సాక్షి, విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి,అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు,తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment