నాగ్‌పూర్, ముంగేష్ పుర్‌లో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ వివరణ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్ పుర్‌లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టంచేసింది. మే 29న ముంగేష్ పుర్‌లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్ దానిని 52.9 డిగ్రీల సెల్సియస్‌గా చూపించింది. ముంగేష్ పుర్, నాగ్‌పూర్ స్టేషన్లలో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్‌లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణ ఇచి్చంది.
‘‘ ఈ రెండు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్(ఏడబ్ల్యూఎస్)లో బిగించిన సెన్సార్‌లను త్వరలోనే పరిశీలిస్తాం. ఢిల్లీలోని ఇతర ఆటోమేటిక్, మాన్యువల్ అబ్జర్వేటరీల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ముంగేష్ పుర్ ఏడబ్ల్యూఎస్‌లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడికి ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించాం. ముంగేష్‌పుర్‌లో స్టాండర్డ్ ఇన్‌స్ట్రుమెంట్ నమోదుచేసిన దానికంటే ఈ సెన్సార్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎక్కువ చూపించింది. లోపాలున్న సెన్సార్‌ను త్వరలోనే మార్చేస్తాం’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment