎంతో పొత్తు కొనసాగిస్తున్న జేడీఎస్.. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జీడీఎస్ కేరళ యూనిట్ కూడా అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టింది. అయితే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా జేడీఎస్ రాష్ట్ర యూనిట్లన్నీ బీజేపీతో పొత్తుకు సమ్మతించాయని దేవెగౌడ గురువారం ప్రకటించారు. కేరళ యూనిట్ కూడా సమ్మతించింది ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వంలో తాము భాగమేనని పేర్కొన్నారు. అక్కడ తమ పార్టీ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాల జేడీఎస్ విభాగాలు అర్థంచేసుకొని మద్దతిచ్చాయని తెలిపారు. కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వంలోని తమ మంత్రి కే కృష్ణన్‌కుట్టి కూడా తన సమ్మతిని తెలియజేశారని పేర్కొన్నారు.పార్టీని కాపాడుకునేందుకు కర్ణాటకలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పూర్తి సమ్మతి తెలిపారని దేవెగౌడ పేర్కొన్నారు. కుమారస్వామిని సీఎం చేసేందుకే.. ఈ వ్యాఖ్యలను తాజాగా పినరయి విజయన్ ఖండించారు. జేడీఎస్ అధినేత చేసిన ప్రకటన అవాస్తమని పేర్కొన్నారు. కేవలం తన రాజకీయ పరిణామాలను సమర్థించుకునేందుకు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అంతేగాక తన కుమారుడు కుమారస్వామికి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టేందుకు దేవెగౌడ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని దీని ద్వారా తన పార్టీ సిద్ధాంతాలకు వెన్నుపోటు పోడిచారని ఆరోపించారు. చదవండి: టీనేజర్లు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు మేం జోక్యం చేసుకోం కేరళలో సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు(ఎల్డీఎఫ్) జెడీఎస్ చాలా కాలంగా మిత్రపక్షంగా ఉందని పినరయి విజయన్ పేర్కొన్నారు. జాతీయ నాయకత్వ నిర్ణయాన్ని విబేధించి ఎల్డీఎఫ్కు తమ నిబద్ధతను కొనసాగిస్తున్నట్లు జేడీఎస్ రాష్ట్ర నాయకత్వం ప్రకటించడంపై ప్రశంసలు కురిపించారు. జేడీఎస్ అంతర్గత వ్యవహారాల్లో తాను కానీ, సీపీఎం కానీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అది తమ పద్దతి కాదని తెలిపారు. కేరళలో వామపక్ష పార్టీతోనే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యే కె కృష్ణన్‌కుట్టి.. దేవెగౌడ ప్రకటనను శుక్రవారం ఖండించారు. తాను కేరళ జీడీఎస్ అధ్యక్షుడు మాథ్యూ టీ థామస్ కలిసి దేవెగౌడను కలిశామని, బీజేపీలో చేరడంపై తమ అభ్యంతరం తెలియజేశామని చెప్పారు. కేరళలో వామపక్ష పార్టీతోనే(సీపీఎం) కలిసి ఉండాలని రాష్ట్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. -
సర్దుకుపోదాం..!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో వామపక్షాలు సర్దుకుపోయే ధోరణిలో ఉన్నట్టు కన్పి స్తున్నాయి. రెండేసి చొప్పున అసెంబ్లీ స్థానాలకు ఒప్పుకున్న సీపీఐ, సీపీఎంల్లో తాము పోటీ చేసే స్థానాల విషయంలో మాత్రం కొంత గందరగోళం నెలకొని ఉంది. కొత్తగూడెం, మునుగోడు స్థానా లను సీపీఐ కోరగా, కాంగ్రెస్ కొత్తగూడెం, చెన్నూ రు స్థానాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ తమకు మునుగోడే కావాలని ఇప్పటివరకు పట్టు బడుతున్న సీపీఐ తాజాగా కాస్త మెత్తబడుతున్నట్టు తెలిసింది. అవకాశం ఉంటే మునుగోడు ఇవ్వాలని, లేనిపక్షంలో చెన్నూరు బరిలో దిగుతామంటూ సంకేతాలు ఇస్తున్నట్టు సమాచారం. ఇక సీపీఎం మిర్యా లగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానా లు ఇవ్వాలని కోరింది. అయితే భద్రాచలంలో ఇప్ప టికే తమ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.. మిర్యాల గూడ స్థానానికి మాత్రం సరే అంది. కానీ పాలేరు విషయంలోనే ఎటూ తేలడం లేదని సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. పాలేరు సీటు ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. దీంతో ఇంకో సీటు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదో ఒక సీటు ఇవ్వాల్సిందేనని సీపీఎం పట్టుబడుతుండటంతో అనూహ్యంగా ఇప్పుడు ఆ జిల్లాలోని వైరా రిజర్వుడు స్థానం తెరపైకి వచ్చింది. వైరా నియో జకవర్గంలో సీపీఎంకు మంచి పట్టుంది. కాబట్టి పాలేరు సాధ్యం కాకుంటే వైరాను అడగాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కానీ వైరాలో కాంగ్రెస్ అభ్యర్థినే బరిలో దింపాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పట్టదలతో ఉన్నట్టు తెలిసింది. దీంతో వైరా కూడా ఎంతవరకు ముడిపడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వామపక్షాల అసహనం! కాంగ్రెస్‌తో పొత్తు ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవ డంతో సీపీఐ, సీపీఎం నేతల్లో అసహనం వ్యక్తం అవుతోంది. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినా ఇంకా పని చేసుకోండంటూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని సీపీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ సీట్లపై కూడా అను మానాలున్నాయా అనే సందేహాలు ఆ పార్టీ కార్య కర్తల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీపీఎంకు మిర్యాలగూడ ఖరారు చేసినా.. ఆ సీటు విషయంలోనూ పూర్తిగా భరోసా ఇవ్వలేదని ఆ పార్టీ చెబుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఎక్కడ పోటీలో ఉంటామో స్పష్టత లేకపోవడంతో వామపక్షాల నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రచారానికి తగిన సమయం ఉండదని అంటున్నాయి. అంతేకాదు పొత్తులపై తమ కేడర్‌కు ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నా మని చెబుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపోతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. బీఎల్ఎఫ్ రెండో జాబితా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాను గురువారం ఆ పార్టీ విడుదల చేసింది. 16 మంది అభ్యర్థులను బీఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకా‹శ్ ప్రకటించారు. ఇల్లెందు బరిలో గుమ్మడి అనురాధ గతంలో ఇల్లెందు నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య కుమార్తె గుమ్మడి అనురాధ ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. అనురాధ ఉస్మానియా లా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. తనకు న్యూడెమొక్రసీ, ప్రజాపంథా సహా పలు సీపీఐ (ఎంఎల్) పార్టీల మద్దతు ఉన్నట్లు ఆమె చెబుతున్నారు. అయితే బలమైన తండ్రి వారస త్వం ఆమెకు కొంత అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఇక్కడ తీరువేరు వార్ వేరు
రెండు ఎన్నికల్లోనూ .. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, ఇల్లెందు, పాలేరు, మధిర స్థానాలను గెలుచుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పినపాక, వైరా, అశ్వారావుపేట స్థానాలను దక్కించుకోగా,భద్రాచలంలో సీపీఎం గెలుపొందింది. అప్పుడే ఏర్పడిన కొత్త రాష్ట్రంలో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముగ్గురు విజయం సాధించడం విశేషం. ఇక సత్తుపల్లిలో టీడీపీ, కొత్తగూడెంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత 2016లో జరిగిన ఉప ఎన్నికలో పాలేరు నుంచి టీఆర్ఎస్ గెలుపొందింది. ఇక 2018 ఎన్నికల్లో మధిర, పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, భద్రాచలం స్థానాలను కాంగ్రెస్, సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలను టీడీపీ దక్కించుకోగా.. వైరాలో ఇండిపెండెంట్ అభ్యరి్థ, ఖమ్మంలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇలా రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలిచింది. అయితే 2018 ఎన్నికల తర్వాత పరిణామాలతో పాలేరు, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తెలంగాణ ఏర్పడ్డాక మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు హోరాహోరీ పోరు కొనసాగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. ఇక గత రెండు ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్.. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు చేరడం, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్, సహకార సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో బలం పెంచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో సీట్ల సంఖ్య పెంచుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఉమ్మడి జిల్లాపై గులాబీ బాస్, సీఎం కేసీఆర్ ప్రత్యేక నజర్ పెట్టి ఇక్కడ సభలు కూడా ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని ఆ పార్టీ నాయకత్వం ధీమాగా ఉంది. జలగం హవా సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి ఇక్కడ ఎక్కువకాలం జలగం కుటుంబం ఆధిపత్యం చెలాయించింది. 1957లో జలగం కొండల్రావు, 1962, 1967,1972లో వేంసూరు నియోజకవర్గం నుంచి జలగం వెంగళరావు విజయ బావుటా ఎగురవేశారు. అనంతరం 1978లో వేంసూరు కాస్తా సత్తుపల్లి నియోజకవర్గంగా ఏర్పడడంతో వెంగళరావు గెలుపొందారు. ఆయన కాసు, పీవీ మంత్రివర్గాల్లో పనిచేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం లోక్‌సభ నుంచి ఎన్నికై కేంద్రమంత్రిగానూ పనిచేశారు. ఆయన సోదరుడు కొండల్రావు సైతం ఎంపీగా ఎన్నికయ్యారు. జలగం వెంగళరావు పెద్ద కుమారుడు ప్రసాదరావు సత్తుపల్లిలో రెండుసార్లు గెలిచి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వెంగళరావు చిన్న కుమారుడు వెంకట్రావు 2004లో కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో టీఆర్ఎస్లో చేరి కొత్తగూడెం నుంచి పోటీచేసి గెలిచారు. 40 ఏళ్ల తర్వాత... గత నలభై ఏళ్లుగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే ప్రతీసారి విపక్షంలోనే ఉంటూ వచ్చారు. ఈ సంప్రదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తిరగరాశారు. 1978లో కాంగ్రెస్ తరఫున కీసర అనంతరెడ్డి గెలుపొందగా.. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వర్టీ ది. నలభై ఏళ్ల తర్వాత మళ్లీ 2018లో ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున పువ్వాడ అజయ్‌కుమార్ విజయం సాధించగా.. రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టగా, ఆయనకు మంత్రి పదవి దక్కింది. కమ్యూనిస్టుల కోటకు బీటలు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్నా క్రమంగా బీటలు వారుతూ వర్టీ ది. గత రెండు ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉమ్మడి జిల్లాలో ప్రభావం చూపలేదు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుతో సీపీఎం భద్రాచలం సీటును గెలుచుకుంది. గతమెంతో ఘనం అన్నట్లు ఇప్పుడు ఉభయ కమ్యూనిస్టులు ఇతర పార్టీ లతో పొత్తు కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సత్తా చాటిన తుమ్మల ఇక సత్తుపల్లి రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు కొత్త ఒరవడి సృష్టించారు. 1983లో తెలుగుదేశం తరఫున ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 1985, 1994, 1999 ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి,2009లో ఖమ్మం నుంచి గెలిచారు. 2014 ఎన్నికల్లో ఖమ్మంలో ఓటమి పాలయ్యారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆÆŠḥఎస్ తరఫున గెలిచినా, 2018 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఓటమి పాలయ్యారు. తుమ్మల ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ కేబినెట్లో పనిచేశారు. శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్లు భిన్నమైన తీర్పును ఇస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లో రాష్ట్రమంతా బీఆర్ఎస్ విజయం సాధించి పాలనాపగ్గాలు చేపట్టినా ఇక్కడ మాత్రం ఒకటీ రెండు సీట్లకే పరిమితమైంది. ఇక ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బలమైన ఓటు బ్యాంక్ కలిగి ఉండగా.. గతంలో సత్తా చాటిన కమ్యూనిస్టులు ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయారు. -
1,000 నుంచి 5,000 ఓట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వామపక్షాలు ఎన్నికల రణరంగంలో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. అయితే పొత్తు, సీట్ల వ్యవహారంపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఒప్పందం జరగలేదని సీపీఐ చెపుతోంది. కాగా, రాష్ట్రంలో తాము అనేక అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలమని, ఇది కాంగ్రెస్‌కు కలసి వస్తుందని సీపీఐ, సీపీఎం నేతలు చెబుతున్నారు. తమ ఓట్లతో బీఆర్ఎస్, బీజేపీలను మట్టికరిపించవచ్చనీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగలదని లెఫ్ట్ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాము గెలిచే స్థితిలో లేకపోయినా, మిత్రులను గెలిపించడంలోనూ, శత్రువులను ఓడించడంలోనూ కీలకంగా ఉంటామని చెబుతున్నారు. దీంతో వామపక్షాలతో పొత్తు కాంగ్రెస్‌కు కీలకంగా మారనుంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అధికంగా ఓట్లు : రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 30 స్థానాల్లో అంటే నాలుగోవంతు సెగ్మెంట్లలో తాము పెద్ద ఎత్తున ప్రభావితం చేయగలమని సీపీఐ, సీపీఎంలు చెబుతున్నాయి. 30 స్థానాల్లో ఉభయ కమ్యూనిస్టు పారీ్టలకు వెయ్యి నుంచి 5 వేల మధ్య ఓట్లు ఉంటాయని సీపీఎం నేత ఒకరు పేర్కొన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో అధిక స్థానాల్లో ఓట్లు ఉన్నాయంటున్నారు. ఇక 100 నుంచి వెయ్యి వరకు ఓట్లున్న స్థానాలు 60 వరకు ఉంటాయని చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంలో అప్పుడు సీపీఎం తరఫున పోటీ చేసిన జూలకంటి రంగారెడ్డికి 11 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. భద్రాచలంలో కూడా సీపీఎం నుంచి పోటీ చేసిన మిడియం బాబూరావుకు 14 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. సీపీఐకి కూడా కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు ఉన్నాయి. ఈ స్థాయి ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని, గెలుపు అవకాశాలను నిర్ణయిస్తాయని లెఫ్ట్ నేతలు అంటున్నారు. పొత్తు కుదిరిన పక్షంలో రాష్ట్రంలో తాము పోటీ చేసే స్థానాలతోపాటు, గణనీయంగా ఓట్లున్న 30 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల కోసం కృషి చేస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే లెక్కలతో వామపక్షాలతో పొత్తుకు సిద్ధమవుతోందని చర్చా సాగుతోంది. -
పాలేరు కోసం సీపీఎం.. మునుగోడు కోసం సీపీఐ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, వామపక్షాల పొత్తు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయా పార్టీల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్లపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాలు ఇప్పటికీ సీట్లపై కసరత్తు చేస్తూనే ఉన్నాయి. సీపీఐ, సీపీఎంలకు చెరి రెండేసి అసెంబ్లీ స్థానాలు, చెరో ఎమ్మెల్సీ ఇచ్చేలా అంగీకారం కుదిరింది. సీపీఐ కొత్తగూడెం, మునుగోడు కోరుతుండగా, సీపీఎం మాత్రం మిర్యాలగూడతో పాటు భద్రాచలం లేదా పాలేరు స్థానాలను ప్రతిపాదించింది. సీపీఐకి కొత్తగూడెం స్థానం ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్, మునుగోడుకు బదులు చెన్నూరు స్థానాన్ని ఇస్తామని తేల్చి చెప్పింది. అయితే చెన్నూరు తమకు వద్దని, మునుగోడు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతోంది. ఒకటి మీరడిగేది.. రెండు మేమిచ్చేది తీసుకోండి కాంగ్రెస్ మాత్రం ‘మీరడుగుతున్న రెండు స్థానాల్లో ఒకటి మీరు కోరుకున్న సీటు ఇస్తాం. మరోటి మేం ఇచ్చే సీటు తీసుకోవాలని’చెబుతోంది. దీంతో సీపీఐ కంగుతింది. ఇక సీపీఎం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే సూత్రాన్ని అమలు చేయనుంది. దీంతో కాంగ్రెస్ చెప్పిన ఏదో ఒక స్థానంలో పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకు ఇచ్చేందుకు అంగీకరించిన కాంగ్రెస్, మరో స్థానం విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడంలేదు. పాలేరు నుంచి పొంగులేటి? పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్‌లో రాష్ట్రస్థాయిలో ప్రముఖులుగా ఉన్నారు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మలకు ఖమ్మం స్థానాలు ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానాన్ని సీపీఎంకు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ స్థానంలో సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్నారు. ఆ స్థానం ఇవ్వకుంటే పొత్తుకు సీపీఎం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. విచిత్రమేంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఎం కోరే సీట్లన్నీ కీలకమైనవే. గతంలో మధిర స్థానాన్ని కూడా సీపీఎం ప్రతిపాదించింది. ఆ స్థానంలో భట్టి విక్రమార్క అనేకసార్లు విజయం సాధించారు. ఇలా కాంగ్రెస్‌కు పట్టున్న స్థానాలను సీపీఎం కోరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఏదిఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కోర్టులో లెఫ్ట్ సీట్ల వ్యవహారం ఉంది. పొత్తు అంశం త్వరగా కొలిక్కి రావాలని కామ్రేడ్లు వేచి చూస్తున్నారు. భద్రాచలం ఇచ్చినా బాగుండేదంటున్న సీపీఎం... సీపీఎం మాత్రం పాలేరు లేదా భద్రాచలం కోరింది. అయితే భద్రాచలంలో తమ అభ్యర్థిని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఎలా ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దీంతో ఇప్పుడు పాలేరు స్థానంపై సీపీఎం పట్టుబడుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపించడంలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మూడు మాత్రమే జనరల్ స్థానాలు ఉండగా, మిగిలినవన్నీ రిజర్వుడు స్థానాలు. ఈ నేపథ్యంలో జనరల్ స్థానాల్లో కొత్తగూడెంను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరో రెండు జనరల్ స్థానాలే మిగిలాయి. వాటిల్లో సీపీఎంకు పాలేరు ఇస్తే జనరల్ స్థానం ఖమ్మం ఒకటే మిగులుతుంది. కానీ ఆ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలకమైన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావులకు టికెట్ ఇవ్వాల్సి ఉంది. -
రాజస్తాన్‌లో స్వింగ్ ఎటు ?
రాజస్తాన్‌లో ప్రజలు వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటంతో చెరో అయిదేళ్లు అధికారాన్ని పంచుకుంటున్నాయి. పార్టీ విజయాల్లో స్వింగ్ స్థానాలే కింగ్ మేకర్స్‌గా మారి అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ స్వింగ్ స్థానాల్లో ఏ పార్టీకి ఎలా ఉంది ? ఈ సారి ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారు ? రాజస్తాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 166 నియోజకవర్గాల్లో ఓటరు నాడి పట్టుకోవడం కష్టంగా మారింది. ప్రతీసారి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పార్టీని మార్చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌పై బీజేపీ తన పట్టు ప్రదర్శిస్తోంది. ప్రజల రాజకీయ ప్రాధాన్యాలేంటో తలపండిన రాజకీయ నాయకులకి కూడా అంతుపట్టడం లేదు. 2008లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించినా 2018లో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ స్వింగ్ స్థానాలు మాత్రం రాజస్తాన్ రాజకీయాల్లో వైల్డ్ కార్డులుగా మారాయి. 2018లో స్వింగ్ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలు కూడా తమ ఉనికిని చాటాయి. ఎవరి ఊహకు అందని విధంగా 12 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తే, బీఎస్పీ రెండు స్థానాలు, సీపీఎం ఒక్క స్థానాన్ని దక్కించుకున్నాయి. స్వింగ్ ఎందుకు కింగ్ ? స్వింగ్ స్థానాల్లో ఓటరు ఒక్కోసారి ఒక్కో రకంగా తీర్పు ఇస్తూ ఉండడంతో ఆ నియోజకవర్గాలపై దృష్టి పెట్టడం రాజకీయపార్టీలకు అనివార్యంగా మారింది. ఎన్నికల వ్యూహాలన్నీ ఆ స్థానాల ప్రాధాన్యాలకనుగుణంగానే రచిస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూహాలు రచించడం అత్యంత కీలకంగా మారింది. ఈ స్థానాల్లో వచ్చే ఫలితాలే రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతుంటాయి. 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే భారతీయ జనతా పార్టీ 28 నియోజకవర్గాల్లో వరుసగా నెగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అయిదు స్థానాల్లో వరుసగా విజయం సాధిస్తూ వచ్చింది. 2008లో స్వింగ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీగా నిలిస్తే 2013 ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిగా తన పట్టు బిగించింది. ఇంచుమించుగా క్లీన్ స్వీప్ చేసింది. గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ మళ్లీ పుంజుకున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు అధికంగా విజయం సాధించడం చూస్తుంటే ఓటర్లు స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ ఈ సారి ఈ స్వింగ్ స్థానాల్లో పట్టు బిగించి కింగ్‌లా మారాలని తహతహలాడుతున్నాయి. ఎలక్షన్ బీట్... అదొక ఫ్యామిలీ పోలింగ్ బూత్ భోపాల్: మధ్యప్రదేశ్‌లో అతి చిన్న పోలింగ్ కేంద్రం అది. ఆ పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్య కేవలం 44. వారంతా రక్తసంబం«దీకులు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే ఆ గ్రామాన్ని కాపాడుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసింది.మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బాలాఘట్ జిల్లాలోని సోనెవాని గ్రామానికి 55 కి.మీ. ట్రెక్కింగ్ చేసి వెళ్లాలి. ఇప్పటివరకు ఎన్నికలు జరిగినప్పుడు సోనెవాని గ్రామంలో నివసిస్తున్న ఆ పెద్ద కుటుంబంలోని 44 మంది కొండలు, గుట్టలు, నదులు దాటుకొని 20 కి.మీ. దూరంలో నవేగావ్ గ్రామానికి నడుచుకుంటూ వెళ్లి ఓటు వేసేవారు. ఈ ఏడాది ఎన్నికల సంఘం ఆ గ్రామంలో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్న ఒక పాఠశాలని పోలింగ్ కేంద్రంగా మార్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ స్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఓటు వేయడానికి ఇకపై ప్రయాస పడనక్కర్లేదని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు చెప్పారు. కౌంటింగ్ తేదీని మార్చాలి అయిజ్వాల్: మిజోరంలో ఓట్ల లెక్కింపుని డిసెంబర్ 3కి బదులుగా మరో రోజు నిర్వహించాలని క్రిస్టియన్లు అధికంగా ఉండే మిజోరం రాష్ట్రానికి చెందిన వివిధ రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. డిసెంబర్ 3 ఆదివారం క్రిస్టియన్లకు పరమ పవిత్రమైన దినమని చర్చిలో ప్రార్థనలకు వెళ్లాలి కాబట్టి కౌంటింగ్ తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, అధికార ఎంఎన్ఎఫ్ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాయి. రాష్ట్రంలో ప్రధాన చర్చిలు కూటమితో పాటు జోరమ్ పీపుల్ మూవ్మెంట్, పీపుల్స్ కాన్ఫరెన్స్‌లు కూడా తేదీని మార్చాలని డిమాండ్ చేశాయి. ఆ రోజంతా చర్చిలో సేవలు చేయడంలో ప్రజలందరూ నిమగ్నమై ఉంటారని కౌంటింగ్ తేదీని మార్చాలని కోరుతున్నాయి. మిజోరంలో 87% మంది క్రిస్టియన్లే ఉన్నారు. మిజోరంతో పాటు తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు కౌంటింగ్ తేదీని డిసెంబర్3గా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని రెండు గిరిజన గ్రామాలు ఎన్నికల బహిష్కరణ రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కోబ్రా జిల్లాలో రెండు గిరిజన గ్రామాలు ఈ సారి ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించాయి. ఇప్పటికీ గ్రామాల్లో కనీస సదుపాయాలు కరువయ్యాయని గ్రామస్థులు వాపోతున్నారు. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదని, విద్యుత్ సదుపాయం లేక అంధకారంలో మగ్గిపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న సర్థియా, బగ్ధారిదంద్ గ్రామాల్లో ప్రజలు తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించకపోతే ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్ని బహిష్కరించాలంటూ పాంప్లెంట్లు పంచుతూ, బ్యానర్లు కట్టారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహిస్తుండగా రామ్‌పూర్‌లో తొలివిడత నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. 12వ తరగతి వరకు ఉచిత విద్య మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రియాంక హామీ మాండ్లా: మధ్యప్రదేశ్‌లో విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తామని, స్కూలు పిల్లలకు అలవెన్స్‌లు కూడా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఆదివాసీ ప్రాంతంలో ఉన్న మాండ్లా జిల్లాలో గురువారం ఎన్నికల ర్యాలీలో ప్రియాంక పాల్గొన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే పఢో–పఢావో పథకం కింద 12వ తరగతి వరకు ఉచిత విద్యతో పాటు 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకి నెలకి రూ.500, 9–10 తరగతి విద్యార్థులకి నెలకి వెయ్యి రూపాయలు, 11, 12 తరగతి విద్యార్థులకి నెలకి రూ.1500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రియాంక గాంధీ పునరుద్ఘాటించారు. ఆదివాసీలు, ఇతర వెనుక బడిన వర్గాల వారికి జనాభాలో తమ నిష్పత్తి ఆధారంగా ఉద్యోగాలు రావడం లేదన్నారు. అందుకే కులగణన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ‘‘బిహార్‌లో ఇటీవల రాష్ట్రంలో కులగణన నిర్వహిస్తే జనాభాలో 84% ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఉన్నారని తేలింది. కానీ ఉద్యోగాలు చేస్తున్న వారి లో వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదు’’ అని ప్రియాంక అన్నారు. బీజేపీలోకి మిజోరం స్పీకర్ ! అయిజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) కు షాక్ తగిలింది. పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర స్పీకర్ లాల్ ర్నిలియానా సైలో పార్టీకి గుడ్ బై కొట్టేశారు. పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో సైలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతుందని చెప్పారు. మిజోరం అధికార పక్షమైన ఎంఎన్‌ఎఫ్‌కి ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు గుడ్ బై కొట్టేశారు. స్పీకర్ కూడా రాజీనామా చేయడంతో పార్టీని వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి బీజేపీ పెద్దలతో కొన్ని డిమాండ్లు చేశానని, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు వారు అంగీకరించారని సైలో వెల్లడించారు. ఎన్నికల్లో ఫేస్బుక్, గూగుల్ తటస్థంగా వ్యవహరించాలి న్యూఢిల్లీ: దేశంలో ప్రజల మధ్య మతపరమైన విద్వేషాలకు సోషల్ మీడియా వేదికలు కారణమవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేర్కొంది. రాబోయే ఎన్నికల్లో ఫేస్బుక్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాలు తటస్థంగా వ్యవహరించాలని కోరింది. పక్షపాత ధోరణి సరైంది కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి తాజాగా లేఖలు రాసింది. ఇండియాలో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటివి అధికార బీజేపీకి, ప్రధాని మోదీ అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, పక్షపాతం ప్రదర్శిస్తున్నాయని వాషింగ్టన్ పోస్టు పత్రికలో కథనం వెలువడింది. ఈ నేపథ్యంలోనే ‘ఇండియా’ కూటమి జుకర్‌బర్గ్, సుందర్ పిచాయ్‌కి లేఖలు రాసింది. ఈ లేఖలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో షేర్ చేశారు. -
తేలని పొత్తులు.. కామ్రేడ్లతో కాంగ్రెస్ సర్దుబాటుపై సందిగ్ధం..
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎన్నికల కదన రంగంలో కలిసి నడుస్తామని ఆయా పార్టీల అగ్రనాయకులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీట్లపైనే పేచీ ఈ ఏడాది ఆరంభంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో అంటీముంటనట్టుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీకి ధీటుగా బదులిస్తున్న భారత రాష్ట్ర సమితితోనే ఎన్నికల్లో కలిసి నడుస్తామని నేరుగా ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇటు సీపీఐ, అటు సీపీఎం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కీలక సీట్ల కోసం పట్టుబట్టాయి. ముఖ్యంగా కొత్తగూడెం, వైరా సీట్లను సీసీఐ.. పాలేరు, భద్రాచలం సీట్లను సీపీఎం కోరాయి. ఈ అంశంపై నాలుగైదు దఫాలుగా ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్షంగా దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తు ప్రస్థావన అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్‌తో కలిసి.. ఎన్నికల పొత్తుపై మాట వరుసకై నా చెప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం కమ్యూనిస్టు పార్టీలకు మింగుడు పడలేదు. దీంతో అనివార్యంగా కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందించాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కమ్యూనిస్టు నేతలు ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపారు. పై స్థాయిలో చర్చలు జరుగుతుండటంతో పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్థానిక హస్తం నేతలు ప్రకటించారు. అయితే పొత్తులపై ఎంతకీ స్పష్టత రావడం లేదు. మరోవైపు రోజులు గడుస్తున్న కొద్దీ ఆశావహులు సైతం తమ వంతు ప్రయత్నంగా టికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఏకై క జనరల్ స్థానంగా ఉన్న కొత్తగూడెం నుంచి హస్తం పార్టీ తరఫున పోటీ ఎక్కువగా ఉంది. కొత్తగూడెంపై పట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో జాతీయ స్థాయిలో పార్టీ పరంగా మంతనాలు సాగిస్తున్నారు. కొత్తగూడెంలో సీపీఐకి గతంలో ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటూ పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన ఉంటే కొత్తగూడెం నుంచి సీపీఐ బరిలో ఉండాల్సిందేనని ఖరాఖండీగా చెబుతున్నారు. దీంతో కూనంనేని పట్టుదల కాంగ్రెస్ నేతల్లో కలవరపాటు కలిగిస్తోంది. టికెట్‌పై ఆశతో.. కొత్తగూడెం సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తాను పోటీ చేయబోయే స్థానాన్ని పార్టీ పెద్దలు నిర్ణయిస్తారంటూ పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు బీసీ వర్గాల నుంచి ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణ ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు నాగ సీతారామలు సైతం గడపగడపకూ తిరుగుతూనే ఢిల్లీ–కొత్తగూడెం మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఇలా నేతలంతా పోటీ కోసం రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. హస్తం ఉండాల్సిందే కొత్తగూడెం సీటును కమ్యూనిస్టులకు కేటాయించారంటూ జోరుగా ప్రచారం జరగడం కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో ఎవరికి వారు తమ గాడ్ఫాదర్లకు ఫోన్లు చేసి పొత్తుల చిక్కులపై వాకబు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు పొత్తు కారణంగా అన్యాయం జరగకుండా చూడాలంటూ విన్నవించుకున్నారు. పొత్తు విషయంలో ముందుగానే ఓ స్పష్టత ఇస్తే బాగుండేదని, ఎంతకీ తేల్చక పోవడం వల్ల తాము ఈ సీటుపై నమ్మకం పెట్టకుని పని చేస్తున్నామని టికెట్ ఆశిస్తున్న నేతలు అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ హై కమాండ్‌కు ఎదురు సమాధానం చెబితే అసలుకే ఎసరు వస్తుందనే భయం కూడా లేకపోలేదు. దీంతో నేరుగా నేతలు బటయకు రాకుండా తమ అనుచరులు, మద్దతుదారులతో ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో ఉంటుందంటూ ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఉండాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
సీపీఐ, సీపీఎంతో సీట్ల పంపకంపై టీ.కాంగ్రెస్ కీలక నిర్ణయం
-
ఉమ్మడిగా వామపక్షాల పోటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశాన్ని తేల్చేందుకు వచ్చే నెల ఒకటో తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, హేమంత్ కుమార్ తదితరులు ఈ భేటీలో పాల్గన్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. బీజేపీకి సహకరించేలా సీఎం కేసీఆర్ ఆలోచనలు: తమ్మినేని వీరభద్రం కేంద్రంలో బీజేపీకి సహకరించే విధంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా కొత్త ఫ్రంట్ తెరిచారని విమర్శించారు. కమ్యూనిస్టు పారీ్టలు బీజేపీ ఓటమి కోసమే పనిచేస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని, ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా పోటీచేస్తూ.. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తోందని ఆరోపించారు. మహిళలను ఉద్ధరించే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని, ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లు తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రాలేదు: కూనంనేని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చించలేదని, అయితే ఆ పార్టీతో పొత్తు వద్దనే ఆలోచన తమకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని.. సీట్ల పంపకంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మజ్లిస్‌తో కేసీఆర్‌కు మొదటి నుంచీ సఖ్యత ఉందని.. సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో మజ్లిస్, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీ ఆరితేరిందన్నారు. రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించ డం ఏమిటని నిలదీశారు. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చే కుట్ర ఇది అని మండిపడ్డారు. -
లెఫ్ట్ పార్టీలకు ఏమైంది?
-
హోం గార్డులను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలి: సీపీఐ నేతలు
-
పొత్తు సరే.. సీట్ల మాటేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తుకు మార్గం దాదాపుగా సుగమమైంది. మునుగోడులో వామపక్షాలతో జతగట్టినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకే బీఆర్ఎస్ మొగ్గుచూపింది. బీఆర్ఎస్తో బ్రేకప్ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేశాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతో జరిపిన సంప్రదింపులు దాదాపు సక్సెస్ అయినట్లేననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఏఐసీసీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో వామపక్షాలు సైతం భాగస్వాములుగా ఉండడంతో రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై సానుకూలతకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అయితే తమకు కేటాయించే సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈ విషయంలో మరింత ముందుకెళ్లాలనే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొత్తు, సీట్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. చెరో ఐదు సీట్లు ఇవ్వండి పొత్తుకు కాంగ్రెస్ ప్రాథమికంగా సమ్మతించినప్పటికీ సీట్ల విషయాన్ని తేల్చలేదు. అయితే సీపీఐ, సీపీఎంలు చెరో ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ వద్ద ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. సీపీఐ నేత నారాయణ తాము ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నట్లు సమాచారం. అయితే తాము అత్యంత బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను కేటాయించడాన్ని కాంగ్రెస్ కొంత ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. సీపీఎం సైతం ఐదు సీట్లలో పోటీ చేస్తామంటోంది. భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు, ఈ మేరకు ఠాక్రేతో ఫోన్లో సీపీఎం నేతలు మాట్లాడినట్లు తెలిసింది. కాగా సీట్ల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే చర్చలు కొనసాగించాలని వామపక్ష పార్టీలు నిర్ణయానికి వచ్చాయని సమాచారం. కాంగ్రెస్ తర్జనభర్జన! వామపక్ష పార్టీల ప్రతిపాదనల నేపథ్యంలో.. వారికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయిలో నాయకత్వం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాల వారీగా కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
చెరొక్కటి మాత్రమే..!
-
30న సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో ఈ నెల 30వ తేదీన మొదటి జాబితా విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం సమావేశమైంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల తరఫున చెరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు 30న సీపీఐ, సీపీఎం సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశ ముంది. వామపక్షాలతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ పార్టీ తేల్చిచెప్పడంతో ఈ రెండుపార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో సీపీఐ నేతలు ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఠాక్రే సీపీఎంతో కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే సరే సరే, లేకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎవరితో పొత్తు లేకపోతే రెండు పార్టీలు కలిసి దాదాపు 20 నుంచి 24 మధ్య అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, సీపీఎం రాష్ట్ర కమిటీలో బీఆర్ఎస్ తీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్తో పార్టీ వ్యవహరించినతీరుపై కూడా కొందరు నాయకులు విమర్శించినట్లు సమాచారం. బీఆర్ఎస్ తీరును ముందే ఎందుకు అర్థం చేసుకోలేకపోయామని నిలదీసినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది. -
కాంగ్రెస్ వైపు కామ్రేడ్ల చూపు
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించే సత్తా ఉన్న ఆ పార్టీతో జత కట్టాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు వికటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. పైగా దేశంలో ‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ స్వయంగా ఆహా్వనిస్తేనే ముందుకు సాగాలని, అప్పటివరకు వేచి చూడాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. పొత్తుల విషయంలో ప్రజల్లో పలుచన కాకుండా హుందాగా ముందుకు సాగాలన్నది కమ్యూనిస్టుల అభిప్రాయం. బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని నిర్ణయం దేశంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ ఓటమే లక్ష్యంగా లెఫ్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. మతోన్మాదం పెరుగుతున్నందున, బీజేపీకి అడ్డుకట్ట వేసే పార్టీలు ఏవైనా సరే వాటితో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఆ ప్రకారమే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటున్నాయి. గతేడాది మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేసే శక్తి బీఆర్ఎస్కే ఉందని భావించి ఆ పార్టీతో సీపీఐ, సీపీఎంలు జతకట్టాయి. అప్పుడు వాటి ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మంలో జరిగిన సభలోనూ సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డి.రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం పాల్గొని తమ ఐక్యత చాటారు. కానీ కేసీఆర్ తమను మోసం చేశారని కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తుకు బ్రేక్ పడడంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే అధికారం ఖాయం. కాబట్టి మీరు మావైపు రండి. మీరు అడిగినన్ని సీట్లు ఇస్తామని’గతంలో కాంగ్రెస్ నేతలు లెఫ్ట్ నేతలతో అన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని లెఫ్ట్ పార్టీలు పెడచెవిన పెట్టాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూడాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోకుంటే.. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని, దీనివల్ల అధికార పార్టీకి ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. ఏదిఏమైనా ఈసారి బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టాలని లెఫ్ట్ పార్టీలు యోచిస్తున్నాయి. ఇప్పుడు రెండే ప్రత్యామ్నాయాలు ఇప్పుడు కమ్యూనిస్టుల ముందున్నవి రెండే ప్రత్యామ్నాయాలు. ఒకటి కాంగ్రెస్‌తో కలిసి నడవడం, రెండోది వామపక్ష, ఇతర పార్టీలతో జతకట్టి ముందుకు సాగడం. ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే చెరి ఐదు అసెంబ్లీ స్థానాలు తప్పక సాధించాలన్నది ఆ పార్టీల యోచన. గౌరవప్రదమైన స్థానాలను కేటాయించడంలో కాంగ్రెస్ విఫలమైతే, రెండు కమ్యూనిస్టు పార్టీలు చెరి 25 స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయి. బీజేపీని ఓడించడం తమకే కాదు ఆయా ప్రతిపక్షపార్టీలకు కూడా అవసరమేనంటున్నారు. తాము గెలవకపోయినా, ఓడించే సత్తా మాత్రం ఉందంటున్నారు. తమకంటే వారికే తీవ్రమైన నష్టమంటున్నారు. అధికారం కావాలంటే తమ అవసరం ఆయా పార్టీలకు ఉందంటున్నారు. ఎలాగైనా ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని కమ్యూనిస్టులు కృతనిశ్చయంతో ఉన్నారు. -
మా తడాఖా చూపిస్తాం
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాజకీయం అంటేనే మోసమనే నిర్వచనం ఇచ్చారని, మిత్ర ధర్మాన్ని పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని వామపక్షాలు మండిపడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించాయి. ‘‘సీఎం కేసీఆర్ నిర్ణయంతో మాకేం నష్టంలేదు. నష్టపోయేది కేసీఆరే. బీజేపీతో బీఆర్ఎస్కు సఖ్యత ఏర్పడింది. బీజేపీ అండ ఉంటే చాలనుకుంటోంది. మునుగోడు ఎన్నికల సమయంలో బీజేపీ ప్రమాదమని చెప్పారు. మరిప్పుడు బీజేపీ ప్రమాదం కాదా? మిత్రధర్మం పాటించరా? కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. వామపక్షాలు లేకపోతే మునుగోడులో బీఆర్ఎస్ ఏమయ్యేది? ఆ ఎన్నికల్లో కేసీఆరే మా అండ కోరారు. తర్వాత కూడా వామపక్షాలు మిత్రపక్షాలని చెప్పారు. ఇప్పుడు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఇది ఊహించని పరిణామం. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం’’ అని వామపక్షాల నేతలు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం, పొత్తు మాట ఇంకెక్కడిదని స్పష్టం చేయడంతో కంగుతిన్న సీపీఐ, సీపీఎం నేతలు.. మంగళవారం వేర్వేరుగా, తర్వాత ఉమ్మడిగా సమావేశమయ్యారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రెండు పార్టీలకు చెందిన నేతలు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్‌రావు, చెరుపల్లి సీతారాములు, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, పశ్యపద్మ తదితరులు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తుపై నిర్ణయమేదీ తీసుకోలేదు..: కూనంనేని 15 రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలు వినోద్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నామా నాగేశ్వర్‌రావులతో పొత్తులపై చర్చ జరిగిందని.. తమకు చెరో అసెంబ్లీ సీటు (సీపీఐకి మునుగోడు, సీపీఎంకు భద్రాచలం), రెండేసి ఎమ్మెల్సీలు ఇస్తామన్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ విధమైన పొత్తుకు అంగీకరిస్తే, అప్పటికప్పుడే చెరో ఎమ్మెల్సీని గవర్నర్ కోటాలో ఇస్తామన్నారని.. ఎమ్మెల్సీ సంగతేమో కానీ, చెరో మూడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని అడిగామని వివరించారు. ‘‘ఇదే సమయంలో బీఆర్ఎస్ బృందం తమ రాజకీయ వైఖరిని కూడా బయటపెట్టింది. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలసి ఉన్నాయని.. అలా ఉండటం తమకు ఇష్టంలేదని పేర్కొంది. ఇండియా, ఎన్డీఏ రెండు కూటములకు బీఆర్ఎస్ వ్యతిరేకమని కేసీఆర్ మాకు స్పష్టం చేయాలన్నారని బృందం వివరించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను, బీజేపీని ఓడించడం కోసం కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్తాం..’’ అని కూనంనేని తెలిపారు కాంగ్రెస్‌తో పొత్తుపై తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వామపక్షాల సాయం లేకపోతే బీఆర్ఎస్ మునుగోడులో గెలిచేదా? అని ప్రశ్నించారు. బీజేపీ మునుగోడులో గెలిచి ఉంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లేవారు కాదా అని వ్యాఖ్యానించారు. రాజకీయ వైఖరిలో తేడా వల్లే..: తమ్మినేని మునుగోడులో బీజేపీని ఓడించటం కోసమే బీఆర్ఎస్తో కలిశామని, బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఏకంగా ఉండాలనేది తమ నిర్ణయమని తమ్మినేని వీరభద్రం వివరించారు. తాము అడిగినన్ని సీట్లు కేసీఆర్ ఇవ్వలేదనే ప్రచారం తప్పు అని, రాజకీయ వైఖరిలోనే తేడా వచ్చిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ వైఖరిని తమకు వెల్లడించారన్నారు. ‘‘బీజేపీకి వ్యతిరేక నిర్ణయానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ కాంగ్రెస్‌తో జాతీయ స్థాయిలో కలవద్దని బీఆర్ఎస్ నేతలు షరతు విధించారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ తమకు ప్రధాన రాజకీయ శత్రువు కాబట్టి అందులో ఉండబోమని చెప్పారు. ‘ఇండియా’ కూటమిలో లెఫ్ట్ పార్టీలు ఉన్నందువల్ల మాతో పొత్తు పెట్టుకోలేదని భావిస్తున్నాం. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి..’’ అని తమ్మినేని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు పొత్తుపై తమకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా, నేరుగా అభ్యర్థులను ప్రకటించడం సమంజసం కాదన్నారు. తమకు ఎమ్మెల్సీలు వద్దని, ఎమ్మెల్యే సీట్లు కావాలని అడిగామని, అదీ ఎక్కువ సీట్లేమీ అడగలేదని వివరించారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఎక్కువ పోరాటాలు చేసింది తామేనని, కేసులు కూడా ఎక్కువగా తమపైనే ఉన్నాయని పేర్కొన్నారు. -
సీఎం కేసీఆర్ మమ్మల్ని అవసరానికి వాడుకున్నారు: కూనంనేని
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలను కలుపుకొని పోయిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నారు. 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సోమవారం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వామపక్షాలతో పొత్తు లేదనే విషయాన్ని సీఎం చెప్పకనే చెప్పేశారు. కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు లేదంటూ సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో నేడు(మంగళవారం) వామపక్షాలు కీలక సమావేశం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా సమావేశమై భవిష్యత్తు కార్యచరణపై చర్చించనున్నాయి. సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసినా అన్ని చోట్లా పోటీచేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో పోటీ చేయని చోట కమ్యూనిస్టులు ఎవరికి మద్దతిస్తారని ఆసక్తిగా మారింది.మళ్లీ కాంగ్రెస్‌కు చేరువవుతారా దూరంగానే ఉంటారా అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Telangana: చతుర్ముఖ వ్యూహంతో బీజేపీ.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తమను అవసరానికి వాడుకున్నారని మండిపడ్డారు. మునుగోడులో ఆయనకు కేసీఆర్‌కు అవసరం ఉంది కాబట్టి పిలిచారని.. అక్కడ బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చామని తెలిపారు. రాజకీయాల్లో మోసం చేసే వాళ్లు ఉంటారని, తాము బీఆర్ఎస్ను నమ్ముకొని లేమని పేర్కొన్నారు. ఎవరైనా కలిసొస్తే పోటీ చేస్తామని.. లేకుంటే ఒంటరిగా పోటీచేస్తామన్నారు. ‘సీపీఐ-సీపీఎం ఉమ్మడిగా కలిసేపోటీ చేస్తాయి. పొత్తుపై మేం ఎప్పుడు వెంపర్లాడలేదు. కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగింది వాస్తవమే. ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ఎన్నికలకు సిద్ధమవుతాం. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటుపై కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్, వామపక్ష నేతల మధ్య చర్చలు జరిగాయి. సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదించింది. చెరి 3 అసెంబ్లీ స్థానాలకు పట్టుబట్టిన వామపక్షాలు.. కనీసం రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండేసి ఎమ్మెల్సీ స్థానాలైనా ఇవ్వాలని అడిగాయి. లేదంటే ఎమ్మెల్సీ సీట్లకు బదులు 3 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరింది. కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని బీఆర్ఎస్ పేర్కొనడంతో చర్చలు ఫలించలేదు. కాగా 9 నెలల కింద జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అక్కడ కొంత బలంగా ఉన్న సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అప్పటి నుంచి ఈ పార్టీల మధ్య మైత్రి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందని అప్పట్లోనే రెండు పార్టీల నేతలు ప్రకటించారు. కానీ అనూహ్యంగా కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తమ పార్టీలకు చెందిన వారికి అవకాశం ఇవ్వకపోవడంతో వామపక్షాలు కంగుతిన్నాయి. పొత్తులో భాగంగా తమ రెండు పార్టీలకు టికెట్లు కేటాయిస్తారని ఆశగా ఎదురుచూస్తున్న కమ్యూనిస్టులకు కేసీఆర్ మొండి చేయి చూపించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి దాకా పొత్తులపై చర్చలు జరిపి, తీరా దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే అభ్యర్థులను ప్రకటించడంపై మండిపడుతున్నాయి. మునుగోడు తర్వాత కేసీఆర్ మాట తప్పారని, సీఎం అవకాశ వాది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పట్టించుకోకపోవడాన్ని సీపీఐ, సీపీఎం ఏ విధంగా చూస్తాయనేది తెలియాల్సి ఉంది. -
కంగుతిన్న కామ్రేడ్లు...!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్తో చిగురించిన వామపక్షాల పొత్తు అంతలోనే వాడిపోయింది. రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని విశ్వసించిన కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ప్రకటనతో కంగుతిన్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో కమ్యూనిస్టుల పొత్తు కొనసాగుతుందని చెప్పారు. తీరా ఇప్పుడు వామపక్షాలను పరిగణనలోకి తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై వామపక్షాల నాయకులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీఆర్ఎస్తో పొత్తులేదని స్పష్టం కావడంతో ఎలక్షన్లకు ఎలా సన్నద్ధం కావాలో తేల్చుకునేందుకు వామపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. కార్యాచరణపై సమావేశాలు బీఆర్ఎస్ వైఖరితో కంగుతిన్న సీపీఎం, సీపీఐ పార్టీ లు భవిష్యత్ కార్యాచరణ కోసం మంగళవారం సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాయి. ఇందులోభాగంగా సీపీఎం, సీపీఐ రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో ముఖ్యనేతలతో చర్చలు జరిపి ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ముందుగా రెండు పార్టీలు విడివిడిగా సమావేశమైన తర్వాత ఉమ్మడి గా సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నాయి. ఇందులోభాగంగా మేథోమథనానికి సిద్ధమయ్యా యి. ఏదేమైనా ఈసారి కలిసి ఉండాలని నిర్ణయించుకున్న వామపక్ష పార్టీలు అతి త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టార్గెట్ బీజేపీ: వామపక్షాల ప్రధాన ప్రత్యర్థి బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కమ్యూనిస్టు పార్టీ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌తో జతకట్టింది. కానీ రాష్ట్రంలో బీజేపీని గట్టిగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర నాయకత్వం బీఆర్ఎస్తో కలిసి నడిచింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఎదిరించడంలో వామపక్షాల పాత్ర కీలకంగా ఉందని, అందుకే పొత్తు పొడిచిందని కామ్రేడ్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీతో పొత్తు ముగియడంతో ప్రత్యామ్నాయ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దేశంలో జత కట్టిన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తులు కొనసాగించే అంశంపై నేటి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రత్యర్థి పార్టీతో పొత్తులు సాగించిన కామ్రేడ్లతో రాష్ట్ర కాంగ్రెస్ కలిసిపోతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ నాయకత్వంపై ఒత్తిడి చేసే కోణంలోనూ వామపక్ష నేతలు యోచిస్తున్నారు. బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందన్న సమయంలో తమకు మూడోవంతు సీట్లు కేటాయించాలని కా మ్రేడ్లు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు సమయంలో సీట్ల సంఖ్యను ఏమేరకు పరిమితం చేయాలనే అంశంపైనా చర్చించనున్నట్లు తెలిసింది. మరోవైపు పొత్తులు లేకుండా ఉమ్మడిగా పోటీ చేసే అంశంపైనా చర్చించనున్నారు. ఇప్పటివరకు చెరో పాతిక స్థానాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సీపీఐ, సీపీఎంలు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి. -
బీఆర్ఎస్తో కొలిక్కిరాని సీపీఎం, సీపీఐ పొత్తు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పయనంపై ఆ పార్టీల కేడర్‌లో అయోమయం నెలకొంది. బీఆర్ఎస్తో పొత్తుపై ఆ పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్తో పొత్తుపై గట్టిగా మాట్లాడిన కమ్యూనిస్టు నేతలు ఇప్పుడు స్వరం తగ్గించారు. రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలా.. బీఆర్ఎస్తో పొత్తుతో వెళ్లాలా అనే ఆలోచనలు ఎటూ తెగడంలేదు. పొత్తులు ఉన్నా, లేకున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధిక సీట్లలో పోటీ చేయడంపై ఆయా పార్టీల నేతలు దృష్టి సారించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు కావడమే కాక రాష్ట్రంలోనే ఆ పార్టీలకు ఇక్కడ కొంత బలం ఎక్కువగానే ఉంది. ఇక పొత్తులపై బీఆర్ఎస్ నాన్చివేత ధోరణి అవలంబిస్తోందనే భావనకు వచ్చిన రెండు పార్టీల నేతలు ఈనెలాఖరు వరకు ఒక నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. కొలిక్కి రాకుండానే.. ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలతో బీఆర్ఎస్కు చెందిన నేత ఒకరు రాజధానిలో పొత్తుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా సీపీఎం పాలేరు, మిర్యాలగూడ, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు, సీపీఐ కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్ స్థానాలను కోరినట్లు తెలిసింది. కాగా సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలను కేటాయిస్తామని సూత్రప్రాయంగా ప్రతిపాదించినట్లు సమాచారం. ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేకపోగా చర్చలు ఆగిపోయాయి. ఉభయ కమ్యూనిస్టులు మాత్రం తమకు బలం ఉన్న స్థానాలను కేటాయిస్తేనే పొత్తుకు సై అనే ఆలోచనలో ఉండగా.. విషయం తేలక కేడర్‌లో స్తబ్దత నెలకొంది. కాలయాపనతో.. బీఆర్ఎస్తో పొత్తు వ్యవహారంలో కాలయాపన జరిగితే తాము నష్టపోతామనే అభిప్రాయం సీపీఎం, సీపీఐ కేడర్‌లో వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ముందుకు రాకపోవడంతో పొత్తు అంశం తేలడం లేదనే చర్చ సాగుతోంది. పొత్తులకు సంబంధించి బీఆర్ఎస్ ఎన్నికల సమయం వరకు వేచి ఉంటుందని భావిస్తుండగా, కమ్యూనిస్టులు బహిరంగంగా ప్రస్తావించడం లేదు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని బీఆర్ఎస్తో బ్రేకప్ కాలేదని, అన్నీ కుదిరితే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. పరస్పర ఓట్ల బదిలీ, సీట్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పొత్తు ఉంటుందని.. లేదంటే ఒంటరిగానే బరిలో దిగుతామని తెలిపారు. దీంతో కమ్యూనిస్టులు ఏదో ఒకటి త్వరగా తేల్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 20కి తగ్గేదే లే... అధికార బీఆర్ఎస్తో పొత్తు ఉన్నా.. లేకున్నా రాష్ట్రంలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉభయ కమ్యూనిస్టులు ఉన్నారు. ఈసారి అసెంబ్లీలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండేలా చూడాలనే ఏకై క అజెండాతో ఆ పార్టీల అడుగులు వేస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్తో చర్చలు ఫలించకపోతే సీపీఎం, సీపీఐ కలిసి బరిలోకి దిగాలన్న నిర్ణయానికి వచ్చాయి. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చి కనీసం ఏడు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాలేరు, మధిర, వైరా, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక అసెంబ్లీ స్థానాలపై ప్రధాన దృష్టి సారించాయి. అలాగే, రాష్ట్రంలోని మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, హుస్నాబాద్, ఇబ్రహీంపట్నం స్థానాలతోపాటు మరో ఏడు స్థానాల్లో తాము బలంగా ఉన్నట్లు ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఓవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తుండగా.. కమ్యూనిస్టులు ఎటూ తేల్చుకోలేక.. ఎటు సాగాలో తెలియక ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీడని పీఠముడి ఇప్పటికే పొత్తులపై ఉభయ కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ మధ్య పలుమార్లు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతున్నా ఫలితం మాత్రం తేలలేదు. గతంలో పొత్తుపై అటు కమ్యూనిస్టులు, ఇటు బీఆర్ఎస్ నేతలు గట్టిగానే మాట్లాడారు. ఈ ఏడాది జనవరిలో ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనూ సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. అలాగే వర్షాలతో నష్టపోయిన పంటల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట బోనకల్ మండలంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఉన్నారు. ఆ తర్వాత నుంచి పొత్తులపై బీఆర్ఎస్ వేచిచూసే ధోరణి అవలంబిస్తోందనే అభిప్రాయం కమ్యూనిస్టు పార్టీల కేడర్‌లో వ్యక్తమవుతోంది. -
ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. గేట్లు క్లోజ్ చేసిన పోలీసులు..
సాక్షి, ఖమ్మం: ఖమ్మం నూతన కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముట్టడిని పిలుపునిచ్చారు. ముట్టడి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో, ఖమ్మం కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేశారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించి అఖిలపక్ష పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా అఖిలపక్ష పార్టీల నేతలు నాగపూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపే అలైన్మెంట్ మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేను బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మార్చాలని డిమాండ్ చేశారు. హైవే విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ప్రైవేటు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదు.. ఇక, కలెక్టరేట్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్శదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘రైతు పోరాటం ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. రైతును చిన్నచూపు చూస్తున్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తే ప్రభుత్వాలు ఉద్యోగుల కాళ్ల వద్దకు వస్తున్నాయి. రైతుకు ఆ పరిస్థితి లేదు. పోలీసులతో ఇబ్బంది పెడితే ఖమ్మంను స్తంభింప చేస్తాం. పోరాడితేనే మన భూములు మనకు మిగులుతాయి. వద్దన్న రోడ్లు వేస్తున్నారు.. కావాలన్న రోడ్లు వేయడం లేదు. బీఆర్ఎస్కు మేము చెబితే వినే పరిస్థితి లేదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులది చట్టబద్దమైన పోరాటం.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రైతుల భూ పోరాటం తీవ్ర స్థాయికి చేరింది. రైతులు చూపిన త్యాగం, ధైర్యంతోనే పోరాటం విజయం సాధిస్తుంది. రైతుల పోరాటానికి సీపీఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది. రైతులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. రైతు పోరాటం వీధి పోరాటం కాదు, చట్టబద్ధమైన పోరాటం. 90శాతం మంది రైతులు అంగీకరిస్తేనే ప్రభుత్వం రైతుల నుండి భూమిని తీసుకోవాలని చట్టంలో ఉంది. తక్కువ నష్టం అయ్యే భూమినే ప్రభుత్వం తీసుకునే హక్కు ఉంది. మార్కెట్ విలువకు 3 రెట్లు ఎక్కువ కట్టించి రైతులకు ఇవ్వాలి. 2016లో భూసేకరణ చట్ట ప్రకారం రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: జెండావిష్కరణలో బీజేపీ నేతల బాహాబాహీ.. రెచ్చిపోయిన ఇరువర్గాలు -
కర్నాటక ఫలితాల ఎఫెక్ట్: ఈసారి పక్కా ప్లాన్‌తో ఎర్రన్నలు, అందుకే ఈ మౌనం
తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న తరుణంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు ఉంటాయనే చర్చ మొదలైంది. రాజకీయ పోరులో కమలం ప్లేస్‌లోకి హస్తం పార్టీ రావడంతో లెఫ్ట్ నేతలు సైలెంట్‌గా పరిస్థితిని గమనిస్తున్నారు. గతంలో మాట ఎలా ఉన్నా.. పొత్తుల గురించి ఇప్పుడే ఓపెన్ కావద్దని నిర్ణయించుకున్నారట ఎర్రన్నలు. ముందుగా బలగం ఉన్న నియోజకవర్గాల్లో బలం పెంచుకునే పని ప్రారంభించారట. ఇంతకీ వారి సైలెన్స్ వెనుకున్న కారణం ఏంటో తెలుసుకుందాం.. కారులోనే అనుకున్నారు, కానీ.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఎంతో కొంత బలం ఉందని చెప్పుకోగల జిల్లా ఏదైనా ఉందంటే.. అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే. రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఈ జిల్లాకు చెందినవారే. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి పోటీ చేయడానకి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే వారిద్దరూ తమ మనసులోని మాట బయటపెట్టారు కూడా. వారు తమ నియోజకవర్గాల్లో చాలా కాలం క్రితమే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు మద్దతిచ్చిన వామపక్షాలు.. సాధారణ ఎన్నికల్లో కూడా కారులోనే ప్రయాణం చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ లెఫ్ట్ పార్టీల మీద కూడా ప్రసరించింది. అందుకే పరిస్థితులు ఎలా మారతాయో అన్న ముందు జాగ్రత్తతో ప్రస్తుతానికి పొత్తుల విషయంలో సైలెన్స్ పాటిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు. (చదవండి: ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు) తొందర పడితే ఇబ్బందులు.. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాకముందు రాష్ట్రంలో కారు, కమలం మధ్యే పోటీ అన్నట్లుగా వార్ జరిగేది. కాని కర్నాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే అన్నట్లుగా మారింది. ఇప్పుడు బీజేపీ మూడో ప్లేస్‌లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తన శక్తినంతా కూడదీసుకుంటోంది. ఇలాంటి కీలక సమయంలో తొందరపడి పొత్తుల విషయం ప్రకటిస్తే.. అసలుకే ప్రమాదం వస్తుందని లెఫ్ట్ పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినేట్ భేటీ.. చర్చించే ముఖ్యాంశాలు ఇవేనా!) ఎన్నికలు వచ్చేలోగా తమకు పట్టు ఉన్న 30 సెగ్మెంట్లలో బలం పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలని డిసైడయ్యారు. ఇద్దరం కలిసికట్టుగా ఉంటే.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చని, లేదంటే అసెంబ్లీ సీట్లు ఇవ్వకుండా మండలి సీటు ఇస్తామని మభ్య పెట్టే ప్రమాదం ఉందని కూడా భావిస్తున్నాయి. తమకు తాముగా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నట్లు కనిపించకూడదని, బలాన్ని పెంచుకుంటే అటు కాంగ్రెస్ గాని.. ఇటు బీఆర్ఎస్ గాని ఎవరో ఒకరు ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పే అవకాశాలుంటాయని అనుకుంటున్నారు. అందుకే మరికొంతకాలం మౌనం పాటించనున్నట్లు తెలుస్తోంది. మనమే తొందరపడి సర్దుబాటు కోసం ప్రయత్నిస్తే డిమాండ్ పడిపోద్దని లెఫ్ట్ పార్టీల నాయకత్వం భయపడుతోంది. అలాగాకుండా బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీల వైపు నుంచి పొత్తుల ప్రతిపాదన వస్తే మనం డిమాండ్ చేయవచ్చని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కమ్యూనిస్టు నేతలు. కారు, హస్తం ఏదైనా ఒక్కటే.. ఇచ్చే సీట్లను బట్టే పొత్తులు ఆధారపడి ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -సాక్షి, పొలిటికల్ డెస్క్. -
పొత్తుల కోసం వెంపర్లాడం
హుస్నాబాద్: బీఆర్ఎస్ పార్టీతో పొత్తులపై ముఖాముఖి చర్చలు జరగలేదని, పొత్తులకోసం వెంపర్లాడబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీతో పొత్తు ఉన్నా.. లేకున్నా వచ్చే ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయ న తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మునుగోడులో సీపీఐ వల్లే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారన్నారు. సీఎం కేసీఆర్ ఆనాడు తమను పిలి చి పొత్తుపెట్టుకున్నారని, వ చ్చే ఎన్నికల్లోనూ ఆయన పిలిస్తేనే పొత్తులపై చర్చిస్తామని చెప్పారు. బీఆర్ఎస్తో తమ స్నేహబంధం ముగియలేదన్నారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం కలిసే పయనిస్తాయని తేల్చిచెప్పారు. తెలంగాణలో 15 సీట్లలో సీపీఐ బలంగా ఉందని, 5 సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. కొత్తగూడెం, వైరా, పెద్దపల్లి, మునుగోడు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో తప్పకుండా పోటీ చేస్తామని వెల్లడించారు. ఆర్టీసీ డిపోల ఎదుట రౌండ్ టేబుల్ సమావేశాలు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చి న హామీలను నేరవేర్చాలని ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు డిపోల ఎదుట తమ పార్టీ ఆ«ధ్వర్యంలో సేవ్ ఆర్టీసీ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈ సమావేశాలకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను ఆహ్వానిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ కార్మికులకు వేతనాలు పెంచుతామని మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు ఇచ్చి న హామీని నేరవేర్చలేదని చాడ విమర్శించారు. వచ్చే నెల 7న ప్రజాసమస్యలపై కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బీసీ, దళితబంధు లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వడం సరికాదన్నా రు. గ్రామసభల ద్వారా లబ్దిదారులను ఎంపి క చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, మణిపూర్ సంఘటనపై ఈనెల 25న దేశవ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చాడ తెలిపారు. -
‘ఇండియా’లో బీఆర్ఎస్ లేకున్నా పొత్తు
సాక్షి, హైదరాబాద్: ‘ఇండియా’ కూటమిలో బీఆర్ఎస్ లేకపోయినా ఆ పార్టీతో పొత్తుకు సంబంధించి సీపీఐ, సీపీఎంకు ఎలాంటి సమస్య లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఆ కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు రాష్ట్రంలో కలిసి పోటీ చేసే అంశం తలెత్తదన్నారు. ‘ఇండియా’ కూటమికి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితు లకు సంబంధం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ ఎన్నికల్లో వామపక్షాలు, కాంగ్రెస్ కూటములే ప్రధా న ప్రత్యర్థులని, అలాగే పశ్చిమ బెంగాల్లో సైతం తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ప్రత్యర్థు లని, కానీ జాతీయ స్థాయిలో దేశం కోసం ‘ఇండియా’ కూటమిలో భాగస్వాములుగా లేరా? అని కూనంనేని ప్రశ్నించారు. రాష్ట్రాల్లో ఆయా పార్టీల మధ్య పోరాటం ఉన్నప్పటికీ దేశ ప్రజల ప్రయోజ నాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీని ఓడించేందుకు జాతీయ స్థాయిలో ఒకటిగా ఉన్నామని వివరించారు. ప్రీ పోల్, పోస్ట్ పోల్ పొత్తులు కొన్ని ఎన్నికల ముందు (ప్రీ పోల్), కొన్ని ఎన్నికల అనంతర (పోస్ట్ పోల్) పొత్తులు ఉంటాయని కూనంనేని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మని, ఆ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించామని, ఈ స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. 26 నుంచి ’సేవ్ ఆర్టీసీ’ పేరిట నిరసన ప్రమాదంలో పడిన ఆర్టీసీని రక్షించుకునేందుకు ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ‘సేవ్ ఆర్టీసీ’ పేరు తో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద నిరసన కార్య క్రమాలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తా మని కూనంనేని తెలిపారు. ఆగస్టు 7న ఇళ్లు, గుడిసెలకు పట్టాలివ్వాలనే డిమాండ్‌తో పాటు ఇతరత్రా సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు ముట్టడిస్తామన్నారు. -
‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’
సాక్షి, హైదరాబాద్: సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్‌తో జత కడుతారనే తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకి శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో మైత్రి కొనసాగుతుందని తమ్మినేని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ కలిసి వెళ్ళినప్పుడే లబ్ధి పొందామని, విడివిడిగా పోయినప్పుడు నష్టపోయామని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించామని కూనంనేని చెప్పారు. పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు ‘బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చూసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరింది. మునుగోడే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యునిస్టులతో పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ సీట్ల అంశంపై మాతో చర్చించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని అనుకుంటున్నారు. మాకు బలంగా ఉన్న చోట ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం’ అని తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే అయ్యేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తహతహ.. కమ్యూనిస్టులు ఉంటేనే కుంభకోణాలు బయటకు.. మునుగోడులో వచ్చిన విపత్తును సీపీఎం, సీపీఐ అడ్డుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంట్లను ప్రజలు ఊహించుకోవడం లేదని.. కమ్యూనిస్టులు ఉంటేనే అనేక కుంభకోణాలు బయటకు తీసుకు వస్తారని చెప్పారు. ఓట్లు సీట్ల కోసం దిగజారం ‘కమ్యూనిస్టుల పద్దతుల్లో మా పోరాటం చేస్తున్నాం. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవు. వ్యక్తిగత దూషణలకే పరిమితం. ఓట్లు సీట్ల కోసం మేము దిగజారం. రోజుకో పార్టీ మారే వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. పొత్తులపైన వెంపర్లాడడం లేదు. కేసీఆర్ ఎప్పుడూ పిలిస్తే అప్పుడే వెళ్తాం. కేసీఆర్ బీజేపీని తక్కువ అంచనా వేయవద్దని విజ్ఞప్తి. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో పొందిక ఉంటుంది. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం’ అని కూనంనేని తెలిపారు. -
బీఆర్ఎస్ తీరుపై కామ్రేడ్ల కస్సుబుస్సు
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో బీఆర్ఎస్ తీరుపై వామపక్షాలు గరంగరంగా ఉన్నాయి. పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై సీపీఐ, సీపీఎం కేడర్‌లో గందరగోళం నెలకొంది. పొత్తులు, ప్రజాసమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ను అపాయింట్మెంట్ కోరినా ఇప్పటివరకు లభించకపోవడంపై కామ్రేడ్లు కస్సుబుస్సులాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ తమను ఉపయోగించుకొని పొత్తులపై చర్చించాలనే సరికి మాత్రం పక్కనపెడుతోందని కొందరు నేతలు మండిపడుతున్నారు. ఖమ్మంలో నిర్వహించిన సభకు తమ జాతీయ నేతలైన కేరళ సీఎం పినరయి విజయన్, డి.రాజా వంటి వారిని వెంటపడి మరీ పిలిపించుకున్న సీఎం కేసీఆర్... ప్రస్తుతం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎం నేతలు శుక్రవారం ఎంబీ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఆ పార్టీల ముఖ్య నేతలు హాజరుకానున్నారు. బీజేపీని వ్యతిరేకించే శక్తులతోనే ముందుకు... మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి అడ్డుకట్ట వేయగలిగేది బీఆర్ఎస్ మాత్రమేనని భావించి ఆ పార్టీకి వామపక్షాలు మద్దతిచ్చాయి. అనుకున్నట్లుగానే బీజేపీ గెలవకుండా అక్కడ వామపక్షాల ఓట్లు సహకరించాయి. రానున్న ఎన్నికల్లోనూ బీజేపీని ఓడించే సత్తాగల పార్టీకే మద్దతు ఇవ్వాలన్నది వామపక్షాల వైఖరి. ఇందులో భాగంగా సీపీఐ, సీపీఎంలు బీఆర్ఎస్ను చెరో 10 అసెంబ్లీ స్థానాలు కోరాలనుకుంటున్నాయి. చర్చల్లో చివరకు చెరో ఐదు స్థానాలు తప్పనిసరిగా అడగాలన్నది వారి ఉద్దేశం. కానీ ఈ స్థానాలు ఇవ్వడానికి బీఆర్ఎస్ సిద్ధంగా లేదన్న వాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్‌లున్న ఆయా స్థానాలను కామ్రేడ్లకు ఇవ్వడం వల్ల ప్రస్తుత ఎమ్మెల్యేలు అలిగి సహకరించకపోతే ఓటు బదిలీ జరగక వారు ఓడిపోయే ప్రమాదం ఉందన్న భావనలో బీఆర్ఎస్ ఉందని వామపక్షాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పది సీట్లు ఇచ్చినా వామపక్షాలు డబ్బు ఖర్చు పెట్టవని, దానివల్ల కూడా సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా బీఆర్ఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్తో పొత్తు కుదరకపోతే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకొనే దిశగా కూడా వామపక్షాలు ఆలోచిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ కూడా ఇప్పటివరకు వామపక్షాలతో పొత్తుపై ఆసక్తి చూపించడంలేదని సమాచారం. -
..మనదో దారైతే వాళ్లదోదారి! ఈ దారులు కలిసేదెప్పుడో!!
..మనదో దారైతే వాళ్లదోదారి! ఈ దారులు కలిసేదెప్పుడో!! -
బెంగాల్లో కాంగ్రెస్, సీపీఎంలది మరోదారి: మమత
కూచ్‌బెహార్: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు తాను ప్రయత్నిస్తుండగా, తమ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల చర్యలు రాష్ట్రంలో బీజేపీకి లాభం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. కూచ్‌బెహార్‌లో సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. ‘కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు మేం మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ, బెంగాల్‌ల్లో మాత్రం సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయి. అటువంటి అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాం’అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ బెంగాల్ అధ్యక్షుడు ఆధిర్ రంజన్ ఛౌధురి స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో టీఎంసీ విశ్వసనీయతపై ఎప్పటి నుంచో అనుమానాలున్నాయన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో తమకు చెప్పే అర్హత మమతా బెనర్జీకి లేదని సీపీఎం ఎదురుదాడి చేసింది. ఈ నెల 23న బిహార్‌లోని పట్నాలో సీఎం నితీశ్ సారథ్యంలో 12కు పైగా రాజకీయ పార్టీల నేతలు సమావేశమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడాలని వీరు నిర్ణయించారు. తాజాగా మమతా బెనర్జీ మరో బాంబు పేల్చడం గమనార్హం. -
TS: పొత్తుల విషయంలో వామపక్షాలు మౌనం.. కారణం అదేనా!
కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. దీంతో పొత్తుల విషయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయనే వాదన వినిపిస్తోంది. అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో నిర్ణయించుకోలేకపోతున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ విషయంలో క్లారిటీ రాలేదా? కాంగ్రెస్ బలపడుతున్నదని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఎర్రన్నల ఆలోచనలు ఎలా ఉన్నాయి? కొంతకాలంగా పొత్తుల విషయంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీలు మౌనం పాటిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని రెండు వైపుల నుంచి ప్రచారం ఊపందుకుంది. కాని తాజా పరిణామాల నేపథ్యంలో పొత్తుల సంగతి తర్వాత ముందు మన బలం పెంచుకుందామని రెండు వామపక్షాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తమకు పట్టున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బహిరంగసభలతో బలాన్ని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగూడెంలో సీపీఐ భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీని టార్గెట్ చేసింది. ఖమ్మం అంటే కమ్యూనిస్టుల అడ్డా అని..ఇక్కడ కాషాయ పార్టీ పప్పులు ఉడకవని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అంటున్నారు. అదే సమయంలో లెఫ్ట్ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయనే విషయమై ఎలాంటి చర్చలూ జరగలేదని ఆయన చెప్పారు. పొత్తుల అంశంపై ఎన్నికల సమయంలోనే స్పష్టత వస్తుందని కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతోందని.. అదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఇక్కడ బీజేపీ పూర్తిగా బలహీనపడిందని లెఫ్ట్ నేతలు అంచనాలు వేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. వారి అంచనాలు, అభిప్రాయాలు చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఎవరితో అయినా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా, పినపాక స్థానాలపై సీపీఐ గురిపెట్టింది. అందులో భాగంగానే కొత్తగూడెంలో భారీ బహిరంగ సభతో బలప్రదర్శన చేసింది. కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సీపీఏం సైతం అదే ఫార్ములాను అనుసరిస్తోంది. పొత్తుల విషయం పక్కన పెట్టి వారికి పట్టు ఉన్నా ప్రాంతాల్లో బలం పెంచుకునే ప్రయత్నంలో సీపీఎం నాయకులు ఉన్నారు. ఇటివలే ఖమ్మం నగరంలో సీపీఏం కూడా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటే ప్రయత్నం చేసింది. ఉమ్మడి జిల్లాలో సీపీఏంకి పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో బలం ఉంది. పాలేరు నుంచి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ సైతం మొదలుపెట్టారు. సీట్ల విషయంలో బీఆర్ఏస్ నుంచి క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో.. ముందు తమకు పట్టు ఉన్న ప్రాంతాల్లో బలం చూపించుకుంటే సీట్లు అవే వస్తాయన్న భావనలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పొత్తుల విషయంలో మౌనంగా ఉంటున్నాయి. అయితే సీపీఎం, సీపీఐ కలిసే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరి వారి పొత్తు కాంగ్రెస్‌తో ఉంటుందా? బీఆర్ఎస్తో ఉంటుందా? బహుశా వారికి కావాల్సిన సీట్లు ఎవరిస్తే వారితో ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బండ్ల గణేష్ పొలిటికల్ ట్వీట్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ! -
‘పూటకో పార్టీతో చంద్రబాబు జట్టు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఉదయం ఓ పార్టీతో.. సాయంత్రం మరో పార్టీతో ఉంటారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఎద్దేవా చేశారు. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తారో తెలియదన్నారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు తమతో ఉదయం సమావేశం నిర్వహించి.. సాయంత్రానికి వాజ్‌పేయ్‌ని కలిసి పొత్తు గురించి మాట్లాడుకున్నారని గుర్తు చేశారు. గతంలో బీజేపీతోనూ, ఆ తర్వాత ఎన్నికల్లో మళ్లీ వామపక్షాలతోనూ చంద్రబాబు పొత్తులు పెట్టుకున్నారన్నారు. అందువల్ల చంద్రబాబు ఇప్పుడు ఎవరితో ఉంటారో చెప్పడం కష్టమని తెలిపారు. అందుకే బీజేపీతో ఆయన పొత్తు పెట్టుకుంటారో, లేదో కచ్చితమైన బ్లూప్రింట్ ఎవరి దగ్గర ఉండదన్నారు. జాతీయ స్థాయిలో ఒక విధానంతో పనిచేసే సీపీఎం ఎన్నికల సమయంలో రాష్ట్రాల్లో ఉన్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకుందని గుర్తు చేశారు. విజయవాడలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాం ఏచూరి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ దేశానికి హానికరమని.. బీజేపీతో జట్టు కట్టే పార్టీలతో పొత్తు పెట్టుకోకూడదన్నది తమ పార్టీ విధానమని ఏచూరి తెలిపారు. కాగా కొత్త పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్‌కు రాష్ట్రపతి అధిపతి అని స్పష్టంగా ఉందని చెప్పారు. ప్రధాని అధికారపక్షానికి మాత్రమే ప్రతినిధి అనే విషయం మరిచిపోతున్నారన్నారు. ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ప్రధాని ప్రారంభిస్తుండటం వల్లే 19 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయన్నారు. హిందూత్వ పేరుతో దేశ చరిత్రను, సిలబస్‌ను చెరిపేసి తమకు అనుకూలమైన కొత్త చరిత్రను సృష్టించుకునేందుకే మతతత్వ బీజేపీ రాజదండం నాటకాన్ని తెరమీదకు తెచ్చిందని ఆరోపించారు. నోట్ల రద్దు తుగ్లక్ చర్య గతంలో నోట్ల రద్దు, ఇప్పుడు రూ.2 వేల నోటు రద్దు వెనుక బీజేపీ ప్రయోజనాలు ఉన్నాయని సీతారాం ఏచూరి ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడి పార్టీలను దెబ్బతీసేందుకే పథకం ప్రకారం రూ.2 వేల నోటు రద్దు చేశారని విమర్శించారు. నోట్ల రద్దు తుగ్లక్ చర్య అని మండిపడ్డారు. దీనివల్ల సాధించేదేమీ లేదన్నారు. గౌతమ్ అదానీ స్కామ్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: ఎడాపెడా ‘ఈనాడు’ అబద్ధాలు -
తమ్మినేని సార్ .. పాలేరు నుంచి పోటీ చేయండి..
ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు యువకులు కోరారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలోని తమ్మినేని నివాసంలో శుక్రవారం గువ్వలగూడెంకు యువకులు ఆయనను కలిసి సీపీఎంలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు చట్టసభల్లో లేకపోవటంతో ప్రజల సమస్యలపై ప్రస్తావన రావడం లేదని తెలిపారు. ఈమేరకు వచ్చే ఎన్నికల్లో ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీచేయాలని ఆయనను కోరారు. నాయకులు మారుతి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాబు, పవన్‌లపై లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి?
ఏపీలో వామపక్షాలకు జ్ఞానోదయం కలిగిందా? చంద్రబాబు అండ్ పవన్‌కల్యాణ్‌ల ఊసరవెల్లి రాజకీయాలు వారికి నిజంగానే అర్థమయ్యాయా? బాబు, పవన్‌ల మీద ఏపీ లెఫ్ట్ నేతల ఆగ్రహానికి కారణం ఏంటి? వచ్చే ఎన్నికల్లో తమకు చంద్రబాబుతో కలిసే ఛాన్స్ పోతుందని ఆందోళన చెందుతున్నాయా? నిజంగా ఏపీ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నాయా? ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ అక్కడి రాజకీయాలు ఎప్పటి నుంచో మాంచి కాకమీదున్నాయి. రేపే సీఎం సీటు మీద కూర్చోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉవ్విళ్ళూరిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వబోనని ప్రతిజ్ఞలు చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీతో బీజేపీని కలపాలని తెగ ఆరాటపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు, బీజేపీ నుంచి బీఎస్పీ వరకు చంద్రబాబు పొత్తు పెట్టుకోని రాజకీయ పార్టీ భారత దేశంలో లేదు. జనసేన పార్టీ స్థాపించి తొమ్మిదేళ్ళు గడచినా ఇంకా నిర్మాణమే చేయని పవన్ కల్యాణ్ కూడా బీజేపీ, టీడీపీ, కమ్యూనిస్టులు, బీఎస్పీ..ఇలా అన్ని రకాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు దత్త పుత్రుడుగా ముద్ర వేయించుకున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలంటే ఇతర పార్టీలు గౌరవించేవి. ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తు రాజకీయాలు మొదలుపెట్టాయో అప్పటినుంచే ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాల గౌరవం తగ్గిపోయింది. గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న సీపీఎం, సీపీఐలు ఈసారి టీడీపీ, జనసేనలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని...ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నాయి. కాని చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మాత్రం బీజేపీతో కలిసి వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తమకు ఎక్కడ దూరం అవుతాడో అని లెఫ్ట్ పార్టీలకు బెంగ పట్టుకుంది. అసెంబ్లీలో కాలు మోపే ఛాన్స్ ఈసారి కూడా మిస్ అవుతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది. తాజాగా సీపీఎం, సీపీఐ తెలుగు రాష్ట్రాల అగ్రనేతలు బీవీ రాఘవులు, కంకణాల నారాయణ సంయుక్తంగా చంద్రబాబు, పవన్‌లపై విరుచుకుపడ్డారు. మోడీ మెడ పట్టి గెంటుతున్నా..చూరు పట్టుకుని వేళ్ళాడటానికి ఇద్దరికీ సిగ్గు లేదా అని ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. ఒకసారి తెలుగుదేశంతో..మరోసారి కాంగ్రెస్‌తో... ఇలా ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నపుడే వామపక్షాలు అసెంబ్లీలో అడుగు పెట్టగలిగాయి. సొంతంగా పోటీ చేసినపుడు భంగపడ్డాయి. గత ఎన్నికల్లో పవన్‌తో కలిసి బోల్తా పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టీడీపీతో జతకట్టాలని ఉబలాటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ప్రాపకం కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు.. పవన్ చేస్తున్న బ్రోకరిజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏదో రాష్ట్రాన్ని ఉద్దరిస్తామని పోజులు కొడుతున్నా.. వాస్తవానికి అసెంబ్లీలో ఒకటో.. రెండో సీట్లు గెలవాలంటే చంద్రబాబు పంచన చేరక తప్పదని సీపీఎం, సీపీఐ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ప్రతి విషయంలోనూ టీడీపీ తోక పార్టీలుగా వ్యవహరిస్తూ.. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతలు ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రతిదానికీ విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ ఎప్పుడూ సింగిల్‌గానే ఎన్నికలకు వెళుతున్నారు. సింహం సింగిల్‌గానే వస్తుందని పదే పదే చెబుతున్నారు. అందుకే సింహాన్ని ఎదిరించేందుకు గుంపుతో కలిసి రావాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే ప్రజలకు దూరమైన కమ్యూనిస్టు పార్టీలు ఇలాగే చంద్రబాబును నమ్ముకుంటే అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న వాటి కోరిక ఎప్పటికీ నెరవేరదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
బీజేపీని ఓడించగలిగితే కాంగ్రెస్‌తో సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: కొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టుగా బీజేపీని ఓడించే స్థాయికి కాంగ్రెస్ చేరితే ఇక్కడ కూడా ఆ పార్టీతో సర్దుబాటు చేసుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఆవిధంగా లేదని, అందుకే బీఆర్ఎస్ వైపే ఉంటామని చెప్పారు. అయితే సీట్ల గురించి బీఆర్ఎస్తో ఇంకా చర్చ జరగలేదని, సమయం వచ్చిన ప్పుడు తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కోరతామని అన్నారు. తాము కోరుకున్నట్టుగా బీఆర్ఎస్ సీట్లు ఇవ్వకపోతే విడిగానే పోటీ చేస్తామని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా బుధవారం ఎంబీ భవన్లో పొలిట్‌బ్యూరో సభ్యులు ఎ.విజయరాఘవన్, బీవీ రాఘవులు, నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలతో కలిసి తమ్మినేని విలేకరులతో మాట్లాడారు. స్నేహంగా ఉంటాం..సమస్యలపై పోరాడతాం బీజేపీని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్తో రాజకీయంగా స్నేహంగా ఉంటామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. అదే సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. బీఆర్ఎస్ తప్పులను విమర్శిస్తామని, ఒప్పును సమర్థిస్తామని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడం అంత సులువు కాదని, అందుకే కేసీఆర్‌ను సమర్థిస్తున్నామని వివరించారు. బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలపర్చేందుకే బీఆర్ఎస్తో సానుకూలంగా ఉన్నామని, బీజేపీని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అఖిలపక్షం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు చేసే ఆందోళనల్లో తాము పాల్గొనబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని తాము కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వారంలో సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతామని తమ్మినేని చెప్పారు. జూన్‌లో సంతకాల సేకరణ, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, నిరసనలు చేపడతామన్నారు. ప్రజాసంఘాల పోరాట కమిటీ ఉద్యమ కార్యాచరణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, తాము కూడా అందులో పాల్గొంటామని తెలిపారు. బీజేపీ ఎజెండా ప్రమాదకరం: విజయరాఘవన్, బీవీ రాఘవులు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతతత్వ ఎజెండా దేశానికే ప్రమాదకరమని విజయరాఘవన్, రాఘవులు విమర్శించారు. అదానీ అక్రమాలపై హిండెన్‌బర్గ్ నివేదిక ఇచ్చినా దానిపై పార్లమెంటులో చర్చ జరగలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజాస్వామిక హక్కులు కాలరాస్తున్నారని, పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సామాన్యులను సమీకరించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. -
ఆపత్కాలంలో ఐక్యతా రాగం!
దేశంలో వామపక్షాలు బలహీనమై పోతున్న కాలమిది. ఇదే సమయంలో మతతత్త్వ శక్తులు బలపడిపోతుండటం ప్రగతి శీల ప్రజాస్వామ్యవాదులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉభయ కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) జాతీయ నాయకత్వాలు హైదరాబాద్‌లో సమావేశమై వామపక్షాల ఐక్యత అవసరంపై చర్చించాయి. ఈ పార్టీల్లో సీపీఐ తాజాగా ‘జాతీయ పార్టీ’ హోదాను కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు వామపక్షాలు ఐక్యమైతేకాని మతతత్త్వ శక్తులను అడ్డుకోవడం సాధ్యం కాదని ప్రకటించాయి. వామపక్షాల ఐక్యత అవసరాన్ని ఎనభై ఏళ్ల క్రితమే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రమాణ పత్రం ఒకటి నొక్కి వక్కాణించడం గమనార్హం. ‘‘భారతదేశాన్ని ‘హిందూ దేశం’గా మార్చేందుకు, భారత సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో దేశాన్ని విభజించి కేవల ‘హిందూ’ దేశంగా మార్చే ‘మను స్మృతి’ని అమలు పరిచేందుకు ఆరెస్సెస్, బీజేపీలు ప్రయత్నిస్తు న్నాయి. మితవాద రాజకీయాలపై శక్తిమంతంగా పోరాడాలంటే దేశంలో వామ పక్షాల మధ్య ఐక్యత మరింత అవసరం. దేశంలోని మితవాద రాజకీ యాలపై నిరంతర పోరుకు వామపక్షాల ఐక్యత నేడు తక్షణావసరం. ఈ ఐక్యత పరస్పర విశ్వాసం ద్వారానే సాధ్యం’’. – సీపీఐ, సీపీఎం పార్టీలు హైదరాబాద్‌లో తొలిసారిగా జరిపిన సంయుక్త సమావేశంలో (10.4.2023) తీసుకున్న నిర్ణయం. వామపక్షాలైన సీపీఐ, సీపీఎంల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి ‘యూనిటీ’ సమావేశం వామపక్ష అభిమానులలో నూతనోత్తే జానికి కారణమయింది. ఉభయపక్షాల ఐక్యత తక్షణావసరాన్ని ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు గుర్తించడం ముదావహం. నిజానికి ఉభయ పార్టీలూ కలవ వలసిన అవసరాన్ని కొత్తగా ఇప్పుడు గుర్తించారని చెప్పనవసరం లేదేమో. ఎనిమిది దశాబ్దాల క్రితమే కాన్పూర్ కేంద్రంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎస్. సత్యభక్త కమ్యూనిస్టుల ఐక్యత కోసం తొలి ప్రమాణ పత్రాన్ని వెలువరించారు. హైదరాబాద్ కేంద్రంగా వెలువడిన ఉభయ పార్టీ (సీపీఐ, సీపీఎం)ల సంయుక్త సమావేశంలో ప్రసంగించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ïసీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు ఉగ్గడించిన ‘ఉభయ పక్షాల ఐక్యత అవసరం’ గుర్తించ డానికి ఇన్నేళ్ల సమయం పట్టడం... ఉభయ వామ పక్షాల ఉమ్మడి వార సత్వానికి ఒక రకంగా ‘మచ్చ’గానే భావించాలి. అయినా ఇప్పటికైనా ఏకపక్షంగా ఉభయపక్షాల ఐక్యతావాంఛ... అనేక సమస్యల పరిష్కా రానికి ఎదురుచూస్తున్న దేశానికి శుభసూచకంగా భావించాలి. ఈ సందర్భంగా కాన్పూర్ తొలి పార్టీ ప్రమాణ పత్రాన్ని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందంటే, ఆ పత్రం ఆనాటికే కాదు, ఎప్పటికీ పోరాట పటిమ గల పార్టీకి ఒక బలమైన దిక్సూచిగా ఎలా నిలబడి పోయిందో గుర్తించడం కోసమే! అందులో పేర్కొన్న ప్రమాణాలలో కొన్నింటిని ఒక్కసారి పరిశీలిద్దాం: ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా లేని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకొనేది సంపాదన కోసం, అది వీలు చిక్కకపోతే ప్రజలపై నిర్బంధ విధానాల ద్వారా ఒడుపుకోవడం కోసమే గానీ ప్రజల ప్రయోజనాలను గుర్తించి వారిని సకాలంలో ఆదుకోవడానికి కాదు; ఈ పరిస్థితుల్లో వామపక్షాల బాధ్యత పెట్టుబడిదారీ శక్తుల తరఫున కొమ్ము కాయడం కాదు, ఆ కొమ్ములను విరిచి ప్రజాబాహుళ్యం మౌలిక అవసరాలైన తిండి, బట్ట, వసతి, ఉపాధి సౌకర్యాలను కల్పించడం. తద్వారా ప్రజలు తమ కష్టార్జితాన్ని తాము స్వేచ్ఛగా అనుభవించడానికి దోపిడీకి తావు లేకుండా చేయడం కమ్యూనిస్టుల విధిగా ఉండాలి. ఇదీ స్థూలంగా 1924 నాటి కాన్పూర్ డాక్యుమెంట్ ఆదేశించింది. ఆ ‘ప్రమాణ పత్రం’ మకుటం కూడా ‘సత్యభక్త, భార తీయ సామ్యవాది దళ్’ (ది ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ) అనీ, ‘సత్యవాది’ అనీ! 1924 నాటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని సమ స్యల్ని ఎంతగా మనసు విప్పి బాహాటంగా ప్రకటించిందో చూడండి: ‘సమాజంలో నాయకులకు, రాజకీయవేత్తలకు, మత ప్రవక్తలకు, సంఘ సంస్కర్తలకు కొదువ లేదు వీరంతా ప్రజలకు చేసే మార్గ నిర్దేశానికి కొదవ లేదు. కానీ వీరు చూపే అనేక మార్గాలు ఉన్న ‘జబ్బు’ను పెంచేవే కానీ తుంచేవి కావు. పైగా చాలామంది మార్గదర్శ కులు తమ పొట్టలు నింపుకోవడం కోసం ప్రజల్ని బుద్ధి పూర్వకంగానే అగాథంలోకి నెట్టేస్తారు. కానీ, ఇలా అగాథంలోకి నెట్టే వాళ్లనుంచి ప్రజల్ని రక్షించడానికే భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టింది. ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల నుంచీ వారిని తామే రక్షిస్తామన్న హామీ ఏ పార్టీ ఇవ్వదు. ఎందుకంటే, ఏ పార్టీ వ్యవస్థా అలా ఉండదు కనుక. ప్రజలంతా ఏకమై తమ కాళ్లమీద నిలబడి సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలి. ధనికులకు, పేదలకు మధ్య దారుణంగా పేరుకు పోయిన సమస్యల్ని తగ్గించడం పార్టీ లక్ష్యంగా ఉండాలి. సమాన త్వాన్ని ప్రేమించేవారికి పార్టీలో నిస్సందేహంగా స్థానం ఉంటుంది. అంతేగాని తాము మాత్రమే అన్ని సౌకర్యాలు అనుభవించాలనుకొనే వారికి పార్టీలో స్థానం ఉండదు. ఎవరైతే ప్రజల్ని మోసం చేస్తూ, ఇతరులను దోచుకుంటూ అనుభవించగోరతారో... వారికి పార్టీలో స్థానం ఉండదు. తమ చెమటోడ్చి సంపాదించుకుంటూ, తప్పుడు మార్గాల ద్వారా సంపాదనకు ఒడిగట్టని పేద రైతులు, కార్మికులు, నిరుపేద గుమస్తాలు, చిన్నచిన్న ప్రభుత్వోద్యోగులు, రైల్వే సిబ్బంది, స్కూలు మాస్టర్లు, చిన్నచిన్న వ్యాపారులు, చిన్నస్థాయి పోలీస్ కానిస్టేబుల్స్, ప్రెస్ ఉద్యోగులు – వంటి వారు మాత్రమే మా పార్టీలో సభ్యత్వానికి అర్హులు’ అని పార్టీ ఈ పత్రం ద్వారా చాటింది. అయితే పెట్టుబడిదారీ (కాపిటలిస్ట్) వర్గానికి, వారి ప్రయోజ నాల కోసం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పనిచేసే సంస్థలను పార్టీ సహించదని చెప్పింది. అందుకనే శ్రమ జీవులంతా ఏకైక భారత కమ్యూనిస్టు పార్టీ పతాకం కింద సమకూడి, తుది శ్వాస వరకూ నిలబడాలని ప్రమాణ పత్రం నిర్దేశించింది. అంతేగాదు, రంగంలో ఉన్న పెక్కు రాజకీయ పార్టీలు వర్గ ప్రయోజనాలను ప్రతిబింబించేవి కాబట్టి... వీటన్నింటిలో ఏకైక పెద్ద కార్మికవర్గ శక్తి కమ్యూనిస్టు పార్టీ కాబట్టి అందరూ ఐక్య శక్తిగా సమీకృతం కావాలని ఆ మానిఫెస్టో ప్రకటించింది. బహుశా అందుకనే సుభాష్ చంద్రబోస్ రానున్న రోజుల్లో భారతదేశ భవిష్యత్తు మౌలికంగా వామపక్ష శక్తుల పోరాటం, త్యాగాల మీదనే ఆధారపడి ఉంటుందని జోస్యం చెప్పారు. ఎందుకంటే, విప్లవోద్యమం అనేది అరాచక ఉద్యమం కాదు, టెర్రరిస్టుల ఉద్యమమూ కాదు. భారత స్వాతంత్య్రోద్యమంలో దేశ భక్తులైన అనేకమంది మేధావులను, నాయకులను, యువకులను, రచయిత లను ‘దేశద్రోహులు’గా వలస పాలకులు ముద్రవేసి జైళ్లలో పెట్టారు. అందులో వామపక్ష భావాలు ఉన్నవారు అనేకమంది ఉన్నారు. ‘మనల్ని దేన్ని చదవకూడదని బ్రిటిష్ పాలకులు కోరుకున్నారు’ (బ్యాన్డ్ అండ్ సెన్సార్డ్: వాట్ ది బ్రిటిష్ రాజ్ డిడిన్ట్ వాంట్ అజ్ టు రీడ్’) అనే గొప్ప చారిత్రిక విశ్లేషణా గ్రంథాన్ని తాజాగా అందించిన చరిత్రకారిణి దేవికా సేథి... అప్పటి వలస భారతంలోని ‘సెన్సార్షిప్’ నిబంధనల మాలోకం గురించీ వివరించారు. స్వాతంత్య్రం వచ్చిన దాదాపు 75 ఏళ్ల తర్వాత రాసిన ఆ గ్రంథం ఎన్నో మరుగున పడిన విషయాలను తెలియచేస్తోంది. ఇంతకూ ‘దేశద్రోహి’ అంటే ఎవరు, అన్న ప్రశ్నకు టర్కీ ప్రసిద్ధ ప్రజా మహాకవి హిక్మెట్‌ను అడిగితే చెబుతాడు: ‘‘ఔను, నేను దేశద్రోహినే – మీరు దేశభక్తులైతే మీరే మన మాతృభూమి పరిరక్షకులైతే నేను నా మాతృభూమికి దేశద్రోహినే దేశభక్తి అంటే మీ విశ్వాసాల వ్యవసాయ క్షేత్రాలే అయితే దేశభక్తి అంటే మీ బొక్కసాల్లో సంపదలే అయితే దేశభక్తి అంటే మీ బ్యాంకు ఖాతాల్లో నిధులే అయితే దేశభక్తి అంటే దారి పక్క దిక్కులేని ఆకలి చావులే అయితే దేశభక్తి అంటే జనాలు కుక్కపిల్లల్లా చలికి వణికిపోవడమే అయితే ఎండా కాలంలో మలేరియాతో కునారిల్లడమే అయితే మతగ్రంథాలను వల్లించడమే దేశభక్తి అయితే పోలీసు చేతి లాఠీయే దేశభక్తి అయితే మీ కేటాయింపులూ, మీ జీతభత్యాలు మాత్రమే దేశభక్తి అయితే మూఢ విశ్వాసాల అజ్ఞానపుటంధకారపు మురికి గుంట నుంచి విముక్తి లేకపోవడమే దేశభక్తి అయితే – నేను దేశద్రోహినే!’’ ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కలి‘విడి’గానే! చర్చనీయాంశంగా కారు – కామ్రేడ్ల స్నేహబంధం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికే ఎన్నికల కార్యాచరణను అమలు చేస్తున్నాయి. కానీ ఇంకా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగలేదు. అయినప్పటికీ అధికార బీఆర్ఎస్ – వామపక్షాల పొత్తు అంశం మాత్రం గత కొన్నాళ్లుగా చర్చనీయాంశమవుతోంది. ఆ పార్టీల నేతలు పోటీలు పడుతూ దీన్ని తెరపైకి తెస్తున్నారు. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని, ఈ అవగాహనలో భాగంగా తాము అడిగే మొదటి స్థానం పాలేరేనని, ఇక్కడ తాము పోటీ చేస్తే మంచోళ్లంతా తమకే ఓట్లు వేయాలని ఆయన కోరారు. పొత్తు చర్చలు ప్రారంభం కాకుండానే ఆయన సీపీఎం పోటీ చేసే స్థానాలపై మాట్లాడటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల మిర్యాలగూడలో జరిగిన ఓ సభలో కూడా ఇక్కడి నుంచి సీపీఎం కచ్చితంగా పోటీ చేస్తుందంటూ తమ్మినేని చెప్పుకొచ్చారు. తమ్మినేని మాత్రమే కాదు.. తాము కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న అసెంబ్లీ స్థానాల పరిధిలోని సీపీఎం, సీపీఐ నేతలు కూడా ఆయా సందర్భాల్లో బీఆర్ఎస్తో పొత్తు, తాము పోటీ చేసే నియోజకవర్గాలను ప్రస్తావిస్తున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా బీఆర్ఎస్తో పొత్తు ఉంటుందని, కొత్తగూడెం నుంచి తాను తప్పనిసరిగా పోటీ చేస్తానని పార్టీ కేడర్‌కు చెపుతున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఆలోచన ఏ విధంగా ఉందన్నది బయటపడక పోవడంతో.. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ పార్టీల మధ్య ఏర్పడిన స్నేహ బంధం ఎంత దూరం కొనసాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గౌరవప్రదమైన స్థాయిలో అంగీకారం! వామపక్ష పార్టీల్లో జరుగుతున్న చర్చల ప్రకారం.. బీఆర్ఎస్తో పొత్తు కుదిరితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు అడగాలని సీపీఎం, సీపీఐలు నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది. పాలేరు, వైరా, మధిర, భద్రాచలం, ఖమ్మం, నకిరేకల్, మిర్యాలగూడ, నల్లగొండ, ఇబ్రహీంపట్నం స్థానాలు కావాలని సీపీఎం అడిగే అవకాశం ఉండగా కొత్తగూడెం, దేవరకొండ, హుస్నాబాద్, బెల్లంపల్లి, వైరా, ఇల్లందు, మునుగోడు నియోజకవర్గాలను సీపీఐ కోరే అవకాశముంది. అయితే కోరినన్ని స్థానాలు ఇవ్వకపోయినా గౌరవప్రదమైన స్థాయిలో పొత్తును అంగీకరించే యోచనలో రెండు పార్టీలూ ఉన్నట్టు సమాచారం. కనీసం మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ సభ్యత్వం కోసం బీఆర్ఎస్ను కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందో? కామ్రేడ్ల ఆలోచనలు ఎలా ఉన్నా.. వారితో తమ అనుబంధంపై బీఆర్ఎస్ పెద్దల మదిలో ఏముందన్నది అంతు పట్టడం లేదు. పలు సందర్భాల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం తెరపైకి వస్తున్నప్పటికీ ఆ పార్టీ కీలక నేతలెవరూ ఎక్కడా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. సీఎం కేసీఆర్ గానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశాన్ని కనీస మాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు. అయితే వామపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇప్పిస్తామని, ఆయా స్థానాల్లో తామే పోటీ చేస్తామని స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వామపక్ష పార్టీల నేతలకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశం కూడా ఎక్కడా చర్చకు రావడం లేదు. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తారనే సంకేతాల నేపథ్యంలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. పలువురు కమ్యూనిస్టు నాయకులకు ఏకంగా సీఎం కేసీఆర్ స్థాయిలో హామీ లభించిందన్న ప్రచారం కూడా వారికి మింగుడు పడడం లేదు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తదితరులు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోరే విషయమై సీపీఎం నేతలు అంతర్గతంగా చర్చించికుంటున్నట్టు తెలుస్తోంది. ఇక సీపీఐ కూడా కనీసం మూడు అసెంబ్లీ స్థానాలు కావాల్సిందేనని పట్టుబట్టే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ, ఇతర పదవుల గురించి కూడా చర్చించాలనే యోచనలో సీపీఐ పెద్దలున్నట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా పొత్తు విషయంలో తగ్గేదేలేదని ఆ పార్టీలు చెబుతున్నాయి. తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నందున ఆ రెండు నియోజకవర్గాల తర్వాతే ఏ స్థానం గురించైనా చర్చ జరుగుతుందని వామపక్ష పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం! వామపక్ష పార్టీలతో పొత్తు చర్చలు జరుగుతాయి కానీ, అధికారికంగా పొత్తు కుదిరే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తుండటం సందిగ్ధతకు తావిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు కుదుర్చుకోలేదని, ఆ రెండు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి, 2023లో లెఫ్ట్‌తో కలిసి వెళితే తాము గతం కంటే బలహీనపడ్డామని తామే అంగీకరించినట్టు అవుతుందనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ నాయకుల్లో ఒకరిద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారని, వారు కోరుతున్న స్థానాలను వదులుకునేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధంగా లేదని, స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ స్థానాల్లో కేడర్‌ను నిలబెట్టుకునేదెట్టా? లెఫ్ట్‌తో పొత్తు అంశం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వామపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయని భావిస్తున్న స్థానాల్లో భద్రాచలం మినహా మిగిలిన చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయా స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న కందాల ఉపేందర్‌రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు తదితరులకు తమ నియోజకవర్గాల్లో కేడర్‌ను నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారుతోంది. ఒకవేళ ఆయా స్థానాలు లెఫ్ట్ పార్టీలకు వదిలివేస్తే పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎక్కడ జారిపోతుందోననే ఆందోళన స్థానిక బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదాస్పద ప్రకటనలకు కూడా సిద్ధమవుతున్నారు. కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మిర్యా లగూడ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా కొద్దిరోజుల క్రితం.. అక్కడ జూలకంటి రంగారెడ్డి సీపీఎం తరఫున పోటీ చేస్తే గెలుపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పినా, ఆ తర్వాత సీపీఎం నేతలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగూడెంలో అయితే వనమాతో పాటు జలగం వెంకట్రావు, గడల శ్రీనివాసరావు తమకంటే తమకే టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తంమీద లెఫ్ట్ పార్టీలతో పొత్తు అంశం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఆశావహులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.