ఏం సాధించారని కూటమి నేతల సంబరాలు: సీపీఎం | Cpm Demands Not To Separate Kk Line From Waltair Division | Sakshi
Sakshi News home page

ఏం సాధించారని కూటమి నేతల సంబరాలు: సీపీఎం

Published Fri, Feb 7 2025 11:16 AM | Last Updated on Fri, Feb 7 2025 12:15 PM

Cpm Demands Not To Separate Kk Line From Waltair Division

సాక్షి, విశాఖపట్నం: కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్‌ చేశారు. వాల్తేర్ డివిజన్‌ను రెండు ముక్కలు చేయడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. 10,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని.. ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా ఒరిస్సా పరిధిలో కలిసిపోతుందని సీపీఎం పేర్కొంది.

అరకు అభివృద్ధికి ఒరిస్సా మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం సాధించారని కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు. జోన్ ఏర్పాటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీపీఎం తెలిపింది.

కాగా, కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్‌ భవన్‌లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.

విశాఖ పర్యాటక భూభాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్‌లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్‌ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్‌ నుంచి కేకే లైన్‌ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వాపోయారు. రాయగడ డివిజన్‌లో కేకే లైన్‌ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement