సాక్షి, విశాఖపట్నం : తూర్పు, మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో అన్ని ప్రధాన ఓడరేవుల్లో 1వ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ఈ తీవ్ర వాయుగుండం కళింగపట్నానికి 310, గోపాల్‌పూర్‌కు 300 తూర్పు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైందని తెలిపారు. ఇది గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం కళింగపట్నం-పూరి మధ్య గోపాల్‌పూర్‌కు తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో కోస్తాలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. తీరం వెంబడి గంటకు 60 నుండి 75 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సముద్రపు అలలు సాధారణం కంటే 0.5మీటర్లు ఎగిసిపడే అవకాశం ఉన్నందున శ్రీకాకుళంలోని లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment