సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: నడి వేసవిలో వచ్చిన అసని తుఫాన్ ఆ రోజుల్లో చల్లదనం పంచినా.. ఇప్పుడు మాత్రం దాని ప్రభావంతోనే భానుడు భగభగమంటున్నాడు. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మొత్తం అసని తుఫాన్ ఊడ్చేయడంతో.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సూర్యుడు నడి నెత్తిన చుర్రుమంటున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని విలవిల్లాడేలా చేస్తున్నాయి.
భానుడి భగభగలకు తోడుగా.. వేడి గాలులు వీస్తుండటంతో..సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా విశాఖ నగరం, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. మిట్టమధ్యాహ్న సమయంలో వేడిగాలులు సెగపుట్టించాయి. ఈ పరిస్థితులు ఇకపై కొనసాగుతాయని దీనికి తోడు రోహిణి కార్తెలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 25 నుంచి రోహిణి కార్తెలు మొదలై.. జూన్ 8 వరకూ కొనసాగనున్నాయి. ప్రజలంతా..
Comments
Please login to add a commentAdd a comment