సాక్షి, హైదరాబాద్: సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండె పోటుకు గురయ్యారు. దీంతో, మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. ఇక, గతంలోనే తమ్మినేని స్ట్రోక్ రావడంతో స్టంట్ కూడా పడింది.
వివరాల ప్రకారం.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం గుండె పోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు.
ఈ నేపథ్యంలో అంబులెన్స్‌లో తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. గతంలో తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు. తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి కొంచెం విషమంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment