
సాక్షి, విశాఖపట్నం: గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు ప్రభుత్వం నట్టేట ముంచేసింది. మెయిన్స్ వేయిదా వేస్తామని ఎమ్మెల్సీ చిరంజీవి ద్వారా అభ్యర్థులను ప్రభుత్వం నమ్మించింది. టీడీపీ నేతల మాటలు నమ్మి గ్రూప్-2 అభ్యర్థులు మోసపోయారు. పరీక్ష వాయిదా కోసం ఆందోళనలు చేసినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదు.
విశాఖలో గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన ఉధృతమైంది. ఇసుకతోట నేషనల్ హైవేపై బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాస్తారోకో చేస్తున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సీఎం డౌన్ డౌన్ అంటూ గ్రూప్-2 అభ్యర్థులు నినాదాలు చేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన విరమించాలని పోలీసులు కోరుతున్నారు.
కళ్లు తిరిగి పడిపోయిన గ్రూప్-2 అభ్యర్థి
గ్రూప్-2 అభ్యర్థి శ్యామ్ కళ్లు తిరిగిపడిపోయాడు. శ్యామ్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మరో అభ్యర్థి చిరంజీవి కూడా సొమ్మసిల్లి పడిపోయాడు. రోస్టర్‌లో సవరణలు చేశాకే పరీక్షకు హాజరవుతామని.. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం మా గోడు పట్టించుకోవాలని గ్రూప్-2 అభ్యర్థులు చెబుతున్నారు.
విజయవాడ: రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి స్పష్టత ఇంకా రాలేదు. ఏపీపీఎస్సీ కార్యాలయానికి గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మూడు రోజులుగా ధర్నాలోనే ఉన్నామని గ్రూప్ 2 మెయిన్స్ అభ్యర్థి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని.. వాయిదా పడుతుందంటూ లోకేష్ చంద్రబాబు చెప్పారు. ఆ నమ్మకంతోనే ఎక్కడ వాళ్లం అక్కడే ఆగిపోయాం. రోస్టర్ విధానంలో తప్పులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రోస్టర్ విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టాలి. రాష్ట్ర విధానాన్ని సరిచేసి ఎగ్జామ్ పెట్టకపోతే మళ్లీ జ్యూడిషల్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇంకో రెండు, మూడు సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే గ్రూప్-2 ప్రిపరేషన్ కోసం ఇల్లు వదిలి కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నాం. ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా రాయలేమని నాయక్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment