high temperatures
-
భూగోళంపై భానుడి భగభగలు.!
సాక్షి, విశాఖపట్నం: భానుడి ప్రకోపానికి భూగోళం భగభగమండుతోంది. పెరుగుతున్న కాలుష్యం మానవాళిని ముప్పు ముంగిటకు నెట్టేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి కాలం మొదలైంది. ఈ ఏడాది కూడా భానుడి భగభగలు తప్పవని ప్రపంచ ఉష్ణోగ్రతల డేటా ప్రొవైడర్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (సీ3ఎస్) వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. భూతాపం భారీగా పెరిగిందని ప్రకటించింది. అదేవిధంగా 2050 నాటికి ప్రీ ఇండస్ట్రియల్ లెవల్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటిౖకైనా మేలుకొని కర్బన ఉద్గారాల నియంత్రణకు ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా అడుగులు వెయ్యకపోతే ఉష్ణతాపాన్ని తట్టు కోవడం కష్టమని సీ3ఎస్ హెచ్చరించింది. 1850 నుంచి ఉష్ణోగ్రతల గణాంకాలు తీసుకుంటే... 2024ను అతి దుర్భరమైన (గ్లోబల్ వార్మింగ్) సంవత్సరంగా ప్రకటించింది.సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయ్!కేవలం భూతాపమే కాదు... సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయని సీ3ఎస్ హెచ్చరించింది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా మినహా అన్ని ఖండాంతర ప్రాంతాలు, సముద్రంలోని గణనీయమైన భాగాలు, ముఖ్యంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా 2024లో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2024లో ధ్రువ సముద్రంపై వార్షిక సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత(ఎస్ఎస్టీ) రికార్డు స్థాయిలో 20.87 డిగ్రీలకు చేరుకుంది. ఇది 1991–2020 సగటు కంటే 0.51 డిగ్రీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2025 మరో వేడి సంవత్సరం కాబోతోందా.?ఈ ఏడాది కూడా 2024 మాదిరిగానే భానుడి భగభగలతో మండిపోయే సూచనలు ఆదిలోనే స్పష్టంగా కనిపించాయని సీ3ఎస్ వెల్లడించింది. జనవరి నెలాఖరు నుంచే వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు గరిష్టంగా నమోదవుతుండటమే ఇందుకు సంకేతమని వెల్లడించింది. గత ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరగగా.. ఈ ఏడాది జనవరిలోనే సగటు ఉష్ణోగ్రత 0.94 డిగ్రీలు పెరగడం అసాధారణ హెచ్చరికగా పరిశోధకులు భావిస్తున్నారు. 2015–24 మధ్య కాలంలో సాధారణం కంటే 0.3 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరిగి అత్యంత వేడి దశాబ్దంగా నమోదైందని.. ఉష్ణోగ్రత సగటు ఒక్కో డిగ్రీ పెరిగే కొద్దీ.. వడదెబ్బ మరణాల సంఖ్య 5 శాతం పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.సీ3ఎస్ ఏం చెప్పిందంటే..» 1850 నుంచి భూ ఉపరితల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు పొందింది.» సీ3ఎస్ పరిశోధనల ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.10 డిగ్రీల సెల్సియస్.» 1991–2020 మధ్య సగటు 0.72 డిగ్రీల సెల్సియస్ కాగా, అది 2024లో 1.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. » గత 10 సంవత్సరాల ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంటే 2024 అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతల సంవత్సరం.» 2024 జూలై 24న రోజువారీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.16 డిగ్రీలు నమోదైంది. ఇదే ఇప్పటి వరకు చరిత్రలో అత్యంత ఉష్ణతాపం రోజుగా సీ3ఎస్ ప్రకటించింది.»2024లో వాతావరణంలో నీటి ఆవిరి మొత్తం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. 1991–2020 సగటు కంటే దాదాపు 5శాతం ఎక్కువగా వ్యాపించింది. ఎందుకిలా జరుగుతోంది?శీతోష్ణస్థితి మార్పులు భయపెడుతున్నాయి. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి కారణం మానవ తప్పిదాలేనన్నది స్పష్టమవుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్... మొదలైన వాయువుల కారణంగా గ్లోబల్ వార్మింగ్ ప్రమాదంముంచుకొస్తోంది. గత ఏడాది భూమి వేడెక్కడానికి కారణమైన సీవో2 వంటి వాయు ఉద్గారాలు ఇప్పటికీ వాతావరణంలో రికార్డు స్థాయిలోనే ఉన్నాయని సీ3ఎస్ వెల్లడించింది. కర్బన ఉద్గారాలు అధికంగా విడుదల చేస్తున్న దేశాల జాబితాలో 29.18 శాతంతో చైనా అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా (14.02 శాతం), భారత్ (7.09శాతం), రష్యా (4.65శాతం) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. వాతావరణంలోని గ్రీన్హౌస్ వాయువుల సాంద్రతలే మన వాతావరణాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద అంశమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భవిష్యత్తు వాతావరణం మనచేతుల్లోనే ఉందిభూ ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వేడెక్కడం చూస్తే వాతావరణం.. మానవాళికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లే. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే వేడిగాలులు, సముద్ర మట్టాల పెరుగుదల, వన్యప్రాణులు అంతరించిపోవడం వంటి ప్రమాదాలు చాలా తీవ్రమయ్యే రోజులు ముందున్నాయి. మనం ఇప్పుడు దానికి అత్యంత చేరువలో ఉన్నాం. గాల్లో సీవో2, మీథేన్, సల్ఫర్ మోనాక్సైడ్ వాతావరణ సాంద్రతలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక పాయింట్ సీవో2 దాదాపు 100 ఏళ్ల వరకు గాల్లో ఉంటుంది. మీథేన్ 400 ఏళ్లు ఉంటుంది. కాబట్టి.. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత అందరిది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన తుఫానులు, వరదలతోపాటు వడగాడ్పులు, కరువు, కార్చిచ్చు ఘటనలు సంభవించాయి. భూతాపం పెరిగే కొద్దీ ఈ తరహా ప్రమాద ఘంటికలు మోగుతూనే ఉంటాయి. కాబట్టి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలిగితే భూమి వేడెక్కడాన్ని తగ్గించగలం. ఇదే మన ముందున్న అతి పెద్ద సవాల్. చెట్ల కంటే.. సముద్రాలే అసలైన వాతావారణ పరిరక్షకులు. అందులో ఉండే మొక్కలు ఆక్సిజన్ని ఎక్కువగా అందిస్తున్నాయి. అందుకే సముద్రాలను సంరక్షించుకోవాలి. – ప్రొఫెసర్ ఓఎస్ఆర్ భానుకుమార్, వాతావరణశాస్త్ర నిపుణుడు -
హైదరాబాద్‌లో అప్పుడే దంచేస్తున్న ఎండలు
భానుడు భగ్గుమంటున్నాడు. తాజాగా పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు (High Temperature) 35.7 డిగ్రీలు నమోదు కాగా.. ఎండ తీవ్రతకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ఉక్కపోత నుంచి ఉపషమనం పొందేందుకు ఏసీలు, కూలర్లకు పనిచెప్పారు. దీంతో విద్యుత్ డిమాండ్ (Electricity Demand) అమాంతం పెరిగింది. సగటున విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా.. అది తాజాగా 70ఎంయూకి దాటింది.సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎండలు మండిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీలు, కనిష్టంగా 21.3 డిగ్రీలు నమోద య్యాయి. ఈ ఉష్ణోగ్రతలకు ఉక్కపోత తోడవడంతో ఉపశమనం కోసం ప్రజలు ఏసీలను ఆన్ చేస్తున్నారు. మొన్నటి వరకు మూలన పడిన కూలర్లు (Air Coolers) మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయి. ఇంట్లోనే కాదు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో రోజంతా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆన్‌లో ఉండటంతో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. ఫిబ్రవరి (February) మొదటి రెండో వారం వరకు గ్రేటర్లో రోజు సగటున డిమాండ్ 60 మిలియన్ యూనిట్లు నమోదు కాగా, తాజాగా 70 ఎంయూ దాటింది. అత్యవసరమైతేనే.. ఎల్సీలకు అనుమతి విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇంజినీర్లలో ఆందోళన మొదలైంది. వేసవిలో నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కం ముందస్తు లైన్ల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, డీటీఆర్‌లలో ఆయిల్ లీకేజీల నియంత్రణ చర్యలు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, లూజు లైన్లను సరి చేయడం, దెబ్బతిన్న ఇన్సులేటర్లను మార్చడం, ఎర్తింగ్ సిస్టం పక్కగా ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం సబ్స్టేషన్ల మధ్య ఇంటర్ లింకింగ్ వర్క్స్ నిర్వహిస్తుంది. వారం పది రోజుల్లో వీటిని కూడా పూర్తి చేయనుంది. మార్చి మొదటి వారంలో ఇంటర్మీడియట్, రెండో మూడో వారంలో టెన్త్ వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. విద్యార్థుల చదువుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియరెన్స్ (ఎల్సీ)లకు స్వస్తి చెప్పింది. అత్యవసరమైతే తప్ప.. ఎల్సీలకు అనుమతి ఇవ్వడం లేదు.ఫిబ్రవరిలోనే.. ఏప్రిల్ డిమాండ్ మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ట (3435 మెగావాట్లు)డిమాండ్.. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే (3455 మెగావాట్లు) నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. మే చివరి నాటికి రోజు సగటు డిమాండ్ 100 ఎంయూలు దాటే అవకాశం ఉన్నట్లు డిస్కం అంచనా వేస్తోంది.ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రణాళికలు 60 శాతానికి మించి లోడు ఉన్న 33కేవీ, 11 కేవీ ఫీడర్లు, డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, ప్రత్యమ్నాయ మార్గాలకు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం 571 (33కేవీ) సబ్స్టేషన్లు ఉండగా, వీటి సామర్థ్యం 9,675 ఎంవీఏగా ఉంది. కొత్తగా మరో 213(33/11 కేవీ) సబ్స్టేషన్ల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు పిలిచింది. పనులు చేసేందుకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు ఆయా సబ్స్టేషన్ల నిర్మాణ పనులు అప్పగించి, నిర్ధేశిత లక్ష్యం లోగా వాటిని పూర్తి చేయించాలని డిస్కం నిర్ణయించింది. అంతేకాదు కొత్తగా నాలుగు వేల కిలో మీటర్ల 33 కేవీ లైన్లు, ఏడు వేల కిలో మీటర్ల 11 కేవీ లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. చదవండి: హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ హౌసింగ్ కాలనీలుసీఎండీ ముషారఫ్ ఫరూఖీ రోజూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎస్ఈలు, సీజీఎంలు, డీఈలతో సమావేశాలు ఏర్పాటు చేసి, లైన్ల పునరుద్ధరణ, కొత్త లైన్ల ఏర్పాటు వంటి పనులను సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా నిజాంపేట, బాచుపల్లి, కూకట్పల్లి, గండి మైసమ్మ, అమీన్‌పూర్‌లలో నమోదవుతున్న విద్యుత్ డిమాండ్, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూ.212.20 కోట్లతో బౌరంపేటలో కొత్తగా నిర్మించిన 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఈ నెలాఖరు లోగా ఛార్జ్ చేయనున్నారు. ఫైళ్ల పెండింగ్‌పై సీఎండీ సీరియస్ సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మేడ్చల్ సర్కిళ్ల పరిధిలో కొత్త కనెక్షన్ల జారీకి సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉండటాన్ని సీఎండీ ఫారూఖీ సీరియస్‌గా తీసుకున్నారు. బుధవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయా సర్కిళ్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయా కనెక్షన్లను ఎందుకు పెండింగ్‌లో పెట్టాల్సి వచి్చందని నిలదీసినట్లు తెలిసింది. నిర్దేశించిన గడువులోగా కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా సైబర్‌సిటీ, రాజేంద్రనగర్ సర్కిళ్ల పరిధిలోని కొంత మంది ఇంజినీర్లు తీరు మార్చుకోవడం లేదని, పరిస్థితిలో మార్పు రాకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించినట్లు తెలిసింది. -
నల్లపెట్టె మౌనరాగం!
నల్ల రంగులో ఉండదు. పేరు మాత్రం బ్లాక్ బాక్స్. ‘డెత్ కోడ్’ను తనలో గోప్యంగా దాచుకుంటుంది. నిజానికిది ఒక్క బాక్సు కూడా కాదు. రెండు పెట్టెలు! విమానం కూలిందంటే అందరి కళ్లూ దానికోసమే చూస్తాయి. రికవరీ బృందాలు దాని వేటలో నిమగ్నమవుతాయి. అది దొరికితే ప్రమాద కారణాలు తెలిసినట్టే. కానీ ఇటీవల బ్లాక్‌బాక్సులు తరచూ విఫలమవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గాలిలో ప్రయాణం ఎప్పుడూ గాల్లో దీపమే. రన్ వే నుంచి ఎగిరిన విమానం క్షేమంగా కిందికి దిగేదాకా టెన్షనే. వైమానిక దుర్ఘటనలకు కచి్చతమైన కారణాలు తెలియాలంటే బ్లాక్ బాక్స్ చిక్కాలి. అందులో ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్డీఆర్), కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) అని రెండు భాగాలుంటాయి. వీటిని ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. సులభంగా గుర్తు పట్టేందుకు వీలుగా అవి ప్రకాశవంతమైన ఆరెంజ్ రంగులో ఉంటాయి. బ్లాక్ బాక్స్ సురక్షితంగా ఉండేలా ప్రమాదాల్లో తక్కువ నష్టం జరిగే తోక భాగంలో అమర్చుతారు. ఎఫ్డీఆర్ సెకన్ల వ్యవధిలో దాదాపు వెయ్యి పరామితులను నమోదు చేస్తుంది. ప్రమాద సమయంలో విమానం ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, ప్రయాణ మార్గం, దిశ తదితరాలను రికార్డు చేస్తుంది. ఇక సీవీఆర్ పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు వారు పంపిన, స్వీకరించిన సమా చారం, కాక్‌పిట్ శబ్దాల వంటివాటిని నమోదు చేస్తుంది. కనుక విమాన ప్రమాదాలకు దారితీసిన కారణాలు, చివరి క్షణాల్లో మార్పులు తదితరాలను బ్లాక్ బాక్స్ మాత్రమే వెల్లడించగలదు. దాని డేటాను విశ్లేషించి ప్రమాద కార ణంపై పరిశోధకులు అంచనాకు వస్తారు. ఇంత కీలకమైన ఈ ‘నల్ల పెట్టె ఇటీవల మొండికేస్తుంది. మూగనోము పడుతుంది. దక్షిణ కొరియాకు చెందిన ‘జెజు ఎయిర్’విమానం గత నెల 29న కూలిపోయి ఇద్దరు మినహా 179 దుర్మరణం పాలవడం తెలిసిందే. కూలడానికి నాలుగు నిమిషాల ముందు నుంచే అందులోని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానేశాయి. దాంతో దర్యాప్తు క్లిష్టంగా మారింది.వైఫల్యానికి కారణాలివీ...బ్లాక్ బాక్సులోని రెండు రికార్డర్లు 4.5 కిలోలుంటాయి. గురుత్వశక్తి కంటే 3,400 రెట్లు అధిక శక్తితో విమానం కూలినా బ్లాక్ బాక్స్ తట్టుకోగలదు. వెయ్యి డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతనూ కాసేపటిదాకా భరించగలదు. సము ద్రంలో కూలినా హై పిచ్ శబ్దాలతో 90 రోజులపాటు సంకేతాలు పంపగలదు. 20 వేల అడుగుల లోతులోనూ నెల పాటు పని చేయగలదు. దొరికాక కీలక డేటా, ఆడియో చెరిగిపోకుండా జాగ్రత్తగా వివరాలు సేకరిస్తారు. డేటాను డౌన్లోడ్ చేసి కాపీ చేస్తారు. దాన్ని డీకోడ్ చేసి గ్రాఫ్స్ రూపొందిస్తారు. అయితే... → సర్క్యూట్ పాడవటం, సెన్సర్లు విఫ లమవడం తదితర సాంకేతిక అవరోధాలు, సాఫ్ట్వేర్ లోపాలు తలెత్తినప్పుడు బ్లాక్ బాక్సు పనిచేయదు. → ప్రమాద తీవ్రత విపరీతంగా ఉండి భౌతికంగా ధ్వంసమైనప్పుడు కూడా దానిపై ఆశ వదిలేసుకోవాల్సిందే. → విమాన సిబ్బంది ఉద్దేశపూర్వకంగా డీ యాక్టివేట్ చేసినా బ్లాక్‌బాక్స్ పనిచేయడం మానేస్తుంది. → డేటా ఓవర్ లోడ్ అయినప్పుడు కూడా మొరాయిస్తుంది. → కొన్ని పాత బ్లాక్ బాక్సుల్లో నిరీ్ణత కా లం తర్వాత డేటా ఓవర్ రైట్ అయిపోతుంది. దాంతో వాటినుంచి ఎ లాంటి సమాచారమూ లభించదు. నిరుడు జనవరిలో అలస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం ప్రయాణ సమయంలో తలుపు ఊడటంతో సీవీఆర్ పూర్తిగా ఓవర్ రైట్ అయింది. దాని నుంచి డేటా లభ్యం కాలేదు. → అత్యుష్ణ, అత్యల్ప ఉష్ణోగ్రతలు, ఎక్కువ కాలం నీటిలో నానడం వల్ల కూడా ఫ్లైట్ రికార్డర్లు పాడవుతాయి. → తేమ చేరి సున్నిత భాగాల్లో పరికరాలు దెబ్బతిని షార్ట్ సర్క్యూట్ కావడం, అత్యధిక ఎత్తుల్లో పీడనం, పక్షులు ఢీకొనడం, పిడుగుపాట్లు వంటి వాటి వల్ల కూడా బ్లాక్ బాక్సు పనిచేయకపోవచ్చు. పదేళ్లుగా జాడ లేని మలేసియా విమానం! నిజానికి ఫ్లైట్ రికార్డర్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఖర్చు, పరిమితుల దృష్ట్యా అది ఆలస్యమవుతోంది. అత్యవసర సందర్భాల్లో ఫ్లైట్ రికార్డర్లు పనిచేయాలంటే వాటికి విమానంలో ప్రత్యేక వ్యవస్థల నుంచి పవర్ సరఫరా తప్పనిసరి. రెండు ఇంజిన్లూ విఫలమైనప్పుడు విమానమంతటా ఎలక్ట్రికల్ పవర్ నిలిచిపోతుంది. 1999లో న్యూయార్క్ నుంచి కైరో వెళుతున్న ‘ఈజిప్ట్ ఎయిర్’విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 217 మంది మరణించారు. ఎలక్ట్రికల్ పవర్ ఆగిపోగానే దాని ఫ్లైట్ రికార్డర్లు పని చేయడం మానివేశాయి. దాంతో, విమానం లోపల సాధారణ అవసరాల కరెంటుపై ఆధారపడకుండా ఫ్లైట్ రికార్డర్లు 10 నిమిషాలు అదనంగా రికార్డింగ్ చేయడానికి వీలుగా ప్రత్యామ్నాయ బ్యాకప్ పవర్ ఏర్పాట్లుండాలని అమెరికా జాతీయ రవాణా సేఫ్టీ బోర్డు సిఫార్సు చేసింది. బ్లాక్ బాక్సుల బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం తక్కువ. కొన్ని సందర్భాల్లో పనే చేయవు. దక్షిణ కొరియా ‘జెజు ఎయిర్’విమానంలోనూ విద్యుత్ వ్యవస్థ విఫలమై ఫ్లైట్ రికార్డర్లకు పవర్ అందక మూగవోయాయని భావిస్తున్నారు. సీవీఆర్ ఒక విడతలో రెండు గంటలపాటు మాత్రమే రికార్డు చేయగలదు. ఆ డేటానే రిపీట్ చేస్తుంది. రికార్డింగ్ నిడివిని 25 గంటలకు పెంచాలన్న డిమాండ్ కార్యరూపం దాలుస్తోంది. 2009లో ఎయిర్ ఫ్రాన్స్ విమానం బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నుంచి పారిస్ వెళ్తూ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 228 మంది చనిపోయారు. మలేసియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 విమానానిదైతే ఇప్పటికీ అంతు లేని వ్యథే! 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ అకస్మాత్తుగా రాడార్ తెర నుంచి అదృశ్యమైంది. మొత్తం 239 మందీ మరణించారని భావిస్తున్నారు. విమానం ఎందుకు, ఎలా అదృశ్యమైందో ఇప్పటికీ అంతుచిక్కలేదు. వైమానిక చరిత్రలోనే ఇదో పెద్ద మిస్టరీ. విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలిందని అనుమానిస్తున్నారు. దాని జాడ కోసం మళ్లీ అన్వేషణ చేపట్టాలని మలేసియా తాజాగా నిర్ణయించింది. ‘ఎయిర్ ఫ్రాన్స్’దుర్ఘటన దరిమిలా మహా సముద్రాలను దాటి ప్రయాణించే విమానాల కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లో 25 గంటల డేటా రికార్డింగ్ తప్పనిసరి చేయాలని ఫ్రాన్స్ సిఫార్సు చేసింది. అమెరికా కూడా దీన్ని చట్టంలో చేర్చింది. కానీ కొత్తగా తయారయ్యే విమానాల్లోనే ఈ మార్పులకు వీలుంది. పాతవాటిలో సాధ్యపడటం లేదు. ఇప్పుడు తిరిగే చాలా విమానాల జీవిత కాలం 40–50 ఏళ్లు! కొత్త టెక్నాలజీతో బ్లాక్ బాక్సులు! తాజా సవాళ్లు, మారిన సాంకేతికత నేపథ్యంలో అధునాతన రీతిలో సరికొత్త బ్లాక్ బాక్సుల కు పకల్పన జరుగుతోంది. ఎక్కువ గంటల రికార్డింగ్, అధిక డేటా స్టోరేజీ, బ్యాకప్ బ్యాటరీల జీవితకాలం పెంపు వంటివి వీటిలో ప్రధానాంశాలు. ప్రమా ద తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా సమర్థంగా పనిచేసే బ్లాక్ బాక్సులూ రానున్నాయి. సముద్రాల్లో కూలినప్పుడు తక్కువ శ్రమతో సత్వరం గుర్తించే అండర్ వాటర్ లొకేటర్ బీకాన్స్ అభివృద్ధి దశలో ఉన్నాయి. ముఖ్యంగా, డేటాను రియల్ టైమ్‌లో పంపే బ్లాక్ బాక్సులు రానున్నాయి. తద్వారా కీలక సమాచారం వెంటనే గ్రౌండ్ స్టేషనుకు చేరుతుంది కనుక ప్రమాదంలో బ్లాక్ బాక్స్ నాశనమైనా ఇబ్బంది ఉండబోదు. – జమ్ముల శ్రీకాంత్ -
అత్యంత ఉష్ణ ఏడాదిగా 2024
జీవకోటికి ప్రాణాధారం సూర్యుడు. సూర్య కిరణాల ప్రసరణతో పుడమి పులకిస్తుంది. అదే పుడమి నేడు భానుడి భగభగలతో అల్లాడుతుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వంటి విపరిణామాలే భూమిపై విపరీత ఉష్ణోగ్రతలకు ముఖ్య కారణాలు. గత కొన్ని నెలలుగా హీట్‌వేవ్‌లు, వాతావరణ మార్పుల కారణంగా ప్రతినెలా ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతూ పోతున్నాయి. వరుసగా గత 17 నెలల్లో చూస్తే 16 నెలల్లో సగటు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతూ రావడం ఆందోళనకరం. ఇలా నెలల తరబడి సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల నమోదవడంతో రాబోయే నెలల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లే ప్రమాదకర ధోరణి కొనసాగనుందని స్పష్టమవుతోంది. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూతాపంలో పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్లోపునకు పరిమితం చేయాలన్న ప్రపంచ దేశాల ప్రతిజ్ఞ ఇప్పుడు నీరుగారిపోతోంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ దాటి నమోదైన తొలి ఏడాదిగా 2024 నిలవనుందని కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్(సీ3ఎస్) తాజాగా ప్రకటించింది. 1991–2020 సగటుతో పోలిస్తే ఈ ఏడాది జనవరి– నవంబర్ కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 0.72 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ నమోదైంది. నవంబర్‌లో సైతం గతంలో ఎన్నడూలేనంతటి ఉష్ణోగ్రత నమోదైంది. పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ఈ నవంబర్‌లో 1.62 డిగ్రీ సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2024 ఏడాది ఎందుకింత వేడి ?హరితవాయు ఉద్గారాలు అత్యధికంగా వెలువ డటంతోపాటు ఎన్నో కారణాలు ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణాలుగా నిలుస్తున్నా యని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక వేడిమిని సముద్రాల ఉపరితల జలాలు పీల్చుకో వడమూ దీనికి మరో కారణం. విచ్చలవిడి మానవ కార్యకలాపాలు, అడవుల నరికివేత, ఎడారీకరణ తదితరాలు ఈ పరిస్థితిని మరింత ఉష్ణ మంటల్లోకి నెట్టేస్తున్నాయి. వాతావరణంలో కలుస్తున్న మీథేన్ స్థాయిలు సైతం గతంలో ఎన్నడూలేనంతగా పెరిగాయి. పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే 2023 చివరినాటికి వాతావరణంలో మీథేన్ గాఢత స్థాయి ఏకంగా 165 శాతం పైకెగసిందని, అధిక ఉష్ణోగ్రతకు ఇదీ ఒక కారణమని అధ్యయనకారులు విశ్లేషణ చేశారు. పారిశ్రామికీకరణ ముందునాటి కాలంతో పోలిస్తే ఉపరితల గాలి ఉష్ణోగ్రత ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో 1.54 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంది. ‘‘మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కోసం సహజ ఎల్–నినో పరిస్థితులూ ఉష్ణోగ్రతల విజృంభణకు మరో కారణం’’ అని సస్టేన్ ల్యాబ్ పారిస్ సీఈఓ డాక్టర్ మినియా ఛటర్జీ వ్యాఖ్యానించారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏమౌతుంది?అధిక ఉష్ణోగ్రత భరించలేని కష్టాలను మోసుకొస్తాయి. పారిశ్రామికీకరణకు ముందునాటితో పోలిస్తే భూ తాపోన్నతిలో పెరుగుదల 1.5 డిగ్రీ సెల్సియస్ దాటితే కరువు, అతి భారీ వర్షాలు, వరదలు సాధారణమవుతాయి. ఇది పర్యావరణానికి, మానవునికి హానికరం. మితిమీరిన వేడి కారణంగా పంటకు నష్టం వాటిల్లుతుంది. దిగుబడి దారుణంగా పడిపోతుంది. జీవజాతులకూ నష్టమే. సాధారణ ఉష్ణోగ్రతల్లో బతికే జీవులు మనుగడ సాధించడం కష్టం. చిన్న జీవుల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వన్యప్రాణుల సంఖ్య తగ్గుతుంది. హీట్‌వేవ్‌ల కారణంగా హాలర్ కోతులు, చిన్న పక్షులు అంతరించిపోతాయి. ఉష్ణోగ్రతల్లో వైరుధ్యం కారణంగా జీవవైవిధ్యం దెబ్బతింటుంది. పక్షుల ఎదుగుదల తగ్గుతుంది. ‘‘ ఉభయచర జీవులు పొదిగే క్రమంతోపాటు ఎండా, వానా, చలికాలాల మధ్య ఉన్న సరిహద్దు రేఖలు చెరిగిపోతాయి. అధిక వేడిమికి పాలిచ్చే జంతువుల మనుగడా కష్టమవుతుంది’’ అని ది హ్యాబిటెంట్స్ ట్రస్ట్ సారథి రిషికేశ్ చవాన్ చెప్పారు. సముద్ర ఉష్ణోగ్రతలూ పైపైకి..ఈ ఏడాది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే పెరిగాయి. ఎక్కువ రోజుల పాటు సముద్ర ఉష్ణోగ్రతలు అధిక స్థాయిల్లో కొనసాగితే పగడపు దిబ్బల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వేడి పెరిగితే సముద్ర జీవావరణానికి సంబంధించిన ఆహారవల యంలో కీలక పాత్రపోషించే ఈ పగడపు దీవులు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అంతర్థాన మవడం ఖాయం. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోని 77 శాతం పగడపు దిబ్బల వద్ద అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ధోరణికి అడ్డుకట్టవేయకపోతే మళ్లీ పూడ్చలేని నష్టం జరుగుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది.–సాక్షి, నేషనల్ డెస్క్ -
జూలై–సెప్టెంబర్‌కల్లా లా నినో
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అసాధారణ వాతావరణ పరిస్థితులను మోసుకొచి్చన 2023–24 ఎల్‌నినో సీజన్ ఈసారి జూలై–సెపె్టంబర్‌కల్లా లా నినోగా మారొచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తాజా కబురు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వరసగా 11వ నెల(ఏప్రిల్) అత్యుష్ణ నెలగా రికార్డులకెక్కింది. సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రతలూ గత 13 నెలలుగా అత్యధిక స్థాయిల్లో నమోదవుతున్నాయని డబ్ల్యూఎంఓ పేర్కొంది. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు వేడిగా ఉండటంతో సంభవించే ఎల్ నినో పరిస్థితులే దీనంతటికీ కారణమని డబ్ల్యూఎంఓ తెలిపింది. అడవుల నరికివేత, కాలుష్యం వంటి మానవ కార్యకలాపాలకుతోడు హరిత వాయువులు ఈ పరిస్థితులకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇంకా కొనసాగుతున్న ఎల్‌నినో కారణంగా భారత్, పాకిస్తాన్సహా దక్షిణాసియాలోని కోట్లాది మంది జనం దారుణమైన వేడిని చవిచూశారు. అయితే జూలై–సెపె్టంబర్‌కల్లా ఎల్‌నినో తగ్గిపోయి లా నినో వచ్చేందుకు 60 శాతం అవకాశముందని, ఆగస్ట్–నవంబర్‌కల్లా అయితే 70 శాతం అవకాశముందని డబ్ల్యూఎంఓ తాజాగా అంచనావేసింది. ఈసారి మళ్లీ ఎల్‌నినో పుంజుకునే అవకాశాలు లేవని తేలి్చచెప్పింది. ఎల్‌నినో కారణంగా భారత్‌లో వర్షపాతం భారీగా తగ్గిపోవడం, లా నినో కారణంగా విస్తారంగా వర్షాలు కురవడం తెల్సిందే. ఆగస్ట్–సెపె్టంబర్ కల్లా భారత్‌లో లా నినో పరిస్థితులు ఏర్పడి చక్కటి వర్షాలు కురుస్తాయని ఇటీవల భారత వాతావరణ శాఖ అంచనావేయడం విదితమే. భారత్‌లో 52 శాతం సాగుభూమి వర్షాధారితం కావడంతో భారతరైతులకు వర్షాలకు అవినాభావ సంబంధం ఏర్పడింది. ‘‘ 2023 జూన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా రికార్డు ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మహాసముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రతలది వచ్చే నెలల్లో కీలక భూమిక’’ అని డబ్ల్యూఎంఓ ఉప ప్రధాన కార్యదర్శి కో బారెట్ అన్నారు. -
సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్ పుర్లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టంచేసింది. మే 29న ముంగేష్ పుర్లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్ దానిని 52.9 డిగ్రీల సెల్సియస్‌గా చూపించింది. ముంగేష్ పుర్, నాగ్‌పూర్ స్టేషన్లలో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణ ఇచి్చంది. ‘‘ ఈ రెండు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్(ఏడబ్ల్యూఎస్)లో బిగించిన సెన్సార్లను త్వరలోనే పరిశీలిస్తాం. ఢిల్లీలోని ఇతర ఆటోమేటిక్, మాన్యువల్ అబ్జర్వేటరీల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ముంగేష్ పుర్ ఏడబ్ల్యూఎస్‌లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడికి ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించాం. ముంగేష్‌పుర్‌లో స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ నమోదుచేసిన దానికంటే ఈ సెన్సార్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎక్కువ చూపించింది. లోపాలున్న సెన్సార్‌ను త్వరలోనే మార్చేస్తాం’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. -
5 డిగ్రీల వరకు అధికంగా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. గత నాలుగు రోజులుగా చాలాచోట్ల సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరో రెండ్రోజు లు ఇదే తరహాలో తీవ్రమైన ఎండలు ఉంటాయ ని వాతావరణశాఖ చెబుతోంది. శుక్రవారం రాష్ట్రంలో ని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 47.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.మంచిర్యాల జిల్లా భీమారంలో కూడా 47.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, నస్పూర్‌లో 46.9, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా గరిమెలపాడులో 46.9, నల్లగొండ జిల్లా కేతెపల్లిలో 46.8, ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో 46.8, కరెపల్లెలో 46.6, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.6, మంచిర్యాల జిల్లా హీజీపూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాష్ట్రంలోని మెజార్టీ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 45.0 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, కనిష్టంగా నల్లగొండలో 25.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2024 వేసవి సీజన్లో అత్యంత వేడిమి రోజుగా మే 30వతేదీ రికార్డు సృష్టించింది. మంచిర్యాల జిల్లా భీమారంలో గురువారం ఈ సీజన్లోనే అత్యధికంగా 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇలావుండగా నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. శుక్రవారం తమిళనాడు, కర్ణాటక ల్లోకి ప్రవేశించినట్లు వాతావరణశాఖ తెలిపింది.శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)కేంద్రం గరిష్టం ఖమ్మం 45.0 ఆదిలాబాద్ 44.3 రామగుండం 44.2 భద్రాచలం 43.8 హనుమకొండ 43.0 నల్లగొండ 43.0 మెదక్ 42.8 నిజామాబాద్ 42.7 మహబూబ్‌నగర్ 42.0 దుండిగల్ 41.0 హకీంపేట్ 41.0 హైదరాబాద్ 41.0 -
వదలని వడగాడ్పులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రాన్ని వడగాడ్పులు వదలడం లేదు. మండుటెండలు ప్రజలకు ఏమాత్రం ఉపశమనం కలిగించడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు రోజురోజుకూ అదుపు తప్పుతూనే ఉన్నాయి. సాధారణం కంటే 3నుంచి 6 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా పలు జిల్లాల్లో వడగాడ్పులు, మరికొన్ని జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మంగళవారం కూడా ఇవి కొనసాగాయి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42–45 డిగ్రీలు రికార్డయ్యాయి. అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా డోన్, బనగానపల్లి (నంద్యాల), కొత్తవలస, జామి (విజయనగరం)లలో 44.9 డిగ్రీలు, కాజీపేట (వైఎస్సార్) 44.6, గోస్పాడు (కర్నూలు)లో 44.2, మహానంది, చీడికాడ, దేవరాపల్లి (అనకాపల్లి)లో 44.1, సారవకోట (శ్రీకాకుళం)లో 43.7 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. ఫలితంగా 66 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 84 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 143 మండలాల్లో వడగాడ్పులు, గురువారం 47 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 109 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు మండలాల్లో 43–45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకు తేలికపాటి వర్షాలు దక్షిణ అంతర్గత కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తువరకు విస్తరించి ఉంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య, ఆగ్నేయ దిశగా దిగువ స్థాయి నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేడి, తేమతో కూడిన అసౌకర్య వాతావరణం ఉంటుందని పేర్కొంది. రైల్వేలకు అలర్ట్ వడగాడ్పుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భారత రైల్వేలను ఐఎండీ అప్రమత్తం చేసింది. వడగాడ్పుల ప్రభావం రానున్న ఐదు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమపై ఉంటుందని తెలిపింది. వీటి పరిధిలో ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లలోని ప్లాట్‌ఫామ్‌లపైన, బోగీల్లోనూ ప్రయాణికులకు పూర్తిస్థాయిలో మంచినీటిని అందుబాటులో ఉంచాలని, ప్లాట్‌ఫామ్‌లపై చల్లదనం కోసం కూల్ రూఫ్‌లు, నీడనిచ్చే ఏర్పాట్లు చేయాలని సూచించింది. -
నిప్పుల కొలిమి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండలు భగ్గుమంటున్నాయి. సాధారణం కంటే 5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కూలర్లు, ఫ్యాన్లు ఏమాత్రం ఉపశమనం ఇవ్వక తిప్పలు పడుతున్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా బుగ్గబావిగూడలో 45 డిగ్రీలు, మాడుగులపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పు న గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పులతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శుక్రవారం ఖమ్మంలో సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, నల్లగొండలలో 4 డిగ్రీలు, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల మేర అధికంగా ఉన్నాయి. మరో మూడు రోజులు ఇలానే.. రాష్ట్రంలో మరో మూడు రోజులు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇదే తరహా పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యా హ్నం పూట బయటికి రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రస్తుతం మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వానలు పడవచ్చని తెలిపారు. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. తీవ్ర ఎండలతో జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలు,వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజారో గ్య విభాగం సూచించింది. ఈ మేరకు శుక్రవార ం ప్రకటన జారీ చేసింది. వాతావరణ శాఖ కూ డా హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. అవేమంటే.. ► దాహం వేయకపోయినా కూడా అవసరమైన మేర నీళ్లు తాగుతూ ఉండాలి. ఓఆర్ఎస్, నిమ్మరసం, లస్సీ, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి తాగాలి. ► వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లకపోవడం మంచిది. బాగా గాలి వచ్చే, చల్లని ప్రదేశాలలో ఉండాలి. ► ఎండకు వెళ్లాల్సి వస్తే.. సన్నని వదులుగా ఉండే కాటన్ వ్రస్తాలను ధరించాలి. తలపై టోపీ, గొడుగు వంటివి కప్పుకోవాలి. ► మధ్యాహ్న సమయంలో ఆరు బయట తీవ్ర శారీరక శ్రమ చేయవద్దు. ► ఎవరైనా వడదెబ్బకు లోనైట్టు గుర్తిస్తే.. వెంటనే వైద్య సహాయం అందించాలి. -
ఈ రెండు నెలలూ అగ్నిగుండమే
సాక్షి, విశాఖపట్నం: వేసవి దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను అట్టుడుకించనుంది. ఈ సీజన్లో ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు అసాధారణ తాపాన్ని వెదజల్లనుంది. గత ఏడాది ఉష్ణ తీవ్రత అధికంగానే ఉంది. ఈ వేసవిలో అంతకు మించి ఎండలు, వడగాలులకు ఆస్కారం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాకు వచ్చింది. సాధారణంగా మే నెలలో ఎండలు మండుతాయి. ఆ నెలలోనే ఎక్కువగా వడగాలులూ వీస్తాయి. కానీ.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఒక నెల ముందుగానే మార్చి మూడో వారం నుంచే ఎండలు విజృంభిస్తున్నాయి. ఎన్నడూ లేనివిధంగా మార్చి నెలాఖరు నుంచే వడగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ ఆరంభం నుంచే మే నెల నాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పలుచోట్ల 40 నుంచి 44 డిగ్రీలు రికార్డవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింతగా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాలులు ప్రతాపం చూపనున్నాయి. సాధారణం కంటే 5–8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాలులకు దారితీయనున్నాయి. మే నెలలో ఎన్నికల దృష్ట్యా ప్రజలు, నాయకులు వడదెబ్బ బారిన పడకుండా, మరణాలు సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భారత ఎన్నికల సంఘానికి ఐఎండీ సూచించింది. అంతేకాదు.. తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏప్రిల్, మే నెలల్లో ఏయే రోజుల్లో ఉష్ణతీవ్రత, వడగాలుల ప్రభావం ఎక్కడ, ఎలా ఉంటుందో ముందుగానే తెలియజేస్తామని కూడా వెల్లడించింది. పెరగనున్న వడగాలుల రోజులు మరోవైపు రాష్ట్రంలో ఈ వేసవిలో వడగాలుల రోజులు కూడా పెరగనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రంలో వేసవి కాలంలో సగటున ఐదు రోజులు వడగాలులు వీస్తాయి. కానీ.. గత ఏడాది జూన్ ఆఖరు వరకు వేసవి సీజన్ కొనసాగడంతో మూడు రెట్ల అధికంగా 17 రోజులు వడగాలులు/తీవ్ర వడగాలుల రోజులు నమోదయ్యాయి. 2020లో మూడు, 2021లో మూడు, 2022లో ఒక్కరోజు చొప్పున వడగాలుల రోజులు రికార్డయ్యాయి. 2019లో మాత్రం అత్యధికంగా 25 రోజులు వడగాలులు వీచాయి. ఈ ఏడాది కూడా సగటు కంటే నాలుగు రెట్లు అధికంగా వడగాలులు వీచేందుకు ఆస్కారం ఉందని ఐఎండీ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఇదే ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. రాయలసీమలో ఉష్ణతీవ్రత రాష్ట్రంలో వడగాలుల ప్రభావం అప్పుడే మొదలైంది. కోస్తాంధ్ర కంటే రాయలసీమలోనే ఉష్ణతీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. మంగళవారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నెల్లూరు జిల్లా కలిగిరిలో 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే ఇది ఐదు డిగ్రీలు అధికం. ఇంకా వగరూర్ (కర్నూలు)లో 43.5, ఒంటిమిట్ట (వైఎస్సార్)లో 43.4, తెరన్నపల్లి (అనంతపురం), ఎం.నెల్లూరు (తిరుపతి), అనుపూర్ (నంద్యాల)లలో 43 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వడగాలులు వీచాయి. ఇంకా మరికొన్ని జిల్లాల్లో 40–42 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాలోనూ.. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2–3 డిగ్రీలు, అక్కడక్కడ 4–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించింది. అదే సమయంలో వేడి, తేమ, అసౌకర్య వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పు వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా చెప్పారు. -
ముందే హీటెక్కిన సీమ
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది రాయలసీమలో వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండల తీవ్రత పెరుగుతోంది. మార్చి మొదటి వారం నుంచి మరింతగా విజృంభిస్తున్నాయి. ఏప్రిల్ నెలారంభంలో నమోదు కావాల్సిన పగటి (గరిష్ట) ఉష్ణోగ్రతలు ఇప్పటినుంచే రికార్డవుతున్నాయి. ప్రస్తుత ఉష్ణతాపాన్ని చూసి మున్ముందు ఇంకెంత తీవ్రతను చవి చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆ ప్రాంత వాసుల్లో నెలకొంటోంది. సాధారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచి 40 డిగ్రీలు, అంతకుమించి పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ.. ఈ ఏడాది అందుకు భిన్నంగా మార్చి ఆరంభంలోనే 41 డిగ్రీలకు పైగా చేరుకుంటున్నాయి. ఈ నెల 2న శనివారం అనంతపురంలో 41, కర్నూలు 39, నంద్యాల, కడపలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3న అనంతపురంలో 39, కర్నూలులో 39, నంద్యాల, కడపలో 38, 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీలు, 5న 4న అనంతపురంలో 40, కర్నూలులో 39, నంద్యాల, కడపల్లో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్నాళ్లుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకంటే రాయలసీమలోనే ఉష్ణతాపం అధికంగా కనిపిస్తోంది. అక్కడ సాధారణం కంటే 3–4 డిగ్రీలు అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో విశాఖపట్నం, కళింగపట్నం మినహా అన్ని ప్రాంతాల్లో 33 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, ఉత్తర కోస్తాల్లో రాయలసీమ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డవుతుండటం ఆ ప్రాంత వాసులకు ఒకింత ఊరటనిస్తోంది. సెగలకు ఇదీ కారణం కోస్తాంధ్ర కంటే రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడానికి గాలిలో తేమ తక్కువగా ఉండటమే కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ తక్కువగా ఉంటే ఉష్ణతాపం పెరగడానికి దోహదపడుతుంది. ఈ తేమ 50 శాతం కన్నా తగ్గే కొద్దీ వేడి అధికమవుతుంది. కొద్ది రోజులుగా రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలలో తేమ 19 నుంచి 26 శాతం మాత్రమే ఉంటోంది. అందువల్ల అక్కడ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. వారంలో మరింత భగభగ రానున్న వారం రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా.. వారం పది రోజుల్లో అవి 4–5 డిగ్రీలకు ఎగబాకే అవకాశం ఉందని చెబుతున్నారు. -
భూగోళం భగ్గుమంటోంది!
మరో శాస్త్రీయ నివేదిక బయటకొచ్చింది. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మళ్ళీ గుర్తు చేసింది. గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం 2023 అని తేలిపోయింది. ఆ మధ్య వెలువడ్డ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాత్కాలిక నివేదికతో పాటు తాజాగా మంగళవారం ఐరోపా యూనియన్‌కు చెందిన వాతావరణ పర్యవేక్షక సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ ఛేంజ్ సర్వీస్’ (సీసీసీఎస్) సైతం ఆ సంగతి నిర్ధారణ చేసింది. ఒకప్పుడు 2016 ‘భుగభుగల నామ సంవత్సరం’గా రికార్డ్ సృష్టిస్తే, తాపంలో అంతకన్నా గణనీయమైన తేడాతో ఆ అపకీర్తి కిరీటాన్ని ఇప్పుడు 2023 దక్కించుకుంది. భూవిజ్ఞాన సాక్ష్యాధారాలు, ఉపగ్రహ సమాచారాలను క్రోడీకరించి చూస్తే, దాదాపు లక్ష సంవత్సరాల్లో అధిక వేడిమి గల ఏడాది ఇదేనట. ఇది పెనునిద్దుర వదిలించే మాట. యథేచ్ఛగా సాగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల వల్ల భూతాపం ఇంతగా పెరిగిందని శాస్త్రవేత్తలకు తెలుసు. ఈ ధోరణి ఇలాగే కొనసాగనుందా? రానున్న సంవత్సరాల్లో భూగోళం అంతకంతకూ వేడెక్కనుందా? పాత రికార్డ్‌లు తుడిచిపెట్టుకు పోనున్నాయా అన్నది ప్రశ్న. 2024 సైతం అత్యధిక భూతాప వత్సరం కావచ్చన్న అంచనాలు పారా హుషార్ అంటున్నాయి. పారిశ్రామికీకరణ ముందు నాటితో పోలిస్తే 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ప్రపంచ ఉష్ణోగ్రత పెరగకుండా చూసుకోవాలన్నది లక్ష్యం. ఎనిమిదేళ్ళ క్రితం ప్యారిస్‌లో జరిగిన ‘కాప్–21’లో ఈ మేరకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనాయి. వీలుంటే 1.5 డిగ్రీల సెల్సియస్ లోపలే ఉండేలా శ్రమించాలనీ తీర్మానించాయి. ప్యారిస్ ఒప్పందం తర్వాత వరుసగా పెరుగుతున్న వాతావరణ విపరిణామ ఘటనలు ప్రపంచాన్ని అప్రమత్తం చేశాయి. ఫలితంగా పర్యావరణ మార్పుకు సంబంధించి ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ అనే హద్దు అలిఖిత శాసనమైంది. అయితే, ఇప్పుడు ఆ హద్దును దాటిపోయే పరిస్థితి వచ్చింది. గడచిన 2023లో భూగోళం భుగభుగలాడింది. ఉష్ణోగ్రతలో పెంపు ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రతి రోజూ 1850 – 1900 మధ్య కాలం కన్నా కనీసం ఒక డిగ్రీ అధిక తాపం ఉంది. గత జూన్‌లో మొదలై డిసెంబర్ దాకా ప్రతి నెలా గరిష్ఠ వేడిమి మాసంగా రికార్డవుతూ వచ్చాయి. ఏడాదిలో సగం రోజులు ఎప్పటికన్నా 1.5 డిగ్రీలు ఎక్కువ వేడి ఉన్నాయి. నవంబర్‌లో రెండు రోజులైతే ఏకంగా 2 డిగ్రీల చెలియలికట్టను దాటేశాయి. భూతాపం లెక్కలు రికార్డ్ చేయడం మొదలుపెట్టాక గత 150 ఏళ్ళలో ఎన్నడూ లేనంత వేడిమి గల వత్సరంగా 2023 రికార్డుకెక్కింది. గతంలో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయిన ఏడాది 2016. సగటున 0.17 డిగ్రీల హెచ్చు ఉష్ణో గ్రతతో 2023 ఆ రికార్డును తిరగరాసింది. ఈ సంగతి ఆందోళన కలిగిస్తుంటే, ఇంత కన్నా భయ పెడుతున్న విషయం ఉంది. వచ్చే 12 నెలల్లో భూగోళం 1.5 డిగ్రీల మార్కును సైతం దాటేసే ప్రమాదం ఉందట. సీసీసీఎస్ శాస్త్రవేత్తలే ఆ మాటన్నారు. అంటే ఈ 2024 మరింత వేడిమితో ఉడుకెత్తించనుందన్న మాట. ఒక పక్క రికార్డు స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు, మరోపక్క సహజ వాతావరణ పరిణామమైన ఎల్ నినో... ఈ రెండూ భూగోళంపై ఉష్ణోగ్రతలు ఇంతగా పెరగడానికి ప్రాథమిక కారణమని శాస్త్రవేత్తల మాట. ఈ అధిక ఉష్ణోగ్రతల దెబ్బతో వడగాడ్పులు, వరదలు, కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాణికోటి ఆయువు తీస్తున్నాయి. జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. అమెరికా, ఐరోపాలలో ఆ మధ్య చెలరేగిన వేడిగాలుల లాంటి వాతావరణ విపరిణామాలు సైతం మానవ తప్పిదాలతో పెరిగిన భూతాపంతోనే సంభవించాయి. డబ్ల్యూఎంఓ, సీసీసీఎస్‌లే కాదు... వందలాది శాస్త్రీయ అధ్యయనాలూ ప్రమాదాన్ని అద్దంలో చూపుతున్నాయి. జపాన్‌కు చెందిన మరో వాతావరణ సంస్థ విడిగా చేసిన మరో విశ్లేషణ ఫలితాలూ ఇలానే ఉన్నాయి. డిగ్రీలో పదో వంతు మేర భూతాపం పెరిగినా... వడగాడ్పులు, తుపానులు తీవ్ర మవుతాయి. సముద్రమట్టాలు పెరుగుతాయి. హిమానీనదాలు త్వరగా కరిగి నీరవుతాయి. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా మనం నిరుడు చూసినవే. భూతాపంతో ఇరాన్, చైనా, గ్రీస్, స్పెయిన్, టెక్సాస్, అమెరికా దక్షిణ ప్రాంతాలు ఉడికిపోయాయి. కెనడాలో విధ్వంసకరమైన కార్చిచ్చు చెలరేగింది. సముద్ర ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంత పెరిగి, సముద్ర వడగాడ్పులు వీచాయి. వేసవిలోనూ, శీతకాలంలోనూ అంటార్కిటికా సముద్ర తీరాల వెంట హిమ ఘనీభవనం చాలా తక్కువైంది. రికార్డు స్థాయిలో పడిపోయింది. ఇవన్నీ ప్రకృతి మోగిస్తున్న ప్రమాద ఘంటికలని గ్రహించాలి. పెరుగుతున్న భూతాపాన్ని నివారించడానికి ఇకనైనా చిత్తశుద్ధితో సంకల్పించాలి. విపరీత ఘట నల్ని నివారించాలంటే, అత్యవసరంగా ఆర్థిక వ్యవస్థను కర్బన రహిత దిశగా నడిపించాలి. పర్యావ రణ సమాచారాన్నీ, జ్ఞానాన్నీ ఆసరాగా చేసుకొని భవిష్యత్తు వైపు అడుగులేయాలి. భూగోళంపై జీవకోటి ప్రాణాధార వ్యవస్థలు అమితంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటికే సురక్షిత వలయం బయట మానవాళి గడుపుతోందనీ శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించారు. భూతాపం, వాతావరణ మార్పులు హద్దు మీరితే పరిస్థితి ఎలా ఉంటుందన్నది 2023 రుచి చూపింది. ఇకనైనా ప్రపంచ దేశాలు తమ నిర్లక్ష్యాన్ని వీడి, వాతావరణ మార్పులపై కార్యాచరణకు దిగాలి. శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించడంలో మీనమేషాలు లెక్కించడం మానవాళికి శ్రేయస్కరం కాదు. అగ్ర రాజ్యాలు సహా అన్నీ ఆ పనికి దిగాలి. వీలైనంత త్వరగా నెట్ జీరో స్థాయి చేరి, జీవనయోగ్యమైన వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి. మన జీవితంలో రాబోయే వత్సరాలన్నీ ఇంతకింత భూతాపంతో ఉంటాయనే భయాలూ లేకపోలేదు. అదే నిజమై, వాటితో పోలిస్తే గడచిన 2023వ సంవత్సరమే చల్లగా ఉందని భావించాల్సిన పరిస్థితి వస్తే, అది ఘోరం. చేతులారా చేస్తున్న పాపానికి ఫలితం! -
2023 హాటెస్ట్ వేసవి
2023లో ఎండలు అక్షరాలా మండిపోయా యి. ఎంతగా అంటే, మానవ చరిత్రలో రికార్డయిన అత్యంత హెచ్చు ఉష్ణోగ్రతలు ఈ ఎండాకాలంలోనే నమోదయ్యాయి. ఈ ఏడాదే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రికార్డులు బద్దలయ్యేంతటి వడ గాడ్పులు, వాటి అనంతర పరిణామాలు ఇందుకు మరింతగా దోహదం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా భూగోళం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగిపోతున్న పరిణామానికి ఇది ప్రమాదకరమైన కొనసాగింపేనని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు... 2023 వేసవి 1880లో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వివరాలు నమోదు చేయడం మొదలు పెట్టిన నాటినుంచి అత్యంత వేడిమితో కూడినదిగా రికార్డు సృష్టించింది. ఈ ఆందోళనకర గణాంకాలను న్యూయార్క్‌లోని నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ (జీఐఎస్ఎస్) వెల్లడించింది. ‘ఇప్పటికైనా మేలుకుని గ్లోబల్ వారి్మంగ్‌కు, ముఖ్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్ట వేయడం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం’ అని పర్యావరణ ప్రియులు, శాస్త్రవేత్తలు∙ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పులి మీద పుట్రలా... ఈ వేసవిలో ఎండలు గత రికార్డులన్నింటిన్నీ బద్దలు కొట్టడం వడ గాడ్పుల పాత్ర చాలా ఎక్కువే. ఈ ఏడాది ప్రపంచంలో చాలా ప్రాంతాలను అవి తీవ్రంగా వణికించాయి... ► ఇటు అమెరికా నుంచి అటు జపాన్ దాకా, యూరప్ నుంచి దక్షిణ అమెరికా ఖండం దాకా కానీ వినీ ఎరగని స్థాయిలో వేడి గాలులు అతలాకుతలం చేసి వదిలాయి. ► ఇటలీ, గ్రీస్ తో పాటు పలు మధ్య యూరప్ దేశాల్లో విపరీతమైన వర్షపాతానికి కూడా ఈ గాలులు కారణమయ్యాయి. ► ఈ వడ గాడ్పుల దుష్పరిణామాలను ఏదో ఒక రూపంలో ప్రపంచమంతా చవిచూసింది. ఇవీ రికార్డులు... ఈ ఏడాది ఎండలు అన్ని రికార్డులనూ బద్దలు కొట్టి పర్యావరణ ప్రియుల ఆందోళనలను మరింతగా పెంచాయి. ► ముఖ్యంగా జూన్, జూలై, ఆగస్ట్ ఉమ్మడి ఉష్ణోగ్రతలు నాసా రికార్డుల్లోని గత అన్ని గణాంకాల కంటే 0.23 డిగ్రీ సెంటిగ్రెడ్ ఎక్కువగా నమోదయ్యాయి. ► అదే 1951–1980 మధ్య అన్నీ వేసవి కా సగటు ఉష్ణోగ్రత కంటే ఏకంగా 1.2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువగా తేలాయి! మేలుకోకుంటే అంతే... గ్రీన్ హౌస్, కర్బన ఉద్గారాలు ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదలకు ప్రధాన కారణమని నాసా జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్ జోష్ విల్లిస్ అంటున్నారు. ‘ కొన్నేళ్లుగా భూగోళం స్థిరంగా వేడెక్కుతూ వస్తోంది. ప్రధానంగా మనిషి నిర్వాకమే ఈ వాతావరణ అవ్యవçస్థకు దారి తీస్తోంది. సాధారణంగా కూడా ఎల్ నినో ఏర్పడ్డప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడం రివాజు’ అని ఆయన అన్నారు. ఎలా నమోదు చేస్తారు? నాసా ఉష్ణోగ్రతల రికార్డు పద్ధతిని జిస్ టెంప్ అని పిలుస్తారు. ► దీనిలో భాగంగా భూ ఉపరితల ఉష్ణోగ్రతలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల వాతావరణ కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు సేకరిస్తారు. ► నౌకలు తదితర మార్గాల ద్వారా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను కూడా సేకరిస్తారు. ► 1951–1980 మధ్య కాలాన్ని సూచికగా తీసుకుని, ఆ 30 ఏళ్ల సగటుతో పోలిస్తే ఏటా ఉష్ణోగ్రతల తీరుతెన్నులు ఎలా ఉన్నదీ లెక్కిస్తారు. మరీ విపరీతమైన మార్పులుంటే తక్షణం అన్ని దేశాలనూ అప్రమత్తం చేస్తారు. ‘ఈ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల దు్రష్పభావం మున్ముందు కూడా ప్రపంచం మొత్తం మీదా చెప్పలేనంతగా ఉండనుంది’ – బిల్ నెల్సన్, నాసా అడ్మినిస్ట్రేటర్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో అత్యంత హెచ్చుదల నమోదవడమే ఈసారి కనీ వినీ ఎరుగని ఎండలకు ప్రధాన కారణం. – జోష్ విల్లిస్, క్లైమేట్ సైంటిస్ట్, ఓషనోగ్రఫర్, నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
అల్పపీడనం బలహీనపడడంతో రాష్ట్రంలో ఉక్కపోత
-
గంగమ్మకూ నీటి కష్టాలు!
సాక్షి, అమరావతి: తన తాత ముత్తాతలకు సద్గతుల ప్రాప్తి కోసం భగీరథుడు దివి నుంచి భువికి రప్పించిన గంగమ్మకూ నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం జీవ నదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు, తీస్టా సహా 12 నదుల్లో ప్రవాహం 2100 నాటికి వర్షాలపైనే ఆధారపడే పరిస్థితి రావచ్చు. మన దేశంతోపాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా ఆసియా ఖండంలోని 16 దేశాల్లో 167.40 కోట్ల మంది ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు తప్పవని చెబుతోంది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ (ఐసీఐఎంవోడీ) సంస్థ ఈ నెల 20న విడుదల చేసిన అధ్యయన నివేదిక. ఇందుకు ప్రధాన కారణం.. ఆ జీవ నదులకు జన్మ స్థానమైన హిమాలయ పర్వతాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు శరవేగంగా కరిగిపోతుండటమేనని తేల్చింది. వాతావరణ మార్పులు, భూఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్లే హిమనీ నదాలు వేగంగా కరిగిపోతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 2010 నాటికి 80 శాతానికి తగ్గిపోవడం ఖాయమని అంచనా వేసింది. ఆసియా ఖండపు నీటి శిఖరం ధ్రువ ప్రాంతాల తర్వాత భూగోళంపై అతి పెద్ద హిమనీ నదాలకు నిలయం హిందూకుష్ పర్వత శ్రేణులే కావడం గమనార్హం. హిమాలయ పర్వత శ్రేణుల్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లోనే గంగా, బ్రహ్మపుత్రా, సింధు, తీస్టా సహా 12 నదులు పురుడు పోసుకుని మనదేశంతోపాటు పాకిస్తాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ తదితర 16 దేశాల్లో ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ నదులకు ప్రధాన ఆధారం హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాలే. హిమపాతంలో గణనీయంగా తగ్గుదల కాలుష్యంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమపాతం గణనీయంగా తగ్గుముఖం పడుతోందని ఐసీఐఎంవోడీ అధ్యయనంలో వెల్లడైంది. 1971 నుంచి 2000 సంవత్సరాల మధ్య హిందూకుష్ పర్వత శ్రేణుల్లో అంచనా వేసిన దానికంటే హిమపాతంలో సగటున 15 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే.. 2070 నుంచి 2100 సంవత్సరాల మధ్యలో అంచనా వేసిన దాని కంటే సింధూ బేసిన్లో 30 నుంచి 50, గంగా బేసిన్లో 50 నుంచి 60, బ్రహ్మపుత్రా బేసిన్లో 50 నుంచి 70 శాతం హిమపాతం తగ్గుతుందని అంచనా వేసింది. శరవేగంగా కరుగుతున్న మంచు 2000 సంవత్సరం నుంచి 2009 మధ్య ఏటా సగటున 0.18 మీటర్ల మేర హిమనీ నదాల పరిమాణం తగ్గితే.. 2010 నుంచి 2019 మధ్య అది 0.28 మీటర్లకు పెరిగిందని ఐసీఐఎంవోడీ తెలిపింది. అంటే.. 2000–2009తో పోల్చి తే 2010–2019 మధ్య హిమనీ నదాల మంచు కరుగుదల 65 శాతం పెరిగినట్టు స్పష్టమవుతోంది. మంచు శరవేగంగా కరుగుతుండటం వల్ల 2100 సంవత్సరం నాటికి హిందూకుష్ పర్వత శ్రేణుల్లోని హిమనీ నదాల పరిమాణం 80 శాతం తగ్గుతుందని లెక్కగట్టింది. దీనివల్ల గంగా, సింధు, బ్రహ్మపుత్ర సహా 12 నదుల్లో వర్షాకాలం తప్ప మిగతా సమయాల్లో నీటి ప్రవాహం ఉండే అవకాశాలు తక్కువని అంచనా వేసింది. ఇది ఆ నదీ పరీవాహక ప్రాంతాల్లోని 167.40 కోట్ల మంది ప్రజల జీవనోపాధులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. హిమపాతం తగ్గడం వల్ల 1979 నుంచి 2019 మధ్య గంగా, బ్రహ్మపుత్ర, సింధు బేసిన్లలో నీటిలభ్యత తగ్గడం వల్ల 1.29 కోట్ల మంది రైతుల జీవనోపాధులు దెబ్బతిన్నాయని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఐఎంవోడీ వెల్లడించింది. -
వడగాడ్పులకు 100 మంది బలి!
బలియా/పట్నా: ఉత్తరాదిన కొనసాగుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో జనం పిట్టల్లా రాలుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో మూడు రోజుల్లోనే 100 మంది వరకు ప్రజలు చనిపోయారు. భరించలేని ఎండలు, వడగాడ్పులకు తాళలేక యూపీలో 54, బిహార్‌లో 44 మరణాలు నమోదయ్యాయి. ఈ నెల 15, 16, 17 తేదీల్లో యూపీలోని బలియా ఆస్పత్రిలో చేరిన సుమారు 400 మంది జ్వర బాధితుల్లో 54 మంది వివిధ కారణాలతో చనిపోయారని అధికారులు తెలిపారు. ఎండలు విపరీతంగా ఉండడంతో ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలకు గురై ఆస్పత్రికి వస్తున్నారని బలియా ప్రధాన వైద్యాధికారి(సీఎంవో) డాక్టర్ జయంత్ కుమార్ తెలిపారు. మొత్తం 54 మందిలో 40 శాతం మంది జ్వరంతో, 60 శాతం మంది ఇతర వ్యాధులతో చనిపోయారని డాక్టర్ కుమార్ చెప్పారు. ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వారేనన్నారు. మరణాలకు కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు లక్నో నుంచి వైద్య బృందాలను పంపించింది. బల్లియా జిల్లా ఆస్పత్రిలో మరిన్ని ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఏర్పాటు చేశారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచామని అధికారులు తెలిపారు. ఆజంగఢ్ డివిజన్ ఆరోగ్య శాఖ అదనపు డైరెక్టర్ ఓపీ తివారీ శనివారం మీడియాతో మాట్లాడుతూ..లక్నో నుంచి రానున్న ఆరోగ్య శాఖ బృందం బల్లియాకు వచ్చి పరీక్షలు నిర్వహిస్తుందని, మరణాలకు కారణాలను నిర్ధారిస్తామని చెప్పారు. బహుశా గుర్తించని ఏదో ఒక వ్యాధి మరణాలకు కారణమై ఉండొచ్చు, ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. వేసవి, శీతాకాలాల్లో డయాబెటిక్ రోగులతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, రక్తపోటు ఉన్నవారిలో మరణాల రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది’అని తివారీ చెప్పారు. శుక్రవారం బలియాలో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉషో్టగ్రత నమోదైందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే ఇది 4.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది. సీఎంఎస్ తొలగింపు బలియా జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్(సీఎంఎస్) డాక్టర్ దివాకర్ సింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆస్పత్రిలో మరణాలకు కారణాలపై నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆజంగఢ్‌కు బదిలీ చేసింది. డాక్టర్ ఎస్కే యాదవ్‌కు సీఎంఎస్ బాధ్యతలను అప్పగించింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ..నిత్యం 125 నుంచి 135 మంది రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారని తెలిపారు. 15న 23 మంది, 16న 20 మంది, 17న 11మంది వేర్వేరు కారణాలతో చనిపోయినట్లు తెలిపారు. బిహార్‌లో 44 మంది.. బిహార్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. గత 24 గంటల్లో తీవ్ర వడగాల్పుల కారణంగా 44 మంది చనిపోయారు. వీరిలో ఒక్క పటా్నలోనే 35 మంది ప్రాణాలు కోల్పోయారు. పట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వంద మంది వరకు వడదెబ్బ బాధితులు చేరినట్లు అధికారులు తెలిపారు. ఎండలకు తోడు రాష్ట్రంలోని 18 ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు, నాలుగు చోట్ల వడగాడ్పులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయని అధికారులు తెలిపారు. షేక్‌పురాలో అత్యధికంగా 44.2 డిగ్రీలు, పటా్నలో 43.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం పాఠశాలలు, అంగన్వాడీలకు వేసవి సెలవులను 24 వరకు పొడిగించింది. -
మరో రెండ్రోజులు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుముం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణాదిలోని మరికొన్ని భాగాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశంఉందని అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ఈసల తక్కెళ్లపల్లిలో 44.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
మండే ఎండలు.. వడగాల్పులు
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇంకా అధికంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమ దిశ నుంచి బలమైన గాలులు వీస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రధానంగా అదిలాబాద్, ఖమ్మం, ములుగు, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇక గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలంగా గాలులు వీస్తున్నాయి. బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత అత్యధికంగా కరీంనగర్ జిల్లా తంగులలో 45.4 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 42.2 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 25.2 డిగ్రీ సెల్సీయస్‌గా నమోదైంది. -
తెలంగాణకు అలర్ట్.. వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం నుంచి వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ అంతటా పగ టి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కాగా, రాష్ట్రంలో ఆదివారం కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఒక్క రోజు మాత్రం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా దక్షిణ చత్తీస్ఘడ్ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఉంది. -
మండుతున్న సూరీడు.. ఆ జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు, శ్రీకాకుళం, వైఎస్సార్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అత్యల్పంగా విశాఖపట్నం (గంభీరం)లో 38.9, కోనసీమ అంబేడ్కర్ జిల్లా(అంగర)లో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వల్లూరు మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచాయని, మరో 27 మండలాల్లో వడగాడ్పులు వీచాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం 29 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అనకాపల్లి జిల్లాలో 5, గుంటూరులో ఒకటి, కాకినాడలో ఒకటి, ఎన్టీఆర్ జిల్లాలో 2, పల్నాడులో 2, మన్యంలో 5, విజయనగరంలో 5, వైఎస్సార్ జిల్లాలో 8 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. శనివారమూ 33 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. నేడు 44 నుంచి 45 డిగ్రీల వరకు శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీలు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు వహించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. -
వచ్చే ఐదేళ్లలో ఎండ ప్రచండం! హెచ్చరించిన డబ్ల్యూఎంఒ
జెనీవా: వచ్చే అయిదేళ్ల పాటు ప్రపంచ దేశాల్లో ఎండలు దంచికొడతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) హెచ్చరించింది. పరిమితికి మించి గ్రీన్హౌస్ వాయువులు విడుదల, ఎల్‌నినో ప్రభావంతో అయిదేళ్ల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. 2015లో జరిగిన పారిస్ ఒప్పందంలో ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, దానిని అధిగమించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. 2015–2022 వరకు వరసగా ఎనిమిదేళ్లు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, వచ్చే ఐదేళ్లలో మరింత పెరిగిపోతాయని తెలిపింది. ‘‘వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది లేదంటే అయిదేళ్ల సగటు ఉష్ణోగ్రతలు పారిస్ ఒప్పందాన్ని అధిగమించేలా 1.5 డిగ్రీలు పెరిగిపోతాయి. అలా పెరగడానికి 98% అవకాశాలున్నాయి’’ అని డబ్ల్యూఎంఒ చీఫ్ పెటరి టాలస్ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ పారిస్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు ఎల్‌నినో పరిస్థితులతో ఈ ప్రమాదం ముంచుకొస్తోందని తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం, ఆహారం, నీటి పర్యవేక్షణ, పర్యావరణంపై ప్రభావం కనిపిస్తుందన్నారు. -
ఎండలతో జనం బెంబేలు
-
నిప్పుల కొలిమి.. తీవ్రమైన వేడి ప్రాంతంగా రాష్ట్రంలోని ఆ జిల్లాలు
సాక్షి, అమరావతి: భానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లాల్లోనూ (శ్రీ సత్యసాయి మినహా) ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే ఎండ మండిపోయింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడ ఎండ తీవ్రతను అంచనా వేయవచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా పచ్చవలో 46.2, కృష్ణా జిల్లా కొండూరులో 46, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.9, పల్నాడు జిల్లా రావిపాడులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2021, 22 సంవత్సరాల్లో వేసవి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో 46 డిగ్రీలు దాటలేదు. 45 డిగ్రీలకు చేరుకున్నా అది కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఈ సంవత్సరం 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవగా, మెజారిటీ ప్రాంతాల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. వచ్చే రెండు రోజులు మరింత తీవ్రం వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. మంగళవారం 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల, కొల్లిపర, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, తాడికొండ, తుళ్లూరు మండలాలు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాల్లో ఉన్నవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎండబారిన పడకుండా చూసుకోవాలన్నారు. ఎక్కువగా నీరు తాగాలి ఈ ఉష్ణోగ్రతల ప్రభావంతో శరీరంలో నీటిశాతం తగ్గిపోయి హెపటైటిస్–బి వచ్చే ప్రమాదం ఉంది. ఎండలో పనిచేసే వారు ఎక్కువగా నీటితో పాటు పళ్లరసాలు, బార్లీ, మజ్జిగ వంటివి తీసుకోవాలి. ఎండలో పనిచేసేవారిలో విపరీతమైన నీరసం, తలనొప్పి, పిక్కలు పట్టేయడం, తల విసిరేయడం వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి ఉన్నా డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించాలి. వారు నీడలోకి చేరి నీరు ఎక్కువగా తీసుకుని సేదతీరాలి. కళ్లకు ఇబ్బందులు రాకుండా నల్ల కళ్లద్దాలు వాడాలి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటలు వరకు ప్రయాణాలు చేయకూడదు. – డాక్టర్ వడ్డాది సురేష్, ఎండీ, రాజమహేంద్రవరం. వడదెబ్బకు ప్రకాశంలో నలుగురు మృతి ఒంగోలు: ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై సోమవారం ప్రకాశం జిల్లాలో నలుగురు మృతిచెందారు. జరుగుమల్లి మండలం కె.బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ (56), పాపిశెట్టి సూరిబాబు(57), పొందూరి సుబ్బరామిరెడ్డి (68), సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ(65) వడదెబ్బకు గురై మరణించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం నుంచే ఎండ తీవ్రత.. ఉదయం 6 గంటలకే మొదలవుతున్న ఎండ వేడి సాయంత్రం 6 గంటలు దాటినా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 40 డిగ్రీలు, 2, 3 గంటల సమయానికి 44 నుంచి 46 డిగ్రీలకు పెరుగుతోంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 30 నుంచి 36 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. -
తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు...
-
ఏప్రిల్–జూన్‌లో వేడి సెగలు!
న్యూఢిల్లీ: వాయవ్య ప్రాంతం మినహా దాదాపు భారతదేశమంతటా ఈ ఏప్రిల్ నుంచి జూన్ నెలదాకా సాధారణం కంటే కాస్త ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సంబంధిత వివరాలను శనివారం ప్రకటించింది. ‘ 2023 ఎండాకాలంలో మధ్య, తూర్పు, వాయవ్య భారతంలో సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్ రోజులు కొనసాగవచ్చు. దేశవ్యాప్తంగా సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలు కొద్దిగా అధికం కావచ్చు. అయితే దక్షిణ భారతదేశంలో, ఇంకొన్ని వాయవ్య ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా, సాధారణం కంటే తక్కువగా నమోదుకావచ్చు’ అని వాతావరణ శాఖ తన అంచనాల్లో పేర్కొంది. మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌ను, తీరప్రాంతాల్లో 37 డిగ్రీల సెల్సియస్‌ను, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల సెల్సియస్‌ను దాటినా, ఆ సీజన్లో ఆ ప్రాంతంలో సాధారణంగా నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రత కంటే 4.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని హీట్‌వేవ్‌గా పరిగణిస్తారు. భారత్‌లో 1901 నుంచి ఉష్ణోగ్రతల నమోదును గణిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి.. అత్యంత వేడి ఫిబ్రవరిగా రికార్డులకెక్కడం గమనార్హం. అయినాసరే సాధారణం కంటే ఎక్కువగా(29.9 మిల్లీమీటర్లకు బదులు 37.6 మిల్లీమీటర్లు) వర్షపాతం నమోదవడం, ఏడుసార్లు పశ్చిమ అసమతుల్యతల కారణంగా మార్చి నెలలో ఉష్ణోగ్రతలు మామూలు స్థాయిలోనే కొనసాగిన విషయం విదితమే. గత ఏడాది మార్చి నెల మాత్రం గత 121 సంవత్సరాల్లో మూడో అతి పొడిబారిన మార్చి నెలగా రికార్డును తిరగరాసింది. భారత్‌లో రుతుపవనాల స్థితిని ప్రభావితం చేసే దక్షిణఅమెరికా దగ్గర్లోని పసిఫిక్ మహాసముద్ర జలాలు చల్లబడే(లా నినో) పరిస్థితి బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. లా నినో పరిస్థితి లేదు అంటే ఎల్ నినో ఉండబోతోందని అర్థం. ఎల్ నినో అనేది అక్కడి సముద్ర జలాలు వేడెక్కడాన్ని సూచిస్తుంది. అప్పుడు అక్కడి నుంచి వచ్చే గాలుల కారణంగా భారత్‌లో రుతుపవనాల సీజన్లో తక్కువ వర్షాలు కురుస్తాయి. అయితే మే నెలకల్లా పరిస్థితులు మారే అవకాశముందని భిన్న మోడల్స్ అంచనాల్లో తేలిందని వాతావరణ శాఖ తెలిపింది. -
ప్రపంచానికి ఇదొక శుభవార్త.. ఓజోన్ పొర స్వయం చికిత్స
వాషింగ్టన్: వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, తద్వారా ప్రకృతి విపత్తులతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఇదొక శుభవార్త. భూగోళంపై ఉష్ణోగ్రతలను నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్ పొర స్వయం చికిత్స చేసుకుంటోంది. ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం క్రమంగా పూడుకుపోతోంది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే ఇందుకు కారణం. ఐక్యరాజ్యసమితికి చెందిన సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానెల్ ఈ విషయాన్ని ఒక నివేదికలో వెల్లడించింది. ప్రతి నాలుగేళ్లకోసారి ఈ నివేదిక విడుదల చేస్తారు. ఓజోన్ పొర పూడుకుపోవడం 2022లో మొదలైందని నివేదికలో తెలిపింది. ఓజోన్ రంధ్రం 2022 సెప్టెంబర్ 7 నుంచి అక్టోబర్ 13 మధ్య సగటున 23.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి కుంచించుకుపోయింది. క్లోరో ఫ్లోరో కార్బన్ల ఉద్గారాలు ఇదే క్రమంలో తగ్గిపోతే 2066 నాటికి పూర్తిగా పూడుకుంటుందని పేర్కొన్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ సత్ఫలితాలు ఇస్తున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు తొలిసారిగా 1980లో గుర్తించారు. మరో నాలుగు దశాబ్దాల్లో 1980 నాటి స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నిపుణులు స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత 2100 నాటికి 0.3 నుంచి 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గేలా హైడ్రో ఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని తగ్గించుకోవాలని మాంట్రికల్ ప్రోటోకాల్ నిర్ధేశిస్తోంది. -
చైనా: కరువుపై మేఘమథన అస్త్రం!
చాంగ్కింగ్(చైనా): దక్షిణ చైనాలో కరువు ఉరుముతోంది. ఎండలు మండిపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. నదుల్లో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని, ఏసీలు వాడొద్దని అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కరెంటు లేక ఫ్యాక్టరీలకు తాళాలు వేయాల్సి వస్తోంది. రిజర్వాయర్లలో నీరు అడుగంటుతోంది. తాగునీరు కూడా సరఫరా కావడం లేదు. కరువు నేపథ్యంలో కొన్నిచోట్ల అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కరువు సమస్యను అధిగమించడానికి మేఘ మథనంపై చైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మేఘాలపై రసాయనాలు వెదజల్లి, వర్షాలు కురిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. సిచువాన్, హూబే ప్రావిన్స్‌ల్లోనూ ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు చేతికి రాకుండా పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన ప్రాంతాల్లో పంటలను కరువు బారినుంచి కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొంది. చైనాలో వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభుత్వం అధికారికంగా రికార్డు చేసే ప్రక్రియ 61 ఏళ్ల క్రితం ప్రారంభమయ్యింది. ఇప్పటినుంచి ఇప్పటిదాకా చూస్తే ఈ ఏడాదే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సిచువాన్ ప్రావిన్స్‌లో 45 డిగ్రీల సెల్సియస్(113 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. దక్షిణ చైనాలో వరిసాగు అధికం. పంట దెబ్బతినకుండా కాపాడుకోవడానికి రాబోయే 10 రోజులు చాలా కీలకమని వ్యవసాయ శాఖ మంత్రి టాంగ్ రెంజియాన్ చెప్పారు. ఇప్పటికిప్పుడు వర్షాలు కురిసే అవకాశం లేదు. దాంతో చైనా సర్కారుకు ఇప్పుడు మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ఒక ప్రత్యామ్నాయంగా మారింది. డ్రోన్ల సాయంతో మేఘాలపై రసాయనాలు చల్లి, కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఉత్తర చైనాలో మాత్రం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కింగాయ్ ప్రావిన్స్‌లో వరదల కారణంగా 26 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. -
ఇక భగభగలు...
సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి: నడి వేసవిలో వచ్చిన అసని తుఫాన్ ఆ రోజుల్లో చల్లదనం పంచినా.. ఇప్పుడు మాత్రం దాని ప్రభావంతోనే భానుడు భగభగమంటున్నాడు. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మొత్తం అసని తుఫాన్ ఊడ్చేయడంతో.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సూర్యుడు నడి నెత్తిన చుర్రుమంటున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజల్ని విలవిల్లాడేలా చేస్తున్నాయి. భానుడి భగభగలకు తోడుగా.. వేడి గాలులు వీస్తుండటంతో..సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా విశాఖ నగరం, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలు ఉడికిపోయాయి. మిట్టమధ్యాహ్న సమయంలో వేడిగాలులు సెగపుట్టించాయి. ఈ పరిస్థితులు ఇకపై కొనసాగుతాయని దీనికి తోడు రోహిణి కార్తెలు సమీపిస్తున్న నేపథ్యంలో మరింత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 25 నుంచి రోహిణి కార్తెలు మొదలై.. జూన్ 8 వరకూ కొనసాగనున్నాయి. ప్రజలంతా.. -
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఎండలు మరింత తీవ్రం
సాక్షి, అమరావతి: వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అనేక చోట్ల 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. వేసవి తీవ్రత, ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వేడిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. చదవండి: తోటలో పెంచుకుంటున్న కోడిని దొంగిలిస్తావా? విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూ రు, వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 24న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45నుంచి 46 డిగ్రీలు, అల్లూరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నంద్యాల జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 25న అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, ఏలూరు, పల్నాడు, నంద్యాల జిల్లాల్లో 45నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో 42నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 26న కూడా 43నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. -
వేసవి ప్రారంభంలోనే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు
-
తెలంగాణలో మరింత పెరగనున్న ఎండలు: వాతావరణశాఖ
-
తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు
-
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
-
పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ వేడి ఎక్కువగానే ఉంటోంది. మంగళవారం పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా ఏర్పేడులో 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. -
ఉత్తరాదిన భానుడి సెగలు
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పటికే రావాల్సిన రుతుపవనాలు 2 వారాలుగా ఆగిపోవడంతో వేడి పెరిగింది. దీంతో, ఉత్తర భారతదేశంలో ఇప్పుడు వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో సుమారు 7 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలైంది. పశ్చిమ దిశ నుంచి వస్తున్న గాలులు వాతావరణంలో వేడిని పెంచాయి. రుతుపవనాల ప్రారంభ దశలో తేలికపాటి వర్షాలతో కాస్త ఉపశమనం పొందిన ప్రజలకు ఇప్పుడు వేడి గాలుల కారణంగా ఉక్కపోతతో అవస్థలు పెరిగాయి. రికార్డు బద్దలు: దేశ రాజధాని ఢిల్లీలో భానుడి ప్రతాపంతో వేడి 90 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. రాజధానిలోని మంగేష్‌పూర్ ప్రాంతంలో గురువారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు 1931 జూలై 1న 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. అయితే అదే సమయంలో జూలై మొదటి రోజు 9 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా జూన్ చివరి వారంలో రుతుపవనాల ప్రభావం కారణంగా ఉష్ణోగ్రత 37–38 డిగ్రీలుగా ఉంటుంది. కానీ ఈ ఏడాది వేడిగాలుల కారణంగా రుతుపవనాలు ఆలస్యం కావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అంతకుముందు 2012 జూలైలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మూడు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రత సుమారు 43 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 7 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. అయితే పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్, యూపీల్లోనూ వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న వేడిగాలులు రుతు పవనాలను అడ్డుకుంటున్నాయి. త్వరలో ఉపశమనం.. రెండు రోజులు ఆలస్యంగా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు కేవలం 10 రోజుల్లోనే దేశంలోని 80% ప్రాంతాన్ని కవర్ చేశాయి. జూలై 3 నుంచి అరేబియా సముద్రం నుంచి గుజరాత్, రాజస్తాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమ గాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందని, అప్పుడు ఉపశమనం లభిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాల బ్రేక్ జూలై 7 వరకు కొనసాగవచ్చని, ఆ తరువాత బంగాళాఖాతం నుంచి వచ్చే గాలులు ఉత్తర భారతదేశానికి చేరిన తర్వాత రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంటోంది. -
అమెరికా, కెనడాలలో ఎండ ప్రచండం
సలేమ్(అమెరికా): అమెరికాలోని వాషింగ్టన్, ఒరెగాన్‌తోపాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. పలు నగరాల్లో ఆల్‌టైమ్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల ధాటికి రాబోయే రోజుల్లో వందలాది మరణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒరెగాన్ రాష్ట్రంలో ఎండల కారణంగా 60 మందికి జనం మృతిచెందినట్లు అధికారులు బుధవారం రాత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన ముల్ట్నోమాలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 45 మంది మరణించారు. కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలో శుక్రవారం నుంచి బుధవారం మధ్య కనీసం 486 మంది ఆకస్మికంగా ప్రాణాలు విడిచారని అధికార వర్గాలు తెలిపాయి. వాంకోవర్, బ్రిటీష్ కొలంబియాలో చాలా ఇళ్లల్లో ఏసీ సదుపాయం లేదని, వృద్ధులు ఎండ వేడిని తట్టుకోలేక చనిపోతున్నారని వెల్లడించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో ప్రతికూల వాతావరణం కారణంగా 20కి పైగా మరణాలు చోటుచేసుకున్నాయి. సియాటెల్, పోర్ట్ల్యాండ్తోపాటు పలు నగరాల్లో రికార్డు స్థాయిలో 115 డిగ్రీల ఫారెన్‌హీట్(46 డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత నమోదయ్యింది. వాషింగ్టన్, ఒరెగాన్, ఇడాహో, మోంటానా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండల ధాటికి 44 నుంచి 97 ఏళ్లలోపు వారే ఎక్కువగా చనిపోతున్నారని ఒరెగాన్ రాష్ట్రం ముల్ట్నోమా కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ తెలిపారు. -
ఏపీ: వణికించిన వడగాలులు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: భానుడి భగభగలు.. రెండోరోజు గురువారం కూడా కొనసాగాయి. సూర్యుడు బుధవారం కంటే మరింత వడగాలులతో రాష్ట్రాన్ని వణికించాడు. ముఖ్యంగా కోస్తా జిల్లాలు ఎండ తీవ్రతతో అట్టుడికిపోయాయి. వడగాలులతో జనం తీవ్ర అవస్థలు పడ్డారు. యాస్ తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గడం.. ఉత్తర భారతదేశం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వాతావరణంలో తేమ లేకపోవడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. రాజస్థాన్ నుంచి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర వైపు గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో.. కోస్తాలో మరో రెండురోజులు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకూ ప్రభావం ఉంటుందని తెలిపింది. గురువారం ఉదయం నుంచే ఎండ తీవ్రత మొదలైంది. 9 గంటలకే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటింది. మధ్యాహ్నం 1 గంటకు సాధారణం కంటే 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా భామిని, విజయనగరం జిల్లా కురుపాంలలో అత్యధికంగా 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖలో సాధారణం కంటే రికార్డు స్థాయిలో 8.2 డిగ్రీలు ఎక్కువగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత 51 ఏళ్ల కాలంలో మే లో విశాఖలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం గమనార్హం. ఎండలు ఎక్కువగా ఉండే రాయలసీమలో మాత్రం ఎక్కడా 40 డిగ్రీలు దాటలేదు. ఈనెల 30వ తేదీ వరకు కోస్తా జిల్లాల్లో ఈ తరహాలోనే ఎండలు, వడగాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కోస్తా ప్రాంతంలోని 32 మండలాల్లో వడగాలులు వీచినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 30 నుంచి రాయలసీమలో వర్షాలు తెలంగాణ నుంచి తేమ గాలులు వస్తుండటం వల్ల ఈనెల 30 నుంచి రాయలసీమలో వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి దక్షిణ కోస్తా, మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్షాలు విస్తరిస్తాయన్నారు. రుతుపవనాల కంటే ముందే వర్షాలు కురవడం వల్ల ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టనుంది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకనున్నాయి. ప్రీ మాన్సూన్ వర్షాల కాలం ముగిసే సమయానికి నైరుతి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఎండల తీవ్రత ఈ నెలాఖరుకు ముగిసినట్లేనని వాతావరణశాఖ తెలిపింది. చదవండి: బయటకు రావాలంటే హడల్: ఆ గ్రామానికి ఏమైంది! Andhra Pradesh: 10 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం -
Summer 2021: 'ఎండ' ప్రచండం
రాష్ట్రంపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులతో నిప్పుల వాన కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం 111 మండలాల్లో, రానున్న 48 గంటల్లో 12 మండలాల్లో వడగాడ్పులు సెగలు పుట్టించనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చి నెలాఖరు నుంచే వేసవి సెగ పుట్టిస్తోంది. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పటి నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవైపు తేమ గాలులు, మరోవైపు ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాబోయే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది తదుపరి 24 గంటల్లో ఉత్తర అండమాన్ దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా.. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో సూర్యుడు నిప్పుల వాన కురిపించనున్నాడని పేర్కొంది. మంగళవారం అనేక మండలాల్లో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు, రేపు (బుధవారం) సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రంలోని 111 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. రాగల 48 గంటల్లో 12 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 80 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమవారం మొత్తం 42 మండలాల్లో వడగాడ్పులు వీచాయని అధికారులు వివరించారు. 31న తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉండే మండలాలు.. గరుగుబిల్లి (విజయనగరం), కొయ్యూరు (విశాఖపట్నం), గొలుగొండ (విశాఖపట్నం), అడ్డతీగల (తూర్పుగోదావరి), రాజవొమ్మంగి (తూ.గో), నెల్లిపాక (తూ.గో), కూనవరం (తూ.గో), చింతూరు (తూ.గో), వేలేరుపాడు (ప.గో), కంచికచర్ల (కృష్ణా), వీరులపాడు (కృష్ణా), ఇబ్రహీంపట్నం (కృష్ణా). -
ఇక వడ దడ!
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో వడగాడ్పులు దడ పుట్టించనున్నాయి. వీటి ప్రభావం శనివారం నుంచే మొదలు కానున్నప్పటికీ ఆదివారం నుంచి మరింత ఉధృతరూపం దాల్చనున్నాయి. మొత్తం 670 మండలాలకు గాను శనివారం వివిధ జిల్లాల్లోని 94 మండలాలు, ఆదివారం 102 మండలాల్లోను వడగాడ్పులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం వెల్లడించింది. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వడగాడ్పుల ప్రభావం ఉండనుంది. అదే సమయంలో విజయనగరం, విశాఖపట్నం, ఆయా ప్రాంతాల్లో సాధారణం కంటే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ప్రధానంగా తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 36 మండలాలు, విజయనగరం జిల్లాలో 34, పశ్చిమ గోదావరిలో 32, కృష్ణాలో 30, విశాఖపట్నంలో 22, శ్రీకాకుళంలో 20కి పైగా మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రతలు రికార్డు కానున్నట్టు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయవ్య దిశ నుంచి వీస్తున్న గాలులే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 1నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల మరింత అధికమవుతుందని, వడగాడ్పుల ప్రభావమూ పెరుగుతుందని చెబుతున్నారు. -
మూడు రోజులు మంటలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులూ భానుడు సెగలు కక్కనున్నాడు. నడి వేసవిని తలపించేలా ఎండలు మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర భారతదేశం నుంచి తేమగాలులు, బంగాళాఖాతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయని, దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అధికపీడనం కారణంగా ఎండలు పెరిగే వీలుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. మంగళవారం కర్నూలు, తునిలో 39.5, విశాఖ, కడప, జంగమహేశ్వరపురంలో 38.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా,ఈ నెలాఖరులో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
నేటి నుంచి వడగాడ్పులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాల్లోని 15 మండలాల్లో మంగళవారం నుంచి వడగాడ్పులు ఉంటాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖలో సోమవారం 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడం వల్ల ఎండలు మండుతున్నాయని, వేడిగాలులు ఉంటాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. కొద్దిరోజులు ఇలాగే ఉంటుందని, ప్రస్తుతం గాలులు ఉత్తర దిశ నుంచి వీస్తున్నాయని తెలిపారు. సాధారణం కంటే 2 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రాయలసీమలో ఎండలు మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. -
ఉత్తర భారతంలో రెడ్ అలర్ట్
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు మించిపోవడంతో భారత వాతావరణ శాఖ(ఐఎండీ)ఆదివారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హరియాణా, చండీగఢ్, రాజస్తాన్‌లకు మరో రెండు రోజుల పాటు ఈ హెచ్చరిక వర్తిస్తుందని తెలిపింది. వడగాడ్పులు వీచే ప్రమాదమున్నందున తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసినట్లు ఐఎండీ పేర్కొంది. వచ్చే 2, 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు కావచ్చని హెచ్చరించింది. ఈ వేసవిలో రెడ్ అలర్ట్ జారీ చేయడం ఇదే మొదటిసారని తెలిపింది. ఉత్తర, మధ్య భారత్‌లో ఏప్రిల్ నుంచి మే రెండో వారం వరకు వానలు కురియడంతో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఈసారి నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని పిలానీలో శనివారం అత్యధికంగా 46.7 డిగ్రీలు నమోదైంది. పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, విదర్భల్లో వచ్చే అయిదు రోజుల్లో తీవ్ర వడగాడ్పులు వీచేందుకు అవకాశ ముందని ఐఎండీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, యానాం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3, 4 రోజుల్లో అక్కడక్కడా వడగాడ్పులు వీస్తాయంది. వాతావరణ పరిస్థితుల్లో తీవ్రతను బట్టి గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే రోజులో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించడమే రెడ్ అలర్ట్ ఉద్దేశం. ఈనెల 28వ తేదీ తర్వాత కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త నరేశ్ కుమార్ అన్నారు. -
ఈ దశాబ్దం చాలా హాట్ గురూ.!
మాడ్రిడ్: చరిత్రలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుత దశాబ్దం(2010–2019)లోనే నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో వాతావరణ మార్పులు మానవాళి సామర్థ్యాన్ని ఏవిధంగా అధిగమిస్తున్నాయో తెలిపింది. అలాగే పారిశ్రామికీకరణ ముందు సమయం (1850–1900) లోని సగటు ఉష్ణోగ్రత కంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సుమారు 1.1 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) వెల్లడించింది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2019 మొదటి 3 స్థానాల్లో నిలిచిందని పేర్కొంది. మానవ కారణ ఉద్గారాలు, మౌలిక వసతుల నిర్మాణం, పంట సాగు, వస్తు రవాణా వంటివి 2019ని అత్యంత కార్బన్ ఉద్గారాలు వెలువడిన ఏడాదిగా రికార్డుకు ఎక్కించిందని డబ్ల్యూఎమ్‌వో వెల్లడించింది. గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా ప్రపంచంలో వెలువడిన ఉష్ణోగ్రతల్లో 90 శాతానికిపైగా వేడిని సముద్రాలు గ్రహిస్తాయని, దీంతో అవి ప్రస్తుతం అత్యంత వేడిని నమోదు చేస్తున్నాయని తెలిపింది. గత 12 నెలల్లో గ్రీన్‌ల్యాండ్ మంచు పలకల్లో సుమారు 329 బిలియన్ టన్నుల మంచు కరిగిపోయిందని డబ్ల్యూఎమ్‌వో వివరించింది. -
కోస్తాలో నిప్పుల ఉప్పెన!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలో ఎప్పుడూ లేనంతగా భానుడు మరింత భగభగమంటున్నాడు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులు రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరో రెండు మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి ఉంటుంది. సాధారణంకంటే ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగాను, అంతకుమించి రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. కానీ, కోస్తాంధ్రలో ఇప్పటికే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమ, మంగళవారాలు అంతకు మించి ఉష్ణోగ్రతలు రికార్డయి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. దీంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర నిప్పుల కుంపటిలా మారనుంది.రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2–4 డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని సూచించింది. ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాలు కాగా, ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. దీంతో ఈనెల 18 తర్వాత నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంవల్ల మూడు నాలుగు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అప్పట్నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునే అవకాశాలున్నాయి. మరోవైపు.. నైరుతీ రుతుపవనాలు నైరుతీ, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించినట్లు హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు, మైసూరు, తమిళనాడులోని సేలం, కడలూరు, ఒడిశాలోని గోపాలపురం, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ వరకు నైరుతీ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. -
సుర్రుమన్న ఛురు
న్యూఢిల్లీ: భారత్‌పై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో శనివారం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని ఛురు ప్రాంతంలో ఏకంగా 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే వారం రోజులవరకూ దేశమంతటా ఇదేతరహా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీలో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు పాలమ్ అబ్జర్వేటరీ తెలిపగా, 46.1 డిగ్రీలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో ఎండ తీవ్రతను సూచించే రెడ్ కేటగిరి హెచ్చరికను ఐఎండీ జారీచేసింది. రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 49 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా బందాలో 48.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాబోయే ఐదు రోజులు మధ్యప్రదేశ్, రాజస్తాన్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హరియాణాలోని నర్నౌల్లో 47.2 డిగ్రీలు,పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45.7 డిగ్రీలు, లూథియానాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చల్లగా ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉనాలో శనివారం 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక జమ్మూకశ్మీర్‌లోని జమ్మూలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, హిమాచల్, తూర్పు మధ్యప్రదేశ్ ఉత్తర కర్ణాటకలోని కొన్నిప్రాంతాల్లో సాధారణం కంటే 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైనట్లు వెల్లడించింది. రాయలసీమ, కేరళ, విదర్భ, హరియాణాలోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా రికార్డైనట్లు పేర్కొంది. ఒడిశాలోని దక్షిణ భాగంలో అధికతేమ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. -
ముందుంది నిప్పుల వాన!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి నిప్పుల ముప్పు ఇంకా పొంచి ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణ తీవ్రత కొనసాగనుంది. ఫొని తుపాను తీరాన్ని దాటక ముందు నుంచీ భానుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. ఎడతెరపి లేకుండా వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లోనూ వెరసి 139 మండలాల్లో వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీరుపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీడీఎంఏ) ఒక అట్లాస్‌ను రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే ఐఎండీ నేషనల్ మాన్సూన్ మిషన్ ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉష్ణోగ్రతల ప్రభావంపై పరిశీలన చేసింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలను తీవ్ర వడగాడ్పుల ప్రభావిత ఏరియాలుగా తేల్చింది. ఏపీ, తెలంగాణపైనా డెడ్లీ హీట్‌వేవ్స్ ప్రభావం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఈ వేసవిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (డెడ్లీ హీట్‌వేవ్స్) నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించింది. వాటి ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉంటుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి చాలా మరణాలు సంభవిస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి అత్యంత అరుదుగా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి రెండు మూడు రోజులకే పరిమితమని, ఎండలు విజృంభించి, మళ్లీ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బకు గురై మంగళవారం ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో నలుగురు వంతున, గుంటూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు వంతున మృతి చెందారు. నేడు, రేపు కోస్తాంధ్రకు వర్ష సూచన కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది. ఈదురుగాలులు, వర్షాలతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం గానీ, జల్లులు గానీ కురిసే అవకాశం ఉంది. గురువారం నుంచి అక్కడ రెండు రోజులు పొడి వాతావరణం నెలకొంటుంది. 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ‘‘జూన్ ఒకటి రెండు తేదీల్లో రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజుల నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్పటిదాకా ద్రోణుల ప్రభావంతో ఒకట్రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసి కాస్త చల్లబరచినా మళ్లీ వడగాడ్పులు విజృంభిస్తాయి. ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్నిచోట్ల 47 డిగ్రీల వరకు నమోదై నిప్పుల కొలిమిని తలపిస్తాయి. రానున్న రెండు మూడు రోజుల్లోనే వీటి పెరుగుదల మొదలవుతుంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలనే కురిపిస్తాయి. ముందుగా ఊహించినట్టుగా ఎల్‌నినో (వర్షాభావ) భయం లేదు’’ – ఓఎస్ఆర్యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయనవిభాగ మాజీ అధిపతి. ఏయూ -
రాష్ట్రంలో మరో మూడ్రోజులు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు కూడా వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడా 42 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంలేదు. బుధవారం నల్లగొండ, ఖమ్మంల్లో ఏకంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జనం విలవిల్లాడిపోతున్నారు. మరోవైపు ఉత్తర ఇంటీరియర్ ఒడిశా నుంచి రాయలసీమ వరకు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొన్నారు. కానీ దానివల్ల రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం ఉండదని, పొడి వాతావరణం నెలకొని ఉంటుందని తెలిపారు. మంథని@47 పెద్దపల్లి జిల్లాలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజురోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మంథనిలో 46.1 గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, బుధవారం రికార్డు స్థాయిలో 47 డిగ్రీలు నమోదైంది. దీంతో జనం విలవిల్లాడారు. ఉదయం 9 గంటలకు మొదలైన భానుడి ప్రతాపం రాత్రి 10 గంటలు దాటినా వేడి తగ్గలేదు. దీంతో చాలా మంది ఇళ్లకే పరిమితయ్యారు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత నల్లగొండ 45.0 ఖమ్మం 44.8 ఆదిలాబాద్ 44.3 రామగుండం 44.0 నిజామాబాద్ 43.6 మహబూబ్‌నగర్ 43.5 మెదక్ 42.6 హైదరాబాద్ 42.1 హన్మకొండ 42.0 -
ప్రజలను అప్రమత్తం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వడగాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్మణ్యం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరో ఐదు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతోపాటు వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే నేపథ్యంలో ఆదివారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫునే కాకుండా ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా వాటిని ప్రోత్సహించాలని సీఎస్ అన్నారు. ఆస్పత్రులు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. ఇంకా నెలపాటు ఎండల తీవ్రత ఉండే ప్రమాదం ఉన్నందున ఎక్కడ ఎవరికి సేవలు అవసరమైనా అందించేందుకు మందులు, అంబులెన్సులతోపాటు వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అంతేకాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అవసరమైన మేరకు అన్ని ఆస్పత్రుల్లో ఉంచాలని ఆదేశించారు. పశువుల దాహార్తిని తీర్చడానికి నీళ్లు నింపిన తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. వడగాలుల బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన సూచనలపై మీడియా ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించాలన్నారు. వడదెబ్బ మరణాలు సంభవించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చలివేంద్రాలు, బస్టాపుల్లో నీడ కోసం షెల్టర్ల ఏర్పాటు, వైద్య సేవలు అందించడం లాంటి పనులను పారిశ్రామిక సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో నిర్వహించాలని కోరారు. ఈ దిశగా ఆయా సంస్థలు ముందడుగేసేలా జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. -
నేటి నుంచి మూడ్రోజులు వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి మూడు రోజులు వడగాడ్పులు వీచే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. ఇదిలావుండగా ఆదివారం భద్రాచలం, ఖమ్మంల్లో 45 డిగ్రీల చొప్పున అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, రామగుండంల్లో 44 డిగ్రీలు, హన్మకొండ, నిజామాబాద్‌ల్లో 43 డిగ్రీలు, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ల్లో 42 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఈశాన్య ఛత్తీస్‌గఢ్ నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వెల్లడించారు. ఏపీలో 19మంది మృత్యువాత రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఏపీ విలవిల్లాడిపోతోంది. ఓవైపు ఎండవేడి మరోవైపు ఉక్కపోత జనాలకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. నానాటికీ వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. దీంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అల్లాడిపోతున్నారు. శని, ఆదివారాల్లోనే రాష్ట్రంలో పందొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. -
భానుడు.. భగ భగ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల పైకి ఉష్ణోగ్రతలు చేరుకున్నాయి. రాన్రాను మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వారం రోజుల్లో వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. వచ్చే వారం మొత్తం అనేక చోట్ల 44 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకుంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. వడగాడ్పుల తీవ్రత పెరిగితే సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదవుతాయి. గతేడాది 23 రోజులున్న వడగాడ్పులు ఈసారి అంతకుమించి ఎక్కువ రోజులు నమోదయ్యే పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు అంటున్నారు. అయితే తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు మధ్యమధ్యలో ఉపరితల ద్రోణులు, ఆవర్తనాలు ఏర్పడుతాయని, దానివల్ల వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు. ఎండల్లో తిరగొద్దు... రాష్ట్రంలో అన్నిచోట్లా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు. ఎండలకు తోడు నగరాలు, పట్టణాల్లో సిమెంటు రోడ్లు, భవనాలు, వాయు కాలుష్యం కారణంగా మరో ఒకట్రెండు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. -
43 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. బుధవారం పలుచోట్ల 43 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలో 43 డిగ్రీలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్‌లోనే ఎండలు ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
సుర్రుమనిపించిన సూరీడు
ఏలూరు (ఆర్ఆర్ పేట) : భానుడు నిప్పులు చెరిగాడు. ఎండ ప్రచండంతో జిల్లా ప్రజలు విలవిల్లాడారు. సోమవారం జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడినా.. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకూ 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే చవిచూసిన ప్రజలు ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో తల్లడిల్లారు. వడగాడ్పుల తీవ్రత పెరగడంతో జనం రోడ్లపైకి రాలేకపోయారు. వృద్ధులు, చిన్నారులు వేడికి ఉక్కిరిబిక్కిరయ్యారు. రాత్రి వేళలోనూ వదలని వేడి సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎండతీవ్రత కనిపించింది. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ప్రజలెవరూ మధ్యాహ్నం 11 గంటల తరువాత రోడ్లపైకి రావడానికి సాహసం చేయలేకపోయారు. రాత్రి 10 గంటలకు కూడా వేడి గాలులు వదల్లేదు. ఇళ్లల్లోని గోడలు, ధరించిన వస్త్రాలు వేడెక్కి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇళ్లల్లోని మంచినీళ్లు సైతం కాగిపోయాయి. నాసా హెచ్చరికలతో ఆందోళన రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్టు నాసా ప్రకటిం చింది. ఆ 8 జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇలానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారంతో అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నాలుగు రోజులపాటు ప్రజలు ఎండల్లో తిరగకూడదంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వడదెబ్బ బారిన పడినవారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వడదెబ్బకు 37 మంది మృతి
-
వడదెబ్బకు 37 మంది మృతి
- కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 9 మంది - విపత్తు నిర్వహణ శాఖకు కలెక్టర్ల నివేదిక - నేడు తెలంగాణ వ్యాప్తంగా వడగాడ్పులు సాక్షి, హైదరాబాద్/రామాయంపేట/ నిజాం పేట/మనూర్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి బుధవారం నాటికి 37 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ కమిషనర్ సదా భార్గవి ‘సాక్షి’కి తెలిపారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 9 మంది వడదెబ్బతో మృతిచెందారు. నాగర్ కర్నూలు, ఖమ్మం జిల్లాల్లో నలుగురు, భద్రాద్రి జిల్లాలో ముగ్గురు, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచి ర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కుమ్రం భీం, మహబూబాబాద్, మేడ్చల్, సిరిసిల్ల, సంగా రెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పు న చనిపోయారని కలెక్టర్లు వెల్లడించారు. చర్యలు శూన్యం.. రాష్ట్రంలో ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణో గ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్ర తపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివే దికలు అందుతున్నా ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటంలో వైఫల్యం కనిపిస్తోందన్న ఆరో పణలు వస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వ హణ శాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొం దించింది. ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి. ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచాలి. 108 సర్వీసులను అందుబాటులో ఉంచాలి. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి నీడ కల్పించాలి. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించాలి. నేడు వడగాడ్పులు.. రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా రాష్ట్రంలో వడ గాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్ర తలు నమోదవుతాయని తెలిపింది. కాగా, బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధి కంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బతో 9 మంది మృతి సాక్షి, నెట్వర్క్: వడదెబ్బతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. మృతు ల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం రాజవరం గ్రామానికి చెందిన గడ్డమీది వెంక మ్మ(65), మిర్యాలగూడలో విజయనగరం శ్రీను(38) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడంలో భూమ అంజయ్య (55), జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లలో కాంపెల్లి దుబ్బయ్య (65), కథలాపూర్ మండలం సిరి కొండలో ఏనుగు లింగారెడ్డి(36), యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండ లం మైలారం గ్రామ తండాలో కంకరమిల్లు కూలీ రమావత్ నీలా (30), మెదక్ జిల్లా నిజాంపేట మం డలం ఖాసీంపూర్‌లో మైలు నారాయణ(62), సిద్దిపేట జిల్లా బెజ్జంకి మం డలం గుండారంలో కోరుకొప్పుల కిష్టవ్వ (68), సంగారెడ్డి జిల్లా మనూరులో ఎర్ర రామయ్య(70) ప్రాణాలు కోల్పోయారు. -
రేపు వడగాడ్పులు వీచే అవకాశం
హైదరాబాద్: తెలంగాణలో రేపు, ఎల్లుండి వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో ఒకటి రెండుచోట్ల వడగాడ్పులు వీస్తాయని, పలుచోట్ల ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్ర మంతటా పలుచోట్ల, ఉష్ణోగ్రతలు 41 పైనే నమోదై, సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2-4 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశముందన్నారు. నేడు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలతో ఆదిలాబాద్ జిల్లా నిప్పులగుండంలా మారింది. ఆదిలాబాద్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
భగ్గుమంటున్న సూరీడు
శివరాత్రితో చలి నిష్క్రమించాక తీరిగ్గా వచ్చే అలవాటున్న వేసవి పిలవని పేరంటంలా ముందే వచ్చి ఠారెత్తిస్తోంది. వాస్తవానికి ఫిబ్రవరి నెలాఖరునుంచే ఎండలు మండుతున్నాయి. గత కొన్ని వారాలుగా అవి క్రమేపీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు లండన్, పెన్సిల్వేనియాలలోని శాస్త్రవేత్తలతోపాటు భారత వాతావరణ విభాగం చేస్తున్న హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఈసారి మాత్రమే కాదు...మున్ముందు కూడా భారత్‌లో భారీ వడగాడ్పులుంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మహానగరాల్లో ఈ పరిస్థితి మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని వారంటున్నారు. ఈసారి వేసవిలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండొచ్చు గనుక అందుకు అనుగుణమైన కార్యాచరణ ప్రణాళికను పాటించాలని భారత వాతావరణ విభాగం, జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంసీ) రాష్ట్రాలను కోరాయి. రెండేళ్లనాడు దేశంలో వడగాడ్పుల వల్ల దాదాపు 2,500మంది మరణించారు. అందులో దాదాపు 2,000 మరణాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించినవే. ఇవి అధికారిక గణాంకాలు. రికార్డుల కెక్కని మరణాలు కూడా కలుపుకుంటే ఇవి మరిన్ని రెట్లు ఎక్కువ ఉంటాయని చెప్పవచ్చు. మృతుల్లో అధిక శాతంమంది రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేద వర్గాలవారే. ఎండలు మండుతున్నా, వడగాడ్పులు వీస్తున్నా ఏదో ఒక పని చేస్తే తప్ప ఇల్లు గడవని జీవితాలు వారివి. ఆ వర్గాల్లో ఉండే నిరక్షరాస్యత వల్ల కావొచ్చు... వారికి పలుకుబడి అంతగా లేకపోవడంవల్ల కావొచ్చు ఆ మరణాల్లో చాలా భాగం వడగాడ్పుల జాబితాలో చేరవు. వడగాడ్పులు కూడా ఇతర ప్రకృతి వైపరీత్యాలైన వరదలు, భూకంపాలు, చలిగాలులు వగైరాల వంటివే. అయితే ప్రభుత్వాలు మాత్రం ఇతర వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించినట్టుగా వడగాడ్పుల విషయంలో వ్యవహరించవు. వాటి దృష్టిలో అసలు ఈ గాడ్పులు ప్రకృతి వైపరీత్యమే కాదు. 2012 వరకూ చలిగాలుల్ని కూడా ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించలేదు. ఆ ఏడాది ఉత్తరాదిన చలిగాలులకు అధిక సంఖ్యలో ప్రజలు మరణించాక తొలిసారి అది కూడా ప్రకృతి వైపరీత్యాల జాబితాలోకి వెళ్లింది. వడగాడ్పుల తీవ్రత దక్షిణాదిలోనే ఎక్కువుంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లోనే అధికం. వడగాడ్పుల్ని ప్రకృతి వైపరీత్యంగా చూడాలన్న డిమాండు కొంతకాలంగా వినబడుతున్నా కేంద్రం ఆ విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అదే జరిగితే వడదెబ్బ తగిలినవారికి వైద్య సదుపాయం కల్పించడం, మరణాలు సంభవించిన పక్షంలో వారి కుటుం బాలకు లక్షన్నర చొప్పున పరిహారం ఇవ్వడం వీలవుతుంది. ఆ అవకాశం లేక పోవడం వల్ల ఆ కుటుంబాలు చెప్పనలవికాని ఇబ్బందులు పడుతున్నాయి. వడగాడ్పుల వల్ల కేవలం మరణాలే కాదు... ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా పుట్టుకొస్తాయి. ఇక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం, మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారికి ఆ సమస్యల తీవ్రత మరింత పెరుగుతుంది. తాగునీటి సమస్య లేకుండా చూడటం, పశు దాణా లభ్యమయ్యేలా చూడటం కూడా కీలకం. అందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు రూపొందించాలి. ఉన్నంతలో వేసవి తాపం పెరుగుతున్న దశలోనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రాష్ట్రాలను కదిలించడం మేలు కలిగించే విషయం. సాధారణ స్థాయి ఉష్ణోగ్రతకు మించి అయిదారు డిగ్రీలు మించితే వడగాడ్పుగా పరిగణిస్తారు. ఈసారి కూడా రాష్ట్రాలకు పంపిన కార్యాచరణ ప్రణాళిక అనేక చర్యలను సూచిం చింది. వడగాడ్పులపై వాతావరణ విభాగం అందజేసే సమాచారం ఆధారంగా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేయడం, ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువగా పెరిగితే రెడ్ అలెర్ట్ జారీ చేయడం వంటివి ఇందులో కొన్ని. దీన్ని అమల్లో పెట్టాక జాతీయ గ్రామీణ ఉపాధి పథకంకింద చేపట్టే పనుల్లో నిర్దిష్ట సమయాల్లో కూలీలతో పనిచేయించడాన్ని నిలిపేయిస్తారు. అలాగే నిర్మాణ రంగంలోనూ, ఇతరత్రా రంగాల్లోనూ పని స్థలాల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన వన్నీ అందుబాటులో ఉంచడాన్ని తప్పనిసరి చేస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వగైరాల్లో రీహైడ్రేషన్ సౌకర్యం కల్పిస్తారు. ఆసుపత్రుల్లో అదనపు బెడ్ల ఏర్పాటు, కూలర్లు సమకూర్చడం వంటి చర్యలు తీసుకుంటారు. వడదెబ్బ మరణాలను ధ్రువీకరించేందుకు స్థానికంగా కమిటీల ఏర్పాటు, వడగాలుల సమాచారాన్ని అందించడంతోపాటు ప్రజానీకంలో చైతన్యం కలగజేసేందుకు, వడదెబ్బ మృతుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు నోడల్ అధికారిని నియమిస్తారు. నాలుగేళ్లక్రితం అహ్మదాబాద్, నాగపూర్, భువనేశ్వర్ తదితర నగరాలను ఎంచు కుని వడగాడ్పుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి స్థానిక సంస్థలనూ, స్వచ్ఛంద సంస్థలనూ అందులో భాగస్వాముల్ని చేసి అమలు చేశాక మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు అనేక చోట్ల నిరుడు ఆ విధానాన్నే అనుసరించడంవల్ల వడదెబ్బ మృతుల సంఖ్య 50 శాతం తగ్గింది. నిజానికి ఈ శతాబ్దంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డయింది. గాడి తప్పిన ప్రకృతిని సరిచేయడం ఏ ఒక్క దేశం వల్లనో సాధ్యం కాదు. అది సమష్టిగా జరగాల్సిన కృషి. పర్యావరణం క్షీణించడానికి కారణమవుతున్న కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న డిమాండుకు అమెరికా, ఇతర పారిశ్రామిక దేశాలు తలొగ్గి ఎంతో కాలం కాలేదు. ఆ తర్వాత కూడా ఏ మేరకు కోత విధించుకుం టాయో చెప్పడంలోనూ తాత్సారం చేశాయి. ఈలోగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ సానుకూల దృక్పథాన్ని ధ్వంసం చేసే చర్యలకు దిగారు. వాతావరణ ఒప్పందాలకు సంబంధించిన విధానాలను రద్దు చేసే కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. వెనకో ముందో ఇతర సంపన్న దేశాలు కూడా ఈ బాట పట్టే అవ కాశం లేకపోలేదు. కాబట్టి రానున్నది మరింత గడ్డుకాలం. కనుక ప్రకృతి వైపరీ త్యాల విషయంలో మరింత అప్రమత్తత, వాటివల్ల కలిగే నష్టం కనిష్ట స్థాయికి పరి మిత మయ్యేలా చూడటం తప్పనిసరి. -
రాత్రి చలి.. పగలు ఎండ
► ఆదిలాబాద్‌లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ► సంక్రాంతి నాటికి ఇంకా పెరగనున్న చలి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా.. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. చాలా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఆరు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, మెదక్‌లలో రాత్రిపూట చలి పెరిగిపోవడంతో అక్కడి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రెండు రోజులుగా ఖమ్మంలోనూ సాధారణం కంటే 6 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మెదక్, నల్లగొండల్లో సాధారణం కంటే 5 డిగ్రీల చొప్పున తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 6, మెదక్‌లో 9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, రామగుండంలలో 11 డిగ్రీల చొప్పున, హన్మకొండ, నిజామాబాద్‌లలో 12 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మరోవైపు అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్, మెదక్లలోనూ సాధారణం కంటే 3 డిగ్రీల చొప్పున అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంక్రాంతి పండుగ నాటికి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో చలి పులి హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. సాయంత్రం ఐదింటి నుంచే చలి మొదలవుతోంది. శనివారం 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 31.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఉదయం, సాయంత్రం చలిగాలులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రాత్రి 9 గంటలకే రహదారులపై ట్రాఫిక్ తగ్గుముఖం పడుతోంది. -
ఉగ్ర భానుడు
మేడారం@ 46.54 మర్రిగడ్డ @ 46.26 తెలంగాణలో మరో 40 రోజులు తీవ్ర వడగాడ్పులు! ఆదివారం పలు చోట్ల రికార్డు ఉష్ణోగ్రతల నమోదు వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 45 మంది మృతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వడగాల్పుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్రంలో దీర్ఘకాలం వడగాల్పులు వీచిన సంవత్సరంగా 2016 నిలుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎల్‌నినో కారణంగా మార్చి నుంచే ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే ఐదారు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ ఎండలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని, జూన్ మొదటివారం వరకు వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈసారి వడగాలులు 50 రోజులపైనే సాధారణం కంటే ఐదు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాల్పులుగా పరిగణిస్తారు. అలాగే సాధారణ ఉష్ణోగ్రతతో సంబం ధం లేకుండా 45 డిగ్రీలు నమోదైనా వడగాడ్పులుగానే లెక్కిస్తారు. ఈ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 10 రోజులకు మించి వడగాడ్పులు నమోదైనట్లు వాతావరణ శాఖ చెబుతోంది. 2010లో తెలంగాణలో 46 రోజులు వడగాలులు నమోదైనట్లు అంచనా వేశారు. అదే ఇప్పటివరకు రికార్డుగా వాతావరణ శాఖ చెబుతోంది. కానీ ఇప్పటికే రాష్ట్రంలో 10 రోజులపాటు వడగాడ్పులు నమోదయ్యాయి. ఇంకా 40 రోజులకు మించి వడగాల్పులు రికార్డయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. మే నెల మొత్తం రాష్ట్రంలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. జూన్ మొదటి వారం వరకు ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి రామగుండం, భద్రాచలం, నిజామాబాద్‌ల్లో 49-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత వేసవిలో ఖమ్మంలో అత్యధికంగా 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనేక చోట్ల 45 డిగ్రీలకు మించి రికార్డు అయింది. వివిధ ప్రాంతాల్లో 10 రోజులకు మించి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఈసారి 49-50 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. 1973 మే 9న భద్రాచలంలో 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుల్లో ఉంది. మళ్లీ మండిపోయిన రాష్ట్రం రాష్ట్రంలో ఆదివారం 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా మేడారంలో అత్యధికంగా 46.54, కరీంనగర్ జిల్లా మర్రిగడ్డలో 46.26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం తెలిపింది. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో 45.98, మన్నెగూడెంలో 45.29, ఎల్లారెడ్డిపేటలో 45.75, మహదేవ్‌పూర్‌లో 45.03 డిగ్రీలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 45.26, దండేపల్లిలో 45.15, నిజామాబాద్ జిల్లా నవీపేట్లో 45.47, భీంగల్‌లో 45.4, మెదక్ జిల్లా కల్హేర్‌లో 45.28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. వాతావరణ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌లో అధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అక్కడక్కడా జల్లులు రాష్ట్రంలో ఆదివారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో జనం సేదతీరారు. మరో రెండ్రోజులు తీవ్రమైన వడగాడ్పులుంటాయని వాతావరణశాఖ చెబుతోంది. అక్కడక్కడా చిరుజల్లులు కురిసినా అవి వడగాడ్పుల తీవ్రతపై పెద్దగా ప్రభావం చూపబోవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వడదెబ్బతో 45 మంది మృతి సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఎండలకు వడదెబ్బతో 45 మంది బలయ్యారు. ఖమ్మం జిల్లాలో 12 మంది మృతిచెందగా, కరీంనగర్ జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, నల్లగొండ జిల్లాలో ఐదుగురు, మెదక్ జిల్లాలో నలుగురు, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు మృత్యువాత పడ్డారు. ఆదివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రాంతం ఉష్ణోగ్రత ఆదిలాబాద్ 44.00 హన్మకొండ 43.00 హైదరాబాద్ 42.00 ఖమ్మం 42.00 మెదక్ 43.00 నల్లగొండ 44.00 నిజామాబాద్ 44.00 రామగుండం 43.00 కర్నూలు 42.8 అనంతపురం 42.2 రెంటచింతల 43 తిరుపతి 40 విశాఖపట్నం 37.4 గతంలో వడగాడ్పులు సంభవించిన రోజులు, వడదెబ్బ మృతుల వివరాలు.. సంవత్సరం వడగాడ్పులు వడదెబ్బ మృతులు 2012 23 144 2013 13 516 2014 19 31 2015 13 541 2016 10 230 (ఇప్పటివరకు అంచనా) -
తాజ్‌మహల్ చెంత దాహం.. దాహం
దేశంలోనే పర్యాటక స్థలాల్లో అగ్రస్థానంలో ఉన్న ఆగ్రాలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో వేడి, దాహం చాలా ఎక్కువగా ఉంటున్నాయి. శుక్రవారం నాడు అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదైంది. శనివారం ఉదయం కొంత మబ్బులు కనిపించినా, వేడి ఎక్కువగానే ఉంది. వడగాలులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయని ఆగ్రాలోని పలివల్ పార్కులో తరచు మార్నింగ్ వాక్ చేసే ప్రదీప్ భాయ్ చెప్పారు. ఈ ఎండల తీవ్రత కారనంగా స్కూళ్లకు వేసవి సెలవులు త్వరగా ఇవ్వాలని నరేష్ పరస్ అనే మరో వ్యక్తి చెప్పారు. తాజ్‌మహల్‌ను సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు కూడా ఈ వేడి చాలా ఇబ్బంది కలిగిస్తోంది. ప్రధానంగా తాజ్ ఎదురుగా ఒక పాలరాతి బెంచి ఉంటుంది. దానిమీద కూర్చుని వెనకాల తాజ్‌మహల్ కనిపించేలా ఫొటోలు తీయించుకుంటారు. ఇప్పుడు దానిమీద కూర్చోవాలంటే వేడెక్కిపోయి చాలా ఇబ్బందిగా ఉంటోందట. తాగునీరు కూడా చాలా సమస్యగా మరిందని పర్యాటకులు వాపోతున్నారు. వీళ్ల దాహం తీర్చడానికి ఆగ్రాలో తగినన్ని నీళ్లు కూడా లేవు. గత 15 రోజులుగా ఇక్కడ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. యమునా నదిలో నీటి అందుబాటు చాలా పడిపోయిందని వాటర్ వర్క్స్ అధికారి ఒకరు చెప్పారు. -
మరో మూడు రోజులపాటు వడగాలులు
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకి మరింత ఎక్కువవుతోంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఏపీ, తెలంగాణలలో వడగాలులకు ఇప్పటివరకు 150మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరో మూడు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో గురువారం 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. అలాగే తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక మిగిలిన జిల్లాల్లో 40డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వడదెబ్బకు 66 మంది మృతి
-అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 28 మంది హైదరాబాద్: వడదెబ్బకు ప్రజలు పిట్లల్లా రాలుతున్నారు. బుధవారం నాటికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 66 మంది మృత్యువాత పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అందులో అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 28 మంది, మెదక్ లో 11 మంది, నిజామాబాద్ జిల్లా లో 7 మంది, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 5 మంది చొప్పున మృతి చెందారు. ఇక ఆదిలాబాద్ లో నలుగురు, వరంగల్ జిల్లాలో నలుగురు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు వడదెబ్బకు చనిపోయారు. ఏప్రిల్ మొదటి వారంలోనే అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 40 డిగ్రీల పైన నమోదైతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. -
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రజలు భయటకు రావలంటేనే భయపడిపోతున్నారు. ఒకవైపు కరువు, ఎండల తీవ్రత, మరోవైపు అకాల వర్షాలతో మానవాళి మనుగడపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భయంకరమైన కరువు దాపరించి తాగునీరు లేక రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలోనూ అదే పరిస్థితి నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో మంగళవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని అనంతపురం జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా, మిగతా జిల్లాల్లో కర్నూలు 42.5, డిగ్రీలు, నెల్లూరు 37 డిగ్రీలు, కాకినాడ 36 డిగ్రీలు, మచిలీపట్నం 34 డిగ్రీలు, విశాఖ 34.8 డిగ్రీల సెంట్రీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. అదేవిధంగా తెలంగాణ జిల్లాలు హైదరాబాద్ 41 డిగ్రీలు, హన్మకొండ 41 డిగ్రీల సెంట్రీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించింది. -
నిప్పుల ‘సన్’డే
భానుడి భగభగలు.. రాష్ట్రంలో సెగలు సాక్షి, హైదరాబాద్/విశాఖపట్నం: రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలతో ఆదివారం రాష్ట్రంలో అనేకచోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో అత్యధికంగా 46.08 డిగ్రీలు, దండేపల్లిలో 45.05, వాంక్డిలో 45.08 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 41.3, రామగుండంలో 41.8, నిజామాబాద్‌లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దాదాపు 20 చోట్ల 43 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. మెట్పల్లిలో 43.76, పెద్దపల్లిలో 43.22, సారంగాపూర్‌లో 44.69, లింగంపల్లిలో 43.13 డిగ్రీలు నమోదయ్యా యి. మొత్తమ్మీద రాష్ట్రంలో 90 శాతానికిపైగా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావాలంటే జనం హడలిపోతున్నారు. వడగాడ్పుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం నామమాత్ర చర్యలు తీసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పాఠశాలలను కూడా తీవ్రమైన ఎండ వేడిమిలో నడిపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు కనీసం ఫ్యాన్లు, మంచినీటి వసతి కూడా కల్పించడం లేదని చెబుతున్నారు. రేడియేషన్ ప్రభావం పదింతలు తీవ్రమైన ఎండ కారణంగా రేడియేషన్ ప్రభా వం ప్రజలపై తీవ్రంగా పడుతోంది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఒక చదరపు మీటర్లో నమోదైన రేడియేషన్‌ను వాట్స్‌లో లెక్కిస్తారు. మహబూబ్‌నగర్ జిల్లా దామరగిడ్డలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్రంలోనే గరిష్టంగా 662 వాట్స్ రేడియేషన్ నమోదైంది. ఆ తర్వాత అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ముధోల్‌లో 597 వాట్స్ నమోదైంది. సాధారణం కంటే రాష్ట్రంలో అనేకచోట్ల పదిం తలు ఎక్కువగా రేడియేషన్ నమోదవుతోంద ని తెలంగాణ వైద్య విద్యా మాజీ సంచాలకు డు, ప్రముఖ చర్మ వైద్య నిపుణుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. రేడియేషన్‌తో చర్మానికి సంబంధించిన సమస్యలే కాకుండా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చల్లని కబురు మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగడంతో రానున్న రెండు, మూడ్రోజులపాటు తెలంగాణ, ఏపీల్లో అక్కడక్కడ తేలిక పాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు గాని కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు తెలిపింది. ఏపీలోనూ భగభగలు ఏపీలోనూ శని, ఆదివారాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో శనివారం రికార్డుస్థాయిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం అనంతపురంలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 42, కడపలో 41, తిరుపతిలో 39.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లోని వివిధ పట్టణాల్లో ఇంతకంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంటలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్రలోనూ పలుచోట్ల 38 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రేవతి కార్తెలోనే పరిస్థితి ఇలా ఉంటే రోహిణీ కార్తె(మే నెల)లో ఎండలు ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారిస్తున్న సూచనలివీ.. - పిల్లలు, వయోవృద్ధులు, గుండెజబ్బు బాధితులు, ఇతర వ్యాధిగ్రస్తులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది. - తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే సాధ్యమైనంతవరకూ తలకు, ముఖానికి వేడి తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - లేత రంగు కాటన్ దుస్తులు ధరించడం మేలు. - అధిక మోతాదులో మంచినీరు తాగాలి. వేడి వల్ల చెమట రూపంలో ఎక్కువ నీరు, ఉప్పు బయటికెళ్తాయి. అందువల్ల డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ఉప్పు వేసిన నీటిని తీసుకోవాలి. ఎండ వల్ల పోయే శక్తిని తిరిగి పొందేందుకు, చల్లదనం కోసం పండ్ల రసాలు, మజ్జిగ, కొబ్బరి నీటితోపాటు తాజా పండ్లు తీసుకోవడం మంచిది. - పొలాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా తలపాగా ధరించాలి. - నివాస ప్రాంతాన్ని సాధ్యమైన మేరకు చల్లగా ఉండేలా చూసుకోవాలి. కిటికీలకు వట్టివేళ్ల కర్టెన్లు లేదా గోనె పట్టలు వేలాడదీసి నీరు చల్లితే చల్లని గాలి వస్తుంది. -
వడదెబ్బకు నాలుగు రోజుల్లో 45 మంది మృతి
-సర్కారుకు విపత్తు నిర్వహణశాఖ నివేదిక -అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మంది -వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక అమలులో వైఫల్యం -మూడు జిల్లాలు మినహాయిస్తే ఎక్కడా పట్టించుకోని వైనం హైదరాబాద్ : వడదెబ్బకు ప్రజలు పిట్లల్లా రాలుతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 45 మంది మృత్యువాత పడినట్లు తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ వెల్లడించింది. ఈ మేరకు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ఈ నెల 24 నుంచి 27వ తేదీల్లో ఈ వడదెబ్బ మృతులు సంభవించాయి. అందులో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మంది, కరీంనగర్ జిల్లాలో 9 మంది చనిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో నలుగురు మృతిచెందారు. మార్చి నెలలోనే అసాధారణ ఎండలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నాలుగు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 47 డిగ్రీలకు మించి చేరడంతో వడదెబ్బ మరణాలు సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. రాబోయే ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది. వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక అమలేదీ? వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు విపత్తు నిర్వహణ శాఖ జారీచేసిన వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలో వైఫల్యం కారణంగానే ఇంతమంది చనిపోయారని సమాచారం. ఇప్పటికీ మూడు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలు వడగాల్పులపై కార్యాచరణ ప్రణాళిక అమలుకు కసరత్తు చేయలేదని తెలిసింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల కలె క్టర్లే ప్రణాళిక అమలుకు కార్యాచరణ సిద్ధం చేసి... సంబంధిత నివేదికను రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు పంపినట్లు సమాచారం. వడగాల్పులపై వాతావరణశాఖ హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆరోపణలున్నాయి. వరంగల్ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వడగాల్పు కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. పాఠశాలల పనివేళలను సవరించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే నిర్వహించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణశాఖ జారీచేసిన కార్యాచరణ ప్రణాళికను తహశీల్దార్, ఎంపీడీవోల వరకు పంపించారు. సర్పంచిలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో సిటీ కేబుల్ ద్వారా, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ఎండ తీవ్రత నుంచి రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఆరుబయట పనిచేసే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. వడగాల్పుల సమయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. ఆరుబయట పాఠశాల తరగతులు నిర్వహించవద్దని సూచించారు. నిధులేవీ? వడగాల్పుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిన సర్కారు అందుకు తగ్గట్లు నిధులను జిల్లాలకు కేటాయించలేదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చలివేంద్రాల ఏర్పాటు, ఐవీ ప్లూయీడ్స్, ఐస్ ప్యాక్స్ తదితర అవసరమైన వాటికి నిధులను కేటాయించలేదని అంటున్నారు. కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినంత మాత్రాన సరిపోదని, నిధులు లేకుంటే ఏమీచేయలేమని సంబంధిత శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి. -
సైదాపూర్‌లో 47.33డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత!
- మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో 44.51 డిగ్రీలు హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో గురువారం ఏకంగా 47.33 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇంతటి స్థాయిలో ఉష్ణోగ్రతలు మార్చిలో రావడం వాతావరణశాఖనూ విస్మయానికి గురిచేస్తోంది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా ఐజలోనూ 44.51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిర్యాలగూడలో 42.31 డిగ్రీలు రికార్డు అయింది. రాష్ట్రంలో చాలాచోట్ల 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే వడగాల్పుల తీవ్రత పెరిగినా అధికారయంత్రాంగం మాత్రం అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
మండుతున్న ఎండలు
హైదరాబాద్ : వేసవి కాలం పూర్తిగా రాక ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సోమవారం భాస్కరుడి ప్రతాపానికి మహబూబ్‌నగర్, అనంతపురం, కర్నూలు, నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. నందిగామ, తునిలో 41 డిగ్రీలు, తిరుపతి, కడపలో 40 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఉదయం నుంచే ఎండ తీవ్ర త ఎక్కువగా ఉండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. -
లైంగిక చర్య ద్వారానూ జికా వైరస్
అమెరికాలోని టెక్సాస్‌లో నమోదైన తొలి కేసు మియామి: అధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట జికా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా ఇప్పుడే చెప్పడం తొందరపాటే అయినప్పటికీ చాలా సందర్భాల్లో వైరస్ల వ్యాప్తిలో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రతతో దోమ మరిన్ని దోమల్ని ఉత్పత్తి చేస్తుందని వారు చెబుతున్నారు. గర్భిణుల పాలిట శాపంగా.. జికా వైరస్ గర్భిణుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఈ వైరస్ గర్భిణుల నుంచి పిల్లలకు సోకి ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ వైరస్‌తో సంభవించే మైక్రోసెఫలీ అనే వ్యాధి పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జికా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించవద్దని గర్భిణులకు డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. లైంగిక చర్య ద్వారా కూడా... ప్రపంచ దేశాలను వణికిస్తున్న జికా వైరస్ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది. టెక్సాస్‌లో ఈ విధంగా జికా సోకిన తొలి కేసు నమోదైంది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య విభాగ వర్గాలు ధ్రువీకరించాయి. ఇప్పటివరకూ ఈ వైరస్ దోమల ద్వారానే సోకుతుందని భావించారు. తాజాగా వైరస్ సోకిన వారితో లైంగిక చర్య ద్వారా కూడా సోకుతుందని తేలింది. ఈ మేరకు అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డెరైక్టర్ డాక్టర్ టామ్ ఫ్రీడెన్ ఓ ఈ మెయిల్లో స్పష్టం చేశారు. జికా డివైస్‌తో రక్షణ దోమల నుంచి వ్యాపిస్తోన్న జికా వైరస్ నుంచి ఓ డివైస్ రక్షణ క ల్పిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. జికాతో పాటు చికున్ గున్యా, డెంగీ, యెల్లో ఫీవర్లకు కారణమైన దోమల నుంచి రక్షించుకునేందుకు ఈ డివైస్ ఉపయోగపడుతుందని మెడికల్ ఎంటమాలజీ జర్నల్‌లో పేర్కొన్నారు. -
మండుతున్న ఎండలు
సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికం సాక్షి, హైదరాబాద్: వర్షాలు కురవాల్సిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి ఆరు డిగ్రీలు అధికంగా రికార్డు అవుతున్నాయి. గత 24 గంటల్లో హైదరాబాద్‌లో సాధారణంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా 37 డిగ్రీలు నమోదైంది. ఏకంగా ఆరు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత ఉంది. అలాగే మహబూబ్‌నగర్‌లో 32 డిగ్రీలు సాధారణంగా నమోదు కావాల్సి ఉండగా... అక్కడ 38 డిగ్రీలకు చేరింది. మెదక్‌లో 31 డిగ్రీలకు గాను... 36 డిగ్రీలు రికార్డు అయింది. హన్మకొండలో 32 డిగ్రీలకు గాను... 37 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్‌లలో సాధారణం కంటే 4 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 3 డిగ్రీలు అదనంగా నమోదైంది. ఇదిలావుండగా శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్య రాష్ట్రంలో సాధారణంగా సరాసరి 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... ఎక్కడా ఒక్క చుక్క వర్షం కురవలేదు. 100 శాతం లోటు వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. -
గజగజ
జిల్లాపై చలిపులి పంజా విసురుతోంది. మునుపెన్నడూ ఎరుగని రీతిలో వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి అయ్యే సరికి 14 డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రత పడిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడి ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకున్నాయి. వృద్ధులు, వ్యాధి గ్రస్తులు మృత్యువాత పడుతున్నారు.విజయనగరం కంటోన్మెంట్, పార్వతీపురం, కురుపాం: జిల్లాలో మూడు రోజులుగా చలిగాలులు విపరీతంగా వీస్తుండడంతో సాయంత్రం నాలుగు గంటలకే చలికోటు, చెవులకు వస్త్రాలను కప్పుకొని ప్రజలు బయట తిరగవలసి వస్తోంది. ఉన్ని వస్త్రాలు ధరించనిదే బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యం గా తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ఏజె న్సీ వాసులు గజగజలాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ చలి వీడడం లేదు. రాత్రిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. రాత్రివేళ పదిన్నర నుంచి పదకొండు వరకూ జనసంచారం ఉండే విజయనగరం వంటి పట్టణాలు రాత్రి 9 గంటలయ్యే సరికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల యితే కానీ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. వణుకుతున్న గిరి సీమలు ఏజెన్సీలో కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి మంగళవారం నాటికి అమాంతంగా 8 డిగ్రీల నుంచి 5 డిగ్రీల సెంటీగ్రేడుకు పడిపోవడంతో గిరి సీమలు గజగజలాడుతున్నాయి. కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, సాలూరు, మక్కువ, పాచిపెంట తదితర మండలాలకు చెందిన గిరి శిఖర ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెర్టర్లు, ఉన్ని కోట్లు, రగ్గులు, జర్కిన్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. చలి మంటలు, కుంపట్ల వద్ద కాలక్షేపం చేస్తున్నారు. ఈ మంచు, చలిలో పోడు పనులకు, గెడ్డలకు కూడా వెళ్లలేకపోతున్నామని గిరిజనులు వాపోతున్నారు. ఉదయం 10 గంటలయితే గాని ఇంటి నుంచి బయటికి రావడం లేదు. అలాగే సాయంత్రం 4 గంటలకే పల్లెలన్నీ దుప్పటి ముసుగేసుకుంటున్నాయి. కొమరాడ ఏజెన్సీలోని కుంతేసు, నయ, రెబ్బ, వనధార, పెదశాఖ, గుణదతీలేసు, పూడేసు, గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ, పెదఖర్జ, పుక్కిడి, కేదారిపురం, కందికుప్ప, రేగిడి, దుడ్డుకల్లు, తాడికొండ ప్రాంతాలు, గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన దురిబిలి, బజ్జిల, వప్పంగి, గొందిలోవ, కాకిలి, దండుసూర, టిక్కబాయి తదితర ప్రాంతాల గిరిజనులు తీవ్ర అవస్థలు గురవుతున్నారు. పూరిగుడెసెలన్నీ మంచుమయం కావడంతో చలికి నిద్ర పట్టక రాత్రి పూటంతా మంటల వద్ద గిరిజనులు గడుపుతున్నారు. కమ్మేస్తున్న పొగమంచు పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు పొగమంచు కమ్మేస్తుండడంతో రైతులు, వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి పూట, తెల్లవారు జామున వాహనాలపై ప్రయాణించేవారికి ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలకు గురికావలసి వస్తుందేమోనని వారు భయపడుతున్నారు. ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు చేతులకు గ్లౌసులు, హెల్మెట్, కాళ్లకు షూస్ ధరించి ప్రయాణించవలసి వస్తోంది. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట, ఎస్.కోట ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తోంది. చలి తీవ్రంగా ఉండడంతో వసతి గృహాల విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. వరి నూర్పు పనుల్లో ఉన్న రైతులు ఇబ్బందికి గురవుతున్నారు. కూరగాయలు, ఇతర ఉత్పత్తులు విక్రయించే వారు అవస్థలు పడుతున్నారు. తీరప్రాంత గ్రామాల్లో... తీర ప్రాంత గ్రామాల్లో పరిస్థితి మరీ ఇబ్బంది కరంగా ఉంది. సముద్రం నుంచి రొజ్జగాలి వీస్తుండడంతో ఇళ్లలో కూడా ఎవరూ ఉండలేకపోతున్నారు. రోజూ తెల్లవారు జామున ఐదు గంటలకు సముద్రంలోకి వేటకు వెళ్లి, తిరిగి ఉదయం 10 గంటలకు తీరానికి చేరుకునే మత్స్యకారులు ప్రస్తుతం ఉదయం ఆరు గంటలకు వెళ్లి తొమ్మిది గంటలకల్లా ఒడ్డుకు వచ్చేస్తున్నారు. సముద్రంలో చలి ఎక్కువగా ఉందని, శరీరం కర్రకట్టేస్తుండడంతో ఉండలేక వచ్చేస్తున్నామని మత్స్యకారులు తెలిపారు. చేపల వేట సాగక అర్థాకలితో గడపవలసి వస్తోందని వారు వాపోయారు. కోరలు చాస్తున్న వ్యాధులు విజయనగరం ఆరోగ్యం:ఇక ఈ చలికి దగ్గు, జలుబు ప్రజలను బాధిస్తున్నాయి. కొంతమంది వైరల్ జ్వరాల భారిన పడుతున్నారు. ఇక ఉబ్బసం, ఆస్తమా, టీబీ రోగులు నానా అవస్థలు పడుతున్నారు.- చలికాలంలో ఎక్కువుగా వృద్ధులు, పిల్లలు న్యుమోనియా వ్యాధికి గురియ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రక్తపోటు పెరిగి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారిపోతుంది. సోరియసిస్ వంటి చర్మవ్యాధుల తీవ్రత ఎక్కువవుతుంది. అదేవిధంగా మంచు ఎక్కువుగా పడడం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు బాధిస్తాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధ్యమైనంతవరకు చల్లగాలిలో తిరగరాదు. గోరు వెచ్చనినీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు, గ్లౌజులు ధరించి వెళ్లాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచింది. వేడి పదార్థాలు భుజించాలి, పడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి, అస్తమా తదితర వ్యాధులను అదుపులో ఉంచే మందులను క్రమం తప్పకుండా వాడాలి. -
మొక్కజొన్నపై సూర్యప్రతాపం
సూర్యప్రతాపంతో మొక్కజొన్న ఎండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలు ఈ పంట రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గింజపోసుకునే దశలో పంట ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. బెట్ట పరిస్థితుల వల్లే పంట ఎండిపోతోందని చెబుతున్న వ్యవసాయ అధికారులు తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఎక్కువగా గిరిజన రైతులే నష్టపోతున్నారు. రుణమాఫీ నేపథ్యంలో కనీసం బీమా సౌకర్యానికీ నోచుకోక వారంతా డీలా పడుతున్నారు. ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో మొక్కజొన్న రైతుకు కష్టకాలం దాపురించింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ పరిస్థితులతో ఎండిపోతుండటంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. బట్టతడుపు జల్లైనా కురిస్తే పంట చేతికొస్తుందన్న ఆశతో చూస్తున్నాడు. గింజపోసుకునే దశలో పంట ఎండిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితి కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి సమయంలో మొక్కజొన్న సాగు మేలని రైతులు దీనివైపు మొగ్గుచూపారు. జిల్లాలో మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 36 వేల ఎకరాలు కానీ ఈ ఏడాది దాదాపు 45 వేల ఎకరాల్లో (పోడు భూముల్లో సాగుతో కలుపుకొని) దీన్ని సాగు చేశారు. జిల్లాలోని ఇల్లెందు, బయ్యారం, గుండాల, టేకులపల్లి, కారేపల్లి, కామేపల్లి, గార్ల, పాల్వంచ, ముల్కలపల్లి, జూలూరుపాడు, ఏన్కూరు, మధిర, చింతకాని, బోనకల్లు, ముదిగొండ, ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్ తదితర మండలాల్లో ఈ పంటను ఎక్కువగా సేద్యం చేస్తున్నారు. చెదురుమదురుగా కురిసిన వర్షాలకు జూలై నెలలో ఈ పంటను వేశారు. 90-110 రోజుల కాల పరిమితి కలిగిన మొక్కజొన్న హైబ్రిడ్ రకాలను ఎక్కువ మంది రైతులు సేద్యం చేశారు. జూలై, ఆగస్టు చివరి వారాలు, సెప్టెంబర్ మొదటి వారాల్లో వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు మొక్కజొన్న ఆశాజనకంగా ఉంది. ఆ తర్వాత దాదాపుగా నెల రోజుల నుంచి చినుకు రాలలేదు. మొక్కజొన్న పాల కంకి దశ, గింజపోసుకునే దశలో ఉంది. ఈ తరుణంలో వర్షాలు లేకపోవటం, దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరగటంతో మొక్కజొన్న పైర్లు ఎండిపోతున్నాయి. గింజపోసుకునే దశలో వాడుముఖం వర్షాలు కురవకపోవడం, అధిక ఉష్ణోగ్రతలతో గింజపోసుకునే దశలో పంట ఎండిపోతోంది. ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, గుండాల, బయ్యారంలో మొక్కజొన్నను పోడు భూముల్లో కూడా సాగుచేయడంతో పంట ఎండిపోతోంది. ప్రస్తుతం పంట పాలకంకి దశలో ఉంది. ఈ దశలో నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో పంట ఎండిపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఏజెన్సీ రైతుకు దెబ్బ.. ఈ పంటను ఎక్కువగా ఏజెన్సీ ప్రాంత రైతులే సాగు చేశారు. పోడు భూములు, నీటి సౌకర్యం లేకుండా ఉన్న ప్రాంతాల్లో రైతులు మొక్కజొన్న సాగును ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. కానీ ఆ పంటకు సరిపడా వర్షం కూడా కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ మండలాల్లో ఎక్కువగా మెట్ట భూములు ఉన్నాయి. ఈ భూముల్లో తేమ నిల్వ ఉండే అవకాశం లేకపోవడంతో రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ఇటీవల అసలే వర్షాలు కురవకపోవడంతో పాలకంకి దశలో ఉన్న పంట ఎండిపోతోంది. ఎకరాకు రూ. 20 వేల మేరకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికి వస్తాయో రావోనని భయపడుతున్నారు. రుణమాఫీ కారణంగా బ్యాంకులో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తమ పంటలకు ఇన్సూరెన్స్ చేయలేకపోయారు. దీనివల్ల పంట ఎండిపోయినా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రైతుల పరిస్థితి రెంటికి చెడిన రేవడిలా తయారైంది. జేడీఏ దృష్టికి పంట నష్టం... జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎండిపోయిన మొక్కజొన్న వివరాలను వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు వి.బి.భాస్కర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అనుకూలమైన వర్షాలు లేని కారణంగా పంట ఎండిపోయిందని, దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు ఉండటం కూడా కారణమైందని జేడీఏకు వివరించారు. ఈ అంశంపై జేడీని వివరణ కోరగా ‘గత కొద్ది రోజులుగా వర్షాలు లేవు. బెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న వాడిపోతోంది’ అని చెప్పారు. -
అటు కాక..ఇటు కోత
సాక్షి, రాజమండ్రి :సూర్యుడు ఏమైనా భూమి పర్యటనకు బయల్దేరి నానాటికీ దగ్గరకు వస్తున్నాడా అన్నట్టు.. ఎండలు మండిపడుతూనే ఉన్నాయి. జిల్లాలో శనివారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. రాజమండ్రిలో జిల్లాలోనే అత్యధికం గా 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కాకినాడలో ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇందుకు 1.15 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని లెక్కగట్టారు. గ్రామీణ విత్తనోత్పత్తి పథకం నుంచి 42 వేల క్వింటాళ్లు, ఏపీ సీడ్స్ ద్వారా 14 వేల క్వింటాళ్లు, రైతుల నుంచి రైతులు 22వేల క్వింటాళ్లు, ప్రైవేట్ కంపెనీల ద్వారా 37 వేల క్వింటాళ్ల విత్తనాలను సేకరించాలని వ్యవసాయ శాఖాధికారులు భావించారు. వరంగల్, కరీంనగర్ నుంచి విత్తనాలు రాకపోవడం, స్థానికంగా గత ఖరీఫ్, రబీలో ఆశించిన దానిలో 50 శాతం కూడా ఉత్పత్తి కాకపోవడంతో స్వర్ణ విత్తనాలకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర విభజనతో అందని విత్తనం జిల్లాకు అవసరమైన విత్తన సేకరణ వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి ఎక్కువగా జరుగుతుంది. ఏపీ సీడ్స్‌తోపాటు ప్రైవేట్ డీలర్లకు ఈ జిల్లాల నుంచి విత్తనాలు దిగుమతి అవుతుంటాయి. ప్రైవేట్ కంపెనీలు, ఏపీ సీడ్స్ ద్వారా రైతులకు అందాల్సిన సుమారు 50 వేల క్వింటాళ్ల విత్తనాల్లో ఈ రెండు జిల్లాల నుంచి 35 వేల క్వింటాళ్లకు పైబడి సేకరించాలి. ఉమ్మడి రాష్ట్రంలో విత్తనాల సేకరణకు వీలుగా వాటి అమ్మకాలపై ప్రభుత్వం కొంత నియంత్రణ ఉంచేది. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడం, గత ఖరీఫ్ పంటనష్టం వల్ల స్వర్ణకు మద్దతు ధరకు మించి (క్వింటాల్ రూ.1,400) ధర రావడంతో ఆ రైతులు విత్తనాల నిల్వలు చేయకుండా అమ్మకాలు చేపట్టారు. దీనిని మన రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ సకాలంలో గుర్తించలేకపోయింది. ఏపీ సీడ్స్, ప్రైవేట్ డీలర్లు సైతం ముందుగా విత్తన సేకరణపై దృష్టి సారించకపోవడం, ఆ జిల్లాల నుంచి దిగుమతి లేక రైతులు ఇప్పుడు విత్తన కొరత ఎదుర్కొనాల్సి వస్తోంది. స్థానికంగానూ తక్కువే జిల్లా రైతులు ఖరీఫ్‌లో స్వర్ణరకం సాగు ఎక్కువగా చేస్తుంటారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సాగు విస్తీర్ణం కాస్త తగ్గినా డెల్టాలో సుమారు 75 శాతం పంట పొలాల్లో స్వర్ణరకం సాగే జరుగుతుంది. గత ఖరీఫ్‌లో ఈశాన్య రుతుపవనాలు, హెలెన్ తుపాను వల్ల 2.50 లక్షల ఎకరాల్లో పంట తుడుచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. వచ్చిన దిగుబడిలో కూడా తేమ వచ్చిన, రంగు మారిన, దెబ్బతిన్న ధాన్యం ఎక్కువ. ఈ ధాన్యం నిల్వ చేస్తే దెబ్బతింటుందని రైతులు విత్తన నిల్వ చేయలేదు. గ్రామీణ విత్తనోత్పత్తిలో భాగంగా సాగు చేసిన పొలాల్లో సైతం విత్తనాల ధాన్యం దెబ్బతింది. దీంతో రైతుల వద్ద విత్తనం ఆశించిన స్థాయిలే లేకుండాపోయింది. అప్పట్లోనే ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చినా స్పందించేవారు లేక రైతులు ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నారు. రబీలో సైతం రైతులు ఖరీఫ్ విత్తనాల కోసం స్వర్ణ రకం సాగు చేస్తుంటారు. మొత్తం రబీ సాగులో నాలుగు శాతం స్వర్ణసాగు ఉంటుంది. గత రబీలో ఇది రెండు శాతానికి పడిపోయింది. దీనివల్ల కూడా విత్తన కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. -
గొంతెండుతోంది..
గ్రామాల్లో అడుగంటినతాగునీటి చెరువులు తాగునీటి విడుదలపై తొలగని సందిగ్ధత తీరంలో దాహం కేకలునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం 6 టీఎంసీలకు గాను 4 టీఎంసీలు మాత్రమే ఇచ్చేందుకు అధికారుల నిర్ణయం శివారుకు తాగునీరు చేరాలంటే పది రోజుల సమయం జిల్లాలో తాగునీటి సమస్యతో జనం గొంతెండుతోంది. జూన్ నెలాఖరు వచ్చేసినా వేసవి ఎండలు కొనసాగుతుండటంతో గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరుఅడుగంటింది. కళ్లెదుటే అంతా కనబడుతున్నా పాలనా యంత్రాంగంలో వీసమెత్తు చలనం లేకుండా పోయింది. వెరసి జిల్లాలోని ప్రజలు దాహార్తితో అలమటిస్తున్నారు. ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల కారణంగా తాగునీటి వినియోగం అధికమైంది. తాగునీటి చెరువులు నీరు అడుగంటి వెక్కిరిస్తున్నాయి. చెరువుల్లో అడుగున ఉన్న బురదనీటినే తాగునీటిగా సరఫరా చేస్తూ పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దుర్వాసన వస్తున్న నీటిని తాగితే ఎలాంటి అనారోగ్యం పాలవుతామేమోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మచిలీపట్నం : జిల్లా ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం ఈ నెల 25న నాగార్జునసాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని పాలకులు చెబుతూ వచ్చారు. మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ అధికారులు, రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖాధికారులు హైదరాబాదులో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కృష్ణా జిల్లాకు తాగునీటి అవసరాల నిమిత్తం నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాకు ఆరు టీఎంసీలు విడుదల చేయాల్సి ఉండగా నాలుగు విడుదల చేయడం వల్ల తాగునీటి అవసరాలకు సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఈ నీటినైనా నాగార్జునసాగర్ నుంచి ఎప్పటికి విడుదల చేస్తారు.. ఎప్పటికి చెరువులు నిండుతాయి.. తాగునీట సమస్య ఎప్పుడు తీరుతుందని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. అడుగంటుతున్న తాగునీటి చెరువులు... జిల్లాలో తాగునీటి చెరువులు 374 ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు. ఈ ఏడాది వేసవి కాలం సుదీర్ఘంగా సాగటం, జూన్ నెలాఖరు వచ్చేస్తున్నా వర్షాలు కురవకపోవటంతో తాగునీటి చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటింది. ఈ నెల 25న తాగునీటిని విడుదల చేస్తామని గతంలో పాలకులు ప్రకటించటంతో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి మచిలీపట్నం, పెడన తదితర పురపాలక సంఘాలకు ప్రతి రోజూ తాగునీటిని గంట, అరగంట సమయం పాటు విడుదల చేస్తున్నారు. నీటి వినియోగం పెరగటంతో రిజర్వాయర్లలోని నీరు అడుగంటింది. జిల్లాలోని 80 శాతం పైగా తాగునీటి చెరువులు అడుగుమేర నీటి మట్టానికి చేరుకున్నాయి. అడుగంటిన నీరు కలుషితమవడంతో వాటిని తాగలేని పరిస్థితి నెలకొంది. అడుగంటిన భూగర్భ జలాలు... జూన్ నెల పూర్తవుతున్నా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్న కారణంగా భూగర్భ జలాలు అడుగంటాయి. చల్లపల్లి, మోపిదేవి వంటి ప్రాంతాల్లో బోరు నీటినే తాగునీటిగా సరఫరా చేస్తున్నారు. బోర్లు సక్రమంగా పనిచేయకపోవటంతో తాగునీరు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సముద్ర తీరంలోని గ్రామాల్లో వర్షాకాలంలో బావుల్లో 12 అడుగుల లోతున తాగునీరు లభ్యమయ్యే పరిస్థితి ఉండేది. వేసవిలో భూగర్భ జలాలు 14 నుంచి 16 అడుగుల లోతుకు నీటి మట్టం తగ్గింది. దీంతో కాలువ గట్ల వెంబడి ఉన్న బావుల్లోని నీరు ఉప్పు నీరుగా మారటంతో గొంతు తడుపుకొనేందుకు చుక్కనీరు దొరకక ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీటి ఇబ్బందులు ఇవీ... కైకలూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. ఆలపాడు, రామవరం, ఆచవరం, గోనెపాడు, పెంచికలమర్రు, మూలలంక, పెదలంక తదితర గ్రామాల్లోని తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో అడుగంటాయి. ఒకటి, రెండు రోజులకు మించి తాగునీటి అవసరాలను తీర్చేందుకే ఈ నీరు ఉపయోగపడుతుంది. పోల్‌రాజ్, సీబీ కెనాల్ ద్వారా లంక గ్రామాలకు తాగునీరివ్వాల్సి ఉంది. వాటికి నీరు ఎప్పుడిస్తారో అధికారులకే తెలియని పరిస్థితి. దివిసీమలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో తాగునీటి చెరువులు అడుగంటాయి. కోడూరు మండలంలోని జరుగువానిపాలెం, వి.కొత్తపాలెం, చింతకోళ్ల, హంసలదీవి, ఇరాలి, రామకృష్ణాపురం, సాలెంపాలెం తదితర గ్రామాల్లోని చెరువుల్లోనూ అదే పరిస్థితి. బడేవారిపాలెం నుంచి పిట్లలంక, సాలెంపాలెం తదితర గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చటం లేదు. పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. సముద్రానికి అత్యంత సమీపంలో ఉన్న కృత్తివెన్ను మండలంలో శీతనపల్లి, మాట్లం, కృత్తివెన్ను, గుడిదిబ్బ, పడతడిక, ఒర్లగొందితిప్ప, నిడమర్రు, పల్లెపాలెం, నీలిపూడి, మునిపెడ తదితర గ్రామాల్లో తాగునీటి చెరువుల్లో నీరు అడుగంటింది. ఉన్న కొద్దిపాటి నీరు రంగుమారి తాగడానికి పనికిరాని పరిస్థితి నెలకొంది. పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులో ఉన్న లక్ష్మీపురం, పల్లెపాలెం గ్రామాలకు చెందిన ప్రజలు భీమవరం వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. 20 లీటర్ల మంచినీటి క్యాన్ ఈ గ్రామాలకు చేరేసరికి రూ.40 వ్యయం అవుతోంది. పెడన మండలంలో 24 పంచాయతీలు ఉండగా 12 పంచాయతీల్లో రక్షిత నీటి పథకాలు ఉన్నాయి. వీటిలో రెండు పథకాలే సక్రమంగా పనిచేస్తున్నాయి. మిగిలిన పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి రోజురోజుకూ అధికమవుతోంది. బంటుమిల్లి మండలంలో మల్లేశ్వరం రక్షిత మంచినీటి పథకం ద్వారా 16 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో నీరు అడుగు మట్టానికి చేరుకుంది. బందరు మండలంలో 34 పంచాయతీలు ఉండగా ఇవన్నీ దాదాపు సముద్రానికి సమీపంలోనే ఉన్నాయి. మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాలతో పాటు మచిలీపట్నం మండలంలోని ప్రజలకు తాగునీటిని తరకటూరులోని సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు ద్వారా అందించాల్సి ఉంది. ఈ సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. -
మండుతున్న ఎండలు!
రాష్ట్రంలో పలు చోట్ల భారీ ఉష్ణోగ్రతలు నమోదు సాక్షి, విశాఖపట్నం: వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండలు చిర్రెత్తుతున్నాయి. భానుడి భగభగలతో ఉదయం 9 దాటాక బయటికి వచ్చేందుకు ప్రజలు భయపడే పరిస్థితి తలెత్తుతోంది. దీనికితోడు విద్యుత్ కోతలు జనాన్ని మరింతగా అల్లాడిస్తున్నాయి. ఫలితంగా వృద్ధులు, చిన్నారుల పరిస్థితి నరకంగా మారింది. శుక్రవారం రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణం కంటే భారీ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వాతావరణ నిపుణుల్ని సైతం ఆశ్చర్యపరిచింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సాధారణం కంటే ఏకంగా ఏడు డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం ఇదే ప్రాంతంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఒక్క రోజు వ్యవధిలో ఏకంగా 41 డిగ్రీలకు చేరింది. గాలిలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత తీవ్రమైందని నిపుణులు తెలిపారు. ఇంటీరియర్ ల్యాండ్ మాస్, స్థానిక పరిశ్రమలు కూడా ఈ ఉష్ణోగ్రతల ఆకస్మిక పెరుగుదలకు కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు. ఏయూ వాతావరణ విభాగ విశ్రాంత ఆచార్యులు ఒ.ఎస్.ఆర్.యు.భానుకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. వాతావరణంలో అధిక పీడనం ఏర్పడే ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు.