Hevy rains
-
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
సాక్షి, విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి,అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు,తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. -
అనంత వర్షాలు...
-
భారీ వర్షాలు.. ఇంటి పంటలు.. ఎత్తు మడులు ఎంతో మేలు!
వాతావరణ మార్పుల నేపథ్యంలో తరచూ వస్తున్న భారీ వర్షాలు, వరదలు కూరగాయల సాగుదారులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూరగాయల లభ్యత కూడా తగ్గిపోతుంది. ధరలు పెరుగుతాయి. అందుకని.. మనం తినే ఆకుకూరలు, కూరగాయలను వీలైనంత వరకు మనకు మనమే ఇంటి పట్టున, ఎంత కొంచెం స్థలం ఉన్నా సరే, సేంద్రియంగా పండించుకునే ప్రయత్నం ఇప్పటికైనా మొదలు పెట్టడం ఉత్తమం. కొద్ది స్థలాల్లో, పెరట్లో కూరగాయలు పెంచే సన్నకారు రైతులు గానీ.. డాబా/మేడ పైన, ఇంటి ముందు, వెనుక ఖాళీ స్థలాల్లో కూరగాయలు సాగు చేసుకునే వారు గానీ ఎత్తుమడుల (రెయిజ్డ్ బెడ్స్)ను నమ్ముకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. చదును సాళ్లలో కన్నా బోదెలు తోలి లేదా ఎత్తు మడులు చేసుకోవటం మేలు. వర్షాలు ఎక్కువైనా లేదా తక్కువైనా ఇవి ఆదుకుంటాయన్నది ‘వరల్డ్ వెజిటబుల్ సెంటర్’ నిపుణుల సూచన. ఎత్తుమడులతో ఉపయోగాలు ఎత్తుమడులను ఏర్పాటు చేసుకొని కూరగాయ పంటలు నాటుకుంటే భారీ వర్షం కురిసినా నీటి ముంపు సమస్య ఉండదు. కాబట్టి నష్టం అంతగా ఉండదు. అధిక తేమ సమస్య నుంచి భూమిపై పెరుగుతున్న మొక్కల కన్నా ఎత్తు మడుల్లో పెరిగే మొక్కలు త్వరగా కోలుకుంటాయి.ఎత్తు మడిని ఇటుకలతో లేదా చెక్కలతో లేదా వెదురు బద్దలతో కూడిన దడితో గానీ.. ఏర్పాటు చేసుకోవచ్చు. ఎత్తు మడిని నేరుగా నేలపైన / మేడపైన / ఇంటి ముందు, వెనుక, పక్కన ఖాళీ జాగాల్లో గచ్చుపైన ప్లాస్టిక్ షీట్ వేసి ఏర్పాటు చేసుకోవచ్చు. అడుగున ఏమీ లేకుండా మట్టిపైనే ఎత్తుమడిని నాలుగు వైపులా ఇటుకలో, చెక్కలో పెట్టి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటప్పుడు.. నేల పైపొర గట్టిపడి ఉంటుంది. దానిపైనే మడిని ఏర్పాటు చేస్తే మొక్కల వేర్లు ఆ గట్టిపడిన నేలలో నుంచి కిందికి వెళ్లడానికి కొంత ఇబ్బంది అవుతుంది. ఈ ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. ఎత్తుమడి ఏర్పాటు చేసుకునే స్థలంలో అరడుగు లోతు మట్టిని తవ్వి తీసి వేసి.. అక్కడ ఎత్తుమడిని ఏర్పాటు చేసుకుంటే మేలు. ఎత్తు మడికి నాలుగు వైపులా గోడలు కూడా భారీ వర్షానికి, నీటి ప్రవాహానికి దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్థానికంగా దొరికే రాళ్లు, అరటి బెదెలు, కట్టెలు లేదా చెక్క ప్యానళ్లను ఎత్తు మడి చుట్టూతా దన్నుగా పెట్టుకుంటే ఎత్తుమడి కింద మట్టి కోతకు గురికాకుండా ఉంటుంది. ఎత్తు మడులను ఏటవాలుగా ఉండే నేలపై ఏర్పాటు చేసుకోకూడదు. చదరంగా ఉండే నేలపైనే ఏర్పాటు చేయాలి. ఎత్తుమడి లోపల మట్టి మిశ్రమం సమతలంగా ఉండాలి. మొక్కల మధ్య గడ్డీ గాదంతో ఆచ్ఛాదన చేసుకుంటే.. వాన నీటి ధాటికి విత్తనాలు, మట్టి, మట్టితో పాటు పోషకాలు కొట్టుకుపోకుండా ఉంటాయి. చదవండి: ఈ ఇల్లుకు కరెంటు అక్కర్లేదు.. ఎందుకంటే.. -
ఢిల్లీలో భారీ వర్షలు
-
‘టిట్లీ’ ముప్పు.. మూడో ప్రమాద హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం : తుపాను, బలమైన గాలులు వీస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం కళింగపట్నం, భీమునిపట్నం, గంగవరం, విశాఖపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం బలపడి తుపాను మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారని సమాచారం. టిట్లీ ప్రభావం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలపై తీవ్రంగా ఉండనుందని అధికారులు తెలిపారు. (చదవండి : ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్! ) రేపు, ఎల్లుండి విస్తారమైన వర్షాలు కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో ‘టిట్లీ’ కేంద్రీకృతమై ఉందని అధికారులు వెల్లడించారు. వాయుగుండం బలపడి ఈరోజు రాత్రి (మంగళవారం) లేదా రేపు ఉదయం తుపానుగా మారే అవకాశం ఉందని అన్నారు. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దిశగా కొన్ని గంటలపాటు ప్రయాణించి ఈ నెల 11న కళింగపట్నం (ఏపీ) - గోపాలపూర్ (ఒడిషా) మధ్య తుపాను తీరం దాటి పశ్చిమ బెంగాల్ వైపు కదులుతుందని అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ రోజు తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. బుధవారం 55-65 కిలోమీటర్ల వేగంతో, గురువారం 80-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. -
ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు ‘టిట్లీ’ తుఫాన్!
-
ఉత్తరాంధ్ర వైపు ‘టిట్లీ’ తుఫాన్!
సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లిరూరల్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. రానున్న 48 గంటల్లో తుపానుగా మారి ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుంది. ఈ తుపానుకు ‘టిట్లీ’ పేరును సూచించనున్నారు. ఈమేరకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి వెల్లడించింది. సోమవారం రాత్రికి ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి 620, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 650 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశలో పయనిస్తోంది. మంగళవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారనుంది. దీని తీవ్రత పెరిగి బుధవారం నాటికి తుపానుగా మారి, ఉత్తరాంధ్ర, ఒడిశాల వైపు పయనించనుందని ఐఎండీ వివరించింది. వాయుగుండం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్లు, తుపానుగా మారాక బుధ, గురు వారాల్లో 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతోనూ బలమైన గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరకోస్తా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ డి.వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, తుపాను ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల ప్రవేశం ఆలస్యమవుతుందని ఐఎండీ తెలిపింది. -
ప్రధాన ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక!
సాక్షి, విశాఖపట్నం : తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఈ తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి 310, గోపాల్‌పూర్‌కు 300 తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పూరి మధ్య గోపాల్‌పూర్‌కు తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 60 నుండి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రపు అలలు సాధారణం కంటే 0.5మీటర్లు ఎగిసిపడే అవకాశం ఉన్నందున శ్రీకాకుళంలోని లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే. -
పత్తికి జీవం
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తిచేలకు జీవం పోశాయి. పదిహేను రోజులుగా వర్షం లేకపోవడంతో పత్తి చేలు వాడుపట్టే దశకు చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముందు వేసిన చేలు కాయలు పగలడంతో పత్తిని కూడా ఏరుతున్నారు. జిల్లాలో 2లక్షల 26 వేల 345 హెక్టార్లలో పత్తి సాగుచేశారు. ఖరీఫ్ ప్రారంభ దశలో వర్షాలు మెట్ట పంటలకు అనుకూలంగా కురవడంతో ఆయకట్టుతోపాటు ఆయకట్టేతర ప్రాం తాలైన దేవరకొండ, నల్లగొండ డివిజన్లలో జూలై చివరి వారంలో పత్తి గింజలు విత్తుకున్నారు. వారం వారం వర్షాలు కురుస్తుండడంతో పత్తి చేలలో కలుపుతీసుకోవడంతో పాటు రెండు మూడు సార్లు ఎరువులకు పెట్టుకున్నారు. దీంతో చేలు ఏపుగా పెరిగి పూత, కాయ దశకు చేరుకున్నాయి. పదిహేను రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతోపాటు ఎండాకాలాన్ని తలపించే విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పత్తి చేలు వాడుపట్టాయి. ఆకులు ఎర్రబారి కొన్ని ప్రాంతాల్లో పూత, పిందెలు రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులు పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని రైతులతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన చెందారు. కనీ సం పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి వస్తాయో రావోనన్న భయం నెలకొంది. కానీ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లావ్యాప్తంగా సోమ, మంగళ, బుధవారాలలో కురిసిన వర్షాలు పత్తిచేలకు జీవం పోశాయి. చేలు ఏపుగా కనిపిస్తున్నాయి. రైతులు తిరిగి ఎరువులకు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. 34 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్‌లో పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 34 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అస్కారం ఉందని చెబుతున్నారు. రైతులకు, మెట్ట పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తుడడం పత్తి రైతులకు కలిసివచ్చే అవకాశం ఉంది. 25 మండలాల్లో కురిసిన వర్షం జిల్లాలో 25 మండలాల్లో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం ఇలా ఉంది. హాలియా మండలంలో 34.4 మిల్లీమీటర్లు, కనగల్ 29.2, దామరచర్లలో 27.0, పెద్దవూరలో 26.4, నల్లగొండలో 15.6, గుర్రంపోడులో 15.5, చింతపల్లిలో 14.6, శాలిగౌరారం 13.6, మర్రిగూడలో 13.4, నిడమనూరులో 9.8, దేవరకొండలో 9.4, నాంపల్లిలో 9.2, కేతేపల్లిలో 9.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే విధంగా చిట్యాలలో 6.2, మిర్యాలగూడలో 4.8, కట్టంగూరులో 3.6, మునుగోడులో 3.6, పీఏపల్లిలో 3.4, త్రిపురారంలో 2.0, డిండిలో 1.8, తిప్పర్తి 1.4, చండూరులో 0.8 మిల్లీమీటర్లు కురిసి సగటు వర్షపాతం 10.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం కూడా జిల్లా వ్యాప్తంగా వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆనందంగా ఉంది వర్షాలు రాకపోవడంతో పత్తి చేను వాడిపట్టింది. ఇక పెట్టుబడి కూడా చేతికి వస్తుందో రాదో నని బాధపడ్డాం. ఎకరా నికి రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టి రెండు ఎకరాల్లో పత్తి గింజలు విత్తాను. పదిహేను రోజులుగా వర్షాలు రాకపోవడంతో అప్పుల పాలవుతామని భయపడ్డా. కానీ మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఆనందంగా ఉంది. పత్తి చేను మంచిగా పెరిగి పూత, కాయలు బాగానే పడుతున్నాయి. దిగుబడి బాగానే వస్తుందని అనుకుంటున్నాను.– అందే నరేష్, రైతు గుండ్లపల్లి పత్తి చేలకు మంచి అనుకూలం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి చేలకు మంచి అనుకూలం. వాడుపట్టే దశలో వర్షాలు కురవడం వల్ల చేలకు బలం చేకూరుతుంది. పూత, కాయలు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే వారం పది రోజుల్లో మరోసారి వర్షం కురిస్తే మంచి దిగుబడులు వచ్చి రైతులు లాభాలు పొందే అవకాశం ఉంది. ఏమైనా తెగుళ్లు ఆశించినట్లు కనిపిస్తే వ్యవసాయాధికారులను సంప్రదించి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అప్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు చోట్లు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 55-75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో అధికారులు అన్ని ప్రధాన ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి ఆదేశాలు జారీచేశారు. తీరప్రాంతంలోని మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్(08942 240557) ఏర్పాటు చేశామని తెలిపారు. తీరప్రాంతంలోని మెరైన్, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొరుగు రాష్ట్రం ఒడిశాలో కూడా వర్షాలు కురుస్తుండటంతో నాగావళి, వంశధార నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
పాతాళ గంగ మరింత పైకి..
సాక్షి,ఆదిలాబాద్: పాతాళ గంగ మరింత పైకి వచ్చింది. జిల్లాలో ఈ యేడాది కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది నీళ్లు అధికంగా పైకి రావడం గమనార్హం. జిల్లాలో జూలై, ఆగస్టు మాసాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దీంతో పాతాళ గంగ ఉబికి పైకొస్తోంది. జిల్లాలో సగటున 1.94 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ఉన్నాయి. బజార్హత్నూర్, జైనథ్, నేరడిగొండ, తాంసి, నార్నూర్‌లలో మీటర్ కంటే తక్కువ లోతులోనే జలాలు లభ్యమవుతున్నాయి. జిల్లా అంతటా.. జిల్లా అంతటా భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. అయితే ఈ జలాలు ప్రస్తుతం స్థిమితంగా ఉండవని, వర్షాలు తగ్గుముఖం పట్టగానే కొంత దిగువకు చేరుకుంటాయని భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా వర్షాకాలం ముగిసే సమయంలో అక్టోబర్‌లో భూగర్భ జలాలపై ఒక అంచనాకు రావచ్చని పేర్కొంటున్నారు. అయితే గతేడాది కంటే ఈయేడాది కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు భూస్థాయి నుంచి చాలా తక్కువ లోతులోనే ఉన్నాయని చెబుతున్నారు. ప్రతినెల చివరిలో జిల్లా భూగర్భ జలాల శాఖ జిల్లాలోని భూగర్భ జలాలను కొలవడం జరుగుతోంది. జిల్లాలోని 15 మండలాల్లో ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిని కొలుస్తారు. భూస్థాయి నుంచి ఎంత లోతులో ఈ నీళ్లు ఉన్నాయనే దానిపై నివేదిక తయారు చేసి నెల చివరిలో ప్రకటించడం జరుగుతుంది. జిల్లాలో ప్రధానంగా వివిధ రకాల నేలలు ఉన్నాయి. గ్రానైట్స్, బాసల్ట్సŠ, లైమ్‌స్టోన్, శాలెస్, ట్రాప్స్ రకాల నేలలు ఉన్నాయి. మొదట మొరంతో ఉండి ఆ తర్వాత లోపల బండరాయి కలిగి తిరిగి మట్టి వంటి నేలలు అధికంగా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాల అంచనా వేసిన దానికంటే తర్వాత రోజుల్లో గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రధానంగా నేరడిగొండ, గుడిహత్నూర్ వంటి మండలాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంది. ఆదిలాబాద్ చుట్టుపక్కల సున్నపురాయి అధికంగా ఉంది. కొన్ని మండలాల్లో గణనీయం.. జిల్లాలో జూన్ మొదటి వారంలోనే తొలకరి వర్షాలు మురిపించాయి. ఆ తర్వాత సుమారు 15 రోజుల పాటు ముఖం చాటేశాయి. ఆ నెల చివరి వారంలో మళ్లీ కొంత వర్షం కురువడం ఊరటనిచ్చింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 204 మిల్లీమీటర్లు ఉండగా, 246 మిల్లీమీటర్లు నమోదైంది. ఇది సాధారణం కంటే అధికంగానే నమోదైనప్పటికీ ఆ నెలలో డ్రైస్పెల్ అధికంగా నమోదైంది. అయితే జూలైలో మాత్రం ఏకధాటిగా వర్షాలు కురువడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రధానంగా జిల్లాలోని జలాశయాలతో పాటు చెరువులన్ని నిండిపోయాయి. ఎటుచూసినా జలకళ సంతరించుకుంది. జూలై నెలలో సాధారణ వర్షపాతం 300 మిల్లీమీటర్లు కాగా, 375 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆగస్టులో 333 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా, 598 మిల్లీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. 18 మండలాల్లో 15 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. మిగతా 3 మండలాల్లో సాధారణ వర్షపాతం కురిసింది. భూగర్భజలాలు స్థిమితంగా ఉండవు వర్షపాతం తగ్గినకొద్ది భూగర్భ జలాల పరిస్థితిలో మార్పు వస్తుంది. జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలకు సగటున 1.94 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. అక్టోబర్ వరకు వర్షాలు కురిసిన తర్వాత జిల్లా భూగర్భ జలాలపై ఒక అంచనాకు రావచ్చు. జిల్లాలో వివిధ రకాల నేలలు ఉన్నాయి. పైన మట్టి మధ్యలో సున్నపురాయి, ఇతర ఖనిజాలు ఉండి తిరిగి మట్టి నేలలు కలిగి ఉన్నాయి. దీంతో జలాలు దిగువకు పోయేది అంచనా వేసిన తర్వాత కూడా కొంత మార్పు వస్తుంది. – పుల్లయ్య, భూగర్భ జలాల శాఖ జిల్లా అధికారి -
ప్రాజెక్టులకు జలకళ
జైనథ్(ఆదిలాబాద్): ఓ పక్క భారీ వర్షాలతో జిల్లాలో ఖరీఫ్ పంటలు నాశనం కాగా, మరో పక్క సాగు నీటి ప్రాజెక్టుల్లో భారీగా వరద నీళ్లు చేరాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సాగు నీటి ప్రాజెక్టుల్లో చేరిన జలసిరి రైతులకు కొంత భరోసానిస్తోంది. ఖరీఫ్ నష్టాన్ని కొంతలో కొంతనైనా వచ్చే రబీ సీజన్లో భర్తీ చేసుకునేందుకు భరోసా కనిపిస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు, లక్ష్మీపూర్ రిజర్వాయర్, తాంసీ మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్టుల్లో భారీ నీటి ని ల్వలు చేరాయి. దీంతో రబీ సీజన్లో ఆదిలాబాద్, జైనథ్, బే ల, తాంసి మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉండడంతో వచ్చే రబీ సీజన్‌కు సాగు నీటి ఇబ్బందులు తప్పాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాత్నాలలో 1 టీఎంసీ నీటి నిల్వ.. జిల్లాలో 24 వేల ఎకరాల ఆయకట్టు కలిగిన సాత్నాల ప్రాజెక్టులో ప్రస్తుతం 1టీఎంసీ నీటి నిల్వలు ఉన్నాయి. 286.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 1.24టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న సాత్నాలలో ప్రస్తుతం వరద నీళ్లు భారీగా వచ్చాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇన్‌ఫ్లో చాలా ఎక్కువగా రావడంతో పలుమార్లు గేట్లు ఎత్తారు. ఈ సంవత్సరం మొత్తం 4.042 టీఎంసీల ఇన్‌ఫ్లో రాగా, ఇప్పటి వరకు గేట్లు, స్పిల్‌వే ద్వారా 3.038 టీఎంసీల నీళ్లను వదిలారు. ప్రస్తుతం 285.5మీటర్ల ఎత్తులో 1.004టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇంకా 507 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కాగా సాత్నాల పరిధిలో ఆదిలాబాద్, జైనథ్, బేల మండలాల్లోని సుమారు 25 గ్రామాల్లో 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నిండుకుండలా లక్ష్మీపూర్ రిజర్వాయర్.. సాత్నాల ప్రాజెక్టు వృథా నీటిని ఒడిసిపట్టేందుకు 2008లో రూ. 56 కోట్ల లక్ష్మీపూర్ గుట్ట కింద రిజర్వాయర్ పనులు ప్రారంభించారు. ఇటీవలే సాత్నాల ఆధునికీకరణ పనుల్లో భాగంగా రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు రూ.30 కోట్లతో సీసీ లైనింగ్ పనులు చేపట్టారు. 250.6 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.153 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న లక్ష్మీపూర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం పూర్తి సామర్థ్యం మేరకు నీళ్లు చేరాయి. 0.153 టీఎంసీ నీళ్లు చేరడంతో మాకోడ వైపు ఏర్పాటు చేసి బ్రీచ్ నుంచి బెల్లూరి వాగులో నీళ్లు పారుతున్నాయి. దీని కుడి కాలువ కింద మాకోడ, బెల్లూరి, బెల్గాం, ఉమ్రి, ఖాప్రి, ఆవల్పూర్ గ్రామాల్లో 2800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎడమ కాలువల కింద జైనథ్, మాకోడ, దీపాయిగూడ, కుతుంపూర్, ఖాప్రి, బెల్గాం, కూర గ్రామాల్లో 4800 ఎకరాల్లో పంటలు సాగవుతాయి. మత్తడి వాగుకు జలకళ.. తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామ సమీపంలోని మత్తడివాగు ప్రాజెక్టుకు సైతం జలకళ సంతరించుకుంది. 277.5 మీటర్ల ఎఫ్ఆర్ఎల్, 0.57టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 277.05 మీటర్ల ఎత్తులో 0.50 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కాలువ కింద వడ్డాడి, జామిడి, కప్పర్ల, బండల్‌నాగాపూర్, పొచ్చెర, ఈదుల సావర్గామ, గోట్కూరి, భీంసరి, నిపాని, జందాపూర్, చాంద తదితర గ్రామాల్లో 8500 ఎకరాల్లో ఆయకట్టు ఉంది. రబీ సాగుకు చింత లేదు.. ఈ సంవత్సరం వర్షాలకు ఖరీఫ్‌లో పత్తి, సోయా పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఖరీఫ్ సీజన్ పోయినట్లే అనిపిస్తోంది. కాకపోతే రబీలో ఈ నష్టాన్ని కొంత పూడ్చవచ్చనే ఒక అశ ఉంది. సాత్నాల ప్రాజెక్టులో నీళ్లు భారీగా చేరడంతో రబీలో శనగ పంట వేసుకోవచ్చు. ప్రాజెక్టు నిండడం చాలా సంతోషంగా ఉంది. – కామ్రే ఆనంద్‌రావు, యువరైతు, లక్ష్మీపూర్, జైనథ్ మండలం -
బీ(ధీ)మా కల్పించేనా..!
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ప్రధానంగా పత్తి, సోయా పంటలను పూర్తిగా కోల్పోయిన రైతాంగం కుదేలైంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పంటకు సంబంధించి ప్రాథమిక అంచనాలు వేసినప్పటికీ త్వరలో పూర్తిస్థాయి సర్వే నిర్వహిస్తామని ప్రకటించింది. ఒకవేళ ఈ సర్వే నిర్వహించి నివేదిక పంపినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారం విడుదల అవుతుందా.. లేదా అనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులకు బీమానే ధీమా ఇవ్వాల్సింది. గతేడాది వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదు. అసలు ఆ పరిహారం వస్తుందా.. రాదా అనేది తెలియని పరిస్థితి. వాతావరణ ఆధారిత బీమాలో అటు వర్షాభావ పరిస్థితుల్లోనూ, ఇటు అతివృష్టిలోనూ పరిహారం అందజేసే పరిస్థితి ఉంటుంది. ప్రీమియం చెల్లించినా పరిహారం ఎప్పుడొస్తుందో అనే విషయంలో స్పష్టత లేకపోవడం రైతులను అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా ఈ బీమాకు సంబంధించిన కార్యాలయం ఆదిలా బాద్‌లో లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉంది. దీంతో వ్యవసాయ అధికారులను రైతులు సంప్రదించినా పరిహారం విషయంలో వారు ఒక స్పష్టతను ఇవ్వలేకపోతున్నారు. అసలు పరిహారం వస్తుందా.. రాదా అనే విషయాన్ని కూడా చెప్పలేకపోవడంతో రైతుల్లో అయోమయం కనిపిస్తోంది. దీంతో అసలు ప్రీమియం చెల్లించి లాభమేమిటన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. దీంతోనే పలువురు రైతులు వాతావరణ ఆధారిత, ఫసల్‌బీమా యోజన ప్రీమియం గడువులోగా బ్యాంకుల్లో రుణం తీసుకునేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న రైతుకు సంబంధించి ప్రీమియం డబ్బులను రుణం నుంచే తీసుకోవడం జరుగుతుంది. దీంతో రైతులు గడువు తర్వాతే రుణం తీసుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారంటే ఈ బీమాలపై ధీమా లేకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో లక్ష మందికి పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో పంటల సాధారణ విస్తీర్ణం లక్షా 92,626 హెక్టార్లు కాగా, అందులో లక్షా 86,007 హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా లక్షా 28,300 హెక్టార్లలో పత్తి పంట సాగైంది. ఇది సాధారణ విస్తీర్ణం కంటే 3 శాతం అధికం. సోయాబీన్ 30,120 హెక్టార్లలో సాగైంది. కందులు 21,260 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు కొద్దిమొత్తంలో సాగయ్యాయి. కాగా పత్తిని మండల యూనిట్‌గా వాతావరణ ఆధారిత బీమా కింద, సోయా, కందులు, ఇతర పంటలు గ్రామ యూనిట్‌గా ఫసల్ బీమా యోజన కింద బీమా చెల్లించేందుకు గత నెలలో గడువులోగా కొద్ది మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించారు. బ్యాంక్ రుణం ద్వారా కొంతమంది, నాన్‌లోనింగ్ రైతులు కూడా మీసేవ ద్వారా నేరుగా ఈ ప్రీమియం కట్టి బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫసల్ బీమాలో రైతులు 10వేలలోపే ఉండడం గమనార్హం. ఇక వాతావరణ ఆధారిత బీమాలో వేల మంది రైతులు ప్రీమియం కట్టారు. పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా ఏ యేడాదికి సంబంధించి ఆ యేడాది బీమా పరిహారం డబ్బులు అందజేయాలని రైతుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. తద్వారా తదుపరి పంటల సాగులో పెట్టుబడికి కొంత ఉపయుక్తంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2017లో పలువురు రైతులు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లించినా వారికి పరిహారం రాకపోవడంతో ఈయేడాది పలువురు రైతులు ఈ బీమా పొందేందుకు ఆసక్తి చూపడం లేదనేది స్పష్టమవుతోంది. సర్వే ప్రారంభం.. జాతీయ బీమా కంపెనీ(ఎన్ఐసీ) జిల్లాలో ఫసల్ బీమా యోజనకు సంబంధించి సర్వే మొదలు పెట్టింది. ప్రధానంగా పంట నష్టం సంభవించిన తర్వాత రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఈ బీమా అధికారులపై సర్వేను త్వరగా ప్రారంభించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కలెక్టర్ కూడా ఎన్ఐసీ అధికారులతో సమావేశమై రైతులకు పరిహారం అందించే విషయంలో సర్వే చేసి పరిహారం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కాగా మంగళవారం జైనథ్, బేల, ఆదిలాబాద్‌రూరల్ మండలాల్లో ఈ సర్వే మొదలుపెట్టారు. ఎన్ఐసీ క్లస్టర్ మేనేజర్ రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖాధికారులతో కలిసి సర్వే ప్రారంభించారు. ఇచ్చోడ, తలమడుగు, తాంసి, భీంపూర్లలో బుధవారం నుంచి సర్వే చేపట్టారు. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ తర్వాత పరిహారం విషయంలో స్పష్టత వస్తుంది. అత్యధికంగా వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి రైతులు ప్రీమియం చెల్లించి ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి సర్వే చేసి రైతులకు న్యాయం చేస్తేనే జిల్లాలో అధిక మంది రైతులకు ప్రయోజనం దక్కే అవకాశం ఉంది. -
చేయి చేయి కలుపుదాం
కోసిగి (కర్నూలు): చేయి చేయి కలిపి కేరళ వరద బాధితులను ఆదుకుందామని బాలుర ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఖలీల్ అహ్మద్, ఏపీటీఎఫ్ మండల అధ్యక్షులు రాముడు, నయకులు హొలగుంద కోసిగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కోసిగిలో వరద బాధితుల సహాయార్థం వ్యాపార దుకాణాలు, ఇంటింటా తిరిగి విరాళాలు సేకరించారు. వారు మాట్లాడుతూ కేరళలో వరద ముంచుకొచ్చి ప్రజలు సర్వ కోల్పోయి నిరాశ్రులయ్యారు. విరాళాలు సేకరించిన వారిలో పీడీఎస్‌యూ డివిజన్ కార్యదర్శి లోకారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. మంత్రాలయం రూరల్: కేరళలో సంభవించిన వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం తరుపున విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మంగళవారం మండల నాయకులు విశ్వనాథ్, నవీన్ నేతృత్వంలో మండల కేంద్రంలో పర్యటించి రూ.39వేలు సేకరించారు. ప్రిన్సిపాల్ చేతుల మీదుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపుతామని తెలిపారు. కార్యక్రమంలో రఘు, జయలక్ష్మి, ఎల్లప్ప, అంజి, ప్రభుత్వ, రాఘవేంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కౌతాళం: మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు మల్లయ్య, మండల పార్టీ కార్యదర్శి లింగన్న తెలిపారు. వారు మాట్లాడుతూ కేరళ రాష్ట్రం వరదలతో నష్టపోయిన బాధితులకు విరాళాలు సేకరించామన్నారు. అలాగే కౌతాళంలోని ప్రతిభ హైస్కూల్ కరస్పాండెంట్ దూద్‌బాషా కుటుంబం కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి రూ.12వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపుతున్నట్లు దూద్ బాషా తెలిపారు. -
పునరావాసం మిగిలింది..
ఇది ఆదిలాబాద్ మండలం చించుఘాట్ నుంచి గుండంలొద్ది గ్రామానికి వెళ్లే దారి. భారీ వర్షాల కారణంగా లక్ష్మీపూర్ ప్రాజెక్టు(గుండంలొద్ది) పొంగి పొర్లడంతో వరద ధాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో గుండంలొద్దికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామంలో 30 ఇళ్లు ఉండగా, సుమారు 150 నుంచి 200 మంది నివసిస్తున్నారు. వారం రోజులుగా ఈ గుండంలొద్దిని చేరుకోలేని పరిస్థితి. కొంత వరద ప్రభావం తగ్గడంతో ఇప్పుడు ఆ గ్రామానికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేసే పని మొదలైంది. ఆ గ్రామానికి వెళ్లే దారి లేకపోవడంతో ఆదివాసీ నవయువ సూర్యవంశీ యూత్ సభ్యులు ఇలా వాగులో ఒకవైపు నుంచి మరోవైపునకు వరుసగా నిలబడి ఒక చెయ్యి నుంచి మరో చెయ్యికి సామగ్రి అందజేస్తూ ఈ గట్టు నుంచి ఆ గట్టుకు చేర్చి గ్రామంలోని ప్రజలకు సహాయ పడుతున్నారు. ఇలా అధికార యంత్రాంగంతోపాటు యూత్, స్వచ్ఛంద సంస్థలు తలా ఒక చెయ్యి వేస్తే జిల్లాలో పునరావాసం వేగిరమయ్యే అవకాశం ఉంటుంది. సాక్షి, ఆదిలాబాద్: వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం విరామం ఇచ్చింది. ఇక వరద బాధితుల పునరావాసం మిగిలింది. ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన గ్రామాలకు యంత్రాంగం చేరుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అన్నివిధాలా ఆదుకొని పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ముందుంది. జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. వరద బాధితుల సహాయార్థం తలో చెయ్యి వేయాలన్న కలెక్టర్ పిలుపు మేరకు పలువురు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, దుస్తులు, ఇతరత్ర సామగ్రిని అందజేశారు. ఇప్పుడు బాధి తులకు వాటిని చేరవేస్తున్నారు. మరోవైపు స్వచ్ఛంద సంఘాలు ముందుకు వచ్చి బాధితులకు ఆసరాగా నిలుస్తున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి బాధితులు ఇళ్లలోకి చేరుకుంటున్నారు. చెత్త, బురదమయం.. వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు ఇటు జిల్లాకేంద్రంలోని కాలనీలతోపాటు గ్రామాల్లో ఎటుచూసినా చెత్త, బురదమయంగా కనిపిస్తోంది. వరద నీరు కారణంగా బావులు కలుషితం అయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి నీళ్లు తాగిన ప్రజలు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పారిశుధ్యం ప్రధాన సమస్యగా ఉంది. గ్రామాల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. దీంతో అతిసార, డయేరియా వ్యాధుల ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే జిల్లాలో జనవరి 1 నుంచి ఇప్పటివరకు 10వేల డయేరియా కేసులు, మలేరియా రెండు కేసులు నమోదయ్యాయి. డెంగీ 35 కేసులు పాజిటీవ్ వచ్చాయి. అందులో మూడు కేసులు మాత్రమే ప్రభావం అధికంగా ఉందని నిర్ధారిం చారు. వారికి చికిత్స అందజేశారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ పరిస్థితి తీవ్ర రూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో కృష్ణవేణి అనే నాలుగేళ్ల చిన్నారి డయేరియాతో మృతిచెందింది. యంత్రాంగాల సమన్వయం.. జిల్లాలో వరద ముప్పు క్రమంగా తగ్గుతుండడంతో జిల్లా యంత్రాంగం సమన్వయంగా గ్రామాల్లో రక్షిత చర్యలు చేపడుతోంది. ప్రధానంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల ద్వారా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లలను సరఫరా చేస్తున్నారు. తాగే నీటి కుండలో ఒక క్లోరిన్ బిళ్ల వేసి ఆరు గంటల తర్వాత నీరు తాగాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఫార్మాసిస్ట్ ద్వారా ఆశ వర్కర్లకు ఈ బిళ్లలను సరఫరా చేశారు. వారు గ్రామాల్లో ప్రజలకు అందజేయాల్సి ఉంది. అన్ని మండలాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా డయేరియా, అతిసార ప్రభావం అధికంగా ఉంటే మూడు రోజుల నుంచి వారం రోజులపాటు శిబిరాలను కొనసాగించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రధానంగా రెండు రోజులపాటు జ్వరం తగ్గని పక్షంలో ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచిస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ట్యాంకుల్లో, బావుల్లో క్లోరినేషన్ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పట్టణంలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాను పెంచడం జరిగింది. సోమవారం లక్షా 20వేల లీటర్లు, మంగళవారం 50వేల లీటర్లు పట్టణంలో సరఫరా చేశారు. గ్రామాల్లోని రక్షిత మంచినీరు దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పారిశుధ్యం కోసం ప్రత్యేక డ్రైవ్.. గ్రామాల్లో ప్రస్తుతం పారిశుధ్యమే ఒక సవాల్‌గా మారింది. ప్రధానంగా ఇటీవల జిల్లాలోని 467 గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులకు నియమించినప్పటికీ ఆ అధికారులు గ్రామాలపై దృష్టి సారించలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖకు చెందిన అధికారులే ఇందులో 200లకు పైగా ఉన్నారు. ఆ అధికారులు ఇప్పుడు గ్రామాల్లో పంట నష్ట సర్వే చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వారు ప్రత్యేక అధికారులుగా తక్షణం గ్రామాలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారించారు. ప్రధానంగా చెత్తాచెదారాన్ని తొలగించి బురదమయమైన చోట మొరం, మట్టితో మరమ్మతులు చేయించాల్సి ఉంది. బుధవారం నుంచి ఈ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామపంచాయతీల్లో కార్మికులు సమ్మెలో ఉండడంతో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. పారిశుధ్యం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఇదివరకే ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన మొదలైన తర్వాత ఆదేశించారు. ఇంతలోనే జిల్లాలో భారీ వర్షాలు కురువడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఈ డ్రైవ్‌కు సంబంధించి అధికారులు ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేకంగా కార్మికులను నియమించుకొని ఈ పని చేపట్టాలని యోచిస్తున్నారు. మరోపక్క 14వ ఆర్థిక సంఘంకు చెందిన నిధులను ఈ పనులకు ఉపయోగించుకునే దిశగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో అధికారులు స్పెషల్ సానిటేషన్ డ్రైవ్‌పై దృష్టి సారించారు. సానిటేషన్ డ్రైవ్‌కు సిద్ధం జిల్లాలో పారిశుధ్య పనులను వేగిరం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కొంతమంది కార్మికులను నియమించుకొని ఈ పనులు చేపడతాం. ప్రత్యేక అధికారుల్లో 200 మందికి పైగా వ్యవసాయ పంట నష్టం సర్వేలో ఉండడంతో మిగిలిన ఈఓఆర్డీ, ఎంపీడీఓ, జెడ్పీ, కోఆపరేటీవ్, తదితర సిబ్బంది సహకారంతో ఈ డ్రైవ్‌ను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే బావుల్లో క్లోరినేషన్ చేశాం. మురుగు నీటి కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరుగుతుంది. మట్టి, మొరంతో బురద ప్రాంతాలను సరిచేస్తున్నాం. – జితేందర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ, ఆదిలాబాద్ -
వర్షం..యోగం!
-
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
చెన్నై: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దుచేయడంతో కొన్ని రైళ్లను చెన్నై మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులు అధికారికంగా వెల్లడించారు. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా 55 మంది మృతిచెందిన విషయం అందరికి విదితమే. రాజధాని చెన్నై నగరంలో పాఠశాలలు, కాలేజీలకు శుక్రవారం సెలవుదినంగా ప్రకటించారు. వర్షాల కారణంగా ఈ ఆదివారం నుంచి పలు రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రద్దయిన కొన్ని రైళ్లు: చెన్నై సెంట్రల్- విజయవాడ జన శతాబ్ది ట్రైన్ నెంబర్. 12077, చెన్నై నుంచి తిరుగుప్రయాణం కావలసిన ట్రైన్ 12078, బెంగళూరు-చెన్నై సెంట్రల్ ట్రైన్ నెంబర్. 12640 రైలు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు సమాచారం. పట్నా-బెంగళూరు ఎక్స్‌ప్రెస్, గువహతి-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్, తిరువనంతపురం షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను చెన్నై సెంట్రల్ మీదుగా కాకుండా ఇతర మార్గాల మీదుగా దారి మళ్లిస్తున్నారు.