సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ.. జగదాంబ సెంటర్‌లో సీపీఎం నిరసన చేపట్టింది. మిట్టల్ స్టీల్ కోసం చంద్రబాబు గనులు అడగడం దుర్మార్గం అంటూ సీపీఎం నేతలు మండిపడుతున్నారు. వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏమిటంటూ వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
వైజాగ్ స్టీల్ కోసం గనులు అడగకుండా మిట్టల్‌కు చంద్రబాబు ఎలా గనులు ఇవ్వాలని కోరుతారంటూ సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని.. వైజాగ్ స్టీల్‌ను కాపాడకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీపీఎం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment